
అమరావతి, సాక్షి: నటుడు పోసాని కృష్ణమురళి తరఫున వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై మరికాసేపట్లో ఏపీ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. పోసానిపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు), మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. ఈ పిటిషన్ విచారణ కంటే ముందే.. కర్నూలు జైలు నుంచి సీఐడీ పోలీసులు పోసానిని గుంటూరుకు తరలిస్తుండడం గమనార్హం.
పోసానిపై దాఖలైన అన్ని కేసుల్లోనూ కస్టడీ పిటిషన్లను తిరస్కరించిన న్యాయస్థానాలు.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చాయి. అంతేకాదు.. పలు జిల్లాలో దాఖలైన కేసులనూ హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తరుణంలో ఈ ఉదయం ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల అవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా..
ఏపీ సీఐడీ తెర మీదకు వచ్చింది. ఐదు నెలల కిందట దాఖలైన కేసును పట్టుకుని గుంటూరు కోర్టు నుంచి పీటీ వారెంట్ పొందింది. ఈ ఉదయం కర్నూల్ జిల్లా జైలుకు పీటీ వారెంట్‌తో చేరుకుంది. ఇది పోసానిని బయటకు రాకుండా చేసే కుట్రేనని పేర్కొన్న వైఎస్సార్‌సీపీ.. హైకోర్టులో సదరు పీటీ వారెంట్‌ను సవాల్ చేసింది.

Comments
Please login to add a commentAdd a comment