చెన్నై: ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తలపెట్టిన బయోపిక్ 800 తమిళనాట పెను వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలు ప్రముఖ దర్శకుడు భారతీ రాజా వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విజయ్ సేతుపతిని ఈ సినిమాలో నటించవద్దని కోరారు. చివరకు మురళీధరన్ కూడా తన బయోపిక్ కోసం కెరీర్‌ని నాశనం చేసుకోవద్దంటూ విజయ్‌ని కోరడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఆ తర్వాత కూడా విజయ్ కుమార్తెకి అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ దర్శకుడు ఆర్ సీను రామసామి తాను కూడా బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. జీవితం ప్రమాదంలో పడింది సాయం చేయండి అంటూ ముఖ్యమంత్రి పళని స్వామిని కోరుతున్నారు. సినిమా నుంచి తప్పుకోవాల్సిందిగా విజయ్ సేతుపతిని కోరిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు రావడం ప్రారంభం అయ్యిందని తెలిపారు.
ఈ సందర్భంగా రామసామి మాట్లాడుతూ.. ‘చాలా మందిలాగే నేను కూడా విజయ్ సేతుపతిని 800 సినిమా నుంచి వైదొలగాలని కోరాను. ఆ తర్వాత కొద్ది రోజులకు విజయ్ కుమార్తె లాగే నాకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. నోటితో పలకలేని పదాలను ఉపయోగించారు. వాట్సాప్ ఒపెన్ చేయాలంటేనే ఒణుకుపుడుతుంది’ అన్నారు. అలానే ఈ బెదిరింపుల వెనక విజయ్ ఫ్యాన్స్ ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తమ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బెదిరింపుల నేపథ్యంలో రోడ్డు మీద నడవాలన్న భయంగా ఉందన్నారు. దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ.. దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. (విమర్శలకు చెక్: విజయ్ అనూహ్య నిర్ణయం)
ఇక 800 చిత్రం ప్రకటించిన నాటి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. తమిళ ద్రోహి చిత్రంలో ఎలా నటిస్తారంటూ విజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించవద్దంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలోని ప్రముఖలు సైతం విజయ్‌కు సూచించారు. శ్రీలంకలో తమిళులను ఊచకోతకోసిన 2009 ఏడాది తనక అత్యంత సంతోషకరమైనది వ్యాఖ్యానించిన తమిళుల వ్యతిరేకి చిత్రంలో నటించవద్దని నిరసన వ్యక్తం చేశాయి. విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతారాంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే బయోపిక్‌కు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై మురళీధరన్ ఓ లేఖ విడుదల చేశారు. తమిళుల తీరును తప్పుబడ్డారు. దీంతో వివాదం కాస్తా పెద్దదిగా మారడంతో 800 బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment