
సాక్షి, చెన్నై : గతకొన్ని రోజులుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన శ్రీలంక మాజీ స్పినర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌పై వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వరుస వివాదాలు, విమర్శల నేపథ్యంలో మురళీధరన్ బయోపిక్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించి.. విమర్శలకు చెక్‌పెట్టారు. వివరాల ప్రకారం.. ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వంలో 800 పేరుతో మురళీధరన్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మురళీధరన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలో ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. (వివాదంలో 800: స్పందించిన మురళీధరన్)
ఈ నేపథ్యంలో శ్రీలంక మతవాదానికి పూర్తిగా మద్దతు పలికిన నమ్మకద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రంలో విజయ్ సేతుపతి నటించవద్దంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలోని ప్రముఖలు సైతం విజయ్‌కు సూచించారు. బడా నిర్మాతలు, దర్శకుల నుంచి విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. మురళీధరన్ బయోపిక్‌పై తమిళ సంఘాలూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. శ్రీలంకలో తమిళులను ఊచకోతకోసిన 2009 ఏడాది తనక అత్యంత సంతోషకరమైనది వ్యాఖ్యానించిన తమిళుల వ్యతిరేకి చిత్రంలో నటించవద్దని నిరసన వ్యక్తం చేశాయి. విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతారాంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే బయోపిక్‌కు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై మురళీధరన్ ఓ లేఖ విడుదల చేశారు. తమిళుల తీరును తప్పుబడ్డారు. దీంతో వివాదం కాస్తా పెద్దదిగా మారడంతో 800 బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి ప్రకటించారు.
ముత్తయ్య లేఖ..
తాజా వివాదం నేపథ్యంలో ముత్తయ్య మురళీధరన్ ఓ లేఖ విడుదల చేశారు. 2009 అల్లర్లపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు. ఎంతోకష్టపడి అంతర్జాతీయ క్రికెట్‌లో 800కు పైగా వికెట్స్ సాధించిన తన చిత్రాన్ని అడ్డుకోవడం సరైనది కాదని తమిళలు తీరును ఖండించారు. శ్రీలంకలో పుట్టడమే తాను చేసిన తప్పా అని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కుట్రపూరితంగానే కొన్ని రాజకీయ శక్తులు ప్రజలను ఉసిగొళ్పాయని లేఖలో పేర్కొన్నారు. అమాయక ప్రజలకు చంపడం ఎవరికీ సంతోషకరమైన విషయం కాదని, ఆ ఏడాది యుద్ధం యుగియడంతో ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment