Muttiah Muralitharan
-
రోహిత్‌లాగే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తాడు.. చాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే..!
ముంబై: భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) రాణిస్తే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) భారత్ వశమవుతుందని శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) అన్నాడు. రిలయన్స్ శీతల పానియాల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన అతను మీడియాతో ముచ్చటించాడు. ‘ఇద్దరు అసాధారణ ఆటగాళ్లు. ప్రపంచ శ్రేణి బ్యాటర్లు. ఎప్పుడైనా సరే క్లాస్ శాశ్వతం. ఫామ్ లేకపోవడం తాత్కాలికం. తప్పకుండా రోహిత్‌లాగే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగితే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంటుంది’ అని మురళీ వివరించాడు. రోహిత్ బృందం ఆల్‌రౌండ్ వనరులతో పటిష్టంగా కనబడుతోందన్నాడు. భారత్ సహా పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో నాణ్యమైన స్పిన్ బౌలర్లు ఉన్నారని, పాకిస్తాన్‌లోని పిచ్‌లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయని చెప్పాడు. -
అశ్విన్ ద గ్రేట్.. మురళీథరన్, షేన్ వార్న్ కంటే ఎక్కువ..!
ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. అశ్విన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 765 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్లతో పోలిస్తే టెస్ట్ క్రికెట్ ఎక్కువగా ఆడిన యాష్.. ఒక్క సుదీర్ఘ ఫార్మాట్లోనే 537 వికెట్లు తీశాడు. అశ్విన్ టెస్ట్‌ల్లో 37 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ ఏడో స్థానంలో ఉన్నాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800) కొనసాగుతున్నాడు. మురళీ తర్వాతి స్థానాల్లో షేన్ వార్న్ (708), ఆండర్సన్ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్‌గ్రాత్ (563) ఉన్నారు.మురళీథరన్, షేన్ వార్న్ కంటే ఎక్కువ సార్లు..!టెస్ట్‌ల్లో మురళీథరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ స్పిన్నర్లు అశ్విన్ కంటే ఎక్కువ వికెట్లు తీశారు. వికెట్ల సంఖ్యా పరంగా లేదా ఇతరత్రా రికార్డుల విషయంలో వీరంతా అశ్విన్ కంటే మెరుగ్గా ఉన్నా, ఒక్క విషయంలో మాత్రం అశ్విన్ పై ముగ్గురిని తలదన్నాడు.టెస్ట్ సిరీస్‌ల్లో అత్యధిక సార్లు 25 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత అశ్విన్‌కే దక్కుతుంది. అశ్విన్ తన కెరీర్లో ఏడు సార్లు టెస్ట్ సిరీస్‌ల్లో 25 అంతకంటే ఎక్కువ వికెట్లు తీయగా.. షేన్ వార్న్, మురళీథరన్ ఆరు సార్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అశ్విన్ 25 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరు సిరీస్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలవడం విశేషం. అశ్విన తన కెరీర్లో మొత్తం 12 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్నాడు. -
అశ్విన్‌కే సాధ్యం.. ముత్తయ్య మురళీధరన్ వరల్డ్ రికార్డు సమం
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఎడిషన్‌లో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సత్తా చాటాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్న వేళ సెంచరీతో ఆదుకున్నాడు.సొంత మైదానం చెపాక్‌లో నిలకడగా ఆడి 113 పరుగులు సాధించాడు. అంతేకాదు.. అదే మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. ఇలా ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించి.. బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి అశూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.రెండో టెస్టులోనూ అదరగొట్టిఇక కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్టులోనూ అశ్విన్ అదరగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లను తిప్పలుపెట్టి కీలక వికెట్లు కూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజ్ముల్ షాంటో(31), షకీబ్ అల్ హసన్(9) వికెట్లు తీసిన అశూ.. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జకీర్ హసన్(10), మొమినుల్ హక్(2), హసన్ మహమూద్(4)లను పెవిలియన్‌కు పంపాడు. అలా మొత్తంగా రెండో టెస్టులో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ రికార్డు సమంఈ మ్యాచ్‌లోనూ భారత్ బంగ్లాపై గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన అశ్విన్‌ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. అశూ టెస్టుల్లో ఈ పురస్కారం అందుకోవడం ఇది పదకొండోసారి కావడం విశేషం. తద్వారా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ చెన్నై బౌలర్ సమం చేశాడు. మురళీధరన్ కూడా సంప్రదాయ క్రికెట్లో 11 సార్లు ఈ అవార్డు గెలిచాడు. కాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో చెన్నై టెస్టులో 280 పరుగుల తేడాతో గెలిచిన రోహిత్ సేన.. కాన్పూర్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.టెస్టుల్లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచిన క్రికెటర్లుముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)- 11 సార్లురవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 11 సార్లుజాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా)- 9 సార్లుసర్ రిచర్డ్ హాడ్లీ(న్యూజిలాండ్)- 8 సార్లుఇమ్రాన్ ఖాన్(పాకిస్తాన్)- 8 సార్లుషేన్ వార్న్(ఆస్ట్రేలియా)- 8 సార్లు.చదవండి: WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డు -
నా రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు: మురళీథరన్
శ్రీలంక బౌలింగ్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తన పేరిట ఉన్న అత్యధిక టెస్టు వికెట్ల (800) రికార్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో తన రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని ధీమా వ్యక్తం చేశాడు. టెస్ట్‌ల్లో తన రికార్డు శాశ్వతంగా మిగిలిపోతుందని జోస్యం చెప్పాడు. ప్రస్తుత తరం బౌలర్లలో ఎవరూ తన రికార్డు దరిదాపుల్లోకి కూడా రాలేరని అన్నాడు.తన రికార్డు చాలా కాలం పాటు పదిలంగా ఉండటానికి పొట్టి క్రికెటే ప్రధాన కారణమని తెలిపాడు. పొట్టి ఫార్మాట్ కారణంగా టెస్ట్ క్రికెట్ ప్రభ కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు, ప్రేక్షకుల్లో టెస్ట్ ఫార్మాట్‌పై ఆసక్తి తగ్గుతోందని ఆవేదన చెందాడు. కాగా, ప్రస్తుత తరం క్రికెటర్లలో మురళీథరన్ రికార్డు కునుచూపు మేరలో నాథన్ లియోన్ (530 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (516) మాత్రమే ఉన్నారు. వీరిలో లియోన్ వయసు 36, అశ్విన్ వయసు 37. వీరద్దరూ రిటైరయ్యేలోపు మురళీథరన్ రికార్డును అందుకునే అవకాశం లేదు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఇటీవల 704 వికెట్లతో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. -
భారత్‌లో రూ. 1400 కోట్లు పెట్టుబడి పెట్టనున్న క్రికెట్ దిగ్గజం
స్పిన్ దిగ్గజం, శ్రీలంకన్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ ముత్తయ్య మురళీథరన్ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్నాడు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో (బడనగుప్పే అనే ప్రాంతంలో) 1400 కోట్ల పెట్టుబడితో బెవరేజ్ యూనిట్ (శీతల పానీయాల తయారీ కేంద్రం) స్థాపించనున్నాడు. ఇందు కోసం కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కర్ణాటక ప్రభుత్వం మురళీ స్థాపించబోయే ‘ముత్తయ్య బెవరేజెస్ అండ్ కన్ఫెక్షనరీస్' సంస్థకు బడనగుప్పేలో 46 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు మురళీ, కర్ణాటక ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని కర్ణాటక భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ దృవీకరించారు. మురళీ శీతల పానీయాల యూనిట్ వచ్చే ఏడాది జనవరి నుంచి పనులను ప్రారంభించాలని భావిస్తుంది. మురళీ ఈ శీతల పానీయాల వ్యాపారాన్ని శ్రీలంకలో విజయవంతంగా నడుపుతున్నాడు. తన వ్యాపారాన్ని భారత్‌లో విస్తరించడంలో భాగంగా అతను తొలుత కర్ణాటకలో పెట్టుబడులు పెట్టనున్నాడు. కర్ణాటక పరిశ్రమల మంత్రి చెప్పిన ప్రకారం మురళీ త్వరలో తన వ్యాపారాన్ని ధార్వడ్ జిల్లాకు కూడా విస్తరించనున్నాడు. కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో మురళీ ఇటీవల ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్‌ను కలిశారు. ఆ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సెల్వకుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ గుంజన్ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 52 ఏళ్ల మురళీథరన్ ప్రస్తుతం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు స్ట్రాటజిక్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. -
మురళీథరన్ రికార్డు బద్దలు కొట్టిన అశ్విన్
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో 9 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్.. ఈ ప్రదర్శనతో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరన్ పేరిట ఉన్న పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఇందులో ఓ రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ టెస్ట్ సిరీస్‌లో 25 అంతకంటే ఎక్కువ వికెట్లు అత్యధిక సార్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మురళీథరన్ పేరిట ఉండిన ఈ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (800) సాధించిన మురళీ తన టెస్ట్ కెరీర్లో (ఓ టెస్ట్ సిరీస్‌లో) 25 అంతకంటే ఎక్కువ వికెట్ల ఘనతను ఆరు సార్లు నమోదు చేయగా.. అశ్విన్ ఏడు సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు. కేవలం 100 టెస్ట్‌ల్లోనే 516 వికెట్లు (36 ఐదు వికెట్ల ఘనతలు) తీసిన అశ్విన్.. మరో 285 వికెట్లు తీస్తే మురళీథరన్ పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బద్దలు కొడతాడు. కాగా, ధర్మశాల వేదికగా జరిగిన టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టిన అశ్విన్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో యాష్ రెండు ఐదు వికెట్ల ఘనతలు, ఓ నాలుగు వికెట్ల ఘనత నమోదు చేశాడు. -
ఇంతకంటే చెత్త ప్రదర్శన మరోటి ఉండదు.. స్పిన్ దిగ్గజం విమర్శలు
శ్రీలంక క్రికెట్ భవితవ్యంపై దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్లుగా కెరీర్ ఎంచుకునే వాళ్లను భయపెట్టే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని వాపోయాడు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే ఈ విషయంలో చొరవ తీసుకొని లంక క్రికెట్ బోర్డును ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి చేశాడు. భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్- 2023లో శ్రీలంక దారుణంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో డీలాపడ్డ లంక పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. 1975, 1983, 1987, 1992 ఎడిషన్ల తర్వాత మరోసారి ఇలాంటి ఘోర పరాభవం మూటగట్టుకుంది స్వర్ణ యుగం కాగా... 1996లో ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక 2007, 2011లో రన్నరప్‌గా నిలిచింది 2003లో సెమి ఫైనల్ వరకు చేరింది. అలాంటి జట్టు ఈసారి పూర్తిగా విఫలం కావడం తనను బాధించిందని మురళీధరన్ ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో 1975 తర్వాత శ్రీలంకకు ఇదే అత్యంత చెత్త ఎడిషన్ అని విమర్శలు గుప్పించాడు. నిబద్ధత, అంకితభావం లోపించినందువల్లే ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నాడు. వ్యక్తిగత అజెండాలను ఆటలపై రుద్దాలనుకోవడం సరికాదని బోర్డు సభ్యులను విమర్శించాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం క్రికెట్‌ను తాకట్టు పెట్టొద్దని చురకలు అంటించాడు. వాళ్ల పరిస్థితి ఏం కావాలి? ఇలాంటి పరిణామాల వల్ల యువ ఆటగాళ్ల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారవుతుందని పేర్కొన్నాడు. దేశం కోసం క్రికెట్ ఆడాలనుకునే వాళ్లను చిన్నబుచ్చుకునేలా చేయొద్దని ముత్తయ్య మురళీధరన్ విజ్ఞప్తి చేశాడు కాగా వనిందు హసరంగ వంటి స్టార్ ఆల్ రౌండర్ ఫిట్‌గా ఉన్నప్పటికీ అతడిని పక్కన పెట్టారని లంక సెలక్షన్ బోర్డుపై విమర్శలు వచ్చాయి. అదే విధంగా.. క్రికెట్ బోర్డులో అవినీతిని నిర్మూలించే క్రమంలో తాను పాత కమిటీని రద్దు చేస్తున్నట్లు ఆదేశ క్రీడామంత్రి రోషన్ రణసింగి గతంలో ప్రకటించారు. లంక బోర్డుపై నిషేధం అయితే బోర్డు సభ్యులు కోర్టుకు వెళ్లగా అక్కడ వారికి సానుకూలంగా తీర్పు వచ్చింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి మాత్రం ఈ విషయాలపై తీవ్రంగా స్పందించింది. లంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ నిషేధం విధించింది ఈ పరిణామాల నేపథ్యంలో లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ న్యూస్ 18తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. -
కోహ్లిలా ఉంటే రోహిత్ మరో వరల్డ్‌కప్ ఆడతాడు: లంక స్పిన్ దిగ్గజం
Rohit Sharma- T20I Future: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో వరల్డ్‌కప్ ఆడే సత్తా ఉన్నవాడేనని శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. విరాట్ కోహ్లి మాదిరి ఫిట్నెస్ కాపాడుకుంటే కచ్చితంగా టీ20 ప్రపంచకప్-2024లో అతడు ఆడతాడని అభిప్రాయపడ్డాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ దాకా అజేయంగా నిలిచిన టీమిండియా.. తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై తప్పక అందుతుందనుకున్న ట్రోఫీ చేజారడంతో కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఇతర ఆటగాళ్లంతా నిరాశలో కూరుకుపోయారు. ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి సంసిద్ధమయ్యే క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గత ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరమయ్యారు. ఈ క్రమంలో ప్రపంచకప్ ఓటమి తర్వాత వీరిద్దరు ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా తప్పుకొనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుతంగా ఆడాడు ఈ నేపథ్యంలో ముత్తయ్య మురళీధరన్ రోహిత్ కెరీర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో అతడి ప్రదర్శన అద్భుతంగా ఉంది. మెరుగైన స్ట్రైక్‌రేటుతో అతడి బ్యాటింగ్ సాగింది. ఈవెంట్ మొత్తంలో అతడు ఒక్కసారిగా వైఫల్యం చెందిన సందర్భం లేదు. అతడికి ఇప్పుడు కేవలం 36 ఏళ్లే.. అంటే ఇంకా యువకుడనే అర్థం. విరాట్ కోహ్లి మాదిరి ఫిట్నెస్ కాపాడుకుంటే కచ్చితంగా ఇంకో వరల్డ్‌కప్ ఆడే అవకాశం ఉంది. ఇంకా యువకుడే.. కోహ్లిలా ఫిట్నెస్ కాపాడుకుంటే వన్డేల్లో అతడి స్ట్రైక్‌రేటు 130కిపైగానే.. టీ20లలో కూడా మెరుగైన గణాంకాలే కలిగి ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా తనకెంతో అనుభవం ఉంది. ఏ ఆటగాడైనా 35 ఏళ్ల తర్వాత కూడా కొనసాగాలనుకుంటే ఫిట్నెస్ కాపాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రోహిత్ ఆడాలని భావిస్తే తప్పక ఆ దిశగా మరింత కష్టపడతాడు. నాకు తెలిసి తను మరో వరల్డ్‌కప్ ఆడటానికి కచ్చితంగా సిద్ధమవుతాడు’’ అని ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నాడు. కాగా అమెరికా, వెస్టిండీస్ సంయుక్తగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024 జూన్ 4న మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. యంగ్ టీమిండియా ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉంది. చదవండి: వాళ్లిద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప: ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు -
ఓటీటీకి స్పిన్ మాంత్రికుడి బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కించి చిత్రం '800'. ఈ చిత్రంలో స్లమ్ గాడ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరేన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా.. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో వివేక్ రంగాచారి నిర్మించారు. అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సినీ ప్రేక్షకులతో పాటు క్రికెట్ అభిమానులను అలరించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్ వచ్చేసింది. డిసెంబర్ 2 నుంచి జియో సినిమాలో ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తమిళం, తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో రిలీజ్ కానుంది. థియేటర్లలో చూడడం మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 800 కథేంటంటే.. ముత్తయ్య మురళీధరన్ అంటే 800 వికెట్లు తీసిన ఏకైన క్రికెటర్‌గానే అందరికి తెలుసు.అయితే ఈ 800 వికెట్లు తీయడానికి వెనుక ఆయన పడిన కష్టమేంటి? తమిళనాడు నుంచి వలస వెళ్లి శ్రీలంకలో సెటిల్ అయిన మురళీధరన్ ఫ్యామిలీ.. అక్కడ ఎలాంటి వివక్షకు గురైంది? వివక్షను, అవమానాలను తట్టుకొని శ్రీలంక జట్టులో చోటు సంపాదించుకున్న మురళీధరన్.. స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత కూడా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. తొలిసారి ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన మురళీధరన్.. జట్టు నుంచి ఎలా స్థానాన్ని కోల్పోయాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ‘చకింగ్ ’అవమానాలను ఎలా అధిగమించాడు? తన బౌలింగ్‌పై వచ్చిన ఆరోపణలు తప్పని ఎలా నిరూపించుకున్నాడు? శ్రీలంకలోని ఎల్టీటీఈ సమస్యపై ప్రభాకరన్‌తో ఎలాంటి చర్చలు జరిపాడు? ఆ ఆలోచన ఎలా వచ్చింది? 1000 వికెట్లు తీసే సామర్థ్యం ఉన్నప్పటికీ..ముందుగానే ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ‘800’ సినిమా చూడాల్సిందే. கிரிக்கெட் உலகை புரட்டி போட்ட #MuthiahMuralidaran என்னும் மாமனிதனின் உண்மை கதை. டிசம்பர் 2 முதல் #800 திரைப்படத்தை #JioCinema-வில் இலவசமாய் காணுங்கள்#800onJioCinema@Murali_800 @Mahima_Nambiar #MadhurrMittal @MovieTrainMP pic.twitter.com/as03GoaPyn — JioCinema (@JioCinema) November 14, 2023 -
బేకరీ వ్యాపారం.. అడుగడుగునా అవమానాలు.. దోషిలా విచారణ! 800వ వికెట్ అతడే..
Muttiah Muralitharan- 800 Wickets: అతడిది అసలు బౌలింగే కాదన్నారు. త్రో చేస్తున్నాడని, బౌలర్ కాదు జావెలిన్ త్రోయర్ అన్నారు. మోసంతో సాధించిన వికెట్లు, రికార్డులు అసలు లెక్కకే రావని, వాటిని పక్కన పడేయాలని విమర్శించారు. అతని కోసమే నిబంధనలు మార్చారని, అలా అయితే అది క్రికెట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. అడుగడుగునా అవమానాలు, మైదానంలోకి దిగితే చాలు స్టాండ్స్ నుంచి ప్రేక్షకుల బూతు పురాణాలు. కొందరు అతడిని తమిళ తీవ్రవాదిగానూ చిత్రించారు. క్రికెట్ చరిత్రలో ఇంతటి అవమానాలను ఎదుర్కొని, దోషిలా విచారణకు గురైన క్రికెటర్ మరెవరూ లేరు. కానీ ఇన్ని ఆటుపోట్ల మధ్య అతని సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు. పట్టుదలతో ప్రతికూల పరిస్థితులకు అతను ఎదురీదాడు. చివరకు అన్ని అడ్డంకులనూ అధిగమించి ఉన్నతస్థానానికి చేరాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కీర్తిని అందుకున్నాడు. అతడే ముత్తయ్య మురళీధరన్. అద్భుతమైన ఆట, ఘనతలతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన శ్రీలంక ఆఫ్‌స్పిన్నర్. నాపై నాకు నమ్మకం ఉంది 2010 జులై 18 నుంచి గాలేలో భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్.. ఈ మ్యాచ్‌తోనే తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని మురళీధరన్ ప్రకటించాడు. ఈ మ్యాచ్‌కు ముందు అతని ఖాతాలో 792 వికెట్లు ఉన్నాయి. సహచరులు అందరూ కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్నో సాధించి అప్పటికే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందిన అతనికి ఒక మైలురాయి పెద్ద ఘనత కాకపోవచ్చు. కానీ 800 అనే సంఖ్య చెప్పుకునేందుకు మాత్రం కాస్త ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందుకే అతను 800 వికెట్ల మార్క్ అందుకోవాలని వారు ఆశించారు. ఒక్క టెస్టులోనే 8 వికెట్లు కష్టమని, సిరీస్‌లో మరో రెండు టెస్టులు ఉన్నాయి కాబట్టి అది సాధించిన తర్వాతే రిటైర్ కావాలని, కనీసం 800 వచ్చాకే రిటైర్మెంట్ ప్రకటించాలని కూడా వారు సూచించారు. కానీ మురళీ వినలేదు. ‘నాపై నాకు నమ్మకం ఉంది’ అంటూ స్పష్టంగా చెప్పేశాడు. వికెట్‌కు అవకాశం లేని బంతులు వేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అతనికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కావాలి. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోగా, అతని ఖాతాలో మరో 2 వికెట్లు చేరాయి. చివరి వికెట్ మిగిలింది. అది తాము మాత్రం తీయరాదని బౌలర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వికెట్‌కు అవకాశం లేని బంతులు వేస్తూ ఉడతాభక్తిగా సాయం చేస్తూ వచ్చారు. మురళీధరన్‌కు 800వ వికెట్ అతడే చివరకు అందరూ ఎదురు చూసిన క్షణం వచ్చింది. ప్రజ్ఞాన్ ఓఝా స్లిప్‌లో జయవర్ధనేకు క్యాచ్ ఇవ్వడంతో గాలే స్టేడియం దద్దరిల్లింది. స్టేడియం పక్కనే ఉండే సముద్ర ఘోష కూడా వినిపించని రీతిలో అభిమానులు హోరెత్తించారు. అది మురళీధరన్‌కు 800వ వికెట్. ఈ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, ఈ స్థితికి చేరేందుకు పడిన శ్రమ ఆ దిగ్గజ స్పిన్నర్‌ను భావోద్వేగానికి గురి చేశాయి. అలెన్ బోర్డర్‌ను ఆశ్చర్యపరచి.. పాఠశాల స్థాయిలో అందరిలాగే తానూ ఒక ఆటను ఎంచుకోవాలని మురళీ క్రికెట్ వైపు మొగ్గాడు. మీడియం పేస్ బౌలర్‌గా అతను మొదలు పెట్టినా స్కూల్ టీమ్‌లో స్పిన్నర్ అవసరాన్ని గుర్తించి కోచ్ అతడిని స్పిన్ వైపు మళ్లించాడు. దాంతో 14 ఏళ్ల వయసులో కొత్త విద్యపై అతను దృష్టి పెట్టాల్సి వచ్చింది. అయితే మురళీ పట్టుదలగా సాధన చేసి అందరి దృష్టిలో పడ్డాడు. వరుసగా వికెట్లు పడగొడుతూ ఉత్తమ ఆటగాడిగా నిలుస్తూ వచ్చాడు. తన కుటుంబ సభ్యుల నుంచి లభించిన గట్టి మద్దతు మురళీకి మేలు చేసింది. మరో ఆలోచన లేకుండా క్రికెట్‌పై దృష్టి పెట్టేలా చేసింది. బేకరీ వ్యాపారం చేస్తూ.. బేకరీ వ్యాపారం చేసే ముత్తయ్య నలుగురు కుమారుల్లో మురళీ ఒకడు. స్కూల్ స్థాయి దాటాక స్థానిక క్లబ్‌లలో కూడా సత్తా చాటి ఎదుగుతూ పోయిన అతనికి సహజంగానే శ్రీలంక ‘ఏ’ టీమ్‌లో అవకాశం లభించింది. అయితే ఆ తర్వాత అసలు సమయం వచ్చింది. 20 ఏళ్ల వయసులో మురళీ గురించి ప్రపంచానికి తెలిసింది. శ్రీలంక పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా.. అందులో మురళీని ఎంపిక చేశారు. నాటి దిగ్గజం, ఆసీస్ కెప్టెన్ అలెన్ బోర్డర్ కూడా అతని బంతులను ఎదుర్కోవడంలో తడబడ్డాడు. దాంతో లంక బోర్డు మరో ఆలోచన లేకుండా అనూహ్యంగా రెండో టెస్టులో అవకాశం కల్పించి అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టేలా చేసింది. అలా మొదలైన ఆ ప్రస్థానం సుదీర్ఘ కాలం పాటు సాగి రికార్డులను తిరగరాసింది. గింగిరాలు తిరిగే బంతితో.. మురళీధరన్ బౌలింగ్ శైలే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. సాధారణంగా ఆఫ్ స్పిన్నర్లు వేలితోనే బంతిని స్పిన్ చేస్తారు. అందుకే వారిని ఫింగర్ స్పిన్నర్లుగా వ్యవహరిస్తారు. అయితే మణికట్టును ఎక్కువగా వాడుతూ స్పిన్ బౌలింగ్ చేసే అరుదైన ప్రజ్ఞ అతని సొంతం. ఎలాంటి పిచ్ మీదైనా బంతిని అసాధారణంగా టర్న్ చేయగల నైపుణ్యం అతనికి పెద్ద సంఖ్యలో వికెట్లను అందించింది. మారథాన్ స్పెల్స్ వేయగలడు సుదీర్ఘ సమయం పాటు విరామం లేకుండా మారథాన్ స్పెల్స్ వేయగల సామర్థ్యం అతని సొంతం. అందుకే అరడజను మంది లంక కెప్టెన్లకు ఎప్పుడైనా అతనే ప్రధాన ఆయుధం. అతడిని సమర్థంగా వాడుకున్న వారంతా నాయకులుగా గొప్ప విజయాలను తమ ఖాతాలో వేసుకోగలిగారు. తర్వాతి రోజుల్లో దూస్రా అనే పదునైన ఆయుధం మురళీ అమ్ముల పొదిలోకి చేరింది. 20 వికెట్లు మురళి ఖాతాలో ఉండాల్సిందే సమకాలీనుల్లో స్పిన్‌ను బాగా ఆడగలరని పేరున్న బ్యాటర్లందరూ మురళీని ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డవారే. అతని స్పిన్ దెబ్బకు ఎన్నో కెరీర్లు ముగిశాయంటే అతిశయోక్తి కాదు. ఒక మూడు టెస్టుల సిరీస్ జరిగిందంటే కనీసం 20 వికెట్లు మురళి ఖాతాలో ఉండాల్సిందే. శ్రీలంక వరుసగా చిరస్మరణీయ విజయాలు సాధించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. పెద్దన్నలా అండగా.. ముఖ్యంగా అర్జున రణతుంగ కెప్టెన్సీలో మురళీ స్థాయి పెరిగింది. ‘ఒక పెద్దన్నలా అతను నాకు అండగా నిలబడ్డాడ’ని రణతుంగ గురించి మురళీ చాలా సార్లు చెప్పుకున్నాడు. 1996 వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకున్న శ్రీలంక జట్టులో మురళీధరన్ కూడా ఉన్నాడు. రికార్డులే రికార్డులు.. అంతర్జాతీయ క్రికెట్లో మురళీధరన్ సాధించిన ఘనతల జాబితా చాలా పెద్దది. టెస్టులు, వన్డేలు, టి20లు కలిపి 1347 వికెట్లు తీసిన ఘనత అతని సొంతం. అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని ఫీట్ ఇది. ఆ ఘనతకు గీటురాళ్లు ఎన్నో 11 సార్లు టెస్టుల్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలవడం, వరుసగా 4 టెస్టుల్లో పదికి పైగా వికెట్లు పడగొట్టడం, అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా 63,132 బంతులు వేయడం, టెస్టు కెరీర్లో ఒక టెస్టులో పదేసి వికెట్లు 22 సార్లు పడగొట్టడం, ఒక ఇన్నింగ్స్‌లో ఐదేసి వికెట్లు 67 సార్లు తీయడం.. ఇలా ఒకటా, రెండా ఆ ఘనతకు గీటురాళ్లు ఎన్నో అతని సుదీర్ఘమైన కెరీర్లో! సునామీ వచ్చినప్పుడు సొంత ఖర్చులతో 2002లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 9 వికెట్లతో అతను తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసి త్రుటిలో 10 వికెట్ల అవకాశం కోల్పోయాడు. ఆటతోనే కాకుండా సమాజ సేవతోనూ మురళీకి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ముఖ్యంగా 2004లో శ్రీలంకలో సునామీ వచ్చినప్పుడు అతను సొంత ఖర్చులతో ప్రత్యేక శ్రద్ధ చూపించి చేపట్టిన సహాయ కార్యక్రమాలు శ్రీలంక దేశవాసుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయాయి. ‘800’ అనే సినిమా కేవలం డబ్బు ప్రకటనతో సరిపెట్టకుండా అతను పడిన శ్రమ, ఇచ్చిన సమయం అతని సహాయ కార్యక్రమం విలువేమిటో చూపించాయి. సునామీ సహాయక కార్యక్రమం కోసమే అప్పటికప్పుడు దేశంలోని నంబర్‌వన్ సిమెంట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సిద్ధమై.. వారితో ఒప్పందం చేసుకోవడం విశేషం. ఇటీవలే మురళీ కెరీర్‌పై వచ్చిన ‘800’ అనే సినిమా కూడా అతని ఘనతలను చూపిస్తుంది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
800 Review: ‘800’ మూవీ రివ్యూ
టైటిల్: 800 నటీనటుటు: మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరేన్ తదితరులు నిర్మాణ సంస్థ:మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ నిర్మాత: వివేక్ రంగాచారి సమర్పణ:శివలెంక కృష్ణ ప్రసాద్ దర్శకత్వం:ఎంఎస్ శ్రీపతి సంగీతం: జీబ్రాన్ విడుదల తేది: అక్టోబర్ 06, 2023 భాషలకు, దేశాలకు అతీతంగా తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800ల వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ ఆయనే. ఆ రికార్డును గుర్తు చేసేలా టైటిల్ పెట్టారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. స్వయంగా ముత్తయ్య మురళీధరన్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ‘800’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో ఈ నెల 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక షో వేసింది చిత్ర బృందం. మరి మురళీధరన్ బయోపిక్ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. ‘800’ కథేంటంటే.. ముత్తయ్య మురళీధరన్ అంటే 800 వికెట్లు తీసిన ఏకైన క్రికెటర్‌గానే అందరికి తెలుసు.అయితే ఈ 800 వికెట్లు తీయడానికి వెనుక ఆయన పడిన కష్టమేంటి? తమిళనాడు నుంచి వలస వెళ్లి శ్రీలంకలో సెటిల్ అయిన మురళీధరన్ ఫ్యామిలీ.. అక్కడ ఎలాంటి వివక్షకు గురైంది? వివక్షను, అవమానాలను తట్టుకొని శ్రీలంక జట్టులో చోటు సంపాదించుకున్న మురళీధరన్.. స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత కూడా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. తొలిసారి ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన మురళీధరన్.. జట్టు నుంచి ఎలా స్థానాన్ని కోల్పోయాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ‘చకింగ్ ’అవమానాలను ఎలా అధిగమించాడు? తన బౌలింగ్‌పై వచ్చిన ఆరోపణలు తప్పని ఎలా నిరూపించుకున్నాడు? శ్రీలంకలోని ఎల్టీటీఈ సమస్యపై ప్రభాకరన్‌తో ఎలాంటి చర్చలు జరిపాడు? ఆ ఆలోచన ఎలా వచ్చింది? 1000 వికెట్లు తీసే సామర్థ్యం ఉన్నప్పటికీ..ముందుగానే ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ‘800’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఓ క్రికెటర్ బయోపిక్ అంటే..అంతా క్రికెట్ గురించి, ఆ ఆటలో ఆయన సాధించిన రికార్డుల గురించి మాత్రమే ఉంటుంది. కానీ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ అలాంటి చిత్రం కాదు. ఇందులో ఆయన జీవితాన్ని చూపించాడు దర్శకుడు ఎంఎస్ శ్రీపతి . చిన్నప్పటి నుంచి మురళీధరన్ కుటుంబం పడిన కష్టాలు.. వివక్ష, అవమానాలను తట్టుకొని తన దేశం కోసం ఆడిన తీరు.. 500పైగా వికెట్లు తీసిన తర్వాత కూడా తనపై ‘మోసగాడు’అనే విమర్శలు రావడం.. దాని వల్ల మురళీధరన్ పడిన మానసిక క్షోభ.. ఒకవైపు తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటునే..800 వికెట్లు తీసిన వైనం.. ఇలా ఒక్కటేమిని.. మురళీధరన్ జీవితంలోని ప్రతి కోణాన్ని ఈ చిత్రంలో చూపించారు. క్రికెట్ ఆట ఎలా పుట్టింది? ఆంగ్లేయులు ఈ ఆటను వివిధ దేశాల్లో ఎలా విస్తరింపజేయారో తెలియజేస్తూ ‘800’ సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మురళీధరన్ తండ్రి ముత్తయ్య బాల్యాన్ని చూపించి.. కాసేపటికే అసలు కథను ప్రారంభిస్తాడు. మురళీధరన్(మధుర్ మిట్టల్) బాల్యం ఎలా గడిచింది? తమిళులు, సింహాళీయులఘర్షణల మధ్య మురళీధరన్ ప్రయాణం కొనసాగిందనేది చూపించారు. ఇంగ్లాండ్ టూర్లో ఆయనకు జట్టు తరపున ఆడే అవకాశం రాకపోవడం.. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో అనూహ్యంగా జట్టులో చోటు లభించడం.. ఇక శ్రీలంక జట్టులో చోటు సంపాదించుకున్న తర్వాత సొంత టీం నుంచే ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి అనేది ఫస్టాఫ్‌లో చూపించారు. వ్యక్తిగత జీవితంలో మురళీ ఎదుర్కొన్న సమస్యలను, ఎదుగుతున్న క్రమంలో ఆయన తొక్కేయడానికి చేసిన ప్రయత్నాలను సెకండాఫ్‌లో చూపించారు. ఆస్ట్రైలియాలో చకింగ్ ఆరోపణల సమయంలో కెప్టెన్ అర్జున రణతుంగ వ్యవహరించిన తీరు హృదయాలను హత్తుకుంటుంది. 1998లో ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో 16 వీకెట్లు తీసి శ్రీలంకను గెలిపించిన తీరుని అద్భుతంగా చూపించారు. ఆ తర్వాత మురళీ బౌలింగ్‌పై మళ్లీ అనుమానాలు వ్యక్తం చేయడం.. ఆ సమయంలో కెప్టెన్ అర్జున రణతుంగ అండగా నిలిచిన తీరు.. ఇవన్నీ బయోపిక్‌లో చక్కగా చూపించారు. ఎలాంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా నిజంగా మురళీధరన్ జీవితంలో ఏం జరిగిందో ఆ విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. సినిమాలో హై ఇచ్చే మూమెంట్స్ లేకపోవడం.. స్లో నెరేషన్ ఈ సినిమాకు మైనస్. క్రికెట్ లవర్స్‌కు, మురళీధరన్ ఫ్యాన్స్‌కి ‘800’ అయితే కచ్చితంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ముత్తయ్య మురళీధరన్‌గా మధుర్ మిట్టల్ జీవించేశాడు. తెరపై మధుర్గా కాకుండా నిజమైన మురళీ ధరన్ని చూసినట్లుగానే అనిపిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించాడు. అప్పటి శ్రీలంక్ కెప్టెన్ అర్జున రణతుంగ పాత్రను పోషించిన నటుడు కూడా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. నిజం చెప్పాలంటే.. ఈ సినిమాలో అర్జున రణతుంగ పాత్ర సెకండ్ హీరో అని చెప్పొచ్చు. మురళీ భార్యగా మహిమ నంబియార్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. సీనియర్ జర్నలిస్ట్‌గా నాజర్ తనదైన నటనతో మెప్పించాడు. ఈ సినిమా కథంతా అతని పాత్ర నెరేట్ చేస్తుంది. మురళీ తల్లిదండ్రులు, నానమ్మ పాత్రలు పోషించిన వారితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకెతిక విషయాలకొస్తే.. జీబ్రాన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ . -
సచిన్, కోహ్లి,ధోని కాదు.. ఆల్‌టైమ్ గ్రేటస్ట్ బ్యాటర్ అతడే
వరల్డ్‌క్రికెట్‌లో ఆల్‌టైమ్ గ్రేటస్ట్ బ్యాటర్ అంటే చాలా మంది భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరునే చెబుతారు. లేదంటే ఏ సర్ వివియన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, ధోని వంటి వారి పేర్లను చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుత తరంలో అయితే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, బాబర్ ఆజం, రోహిత్ శర్మలో ఎవరో ఒకరని అత్యుత్తమ బ్యాటర్‌గా ఎంచుకుంటారు. కానీ శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ దృష్టిలో వీరవరూ గ్రేటెస్ట్ ఆటగాళ్లు కాదంట. వరల్డ్ క్రికెట్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్న మురళీధరన్ తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా మురళీధరన్‌కు మీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. అక్కడ ఉన్నవారంతా సచిన్ లేదా కోహ్లి పేరును చెబుతారని భావించారు. కానీ ముత్తయ్య మాత్రం అందరి ఊహలను తలకిందులు చేస్తూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరును ముత్తయ్య చెప్పాడు. కాగా భారత క్రికెట్లో సెహ్వాగ్‌కు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 14 ఏళ్ల పాటు టీమిండియాకు సెహ్వాగ్ ప్రాతినిథ్యం వహించాడు. వీరేంద్రడు తన అంతర్జాతీయ కెరీర్లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 ఆడాలు ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యునిగా సెహ్వాగ్ ఉన్నాడు. చదవండి: ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ ఎవరిదో తెలుసా? Recalling those names etched in GOLD! 😍 Our StarCast @IrfanPathan, @wasimakramlive, @M_Raj03, @PiyushChawla255 & more name their greatest of all time ODI cricketers! Name yours 👇 pic.twitter.com/gP8UCAnNgu — Star Sports (@StarSportsIndia) October 3, 2023 -
800 చూసి ఆశ్చర్యపోతారు
‘‘ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా ‘800’ రూపొందింది. బయోపిక్ కాబట్టి కథలో మార్చడానికి ఏం ఉంటుంది? ఆయన జీవితంలో కమర్షియల్ హంగులన్నీ ఉన్నాయి. ఒక మనిషి జీవితం ఇలా ఉంటుందా? అన్ని అవరోధాలు ఎదుర్కొని ముత్తయ్య ఈ స్థాయికి చేరుకున్నారా? అని ప్రేక్షకులు ఆశ్చర్య΄ోతారు’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్, ఆయన భార్య మది మలర్ ΄ాత్రలో మహిమా నంబియార్ నటించగా ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శ్రీపతిని మా నిర్మాణ సంస్థలోనే దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నాం. అయితే ‘800’కి చాన్స్ వచ్చిందని చెబితే ఆ సినిమా చేసి రమ్మని నేనే చె΄్పాను. ఈ చిత్రాన్ని ఇండియాలో సుమారు 1100 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. శ్రీపతితో ఓ సినిమా, ‘యశోద’ చిత్రదర్శకులతో మరో సినిమా చేస్తాను. దర్శకుడు పవన్ సాధినేనితో ఓ చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
Muttiah Muralitharan: నా జీవితమే సినిమాలా ఉంటుంది
‘‘నా బయోపిక్‌గా ‘800’ అనుకున్నప్పుడు స్క్రిప్ట్ నాలుగైదుసార్లు చదివా. ఇందులో ఎటువంటి మసాలా ఉండకూడదనే విషయాన్ని దర్శక–నిర్మాతలకు ముందుగానే చెప్పాను. నిజమైన కథ లేకపోతే అది బయోపిక్ కాదు. నా జీవితమే సినిమాలా ఉంటుంది. నా జీవితంలో ఎత్తుపల్లాలు ఎలా అయితే ఉన్నాయో.. ‘800’ విడుదల వెనక అలాగే ఎత్తుపల్లాలు ఉన్నాయి’’ అని శ్రీలంక ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ అన్నారు. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ నిర్మించింది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ముత్తయ్య మురళీధరన్ విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► మీ బయోపిక్ గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది? నా జీవితాన్ని సినిమాగా తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. శ్రీలంక ప్రజలకు సహాయం చేయడం కోసం 20 ఏళ్ల క్రితం ఓ ఫౌండేషన్ స్థాపించి, ఎంతో మందికి సాయం అందించాం. శ్రీలంకలోని తమిళ ప్రజలకు సాయం చేయడానికి దర్శకుడు వెంకట్ ప్రభు 2008లో వచ్చారు. ఆయనతో పాటు ‘800’ చిత్రదర్శకుడు శ్రీపతి, ఇంకో ఇద్దరు ఉన్నారు. నా వైఫ్ మదిమలర్, వెంకట్ ప్రభు చిన్ననాటి స్నేహితులు కావడంతో మమ్మల్ని కలిశారు. నా ట్రోఫీలు, సాధించిన ఘనతలు చూసి నా బయోపిక్ తీద్దామంటే ముందు వద్దన్నాను.. ఆ తర్వాత సరే అన్నాను. అప్పుడు శ్రీపతిని కథ రాయమని వెంకట్ ప్రభు చెప్పారు. ► బయోపిక్ అంటే ఫిక్షన్ జోడిస్తారు కదా.. నో ఫిక్షన్. ఈ సినిమాలో క్రికెట్ 20 శాతమే ఉంటుంది. మిగతా 80 శాతం నా జీవితం ఉంటుంది. నా జర్నీ, నేను ఇన్ని ఘనతలు సాధించిన క్రమంలో నా కుటుంబం, దేశం ఎదుర్కొన్న పరిస్థితులు ‘800’లో చూపించాం. నా బాల్యం, సెలెక్టర్లు నన్ను ఎందుకు ఎంపిక చేశారు వంటివి ఎవరికీ తెలియవు. ఆ విషయాలు సినిమాలో ఉంటాయి. ► ‘800’ సినిమా రషెస్ చూశారా? మీ పాత్రకు మధుర్ మిట్టల్ ఎంత వరకు న్యాయం చేశారు? రషెస్ కంటే మూవీ చూడాలనుకున్నాను. అందుకే చూడలేదు. నేను పెద్ద సినిమా అభిమానిని. ఇండియన్ సినిమాలను మిస్ కాను. మధుర్ మిట్టల్‌ని రెండుసార్లు కలిశా. ‘800’ టీజర్, ట్రైలర్ చూశాను. నాలాగా, లుక్స్ పరంగా 70 శాతం మ్యాచ్ అయ్యాడు. ► ‘800’ షూటింగ్‌కి వెళ్లలేదా? ఒక్కసారి మాత్రమే వెళ్లాను. సినిమా నిర్మాణం గురించి నాకేమీ తెలియదు. అది కష్టమైన కళ. కొన్నిసార్లు నిర్మాతలను చూస్తే బాధగా ఉంటుంది. నటీనటులతో పాటు అందరికీ డబ్బులు ఇస్తారు. ఒకవేళ సినిమా ఆడకపోతే నిర్మాతల డబ్బులే పోతాయి కదా. ► సినిమా హిట్ కావచ్చు, ఫ్లాప్ అవ్వొచ్చు. అందుకే చాలామంది క్రికెటర్లు తమ బయోపిక్ తీయాలని కోరుకోరు.. సినిమా విజయంలో చాలా అంశాలు ఉంటాయి. సినిమా ఫ్లాప్ అయితే నా లెగసీ ఏమీ పడిపోదు. నా లెగసీ క్రికెట్. నిజంగా జరిగిన కథను ప్రజలకు చెప్పాలని మేం చేసిన ప్రయత్నం ‘800’. అది కొందరికి నచ్చవచ్చు.. మరికొందరికి నచ్చకపోవచ్చు. ఇదొక మంచి సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ► శ్రీలంకలోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారా? ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. శ్రీలంకన్ సింహళ భాషలోనూ రిలీజ్ చేస్తున్నాం. ► తెలుగు సినిమాలు చూస్తారా? శ్రీలంకలో తమిళ, హిందీ చిత్రాలు రిలీజవుతాయి. ఆ భాషల్లో డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తా. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప’ సినిమాలను హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయడంతో చూశా. శ్రీలంకలో బాలీవుడ్ మూవీస్ ఫేమస్. ఇప్పుడు తెలుగు సినిమా టాప్ పొజిషన్‌కు చేరుకుంది. ► మీకు ఇష్టమైన తెలుగు నటుడు ఎవరు? ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో సూపర్ హీరోస్, స్టార్ హీరోస్ ఎక్కువ మంది ఉన్నారు. నేను నాని సినిమాలు ఎక్కువ చూశా. ‘ఈగ’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలు బాగున్నాయి. ► మీ బయోపిక్ విడుదలవుతోంది. టెన్షన్ ఏమైనా? ఎందుకు టెన్షన్ పడాలి? నేను వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతుంటే టెన్షన్ పడాలి (నవ్వుతూ). ► త్వరలో వరల్డ్ కప్ మొదలవుతోంది. మీ ఫేవరేట్ టీమ్? శ్రీలంక మాత్రమే నా ఫేవరెట్. అయితే ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పలేం. -
యువతకు మురళీధరన్ స్ఫూర్తి
‘‘మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. కానీ, అంతకంటే గొప్ప మనసున్న వ్యక్తి, నిగర్వి. ఈ తరం యువతకు రోల్ మోడల్, స్ఫూర్తి. అతనిలాంటి స్నేహితుడు ఉండటం అదృష్టం. తనకు క్రికెట్టే జీవితం’’ అని క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూ΄÷ందిన చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్, ఆయన భార్య మది మలర్‌గా మహిమా నంబి యార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘800’ ప్రీ రిలీజ్ వేడుకకి వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ– ‘‘క్రికెట్ అంటే రికార్డులు కాదు... స్నేహితుల్ని చేసుకోవడం. లక్ష్మణ్ నాకు క్లోజ్ ఫ్రెండ్. ఇండియన్ సెలబ్రిటీలతో క్రికెట్ టీమ్ ఏర్పాటు చేయాల్సి వస్తే హీరో వెంకటేశ్‌ని కెప్టెన్ చేయాలి.. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం’’ అన్నారు. ‘‘కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘ఈ సినిమాలో మురళీధరన్ క్రికెట్ గురించి మాత్రమే కాదు. ప్రజలకు తెలియని ఆయన జీవితం ఎంతో ఉంది’’ అన్నారు మధుర్ మిట్టల్. -
800 మూవీ విజయ్ సేతుపతి చేయాల్సింది, కుటుంబాన్ని బెదిరించడంతో..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీలో మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. నాకు బ్రదర్ కంటే ఎక్కువ: లక్ష్మణ్ సోమవారం నాడు హైదరాబాద్‌లో '800' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీవీఎస్ లక్ష్మణ్ చేతుల మీదుగా బిగ్ టికెట్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ''మైదానంలో మురళీధరన్ సాధించినది మాత్రమే కాదు, అతని జీవితం అంతా ఇన్స్పిరేషన్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి మురళీధరన్ మెంటార్ కూడా! అతనితో పాటు క్రికెట్ ఆడాను. అతనికి అపోజిట్ టీంలో ఆడాను. మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. అంత కంటే గొప్ప మనసు ఉన్న వ్యక్తి, నిగర్వి. ఈతరం యువతకు రోల్ మోడల్. నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అతనిలాంటి ఫ్రెండ్ ఉండటం లక్కీ. మురళీధరన్ కి క్రికెట్టే జీవితం'' అని అన్నారు. లక్ష్మణ్‌తో అలాంటి అనుబంధం: ముత్తయ్య ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ ''1998లో ఫస్ట్ టైమ్ లక్ష్మణ్‌ను చూశా. ఒరిస్సాలోని కటక్‌లో మ్యాచ్ ఆడాం. నా కంటే వయసులో లక్ష్మణ్ చిన్న. అప్పుడు టీనేజర్ అనుకుంట! అప్పుడే తన ఆటతో లక్ష్మణ్ అందరికి షాక్ ఇచ్చాడు. ఈ అబ్బాయి ఇండియన్ టీంలో ఎందుకు లేడని అనుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు కలిశాం. స్పిన్ ఆడటంలో లక్ష్మణ్ మేటి. మేం మైదానంలో వేర్వేరు దేశాలకు ఆడినప్పటికీ... మైదానం బయట సచిన్, అనిల్ కుంబ్లే, గంగూలీ అంతా స్నేహితులుగా ఉన్నాం. క్రికెట్ అంటే రికార్డులు కాదు... స్నేహితుల్ని చేసుకోవడం! వెంకటేశ్‌ను కెప్టెన్ చేయాలి హైదరాబాద్ నాకు స్పెషల్... నేను ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి పని చేయమని అడిగారు. ఒకసారి టీం అంతా హైదరాబాద్ నుంచి వేరే సిటీకి వెళుతున్నాం. సరదాగా బిర్యానీ అడిగా. అరగంటలో విమానంలో చాలా బిర్యానీలు ఉన్నాయి. లక్ష్మణ్ అంటే అది'' అని చెప్పారు. ఇండియన్ సెలబ్రిటీలతో క్రికెట్ టీం ఏర్పాటు చేయాల్సి వస్తే... ఎవరెవరిని ఎంపిక చేస్తారని అడగ్గా ''వెంకటేష్ ను కెప్టెన్ చేయాలి. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మిస్ కారు'' అని మురళీధరన్ చెప్పారు. నానితో ఒకసారి మాట్లాడానని ఆయన తెలిపారు. విజయ్ సేతుపతిని బెదిరించారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముత్తయ్య మురళీధరన్ కీలక విషయాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'విజయ్ సేతుపతితో '800' తీయాలని అనుకున్నాం. ఆయన కూడా అందుకు ఒప్పుకున్నారు. కానీ ఇది ఇష్టం లేని కొందరు నాయకులు ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. తన కుటుంబాన్ని బెదిరించారు. దీంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: రెండుసార్లు బ్రేకప్, డిప్రెషన్లో.. కాంట్రాక్టు మీద సంతకం పెట్టాక రాత్రికి రమ్మనేవాళ్లు! -
అక్టోబరులో 800
శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించగా, ఆయన భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ కనిపిస్తారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో వివేక్ రంగాచారి ఈ బయోపిక్‌ను నిర్మించారు. ఈ సినిమా దేశవ్యాప్త థియేట్రికల్ రిలీజ్ హక్కులను నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు.ఈ సినిమాను అక్టోబరు 6న విడుదల చేస్తున్నట్లుగా గురువారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ‘800’ సినిమాను వచ్చే నెల 6న విడుదల చేస్తున్నాం. ముత్తయ్య మురళీధరన్ జీవితంలోని క్రికెట్ అంశాలను గురించి మాత్రమే కాదు.. ఆయన బాల్యంలో జరిగిన ఘటనలను కూడా ఈ చిత్రంలో చూపిస్తాం. కేవలం క్రికెట్ ప్రేమికులనే కాదు.. ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పట్ల శ్రీపతి అంకితభావం, పట్టుదల చూసి ఈ సినిమాకు ఓకే చెప్పాను. ప్రజలంతా ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు ముత్తయ్య మురళీధరన్. ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్. -
స్టార్ క్రికెటర్ బయోపిక్.. ఐదేళ్ల క్రితమే మొదలైంది కానీ
శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా '800'. ఇందులో మురళీధరన్ పాత్రలో ఆస్కార్ గెలుచుకున్న 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ మాదూర్ మిట్టల్ నటించాడు. మహిమా నంబియార్ హీరోయిన్. నాజర్, వేల రామమూర్తి, నరేన్, రమ్యకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎం.ఎస్ శ్రీపతి కథ రాసి, దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: భోళా శంకర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే) ఇకపోతే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో '800' మూవీని ట్రైన్ మోషన్ పిక్చర్స్ నిర్మించింది. జిబ్రాన్ సంగీతమందించారు. శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టగా, ముత్తయ్య మురళీధరన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన మాట్లాడుతూ తన బయోపిక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. '2018లో దర్శకుడు వెంకట్ ప్రభు, శ్రీపతి శ్రీలంకకు వచ్చి నన్ను కలిశారు. నా బయోపిక్ తీయాలనే ఆలోచన ఉందని అప్పుడే చెప్పారు. కానీ నాకు ఇష్టం లేదు. అయితే వారు ఇచ్చే డబ్బు నా స్వచ్ఛంద సంస్థకు ఉపయోగపడుతాయని నా మేనేజరు చెప్పాడు. దీంతో అంగీకరించాను. ఈ చిత్రం నా క్రికెట్ కెరీర్ గురించే కాదు. దాని వెనుక నా లైఫ్‌లో.. అట్టడుగు స్థాయి నుంచి ఎన్నో కష్టాలను, ఆటంకాలను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం చూపించారు' అని మురళీధరన్ చెప్పారు. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: మంచు విష్ణు కొత్త సినిమాలో ప్రభాస్.. ఆ పాత్రలో) -
అయినా.. చహల్‌ను ఎందుకు సెలక్ట్ చేస్తారు? నా ఛాయిస్ అతడే: స్పిన్ దిగ్గజం
Muttiah Muralitharan's Blunt Take: కేవలం వైవిధ్యం కోసమని అదనపు స్పిన్నర్‌ను ఎంపిక చేయడం సరికాదని శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. వరల్డ్‌కప్-2023 జట్టులో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే సరిపోయేదంటూ బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టాడు. అయితే, అదే సమయంలో.. యజువేంద్ర చహల్‌ను పక్కన పెట్టి మంచి పని చేశారని సమర్థించాడు. కాగా సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లతో పాటు.. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కింది. అయితే, మరో మణికట్టు స్పిన్నర్ చహల్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపికపై స్పందించిన మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బయోపిక్ ‘800’ ప్రమోషన్లలో భాగంగా.. జడేజా ఉన్నాడు కదా ‘‘ఒకవేళ జడేజా, కుల్దీప్లను తీసుకుని ఉంటే సరిపోయేది. వైవిధ్యం పేరిట ముగ్గురు స్పిన్నర్లను ఎంపిక చేయడం మాత్రం సరికాదు. జడ్డూ ఎలాగో ఆల్‌రౌండర్ కాబట్టి కుల్దీప్ను స్పెషలిస్టు బౌలర్‌గా వాడుకునేవాళ్లు. ఇక రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్‌ల ప్రస్తుత ఫామ్ ఎలా ఉందో నాకు తెలియదు. అయినా, టీ20 ఫార్మాట్లో ప్రదర్శన ఆధారంగా వన్డేలకు సెలక్ట్ చేయలేరు కదా! 50 ఓవర్ల ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. ఒకవేళ చహల్ కంటే కుల్దీప్ ప్రదర్శన మెరుగ్గా ఉంటే అతడిని ఎంపిక చేయడంలో తప్పులేదు. ఒక్కోసారి అనుభవం కంటే ఫామ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. చహల్‌ను ఎలా ఎంపిక చేస్తారు? వన్డేల్లో అతడి ప్రదర్శన చెప్పుకోదగ్గదిగా లేనపుడు అతడిని ఎవరైనా ఎలా సెలక్ట్ చేయగలరు? కాబట్టే అతడిని విస్మరించి ఉంటారు. ఇంతకీ చహల్ దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నాడా? తిరిగి ఫామ్ పొందాలంటే అంతకంటే ఉత్తమమైన మార్గం మరొకటి ఉండదు కదా!’’ అని టెస్టుల్లో 800 వికెట్లు పడగొట్టిన ముత్తయ్య మురళీధరన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అశ్విన్ ఉంటే ఒకవేళ తనకు ముగ్గురు స్పిన్నర్లను ఎంచుకునే అవకాశం ఉంటే మాత్రం.. జడేజా, అశ్విన్, కుల్దీప్లవైపే మొగ్గు చూపుతానని మురళీధరన్ ఈ సందర్భంగా తెలిపాడు. అయితే, దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో కాకుండా.. ఐపీఎల్లో బాగా ఆడినంత మాత్రాన ఎవరికీ అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశాడు. చదవండి: వరల్డ్‌కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌గా అతడే? -
మురళీధరన్ అదే చేశాడు! – సచిన్ టెండూల్కర్
‘‘1993లో మురళీధరన్‌ని కలిశాను. అప్పట్నుంచి మా స్నేహం అలాగే ఉంది. ఎంతో సాధించినా సాధారణంగా ఉంటాడు. అతను ఏదైనా అడిగితే కుదరదని చెప్పడం కష్టం.. అందుకే పిలవగానే ఈ వేడుకకి వచ్చాను’’ అన్నారు భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ‘800’ ట్రైలర్‌ని సచిన్ టెండూల్కర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆటలో గెలు పోటములు ఉంటాయి. మళ్లీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు.. అతని జీవితం గురించి ప్రజలు తెలుసుకోవాలి’’ అన్నారు. ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ– ‘‘నేను సచిన్ ఫ్యాన్‌ని. మరో వందేళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు’’ అన్నారు. ‘‘ఈ సినిమాను విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘800’ మానవత్వంతో కూడిన కథ’’ అన్నారు ఎంఎస్ శ్రీపతి. ‘‘మురళీధరన్గారి పాత్ర చేయడం ఓ పెద్ద బాధ్యత’’ అన్నారు మధుర్ మిట్టల్. -
మరో వందేళ్లయినా సచిన్ లాంటి క్రికెటర్ పుట్టడు: మురళీధరన్
టెస్టు క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తీసిన సినిమా '800'. మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకుడు. బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. శివలెంక కృష్ణప్రసాద్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ముంబైలో మంగళవారం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా '800' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో భాగంగా మురళీధరన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!) 'నా కోసం ఇక్కడికి వచ్చిన, మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న సచిన్‌కి థాంక్స్. నేను కూడా సచిన్ ఫ్యాన్. క్రికెట్లో ఆయన సాధించినది ఎవరూ సాధించలేరు. మరో 100 ఏళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు. ఆయన ఎప్పటికీ బెస్ట్. మరో సచిన్ టెండూల్కర్ పుట్టరు. నా బౌలింగ్‌లో రన్స్ చేయడంలో లారా సక్సెస్ అయ్యాడు. కానీ నా బౌలింగ్ శైలిని పట్టుకోలేకపోయాడు. రాహుల్ ద్రావిడ్ కూడా! సచిన్ మాత్రం నా ఆటను పూర్తిగా చదివేశాడు'' అని మురళీధరన్ చెప్పాడు. ఇక సచిన్ మాట్లాడుతూ ''మై వెరీ డియర్ ఫ్రెండ్ మురళీధరన్‌కి ఆల్ ది బెస్ట్. అతని జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. ఎంతో సాధించినా చాలా సింపుల్‌గా ఉంటాడు. అతనికి నో చెప్పడం కష్టం. అతని కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఆటలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మన ఆట పట్ల డిజప్పాయింట్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు' అని అన్నాడు. (ఇదీ చదవండి: తొలిప్రేమ- బ్రేకప్ గురించి చెబుతూ బాధపడిన జాన్వీ) -
గుండెల్ని పిండేస్తున్న ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ ట్రైలర్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్లల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ముత్తయ్య మురళీధరన్ చిన్నప్పట్నుంచి క్రికెటర్‌గా ఎదిగిన జర్నీని, ముఖ్యంగా ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూపించారు. తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస రావడం..అక్కడ పౌరసత్వానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొవడం.. అవన్నీ దాటుకొని క్రికెటర్‌గా ఎదిగితే.. అక్కడ కూడా అవమానాలు.. జావి వివక్షతకు గురికావడం..చేయి స్టైయిట్‌గా ఊపడం లేదంటూ అంతర్జాతీయ క్రికెట్లో అడ్డంకులు ఎదురు కావడం..ఇవన్నీ ట్రైలర్లో చూపించారు. ఆద్యంతం ఎమోషనల్ జర్నీగా `800`ట్రైలర్‌ని చూడండి -
వన్డే వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనలిస్టులు ఆ జట్లే.. ఆ రెండు మాత్రం పక్కా: సెహ్వాగ్
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 రూపంలో క్రికెట్ ప్రేమికులకు మరో పండుగ రాబోతోంది. భారత్ వేదికగా అక్టోబరు 5న ఈ మెగా ఈవెంట్ మొదలుకానుంది. ఈ క్రమంలో వంద రోజుల ముందుగానే(మంగళవారం) అంతర్జాతీయ క్రికెట్ మండలి షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో క్రికెట్ అభిమానులు ఎప్పుడెపుడు ఈ ఈవెంట్ మొదలవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక మరికొంత మంది సెమీస్ చేరే జట్లు, విజేతగా నిలిచే జట్టుపై అంచనా వేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. టాప్-4లో ఉండే జట్లు ఇవే కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. క్రికెట్ దిగ్గజాలు, మాజీ ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం వన్డే ప్రపంచకప్-2023లో టాప్-4లో నిలవలగల సత్తా ఉన్న జట్లను ఎంచుకున్నాడు. ఐసీసీ ఈవెంట్ సందర్భంగా వీరూ మాట్లాడుతూ.. ‘‘నేను నాలుగు జట్లను ఎంచుకోవాలంటే.. నా మదిలో మెదిలే పేర్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, పాకిస్తాన్. ఈసారి సెమీ ఫైనలిస్టులు ఈ జట్లే. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అయితే కచ్చితంగా టాప్-4లో ఉంటాయి. ఆ రెండు టీమ్‌లు పక్కా ఎందుకంటే వాళ్లు సంప్రదాయ షాట్లు ఆడరు.. రొటీన్‌కి భిన్నంగా ఉంటారు. అద్భుతమైన ఆట తీరుకు ఈ జట్లు పెట్టింది పేరు. అంతేకాదు మిగతా జట్లతో పోలిస్తే ఉపఖండంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మెరుగ్గా రాణించగలవు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ.. ఈ టోర్నీలో టీమిండియా- ఇంగ్లండ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. సొంతగడ్డపై ఆడనుండటం భారత్‌కు కలిసి వచ్చే అంశమే అయినా.. ఇంగ్లండ్ కూడా గట్టిపోటీనిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. ఇక భారత్‌లో జరుగునున్న ఈ మెగా టోర్నీకి ఆతిథ్య టీమిండియా సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల కోసం వెస్టిండీస్, శ్రీలంక వంటి ఒకప్పటి మేటి జట్లతో పాటు పసికూనలు క్వాలిఫైయర్స్‌లో పోటీపడుతున్నాయి. చదవండి: CWC Qualifiers 2023: హ్యాట్రిక్ సెంచరీ.. జట్టును వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా! -
స్పిన్ మాంత్రికుడి బయోపిక్.. ఆసక్తిగా ఫస్ట్ లుక్!
క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు సాధించిన ప్రముఖ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘800’. సోమవారం (ఏప్రిల్ 17) ముత్తయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఎంఎస్ శ్రీపతి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’లో చేసిన సలీమ్ మాలిక్ పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మధుర్ మిట్టల్ ఈ బయోపిక్‌లో ముత్తయ్య పాత్రను పోషిస్తున్నారు. ముత్తయ్య భార్య మదిమలర్ పాత్రను మహిమా నంబియార్ చేస్తున్నారు. శ్రీపతి మాట్లాడుతూ – ‘‘కెరీర్లో 800 టెస్ట్ వికెట్స్ తీసిన ఏకైక ఆఫ్ స్పిన్నర్ బౌలర్‌గా మురళీధరన్ అరుదైన రికార్డు సాధించారు. అందుకే ఈ చిత్రానికి ‘800’నే టైటిల్‌గా పెట్టాం. మురళికి తమిళనాడులో మూలాలు ఉన్నాయి. అతని తాతలు భారతీయులు. బ్రిటిష్ వారు అక్కడి టీ తోటలలో పని చేయడానికి వారిని శ్రీలంకకు తీసుకెళ్లారు. ఇలా ముత్తయ్య మురళీధరన్‌లోని పలు కోణాలను చూపించే చిత్రం ఇది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. వివేక్ రంగాచారి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
నాకంటే అతడే బెటర్.. చాలా నేర్చుకున్నా: ముత్తయ్య మురళీధరన్
1990లలో ప్రత్యర్ధి బ్యాటర్లను తమ స్పిన్ మయాజాలంతో ఈ ఇద్దరు స్పిన్నర్లు ముప్పుతిప్పలు పెట్టేవారు. వారిలో ఒకరు ఆస్ట్రేలియా దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్.. మరొకరు శ్రీలంక లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. తాజాగా గ్రేట్ షేన్ వార్న్‌ను గుర్తుచేసుకుని ముత్తయ్య మురళీధరన్ భావోద్వేగానికి లోనయ్యాడు. వార్న్‌ను చాలా మిస్స్ అవుతున్నాము అని అతడు తెలిపాడు. నేను క్రికెట్ ఆడే రోజుల్లో వార్న్ స్పిన్ మ్యాజిక్‌ను దగ్గరి నుంచి చూసే వాడిని అని ముత్తయ్య అన్నాడు . "వార్న్ నాకంటే చాలా గొప్పవాడు అని నేను ఎప్పుడూ భావిస్తున్నాను. నేను శ్రీలంక తరపున ఆడుతున్నప్పుడు అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అతడు అల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్. మేము అందరం షేన్ను మిస్ అవుతున్నాం" అని మురళీధరన్ పేర్కొన్నాడు కాగా భారత్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో మురళీధరన్ ఆడనున్నాడు. ఈ టోర్నీలో మణిపాల్ టైగర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి: Ind A vs NZ A: న్యూజిలాండ్‌తో సిరీస్.. కెప్టెన్‌గా సంజూ శాంసన్.. బీసీసీఐ ప్రకటన -
Ind Vs Hk: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. టీమిండియా తొలి బౌలర్‌గా..
Asia Cup 2022 India Vs Hong Kong- Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆసియా కప్ టోర్నీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఆసియా కప్-2022లో భాగంగా.. హాంగ్ కాంగ్‌తో బుధవారం(ఆగష్టు 31) జరిగిన మ్యాచ్‌లో బాబర్ హయత్ వికెట్ తీయడం ద్వారా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పేరిట ఉన్న రికార్డును జడ్డూ బద్దలు కొట్టాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జడేజా ఇప్పటి వరకు మొత్తంగా 23 వికెట్లు పడగొట్టాడు. 2010 నుంచి ఆసియా కప్ టోర్నీలో ఆడుతున్న ఈ ఆల్‌రౌండర్ తాజాగా సాధించిన ఘనతతో దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్, లసిత్ మలింగ, అజంతా మెండిస్, సయీద్ అజ్మల్ తర్వాతి స్థానంలో నిలిచాడు. కాగా హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో జడేజా 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అంతకుముందు పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో 2 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చాడు. ఆసియా కప్ టోర్నీలో 2010 నుంచి 2022లో హాంగ్ కాంగ్‌తో మ్యాచ్ వరకు రవీంద్ర జడేజా తీసిన వికెట్లు: ►2010- నాలుగు వికెట్లు ►2012- ఒక వికెట్ ►2014- ఏడు వికెట్లు ►2016- మూడు వికెట్లు ►2018- ఏడు వికెట్లు ►2022 హాంగ్ కాంగ్‌తో మ్యాచ్ నాటికి- ఒకటి ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 ఆటగాళ్లు(ఇప్పటి వరకు) 1. మురళీధరన్(శ్రీలంక)- 30 2. లసిత్ మలింగ(శ్రీలంక)- 29 3. అజంతా మెండిస్(శ్రీలంక)- 26 4. సయీద్ అజ్మల్(పాకిస్తాన్)- 25 5. రవీంద్ర జడేజా(ఇండియా)- 23 చదవండి: Ind Vs HK: కోహ్లికి హాంగ్ కాంగ్ జట్టు స్పెషల్ గిఫ్ట్.. థాంక్యూ విరాట్ అంటూ! ఫిదా అయిన ‘కింగ్’! Asia Cup 2022: నాడు కోహ్లి వర్సెస్ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్ ఫిదా! తలవంచి మరీ! వైరల్ IND VS HK: అక్కడ ఉన్నది జడేజా.. కొంచెం చూసి వెళ్లాలి కదా! వీడియో వైరల్ -
'మురళీధరన్, నరైన్ కాదు.. ప్రపంచ క్రికెట్లో నేనే బెస్ట్ స్పిన్నర్'
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఫీల్డ్‌లో గానీ ఆఫ్‌ధి ఫీల్డ్‌లో గానీ ఎంతో ఉత్సహంగా ఉంటాడో ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరో సారి గేల్ తన ఫన్నీ కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం యూనివర్స్ బాస్ కరీబియన్ దీవులలో జరగబోయే సరికొత్త టోర్నీ 'సిక్స్టీ' లీగ్‌కు సిద్దమవుతున్నాడు. ఈ టోర్నీ టీ10 ఫార్మాట్లో జరగనుంది. ఈ లీగ్ బుధవారం(ఆగస్టు 24) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూనివర్స్ బాస్ సరదా వాఖ్యలు చేశాడు. మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పేట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నా అని ఈ సందర్భంగా గేల్ తెలిపాడు. ఈ టోర్నీలో బ్యాట్‌తో పాటు బాల్‌తో కూడా రాణించాలని అనుకుంటున్నట్లు గేల్ వెల్లడించాడు. అదే విధంగా ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకు తనే అత్యత్తుమ స్పిన్నర్ అని గేల్ ఫన్నీ కామెంట్లు చేశాడు. "నా బౌలింగ్ సహజమైనది. నేను కచ్చితంగా ఈ టోర్నీలో బౌలింగ్ చేస్తాను. మీకు తెలుసా..? ప్రపంచ క్రికెట్లో నేనే ఇప్పటి వరకు గ్రేట్ స్పిన్నర్‌ని. ముత్తయ్య మురళీధరన్ కూడా నాలా బౌలింగ్ చేయలేకపోయాడు. అతని కంటే నేను తక్కువ ఎకనామీతో బౌలింగ్ చేశాను. అదేవిధంగా సునీల్ నరైన్ కూడా నా దగ్గరకు రాలేడు" అని సరదాగా గేల్ వాఖ్యనించాడు. "మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పెట్టేందుకు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నాను. గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉండడంతో ఇది నా అరంగేట్ర మ్యాచ్‌గా భావిస్తున్నాను. ఈ టోర్నీతో మళ్లీ నా రిథమ్‌ను తిరిగి పొందుతాను. ఈ టోర్నీ నన్ను మరికొంత కాలం క్రికెట్ ఆడేలా సహాయపడుతుందని" యూనివర్స్ బాస్ పేర్కొన్నాడు. కాగా గేల్ చివరగా టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. -
టెస్టు క్రికెట్లో ఆండర్సన్ అరుదైన ఫీట్.. మూడో బౌలర్‌గా..!
ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టామ్ లాథమ్‌ను ఔట్ చేసిన అండర్సన్.. తన కెరీర్లో 650వ టెస్టు వికెట్‌ని సాధించాడు. తద్వారా టెస్టుల్లో 650 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా అండర్సన్ రికార్డులెక్కాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో స్పిన్ దిగ్గజాలు షేన్ వార్న్, మురళీధరన్ తొలి రెండు స్ధానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 539 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్(145), జో రూట్(176) పరుగులతో రాణించారు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మిచెల్(190),టామ్ బ్లండల్(106) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. 14 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కివీస్ 140 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఆడుతోంది. చదవండి: Dilip Vengsarkar: టీమిండియాకి ఆడాలంటే ఇది సరిపోదా.. ఇంకా ఏం చేయాలి? -
'మైండ్ దొబ్బిందా.. ఆ బౌలింగ్ ఏంటి?'.. మురళీధరన్ ఆగ్రహం
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ చెత్త బౌలింగ్‌పై ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఖరి ఓవర్లో విజయానికి 22 పరుగులు అవసరమైన దశలో మార్కో జాన్సెన్ బౌలింగ్‌కు వచ్చాడు. అయితే ఆఖరి రెండు బంతులను రషీద్ ఖాన్ భారీ సిక్సర్లు సంధించాడు. ఇది జీర్ణించుకోలేని కోచ్ మురళీధరన్.. ''కీలక దశలో ఫుల్ లెంగ్త్ బంతులను వేయడం ఏంటని.. మైండ్ దొబ్బిందా.. అసలేం బౌలింగ్ చేస్తున్నాడు'' అంటూ బూతుపురాణం అందుకున్నాడు. మార్కో జాన్సెన్పై కోపంతో మురళీధరన్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. వాస్తవానికి మార్కో జాన్సేన్ చివరి ఓవర్ బానే బౌలింగ్ చేశాడు. తన ప్లాన్ ప్రకారం.. ప్రతి బంతిలో వైవిధ్యత చూపించాడు. ఎగ్జిక్యూషన్ లోపం కొంత.. అలాగే రషీద్ ఖాన్ ఎటాకింగ్ కొంత అతని ప్లాన్‌ను పూర్తిగా చెడగొట్టాయి. తొలిబంతికి స్లో కట్టర్ వేశాడు.. కానీ దాన్ని తెవాతీయా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత కూడా జాన్సెన్ తన బౌలింగ్‌లో వైవిధ్యత చూపించాడు. వరుసగా వైడ్ యార్కర్, బౌన్సర్, స్ట్రెయిట్ యార్కర్, లో ఫుల్ టాస్ లాంటి వైవిధ్య భరిత బంతులు వేశాడు. అయితే రషీద్ ఖాన్ రూపంలో అతనికి పెద్ద సమస్య వచ్చి పడింది. గ్రహచారం బాగాలేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే లక్ష్య చేధన సమయంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మార్కో జాన్సెన్ చెత్త రికార్డును అందుకున్నాడు. చదవండి: Marco Jansen: ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ బౌలర్ చెత్త రికార్డు beauty of IPL pic.twitter.com/Nswvs2domu — best girl | IPL era (@awkdipti) April 27, 2022 Murali getting Angry during the 20 th over pic.twitter.com/jvcjVh4Kpp — Kaveen Wijerathna (@CricCrazyKaveen) April 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రషీద్ ఖాన్ రేంజ్లో మేము లేము.. ఎస్ఆర్హెచ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ను ఉద్దేశించి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీథరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2017 నుంచి 2021 ఐపీఎల్ సీజన్ వరకు ఎస్ఆర్హెచ్లో భాగమైన రషీద్ ఖాన్‌ను ఆటగాళ్ల రిటెన్షన్‌లో భాగంగా అట్టిపెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశామని, అయితే అతని రేంజ్లో (రెమ్యునరేషన్) మేము లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకోవాల్సి వచ్చిందని కీలక కామెంట్స్ చేశాడు. రషీద్ ఖాన్‌పై ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుందని సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో మురళీథరన్ పై విధంగా స్పందించాడు. రషీద్ ఎస్ఆర్హెచ్ కుటుంబంలో మాజీ సభ్యుడు.. అతనిపై ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి కానీ తమ అభిమానులకు కానీ ఎలాంటి పగ, ప్రతీకారాలు లేవు.. రిటెన్షన్‌లో రషీద్‌ను దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాము.. అయితే అతను అడిగినంత మేం ఇవ్వలేకపోయామంటూ మురళీథరన్ వివరణ ఇచ్చాడు. కాగా, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్)లో రూ.కోటి 70 లక్షలు మాత్రమే తీసుకునే రషీద్.. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు జరిగిన ఆటగాళ్ల రిటెన్షన్‌లో ఏకంగా రూ.15 కోట్లు డిమాండ్ చేశాడని వార్తలు వచ్చాయి. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో రషీద్ అధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన వార్త నిజమేనని స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్ వదులుకున్న రషీద్ ఖాన్‌ను ఐపీఎల్ న్యూ ఎంట్రీ గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్లు వెచ్చించి డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేయగా, ఎస్ఆర్హెచ్.. కేన్ విలియమ్సన్‌ను రూ.12 కోట్లకు, అన్క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లకు చెరి 4 కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకుంది. సనరైజర్స్ రషీద్ ఖాన్‌ను 2017లో రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీ తరఫున 76 మ్యాచ్‌లు ఆడిన అతను 6.35 ఎకానమీతో 93 వికెట్లు పడగొట్టి, ఫ్రాంచైజీ తరఫున రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా రికార్డుల్లో నిలిచాడు. చదవండి: IPL 2022: ఆర్సీబీ టైటిల్ నెగ్గే వరకు ఆ అమ్మడు పెళ్లి చేసుకోదట..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్
ఐపీఎల్ 2022 మెగా వేలంలో అనమాక ఆటగాళ్లను కొనుగోలు చేసి విమర్శలపాలవుతున్నసన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వ్యూహ రచన విషయంలో మాత్రం అందరికంటే ముందున్నట్లు కనిపిస్తోంది. జట్టు కూర్పు విషయంలో ఏ ఫ్రాంచైజీ కూడా ప్రకటన చేయకముందే ఎస్ఆర్హెచ్ తమ ఓపెనింగ్ జోడీ ఎవరనే విషయమై క్లారిటీ ఇచ్చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించాడు. ఐపీఎల్ 2022 సీజన్లో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు యువ ఆటగాడు అభిషేక్ శర్మ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపాడు. గతంలో మిడిలార్డర్లో ఆడిన లెఫ్ట్ హ్యాండ్ ఆల్‌రౌండర్ అయిన అభిషేక్ శర్మకు ఈసారి ఓపెనర్‌గా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మురళీధరన్ పేర్కొన్నాడు. మెగా వేలంలో ఈ యువ ఆల్‌రౌండర్ కోసం ఎస్ఆర్హెచ్ ఏకంగా 6.5 కోట్లు వెచ్చించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అభిషేక్ శర్మ కోసం ఆరెంజ్ ఆర్మీ.. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌లతో పోటీ పడి భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపీఎల్లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో 17.2 సగటుతో 241 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన మెగా వేలంలో సన్‌రైజర్స్ మొత్తం 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అంతకుముందు రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లను కలుపుకుంటే ఎస్ఆర్హెచ్ సభ్యుల సంఖ్య 23కు చేరింది. రిటైన్డ్ ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్(14 కోట్లు), కెప్టెన్ అబ్దుల్ సమద్(4 కోట్లు) ఉమ్రాన్ మాలిక్(4 కోట్లు) మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: నికోలస్ పూరన్(10.75 కోట్లు) వాషింగ్టన్ సుందర్(8.75 కోట్లు) రాహుల్ త్రిపాఠి(8.5 కోట్లు) రొమారియో షెపర్డ్(7.7 కోట్లు) అభిషేక్ శర్మ(6.5 కోట్లు) భువనేశ్వర్ కుమార్(4.2 కోట్లు) మార్కో జన్సెన్(4.2 కోట్లు) టి నటరాజన్(4 కోట్లు) కార్తీక్ త్యాగి(4 కోట్లు) ఎయిడెన్ మార్క్రమ్(2.6 కోట్లు) సీన్ అబాట్(2.4 కోట్లు) గ్లెన్ ఫిలిప్(1.5 కోట్లు) శ్రేయస్ గోపాల్(75 లక్షలు) విష్ణు వినోద్(50 లక్షలు) ఫజల్ హక్ ఫారుఖి(50 లక్షలు) జె సుచిత్(20 లక్షలు) ప్రియమ్ గార్గ్(20 లక్షలు) ఆర్ సమర్థ్(20 లక్షలు) శశాంక్ సింగ్(20 లక్షలు) సౌరభ్ దూబే(20 లక్షలు) చదవండి ఐపీఎల్ 2022: ఆరెంజ్ ఆర్మీ ఇదే.. ఈసారి దబిడి దిబిడే..! -
టెస్టుల్లో అశ్విన్ అరుదైన రికార్డు.. కుంబ్లేను దాటేశాడుగా..
Ashwin becomes 2nd fastest bowler to take 300 Test wickets at home: టెస్ట్ క్రికెట్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పలు రికార్డులను సృష్టించాడు. భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. 350 వికెట్లతో అనిల్ కుంబ్లే తొలి స్ధానంలో ఉండగా, 300 వికెట్లతో అశ్విన్ రెండో స్ధానంలో ఉన్నాడు. అదే విధంగా స్వదేశంలో వేగవంతంగా 300 వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించాడు. తొలి స్ధానంలో శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. కాగా 48 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను మురళీధరన్ సాధించగా, 49 మ్యాచ్‌ల్లో అశ్విన్ ఈ రికార్డును సాధించాడు. భారత్ తరుపున స్వదేశంలో వేగవంతంగా 300 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అంతకు ముందు భారత దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే 52 మ్యాచ్‌ల్లో 300 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో హెన్రీ నికోలస్ వికెట్ పడగొట్టి అశ్విన్ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో మొత్తంగా 14 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టేది అతడే.. -
టీ20 వరల్డ్ కప్: నా ఓటు అతడికే: ముత్తయ్య మురళీధరన్
కొలంబో: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికే కుల్దీప్ తన ప్రతిభను నిరూపించుకున్నాడని, అయినా దురుదృష్టవశాత్తూ కొన్నిసార్లు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రానున్న టీ20 వరల్డ్ కప్‌లో వరుణ్ చక్రవర్తితో పోలిస్తే, కుల్దీప్నకే టీమిండియా తరఫున ఆడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అతడికే తన ఓటు అని ముత్తయ్య మురళీధరన్ స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్-2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన కుల్దీప్‌నకు యాజమాన్యం అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. స్పిన్ విభాగంలో సునిల్ నరైన్, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తిని మాత్రమే ఎక్కువగా వినియోగించుకుంది. ఈ విషయంపై స్పందించిన కుల్దీప్.. ‘‘నేను మరీ అంతపనికిరాని వాడినా? చెత్తగా ఆడతానా?’’ అని మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక భారత జట్టు శ్రీలంక టూర్లో భాగంగా జట్టులో చోటుదక్కించుకున్న అతడు... వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు తీశాడు. రెండో మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన కుల్దీప్.. చివరి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అదే విధంగా.. మొదటి టీ20లో ఆడే అవకాశం రాకపోగా.. రెండో టీ20లో 2 వికెట్లతో రాణించాడు. మూడో మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అదే విధంగా.. శ్రీలంక పర్యటనలో భాగంగా అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి.. తొలి రెండు మ్యాచ్‌లలో ఒక్కో వికెట్ తీశాడు. మూడో మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయాడు. ఈ నేపథ్యంలో రానున్న టీ20 వరల్డ్ కప్ అంచనాల గురించి ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ... ‘‘యూఏఈలో జరుగనున్న ఐపీఎల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడక తప్పదు. ఎవరు ఫాంలో ఉంటారు.. ఎవరు ఫాం కొనసాగిస్తారన్న అంశాలు తేలతాయి. అయితే, స్పిన్నర్ల విషయంలో నేను మాత్రం కుల్దీప్ యాదవ్ వైపే మొగ్గు చూపుతాను. ఎందుకంటే వికెట్లు తీయగల బౌలర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి విషయానికొస్తే... తను మంచి బౌలర్. టీమిండియా, ఐపీఎల్ జట్లకు తను బెటర్ ఆప్షన్. అయితే, అజంతా మెండిస్, సునీల్ నరైన్ అంతటి స్థాయి వరుణ్‌కు లేదనే అనుకుంటాను. తను బ్యాట్స్‌మెన్‌ను మెస్మరైజ్ చేయలేడు. ఇంకా మెరుగ్గా రాణించాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్లో భాగంగా ముత్తయ్య మురళీధరన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. -
11 ఏళ్ల క్రితం ఈ రోజు శ్రీలంక స్పిన్ దిగ్గజం ఏం చేశాడో గుర్తుందా..?
కొలంబో: సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఇదే రోజున శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు నేలకూల్చిన తొలి క్రికెటర్‌గా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. రోజుకో రికార్డు బద్దలవుతున్నా నేటి క్రికెట్లో 11 ఏళ్ల క్రితం మురళీ నెలకొల్పిన ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. బహుశా భవిష్యత్తులో ఏ క్రికెటర్ కూడా ఈ రికార్డు దరిదాపుల్లోకి చేరేలా కనిపించడం లేదు. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా గాలేలో 2010 జులై 22న భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో మురళీధరన్ 800 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన మురళీ.. ఈ మైలురాయిని చేరుకునేందుకు మరో వికెట్ అవసరమైంది. అయితే, అప్పటికే భారత్ రెండో ఇన్సింగ్స్‌లో 9 వికెట్లు చేజార్చుకుంది. దీంతో మురళీ 800 వికెట్లు మైలురాయిని చేరుకుంటాడా? లేదా? అన్న సస్పెన్స్ కొనసాగింది. ఎందుకంటే ఈ టెస్టు ప్రారంభానికి ముందే మురళీ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. తొలి టెస్టు తర్వాత తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించడంతో 800 వికెట్ దక్కుతుందా? లేదా? అన్న టెన్షన్ క్రీడాభిమానుల్లో మొదలైంది. అయితే, చివరికి ఆ సమయం రానే వచ్చింది. ప్రజ్ఞాన్ ఓఝాకు ఆఫ్ స్టంప్ ఆవల సంధించిన బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి జయవర్థనే చేతుల్లో పడడంతో స్టేడియం మార్మోగిపోయింది. బాణాసంచా మోతెక్కింది. ఆనందాన్ని పట్టలేని మురళీ మైదానంలో గెంతులేశాడు. సహచరులంతా ఈ సందర్భాన్ని మరపురాని రీతిలో సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా, మురళీధరన్ తన టెస్ట్ కెరీర్ మొత్తంలో 113 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 800 వికెట్లు పడగొట్డాడు. మురళీధరన్ ఆడిన చివరి టెస్ట్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. -
తండ్రికి తగ్గ తనయుడు.. అచ్చంగా దించేశాడు
కొలంబొ: ముత్తయ్య మురళీధరన్.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు( అన్ని ఫార్మాట్లు కలిపి 1374 ) తీసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేగాక టెస్టు క్రికెట్లో 800 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా, వన్డేల్లో 534 వికెట్లతో చరిత్రకెక్కిన ఈ లంక స్పిన్ దిగ్గజం మరో దిగ్గజం షేన్ వార్న్‌తో పోటీ పడి వికెట్లు తీశాడు. అయితే అతని బౌలింగ్ యాక్షన్‌పై ఫీల్డ్ అంపైర్లు చాలాసార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన మురళీధరన్ బౌలింగ్‌ను 'చక్కర్' అంటూ పిలవడం అప్పట్లో వైరల్‌గా మారింది. ఇలా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా తన వైవిధ్యమైన బౌలింగ్‌తో క్రికెట్లో తన పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. తాజాగా మురళీధరన్ కొడుకు నరేన్ బౌలింగ్ యాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అచ్చం తండ్రి బౌలింగ్ యాక్షన్‌ను దింపిన నరేన్ వీడియో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోనూ స్వయంగా మురళీధరన్ తన ట్విటర్లో షేర్ చేస్తూ..'' ఇట్స్ ఫాదర్ అండ్ సన్ టైమ్.. వీడియో క్రెడిట్స్ టూ సన్‌రైజర్స్ '' అంటూ కామెంట్ చేశాడు. ఇక మురళీధరన్ లంక తరపున 133 టెస్టుల్లో 800 వికెట్లు, 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. అటు టెస్టులతో పాటు వన్డేల్లోనూ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. Father and Son Time! Video credits @SunRisers pic.twitter.com/Jv8fYOAZcp — Muthiah Muralidaran (@Murali_800) July 15, 2021 -
బౌన్సర్లతో కొట్టి చంపకు అని బతిమిలాడేవాడు.. కానీ: అక్తర్
ఇస్లామాబాద్: తన కెరీర్లో అద్భుతమైన బంతులు సంధించి ఎంతో మంది బ్యాట్స్‌మెన్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’, పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్. పదునైన బౌన్సర్లు, యార్కర్లతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపించేవాడు. అంతటి ‘భీకరమైన’ బౌలర్‌ను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన ‘బ్యాట్స్‌మెన్’ ఎవరో తెలుసా? శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అట. ఈ విషయాన్ని అక్తర్ స్వయంగా వెల్లడించాడు. స్వతహాగా మేటి బౌలర్ అయిన ముత్తయ్య.. తన కెరీర్లో ఎక్కువగా పదకొండో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగేవాడు. అలాంటి లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ను ఎదుర్కోవడం అక్తర్‌కు అసలు లెక్కే కాదు. ఈ విషయాల గురించి అక్తర్ మాట్లాడుతూ... ‘‘నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యౌట్స్మెన్ ముత్తయ్య మురళీధరన్. ఇదేమీ జోక్ కాదు. నిజమే చెబుతున్నా. ‘నేనసలే బక్కపల్చని వాడిని. నీ బౌన్సర్లతో నన్ను కొట్టిచంపకు.. ప్లీజ్.. నువ్వు బంతి నెమ్మదిగా విసిరితే.. నేను వికెట్ సమర్పించుకుంటా’ అని బతిమిలాడేవాడు. సరేలే అని అలాగే చేస్తే భారీ షాట్ ఆడి.. ఏదో పొరపాటులో అలా జరిగిపోయింది అని చెప్పేవాడు’’ అని వ్యాఖ్యానించాడు. ఇక సమకాలీన క్రికెటర్లలో విరాట్ కోహ్లి, బాబర్ ఆజం, బెన్ స్టోక్స్ వికెట్ తీసే అవకాశం వస్తే బాగుంటుందని అక్తర్ చెప్పుకొచ్చాడు. ఇక పీఎస్ఎల్ లేదా ఐపీఎల్.. ఏ లీగ్‌లో ఆడటానికి ఇష్టపడతారనే ప్రశ్నకు బదులుగా.. ‘మాతృ దేశం మీద ప్రేమతో పాకిస్తాన్ లీగ్, డబ్బు కోసమైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్’ ఆడతానని తనదైన శైలిలో కామెంట్ చేశాడు. -
ముత్తయ్య మురళీధరన్ డిశ్చార్జి
చెన్నై, సాక్షి: శ్రీలంక క్రికెట్ దిగ్గజం, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. 49 ఏళ్ల మురళీధరన్‌కు ఆదివారం అపోలో ఆసుపత్రిలో డాక్టర్ జి.సెంగోత్తువేలు యాంజియాప్లాస్టీ నిర్వహించి స్టెంట్‌ను అమర్చారు. సోమవారం డిశ్చార్జి అయిన మురళీధరన్ సాధారణ జీవితాన్ని గడపవచ్చని ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడు రోజుల క్వారంటైన్ తర్వాత మురళీధరన్ మళ్లీ సన్‌రైజర్స్ జట్టుతో కలవనున్నాడు. శ్రీలంక క్రికెటర్ దిల్హారాపై ఎనిమిదేళ్ల నిషేధం అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు శ్రీలంక క్రికెటర్ దిల్హారా లోకుహెట్టిగేపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. 2017లో యూఏఈలో జరిగిన టి20 టోర్నీలో శ్రీలంకకు చెందిన ఓ జట్టు పాల్గొంది. ఈ టోర్నీ సందర్భంగా దిల్హారా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఐసీసీ విచారణలో తేలింది. 40 ఏళ్ల దిల్హారా 2016లో రిటైరయ్యాడు. శ్రీలంక తరఫున తొమ్మిది వన్డేల్లో, రెండు టి20 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. చదవండి: ముత్తయ్య మురళీధరన్‌కు యాంజియోప్లాస్టీ -
ముత్తయ్య మురళీధరన్‌కు ఛాతీ నొప్పి..
చెన్నై: శ్రీలంక క్రికెట్ దిగ్గజం, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్‌కు ఆదివారం యాంజియోప్లాస్టీ నిర్వహించారు. వైద్యులు అతనికి ఒక స్టెంట్‌ను అమర్చారు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం చెన్నైలో ఉన్న మురళీధరన్‌కు ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక అపోలో ఆసుపత్రిలో చేరాడు. శనివారమే 49 ఏళ్లు పూర్తి చేసుకున్న మురళీధరన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక మళ్లీ సన్‌రైజర్స్ జట్టుతో చేరతాడు. చదవండి: అపురూపమైన కానుకతో స్టోక్స్‌కు వీడ్కోలు.. సిరాజ్ మొత్తం మారిపోయాడు: కోహ్లి -
మురళీధరన్‌గా ధనుష్?
ప్రముఖ శ్రీలంకన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ అనుకోకుండా వివాదంలో ఇరుక్కుంది. మురళీధరన్‌గా తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తారని ప్రకటించారు. ‘800’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు యంఎస్ శ్రీపతి దర్శకుడు. ఫస్ట్ లుక్ కూడా విడుదలయింది. అయితే విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకోవాలని తమిళులు సోషల్ మీడియా ద్వారా నిరసన తెలియజేశారు. మురళీధరన్‌కి తమిళ మూలాలున్నప్పటికీ ఒక్కసారి కూడా తమిళ సమస్యలకు మద్దతుగా మాట్లాడలేదు, నిలబడలేదు అన్నదే ఆ నిరసనకు కారణం. పలువురు దర్శకులు కూడా సేతుపతిని తప్పుకోమని కోరారు. ‘నా వల్ల నువ్వు ఇబ్బందిపడొద్దు. ఈ సినిమా నుంచి తప్పుకో’ అని విజయ్ సేతుపతికి ఓపెన్ లెటర్ రాశారు మురళీధరన్. ఇప్పుడు ఆ పాత్ర ఎవరు చేస్తారనే చర్చ నడుస్తోంది. తాజాగా మురళీధరన్ పాత్రకు ధనుష్ పేరుని పరిశీలిస్తున్నారని కోలీవుడ్ టాక్. మరి ధనుష్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారా? వేచి చూడాలి. అసలు మురళీధరన్ బయోపిక్ తెరకెక్కుతుందా? అనే సందేహం కూడా పలువురిలో ఉంది. -
ఆ హీరో ఫ్యాన్స్‌తో నాకు ప్రమాదం..
చెన్నై: ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తలపెట్టిన బయోపిక్ 800 తమిళనాట పెను వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలు ప్రముఖ దర్శకుడు భారతీ రాజా వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విజయ్ సేతుపతిని ఈ సినిమాలో నటించవద్దని కోరారు. చివరకు మురళీధరన్ కూడా తన బయోపిక్ కోసం కెరీర్‌ని నాశనం చేసుకోవద్దంటూ విజయ్‌ని కోరడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఆ తర్వాత కూడా విజయ్ కుమార్తెకి అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ దర్శకుడు ఆర్ సీను రామసామి తాను కూడా బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. జీవితం ప్రమాదంలో పడింది సాయం చేయండి అంటూ ముఖ్యమంత్రి పళని స్వామిని కోరుతున్నారు. సినిమా నుంచి తప్పుకోవాల్సిందిగా విజయ్ సేతుపతిని కోరిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు రావడం ప్రారంభం అయ్యిందని తెలిపారు. ఈ సందర్భంగా రామసామి మాట్లాడుతూ.. ‘చాలా మందిలాగే నేను కూడా విజయ్ సేతుపతిని 800 సినిమా నుంచి వైదొలగాలని కోరాను. ఆ తర్వాత కొద్ది రోజులకు విజయ్ కుమార్తె లాగే నాకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. నోటితో పలకలేని పదాలను ఉపయోగించారు. వాట్సాప్ ఒపెన్ చేయాలంటేనే ఒణుకుపుడుతుంది’ అన్నారు. అలానే ఈ బెదిరింపుల వెనక విజయ్ ఫ్యాన్స్ ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తమ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బెదిరింపుల నేపథ్యంలో రోడ్డు మీద నడవాలన్న భయంగా ఉందన్నారు. దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ.. దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. (విమర్శలకు చెక్: విజయ్ అనూహ్య నిర్ణయం) ఇక 800 చిత్రం ప్రకటించిన నాటి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. తమిళ ద్రోహి చిత్రంలో ఎలా నటిస్తారంటూ విజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించవద్దంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలోని ప్రముఖలు సైతం విజయ్‌కు సూచించారు. శ్రీలంకలో తమిళులను ఊచకోతకోసిన 2009 ఏడాది తనక అత్యంత సంతోషకరమైనది వ్యాఖ్యానించిన తమిళుల వ్యతిరేకి చిత్రంలో నటించవద్దని నిరసన వ్యక్తం చేశాయి. విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతారాంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే బయోపిక్కు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై మురళీధరన్ ఓ లేఖ విడుదల చేశారు. తమిళుల తీరును తప్పుబడ్డారు. దీంతో వివాదం కాస్తా పెద్దదిగా మారడంతో 800 బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి ప్రకటించారు. -
విజయ్ సేతుపతి కూతురికి అత్యాచార బెదిరింపు
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్న విషయం తెలిసిందే. తన బయోపిక్ విషయంలో వివాదాలు తలెత్తడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ విజయ్ సేతుపతికి మాజీ క్రికెటర్ మురళీధరన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముత్తయ్య ఓ పెద్ద లేఖ విడుదల చేశారు. విజయ్ సేతుపతి మంచి నటుడని, కేవలం తన సినిమా వల్ల ఈ కోలీవుడ్ నటుడికి ఏ ఇబ్బంది కలగకూడదని భావించి ఆయనను తప్పుకోవాలని కోరినట్లు మురళీధరన్ తెలిపారు. దీనిపై విజయ్ సేతుపతి కూడా స్పందించి ఈ సినిమా నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ట్విటర్లో ‘ధన్యవాదాలు.. ఇక సెలవు’ అని ట్వీట్ చేశారు. చదవండి: తప్పుకున్న విజయ్ తుపతి ఇక ఈ ప్రాజెక్టు నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్న కొన్ని గంటలకే ఆయన చిన్న కూమార్తెపై సోషల్ మీడియాలో అత్యాచార బెదింపులకు పాల్పడుతున్నారు. విజయ్ సేతుపతి ట్వీట్‌కు సమాధానమిస్తూ.. తన కూమార్తెపై అఘాయిత్యానికి పాల్పడతామని, అలా చేస్తేనే ఈలం తమిళుల బాధ ఎలా ఉంటుందో నటుడికి అర్థం అవుతుందని అని పేర్కొన్నారు. అయితే ఈ ట్రోల్‌పై అనేకమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో సదరు నెటిజన్ ప్రవర్తనను ఖండిస్తున్నారు. చదవండి: వివాదంలో 800: స్పందించిన మురళీధరన్ అంతేగాక ఇదే ట్రోల్స్‌పై సింగర్ చిన్మయి కూడా స్పందించారు. ట్రోల్ చేసిన అకౌంట్‌ను పోలీసులకు నివేదించారు. నెటిజన్ వ్యాఖ్యలపై మండిపడుతూ దానికి చెందిన స్క్రీన్ షాన్‌ను షేర్ చేశారు. ‘ఇలాంటి నీచమైన వ్యక్తులే సమాజంలో లైంగిక నేరాలకు మద్దతు పలుకుతారు, దీనిని ఎవరూ మార్చలేరు?. అమ్మాయిలను బహిరంగంగా అత్యాచారం చేస్తానని చెప్తున్న వ్యక్తి నేరస్థుడు. ఇంత జరుగుతున్న చూస్తూ ఊరుకుంటున్నారంటే సిగ్గుచేటు’ అంటూ మండిపడ్డారు. అలాటే అడయార్ డిప్యూటీ కమిషనర్, చెన్నై పోలీసులను ట్యాగ్ చేశారు. కాగా ఇటీవల క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తెపై అత్యాచారం బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు! -
తప్పుకున్న సేతుపతి
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘800’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి టైటిల్ రోల్ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు. అయితే తమిళ నాట ఈ సినిమా విషయంలో వివాదం మొదలైంది. శ్రీలంక ఆటగాడు అయినప్పటికీ మురళీధరన్‌కు తమిళ మూలాలున్నాయి. అయితే తమిళ ఉద్యమానికి సంబంధించిన విషయాల్లో మురళీధర న్ తమిళుల వైపు ఎప్పుడూ నిలబడలేదనే వివాదం తెరమీదకొచ్చింది. అందుకే విజయ్ సేతుపతి ఈ సినిమా చేయకూడదని సోషల్ మీడియాలో పలువురు హల్చల్ చేశారు. కొందరు తమిళ సినీ ప్రముఖులు కూడా విజయ్ సేతుపతి ఈ సినిమా చేయడం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. అందులో సీనియర్ దర్శకులు భారతీరాజా, చేరన్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నారు. ఈ విషయాన్ని మురళీధరన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘నా వల్ల నీలాంటి గొప్ప నటుడు ఇబ్బంది పడటం కరెక్ట్ కాదు. ఎటువంటివంటి ఇబ్బందులు పడొద్దు’ అని ఓ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖకు ‘ధన్యవాదాలు’ అని సమాధానమిచ్చారు విజయ్ సేతుపతి. ఇప్పుడు విజయ సేతుపతి స్థానంలో ఎవరొస్తారో చూడాలి. -
విమర్శలకు చెక్: విజయ్ అనూహ్య నిర్ణయం
సాక్షి, చెన్నై : గతకొన్ని రోజులుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన శ్రీలంక మాజీ స్పినర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌పై వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వరుస వివాదాలు, విమర్శల నేపథ్యంలో మురళీధరన్ బయోపిక్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించి.. విమర్శలకు చెక్‌పెట్టారు. వివరాల ప్రకారం.. ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వంలో 800 పేరుతో మురళీధరన్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మురళీధరన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలో ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. (వివాదంలో 800: స్పందించిన మురళీధరన్) ఈ నేపథ్యంలో శ్రీలంక మతవాదానికి పూర్తిగా మద్దతు పలికిన నమ్మకద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రంలో విజయ్ సేతుపతి నటించవద్దంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలోని ప్రముఖలు సైతం విజయ్‌కు సూచించారు. బడా నిర్మాతలు, దర్శకుల నుంచి విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. మురళీధరన్ బయోపిక్‌పై తమిళ సంఘాలూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. శ్రీలంకలో తమిళులను ఊచకోతకోసిన 2009 ఏడాది తనక అత్యంత సంతోషకరమైనది వ్యాఖ్యానించిన తమిళుల వ్యతిరేకి చిత్రంలో నటించవద్దని నిరసన వ్యక్తం చేశాయి. విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతారాంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే బయోపిక్కు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై మురళీధరన్ ఓ లేఖ విడుదల చేశారు. తమిళుల తీరును తప్పుబడ్డారు. దీంతో వివాదం కాస్తా పెద్దదిగా మారడంతో 800 బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి ప్రకటించారు. ముత్తయ్య లేఖ.. తాజా వివాదం నేపథ్యంలో ముత్తయ్య మురళీధరన్ ఓ లేఖ విడుదల చేశారు. 2009 అల్లర్లపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు. ఎంతోకష్టపడి అంతర్జాతీయ క్రికెట్లో 800కు పైగా వికెట్స్ సాధించిన తన చిత్రాన్ని అడ్డుకోవడం సరైనది కాదని తమిళలు తీరును ఖండించారు. శ్రీలంకలో పుట్టడమే తాను చేసిన తప్పా అని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కుట్రపూరితంగానే కొన్ని రాజకీయ శక్తులు ప్రజలను ఉసిగొళ్పాయని లేఖలో పేర్కొన్నారు. అమాయక ప్రజలకు చంపడం ఎవరికీ సంతోషకరమైన విషయం కాదని, ఆ ఏడాది యుద్ధం యుగియడంతో ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు. -
వివాదంలో 800: స్పందించిన మురళీధరన్
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ప్రస్తుతం '800' పేరుతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. అయితే కొన్ని తమిళ సంఘాలు, సంస్థలు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక జాతీయ జట్టుకు ఆడి మురళీధరన్ తమిళ జాతికి ద్రోహం చేశారని అవి ప్రచారం చేస్తున్నాయి. మురళీధరన్ పాత్రలో నటిస్తున్నందుకు విజయ్ సేతుపతిపై మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై మురళీధరన్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ జీవితంలో నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. నా వ్యక్తిగత జీవితం, క్రికెట్ జీవితం గురించి చాలా మంది మాటలన్నారు. ఇప్పుడు '800' చిత్రం కూడా నా జీవితం గురించే చర్చిస్తుంది కాబట్టి, దీనిపైనా విమర్శలు వస్తాయి. అయితే, నేను కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను’ అన్నారు ‘ఈ చిత్రాన్ని కొందరు వివిధ కారణాలతో రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు. నేను ఇదివరకు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చూపిస్తున్నారు. గత ఏడాది నేను 2009 నాకు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అయితే కొందరు దీన్ని వక్రీకరించి 'శ్రీలంకలో తమిళులను పెద్ద సంఖ్యలో చంపిన ఏడాది మురళీధరన్‌కు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరమట' అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఓ సామాన్యుడి కోణంలో ఆలోచించండి. దేశంలో యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఇంతటి ఆందోళనకర పరిస్థితుల్లో 2009లో యుద్ధం సమాప్తమైంది. ఓ సామాన్యుడిగా సురక్షితంగా ఉన్నామన్న భావన నాకు కలిగింది. పదేళ్లుగా ఇరువైపులా మరణాలు లేవు. అందుకే, 2009ని నేను అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అమాయకులను చంపడాన్ని నేను ఎప్పుడూ సమర్థించలేదు. సమర్థించబోను’ అని మురళీధరన్ స్పష్టం చేశారు. (చదవండి: ‘800’ వివాదం.. జనాలకు ఏం పని లేదా?!) అంతేకాక ‘నా జీవిత కథను సినిమాగా తీస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినప్పుడు మొదట నేను తటపటాయించా. కానీ, ఆ విషయం గురించి ఆలోచించన తర్వాత, మురళీధరన్‌గా నేను సాధించిన విజయాలు నా ఒక్కడివే కాదనిపించింది. నా తల్లిదండ్రుల సహకారం ఇందులో ఎంతో ఉంది. నా ఉపాధ్యాయులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు అందరూ నా వెనుక ఉన్నారు. సినిమాతో వాళ్లకు గుర్తింపు వచ్చినట్లవుతుందని అనిపించింది. అందుకే ఒప్పుకున్నాను’ అని తెలిపారు. ఇక "శ్రీలంక తమిళులు చనిపోతున్నప్పుడు ముత్తయ్య ఫిడేలు వాయించారు. తన సొంత ప్రజలు చనిపోయినప్పుడు అతను ఆనందించారు. అలాంటి వ్యక్తి క్రీడాకారుడిగా ఎంత సాధించినా ఉపయోగం ఏమిటి? మనకు సంబంధించినంతవరకు, ముత్తయ్య నమ్మకద్రోహం చేసాడు" అని ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా విమర్శించారు. (చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు! ) పీఎంకే చీఫ్ డాక్టర్ పి రామదాస్ మాట్లాడుతూ, "విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతాడు" అని తెలిపారు. ఇక ఈ చిత్ర నిర్మాతలు, డార్ మోషన్ పిక్చర్స్, ఈ సినిమా "పూర్తిగా స్పోర్ట్స్ బయోగ్రఫీ" అని, దీనిలో శ్రీలంకలో తమిళుల పోరాటాలను తక్కువ చేసే సన్నివేశాలను చూపించమని చెప్పారు. ఈ వివాదాలపై విజయ్ సేతుపతి ఇంకా స్వయంగా స్పందించలేదు. 2017లో నటుడు, రాజకీయ నాయకుడు రజనీకాంత్ తన 2.0 చిత్రం నిర్మాతలు ఏర్పాటు చేసిన శ్రీలంక కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. నిరాశ్రయులైన తమిళులకు ఇళ్లను పంపిణీ చేయడానికి నిర్ణయించిన ఈ కార్యక్రమాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. దీని ద్వారా తమిళులు పునరావాసం పొందారని అంతర్జాతీయ సమాజానికి తప్పుడు ప్రచారం చేయడానికి శ్రీలంక తన పర్యటనను ఉపయోగించుకోవచ్చని రజనీని హెచ్చరించాయి. -
‘800’ వివాదం.. జనాలకు ఏం పని లేదా?!
చెన్నై: హీరో విజయ్ సేతుపతి క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’లో నటించవద్దంటూ నిరసనలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ విజయ్ సేతుపతికి మద్దతుగా నిలిచారు. నమ్మక ద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రంలో నటించొద్దని విజయ్ సేతుపతికి దర్శకుడు భారతీరాజా సూచించిన విషయం తెలిసిందే. అంతేగాక పలు తమిళ సంఘాలు కూడా దేశద్రోహి సినిమాలో నటించవద్దంటూ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో రాధిక శుక్రవారం వరుస ట్వీట్లు చేస్తూ విజయ్ సేతుపతికి, చిత్ర పరిశ్రమకు సంఘీభావం తెలిపారు. రాజకీయాలను, వినోదాన్ని కలపవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు!) రాధిక ట్వీట్ చేస్తూ.. ‘జనాలకు ఏం పని లేదా.. ఒక నటుడిని, క్రికెటర్‌ను కలపడం అర్థం లేని వివాదం. ముత్తయ్య మురళీధరన్‌ను కోచ్‌గా నియమించిన ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదు’ అన్నారు. అలాగే ‘‘సన్‌రైజర్స్, సన్ టెలివిజన్ ఛానెల్‌కు బలమైన రాజకీయ అనుబంధం ఉంది. అయినప్పటికి రాజకీయాలను, క్రికెట్‌ను, వినోదాన్ని వృత్తిపరంగా తగిన మార్గంలో స్ఫష్టంగా నిర్వహిస్తోంది. అలాంటప్పుడు రాజకీయాలకు దూరంగా చిత్ర పరిశ్రమను, వినోదాన్నేందుకు చూడకూడదు’’ అని ప్రశ్నించారు. అయితే తను ఈ విషయాన్ని వివాదం చేయాలనుకోవడం లేదన్నారు. కేవలం సినీ పరిశ్రమకు, నటులకు న్యాయపరమైన మద్దతునిచ్చే ప్రయత్నంలో తటస్థతకు, పక్షపాతరహితానికి సాక్ష్యం ఇచ్చేందుకే సన్‌రైజర్స్ పేరును వాడాను అంటూ రాధిక మరో ట్వీట్లో స్పష్టం చేశారు. (చదవండి: విజయ్ సేతుపతికి జంటగా నిత్యా మీనన్) #muthaiyamuralitharan biopic &asking @VijaySethuOffl not to act😡do these people hav no work??why not ask @SunRisers why he is the head coach, team belongs to a Tamilian with political affiliations?VSP is an actor, and do not curb an actor. VSP&cricket both don’t warrant nonsense — Radikaa Sarathkumar (@realradikaa) October 16, 2020 అయితే ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వంలో 800 పేరుతో శ్రీలంక క్రికెటర్ మురళీధరన్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మురళీధరన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలో ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీలంక మతవాదానికి పూర్తిగా మద్దతు పలికిన వ్యక్తి ముత్తయ్య అని అలాంటి నమ్మకద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రంలో విజయ్ సేతుపతి నటించవద్దంటూ దర్శకుడు భారతీరాజు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అంతేగాక 800కు వ్యతిరేకంగా పలు తమిళ సంఘాలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. దర్శకుడు శీను రామస్వామి, చేరన్ కూడా ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రలో నటించొద్దని విజయ్‌సేతుపతికి విజ్ఞప్తి చేశారు. (చదవండి: విజయ్ సేతుపతికి జంటగా నిత్యా మీనన్) my intention of that tweet was not to create any room for controversies but was to support the film industry and the connected artists within prejudices. That's why I brought in #Sunrisers name as a testimony of non biased, neutral and professional approach — Radikaa Sarathkumar (@realradikaa) October 16, 2020 -
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు!
నమ్మకద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కనున్న చిత్రంలో నటించొద్దని నటుడు విజయ్‌సేతుపతికి దర్శకుడు భారతీరాజా హితవు పలికారు. శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రను 800 పేరుతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ముత్తయ్యమురళీధరన్ పాత్రలో విజయ్‌సేతుపతి నటిస్తున్నారు. ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో విజయ్‌సేతుపతి నటిస్తుండడంపై తమిళ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. భారతీరాజా 800 చిత్రంలో నటించొద్దని విజయ్‌సేతుపతికి హితవు పలుకుతూ గురువారం ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో శ్రీలంక మతవాదనకి పూర్తిగా మద్దతు పలికిన వ్యక్తి ముత్తయ్య మురళీధరన్ అని అన్నారు. ముత్తయ్య మురళీధరన్ నమ్మకద్రోహి అని పేర్కొన్నారు. అదేవిధంగా దర్శకుడు శీను రామస్వామి, చేరన్ కూడా ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రలో నటించొద్దని విజయ్‌సేతుపతికి విజ్ఞప్తి చేశారు. -
వివాదంలో విజయ్ సేతుపతి చిత్రం
తమిళ హీరో విజయ్ సేతుపతికి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలు, సినిమాలతో తన అభిమానులను అలరిస్తుంటారు. ఇక ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. తాజాగా విజయ్ సేతుపతి శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలయిన మోషన్ పిక్చర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇక మురళీధరన్‌గా విజయ్ సేతుపతి లుక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ప్రస్తుతం ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సేతుపతిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #షేమ్ఆన్ విజయ్‌సేతుపతి అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ ప్రారంభించారు. శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మకంగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తున్నది. జాతి ఆధారంగా వివిక్ష చూపించే దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ పాత్రలో మీరు నటిస్తారా.. ఇదేనా తమిళ ప్రేక్షకుల పట్ల మీరు చూపే కృతజ్ఞత అంటూ ప్రశ్నిస్తున్నారు. (చదవండి: సవాల్‌కి సై) మరి కొందరు మీరు చేసేది పూర్తిగా తప్పు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మూవీ మేకర్స్ మాత్రం ఈ బయోపిక్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని.. నిజాల్ని నిర్భయంగా చూపిస్తామని ప్రకటించారు. ముత్తయ్య మురళీధరన్ జీవితంలో కనిపించని అనేక కోణాలు తెర మీదకు వస్తాయని తెలుపుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. -
మురళీధరన్‌గా విజయ్ సేతుపతి
చెన్నై: అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా సినిమా రూపొందనుంది. ఎంఎస్ శ్రీపతి దీనికి దర్శకత్వం వహించనుండగా...మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తాయి. ‘సైరా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ సేతుపతి దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ పాత్రలో కనిపిస్తాడు. మురళీధరన్ టెస్టుల్లో తీసిన 800 వికెట్లను గుర్తు చేసే విధంగా సినిమా టైటిల్ కూడా ‘800’ అని పెట్టారు. వన్డేల్లో కూడా మురళీధరన్ 534 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నేడు జరిగే చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌కు ముందు ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. మురళీ బయోపిక్కు ప్రధానంగా తమిళంలో రూపొందించి ఇతర భారతీయ భాషలతో పాటు సింహళీస్లో కూడా అనువదిస్తారు. భారత్‌తో పాటు శ్రీలంక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో సినిమాను షూట్ చేస్తారు. -
సవాల్‌కి సై
విభిన్న సినిమాలు, విభిన్న పాత్రలతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఆయన భాగమయ్యే ప్రతీ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుంది. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ప్రముఖ శ్రీలంకన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధర న్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను విజయ్ సేతుపతి పోషించనున్నారు. ‘800’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్, థార్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మించనున్నాయి. దర్శకత్వ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారో ఇంకా ప్రకటించలేదు. ‘ఈ చిత్రంలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాత్ర నాకో చాలెంజ్ లాంటిది. ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీధరన్గారు కూడా ఈ ప్రాజెక్ట్‌లో మాకు తోడుగా ఉండటం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు విజయ్ సేతుపతి. -
స్టార్ క్రికెటర్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఈ బయోపిక్కు సంబంధించి అప్డేట్ను ఇచ్చింది. ముత్తయ్య మురళీధరన్ పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటింస్తున్నాడని అఫిషియల్‌గా ప్రకటించింది. మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలోనే రానుంది. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించనున్నారు. టెస్ట్ క్రికెట్లో ఎనిమిది వందల వికెట్లు తీసిన ఘనత మురళీధరన్ సొంతం. వన్డేల్లో మురళీ 534 వికెట్లు తీశాడు. 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ బయోపిక్ చిత్రానికి ‘800’ అని పెరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి మురలీధరన్ బౌలింగ్ శైలీని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడట. మరలీధరన్ పాత్రతో విజయ్ పక్కాగా మెప్పిస్తాడని నిర్మాతలు భావిస్తున్నారు. మురళీధరన్ బయోపిక్ కోసం క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. IT'S OFFICIAL... #VijaySethupathi to star in cricketer #MuthiahMuralidaran biopic... Directed by #MSSripathy... Produced by Movie Train Motion Pictures and Dar Motion Pictures. #MuralidaranBiopic pic.twitter.com/0KeCPzk6im — taran adarsh (@taran_adarsh) October 8, 2020 -
‘ప్లాన్-బితోనే క్రికెట్లోకి వచ్చా’
కొలంబో: ప్రపంచ టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్న సంగతి తెలిసిందే. తన టెస్టు కెరీర్లో 800 వికెట్లను ఖాతాలో వేసుకున్న మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తన ఆఫ్ బ్రేక్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించడంలో మురళీధరన్‌తో ప్రత్యేకమైన శైలి. అయితే తన యాక్షన్‌పై అనేకసార్లు వార్తల్లో నిలిచిన మురళీధరన్..ఎప్పటికప్పుటూ ఐసీసీ గ్రీన్ సిగ్నల్ పొందుతూనే అరుదైన రికార్డును సాధించడం ఇక్కడ విశేషం. 1998-99 సీజన్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మురళీధరన్ యాక్షన్‌పై అనుమానం వ్యక్తం చేసిన అంపైర్ రాస్ ఎమెర్సన్ వరుసగా నో బాల్స్ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. మురళీ బంతిని సంధించడం అంపైర్ నోబాల్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. అయినప్పటికీ తన యాక్షన్‌లో ఎటువంటి లోపం లేదని నిరూపించుకున్న ఈ స్పిన్ మాంత్రికుడు టెస్టు ఫార్మాట్ అత్యధిక వికెట్ల టేకర్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. (వారిద్దరూ ఇంగ్లండ్ టూర్‌కు డుమ్మా) అయితే తాను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సమయంలో ఆఫ్ బ్రేక్ బౌలింగ్ సెట్ కాకపోయి ఉంటే లెగ్ స్పిన్ బౌలర్‌గా అవతరించేవాడినన్నాడు. తాను మణికట్టు స్పిన్‌ను కూడా ప్రాక్టీస్ చేసి ప్లాన్-బిని సిద్ధంగా ఉంచుకున్న విషయాన్ని తెలిపాడు. ‘ నేను యువకుడిగా ఉన్నప్పడు లెగ్ స్పిన్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా టెస్టుల్లో సెట్ కాకపోతే పరిస్థితి ఏంటి అనే దాని కోసం లెగ్ స్పిన్‌ను ప్రాక్టీస్ చేసేవాడిని. ఒకవేళ టెస్టుల్లో ఆఫ్ స్పిన్నర్‌గా కొనసాగిన నేను అది వర్క్ కాకపోయి ఉంటే కచ్చితంగా లెగ్ స్పిన్నర్‌ను అయ్యేవాడిని’ అని తెలిపాడు. ఎవరైనా ఎప్పుడైతే క్రికెట్లోకి రావాలనుకుంటారో ప్లాన్-ఏ, ప్లాన్-బిలు సిద్ధంగా ఉండాలన్నాడు. ఏదొక దానికే మాత్రమే కట్టుబడి ఉంటే అది వర్కౌట్ కాకపోతే సమస్యలు వస్తాయన్నాడు. ప్రొఫెషనల్ స్థాయిలో ఒక గేమ్‌ను ఆడాలంటే మానసిక ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుందన్నాడు. ఇది కేవలం క్రికెట్ మాత్రమే పరిమితం కాదని, అన్ని క్రీడలకు వర్తిస్తుందన్నాడు. మానసిక బలమే ఆటలో కీలక పాత్ర పోషిస్తుందని మురళీ చెప్పుకొచ్చాడు.(‘మాపై ప్రయోగం చేయడం లేదు’ ) -
నేను 8 వికెట్లు తీయలేనా..!
కొలంబో: టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు (800) నెలకొల్పిన దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తన ఆఖరి టెస్టులో ఈ ఘనత నమోదు చేసాడు. 2010లో స్వదేశంలో భారత్‌తో జరిగిన ఈ సిరీస్‌కు ముందే తాను మొదటి టెస్టు మాత్రమే ఆడి రిటైర్ అవుతానని అతను ముందే ప్రకటించాడు. అప్పటికి అతని ఖాతాలో 792 వికెట్లు ఉన్నాయి. అయితే సహచరుడు సంగక్కర మాత్రం 800 మైలురాయిని వచ్చేవరకు ఆడాల్సిందేనని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అవసరమైతే తర్వాతి టెస్టునుంచి విశ్రాంతి తీసుకొని లేదా మరుసటి సిరీస్ అయినా ఆడాల్సిందే తప్ప ఇలా తప్పుకోవద్దని మళ్లీ మళ్లీ చెప్పాడు. దీనిపై స్పందించిన మురళీ...‘నేను నిజంగా అత్యుత్తమ స్పిన్నర్నే అయితే ఒకే టెస్టులో 8 వికెట్లు తీస్తాను తప్ప ఇలా సాగదీయను’ అని బదులిచ్చాడు. చివరకు అతను అన్నట్లుగానే సరిగ్గా 8 వికెట్లు తీసి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. గురువారం భారత స్పిన్నర్ అశ్విన్‌తో జరిపిన ఇన్స్టాగ్రామ్ సంభాషణలో సంగక్కర ఇది వెల్లడించాడు. -
గవర్నర్‌గా ముత్తయ్య మురళీధరన్!
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ త్వరలో కొత్త పాత్రలోకి ప్రవేశించబోతున్నాడు. తమిళుల ప్రాబల్యం అధికంగా ఉన్న నార్తర్న్ ప్రావిన్స్‌కు మురళీధరన్‌ను గవర్నర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ పదవిని స్వీకరించాలంటూ లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స స్వయంగా ఆహ్వానించినట్లు సమాచారం. శ్రీలంక తరఫున 133 టెస్టులు ఆడి 800 వికెట్లు తీసిన 47 ఏళ్ల మురళీధరన్ 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించాడు. -
గిల్‌క్రిస్ట్‌నే కలవరపెట్టిన భారత బౌలర్..!!
మెల్బోర్న్ : తన కెరీర్లో ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్లలో భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒకరని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తెలిపారు. అదేవిధంగా శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌లో కూడా ఇబ్బంది పడినట్లు వెల్లడించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌లో 2001లో జరిగిన బోర్డర్- గవాస్కర్ సిరీస్‌లో 32వికెట్లు పడగొట్టిన భజ్జీ ఆసీస్‌కు కొరకరాని కొయ్యలా మారాడని ఈ సందర్భంగా గిల్‌క్రిస్ట్ గుర్తు చేసుకున్నాడు. 2001లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో టెస్టులో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ముంబైలో జరిగిన తొలి టెస్టులో గిల్‌క్రిస్ట్ సెంచరీతో చెలరేగడంతో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లలో హర్భజన్ చెలరేగడంతో భారత్ తదుపరి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీంతో గంగూలీ సారథ్యంలోని టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. 'ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్‌లో మేము 99/5 స్థితిలో ఉన్న సమయంలో నేను క్రీజులోకి వెళ్లాను. 80 బంతుల్లో 100 పరుగులు చేశాను. అయితే ఆ టెస్టును మూడు రోజుల్లోనే గెలిచాం. ఇంత సులభంగా మ్యాచ్ గెలవగానే.. గత 30 సంవత్సరాలుగా మా జట్టు భారత్‌లో ఎందుకు సిరీస్ గెలవలేదు అని ప్రశ్నించుకునేవాడిని. కానీ.. తర్వాత భారత్‌లో టెస్టు సిరీస్ ఎంత కఠినమో త్వరగానే అర్థమైపోయింది. తర్వాతి టెస్టు మ్యాచ్ కోసం కోల్‌కతాకు వెళ్లాం. అక్కడ మమ్మల్ని భజ్జీ తన బౌలింగ్‌తో కలవర పెట్టాడు నా కెరీర్లో నేను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన బౌలర్ భజ్జీనే. ఆ తర్వాత శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. వీళ్లిద్దరూ నేను ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్లు. ఈ సిరీస్ ఓటమి తర్వాత టెస్ట్ క్రికెట్ విషయంలో మేము అనేక విషయాలను తెలుసుకున్నాం. ప్రతిసారి దాడి చేయడమే కాకుండా తమ వ్యూహాలను మార్చుకొని ఆడాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నాం. 2001లో సిరీస్ చేజారి పోయాక మా వ్యూహాలను మార్చాం. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేందుకు దాడి చేయడం ఒకటే సరైన మార్గం కాదని తెలుసుకున్నాం. తర్వాత 2004లో భారత పర్యటనలో భాగంగా 35 సంవత్సరాల తర్వాత సిరీస్‌ను గెలవడం చాలాగొప్ప విషయం’అని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. కాగా, ఈ సిరీస్‌లో చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో క్లిష్ట సమయంలో 49 పరుగులు చేసిన ఆడమ్, అవి తనకెంతో ప్రత్యేకమన్నారు. ఈ పర్యటనలో ఆసీస్ 2-1 తేడాతో టీమిండియాపై విజయం సాధించిన విషయం తెలిసిందే. -
800లో భాగస్వామ్యం
క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టనున్నారు హీరో రానా. ఆడటానికి కాదు. ఆడించడానికి. శ్రీలంక ప్రముఖ మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘800’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. మురళీధరన్ పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నారు. ఈ సినిమాను థార్ మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌తో కలిసి రానా నిర్మించనున్నారు. ‘‘థార్ ఫిల్మ్స్‌తో సురేష్ ప్రొడక్షన్స్ అండ్ నేను కలిసి లెజెండరీ క్రికెటర్ మురళీధరన్ బయోపిక్‌ను నిర్మించబోతున్నాం’’ అని రానా పేర్కొన్నారు. ఈ సినిమాకు ఎమ్ఎస్ శ్రీపతి దర్శకత్వం వహించనున్నారు. డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాదిలో విడుదల చేయాలనుకుంటున్నారట. -
రానా నిర్మాణంలో లెజండరీ క్రికెటర్ బయోపిక్
శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ బయోపిక్‌లో ముత్తయ్యగా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి నిర్మించబోతున్నారు. థార్‌మోషన్ పిక్చర్స్‌తో సంయుక్తంగా సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చిత్ర మేకర్స్ మంగళవారం ప్రకటించారు. విజయ్ సేతుపతి, దర్శకుడు రంగస్వామి, థార్ ప్రొడక్షన్‌తో కలిసి పనిచేయబోతుండడం ఉత్సాహంగా ఉందని రానా ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఇక సురేశ్ ప్రొడక్షన్స్‌లో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్లో ఎనిమిది వందల వికెట్లు తీసిన ఘనత మురళీధరన్ సొంతం. సో.. ఈ సినిమాకు ‘800’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్ మాత్రం డిసెంబర్లో ప్రారంభంకానుంది. -
విజయ్ @ 800
క్రికెట్ ప్రపంచంలో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరు తెలియనివారు ఉండకపోవచ్చు. టెస్ట్, వన్ డే క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత ముత్తయ్య పేరు మీదనే ఉంది. ఇటీవల క్రీడాకారుల జీవితాలు వెండితెరపైకి వస్తున్న నేపథ్యంలో తాజాగా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ తెరపైకి వచ్చింది. ఈ బయోపిక్‌లో ముత్తయ్యగా విజయ్ సేతుపతి నటించబోతున్నారు. ఈ సినిమాకు శ్రీపతి రంగస్వామి దర్శకుడు. ‘‘ముత్తయ్య మురళీధరన్ తమిళ సంతతికి చెందిన సూపర్ స్పోర్ట్స్ పర్సన్. స్పిన్నర్‌గా ప్రపంచఖ్యాతి గడించారు. అతని పాత్రలో నటించడం నాకు సవాల్ లాంటిది. ముత్తయ్య మురళీధరన్గారు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం, స్వయంగా నాకు క్రికెట్ టిప్స్ చెప్పడం సంతోషంగా ఉంది. నన్ను నమ్మిన మురళీధరన్‌కు, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విజయ్ సేతుపతి. ‘‘విజయ్ సేతుపతి వంటి నటుడు నా పాత్రలో నటించడం హ్యాపీ’’ అన్నారు మురళీధరన్. టెస్ట్ క్రికెట్లో ఎనిమిది వందల వికెట్లు తీసిన బౌలర్ రికార్డు మురళీధరన్ సొంతం. సో.. ఈ సినిమాకు ‘800’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట టీమ్. ఈ చిత్రాన్ని థార్ మోషన్ పిక్చర్స్ నిర్మించనుంది. -
నన్ను ఇబ్బంది పెట్టింది వారే: యువీ
న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన యువరాజ్ సింగ్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన క్రికెట్ కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ల పేర్లను యువీ వెల్లడించాడు. తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరనేనని స్పష్టం చేశాడు. మురళీధరన్‌ను ఆడటానికి తీవ్ర ఇబ్బందులు పడేవాడినన్న యువీ.. అదే సమయంలో పేస్ విభాగంలో ఆసీస్ మాజీ పేసర్ మెక్‌గ్రాత్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి వచ్చేదన్నాడు. ఈ ఇద్దరే తనను ఎక్కువ ఇబ్బందులు గురి చేశారని యువీ పేర్కొన్నాడు. ఇక తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అనే ప్రశ్నకు ఆసీస్‌కు రెండుసార్లు వరల్డ్‌కప్ సాధించి పెట్టిన రికీ పాంటింగ్ అని బదులిచ్చాడు. పాంటింగ్ బ్యాటింగ్‌తో పాటు వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ల ఆటను ఎక్కువగా ఆస్వాదించానన్నాడు. (ఇక్కడ చదవండి: అతడిని ఎప్పటికీ క్షమించను: యువీ తండ్రి) -
మురళీ సార్.. దోశను చంపుతున్నారు
ఒకప్పుడు దూస్రాలతో బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించిన శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ దోస తింటున్న ఫొటో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న మురళీధరన్, తన టీం సభ్యులతో కలసి బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ తింటున్నప్పుడు కీపర్ శ్రీ వాత్సవ గోస్వామి ఫొటో తీశాడు. ‘మురళీ సార్ దోశను చంపుతున్నారు’ అనే అర్థంతో సన్ రైజర్స్ జట్టు ఆటగాడు గోస్వామి చేసిన ట్వీట్‌పై చాలామంది నెటిజన్లు జోకులు వేస్తూ, షేర్ చేస్తున్నారు. మురళీధరన్ దోశ తింటున్న ఫొటో షేర్ చేసిన శ్రీవాత్సవ గోస్వామికి పంజాబ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. సారథి కేన్ విలియమ్స్ గైర్హాజరీలో ఆడిన ఆ మ్యాచ్‌లో రైజర్స్ జట్టు ఓటమి పాలైంది. డేవిడ్ వార్నర్ 53 బంతుల్లో 85 పరుగులతో అదరగొట్టడంతో రైజర్స్ 181 పరుగులు చేయగలిగింది. కానీ ఛేదనలో భీకర ఆటగాడు ఆండ్రూ రస్సెల్ 19 బంతుల్లోనే 49 పరుగులు చేసి కోల్కత్తా జట్టును సులభంగా విజయ తీరాలకు చేర్చాడు. -
‘అందరూ కోహ్లిలు కాలేరు’
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో ఆడే ఆటగాళ్లంతా విరాట్ కోహ్లి మాదిరి ఆడాలనుకోవడం సాధ్యమయ్యే విషయం కాదని శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ పేర్కొన్నాడు. తుది జట్టులో ఉండే ఆటగాళ్లు అందరూ కోహ్లిలు కాలేరని, అది ఎప్పటికీ సాధ్యం కూడా కాదన్నాడు. ఆసీస్‌తో జరిగిన నాల్గో వన్డేలో భారత్ పరాజయం కావడం ఆటలో భాగమేనని మురళీ ధరన్ చెప్పుకొచ్చాడు. కొన్ని సందర్భాల్లో గెలిస్తే, మరికొన్ని సార్లు ఓటమిని కూడా అంగీకరించాలన్నాడు. ప్రతీ ఒక్క జట్టు 11 మంది విరాట్ కోహ్లిలతో కానీ సచిన్ టెండూల్కర్‌లతో కానీ బ్రాడ్‌మన్‌లతో కానీ నింపాలనే అనుకుంటుందని, అది ఎప్పటికీ సాధ్యం కానేకాదన్నాడు. ప్రతీ ఒక్కరూ మ్యాచ్ విన్నర్ కాలేరని విషయాన్ని ఇక్కడ గుర్తించుకోవాలన్నాడు. (ఇక్కడ చదవండి: పంత్‌లో ధోనిని వెతకడం ఆపండి) ‘వరల్డ్‌కప్ ముందు భారత్ జట్టు చేసే ప్రయోగాలు చాలా బాగున్నాయి. ఈ తరహా ప్రయోగాలు చేసేటప్పుడు గెలుపుతో పాటు ఓటమి కూడా ఉంటుంది. ఇక్కడ ఓపిక చాలా అవసరం. ప్రధానంగా ఫ్యాన్స్‌కు నేను చెప్పేదొక్కటే. ఓపికతో ఉండండి. అప్పుడే మీ క్రికెటర్లకు ఒత్తిడి ఉండదు. భారత ఆటగాళ్లు అమోఘంగా రాణిస్తున్నారు. దయచేసి అనవసర విమర్శలు చేసి ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకండి. ఇదొక ఆట. ఇందులో గెలుపు-ఓటములు సహజం’ అని మురళీ ధరన్ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: ధోని లేకపోవడం వల్లనే ఓటమి: మాజీ క్రికెటర్) -
చిత్ర విచిత్ర రనౌట్లు!
బంతి బౌండరీ దాటిందని రిలాక్స్ అవడమో, క్రీజులోకి వచ్చామనే భ్రమలో ఉండటంతోనో లేక అతితొందరతోనో బ్యాట్స్‌మన్ రనౌట్ అవుతుంటారు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ వింతగా, నిర్లక్ష్యంగా రనౌట్ అవ్వడం తెలిసిందే. అయితే క్రికెట్ చరిత్రలో వినూత్న రనౌట్లు కోకొల్లలు. ఈ జాబితాలో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇంజమాముల్ హక్, మిస్బావుల్ హక్, మహ్మద్ అమిర్, టీమిండియా బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ బెల్, అలిస్టర్ కుక్, శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీథరన్‌లు ఉన్నారు. క్రీజులో పాతుకపోతున్నారు, ఇక గెలిచినట్టే అన్న తరుణంలో సిల్లీగా రనౌట్లు అవ్వడం అటు జట్టుకు ఇటు అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించేదే. చేజింగ్ సమయంలో అందులోనూ చివర ఓవర్లలో ప్రతీ పరుగు ముఖ్యమైనదే. ఈ సమయంలో రనౌట్లు కామనే. కానీ టెస్టుల్లో, వన్డేల్లో మధ్య ఓవరల్లో నిర్లక్ష్యంతో రనౌటవ్వడం అందరికీ కోపాన్ని కలిగించే అంశం. వినూత్నంగా రనౌటవ్వడంలో పాక్ మాజీ సారథి ఇంజమాముల్ హక్ తొలి స్థానంలో ఉంటాడు. అందులోనూ కామెడీగా రనౌట్లయినవి 23 వరకు ఉండటం గమనార్హం. టీమిండియాతో వన్డే మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న ఇంజమామ్.. ఫీల్డర్ వికెట్ల వైపు విసిరిన బంతిని అడ్డుకోవడంతో అంపైర్ రనౌట్‌గా ప్రకటించాడు. అప్పుడు ఇలాంటి రనౌట్లు కూడా ఉంటాయా అని అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మిస్బావుల్ హక్, అమిర్, అజహర్ అలీలు కూడా ఫన్నీగా రనౌటయ్యారు. ఇక టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్‌కు పరుగెత్తడం కన్నా బౌండరీలు బాదడం ఈజీ అనుకుంటాడు. 2007లో శ్రీలంక నిర్దేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఫామ్‌లో ఉన్న సెహ్వాగ్ సిల్లీగా రనౌటవ్వడం అందరికీ ఆగ్రహాన్ని తెప్పించింది. 2011లో టీమిండియాతో టెస్టు సందర్భంగా బంతి బౌండరీ దాటిందని ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్ పిచ్ మధ్యలో సహచర బ్యాట్స్‌మన్‌తో రిలాక్స్ అవుతున్నాడు. అయితే బౌండరీ వద్ద బంతి అందుకున్న ఫీల్డర్ ప్రవీణ్ కుమార్, కీపర్ ధోని సహకారంతో బెల్‌ను రనౌట్ చేశాడు. దీంతో షాక్‌లోనే బెల్ మైదానాన్ని వీడాల్సివచ్చింది. 2012లో కోల్‌కతాలో ఇంగ్లండ్-టీమిండియా టెస్టు సందర్భంగా ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మన్ కుక్ భయంతో సిల్లీగా అవుటయ్యాడు. సింగిల్ తీస్తున్న క్రమంలో ఫీల్డర్ విసిరిన బంతిని భయంతో తప్పించకోబోయి రనౌటగా వెనుదిరుగుతాడు. ఇక క్రికెట్ చరిత్రలో అత్యంత సిల్లీ రనౌట్ అంటే ముత్తయ్య మురళీథరన్దే అని చెప్పవచ్చు. 2006లో న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్‌లో ఈ కామెడీ రనౌట్ చోటుచేసుకుంది. వరుసగా వికెట్లు పడుతుంటే ఒంటరి పోరాటం చేస్తున్న కుమార సంగక్కర ఒక్క పరుగు తీస్తే సెంచరీ పూర్తవుతుంది. అయితే స్ట్రైకింగ్‌లో ఉన్న సంగక్కర సింగిల్ తీసి శతకం అభివాదం చేస్తుండగానే అవతలి ఎండ్‌లో మురళీధరన్ అవుటని అంపైర్ ప్రకటించాడు. దీంతో సంగక్కర షాక్‌కు గురయ్యాడు. సహచర ఆటగాడిని అభినందించాలనే తొందరలో స్పిన్ మాంత్రికుడు సిల్లీగా రనౌటయ్యాడు. -
క్రికెట్ చరిత్రలో వినూత్న రనౌట్లు
-
వాళ్లే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్: లారా
సాక్షి, స్పోర్ట్స్: ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్‌గా టీమిండియా సారథి విరాట్ కోహ్లి నిలుస్తాడని వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ 2019 ప్రచారంలో భాగంగా న్యూయార్క్‌లో వున్న లారా పలు విషయాలు క్రికెట్ అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుత క్రికెట్లో అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మెన్ ఎవరంటే తను కోహ్లి, ఇంగ్లండ్ టెస్టు సారథి జోయ్ రూట్లకే ఓటు వేస్తానని స్పష్టంచేశాడు. ఇంగ్లండ్-టీమిండియాల మధ్య జరగుతున్న సిరీస్‌లో వీరిద్దరూ పోటిపడి పరుగులు చేస్తున్నారని కొనియాడాడు. ఇక 29 ఏళ్ల టీమిండియా సారథి పరుగుల సునామీ తగ్గటం లేదన్నాడు. గత పర్యటను చేదు అనుభవాలను చెరిపివేస్తూ ప్రస్తుత సిరీస్‌లో అదరగొడుతూ ఇప్పటికే 544 పరుగులు సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. టెస్టుల్లో తాను ఎందుకు నంబర్ వన్ బ్యాట్స్‌మనో ప్రపంచానికి కోహ్లి చాటి చెప్పాడని వివరించాడు. వార్న్, ముత్తయ్య భయపెట్టారు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీథరన్ బౌలింగ్‌లో తాను ఇబ్బందులకు గురైన మాట వాస్తవమేనని లారా అంగీకరించాడు. తన క్రికెట్ కెరీర్లో వీరిద్దరి బౌలింగ్ తనను భయపెట్టిందన్నాడు. పక్కా ప్రణాళికతో వారి బౌలింగ్‌ను ఎదుర్కొడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని వివరించాడు. అంతర్జాతీయ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు(400*) సాధించిన లారా స్పిన్ దిగ్గజాల(వార్న్, ముత్తయ్య)కు భయపడ్డానని చెప్పడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒలంపిక్స్‌లో క్రికెట్ ఉండాలి మూడు గంటల ఆటైన టీ20 క్రికెట్‌ని ఒలంపిక్స్‌లో ప్రవేశపెట్టాలని బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. అత్యంత ప్రజాధరణ కలిగిన క్రికెట్ ఒలంపిక్స్‌లో లేకపోవడం ఆశ్యర్యాన్ని కలిగిస్తుందన్నాడు. అతి త్వరలోనే ఒలంపిక్స్‌లో క్రికెట్ ఉండాలని ఆశిద్దామని పేర్కొన్నాడు. నాణ్యమైన క్రికెట్‌ను ఆడాలనుకునే దేశాలు మాత్రమే లాంగ్ ఫార్మట్ క్రికెట్‌ను ప్రోత్సహిస్తాయని ఓ ప్రశ్నకు సమాధానంగా లారా వివరించాడు. -
అదొక కపటపు ఎత్తుగడ: మురళీ ధరన్
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా చేయాలన్న ఆ దేశ క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఆఫర్‌ను దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీ ధరన్ తిరస్కరించాడు. అంతకుముందు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే సైతం కన్సల్టెంట్ ఆఫర్‌ను తిరస్కరించగా, ఇప్పుడు ఆ జాబితాలో మురళీ ధరన్ చేరిపోయాడు. తనకు శ్రీలంక క్రికెట్ జట్టు సలహాదారుగా చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన మురళీ.. ఇందుకు ప్రస్తుత ఎస్ఎల్సీ విధానం సరిగా లేకపోవడమే కారణమన్నాడు. దీనిలో భాగంగా ఎస్ఎల్సీ నమ్మకాన్ని కోల్పోయిందంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. ‘నాకు శ్రీలంక క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా చేయమంటూ వచ్చిన ఆఫర్లో నిజాయితీ లేదు. అదొక కపటపు ఎత్తుగడ. మా బోర్డు ఎప్పుడో నమ్మకాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ఎస్ఎల్సీ అవలంభించే విధానంలో విశ్వాసం లోపించింది. ఇప్పుడు మా సహకారం కావాలని శ్రీలంక క్రికెట్ పరిపాలన కమిటీ కోరడం నిజంగా శోచనీయం’ అని మురళీ ధరన్ మండిపడ్డాడు. మరొకవైపు లంక క్రికెట్ కమిటీలో పనిచేసిన జయవర్ధనే సైతం దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘మా క్రికెట్ బోర్డు విధానం సరిగా లేదు. మమ్మల్ని ఉపయోగించుకోవాలని క్రికెట్ పెద్దలు చూస్తున్నారు. మమ్మల్ని కొనాలని చూస్తే అది ఎంతమాత్రం లాభించదు’ అని జయవర్ధనే వ్యాఖ్యానించాడు. గతేడాది శ్రీలంక క్రికెట్ ప్రక్షాళనలో భాగంగా ఒక స్పెషల్ ప్యానల్‌ను నియమించిన సంగతి తెలిసిందే. అందులో జయవర్ధనే సభ్యుడిగా ఉన్నాడు. అయితే అప్పట్లో జయవర్ధనే సూచించిన ప్రతిపాదనలకి శ్రీలంక క్రికెట్ బోర్డు విలువ ఇవ్వకపోవడంతో మళ్లీ ఆ తరహా అనుభవాన్ని చూడకూడదనే ఆలోచనలో జయవర్ధనే ఉన్నాడు. ఆ క్రమంలోనే తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు చేసిన విన్నపాన్ని మాజీ కెప్టెన్ తిరస్కరించాడు. ఇటీవల కాలంలో విజయాల కోసం తంటాలు పడుతున్న శ్రీలంక జట్టును గాడిలో పెట్టేందుకు సీనియర్ ఆటగాళ్లతో ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయాలనే యోచనలో లంక బోర్డు ఉంది. ఇందులో జయవర్ధనే, మురళీ ధరన్, కుమార సంగక్కార పేర్లను కూడా చేర్చింది. ఈ మేరకు కమిటీకి అనుమతి ఇవ్వాలని క్రీడామంత్రికి తమ విన్నపాన్ని పంపింది. అయితే సెలక్టర్లు చేసిన ప్రతిపాదనను మరో ఆలోచన లేకుండా మురళీ ధరన్, జయవర్ధనేలు తిరస్కరించడం లంక బోర్డుకు షాకిచ్చినట్లయ్యింది. -
తొలి ఫాస్ట్ బౌలర్‌గా..
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనతను సాధించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక బంతులేసిన బౌలర్ల జాబితాలో అండర్సన్ (30,074) నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం కర్ట్నీ వాల్ష్ (30,019)ను అధిగమించాడు. ఓవరాల్‌గా ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక బంతులేసిన ఆటగాడిగా అండర్సన్ తొలి స్థానంలో నిలిచాడు. 132 టెస్టులు ఆడిన ఈ ఇంగ్లీష్ బౌలర్ 539 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 887పాయింట్లతో అండర్సన్ రెండో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా బౌలర్ రబడా 899 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టెస్టుల్లో అత్యధిక బంతులేసిన బౌలర్ల జాబితాలో శ్రీలంకకు చెందిన ఆఫ్ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (133 టెస్టుల్లో 44,039 బంతులు) తొలి స్థానంలో ఉన్నాడు. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (132 టెస్టుల్లో 40,850 బంతులు) రెండో స్థానంలో, ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్(145టెస్టుల్లో 40,705 బంతులు) మూడో స్థానంలో ఉన్నారు. కివీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 0-1తో కోల్పోయింది. -
వరుస పెట్టి నో బాల్ ఇస్తు మురళీని అవమానించారు
-
'మైదానంలో మురళీని అవమానించారు'
మెల్బోర్న్: టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ ముత్తయ్య మురళీ ధరన్. శ్రీలంకకు చెందిన మురళీ తన టెస్టు కెరీర్లో 800 వికెట్లు సాధించి ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే మురళీ కెరీర్‌ను చాలాకాలం వెంటాడి నిద్రలేకుండా చేసింది మాత్రం అతని బౌలింగ్ యాక్షన్. ఎంతలా అంటే మురళీ మ్యాచ్ ఆడుతున్నాడంటే అతని బౌలింగ్ మాత్రమే చర్చ నడిచేంతగా. ఒకానొక సందర్బంలో మురళీ మోచేతి(ఎల్బో)ని వంచే క్రమంలో అది నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ అతని బౌలింగ్‌ను నిషేధించిన పని చేశాడు అంపైర్ హెయిర్. ఆస్ట్రేలియాతో ఎంసీజేలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మురళీ బౌలింగ్‌ను తప్పుబడుతూ వరుస పెట్టి నో బాల్ ఇచ్చాడు. దాంతో మురళీ కెరీర్ అయోమయంలో పడింది. కాగా, లంక కెప్టెన్ అర్జున రణతుంగతో పాటు పలువురు వ్యాఖ్యాతలు సైతం మురళీ అండగా నిలవడంతో అతని బౌలింగ్ యాక్షన్‌ను సరిచేసుకునే అవకాశం దొరికింది. దానిలో భాగంగా ఐసీసీ నుంచి బౌలింగ్‌లో క్లీన్ సర్టిఫికెట్ తెచ్చుకుని ఆపై అత్యధిక టెస్టు వికెట్లను తన పేరిట లిఖించుకున్న క్రికెటర్ మురళీ. కాగా, తాజాగా మురళీ బౌలింగ్ యాక్షన్‌పై తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా స్పందించాడు. 'మురళీ బౌలింగ్ కు శిలువ వేసేంత పని చేశారు. అతన్ని మైదానంలో చాలా దారుణంగా అవమానించారు. నా వరకూ అయితే ఒక ఆటగాడికి దక్కే గౌరవం మురళీకి దక్కలేదు. టెస్టు మ్యాచ్‌కు ముందు ఎప్పుడూ మురళీ గురించే చర్చ. మురళీ బౌలింగ్ చేసేటప్పుడు మోచేతిలో వంపు రావడానికి కారణం అతని శారీరక స్థితే. అతను అలా పుట్టాడు కాబట్టే బౌలింగ్ యాక్షన్ అలా ఉండేది. మురళీ శైలిలో వేరేవారు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ మురళీ కావాలని బౌలింగ్‌ను అలా చేస్తే చాలా మంది అతన్ని కాపీ కొట్టేవారు కాదా. ఆ బౌలింగ్ యాక్షన్‌ను ఇప్పటివరకూ ఎవరూ అనుకరించలేదంటే మురళీ బౌలింగ్ విభిన్నమైదని లెక్క. నా దృష్టిలో మురళీ బౌలింగ్ కచ్చితంగా ప్రత్యేకమైనదే' అని స్టీవ్ తెలిపాడు. -
ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు
కొలంబో:రవిశాస్త్రి, యువరాజ్ సింగ్, హెర్ష్లీ గిబ్స్ వీరంతా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన వీరులు. అయితే తాజాగా భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆరు సిక్సర్లు సాధించి వారి సరసన నిలిచాడు. సౌరాష్ట్ర టీ20 టోర్నమెంట్లో జడేజా ఈ ఫీట్‌ను సాధించాడు. కాగా, వీరిని తలదన్నేలా శ్రీలంకకు చెందిన టీనేజర్ ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఇలా ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు కొట్టడం ఏ ఫార్మాట్ క్రికెట్లో ఇదే తొలిసారి కావడం విశేషం. అండర్-15 మురళీ గుడ్నెస్ కప్ ఫైనల్లో భాగంగా ఎఫ్‌ఓజీ అకాడమీ తరఫున ఆడుతున్న నవీందు పహసర (89 బంతుల్లో 109) ఈ ఫీట్ సాధించాడు. ఒక బంతి నోబాల్ కావడంతో ఆ కుర్రాడు ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు కొట్టడం సాధ్యమైంది. లంక మాజీ స్పిన్నర్ మురళీధరన్ తన ఫౌండేషన్ తరఫున ఈ టోర్నీ నిర్వహిస్తున్నాడు. నవీందు అద్భుత ఇన్నింగ్స్‌తో కొట్టావాపై ఎఫ్‌ఓజీ విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. -
అత్యుత్తమ స్పిన్నర్ అతనే:మురళీ
కొలంబో:శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో విశేషంగా రాణించి ఎనిమిది వికెట్లు సాధించడంతో పాటు మూడొందల వికెట్ల మైలురాయిని వేగవంతంగా పూర్తి చేసిన భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్‌పై దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరైనా ఉన్నారంటే అది అశ్వినేనని కొనియాడాడు. ముందుగా అరుదైన ఫీట్‌ను సాధించిన అశ్విన్‌కు అభినందనలు తెలిపిన మురళీ.. మూడొందల టెస్టు వికెట్లను తీయడమంటే అంత తేలికైన విషయం కాదన్నాడు. కచ్చితంగా ఈతరం ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో అశ్వినే ముందువరుసలో ఉన్నాడనడానికి అతని ప్రదర్శనే కొలమానంగా పేర్కొన్నాడు. ఇంకా నాలుగైదేళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉన్న అశ్విన్ మరిన్నిరికార్డులను సాధిస్తాడని మురళీ జోస్యం చెప్పాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ (అశ్విన్‌కు 54వ టెస్టు మ్యాచ్)లో 300 వికెట్లు తీసి.. అత్యంత వేగవంతంగా ఈ రికార్డు సాధించిన బౌలర్‌గా అశ్విన్ ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే ఆసీస్ మాజీ పేసర్ డెన్నిస్లిల్లీ(56 టెస్టు మ్యాచ్‌లు) సాధించిన రికార్డును అశ్విన్ సవరించాడు. -
‘టీఎన్‌పీఎల్’లో మురళీధరన్
చెన్నై: ఐపీఎల్ సహా ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు లీగ్‌లలో భాగంగా ఉన్న దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ దిగువ స్థాయి క్లబ్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడానికి అంగీకారం తెలిపారు. మాజీ భారత క్రికెటర్ వీబీ చంద్రశేఖర్‌కు చెందిన తిరువళ్లూర్ వీరన్స్ జట్టుకు మురళీ తన అనుభవాన్ని పంచనున్నారు. జులైలో జరిగే ఈ లీగ్‌లో అన్ని మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉంటారని జట్టు యజమాని చంద్రశేఖర్ తెలిపారు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బౌలింగ్ కోచ్‌గా ఉన్న మురళీ, ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. -
నరేంద్ర మోదీ నోట నా పేరు విని..
- భారత ప్రధాని వ్యాఖ్యలపై శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఆశ్చర్యం హైదరాబాద్: ‘తమిళజాతి ఆణిముత్యం ముత్తయ్య మురళీధరన్..’ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నాడు శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్! ‘తన సందేశంలో నరేంద్ర మోదీ లాంటి గొప్ప నేత.. నా పేరు పలకడం గొప్ప అనుభూతి’ అని మురళీధరన్ అన్నాడు. రెండు రోజుల శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం డికోయా నగరంలో తమిళ ప్రజలను కలుసుకున్న నరేంద్ర మోదీ.. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంలోనే.. మురళీధరన్‌ను, దివంగత ఎంజీఆర్‌ను తమిళజాతి ఆణిముత్యాలుగా మోదీ కీర్తించారు. ప్రస్తుతం ఇండియాలోనే ఉన్న మురళీధరన్.. ఐపీఎల్-10లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన మురళీ.. మోదీ వ్యాఖ్యలపై స్పందించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అలాంటి దేశాన్ని నడిపిస్తోన్న నేత(మోదీ).. శ్రీలంకలో మా(తమిళ) కమ్యూనిటీని గురించి మాట్లాడటం గొప్పవిషయం’ అని మురళీ అన్నారు. శ్రీలంకకు భారత్ పెద్దన్నలాంటిదని, ఇరు దేశాలది గాఢానుబంధమని గుర్తుచేశాడు. ‘భారత్ నుంచి శ్రీలంకకు వెళ్లిన తమిళుల్లో నేను ఐదో తరం వాడిని. పెళ్లి కూడా చెన్నైకి చెందిన అమ్మాయినే చేసుకున్నా. నిజానికి ఇరు దేశాలది చాలా క్లోజ్ రిలేషన్. పేదల కోసం ఎన్నో పనులు చేస్తోన్న నరేంద్ర మోదీని.. అందరిలాగే మేము కూడా ఇష్టపడతాం. ఆయన పాపులారిటీ ఏంటో ఎన్నికలప్పుడే తెలిసింది’ అని మురళీధరన్ పేర్కొన్నారు. -
పొలార్డ్ కు మురళీధరన్ మద్దతు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా ముంబై ఇండియన్స్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ ఆటను తప్పుబడుతూ ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ స్పందించాడు. ఒక ఆటగాడ్ని బహిరంగంగా తప్పుబట్టడం ఎంతటి వారికైనా సరికాదంటూ పొలార్డ్ కు మురళీ మద్దతుగా నిలిచాడు. అసలు పొలార్డ్ టాపార్డర్‌లో ఫిట్ కాలేడంటూ మంజ్రేకర్ ఎలా నిర్ణయిస్తాడని మురళీ ప్రశ్నించాడు. దాదాపు 10ఏళ్ల క్రికెట్ లో అనుభవం ఉన్న పొలార్డ్ ను పరిమిత ఓవర్ల ఆటగాడని మంజ్రేకర్ వ్యాఖ్యానించడం సరైనది కాదని ఈ దిగ్గజ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. 'మంజ్రేకర్-పొలార్డ్‌ల వ్యవహారం కేవలం ఏ ఒక్క వ్యక్తికో సంబంధించినది కాదు. ఈ వివాదం చెలరేగడంలో ఇద్దరి పాత్ర ఉంది. టాపార్డర్ లో పొలార్డ్ పనికి రాడంటూ మంజ్రేకర్ వ్యాఖ్యానించకుండా ఉండాల్సింది. అలా చేయడం కచ్చితంగా ఒక ఆటగాడ్ని విమర్శించడమే. అందులోనూ బహిరంగంగా విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది. ట్వంటీ 20ల్లో ఏడువేల పరుగులకు దగ్గరగా ఉన్న ఆటగాడు టాపార్డర్ ఫిట్ కాలేడని మంజ్రేకర్ ఎలా అన్నాడు. అతను టాపార్డర్ లో సెట్ కాకపోతే అన్ని పరుగులు ఎలా చేస్తాడు. ఆ వ్యాఖ్యలు కచ్చితంగా బాధించేవిగా ఉన్నాయి. ఆ క్రమంలోనే మంజ్రేకర్ పై పొలార్డ్ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికాదు'అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో పొలార్డ్ కు మురళీ ధరన్ మద్దతుగా నిలిచాడు. మొన్న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో పొలార్డ్ ఔట్ అయిన సందర్భంలో... ఇన్నింగ్స్‌లో చివరి కొన్ని ఓవర్లకు మాత్రమే అతను పనికొస్తాడంటూ మంజ్రేకర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై పొలార్డ్ స్పందిస్తూ.. ‘నీ నోటి నుంచి సానుకూల మాటలు రావా. డబ్బులు ఇస్తారు కాబట్టి నీ నోటి దూలను కొనసాగించు. బుర్ర లేదని కూడా అన్నావు. మాటలు జాగ్రత్తగా వాడు. ఒక్కసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేం’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మురళీధరన్
దుబాయ్: శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో మురళీధరన్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని బుధవారం ఐసీసీ వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సాధించిన తొలి శ్రీలంక ఆటగాడిగా మురళీధరన్ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా మహిళల క్రి కెట్ జట్టు కెప్టెన్ కరేన్ రోల్టన్, ఆర్థర్ మోరీస్ (ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్), 19వ శతాబ్దపు మేటి బౌలర్ జార్జ్ లిహ్‌మన్ (ఇంగ్లండ్) కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
మురళీధరన్‌పై శ్రీలంక ఫిర్యాదు
కొలంబో: ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ వైఖరిపై ఆ దేశ క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భాగంగా పల్లెకిలా పిచ్‌ను రూపొందించే క్రమంలో మురళీధరన్ ఓవరాక్షన్ చేయడాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్రంగా తప్పుబట్టింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సలహాదారుగా ఉన్న మురళీధరన్.. శ్రీలంక క్రికెట్ మేనేజ్మెంట్ రూపొందించే పిచ్‌ల వ్యవహారంలో అనవసరపు జోక్యం చేసుకుంటున్నాడని మండిపడింది. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్కు శ్రీలంక జట్టు ఫిర్యాదు చేసింది. 'తొలి టెస్టు జరిగే పల్లెకిలె స్టేడియంలో పిచ్ ను తయారు చేస్తున్నప్పుడు అక్కడకు వచ్చిన మురళీధరన్ దురుసుగా ప్రవర్తించాడు. ఆ స్టేడియం నిర్వహాకులు మురళీని అడ్డుకున్నా వారిని తోసుకుంటూ లోనికి వచ్చాడు. ఈ క్రమంలో శ్రీలంక టీమ్ మేనేజర్ చరితా సేననాయకేతో తీవ్ర వాగ్విదానికి దిగాడు. ఒక జట్టుకు కన్సల్టెంట్‌గా ఉన్న వ్యక్తి, మరొక జట్టు పిచ్‌లు రూపొందించేటప్పుడు రావడం నిబంధనలకు విరుద్ధం. ఈ విధంగా మురళీ ప్రవర్తిస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. మరొకసారి ఈ తరహా ఘటన జరగదని అనుకుంటున్నాం. మురళీ వైఖరితో చాలా నిరూత్సాహానికి గురయ్యాం'అని శ్రీలంక క్రికెట్ జట్టు అధ్యక్షుడు తిలంగా సుమితపాలా సీఏకు ఫిర్యాదు చేశారు. రేపట్నుంచి ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. -
ఆస్ట్రేలియాకు ముత్తయ్య పాఠాలు
కొలంబో:ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు శ్రీలంక మాజీ దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాఠాలు చెప్పడానికి సిద్ధమయ్యాడు. త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్ గా వ్యవహరించేందుకు మురళీ ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ధృవీకరించాడు. 'ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మురళీ సలహాదారుడిగా వ్యవహరించనున్నాడు. దిగ్గజ స్పిన్నర్ తో సీఏ ఒప్పందం చేసుకుంది. మా యువ స్పిన్నర్లతో మురళీ పని చేస్తాడు. ఇప్పటికే శిక్షణా శిబిరంలో ఉన్న మా జట్టుతో మురళీ కలిశాడు. శ్రీలంక పిచ్ లపై మురళీకున్న ఆపార అనుభవం మాకు ఉపయోగపడుతుంది. దాంతో పాటు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో మురళీ అత్యధిక వికెట్లు సాధించాడు.అతనితో కలిసి పని చేయడం మా యువ స్పిన్నర్ల అదృష్టం'అని స్మిత్ తెలిపాడు. -
బీసీసీఐపై మురళీధరన్ మండిపాటు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తనకు రెండున్నర కోట్ల రూపాయలు(4 లక్షల డాలర్లు) చెల్లించాల్సి ఉందని శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తెలిపాడు. తమ దేశానికి చెందిన మహేల జయవర్ధనేకు రూ. 3 కోట్లు ఇవాల్సి ఉందని వెల్లడించాడు. గతేడాది గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ మొత్తానికి దూరమైన టీమిండియా ప్రధాన పేసర్ మొహ్మద్ షమీకి రూ.2 కోట్ల, 23 లక్షల పరిహారాన్ని బీసీసీఐ అంజేసింది. ఈ నేపథ్యంలో తమకు కూడా పరిహారం ఇవ్వాలని కొచ్చి టస్కర్స్ టీమ్ సభ్యులు కోరుతున్నారు. 'షమీకి బీసీసీఐ పరిహారం ఇచ్చింది. అవకాశముంటే కొచ్చి టస్కర్స్ ఆటగాళ్లకు కూడా పరిహారం ఇవ్వాల'ని ఈ జట్టు తరపున ఆడిన ఆస్ట్రేలియ క్రికెటర్ బ్రాడ్ హొడ్జ్ ట్విట్టర్ ద్వారా కోరాడు. దీని గురించి పలుమార్లు బీసీసీఐ అడిగినా ఫలితం లేకపోయిందని మురళీధరన్ చెప్పాడు. తాను చాలా లీగ్‌లు ఆడానని, బీసీసీఐ మాదిరిగా ఏ బోర్డు వ్యవహరించలేదని విమర్శించాడు. ఆటగాళ్లతో పాటు బోర్డు కూడా కాంట్రాక్టును గౌరవించాల్సిన అవసరముందన్నాడు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని, సమస్య పరిష్కారమైన తర్వాతే ఆటగాళ్లు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. వీవీఎస్ లక్ష్మణ్, రవీంద్ర జడేజా కూడా కొచ్చి టస్కర్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. -
'విరాట్‌ను ఎవరూ ఆపలేరు'
కోల్‌కతా: ప్రస్తుతం అసాధారణ ఫామ్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లినీ నియంత్రిచడం ఎవరికీ సాధ్యం కాదని శ్రీలంక మాజీ ఆటగాడు, టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డాడు. గత రెండు సంవత్సరాల నుంచి అత్యుద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న విరాట్ చాలాకాలం ఇదే ఊపును కొనసాగించే అవకాశం ఉందని మురళీ పేర్కొన్నాడు. ఒక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోనే కాదు, అంతర్జాతీయ క్రికెట్లో కూడా తనదైన ముద్రతో కొనసాగిస్తూ దూసుకుపోతున్న విరాట్‌ను నిలువరించడం అంత సులభతరం కాదన్నాడు.ప్రస్తుతం విరాట్ తన కలను సాకారం చేసుకునే క్రమంలో మధ్యలో మాత్రమే ఉన్నాడని, ఇంకా సుదీర్ఘ దూరం ప్రయాణించి మరిన్ని రికార్డులు నెలకొల్పుతాడని ఆశిస్తున్నట్లు మురళీధరన్ తెలిపాడు. యువ క్రికెటర్లను సానబట్టేందుకు క్రికెట్ అసోసియేషన్ బెంగాల్(క్యాబ్) రూపొందించిన ' విజన్ 2020' కార్యక్రమానికి హాజరైన మురళీ ధరన్.. విరాట్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రపంచంలోని విరాట్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని కొనియాడాడు. -
'ఆ ఇద్దరి బౌలర్లకు మాత్రమే భయపడేవాణ్ని'
న్యూఢిల్లీ: దూకుడైన బ్యాటింగ్‌తో ఎందరో బౌలర్లకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్.. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో స్పిన్ బౌలర్లు ముత్తయ్య మురళీధరన్, హర్భజన్ సింగ్‌ల మాత్రమే భయపడ్డానని చెప్పాడు. ఢిల్లీకి వచ్చిన గిల్‌క్రిస్ట్.. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా కొంతమంది పిల్లలు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎవరి బౌలింగ్‌కు భయపడేవారన్న ప్రశ్నకు ఆసీస్ మాజీ కీపర్ సమాధానమిస్తూ.. మురళీ, భజ్జీలకు అని చెప్పాడు. మురళీ వేసే స్పిన్ బంతులను అంచనా వేయలేకపోయేవాడినని, 10 ఏళ్ల పిల్లాడిలా తికమకపడేవాడినని నాటి సంగతులు వెల్లడించాడు. 'ఓ టెస్టు మ్యాచ్‌లో మురళీ వేసిన తొలి బంతిని ఫోర్ బాదాను. రెండో బంతిని షాట్ ఆడబోగా, గాల్లోకి లేచింది. అంతే క్యాచ్ అవుటయ్యాను. తర్వాతి మ్యాచ్‌లో మురళీ బౌలింగ్‌లో తొలి బంతికే అవుటయ్యాను' అని గిల్ క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. తనతో పాటు సహచర క్రికెటర్ మైకేల్ హస్సీ కూడా మురళీ బౌలింగ్‌లో ఆడేందుకు ఇబ్బందిపడేవాడని చెప్పాడు. -
ఆ ఇద్దరికి భయపడేవాణ్ని: ద్రవిడ్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ లో మిస్టర్ డిపెండబుల్ గా పేరు గాంచిన రాహుల్ ద్రవిడ్ ప్రధానంగా ఇద్దరు బౌలర్లు అంటే భయపడేవాడట. తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఆసీస్ మాజీ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ బౌలింగ్ అత్యంత క్లిష్టంగా ఉండేదని ద్రవిడ్ తాజాగా స్పష్టం చేశాడు. ప్రత్యేకంగా మెక్ గ్రాత్ ఆఫ్ స్టంప్ వేసే బంతుల్ని అంచనా వేయడం చాలా కఠినంగా ఉండేదన్నాడు. తనకు ఎదురైన ఫాస్ట్ బౌలర్లలో అతనే అత్యంత ప్రమాదకారి బౌలర్ గా ద్రవిడ్ పేర్కొన్నాడు. అయితే స్పిన్ బౌలర్ల విషయానికొస్తే శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీ ధరన్ బౌలింగ్ చాలా బిగుతుగా ఉండేదన్నాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో అభిమానులతో ముచ్చటించిన ద్రవిడ్ తన క్రికెట్ కెరీర్ కు సంబంధించి పలు విషయాలను పంచుకున్నాడు. 'మెక్ గ్రాత్ నిజంగా ఒక గొప్ప బౌలర్. నేను ఎదుర్కొన్న ఫాస్ట్ బౌలర్లలో అతను అత్యంత క్లిష్టమైన బౌలర్. మెక్ గ్రాత్ ఆఫ్ స్టంప్ అవతల వేసే బంతులు ఎలా వస్తున్నాయో తెలిసేది కాదు. అతను తొలి ఓవర్ మొదలుకొని ఎప్పుడూ బౌలింగ్ వేసినా ఒకేరకమైన దూకుడు ఉండేది. స్లో బౌలర్లలో మురళీ ధరన్ బౌలింగ్ ను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అతను వేసే దూస్రాలను ఆడటం ఒక సవాల్. మురళీ రెండు వైపుల బంతిని బాగా స్పిన్ చేసే వాడు. గింగిరాలు తిరుగుతూ వచ్చే అతని బంతులు అఅంచనా వేయడం నాకు కత్తిమీద సాము మాదిరిగా ఉండేది. ఎప్పుడూ నిలకడగా బౌలింగ్ చేసే మురళీని ఎదుర్కొవడానికి చాలా శ్రమించేవాడిని' అని ది వాల్ ద్రవిడ్ తెలిపాడు.