హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) మహిళల టోర్నమెంట్‌కు సంబంధించి మంగళవారం వేలం కార్యక్రమం జరిగింది. భారత జట్టు డిఫెండర్ ఉదిత దుహాన్‌కు అత్యధికంగా రూ. 32 లక్షలు లభించాయి. శ్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు ఉదితను కొనుగోలు చేసింది. ఉదిత తర్వాత రెండో అత్యధిక మొత్తం నెదర్లాండ్స్ డ్రాగ్ ఫ్లికర్ యిబ్బీ జాన్సన్‌కు దక్కింది. ఒడిశా వారియర్స్ జట్టు రూ. 29 లక్షలకు యిబ్బీ జాన్సన్‌ను సొంతం చేసుకుంది.
భారత జట్టు సభ్యులు లాల్‌రెమ్‌సియామి (రూ. 25 లక్షలు; శ్రాచి రార్ బెంగాల్ టైగర్స్), సునెలితా టొప్పో (రూ. 24 లక్షలు; ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్), సంగీత కుమారి (రూ. 22 లక్షలు; ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్)లకు కూడా పెద్ద మొత్తమే లభించింది. భారత సీనియర్ జట్టు కెపె్టన్ సలీమా టెటెను ఒడిశా వారియర్స్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది.
ఇషిక (రూ. 16 లక్షలు), నేహా గోయల్ (రూ. 10 లక్షలు)లను కూడా ఒడిశా వారియర్స్ కొనుగోలు చేసింది. సూర్మా హాకీ క్లబ్ భారత మాజీ కెప్టెన్ సవితా పూనియా (రూ. 20 లక్షలు), షర్మిలా దేవి (రూ. 10 లక్షలు), నిక్కీ ప్రధాన్ (రూ. 12 లక్షలు)లను దక్కించుకుంది. హెచ్‌ఐఎల్ టోర్నీ డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు రాంచీ, రౌర్కెలాలలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment