remand
-
రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వాలి
సాక్షి, అమరావతి: ఏదైనా కేసులో తనకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు అందుకు గల కారణాలతో కూడిన రిమాండ్ ఆర్డర్‌ను తనకు అందజేయాలని నిందితుడు కోరితే, ఆ ఆర్డర్‌ను నిందితునికి సత్వరమే అందజేయాల్సి ఉంటుందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. పౌరుల హక్కులు ముడిపడి ఉన్న కేసుల్లో కింది కోర్టులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పప్పుల వెంకటరామిరెడ్డి అరెస్టు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రిమాండ్ ఆర్డర్ కోసం వెంకటరామిరెడ్డి సంబంధిత కోర్టులో దరఖాస్తు చేశారో తెలుసుకోవాలని ఆయన తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వకపోతే అది చెల్లదు..తన కుమారుడు పప్పుల వెంకటరామిరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు అతనికి విధించిన రిమాండ్ చెల్లదంటూ పప్పుల చెలమారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెలమారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రిమాండ్‌కు గల కారణాలను నిందితుడైన వెంకటరామిరెడ్డికి అందచేయలేదన్నారు. రిమాండ్ ఆర్డర్‌ను నిందితునికి అందచేయడం తప్పనిసరని, అలా ఇవ్వని పక్షంలో ఆ రిమాండ్ చెల్లదన్నారు. ఇందుకు సంబంధించి పలు తీర్పులున్నాయన్నారు. అంతకుముందు.. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, వెంకటరామిరెడ్డిని అరెస్టుచేసి కోర్టు ముందు హాజరుపరిచామన్నారు. అందువల్ల ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. నిందితుడు కింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశారని, అందువల్ల ఈ వ్యాజ్యంపై ఎలాంటి విచారణ అవసరంలేదన్నారు. అరెస్టుకు గల కారణాలను కూడా అతనికి తెలియజేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కింది కోర్టులు నిందితులకు వారి రిమాండ్ ఆర్డర్‌ను సత్వరమే అందజేయాలని అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుడు రిమాండ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేయలేదని తెలిపింది. ఈ సమయంలో శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని తాము మరోసారి పరిశీలన చేస్తామన్నారు. దీంతో ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను 29కి వాయిదా వేసింది. -
తెలుగువారిపై కామెంట్స్.. సినీ నటి కస్తూరికి రిమాండ్
తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. తాజాగా ఇవాళ ఆమెను చెన్నైలోనే ఎగ్మోర్ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 29 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలుకాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల పరిపాలనలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారంది. (ఇది చదవండి: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు.. కస్తూరి అరెస్ట్)క్షమాపణలు చెప్పిన కస్తూరిఅలా వచ్చినవారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొంది. అలాగైతే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై చెన్నైలో నివసించే తెలుగు వారు మండిపడ్డారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలుగువారికి కస్తూరి క్షమాపణలు చెప్పింది. -
కలెక్టర్‌పై దాడి కేసు.. బీఆర్ఎస్ నేత నరేందర్‌రెడ్డికి రిమాండ్
సాక్షి,రంగారెడ్డిజిల్లా: వికారాబాద్ కలెక్టర్‌పై కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన దాడి కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి బుధవారం(నవంబర్13) కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫార్మా కంపెనీ భూ సేకరణ జరుపుతున్న క్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్ సోమవారం లగచర్ల వెళ్లారు.ఈ సమయంలో కలెక్టర్‌పై పలువురు గ్రామస్తులు దాడి చేశారు. దాడి నుంచి కలెక్టర్ తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ దాడి ఘటనలో వెనుక ఉండి నడిపించింది బీఆర్ఎస్ నేత నరేందర్‌రెడ్డి అనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు.దీంతో కోర్టు నరేందర్‌రెడ్డికి ఈనెల 27 వరకు రిమాండ్ విధించింది. దీంతో నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.లగచర్ల ఘటనలో మంగళవారం 16 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు బుధవారం మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సురేశ్ సోదరుడితో పాటు మరో ముగ్గురు ఉన్నారు.ఇదీ చదవండి: పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్.. అప్డేట్స్ -
గుంటూరు జిల్లా జైలుకు పెద్దిరెడ్డి సుధారాణి దంపతులను తరలింపు
-
అరెస్ట్‌కు కారణాలను రాతపూర్వకంగా చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: ఏ కేసులో అయినా అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు రాతపూర్వకంగా ఇవ్వాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో పోలీసులు ఏకీకృత, నిర్ధిష్ట విధానాన్ని అనుసరించడం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆ దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్‌కు గల కారణాలను నిందితునికి రాతపూర్వకంగా తెలియచేసి తీరాలని పోలీసులను ఆదేశించింది. తద్వారా కస్టోడియల్ రిమాండ్ నుంచి తనను తాను కాపాడుకుని, బెయిల్ కోరేందుకు అవకాశం ఇవ్వాలని తేల్చిచెప్పింది. అలా చేయని పక్షంలో వివాదాస్పద అంశాల్లో వాస్తవాలేమిటన్న విషయం తేలకుండా పోతుందని పేర్కొంది.అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు రాతపూర్వకంగా తెలియచేసే విషయంలో ఏకీకృత విధానాన్ని రూపొందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. అరెస్ట్‌కు దారి తీసిన కేసుకు సంబంధించిన మౌలిక వివరాలను కూడా అందులో పొందుపరచాలంది. అరెస్ట్‌కు సంబంధించి ఏ కారణాలనైతే నిందితునికి తెలియచేశారో వాటిని రిమాండ్ రిపోర్ట్‌తో జత చేయాలని కూడా ఆదేశించింది.రిమాండ్ అధికారాన్ని ఉపయోగించే న్యాయాధికారులు, మేజిస్ట్రేట్లు, జడ్జీలందరూ అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు తెలియచేయాలన్న రాజ్యాంగంలోని అధికరణ 22(1)లోని ఆదేశాన్ని, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 47(1)ను పోలీసులు అనుసరించారా లేదా అన్న దానిపై తమ సంతృప్తిని రికార్డ్ చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. అరెస్టయిన వ్యక్తికి కూడా హక్కులుంటాయని, మానవ హక్కులు కూడా వర్తిస్తాయని తెలిపింది.విద్యాసాగర్ రిమాండ్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోంసినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసులో విజయవాడ కోర్టు తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. విద్యాసాగర్ రిమాండ్ విషయంలో విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. విజయవాడ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను కొట్టేసేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి సోమవారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పు కాపీని రాష్ట్రంలోని న్యాయాధికారులందరికీ, డీజీపీకి పంపాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు.ఇదే సమయంలో తన అరెస్ట్ గురించి, అరెస్ట్‌కు గల కారణాల గురించి తన కుటుంబ సభ్యులకు గానీ, స్నేహితులకు గానీ పోలీసులు తెలియచేయలేదన్న విద్యాసాగర్ వాదనను న్యాయమూర్తి తన తీర్పులో తోసిపుచ్చారు. అరెస్ట్ గురించి, అరెస్ట్‌కుగల కారణాలను పోలీసులు విద్యాసాగర్‌కు 20.09.2024 ఉదయం 6.30 గంటల సమయంలోనే తెలియచేశారన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో జతచేసిన డాక్యుమెంట్లలో విద్యాసాగర్ అరెస్ట్‌కు సంబంధించిన అరెస్ట్ మెమో కూడా ఉందని తెలిపారు. జత్వానీ ఫిర్యాదు మేరకు విద్యాసాగర్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన్ను అరెస్ట్ చేశారు. విజయవాడ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ చక్రవర్తి సోమవారం తీర్పు చెప్పారు. -
మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు నవంబర్ 4 వరకు రిమాండ్
-
మాజీ ఎంపీ సురేష్ కు 14రోజుల రిమాండ్
సాక్షి, అమరావతి/మంగళగిరి : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను బుధవారం అర్థరాత్రి దాటాక హైదరాబాద్‌లో అరెస్టుచేసిన పోలీసులు ఆయనను గురువారం ఉ.8.30 గంటలకు మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుచేసిన పోలీసులు స్టేషన్లో ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈయనతోపాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసులరెడ్డిని కూడా అరెస్టుచేసిన మంగళగిరి రూరల్ పోలీసులు వీరిద్దరినీ మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం వీరిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. అక్రమ కేసులతో తమను అడ్డుకోలేరని, 2029లో చంద్రబాబుకు బుద్ధిచెప్పి తీరుతామన్నారు. కక్షతోనే తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందిపెడుతున్నారని.. ప్రజలు, దేవుడు చూస్తున్నారని చెబుతూ జై జగన్ అంటూ నినదించారు. అంతకుముందు.. స్టేషన్ వద్ద సురేష్ సతీమణి బేబీలత మాట్లాడుతూ.. తన భర్తపై చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టారన్నారు. కేసులతో తమను భయపెట్టలేరని, 2019కు ముందు పొలాల దగ్థం కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని అప్పట్లో తన భర్తపై టీడీపీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా లొంగలేదని.. ఇలాంటి అక్రమ కేసులకు తాము భయపడేదిలేదని స్పష్టంచేశారు. ఇక సురే‹Ùను అరెస్టుచేశారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్‌బాబు, వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, నవరత్నాల అమలు కమిటీ మాజీ చైర్మన్ నారాయణమూర్తి, గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాలవజ్ర బాబు, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కమ్మూరి కనకారావు తదితరులతో పాటు కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకుని ఆయనకు మద్దతు పలికారు. -
కలకత్తా ట్రైనీ డాక్టర్ కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
కలకత్తా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా మహిళా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సీబీఐ కస్టడీ ముగియడంతో నిందితునికి కట్టుదిట్టమైన భద్రత నడుమ కలకత్తాలోని సెల్డా క్రిమినల్ కోర్టు జడ్జి ముందు శుక్రవారం(ఆగస్టు23) హాజరుపరిచారు.దీంతో కోర్టు నిందితునికి 14 రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు నిందితుడిని జైలుకు తరలించారు. ఇటీవల కలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యంత దారుణంగా లైంగికదాడి జరిపి హత్య చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. -
పిన్నెల్లికి రిమాండ్
సాక్షి, నరసరావుపేట/నెల్లూరు (క్రైం): పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల అదనపు జూనియర్ సివిల్ కోర్టు రెండు కేసుల్లో 14 రోజుల రిమాండ్ విధించింది. మరో రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ మేజిస్ట్రేట్ ఎస్. శ్రీనివాస కల్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ రోజు, తరువాత జరిగిన ఘటనలపై తనపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బుధవారం మధ్యాహ్నం హైకోర్టు తోసిపుచ్చడం, ఆ వెంటనే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి నరసరావుపేట ఏరియా వైద్యశాలలో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని మాచర్లకు తరలించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శ్రీనివాస కల్యాణ్ ముందు హాజరుపరిచారు. ఆయనపై నమోదైన నాలుగు కేసులపై విడివిడిగా ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. తెల్లవారుజాము నాలుగు గంటల వరకు వాదనలు కొనసాగాయి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం కేసు, పోలింగ్ బూత్ ముందు మహిళను బెదిరించారంటూ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కారంపూడి సీఐ నారాయణస్వామి, టీడీపీ నేత నంబూరి శేషగిరిరావుపై దాడి కేసుల్లో రిమాండ్ విధించింది. పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. వెంటనే ఆయన్ని పటిష్ట భద్రత మధ్య నెల్లూరు తీసుకెళ్లారు. గురువారం ఉదయం 8.30 గంటలకు నెల్లూరులోని కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్తగా కేంద్ర కారాగారం వద్ద పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎవరూ అక్కడికి రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.కోర్టు వద్దే పిన్నెల్లిపై దాడికి యత్నంపెన్నెల్లిని కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చిన సమయంలో కోర్టు వద్దే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై దురుసుగా వ్యవహరించారు. పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు ముందే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. పిన్నెల్లి కోర్టు లోపలికి వెళ్తున్న సమయంలో మాచర్లకు చెందిన టీడీపీ కార్యకర్త కొమేర శివ అడ్డంగా నిలబడి దురుసుగా మాట్లాడాడు. ఆయనపై దాడి చేయబోయాడు. పోలీసులు అడ్డుకోకపోవడంతో పిన్నెల్లి అతన్ని తోసుకొని కోర్టులోకి వెళ్లిపోయారు. కోర్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. మాజీ ఎమ్మెల్యేని కోర్టులో హాజరుపరుస్తున్న సందర్భంలో ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీ కార్యకర్తలను అక్కడకు అనుమతించడమే కాకుండా వారు రెచ్చగొట్టేలా దుర్భాషలాడుతున్నా, బాణాసంచా కాల్చుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. పిన్నెల్లిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉందని తెలిసి కూడా ఆయన్ని కోర్టుకు తీసుకువచ్చే సమయానికి వారిని చెదరగొట్టలేదు. పిన్నెల్లిని కోర్టు లోపలికి తీసుకువెళ్లే సమయంలో ఆయన ముందు పోలీసులు ఎవరూ లేరు. అందువల్లే టీడీపీ కార్యకర్త శివ కోర్టు ప్రాంగణంలోనే నేరుగా పిన్నెల్లికి ఎదురు రాగలిగాడు. వెంటనే అతన్ని నిలువరించకపోగా, అతను కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, దాడికి యత్నించినా పట్టించుకోకపోవడం పోలీసుల ఉద్దేశపూర్వక చర్యేనని వైఎస్సార్సీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పైగా, ఉద్దేశపూర్వకంగా కోర్ట వద్దే పిన్నెల్లికి అడ్డు నిలబడి, దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్త శివే తనపై పిన్నెల్లి దాడి చేశారంటూ మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్‌పై దాడి కేసులో ప్రధాననిందితుడైన బిభవ్కుమార్కు కోర్టు 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. ఇటీవల తమ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ను కలిసేందుకు సీఎం నివాసానికి వెళ్లినపుడు తనపై దాడి జరిగిందని స్వాతిమలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ తనను కింద పడేసి తన్నారని ఫిర్యాదులో తెలిపారు. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మలివాల్‌పై దాడి ఘటనపై రాజకీయ దుమారం పెద్దదవుతూనే ఉంది. -
స్వాతి మలివాల్ కేసులో సాక్ష్యాలు మాయం?!
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడి కేసులో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిందితుడు బిభవ్ కుమార్ రిమాండ్ నోట్‌ను విడుదల చేశారు. ఈ కేసులో సాక్షాలు మాయమైట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన రోజు (మే13)న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సీసీటీవీ ఫుటేజీని నిందితుడు బిభవ్‌కుమార్ ట్యాంపర్ చేశారని వెల్లడించారు. ‘‘విచారణకు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ సహకరించడం లేదు. బిభవ్ కుమార్ తన ఫోన్ పాస్ వర్డ్ చెప్పడం లేదు. ఆయన ఫోన్‌ను ముంబైలో ఫార్మాట్ చేశారు. కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీ బ్లాంక్‌గా ఉంది. దాడి జరిగిన వీడియోను తొలగించారు. సీసీటీవీ పుటేజీకి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్‌ను ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరిస్తున్నారు’’ అని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.‘‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు బ్లాంక్‌గా ఉన్నాయి. మే 23( సోమవారం) రోజు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసేందుకు వీలుగా డిజిటిల్ వీడియో రికార్డర్‌ను మాకు అందజేయలేదు.ముఖ్యమంత్రి నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాల నిర్వహణ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. ఆ విభాగానికి చెందని ఓ జూనియర్ ఇంజనీర్ ఇచ్చిన పెన్ డ్రైవ్‌ను పరిశీలించాము. కానీ అందులో ఒక వీడియో బ్లాంక్‌గా వస్తోంది. జూనియర్ ఇంజనీర్ వద్ద డీవీఆర్ యాక్సెస్ లేదు’ అని దర్యాపు చేసిన ఢిల్లీపోలీసులు రిమాండ్ నోట్లో వెల్లడించారు. ఇక.. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి.. ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. -
తాడిపత్రి ఘటనలో 91 మందికి రిమాండ్
విడపనకల్లు: పోలింగ్ అనంతరం తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి టీడీపీ, వైఎస్సార్సీపీలకు చెందిన 91 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేసి ఉరవకొండ సివిల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజి్రస్టేట్ దుర్గా కళ్యాణి ఎదుట హాజరు పరిచారు. జడ్జి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని రెడ్డిపల్లిలోని అనంతపురం జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే అక్కడ సౌకర్యాలు సరిగా లేవని, శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ జడ్జికి తెలిపారు. అందువల్ల నిందితులను కడప కేంద్ర కారాగానికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు జడ్జి నిరాకరించారు. జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. కోర్టు వద్ద భారీ భద్రత అల్లర్ల ఘటనలో నిందితులను ఉరవకొండకు తీసుకువస్తున్నారన్న సమాచారంతో ఉదయం నుంచి కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నిందితుల బంధువులు భారీగా కోర్టు వద్దకు తరలివచ్చారు. పోలీసులు ఉదయమే ఉరవకొండ కోర్టు ఆవరణను ఆ«దీనంలోకి తీసుకున్నారు. గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను కూడా లోనికి అనుమతించలేదు. సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్సీపీకి చెందిన 37 మందిని, టీడీపీకి చెందిన 54 మందిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ఐపీసీ 143, 147, 324, 307, 363 ఆర్డబ్యూ149 కింద కేసులు నమోదు చేశారు. -
సీఎం జగన్‌పై దాడి: సతీష్‌కు మూడు రోజుల పోలీసు కస్టడీ విధింపు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఏ1గా ఉన్న సతీష్‌ను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించ్చింది.ఈ నేపథ్యంలో సతీష్‌ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించనున్నారు. కాగా, న్యాయవాది సమక్షంలో సతీష్‌ను విచారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో, ఈనెల 25, 26, 27 తేదీల్లో సతీష్‌ను పోలీసులు విచారించనున్నారు. ఇక, సీఎం జగన్‌పై సతీష్ రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై సతీష్ హత్యాయత్నానికి తెగబడ్డాడు. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది.రిమాండ్ రిపోర్టు ఇలా.. సీఎం జగన్‌పై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి కోసం నిందితులు పక్కాగా స్కెచ్ గీసుకున్నారన్న విషయం తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పాటు కాల్‌డేటా, సిసిటివి ఫుటేజ్‌లు అన్నీ పరిశీలించిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి కదలికలు స్పాట్లో ఉన్నట్లు నిర్ధారించారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.17వ తేదీన A1నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్ చేసి సెల్‌ఫోన్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఏ2 ప్రోద్బలంతో.. నిందితుడు సతీష్ కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. సీఎంను చంపాలనే కుట్రతోనే సీఎం తల భాగంపై దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.కుట్ర ఎలా జరిగిందంటే?ముఖ్యమంత్రిపై దాడి చేయాలని ముందస్తు పథకం వేసుకున్నారు.ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు ఏ1 సతీష్‌ను ప్రేరేపించాడు.ఈ కేసులో ఏ2 ఆదేశాలతో సీఎం జగన్‌ను హత్య చేయడానికి సతీష్ సిద్ధమయ్యాడుసింగ్ నగర్ ప్రాంతంలో వివేకా నంద స్కూల్ దగ్గర నిందితుడు వెయిట్ చేశాడుసీఎం జగన్ వచ్చే వరకు ఎదురు చూశాడుదాడికి పదునుగా ఉన్న రాళ్లను ముందే సేకరించాడుప్యాంటు జేబులో రాళ్లను పెట్టుకుని నిందితుడు వచ్చాడునిందితుడి కాల్ డేటాలో కీలకమైన అంశాలు దొరికాయిసీసీటీవీ ఆధారంగా కేసుకు సంబంధించి చాలా విషయాలు లభించాయిప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం క్లియర్‌గా ఉందిఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది సాక్షులను విచారించాంసాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేశాం17వ తేదిన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి సెల్ ఫోన్ సీజ్ చేశారు. -
సీఎం వైఎస్ జగన్‌పై దాడి: అది ముమ్మాటికీ హత్యాయత్నమే..
సాక్షి ప్రతినిధి, విజయవాడ : సీఎం వైఎస్ జగన్‌పై నిందితుడు విసిరిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి కనుబొమపై కాకుండా ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో తేల్చిచెప్పారు. ఈ విషయం నిర్ధారణ అయినందునే ఐపీసీ 307 కింద హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొనడంతో అందుకు న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో నిందితుడు వేముల సతీశ్‌కుమార్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతనిని నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. అంతకుముందు.. ఈ కేసులో నిందితుడిని విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదనలు వాడివేడీగా సాగాయి. హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు నిందితుడి తరఫు న్యాయవాది ప్రయత్నించగా.. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిశోర్ ఆ వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియోల ఆధారంగా నిందితుడి తరఫు న్యాయవాది వాదించడం గమనార్హం. ముఖ్యమంత్రికి రాయిదెబ్బ తగలలేదని.. గజమాల ఇనుప వైర్ గీసుకుని గాయమైందని.. పైగా, ఈ దాడికి పాల్పడాలని నిందితుడు సతీశ్‌ను ఎవరూ ప్రేరేపించలేదని వాదించారు. కానీ, ఈ వాదనలను ఏపీపీ కిశోర్ తిప్పికొట్టారు. పోలీసుల రిమాండ్ నివేదికలో పేర్కొన్న అంశాలను ఉటంకిస్తూ పక్కా కుట్రతోనే సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు తగిలిన గాయాల తీవ్రతపై ప్రభుత్వాసుపత్రి అధికారులు ఇచ్చిన నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. నిందితుడు హత్యాయత్నానికి ఉపయోగించిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి సీఎం జగన్ కనుబోమపై కాకుండా తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని నిర్ధారణ అయినందునే ఈ దుర్ఘటనను హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. కుట్రదారుల ప్రేరేపణతోనే.. గతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కేదర్‌యాదవ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఏపీపీ ఈ సందర్భంగా ఉదహరించారు. కొందరు కుట్రదారుల ప్రేరేపించడంతోనే నిందితుడు వేముల సతీశ్ సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైందన్నారు. నిందితుడు సతీష్ మైనర్ అని అతని తరఫు న్యాయవాది వాదనను ఏపీపీ కిశోర్ తప్పని నిరూపించారు. పోలీసులు ముందుగానే నిందితుడు సతీ‹Ùకు కార్పొరేషన్ జారీచేసిన జనన ధృవీకరణ పత్రాన్ని న్యాయస్థానానికి సమర్పించారు. దాని ఆధారంగా నిందితుడికి 19 ఏళ్లు ఉన్నట్లుగా తేలిపోయింది. దీంతో న్యాయస్థానం సతీశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం.. భద్రతా కారణాల దృష్ట్యా అతనిని పోలీసులు నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకుగాను నిందితుడు సతీశ్‌ను పోలీస్ కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. -
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అరెస్ట్, ఈడీ రిమాండ్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు శనివారం ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. రిమాండ్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపడతామని పేర్కొంది. కాగా.. ఈడీ మార్చి 28 వరకు తమ క్లైంట్కు ఈడీ కస్టడీ విధించటం చట్టవిరుద్ధమని సీఎం కేజ్రీవాల్ న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలిసిందే. మార్చి 24 ఆదివారంలోపు తను దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పిటిషన్లో కోరారు. అత్యవసర విచారణ కోసం కేజ్రివాల్ తరపు అడ్వకేట్ ప్రయత్నం చేశారు. కాగా.. ఢిల్లీ హైకోర్టు అత్యవసరణ విచారణకు అనుమతించకపోవటం గమనార్హం. ఇక.. గురువారం ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. నిన్న శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టుకు హాజరుపరిచి.. ఈడీ పదిరోజుల కస్టడీకి కోరింది. దీంతో కోర్టు ఆరు రోజుల పాటు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. చదవండి: కేజ్రీవాలే అసలు కుట్రదారు -
కవితకు రిమాండ్, 7 రోజుల కస్టడీ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో రిమాండ్ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్‌లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. ఫామ్ హౌజ్‌కు కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం, ఆపై కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించిన పరిణామాల అనంతరం ఆమె తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు వెళ్లిపోయారు. అయితే కవిత అరెస్టుపై ఇప్పటివరకూ కేసీఆర్ స్పందించలేదు. కవిత భర్తకు కూడా నోటీసులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అనూహ్యంగా మరో అడుగు ముందుకేసింది. కవిత భర్త అనిల్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే అనిల్ ఫోన్లను సీజ్ చేసింది ఈడీ. కవిత కస్టడీ రిపోర్టులో ఏముందంటే? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారు సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక కుట్ర దారు, ప్రధాన లబ్ధిదారు కవితే ఆమ్ అద్మీ పార్టీకి కవిత లిక్కర్ స్కాం ముడుపుల కింద వంద కోట్లు ఇచ్చారు మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారు రూ. 30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది. మరోవైపు కవిత అరెస్టును ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీయడానికే రాజకీయ డ్రామా చేశారని, కవిత అరెస్టుపై ఆమె తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని, ఈడీ ఒకేరోజు హైదరాబాద్ వచ్చారని, ఈ కేసులో మోదీ మౌనం ఎందుకు వహిస్తున్నారని అడిగారు. కవిత అరెస్టుతో బీఆర్ఎస్ సానుభూతి, అవినీతిని సహించేది లేదంటూ బీజేపీ ఓట్లు దండుకునే యత్నం చేస్తున్నారన్నారు. -
AP: ప్రత్తిపాటి కుమారుడికి రిమాండ్.. జైలుకు తరలింపు
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా : జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు శరత్‌ను శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ సబ్ జైలుకు తరలించారు. గురువారం రాత్రి అరెస్టు అనంతరం శరత్‌ను పోలీసులు విజయవాడలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. శరత్ రిమాండ్ పై రెండు గంటలపాటు వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. శరత్ తరపున ఆయన న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇదే తరహా కేసు తెలంగాణలో కూడా నమోదు చేసినట్లు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఒకే తరహా నేరంపై రెండు ఎఫ్.ఐ.ఆర్ లు పెట్టడం నిబంధనలకు విరుద్దమని తెలిపారు. కాగా, జీఎస్టీ ఎగవేత కేసులో గురువారం రాత్రి శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాచవరం పోలీసుస్టేషన్లో శరత్‌పై కేసు నమోదు అయింది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో సహా మొత్తం ఏడుగురుపై పోలీలు కేసు నమోదుచేశారు. వీరిలో పుల్లారావు భార్య, బావమరిది ఉన్నారు. ఇదీ చదవండి.. అమరావతిలో ప్రత్తిపాటి దోపిడీ -
శివబాలకృష్ణ అక్రమ సంపాదన విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
-
‘టౌన్ ప్లానింగ్’ శివబాలకృష్ణ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు దొరికిన పురపాలక శాఖ పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగం ఉన్నతాధికారి శివబాలకృష్ణ ఆస్తులు లెక్కకు మించి బయటపడుతున్నాయి. సోదాల్లో గుర్తించిన ఆస్తుల విలువను మదింపు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. గురువారం ఆయనను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వచ్చే నెల 8వరకు రిమాండ్ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించిన మూర్తి, సత్యంల కోసం గాలిస్తున్నారు. శివబాలకృష్ణ అవినీతి, అక్రమాల సంపాదనతో నాలుగైదు ప్రాంతాల్లో వంద ఎకరాల వరకు వ్యవసాయ భూమి, ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేశారని పురపాలక శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాటి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సుమారు రెండు కిలోల బంగారం.. కోటి నగదు.. శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థిరాస్తి పత్రాలను అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్‌లో విల్లాలు, ఫ్లాట్లు, నగర శివారు ప్రాంతాల్లో భారీగా భూముల పత్రాలు వీటిలో ఉండటం గమనార్హం. మొత్తంగా వంద ఎకరాల వరకు ఈ భూములు ఉన్నట్టు తెలిసింది. వీటితోపాటు కోటి వరకు నగదు, దాదాపు రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఆరు కిలోలకుపైగా వెండి వస్తువులు, 80కిపైగా అత్యంత ఖరీదైన వాచీలు, పదుల సంఖ్యలో ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కూడా అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఇంకా బ్యాంకు లాకర్లను తెరిస్తే ఇంకా ఎంత స్థాయిలో ఆస్తులు బయటపడతాయోనని అధికారులు పేర్కొంటున్నారు. బినామీల పేరిట భూములు సోదాల్లో కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల స్థిరాస్తి భూముల పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటిలో చాలా వరకు బినామీల పేరిట ఉన్నట్టు చెప్తున్నారు. బినామీలుగా వ్యవహరించిన సత్యం, మూర్తి కోసం అధికారులు గాలిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో, మరో 16 చోట్ల జరిపిన దాడుల్లో ఇప్పటివరకు స్థిరాస్తులు, చరాస్తుల డాక్యుమెంట్లలోని ప్రభుత్వ విలువ ప్రకారం రూ.8.26 కోట్ల ఆస్తులను గుర్తించినట్టు ఏసీబీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో ఎన్నోరెట్లు అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా ఆస్తుల మదింపు జరుగుతోందని తెలిపారు. సోదాల్లో రూ.99,60,850 నగదు, 1,988 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆరు కిలోల వెండి ఆభరణాలు/వస్తువులు, డాక్యుమెంట్ల లెక్కల ప్రకారం రూ.5,96,27,495 విలువైన స్థిర, చరాస్తులను గుర్తించినట్టు తెలిపారు. బాలకృష్ణను అరెస్టు చేసి ఏసీబీ కోర్టు అదనపు స్పెషల్ జడ్జి ముందు హాజరుపర్చినట్టు వివరించారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులకు సంబంధించి ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సమాచారం ఇవ్వాలని కోరారు. పుర ‘ప్లానింగ్’ అంతా ఆయనదే! ♦ విధానాల రూపకల్పనలో చక్రం తిప్పిన శివబాలకృష్ణ ♦ ఆయన కోసం పురపాలక శాఖలో డైరెక్టర్ (ప్లానింగ్) పోస్టు సృష్టి ♦ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్ విధాన నిర్ణయాల్లో ప్రభావం ♦ రెరా నిబంధనలు, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, టీఎస్–బీపాస్ల రూపకల్పనలోనూ కీలక పాత్ర ♦ అనుమతులు, మినహాయింపులు, అలైన్మెంట్ మార్పుల పేరిట అవినీతి ♦ శివబాలకృష్ణ ఏసీబీకి చిక్కడంపై రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర చర్చ సాక్షి, హైదరాబాద్: ఏసీబీకి చిక్కి అరెస్టయిన హెచ్ ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ.. రాష్ట్ర అర్బన్ ప్లానింగ్ పాలసీల రూపకల్పనలో చక్రం తిప్పారని పురపాలకశాఖ వర్గాలు చెప్తున్నాయి. పట్టణ ప్రణాళి కకు సంబంధించిన విధానాల రూపకల్పన, రచన (డ్రాఫ్టింగ్)లో దిట్టకావడంతో ఆయన హవా కొన సాగిందని అంటున్నాయి. 2014లో రాష్ట్ర సచివాల యంలోని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో డైరెక్టర్ (ప్లానింగ్) పేరుతో కొత్త పోస్టును సృష్టించి మరీ ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించ డం గమనార్హం. దీనితో ఆయన హెచ్ఎండీఏ, జీహె చ్ఎంసీ, హైదరాబాద్ మెట్రోరైల్, భూవిని యోగ మార్పిడి, ఎలివేటెడ్ కారిడార్లు, ఆకాశ హర్మ్యాలు, మాస్టర్ ప్లాన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ స్థాయి లో విధానపర నిర్ణయాలు తీసుకోవ డంలో కీలకంగా వ్యవహరించారు. పురపాలక శాఖ లో ఈ వ్యవ హారాలను పర్యవేక్షించే కీలకమైన ప్లానింగ్–1, ప్లానింగ్–2, ప్లానింగ్–3 అనే మూడు సెక్షన్లకూ శివ బాలకృష్ణ మకుటం లేని మహా రాజుగా వ్యవహరించారని.. హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్)గా ఆ సంస్థ అంతర్గత వ్యవహారాల్లోనూ ప్రభావం చూపి నట్టు చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే ఆయ న పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడి ఆస్తులు పోగే సుకున్నట్టు ఆరోపణలు విని పిస్తున్నాయి. శివబాల కృష్ణ ఇంట్లో సోదాల్లో లభించిన విలువైన వాచీలు, సెల్ఫోన్లు, ఆభరణాలు వంటివన్నీ బహుమతు లుగా అందుకున్నవేనని పురపాలక శాఖలో చర్చ జరుగుతోంది. కీలక విధాన నిర్ణయాలన్నీ.. గత పదేళ్లలో రాష్ట్ర పురపాలక శాఖ తీసుకొచ్చిన పాలసీల రూపకల్పనలో శివబాలకృష్ణ ముఖ్యపాత్ర పోషించారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ముఖ్యమైన తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యు లేషన్ అథారిటీ (టీఎస్ రెరా) నిబంధనలను సైతం శివబాలకృష్ణ రూపొందించారు. ఈ క్రమంలో రెరా అమల్లోకి వచ్చిన తేదీ నాటికే నిర్మాణం ప్రారంభమైన ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చి, బిల్డర్లకు ప్రయోజనం కల్పించినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇక అనుమతి లేని కట్టడాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం సర్కారు తెచ్చిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల జీవోలు శివబాలకృష్ణ ఆధ్వర్యంలోనే సిద్ధం చేశారు. టౌన్షిప్ పాలసీ, పొడియం పార్కింగ్ పాలసీ, పార్కింగ్ ఫీజు విధానం, సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో భవన అనుమతుల జారీ కోసం తెచ్చిన టీఎస్–బీపాస్ పాలసీ, కూల్‌రూఫ్ పాలసీ, రాష్ట్ర బిల్డింగ్ రూల్స్ (జీవో 168)కు సవరణలతో వేర్వేరు సందర్భాల్లో జారీ చేసిన జీవోలు, లేఅవుట్ రూల్స్‌కు సవరణలతో వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన జీవోలను సైతం ఆయన నేతృత్వంలోనే రూపొందించినట్టు పురపాలక శాఖ వర్గాలు చెప్తున్నాయి. దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టి.. హెచ్ఎండీఏ, ఇతర పట్టణాల మాస్టర్ ప్లాన్లకు సవ రణలు/మినహాయింపులు, మాస్టర్ ప్లాన్ల నుంచి రోడ్లను తొలగించడం/పార్కులను మార్చడం, హెచ్ఎండీఏ పరిధిలో భూవినియోగ మార్పిడి దర ఖాస్తుల పరిష్కరణ, హెచ్ఎండీఏ పరిధి విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్, ఓఆర్ఆర్ వ్యవహారాలు, ఆకాశహర్మ్యాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిబంధ నల మినహాయింపులు, భారీ రియల్ ఎస్టేట్ ప్రాజె క్టులు/గేటెడ్ సొసైటీలు/టౌన్‌షిప్‌ల నిర్మాణానికి అనుమతులు, మెట్రో అలైన్మెంట్ మార్పులు వంటి అంశాల్లోనూ శివబాలకృష్ణ కీల కంగా వ్యవహ రించారని సమాచారం. ఈ క్రమంలో ఆయా అంశాల్లో అనుమతులు, మినహాయింపులు కోరుతూ వచ్చే దరఖాస్తులను పెండింగ్ ఉంచేవా రని.. కొన్నింటికి మాత్రమే వేగంగా పురపాలకశాఖ నుంచి అనుమతులు లభించేవని విమర్శలు ఉన్నా యి. ఈ క్రమంలోనే భారీగా సొమ్ము, బహుమ తులు అందుకునేవారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
జూలైలోనే పక్కాగా రెక్కీ
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటులో పొగగొట్టాలతో కలకలం రేపిన నిందితులు ఇందుకు కొద్ది నెలల క్రితమే పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్లమెంట్‌లోకి పొగగొట్టాలను ఎలా దాచి తీసుకెళ్లాలన్న దానిపై రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌కు వచి్చన వారి షూలను తనిఖీ చేయట్లేరనే విషయాన్ని ‘రెక్కీ’ సందర్భంగా వీరు కనుగొన్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన మనోరంజన్ జులైలోనే ఈ మేరకు ఒకసారి సందర్శకుల పాస్‌తో లోపలికి వచ్చి రెక్కీ నిర్వహించాడని తెల్సింది. షూలు విప్పి తనిఖీలు చేయట్లేరనే విషయం గమనించి పొగ గొట్టాలను షూలో దాచి తెచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా లక్నోలో షూలను తయారుచేయించారట. మరోవైపు పార్లమెంట్లో ‘పొగ’ ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో పాల్గొన్న మరో నలుగురిపాటు వారికి ఆశ్రయం కలి్పంచిన మరో వ్యక్తినీ అరెస్ట్‌చేశారు. లోక్‌సభ లోపల, వెలుపల పొగ గొట్టాలను విసిరిన నలుగురిపై కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నలుగురికీ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల రిమాండ్‌కు పంపించింది. ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కోల్‌కతాకు చెందిన ఇతడు విప్లవ యోధుడు భగత్ సింగ్ వీరాభిమాని. లలిత్, సాగర్, మనోరంజన్ ఏడాది క్రితం మైసూర్లో కలిశారు. అప్పుడే పార్లమెంట్ లోపలికి చొరబడేందుకు ప్రణాళిక రచించారు. వీరికి తర్వాత నీలమ్ దేవి, అమోల్ షిండే తోడయ్యారు. ఫేస్బుక్లో భగత్‌సింగ్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో సృష్టించిన పేజీలో వీరంతా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేవారు. లలిత్ వీరిని ముందుండి నడిపాడు. ప్రణాళిక ప్రకారమే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ అన్ని ప్రవేశ ద్వారాల వద్ద మనోరంజన్ రెక్కీ నిర్వహించాడు. జూలైలో సందర్శకుల పాస్‌తో పార్లమెంట్ ప్రాంగణంలోకి వచ్చాడు. భద్రతా సిబ్బంది సందర్శకుల షూలను విప్పి తనిఖీ చేయడం లేదని విషయం గమనించాడు. ఆ మేరకు ప్రణాళిక సిద్ధమైంది. మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని విశాల్ శర్మ అలియాస్ వికీ ఇంట్లో సాగర్, మనోరంజన్, అమోల్, నీలం, లలిత్‌లు బస చేశారు. ఉదయం అందరూ కలిసి పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. వీరి సెల్ఫోన్లను లలిత్ తన వద్దే ఉంచుకున్నాడు. పాస్‌లు ఇద్దరికి మాత్రమే రావడంతో మిగతా ముగ్గురు బయటే ఉండిపోయారు. అమోల్, నీలమ్‌లు పార్లమెంట్ ఆవరణలో పొగ గొట్టాలు విసురుతుండగా లలిత్ వీడియో చిత్రీకరించాడు. అనంతరం ఈ వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా కోల్‌కతాకు చెందిన ఒక ఎన్జీవో నిర్వాహకుడు నీలా„Š అయి‹Ùతో స్పెషల్ సెల్ పోలీసులు మాట్లాడారు. ఈ ఎన్జీవోతోనే లలిత్ ఝాకు సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు గురువారం రాత్రి లలిత్ ఝాను అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ద్వారానే పార్లమెంట్ ఘటన వెనుక నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. వారం రోజుల రిమాండ్ పార్లమెంట్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన కేసులో పట్టుబడిన నలుగురిపై ఉపా చట్టంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. గురువారం మనోరంజన్, సాగర్, అమోల్, నీలమ్‌లను ‘పటియాలా’ కోర్టుకు తీసుకొచ్చి ఎన్ఐఏ కేసులను విచారించే జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఏడు రోజుల రిమాండ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఒకే రకమైన సమాధానాలు సాగర్ శర్మ(26), మనోరంజన్(34), అమోల్ షిండే(25), నీలమ్ దేవి(37)లకు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో వైద్యుల బృందంతో పోలీసులు మెడికల్ పరీక్షలు చేయించారు. అనంతరం వీరిని చాణక్యపురిలోని డిప్లొమాటిక్ సెక్యూరిటీ ఫోర్స్(డీఎస్ఎఫ్) కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. ముందుగా, నీలమ్, అమోల్‌లను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌కు, తర్వాత డీఎస్ఎఫ్ కార్యాలయానికి తరలించారు. విచారణలో వీరు రెండు సంస్థల పేరు వెల్లడించారు. నిందితులు చెబుతున్న సమాధానాలన్నీ ఒకే రకంగా ఉండటాన్ని బట్టి చూస్తే, ముందుగానే ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. ‘దేశంలో రైతుల ఆందోళనలు, మణిపూర్‌లో హింస, నిరుద్యోగం వంటి సమస్యలను చూసి నిరాశకు లోనై ఈ చర్యకు పాల్పడ్డాం. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం కోసం, ఎంపీలు పై అంశాలపై చర్చ జరపాలనే ఉద్దేశంతో రంగుల పొగను వినియోగించాం. బ్రిటిష్ పాలనలో విప్లవయోధుడు భగత్ సింగ్ చేసినట్లుగా పార్లమెంట్లో అలజడి సృష్టించడం ద్వారా దేశ ప్రజల్లో ఇది చర్చనీయాంశంగా మారాలని భావించాం’ అని నలుగురు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. ఆధారాలు దొరక్కండా చేసేందుకే లలిత్ ఝా వీరి ఫోన్లను వెంటతీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. బహుశా అతడు వీటిని ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
రిమాండ్ ఖైదీగా 50 రోజులు పూర్తి చేసుకున్న చంద్రబాబు
-
చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ అనుభవిస్తున్న చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర బెయిల్‌పై నిర్ణయం ఆధారంగా ప్రధాన బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కంటి శస్త్ర చికిత్సను కారణంగా చూపుతూ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ‘ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిలివ్వండి’ సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అందుకు ఆయనపై పెడుతున్న వరుస కేసులే నిదర్శనమని తెలిపారు. గత 52 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారని వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుట్రపూరితంగా అరెస్ట్ చేశారన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును సీఐడీ ప్రశ్నించడం పూర్తయిందని, అందువల్ల అతనిని జైలులో ఉంచాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుపై నిర్ధిష్ట ఆరోపణలేవీ లేవన్నారు. జైలులో చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారన్నారు. పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. కుడి కన్నుకు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందని, ఇదే విషయాన్ని వైద్యులు సైతం ధ్రువీకరించారని పేర్కొన్నారు. నచ్చిన వైద్యునితో చికిత్స చేయించుకునే ప్రాథమిక హక్కు పిటిషనర్‌కు ఉందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ‘ఆరోగ్య సమస్యల్ని సాకుగా చూపుతున్నారు’ సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, స్పెషల్ పీపీ యడవల్లి నాగవివేకానంద, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చేందుకు అరోగ్య సమస్యలను కారణంగా చూపుతున్నారని స్పష్టం చేశారు. ప్రధాన బెయిల్ పిటిషన్లో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సుధాకర్‌రెడ్డి కోర్టును కోరగా.. గడువు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, ముందు మధ్యంతర బెయిల్‌పై వాదనలు వినిపించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు బరువు తగ్గారన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఒకటిన్నర కేజీ బరువు పెరిగారని సుధాకర్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్యుల నివేదికలను ఆయన కోర్టు ముందుంచారు. చంద్రబాబుకు జైల్లోనే అన్ని రకాల పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కంటి శస్త్రచికిత్స అత్యవసరం ఎంతమాత్రం కాదన్నారు. వైద్యులు సైతం ఇదే చెప్పారన్నారు. చంద్రబాబుకున్న అనారోగ్య సమస్యలు వయోభారంతో బాధపడే వారికి ఉండేవేనన్నారు. అవేమీ అసాధారణ సమస్యలు కాదన్నారు. జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆరోగ్య సమస్యలను కారణంగా మాత్రమే చూపుతున్నారని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు మధ్యంతర బెయిల్‌పై మంగళవారం నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. -
వ్యూహాత్మకంగానే.. తప్పు మీద తప్పులు!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయినప్పటి నుంచి ఆ పార్టీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోంది. ఒక తప్పును కవర్ చేయడానికి మరిన్ని తప్పులు చేస్తారన్నట్లుగా టీడీపీ నేతలు పూర్తి అయోమయావస్థలో పలు బ్లండర్స్కు పాల్పడుతున్నట్లుగా ఉంది. చంద్రబాబు గత నెల తొమ్మిదో తేదీన అరెస్టు అయ్యారు. అప్పటి నుంచి టీడీపీ చేసిన తప్పులేమిటో చూద్దాం. చంద్రబాబును ఉదయం ఆరున్నర గంటల సమయంలో అరెస్టు చేస్తే.. కోర్టులో మాత్రం ఆయన తరపు లాయర్లు అర్దరాత్రి అరెస్టు చేసినట్లు చెప్పడానికి యత్నించారు. తమ కక్షీదారుకు మద్దతుగా లాయర్లు వాదిస్తారు. కానీ, అందరికి తెలిసిన సత్యాన్ని కూడా అందుకు భిన్నంగా చెబితే ప్రజలలో పలచన అవుతామన్న సంగతి అర్థం చేసుకోవాలి. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఆయనను హెలికాఫ్టర్‌లో తరలించాలని సీఐడీ భావించింది. కానీ, అందుకు చంద్రబాబు నిరాకరించారు. దాంతో ఆయన కోరుకున్న విధంగానే రోడ్డు మార్గంలో.. అదీ ఆయన వాహనంలోనే తరలించారు. అయినా టీడీపీ నేతలు, ఆయనకు మద్దతు ఇచ్చే ఇతర పార్టీల నేతలు చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని విమర్శలు చేశారు. ✍️తప్పు చేసింది చంద్రబాబు అయితే ప్రభుత్వం పై నింద మోపడం ఏమిటి? ప్రజలకు ఈ విషయం కూడా తేటతెల్లమైంది. ఆయన విజయవాడ వస్తుంటే ప్రజలంతా తండోపతండాలుగా తరలివచ్చి సానుభూతి చెబుతారని ఆశించారు. కానీ ఒకటి,రెండు చోట్ల మినహాయించి అలా జరగలేదు. దాంతో ఆయన ప్లాన్ బెడిసినట్లయింది. కాకపోతే ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించుకోవడానికి కొంత సమయం కలిసి వచ్చింది. అలాగే విజయవాడ నుంచి రాజమండ్రి జైలుకు రిమాండ్ పై తరలించినప్పుడు కూడా స్పందన కనిపించలేదు. ఆయనకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియా సంస్థలు మాత్రం శరభ..శరభ అంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోయాయి. ఇలాంటి మీడియాను నమ్ముకునే చంద్రబాబు నష్టపోయారు. ఎందుకంటే వారు రాసింది ప్రతిదీ నిజమని ఆయన భ్రమపడ్డారు. అందుకే మాట్లాడితే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి నువ్వేం పీకావ్.. అంటూ సవాల్ చేసేవారు. తీరా అవినీతి కేసుల్లో అరెస్టు చేసిన తర్వాత కక్ష అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ✍️చంద్రబాబు అరెస్టు అయిన వెంటనే బెయిల్ పిటిషన్ కోసం ప్రయత్నించకుండా క్వాష్ పిటిషన్లు వేసి ఆయన తరపు లాయర్లు కాలం గడిపినట్లు అనిపిస్తుంది. దాంతో ఆయన ఐదువారాలు దాటినా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు తనయుడు లోకేష్ తండ్రి అరెస్టు తర్వాత హడావుడిగా ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లడం పలు సందేహాలకు తావిచ్చింది. పైకి డాంబికంగా మాట్లాడుతున్నా తాను కూడా అరెస్టు అవుతానేమో అనే భయంతోనే ఢిల్లీలోనే బస చేశారన్న భావన ప్రజలలోకి వెళ్లింది. ఇది కూడా టీడీపీకి నెగిటివ్ అయింది. చంద్రబాబు జైలులో ఉంటే సానుభూతి వస్తుందనుకుంటే అది కూడా పెద్దగా కనిపించకపోవడం తో రకరకాల నిరసనలు అంటూ కథ నడిపారు. ✍️డప్పులు కొట్టడం, విజిల్స్ ఊదడం, కంచాలు కొట్డడం వంటివి చూసేవారికే ఎబ్బెట్టుగా మారాయి. ఏదో సంబరాలు చేసుకున్నట్లు ఉంది.. తప్ప బాధపడుతున్నట్లు లేదన్న వ్యాఖ్యలు వచ్చాయి. తదుపరి లైట్లు తీసేయాలని ఒకరోజు, చేతులకు సంకేళ్లు వేసుకున్నట్లు ఇంకో రోజు కార్యక్రమాలు చేశారు. కాని అవన్నీ ప్రజలలోకి వెళ్లలేకపోయాయి. టీడీపీ కార్యకర్తలు అరవై, డెబ్బై లక్షల మంది ఉంటారని చంద్రబాబు చెబుతుంటారు. అందులో పది శాతం మంది ఆ నిరసనలలో పాల్గొన్నా చాలా ప్రభావం పడేదని అంటారు. నిజానికి ఈ నిరసనలు ఎవరిమీద చూపుతున్నారు?. చంద్రబాబును అవినీతి కేసులో అరెస్టు చేసింది సీఐడీ అనేది నిజమే. కాని వారు పెట్టిన ప్రాధమిక ఆధారాలను చూశాకే కోర్టు ఆయనను రిమాండ్‌కు పంపిందన్న సంగతిని మర్చిపోయి ఈ నిరసనలు చేయడం కూడా విమర్శలకు గురి అయింది. ఇక రిమాండ్‌కు పంపిన గౌరవ జడ్జి మీద ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్‌లు పెట్టడం నీచం అనే భావన ఏర్పడింది. ✍️చంద్రబాబు చాలా ఆరోగ్యంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. సడన్‌గా ఆయనకు ఏదో జరిగిపోతోందని లోకేష్ తదితరులు అనడం కూడా ఎవరికి అర్ధం కాలేదు. మరోవైపు తమ హెరిటేజ్ కంపెనీలో రెండు శాతం షేర్లు అమ్మితే రూ. 400 కోట్లు వస్తాయని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పడం కొత్త వివాదం అయింది. లోకేష్ చాలా రోజులు ఢిల్లీలో ఉన్నప్పటికీ బీజేపీ పెద్దలు ఎవరూ కలవడానికి ఆసక్తి చూపలేదు. ఎలాగోలా హోంమంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్ దొరికిన తర్వాత ఆయనే తనను పిలిపించుకున్నారని లోకేష్ చెప్పడం అంత తెలివైన చర్యగా ఎవరూ చూడడం లేదు. తద్వారా అమిత్ షానే అవమానించారని కొందరు వ్యాఖ్యానించారు. భేటీ అయిన తర్వాత ఒక సందర్భంలో టీడీపీ అటు ఎన్డీయేకి, ఇటు ఇండియా కూటమికి సమదూరంలో ఉంటుందని అనడం కూడా బీజేపీ నేతలకు నచ్చలేదట. దాంతో టీడీపీ గురించి ఆలోచించవలసిన అవసరం లేదని బీజేపీ పెద్దలు భావించారట. చంద్రబాబు ఆరోగ్యంపై రకరకాల వదంతులు టీడీపీవారే లేవదీయడం, ప్రజలలో అనుమానాలు కలిగేలా కుటుంబ సభ్యులే మాట్లాడడం కూడా ఆశ్చర్యం కలిగించింది. నిజంగానే చంద్రబాబు ఆరోగ్యం బాగోపోతే ఎందుకు ఆయనను ఆస్పత్రిలో చేర్చాలని కోర్టులో పిటిషన్ వేయలేదో అర్ధం కాదు. కేవలం ఏసీ పెట్టాలని మాత్రమే పిటిషన్ వేయడం కోర్టువారు అంగీకరించడం జరిగిపోయాయి. మరి అలాంటప్పుడు చంద్రబాబు ఆరోగ్యం నిజంగా దెబ్బతిన్నదా?లేదా? అనే చర్చకు ఆస్కారం ఇచ్చారు. చంద్రబాబు ఎండల్లో, దుమ్ము, ధూళి మధ్య చెమట్లు కక్కుతూ జనం మధ్యలో తిరుగుతున్నప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. కానీ జైలులో నీడపట్టున ఉన్నప్పుడు అంత సీరియస్‌గా ఆరోగ్యం దెబ్బతింటుందా? అనే అనుమానం కూడా కొందరు వ్యక్తం వ్యక్తం చేశారు. అయినప్పటికీ టీడీపీ వాళ్లు కోర్టులో ఆయనను ఆస్పత్రిలో చేర్చాలని కోరకపోవడంతో జనంలో సందేహాలు వచ్చాయి. ✍️ఏపీలో పెద్దగా నిరసనలు లేకపోయినా, హైదరాబాద్‌లో ఒక సామాజికవర్గం వారే నిరసనలకు దిగడం ద్వారా చంద్రబాబును చివరికి ఒక కుల నాయకుడుగా మార్చివేశారనే వ్యాఖ్యలు కూడా వచ్చాయి. తెలంగాణ ఎన్నికలకు ముడిపెట్టిన తీరు కూడా అంత తెలివిగా కనిపించదు. ఇలా పలు రకాలుగా టీడీపీ నేతలు అనండి.. చంద్రబాబు కుటుంబ సభ్యులనండి.. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అన్నింటికీ మించి చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ అమెరికా వెళ్లిపోవడం, సుప్రీంకోర్టు వరకు కేవలం 17ఏ ద్వారా గవర్నర్ అనుమతి లేనందునే కేసు కొట్టేయాలని లాయర్లు కోరడం వంటివాటి ద్వారా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, టీడీపీ ఖాతాలోకి రూ. 27కోట్లు వచ్చే ఉంటాయని ప్రజలు అభిప్రాయపడే పరిస్థితిని ఆ పార్టీ నేతలే తెచ్చుకున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి లాయర్ గా పేరొందిన హరీష్ సాల్వే చివరికి తన వాదనలో చంద్రబాబు వయసు ప్రస్తావించి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అనడం, అవసరమైతే మళ్లీ జైలులో పెట్టవచ్చని చెప్పడంతో టీడీపీ ఎంత బలహీనంగా ఉందన్న విషయం అర్దం అయిపోయింది. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
చంద్రబాబు రిమాండ్ పొడగింపు..!?
-
రాజమండ్రీ జైల్లో 24వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు