Seenu Ramasamy
-
నాతో సన్నిహితంగా ఉండాలని చూశాడు.. అందుకే: హీరోయిన్
వివాదస్పద నటిగా ముద్ర వేసుకున్న నటి మనీషా యాదవ్. బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన వళక్కు ఎన్ 18/9 చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అలా ఒరు కుప్పం కాదల్‌తో పాటు పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా దర్శకుడు శీను రామసామి దర్శకత్వంలో ఇదమ్ పొరుల్ యావళ్ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేశాక.. ఊహించని విధంగా మూవీ నుంచి తొలగించారు. దీనికి ప్రధాన కారణం ఆమె సహకరించడం లేదని.. తనను ఇబ్బందులకు గురి చేశారన్నది డైరెక్టర్ ఆరోపించారు. లైంగిక ఆరోపణలు.. అయితే 'ఇదం పొరుల్ యావల్' సినిమా సమయంలో నటి మనీషా యాదవ్‌పై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని దర్శకుడు శీను రామసామిపై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె స్థానంలో నందితా శ్వేత ఈ చిత్రంలో నటించారు. అయితే ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అయితే ఇటీవలే ఆమె మరోసారి రామస్వామి చిత్రంలో నటించనుందంటూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మనీషా యాదవ్ స్పందించింది. అలాంటి వారితో సినిమాలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇటీవలే ఓ పాత్ర కోసం మనీషాను సంప్రదించారన్న ప్రశ్నకు కాస్తా ఘాటుగానే బదులిచ్చింది. మనీషా మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం శీను రామస్వామి ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆయన కొత్త సినిమాలో నటిస్తావా అని అడిగారు. తాను ఆ చిత్రంలో నటించనని మొహం మీదే చెప్పేశా. కానీ'ఇదం పొరుల్ యేవల్' మూవీ సమయంలో అతను ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉంది. తప్పుడు ఉద్దేశ్యంతో చాలాసార్లు సన్నిహితంగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ నేను అతని కోరికలను అంగీకరించలేదు. అందుకే నన్ను సినిమా నుంచి తప్పించాడు. నాపై తప్పుడు ప్రచారం చేశాడు. నాకు నటించడం తెలియదని సినీ పరిశ్రమలో దుష్ప్రచారం చేశాడని' తెలిపింది తాను పెద్ద దర్శకులతోనే చాలా చిత్రాలు చేశానని.. అయితే ప్రతిభ ఉన్నా.. ఇలాంటి మానవత్వం లేని దర్శకుల చిత్రాలలో నటించాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. 'ఒరు కుప్ప కథై' ఆడియో లాంఛ్ కార్యక్రమంలో అందరిలాగే మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించింది. అంతే కానీ ఆయన సినిమాలో నటించడం జరగదన్నారు. తనకు మంచి భర్త, కుటుంబం, స్నేహితులు ఉన్నారని నటి మనీషా యాదవ్ పేర్కొంది. నాలాంటి కొత్త హీరోయిన్లకు ఇలాంటి చెడు అనుభవాలు ఎప్పుడూ ఎదురు కాకూడదని అన్నారు. அனைவருக்கும் இனிய தீபாவளி வாழ்த்துக்கள்.. ✨🪔 pic.twitter.com/QleYnFArIm — Manisha Yadav (@ManishaYadavS) November 13, 2023 -
ఆ హీరో ఫ్యాన్స్‌తో నాకు ప్రమాదం..
చెన్నై: ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తలపెట్టిన బయోపిక్ 800 తమిళనాట పెను వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలు ప్రముఖ దర్శకుడు భారతీ రాజా వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విజయ్ సేతుపతిని ఈ సినిమాలో నటించవద్దని కోరారు. చివరకు మురళీధరన్ కూడా తన బయోపిక్ కోసం కెరీర్‌ని నాశనం చేసుకోవద్దంటూ విజయ్‌ని కోరడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఆ తర్వాత కూడా విజయ్ కుమార్తెకి అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ దర్శకుడు ఆర్ సీను రామసామి తాను కూడా బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. జీవితం ప్రమాదంలో పడింది సాయం చేయండి అంటూ ముఖ్యమంత్రి పళని స్వామిని కోరుతున్నారు. సినిమా నుంచి తప్పుకోవాల్సిందిగా విజయ్ సేతుపతిని కోరిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు రావడం ప్రారంభం అయ్యిందని తెలిపారు. ఈ సందర్భంగా రామసామి మాట్లాడుతూ.. ‘చాలా మందిలాగే నేను కూడా విజయ్ సేతుపతిని 800 సినిమా నుంచి వైదొలగాలని కోరాను. ఆ తర్వాత కొద్ది రోజులకు విజయ్ కుమార్తె లాగే నాకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. నోటితో పలకలేని పదాలను ఉపయోగించారు. వాట్సాప్ ఒపెన్ చేయాలంటేనే ఒణుకుపుడుతుంది’ అన్నారు. అలానే ఈ బెదిరింపుల వెనక విజయ్ ఫ్యాన్స్ ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తమ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బెదిరింపుల నేపథ్యంలో రోడ్డు మీద నడవాలన్న భయంగా ఉందన్నారు. దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ.. దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. (విమర్శలకు చెక్: విజయ్ అనూహ్య నిర్ణయం) ఇక 800 చిత్రం ప్రకటించిన నాటి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. తమిళ ద్రోహి చిత్రంలో ఎలా నటిస్తారంటూ విజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించవద్దంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలోని ప్రముఖలు సైతం విజయ్‌కు సూచించారు. శ్రీలంకలో తమిళులను ఊచకోతకోసిన 2009 ఏడాది తనక అత్యంత సంతోషకరమైనది వ్యాఖ్యానించిన తమిళుల వ్యతిరేకి చిత్రంలో నటించవద్దని నిరసన వ్యక్తం చేశాయి. విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతారాంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే బయోపిక్కు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై మురళీధరన్ ఓ లేఖ విడుదల చేశారు. తమిళుల తీరును తప్పుబడ్డారు. దీంతో వివాదం కాస్తా పెద్దదిగా మారడంతో 800 బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి ప్రకటించారు. -
జోడీ కుదరలేదు
ప్రభుదేవా, తమన్నా మరో సినిమా చేస్తు్తన్నారు. గతేడాది వచ్చిన హారర్ కామెడీ ‘అభినేత్రి’లో వీళ్లిద్దరూ జంటగా నటించిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే... ఈసారి జోడీ కుదరలేదు. ఆశ్చర్యంగా ఉందా? మరేం లేదు. ఇందులో ప్రభుదేవా విలన్‌గా నటిస్తున్నారు. మరి, హీరో ఎవరంటే.. ఎవరూ లేరు. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ కదా, తమన్నాదే మెయిన్ క్యారెక్టర్. సో.. తనే హీరో కింద లెక్క. తమిళంలో నయనతార నటిస్తున్న ‘కొలైవుదిర్ కాలమ్’ సినిమా హిందీ రీమేక్‌లోనే ప్రభుదేవా–తమన్నా నటించనున్నారు. చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్న ‘కొలైవుదిర్...’ ఇంకా విడుదల కాలేదు. కానీ, హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనతో దర్శక–నిర్మాతలు ప్రభుదేవా, తమన్నాలకు కథ వినిపించగా... గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆల్రెడీ లండన్‌లో షూటింగ్ ప్రారంభమైంది. హిందీ వెర్షన్‌కూ చక్రి తోలేటియే దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార పాత్రను హిందీలో తమన్నా చేస్తున్నారు. సంగీత దర్శకుడు యువన్‌శంకర్ రాజాతో కలసి ‘కొలైవుదిర్ కాలమ్’ను నిర్మిస్తున్న వశూ భగ్నానీయే హిందీ చిత్రానికి కూడా నిర్మాత. ‘‘ఫస్ట్ టైమ్ నేను విలన్‌గా నటిస్తున్నాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు విభిన్నంగా ఉంటుంది. ఎవరూ ఊహించని పాత్రలో కనిపిస్తా’’ అన్నారు ప్రభుదేవా. సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా కూడా హిందీ వెర్షన్లో ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇది కాకుండా... తమిళ దర్శకుడు శీను రామసామి.. ప్రభుదేవా, తమన్నా జంటగా ఓ సినిమా తీయాలనుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. మరి, ఆ సినిమా ఏమైందో?