ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ షూటర్ గగన్ నారంగ్ పాడ్‌కాస్ట్‌లో షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. తాను ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని, బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకోవడానికి తన ఆరోగ్య పరిస్థితి అస్సలు సహకరించడం లేదని పేర్కొంది. తన మోకాలులోని మృదులాస్థి బాగా దెబ్బతిందని అందువల్ల ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా కష్టం. అదీగాక అత్యున్న స్థాయి ఆటగాళ్లను ఎదుర్కోవడానికి రెండు గంటల ప్రాక్టీస్ ఏ మాత్రం సరిపోదని వెల్లడించింది.
సైనా వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట పెద్ద దుమారం రేపాయి. ఆమె రిటైర్మైంట్ గురించి పలు ఊహగానాలు హల్‌చల్ చేశాయి. నిజానికి సైనా దాని గురించి ఆలోచిసస్తున్నా అనే చెప్పిందే తప్ప బహిరంగంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. ఆటగాళ్ల కెరియర్ చిన్నదే అయినా తాను 9 ఏళ్ల వయసులోనే క్రీడాకారిణిగా కెరియర్ ప్రారంభించానని చెప్పుకొచ్చింది. ఐతే ఆమె గతేడాది సింగపూర్ ఓపెన్ తర్వాత బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనలేదు. అసలు ఇలాంటి సమస్యను ఎక్కువగా క్రీడాకారులే ఎందుకు ఎదుర్కొంటారంటే..
కీళ్ళలో మార్పులకు కారణమే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అని ఎడిన్‌బర్గ్‌లోని విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. 2022లో చేసిన అధ్యయనంలో దీన్ని గుర్తించారు. ఈ సమస్యతో దాదాపు 3 వేల మంది రిటైర్డ్ ఒలింపియన్లు బాధపడుతున్నట్లు చెప్పారు. వారంతా మోకాలి, కటి వెన్నుముక, భుజాలు వంటి ప్రాంతాల్లో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా వేసవి, శీతాకాల ఒలింపిక్ క్రీడలలో రిటైర్ కాబోతున్న ఎలైట్ అథ్లెట్ల కీళ్లలో ఈ సమస్యను గుర్తించామని చెప్పారు. ఆస్టియో ఆర్థైటిస్ అనేది భరించలేని నొప్పిని కలిగిస్తుందని అన్నారు. క్రీడల్లో ఉండే ఒకవిధమైన ఒత్తిడి, అయ్యే గాయలు కారణంగా ఈ సమస్య వస్తుంది.
అయితే ఈ గాయాలు పదే పదే పునరావృతమవుతుంటే సమస్య తీవ్రమవుతుందని అన్నారు. అది కాస్త మృదులాస్థి విచ్ఛిన్నానికి దారితీసి భరించలేని నొప్పిని కలుగజేస్తుందని అన్నారు. అలాగే ఒక్కోసారి క్రీడల సమయంలో అయ్యే గాయాల కారణంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. మోకాలు, మడమల వద్ద అయ్యే గాయాలు కారణంగా ఈ ఆస్టియో ఆర్థైటిస్ సమస్య అభివృద్ధి చెందే అవకాశ ఉందని అన్నారు.
దీర్థకాలిక కీళ్ల వాపులు కూడా ఈ పరిస్థితికి దారితీస్తుందని చెబుతున్నారు. కొన్ని క్రీడల్లో వేగవంతమైన కదలిక భుజాలు, మోకాళ్లపై ఒత్తిడి ఏర్పడటంతో ఈ సమస్య వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ అని చెబుతున్నారు. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే అసౌకర్యం, నొప్పిని కలుగజేసి వైకల్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.
(చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి ..ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కి ఏకంగా..!)
Comments
Please login to add a commentAdd a comment