
చెన్నై: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా సినిమా రూపొందనుంది. ఎంఎస్ శ్రీపతి దీనికి దర్శకత్వం వహించనుండగా...మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తాయి. ‘సైరా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ సేతుపతి దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ పాత్రలో కనిపిస్తాడు. మురళీధరన్ టెస్టుల్లో తీసిన 800 వికెట్లను గుర్తు చేసే విధంగా సినిమా టైటిల్ కూడా ‘800’ అని పెట్టారు.
వన్డేల్లో కూడా మురళీధరన్ 534 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నేడు జరిగే చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌కు ముందు ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. మురళీ బయోపిక్‌కు ప్రధానంగా తమిళంలో రూపొందించి ఇతర భారతీయ భాషలతో పాటు సింహళీస్‌లో కూడా అనువదిస్తారు. భారత్‌తో పాటు శ్రీలంక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో సినిమాను షూట్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment