సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కేసులోని ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తమ అరెస్టు అక్రమమని పేర్కొన్నారు. పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరపనుంది.
కాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎర కేసులో మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో పట్టుబడిన నిందితుల రిమాండ్‌కు అనుమతినిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురు నిందితులు సైబరాబాద్ సీపీ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు రోజులపాటు వాదనలు విన్న హైకోర్టు.. నిందితుల రిమాండ్‌కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. వారిని అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలని పేర్కొంది.
చదవండి: మోర్బీ ఆసుపత్రికి ప్రధాని.. అర్థరాత్రి హంగామా.. ఆగమేఘాల మీద మరమ్మతులు
Comments
Please login to add a commentAdd a comment