45 ఏళ్ళ రాజకీయ జీవితంతో కోర్టు బోన్ ఎక్కకుండా... ఎన్నో నేరాలు, ఘోరాలు చేసినా తప్పించుకున్న చంద్రబాబు, ఇప్పుడు మొట్టమొదటి సారిగా కటకటాల పాలవుతున్నాడు! తాను తప్పించుకునేందుకు మొత్తం భూమ్యాకాశాల్నీ ఏకం చేసినా... తప్పించుకోలేని తప్పులు చేసి మొట్టమొదటి సారిగా బోన్ ఎక్కాడు, జైల్‌లోకి వెళుతున్నాడు!
తప్పు చేయనివాడిని నీతిమంతుడు అంటారు గానీ... తప్పులు చేయటమే పనిగా పెట్టుకుని, దొరక్కుండా మేనేజ్ చేసుకుంటూ తప్పించుకు తిరుగుతున్నవాడిని నీతిమంతుడంటారా?
చివరికి తన సుప్రీం కోర్టు లాయర్ లూధ్రా, తన 15 మంది లాయర్ల వాదనలే కాకుండా... తానే లాయర్‌గా మారి వాదించినా చంద్రబాబుకు రిమాండ్ తప్పలేదు! చంద్రబాబు నాయుడు చేసిన వాదనలు చూస్తే... ఎక్కడా, తాను అవినీతి చేయలేదని చెప్పలేదు!
బయట ప్రెస్‌మీట్ పెట్టిన అచ్చెన్నాయుడు కూడా, తమ చంద్రబాబు నీతిమంతుడని ఎక్కడా చెప్పలేదు! చివరికి ఎల్లో మీడియా కూడా! బాబు చేసినవన్నీ టెక్నికల్‌గా వాదనలే తప్ప...
* తనను 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టలేదని
* గవర్నర్‌కు చెప్పలేదని
* 48 గంటలు అయిపోయింది... వదిలేయాలని
* రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు పేరు మొదట్లో లేదని
* నంద్యాల కోర్టులోనే చంద్రబాబును ప్రవేశపెట్టి ఉండాలని
* పీసీ యాక్ట్ ప్రకారం వారం ముందు నోటీస్‌లు ఇవ్వాలని...
ఇలాంటి వాదనలు చేశారు తప్ప.... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈ కుంభకోణంలో ఆయన పాత్ర లేదని ఎక్కడా వాదించకపోవటం గమనించాల్సిన విషయం!
అంటే... నేను అవినీతి పరుడిని కాదు... ఎలాంటి విచారణకైనా సిద్ధం లాంటి పదాలు చంద్రబాబు నోట రావటం లేదు! అంతే కాకుండా, ఎలాంటి జ్యుడీషియల్ స్రూటినీకి అయినా నిలబడతాను అని; అవినీతి జరగనే లేదని చంద్రబాబుగానీ, ఆయన లాయర్లుగానీ వాదించకపోవటం... రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం!
స్కిల్ స్కాం అనేదే లేదని చంద్రబాబు, టీడీపీ, ఎల్లో మీడియాల్లో ఏ ఒక్కటీ చెప్పటం లేదు! వారి వాదనంతా... మా బాబుకు సంబంధం ఏమిటి అన్నది మాత్రమే! దీని అర్థం... బాబు, తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశాడన్నది, ఈ సారి తప్పించుకోవటం కుదరలేదన్నది!
మా చంద్రబాబును జైల్లో పెడతారా అని ఆవేశపడి అరిచే వాళ్ళలో ఏ ఒక్కరూ... మా చంద్రబాబు ఎలాంటి విచారణకైనా సిద్ధం... ఎలాంటి దర్యాప్తు అయినా ఎదుర్కొంటాడు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో సహా, అని అనకపోవటాన్ని గమనించాలి! ఎందుకంటే చంద్రబాబు... వీరప్పన్ మాదిరిగా దొరకని దొంగే తప్ప, దొంగ కాదు అనటానికి ఎలాంటి ఆధారాలూ లేవు!
అవినీతి, చట్ట విరుద్ధ కార్యక్రమాలు... అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థల మేనేజ్‌మెంట్, ఇందుకు ఒక వర్గం ఎల్లో మీడియా మద్దతు... ఇవన్నీ ఈ రాష్ట్రంలో నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు రాజకీయాలు తెలిసిన వారందరికీ తెలుసు!
* చివరికి ఎన్టీఆర్‌ను ఆయన సీఎం పదవి లాక్కున్నా...
* తెలంగాణలో ఓటుకు కోట్లిస్తూ దొరికినా...
ప్రతి సందర్భంలో బాబు దొంగతనాల్ని ఎల్లో మీడియా, టీడీపీతో పాటు... పవన్ కళ్యాణ్, సీపీఐ నారాయణ, రామకృష్ణ లాంటి వారు నిరంతరం సమర్థిస్తూ వచ్చారు! సుజనా, సీఎం రమేశ్ లాంటి వారిని బాబు, తన అవినీతి మేనేజ్‌మెంట్‌కే వేరే పార్టీలకు పంపాడు!
ఇప్పుడు పురంధేశ్వరి కూడా అదే జాబితాలో చేరిపోయి బాబు కోసం లాబీయింగ్ చేసే బృందంలో చేరిపోయి; చివరికి కేంద్ర ప్రభుత్వ ఐటీ షోకాజ్ నోటీస్‌లకు కూడా విలువ లేదని చెపుతూ చంద్రబాబుకు ఎంతటి విలువ ఇచ్చారో చూస్తున్నాం!
ఇక పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు కోసం నడి రోడ్డుమీద నడక నుంచి పడక వరకు ఎందుకైనా రెడీ అయిపోయాడు! ప్యాకేజీ స్టార్‌కు బాబే చట్టం, బాబే రాజ్యాంగం, బాబే పీసీ యాక్ట్, బాబే ఐపీసీ, బాబే సీఆర్‌పీసీ! ఇదీ పరిస్థితి!
ఇక తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా కంబైన్డ్‌గా సృష్టించి, నారు–నీరు పోస్తున్న రకరకాల బృందాలు, JACలు, విశ్లేషకులు... వీరంతా స్లీపర్ సెల్స్‌గా చంద్రబాబు నడుపుతున్న ఒక ముఠాకు సపోర్టింగ్ వ్యవస్థ.
చదవండి: చంద్రబాబుకు జైలే
Comments
Please login to add a commentAdd a comment