సాక్షి, విజయవాడ: చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. కేసులో ఏ3గా చంద్రబాబును చేర్చారు.
ఎఫ్‌ఐఆర్ కాపీ పూర్తి వివరాల కోసం చదవండి
చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి విచారణ జరపాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను ఏసీబీ కోర్టు అనుమతించింది.
చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారు: ఏపీబీసీఎల్ ఎండీ
మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చే అంశంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఏపీబీసీఎల్ ఎండీ పేర్కొన్నారు. రెండు బేవరేజ్‌లు, మూడు డిస్ట్రిలరీల కోసం 2012లో మద్యం పాలసీనే మార్చేశారు. 2015లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి పన్నులు రాకుండా చేశారు. 8 శాతం వ్యాట్ కాకుండా 6 శాతం పన్నులు తీసేశారని APBCL ఎండీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మద్యం కంపెనీల అనుమతుల పూర్తి కథేంటీ?
40 ఏళ్ల అనుభవం అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం విధానంలో కొత్త ఒరవడులు తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలకుగానూ ఏకంగా 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే.
లిక్కర్‌లో చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లు వినూత్నం, విశేషం. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, భూంభూం బీర్, పవర్ స్టార్ 999, లెజెండ్.. ఇవన్నీ చంద్రన్న కానుకలే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్ బ్రాండ్‌లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. బాబు హయాంలో మద్యం సిండికేట్లు రాజ్యమేలేవి. నలభైఐదు వేల బెల్టు షాపులతో మద్యాన్ని ఇంటింటికి సరఫరా చేసేవారు.
► చంద్రబాబు హయాంలోనే బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజండ్, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హేంగర్ లాంటి 254 బ్రాండ్‌లకు అనుమతులిచ్చారు. ఇలాంటి బ్రాండ్ల పేరుతో తన దగ్గరి నేత రుణం తీర్చుకున్నారు.
► SPY బ్రాండ్ ఎవరిదో అందరికీ తెలుసు. ఎస్‌పీవై రెడ్డి ఏ పార్టీలో ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే
► విశాఖ డిస్టిలరీకి 2019 ఫిబ్రవరి 25న అనుమతి ఇచ్చారు. అది టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి చెందిన కంపెనీ. చంద్రబాబు పాలన అయిపోగానే దాన్ని అమ్మేశారు.
► PMK డిస్టిలరీ పార్టీలోని ఓ సీనియర్ నేత వియ్యంకుడిందని తెలుగుదేశంలోనే ప్రచారం ఉంది
► శ్రీకృష్ణా డిస్టిలరీ కూడా రాయలసీమ టిడిపి నేతకు చెందినది
► 1982కి ముందు ఉన్నవి కేవలం ఐదు డిస్టిలరీలే. ఆ తర్వాతే మిగిలినవన్నీ వచ్చాయి. యాజమాన్యం మారిన రెండు కంపెనీలతో కలిపి చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చినవి మొత్తం 14.
► చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 7 డిస్టిలరీలకు కు అనుమతి ఇచ్చారు. ఐదేళ్లలో 254 బ్రాండ్లు, ఏడు డిస్టిల్లరీలకు అనుమతి ఇచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు
► ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూడీలక్స్ బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉండగానే 2017 నవంబరు 22న అనుమతిచ్చారు.
► గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకు కూడా టీడీపీ ప్రభుత్వమే 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చింది.
► హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలు సైతం చంద్రబాబు నిర్వాకమే. ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం 2017 జూన్ 7న అనుమతి జారీచేసింది.
► రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు కూడా చంద్రబాబే 2018 నవంబరు 9న అనుమతిచ్చారు.
► బిరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు అనుమతులు పదవి నుంచి దిగిపోయే కొద్ది ముందు ఇచ్చారు.
► టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ టీడీపీ సర్కారే అనుమతి ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment