- రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు తరలింపు
- ప్రత్యేక భద్రత నడుమ చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న పోలీసులు
- చంద్రబాబుకు రాజమండ్రి జైలును కేటాయిస్తూ వారెంట్ జారీ
► రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న చంద్రబాబు. చంద్రబాబుకు ఖైదీ నెంబర్ 7691 కేటాయింపు.
►కొవ్వూరు టోల్గేట్ దటిన చంద్రబాబు కాన్వాయ్, ఫోర్త్ బ్రిడ్జి మీదుగా కొవ్వూరు నుండి దివాన్ చెరువుకు ప్రవేశించనున్న చంద్రబాబు కాన్వాయ్. హైవే మీదుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోనున్న చంద్రబాబు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద 300 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు సెంట్రల్ జైలు రోడ్డు బ్లాక్ చేసిన పోలీసులు.
►ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలను పరిశిలించిన ఏసీబీ కోర్టు తీవ్ర ఉత్కంఠత నడుమ తీర్పును ప్రకటించింది. చివరకు చంద్రబాబుకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది.
►స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడును ఆదివారం కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. విజయవాడ ఏసీబీ కోర్టులో ఉదయం నుండి దాదాపు ఏడున్నర గంటలకు పైగా వాదనలు జరిగాయి. వాదనలు ముగిశాక కోర్టు కాంపౌండులో కొంత హైడ్రామా నడిచిన తర్వాత ఏసీబీ జడ్జి సీఐడీ వాదనలతో ఏకీభవిస్తున్నటు తెలుపుతూ చంద్రబాబుకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది.
►సిఐడి అధికారులు సిద్ధం చేసిన రిమాండు రిపోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా ఉంటూనే చంద్రబాబు నేరానికి పాల్పడ్డారని, తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని రిమాండ్ రిపోర్టులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
►మొత్తం రూ. 371 కోట్ల కుంభకోణమని అభియోగం మోపారు. దీనిలో సీమెన్స్ 90 శాతం ఖర్చు భరిస్తుందని క్యాబినెట్‌లో అబద్ధాలు చెప్పారని, నోట్ ఫైల్‌ను చంద్రబాబు, అచ్చెన్నాయుడు అప్రూవల్ చేశారని సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆర్థికశాఖ కార్యదర్శి అభ్యంతరం చెప్పినా కూడా వారు పట్టించుకోలేదని ఆనాడు సీఎం, సీఎస్ ఆదేశాలతోనే నిధులు విడుదలయ్యాయని, షెల్ కంపెనీల ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ. 259 కోట్లు మళ్లించారని రిపోర్టులో స్పష్టం చేశారు.
►ఆదివారం ఉదయాన్నే ఏసీబీ కోర్టులో వాదనలు జరిగగా చంద్రబాబు తరుఫున సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరుఫున అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి న్యాయమూర్తికి వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ జడ్జి సాయంత్రం తీర్పును వెలువరించింది. ఈ నెల 22 వరకు చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకు జైలే
Comments
Please login to add a commentAdd a comment