Ormax Most Popular Sportspersons In India June 2022: మూడంకెల స్కోర్ సాధించక దాదాపు వెయ్యి రోజులు గడుస్తున్నా.. పూర్తిగా ఫామ్ కోల్పోయి దాదాపు ఏడాది గడుస్తున్నా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదనటానికి తాజాగా విడుదలైన ఈ సర్వే ఫలితాలే నిదర్శనం. 2022 జూన్ నెలకు గాను క్రీడా విభాగానికి సంబంధించి భారత దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరనే అంశంపై ఆర్మాక్స్ అనే మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో విరాట్ కోహ్లి మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు.
Ormax Sports Stars: Most popular sportspersons in India (Jun 2022) pic.twitter.com/7muGeR4Y8P
— Ormax Media (@OrmaxMedia) July 22, 2022
ఆర్మాక్స్ సంస్థ స్పోర్ట్స్ స్టార్స్ జూన్ 2022 పేరిట విడుదల చేసిన టాప్ 10 జాబితాలో కోహ్లి తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, పోర్చుగల్ సాకర్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో నిలిచారు.
Ormax Sports Stars: Most popular sportspersons in India (Jan 2022) pic.twitter.com/N9hhYdPhIT
— Ormax Media (@OrmaxMedia) February 21, 2022
ఇదే సంస్థ ఈ ఏడాది ఆరంభంలో చేపట్టిన సర్వేలోనూ టాప్‌లో నిలిచిన విరాట్.. ఫామ్‌లో లేకపోయినా, ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రజాదరణలో తాను ఎప్పటికీ కింగ్‌నేనని మరోసారి నిరూపించాడు. అయితే ఆర్నెళ్ల క్రితం విడుదలైన జాబితాలో మూడో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ.. తాజా జాబితాలో ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి దిగజారడం చర్చనీయాశంగా మారింది. జనవరి 2022 జాబితాతో పోలిస్తే ప్రముఖ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు ఎగబాకగా.. వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్ పేరు టాప్ 10 జాబితాలో గల్లంతైంది.
చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 'కింగే'.. ఒక్క పోస్టుకు ఎంత సంపాదిస్తున్నాడంటే?
Comments
Please login to add a commentAdd a comment