sports persons
-
ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న సైనా నెహ్వాల్..క్రీడాకారులకే ఎందుకంటే..?
ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ షూటర్ గగన్ నారంగ్ పాడ్‌కాస్ట్‌లో షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. తాను ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని, బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకోవడానికి తన ఆరోగ్య పరిస్థితి అస్సలు సహకరించడం లేదని పేర్కొంది. తన మోకాలులోని మృదులాస్థి బాగా దెబ్బతిందని అందువల్ల ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా కష్టం. అదీగాక అత్యున్న స్థాయి ఆటగాళ్లను ఎదుర్కోవడానికి రెండు గంటల ప్రాక్టీస్ ఏ మాత్రం సరిపోదని వెల్లడించింది. సైనా వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట పెద్ద దుమారం రేపాయి. ఆమె రిటైర్మైంట్ గురించి పలు ఊహగానాలు హల్చల్ చేశాయి. నిజానికి సైనా దాని గురించి ఆలోచిసస్తున్నా అనే చెప్పిందే తప్ప బహిరంగంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. ఆటగాళ్ల కెరియర్ చిన్నదే అయినా తాను 9 ఏళ్ల వయసులోనే క్రీడాకారిణిగా కెరియర్ ప్రారంభించానని చెప్పుకొచ్చింది. ఐతే ఆమె గతేడాది సింగపూర్ ఓపెన్ తర్వాత బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనలేదు. అసలు ఇలాంటి సమస్యను ఎక్కువగా క్రీడాకారులే ఎందుకు ఎదుర్కొంటారంటే..కీళ్ళలో మార్పులకు కారణమే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అని ఎడిన్‌బర్గ్‌లోని విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. 2022లో చేసిన అధ్యయనంలో దీన్ని గుర్తించారు. ఈ సమస్యతో దాదాపు 3 వేల మంది రిటైర్డ్ ఒలింపియన్లు బాధపడుతున్నట్లు చెప్పారు. వారంతా మోకాలి, కటి వెన్నుముక, భుజాలు వంటి ప్రాంతాల్లో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా వేసవి, శీతాకాల ఒలింపిక్ క్రీడలలో రిటైర్ కాబోతున్న ఎలైట్ అథ్లెట్ల కీళ్లలో ఈ సమస్యను గుర్తించామని చెప్పారు. ఆస్టియో ఆర్థైటిస్ అనేది భరించలేని నొప్పిని కలిగిస్తుందని అన్నారు. క్రీడల్లో ఉండే ఒకవిధమైన ఒత్తిడి, అయ్యే గాయలు కారణంగా ఈ సమస్య వస్తుంది. అయితే ఈ గాయాలు పదే పదే పునరావృతమవుతుంటే సమస్య తీవ్రమవుతుందని అన్నారు. అది కాస్త మృదులాస్థి విచ్ఛిన్నానికి దారితీసి భరించలేని నొప్పిని కలుగజేస్తుందని అన్నారు. అలాగే ఒక్కోసారి క్రీడల సమయంలో అయ్యే గాయాల కారణంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. మోకాలు, మడమల వద్ద అయ్యే గాయాలు కారణంగా ఈ ఆస్టియో ఆర్థైటిస్ సమస్య అభివృద్ధి చెందే అవకాశ ఉందని అన్నారు. దీర్థకాలిక కీళ్ల వాపులు కూడా ఈ పరిస్థితికి దారితీస్తుందని చెబుతున్నారు. కొన్ని క్రీడల్లో వేగవంతమైన కదలిక భుజాలు, మోకాళ్లపై ఒత్తిడి ఏర్పడటంతో ఈ సమస్య వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ అని చెబుతున్నారు. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే అసౌకర్యం, నొప్పిని కలుగజేసి వైకల్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి ..ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కి ఏకంగా..!) -
ఫామ్‌లో లేకపోతేనేం.. ఇప్పటికీ కోహ్లినే 'కింగ్'
Ormax Most Popular Sportspersons In India June 2022: మూడంకెల స్కోర్ సాధించక దాదాపు వెయ్యి రోజులు గడుస్తున్నా.. పూర్తిగా ఫామ్ కోల్పోయి దాదాపు ఏడాది గడుస్తున్నా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదనటానికి తాజాగా విడుదలైన ఈ సర్వే ఫలితాలే నిదర్శనం. 2022 జూన్ నెలకు గాను క్రీడా విభాగానికి సంబంధించి భారత దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరనే అంశంపై ఆర్మాక్స్ అనే మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో విరాట్ కోహ్లి మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. Ormax Sports Stars: Most popular sportspersons in India (Jun 2022) pic.twitter.com/7muGeR4Y8P — Ormax Media (@OrmaxMedia) July 22, 2022 ఆర్మాక్స్ సంస్థ స్పోర్ట్స్ స్టార్స్ జూన్ 2022 పేరిట విడుదల చేసిన టాప్ 10 జాబితాలో కోహ్లి తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, పోర్చుగల్ సాకర్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో నిలిచారు. Ormax Sports Stars: Most popular sportspersons in India (Jan 2022) pic.twitter.com/N9hhYdPhIT — Ormax Media (@OrmaxMedia) February 21, 2022 ఇదే సంస్థ ఈ ఏడాది ఆరంభంలో చేపట్టిన సర్వేలోనూ టాప్‌లో నిలిచిన విరాట్.. ఫామ్‌లో లేకపోయినా, ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రజాదరణలో తాను ఎప్పటికీ కింగ్నేనని మరోసారి నిరూపించాడు. అయితే ఆర్నెళ్ల క్రితం విడుదలైన జాబితాలో మూడో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ.. తాజా జాబితాలో ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి దిగజారడం చర్చనీయాశంగా మారింది. జనవరి 2022 జాబితాతో పోలిస్తే ప్రముఖ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు ఎగబాకగా.. వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్ పేరు టాప్ 10 జాబితాలో గల్లంతైంది. చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 'కింగే'.. ఒక్క పోస్టుకు ఎంత సంపాదిస్తున్నాడంటే? -
‘శిక్ష’ ముగిసిన డోపీలకూ జాతీయ క్రీడా పురస్కారాలు
న్యూఢిల్లీ: తెలిసో... తెలియకో... డోపింగ్ ఉచ్చులో పడి శిక్ష పూర్తి చేసుకున్న క్రీడాకారులకు ఊహించని ఊరట లభించింది. ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాలకు వారి పేర్లను కూడా ఇకపై పరిశీలించనున్నారు. దీంతో అమిత్ పంఘాల్‌లాంటి భారత స్టార్ బాక్సర్‌కు ‘అర్జున’ తదితర అవార్డులు దక్కనున్నాయి. 2012లో డోపింగ్ మరక వల్లే అమిత్ అవార్డులకు దూరమయ్యాడు. అయితే నిషేధకాలం పూర్తి చేసుకున్న వారినే ఎంపిక చేస్తారు. ఈసారి టోక్యో ఒలింపిక్స్ వల్లే జాతీయ క్రీడా పురస్కారాల ఎంపిక, ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఒలింపిక్స్ పతక విజేతలకు కూడా అవకాశమివ్వాలనే ఉద్దేశంతో కేంద్ర క్రీడాశాఖ ఈ ప్రక్రియను వాయిదా వేసింది. ఇప్పటికే కమిటీని నియమించిన ప్రభుత్వం త్వరలోనే వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించి అవార్డు విజేతలను ప్రకటించనుంది. చదవండి: భారత టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన.. కొత్త బాధ్యతల్లో ధోని -
సరిలేరు ఆమెకెవ్వరు...
ఆమె గరిటె తిప్పితే.... కడుపు నిండుతుంది. ఆమె పాట పాడితే... మనసు పరవశిస్తుంది. ‘ఆమె’ ఆట ఆడితే... విజయమే బానిసవుతుంది. పతకం మురిసిపోతుంది. యావత్ దేశం గర్వపడేలా చేస్తుంది. ఆమె ఇప్పుడు ఆకాశంలోనే సగం కాదు... ఆటల్లోనూ ఘనం. క్రీడా సమరంలో క్రియాశీలం. ఇంకా చెప్పాలంటే ఒలింపిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ వీరనారిత్వమే పతకాలను తెచ్చిపెడుతోంది. వ్యక్తిగత క్రీడల్లో 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టర్, తెలుగుతేజం కరణం మల్లీశ్వరి త్రివర్ణ శోభితం చేస్తే... 2012 లండన్ ఒలింపిక్స్‌లో షట్లర్ సైనా నెహ్వాల్, బాక్సర్ మేరీకోమ్... 2016 రియో ఒలింపిక్స్‌లో షట్లర్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మలిక్‌లే పతకాలు, శతకోటి భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో, అంతే కదన కుతూహలంతో ‘టోక్యో’ వెళ్లేందుకు కష్టపడుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆశల పల్ల్లకిని మోయనున్న షట్లర్ సింధు, బాక్సర్లు మేరీకోమ్, సిమ్రన్‌జిత్, పూజా రాణి, లవ్లీనా, ఆర్చర్ దీపిక కుమారి, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, మహిళా షూటర్లు మనూ భాకర్, రాహీ సర్నోబత్, ఇలవేనిల్ వలారివన్, అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండేలా, తేజస్విని సావంత్, యశస్విని సింగ్, చింకీ యాదవ్, అథ్లెట్స్ భావన, ప్రియాంక గోస్వామి, రాణి రాంపాల్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు సభ్యులకు మనసారా కంగ్రాట్స్ చెబుదాం. విమెన్ ఇండియా... విన్ ఇండియా. కేవలం ఒలింపిక్ క్రీడాంశాల్లోనే కాకుండా నాన్ ఒలింపిక్ క్రీడల్లోనూ భారత మహిళా క్రీడా కారిణులు మెరిసిపోతున్నారు. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ మేధోసంపదతో రెండు దశాబ్దాలుగా ప్రపంచ చెస్‌లో భారత్ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. పదిహేను నెలల క్రితం ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో హంపి స్వర్ణ పతకాన్ని గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. బీబీసీ మీడియా సంస్థ అందించే ‘ఈ ఏడాది అత్యుత్తమ భారతీయ క్రీడాకారిణి’ అవార్డు రేసులో రాణి రాంపాల్ (హాకీ), వినేశ్ (రెజ్లర్), మనూ భాకర్ (షూటింగ్), ద్యుతీ చంద్ (అథ్లెటిక్స్)లతో కలిసి హంపి బరిలో నిలిచింది. మహిళా దినోత్సవం సందర్భంగా బీబీసీ సంస్థ ఈరోజు విజేతను ప్రకటించనుంది. -
శాయ్ నుంచి శాప్ దాకా అదే వేదన
ఏఎన్‌యూ: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆయా దేశాలు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నాయి. జమైకా వంటి అతి పేద దేశంతో పాటు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనా కూడా క్రీడారంగానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారత్‌లో మాత్రం క్రీడలు ఎప్పుడూ చిన్నచూపేనని క్రీడాకారులు, కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడలకు అంతర్జాతీయ ఖ్యాతి తెస్తామని పాలకులు, అధికారులు చెబుతున్నారే తప్ప వాస్తవానికి జరుగుతున్నది అందుకు విరుద్ధమైన పనులేనని వాపోతున్నారు. ఈ విషయంలో జాతీయ స్థాయి క్రీడారంగ సంస్థ అయిన శాయ్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) వరకూ అంతటా ఒకటే తీరు అని చెబుతున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే.. ఇచ్చే నగదు తిండికే సరి.. అత్యున్నత ప్రమాణాలు, అంకిత భావం ఉన్న కోచ్‌లు, నైపుణ్యం ఉండి లక్ష్యం సాధించాలనే క్రీడాకారులతోనే విజయాలు సాధ్యమవుతాయి. అలాంటి పరిస్థితి లేనప్పుడు విజయాలు సుదూరం. ప్రభుత్వం వారిని ప్రోత్సహించకుండా జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపినా నిష్ప్రయోజనం. నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఎందరో ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లేక క్రీడారంగానికి దూరవవుతున్నారు. ప్రస్తుతం శాయ్ ఒక్కో క్రీడాకారుడికి ఒక రోజుకు రూ.250 వెచ్చిస్తోంది. అది తిండికి సరిపోతుంది. ఇక ఇతర పరికరాలు, బట్టలు, షూస్ కొనుగోలు ఎలా? సరైన వనరులు ఉండాల్సిందే..! – డీఏ వినాయక ప్రసాద్, శాయ్ కోచ్ ప్రోత్సహిస్తేనే విజయాలు ఇతర దేశాల క్రీడా విధానం, ప్రోత్సాహకాలతో మన దేశ విధానాన్ని పోల్చుకోవడం సరికాదు. గతంలో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. అంతర్జాతీయ పతకాలను సాధించే అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇంకా పెరగాలి. క్రీడారంగంలోని అధికారులు, కోచ్‌లు, విధాన రూపకర్తలు అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించొచ్చు. మన దేశంలో ఎంతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఉన్నారు. వారికి అన్ని అంశాల్లో ప్రోత్సాహం అందిస్తేనే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలం. చైనా, రష్యా వంటి దేశాల్లో స్కూల్లోనే ట్రాక్‌లు, ప్రత్యేకమైన స్పోర్ట్స్ అకాడమీలు ఉన్నాయి. – పీటీ ఉష, అర్జున అవార్డు గ్రహీత, కోచ్ నైపుణ్యం ఉన్నా ప్రోత్సాహం కరువు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాల్లో ఎందరో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నారు. వారికి మూడుపూటలా తిండిపెట్టి వసతులు కల్పిస్తే వారు మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంది. వారిని గుర్తించి ప్రాథమిక దశ నుంచే ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణతో రూపొందించాలి. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఆశించిన స్థాయిలో లేదు. సాధనకు పరికరాలు కనీసం కాళ్లకు షూస్ కూడా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిస్థితి మారాలి. – సుబ్బారావు, శాయ్ కోచ్ , ఔరంగాబాద్ -
క్రికెట్ కంటే దేశమే ముఖ్యం
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ నటులపై నిషేధం విధించడంపై బాలీవుడ్ పరిశ్రమ భిన్నంగా స్పందిస్తోంది. కొందరు పాక్ నటులకు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడారు. కాగా పాక్‌తో క్రీడా సంబంధాల విషయంపై క్రీడా వర్గాల నుంచి దాదాపు ఏకాభిప్రాయం వస్తోంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామని క్రీడాకారులు చెబుతున్నారు. తనకు క్రికెట్ కంటే దేశమే ముఖ్యమని క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా నిలుస్తామన్నాడు. పాక్‌తో క్రికెట్ ఆడబోమని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని క్రికెటర్లు స్వాగతించారు. బీసీసీఐ, ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తామని మరో క్రికెటర్ పార్థివ్ పటేల్ అన్నాడు. క్రికెటర్లతో పాటు ఇతర క్రీడలకు చెందిన ఆటగాళ్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.