Crime Investigation Department
-
రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్!
సాక్షి, అమరావతి: ‘మీకూ మీ రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఓ దండం.. నిబంధనలకు విరుద్ధంగా పని చేయడం నా వల్ల కాదు.. అక్రమ కేసులు, వేధింపులకు నేను పాల్పడ లేను..’ అని సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ తేల్చి చెప్పారు. అదంతా కాదు.. తాము చెప్పింది చేయాల్సిందేనని, నిబంధనలు జాన్తానై అంటూ డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ హుకుం జారీ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పడంతో ఆ ఉన్నతాధికారులు హడలిపోయారు. దాంతో తమ పుట్టి మునుగుతుందని హడలిపోయిన డీజీపీ, సీఐడీ చీఫ్ చాలాసేపు సర్ది చెప్పడంతో అతి కష్టం మీద రాజీనామా విషయంలోబ్రిజ్లాల్ వెనక్కి తగ్గారు. రెడ్‌బుక్(Redbook) వేధింపులకు పాల్పడలేనని స్పష్టం చేస్తూ సెలవుపై వెళ్లిపోయారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఉదంతం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తమ రెడ్‌బుక్ రాజ్యాంగ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం(Ration rice) అక్రమ రవాణా అవుతోందని గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. ముందస్తు పన్నాగంతో మంత్రి నాదేండ్ల మనోహర్ (Nadendla Manohar) ద్వారా కుట్రకు తెరతీసి.. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ‘సీజ్ ద షిప్’ డ్రామాను రక్తి కట్టించేందుకు యత్నించింది. కాగా, కేంద్ర కస్టమ్స్ అధికారులు నిబంధనలకు కట్టుబడటంతో టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం కుట్ర బెడిసికొట్టింది. దాంతో చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు కేసును తమ ఆధీనంలోని సీఐడీకి అప్పగించింది. అందుకోసం నియమించిన సిట్‌కు సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను చీఫ్‌గా నియమించింది. సిట్ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులను నియమించింది. కానీ ఒక్క రోజులోనే వారిని మార్చి పూర్తిగా తమ మాట వినే అధికారులను నియమించింది. అనంతరం వినీత్ బ్రిజ్‌లాల్ కాకినాడలో పర్యటించిన పోర్టు, గోదాములు మొదలైన వాటిని పరిశీలించి వచ్చారు. తాను గుర్తించిన వాస్తవ విషయాలతో నివేదిక రూపొందించేందుకు ఉపక్రమించారు. పెద్దలు చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాలి తాము అనుకున్న రీతిలో నివేదిక సిద్ధం కావడం లేదని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు.. పోలీసు పెద్దకు దిశా నిర్దేశం చేయడంతో అసలు కుట్రకు తెరలేచింది. ఈ నేపథ్యంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్.. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను పిలిచి మాట్లాడారు. తాము చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ‘క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విషయాలతో పని లేదు.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందా లేదా అన్నదానితో నిమిత్తం లేదు. జరిగినట్టు నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లు చెబుతారో వారిని బాధ్యులుగా పేర్కొనాలి’ అని ఆదేశించినట్టు తెలుస్తోంది. సీఐడీ చీఫ్ ఆదేశాలను వినీత్ బ్రిజ్‌లాల్ నిర్ద్వందంగా తిరస్కరించారు. తాను క్షేత్ర స్థాయిలో కనుగొన్న వాస్తవ విషయాలతోనే నివేదిక రూపొందిస్తానని స్పష్టం చేశారు. అలా అయితే కుదరదని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే నివేదిక ఇచ్చి తీరాలని సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దీనిపై వినీత్ బ్రిజ్‌లాల్ తీవ్రంగానే స్పందించినట్టు తెలుస్తోంది. డీజీపీదీ అదే మాట.. బ్రిజ్‌లాల్ వైఖరిని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో బ్రిజ్‌లాల్‌ను డీజీపీ తన చాంబర్‌కు పిలిపించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మరోసారి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని ఆదేశించారు. బ్రిజ్‌లాల్ మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వనని తేల్చి చెప్పారు. అంతేకాదు తనకు పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిబంధనల మేరకే పని చేస్తున్నానన్నారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూముల కుంభకోణంపై నియమించిన సిట్‌కు నేతృత్వం వహించానని, అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏవోబీలో గంజాయి నిర్మూలనకు సెబ్ కమిషనర్‌గా పని చేశానని చెప్పారు. విశాఖపట్నంలో భూముల కుంభకోణంలో ప్రమేయం ఉన్న అప్పటి టీడీపీ మంత్రిపై చర్యలు తీసుకోని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. ఆయన వాదనను ఏమాత్రం వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాల్సిందేనని డీజీపీ, సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన బ్రిజ్‌లాల్ ఇలా అయితే తాను ఏకంగా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి బయటకు వచ్చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని కూడా డీజీపీకి సమర్పించినట్టు సమాచారం. దాంతో డీజీపీ, సీఐడీ చీఫ్ హడలిపోయారు. ఈ వ్యవహారం బయటకు పొక్కితే తాము ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించారు. ఆ మర్నాడు మళ్లీ బ్రిజ్‌లాల్‌ను పిలిపించి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అతి కష్టం మీద అందుకు సమ్మతించిన ఆయన తాను మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం కావడంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు.త్వరలో సిట్ చీఫ్‌గా మరొకరు! తమ కుట్రలకు వినీత్ బ్రిజ్‌లాల్ ససేమిరా అనడంతో ఆయన స్థానంలో సిట్ చీఫ్‌గా మరొకర్ని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి గ్రేహౌండ్స్‌కు బదిలీ చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెలవు నుంచి వచ్చిన తర్వాత ఆయన్ను బదిలీ చేస్తారని సమాచారం. కాగా, వినీత్ బ్రిజ్‌లాల్ ఉదంతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల కక్ష సాధింపు కుట్రలకు పోలీసు వ్యవస్థను భాగస్వామిని చేస్తున్న పోలీసు ఉన్నతాధికారుల తీరుపై యంత్రాంగం తీవ్రంగా మండిపడుతోంది. ఉన్నత పదవులు పొందేందుకు, రిటైరైన తర్వాత కూడా పదవులు పొందేందుకు యావత్ పోలీసు వ్యవస్థను ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేసే వ్యవస్థగా మార్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పోలీసు అధికారులు బలవుతున్నా, వారికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నా.. పట్టించుకోని ఉన్నతాధికారులు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారని పోలీసు వర్గాలు దుయ్యబడుతున్నాయి. చదవండి: చెప్పారంటే.. చేయరంతే!డీజీపీ కావాలనే లక్ష్యంతో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, డీజీపీగా పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాకపోవడంతో రిటైరైన తర్వాత ఆర్టీసీ ఎండీగా పోస్టింగు లక్ష్యంగా ద్వారకా తిరుమలరావు పని చేశారన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గక బ్రిజ్‌లాల్ నిబద్ధతతో వ్యవహరించడాన్ని ప్రశంసిస్తున్నాయి. -
అబద్ధపు వాంగ్మూలాలకు ఒత్తిళ్లు
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు సర్కారు అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ కీలక నేతలను వేధించే కుట్రలను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా సీఐడీ వ్యవస్థను దుర్వినియోగం చేయడంతోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను రాజ్యాంగేతర శక్తిలా వాడుకుంటోంది. అక్రమంగా నమోదు చేసిన మద్యం కేసులో అధికారులపై బెదిరింపులకు పాల్పడుతోంది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితోపాటు సంస్థలో గతంలో పని చేసిన సత్యప్రసాద్ నుంచి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బరి తెగిస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వారిని వేధిస్తోంది. అబద్ధపు వాంగ్మూలాలు తీసుకోండి..అక్రమ కేసులు బనాయించండి త్వరలోనే కొందరు కీలక నేతలను అరెస్ట్ చేస్తామని మంత్రి నారా లోకేశ్ ఇటీవల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయనేమీ ముఖ్యమంత్రి కాదు.. హోంమంత్రి కూడా కాదు. లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. పోలీసు శాఖ, సీఐడీ విభాగం, ఇతర దర్యాప్తు సంస్థలు ఆయన అధికారిక పరిధిలోకి రావు. అలాంటప్పుడు కొందరు వైఎస్సార్సీపీ నేతలను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన ఎలా ప్రకటించారన్నది కీలకంగా మారింది. అక్రమ కేసులు నమోదు చేసి వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేయాలని లోకేశ్ పోలీసు శాఖపై ఒత్తిడి తెస్తున్నారన్నది దీనిద్వారా స్పష్టమవుతోంది. తాము అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా వైఎస్సార్సీపీ కీలక నేతలను అక్రమ కేసుల్లో ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసు శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఏసీబీ అదనపు డీజీ అతుల్ సింగ్ తదితరులపై లోకేశ్ చిందులు తొక్కారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ తరువాతే అక్రమ కేసుల కుట్రను సీఐడీ వేగవంతం చేసింది. సోషల్ మీడియా కార్యకర్తలపై వందల సంఖ్యలో అక్రమ కేసులు నమోదు చేసి తీవ్ర వేధింపులకు పాల్పడి అరాచకం సృష్టించింది. ఈ క్రమంలో నారా లోకేశ్ మరోసారి వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టుల గురించి సీఐడీ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డిలతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు సీఐడీకి స్పష్టం చేశారని తెలుస్తోంది. ఆ బాధ్యతను సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్తోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌కు అప్పగించినట్టు సమాచారం.నెలాఖరుకల్లా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాల్సిందే...ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్ వేధింపుల కుట్రను తీవ్రతరం చేశారు. మద్యం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి పాత్ర ఉందని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈమేరకు బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేరెడ్డి, ఆ సంస్థ మాజీ ఉద్యోగి సత్యప్రసాద్‌లను తీవ్రంగా వేధిస్తున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలను 164 సీఆర్పీసీ కింద ఈ నెలాఖరు కల్లా నమోదు చేయాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేశారు. అలా చేస్తే ఢిల్లీలో కీలక పోస్టింగు ఇస్తామని లేదంటే ఇప్పటికే వాసుదేవరెడ్డిపై నాలుగు అక్రమ కేసులు నమోదు చేశామని..ఇక ముందు మరిన్ని బనాయిస్తామని బెదిరిస్తున్నారు. అక్రమ కేసు నమోదు చేసి కనీసం రెండేళ్లపాటు జైలులో ఉంచుతామని ఘట్టమనేని శ్రీనివాస్ బెదిరించడం ప్రభుత్వ కుట్రలకు తార్కాణం. నెలాఖరునాటికి వారిద్దరితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించడమే లక్ష్యంగా సీఐడీ అధికారులు, ఘట్టమనేని శ్రీనివాస్ వేధింపులను తీవ్రతరం చేశారు. దీని వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందన్నది స్పష్టం. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్‌తోపాటు యావత్ పోలీసు, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తమను బెదిరిస్తున్న తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ సిద్ధమవుతున్నారని సమాచారం. -
చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మెదపని సీఐడీ
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును అటకెక్కించేసిన సీఐడీ ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ అదే రీతిన వ్యవహరించింది. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గట్టిగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ఇప్పుడు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోయింది. స్కిల్ కుంభకోణం కేసులో చార్జిషీట్లు దాఖలు చేసేశామన్న సీఐడీ.. ఇక చేసేదేమీ లేదన్నట్టు సుప్రీంకోర్టు ముందు వ్యవహరించింది. దీంతో దర్యాప్తు సంస్థ అయిన సీఐడీనే చంద్రబాబు బెయిల్ రద్దు విషయంలో అసహాయత వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరించింది. స్కిల్ కుంభకోణం కేసు విచారణకు అవసరమైన సమయంలో సహకరించాలని సీఎం చంద్రబాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.చంద్రబాబే సీఎం కావడంతో మారిన సీన్చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా రూ.వందల కోట్లు దారి మళ్లాయి. షెల్ కంపెనీల ద్వారా విదేశీ ఖాతాలకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి టీడీపీ అధికారిక ఖాతాల్లోకి ఆ నిధులు వచ్చాయి. దీనిపై గత ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ ప్రాథమిక విచారణ జరిపి నిధుల మళ్లింపు వాస్తవమేనని తేల్చింది. ఇందుకు గాను చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు 2023 నవంబర్‌లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీఐడీ అదే నెలలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరింది. తమ తరఫున వాదనలు వినిపించేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని నియమించుకుంది. దీనిపై అప్పటినుంచి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది. ఈ మధ్యలో ప్రభుత్వం మారడం.. స్కిల్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబే ముఖ్యమంత్రి కావడంతో సీఐడీ తన దర్యాప్తును అటకెక్కించేసింది. చార్జిషీట్ల దాఖలులో అసాధారణ జాప్యం చేసింది. స్కిల్ కుంభకోణం కేసును ఎన్ని రకాలుగా నీరుగార్చాలో అన్ని రకాలుగా నీరుగార్చేందుకు చర్యలు తీసుకుంది.జోక్యం అవసరం లేదన్న సీఐడీతాజాగా బుధవారం సీఐడీ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హైకోర్టు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి మరీ తీర్పునిచ్చిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాలేదు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశామని, అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్‌పై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మాత్రమే సీఐడీ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ, చార్జిషీట్ దాఖలు చేసినందున చంద్రబాబు బెయిల్ విషయంలో ఇప్పుడు తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. సీఐడీ పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. -
ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ వాంగ్మూలం రీరికార్డింగ్!
సాక్షి, అమరావతి : చంద్రబాబుపై అవినీతి కేసులను నీరుగార్చడమే ఏకైక కర్తవ్యంగా భావిస్తున్న సీఐడీ అందుకు చర్యలు వేగవంతం చేసింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్ర మాలను ఆధారాలతో సహా వెల్లడించిన అప్పటి సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌పై ఒత్తిడి తెచ్చి, గతంలో ఆయనిచ్చిన వాంగ్మూలాన్ని మా ర్పించి, కొత్తగా వాంగ్మూలం ఇప్పించడంలో విజ యవంతమైంది. చంద్రబాబు ప్రభుత్వ అక్ర మాలను వెల్లడిస్తూ ఆయన గుంటూరులోని న్యాయస్థానంలో ఇంతకుముందు 164 సీఆర్పీసీ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయనతో గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా వాంగ్మూలం ఇవ్వాలని సీఐడీ ద్వారా బెదిరింపులకు పాల్పడింది. ఇందుకు ఆయన అంగీకరించలేదు. రెండుసా ర్లు ఆయనతో 164 సీఆర్సీపీ వాంగ్మూలాన్ని రీరి కార్డింగ్ చేసేందుకు సీఐడీ యత్నించి విఫలమైంది. ఓ సారి న్యాయాధికారి సెలవులో ఉండటంతో వాయిదా పడింది. మరోసారి న్యాయస్థానం ప్రాంగణం వరకూ వచ్చిన శ్రీధర్ బయటే చాలాసేపు తన వాహనంలో ఉండిపోయారు. న్యాయస్థానం లోపలికి వెళ్లలేదు. ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇవ్వడం నేరంగా పరిగణిస్తారని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పలువురు న్యాయవాదులు ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో వాంగ్మూలం ఇవ్వకుండానే వెనుదిరిగారు. మూడో ప్రయత్నంలో బుధవారం సీఐడీ అధికారులు ఆయన్ని గుంటూరులోని న్యాయస్థానానికి తీసుకువచ్చారు. సీఐడీ అధికారులు, మఫ్టీలో ఉన్న పోలీసు అధికారుల పహారా మధ్య దాదాపు రెండు గంటలపాటు ఆయన న్యాయస్థానంలోనే ఉన్నారు. ఆ సమయంలో ఇతరులు ఎవరూ ఆయన్ని కలిసేందుకు కూడా సీఐడీ అధికారులు అనుమతించలేదు.సీఆర్పీసీ 164 కింద శ్రీధర్ తన వాంగ్మూలాన్ని రీరికార్డింగ్ చేసినట్టు సమాచారం. అనంతరం ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా తన వాహనంలో వెళ్లిపోయారు. వాంగ్మూలం రీరికార్డింగ్‌పై అధికారికంగా సీఐడీ, ఇతర అధికారులుగానీ స్పందించలేదు. -
మూడు నెలల్లో ముగించేద్దాం
సాక్షి,టాస్క్ ఫోర్స్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన కేసులను యుద్ధప్రాతిపదికన మూసివేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇప్పుడు ఈ వ్యవహారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. పోలీసు, సీఐడీ విభాగాలను వీలైనంత మేర ఉపయోగించుకోవడం, కేసులను నీరుగార్చడం.. ఇదీ పథకం. ఈ పథకాన్ని సిద్ధార్థ్ లూథ్రా స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. విజయవాడలోని నోవాటెల్ హోటల్ కేంద్రంగా ఆది, సోమవారాల్లో నిర్వహించిన రహస్య సమావేశాల్లో ఈ మేరకు ఓ కుట్రను ఖరారు చేశారని వినిపిస్తోంది. లూథ్రాతో పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం. సాక్షులను బెదిరించండి... వాంగ్మూలాలు మార్చండి.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బరితెగించి పాల్పడిన దోపిడీని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణాల కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబేనన్నది ఆధారాలతో బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధమని చెప్పినా సరే సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించడంతోనే అక్రమాలకు పాల్పడాల్సి వచ్చిందని ఆనాటి ఉన్నతాధికారులతోపాటు ఇతరులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అక్రమ నిధులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి, టీడీపీ బ్యాంకు ఖాతాలకు చేరినట్టు ఆధారాలను సిట్ సేకరించింది. దాంతోనే ఆ కేసుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికినట్టైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసుల నుంచి చంద్రబాబు పేరు తప్పించేందుకు కుట్ర పన్నుతోంది. అందుకు గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులను, ఇతరులను తీవ్రస్థాయిలో బెదిరించి బెంబేలెత్తించాలని పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులకు ఆదేశాలందాయని తెలుస్తోంది. అవసరమైతే వారిపై ఇతరత్రా అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయాలని కూడా లూథ్రా సలహా ఇచి్చనట్లు సమాచారం. సాక్షులను బెదిరించి దారికి తెచ్చుకోకపోతే చంద్రబాబును ఈ అవినీతి కేసుల నుంచి బయటపడేయడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎంతమందిని బెదిరించారు... ఎంతమంది ఇంకా బెదిరించాల్సిన జాబితాలో ఉన్నారనే వివరాలు కూడా లూథ్రా అడిగి తెలుసుకున్నారట.అన్నీ మూసేద్దాం..చంద్రబాబు అవినీతి కేసుల్లో గతంలో సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేయాలనేది కూడా ఈ రెండు రోజుల సమావేశాల్లో ఖరారు చేసిన కుట్రలో భాగంగా ఉంది. గతంలో సిట్‌లో పనిచేసిన కిందిస్థాయి అధికారులను పిలిపించి బెదిరించాలని కూడా లూథ్రా సలహా ఇచ్చారట. ఇప్పటికే తాము నాలుగైదు సార్లు ఆ కిందిస్థాయి అధికారులను తీవ్రస్థాయిలో బెదిరించామని పోలీసు, సీఐడీ అధికారులు ఆయనకు చెప్పారు. అది సరిపోదని....ఆ వేధింపులను ఇంకా తీవ్రతరం చేయాలని లూథ్రా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ గరిష్టంగా మూడు నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉందని, ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ రోజువారీగా తనకు నివేదిక ఇవ్వాలని ఓ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారికి లూథ్రా సూచించినట్లు పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఈ పనులు పూర్తి చేస్తే అనంతరం చంద్రబాబుపై కేసులను మూసివేసే సంగతి తాను చూసుకుంటానని సీనియర్ న్యాయవాది లూథ్రా ఈ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై కేసులను నీరుగార్చే పన్నాగాన్ని కచ్చితంగా అమలు చేస్తామని... త్వరలోనే టాస్క్ పూర్తి చేస్తామని పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో లూథ్రా వ్యాఖ్యానించినట్లు పోలీసు వర్గాలంటున్నాయి. రెండు రోజుల సమావేశాల అనంతరం లూథ్రా ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారని సమాచారం.అంతా లూథ్రా చెప్పినట్లే..సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యావత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవçÜ్థకు సూపర్ బాస్‌గా అవతరించారు. గతంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలిపోయిన ఆ సీనియర్ న్యాయవాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం చంద్రబాబు అవినీతి కేసులను అడ్డగోలుగా క్లోజ్ చేసే పన్నాగానికి సర్వం తానై వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అవినీతి కేసులను మూసివేయడంతోపాటు...వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేసే కుట్రను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. లూథ్రాయే సుప్రీం అని, ప్రభుత్వ కీలక విభాగాల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి తేల్చి చెప్పారని కూడా వినిపిస్తోంది. అందువల్లే పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్, న్యాయ విభాగాలు పూర్తిగా లూథ్రా నియంత్రణలోకి వచ్చేశాయి. ఆయన ఆదేశాలకు రాష్ట్ర పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు జీ హుజూర్ అంటున్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులే కాదు... జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అవసరమని భావిస్తే చివరికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కూడా ఆయన ఫోన్లు చేసి ఆదేశిస్తున్నారు. వారు చిత్తం మహా ప్రభో.. అని ఆయన ఆదేశాలను శిరసావహిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదు మేరకు నమోదుచేసిన అక్రమ కేసులో రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌పై అక్రమ కేసు నమోదు చేయడంతో పాటు విచారణ పేరుతో ఎలా వేధించాలో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారికి లూథ్రాయే స్వయంగా నిర్దేశించారని పోలీసులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, ఇతర అక్రమ కేసులతో వేధింపులను కూడా లూథ్రా నిశితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారట. సిద్ధార్థ్ లూథ్రా రాజ్యాంగేతర శక్తిగా ఆవిర్భవించారని ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
టాటా, గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయండి
సాక్షి, అమరావతి : సినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని సీఐడీ హైకోర్టును అభ్యర్థించింది. ఈమేరకు సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరిత వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. వారికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆ కౌంటర్లలో హైకోర్టును సీఐడీ కోరింది. కుక్కల విద్యాసాగర్‌తో కలిసి కుట్రలో పాల్గొనడం ద్వారా పోలీసు మాన్యువల్ ఆర్డర్‌ను ఉల్లంఘించారని చెప్పింది. ఈ కుట్రలో న్యాయవాది వెంకటేశ్వర్లు సైతం పాలుపంచుకున్నారని తెలిపింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 2న చేపట్టనుంది.విద్యాసాగర్‌కు బెయిల్ ఇవ్వొద్దు..జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని సీఐడీ హైకోర్టును కోరింది. విద్యాసాగర్ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపింది. ఈ మేరకు సీఐడీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. -
సీఎం ‘సమోసా’ వివాదం.. దర్యాప్తు ఏం లేదు: సీఐడీ
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ‘సమోసా’ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఐడీ కార్యాలయంలో సీఎం సుఖ్వీందర్ సింగ్ హాజరైన ఓ కార్యక్రమంలో ఆయనకు ఇవ్వాల్సిన సమోసాలు మాయం అయినట్లువార్తలు రావడంతో..ఈ అంశంపై వివాదం చెలరేగింది.. దీనిపై సీఐడీ దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు ఆరోపణలు రావడంతో.. తాజాగా దర్యాప్తు సంస్థ స్పందించింది. తాము ఎలాంటి విచారణ చేపట్టలేదని స్పష్టం చేసింది.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 21న ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమం కోసం ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారని, అయితే వాటిని సెక్యూరిటీ స్టాఫ్ తినేశారని వార్తలు వచ్చాయి. సీఎం వద్దకు చేరాల్సిన అవి ఎవరి వల్ల మధ్యలో మిస్ అయ్యాయే గుర్తించేందుకు సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ సీఐడీ డైరెక్టర్ జనరల్ సంజీవ్ రంజన్ ఓజా మాట్లాడుతూ.. సమోసాలు కనిపించకుండా పోవడంపై ఎలాంటి దర్యాప్తు జరపడం లేదని తెలిపారు. ఇది అంతర్గత విషయమని చెప్పారు. అయితే అధికారుల సమావేశానికి ఆర్డర్ చేసిన స్నాక్స్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంపై ఆశ్చర్యం వేయడం చాలా సాధారణమైన విషయమని అన్నారు.దీనిపై విచారణ ఏం లేదని, కేవలం బాక్సుల గురించి తెలుసుకోవడానికి ఒక విజ్ఞప్తి మాత్రమే జరిగిందని చెప్పారు.మరోవైపు ప్రతిపక్ష బీజేపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిందిు. ఇదంతా హాస్యాస్పదమైన వ్యవహారమని, సమోసాలను ఎవరు తింటే ఏమవుతుందని ప్రశ్నించింది. ‘సీఎం తినాల్సిన సమోసాలను తీసుకెళ్లిందెవరు..? సీఐడీ తేల్చనుంది..’’ అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుండటంతో సీఎం కార్యాలయం కూడా స్పందించింది. ప్రభుత్వం అటువంటి విచారణకు ఆదేశించలేదని, ఈ విషయంతో సంబంధం లేదని చీఫ్ మీడియా అడ్వైజర్ నరేష్ చౌహాన్ వెల్లడించారు. ఇది సీఐడీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. -
మూడేళ్లయినా చార్జిషీట్ ఎందుకు వేయలేదు?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై దర్యాప్తును అటకెక్కించిన సీఐడీని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టంది. 2021లో కేసు నమోదు చేసినప్పటికీ, ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయలేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మూడేళ్లు దాటినా ఎందుకు చార్జిషీట్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు ప్రధాన నిందితునిగా ఉన్న స్కిల్ డెలప్మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీ ఉద్దేశపూర్వకంగానే మూలన పడేసిందని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు సైతం ఆక్షేపించడం చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయిన ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయకుండా సీఐడీ చేస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం నిందితులకు వరంగా మారింది. ఈ కుంభకోణం మాస్టర్ మైండ్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా విధించిన షరతుల్లో కొన్నింటిని హైకోర్టు సడలించింది. విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు అనుమతినిచ్చింది. బోస్ సరెండర్ చేసిన పాస్‌పోర్ట్‌ను వెనక్కి ఇచ్చేయాలని విశాఖపట్నం మొదటి అదనపు సెషన్స్ జడ్జిని ఆదేశించింది. రూ.25 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని బోస్‌ను ఆదేశించింది. విశాఖపట్నం కోర్టు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పాస్‌పోర్ట్‌ని సరెండర్ చేస్తానని హామీ ఇవ్వాలని బోస్‌ని ఆదేశించింది. ప్రయాణ వివరాలన్నింటినీ ముందస్తుగానే కింది కోర్టుకు తెలియజేయాలని కూడా చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.ప్రజాధనం కొల్లగొట్టి విదేశాల్లో దాచారని ఈడీ వెల్లడిసుమన్ బోస్‌ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బోస్ పలు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ఆ డబ్బును విదేశాలకు తరలించారని, అందువల్ల విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వొదని ఈడీ తరఫు న్యాయవాది జోస్యుల భాస్కరరావు హైకోర్టును కోరారు. దీని ప్రభావం దర్యాప్తుపై పడుతుందని వివరించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ షరతులను సడలించడం సరికాదని గట్టిగా వాదించారు. -
ఈడీ నీకెక్కడ క్లీన్చిట్ ఇచ్చింది?
ఈ నెల 15వ తేదీన ఈడీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఎక్కడా చంద్రబాబుకు క్లీన్చిట్ ప్రస్తావన లేదు. ఈ కేసులో నిందితులకు చెందిన రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ స్పష్టంగా పేర్కొంది. కానీ, చంద్రబాబు మాత్రం తన అధికారిక టీడీపీ వెబ్సైట్లో ‘న్యాయం గెలిచింది. స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదని ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది.’ అంటూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మనిషి (చంద్రబాబు) అబద్ధానికి రెక్కలు కట్టడంలో స్పెషలిస్టు. అబద్ధానికి రెక్కలు కట్టడంలో పీహెచ్డీ తీసుకున్నాడు. – వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నీకు క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చిందో చూపాలి..’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. టీడీపీ పాలనలో జరిగిన స్కిల్ స్కామ్‌పై వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ దర్యాప్తు చేసి.. అన్ని ఆధారాలతోనే ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేసిన చంద్రబాబును అరెస్ట్ చేసిందని చెప్పారు. ఆ కేసుపై ఈడీ కూడా దర్యాప్తు చేసిందని, స్కామ్ జరిగినట్లు నిర్ధారించిందని, దానికి తార్కాణమే ఆ కుంభకోణంలో పాత్రధారులైన డిజైన్ టెక్ ఎండీ, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సహా నలుగురిని అరెస్ట్ చేసి రెండు విడతల్లో రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని వివరించారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు కొనుసాగుతోందని ఈడీ తేల్చిచెబుతూ మీడియాకు ప్రకటన విడుదల చేస్తే.. దాన్ని పట్టుకుని తనకు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... ఆస్తులు అటాచ్ చేస్తే.. క్లీన్చిట్ ఇచ్చినట్టా? సిల్క్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ నెల 15వ తేదీన విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఎక్కడా చంద్రబాబుకు క్లీన్చిట్ ప్రస్తావన లేదు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సీమెన్స్ ప్రాజెక్టులో భాగంగా డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులు కలిసి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేశారని, నిధులు దుర్వినియోగం అయ్యాయని ఈడీ గుర్తించింది. డిజైన్ టెక్ సంస్థ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్‌లు కలిసి ఏపీ ప్రభుత్వ నిధులను కొల్లగొట్టారని, డొల్ల కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి ప్రజాధనాన్ని స్వాహా చేశారని నిర్ధారించింది. ఇందులో పెద్ద ఎత్తున కమీషన్లు చేతులు మారినట్టు కూడా తేల్చింది. అందుకే ఇంతకు ముందే డిజైన్ టెక్ సిస్టమ్స్ సంస్థకు సంబంధించిన రూ.31.20 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడమే కాకుండా నిందితులు అయిన వికాస్ వినాయక్ కన్వేల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్‌లను అరెస్టు చేసినట్టు వెల్లడించింది. తాజాగా మరో రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ స్పష్టంగా ప్రెస్‌నోట్‌లో తెలియజేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్టు కూడా ప్రకటించింది. ఆ ప్రెస్‌నోట్ చదివితే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఈ కేసులో చంద్రబాబుతోపాటు సుమన్ బోస్, వికాస్ వినాయక్ కన్వేల్కర్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ నిందితులు. ఎందుకంటే చంద్రబాబే ముఖ్యమంత్రి హోదాలో 13 సార్లు.. 13 చోట్ల ఫైళ్లపై సంతకాలు పెట్టారు. వాళ్లకు రూ.371 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బు మొత్తం మళ్లీ డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. కాబట్టే నలుగురిని అరెస్టు చేసింది. ఆస్తులను అటాచ్ చేసింది. కానీ, చంద్రబాబు మాత్రం తన అధికారిక టీడీపీ వెబ్సైట్లో ‘నిజం నిలిచింది.. న్యాయం గెలిచింది. స్కిల్ డెవలప్మెంట్లో అక్రమ కేసు పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెంపపెట్టులా చంద్రబాబుకు ఎటువంటిసంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది ఈడీ..’ అంటూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మనిíÙ (చంద్రబాబు) అబద్ధానికి రెక్కలు కట్టడంలో పీహెచ్డీ తీసుకున్నాడు. దీనికి చంద్రబాబు తనకు క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు మార్చేసుకున్నారు. అసలు ఇంకెవ్వరికీ చదువు రాదనుకుంటాడా... ఎవరికీ ఏమీ తెలియదనుకుంటాడా చంద్రబాబు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వంటి మీడియా సామ్రాజ్యాన్ని పెట్టుకుని ఎంతకైనా గోబెల్స్ ప్రచారం చేయగలననే అతి విశ్వాసం ఉన్నా కూడా... ఈ మాదిరిగా వక్రీకరించడం ఎవరి వల్లా కాదు!. ఈడీ అటాచ్లపై బాబు మాట్లాడరేం! ఈ స్కామ్‌లో ఈడీ అరెస్టు చేసిన మనుషులకు, ఆస్తులు అటాచ్ చేసిన సంస్థలకు డబ్బులు ఎవరు ఇచ్చారు..? చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం వాస్తవం కాదా? జర్మనీకి చెందిన ఒరిజినల్ సీమెన్స్ కంపెనీ ఆ డబ్బులు తమకు ముట్టలేదని, ప్రాజెక్టుతో తమకు సంబంధం లేదని చెప్పడం వాస్తవం కాదా? సదరు కంపెనీ ప్రతినిధి నోయిడా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలంగా ఇవ్వడం వాస్తవం కాదా? సీమెన్స్ సంస్థ ఈ డబ్బు పక్కదారి పట్టిందనే విషయాన్ని తమ అంతర్గత పరిశోధనలో కనుగొన్నామని.. అది తమ ఇండియా విభాగానికి చెందిన మాజీ ఎండీ సుమన్ బోస్ కంప్యూటర్లు, ఫోన్లను పరిశీలిస్తే బయటకు వచ్చిందని.. డబ్బు పుణే నుంచి హైదరాబాద్‌కు వెళ్లిందని.. సాక్షాత్తు సీమెన్స్ తమ అంతర్గత పరిశోధనలో వెల్లడైందని రిపోర్టు ఇచ్చిందా..? లేదా?. ఈ కేసులో నిందితుల ఆస్తుల ఆటాచ్మెంట్పై మాత్రం చంద్రబాబు మాట్లాడరు. కానీ, తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటాడు. చంద్రబాబును ఈడీ అరెస్టు చేయదా?సిల్క్ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబును, ఆయన పీఏ శ్రీనివాస్‌ను భవిష్యత్తులో ఈడీ అరెస్టు చేయదా? ప్రజాధనాన్ని డొల్ల కంపెనీలు సృష్టించి బయటకు పంపడం.. అలా వెళ్లిన డబ్బులు మళ్లీ తిరిగి హవాలా మార్గంలో చంద్రబాబు జేబులోకి చేరడం వాస్తవం కాదా? దొంగలు దొంగలు కలిసి ఊళ్లను పంచుకోవడం అంటే ఇది కాదా? ఇద్దరు ఐఏఎస్ అధికారులు మేజిస్ట్రేట్ ముందు సెక్షన్–164 కింద వాంగ్మూలం ఇచ్చారు. తాము చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బు విడుదల చేశామని చెప్పారు. ఇది వాస్తవం కాదా? ఇవన్నీ కళ్ల ఎదుట కనిపిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ‘న్యాయం గెలిచింది.. నిజం నిలిచింది..’ అని ఎలా అంటారు? కంటికి కనిపించే ఆధారాలు ఉన్నాయి. స్కామ్ నిజమే అని ఈడీ కూడా ధ్రువీకరించుకుని అరెస్టులు చేసింది... ఆస్తులు అటాచ్మెంట్ చేసింది. అయినా చంద్రబాబు లడ్డూలు విషయం మాదిరిగా.. ఇసుక, మద్యం స్కామ్‌ల తరహా అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. ఇలాంటి వాళ్లు నిజంగా మనుషులేనా.. అందరూ ఆలోచన చేయాలి. -
చిలకలూరిపేట ఐసీఐసీఐలో సీఐడీ విచారణ
చిలకలూరిపేట: ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట బ్రాంచ్‌లో జరిగిన కుంభకోణం విషయంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ ఏఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో సీఐడీ అధికారుల బృందం గురువారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌కి చేరుకుని విస్తృతంగా విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకు తలుపులు మూసివేసి ఎవరినీ లోనికి అనుమతించకుండా విచారణ కొనసాగించారు. ఈ సందర్బంగా సీఐడీ ఏఎస్పీ సీహెచ్ ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8న సీఐడీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత విషయమై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కేసును గుంటూరు సీఐడీ కార్యాలయానికి బదిలీ చేసినట్టు తెలిపారు. తమ విచారణలో ఇప్పటి వరకు 72 మంది ఖాతాదారులకు సంబంధించి రూ. 28 కోట్లు గోల్మాల్ జరిగినట్టు గుర్తించినట్లు తెలిపారు. 2021 నుంచి ఇక్కడ బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన దూడ నరేష్చంద్రశేఖర్, మరో ఇద్దరు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇక్కడ పనిచేసిన అనంతరం నరేష్చంద్రశేఖర్ నరసరావుపేట, విజయవాడ భారతీనగర్ బ్రాంచ్‌లలో మేనేజర్‌గా పనిచేసినట్టు తెలిపారు. విజయవాడలో పనిచేస్తున్న సమయంలో అతని అవకతవకలు వెలుగు చూసి ఈ ఏడాది జూలైలో బ్యాంకు అతనిని విధుల నుంచి సస్పెండ్ చేసిందన్నారు. ఈ నెల చిలకలూరిపేట బ్రాంచిలో జరిగిన అక్రమాలు వెలుగు చూడటంతో సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. ఇంకా ఎవరైనా బ్యాంకు సిబ్బంది ఈ వ్యవహారంలో ఉన్నారా లేరా అనేది విచారణలో తేలాల్సి ఉందని తెలిపారు. వారం, పది రోజుల్లో విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, కేసు విషయమై ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. సీఐడీ సీఐ సంజీవ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
బాబు అండ్ కో కేసులన్నీ సీబీఐ, ఈడీకి అప్పగించండి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యాపార వేత్తలు లింగమనేని రమేష్, వేమూరు హరికృష్ణ ప్రసాద్ తదితరులతో పాటు పలు కంపెనీలపై గతంలో నమోదైన కేసులన్నింటినీ సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాలు తదితరాల స్కామ్‌లకు సంబంధించి చంద్రబాబు, ఇతరులపై నమోదైన కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని.. నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసుల తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ సీనియర్ పాత్రికేయుడు, స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాల గంగాధర తిలక్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ దర్యాప్తును పర్యవేక్షించాలని ఆయన తన వ్యాజ్యంలో హైకోర్టును కోరారు. దర్యాçప్తు పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు స్థాయీ నివేదికలను కోర్టు ముందుంచేలా కూడా సీబీఐ, ఈడీలను ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలతో పాటు మొత్తం 114 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రతివాదుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీ, సీబీఐ, ఈడీలను కూడా చేర్చారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తాను వ్యక్తి గత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. ఆయా కుంభకోణాల్లో అక్రమాలు ఎలా జరిగాయో కూడా సమగ్రంగా వివరించారు.సీఐడీ ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు ‘ఫలితాలు వెలువడిన రోజున డీజీపీగా, పోలీసు బలగాలకు అధిపతి (హెచ్‌ఓఎఫ్)గా ఉన్న హరీష్ కుమార్ గుప్తా సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులకు ప్రవేశాన్ని నిరాకరించారు. చంద్రబాబు తదితరులు అధికారంలోకి రాబోతున్నారని గ్రహించి, ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించారు. అంతేకాక మధ్యాహ్నం 12.30 గంటలకు రహస్యంగా సాయుధులను అక్కడ మోహరింప చేశారు. కౌంటింగ్ జరుగుతుండగానే, ఆర్థిక నేరాల విభాగం నుంచి అధికారులందరినీ వెళ్లిపొమ్మన్నారు. ఈ విషయాలన్నీ పత్రికల్లో వచ్చాయి. ఓ డీజీపీ ఈ విధంగా చేయడం చట్ట విరుద్ధం, ఏకపక్షం, దౌర్జన్యపూరితం’ అని తిలక్ తన వ్యాజ్యంలో వివరించారు.ఆ కేసుల విషయంలో ఉదాసీనత స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈసీఐఆర్‌ను రిజిష్టర్ చేసిందని తెలిపారు. కొందరు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపిందన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి డీజీపీ, సీఐడీ అదనపు డీజీ తదితరులందరూ కూడా ఈ కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తిలక్ వివరించారు. ఈ కేసుల్లో సీఐడీ, ఈడీ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తును చంద్రబాబు, ఇతర నేతలకు అనుకూలంగా నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసులన్నింటి దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు. ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ హోదాలో డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మద్యం కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. ఇసుక కుంభకోణంపై ఫిర్యాదు చేసినందుకు గనుల శాఖ అప్పటి డైరెక్టర్ జి.వెంకట రెడ్డిపై కక్ష తీర్చుకుంటున్నారన్నారు. తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటామని రెడ్‌బుక్ అంటూ పలువురు అధికారులను వేధిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. -
స్కిల్ కేసులో నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ, సాక్షి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న స్కిల్ డెవపల్‌మెంట్ స్కాం కేసు ఇవాళ సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో అరెస్టై 53 రోజులపాటు జైల్లో గడిపిన చంద్రబాబు.. బెయిల్ మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలంటూ నేర పరిశోధన విభాగం(CID) వేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ విచారణ జరపనున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ షరతుల్ని ఉల్లంఘించారన్నది సీఐడీ వాదన. అంతేకాదు.. రెడ్‌బుక్ పేరుతో అధికారుల్ని ఆయన తనయుడు నారా లోకేష్ సైతం విచారణ అధికారుల్ని బెదిరిస్తున్నాడన్నది మరో అభియోగం. ఈ రెండింటిపైనా సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగుతోంది. ఇదిలా ఉంటే.. బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని గత విచారణలో చంద్రబాబుకు సుప్రీం కోర్టు వార్నింగ్ సైతం ఇచ్చింది.ఇదీ చదవండి: స్కిల్ కేసు.. చంద్రబాబుకు సుప్రీం వార్నింగ్గత విచారణలో సందర్భంగా.. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ వాదిస్తూ.. ‘‘చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు స్కిల్ కేసు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారు. దర్యాప్తునకు భంగం కలిగేలా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. రెడ్ బుక్ లో అధికారులు పేర్లు రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల అంతు చూస్తాను అని లోకేష్ బెదిరిస్తున్నారు. ఈ మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు అని వాదించారు. దీంతో.. రెడ్ బుక్ అంశంపై దాఖలు చేసిన అప్లికేషన్ రికార్డులలో ఉంచాలని రిజిస్ట్రీని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. -
కన్ఫ్యూజ్ చేయబోయి బొక్కబోర్లా పడ్డారు
కన్విన్స్ చేయడం చేతగానపుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం సులువు.. ఇది చంద్రబాబు దశాబ్దాల నుంచి అమలు చేస్తున్న కుట్ర.. తన పాలనా గురించి,. తాను చేసిన అభివృద్ధి గురించి ఏనాడూ ఎప్పుడూ చెప్పుకోలేని చంద్రబాబు..ఎన్నికల సమయంలో అవతలి పార్టీవల్ల మీద దుమ్మెత్తిపోసి ప్రజలను గందరగోళపరిచి లభ్ది పొందుతూ ఎన్నికల్లో గట్టెక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా తాను గత ఐదేళ్ళలో ఏమి చేసిందీ చెప్పుకోలేని చంద్రబాబు సీఎం వైఎస్ జగన్ పాలనలోని గొప్పతనాన్ని గుర్తించే మనసులేక.. ఏకంగా లేని చట్టాన్ని చూపించి ప్రజలను భయపెట్టాలని చూశారు.కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనే అంశాన్ని చూపించి ప్రజలను భయపెట్టి లబ్ధిపొందాలన్నది చంద్రబాబు కుట్రగా తెలుస్తోంది... ఈ క్రమంలో అయన కొంతమంది కార్యకర్తలు, యువత, రైతులను డబ్బులిచ్చి జనంలోకి పంపించి ఆ చట్టం పేరిట జనాన్ని భయపెట్టాలని చూాశారు. దీంతోబాటు TDP ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా జగన్‌పై, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. దీంతోబాటు ప్రజల భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని దుష్ప్రచారం మొదలు పెట్టింది. ప్రజలకు లక్షల ఎకరాల అటవీ భూములు, చుక్కల భూములకు సంబంధించి ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించిన జగన్ తిరిగి ప్రజల భూములు లాక్కోవడం ఏమిటన్న చర్చ జనంలోకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా కేవలం ఇదే అంశాన్ని రాస్తూ..టీవీల్లో...చూపిస్త్తూ ప్రజలను భయపెట్టేందుకు ప్రయతించింది. దీంతో ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను కలిసి టీడీపీ తీరుమీద ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదులో బలం ఉందని గ్రహించిన ఎన్నికల కమిషన్ ఇక ముందు ఈ చట్టం గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నవాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర సీబీసీఐడీని సైతం ప్రశ్నించింది.. దీంతో తెలుగుదేశం వారి గొంతులో వెలక్కాయపడినట్లు అయింది.. సీఐడీ ని ఎన్నికల సంఘం ఆదేశించడం ఆంటే అందులో నిజం ఉన్నట్లే... ఇకముందు నోటికొచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని ఈసీ ఆదేశాలతో టీడీపీ వాళ్లకు అర్థం ఐంది.-సిమ్మాదిరప్పన్న -
దొరికాడు దొంగ
సాక్షి, అమరావతి: ‘స్కిల్’ స్కామ్... చంద్రబాబుకు ఎప్పటికీ వెంటాడే పీడకల...40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబును ఖైదీ నంబర్ 7691గా 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఊచలు లెక్కించేలా చేసింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం. యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఈ కేసులో సీఐడీ చంద్రబాబుతో పాటు 8 మందిని అరెస్ట్ చేసింది. చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షెల్ కంపెనీల ప్రతినిధులు నలుగురిని అరెస్ట్ చేసింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్( కాగ్) స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. చంద్రబాబు 17ఏ చట్టం కింద ఈ కేసు నుంచి తప్పించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే తరహాలో షెల్ కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు పొందిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం సరైన చర్యేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మరి అదే తరహాలో స్కిల్‌స్కామ్‌కు పాల్పడి షెల్‌కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి నిధులు మళ్లించిన చంద్రబాబుపై ఈడీ కత్తి వేలాడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్ అని నిర్ధారిస్తూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణం కథ కమామిషు ఇలా ఉంది... చంద్రబాబు అవినీతి నెట్వర్క్ ఇదీ.. ♦ టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ♦ డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ♦ పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై,అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్‌వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ♦ మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. 370 కోట్ల నుంచి 3,300 కోట్ల రూపాయలకు పెంచేసి.. 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం తన బినామీ సంస్థ డిజైన్ టెక్‌ను రంగంలోకి దింపి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీకి డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ డిజైన్ టెక్ కంపెనీలు తమ వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వనే లేదు. ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు... డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగాతరలించారు. ప్రతిదశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. ఫైళ్లు మాయం చేసిన కుంభకోణం గుట్టు రట్టు 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో నిర్వహించిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో సిట్ నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. చంద్రబాబుకు 17ఏ కింద రక్షణ లభించదన్న సుప్రీం కోర్టు స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన మాజీ సీఎం చంద్రబాబు ‘సెక్షన్ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. సెక్షన్ 17ఏను తనకు వర్తింపజేస్తూ తనపై స్కిల్ స్కామ్‌లో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ విభాగం 2017లోనే నమోదు చేసింది కాబట్టి 2018 నవంబరు నుంచి అమలులోకి సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. స్కిల్ స్కామ్ ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86కోట్లు.. చంద్రబాబుపైఈడీ కన్ను మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌ను సమర్థిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. షెల్ కంపెనీల ద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా అక్రమ నిధులు పొందితే అందుకు ఆ పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్‌కు కూడా ఇది వర్తిస్తుందని ఈడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు మళ్లించినట్టు సీఐడీ ఆధారాలతోసహా నిర్ధారించింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని నాలుగు బ్యాంకుల్లో టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు. జూబ్లీ హిల్స్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలు ఉన్నాయి. ఆ మూడు ఖాతాల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500 జమ చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయినోట్ల కట్ల రూపంలో తీసుకువచ్చి మరీ జమ చేశారు. ఆ నిధులు తమకు ఎలా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును 2016, నవంబరులో ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. భారీ డిపాజిట్లకు ఆదాయ మార్గాలు వెల్లడించాలని పేర్కొంది. కానీ ఆదాయ మార్గాలను వెల్లడించకుండానే టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86కోట్లు జమ చేయడం గమనార్హం. ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్కిల్‌స్కామ్‌లో చంద్రబాబును ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐడీ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీఎండీ–సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్కర్ తదితర కంపెనీల అధికారులు -
చంద్రబాబే ప్రధాన నిందితుడు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా పన్నాగంతోనే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ నిగ్గు తేల్చింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజులు ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సమగ్ర వివరాలతో సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబే ప్రధాన నిందితుడు (ఏ1)గా, రెండో నిందితుడి (ఏ2)గా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477 (ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఈ చార్జిషీట్లో పేర్కొంది. రూ.330 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌గా కనికట్టు చేశారని వివరించింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్ కంపెనీ వాటా 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోయినా, ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను జీఎస్టీతోసహా రూ.371 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని తెలిపింది. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు కొల్లగొట్టారని వివరించింది. సీఐడీ చార్్జషీట్లోని ప్రధాన అంశాలు ఇవీ... 2017లోనే బయటపడినా.. 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో జరిపిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి, ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్టు ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం మొత్తం బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్‌టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో పక్కా పథకం ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం చంద్రబాబు తన బినామీ సంస్థ డిజైన్‌టెక్‌ను రంగంలోకి దింపారు. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు బినావీులు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్– డిజైన్‌టెక్ కంపెనీలు వాటి వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద డిజైన్‌టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్టు నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. డిజైన్‌టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లతో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోను చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర షెల్ కంపెనీల ద్వారా నిధులను హవాలా మార్గంలో మళ్లించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు ఆయన బెయిల్ రద్దు పిటిషన్‌పై కొనసాగుతున్న విచారణస్కిల్ స్కామ్‌లో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న చంద్రబాబు వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు రెడ్‌బుక్ పేరుతో ఈ కేసులో కీలక సాక్షులు, అధికారులను బెదిరింపులకు గురిచేసి దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని కూడా సీఐడీ ఆ పిటిషన్లో పూర్తి ఆధారాలతో పేర్కొంది. దర్యాప్తు చేస్తున్న ఈడీ మనీ లాండరింగ్ ద్వారా నిధులు మళ్లించిన స్కిల్ స్కామ్ గురించి సీఐడీ అధికారులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నివేదించారు. దాంతో రంగంలోకి దిగిన ఈడీ ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులైన సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, చార్టెడ్ అకౌంటెంట్ ముకుల్ చంద్ర అగర్వాల్, షెల్ కంపెనీల సృష్టికర్త సురేశ్ గోయల్‌ను అరెస్ట్ చేసింది. డిజైన్‌టెక్ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్ల ఆస్తులను జప్తు చేసింది కూడా. సీఐడీ చార్్జషీట్లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ – సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర కంపెనీల అధికారులు -
ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు కొట్టివేత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ఆ సంస్థ ఆస్తులను ఆంధ్రప్రదేశ్ సీఐడీ జప్తుచేసి ఉండగా, తిరిగి అవే ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా జప్తుచేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. ఈడీ జారీచేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్ట ఉద్దేశాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని.. పైగా డిపాజిటర్లకు కష్టం కలిగించేలా కూడా ఉన్నాయని స్పష్టంచేసింది. అందువల్ల ఈడీ ఉత్తర్వులను కొట్టేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అదే సమయంలో సీఐడీ జప్తు ఉత్తర్వులు డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించేలా ఉన్నాయని తేల్చిచెప్పింది. అలాగే.. ‘డిపాజిటర్లందరూ ప్రధానంగా ఏపీకి చెందిన వారే. జప్తు ఆస్తులు కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. తమ కష్టార్జితాన్ని వారు డిపాజిట్ల రూపంలో కంపెనీలో పెట్టారు. తాము చెల్లించిన ఈ డిపాజిట్ల మొత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు మనీలాండరింగ్ చట్టం కింద అడ్జుడికేటింగ్ అథారిటీ వద్దకు వెళ్లి తేల్చుకోవడం డిపాజిటర్లకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ఏలూరులోని ప్రత్యేక కోర్టే ఈ మొత్తం వ్యవహారాన్ని తేల్చడం డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించినట్లవుతుంది. అందువల్ల ఈడీ జారీచేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కొట్టెస్తున్నాం’.. అని న్యాయస్థానం పేర్కొంది. అంతేకాక.. అగ్రిగోల్డ్ ఆస్తులను సీఐడీ జప్తుచేయడాన్ని ప్రత్యేక న్యాయస్థానం కూడా సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేసిందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు సమర్థించింది. డిపాజిటర్లను మోసంచేసి కూడబెట్టిన భారీ ఆస్తులను విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాలను తిరిగి డిపాజిటర్లకు చెల్లించడమే డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ముఖ్యోద్దేశమన్న ప్రభుత్వ వాదనతో కూడా ఏకీభవించింది. అగ్రిగోల్డ్ కుంభకోణంపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చని ఈడీకి హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల తీర్పునిచ్చారు. ఈడీ జప్తు ఉత్తర్వులపై పిటిషన్లు.. మరోవైపు.. అగ్రిగోల్డ్ నుంచి కొనుగోలు చేసిన తమ ఆస్తులను జప్తుచేస్తూ ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను సవాలుచేస్తూ ఆలిండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బ్యాంకులు నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన వారూ అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ జప్తుచేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. అసలు అగ్రిగోల్డ్ కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్ కంపెనీ నుంచి తాము కొన్న భూముల్లో నిర్మించుకున్న అపార్ట్మెంట్లను సైతం జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయా ఫ్లాట్ల యజమానులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. రుణం ఇచ్చాం కాబట్టి, ఆస్తులను వేలంవేసే హక్కు తమకుందంటూ బ్యాంకులు సైతం కొన్ని పిటిషన్లు దాఖలు చేశాయి. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, ఈడీ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ జోస్యుల భాస్కరరావు, పిటిషనర్ల తరఫున పీఎస్పీ సురేష్‌కుమార్, పూజారి నరహరి, సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్‌లు వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న కోర్టు గతేడాది ఆగస్టులో తీర్పు రిజర్వ్ చేశారు. ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ రవి ఈ వ్యాజ్యాలన్నింటిపై తన తీర్పును వెలువరించారు. ఆస్తి జప్తు ద్వారా చట్టం ఉద్దేశం నెరవేరదు.. ‘జప్తు చేసిన ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను డిపాజిటర్లందరికీ సమానంగా పంచే అధికారాన్ని ప్రత్యేక కోర్టుకు డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కల్పిస్తోంది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్–6లో ఉన్న ఏ నిబంధన కూడా మనీలాండరింగ్ చట్టం సెక్షన్–5లో లేదు. జప్తుచేసిన ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను డిపాజిటర్లకు సమానంగా పంపిణీ చేయాలన్న నిబంధన ఏదీ కూడా మనీలాండరింగ్ చట్టంలో లేదు. ఈ విషయంలో అడ్వొకేట్ జనరల్ వాదనతో ఈ కోర్టు ఏకీభవిస్తోంది. కేవలం ఆస్తి జప్తు చేయడం ద్వారా చట్టం ఉద్దేశం నెరవేరదు. ఆస్తి జప్తు బాధితులను రక్షించలేదు. ఈ కారణాలరీత్యా 2015లో సీఐడీ జప్తుచేసిన ఆస్తులను తిరిగి 2020లో ఈడీ జప్తుచేస్తూ జారీచేసిన ప్రాథమిక ఉత్తర్వులను కొట్టెస్తున్నా’.. అని జస్టిస్ రవి తన తీర్పులో పేర్కొన్నారు. ఆస్తుల జప్తునకు సంబంధించిన అన్నీ అంశాలను ఏలూరులోని ప్రత్యేక కోర్టు ముందే తేల్చుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
అగ్రిగోల్డ్ బూచి... ప్రత్తిపాటి భూముల లాలూచీ
సాక్షి, అమరావతి: సామాన్య డిపాజిటర్లను నిండా ముంచేసిన అగ్రిగోల్డ్ కుంభకోణం మాటున టీడీపీ పెద్దలు కొల్లగొట్టిన భూములపై ప్రభుత్వం కొరఢా ఝళిపించింది. అందులో మొదటి అడుగుగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అగ్రిగోల్డ్ నుంచి కొల్లగొట్టిన భూములను అటాచ్ చేయాలని నిర్ణయించింది. పుల్లారావు కుటుంబానికి చెందిన 6.19 ఎకరాలను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని ఆసరాగా చేసుకొని టీడీపీ నేతలు ఆ సంస్థకు చెందిన భూములను కొల్లగొట్టారు. ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం కూడా ఆ భూ దోపిడీలో అడ్డగోలుగా లబ్ధి పొందింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం (అప్పటి ప్రకాశం జిల్లా) గురిజేపల్లిలోని సర్వే నంబర్లు 104/1, 104/3, 104/4, 104/5, 104/6, 103/2లో ఉన్న 6.19 ఎకరాలను హస్తగతం చేసుకుంది. అప్పటికే అగ్రిగోల్డ్ కంపెనీపై కేసు నమోదైంది. ఆ కేసు పేరుతో భయపెట్టి సెటిల్మెంట్ కింద ఆ భూమి తమ పరం చేసేలా డీల్ కుదుర్చుకున్నారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన కనుకొల్లు ఉదయ్ దినకర్ పేరిట ఉన్న ఆ 6.19 ఎకరాలను పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ పేరిట బదిలీ చేశారు. ఈమేరకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2015లో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా ఆ భూములను కామేపల్లి లక్ష్మీ ప్రసాద్, చెరుకూరి కోటేశ్వరరావు, కామేపల్లి గ్రానైట్స్ పేరిట బదిలీ చేసేశారు. ఈ విధంగా అగ్రిగోల్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అటాచ్‌మెంట్‌కు అనుమతి ఈ కేసు దర్యాప్తును సీఐడీ అధికారులు వేగవంతం చేశారు. డిపాజిటర్ల నిధులతో అగ్రిగోల్డ్ కంపెనీ కొనుగోలు చేసిన భూములను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం దక్కించుకుందని గుర్తించారు. దాంతో ఆ భూములను అటాచ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఐడీ పంపిన ప్రతిపాదనలను హోమ్ శాఖ ఆమోదించి అటాచ్‌మెంట్‌కు అనుమతి జారీ చేసింది. -
‘ఫైబర్’ ఫ్రాడ్ సూత్రధారి బాబే
సాక్షి, అమరావతి: కేంద్ర నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లూటీకి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. తనకు సన్నిహితుడైన, నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు ఆధారాలతో నిగ్గు తేల్చింది. ఈ నేపథ్యంలో ఏ 1గా మాజీ సీఎం చంద్రబాబు, ఏ 2గా టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ 3గా ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్, ఇన్‌క్యాప్ సంస్థల మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు (ప్రస్తుతం ద.మ. రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్)తోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం కేసులు నమోదు చేసింది. ఫైబర్‌నెట్ పేరుతో చంద్రబాబు బృందంప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ సీఐడీ తన చార్జ్‌షీట్‌లో సవివరంగా పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో చంద్రబాబును ఏ 25గా పేర్కొనగా అనంతరం దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా తాజాగా చార్జ్‌షీట్‌లో ఏ1గా చేర్చారు. ఈ వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు ఉంది. ఐటీ శాఖకు బదులుగా.. టెరాసాఫ్ట్‌కు ఫైబర్‌నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు మొదటి దశలో రూ.333 కోట్ల పనుల్లో అక్రమాలకు బరితెగించారు. ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా చేపట్టాలని స్వయంగా ఆదేశించారు. నాడు ఈ శాఖలను చంద్రబాబే నిర్వహించడం గమనార్హం. బిడ్లు.. టెండర్లు వేమూరివే వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరిని ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ను కీలక స్థానంలో నియమించి పనులు చక్కబెట్టారు. నిబంధనలను విరుద్ధంగా ఫైబర్‌నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వ్యక్తులు నిబంధనల ప్రకారం టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదు. చంద్రబాబు దీన్ని తుంగలోకి తొక్కారు. అమాంతం విలువ పెంచేసి... ప్రాజెక్ట్ విలువను అడ్డగోలుగా నిర్ణయించారు. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండా సరఫరా చేయాల్సిన పరికరాలు, నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతం పెంచేశారు. వేమూరి హరికృష్ణ, నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారు. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ.. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్‌లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ – పోస్ యంత్రాల సరఫరాలో విఫలమైన టెరాసాఫ్ట్‌ను అధికారులు బ్లాక్ లిస్టులో చేర్చారు. చంద్రబాబు ఆ కంపెనీని ఏకపక్షంగా బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. పోటీలో ఉన్న ఇతర కంపెనీలను పక్కనబెట్టేశారు. దీనిపై పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఖాతరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సైతం సాంకేతిక కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్‌ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత టెరాసాఫ్ట్ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ సాధించేందుకుగా వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు. అమలు లోపభూయిష్టం ప్రాజెక్టును అమలు చేయడంలో టెరాసాఫ్ట్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్ నోటిఫికేషన్ నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో వ్యవహారాన్ని నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కాగితాలపై చూపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. నాసిరకమైన పనులతో ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేలింది. కీలక అధికారుల వాంగ్మూలం.. ఫైబర్‌నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలను సేకరించింది. ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించి నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని, ఈ టెండర్ల ప్రక్రియలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారని సెక్షన్ 164 సీఆర్పీసీ ప్రకారం న్యాయస్థానంలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో గురువారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఏ 1 గా చంద్రబాబు, ఏ 2 గా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. వీరితో పాటు నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్‌లను ముద్దాయిలుగా సీఐడీ పేర్కొంది. సింగపూర్‌తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందమని సీఐడీ తేల్చింది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అంటూ తప్పుదారి పట్టించినట్టు సీఐడీ తెలిపింది. అయితే జీ 2 జీ ఒప్పందమే జరగలేదని సీఐడీ నిర్ధారించింది. సింగపూర్‌తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిలేదని సీఐడీ తేల్చింది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్‌కు డబ్బులు చెల్లింపులు జరిగినట్టు నిర్ధారణ చేసింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్ లు రూపొందించినట్టు సీఐడీ పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్ని లింగమనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్టు సీఐడీ చార్జ్ షీట్లో వెల్లడించింది. 58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొన్నారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకి మేలు చేసేలా అలైన్ మెంట్ మార్పులు చేశారు. లింగమనేని నుండి చంద్రబాబుకు ఇంటిని ఇచ్చినట్టు సీఐడీ పేర్కొంది. లింగమనేని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ 14 ఎకరాల భూములు కొన్నట్టు సీఐడీ పేర్కొంది. ఈభూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చినట్టు సీఐడీ నిర్ధారించింది. -
మద్యంకుంభకోణం దర్యాప్తులో సీఐడీ దూకుడు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. చీకటి జీవోలతో అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా మద్యం కాంట్రాక్టులు కట్టబెట్టి ఏటా రూ.1,300 కోట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతిపై దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ ఈ కుంభకోణం సూత్రధారులు, పాత్రధారులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన తీరుపై కీలక ఆధారాలు సేకరించింది. దాంతో ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారికి త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించాలని నిర్ణయించింది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్ తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120 (బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13 (1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నోట్ ఫైళ్లు, చీకటి జీవోల గుట్టురట్టు: రాష్ట్రంలో 2012 నుంచి అమలులో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన తీరుపై సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతోపాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపారు. దానిపై కేబినెట్లో చర్చించలేదు. కానీ కేబినెట్ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్లీ అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలనే ప్రతిపాదనతో నోట్ ఫైల్ పంపారు. ‘కాపీ టు పీఎస్ టు సీఎం’అని స్పష్టంగా పేర్కొంటూ ఆ నోట్ ఫైల్ పంపడం గమనార్హం. ఆ వెంటనే డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ చేసింది. అంటే కేబినెట్‌కు తెలియకుండానే వ్యవహారం నడిపింది. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరతూ బార్ల యజమానుల సంఘం 2015 సెప్టెంబరు 9న వినతిపత్రం సమర్పించినట్టు చూపించడం గమనార్హం. అంటే బార్ల యజమానుల నుంచి వినతి పత్రం రాకముందే ఆ ఫీజును రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దాన్ని రాటిఫై చేసేందుకు అన్నట్టుగా లేని వినతి పత్రాన్ని ఒకదానిని సృష్టించారు. అక్రమాన్ని కప్పిపుచ్చుకునేందుకు బార్ల యజమానుల పేరిట ఇలా లేఖను సృష్టించినట్టు సీఐడీ గుర్తించింది. అనంతరం బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. మరోపక్క డిస్టిలరీలకు అడ్డగోలుగా అనుమతులు జారీ చేయడమే కాకుండా, అప్పటివరకు లేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండిపడిందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నివేదించారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. ఈ మొత్తం బాగోతంపై గురించి సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ఇక నిందితుల విచారణే మద్యం కుంభకోణంపై కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ, అందులో పాత్రధారులు, సూత్రధారులను విచారించేందుకు ఉపక్రమిస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకుంది. ప్రధానంగా నోట్‌ఫైళ్లు, ఇతర ఆధారాలను సేకరించింది. ఒకే రోజులో పరస్పర విరుద్ధంగా నోట్‌ఫైళ్లు రూపొందించడం, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసిన తరువాత కూడా బార్ల యజమానుల పేరిట వినతిపత్రాన్ని రికార్డుల్లో చేర్చిన పన్నాగాన్ని ఛేదించనుంది. అందుకోసం త్వరలోనే నిందితులకు నోటీసులు జారీ చేయనుంది. నిందితుల విచారణకు ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని గుర్తించింది. వారికీ నోటీసులు జారీ చేయనుంది. మద్యం కంపెనీల ప్రతినిధులతోపాటు కీలక ఉన్నతాధికారులను విచారించేందుకు సిద్ధపడుతోంది. ఆ విచారణ ద్వారా గుర్తించిన అంశాలను సమీక్షించిన తరువాత కేసు దర్యాప్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
నకిలీ అధికారి అవతారమెత్తిన టీడీపీ నేత పుట్టా అనుచరుడు
సాక్షి ప్రతినిధి, కడప: సీఐడీ అధికారులమంటూ హడావుడి చేసిన నకిలీ అధికారుల బండారం బట్టబయలయిన ఘటనలో వైఎస్సార్ జిల్లా టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడితో సహా 8మందిని cc అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన న్యాయవాది మహేంద్రకుమార్ (38) టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడు. పుట్టా సుధాకర్‌యాదవ్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన రంజిత్‌కుమార్ (47)తో పరిచయం ఏర్పడింది. అతను గతంలో తాను పనిచేసిన హైదరాబాద్ కేంద్రంగా అమెరికా ఐటీ నియామకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజా (ఏజేఏ) సంస్థ వ్యవహారాల గురించి మహేంద్రకుమార్‌కు తెలిపారు. ఆ సంస్థ లొసుగుల కారణంగా డైరెక్టర్ సుగుణాకరను బెదిరిస్తే రూ.కోట్లు కొల్లగొట్టవచ్చని చెప్పాడు. ఈ క్రమంలో కర్నూల్ రేంజ్ కార్యాలయంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సుజన్‌ను సంప్రదించారు. ఎస్ఐ సుజన్ కడప అశోక్‌నగర్‌లో ఉంటున్న ఐటీ నిపుణుడు మహ్మద్ అబ్దుల్ ఖదీర్‌ను పరిచయం చేశారు. టెక్నికల్ ఇష్యూస్ బాగా తెలిసిన మరికొంతమంది సభ్యులతో కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆ మేరకు అజా సంస్థలోకి ప్రవేశించారు. సీఐడీ అధికారులుగా గుర్తింపు కార్డులు చూపించి తనిఖీలు నిర్వహించి నానా హడావుడి చేశారు. రూ.10కోట్లు డిమాండ్ అమెరికాలోని క్లయింట్ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆ దేశ అధికారులు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలకు వచ్చినట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ను భయపెట్టారు. ఈ వ్యవహారం నుంచి బయటపడాలంటే రూ.10కోట్లు ముట్టచెప్పాలని డిమాండ్ చేశారు. బేరసారాల తర్వాత రూ.2.3కోట్లు అప్పగించేలా అంగీకారం కుదిరింది. కంపెనీ ఖాతాల్లో రూ.71.80 లక్షలున్నాయని బాధితుడు చెప్పారు. నేరుగా తీసుకుంటే దొరికిపోతామని భావించి ఆ సంస్థ ఉద్యోగులు రవి, చేతన్, హరి ఖాతాల్లోకి రూ.26 లక్షలు బదలాయించారు. ఈ మొత్తం వ్యవహారం జనవరి 26న చోటు చేసుకుంది. 27వ తేదీ ఉదయం ఆ ముగ్గురు ఉద్యోగుల్ని మాదాపూర్‌లోని బాల్కనీ హోటల్‌కు తీసుకెళ్లి బంధించారు. ఏటీఎం కార్డులు, బ్యాంకు వివరాలు తీసుకుని రూ.12.5లక్షలు తమ ఖాతాల్లోకి మార్చుకున్నారు. మిగతా సొమ్ముకోసం డైరెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో.. ఉద్యోగుల్ని వదిలేసి పారిపోయారు. విషయం గ్రహించిన సంస్థ డైరెక్టర్ సుగుణాకర పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో సహకరించిన వారితో పాటు, ప్రత్యక్షంగా పాల్గొన్న 10మందిపై కేసు నమోదైంది. మైదుకూరు టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడు మహేంద్రకుమార్, సుబ్బకృష్ణతో పాటు 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుజన్, రాజా అనే నిందితుడు పరారీలో ఉన్నారు. -
HYD: పాస్‌పోర్టు స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. మరో ఇద్దరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో సీఐడీ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అనంతపురానికి చెందిన ఏజెంట్‌తో పాటు మరొకరిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి పాస్‌పోర్టులు సహా పలు నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని సీఐడీ అరెస్టు చేయగా.. తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కి చేరింది. నిందితులందరిని కస్టడీకి తీసుకొని విచారించనుంది. ఇప్పటికే 92 నకిలీ పాస్‌పోర్టులను సీఐడీ గుర్తించింది. అరెస్టయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో 35కి పైగా పాస్‌పోర్టులు రద్దు చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. పలువురు నిందితులు ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు గుర్తించింది.. మిగతావారినైనా దేశం దాటకుండా ఉండేందుకు లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తోంది. పాస్‌పోర్టుల జారీలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. పాస్‌పోర్టు జారీ, ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏజెంట్లు.. అధికారులకు లంచాలు ఇచ్చారని సీఐడీ ఆధారాలు సేకరించింది. -
అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ
భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా అస్సాంలో రాహుల్‌పై నమోదైన క్రిమినల్ కేసును పోలీసులు సీఐడీకి బదిలీ చేశారు. జనవరి 23న గువాహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణపై రాహుల్ గాంధీపై అసోం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు కోసం సీఐడీకి బదిలీ చేసినట్లుగా ఆ రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్ ట్విటర్ ద్వారా తెలిపారు. సమగ్రమైన, లోతైన విచారణకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా మంగళవారం మేఘాలయా నుంచి అస్సాం గువాహటిలోకి రాహుల్ ప్రవేశించగా.. సిటీలోకి ఆయన యాత్రకు అనుమతి లేదని అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కాంగ్రెస్ శ్రేణులు బారికేడ్లను దాటి దూసుకురావడంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో అస్సాంలో ఘర్షణలు సృష్టించినందుకు.. హింస, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడికి పురిగొల్పినందుకు వంటి ఆరోపణలతో రాహుల్, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై 9 కేసు నమోదు చేశారు. దీంతో రాహుల్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. గువాహటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత హెచ్చరించారు. దీనిపై రాహుల్ కౌంటర్ ఇస్తూ బీజేపీ సర్కార్ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. మరోవైపు రాహుల్ భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోనళ వ్యక్తం చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకేంద్రహోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కేసును సీఐడీకి బదిలీ చేయడం ఆసక్తిగా మారింది. చదవండి: రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -
లోకేశ్ ‘రెడ్ డైరీ’ కేసు 30కి వాయిదా
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలపై కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా, కీలక సాక్షులను భయభ్రాంతులకు గురిచేసేలా నారా లోకేశ్.. అధికారులను బెదిరిస్తున్నారన్న సీఐడీ పిటిషన్‌పై విచారణను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ నెల 30కి వాయిదా వేసింది. గతంలో ఆయనకు ఇచ్చిన 41ఏ నోటీసులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఐడీ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతంలో 41ఏ నోటీస్ కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్ పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బెదిరించిన విషయాన్ని ఆధారాలతో సహా నివేదించింది. రెడ్ డైరీ పేరుతో కీలక సాక్షులను బెదిరిస్తున్న లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలని పిటిషన్లో కోరింది. కాగా ఈ కేసులో జారీ చేసిన నోటీసులను తీసుకునేందుకు లోకేశ్ సుముఖత చూపలేదు. ఆ నోటీసులు అందించేందుకు వెళ్లిన సీఐడీ అధికారులకు ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో నోటీసులను పోస్టులో లోకేశ్ నివాసానికి పంపారు. ఆ నోటీసులను తీసుకునేందుకు లోకేశ్ నిరాకరించారు. నోటీసులను లోకేశ్ మొబైల్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపించినా కూడా ఆయన స్పందించలేదు. దాంతో ఆ విషయాన్ని కూడా సీఐడీ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో న్యాయస్థానం ద్వారా నోటీసులు జారీ చేయాలని కోర్టు రిజిస్ట్రార్ ను న్యాయమూర్తి ఆదేశించారు. లోకేశ్ గానీ, ఆయన తరఫు న్యాయవాదులు గానీ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని లోకేశ్ తరఫు న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానాన్ని మంగళవారం కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. -
Nara Lokesh: రెడ్‌బుక్ కేసు విచారణ నేడు
విజయవాడ, సాక్షి: నారా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు రెడ్ బుక్ బెదిరింపుల కేసు నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో కోర్టు ఆదేశాలానుసారం సీఐడీ, లోకేష్‌కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నోటీసులు అందుకోకపోవడంపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరవుతారా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. యువగళం పేరిట యాత్ర చేపట్టిన నారా లోకేష్.. ముగింపు రోజున పలు ఇంటర్వ్యూల్లో కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేశారు. దీంతో గత నెలలో ఏసీబీ కోర్టులో సీఐడీ ఒక మెమో దాఖలు చేసింది. లోకేష్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ.. ఆధారాలతో సహా పిటిషన్లో సీఐడీ కోరింది. దీంతో తమ ముందు హాజరై స్వయంగా హాజరైగానీ లేదంటే న్యాయవాది ద్వారాగానీ వివరణ ఇవ్వాలని కోర్టు లోకేష్‌ను ఆదేశించింది. మెమోలో ఏముందంటే.. యువగళం ముగింపు సమయంలో లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో.. తన తండ్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ తప్పుడు కేసులు బనాయించిందని, రిమాండ్ విధించడం తప్పంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థను కించపరిచేలా ఉన్నాయని.. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల్ని తప్పుబట్టేలా ఉన్నాయని.. అన్నింటికి మించి కోర్టు ఆదేశాల్ని ధిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ మెమోలో సీఐడీ పేర్కొంది. ఆ వాంగ్మూలాలు తప్పేనంటూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్‌రోడ్ కుంభకోణం, ఫైబర్ నెట్ స్కామ్.. తదితర కేసులలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారు. అయితే.. ఆ సమయంలో తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాలను నారా లోకేష్ తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ‘‘అసలు అధికారులు 164 సీఆర్పీసీ క్రింద వాంగ్మూలం ఎలా ఇస్తారు? వాళ్ల పేర్లు రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశా. మా ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తా’ అంటూ లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. ఇది సాక్ష్యులను బెదిరించి.. కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించడమే అవుతుందని సీఐడీ ఏసీబీ కోర్టు పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు.. గతంలో లోకేష్‌కి జారీ చేసిన 41ఏ నోటీసులలో పేర్కొన్న షరతులకీ విరుద్ధంగా ఆయన మాట్లాడారని పేర్కొంది. లోకేష్‌పై కోర్టు సీరియస్ రెడ్ బుక్ బెదిరింపుల వ్యవహారంలో కేసులో.. నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులును లోకేష్ తొలుత స్వీకరించలేదు. ఈ పరిణామంలో లోకేష్ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్టర్ పోస్టులో పంపాలని సీఐడీని ఆదేశించింది. దీంతో చేసేది లేక రిజిస్టర్ పోస్టులో సీఐడీ, లోకేష్‌కు నోటీసులు పంపింది.