విజయ్‌ @ 800 | Vijay Sethupathi to play Muttiah Muralitharan in biopic | Sakshi
Sakshi News home page

విజయ్‌ @ 800

Published Thu, Jul 25 2019 6:07 AM | Last Updated on Thu, Jul 25 2019 6:07 AM

Vijay Sethupathi to play Muttiah Muralitharan in biopic - Sakshi

క్రికెట్‌ ప్రపంచంలో శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ పేరు తెలియనివారు ఉండకపోవచ్చు. టెస్ట్, వన్‌ డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత ముత్తయ్య పేరు మీదనే ఉంది. ఇటీవల క్రీడాకారుల జీవితాలు వెండితెరపైకి వస్తున్న నేపథ్యంలో తాజాగా ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ తెరపైకి వచ్చింది. ఈ బయోపిక్‌లో ముత్తయ్యగా విజయ్‌ సేతుపతి నటించబోతున్నారు. ఈ సినిమాకు శ్రీపతి రంగస్వామి దర్శకుడు. ‘‘ముత్తయ్య మురళీధరన్‌ తమిళ సంతతికి చెందిన సూపర్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌.  స్పిన్నర్‌గా ప్రపంచఖ్యాతి గడించారు. అతని పాత్రలో నటించడం నాకు సవాల్‌ లాంటిది.

ముత్తయ్య మురళీధరన్‌గారు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం, స్వయంగా నాకు క్రికెట్‌ టిప్స్‌ చెప్పడం సంతోషంగా ఉంది. నన్ను నమ్మిన మురళీధరన్‌కు, నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు విజయ్‌ సేతుపతి. ‘‘విజయ్‌ సేతుపతి వంటి నటుడు నా పాత్రలో నటించడం హ్యాపీ’’ అన్నారు మురళీధరన్‌. టెస్ట్‌ క్రికెట్‌లో ఎనిమిది వందల వికెట్లు తీసిన బౌలర్‌ రికార్డు మురళీధరన్‌ సొంతం. సో.. ఈ సినిమాకు ‘800’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట టీమ్‌. ఈ చిత్రాన్ని థార్‌ మోషన్‌ పిక్చర్స్‌ నిర్మించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement