టోర్నీకి ముందే ఫిట్‌గా ఉంటా: సైనా | Saina Nehwal hopes to be fit ahead of World Championship | Sakshi
Sakshi News home page

టోర్నీకి ముందే ఫిట్‌గా ఉంటా: సైనా

Published Fri, Jul 31 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

Saina Nehwal hopes to be fit ahead of World Championship

 న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వ రల్డ్ చాంపియన్‌షిప్‌కు ముందే భుజం నొప్పి నుంచి పూర్తి స్థాయిలో కోలుకుంటానని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ధీమా వ్యక్తం చేసింది. వచ్చే నెల 10 నుంచి జకార్తాలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న సైనాకు వ రల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం ఇంకా ఊరిస్తూనే ఉంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా క్వార్టర్స్ దాటి ముందుకెళ్లలేదు. ‘ప్రస్తుతానికైతే ఇంకా కొంచెం నొప్పిగా ఉంది. అయితే టోర్నీకి ముందే ఫిట్‌గా ఉంటానన్న నమ్మకముంది. ఇక డ్రా విషయానికి వస్తే కఠినంగానే ఉంది. నా శిక్షణ ఆశాజనకంగా సాగుతోంది. అత్యున్నత టోర్నీలో ఆడేటప్పుడు మనం అన్ని విభాగాల్లోనూ రాటుదేలాల్సి ఉంటుంది’ అని సైనా తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement