
ముంబై: భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) రాణిస్తే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) భారత్ వశమవుతుందని శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) అన్నాడు. రిలయన్స్ శీతల పానియాల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన అతను మీడియాతో ముచ్చటించాడు. ‘ఇద్దరు అసాధారణ ఆటగాళ్లు. ప్రపంచ శ్రేణి బ్యాటర్లు. ఎప్పుడైనా సరే క్లాస్ శాశ్వతం. ఫామ్ లేకపోవడం తాత్కాలికం.
తప్పకుండా రోహిత్‌లాగే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగితే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంటుంది’ అని మురళీ వివరించాడు. రోహిత్ బృందం ఆల్‌రౌండ్ వనరులతో పటిష్టంగా కనబడుతోందన్నాడు. భారత్ సహా పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో నాణ్యమైన స్పిన్ బౌలర్లు ఉన్నారని, పాకిస్తాన్‌లోని పిచ్‌లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయని చెప్పాడు.