TRS MLAs
-
మళ్లీ తెరపైకి ఎమ్మెల్యేల కొనుగోలు టాపిక్.. రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేస్తూ రేవంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ ట్విట్టర్ వేదికగా.. ‘కేసీఆర్!.. మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా?. అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా?. ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ సందర్భంలో.. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు బీఎల్ సంతోష్.. హైదరాబాద్ వచ్చిండటగా.. ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి.. మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా? ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా? లేక సిట్ ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా? తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం..!!’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్! @TelanganaCMO మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా? అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా? ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ… — Revanth Reddy (@revanth_anumula) October 5, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ ఎన్నికల కమిటీల ప్రకటన.. 14 కమిటీలు.. రాజగోపాల్‌రెడ్డి, వివేక్, విజయశాంతిలకు చోటు -
మేం దాడులకు దిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పారిపోతారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రతిదాడులకు దిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవినీతిపై పోస్టర్లు అంటిస్తున్నారన్న కారణంగా వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్‌పై దాడి చేయడం హేయమని మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తోట పవన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అనుచరులు కిరాతకంగా దాడిచేశారని, హత్య చేసేందుకు యత్నించారని, వినయ్‌భాస్కర్‌తో పాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మహేశ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దళిత నాయకుడు సాయన్నకు ప్రభుత్వం గౌరవం ఇవ్వదా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి దళితులంటే గౌరవం లేదని, కనీసం అధికారిక లాంఛనాలతో కూడా సాయన్న అంత్యక్రియలు పూర్తి చేయకుండా చావులో కూడా సాయన్నకు బాధను మిగిల్చారని మహేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: తీర్పు రిజర్వ్ చేసి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో విషయంలో హైకోర్టు కూడా ట్విస్ట్ ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాయి. వాదన సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే.. లిఖితపూర్వక వాదనలకు అనుమతివ్వాలని కోర్టును కోరారు. దీంతో, ఈనెల 30వ తేదీ లోపు లిఖితపూర్వకంగా వాదనలు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇక, ఎమ్మెల్యేల కేసును సీబీఐకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి అంతకు ముందు కోర్టు సింగిల్ బెంచ్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పును ఇచ్చింది. కాగా, సింగ్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. మొయినాబాద్ కేసు వివరాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. సిట్ తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. డాక్యుమెంట్లు ఇస్తే విచారణ ప్రారంభిస్తామని హైకోర్టుకు తెలిపింది. అయితే హైకోర్టులో కేసు విచారణ పూర్తయ్యే దాకా ఆగాలని ధర్మాసనం సీబీఐకి సూచించింది. ఆ తర్వాత సీబీఐ వాదన కూడా వింటామని పేర్కొంది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. అదేవిధంగా నిందితుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2014 నుంచి 2018 వరకు బీఆర్ఎస్లో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేల జాబితాను కోర్టుకు సమర్పించారు. 2014 నుంచి 2018 వరకు 37 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలోకి చేర్చుకుందని ఆరోపించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణనకు జనవరి 9వ తేదీ (సోమవారం)కి వాయిదా వేసింది. చదవండి: మంత్రి పదవి వదులుకుంటా.. కిషన్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ -
ఎమ్మెల్యేల కేసు: గురువారానికి విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రభుత్వం వేసిన అప్పీల్ పిటీషన్‌కు విచారణ అర్హత లేదని ప్రతివాదుల లాయర్ అన్నారు. సుప్రీంకోర్టు మాత్రమే విచారించగలదని పేర్కొన్నారు. ఇతదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.. కాగా, ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు. అలాంటి సమయంలో పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌కు బాధ్యత ఉంటుంది. కేసీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడంతో తప్పులేదు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అది పబ్లిక్ డొమైన్‌లోకి వస్తుంది. ప్రజాక్షేత్రంలోకి ఎవిడెన్స్ వచ్చిన తరువాతే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ ఆధారంగా ఈ కేసును సీబీఐకి ఇవ్వడం సరికాదు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే సీఎం స్పందించకూడదా?. సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రధాని, హెచ్ఎం పేర్లు ప్రస్తావించినందుకే కేసును సీబీఐకి అప్పగిస్తారా?. సిట్‌ను క్వాష్ చేస్తే అసలు కేసు ఎక్కడిది అంటూ బలంగా తమ వాదనలు కోర్టుకు వినిపించారు. -
‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో కీలక పరిణామం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ అప్పీలుపై హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 455/2022) సీబీఐకి బదిలీ చేయడాన్ని ఆపాలని తెలంగాణ సర్కార్ పిటిషన్లో కోరింది. జీవో 63 రద్దుపై హైకోర్టులో అప్పీల్ చేసింది. సిట్ దర్యాప్తు కొనసాగించాలని డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం.. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలని కోరింది. అయితే ఎమ్మెల్యేల కేసును విచారిస్తున్న సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సీబీఐకి బదిలీ చేయాలని ఇటీవల సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 63 రద్దు చేసింది. కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 455/2022) పూర్తి వివరాలను, స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను సీబీఐకి అందజేయాలని సిట్, దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసింది. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారీ ట్విస్ట్ -
ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి గైర్హాజరు.. వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: ఈడీ విచారణకు గైర్హాజరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం తన పిటిషన్ విచారణకు రానున్నట్లు తెలిపారు. ఈడీకి సంబంధంలేని కేసులో విచారణ సరికాదని తెలిపారు. అసలు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఈడీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. తనను ఇబ్బంది పెట్టడానికే ఈడీ సీబీఐ విచారణ పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపించారు. న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళ్తానని తెలిపారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిరి రెండు సార్లు విచారించిన ఈడీ.. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే నోటీసులు ఇచ్చింది. నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరుకావాలని రోహిత్‌ను ఆదేశించింది. అయితే ఈడీ ఎదుట హాజరు కాకుడదని రోహిత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఈడీ అధికారులకు మెయిల్ చేశారు. హై కోర్టులో రిట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో.. తాను విచారణకు హాజరు కాలేనని రోహిత్ పేర్కొన్నారు. మరోవైపు బుధవారం హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉండగా.. హై కోర్టు తీర్పు ఒచ్చాకే తదుపరి విచారణపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. మరోవైపు రోహిత్ రెడ్డి మెయిల్‌కు ఈడీ అనుమతి ఇస్తుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఎమ్మెల్యే గైర్హాజరుతో ఈడీ తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. ఈడీ జేడీగా రోహిత్ ఆనంద్ -
బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలంటూ ఆవేదన
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో పదవులు వాటంతట అవే నడుచుకుంటూ వస్తాయని దాదాపు నెలరోజుల క్రితం తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్ జిల్లా విస్తతస్థాయి సమావేశం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హామీ ఇచ్చారు. పదవులు నడచుకుంటూ రావడం కాదు కదా.. ఇప్పటివరకు కనీసం జిల్లా, డివిజన్‌స్థాయి కార్యవర్గాలు సైతం ఏర్పాటు కాకపోవడంతో ఆయా నేతల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నా లోలోపలే అణచుకుంటున్నారు. అవి ఏ క్షణాన్నయినా భగ్గుమనేలా నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. పెద్దస్థాయి నేతలు కొందరికి పదవులుంటే సరిపోతుందా? డివిజన్లలో స్థానికంగా పనిచేసే తమకు ఎలాంటి పదవి, గుర్తింపు లేకుంటే తమను గుర్తించేదెవరు? అని పలు డివిజన్ల నేతలు ఆవేదన చెందుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేదెలా? గ్రేటర్‌లోనే ఉన్న ఇతర జిల్లాల్లో నామినేటెడ్ పదవులు ఇస్తున్నా హైదరాబాద్ జిల్లా వారికి మాత్రం నామినేటెడ్ పదవులు కాదు కదా కనీసం పార్టీ కమిటీలు కూడా పూర్తిగా భర్తీ చేయకపోవడంతో నేతలు తీవ్ర నిరాశా నిస్పహల్లో మునిగారు. పదవులు నడచుకుంటూ వచ్చేది ఎప్పుడు.. పైస్థాయిలోని కొందరికి మాత్రం పదవులుంటే సరిపోతుందా.. అసెంబ్లీ ఎన్నికలు ఏ క్షణాన వస్తాయో తెలియని పరిస్థితి. ఈలోగా ఎలాంటి పదవులు లేకుంటే తాము ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. నోటిఫికేషన్ వస్తే నామినేటెడ్ పోస్టులెలాగూ ఇవ్వరు. అప్పటికప్పుడు డివిజన్ కమిటీలు భర్తీ చేసినంత మాత్రాన ప్రయోజనమేముంటుంది. నియోజకవర్గ స్థాయి నేతలకు నామినేటెడ్ పోస్టులు లేకుంటే తాము ప్రజల తలలో నాలుకలా పనులు చేయాలంటే.. అధికారుల వద్దకు వెళ్లి చేయించాలంటే ఏదో ఒక పదవి కనీసం ఉండాలి కదా? అని గోషామహల్ నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు వేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘హస్తం’లో కొత్త కోణం.. ఏళ్లుగా వైరం.. సేవ్ కాంగ్రెస్‌తో ఒక్కటైన వైనం అంతర్మథనంలో పార్టీ శ్రేణులు.. క్రమశిక్షణో, అధిష్టానానికి భయపడో బీఆర్ఎస్లో ఇప్పటి వరకు ఎలాంటి అసమ్మతి సెగలు బయటకు కనిపించలేదు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్యే స్థాయి నాయకులే మంత్రి తీరుపై తమ అసమ్మతి, అసంతప్తి గళాల్ని వినిపించడంతో ఎలాంటి హోదా, పదవులు లేని తాము ఎలా పనిచేయగలమని పలు డివిజన్లు, నియోజకవర్గాల స్థాయి నేతలు తీవ్ర అసంతప్తితో ఉన్నారు. ప్రభుత్వం ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినప్పుడు అగ్రనేతలకు క్షీరాభిషేకాలు, భారీ ఊరేగింపులు, కటౌట్ల ఏర్పాట్లవంటి పనులే తమకు సరిపోతున్నాయని, తమను పట్టించునే నాయకుడే లేకుండా పోయారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో డివిజన్ స్థాయి నేతలు సైతం ఏదో ఒకదశలో రగులుతున్న తమ బడబాగ్నిని బహిరత్గం చేసే అవకాశం లేకపోలేదని జిల్లా స్థాయి నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు, జిల్లా మంత్రి డివిజన్ నేతల మనోగతాన్ని అర్థం చేసుకొని వివిధ కమిటీలు భర్తీ చేయాలని, నామినేటెడ్ పోస్టులిప్పించాలని వివిధ స్థాయిల నేతలు కోరుతున్నారు. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే.. మరోవైపు, ఆయా స్థాయిల నేతలకు పొసగడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలోకొచ్చే ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే లేకుండా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో ఎమ్మెల్యే అనుచరులు మేయర్ గోబ్యాక్ అంటూ ఆందోళనలు చేశారు. నియోజక వర్గాల సమ్మేళనాలెప్పుడో? రెండు మూడు రోజుల్లో నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనాలు ఖరారు చేస్తామని ప్రకటించి నెలరోజులవుతోంది. ఇంతవరకు ఆ ఊసే లేదు. అనేక డివిజన్లలో పార్టీ కమిటీల్లేవు. ఏడాది కిందట ఏర్పాటు చేసిన కమిటీల్లో ఎన్ని పనిచేస్తున్నాయో తెలియదు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల నడుమ విభేదాలతో చాలా డివిజన్ల కమిటీలు నిద్రాణంగా ఉన్నాయి. చాలా డివిజన్లలో అసంపూర్ణ కమిటీలున్నాయి. ఆత్మీయ సమ్మేళనాల్లో అన్నీ చర్చించి భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు అతీగతీ లేకపోవడంపై పార్టీ శ్రేణులు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
‘ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’ కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లలో వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్ మీడియా ముందు ఫుటేజ్ పెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్ సహా పలువురు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్లు 65బీ సర్టిఫికెట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపింది. సీఎం మీడియో సమావేశానికి సంబంధించి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను న్యాయమూర్తి ప్రశ్నించారు. 65బీ ఇచ్చేందు కు సమయం కావాలని కోరడంతో.. సాయంత్రం 4.30 గం. వరకు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను సాయంత్రం వరకు వాయిదా వేశారు. పిటిషనర్లు ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకోలేం.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని చట్టంలో లేదని హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది జోగినపల్లి సాయికృష్ణ వాదించారు. యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి తీసుకొని వచ్చిన వీడియోను ఎవిడెన్స్‌గా పరిగణించలేమని చెప్పారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 65బీ ప్రకారం సర్టిఫికెట్ లేకుండా ఎవిడెన్స్‌ను రికార్డుల్లోకి తీసుకోవడానికి వీలులేదని చెప్పారు. అసలు సీబీఐకి ఈ కేసును బదిలీ చేయాలి అనడానికి.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌కు సంబంధం లేదన్నారు. ఇలాంటి ఎవిడెన్స్‌ను ట్రయల్ కోర్టులో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని నివేదించారు. రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాప్ చేసి.. నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. అక్టోబర్ 26న ముఖ్యమంత్రి మీడియా భేటీ నిర్వహించగా, నవంబర్ 9న సిట్ ఏర్పాటు జరిగిందని కోర్టుకు దృష్టికి తేచ్చారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ మెటీరియల్ ఎలా ఇచ్చిందో చెప్పాలని పిటిషనర్లను ప్రశ్నించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీని కోసం సాయంత్రం 4.30 గంటల వరకు న్యాయమూర్తి సమయం ఇచ్చారు. సాయంత్రం వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వు చేశారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు -
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని దాఖలైన కేసులో హైకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. ఈ కేసులో వాద, ప్రతివాదనలు ముగియడంతో త్వరలో తీర్పును వెలువరిస్తామని పేర్కొంది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజి, న్యాయవాది బి.శ్రీనివాస్, తుషార్ వెల్లపల్లి ఇతరులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ఈ కేసును ఏసీబీ అధికారులు మాత్రమే విచారణ చేయాలని.. లా అండ్ ఆర్డర్ పోలీసులకు, సిట్‌కు ఆ అధికారం లేదని బుధవారం బీజేపీ తరఫున హాజరైన జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు. గురువారం మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ సూచన మేరకు లేదా వ్యక్తులు ఫిర్యాదు చేసినప్పుడు పబ్లిక్ సర్వెంట్‌పై విచారణ చేసే అధికారం లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా ఉంటుందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ కేసును తప్పనిసరిగా ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉందా అని ప్రశ్నించారు. దీనికి ఏజీ బదులిస్తూ.. అలాంటిదేమీ లేదని అన్నారు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత దాన్ని సిట్‌కు బదలాయించారని చెప్పారు. ‘ప్రభుత్వం పూర్తి అధికారాలిస్తూ సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏసీబీ, లా అండ్ ఆర్డర్ కేసులను ఏదైనా సిట్ దర్యాప్తు చేయవచ్చు. ఆ మేరకు సిట్‌కు అన్ని అధికారాలు ఉన్నాయి. సిట్ దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా జరుగుతోంది. నిందితులు విచారణకు సహకరించడం లేదు. కేసులు వేస్తూ తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. ఈ కేసులో పలువురు మధ్యంత పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని పట్టించుకోకుండా ప్రధాన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పాలి’అని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, మధ్యంతర పిటిషన్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం తమ దృష్టికి తేవాలన్నారు. ప్రధాన పిటిషన్లపై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, అక్టోబర్ 27న ప్రధాన పిటిషన్ దాఖలైంది మొదలు ఇప్పటివరకు వాదప్రతివాదనలు వాడీవేడిగా సాగాయి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సైతం హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. కేసును సీబీఐకి అప్పగించాలని, సిట్ స్వేచ్ఛగా, పారదర్శకంగా దర్యాప్తు చేయడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.. సిట్ దర్యాప్తును అడ్డుకోవద్దని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ మీడియా ముందు పెట్టిన ఫుటేజ్‌ను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. హై ప్రొఫైల్ కేసు దర్యాప్తు మధ్యలోనే ఆధారాలు బయటకు ఎలా వెళ్లాయని అన్న పిటిషన్లు.. సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని కోర్టుకు తెలిపారు. సీఎం ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రేపు(శుక్రవారం) తుది వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే కేసుకు సంబంధించిన సీడీలు, పెన్‌డ్రైవ్‌ను సీఎం కోర్టుకు పంపించారు. చదవండి: కామారెడ్డి: గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి.. -
ఫాంహౌజ్ కేసు: కీలకంగా మారనున్న హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో ఇవాళ(శుక్రవారం) తెలంగాణ హైకోర్టులో జరిగే విచారణ కీలకం కానుంది. సిట్ రివిజన్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ వ్యవహారంలో.. ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు తీర్పును రద్దు చేయాలంటూ సిట్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఏసీబీ కోర్టు తీర్పును సమర్థిస్తూ.. కేసు విచారించే అర్హత లా అండ్ ఆర్డర్ పోలీసులకు లేదంటూ ప్రతివాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో పలు పిటిషన్ లు దాఖలు అయ్యాయి. ఈ అన్ని పిటిషన్లపై మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది హైకోర్టు. రామచంద్ర భారతి విడుదల ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో చంచల్ గూడ జైలు నుండి రామచంద్ర భారతి బెయిల్ పై విడుదల అయ్యాడు. ఫాంహౌజ్ కేసులో A1 నిందితుడు రామచంద్ర భారతి. సుమారు 45రోజుల తర్వాత జైల్ నుండి విడుదల. వాస్తవానికి.. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో గురువారమే జైలు నుంచి విడుదల అయ్యాడు. అయితే.. ఆ వెంటనే మరో కేసులో అరెస్ట్ చేశారు. దీంతో గురువారం రాత్రి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు రామచంద్ర భారతి. ఆ వెంటనే బెయిల్ మంజూరు అయ్యింది. రామచంద్ర భారతిపై ఎమ్మెల్యే ల కొనుగోలు కేసుతో పాటు మరో రెండు కేసులు. ఇదే కేసులో A3 సింహయాజులు ఇప్పటికే బెయిల్ పై విడుదల అయ్యాడు. మరోవైపు A2 నందకుమార్‌ను మరో కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఇక A4బిఎల్ సంతోష్, A5తుషార్,A6 జగ్గు స్వామి,A7 శ్రీనివాస్ నిందితుల పై మెమో కొట్టివేసింది ఏసీబీ కోర్టు. -
ఫాంహౌజ్ కేసు: బెయిల్‌పై విడుదల, వెంటనే మళ్లీ అదుపులోకి..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్ చంచల్ గూడ జైల్ నుండి విడుదల అయ్యారు. అయితే జైలు నుంచి బయటకి రాగానే ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందకుమార్ పై బంజారాహిల్స్ పీఎస్ లో నమోదైన చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతిని ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రభారతి, నందకుమార్ లను పోలీసులు బంజారాహిల్స్ పీఎస్ కి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే సింహయాజీ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్ లకు డిసెంబర్ 1న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పాస్ పోర్టులను సిట్ అధికారులకు అప్పగించడంతో పాటు సాక్ష్యులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని షరతు విధించింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సింహయాజి విడుదల
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసుకు సంబంధించి.. నిందితుడు సింహయాజి స్వామి ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు. ఈ కేసులో A3నిందితుడిగా ఉన్న సింహయాజికి బెయిల్ దొరికిన విషయం తెలిసిందే. అయితే.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి వారం తర్వాత బుధవారం సింహయాజి విడుదల అయ్యాడు. షూరిటీలు చెల్లింపులో ఆలస్యం కావడంతో.. విడుదలకు ఆటకం ఏర్పడింది. ఇక ఈ కేసులో.. మరో ఇద్దరు నిందితులు జైల్లోనే ఉన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. ముగ్గురు నిందితులకు రామచంద్రళబారతి, నందకుమార్, సింహయాజులు కు వారం క్రితం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. కేసులు పెండింగ్‌లో ఉండటంతో రామచంద్ర భారతి, నంద కుమార్‌లు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం సిట్ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. రూ. 3 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురి పాస్‌పోర్టులు పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలని తెలిపింది. -
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. 5 గంటల పాటు వాడీవేడిగా వాదనలు
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో హైకోర్టులో వాదనలు వాడీవేడిగా సాగాయి. కిక్కిరిసిన కోర్టు హాల్లో ఉదయం దాదాపు 11 గంటలకు ప్రారంభమైన వాదనలు.. భోజనం విరామం తరువాత.. సాయంత్రం 5 గంటల వరకు (5 గంటలు) కొనసాగాయి. న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి సుదీర్ఘ వాదనలను విన్నారు. తదుపరి విచార ణను ఈ నెల 6కు వాయిదా వేశారు. సిట్ దర్యాప్తునకు సహకరించాలని భారత్ ధర్మ జన సేన (బీడీజేఎస్) అధ్యక్షుడు తుషార్ వెల్లప్పల్లిను ఆదేశించారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఆయన్ను అరెస్టు చేయొ ద్దని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బీజేపీతో పాటు నిందితులు, 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు అందుకున్న వారు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. తొలుత వాదనలు ప్రారంభం కాగానే.. అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) రాంచంద్రరావు కౌంటర్ దాఖలు చేశారు. నిందితులకు బీజేపీ నేతలకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల ప్రతిని, ఆ పార్టీ పెద్దలతో నిందితులు దిగిన ఫొటోలను కోర్టుకు అందజేశారు. అలాగే కేసు కీలక ఆధారాల ను సిట్ సమరి్పంచింది. తర్వాత.. భారత్ ధర్మ జన సేన (బీడీజేఎస్) అధ్యక్షుడు తుషార్ వెల్లప్పల్లికి నోటీసులు ఇవ్వడంపై ఆయన తరఫు న్యాయవాది హెగ్డే అభ్యంతరం తెలిపారు. అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని, తర్వాత వస్తానని చెప్పినా పట్టించుకోకుండా ఆయనపై లుక్ఔట్ నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. సిట్ నోటీసులను నిలుపుదల చేయాలని కోరారు. సిట్.. మీడియాకు లీకులిస్తోంది.. ముగ్గురు నిందితుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదిస్తూ.. ‘ఏ కేసులోనైనా దర్యాప్తు పారదర్శకంగా, నిజాయతీగా జరగాల్సిన అవసరం ఉంది. కానీ, ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ, దర్యాప్తు అలా సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే సిట్ పనిచేస్తోంది. ఫామ్‌హౌస్ ఘటన జరిగిన రోజే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ హైకోర్టుతో పాటు ఇతర హైకోర్టులకు దర్యాప్తు సీడీలు, ఇతర వివరాలు సీఎం పంపారు. దర్యాప్తు.. ఏ అంశమైనా బయటకు పొక్కనీయకుండా విచారణ సాగించాలి. కానీ, కీలక సమాచారం మీడియాకు లీక్ చేస్తున్నారు. దర్యాప్తు ఎలా జరగాలనే విషయంపై పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఈ కేసులో పలు ఉల్లంఘనలు జరిగాయి. సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించాలి’ అని న్యాయమూర్తిని కోరారు. సీబీఐ విచారణ అవసరం లేదు... ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని, సీబీఐకి అప్పగిస్తే వీగిపోవడం ఖాయమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు చేసిన కొన్ని కేసులు వీగిపోయిన ఉదంతాలను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ‘ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం తీవ్ర నేరం. ఈ కేసును ఎంతో వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. ఐపీఎస్‌లు కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తారు. వారు రాజకీయ ఒత్తిడులకు తలొగ్గే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది అనడానికి ఆధారాలు లేవు. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న వీడియోలు, వాయిస్ రికార్డులు సీజే, ఇతరులకు పంపడం తప్పే. ఈ విషయంలో క్షమాపణలు చెప్పాం. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే కుట్ర జరిగింది. బీజేపీకి సంబంధం లేదంటూనే నిందితుల తరఫున పిటిషన్లు వేస్తున్నారు. ఈ వ్యవహారంలో కేసు నమోదైన మరుక్షణం నుంచి బలహీనం చేసే ప్రయత్నం జరుగుతోంది. గడిచిన కొన్నేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. పారీ్టగానీ, ప్రభుత్వంగానీ ప్రమాదంలో పడినప్పుడు పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా స్పందించే హక్కు ఆయనకు ఉంటుంది. అందులో భాగంగానే మీడియా భేటీలో ప్రజలకు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదు’అని నివేదించారు. తమ వద్ద ఆధారాలున్నాయంటూ సిట్ అందరికీ నోటీసులు ఇస్తూ పోతోందని, అవేంటో కోర్టుకు కూడా చెప్పడం లేదని బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది ప్రభాకర్ పేర్కొన్నారు. సైబరాబాద్ సీపీ మీడియాకు వివ రాలు వెల్లడించారని, పోలీసుల విచారణ వద్దన్నందుకు.. అదే పోలీస్ ఉన్నతాధికారులతో సిట్ ఏర్పా టుచేయడం సమంజసమా.. అని ప్రశ్నించారు. ఇక, న్యాయవాది శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయ వాది ఉదయ హోల్లా వాదనలు వినిపించారు. చదవండి: మంత్రి గుంగుల ఇంటికి సీబీఐ బృందం.. ఢిల్లీకి రావాలని సమన్లు -
ఎమ్మెల్యేల కేసులో సిట్‌కు ఎదురుదెబ్బ.. తుషార్‌కు భారీ ఊరట!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు ఊరట లభించగా.. తాజాగా తుషార్‌కు సైతం ఉపశమనం కలిగింది. తుషార్ వ్యవహారంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే సిట్ విచారణకు తుషార్ సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, విచారణ సందర్భంగా సిట్ అధికారులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి నిందితుల జాబితాలో తుషార్ పేరు చేర్చారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 41ఏ సీఆర్పీసీపై రిప్లై ఇవ్వకుండా లుక్ ఔట్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కోర్టు.. తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఈ కేసులో తుషార్‌కు ఊరట లభించింది. మరోవైపు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ దర్యాప్తు జరపాలన్న బీజేపీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ తరఫున మహేష్ జఠ్మలానీ, ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్, సిట్ తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తున్నారు. -
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణలో నందు పొంతనలేని సమాధానాలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు కొర్రె నందుకుమార్ పోలీస్ విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో పోలీసులు అతడిని మంగళవారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత దగ్గుబాటి సురేష్‌లకు చెందిన ప్లాట్లను లీజు పేరుతో తీసుకొని దుర్వినియోగం చేసిన కేసులో నందుకుమార్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఇందులోభాగంగా పోలీసులు మంగళవారం నందుకు 22 ప్రశ్నలు సంధించారు. తొలుత మీ సొంతూరు ఏది అని ప్రశ్నించగా పరిగి, ఎల్బీనగర్, చైతన్యపురి అని నిర్లక్ష్యంగా చెప్పినట్లుగా తెలిసింది. నీ వృత్తి ఏంటన్న ప్రశ్నకు.. హోటల్ బిజినెస్ అని చెప్పినట్లు సమాచారం. మొదటగా అంబర్‌పేట్‌లో సీజన్ పేరుతో హోటల్ నడిపినట్లు చెప్పారు. ఫిలింనగర్లో డెక్కన్ కిచెన్ హోటల్ ఎలా వచ్చిందని ప్రశ్నించగా 2016 డిసెంబర్లో డబ్లూ3 పేరుతో హోటల్ లీజుకు తీసుకున్నానని, అనంతరం దక్కన్ కిచెన్‌గా మార్చానని బదులిచ్చారు. డెక్కన్ హోటల్‌కు ఎవరెవరు వచ్చే వారు? సదరు ఎమ్మెల్యేలు ఎలా తెలుసు? రామచంద్ర మూర్తితో పరిచయం ఎలా జరిగింది అని ఆరా తీసినట్లు సమాచారం. డబ్లూ 3 హాస్పిటాలిటీకి ప్రమోద్ కుమార్ రాజీనామా చేయగానే తాను ఎండీగా కొనసాగినట్లు చెప్పారని తెలిసింది. అభిషేక్‌కూడా 2017లోనే డైరెక్టర్‌గా తప్పుకున్నారన్నారు. దక్కన్ కిచెన్ పేరుతో 6 లక్షలు వసూలు చేసినప్పుడు ఏదైనా డాక్యుమెంటేషన్ ఉందా అని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని తెలిపారు. ఈ ప్రాపర్టీని ఎందుకు తీసుకున్నావన్న ప్రశ్నకు.. వ్యాపారనిమిత్తం తీసుకున్నట్లు చెప్పారు. ఏ వ్యాపారం కోసం తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఐస్‌క్రీం షాపులు, మిల్క్‌షేక్ కౌంటర్లు ఏర్పాటు చేశానన్నారు. దక్కన్ కిచెన్ ప్రొప్రైటర్లు ఎలా పరిచయం అని ప్రశ్నించగా వారే తనను సంప్రదించారని చెప్పినట్లు తెలిసింది. కామన్ ఫ్రెండ్ సురేష్‌రెడ్డి ద్వారా ప్రమోద్ కుమార్ పరిచయమైనట్లు చెప్పారు. ఈ హోటల్ ద్వారా పది శాతం రెవెన్యూ వాటా పొందుతున్నానని, ప్రస్తుతం డైరెక్టర్లుగా కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావు, ఆవుల అభిషేక్ ఉన్నారని తెలిపినట్లు సమాచారం. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం -
ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెలుగులోకి వస్తున్న అనుమానితులను 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు అనుమతి, సహేతుక కారణం లేకుండా విచారణకు గైర్హాజరైతే అరెస్టు చేసేందుకు సిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ మెయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ప్రధాన నిందితుడు రామచంద్రభారతితో కేరళ వైద్యుడు కొట్టిలిల్ నారాయణ జగ్గు అలియాస్ జగ్గు స్వామి ఫోన్ సంభాషణలు రికార్డయ్యాయి. రామచంద్రభారతి తన ఫోన్లో జగ్గు స్వామికి ‘విటమిన్ సీ’ సిద్ధం చేయాలని సందేశం పంపినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కస్టడీలో నిందితులు వెల్లడించిన వివరాల మేరకు.. జగ్గు స్వామిని విచారించేందుకు సిట్ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ బృందం కేరళకు వెళ్లగా.. ఆయన అమృత ఆసుపత్రి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు. దీంతో సిట్ అధికారులు సాక్ష్యులైన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ లకు 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. నోటీసులు ప్రకారం వీరంతా సిట్ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా... వైద్య కారణాల నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నానని మణిలాల్ సిట్ అనుమతి కోరగా.. మిగిలిన ముగ్గురు అనుమానితులు సిట్ ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరయ్యారు. దీంతో తీవ్రంగా పరిగణించిన సిట్ బృందం వారిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుందని భావించిన జగ్గు పీఏలు శరత్, ప్రశాంత్, విమల్ కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు సమాచారాన్ని అక్కడి న్యాయాధికారి సిట్ విచార ణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్‌కు సమాచారం అందించారు. దీంతో తదుపరి కార్యాచరణపై సిట్ ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు తెలిసింది. చదవండి: Malla Reddy: రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు? -
ఎమ్మెల్యేలకు ఎర కేసు: ‘బండి సంజయ్ పేరు చెప్పాలని వేధిస్తున్నారు ’
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తీవ్రంగా వేధిస్తోందని న్యాయవాది భూసారపు శ్రీనివాస్ ఆరోపించారు. సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని కోరారు. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యానని, మూడు రోజులపాటు కేవలం సంజయ్ పేరు చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగడం లేదని వెల్లడించారు. ఈ మేరకు సిట్ దర్యాప్తు ఆపి, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ అధికారులు, సీబీఐ, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్, సీవీ ఆనంద్‌తోపాటు ఇద్దరు సిట్ సభ్యులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో సిట్ ఎదుట హాజరయ్యానని.. రాజేంద్రనగర్ ఏసీపీ, అధికారులు రమా రాజేశ్వరి, కమళేశ్వర్‌లు బండి సంజయ్, కొందరు బీజేపీ ముఖ్య నేతల పేర్లు చెప్పాలని రోజంతా తీవ్ర ఒత్తిడి తెచ్చారన్నారు. వారు కోరిన విధంగా చెప్పేందుకు నిరాకరిస్తే.. తనను నిందితుడిగా(ఏ7)గా పేర్కొంటూ మెమో జారీ చేస్తామని బెదిరించారన్నారు. ఈ విషయాన్ని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్‌కు చెప్పినా పట్టించుకోలేదని నివేదించారు. విచారణవీడియోను హైకోర్టుకు సమరి్పంచాలని కోరినా.. 23నాటి∙విచారణలో అధికారులు కోర్టుకు అందజేయలేదని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకుని సిట్ దర్యాప్తు ఆపాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: హైదరాబాద్‌లో నీరా కేఫ్ రెడీ -
అదంతా కేసీఆర్ డ్రామా.. నడ్డాకు చెప్పిన రాష్ట్ర బీజేపీ నేతలు..
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. శుక్రవారం పారీ్టలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేరిక అనంతరం ఆయనతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నడ్డాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల ఎర అంశం చర్చకు వచ్చింది. దీనిపై వివరణ ఇచ్చిన రాష్ట్ర నేతలు, ఇదంతా సీఎం కేసీఆర్ డ్రామా అని స్పష్టం చేశారు. ప్రజాబలంలేని పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి, వారితో డ్రామా ఆడించారని, నాటకం బయట పడకుండా ఎమ్మెల్యేలని ప్రగతిభవన్ బయటకు కూడా రానివ్వడం లేదని విశదీకరించారు. సీఎం ఫాంహౌస్‌లో ఉంటే ఎమ్మెల్యేలను అక్కడే ఉంచుతున్నారని, వారిని మీడియా ముందు మాట్లాడనివ్వడంలేదని చెప్పుకొచ్చారు. సరిగ్గా ఇదే సందర్భంలో నడ్డా ‘ఫాంహౌస్ ముఖ్యమంత్రిని ఇకపై అక్కడే కూర్చోనిద్దాం’అని అన్నట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయమై కేంద్రాన్ని నిలదీసే అవకాశముందని కొందరు నేతలు నడ్డా దృష్టికి తెచ్చారు. అసెంబ్లీలో బీజేపీకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నారని వివరించారు. ఇందుకు నడ్డా స్పందిస్తూ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే అసెంబ్లీ బయట సీఎం తీరును ఎండగట్టాలని, ఆయన చేసిన ప్రతి ఆరోపణలకు గట్టిగా జవాబివ్వాలని నేతలను ఆదేశించారు. చదవండి: ‘ముందస్తు’ ప్రచారం.. కమలం అప్రమత్తం -
ఎమ్మెల్యేల ఎర కేసు: మరో ఐదుగురికి సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో అయిదుగురికి సిట్ నోటీసులు జారీ చేసింది. కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మణిలాల్‌లోపాటు సిబ్బంది శరత్, ప్రశాంత్, విమల్, ప్రతాపన్‌కు నోటీసులు ఇచ్చింది. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. రిమాండ్ పొడిగింపు ఎమ్మెల్యేలకు ఎర కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు వచ్చేనెల 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. విచారణకు నందకుమార్ భార్య టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నంద కుమార్ భార్య చిత్ర లేఖ, న్యాయవాదులు ప్రతాప్ గౌడ్, శ్రీనివాస్‌లు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలు.. ప్రతాప్ గౌడ్, నందకుమార్ ట్రాన్సెక్షన్‌పై విచారిస్తున్నారు. రామచంద్ర భారతి, సింహయాజులు తో పరిచయాలపై ప్రశ్నిస్తున్నారు. చదవండి: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్.. -
రామచంద్ర భారతి, నందులతో ‘రఘురామ’ చెట్టపట్టాల్!
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందుకుమార్‌తో.. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సత్సంబంధాలు ఉన్నట్టుగా సిట్ గుర్తించినట్లు తెలిసింది. నిందితుల సెల్ఫోన్లలో రఘురామ కృష్ణరాజు దిగిన ఫొటోలు, ఇతర కీలక వివరాలు బయటపడినట్లు సమాచారం. దీంతో ఎంపీని విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 41–ఏ సీఆర్పీసీ కింద గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న ఉదయం 10:30 గంటలకు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపారు. సహేతుక కారణం లేకుండా గైర్హాజరైతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని ఎంపీకి పంపిన ఈ–మెయిల్లో విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీకి ప్రత్యక్షంగా నోటీసులు అందించేందుకు సిట్ అధికారులు గురువారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని రఘురామ నివాసానికి వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని, ఢిల్లీకి వెళ్లారని సిబ్బంది తెలిపినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ వెళ్లిన సిట్ బృందం ఆయన నివాసంలో నోటీ సులు అందజేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి రఘురామ కృష్ణరాజుకు ముందే సమాచారం ఉందేమోనని, ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిన నగదు సమకూర్చడంలో ఎంపీ పాత్ర ఉందేమోనని సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనను విచారించాలని నిర్ణయించింది. ఏడుకు చేరిన నిందితుల సంఖ్య ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తాజాగా మరో నలుగురిని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతో‹Ù, కర్ణాటక బీడీజేఎస్ చీఫ్ తుషార్ వెల్లపల్లి, కేరళ వైద్యుడు కొట్టిలిల్ నారాయణ జగ్గు అలియాస్ జగ్గు స్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ మేరకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేశారు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న హైకోర్టు సింగిల్ జడ్జికి కూడా ఈ సమాచారం అందజేసినట్లు తెలిసింది. దీంతో ఈ కేసులో మొత్తం నిందితులు సంఖ్య ఏడుకు చేరుకుంది. ఇప్పటికే నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలు అరెస్టయి, చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజా నలుగురు నిందితులకు కూడా 120–బీ, 171–బీ రెడ్ విత్ 171–ఈ, 506 రెడ్ విత్ 34 ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం–1988 సెక్షన్–8 కేసులు వర్తిస్తాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరో ఐదుగురికి మళ్లీ నోటీసులు.. ఈ కేసు వెలుగులోకి వచి్చనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ అలాగే జగ్గు పనిచేస్తున్న అమృత ఆసుపత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్ఓ) ప్రతాపన్లను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆ నలుగురు సాక్షులకు సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. అయితే వారు విచారణకు గైర్హాజరు కావటంతో తాజాగా 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈసారి కూడా హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ‘అమృత’తో జగ్గుస్వామి సంబంధాలు నిర్ధారణ! జగ్గు స్వామిని విచారించేందుకు కేరళ వెళ్లిన సిట్ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి బృందాన్ని .. అమృత ఆసుపత్రితో జగ్గుకు ఎలాంటి సంబంధాలు లేవంటూ ఆసుపత్రి సీఎస్ఓ తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. దీంతో సిట్ బృందం స్థానిక పోలీసుల సహకారంతో జగ్గు ఇళ్లు, ఆఫీసులపై సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా.. అమృత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్)లో పరిపాలన విభాగంలో డిప్యూటీ మేనేజర్‌గా జగ్గు స్వామి పనిచేస్తున్నారని తేలింది. ఆసుపత్రి తరఫున బ్యాంక్ చెక్‌లను జారీ చేసే అధికారం కూడా ఆయనకు ఉందని గుర్తించినట్టు తెలిసింది. ఇదీ చదవండి: కక్షతోనే ఆంక్షలు.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ. 40,000 కోట్ల గండి -
సంతోష్ ఎప్పుడు వస్తారు?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ విచారణకు ఎప్పుడు వస్తారో చెప్పేదెవరని హైకోర్టు ధర్మాసనం.. బీజేపీ తరఫు న్యాయ వాదిని ప్రశ్నించింది. హాజరుపై స్పష్టత ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ–మెయిల్, వాట్సాప్ ద్వారా మళ్లీ నోటీసులు అందజేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. సిట్ విచారణను ఆపాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, నిందితులు రామచంద్ర భారతి, నందు, సింహయాజి, కరీంనగర్ న్యాయవాది బి.శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్, ఏఏజీ రామచంద్రరావు, కేంద్రం తరఫున గాడి ప్రవీణ్‌కుమార్, నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ, బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్ చిదంబరేశ్, ఎన్.రామచంద్రరావు హాజరయ్యారు. పార్టీ ప్రతినిధుల్లా మాట్లాడకూడదు.. ‘సంతోష్‌కు నోటీసులు ఇవ్వడం కోసం 16వ తేదీ నుంచి సిట్ ప్రయత్నిస్తోంది. ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. సంతోష్ కావాలనే నోటీసులు తీసుకోకుండా తప్పించుకుంటున్నారు. దీంతో ఆయన కార్యాలయంలోని వారికి సిట్ వాటిని అందజేసింది. ఆయనపై అనేక అనుమానాలున్నాయి. విచారణకు రాకుండా జాప్యం చేయడం మూలంగా సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది’ అని ఏజీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎన్. రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆధారాలు మొత్తం బహిరంగపర్చిందని ఆరోపిం చారు. బీఎల్ సంతోష్ సీనియర్ సిటిజన్ అని.. ఏం చేయలన్నదానిపై న్యాయసలహా తీసుకుంటున్నా రని తెలిపారు. ఈ క్రమంలో సంతోష్ అసలు విచా రణకు ఎందుకు హాజరుకావడం లేదు.. ఎప్పుడు హాజరవుతారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై తమ కు సమాచారం లేదని బీజేపీ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఇంకా వ్యక్తిగతంగా ఆయనకు నోటీసులు అందలేదని ఆయన చెప్పడంపై ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసుల విషయం తెలియనప్పుడు 70 ఏళ్ల వయసులో విచారణకు హాజరుకా లేనని సిట్‌కు సంతోష్ ఎలా లేఖ రాశారని ప్రశ్నించారు. కాగా, ఈ సందర్భంగా బీజేపీ, ప్రభుత్వ న్యాయవాదుల తీరు పట్ల న్యాయమూర్తి అభ్యంత రం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రతినిధుల్లా మాట్లాడకూడదని.. రాజకీయ నాయకుల్లా వాదించుకోవడం సరికాదన్నారు. వృత్తి నిపుణుల్లా ప్రవర్తించాలని వ్యాఖ్యానించారు. ఆవేశానికి లోనుకావొద్దన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఇవ్వాలని ఏజీని న్యాయమూర్తి కోరగా, ఇంకా రాలేదని చెప్పారు. ఉత్తర్వులు వచ్చాకే విచారణ జరుపుతామంటూ మధ్యాహ్నం 2:30కి వాయిదా వేశారు. సిట్‌పై తేల్చాల్సింది ఈ ధర్మాసనమే.. తిరిగి విచారణ ప్రారంభం సందర్భంగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీని ఏజీ న్యాయమూర్తికి అందజేశారు. ‘సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినా సంతోష్ విచారణకు హాజరుకాలేదు. బీఎల్ సంతోష్ తరఫున న్యాయవాదులెవరూ ప్రాతినిధ్యం వహించడం లేదు. ఈ నెల 19న అరెస్టు చేయకూడదని ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సిట్ స్వతంత్రంగా, స్వేచ్ఛగా విచారణ సాగించే వెసులుబాటు కల్పించాలి’ అని ఏజీ విజ్ఞప్తి చేశారు. విచారణ కోసమే 41ఏ నోటీ సులు ఇచ్చామని చెప్పి.. ఇప్పుడు అరెస్టు చేయకూడదన్న ఆదేశాలు రద్దు చేయాలని కోరడం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. బీజేపీ కీలక నేత అయిన సంతోష్‌ను అరెస్టు చేస్తే.. దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చిదంబరేశ్ నివేదించారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఏజీ బదులిచ్చారు. సిట్ దర్యాప్తును సింగిల్ జడ్జి పర్యవేక్షించాలని డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసిందని మహేశ్ జఠ్మలానీ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సిట్ భవితవ్యాన్ని తేల్చే అధికారం ఈ ధర్మాసనానిదేనని చెప్పారు. సిట్ ఉండాలా?. వద్దా ? కొత్త సిట్‌ను ఏర్పాటు చేయాలా? లేదా సీబీఐకి బదిలీ చేయాలా?.. ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ ఈ ధర్మాసనానికి ఉందన్నారు. హైకోర్టు జడ్జి దర్యాప్తును పర్యవేక్షించగలరా? అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు జఠ్మలానీ బదులిస్తూ.. పర్యవేక్షించవచ్చని.. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముగ్గురు నిందితులు గురువారం హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సంతోష్‌కు మళ్లీ నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. సిట్ వేధిస్తోంది: శ్రీనివాస్ విచారణ పేరుతో సిట్ అధికారులు వేధిస్తున్నారని పేర్కొంటూ న్యాయవాది భూసారపు శ్రీనివాస్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిరోజూ తమ ఎదుట హాజరుకావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ నెల 25న సిట్ ఎదుట హాజరైతే సరిపోతుందని తెలిపింది. అలాగే తనకు సిట్ సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వడంపై అంబర్‌పేటకు చెందిన హైకోర్టు న్యాయవాది ప్రతాప్‌గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింహయాజీ స్వామితో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వేధిస్తున్నారని, ఈ నోటీసులను కొట్టేయాలని కోరారు. ఇదీ చదవండి: రెండో రోజూ ఐటీ వేట: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో కొనసాగిన దాడులు -
ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసు.. హైకోర్టులో బీజేపీకి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టులో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు మరోసారి నోటీసులివ్వాలని సిట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపాలని తెలిపింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. అంతకముందు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు విచారణ తిరిగి ప్రారంభించింది. హైకోర్టు బెంచ్ ముందుకు సుప్రీంకోర్టు తీర్పు కాపీ చేరింది. బీజేపీ తరపున మహేష్ జెఠ్మలానీ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. సుప్రీంకోర్టు ఎక్కడా దర్యాప్తుపై స్టే ఇవ్వలేదని ఈ సందర్భంగా ఏజీ కోర్టుకు తెలిపారు. కేసుతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు బీఎల్ సంతోష్ సహకరించడం లేదని, 41ఏ సీఆర్పీసీ ప్రకారం విచారణకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. బీఎ సంతోష్ గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాడని మహేష్ జెఠ్మలానీ కోర్టుకు తెలిపారు. ఎప్పటి వరకు సమయం కావాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 29న నివేదిక సమర్పించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్డర్ ఉందని ఏజీ పేర్కొన్నారు. బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కానీ నేపథ్యంలో విచారణ ఆలస్యం అవుతుందన్నారు. తదుపరి చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. చదవండి: మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు: రఘునందన్ రావు -
ఎమ్మెల్యేలకు ఎర కేసు: సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎక్కడ?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎక్కడని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. బీఎల్ సంతోష్‌కు ఈనెల 16 నుంచి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. చివరకు ఢిల్లీ పోలీసుల సాయంతో బీజేపీ ఆఫీసులో నోటీసులు అందించినట్లు వివరించారు. బీఎల్ సంతోష్ సిట్ ముందుకు వస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని కోర్టుకు చెప్పారు. సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతోందన్నారు. మరోవైపు బీఎల్ సంతోష్ చట్టాన్ని ఎక్కడా ధిక్కరించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రామచందర్‌రావు న్యాయస్థానానికి తెలిపారు. దీంతో బీఎల్ సంతోష్ 41 సీఆర్పీసీని సవాల్ చేయాలనుకుంటున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. సిట్ ముందు హాజరయ్యేందుకు బీఎల్ సంతోష్ గడువు కోరుతున్నారా? అని అడిగింది దీనికి బదులిస్తూ.. బీఎల్ సంతోష్ సిట్‌కు లేఖ రాశారని రామచందర్ రావు కోర్టుకు తెలిపారు. విచారణకు ఎందుకు హాజరు కాలేకపోతున్నారో లేఖలోనే చెప్పారని వివరించారు. బీఎల్ సంతోష్ తనకు ఇష్టమున్న సమయంలో విచారణకు వస్తే కేసును తప్పుదోవ పట్టించే ప్రమాదముందని ప్రభుత్వం తరఫు న్యాయవాదని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. సుప్రీంకోర్టు ఉత్తర్వులు చూశాకే విచారణ జరుపుతామని చెప్పింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2:30కి కోర్టు వాయిదా వేసింది. అయితే సాయంత్రానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు రావచ్చని న్యాయవాదులు భావిస్తున్నారు. చదవండి: కుమారుడికి అస్వస్థత.. ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణహైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు విచారణకు హాజరు కాలేదని హైకోర్టుకు సిట్ స్పష్టం చేసింది. వారికి నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదని, ఏదైనా ఆర్డర్ ఇవ్వాలని హైకోర్టును సిట్ కోరింది. బీఎల్ సంతోష్‌కు నోటీసులు అందాయని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, సిట్ విచారణ అంశాలపై రేపు మరోసారి విచారిస్తామన్న హైకోర్టు తన విచారణను వాయిదా వేసింది. కాగా, ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరు కావాల్సి ఉన్న ముగ్గురికి లుకౌట్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలు సోమవారం విచారణకు హాజరు కాలేదు. బీఎల్ సంతోష్ ఆఫీస్‌లో సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో బీఎల్ సంతోష్ తాను వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్నాని, అందువల్ల సిట్ ముందుకు వచ్చేందుకు సమయం కావాలని కోరాడు. ఐతే కేరళ వైద్యుడు జగ్గుస్వామీ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. దీంతో అతను విదేశాలకు పారిపోకుండా తెలంగాణ పోలీసులు అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అలర్ట్ చేయడమే కాకుండా విదేశాలకు చెక్కేయకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది సిట్. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు...ఎయిర్‌పోర్ట్‌ల్లో నిఘా!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురికి లుకౌట్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలు సోమవారం విచారణకు హాజరు కాకపోవడంతో సిట్ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే బీఎల్ సంతోష్ ఆఫీస్‌లో సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో బీఎల్ సంతోష్ తాను వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్నాని, అందువల్ల సిట్ ముందుకు వచ్చేందుకు సమయం కావాలని కోరాడు. ఐతే కేరళ వైద్యుడు జగ్గుస్వామీ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. దీంతో అతను విదేశాలకు పారిపోకుండా తెలంగాణ పోలీసులు అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అలర్ట్ చేయడమే కాకుండా విదేశాలకు చెక్కేయకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది సిట్. ఇక ఈ కేసులో బండి సంజయ్ అనుచరుడు న్యాయవాది శ్రీనివాస్‌ని ఇప్పటికే ప్రశ్నించిన సిట్ మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో రెండో రోజు విచారణకు హాజరైన అడ్వకేట్ శ్రీనివాస్ కాల్‌డేటా, బ్యాంక్స్టేట్మెంట్లను సిట్ బృందం పరిశీలిస్తోంది. (చదవండి: ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసులో కొత్త ట్విస్ట్.. ఆ ముగ్గురికి లుకౌట్ నోటీసులు!) -
ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నోటీసులు జారీ చేసిన ముగ్గురిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీరంతా సోమవారం నాడు విచారణకు హాజరు కాకపోవడంతో లుకౌట్ నోటీసులు ఇచ్చింది. ఇక ఈ కేసులో బండి సంజయ్ అనుచరుడు, అడ్వకేట్ శ్రీనివాస్‌ను ఇప్పటికే ప్రశ్నించిన సిట్ మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాలని తెలిపింది. కాగా సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరు కావాల్సిందిగా బీఎల్ సంతోష్‌కు తొలిసారి జారీ చేసిన నోటీసులో సిట్ పేర్కొంది. కానీ సంతోష్ గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. సంతోష్‌తో పాటు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్, తుషార్ వెల్లాపల్లి, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలకూ సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురూ విచారణకు హాజరుకాలేదు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంతోష్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. చదవండి: కానిస్టేబుల్ ఈశ్వర్.. ఇతని రూటే సపరేటు.. దొంగలతో చేతులు కలిపి -
టికెట్ ఎందుకు బుక్ చేశారు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిట్ పలువురికి 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమీప బంధువు, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్ సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరయ్యారు. సిట్ సభ్యులైన సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) కళ్మేశ్వర్, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ వేర్వేరుగా సాయంత్రం 6:30 గంటల వరకూ ఆయనను సుమారు 8 గంటలపాటు విచారించారు. శ్రీనివాస్ ఫోన్ కాల్‌డేటాతోపాటు, ఆయన బ్యాంక్ ఖాతా వివరాలను పరిశీలించి, వాటిపై పలు సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం. గత నెల 26న నలుగురు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలతో హరియాణాకు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్ వ్యాపారి నందుకుమార్, తిరుపతి స్వామి సింహయాజీలు రహస్య మంతనాలు జరుపుతుండగా.. పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అదేరోజు మధ్యాహ్నానికి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ ఇండియా విమాన టికెట్‌ను బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అసలు సింహయాజీతో మీకున్న సంబంధం ఏంటని అధికారులు శ్రీనివాస్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. సింహయాజీతో పూజలు చేయించడం కోసమే ప్రత్యేకంగా టికెట్ బుక్ చేశానని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అలాగే శ్రీనివాస్ ఫోన్లోని యూపీఐ లావాదేవీల జాబితాను ముందు పెట్టి విచారించారు. కాగా, విచారణలో శ్రీనివాస్ ఓ జాతీయ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లు వెల్లడించినట్టు సమాచారం. దీంతో వారికీ 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. అరగంట ఫోన్లో ఏం మాట్లాడారు? తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ మొదటిది కానుంది. నోటీసులు జారీ చేసిన నలుగురిని విచారించేందుకు 16, 17 అంతస్తుల్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. విచారణకు హాజరయ్యే వారి ప్రతి కదలిక, హావభావాలు, విచారణ సమయంలో సిట్ ప్రశ్నలు, రాబట్టే సమాధానాలు, వారి స్పందన.. ఇలా అన్ని అంశాలూ స్పష్టంగా రికార్డయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు నందుకుమార్ ఫోన్‌ను విశ్లేషించగా.. గత నెల 26 కంటే ముందు అరగంట సేపు సెల్ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఏం మాట్లాడారు? 26న టికెట్లు బుక్ చేయాలని ఎవరైనా కోరారా? అని లోతుగా విచారించినట్లు సమాచారం. ఇదిలాఉండగా.. శ్రీనివాస్ నుంచి సంతృప్తికర సమాధానాలు రాబట్టలేని అధికారులు.. మంగళవారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇదీ చదవండి: సామాన్యుడి కోసం ధర్మపీఠం -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సిట్ విచారణ వేగవంతం
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి సిట్ విచారణ కొనసాగుతోంది. బండి సంజయ్ అనుచరుడు అడ్వకేట్ శ్రీనివాస్‌ను పోమవారం సిట్ సుదీర్ఘంగా విచారించింది. సుమారు 8 గంటల పాటు శ్రీనివాస్‌ను సిట్ విచారించింది. సింహయాజి స్వామికి శ్రీనివాస్ విమానం టికెట్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన సిట్..ఈ మేరకు విచారణ చేపట్టింది. అక్టోబర్ 26వ తేదీన తిరుపతి నుండి హైదరాబాద్‌కు సింహయజుల స్వామికి శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్ చేసినట్లు సిట్ గుర్తించింది. సింహయాజి స్వామితో శ్రీవివాస్‌కు ఉన్న పరిచాయలపై ప్రధానంగా సిట్ విచారించింది. ఫోన్ కాల్ లిస్ట్, యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆధారంగా సిట్ విచారించింది. అయితే పూజకు సంబంధించే సింహయాజి స్వామికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసినట్లు విచారణలో శ్రీనివాస్ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని 17వ అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. కాగా, ఈ విచారణకు బీఎల్ సంతోష్, జగ్గు స్వామి, తుషార్‌లు హాజరు కాలేదు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు విముఖత
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. రిమాండ్‌ను సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్‌నాథ్‌తో కూడా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నిందితుల తరపు న్యాయవాది తన్మయ్ మెహతా వాదించగా.. తెలంగాణ ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఈ మేరకు రామచంద్రబారతి సహా ముగ్గురు నిందితుల పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విచారణ దశలో ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు పిటిషనర్‌కు ఉందని కోర్టు సూచించింది. హైకోర్టు బెయిల్ ఇస్తుంది కదా అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో రిమాండ్ విషయంలో హైకోర్టు తీర్పును అత్యున్నత ధర్మాసనం తప్పుపట్టింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు సమర్థనీయం కాదని వెల్లడించింది. సింగిల్ జడ్జి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని, తీర్పులో ప్రస్తావించిన అంశాలు సమంజసమైనవి కావని తెలిపింది. అరుణేశ్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను హైకోర్టు తప్పుగా తీసుకుందని అభిప్రాయపడింది. ముమ్మరంగా విచారణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. బండి సంజయ్ అనుచరుడు అడ్వకేట్ శ్రీనివాస్ సోమవారం సిట్ విచారణకు హజరయ్యారు. నిందితులకు విమాన టికెట్లు బుక్ చేశారని శ్రీనివాస్‌పై అరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ చేతిలో కీలక ఆధారాలు సేకరించింది. అక్టోబర్ 26న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు సింహయజులు స్వామికి శ్రీనివాస్ టికెట్ బుక్ చేసినట్టు సిట్ గుర్తించింది. ఈ మేరకు శ్రీనివాస్‌కు సంబంధించిన లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఫోన్ కాల్ లిస్ట్ వివరాలు ముందుంచి శ్రీనివాస్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్ ఎదుట సంతోష్ హాజరు లేనట్టే! -
ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్ ఎదుట సంతోష్ హాజరు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ ఇప్పట్లో హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. సిట్ గతంలో ఇచ్చిన నోటీసు మేరకు బీఎల్ సంతోష్ సోమవారం విచారణకు కావాల్సి ఉంది. మరోవైపు సోమ, మంగళవారాల్లో రాష్ట్ర బీజేపీ నాయకులకు నిర్వహిస్తున్న ప్రశిక్షణ్ శిబిరంలో సంస్థాగత అంశాలపై ఆయన శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కానీ బీఎల్ సంతోష్ ప్రశిక్షణ్ శిబిరానికి హాజరుకావడం లేదని, ఆయన తీసుకునే సెషన్‌ను తొలగించారని తెలిసింది. అయితే సాంకేతికంగా సంతోష్‌కు ఇంకా నోటీసులు అందలేదని, లేదా ఆయన స్వయంగా స్వీకరించలేదని.. అందువల్ల ఆయన దీనిపై స్పందించడంగానీ, విచారణకు హాజరుకావడంగానీ జరగకపోవచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కోర్టు ఢిల్లీ పోలీసుల ద్వారా సంతోష్‌కు నోటీసులు అందజేయాలని సూచించిందని.. మరి ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించి నోటీసులిస్తారా, సమయం తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. ఒకవేళ నోటీసులు అందినా సంతోష్ తరఫు న్యాయవాది హాజరై కొంత సమయం కోరే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం బీఎల్ సంతోష్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, ఇప్పట్లో సిట్ విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. చదవండి: గవర్నర్ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు -
ఒకటే ఫోన్, ఐఎంఈఐ నంబర్లు.. పొరపాటా లేక స్పష్టత కోసమా?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో భాగంగా జారీ చేసిన నోటీసులలో గందరగోళం నెలకొంది. సోమవారం హైదరాబాద్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మెరబెట్లు లక్ష్మీ జనార్దన సంతోష్ (బీఎల్ సంతోష్), కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లకు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇరువు రూ విచారణకు వచ్చేటప్పుడు వారు వినియోగించే మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, ఐపాడ్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వెంట తీసుకురావాలని నోటీసులో సిట్ పేర్కొంది. ఫలానా ఫోన్ నంబరు, ఫలానా ఐఎంఈఐ నంబరు గల సెల్‌ఫోన్‌ను తప్పనిసరిగా తీసుకు రావాలని ఆదేశించింది. ఫోన్లోని సమాచారాన్ని తొలగించడం లేదా చెరపడం కానీ చేయరాదని పేర్కొంది. అయితే బీఎల్ సంతోష్, శ్రీనివాస్.. ఇద్దరికీ సిట్ జారీ చేసిన నోటీసులలో పేరొన్న ఫోన్ నంబరు, ఐఎంఈఐ నంబర్లు ఒకటే ఉండటం గందరగోళానికి తెరతీసింది. ముద్రణలో పొరపాటేనా.. ఇరువురు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సిట్ విచారణాధికారి, రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ బి.గంగాధర్ ఈ నెల 16న నోటీసులు జారీ చేశా రు. అయితే ఒకే రోజు ఒకే సమయానికి ఇద్దరికీ నోటీసులు జారీ చేసే క్రమంలో ముద్రణలో పొరపాటు జరిగిందా? లేక దర్యాప్తులో భాగంగా ఆ ఫోన్ నంబరు ఎవరి దగ్గర ఉంది? ఎవరు వినియోగిస్తున్నారో తెలుసుకోవటానికే అలా ఇద్దరి నోటీసుల్లోనూ ఒకటే ఫోన్, ఐఎంఈఐ నంబర్ల ను పేర్కొన్నారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. నోటీసులో పేర్కొన్న ఫోన్ నంబరుకు ‘సాక్షి’ కాల్ చేసేందుకు ప్రయత్నించగా.. ట్రూ కాలర్‌లో బీఎల్ సంతోష్ అనే పేరు రావటం గమనార్హం. దీంతో శ్రీనివాస్‌కు జారీ చేసిన నోటీసు ముద్రణలో సిట్ అధికారు లు పొరపాటు చేసి ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో ఈనెల 29లోగా దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. సమయం తక్కువగా ఉండటంతో నోటీసుల జారీలో పొరపాట్లు దొర్లి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బీఎల్ సంతోష్ స్వస్థలం కర్ణాటకలోని ఉడిపి జిల్లా హిరియాడ్కా పట్టణం కాగా.. సిట్ అధికారులు మాత్రం బెంగళూరులోని మల్లేశ్వరం, టెంపుల్ స్ట్రీట్ చిరునామాతో నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఎవరికీ భౌతికంగా అందించలేదు.. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు హరియాణాలోని ఫరీదాబాద్ పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహాయాజీలను విచారించి న పోలీసులు వారి నుంచి మరింత సమాచారా న్ని రాబట్టారు. వీటి ఆధారంగా సంతోష్, శ్రీనివాస్‌లతో పాటు కేరళలో బీజే పీకి మిత్రపక్షమైన భరత్ ధర్మజనసేన(బీడీజేఎస్) అధినేత తుషార్ వెల్లపళ్లి, రామచంద్రభారతికి మధ్యవర్తిత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్న కేరళకు చెందిన వైద్యుడు జగ్గు స్వామికి కూడా 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ అయ్యాయి. అయితే వీరిలో ఏ ఒక్కరికీ కూడా సిట్ అధికారులు భౌతికంగా నోటీసులు అందించకపోవటం గమనార్హం. శ్రీనివాస్, జగ్గు స్వామి ఇళ్లకు నోటీసులు అతికించగా, తుషార్ ఇంట్లో లేకపోవటంతో ఆయన ఆఫీసు సెక్రటరీకి నోటీసులు అందించారు. అయితే ఈనెల 3న సీఎం కేసీఆర్.. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి సంభాషించిన ఆడియో, వీడి యో రికార్డులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో రామచంద్రభారతి, బీఎల్ సంతోష్, సునీల్‌కుమార్ బన్సల్, తుషార్ పేర్లను పలుమార్లు ప్రస్తావించారు. ఇందులో సంతోష్, తుషార్లకు సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. బన్సల్‌కు నోటీసులు జారీ చేశారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. స్పష్టత కోసమేనా? కాగా.. అరెస్టు సమయంలో రామచంద్రభా రతి సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులోని కాంటాక్ట్‌లను పరిశీలించగా.. ‘సంతోష్ బీజేపీ’ పేరిట ఉన్న ఫోన్ నంబర్‌కు ఇంగ్లీషులో పంపిన సందేశాలను పోలీసులు గుర్తించారు. ‘నేను రామచంద్రభారతిస్వా మీజిని, హరిద్వార్ బైఠక్‌లో మిమ్మల్ని కలిశా. తెలంగాణలో కీలకాంశాలపై చర్చించాలి. 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ అపాయింట్మెంట్ కావాలి, ఆ ముగ్గురికీ కొంత విట మిన్ ఎం అవసరం.. వంటి పలు సందేశాలను పోలీసులు గుర్తించారు. సంతోష్ బీజేపీ నుంచి మాత్రం రామచంద్రభారతికి ఎలాంటి రిప్లైలు వచ్చినట్లు పోలీసులకు కనిపించలేదని తెలుస్తోంది. ఈ అంశంపై స్పష్టత కోసమే సిట్ అధికారులు బీఎల్ సంతోష్, శ్రీనివాస్‌లకు ఇరువురికీ ఒకే ఫోన్ నంబరు, ఐఎంఈఐ నంబరును తీసుకురావాలని సూచించినట్లు పోలీసు వర్గాలు అంటున్నాయి. అసలు ఆ ఫోన్‌ను ఎవరు వినియోగిస్తున్నారో బయటపడుతుందని చెపుతున్నారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్‌లు.. బీజేపీకి కొత్త టెన్షన్! -
‘మునుగోడు’ పాఠం నేర్చుకుందాం
సాక్షి, హైదరాబాద్: నిత్యం అధికారిక కార్యక్రమాలు, పర్యటనలతో బిజీగా ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడు ఉప ఎన్నిక ద్వారా కొత్త పాఠాలు నేర్చుకున్నారా? పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల పర్యవేక్షణలో ఉప ఎన్నిక వ్యూహం అమలు, ప్రచారంలో ఎదురైన అనుభవాలు తమ పనితీరును అంచనా వేసుకునేందుకు వీలు కల్పించాయా? ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై, ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో నెలకొన్న అభిప్రాయాలను, వివిధ వర్గాలు తమపట్ల స్పందిస్తున్న తీరును బేరీజు వేసుకునేందుకు ఉప ఎన్నిక ఒక పాఠంలా పనిచేసిందా?.. ఈ ప్రశ్నలకు టీఆర్ఎస్ వర్గాలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను క్రోడీకరించి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోగా దిద్దుబాటు చర్యలు చేపట్టడం, కొత్త ఎన్నికల వ్యూహాన్ని రూపొందించుకుని అమలు చేయడంపై ఇప్పట్నుంచే దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ఉప ఎన్నిక నొక్కి చెప్పిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వచ్చే పది నెలల పాటు నియోజకవర్గంలోనే మకాం వేసి, ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితిని గుర్తు చేసిందనే భావన కనిపిస్తోంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ ‘ఐప్యాక్’సంస్థ వివిధ మార్గాల ద్వారా సేకరించి ఇస్తున్న సమాచారాన్ని సీఎం కేసీఆర్ విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వంద మందికో ఇన్చార్జిని నియమించాలని కేసీఆర్ ఆదేశించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కోణంలోనే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలు, కేడర్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారని వివరిస్తున్నాయి. మోహరింపుతో స్వయం విశ్లేషణ మునుగోడు ఉప ఎన్నిక విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని పార్టీ కీలక నేతలందరినీ మోహరించారు. సుమారు 20రోజుల పాటు మునుగోడులో మకాం వేసిన నేతలు పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. అక్కడ 2,500 నుంచి 3వేల మంది ఓటర్లను ఒక యూనిట్‌గా విభజించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా గ్రామాలు, వార్డుల్లో మకాం వేసిన నేతలకు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల పట్ల ఓటర్లలో నెలకొన్న అభిప్రాయాన్ని మదింపు చేసుకునే అవకాశం దక్కింది. ఏయే వర్గాలు పార్టీ పట్ల ఏ విధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి, వారు ఉప ఎన్నికలో ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు, ఏయే అంశాలు వారిని ప్రభావితం చేస్తున్నాయన్న అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం దక్కింది. యువత, ఉద్యోగులు, కొత్త ఓటర్లు, మహిళలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఏం కోరుకుంటున్నారనే దానిపైనా స్పష్టత వచ్చింది. ఎమ్మెల్యేలు ఈ అనుభవాలను తమ నియోజకవర్గ పరిస్థితులతో పోల్చి చూసుకుంటూ.. వచ్చే ఎన్నికల్లో తమకు ఎదురయ్యే ఫలితంపై అంచనాలు వేసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, స్థానిక నేతలు ఏం కోరుకుంటున్నారు, ఏ అంశాలపై అసంతృప్తితో ఉన్నారు, అంతర్గత విభేదాలు ఏ విధంగా ప్రభావం చూపుతాయి, వారిని ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశాలపైనా ఎమ్మెల్యేలకు స్పష్టత వచ్చినట్టు పేర్కొంటున్నాయి. ఓటర్లకు చేరువ అయ్యేలా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నా.. వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ అవకాశంపై ఎమ్మెల్యేలు అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాలు, మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి కేడర్‌తో ఉన్న గ్యాప్‌ను సరిదిద్దుకోవడం, వారికి దగ్గరయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవడంలో నిమగ్నం అవుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో భేటీలు, వివిధ సామాజిక వర్గాలతో సమావేశాల ద్వారా వారికి చేరువగా ఉన్నామనే అభిప్రాయం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రతి వంద మంది ఓటర్లకు ఒక పార్టీ ఇన్చార్జిలను నియమించి, వారి ఫోన్ నంబర్ల జాబితాలను తెలంగాణ భవన్‌కు పంపాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ ఇన్చార్జులు ప్రతీ ఓటరును చేరుకుని వారి పూర్తి వివరాలను సేకరించి ప్రొఫైల్స్‌ను రూపొందిస్తారు. ఓటరు కుటుంబం, వారిలో ఎందరికి ఓటు హక్కు ఉంది, ఎక్కడ నివాసం ఉంటున్నారు, నియోజకవర్గం బయట ఉండే వారి చిరునామా, ఫోన్ నంబర్ వివరాలన్నీ సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి, పట్టు పెంచుకునేందుకు ఈ కసరత్తు ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇదీ చదవండి: Hijab: నిరసనకారులకు గుణపాఠమా?! -
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోని ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు సోమవారం కొట్టివేసింది. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే కేసును, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు.. నిందితుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. బెయిల్ మంజూరు కాకపోవడంతో ముగ్గురు నిందితులు యథావిధిగా చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండనున్నారు. కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలపై రామచంద్రభారతి, నందు, సింహయాజి అనే ముగ్గురు వ్యక్తులను సాక్ష్యాధారాలతో సహా మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) విచారిస్తోంది. ఎరకు ఎక్కడ? ఎప్పుడు బీజం పడిందో తేల్చే పనిలో పడ్డారు. రామచంద్రభారతి, నందు, సింహయాజీలకు ఒకరితో మరొకరికి పరిచయం ఎలా ఏర్పడింది? వీరిని ఎవరెవరు కలిశారు? అనే వివరాలను రాబట్టడంలో నిమగ్నమయ్యారు. చదవండి: 'ఆ నలుగురు' ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్.. 4 ఠాణాల్లో ఫిర్యాదులు.. పీటీ వారెంట్ మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై పోలీసులు పీటీ వారెంట్ కోరారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇప్పటికే నందకుమార్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో రెండు కేసులు నమోదవ్వగా.. కేసు దర్యాప్తులో భాగంగా విచారించేందుకు నందకుమార్ అరెస్ట్‌కు అనుమతించాలని పోలీసులు కోరారు. ఎమ్మెల్యేల ఎర కేసులో ఏ2 గా ఉన్న నందకుమార్.. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పీటీ వారెంట్‌కు నాంపల్లి కోర్టు అనుమతిస్తే.. పోలీసులు నందును విచారించనున్నారు. -
'ఆ నలుగురు' ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్.. 4 ఠాణాల్లో ఫిర్యాదులు..
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసుకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ మేరకు వారు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఫిర్యాదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఘట్కేసర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గచ్చిబౌలి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బంజారాహిల్స్ ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌ను కలిసిన రోహిత్ రెడ్డి తనకు ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 11 ఫోన్ నంబర్ల నుంచి తరచూ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో దూషిçస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఆరుకు చేరిన కేసుల సంఖ్య ఫామ్‌హౌస్ ఘటనలో ప్రధాన, అనుబంధ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ‘ఎర’కు సంబంధించిన ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలపై మొయినాబాద్ ఠాణాలో నమోదైన కేసు మొదటిది కాగా.. ఆ తర్వాత రామచంద్రభారతి రెండేసి ఆధార్, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు కలిగి ఉన్నాడంటూ బంజారాహిల్స్‌లో మరో కేసు నమోదయింది. తాజాగా నమోదైన నాలుగు కేసులతో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది. రోహిత్‌రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఎమ్మెల్యే ఇంటికెళ్లిన అధికారులు రెమా రాజేశ్వరి, కల్మేశ్వర్ శింగేనవర్.. నిందితులు ఆయన్ను ఎలా సంప్రదించారు? పార్టీ మారితే ఏం ఇస్తామని ఆఫర్ చేశారని ప్రశ్నించి..ఆ మేరకు స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
‘ఎర’కు బీజం ఎక్కడ పడింది? మూలాలను పసిగట్టే పనిలో సిట్..
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం అదికారులు వేగవంతం చేశారు. ఎరకు ఎక్కడ? ఎప్పుడు బీజం పడిందో తేల్చే పనిలో పడ్డారు. రామచంద్రభారతి, నందు, సింహయాజీలకు ఒకరితో మరొకరికి పరిచయం ఎలా ఏర్పడింది? వీరిని ఎవరెవరు కలిశారు? అనే వివరాలను రాబట్టడంలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులు ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నందకుమార్, తిరుపతికి చెందిన స్వామి సింహయాజీల ఇళ్లు, ఆశ్రమాలలో సోదాలు చేశారు. హైదరాబాద్, తిరుపతి సహా హరియాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలోని ఏడు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లకు చెందిన సుమారు 80 మంది పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నందును ఎవరెవరు కలిశారు? ఇళ్లు, ఆశ్రమాలలో సోదాలు చేస్తున్న అధికారులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. నందకుమార్‌కు చెందిన ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్లో, ఆయన ఇంటిలోనూ పోలీసులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. హిల్‌టాప్ అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకొని.. నందును కలవటానికి ఎవరెవరు వచ్చారనే అంశంపై ఆరా తీశారు. అలాగే రామచంద్రభారతికి చెందిన హరియాణలోని ఫరీదాబాద్, అలాగే కర్ణాటకలోని పుత్తూరులో ఉన్న ఇళ్లల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. తిరుపతిలోని సింహాయాజీ ఇంటిలో కూడా తనిఖీలు చేపట్టారు. కుటుంబ సభ్యులు, స్థానికులను విచారించి పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఆయా సోదాల సందర్భంగా పలు రికార్డులు, కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మరోవైపు గత నెల 26న హైదరాబాద్‌కు వచ్చిన రామచంద్రభారతి, సింహయాజీలు నందకుమార్‌కు చెందిన డెక్కన్ కిచెన్ హోటల్లోనే బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి సీసీటీవీ కెమెరాలలో ఇది రికార్డయినట్లు ఓ అధికారి తెలిపారు. తుషార్, భారతి మధ్యన కేరళ వైద్యుడు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను రెండు రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు.. వారి నుంచి పలువురి పేర్లు రాబట్టినట్లు తెలిసింది. దీంతో ఈ కేసుతో వారికి ఉన్న సంబంధం, ఇతరత్రా వివరాలను సేకరించేందుకు కేరళలోని కొచ్చి ప్రాంతానికి చెందిన ఓ వైద్యుడి ఇంటిలో సోదాలు చేసినట్లు తెలిసింది. రామచంద్రభారతి, తుషార్‌కు మధ్య ఈయన వారధిలాంటి వాడని సిట్ అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. తుషార్‌కు అత్యంత సన్నిహితుడైన ఈ వైద్యుడే రామచంద్రభారతిని తుషార్‌కు పరిచయం చేశాడని గుర్తించారు. ఇందుకోసం ఆధారాలను సేకరిస్తున్నామని, ఈ కేసుతో సంబంధం ఉన్న వారి కార్యకలాపాలు, వివరాలను సేకరిస్తున్నామని సిట్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. నేడు నగరానికి సిట్ బృందాలు మరో నిందితుడు సింహయాజీ గత నెల 26న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చారని, ఈయన ప్రయాణ టికెట్‌ను ఓ జాతీయ పార్టీకి చెందిన కీలక నేత దగ్గరి బంధువే సమకూర్చారని పోలీసులు గుర్తించారు. గత 2 రోజులుగా ఇతర రాష్ట్రాలలో సోదాలలో ఉన్న సిట్ బృందాలు సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంటాయని, వారు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించాక ఈ కేసులో మరికొందరిని నిందితులుగా చేసే అవకాశం ఉందని, అవసరమైతే వారిని అరెస్టు చేసి విచారించి పూర్తి వివరాలు రాబడతామని ఓ అధికారి వివరించారు. చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
బీజేపీ వాళ్లకు ‘సిట్’ మీద నమ్మకం లేదట.. టీఆర్ఎస్ వాళ్లకు సీబీఐ మీద నమ్మకం లేదట సార్!!
బీజేపీ వాళ్లకు ‘సిట్’ మీద నమ్మకం లేదట.. టీఆర్ఎస్ వాళ్లకు సీబీఐ మీద నమ్మకం లేదట సార్!! -
ఎమ్మెల్యేల కొనుగోలు.. ‘సిట్’లో రెమా రాజేశ్వరి.. సీవీ ఆనంద్ తర్వాత ఆమెనే!
సాక్షి, నల్లగొండ: జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరికి రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ కోసం నియమించిన ప్రత్యేక విచారణ బృందం (సిట్)లో ఆమెకు చోటు కల్పించింది. రాజకీయ ప్రమేయమున్న ఈ కీలక కేసులో జిల్లా ఎస్పీని నియమించేందుకు గాను అనేక అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో పలు కీలక కేసులను విచారించిన అనుభవంతో పాటు ఆయా కేసుల్లో పక్కా సాక్ష్యాలు సేకరించే నైపుణ్యం ఉన్న అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న రెమా రాజేశ్వరికి ఈ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ప్రభుత్వం నియమించిన ఏడుగురు పోలీసు అధికారుల్లో సిట్‌కు నేతృత్వం వహించనున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తర్వాత సీనియర్ అధికారిణి మన ఎస్పీనే. ట్రాక్ రికార్డు అదుర్స్.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసు రాజకీయంగా చాలా కీలకమైంది. ఈ కేసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది. అలాంటి కీలకమైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌లో మన ఎస్పీకి చోటు దక్కేందుకు గతంలో ఆమెకున్న ట్రాక్ రికార్డే కారణమనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది. 2014లో పెదవూర మండలం ఏనెమీదితండాలో 12 మంది గిరిజన బాలికలపై జరిగిన లైంగిక దాడి కేసు విచారణలో ఎస్పీ రెమా రాజేశ్వరి కీలకంగా వ్యవహరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో జిల్లా అదనపు ఎస్పీగా ఉన్న ఆమె పకడ్బందీగా కేసును ముందుకు నడిపించి సాక్ష్యాధారాలతో సహా నిరూపించి నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషిచేశారు. ఆమె మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఎరుకల శ్రీను అనే సీరియల్ కిల్లర్ కేసును కూడా ఛేదించారు. 17 మందిని పొట్టనబెట్టుకున్న నరహంతకుడిని కటకటాల పాలుజేసి సంచలన కేసు దర్యాప్తునకు నేతృత్వం వహించారు. అదే జిల్లాలో 12 మందిని హత్య చేసిన మరో సీరియల్ కిల్లర్ యూసుఫ్ ఆటకట్టించింది కూడా రెమా రాజేశ్వరీనే. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీసీపీగా పనిచేసినప్పుడు కూడా కీలక కేసుల దర్యాప్తులో తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కీలకమైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ బాధ్యతలు అప్పజెప్పింది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసింది. సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సీట్ సభ్యులుగా నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిలను నియమించింది. కాగా ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా పోలీసుల దర్యాప్తుపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేసుకోవచ్చంటూ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. కేసుపై రాష్ట్ర, జాతీయ స్థాయి మీడియాల్లో విపరీత ప్రచారం జరిగిన దృష్ట్యా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. చదవండి: తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు -
ఫాంహౌస్ ఎపిసోడ్లో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా పోలీసుల దర్యాప్తుపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేసుకోవచ్చంటూ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. కేసుపై రాష్ట్ర, జాతీయ స్థాయి మీడియాల్లో విపరీత ప్రచారం జరిగిన దృష్ట్యా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అలాగే ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందుకుమార్, సింహయాజీ దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. విచారణ పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు అప్పగించాలని బీజేపీ, నిందితులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అసలు ఈ కేసులో పిటిషన్ వేసే అర్హత (లోకస్ స్టాండీ) బీజేపీకి ఉందా? లేదా? అనే అంశంపై ముందుగా వాదనలు వినిపించాలని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) రామచందర్‌రావు ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. ‘అసలు ఈ కేసులో బీజేపీకి పిటిషన్ వేసే అర్హతే లేదు. ఈ కేసుకు సంబంధించినంత వరకు బీజేపీకి సంబంధం లేదు. ఎఫ్ఐఆర్లో బీజేపీ పేరుగాని, వారి నాయకుల పేర్లుగానీ లేవు. వారు నిందితులు కాదు. బాధితులు కాదు. వారికి వచ్చిన సమస్య ఏమిటో అర్ధం కావడం లేదు. దర్యాప్తు వివక్షాపూరితంగా కొనసాగుతోందని చెప్పడానికి వారెవరు? కేసులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు. దర్యాప్తు నిష్పపక్ష పాతంగా సాగుతుంది. గత నెల 26న రాత్రి కేసు నమోదు చేయగా, మరుసటి రోజు(24గంటలైనా గడవక ముందే) విచారణ పారదర్శకంగా జరగడంలేదని బీజేపీ ఈ పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణను సీబీఐకు అప్పగించాల్సిన అవసరం లేదు. గత నెల 26న రాత్రి పంచానామా ప్రారంభించారు.. పూర్తయ్యే సరికి 27వ తేదీ ఉదయం 8.30 అయ్యింది. అనంతరం మధ్యవర్తులతో సంతకాలు చేయించారు. రఫ్ స్కెచ్ కూడా తయారు చేయగా, దానిపై కూడా సంతకాలు చేశారు. అయితే మధ్యవర్తులు పొరపాటున తేదీని 26గా రాశారు. ఈ ఒక్క కారణాన్ని చూపి సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదు. దర్యాప్తు జాప్యమైతే సాకు‡్ష్యలను తారుమారు చేసే అవకాశం ఉంది. నిజాలు నిగ్గుతేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేయాలి. దీని కోసం స్టేను ఎత్తివేయాలి’అని నివేదించారు. బీజేపీపై నిందలు మోపారు.. ‘ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు పంచానామా అంతా 26నే సిద్ధం చేసినా... దానిపై అత్యంత కీలకమైన సాకు‡్ష్యల సంతకాలు మాత్రం 27న చేశారు. స్వాధీన ప్రక్రియంతా 26నే పూర్తయినా.. మండల రెవెన్యూ అధికారుల సంతకాలు కూడా 27నే చేశారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశమంతా తమకు ముందుగానే తెలుసని పోలీసులు చెబుతున్నారు. ఆ మేరకు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని వెల్లడిస్తున్నారు. ముందస్తు అంతా సిద్ధం చేసుకున్న పోలీ సులు సంతకాలు మాత్రం మరుసటిరోజు ఎందుకు తీసుకున్నారు? ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రోద్బలంతో పోలీసులు కావాలనే బీజేపీపై నిందమోపుతూ అప్రతిష్ట పాలుచేశారు. ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మీడియాకు సాక్ష్యాలను ఇవ్వడమే కాకుండా బీజేపీ కేంద్ర న్యాయకత్వంపై తీవ్రమైన మాటల దాడి చేశారు. జాతీయ స్థాయిలో దీనిపై ప్రచారం జరిగింది, ఈ వ్యవహారంలో పిటిషనర్ పార్టీ బాధితురాలే. ముఖ్యమంత్రి ఆరోపణల నేపథ్యంలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ముఖ్యమంత్రి నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వంపై మాటల దాడి చేస్తుంటే.. కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు అందుకు భిన్నంగా బీజేపీకి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మా వాదనను తోసిపుచ్చడం సరికాదు’అని బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు. మరోవైపు ఫామ్‌హౌస్‌లో పట్టుబడిన నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. దీన్ని సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేయగా, నిందితుల రిమాండ్‌కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. మంగళవారం ఉత్తర్వుల సందర్భంగా ఈ వివరాలన్నింటిని పేర్కొన్న న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి.. ఈ కేసులో మెయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేయవచ్చని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ జరిపించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. -
మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడిషనల్ అడ్వకేట్ జనరల్(ఏఏజీ). పిటిషనర్‌కు ఎమ్మెల్యేల కొనుగోలుతో ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. ఇలాంటి అంశాలపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను కోర్టు ముందు ప్రస్తావించారు ఏఏజీ. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని, బీజేపీలో చేరకపోతే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తామని బెదిరించారని తెలిపారు ఏఏజీ. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న వాదనలను తోసిపుచ్చారు. కేసు విచారణ ప్రారంభ దశలోనే ఉందని, ఇప్పుడు సీబీఐకి ఇవ్వడం సారికాదన్నారు. మరోవైపు.. బీజేపీ తరపున కర్ణాటక మాజీ ఏజీ వాదనలు వినిపించారు. ఇదంతా టీఆర్ఎస్ పక్కా ప్లాన్‌తో చేసిందని ఆరోపించారు బీజేపీ న్యాయవాది. పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటపడతాయని కోరారు. ఇదీ చదవండి: సెంటిమెంట్లకు చోటు లేదు.. గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నిర్దోషులుగా ఉరిశిక్ష ఖైదీలు -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ఏదైనా ట్రాప్ అయిన కేసుల్లో అదే రోజు బెయిల్ ఇస్తున్నారుగా అని తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీ కోర్టుకెందుకు వెళ్లిందన్న సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను హైకోర్టు ఎలా స్వీకరించిందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ట్రయల్‌కోర్టు ఆదేశాలు పక్కనపెడుతూ హైకోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ రామచంద్ర భారతి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయ వాది విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పిటిషనర్లను అరెస్టు చేశారని తెలిపారు. సాధారణ పోలీసులు వచ్చి ట్రాప్ చేసినట్లు పేర్కొన్నారు. నగదు దొరికిన ట్రాప్ కేసుల్లోనూ అదే రోజూ బెయిలు ఇస్తున్నారు కదా అని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. దర్యాప్తుపై స్టే విధించాలని ఓ రాజకీయ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. స్టే నడుస్తోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా పేర్కొన్నారు. ఓ పార్టీ పిటిషన్ దాఖలు చేయడం, హైకోర్టు విచారణకు స్వీకరించడం ఏంటని జస్టిస్ బీఆర్ గవాయి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ పిటిషన్‌తో తమకు సంబంధం లేదని విశ్వ నాథన్ పేర్కొన్నారు. రెండు పార్టీలల రచ్చలో పిటిషనర్‌ను ఇబ్బందిపెడుతున్నారన్నారు. అసలు హైకోర్టులో ఏం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించగా.. దర్యాప్తుపై సోమవారం వరకూ స్టే కొనసాగించిందని వివరించారు. ‘ఏదేమైనా ప్రస్తుత పిటిషన్, హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నా.. పిటిషనర్లు బెయిల్ దరఖాస్తును ట్రయల్‌కోర్టు న్యాయమూర్తి పరిశీలించడానికి అడ్డంకి కావు. మెరిట్స్‌పై దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు చెప్పాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణ నవంబర్ 7కు వాయిదా వేస్తున్నాం’అని ధర్మాసనం పేర్కొంది. ఈ సమయంలో ట్రయల్‌కోర్టు తమ రిమాండ్ దరఖాస్తు కూడా పరిశీలించాలని ఒకట్రెండుసార్లు సిద్దార్థ లూత్రా ప్రస్తావించారు. ఇలా వ్యవహరిస్తే నిందితులకు బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది అని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. సీబీఐతో విచారణ జరిపించండి సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు జరిపించాలని కోరుతూ నిందితులు రామచంద్ర భారతి, నందుకుమార్, సింహయాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు విచారణ పారదర్శకంగా చేస్తారన్న నమ్మకం తమకు లేదని చెప్పారు. ‘అక్టోబర్ 26న, మొయినాబాద్‌లోని రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో అవినీతి నిరోధక చట్ట ప్రకారం కేసు నమోదు చేసి మమల్ని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీలో చేరేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇవ్వజూపినట్లు కేసులో పేర్కొన్నారు. 27న రిమాండ్‌ను పోలీసులు కోరగా, ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీనిపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. కిందికోర్టు ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు.. మమల్ని వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. అనంతరం పోలీసులు మమల్ని అరెస్టు చేసి జైలు కు తరలించారు. ఈ నేపథ్యంలోనే మా ఫోన్లను ట్యాప్ చేసినట్లు చెబుతూ.. పలు ఆడియో టేపులను బయటికి లీక్ చేశారు. మా వ్యక్తిగత సంభాషణలను కూడా లీక్ చేశారు. ఇది టెలిగ్రాఫిక్ చట్ట నిబంధనలకు విరుద్ధం. రాష్ట్ర అధికార పార్టీ నేరు గా ప్రమేయం ఉన్న ఈ కేసులో పోలీస్ విచారణ సక్రమంగా సాగుతుందన్న నమ్మకం మాకు లేదు. ఈ నేపథ్యంలో కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోని సిట్‌తో విచారణ జరిపించాలని కోరుతున్నాం’అని పిటిషన్లో పేర్కొన్నారు స్టేను ఎత్తివేయండి సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో విచారణను సీబీఐ లేదా సిట్‌తో జరిపించేలా ఆదేశాలు జారీ చేయాలన్న బీజేపీ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. ఇదే విచారణ కోరుతూ నిందితుడు కోరే నందుకుమార్ సతీమణి చిత్రలేఖ కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్‌రావు, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్ హాజరై వాదనలు వినిపించారు. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖ లుచేస్తూ.. స్టేను ఎత్తివేయడంతోపాటు పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. కౌంటర్‌పై పరిశీలనకు సమయం కావాలని ప్రభాకర్ కోరడంతో విచారణను వాయిదా వేసింది. తేదీ తప్పుగా పేర్కొనడం పొరపాటే.. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిల్ పేర్కొన్న వివరాలు.. ‘టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మె ల్యేలు పార్టీ మారడానికి రూ.50 కోట్ల చొప్పున నగదు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని ఓ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశా రు. పోలీసులకు ముందుగా ఉన్న సమాచారం మేరకు ఫామ్‌హౌస్‌లో సీసీ కెమెరాలు, వాయిస్ రికార్డ్‌లు ఏర్పాటు చేశారు. నిందితులు వచ్చిన తర్వాత రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ 120–బీ, 171–వీ ఆర్/డబ్ల్యూ 171–ఈ, 506 ఆర్/డబ్ల్యూ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 కింద క్రైం నంబర్ 455/2022 నమోదు చేశారు. నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీ సెల్ఫోన్లు సీజ్ చేశారు. పోలీసులు వీటి ద్వారా పలు సమాచారం తెలుసుకున్నారు. ఇందులో నిందుతులు ఎమ్మెల్యేలతో జరిపిన సంభాషణలు, ఇతర ఆధారాలు ఉన్నాయి. గత నెల 26న రాత్రి కేసు నమోదు చేయ గా, మరుసటి రోజు(24గంటలైనా గడవక ముందే) విచారణ పారదర్శకంగా జరగడంలేదని బీజేపీ ఈ పిటిషన్ దాఖలు చేసింది. గత నెల 26న రాత్రి పంచనామా ప్రారంభించారు.. పూర్త య్యే సరికి 27వ తేదీ ఉదయం 8.30 అయ్యింది. అనంతరం మధ్యవర్తులతో సంతకాలు చేయించారు. రఫ్ స్కెచ్ తయారు చేయగా, దానిపై కూడా సంతకాలు చేశారు. అయితే మధ్యవర్తులు పొరపాటున తేదీని 26గా రాశారు. ఈ ఒక్క కారణాన్ని చూపి సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదు. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. నిందితులను రిమాండ్‌కు తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్టేను ఎత్తివేయాలని, పోలీస్ దర్యాప్తునకు అనుమతించాలని కోరుతున్నాం. కేసు విచారణను సీబీఐకు అప్పగించాల్సిన అవసరం లేదు.’ -
ఎమ్మెల్యేలకు 'ఎర' వ్యవహారం.. పీఎంఓ సీరియస్..!
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం చినికిచినికి గాలివానలా మారుతుండటం, నేరుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలపైనే ఆరోపణలు రావడంతో.. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో చోటు చేసుకున్న ప్రలోభాలకు సంబంధించిన వీడియోలను తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు బహిర్గతం చేయడం, న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ మీడియా, దర్యాప్తు సంస్థలకు పంపిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంలోని వాస్తవాలను వెలికితీసే పనిలో పీఎంఓ నిమగ్నమైనట్టు కేంద్రంలోని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. పీఎంఓలోని ముగ్గురు కీలక అధికారులకు దీనికి సంబంధించిన బాధ్యతలు కట్టబెట్టినట్లు సమాచారం. వీడియోలో ఉన్న వ్యక్తులతో ప్రముఖులకు ఉన్న లింకులు, నకిలీ ఆధార్ కార్డులతో పాటు వారి కాల్ డేటా తదితర అంశాలపై లోతైన దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల రెండోవారంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఉండనున్నందున.. అప్పట్లోగానే దీనిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయనున్నట్టు తెలిసింది. ముఖ్యుల పేర్ల ప్రస్తావనతో అప్రమత్తం ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని బీజేపీ అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకుంది. మధ్యవర్తుల సంభాషణల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేర్లు ప్రస్తావనకు రావడం, దీన్ని ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ అంశంగా లేవనెత్తడం, గుజరాత్ ఎన్నికల ప్రచారాస్త్రంగానూ ప్రతిపక్షాలు దీన్ని వాడుకునే అవకాశాల నేపథ్యంలో.. పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వాన్ని అప్రమత్తం చేసింది. రాజకీయంగా దీన్ని ఎదుర్కోవాల్సిన తీరు, న్యాయపరంగా చేయాల్సిన పోరాటంపై మార్గదర్శనం చేసింది. జాతీయ నాయకత్వం సూచనల మేరకు.. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ సైతం కేసీఆర్‌పై విమర్శల దాడి చేశారు. ఇక హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. మధ్యవర్తులపై ఇంటిలిజెన్స్‌కు ఆదేశాలు పీఎంఓ ఇప్పటికే సదరు వీడియో క్లిప్పింగ్‌లను సేకరించడంతో పాటు, మధ్యవర్తుల కాల్‌డేటాపై విశ్లేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం దీనిపై లోతైన విచారణ చేస్తున్నట్టు సమాచారం. మధ్యవర్తులు ఎవరు? వారికి బీజేపీతో సంబంధాలున్నాయా? బీజేపీ నేతలెవరితో టచ్‌లో ఉన్నారు?, వీరికి గతంలో ఏదైనా నేర చర్రిత ఉందా? అన్న అంశాలపై కూపీ లాగుతున్నారు. మధ్యవర్తుల రోజువారీ కార్యకలాపాలు, వారి వ్యాపారాలు, లావాదేవీలు ఆరా తీయాల్సిందిగా ఇంటిలిజెన్స్ సంస్థలకు ఆదేశాలిచ్చినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో మధ్యవర్తులు జరిపిన సంభాషణల్లో డబ్బుతో ముడిపడిన అంశాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు అందించిన సహకారం, రాజస్తాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సిద్ధమైన ప్రణాళిక, వాటికి తామందించిన సహకారం వంటి అంశాల ప్రస్తావన ఉండటంతో ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలి వేయరాదన్న గట్టి నిర్ణయానికి పీఎంఓ వచ్చినట్లు తెలిసింది. పీఎంఓకు కేంద్ర హోం శాఖ నివేదిక! ఈ అంశంలో కేంద్ర హోంశాఖ ప్రాథమిక ఇప్పటికే దర్యాప్తు చేసిందని, ఆ నివేదిక సైతం శుక్రవారం పీఎంఓకు చేరిందని సమాచారం. ఎఫ్ఐఆర్, కోర్టుకు సమర్పించిన అంశాలు, రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న అంశాలపై అందులో కూలంకషంగా వివరించినట్లు తెలిసింది. వీటన్నింటినీ నిశితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా ఈ అంశం ఇప్పటికే న్యాయస్థానాల్లో విచారణ దశల్లో ఉన్నందున, కోర్టు ఆదేశాల అనంతరం దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ చేయించే అవకాశాలను కడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. చదవండి: ‘వీడియోలో అమిత్‌షా పేరు చెబితే.. సంబంధం ఉన్నట్టేనా?’ -
ఫామ్‌హౌజ్ వ్యవహారం.. ప్రకాష్ రాజ్ ఘాటు ట్వీట్
సాక్షి, బెంగళూరు: తెలంగాణలో రాజకీయాలను వేడేక్కించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ‘‘ఢిల్లీకి చెందిన సిగ్గులేని బ్రోకర్లు..ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. మానమర్యాదలను అమ్ముకున్నవాళ్లు.. ప్రజాస్వామ్యాన్నే వేలానికి పెట్టారు’’ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ఇదిలా ఉంటే.. తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నిన్న(గురువారం) సాయంత్రం ప్రెస్మీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీజేపీపై ఆగ్రహం.. ప్రజాస్వామ్యం నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ ప్రసంగంతో పాటు మీడియాకు సమర్పించిన వీడియోలను కూడా ప్రకాష్ రాజ్ ట్యాగ్, పోస్ట్ చేశారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాన్ని పోలీసులు భారీ ఆపరేషన్ ద్వారా చేధించడం.. ఆపై కేసు నమోదు విచారణ.. కోర్టుకు చేరిన వ్యవహారం, తదనంతర పరిణామాలు.. ఈలోపు మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. Shameless Brokers from Delhi..killing democracy ಮಾನ ಮರ್ಯಾದೆ ಮಾರಿಕೊಂಡವರು.. ಪ್ರಜಾಪ್ರಭುತ್ವವನ್ನೇ ಹಾರಾಜಿಗೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ.. #LotusLeaks #justasking pic.twitter.com/w516YyTpoI — Prakash Raj (@prakashraaj) November 4, 2022 -
కేసీఆర్ విడుదల చేసిన 70 నిమిషాల వీడియో సంభాషణ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి సంబంధించి మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్ ఫామ్‌హౌస్‌లో బీజేపీ దూతలుగా చెబుతున్న వారి మధ్య జరిగిన వీడియో సంభాషణల రికార్డింగ్‌ను (మొత్తం నాలుగు క్లిప్‌లు) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం బహిర్గతం చేశారు. మూడు గంటలు ఉన్న వీడియో సంభాషణలను 70 నిమిషాలకు కుదించి విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు. బీజేపీలో ముగ్గురు వ్యక్తులే అన్ని నిర్ణయాలు తీసుకుంటారని, ప్రధాని నేరుగా ఉండరని, అయితే అన్ని విషయాలూ ఆయనకు వివరిస్తారంటూ జరిగిన సంభాషణలు ఇందులో ఉన్నాయి. ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగ కాంతారావుతో రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ జరిపిన సంభాషణల్లోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి. రోహిత్‌రెడ్డి: మీతో (రామచంద్ర భారతి) చెప్పినట్లు మేమంతా సిద్ధం. మీరు వీరితో కూడా ఓపెన్‌గా చర్చిస్తే వారికి నమ్మకం ఏర్పడుతుంది. రామచంద్ర: మీతో ఇదివరకే చర్చించాం.. రోహిత్: మీరు నాతో చర్చించడం వేరు. వారితో చర్చించడం వేరు. రామచంద్ర: ఇక్కడ డెలివరీ(డబ్బు)కి కమిట్ చేయించారు. తరువాత ఢిల్లీకి వెళ్దాం. నేను ఢిల్లీకి మెసెజ్ పంపించాను. అక్కడనుంచి సమాధానం కోసం చూస్తున్నా. రోహిత్: ఫిగర్ కూడా ఎంతో చెప్పండి. రామచంద్ర: ఒక్కొక్కరికి 50. గువ్వల బాలరాజు: అంటే.. రోహిత్: ఒక్కొక్కరికి రూ.50 కోట్లు (అందరు నవ్వులు). ఆయన ఢిల్లీకి సమాచారం పంపించారు. సింహయాజి: మీరు రూ.50 లక్షలు అనుకుంటున్నారా.? కాదు. రూ.50 కోట్లు బాలరాజు: మరో ఐదుగురు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం.. రోహిత్‌రెడ్డి: ఆ విషయం వారితో చర్చించా. సింహయాజి, నందు: ఇది తర్వాత చూద్దాం. మీకు ఎక్కడ డెలివరీ కావాలో అక్కడ ఇచ్చేస్తాం. నందు: మరో ఐదుగురు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా తీసుకుంటామా..! రామచంద్ర: ఎస్.. వాళ్లను కూడా..వీ వాంట్ ఎగ్జాట్ నంబర్స్. నందు: ఎస్. వాళ్లు వస్తారు. రోహిత్: మూడు అడిగా. బాలరాజు: నీవు ఏం అడిగావో మాకేమి తెలుసు. రోహిత్: బీ ఫామ్‌లు వారే ఇవ్వాలి. రామచంద్ర: బీ ఫామ్ కంటే ముందు.. మీరు క్లియర్‌గా ఉండాలి. మేము క్లియర్‌గా ఉంటాం. పార్టీలో చేరిన తరువాత బీ.ఫామ్ మా హామీ. చూడండి బీజేపీలో ముగ్గురు వ్యక్తులు ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. రాష్ట్ర నాయకత్వానికి ఏ సంబంధం ఉండదు. బీజేపీలో మొత్తం చూస్తారు. బీఎల్ సంతోష్, అమిత్‌షా, జేపీ నడ్డా. బాలరాజు: ప్రధానమంత్రి రామచంద్ర: పీఎం ఎందులోనూ నేరుగా ఇన్వాల్వ్ కారు. ఆయనకు వీరి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ అందుతుంటుంది అంతే. బాలరాజు: ఆరెస్సెస్ వేరు, బీజేపీ వేరు అనే చర్చ నడుస్తోంది... రామచంద్ర: అవును వేర్వేరు. ఆరెస్సెస్ ఓ సామాజిక సంస్థ. భాజపా ఒక రాజకీయ సంస్థ. అయితే ప్రతి భాజపా వ్యక్తికీ ఆరెస్సెస్ నేపథ్యం ఉంది. బాలరాజు: ఈయన కూడా అంతేనా? రామచంద్రభారతిని చూపిస్తూ... సింహయాజి: అవును...అంటూ ఆయన ఎదిగిన తీరును వివరించారు. (మరోసారి సంతోష్, అమిత్ షా, నడ్డాలు ఎలా హ్యాండిల్ చేస్తారో వివరించారు.) రామచంద్ర: మేం ఇక్కడికి వచ్చే ముందే విషయాలన్నీ చెప్పాం. అన్నింటికీ వారు ఒప్పుకున్నారు. ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. బీఎల్ సంతోష్ కాంగ్రెస్‌లోని సూర్జిత్వాలా లాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఆయనకు ఎవరికి బీఫామ్ ఇవ్వాలి వంటి విషయాల్లో పూర్తి అధికారం ఉంది. ఎమ్మెల్యేలు: మేం బీఫామ్ కోసమో దేనికో ఇక వేరే ఎవరినీ అప్రోచ్ కావాల్సిన అవసరం లేదు. రామచంద్ర: లేదు లేదు ఆ అవసరమే లేదు. మేం ఇక్కడ నుంచి వెళ్లేలోపుగానే మీకు వచ్చే ఎన్నికల్లో బీఫామ్ కన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే మరో 2 విషయాల్లో సంపూర్ణంగా స్పష్టత వస్తుంది. ఇదంతా క్రిస్టల్ క్లియర్ ఆపరేషన్. ఎమ్మెల్యేలు: మేం ఎవరైనా రాష్ట్ర నేతలతో టచ్‌లో ఉండాలి అంటారా? రామచంద్ర: లేదు లేదు... అక్కర్లేదు కేవలం మీరు రోహిత్‌తో టచ్‌లో ఉంటే చాలు. రోహిత్: మనం అంతా డైరెక్ట్ ఢిల్లీతోనే సార్. నిజానికి వీళ్లు స్వామిజీకి ఇన్చార్జిలు. స్వామిజీ నే కర్ణాటక, మహారాష్ట్ర చేశారు.. అంటుండగా.. రామచంద్ర: కర్ణాటక ఆపరేషన్ చేశాం మీకు తెలుసుగా? కాంగ్రెస్ నుంచి 16 మందిని తీసుకుని మేం ప్రభుత్వం ఏర్పాటు చేశాం, అయితే కర్ణాటకకు, తెలంగాణకు వ్యత్యాసం ఉంది. తెలంగాణ, ఆంధ్ర పూర్తిగా వేరే.. మిగతా వాటితో పోలిస్తే..మీ ఒక నియోజకవర్గ ఎన్నికతో మేం రాష్ట్ర స్థాయి ఎన్నికలే నిర్వహించగలం. (నవ్వుతూ) మీరిక్కడ ఒక ఎన్నిక కోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తే మేం ఆ మొత్తంతో 70, 80 నియోజకవర్గాలు ఫినిష్ చేస్తాం. రామచంద్ర: బీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే 4 రాజకీయ పార్టీలు నమోదై ఉన్నాయి. ఎమ్మెల్యేలు: అయితే మీరు ఆపుతారా? సింహయాజి: అదంతా ఒక పొలిటికల్ సిస్టమ్ ప్రకారం నడుస్తుంది. ఎమ్మెల్యేలు: తెలంగాణ బాగా కాస్ట్లీ చేసేశారు... మునుగోడు కూడా కాస్ట్లీ చేసేస్తున్నారు. ఇంకేముంది ఆయనకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్ట్ సరే ఎంత ఖర్చుపెడుతున్నారు? సింహయాజి: ఎంతైనా పెట్టుకుంటాడు అది ఆయనే...కాదు కాదు పార్టీ కూడా ఇచ్చింది. 30 ఇచ్చింది ఆల్రెడీ... ఇంకో 20 వస్తుంది. రామచంద్ర: మరో 15 ఏళ్లు భాజాపా పాలనే ఉంటుంది. ఇది ఫిక్స్. కాంగ్రెస్‌కి లీడర్ లేడు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ కానీ నిర్మాణం లేదు. తెలంగాణ అవతల వారికి జాతీయ స్థాయి నేత ఎవరూ లేడు. మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ సహా మొత్తం 17 పార్టీలు కలిసి ఒక ప్రతిపక్ష పార్టీగా మారడం అసాధ్యం. ఎందుకంటే అందులో ప్రతి ఒక్కనేతా ప్రధాని అభ్యర్ధే. నితిష్, ఖర్గే, గెహ్లాట్, కేసీఆర్, కేజ్రీవాల్...అందరూ పీఎం అభ్యర్థులే...అందుకే వాళ్లు కలవరు. అందుకే 15 ఏళ్లు భాజాపాదే పాలన. ఎమ్మెల్యేలు: ఈవీఎం మిషన్లు ఉన్నాయి రామచంద్ర: మేం ఆ మిషన్లతో ఆపరేట్ చేయం కానీ (నవ్వుతూ) అందుకేనేమో బ్యాలెట్ రావాలంటున్నారు. బ్యాలెట్‌తో కూడా ఇష్యూ ఉంది. ఈవీఎంతో కూడా ఉంది. ఈవీఎంలో కొంత స్ట్రాటజీ ఉంది. ఎమ్మెల్యేలు: స్వామిజీ మీరు ఎప్పుడైనా రాజకీయాల్లో ఉన్నారా? రామచంద్ర: నేను ఆరెస్సెస్ వ్యక్తిని పూర్తిగా సింహయాజి: రామచంద్ర భారతి స్వామిజీ చాలా పవర్ ఫుల్, పెద్ద పెద్ద నేతలతో తిరుగుతారు. ఆయన మోదీగారు ఒకే ఫ్లైట్‌లో వెళ్లి వస్తుంటారు. ఎమ్మెల్యేలు: స్వామిజీ వయసు? సింహయాజి: రుషిమూలం, నదిమూలం అడగకూడదు అంటారు. ఇక్కడైన తర్వాత ఆంధ్రా ఎమ్మెల్యేలు: మరి బండి సంజయ్..! నందకుమార్: ఇక్కడ ఎవరిదీ నడవదు బండి సంజయ్, కిషన్‌రెడ్డి కాదు.. అంతా సంతోష్‌దే పవర్ సింహయాజి: బీఎల్ సంతోష్ క్యాండిడేట్లే ఉన్నారందరూ అర్థమైందా? ఎమ్మెల్యేలు: మరి అమిత్‌షా.. సింహయాజి: అమిత్‌షా, సంతోష్ అందరూ ఒకటేగా.. అంతేకాదు బీఎల్ సంతోష్ నో అంటే అమిత్‌షా ఏమీ చేయలేరు. అంత పవర్ఫుల్ సంతోష్. రాష్ట్రపతి కూడా ఈయన చెప్పింది వినాలి. ప్రతి కేబినెట్ మీటింగ్‌లో కూడా బీఎల్ సంతోష్ కూర్చుంటారు. నందుకుమార్: అన్నా అశోకా నైన్లో ఉంటాడు. మోడీ, అమిత్‌షా మాట్లాడాలనుకుంటే ఫోన్ నంబర్ ఇచ్చి పోతాడు. ఈయన మాత్రం పోడు. సింహయాజి: ఆయన పోడు.. క్వశ్చనే లేదు. ఆయనకు ఆర్ఎస్ఎస్ అంత పవర్ ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ తరఫున ఆయన.. ఎమ్మెల్యేలు: స్వామీజీ అంతా ఇప్పుడు మనకు.. సింహయాజి: బీజేపీనంతా స్వామీజీలే ఆపరేట్ చేసేది. వీళ్లందరూ పోయి ఎందుకు స్వాముల్ని మొక్కుతుంటారు. చినజీయర్ స్వామికి.. ఆ స్వామికి..! నందు: ఈయన ఎంత సింపుల్‌గా ఉంటారంటే.. ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. అంతా మన సనాతన ధర్మం గురించే.. మోదీ, నడ్డా, అమిత్‌షా మాదిరి మొత్తం ఆరుగురే డీల్ చేసేది. ఈ ఆరుగురే అంతా.. రామచంద్ర: వీరంతా ఒప్పుకున్నా.. సంతోష్ నో అంటే నో అనే.. ఎమ్మెల్యేలు: పీఎం ఒప్పుకున్నా కూడానా? సింహయాజి: అవును పీఎం ఒప్పుకున్నా కూడా.. ఎమ్మెల్యేలు: అక్కడ ఎలా ఉంది స్వామి? ఆంధ్రా.. ఇదే ఆపరేషనా? సింహయాజి: ఇది అయిపోతే మొదలుపెడతాం రోహిత్‌రెడ్డి: క్యాష్ ఏడుందో చెప్తారు. చెప్తే మనం పోయి పిక్ చేసుకుని.. (ఇంతలో స్వామీజీ కల్పించుకుని ఆపారు) ఎమ్మెల్యేలు: మొత్తానికి ఢిల్లీ ఫెయిలైనట్టేనా? (ప్రభుత్వం కూల్చివేతపై) నందు: కాదు.. ఢిల్లీ కూడా స్టార్టయింది. సింహయాజి: 35 మంది రెడీ.. అసలు వాడ్ని ఎత్తేశాంగా ఇప్పుడు ఒకడిని. ఈడీని పెట్టి.. నందకుమార్: సిసోడియా గాడ్ని ఈడీ పెట్టి ఇరికించారు. సింహయాజి: సిసోడియాతోనే ఎమ్మెల్యేలు వస్తున్నారు ఇప్పుడు తెలుసా? ఎమ్మెల్యేలు: అవునా? సింహయాజి: అవును అందుకే ఈడీ. నందకుమార్: 36 మంది రెడీ. రాజస్థాన్‌లో 30 మందిని రెడీ చేశారు. ఈయన ఆపరేషన్లే.. సింహయాజి: వింటే గోడీ.. లేకపోతే ఈడీ. ఎమ్మెల్యేలు: గోడీ అంటే? సింహయాజి: గోడీ అంటే సఖ్యత.. లేకపోతే ఈడీ దాడులు. దాదాపు 38 మంది లిస్ట్‌లో ఉన్నారు. మన తెలంగాణలోనైనా వింటే గోడీ.. లేకపోతే ఈడీ ఎటాక్ అంటామన్నమాట. నందు: స్వామి దగ్గర లిస్టు ఉంది. స్వామికి ఆ లిస్ట్ ఇచ్చారు సంతోష్ వాళ్లు. ఇందులో అసలువారిని టచ్ చేయరు. పక్కనున్నోళ్లనే. రామేశ్వర్‌రావును వదిలేశారు. బీజేపీకి 100 (కోట్లు) ఇచ్చారు.. దండంపెట్టి.. సింహయాజి: ఆ 100 (కోట్లు) ఇస్తేనే ముగ్గురొచ్చారు. అమిత్‌షా, మిగతావారు.. రామేశ్వర్‌రావుపై కేసు ఉంది. దాన్ని తప్పించుకోవడానికే డబ్బులిచ్చి ఫేవర్‌గా ఉండటానికే వాళ్లను ఇన్వైట్ చేశారు. ఎమ్మెల్యేలు: ఇక్కడైతే మొత్తమ్మీద బండి సంజయ్దేమీ నడవదు సింహయాజి: బండికి గండే.. ఇప్పుడంతా ఎవరికి వారు హైకమాండ్‌కు టచ్‌లో ఉంటున్నారు. అదే చూస్తున్నారు. కొత్త రక్తం వస్తే దానికి అంటగట్టాలని చూస్తున్నారు. ఎమ్మెల్యేలు: మరి ఊ అంటే మోదీతో మాట్లాడుతాం అన్నట్టు మాట్లాడుతారు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు నందు: నిన్న మొన్న వచ్చినోడితో సహా ప్రతీ ఒక్కరి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరిని ఎక్కడ కట్ చేయాలో ఆయనకు తెలుసు. కిషన్‌రెడ్డి ఏంటి, కిషన్‌రెడ్డికి సీఎంతో సంబంధం ఏంటి అన్నీ మోదీకి తెలుసు. అయితే ఎవరినీ ఏమీ అనకుండా అలా నడిపిస్తారు. బండి సంజయ్‌కి అపాయింట్మెంటే లేదు. (అంతా నవ్వులు) డబ్బుకు సమస్య లేదు భారతి: సంతోష్, అమిత్ షా ఒకేచోట ఉన్నారు. తుషార్ వేరే చోట ఉన్నారు. ఫోన్ కలవడం లేదు. డబ్బులు ఇవ్వడంలో ఎలాంటి సమస్యా లేదు. ఈ రోజే మీ ముగ్గురి పేర్లు తెలిశాయి. మీ పేర్లు పంపొద్దని చెప్పా. ఇంటిలిజెన్స్‌కు సమాచారం వెళ్తే ఇబ్బందులు వస్తాయని చెప్పా. రోహిత్‌రెడ్డి: ఇప్పటినుంచి ఏ విధంగా ముందుకు వెళతారు అని మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారు? భారతి: మీ తరహాలోనే వాళ్లకు కూడా కొన్ని షరతులు ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? అని అడుగుతారు. నేను మధ్యవర్తిని మాత్రమే. (ఈలోగా తుషార్ నుంచి ఫోన్.. మలయాళంలో) భారతి: తుషార్ గారు.. లైన్లో రోహిత్‌రెడ్డి ఉన్నారు. రోహిత్‌రెడ్డికి ఫోన్ ఇస్తున్నా. అతనితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు నా ముందే ఉన్నారు. గతంలో చర్చించినట్లు డబ్బుల కోసం అడుగుతున్నారు. వాళ్లకు ఉన్న సమస్యలను చెప్తున్నారు. (భారతి ఫోన్ రోహిత్‌కు ఇచ్చాడు) రోహిత్‌రెడ్డి: తుషార్ గారూ.. ఎలా ఉన్నారు? మేం మునుగోడు ఎన్నికలో ఉన్నాం. తుషార్: రేపటి నుంచి ఎప్పుడైనా కలుద్దాం. బీఎల్ సంతోష్‌ను ఏ తేదీ రావాలో అడుగుతా. 3న ఎన్నిక ఉంది కదా. 4న కలుద్దాం. మీకు ఏ రోజు వీలవుతుంది. రోహిత్‌రెడ్డి: ఈ రోజు లేదా రేపు పూర్తిచేస్తే బాగుంటుంది. అందుకే మిగతా ఎమ్మెల్యేలను ఈ రోజు మునుగోడు నుంచి రప్పించా. తుషార్: రేపు లేదా ఎల్లుండి వీలైనంత త్వరగా సంతోష్ టైమ్ తీసుకుంటా. అంతకంటే ముందు మనం కలుద్దాం. రోహిత్‌రెడ్డి: తుషార్ గారూ.. మీరు ఈ రోజు రాత్రి లేదా రేపు హైదరాబాద్‌కు రాగలరా.. మేము ప్రమాదకర పరిస్థితుల్లో పడతాం. తుషార్: మనందరం బీఎల్ సంతోష్‌ను కలుద్దాం భారతి: వాళ్లు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. వారి వెనుక నిఘా వర్గాలు ఉన్నాయి. రోహిత్‌రెడ్డి: మీరు ఫిగర్ ఎంతో నేరుగా చెప్పండి భారతి: తుషార్ గారు.. మొత్తం నలుగురు ఉన్నారు. టు టు ఫైవ్.. రోహిత్‌రెడ్డి: ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు భారతి: సెవెన్.. ఫైవ్.. (మళయాలంలో సంభాషణ), ఈ రోజే డబ్బు కావాలని అడుగుతున్నారు. తుషార్: సంతోష్ ఫోన్ కలవడం లేదు. అమిత్‌షా మీటింగ్లోఉన్నారు. అందుబాటులోకి రావడం లేదు. రోహిత్‌రెడ్డి: ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ముడితె జంప్ గువ్వల: ప్రచారానికి వెళ్లకపోతే మేము ఎక్కడ ఉన్నామో మా డ్రైవర్లను అడిగి ఆరా తీస్తున్నారు. భారతి: నా ఆరోగ్యం బాలేదు. అయినా వచ్చా.. ఈ రోజు పని పూర్తి చేయాలనే అనుకున్నాం. రోహిత్‌రెడ్డి: ఢిల్లీని కూడా స్వామీజీ అపరేట్ చేస్తున్నారట, వచ్చే వారం ఖతం అట. గువ్వల: ఎవరి ద్వారా అవుతోంది. భారతి: తొలిసారి మేము ఇలా వేరే చోటకు వచ్చి మాట్లాడుతున్నాం. కానీ చేరే వారు ఢిల్లీకి వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుని వెళ్తారు. ఇప్పటివరకు బీజేపీ ఇలానే చేస్తూ వస్తోంది. గువ్వల: ఆప్‌లో ఎవరిని చేర్చుకుంటున్నారు? భారతి: కేజ్రీవాల్ రైట్ హ్యాండ్ను చేర్చుకుంటున్నాం. 33 మెజారిటీ, 36 మంది రెడీగా ఉన్నారు. రాజస్తాన్‌లో 21 మంది ఉన్నారు. సింహయాజీ: రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా నా భక్తుడు. రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి: గంట సేపైనా ఎదురు చూస్తాం. బీఎల్ సంతోష్‌తో మాట్లాడండి. భారతి: కర్ణాటకలో ఎమ్మెల్యేలను చెన్నై తీసుకెళ్లి ఇండిగోలో ముంబయికి చేర్చాం. అక్కడ వారికి కావాల్సింది ఇచ్చాం. సింహయాజి: పంచెలు, రుమాళ్లు చుట్టుకుని కర్ణాటక ఎమ్మెల్యేలు కూలీల్లా ట్రాక్టర్లో వచ్చారు. భారతి: మొదట రామనగరకు వెళ్లాం. అక్కడ ఫామ్‌హౌస్ నుంచి ట్రాక్టర్లో యెలహంకకు తీసుకెళ్లాం. అక్కడ నుంచి బస్సులో చెన్నైకు తీసుకెళ్లాం. సింహయాజి: ఢిల్లీలో ఇంటెలిజెన్స్ అంతా కేంద్రం పరిధిలో ఉంటుంది. భారతి: మొదటి పే మెంట్ ఇస్తాం. ఢిల్లీలో వాళ్లకు డబ్బులు వద్దు. పవర్ మారగానే పదవులు ఇస్తాం. సింగిల్ రూపీ కూడా ఇవ్వడం లేదు. బీజేపీ నుంచి సీఎం ఉంటారు. డిప్యూటీ సీఎం, ఇతర పదవులు ఆమ్ ఆద్మీ నుంచి వచ్చే వారికి ఇస్తాం. చర్చలు పూర్తయ్యాయి. బీజేపీ ఏం చెప్తుందో అది చేస్తుంది. కమిట్ అయితే చేస్తుంది. గువ్వల: మీలా ఎంతమంది పనిచేస్తున్నారు? భారతి: పార్టీ విషయాలు వేరు. మానవత్వం, నమ్మకం ఉండాలి. బీజేపీ నమ్మకంపైనే ఆధారపడుతుంది. ఏ రాష్ట్రం తీసుకున్నా సరే. గువ్వల: విశ్వాసం పేరిట అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాలను కూల్చివేస్తారన్న మాట రోహిత్‌రెడ్డి: మంత్రి పదవి రానందునే గువ్వల బయటకు రావాలని అనుకుంటున్నాడు. భారతి: బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిన ప్రతిచోటా చూడండి. కర్ణాటకలో 16 మంది వస్తే 12 మందికి మంత్రి పదవులు హామీ ఇచ్చాం. 13 మందికి ఇచ్చాం. మా సొంత ఎమ్మెల్యేలు 5, 6 సార్లు గెలిచినా కూడా పక్కన పెట్టాం. ఎందుకంటే మేం మాట ఇచ్చాం వారికి. అదే తరహాలో మీకు కూడా మంత్రి పదవులు ఇస్తాం. నిజానికి షిండేకు మేము డిప్యూటీ సీఎం ఆఫర్ చేశాం. కానీ చర్చల తర్వాత కావాల్సిన నంబర్ వచ్చిన తర్వాత సీఎం పోస్ట్ డిసైడ్ అయింది. అనుభవం లేకున్నా అన్నింటినీ మేనేజ్ చేశాడు షిండే. మీరు మంత్రి అయినా మీ అపాయింట్మెంట్ లేకుండా రాలేము. అదీ మా ప్రోటోకాల్.. కానీ జోక్యం చేసుకోం. గువ్వల: షిండే లాంటి వాళ్ల మీద నియంత్రణ లేకుండా సీఎంలు చేసి ఏం చేస్తారు? భారతి: సీఎం అయిన తర్వాత వాళ్లు బీజేపీ అడ్మినిస్ట్రేషన్లోకే వస్తారు. చదవండి: న్యాయవ్యవస్థే కాపాడాలి.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య: సీఎం కేసీఆర్ -
ఎమ్మెల్యేలకు ఎర కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కేసులోని ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తమ అరెస్టు అక్రమమని పేర్కొన్నారు. పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరపనుంది. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎర కేసులో మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో పట్టుబడిన నిందితుల రిమాండ్‌కు అనుమతినిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురు నిందితులు సైబరాబాద్ సీపీ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు రోజులపాటు వాదనలు విన్న హైకోర్టు.. నిందితుల రిమాండ్‌కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. వారిని అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలని పేర్కొంది. చదవండి: మోర్బీ ఆసుపత్రికి ప్రధాని.. అర్థరాత్రి హంగామా.. ఆగమేఘాల మీద మరమ్మతులు -
‘ఎర’ రాజకీయంపై జోరుగా చర్చ.. వీడని చిక్కు.. ఎవరికి లక్కు!
సాక్షి, వికారాబాద్: తాజా రాజకీయాలు తాండూరు చుట్టే తిరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎవరికి అనుకూలమో.. ఎవరికి ప్రతికూలమో అంతుపట్టని విధంగా మారాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఇంకా స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు టికెట్ ఎవరికనే చర్చ అధికార పార్టీలో జోరుగా జరుగుతోంది. గతంలో తాండూరు స్థానం నాదంటే.. నాది అంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బాహాటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ‘ఎర’ అంశం ఎవరికి అనుకూలంగా మారుతుందనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఘటన జరిగిన నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా స్పష్టత రావడంలేదు. ప్రస్తుతం వారి రాజకీయ భవిష్యత్‌పై స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య పోటీ తీవ్రం తాండూరులో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రోహిత్‌రెడ్డిల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. స్వల్ప ఆధిక్యతతో రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించాక కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. తన అనుచరులను సైతం వెంట తెచ్చుకొన్నారు. పదవుల విషయంలోనూ.. తాండూరు అసెంబ్లీ స్థానం కోసం పట్నం మహేందర్‌రెడ్డితో పాటు పైలెట్ రోహిత్‌రెడ్డి ఆశిస్తున్నారు. రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరినా మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన నాయకులు మాత్రం ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వచ్చారు. మరోవైపు పార్టీ, నామినేట్ పదవుల విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. తాండూరు అసెంబ్లీ టికెట్ సీఎం కేసీఆర్ తమకే ఇస్తారని ఇద్దరు నేతలు ప్రకటిస్తూ వచ్చారు. మరోవైపు రాజకీయంగా, అధికారికంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పైచేయిగా నిలిచారు. కలిసొచ్చేది ఎవరికో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందనేది తాజాగా చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయింపునకు బీజేపీ నాలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగడం.. కథ అడ్డం తిరిగి మధ్య వర్తులు జైలు పాలవడం నాలుగు రోజుల వ్యవధిలో చకచక జరిగిపోయాయి. అయితే ఇందులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కాగా ఈ వ్యవహారం తాండూరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇద్దరి రాజకీయ భవిషత్ను నిర్ణయించనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చదవండి: మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కన్ఫర్మ్: మంత్రి హరీష్‌రావు -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు.. బీజేపీని ఏకిపారేసిన సీఎం కేసీఆర్
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక వేళ చండూరు సభ వేదికగా సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. కార్పొరేట్ గద్దలకు బీజేపీ 14 లక్షల కోట్లు ఇచ్చిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగానికి నిధులు ఇవ్వడం చేత కాదా అని ప్రశ్నించారు. వడ్లు కొనమంటే మనల్ని నూకలు తినమన్నారని, నూకలు తినమన్న వారికి ఎన్నికల్లో తోకలు కత్తిరించాలన్నారు. బలవంతంగా రుద్దబడిన మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి చెంపపెట్టు కావాలని ఆకాంక్షించారు. చండూరు సభ వేదికపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిని వేదికపైకి తీసుకొచ్చారు. కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందకోట్లకు ఆత్మగౌరవాన్ని కొందామని చూసినట్లు తెలిపారు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్లు నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారని ప్రస్తావించారు. ఈ నలుగురు అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా తెలంగాణ, జాతి గౌరవాన్ని కాపాడారని ప్రశంసించారు. రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని తమ ఎమ్మెల్యేలు నిరూపించారని పేర్కొన్నారు. చదవండి: వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి: సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న వడ్లు కొనడం చేతకాని వారు వంద కోట్లతో ఎమ్మెల్యేలను కొంటారా అని సీఎం కేసీఆర్ విమర్శించారు. వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలన్నారు. దీని వెనకున్న వారు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్‌ను పడగొట్టాలని చూశారని.. ఢిల్లీ బ్రోకర్లు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారన్నారు. ‘నేను రాజ్యాంగబద్దమైన ముఖ్యమంత్రి పదదవిలో ఉన్నాను. కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. రాబోయే రోజుల్లో అన్నీ బయటపడతాయి. తలకుమాసినోడు ఒకడొచ్చి తడిబట్టలతో ప్రమాణం చేస్తావా అంటాడు. మతోన్మాద శక్తులను తరిమేస్తే తప్ప దేశం బాగుపడదు. టీవీల్లో చూసింది చాలా చిన్నది. ముందు ముందు చూడాల్సింది చాలా ఉంది’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
తెలంగాణ తరహాలో ఢిల్లీలో ఎమ్మెల్యేలకు ఎర
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో తరహాలో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణలో బయటకువచ్చిన మధ్యవర్తుల ఆడియో టేపుల ద్వారా ఈ కుట్ర కోణం స్పష్టంగా తెలుస్తోందన్నారు. కుట్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రమేయం ఉందని తేలితే అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్‌చేశారు. శనివారం సిసోడియా ఢిల్లీలోని ఆప్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ దళారిగా చెబుతున్న ఒక వ్యక్తి మాట్లాడిన ఆడియో టేప్‌ను మీడియాకు వినిపించారు. ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ముగ్గురిలో ఒకరు నేరుగా బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయి’ అని సిసోడియా తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు రాజ్నా«థ్, కిషన్ రెడ్డి, ఇతర నేతలతో నిందితుల్లో కొందరు దిగిన ఫొటోలను మీడియాకు సిసోడియా చూపించారు. రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ అనే మధ్యవర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎలా కుట్ర పన్నారో ఆడియో టేప్‌లో స్పష్టంగా వెల్లడైందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆశ చూపిస్తూ ఢిల్లీలోనూ ఎమ్మెల్యేలను కొనే వ్యవహారాన్ని నడిపిస్తున్నామని ఆడియో టేప్‌లో వినిపించిన అంశాన్ని సిసోడియా ప్రస్తావించారు. ‘ఇంకో ఆడియోలో ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేల కొనుగోలు తతంగం కొనసాగుతోందన్నారు. అంటే అంతటి భారీమొత్తంలో బీజేపీ నగదు సిద్ధం చేసుకున్నట్లు అర్థమవుతోంది’ అని అన్నారు. ‘ టేపుల్లో దళారులు అమిత్ షా పేరును పరోక్షంగా ప్రస్తావించడం తీవ్ర ఆందోళనకరం. షా ప్రమేయం ఉంటే ఆయన్ను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలి. హోంశాఖ మంత్రి పదవి నుంచి తప్పించాలి. ఈడీ విచారణ చేపట్టాలి’ అని అన్నారు. వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనే అలవాటున్న బీజేపీకి ఉన్న రాజకీయపార్టీ గుర్తింపును ఈసీ రద్దుచేయాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ డిమాండ్‌చేశారు. -
ఈ టైంలో వద్దు.. మునుగోడులో జేపీ నడ్డా సభ రద్దు..!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనాల్సిన బహిరంగసభను రద్దు చేసుకున్నారు. అయితే దీనిపై రాష్ట్ర పార్టీ ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని ముఖ్యనేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ సభ ఆలోచనను విరమించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలకు పెద్దమొత్తంలో డబ్బు ఎర చూపి ప్రలోభపరిచేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నించిందంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపించడం, దీనికి సంబంధించిన ఆడియో టేపులు కూడా బయటకు రావడం రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికల ప్రచారసభకు రావడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదనే నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్టు సమాచారం. ఈ సభ నిర్వహణకు చేసే వ్యయాన్ని ఎన్నికల ప్రచారానికి మళ్లించి మరింత ప్రభావవంతంగా చేయాలని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతం నుంచే మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనడానికి నడ్డా అంతగా సుముఖత చూపలేదని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం మునుగోడు పరిధిలో మల్కాపురంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు నడ్డాకు సమాధిని కట్టడంతో బీజేపీ నాయకత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ నేపథ్యంలో 31న మునుగోడు సభలో పాల్గొనడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీలకు నడ్డా గట్టి జవాబిస్తారని పార్టీ నాయకులు భావించారు. 9 చోట్ల సభలు...: 31న నడ్డా సభకు బదులుగా మునుగోడు పరిధిలోని ఏడు మండల కేంద్రాలు, రెండు మున్సిపాలిటీల్లో నిర్వహించే సభల్లో పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ బైక్ ర్యాలీలు, ఎన్నికల ప్రభలు నిర్వహించి వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 1న జాతీయ, రాష్ట్రపార్టీ ముఖ్యనేతల రోడ్‌షోలతో పార్టీ ప్రచార కార్యక్రమాలకు ముగింపు పలకనున్నారు. చదవండి: కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి... -
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరో ఆడియో టేపు
-
స్వామీజీ-రోహిత్ రెడ్డి సంభాషణ వైరల్
-
ఎమ్మెల్యేల ఎపిసోడ్.. స్వామీజీ-రోహిత్ రెడ్డి సంభాషణ వైరల్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగొలు కుట్ర ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారింది. రెండు రోజుల నుంచి ఈ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ రగడ రాజేస్తుంది. నువ్వా-నేనా అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఘటనలో తాజాగా ఓ ఆడియో బయటకొచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, స్వామిజీ రామచంద్ర భారతి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఫామ్‌హౌజ్ మీటింగ్‌కు ముందు రామచంద్రభారతితో రోహిత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఫోన్ సంభాషణ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: నమస్తే స్వామీజీ ఎలా ఉన్నారు. స్వామీజీ: బాగున్నాను. మీరెలా ఉన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: నేను బాగున్నాను. స్వామీజీ: నందు మేము మాట్లాడుకున్నాము. మాకు కొన్ని వివరాలు చెప్తే సార్‌తో మాట్లాడతాను. ఇప్పటికే మాట్లాడాను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: హా స్వామిజీ స్వామీజీ: పేరు పంపితే బాగుంటుంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి:పేర్లు చెప్పడం ఇప్పుడు కష్టం. ఇప్పటికి ఇద్దరు కర్ఫర్మేషన్ ఇచ్చారు. కలిసి మాట్లాడితే బాగుంటుంది స్వామిజీ. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: ప్రస్తుతం మేం ముగ్గురం రెడీగా ఉన్నాం. స్వామీజీ: మీరు నెంబర్-2 ముందు ఎమ్మెల్యేల పేర్లు చెబుతారా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: నెంబర్ 2 ముందు పేర్లు చెబుతాను. ఈ విషయం బయటపడితే మా పని అయిపోతుంది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: మా సీఎం గురించి మీకు తెలుసు కదా.. ఆయన చాలా దూకుడుగా ఉంటారు. స్వామీజీ: నెంబర్-1, నెంబర్-2.. బీఎల్ సంతోష్ ఇంటికి వచ్చి అన్నింటిపై చర్చిస్తారు. బీఎల్ సంతోష్ మా ఆర్గనైజింగ్ సెక్రటరీ.. ప్రభుత్వ ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తారు. ఏ నిర్ణయమైనా బీఎల్ సంతోషే తీసుకుంటారు. స్వామీజీ: సంతోష్‌తో కలిసి మనం నెంబర్-2 దగ్గరకు వెళదాం. ఒకరిద్దరు ముందుగా వస్తే బాగుంటుంది. స్వామీజీ: 24వ తేదీ వరకు నేను బెడ్ రెస్ట్‌లో ఉండాలి. తర్వాత నేను హైదరాబాద్ వస్తాను. వచ్చాక కూర్చొని మాట్లాడుకుందాం స్వామీజీ: 25న గ్రహణం ఉంది కాబట్టి.. ఆ తర్వాత కలుద్దాం. స్వామీజీ: 26 తర్వాత ఎక్కడైనా కలుద్దాం.. హైదరాబాద్‌లో మాత్రం వద్దు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: సమస్య ఏంటంటే స్వామీజీ, ప్రస్తుతం ఎలక్షన్ ఉంది కదా వాళ్లు మమ్మల్ని గమనిస్తున్నారు. సో హైదరాబాదే మంచి ప్లేస్. స్వామీజీ: అలాగే, అలాగే హైదరాబాద్‌లోని ఏదో చోటికి వస్తాను. కలుద్దాం. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: స్వామిజీ మీరు క్లారిటీ తీసుకోండి.. నేను మరికొంత మందికోసం ప్రయత్నిస్తా.. స్వామీజీ: నేను డైరెక్టుగా బీఎల్ సంతోష్‌తోనే మాట్లాడతా.. మధ్యవర్తులు ఎవరూ లేరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: దయచేసి ఇదంతా టాప్సీక్రెట్గా పెట్టండి.. లేకపోతే నాపనైపోతుంది. స్వామీజీ: ఏమైనా చిన్న తేడా వచ్చినా మేము కవర్ చేస్తాం. మేం కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తాం. స్వామీజీ: ఈడీ నుంచి ఐటీ వరకు, మీ భద్రతను కూడా మేముచూసుకుంటాం స్వామీజీ: మీరంతా మా స్కానర్‌లో ఉన్నారు.. మీరేమి కంగారుపడొద్దు -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. ఏదో తేడా కొడుతుంది..!
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు మిస్టరీ ఒక ప్రహసనంగానే మిగిలిపోతుందా? ఈ ఉదంతం మొత్తం పరిశీలిస్తే టీఆర్ఎస్ తొందరపడిందా అన్న సంశయం వస్తుంది. గతంలో ఓటుకు నోటు కేసులో ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే, ఈనాటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని రెడ్ హాండెడ్‌గా పట్టుకున్న ఘటన గుర్తున్నవారందరికి టీఆర్ఎస్ మరో సంచలనం సృష్టించిందని, తనకు సవాల్ విసురుతున్న భారతీయ జనతా పార్టీని ఆత్మరక్షణలో పడేసిందని అనిపించింది. కాని చివరికి ఇది ఒక రాజకీయ క్రీడగానే మిగిలిపోయిందా అన్న భావన కలుగుతుంది. చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. జాతీయ మీడియా ముందుకు ఆధారాలు! బుధవారం రాత్రి టీవీ చానళ్లలో జరిగిన హడావుడి చూస్తే, ఇదేదో వందల కోట్ల వ్యవహారమని, కోట్ల డబ్బు పట్టుబడిపోయిందని అనిపించింది. కొన్ని చానళ్లు పదిహేను కోట్ల రూపాయల మొత్తం దొరికిందని స్క్రోలింగ్‌లు ఇస్తే, మరికొన్ని చానళ్లు దానిని వంద కోట్లుగా కూడా ప్రచారం చేశాయి. మరి కాసేపట్లో పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తారని సమాచారం రాగానే, ఆ డబ్బును ప్రదర్శిస్తారని అనుకున్నాం. కాని ఆయన పొడి, పొడిగా మాట్లాడి వెళ్లడం సందేహాలకు తావిచ్చింది. ఆయన డబ్బు గురించి కాని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయం కాని గట్టిగా ఏమీ చెప్పలేదు. కాకపోతే వారిని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయని చెప్పి వెళ్లిపోయారు. మీడియా వారు డబ్బు దొరికిందా అని మరో పోలీసు అధికారిని ప్రశ్నించినా, ఆయన ఏమీ జవాబు ఇవ్వలేదు. దాంతో ఇందులో తేడా ఉందని అనుకున్నారో, ఏమో కాని టీవీలలో డబ్బు గురించిన ప్రస్తావనను ఆపివేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి రోహిత్ రెడ్డి, రేగా కాంతారావులను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందన్నది అభియోగం. ఒక్కొక్కరికి వంద కోట్ల ఆఫర్, కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి వచ్చినవారిలో ఒకరు పూజారి కాగా, మరొకరు చిన్న స్థాయి స్వామీజి. ఇంకొకరు ఒక చిన్న వ్యాపారవేత్త. ఒక సమాచారం ప్రకారం వీరేదో చిన్న, చిన్న బ్రోకరేజీలు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారట. బీజేపీలోకి వస్తే డబ్బు వస్తుందని చెప్పి, అందులో తమకు ఎంత కమిషన్ ఇస్తారని అడగడానికి వచ్చి ఉండవచ్చని కొందరు చెబుతున్నారు. వీరికి వందల కోట్లు హాండిల్ చేస్తే సత్తా, లేదా స్థోమత ఉందా అన్న డౌటు వచ్చింది. సదరు వ్యాపారికి అటు టిఆర్ఎస్తో, ఇటు బీజేపీతోనూ సంబంధాలు ఉన్నాయట. వీరేదో డీల్ గురించి మాట్లాడినప్పుడు ఆడియోలు ఉన్నాయని పోలీసులు అంటున్నా, వాటిని కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదో తెలియదు. పైగా ఎవరైనా కీలక నేత, వీరితో మాట్లాడిన ఆడియో ఉంటే దానికి విశ్వసనీయత వస్తుంది కాని, సదరు వ్యక్తి తనకు ప్రధాని తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు.. హోం మంత్రి తెలుసు అంటూ మాట్లాడితే, దానిని రికార్డు చేస్తే ఏమి ప్రయోజనం. దానిని ఎవరు నమ్ముతారు. పోసుకోలు కబుర్లుగానే భావిస్తారు తప్ప ఇంకొకటి ఉండదు. కాగా ఇదే సమయంలో మరి కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయి. టీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఈ ఉదంతంపై టీఆర్ఎస్ నేతలు ఎవరూ మాట్లాడవద్దని ఎందుకు అన్నారు?. అసలు ముఖ్యమంత్రి కేసీఆరే మీడియా సమావేశం పెడతారని ఎందుకు ప్రచారం జరిగింది?. తమను బీజేపీ కొంటానికి వచ్చిందని చెప్పిన ఎమ్మెల్యేలు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టలేదు?. తొలుత టీఆర్ఎస్కు ఇదేదో ఊపు తెస్తుందని అనుకుంటే, చివరికి బూమ్ రాంగ్ అయిన చందంగా పరిస్థితి మారింది. బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించారు. వారు దీనిపై సీబీఐ విచారణ లేదా, సిటింగ్ జడ్జి తో విచారణ కోరుతున్నారు. హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఈలోగా ఏసీబి కోర్టు డబ్బు చూపకపోతే అవినీతి నిరోధక కేసుకిందకు రాదని స్పష్టం చేయడంతో ఇది మొత్తం వీగిపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఓటుకు నోటు కేసు ఘటన జరిగినప్పుడు ఆ వెంటనే పట్టుబడిన డబ్బుతో సహా , రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ సంభాషణ వీడియో మొత్తం బయటకు వచ్చేసింది. ఏసీబీ పకడ్బందీగా ప్లాన్ చేసి పట్టుకుంది. తదుపరి ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోన్ సంభాషణ ఆడియో కూడా బహిర్గతం అయింది. దాంతో కేసీఆర్ సమర్ధతపై ప్రజలందరిలో ఒక నమ్మకం ఏర్పడింది. ఆయన ఇమేజీ బాగా పెరిగింది. కేవలం ఏభై లక్షలు పట్టుబడితేనే అంత మైలేజీ వచ్చినప్పుడు, వందల కోట్ల ఉదంతంలో ఇంకెంత మైలేజీ రావాలి?. బీజేపీ ఎంతగా బదనాం కావాలి. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ఆ క్రమంలో భారీగా డబ్బు వెదజల్లుతోందని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో కూడా అలాగే ఏమైనా జరిగిందేమోనని చాలా మంది అనుకున్నారు. తీరా అక్కడ ఏవో బ్యాగులు చూపడం మినహా డబ్బు చూపకపోవడంతో కేసు బలహీనమైపోయింది. ఈ నలుగురు ఎమ్మెల్యేలు తరచుగా ఆ పామ్ హౌస్ లో కలుస్తుంటారట. వీరిలో బాలరాజు తప్ప మిగిలిన ముగ్గురు కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరినవారు. అందువల్ల వీరి విధేయత గురించి పెద్దగా చర్చించుకోనవసరం లేదు. మునుగోడులో ఎన్నికల ప్రచారంలో ఉండవలసిన వీరు ఇక్కడ పామ్ హౌస్‌లో ఎవరితోనో సంప్రదింపులలో ఉన్నారన్న సమాచారం అందడంతో అదేదో బీజేపీ కుట్రేమోనని అనుమానించి పోలీసులను పంపించారా అన్న సందేహం కలుగుతంది. అంటే మిస్ ఇన్ ఫర్మేషన్ వల్ల పోలీసులు అక్కడకు రావడం, అలాగే మీడియాకు కూడా ఈ విషయం తెలియడంతో నానా రచ్చ అయి ఉండవచ్చని చెబుతున్నారు. పోలీసులు పామ్ హౌస్‌కు వెళ్ళినప్పుడు ఈ ఎమ్మెల్యేలు కూడా బిత్తరపోయారట. కాని ఆ తర్వాత తేరుకుని తామే ఫిర్యాదు చేశామని వారు చెప్పారు. ఒకవేళ నిజంగానే బీజేపీ ఇలాంటి ఆపరేషన్ చేయదలిస్తే పొరుగున బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక నుంచి కాకుండా ఇంత తెలివితక్కువగా ఒక పామ్ హౌస్ ద్వారా ఆపరేట్ చేస్తుందా అన్న ప్రశ్న వస్తుంది. దీనిపై కేసీఆర్ స్పందించలేదు. అదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు. యాదాద్రిలో ప్రమాణం చేద్దామని సంజయ్ సవాల్ చేస్తే, మోదీ ఆ ప్రమాణానికి రావాలని టీఆర్ఎస్ ప్రతి సవాల్ చేసింది. విశేషం ఏమిటంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో బీజేపీకే కాదు.. టీఆర్ఎస్కు కూడా రికార్డు ఉంది. గత టరమ్‌లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, బీఎస్పి ఎమ్మెల్యేలు పలువురిని తనలో కలిపేసుకుంది. ఈ టరమ్ లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది ఉంటే పన్నెండు మందిని టిఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. అందువల్ల ఈ విషయాలలో ఎవరిని తప్పు పడదాం? ఏమైనా వర్తమాన రాజకీయాలలో ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారాలు ఇంత అసహ్యంగా తయారయ్యాయనడానికి ఈ తాజా ప్రహసనం కూడా ఒక ఉదాహరణే అవుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అరెస్ట్‌ను ఏబీసీ కోర్టు రిజక్ట్ చేయడంపై సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. మేజిస్ట్రేట్ తప్పుడు ప్రొసీజర్‌ను అనుసరించారని అభియోగం. ఇవాళ మధ్యాహ్నం హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. జాతీయ మీడియా ముందుకు ఆధారాలు! కాగా, ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్‌గా నగదు పట్టుబడనందున ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు పంపాలంటూ పోలీసులు దాఖలు చేసిన రిపోర్టును తిరస్కరించారు. నిందితులను విడుదల చేయాలని.. వారికి సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం నోటీసులు జారీ చేసి విచారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో నిందితులు కొనుగోలు సంప్రదింపులు జరిపిన ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని పోలీసులు విన్నవించినా దీనిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. -
నందకుమార్‌తో పరిచయాలు ఉన్నాయి.. కానీ: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీలో ఎవరైనా చేరవచ్చని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పార్టీలో చేరికల కోసం ప్రత్యేక కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. ఏ పార్టీ నుంచి వచ్చిన వారినైనా చేర్చుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. నందకుమార్‌తో తమకు పరిచయాలు ఉన్నాయి కానీ ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్లోనే ఉన్నారని పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వస్తే ఏంటి.. పోతే ఏంటని ప్రశ్నించారు. బీజేపీ దగ్గర డబ్బులు లేవని, డబ్బులు ఉన్నాయి కాబట్టే కేసీఆర్ విమానం కొంటున్నారని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నించారంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై మరోసారి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ‘ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరే. వేరే పార్టీ నుండి వచ్చిన వారిని మంత్రులు చేశారు. బీఎస్పీ నుంచి గెలిచిన వారికి మంత్రి పదువులు ఇచ్చారు. కాంగ్రెస్‌కు చెందిన 12 మందిని టీఆర్ఎస్లోకి తీసుకున్నారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నామని కట్టుకథలు అల్లారు. ముందు రూ. 100 కోట్లు.. ఆ తర్వాత రూ. 15 కోట్లు అన్నారు. ఆ నలుగురు మా పార్టీలో చేరితే ప్రభుత్వం పడిపోతుందా?. నందకుమార్ తెలుసు కానీ నా అనుచరుడు కాదు. ఆయన ఎంపీ సంతోష్‌కు సన్నిహితుడు. కేసీఆర్ ప్రెస్‌మీట్ ఢిల్లీలో కాకుంటే లండన్‌లో పెట్టుకోవచ్చు.’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సెటైర్లు వేశారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం.. బండి Vs కేసీఆర్.. యాదాద్రిలో హైటెన్షన్ -
యాదాద్రిలో టెన్షన్.. టెన్షన్
-
ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం.. బండి Vs కేసీఆర్.. యాదాద్రిలో హైటెన్షన్
సాక్షి, యాదాద్రి భువనగిరి: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారం తెలంగాణలో రాజకీయ వేడి రాజేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే తమకు ఆ అవసరం లేదని, మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఘటన కేసీఆర్ కుట్ర అని బీజేపీ వాదిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతో రాజకీయాలు చేస్తోందని మండిపడింది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఆరోపణలు, విమర్శలు ఎక్కుపెట్టాయి. తాజాగా టీఆర్ఎస్, బీజేపీ హైడ్రామా నేపథ్యంలో యాదాద్రిలో టెన్షన్ నెలకొంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కాసేపట్లో యాదాద్రి ఆలయానికి వెళ్లనున్నారు. భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. ఫాంహౌజ్ వ్యవహారంపై ప్రమాణానికి సిద్ధమని ఆయన తెలిపారు. ప్రమాణం చేయడానికి కేసీఆర్ రావాలని బండి సంజయ్ సవాల్ చేశారు. బండి సంజయ్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు అడ్డుకున్నా యాదాద్రి వెళ్తానని బండి సంజయ్ తెగేసి చెబుతున్నారు. మరోవైపు యాదాద్రిలో టీఆర్ఎస్ నేతలు నల్ల జెండాలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బండి సంజయ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసనలతో మొత్తానికి యాదాద్రిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి .ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. చదవండి: MLAs Episode: బీజేపీ హైకమాండ్ ఆగ్రహం.. రంగంలోకి కేంద్ర హోం శాఖ -
MLAs Episode: బీజేపీ హైకమాండ్ ఆగ్రహం.. రంగంలోకి కేంద్ర హోం శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కలకలం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్ ఆరోపణలపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉందని తెలిసింది. దీనిని తీవ్రస్థాయిలో తిప్పికొట్టాలని రాష్ట్ర నేతలకు సూచించినట్టు సమాచారం. ఈ అంశంలో టీఆర్ఎస్ నేతలు నేరుగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించడం, దిష్టిబొమ్మలను దహనం చేయడాన్ని ఉపేక్షించవద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది. అవసరమైతే టీఆర్ఎస్తో తాడోపేడో తేల్చుకోవాలనే సంకేతాలను కూడా హైకమాండ్ ఇచ్చినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సీబీఐ విచారణ.. కోర్టుల్లో పోరాటం.. టీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న అంశం గురువారం ఢిల్లీలో హాట్‌టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలోకి బీజేపీని లాగుతోందని భావించిన పార్టీ పెద్దలు.. దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలతో చర్చించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ అంశంలో సీబీఐ విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, కుదరని పక్షంలో కోర్టుల ద్వారా జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించేలా పోరాటం చేయాలని సూచించినట్టు వివరిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ గురువారం హైకోర్టును ఆశ్రయించిందని అంటున్నాయి. ఇక రాజకీయంగానూ ఈ వ్యవహారాన్ని ఎదుర్కోవాలని నేతలకు హైకమాండ్ సూచించినట్టు తెలిసింది. ‘తెలంగాణలో మరో ఎనిమిది, తొమ్మిది నెలలైతే సాధారణ ఎన్నికలున్న సమయంలో ఎవరైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చేస్తారా? అదీ కేవలం నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన ప్రభుత్వం పడిపోతుందా? ఒక్కో ఎమ్మెల్యే కొనుగోలుకు రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయా?’అన్న దానిపై విస్తృత చర్చ పెట్టాలని సూచించినట్టు సమాచారం. ఇదే సమయంలో ‘కొనుగోళ్ల వ్యవహారం అంతా బోగస్. కేసీఆర్ ఆడుతున్న డ్రామా. పోలీసులు దీనికి సహకరిస్తున్నారు. ఫామ్‌హౌస్ ఎవరిది? డబ్బు ఎక్కడిది? ఎవరు ఎవరితో మాట్లాడారనే ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే పోలీసులు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌కు ఎలా తరలించారు? బేరసారాలపై ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌లో విచారిస్తున్నారా? లేక ప్రగతిభవన్ చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారా?’’అని బీజేపీ జాతీయ స్థాయి నేత ఒకరు పేర్కొనడం గమనార్హం. ఈ అంశాలన్నింటినీ జనంలోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పార్టీకి సూచించినట్టు వెల్లడించారు. నిజానిజాలు త్వరలోనే బయటికి వస్తాయని.. ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని లక్ష్యంగా పెట్టుకొని ఇలా చేశాక పార్టీ అంత సులువుగా దీనిని వదిలిపెట్టదని పేర్కొన్నారు. రంగంలోకి కేంద్ర హోం శాఖ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి లక్ష్యంగా విమర్శలు చేస్తుండటం, వందల కోట్ల డీల్ జరిగినట్టు కథనాలు వస్తుండటంపై హోంశాఖ ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి పెట్టాలని ఐబీ, ఐటీ, ఈడీలనూ అప్రమత్తం చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తమకు అందించాలని ఇప్పటికే ఏజెన్సీలను కోరినట్టు నేతలు చెబుతున్నారు. నిజంగానే కోట్ల రూపాయలు చేతులు మారితే అవి ఎవరివి? ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చేందుకు సిద్ధం కావాలని సూచించినట్టు పేర్కొంటున్నారు. కేంద్ర సంస్థలు ఈ వ్యవహారంపై రెండు మూడు రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. -
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. జాతీయ మీడియా ముందుకు ఆధారాలు!
సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలు నలుగురు పార్టీ ఫిరాయించేలా ప్రలోభపెట్టా రనడానికి, ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం ఉందనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. ఫామ్‌హౌజ్ వ్యవహారంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని.. ఈ తతంగం మొత్తాన్ని బయటపెట్టేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రలోభాల పర్వాన్ని ఆసాంతం పరిశీలిస్తున్నారని, త్వరలోనే జాతీయ మీడియా ముందుకు తీసుకెళ్లనున్నారని పేర్కొంటున్నాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా.. టీఆర్ఎస్ ‘ఎమ్మెల్యేలకు ఎర’ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున న్యాయపరమైన చిక్కులు తలెత్త కుండా జాగ్రత్తలు తీసుకున్నాకే మాట్లాడాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ వ్యవహారంలో బీజేపీ ఢిల్లీ పెద్దల ప్రమే యం ఉన్నట్టు రూఢీ చేసే సమాచారం సదరు స్వామీజీల ఫోన్లలో దొరికిందని అంటున్నాయి. ఫామ్‌హౌజ్‌లో రికార్డయిన ఆడియో, వీడియో ఫుటేజీలోనూ బీజేపీ ఢిల్లీ పెద్దల పాత్రను రుజువు చేసే ఆధారాలు ఉన్నాయని.. వాటిలోని సమాచారాన్ని రూఢీ చేసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీ బండారాన్ని బయటపెట్టాలని కేసీఆర్ భావిస్తు న్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చదవండి: అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా? నిందితులను రిమాండ్‌కు పంపకముందే మీడియాతో మాట్లాడితే పోలీసు విచారణను ప్రభావితం చేశారనే ఆరోపణలు వచ్చే అవకా శం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్టు చెప్తున్నా యి. బీజేపీ ఎదురుదాడి వలలో చిక్కుకోకుండా ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెనుక బాగోతాన్ని ఆధారాలతో సహా జాతీయ మీడియా ముందు బయట పెట్టాలని సీఎం నిర్ణయించినట్లు టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. స్వామీజీల ఫోన్లలో కీలక సమాచారం తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఢిల్లీ పెద్దలు స్వయంగా రంగంలోకి దిగినట్టుగా నిందితులు నందకుమార్, ఇద్దరు స్వామీజీలు వెల్లడించారని సదరు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు వివరించారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇది కేవలం నలుగురు ఎమ్మెల్యేలు, రూ.400 కోట్ల ప్రలోభాలకే పరిమితం కాలేదని, ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కొనుగోళ్లకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయని అంటున్నాయి. బీజేపీ కీలక నేత ఒకరు తమతో నేరుగా టచ్‌లో ఉన్నట్టు చెప్పారని.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు బాధ్యత తమకు అప్పగించారని వారు చెప్పిన సంభాషణలు రికార్డు అయ్యాయని పేర్కొంటున్నాయి. కేంద్ర సంస్థల దుర్వినియోగం, తెలంగాణలోనూ వాటిని ఉసిగొల్పనున్న వైనానికి స్వామీజీల సంభాషణలు అద్దం పట్టేలా ఉన్నాయని అంటున్నాయి. ప్రగతిభవన్లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఫామ్‌హౌజ్ ఘటనలో ప్రలోభాలకు గురైన ట్టుగా పేర్కొంటున్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు(అచ్చంపేట), రేగ కాంతారావు (పినపాక), బీరం హర్షవ ర్ధన్‌రెడ్డి(కొల్లాపూర్), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు) బుధవారం రాత్రి నుంచీ ప్రగ తిభవన్లోనే ఉండటం గమనార్హం. ఘటన తర్వాత వారు మీడియాకు అందుబాటులోకి రాలేదు. అయితే వారు ఫామ్‌హౌజ్‌లో బీజేపీ దూతలతో జరిగిన మంతనాలు, పోలీసుల రాక, భేటీకి సంబంధించిన ఆధారాలు తదితరాలపై సీఎం కేసీఆర్‌కు పూర్తి వివరాలు వెల్లడించారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. పదిరోజులుగా బేరసారాలు జరిగాయని.. భేటీ కోసం దీపావళి తర్వాత సమయాన్ని ఖరారు చేశారని వివరించారని అంటున్నాయి. చదవండి: ఫామ్‌హౌజ్ ఘటన.. టీఆర్ఎస్పై కిషన్‌రెడ్డి కౌంటర్ ఎటాక్ ఈ సమయంలో ఆడియో, వీడియో ఫుటేజీల్లో నిక్షిప్తమైన సమాచారం గురించి కేసీఆర్ ఆరా తీశారని.. ప్రలోభాల పర్వంపై పూర్తి వివరాలను బయటపెట్టేదాకా మౌనం పాటించాలని ఆదేశించారని పేర్కొంటున్నాయి. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావు కూడా బుధవారం రాత్రి నుంచీ ప్రగతిభవన్లోనే ఉండిపోయారు. మంత్రి హరీశ్‌రావు మాత్రం గురువారం తెల్లవా రుజామున బయటికి వెళ్లి కాసేపటికే తిరిగి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. వారు ప్రలోభాల పర్వానికి సంబంధించిన ఆడి యో, వీడియో ఫుటేజీలను విశ్లేషించి.. ఆధా రాలను సిద్ధం చేసుకుంటున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
టీఆర్ఎస్ పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల చేసిన బీజేపీ
-
ఫామ్‌హౌస్ డీల్‌పై కేసు నమోదు
-
ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడం ద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోందని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ వేదికగా జరిగిన ఘటనను ఖండిస్తూ అధికార పార్టీ నేతలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర చండూరు: టీఆర్ఎస్ను చూస్తుంటే బీజేపీకి వెన్నులో వణుకు మొదలైందని, సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి బీజేపీ తమను టార్గెట్ చేసిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. చండూరులో విలేకరు లతో మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలో సింహ యాజులు, రామచంద్ర భారతి, నందకుమార్ల ద్వారా టీఆర్ఎస్కు చెందిన గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్‌రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డిలను రూ.100 కోట్లకు పైగా నగదు, కాంట్రాక్టులు, ఇతర పదవులను ఇవ్వజూపి బీజేపీలోకి రావాలని ప్రలోభ పెట్టే యత్నం జరిగిందని తెలిపారు. ఇదే విషయం తమ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం అందించారన్నారు. టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో భారీ మెజారీ్టతో గెలవబోతోందని.. బీజేపీ డిపాజిట్ కోల్పోతుందనే భయంతో కుట్రలకు తెర లేపుతోందని మండిపడ్డారు. బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి అడ్డదారిన.. దొడ్డి దారిన కొనే యత్నం మొదలు పెట్టిందని సుమన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీ నాటకాలాడితే తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు. బీజేపీ ప్రలోభాలకు లోనుకారు.. అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ పరిహాసం చేస్తోంది. ధనస్వామ్యంతో కొనుగోళ్ల పర్వం సాగిస్తోంది. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. బీజేపీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు లొంగరు. బీఆర్ఎస్తో ఢిల్లీ పీఠం కదులుతుందనే భయం. కేసీఆర్‌కు ఆదరణ పెరుగుతున్నందునే ఈ కుతంత్రం. – మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మోదీ, అమిత్ షా ఆటలు సాగవు బీజేపీకి ప్రజాస్వామ్య విలువలు లేవు. టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు దురాలోచనతో అడ్డదారులు ఎంచుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే రకం కాదు. కేసీఆర్ ముందు మోదీ, అమిత్ షా ఆటలు సాగవు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి. – మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి మోదీ, అమిత్ షా కుట్ర దేశవ్యాప్తంగా కేసీఆర్‌కు వస్తున్న ఆదరణ ఓర్వలేక మోదీ, అమిత్ షా కుట్ర జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి తరహాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరు. బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగే రకం కాదు. – మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలంగాణలో కుదరదు మునుగోడులో విజయం సాధించలేమనే భయంతోనే నీచ రాజకీయాలను బీజేపీ మొదలు పెట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మీ తరం కాదు. మహారాష్ట్ర రాజకీయాలు తెలంగాణలో కుదరదు. –శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ బేరసారాలకు లొంగదు టీఆర్ఎస్ పార్టీ బేరసారాలకు లొంగదు. ఇది కే సీఆర్ పార్టీ ఎవరూ కొనుగోలు చేయలేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే మా లక్ష్యం. – గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్ -
ఫాంహౌస్ డీల్‌పై వెలుగులోకి షాకింగ్ విషయాలు.. రోహిత్‌రెడ్డి ఫిర్యాదులో ఏముంది?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొయినాబాద్ ఫాంహౌస్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. పట్టుబడ ముగ్గురిని ఫౌంహౌస్‌లోనే ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ చేపట్టారు. పట్టుబడ్డ ముగ్గురి ఫోన్ల కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. చదవండి: ఫామ్ హౌస్‌లో ఏం జరిగింది?.. ఆ ఫోన్లలో అవతల ఎవరు? కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీల్‌లో భాగంగానే స్వామీజీ, నందు, సతీష్ ఫాంహౌస్‌కు వచ్చారని, బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీలో చేరకుంటే క్రిమినల్ కేసులు పెడతామని.. ఈడీ,సీబీఐ దాడులు జరుగుతాయని బెదిరించారని రోహిత్ రెడ్డి అన్నారు. బీజేపీలో చేరేందుకు రూ.100 కోట్లు ఆఫర్ చేశారన్నారు. ఎమ్మెల్యేలను తీసుకొస్తే ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇస్తామని డీల్ నడిచినట్లు ఫిర్యాదులో రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. -
బేరసారాలకు టీఆర్ఎస్ లొంగదు: గువ్వల బాలరాజు
-
ఫామ్ హౌస్‌లో ఏం జరిగింది?.. ఆ ఫోన్లలో అవతల ఎవరు?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు ప్రయత్నించిన ముగ్గురూ చేసిన ఫోన్ కాల్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ఎవరికి ఫోన్ చేశారు? అనే అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు గంటన్నర పాటు సాగిన వీరి మంతనాలను నిఘా వర్గాలు, పోలీసు అధికారులు ప్రత్యేక కెమెరాల ద్వారా రికార్డు చేశారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర? హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభ పెట్టడానికి రంగంలోకి దిగినట్టుగా చెబుతున్న సింహయాజులు స్వామి, రామచంద్ర భారతి, నంద కుమార్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి, ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడానికి పోలీసులు భారీ స్కెచ్ వేశారు. రోహిత్ రెడ్డి ద్వారానే ఈ సమావేశం మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో ఉన్న అతడి ఫామ్ హౌస్‌లో జరిగేలా కథ నడిపారు. బుధవారం సాయంత్రం సమావేశం కావాలని వీళ్లు మంగళవారం ఉదయమే నిర్ణయించుకున్నారు. వేచి చూసి దాడి చేశారు..: ఎమ్మెల్యేల ద్వారా విషయం తెలుసుకున్న నిఘా అధికారులు, పోలీసులు మంగళవారం సాయంత్రమే ఫామ్ హౌస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో సమావేశం జరిగేందుకు ఉద్దేశించిన హాల్‌తో పాటు ఆరుచోట్ల అత్యాధునికమైన రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ సమావేశం జరిగినా ఆద్యంతం రికార్డు అయ్యేలా సిద్ధం చేశారు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు, నిఘా వర్గాలు మారు వేషాల్లో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నా.. సాయంత్రం ఈ సమావేశం మొదలైన వెంటనే దాడి చేయలేదు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగేవరకు, వారి మాటలతో పాటు అక్కడ జరిగే ప్రతి వ్యవహారం రికార్డు కావడం కోసం వేచి చూశారు. ఆపై దాడి చేసి ముగ్గురితో పాటు డ్రైవర్ తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు!: సమావేశం జరిగిన హాలులోని ఓ పక్కగా ఉన్న డైనింగ్ టేబుల్ వద్ద ఆ ముగ్గురూ, సోఫాల్లో ఎమ్మెల్యేలు నలుగురూ కూర్చున్నారు. ఈ మీటింగ్ నేపథ్యంలో రామచంద్ర భారతి మూడుసార్లు గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు చేసి ఎమ్మెల్యేలతో మాట్లాడించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే అవతలి వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో వీలు కాలేదు. అలాగే ఆ ముగ్గురూ ఢిల్లీలో ఉన్న ఓ కేంద్ర పెద్దతో మాట్లాడించాలని ప్రయతి్నంచారని, అయితే ఆయన అందుబాటులో లేరని సహాయకుడు చెప్పిన అంశాలు రికార్డు అయినట్లు తెలిసింది. 3 రోజులు..70 మంది పోలీసులు: ఈ ఆపరేషన్ కోసం నిఘా, పోలీసు వర్గాలకు చెందిన దాదాపు 70 మంది 3 రోజులు పని చేశారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 84 సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గంటన్నర పాటు సాగిన భేటీ ఈ కెమెరాల్లో రికార్డు అయ్యింది. పీఠాధిపతిగా ప్రకటించుకున్న సింహయాజులు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వంలో కీలకంగా వ్యవహరించిన సింహయాజులు స్వామి తిరుపతి వాసి. అన్నమయ్య జిల్లా చిన్న మండ్యం మండలంలో శ్రీమంత్రరాజ పీఠం ఏర్పాటు చేసుకొని, తనను తాను పీఠాధిపతిగా ప్రకటించుకున్నారు. అది లక్ష్మీ నరసింహ స్వామికి చెందిన పీఠంగా చెబుతూ పలుకుబడి పెంచుకున్నాడు. ఇతడికి తిరుపతిలో సొంత ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బు తెచ్చింది నందూయేనా..?: రామచంద్ర భారతి ఢిల్లీ ఫరీదాబాద్‌లోని ఓ ఆలయ పూజారి కాగా.. కర్ణాటకకు చెందిన నందకుమార్ నగరానికి వలసవచ్చి చైతన్యపురి ప్రాంతంలో నివసిస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్ ప్రాంతంలో సదరన్ స్పైస్ పేరుతో ఓ రెస్టారెంట్ నడిపాడు. ఫిల్మీ జంక్షన్ అనే రెస్టారెంట్ నిర్వహణ సమయంలో దాని స్థల యజమాని అయిన సినీ ప్రముఖుడితో విభేదాలు తలెత్తాయి. ఆపై అవినాష్ అనే వ్యక్తితో కలిసి మాణిక్‌చంద్ పాన్ మసాలా వ్యాపారం చేశాడు. తర్వాత మాణిక్ చంద్ బ్రాండ్‌ను తన ఆ«దీనంలోకి తీసుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీలోనూ సౌత్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. వీటితో పాటు నగరంలోని అనేక పబ్బులు, రెస్టారెంట్లు, బార్లలో భాగస్వామ్యం ఉంది. పలువురు ప్రముఖులు ఇతడి వద్ద పెట్టుబడులు పెట్టారని, కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసులతో ఇతడికి స్నేహం ఉందని, హవాలా ఆపరేటర్ అని కూడా తెలిసింది. బుధవారం నందు పుట్టిన రోజు కావడంతో ఈ ఫామ్ హౌస్‌లో పార్టీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హవాలా ఆపరేటర్ కావడంతో డబ్బు తీసుకువచ్చింది నందూయేనా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా నిందితులు ముగ్గుర్నీ పోలీసులు ఫామ్‌హౌస్ నుంచి తరలించారు. -
బేరసారాలకు టీఆర్ఎస్ లొంగదు: ఎమ్మెల్యే బాలరాజు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ నేతలకు వల వేసేందుకు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేసి భారీగా నగదు పట్టుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ బేరసారాలకు లొంగదని చెప్పారు ఎమ్మెల్యే బాలరాజు. ఇది కేసీఆర్ పార్టీ.. ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు.. తెలంగాణ సమాజం అమ్ముడుపోదన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్. నిస్సిగ్గుగా తమ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీపై తెలంగాణ సమాజం తిరగబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సాక్షిగా బీజేపీ కుట్రలు బయటపడ్డాయన్నారు. తమ ఎమ్మెల్యేలు ధైర్యంగా కుట్రను బయటపెట్టారని అన్నారు. ఇదీ చూడండి: మునుగోడు లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలకు వల.. రూ.100 కోట్లతో డీల్ -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే చంపాలని అనిపిస్తోంది..!
విద్యానగర్ (కరీంనగర్): టీఆర్ఎస్ పాలనలో ఎంపీటీసీలు మొదలు.. ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అవినీతి అడ్డూఅదుపు లేకుండా పోయిందని, అందుకే మావోయిస్టుల హెచ్చరికలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు అన్నారు. ఆదివారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకుల అవినీతి ఇలాగే సాగితే రానున్న రోజుల్లో ‘అన్నలు’వస్తారని, పది నిమిషాల్లో అందరినీ చంపేసి వెళ్లిపోతారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, మెడికల్ ఉద్యోగాల మాఫియాపై మావోయిస్టులు సీరియస్‌గా ఉన్నారని, వారు దాడి చేయాలనుకుంటే 10 నిమిషాల్లో పని పూర్తిచేసి బార్డర్ దాటి వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి అంతా సీఎం కేసీఆర్‌కు తెలిసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ మంత్రి బావ రూ.8కోట్ల ప్రాపర్టీని ఆక్రమించినప్పటికీ అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే తనకే చంపాలని అనిపిస్తోందని గోనె వ్యాఖ్యానించారు. -
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావాల్సిందే
-
రజాకార్ల పాలనను తలపిస్తున్నారు
మోత్కూరు/ సాక్షి, యాదాద్రి/ హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లైసెన్స్డ్ గూండాల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతూ రజాకార్ల పాలనను తలపిస్తున్నారన్నారు. హత్యలు, అత్యాచారాలకు టీఆర్ఎస్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ధ్వజమెత్తారు. పదిహేను రోజుల్లో ఇద్దరు లాయర్లను టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హతమార్చారని ఆరోపించారు. తక్షణమే అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తేవాలని డిమాండ్ చేశారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల్లో సర్కారు విఫలం శాంతి భద్రతల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయ్యిందని సంజయ్ విమర్శించారు. హత్యలు, అత్యాచారాలు, కబ్జాలు, ఇసుక.. డ్రగ్స్ మాఫియాలకు టీఆర్ఎస్ నిలయంగా మారిందని ఆరోపించారు. మునుగోడులో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే పార్టీగా బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో యాత్ర ప్రముఖ్ జి.మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లాలోకి యాత్ర సంజయ్ పాదయాత్ర ఆదివారం సాయంత్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగిసి.. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలోకి ప్రవేశించింది. నల్లగొండ జిల్లాలో సంజయ్ 12 రోజుల పాటు 153.3 కి.మీ. నడిచారు. 5 గ్రామసభలు, 10 బహిరంగ సభలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా దాదాపు 160 కిలోమీటర్లు సాగే పాదయాత్ర 12 రోజుల పాటు కొనసాగనుంది. పలు చారిత్రక ప్రదేశాలతో పాటు తెలంగాణ పోరాట యోధులు జన్మించిన ప్రాంతాల మీదుగా పాదయాత్ర జరుగుతుంది. ఈ సందర్భంగా ఐనవోలు మల్లన్న, వెయ్యి స్తంభాల గుడితో పాటు భద్రకాళి అమ్మవారి ఆలయాలను సంజయ్ సందర్శించనున్నారు. -
50 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం.. బండి సంజయ్ వ్యాఖ్యలు
సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రజాసంగ్రామయాత్ర సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలకు ఇంతవరకు అధికారం ఇచ్చారని, ఇప్పుడు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. అధికారం కోసం కేసీఆర్ ఇంట్లో పంచాయతీ నడుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్షా 80 వేల కోట్లు ఖర్చుపెట్టి తన ఫాంహౌస్‌కు నీళ్లు తెచ్చుకున్న సీఎం.. యాదాద్రి జిల్లాలోని బునాదిగాని కాలువకు బస్వాపూర్ ప్రాజెక్టును అనుసంధానం చేయడానికి రూ.100 కోట్లు కేటాయించడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నిస్తే బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. తుంగతుర్తిలో ఇసుక మాఫియాను అడ్డుకున్న వారిని జైలుకు పంపించారన్నారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలుపును కేసీఆర్ ఆపలేడన్నారు. ఉప ఎన్నిక వస్తేనే తుంగతుర్తిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. వీఆర్ఏల సమస్యలను 20 రోజులుగా పరిష్కరించడం లేదన్నారు. కేసీఆర్ బస్‌చార్జీలు, కరెంట్ బిల్లులు విపరీతంగా పెంచారని మండిపడ్డారు. దళితబంధు ఎంతమందికిచ్చారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గంలో గాదరి కిషోర్‌ను, టీఆర్ఎస్ పార్టీనీ ఓడిస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. అనంతరం రిటైర్డ్ ఏసీపీ బొట్టు కృష్ణ సహా వివిధ పార్టీలకు చెందిన వారు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. చదవండి: ‘నా రాజీనామా తర్వాత మునుగోడులో ఎన్నో మార్పులు’ -
నెల రోజుల్లో కాంగ్రెస్‌లోకి ఆశ్చర్యకర చేరికలు
సాక్షి, హైదరాబాద్: నెల రోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీలోకి ఆశ్చర్యకర చేరికలుంటాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, బీజేపీకి చెందిన కీలక నేతలు కూడా మాట్లాడుతున్నారని, వీరంతా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన వెల్లడించారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఈనెల 5న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఆందోళన విజయవంతం చేసేందుకు మంగళవారం టీపీసీసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం గాంధీభవన్‌లో జరిగింది. సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర నేతలు అంజన్‌కుమార్ యాదవ్, బొల్లు కిషన్, రాచమళ్ల సిద్దేశ్వర్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, ప్రసాద్ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చదవండి: టీఆర్ఎస్కు మంత్రి ఎర్రబెల్లి సోదరుడు గుడ్‌బై! బీజేపీలోకి ప్రదీప్‌రావు? -
ప్రశాంత్ కిషోర్ సర్వేతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో మొదలైన గుబులు
-
దళిత ఎమ్మెల్యేలపై బీజేపీ ఫేక్ వీడియోలు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలపై బీజేపీ సోషల్ మీడియా వింగ్ ఫేక్ వీడియోలు తయారు చేసి తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఫేక్ వీడియోలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని అదనపు డీజీపీ జితేందర్‌కు సుమన్ నేతృత్వంలో ఆరూరి రమేశ్, క్రాంతికిరణ్, మెతుకు ఆనంద్‌తో కూడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం శుక్రవారం ఫిర్యాదు చేసింది. అనంతరం సుమన్ మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కూడా కుటుంబాలున్నాయని, బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుపైనా ఫేక్ వీడియోలు సృష్టించారని, దళిత నేతల ఎదుగుదలను బీజేపీ ఓర్చుకోవడం లేదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్ర చారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగుతామని సంజయ్, ఈటల సహా ఎవర్నీ వదలబోమని సుమన్ హెచ్చరించారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా డబ్బు పంచారు: ఈటల
సాక్షి, కరీంనగర్: అధికార పార్టీ ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా డబ్బు పంచారని ఆరోపించారు. ఈవీఎంలు కూడా మార్చినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఓటు వేసిన బాక్స్‌లు కూడా మాయం చేయడం దుర్మార్గం. టీఆర్ఎస్ కుట్రలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఈటల తెలిపారు. (చదవండి: Huzurabad Bypoll: ఓటెత్తిన హుజూరాబాద్) -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో భారీ చోరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసంలో భారీ చోరీ జరిగింది. లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగింది. దీనిపై పోలీసులు రహాస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు 305 ఫ్లాట్ కేటాయించారు. అయితే ఆ ఫ్లాట్‌లో ఎమ్మెల్యే బంధువు అమర్నాథ్ బాబు కుటుంబం కొంతకాలంగా నివసిస్తోంది. శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లాట్‌లో దొంగతనానికి పాల్పడ్డారు. ఫ్లాట్‌లోకి వెళ్లిన దొంగలు 14.6 తులాల బంగారం, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. అయితే ఈ విషయంపై ఆబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, నారాయణగూడ సీఐ రమేశ్‌కుమార్ వివరాలు వెల్లడించకుండా చోరీపై గోప్యత పాటిస్తున్నారు. పోలీసులు పదుల సంఖ్యలో సెక్యూరిటీ ఉండే క్వార్టర్ట్స్‌లో చోరీ కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమర్నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో తమ డ్రైవర్ ఇంట్లో పలు వస్తువులు కూడా దొంగతనానికి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేసిన తాళాలు వేసినట్లు ఉండడం, లోపలికి ఎవరూ రాకపోవడంతో ఇంటిదొంగ పనే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండడంతో పోలీసులు డ్రైవర్‌పై అనుమానిస్తున్నారు. ఈ క్వార్టర్స్ ఇటీవల కొత్తగా నిర్మించిన విషయం తెలిసిందే. -
మైండ్‌గేమ్‌తో బీజేపీ ఆటలు సాగవు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేవలం సీఎం కేసీఆర్‌ను తిట్టడం కోసమే పెట్టినట్లు ఉందని హుజుర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం కరోనాను కనిపెట్టడంలో విఫలమవగా ఆ సమయంలో కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ధీటుగా ఎదుర్కొందో దేశమంతా చూసిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాలను కేంద్రమంత్రులందరూ పొగిడారని చెప్పారు. గుజరాత్ తరువాత తెలంగాణ మాత్రమే జీఎస్టీ అత్యధికంగా కడుతున్న రాష్ట్రమని ఎమ్మెల్యే తెలిపారు. జనాల మైండ్‌తో గేమ్ ఆడుతూ ఎన్నికల్లో గెలుస్తున్నారని విమర్శించారు. బీజేపీకి రామ మందిరం కట్టడమే ఇష్టం లేదని.. సుప్రీంకోర్టు చెప్పేవరకు పోరాటం చేసిన నేత ఒక్కరూ బీజేపీలో లేరని పేర్కొన్నారు. నేషనల్ స్కిల్ దేవలమెంట్ పెట్టి దేశంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, తెలంగాణలో 7లక్షల 60 వేల ఉద్యోగాలు ఐటీ ఆధారితతో యువతకు ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా లోగోను రూ.10 కోట్లు పెట్టి బయట కొన్నా ఉపయోగం లేదని చెప్పారు. కొన్ని పిచ్చి కుక్కలను రాష్ట్రం మీదకు వదిలారు!.. అని తీవ్రస్థాయిలో బీజేపీ నేతలపై సైదిరెడ్డి విరుచుకుపడ్డారు. మాఫియాను పోషించేది బీజేపీనే మరో ఎమ్మెల్యే గాదరి కిశోర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దేశీయ దొంగలు ఇష్టమొచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సత్యహరిశ్చంద్రుడు బతికి ఉంటే వీరి మాటలు విని ఆత్మహత్య చేసుకునే వారని తెలిపారు. దేశంలో మాఫియాను పెంచి పోషించేది బీజేపీ అని, హత్యలు అత్యాచారాలు చేసిన 25 మంది మంత్రివర్గాల్లో ఉన్నారని ఎమ్మెల్యే కిశోర్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేసులు ఉన్న నేతలు 176 మంది పాలకవర్గంలో కొనసాగుతున్నారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేసుల వల్ల గతంలో గుజరాత్ నుంచి వెలివేశారని గుర్తుచేశారు. దేశానికి మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్లధనం పేరుతో ఎంతమందిని అరెస్ట్ చేశారని, పేదలకు ఎంతధనం పంచారో చెప్పాలి? అని ప్రశ్నించారు. మాఫియా అనేది ఎవరో దేశ.. రాష్ట్ర ప్రజలకు తెలుసని తెలిపారు. దేశం బయట ఉన్న డబ్బులు దేశానికి రప్పించకుండా.. దేశంలో ఉన్న డబ్బులు బయటకు తరలిస్తున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. బండి సంజయ్ కాలం దగ్గర పడిందని హెచ్చరించారు. కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణ ప్రజలను అన్నట్లేనని ఎమ్మెల్యే కిశోర్ పేర్కొన్నారు. -
రెండేళ్ల పదవీ కాలం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మనోగతం
‘స్వరాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందాలనేదే.. టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఆ ప్రాతిపదికనే పార్టీ ఆవిర్భవించి ప్రజల ఆశీర్వాదంతో మరోమారు అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే.. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. విపక్షాలు ఎన్ని విమర్శలు.. ఆరోపణలు చేసినా ఇది కఠోర వాస్తవం. మాటతప్పి..మడమ తిప్పే నైజం మాది కాదు. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో మూడేళ్లలో అన్నింటినీ నెరవేరుస్తాం. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లా దశదిశ మార్చి మళ్లీ దీవించాలని కోరుతాం.’ ఇదీ.. రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ ఎదుట ఆవిష్కరించిన ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మనోగతం. సాక్షి, సూర్యాపేట: ఏళ్ల తరబడి బీడుగా ఉన్న భూములు సస్యశ్యామలం అయ్యాయి. ఎన్నో ఏళ్ల కింద తీసిన కాల్వల్లో ఇక నీళ్లు రావని ఆయకట్టు రైతులు భావించారు. కానీ ఈ కాల్వల్లో గోదావరి జలాలు పారించి రైతు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది మా ప్రభుత్వం. మూసీ, గోదావరి, కృష్ణా జలాలతో జిల్లాలో రికార్డు స్థాయిలో పంటలు పండాయి. ఎక్కడ చూసినా పచ్చదనమే.. జిల్లాకు గోదావరి జలాల రాకతో ఆయకట్టులో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. మా ప్రభుత్వం వచ్చాక రైతుల కళ్లల్లో ఆనందం చూడాలనుకుంది. గోదావరి జలాలను ఈ కాలువలకు మళ్లించి రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాం. గతేడాది నుంచి పంట పూర్తిగా చేతికి వచ్చే వరకు జిల్లాలోని ఆయకట్టుకు గోదావరి నీళ్లు అందిస్తూ వస్తున్నాం. ఇలా పూర్తి స్థాయిలో పంటకు గోదావరి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మూసీ ప్రాజెక్టును ఆధునికీకరించడంతో ఆయకట్టులో రెండు సీజన్లకు నీళ్లు అందుతున్నాయి. వైద్యరంగంలో బలోపేతమయ్యాం.. జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు రావడం మా ప్రభుత్వంతోనే సాధ్యమైంది. సూర్యాపేటలో కూడా వైద్యకళాశాల ఏర్పాటు కావడంతో వైద్య రంగంలో జిల్లా మరింత ముందంజలో ఉంది. మెడికల్ కళాశాల జిల్లాకు కలికితురాయి. కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కార్పొరేట్ స్థాయిని మించి వసతులు ఏర్పాటవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఇప్పటికే రోడ్ల వెడల్పు, జంక్షన్ల నిర్మాణ పనుల కార్యక్రమం మొదలైంది. సద్దల చెరువు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా రూపుదిద్దుకుంటోంది. పట్టణ నడిబొడ్డున మోడల్ మార్కెట్ నిర్మాణం అయింది. మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో అగ్రభాగాన నిలిచింది. ⇒ ఎన్నికల హామీలు నెరవేరుతున్నాయి.. నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి.. ఎన్నికల హామీలన్నీ నెరవేరుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని ఇంటింటికీ తాగునీరు అందించడంతోపాటు సాగునీటి సమస్యను కూడా పరిష్కరించాం. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను మరింత అభివృద్ధి పరిచి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండేళ్ల కాలంలో నల్లగొండ నియోజకవర్గంలో మున్సిపాలిటీతోపాటు మూడు మండలాల్లో సీసీ రోడ్లు నిర్మించాం. మరో మూడేళ్లలో నియోజకవర్గాన్ని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నల్లగొండ పట్టణానికి రెండో పైప్‌లైన్ తీసుకొచ్చి తాగు నీటి సమస్య లేకుండా చేశా. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నాం. నల్లగొండను మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నా. గత పాలకులు వదిలేసిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.18కోట్లు మంజూరు చేసింది. పనులు త్వరలో పూర్తి చేయిస్తాం. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీలు పెంచడంతోపాటు డయాలసిస్ వ్యవస్థను మెరుగు పర్చాం. సిటీస్కాన్ ఉపయోగంలోకి తెచ్చాం, ఎంఆర్ఎస్ స్కాన్ , కేన్సర్ యూనిట్కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. రూ.275 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీలోని 32ఎకరాల విస్తీరణంలో మెడికల్ కళాశాల నూతన భవనం నిర్మించబోతున్నాం , దానికి సీఎం త్వరలో శంకుస్థాపన చేస్తారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ముందున్నాం. ⇒ రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు: మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలే కాకుండా అంతకంటే ఎక్కువ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. మిర్యాలగూడ పట్టణంలో రూ.100 కోట్లతో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాం. ఆగిపోయిన మినీ రవీంద్రభారతికి రూ.3కోట్లు కేటాయించాం. సంత్‌సేవాలాల్ భవనం, జ్యోతిరావుపూలే భవనం నిర్మిస్తున్నాం. మూడు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి రూ.525 కోట్లు మంజూరయ్యాయి. రూ.17 కోట్లతో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్ పనులు సాగుతున్నాయి. రూ.50 కోట్లతో పలు గ్రామాల్లో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశాం. కేఎన్ఎం కళాశాలను ప్రభుత్వ పరం చేయడంతోపాటు జూనియర్ కళాశాలలో రూ.3కోట్లతో తరగతి గదులను నిర్మిస్తున్నాం. పట్టణంలో 560 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రూ.50 కోట్లతో 31 చెక్ డ్యామ్‌లను నిర్మించనున్నాం. మిర్యాలగూడ పట్టణంలో 80 పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాం. ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి చేయనున్నాం. ⇒ తొలి ఏడాదిలోనే సగం వాగ్దానాలు పూర్తి చేశా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్: ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన వాగ్దానాల్లో సగం పూర్తి చేశా. , మిగిలినవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తా. ఇచ్చిన హామీ మేరకు తీవ్ర సాగునీటి కొరతను ఎదుర్కొంటున్న మోతె, మునగాల, నడిగూడెం మండలాలకు కాళేశ్వరం జలాలను తీసుకొచ్చా. కోదాడ పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేశాం. కోదాడ ట్యాంక్‌బండ్ పనులతో పాటు మరో 8ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేసి పెద్దచెరువును పర్యాటక ప్రాంతంగా మారుస్తాం. పేదలకు 1,840 డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరలో పంపిణీ చేస్తాం. ఇంటిస్థలం ఉన్న మరో 3 వేల మందికి రూ.5లక్షలు ఇప్పించడానికి కృషి చేస్తా. ⇒ హామీలు పురోగతిలో ఉన్నాయి హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి: నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు పురోగతిలో ఉన్నాయి. నియోజకవర్గంలో చివరి భూములకు నీరందించేందుకు లిఫ్ట్‌లపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా పులిచింతల ప్రాజెక్ట్‌లో ముంపునకు గురవుతున్న అడ్లూరు, చింతిర్యాల, గుర్రంబోడు, రేబల్లె లిఫ్ట్‌లను తరలించేందుకు రూ.75 కోట్లు మంజూరు చేయించాం. అదేవిధంగా చెక్‌డ్యాంలు నిర్మించేందుకు రూ.32 కోట్లు మంజూరయ్యాయి. మేళ్లచెరువు, మఠంపల్లి, మండలాల్లో చాలా వరకు లింక్ రోడ్లు, బ్రిడ్జి మంజూరు చేయించా. కొన్ని పూర్తి అయ్యాయి. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. హుజూర్నగర్ రింగ్ రోడ్డు మిగిలిన పనులకుగాను రూ.5 కోట్లు మంజూరు చేయించా. మిగిలిన పనులు త్వరలో పూర్తవుతాయి. ఏరియా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంక్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నా. ఈఎస్ఐ ఆస్పత్రి కోసం మేళ్లచెరువులో 5ఎకరాల భూమి కేటాయించాం. మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలకు సంబంధించిన కేసులు కోదాడ కోర్టుకు వెళ్తున్నాయి. వాటిని హుజూర్నగర్ కోర్టు పరధిలోకి తెచ్చే అంశం ఫైల్ సీఎం కేసీఆర్ దగ్గర ఉంది. త్వరలోనే క్లీయర్ అవుతుంది. హుజూర్‌నగర్‌లో ప్రత్యేకంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతే కాకుండా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మఠంపల్లి మండలంలో 2,500 ఎకరాలు భూ సేకరణ జరిగింది. మిగతా పనులు కూడా పూర్తి చేస్తాం. ⇒ సాగునీరు, సౌకర్యాల కల్పనకు పెద్దపీట భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి: భువనగిరి నియోజకవర్గంలో సాగునీరు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. రానున్న మూడేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతా. కరోనా కష్టకాలంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడానికి నియోజకవర్గ అభివృద్ధి నిధులను నిలిపివేశారు. అయినప్పటికీ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ అండతో రూ.20 కోట్లతో హెచ్ఎండీఏ నిధులతో నియోజకవర్గంలో మురుగు కాలువలు, సీసీరోడ్లు చేపట్టాం. 90 శాతం పనులు పూర్తి కావచ్చాయి. అన్ని గ్రామాల రైతులకు సాగు నీరందిస్తాం. బస్వాపురం రిజర్వాయర్ పూర్తి కావస్తోంది. రిజర్వాయర్‌లో1.5 టీఎంసీల కాళేశ్వరం నీరు రైతులకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా మూసీ కాల్వలైన బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలను పూర్తి చేస్తున్నాం. జిల్లా కేంద్రమైన భువనగిరిలో రూ.8.72 కోట్లతో మోడల్‌మార్కెట్ నిర్మాణం జరుగుతోంది. రోడ్డు వెడల్పు కోసం రూ.15.18 కోట్లతో పనులు చేపట్టాం. రూ.1.60కోట్లతో స్మృతి వనం పనులు జరుగుతున్నాయి. మున్సిపాలిటీకి మరో రూ.50 కోట్లతో అభివృద్ధిపనుల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ⇒ పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య : ప్రధానంగా నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టు ప నులపై దృష్టి సారించా. ఉదయసముద్రంతోపాటు, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను పూర్తిచేయించి సాగునీరు అందించడానికి కృషిచేస్తా. పిలాయిపల్లి ఆధునికీకరణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ధర్మారెడ్డిపల్లి ఆధునికీకరణ పనులు 70శాతం పూర్తయ్యాయి. వచ్చే వేసవి వరకు పెండింగ్ పనులను పూర్తి చేయించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. ఆసిఫ్‌నహర్, శాలిగౌరారం ప్రాజెక్టు కాలువల మరమ్మతులకు రూ.25కోట్లు, ఎర్రకాలువ పునర్నిర్మాణానికి రూ.30కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. నకిరేకల్, రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయిని 100 పడకలకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు అవసరమైన పోస్టులు మంజూరయ్యాయి. నకిరేకల్‌లోని డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు కట్టించేందుకు కృషి చేస్తా. చిట్యాల పట్టణంలో ప్రమాదాల నివారణకు జాతీయ రహదారి వెంట ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంటుంది. నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్లో కోల్డ్స్టోరీజే ఏర్పాటు చేయిస్తా. ⇒ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నా.. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నా. ఎన్నికల సమయంలో దేవకకొండ నియోజకవర్గంలోని ప్రజలకు డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో పాటు దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా మార్చుతా. పొగిల్ల, నంబాపురం అంబాభవాని ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానని హామీలు ఇచ్చా. ఈ మేరకు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా గొట్టిముక్కుల, సింగరాజుపల్లి, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అదేవిధంగా దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా మార్చే క్రమంలో ఇప్పటికే ఖిలాలో పార్కు ఏర్పాటుకు రూ.5కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. వెనుకబడ్డ చందంపేట మండల గిరిజనుల కోసం పొగిల్ల, అంబాభవాని, నంబాపురం ఎత్తిపోత పథకాలు సైతం కార్యరూపం దాల్చేందుకు పేపర్ పనులు పూర్తి చేశాం. నియోజకవర్గంలో ఇప్పటికే 526 డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. మండలాల్లో స్థల సేకరణ జాప్యంతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. త్వరలోనే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తా. కోర్టు కేసుల నేపథ్యంలో వంద పడకల ఆస్పత్రి కార్యరూపం దాల్చే క్రమం కొంత ఆలస్యమైంది. కోర్టు కేసులు పూర్తయినందున త్వరలోనే వంద పడకల ఆస్పత్రికి పూర్తి స్థాయిలో వైద్యసౌకర్యాలు, సిబ్బంది వచ్చే అవకాశం ఉంది. -
ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఆరుగురు ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. వారిని కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. నోటీసులు జారీ అయిన వారిలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకురు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. రవిప్రకాశ్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ.. టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు మరోసారి సూచించింది. వచ్చే నెల 7లోపు మరో నిర్ణయం తెలపాలని హైకోర్టు తెలిపింది. అప్పటి వరుకు రవిప్రకాష్‌పై ఉన్న స్టే కొనసాగుతుంది. తుదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 7 కు వాయిదా వేసింది. -
మా ఎమ్మెల్యేలెవరూ బీజేపీతో టచ్‌లో లేరు
సాక్షి, హైదరాబాద్: కుట్రలు, కుతంత్రాలతోనే రాజకీయాలు నడపాలని బీజేపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. బీజేపీ రాజకీయ దుర్మార్గపు క్రీడ ఆడుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేత లక్ష్మణ్ పేర్కొనడం నీతి మాలిన రాజకీయానికి నిద ర్శనమన్నారు. గురువారమిక్కడ కర్నె విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరూ బీజేపీతో టచ్‌లో లే రని, కేంద్రమంత్రులే తమతో టచ్‌లో ఉన్నారని వ్యం గ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మం త్రులు దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల ను ఎలా అమలు చేయాలని ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టంచేశారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: తమతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని, అడ్డదారిలో అధికారంలోకి రావాలని తాము అనుకోవడం లేదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మున్సిపల్ ఎన్నికల్లో కేంద్రం అమలు చేస్తున్న పథకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఆర్టీసీ పెట్రోల్ బంక్‌లను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన విషయంపై స్వయంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలుస్తానని లక్ష్మణ్ తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని, కొత్త అధ్యక్షుడు ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని లక్ష్మణ్ చెప్పారు -
సభా కమిటీల్లో మనోళ్లు!
సాక్షి , వరంగల్: సభా కమిటీల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులకు అవకాశం దక్కింది. మంత్రివర్గ విస్తరణ సమయంలో సభా కమిటీల్లోను ఓరుగల్లుకు పెద్దపీట వేయనున్నట్లు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజున ఉమ్మడి సభా కమిటీలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. ఆయా కమిటీల వివరాలిలా ఉన్నాయి. జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సర్వీస్ మెంబర్ : నన్నపనేని నరేందర్ (వరంగల్ తూర్పు) అసెంబ్లీ కమిటీలు రూల్స్ కమిటీ సభ్యుడిగా గండ్ర వెంకటరమణరెడ్డి(భూపాలపల్లి) ప్రివిలేజ్ కమిటీ సభ్యుడిగా డాక్టర్ టి.రాజయ్య (స్టేషన్‌ఘన్‌పూర్) కమిటీ అన్ గవర్నమెంట్ అక్యూరెన్స్ సభ్యుడిగా చల్లా ధర్మారెడ్డి (పరకాల) ఫైనాన్షియల్ కమిటీలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిలుగా పెద్ది సుదర్శన్‌రెడ్డి(నర్సంపేట), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ) కమిటీ ఆన్ ఎస్టిమేట్స్ సభ్యుడిగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(జనగామ) కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యుడిగా బానోతు శంకర్‌నాయక్(మహబూబాబాద్) లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీలు రూల్స్ కమిటీ సభ్యుడిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ) పిటీషన్స్ కమిటీ సభ్యుడిగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి(స్థానిక సంస్థల ఎమ్మెల్సీ) వెల్ఫేర్ అండ్ అదర్ జాయింట్ కమిటీలు అమెనిటీస్ కమిటీ సభ్యులుగా దాస్యం వినయ్‌భాస్కర్(వరంగల్ పశ్చిమ), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ) వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ కమిటీ సభ్యులుగా ధనసరి అనసూయ(ములుగు) వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ సభ్యుడిగా బానోతు శంకర్‌నాయక్(మహబూబాబాద్) వెల్ఫేర్ ఆఫ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ సభ్యుడిగా నన్నపనేని నరేందర్(వరంగల్ తూర్పు), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (స్థానిక సంస్థల ఎమ్మెల్సీ) లైబ్రరీ కమిటీ సభ్యులుగా చల్లా ధర్మారెడ్డి (పరకాల), ధనపరి అనసూయ(ములుగు) -
అక్కడా వారిదే పెత్తనం!
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహం ఆ పార్టీలోనే చర్చనీయాంశమైంది. పరిషత్ ఎన్నికల బీఫారాల పంపణీ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములునాయక్, రామగుండంలో ఏఐఎఫ్బీ తరఫున గెలిచిన కోరుకుంటి చందర్ ఫలితాలు వెల్లడైన వారంలోనే టీఆర్ఎస్లో చేరారు. అనంతరం టీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో బీఫారాల పంపిణీలో ఇబ్బందులు లేవు. ఇతర పార్టీల తరఫున గెలిచి టీఆర్ఎస్లో చేరిన 14 మంది ఎమ్మెల్యేల సెగ్మెంట్లలోనూ పరిషత్ ఎన్నికల టీఆర్ఎస్ బీఫారాల పంపిణీ బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకే అప్పగించారు. అయితే, ఈ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినవారిలో ఆందోళన నెలకొంది. అభ్యర్థుల ఎంపికలో తమకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంపట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తొలివిడత నామినేషన్ దాఖలు ప్రక్రియ బుధవారం ముగిసిపోతుంది. కాగా, కాంగ్రెస్‌కు చెందిన ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల అభీష్టం... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినవారికి ఈ బాధ్యతలు ఉంటాయని భావించారు. అయితే ఆయా నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికసంఖ్యలో టీఆర్ఎస్లో చేరడంతో పరిస్థితి మారిపోయింది. బీఫారాల పంపిణీ, టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు వ్యవహారాలను వీరే చూసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు బీఫారాలను ఎమ్మెల్యేలకే ఇచ్చారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయినవారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు తమతో ఉన్నవారికి పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావడంలేదని అంటున్నారు. పరిషత్ అభ్యర్థుల ఎంపికలో టీఆర్ఎస్లోని ద్వితీయ శ్రేణి నేతలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా రు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలసి ఈ విషయంపై విన్నవించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అంతా ఎమ్మెల్యేలే...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ..పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అన్ని జడ్పీలు, ఎంపీపీలను కైవసం చేసుకోవడం లక్ష్యంగా వ్యూహం అమలు చేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, బీఫారాల పంపిణీ, గెలుపు బాధ్యతలను పూర్తిగా ఎమ్మెల్యేలకే అప్పగించింది. పరిషత్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నామని, గెలుపోటములకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల తొలిదశ ప్రక్రియ సోమవారం మొదలైంది.నామినేషన్ల దాఖలు ప్రారంభమైన నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేలతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. పరిషత్ ఎన్నికలలో అమలు చేయాల్సిన వ్యూహాన్ని వివరించారు. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గెలుపు అవకాశాలను ప్రతిపాదికగా అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. ఆశావాహులు ఎక్కువ మంది ఉంటారని, అందరినీ కలుపుకునిపోయే వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులతో గ్రామాల్లో ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్నారని, ఏకాభిప్రాయం మేరకు అభ్యర్థులకు ఎంపిక చేస్తే గెలుపు సునాయాసమవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలోనే ఎలాంటి అసంతృప్తులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆశావహులు అందరు నామినేషన్ దాఖలు చేసిన చర్చించి ఒప్పించడం వల్ల గందరగోళ పరిస్థితులు ఉంటాయని, ముందుగానే సమావేశం నిర్వహించి ఒక్కరే నామినేషన్ దాఖలు చేసేలా చూడాలని ఆదేశించారు. స్థానిక అంశాలు... జెడ్పీటీసీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసుకోవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం ఉండాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో అన్ని జెడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకునేలా ఎమ్మెల్యేలు ప్రయత్నించాలని ఆదేశించారు. ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ పదవులలో అధికార పార్టీ వారు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. గ్రామాలు సమగ్ర అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకోవాలని... దీనికి అనుగుణంగా ఎమ్మెల్యేలు పని చేయాలని ఆదేశించారు. -
అమాత్యులెవరో..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జిల్లాలో ఉత్కంఠ రేపుతోంది. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించిన నేపథ్యంలో పదవి ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు, రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్న నేపథ్యంలో జిల్లా నుంచి ఎవరు అమాత్యులవుతారు.. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగగా.. ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగింది. జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ కూటమిగా ఏర్పడి పోటీ చేయగా.. నియోజకవర్గాల్లో కూటమి విజయం సాధించింది. ఇందులో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులు విజయం సాధించగా.. టీడీపీ అభ్యర్థులు సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. దీంతో జిల్లాలోని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎవరికి పట్టం కట్టాలనే అంశంపై టీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లా నుంచి టీఆర్ఎస్ తరఫున ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్‌కుమార్ ఒక్కరే విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన లావుడ్యా రాములునాయక్ టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో టీఆర్ఎస్ బలం జిల్లాలో రెండుకు చేరిన్నా.. పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్‌కుమార్ మాత్రమే గెలిచారు. దీంతో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఏకైక ఎమ్మెల్యేగా ఆయనకు మంత్రిగా అవకాశం లభిస్తుందని పువ్వాడ అనుచర వర్గం, పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. జిల్లా టీడీపీలో సీనియర్ నేతగా ఉండి.. వరుసగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్యను అధికార టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే మంత్రివర్గ విస్తరణలోపు సండ్ర టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. టీడీపీ శ్రేణులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా గత డిసెంబర్లో పోటీ చేసేందుకు అనువుగా ఆయన టీటీడీ బోర్డు సభ్యత్వ పదవికి రాజీనామా కూడా చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని పునరుద్ధరించినా.. ఆయన తిరిగి స్వీకరించలేదు. అధికార టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా టీటీడీ బోర్డు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వెంకటవీరయ్య రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నందున.. టీటీడీ బోర్డు సభ్యత్వం వంటి కీలక పదవిని సైతం వదులుకోవడం.. ఆయనకు తెలంగాణ మంత్రివర్గంలో స్థానంపై భరోసా లభించడమే కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో సండ్ర వెంకటవీరయ్య తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనే అంశంపై జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. జిల్లా నుంచి టీఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని, కేసీఆర్ తనయుడు కేటీఆర్‌తో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు అందలం ఎక్కిస్తాయని ఆయన అభిమానులు విశ్వసిస్తున్నారు. దీంతో జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది? అసలు తొలి మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం ఉందా? లేదా? అనే అంశంపై రాజకీయ వర్గాలు ఎవరికి తోచిన విధంగా వారు తమ అనుకూల.. ప్రతికూల వాదనలు వినిపిస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను టీఆర్ఎస్లో చేర్చుకుని.. మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా రాష్ట్రంలో టీడీపీని బలహీన పరచడంతోపాటు శాసనసభలో ఆ పార్టీ తరఫున గళమెత్తే బలమైన నేత లేకుండా అవుతారనే వ్యూహంతో పార్టీ అధిష్టానం పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై ఆచితూచి స్పందిస్తున్న సండ్ర.. భవిష్యత్ వ్యూహంపై మాత్రం నోరు మెదపడం లేదని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సానుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వంలో తాము కీలకంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదని సండ్ర అభిమానులు వ్యాఖ్యానిస్తుండడం విశేషం. సామాజిక రాజకీయ అంశాలను, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలిపించగలిగే సమర్థతను సైతం పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని టీఆర్ఎస్లోని మరికొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక జిల్లా టీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్‌పై సైతం పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
మంత్రి యోగం ఎవరికో?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు దాటిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని కొలువు దీర్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సన్నద్ధమయ్యారు. శాసనసభలో కీలకమైన ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎంకు చెందిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలతో గురువారం ఆయన లాంఛనంగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి మహమూద్ అలీ మాత్రమే ప్రస్తుతం కేబినెట్ హోదాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 18న మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి గతంలోనే వెల్లడించారు. మంత్రి వర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 18 మంది సభ్యులు ఉండేందుకు వీలున్న పరిస్థితుల్లో విస్తరణలో ఎందరికి అవకాశం దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. పరిమిత సంఖ్యలోనే మంత్రులను నియమించి, మరికొం దరికి పార్లమెంటరీ కార్యదర్శి పదవులు కట్టబెడతారని, కొత్తగా ఏర్పాటైన ప్రతీ జిల్లా నుంచి ఒకరికి కేబినెట్ స్థాయి హోదా దక్కనుందని టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు, మరో ఇద్దరికి పార్లమెంటరీ కా ర్యదర్శి లేదా ఇతర కేబినెట్ హోదాలో ఓ పదవి రావచ్చు. ఆ పదవులు సైతం 18వ తేదీనే లభిస్తాయా..ఇంకొంత కాలం వేచిచూడాలా అనేది సస్పెన్స్. ఐకే రెడ్డికి మంత్రి పదవా.. స్పీకర్ హోదానా? 2014 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి గెలిచి, టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని నాలుగేళ్లకుపైగా వివాదరహిత కేబినెట్ మంత్రిగా సేవలందించిన సీనియర్ నేత అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డికి మరోసారి ఉన్నత పదవి దక్కడం ఖాయమని తేలిపోయింది. కీలకమైన మంత్రి పదవి ఆశిస్తున్న ఐకే రెడ్డికి స్పీకర్ పదవిని కట్టబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఉన్నత విద్యావంతుడు, న్యాయశాఖ మంత్రిగా, ఎంపీగా, జెడ్పీ చైర్మన్‌గా పలు కీలక పదవులు నిర్వహించిన ఐకే రెడ్డి స్పీకర్‌గా న్యాయం చేస్తారని ఆయన భావిస్తున్నారు. అయితే స్పీకర్ పదవి నిర్వహించిన వారు తరువాత ఎన్నికల్లో ‘ఓటమి’ పాలవుతారనే సెంటిమెంట్ ప్రచారంలో ఉండడంతో ఐకే రెడ్డి ఆ పదవికి అంగీకరిస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ స్పీకర్‌గా కొనసాగేందుకు ఐకే రెడ్డి ఒప్పుకోకపోయినా.. ఐకే రెడ్డితో ముఖ్యమంత్రికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా రాష్ట్రంలో కీలకమైన మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో అవకాశంకోసం రామన్న.. ఆదిలాబాద్ చరిత్రలో వరుసగా మూడుసార్లు గెలిచిన జోగు రామన్న గత కేబినెట్లో పూర్తికాలం మంత్రిగా పనిచేశారు. మంత్రిగా తొలుత కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా..తరువాత ముఖ్య మంత్రి నుంచి మంచి మార్కులు సంపాదించా రు. ఉమ్మడి జిల్లాలో బలమైన మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన ఏకైక బీసీ ఎమ్మెల్యే ఆ యనే కావడం కలిసివచ్చే అంశం. ఉత్తర తెలం గాణ నుంచి ఇదే సామాజిక వర్గానికి చెందిన ఎ మ్మెల్యేకు మంత్రివర్గంలో అవకాశం లభిస్తే రామన్నకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. నిజా మాబాద్, కరీంనగర్ నుంచి ఈ వర్గం ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవిని ఆశిస్తుండడం గమనార్హం. తూర్పు జిల్లా నుంచి సుమన్! తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న యువ నాయకుడు బాల్క సుమన్ ఎంపీగా కొనసాగుతూనే అనూహ్య పరిస్థితుల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆయనను గెలిపిస్తే ఉన్నతస్థానం కల్పిస్తానని మందమర్రి ఎన్నికల ప్రచార సభలోనే కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తూర్పు ఆదిలాబాద్ పరిధిలోని మంచిర్యాల జిల్లా నుంచి సుమన్‌కు కేబినెట్లో అవకాశం లభించే అవకాశం ఉంది. అయితే పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. ఈశ్వర్ సామాజిక వర్గానికే చెందిన సుమన్‌కు కూడా ఒకే లోక్‌సభ పరిధిలో మంత్రి పదవి ఇస్తారా? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈశ్వర్‌కు స్పీకర్ హోదా ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సుమన్‌కు మంత్రి పదవి లభిస్తుందా..? లేక కేబినెట్ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్, విప్, పార్లమెంటరీ కార్యదర్శి పదవుల్లో మరేదైనా ఉంటుందా అని టీఆర్ఎస్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఏదేమైనా సుమన్‌కు కేబినెట్ హోదా మాత్రం ఖాయమని తెలుస్తోంది. ఈ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సైతం నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా..ఉత్తర తెలంగాణలో ఆయన సామాజిక వర్గం నుంచి గట్టి పోటీ నెలకొనడంతో ఇబ్బందిగా మారింది. కుమురంభీం జిల్లా నుంచి సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈసారి ‘కమ్మ’ కోటాపై కన్నేశారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వర్ రావు ఓడిపోగా, సీనియర్ ఎమ్మెల్యేగా తనకు ఆ సామాజికవర్గం కోటాలో అవకాశం ఇవ్వాలని లాబీయింగ్ చేస్తున్నారు. ఎస్టీ, మహిళా కోటాపై రేఖానాయక్ ఆశలు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించిన ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన రేఖానాయక్ తనకీసారి కేబినెట్ హోదా ఖాయమనే ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలోనే టీఆర్ఎస్ నుంచి గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు ముగ్గురు కాగా, ఎస్టీ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే రేఖానాయక్. గతంలోనే మహిళ లేకుండా కేబినెట్ కొనసాగించారనే అపప్రద ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి మహిళా మంత్రి తప్పనిసరి అని స్పష్టమైంది. ఎస్టీ వర్గం నుంచి గతంలో మంత్రిగా ఉన్న చందూలాల్ ఈసారి అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. ఈ నేపథ్యంలో రేఖానాయక్‌కు అవకాశం ఇస్తే ఎస్టీతోపాటు మహిళా కోటాలో మంత్రి పదవి భర్తీ చేసినట్లవుతుంది. కొసమెరుపు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే మంత్రిపదవులు దక్కుతాయి. సీనియర్లు ఆశిస్తున్నా.. డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఒకటి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌కు మరోటి మంత్రి పదవి ఇచ్చి, మరో రెండు పదవులు పార్లమెంటరీ సెక్రెటరీ లేదా ఇతర కేబినెట్ హోదాలో మాత్రమే దక్కే అవకాశం ఉంది. -
ఎమ్మెల్యేలకు ‘నివేదన’ పరీక్ష
అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభకు జన సమీకరణ ఎమ్మెల్యేలకు ఓ పరీక్షలా మారింది. జిల్లాలోని ప్రజాప్రతినిధులు కేసీఆర్ దృష్టిని ఆకర్షించేలా జన సమీకరణ చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. వచ్చే నెలలోనే ఆయా నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటిస్తామని అధినేత ప్రకటించడంతో ఎన్నికల వేడి రాజేసి నట్లయ్యింది. సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇస్తామని, రాని వారికి ప్రత్యామ్నాయ పదవులు కేటాయిస్తామని స్పష్టత ఇవ్వడంతో ఎమ్మెల్యేల్లో టిక్కెట్ల టెన్షన్ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభకు జన సమీకరణ ఎమ్మెల్యేలకు ఓ పరీక్షలా మారింది. వచ్చే నెలలోనే ఆయా నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటిస్తామని అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో.. జిల్లాలోని ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులను తరలించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని భావిస్తున్నారు. కేసీఆర్ దృష్టిని ఆకర్షించేలా జన సమీకరణ చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఎన్నికల జోన్లోకి వచ్చేశామని, రేపే ఎన్నికలు అనుకుని సమాయత్తం కావాలి.. అని అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఎన్నికల వేడిని రాజేసింది. మరోవైపు సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇస్తామని, రాని వారికి ప్రత్యామ్నాయ పదవులు కేటాయిస్తామని కేసీఆర్ స్పష్టత ఇవ్వడంతో ఎమ్మెల్యేల్లో టిక్కెట్ల టెన్షన్ పెరిగింది. ఈ సంకేతాలు ఒక రకంగా టిక్కెట్ల రేసులో ఉన్న ఆశావహుల్లో ఆశలు రేకెత్తించినట్లయింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్పు చేయాల్సిన వారిలో జిల్లాలో ఏ నియోజకవర్గం ఉంటుంది.. అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి రెండు లక్షల మంది.. జాతీయ రాజకీయ వర్గాల దృష్టిని సైతం ఆకర్షించేలా అధికార పార్టీ సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ శివారులో ప్రగతి నివేదన భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయిం చారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, రాష్ట్ర కార్యవర్గం నేతల సమావేశం అనంతరం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా మంత్రి పోచారం నివాసంలో సమావేశమయ్యా రు. నియోజకవర్గానికి 20 వేల నుంచి 25 వేల మందిని తరలించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న కామారెడ్డి, ఎల్లారెడ్డి వం టి నియోజకవర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో శ్రే ణులను తీసుకెళ్లేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. లారీలు, అందుబాటులో ఉన్న అన్ని రకా ల వాహనాల్లో తరలివెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ట్రాక్టర్లలో తరలివెళ్లే వారు ఒక రోజు ముం దుగానే కొంగరకు చేరుకోవాలని భావిస్తున్నారు. జిల్లా సమన్వయ కర్తగా ప్రశాంత్‌రెడ్డి.. ప్రగతి నివేదన సభకు ఆయా నియోజకవర్గాల్లో జన సమీకరణకు ఇన్చార్జిగా జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. జిల్లా సమన్వయకర్తగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డిని నియమించారు. ఇద్దరు నేతల పర్యవేక్షణలో శ్రేణుల తరలింపు జరగనుంది. కాగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమాయత్త సమావేశానికి జిల్లాకు చెందిన రాష్ట్ర కార్యవర్గ నేతలను ఆహ్వానించకపోవడం పట్ల సదరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అన్ని బస్సులు ఇవ్వండి.. ప్రగతి నివేదన సభకు జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను కేటాయించాలని ఆ సంస్థ అధికారులకు విజ్ఞప్తి అందింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అద్దె బస్సులతో సహా.. అన్ని బస్సులను కూడా ఈ సభకు తీసుకెళ్లాలని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో ఉన్న 520 బస్సులను తీసుకెళ్లాలని భావిస్తున్నా రు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా.. ఒ క్కో డిపోకు 50 నుంచి 60 వరకు బస్సులను కేటాయిస్తామని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. -
ముందస్తు ఉత్కంఠ
రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే సంకేతాల నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో కదలిక మొదలైంది. వచ్చే నెలలోనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జహీరాబాద్ మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ నేతలే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగులను పక్కన పెట్టి తమకు టికెట్ దక్కుతుందనే ఆశ కొందరు అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ‘ముందస్తు’ హడావుడితో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు. ప్రధాన విపక్ష పార్టీల్లో మాత్రం అలాంటి సందడి ఎక్కడా కనిపించడం లేదు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర శాసనసభను వచ్చే నెలలో రద్దు చేసి అధికార టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే సంకేతాలు వస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే ‘ప్రగతి నివేదన’ సభ అనంతరం ముందస్తు ఎన్నికల దిశగా పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రగతి నివేదన సభ తర్వాత పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామనే సీఎం ప్రకటన నేపథ్యంలో పూర్వపు మెదక్ జిల్లా పరిధిలో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. జహీరాబాద్ అసెంబ్లీ స్థానం మినహా మిగతా అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు మెదక్, జహీరాబాద్ ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ద్వారా ‘క్లీన్ స్వీప్’ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కొంతకాలంగా కొత్త జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సమీక్షల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తితో దూరంగా ఉంటున్న నేతలు పార్టీ వీడకుండా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ద్వితీయ శ్రేణి నాయకులు, క్రియాశీల నేతలతో నేరుగా సంబంధాలు నెరుపుతున్నారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా ఎన్నికల నాటికి అందరినీ సమన్వయం చేసి ఫలితం రాబట్టాలనేది మంత్రి వ్యూహంగా కనిపిస్తోంది. టికెట్ల వేటలో ఔత్సాహికులు జహీరాబాద్ అసెంబ్లీ స్థానం మినహా మిగతా అన్ని చోట్లా టీఆర్ఎస్ పార్టీ నేతలే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగులందరికీ వచ్చే ఎన్నికల్లో తిరిగి టికెట్ కేటాయిస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తాజాగా మాత్రం అంతర్గత సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని వ్యాఖ్యానించడంతో కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేని చోట తమకు అవకాశం దక్కుతుందని భావిస్తున్న ఔత్సాహిక నేతలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజవర్గం పరిధిలో కొత్త అభ్యర్థిని టీఆర్ఎస్ తెరమీదకు తెస్తుందనే ప్రచారం జరుగుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాణిక్‌రావు కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చినా, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని మార్చుతారని భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అందోలు, నర్సాపూర్, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థిని మార్చుతారనే ప్రచారం సాగుతోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, జర్నలిస్టు యూనియన్ నేత క్రాంతి కిరణ్ టికెట్ ఆశిస్తూ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ నడుమ పొత్తు కుదిరితే నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు పెనుమార్పులకు లోనవుతాయని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్, ఆయన సతీమణి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఈ నెల మొదటి వారంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడంతో సంగారెడ్డి టీఆర్ఎస్ రాజకీయాలు చర్చనీయాంశమయ్యాయి. ఇతర పార్టీల్లో కానరాని సందడి ముందస్తు ఎన్నికల నిర్వహణపై సీఎం సంకేతాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో సందడి మొదలైంది. విపక్ష పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల్లో మాత్రం రాజకీయ కార్యకలాపాలు పెద్దగా ఊపందుకున్న దాఖలాలు కనిపించడం లేదు. విపక్ష పార్టీలకు చెందిన కొందరు బడా నేతలు టీఆర్ఎస్ గూటికి చేరుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరిద్దరు నేతలు మాత్రం చాప కింద నీరులా అసెంబ్లీ ఎన్నికల దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అరడజనుకు పైగా నియోజకవర్గాల్లో బహుళ, బలహీన నాయకత్వం కాంగ్రెస్‌కు ఆటంకంగా మారేలా ఉంది. నారాయణఖేడ్, పటాన్చెరులో కొంత మేర టీడీపీ ఓటు బ్యాంకును కలిగి ఉన్నా, ఇతర నియోజకవర్గాల్లో నామమాత్ర కేడర్ కూడా లేదు. కార్మిక వర్గం ఓట్లపై ఆధారపడి సీపీఎం, తెలంగాణ వాదంపై తెలంగాణ జన సమితి ఎన్నికల దిశగా అభ్యర్థుల కోసం వేట సాగిస్తోంది. -
పాసవుతామా..!
జనామోదం ఉన్నవారికే టికెట్లు ఇస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటన ఆ పార్టీ ఎమ్మెల్యేలలో గుబులు రేకెత్తిస్తోంది. 2014లో అధికారం చేపట్టనప్పటి నుంచి ఇప్పటివరకు తొమ్మిదిసార్లు సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి.. శాసనసభ్యుల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. సర్వే ఫలితాలను ఎమ్మెల్యేలకు వివరిస్తూ పనితీరులో వెనుకబడ్డవారికి క్లాస్ తీసుకుంటున్నారు. అలాగే పాస్‌మార్కులకు దగ్గరగా ఉన్నవారికి పలు సూచనలు చేస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమిటి? శాసనసభ్యుడి పనితీరు పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది? ప్రభుత్వ పాలన, సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజానాడి ఎలా ఉంది? అనేది విశ్లేషించనున్నారు. దీనికి అనుగుణంగా లభించే మార్కుల మేరకు అభ్యర్థిత్వాలు ఖరారయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎమ్మెల్యేల పనితీరుపై, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. సామాజికవర్గాల వారీగా ప్రజల మనోగతం తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి.. ప్రైవేటు ఏజెన్సీల నుంచే కాకుండా నిఘా వర్గాలు ఇచ్చే సమాచారాన్ని కూడా క్రోడీకరించుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే మూడు నెలలకోసారి శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తూ సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల జట్టు కూర్పుపై కసరత్తు చేస్తున్న గులాబీ అధిష్టానం చివరి సర్వేను వారం రోజుల్లో ప్రకటించే దిశగా ఆలోచన చేస్తోంది. వాస్తవానికి ఈ నెల 17న ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మరణంతో ఈ సమావేశాన్ని రద్దుచేసింది. ‘ముందస్తు’ సంకేతాలతో.. షెడ్యూల్ కంటే ముందుగానేఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ తరహా సంకేతాలివ్వడం.. సెప్టెంబర్ నెలలోనే 80శాతం టికెట్లను ప్రకటిస్తామనడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. అంతేగాకుండా సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ నిర్వహించాలని నిర్ణయించడం.. 25 లక్షల మందితో ఈ సభ జరపాలని భావిస్తుండడం చూస్తే ఈ బహిరంగ సభలోనే ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సభలో మెజార్టీ టికెట్లను ప్రకటిస్తామని చేసిన ప్రకటన అధికార పార్టీలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. డిసెంబర్‌లోపు శాసనసభ ఎన్నికలను పూర్తిచేయడమే లక్ష్యంగా పావులు కదుపుతుండడం.. నియోజకవర్గాలకే పరిమితం కావాలని ఎమ్మెల్యేలకు సూచిస్తుండడంతో గులాబీ దళంలో ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో పెండింగ్ పనులను పూర్తిచేసేందుకు ప్రజాప్రతినిధులు యంత్రాంగంపై ఒత్తిడి పెంచారు. ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లనున్నందున ప్రజావ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఫైనల్ సర్వే ఇదే..? త్వరలో జరుగనున్న శాసనసభాపక్ష సమావేశంలో సర్వే వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించే అవకాశముంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన పక్షంలో ఇదే సర్వే కానుంది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా ప్రజాభిప్రాయం సేకరించిన ముఖ్యమంత్రి.. ఫలితాలను మదింపు చేశారు. దీనికి అనుగుణంగా ఆయా నియోజకవర్గాల రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనున్నారు. ఈ సర్వేలో మెరుగైన ఫలితాలు కనబరిచిన వారి టికెట్లకు ఢోకాలేకున్నా వెనుకబడ్డవారికి రిక్తహస్తమే మిగలనుంది. సర్వే నివేదిక ఆధారంగా ఏయే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగుంది? శాసనసభ్యుడి పనితీరు పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది? ప్రభుత్వ పాలన ముఖ్యమంత్రి సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజా నాడి ఎలా ఉంది? అనేది విశ్లేషించనున్నారు. దీనికి అనుగుణంగా లభించే మార్కుల మేరకు అభ్యర్థిత్వాలు ఖరారయ్యే ఛాన్స్ ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ పాస్ మార్కులు కూడా లభించని శాసనసభ్యులకు టికెట్టు ఎందుకు నిరాకరించదలిచామో విడమరిచి చెప్పే అవకాశంలేకపోలేదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి అభ్యర్థిత్వాలపై మరో నెల రోజుల్లో క్లారిటీ రానుంది. ఈ వారంలో జరిగే ఎల్పీ మీటింగ్ వచ్చే ఎన్నికలకు నాంది పలికే అవకాశం కనిపిస్తోంది. ఎందుకు ముందుగా రణక్షేత్రంలోకి వెలుతున్నామనే అంశంపై కూడా స్పష్టత ఇచ్చే వీలుంది. -
టికెట్ టెన్షన్!
టీఆర్ఎస్ శాసనసభ్యుల గుండెల్లో గుబులు మొదలైంది.. సిట్టింగ్‌లకే సీట్లిస్తామన్న సీఎం కేసీఆర్.. ఒకటి, రెండు చోట్ల మార్పులు తప్పవని చేసిన ప్రకటన అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆందోళనకు గురి చేస్తోంది. ‘ఒకటి, రెండు మార్పులు’ అన్న అంశంపైనే ప్రధానంగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఎవరి సీట్లు గల్లంతవుతాయి.. ఎవరికి టికెట్లు దక్కుతాయనే అంశంపైనే ప్రధాన చర్చ నడుస్తోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకవైపు ఆనందం, మరోవైపు ఒకింత ఆందోళన నెలకొంది. సిట్టింగ్‌లకే సీట్లని సీఎం కేసీఆర్ ప్రకటించడం వారిలో సంతోషం నింపగా.. ఒకటి, రెండు మార్పులుంటాయని ఆయన కుండబద్దలు కొట్టడం శాసన సభ్యులను కలవరపెడుతోంది. సెప్టెంబర్‌లోనే అభ్యర్థుల తొలి జాబి తా విడుదల చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో అధికార పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే, ‘ఒకటి, రెండు మార్పులు’ అన్న అంశంపైనే ప్రధానంగా ఈ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఎమ్మెల్యేలకు టికెట్ టెన్షన్ పట్టుకుంది. సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని పేర్కొన్న కేసీఆర్.. మరోవైపు ఒకటీ రెండు చోట్ల మార్పులుంటాయనే సంకేతాలివ్వడం తెలిసిందే. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు అభ్యర్థిత్వంపై ఎక్కడో ఒకింత అభద్రతాభావంతో ఉన్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆ మార్పు చేయాలని భావిస్తున్న సీట్లలో ఉమ్మడి జిల్లాకు చెందిన నియోజకవర్గాలేమైనా ఉంటాయా..? అనే అంశంపై పార్టీలో విశ్లేషణ సాగుతోంది. అభ్యర్థుల ఎంపికలో కేశవరావు నేతృత్వంలోని పార్టీ ప్రధాన కార్యదర్శు లు, కార్యదర్శులతో ఎప్పటికప్పుడు తెప్పించుకు నే నివేదికలు కూడా కీలకమని కేసీఆర్ పేర్కొన్నా రు. దీంతో సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు అంటూనే ఎంపిక కమిటీని నియమించడంతో కొందరు ఎమ్మెల్యేలకు అంతర్గతంగా టెన్షన్ పట్టుకుంది. కొందరు ఎమ్మెల్యేల్లో టెన్షన్! 2014 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా గులాబీ జెండాను ఎగురవేసింది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన సీనియర్ నేతలున్న కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఖాతా కూడా తెరువలేక పోయింది. నిజామాబాద్ అర్బన్ వంటి పలు నియోజకవర్గాల్లో కొంత పట్టున్న బీజేపీ సైతం ఉనికి చాటుకోలేక పోయింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా గత ఫలితాలనే పునరావృతం చేయాలని అధికార పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వ, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహించుకుని వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆరు నెలల ముందుగానే అభ్యర్థుల ప్రకటన చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. మొత్తం మీద పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రకటన పార్టీ శ్రేణుల్లో ఎన్నికల ఉత్సాహాన్ని నింపగా, ఎమ్మెల్యేల్లో మాత్రం టెన్షన్ మొదలైందనే చర్చ గులాబీ దళంలో సాగుతోంది. మొదటి విడతలో ఖరారయ్యేదెవరికి..? సెప్టెంబర్‌లోనే టిక్కెట్లు ఖరారు చేయడం ద్వారా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మరింతగా ప్రజలతో మమేకం అయ్యేందుకు అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో మొదటి విడతలో ఖరారయ్యే స్థానాలు మూడు నుంచి నాలుగు ఉండే అవకాశాలున్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మొదటి విడతలో ఎవరి స్థానం ఉంటుందా అని టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. సమాజిక సమీకరణాలు, ఎలాంటి వివాదాలు లేని నియోజకవర్గాలు, అలాగే టిక్కెట్ కోసం పోటీ పడే నేతలు లేని నియోజకవర్గాలకు మొదటి జాబితాలో చోటు దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు, వివాదాల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నయంగా ఇతర నేతలు తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. -
‘డేంజర్ జోన్’లో ఎవరో..?!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ‘మీ నియోజకవర్గాల్లో మీకు విపత్కర పరిస్థితులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటే మిమ్మల్సి ఎవరూ రక్షించలేరు’ అంటూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించిన చేసిన ఎమ్మెల్యేలు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 మందిలో కొందరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారన్న ఆ ఐదుగురు ఎవరు? మూడు విడతల సర్వేలో వారి పనితీరును కళ్లకు కట్టిన అధినేత ఈసారి గట్టిగానే మందలించారా? ఒక సందర్భంలో ‘సిట్టింగ్’లకే మళ్లీ అవకాశం ఇస్తామన్న ఆయన తాజా సర్వేలతో వైఖరి మార్చుకోనున్నారా? ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ‘డేంజర్ జోన్’ ఎమ్మెల్యేలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనక తప్పదా? అనే అంశాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చగా మారాయి. తాజాగా గులాబీ దళపతి కేసీఆర్ 39 నియోజకవర్గాల్లో అక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు విపత్కర పరిస్థితులు ఉన్నాయం టూ హెచ్చరించిన ట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలకుగాను జగిత్యాల మినహా 12 స్థానాల నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఐదుగురి పేర్లు డేంజర్ జోన్లో ఉన్నట్లు వినిపిస్తుండగా.. కొంద రు ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడిన కేసీఆర్.. మరికొందరు ఎమ్మెల్యేలకు మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్‌తో చెప్పించినట్లు సమాచారం. దీంతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడున్న స్థానాలన్నింటినీ కైవసం చేసుకోవాలన్న వ్యూహంతో ఉన్న కేసీఆర్ ‘డేంజర్ జోన్’ ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా పరిణామాలు ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, అటు కేడర్‌లో హాట్‌టాఫిక్‌గా మారాయి. ప్రామాణికంగా మూడు విడతల సర్వేలు టీఆర్ఎస్ శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత 2015–16లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ మొదట సర్వే జరిపించారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి వరకూ మరో రెండు విడతల సర్వే నిర్వహించారు. మొదటి, రెండో విడతల ఫలితా లు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఆ సమావేశంలోనే ర్యాంకులు, మార్కులను ప్రకటించారు. తొలి సర్వేలో మంచి మార్కులు కొట్టేసిన వారు కూడా రెండో, మూడో సర్వే నాటికి వెనుకబడిపోగా.. మరికొందరు మెరుగుపర్చుకున్నట్లు తేల్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన ఈ సర్వేలో హుజూరా బాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రజలు ఫస్ట్ ర్యాంకు ఇచ్చారు. తొలి సర్వేలో మంత్రి 73.50 శాతంగా ఉంటే... రెండో సర్వే నాటికి ఆయన పనితీరు 89.90 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తొలి సర్వేలో 42.60 శాతం మార్కులు రాగా, రెండో సర్వేలో 47.30కి పెరిగింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ 70.60 శాతం నుంచి 60.40కు పడిపోయింది. తొలి, రెండో సర్వేలతో పోలిస్తే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాలుగు శాతం పెరగగా.. మిగతా ఎమ్మెల్యేల్లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు మార్కులు తగ్గాయి. అదే వరుసలో రామగుండం ఎమ్మె ల్యే సోమారపు సత్యనారాయణ, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఆ తర్వాత కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఉన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే శోభ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి భారీగా తగ్గారు. మూడో విడత సర్వే కూడా జరిగినప్పటికీ గోప్యంగా వ్యవహరించిన అధినేత... సర్వే ఫలితాలను ఒక్కొక్కరికీ వ్యక్తిగతంగా వివరించినట్లు అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ‘రైతుబంధు’ తర్వాత జరిగిన కీలక సర్వే రైతుబంధు పథకం అమలు తర్వాత జరిగిన సర్వేలు, వివిధ మార్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికల్లో వచ్చిన సమాచారం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ సర్వేలలో వచ్చిన ఫలితాలతో ఒక దశలో సీఎం కేసీఆర్ షాక్‌కు గురయినట్టు కూడా ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని, ప్రత్యర్థి పార్టీలకు కనీసం పోలింగ్ ఏజెంట్లు కూడా లేరని కేసీఆర్ చుట్టున్న నాయకులు చెప్పుకుంటున్న తరుణంలో సర్వేలు భిన్నంగా రావడంపై తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్కు ఉన్న 90 మందిలో 39 మంది డేంజర్ జోన్లో ఉన్నారంటూ నివేదికలు అందడం.. ఉమ్మడి జిల్లాలో ఐదుగురి పేర్లు ప్రచారంలోకి రావడం ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది. మొదటి విడత సర్వేకు.. రెండు, మూడు సర్వేలకు తేడా పోలిస్తే మెరుగ్గా ఉన్నవారితోపాటు గ్రాఫ్ తగ్గిన పలువురి పరిస్థితి కూడా మెరుగైనట్లు తేలింది. ఈ నేపథ్యంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ ఒకటి, అర మినహాయిస్తే ‘సిట్టింగ్’లు అందరికీ టిక్కెట్లు ఇస్తామనే చెప్పారు. మూడేళ్ల కాలంలో నిర్వహించిన మూడు సర్వేలతోపాటు, రైతుబంధు తర్వాత తెప్పించుకున్న నివేదికల వరకు పరిస్థితి మెరుగుపడని వారిని అధినేత ‘డేంజర్ జోన్’లో చేర్చినట్లు చెప్తున్నారు. ఈ కేటగిరి కింద ఐదుగురు ఎమ్మెల్యేలు వస్తున్నారని, ఆ ఐదుగురిలో కొందరితో నేరుగా మాట్లాడిన ముఖ్యమంత్రి, మరికొందరితో మంత్రులు రాజేందర్, కేటీఆర్ మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ ఇటూ పార్టీ వర్గాల్లో, అటు రాజకీయ విశ్లేషకుల్లో కలకలం రేపుతోంది. ఇంత జరిగినా వారి పరిస్థితి మారకపోతే త్వరలోనే ఆ వివరాలు కూడా వెల్లడి కావచ్చన్న చర్చ జరుగుతోంది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక
-
డేంజర్లో ఉన్నారు జాగ్రత్త : సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారా? పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో వారంతా గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదా? ఈ జాబితాలో పలువురు చైర్మన్లు, ప్రభుత్వ విప్‌లతోపాటు ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారా? ఇందుకు అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు! నియోజకవర్గాల్లో విపత్కర పరిస్థితులున్నాయంటూ ఆ 39 మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించినట్టుగా తెలిసింది. వీరిలో కొందరితో కేసీఆరే నేరుగా మాట్లాడారు. మరికొందరు ఎమ్మెల్యేలకు వారికి దగ్గరగా ఉన్న మంత్రులతో చెప్పించారు. మంత్రులు కేటీఆర్, టి.హరీశ్‌రావు సన్నిహితులకు వారితోనే ఈ విషయాన్ని చెప్పించినట్టుగా సమాచారం. పార్టీకి, ఎమ్మెల్యేలకు ఆదరణ ఎక్కువగా ఉందని అంచనా వేసుకుంటున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ పలువురు సీనియర్ల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని కేసీఆర్‌కు నివేదికలు అందాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అయితే ఎక్కువ మంది పనితీరుపై వ్యతిరేకత ఉండగా.. కొందరి పరిస్థితి చాలా దారుణంగా ఉందని వివిధ సర్వేల నివేదికల ద్వారా తేలింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తేలిన 39 మందికి హెచ్చరికలు జారీ అయ్యాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటే ఎవరూ కాపాడలేరని సీఎం స్పష్టంగా చెప్పారు. 100 సీట్లపై ధీమా : గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 మంది ఎమ్మెల్యేలను గెల్చుకుని అధికారం చేపట్టింది. తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేల అకాల మరణం (నారాయణఖేడ్, పాలేరు) కారణంగా వచ్చిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలనూ టీఆర్ఎస్ గెల్చుకుంది. టీడీపీ(12), కాంగ్రెస్(7), వైఎస్సార్ కాంగ్రెస్(3), బీఎస్పీ(2), సీపీఐ(1) నుంచి మొత్తం 25 మంది టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 90 మందికి చేరింది. రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్న 90 మంది ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గకుండా గెల్చుకోవాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఇందుకు రాష్ట్రంలో అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేస్తున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, రైతుబంధు, రైతు బీమా వంటి భారీ బడ్జెట్‌తో కూడిన పథకాలను అమలు చేస్తున్నారు. వీటితోపాటు పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వీటితో టీఆర్ఎస్కు తిరుగులేని ఆధిక్యత వస్తుందన్న విశ్వాసంతో కేసీఆర్ ఉన్నారు. వీటి భరోసాతోనే కనీసం 100 స్థానాలు గెలుస్తామని బహిరంగ సమావేశాల్లో ముఖ్యమంత్రి చెబుతున్నారు. కనీసం ఇప్పుడున్న 90 సంఖ్యను తగ్గకుండా గెలుస్తామని అంతర్గత సమావేశాల్లో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏం తేలింది? రైతుబంధు పథకం అమలు తర్వాత జరిగిన సర్వేలు, వివిధ మార్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికల్లో వచ్చిన సమాచారంతో సీఎం కేసీఆర్ షాక్‌కు గురయినట్టు టీఆర్ఎస్ ముఖ్యులు వెల్లడించారు. టీఆర్ఎస్కు ఉన్న 90 మందిలో 39 మంది డేంజర్ జోన్లో ఉన్నారంటూ నివేదికలు అందాయి. నియోజకవర్గంలో అంతా తమదే రాజ్యం అని, ప్రత్యర్థి పార్టీలకు కనీసం పోలింగ్ ఏజెంట్లు కూడా లేరని కేసీఆర్ చుట్టున్న నాయకులు చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లోనూ క్షేత్రస్థాయి పరిస్థితులు ఆశ్చర్యానికి గురి చేసినట్టుగా తెలిసింది. వీరిలో ఇద్దరు మంత్రులు కూడా ఉండటంతో కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన పలు కార్పొరేషన్ చైర్మన్లు, విప్ల పరిస్థితి అయితే పార్టీకి ఉన్న ఆదరణలో సగం కూడా లేదని తేలింది. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై వివిధ కారణాలతో పార్టీ శ్రేణులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, తటస్థులు వ్యక్తిగతంగా ఆగ్రహంతో ఉన్నారని తేలింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదమని చెబుతూ 39 మంది ఎమ్మెల్యేలకు రాతపూర్వకంగా నివేదికల వివరాలను పంపించినట్టుగా తెలిసింది. నియోజకవర్గాల్లో ఏయే కారణాల వల్ల వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మండలాల వారీగా అందించారు. ఇలా ఉంటే కష్టమే.. ఎమ్మెల్యేల పనితీరుపై హెచ్చరికతో కూడిన నివేదికను పంపించడంతోపాటు పార్టీ ముఖ్యులను ఆయా ఎమ్మెల్యేలతో మాట్లాడాలని కేసీఆర్ ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడి హెచ్చరించారు. ‘‘పార్టీ పనితీరుపై మీ నియోజకవర్గం సానుకూలంగా ఉంది. ఎమ్మెల్యేగా మాత్రం మీపై వ్యతిరేకత ఉంది. పార్టీ పనితీరుకు ఉన్న ఆదరణలో సగం కూడా మీకు లేదు. ఇది వ్యక్తిగతంగా మీకు మాత్రమే కాకుండా పార్టీకి చాలా నష్టం. ఎమ్మెల్యేలు గెలిస్తేనే టీఆర్ఎస్కు అధికారం వస్తుందని గుర్తుంచుకోవాలి. మీ పనితీరు ఎలా ఉన్నా అభ్యర్థిగా మీకే అధికారం ఇచ్చి, టీఆర్ఎస్కు అధికారం వచ్చే అవకాశాలను వదులుకోలేం. మీకు ఏయే కారణాలతో వ్యతిరేకత పెరిగిందో, ఏయే వర్గాలు మీకు దూరమయ్యాయో స్పష్టంగా, నిర్దిష్టంగా అందిస్తున్నాం. మీరేం చేస్తారో మీ ఇష్టం. మీ పనితీరు మారకుంటే, ఆదరణ పెంచుకోకుంటే కష్టం’’ అని స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా సమాచారం. వ్యక్తిగతంగా పనితీరును ఎలా మార్చుకుంటారో, బలమెలా పెంచుకుంటారో నివేదిక ఇవ్వాలంటూ ఆ 39 మంది ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ అయినట్టుగా తెలిసింది. -
టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్ : శాసనసభ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో అధికార పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వాలను యథాతథంగా కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సభ్యుల బహిష్కరణ నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన శాసనసభకు సంబంధించినదని.. అది సభ మొత్తం కలసి తీసుకునే నిర్ణయమే తప్ప, ఏ సభ్యుడికీ వ్యక్తిగత హోదాలో అధికారంగానీ, హక్కుగానీ ఉండవని స్పష్టం చేసింది. అందువల్ల అప్పీలు దాఖలు చేయాల్సింది అసెంబ్లీ మాత్రమేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం సోమవారం 58 పేజీల తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పుపై.. శాసనసభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు హెడ్‌ఫోన్ విసిరి మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను గాయపరిచారం టూ.. అసెంబ్లీ తీర్మానం ద్వారా వారిని బహిష్కరించారు. అనంతరం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్టుగా నోటిఫికేషన్ కూడా జారీ అయింది. దీనిపై వెంకటరెడ్డి, సంపత్‌లు హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు.. బహిష్కరణ ప్రొసీడింగ్స్‌ను, నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. హైకోర్టు ధర్మాసనానికి అప్పీలు దాఖలు చేశారు. అయితే సింగిల్ జడ్జి విచారణ జరిపిన వ్యాజ్యంలో ఈ ఎమ్మెల్యేలెవరూ ప్రతివాదులు కానందున.. నిబంధనల మేరకు అప్పీల్ దాఖలు కోసం తమకు అనుమతి ఇవ్వాలంటూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో వారి అప్పీలు దాఖలుకు అనుమతించాలా, వద్దా అన్న అంశంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించగా.. కోమటిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. గత నెల 2న వాదనలు విన్న ధర్మాసనం.. తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది. 58 పేజీల ఈ తీర్పులో శాసనసభ అధికారాలు, హక్కులు, అసాధారణ అధికారాల గురించి సవివరంగా చర్చించింది. అసెంబ్లీకి మాత్రమే అధికారం ఉంటుంది.. సభ్యుడి బహిష్కరణ నిర్ణయం శాసనసభ ఉమ్మడి నిర్ణయమని, దానిని న్యాయస్థానాన్ని రద్దు చేస్తే అసెంబ్లీ మాత్రమే అప్పీల్ దాఖలు చేయాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. బహిష్కరణకు అనుకూలంగా తాము ఓటు వేశాం కాబట్టి.. సింగిల్ జడ్జి తీర్పు వల్ల తాము ప్రభావితమవుతున్నామని, అందువల్ల తమకు అప్పీల్ దాఖలు చేసే హక్కు ఉందన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాదన సరికాదని పేర్కొంది. ‘‘ఓ సభ్యుడిని బహిష్కరించాలా? వద్దా? అన్నది పూర్తిగా సభ పరిధిలోని వ్యవహారం. శాసనసభకు ఉండే హక్కులు, అధికారాలకు, సభ్యులకు ఉండే హక్కులు, అధికారాలకు మధ్య తేడా ఉంది. ఓ సభ్యుడిని బహిష్కరించే విషయంలో ప్రత్యేకాధికారాలు, హక్కులు శాసనసభకు మాత్రమే ఉన్నాయా? లేక దాని సభ్యులకు కూడా ఉన్నాయా? అన్నది ప్రధాన ప్రశ్న. అయితే ఏ రకంగా చూసినా.. ఓ సభ్యుడి బహిష్కరణ అన్నది సభ ఉమ్మడి నిర్ణయమే అవుతుందే తప్ప.. సభ్యుల వ్యక్తిగత హక్కుకు సంబంధించింది కాదు..’’.. అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక రాజ్యాంగంలోని అధికరణ 194 (4) ప్రకారం సభలో మాట్లాడే, సభ ప్రొసీడింగ్స్‌లో పాల్గొనే హక్కు ఉన్న వారందరూ శాసనసభ సభ్యులే అవుతారన్న వాదనను ప్రస్తావించింది. ఆ లెక్కన అధికరణ 177 ప్రకారం రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కు సైతం (ఓటు హక్కు తప్ప) సభలో మాట్లాడే, ప్రొసీడింగ్స్‌లో పాల్గొనే హక్కు ఉంటుందని.. కాబట్టి స్పీకర్ లేదా అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేయనప్పుడు ఏజీకి అప్పీల్ చేసే అధికారం ఉంటుందని తెలిపింది. వాస్తవానికైతే ఏజీ ఇలా అప్పీల్ దాఖలు చేయడానికి కూడా వీల్లేదని పేర్కొంది. స్పీకర్‌గానీ, కార్యదర్శిగానీ అప్పీల్ చేయాలి ప్రస్తుత వ్యవహారంలో 12 మంది ఎమ్మెల్యేలు సభ ఉమ్మడి నిర్ణయానికి మద్దతు తెలిపారని.. అయితే ఇలా మద్దతు తెలిపినవారి అప్పీల్‌ను అనుమతిస్తే, సభ నిర్ణయానికి మద్దతు తెలపని వారి అప్పీల్‌ను సైతం అనుమతించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘బహిష్కరణ తీర్మానాన్ని సభ్యులందరూ కలిసి చేసినప్పుడు, దానిని కోర్టు రద్దు చేస్తే.. సభే ప్రభావిత వ్యక్తి అవుతుంది. అంతేతప్ప కొందరు సభ్యులో, సభ్యుల బృందమో ప్రభావిత వ్యక్తి కిందకు రాదు. ఇలా సభ మొత్తంగా పరిగణనలోకి వచ్చినప్పుడు స్పీకర్ లేదా అసెంబ్లీ కార్యదర్శి మాత్రమే అప్పీల్ దాఖలు చేయాల్సి ఉంటుంది..’’అని పేర్కొంది. ఈ మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. -
ప్రొటోకాల్‌కే ‘పెద్దలు’ అయ్యో పాపం ఎమ్మెల్సీ!
‘పేరుకు పెద్దల సభ. కానీ మండల స్థాయిలో చిన్న అధికారి కూడా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే కంటే ప్రొటోకాల్ పెద్దదే. అయినా ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఎక్కడా అడుగుపెట్టలేని పరిస్థితి. సీడీపీ నిధుల నుంచి చిన్న సిమెంట్ రోడ్డు వేద్దామన్నా ఎమ్మెల్యే పర్మిషన్ ఉండాల్సిందే. ఏ విషయంలోనూ సొంతంగా నిర్ణయం తీసుకోలేని నిస్సహాయత. పేరుకు పెద్ద పదవి ఉన్నా ఎవరినీ ఆదుకునే అవకాశం లేదు’ – రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ ఆవేదన ‘‘నియోజకవర్గంలోని ఓటర్లతో నేరుగా ఎన్నికయ్యాను. నాకు తెలియకుండా నా నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పెత్తనం చేస్తానంటే ఎలా? ఏ గ్రామంలో ఎవరేం పని చేశారో, ఇప్పుడేం చేస్తున్నారో నాకు తెలుసు. ఒక ఎమ్మెల్సీ వచ్చి నన్ను లెక్కపెట్టకుండా రోడ్డు పనో, మరో పనో ఇచ్చుకుంటూ పోతే నా మాటకు ఎవరు విలువ ఇస్తరు? నాకు తెలియకుండానే నియోజకవర్గంలో పనులు అవుతున్నాయంటే నేనెందుకు?’’ – ఇదీ అధికార పార్టీ ఎమ్మెల్యేల వాదన సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య జరుగుతున్న అధికార యుద్ధం ఇదీ! వీరేకాదు.. ఎమ్మెల్యేలతో ఎంపీలు, జెడ్పీలకు కూడా పొసగడం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన, పార్టీ అంతర్గత వ్యవహారాలు.. ఇలా ఏ అంశమైనా ఇదే పరిస్థితి ఉంటోంది. కొన్ని జిల్లాల్లో అయితే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఇది తలనొప్పిగా మారుతోంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల మధ్య పోరులో గులాబీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు నలిగిపోతున్నారు. కొన్ని నియోజకవర్గాలలో అయితే ఏకంగా నేతల మధ్య పరస్పరం పోలీసు కేసులు, దాడులు వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి విషయంలో ఇరువర్గాలను కూర్చోబెట్టి సమన్వయం చేసే యంత్రాంగం పార్టీలో లేకుండా పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గు గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన పలువురు నేతలకు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వలేకపోయామని, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని బట్టి చూద్దామంటూ పార్టీ భరోసా ఇవ్వడంతో పలువురు ఎమ్మెల్సీగా అవకాశం తీసుకున్నారు. ఇలాంటివారి విషయంలో యుద్ధం తీవ్రస్థాయిలో ఉంది. వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సర్కారు కూడా ఎమ్మెల్యే మాటకే విలువ ఇస్తోంది. ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యే నిర్ణయమే ఫైనల్ అని సీఎం కేసీఆర్ స్పష్టంగా ఆదేశాలిచ్చారు. గతంలో పలుమార్లు జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశాలతోపాటు బహిరంగంగా కూడా సీఎం ఈ మేరకు సూచనలు చేశారు. ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనలు, అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకోవాలని నిర్దేశించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కూడా ఎమ్మెల్యేకు తెలియకుండా ఏ నియోజకవర్గంలోనూ జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు. ఈ ఆదేశాలతో తమ పరిస్థితి మరింత దీనంగా తయారైందని ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఎమ్మెల్సీలను ఎందుకు పట్టించుకోవాలనే ధోరణిలో ఎమ్మెల్యేలు ఉన్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ‘‘పటేల్, పట్వారీలు నా పట్టు. నన్ను ఎట్లా కొడతవో కొట్టురా మొగుడా’’అన్నట్టుగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని శాసన మండలిలో సీనియర్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. పోలీస్ స్టేషన్లో, రెవెన్యూ కార్యాలయాల్లోనూ చిన్న పనులు చెప్పినా కావడం లేదని పలువురు మండలి సభ్యులు వాపోతున్నారు. మండల స్థాయిలోని చిన్న అధికారులు కూడా తమ మాటలను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ‘‘నెల జీతం, సౌకర్యాలు, గన్‌మన్ వంటివి తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. నన్ను నమ్ముకున్నవారికో, ప్రజలకో ఏదైనా చేస్తాననే విశ్వాసం కూడా లేకుండా పోయింది. పేరుకు పదవి ఉన్నా ఎలాంటి సంతృప్తి లేదు’’అని ఓ ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నియోజకవర్గంలో ప్రత్యక్షంగా ఎమ్మెల్యేగా గెలవాలంటే ఎన్నో ఆటుపోట్లు అధిగమించాల్సి వస్తుందని ఎమ్మెల్యే అంటున్నారు. గ్రామ స్థాయిలో నుంచి ఎవరేమిటో, వారికేం చేయాలో, ఎవరిని ఎక్కడ అదుపులో పెట్టుకోవాలో ప్రత్యక్షంగా తమకున్న అనుభవం, ఇబ్బంది ఎమ్మెల్సీకి ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమస్యలున్న నియోజకవర్గాల్లో అటు ఎమ్మెల్యేలను, ఇటు ఎమ్మెల్సీలను సమన్వయం చేయడంలో జిల్లా ఇన్చార్జి మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడెక్కడ.. ఎవరెవరు? - నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు, ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ టికెట్‌ను ఆశించిన భూపతిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్.. ఎమ్మెల్యే అవకాశాన్ని గోవర్ధన్‌కు ఇచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి టికెట్‌ను ఆశిస్తున్న వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే గోవర్ధన్ కోరిక మేరకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా సమావేశమై ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానించారు. - నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యే కె.ప్రభాకర్‌రెడ్డికి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మధ్య పొసగడం లేదు. మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఆశించిన కర్నెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి మధ్య సమన్వయంలో సమస్యలు వస్తున్నాయి. - ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మధ్య కూడా ఇలాంటి విభేదాలే ఉన్నాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా టి.రాజయ్య ఉండగా.. గతంలో ఇదే స్థానం నుంచి కడియం ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. - ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్న కొండా మురళి స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నాననే అసంతృప్తితో ఉన్నారు. పరకాల నియోజకవర్గంలో బలమైన అనుచరవర్గం ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కాదని ఏమీ చేయలేని పరిస్థితి ఉండటంతో లోలోన మధనపడుతున్నారు. అసంతృప్తిని బయటకు ప్రకటించకపోయినా ఎన్నికల సమయానికి పరిస్థితులు మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. - ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డికి మధ్య సమస్యలు వస్తున్నాయి. భూపాల్‌రెడ్డి పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఎంపీలు, జెడ్పీలదీ ఇదే పరిస్థితి.. ఎంపీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఎమ్మెల్యేల అనుమతి లేకుండా నియోజకవర్గంలో రూపాయి ఖర్చు పెట్టలేని దుస్థితిలో అధికార పార్టీ ఎంపీలు ఉన్నారు. ఎంపీకి చెందిన నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా ఎమ్మెల్యే ప్రతిపాదనల మేరకే కేటాయించాలని పార్టీ అధినేత నుంచి సూచనలున్నాయి. ఎమ్మెల్యేకు నచ్చకుంటే చిన్న పని కూడా చేయలేకపోతున్నామని ఎంపీలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాకు తామే బాస్ అయినా ఎమ్మెల్యేను కాదని అడుగు పెట్టే పరిస్థితి లేదని అటు పలువురు జెడ్పీ చైర్మన్లు కూడా ఆవేదన చెందుతున్నారు. నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలు నాయక్‌కు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ మధ్య ఇదే పరిస్థితి ఉంది. కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమతో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తో పొసగడం లేదు. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, ములుగు ఎమ్మెల్యే, మంత్రి చందూలాల్ పరస్పరం బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. -
సముద్రంలో నీటిబిందువు రేవంత్
-
సముద్రంలో నీటిబిందువు రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై అసెంబ్లీ మీడియా పాయింట్లో సోమవారం ఆసక్తికర చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డితో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎ.జీవన్‌రెడ్డిల మాటా ముచ్చట ఆసక్తిగా సాగింది. ముగ్గురి మధ్య.. ఏది ధర్మం.. ఏది న్యాయం.. అన్న పాయింట్ నుంచి మొదలైన సంభాషణ రేవంత్ చేరిక వరకు వెళ్లింది. ‘తెలంగాణ ఇచ్చినందుకు ధర్మం తప్పకుండా సోనియాగాంధీ ఇంటికెళ్లి కేసీఆర్ కలవటం న్యాయమే.. అయితే మా వాళ్లు ఎన్నికల్లో కలుపుకోకుండా తప్పు చేశారు’అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ‘మీరు కలుపుకోనందుకే టీఆర్ఎస్ గెలిచి.. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగింది’అని ముత్తిరెడ్డి బదులుగా స్పందించారు. ‘అవును నిజమే.. అదే ఇప్పుడు మాకు సమస్య అయింది’అంటూ జీవన్‌రెడ్డి అనడంతో ముగ్గురూ నవ్వుకున్నారు. అదే సమయంలో ‘రేవంత్‌రెడ్డిని ఎందుకు పెద్ద లీడర్ని చేస్తున్నారు..’అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ‘రేవంత్ కాంగ్రెస్‌లో చేరడం సముద్రంలో నీటి బిందువు చేరడం లాంటిదే..’అంటూ ముత్తిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎమ్మెల్యేల మాటలు విని జీవన్‌రెడ్డి నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. -
టీఆర్ఎస్కు మద్దతుగా ‘మీట్ అండ్ గ్రీట్’
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్‌లో నివసిస్తున్న కేసీఆర్, టీఆర్ఎస్ మద్దతుదారులు (కేటీఎస్‌యూకే) సోమవారం లండన్‌లో ‘మీట్ అండ్ గ్రీట్’పేరిట కార్యక్రమం నిర్వహించారు. కేటీఎస్‌యూకే నేత నగేశ్‌రెడ్డి కాసర్ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో.. సంస్థ సభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులతో పాటు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ తదితరులు అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాము చేపట్టిన కార్యక్రమాల గురించి నగేశ్‌రెడ్డి వివరించారు. ‘చేనేతకు చేయూతనిద్దాం నేతన్నకు మద్దతునిద్దాం..’ అనే నినాదంతో తాము కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వివిధ దేశాల్లో టీఆర్ఎస్ ఎన్నారై కార్యక్రమాలకు సీఎం కేసీఆర్, ఇతర నేతలు ప్రోత్సాహం ఇస్తున్నారని సంస్థ అధ్యక్షుడు సిక్కా చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా చేనేతను ప్రోత్సహించేందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నారైల అండదండలు ఉండాలని దేవీప్రసాద్ కోరారు. కేసీఆర్ చేనేత పరిశ్రమ కోసం వినూత్న పథకాలతో కృషి చేస్తున్నారన్నారు. ఇక హైదరాబాద్‌ను అంతర్జా తీయస్థాయి నగరంగా తీర్చిదిద్దేలా కృషి జరుగుతోందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. ఎక్కడా లేనివిధంగా టీఎస్ ఐ–పాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. తాను ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చానని, చేనేత అభివృద్ధికి తోడ్పడతానని ఎమ్మెల్యే కొండా సురేఖ చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు రామ్ చెప్యాల, శ్రీనివాస్‌రెడ్డి పింగళి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి!
-
ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి!
- వారి స్థానంలో ప్రత్యామ్నాయాలపై టీఆర్ఎస్లో విస్త్తృతంగా చర్చ - ప్రజాదరణ ఉన్న నేతల కోసం ఆరాలు - విపక్షాల్లోని బలమైన నేతలపైనా దృష్టి - జిల్లాల వారీగా జాబితాలపై కసరత్తు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ అధినేత అసంతృప్తిగా ఉన్నారా.. పదే పదే చెబుతున్నా కొందరు ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడకపోవడం, స్థానిక అధికార యంత్రాంగంపై పట్టు సాధించలేకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారా.. అలాంటి వారి స్థానంలో ప్రత్యామ్నాయాలు సిద్ధం చేయాలన్న అంతర్మథనం జరుగుతోందా..? ఈ ప్రశ్నలకు టీఆర్ఎస్ విశ్వసనీయ వర్గాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేసేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేయించారు. ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు, పార్టీ ఆదరణ అంశాలను బేరీజు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో విశ్లేషణ.. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ బలోపేతాన్ని పట్టించుకోకుండా సొంత పనులు, వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో కొన్ని మార్పులు అనివార్యమయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా కొందరు ఒక్కసారి ఎమ్మెల్యేలను వదిలించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో గెలుపు గుర్రాల ఎంపికపై ప్రాథమికంగా విశ్లేషణ జరుగుతోందని సమాచారం. ఇందులోభాగంగా ఆయా చోట్ల ప్రతిపక్షాల్లో బలమైన నాయకులుగా పేరున్న వారిపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా గతంలో టీఆర్ఎస్లోనే సమర్థులుగా పేరుతెచ్చుకుని వివిధ కారణాలతో బయటకు వెళ్లిపోయిన వారినీ తిరిగి తీసుకొచ్చే యోచన కూడా ఉన్నట్లు సమాచారం. పలు రకాలుగా విఫల ప్రయోగాలు చేసిన టీఆర్ఎస్ మాజీలు కొందరు రాజీబాటకు వచ్చి రాయబారాలు కూడా మొదలుపెట్టారని అంటున్నారు. అటు విపక్షాల తరఫున పోటీచేసి ఓడిపోయిన వారైనా సరే.. బలమైన నేతలుగా పేరున్న వారిని గులాబీ గూటికి ఆహ్వానించాలన్న యోచనలో నాయకత్వం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా జాబితాల తయారీకి కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. మరిన్ని చేరికలపై దృష్టి పూర్వపు ఆదిలాబాద్ జిల్లా పరిధిలో కనీసం రెండు మూడు నియోజకవర్గాల్లో మార్పు ఉండవచ్చని అంటున్నారు. దక్షిణ తెలంగాణలో ఓ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ఇక ఇదే జిల్లాలో ఒకరి తొలిసారి అవకాశమివ్వగా అంచనాల మేరకు పనిచేయలేకపోయారని, అనవసర విషయాలతో వివాదాస్పదమయ్యారని చెబుతున్నారు. ఆ ఎమ్మెల్యే స్థానంలో పొరుగునే ఉన్న మరో నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఖాళీ అయిన చోట కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరిని తీసుకొచ్చే పనిలో ఉన్నారని వినికిడి. ఇక ఓ మహిళా ఎమ్మెల్యే స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేను తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెదక్ జిల్లాలో సైతం ఓ మాజీ మంత్రి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ ఆ నేత పెడుతున్న డిమాండ్లతో ప్రతిష్టంభన నెలకొందని అంటున్నారు. ఇక్కడ పార్టీ కేడర్‌కు ఏమాత్రం అందుబాటులో లేని, అధికారులను అజమాయిషీ చేయలేకపోతున్న ఓ ఎమ్మెల్యే స్థానంలో ప్రత్యామ్నాయం కోసం వెదుకుతున్నారని సమాచారం. ఇక్కడ టీఆర్ఎస్ మాజీ నేత ఒకరు తనకు అవకాశమివ్వాలని కోరుతున్నారని.. చర్చలు జరిగినా ఇంకా ఒక ముఖ్యనేత గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. అటు హైదరాబాద్ పొరుగు జిల్లాలో ఒక మాజీ మంత్రిని తీసుకురావాలని సంప్రదింపులు జరిగాయని.. కానీ స్థానిక నేతలు అడ్డుపడి, ప్రస్తుత ఎమ్మెల్యేనే కొనసాగించాలని కోరడంతో తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. మొత్తంగా విపక్షాల్లోని కొందరు బలమైన నాయకులను, పార్టీ మాజీలను పార్టీలోకి ఆహ్వానించే ప్రక్రియ తెరవెనుక జోరుగానే సాగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎమ్మెల్యేలపై నమ్మకం లేకే ఈ సర్వే
హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి తన ఎమ్మెల్యేలపై నమ్మకం లేకపోవడం వల్లే సర్వేలని తెరపైకి తీసుకొస్తున్నారని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..మూడేళ్ల పాలనలో కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారని ప్రజలు పట్టం కడుతారని, యువతకు వెన్ను పోటు పొడిచినందుకా లేక , రైతులను గాలికి వదిలేసినందుకా అని సూటిగా ప్రశ్నించారు. 12 శాతం రిజర్వేషన్ అని ముస్లిం, ఎస్టీలను మోసం చేసినందుకు కేసీఆర్‌కి పట్టం కట్టాలా..? అని ద్వజమెత్తారు. సర్వేల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, దమ్ము ధైర్యం ఉంటే పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఎమ్యెల్యేలను తన చేతిలో పెట్టుకోడానికే ఈ సర్వే నాటకమాడుతున్నారని ఆరోపించారు. -
డీసీసీబీ చైర్మన్ జంగాపై వేటు!
⇔ వరంగల్ డీసీసీబీలో అక్రమాలు ⇔ చైర్మన్ రాఘవరెడ్డిపై సీఎంకు ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు ⇔ ప్రాథమిక విచారణలో అక్రమాల ధ్రువీకరణ.. ⇔ పాలకవర్గంపై వేటుకు సర్కారు మొగ్గు సాక్షి, హైదరాబాద్: అక్రమాల ఆరోపణలు వరంగల్ సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గం రద్దుకు దారి తీస్తున్నాయి. డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ సహకార శాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. డీసీసీబీలో అక్రమాలు, చైర్మన్ రాఘవరెడ్డి అవినీతిపై అదే జిల్లాకు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సహకార శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా విచారణ పూర్తి చేశారు. మార్చి 22న వరంగల్ డీసీసీబీ కార్యాలయానికి వచ్చి అధికారులు రికార్డులను పరిశీలించారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. విచారణ నివేదికలను సీఎం కార్యాలయానికి, హైదరాబాద్‌లోని నాబార్డు, ఆర్బీఐ అధికారులకు పంపారు. ప్రాథమిక విచారణ నివేదికలో అధికారులు పాలక వర్గాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. అక్రమాల్లో భాగస్వాములైన అధికారులపైనా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. విచారణ నివేదిక ఆధారంగా వరంగల్ డీసీసీబీ పాలకవర్గాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా సహకార చట్టంలోని 51 సెక్షన్ ప్రకారం కూడా విచారించాలని సహకార శాఖ ఉన్నతాధికారులు సోమవారం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నివేదిక రాగానే... పాలకవర్గాన్ని రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకోనుంది. జంగా రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మరో ఐదుగురు ఎమ్మెల్యేలతో కలసి డీసీసీబీలో అక్రమాలపై సీఎంకు ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రైతుల కోసం నాబార్డు కేటాయించిన రూ.50 లక్షల నిధులలో ఒక్క రూపాయి కూడా అన్నదాతలకు ఇవ్వకుండా రాఘవరెడ్డి మొత్తం తన పేరిటే తీసుకున్నారని, అలాగే కుటుంబ సభ్యులకు భారీగా ప్రయోజనం చేకూర్చేలా రుణాలు పొందారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాఘవరెడ్డి ప్రాతినిధ్యం వహించే దర్గా కాజీపేట సొసైటీలో కుటుంబీకులందరి పేరిట పంట రుణాలు, ఇతరుల పేరుతో బినామీ రుణాలు తీసుకున్నారని, మళ్లీ ఇవే భూములపై మార్టిగేజ్ రుణాలు పొందారని పేర్కొన్నారు. ఇలా ఎమ్మెల్యేలు మొత్తం 16 అంశాలపై ఫిర్యాదులు చేశారు. -
తేడా ఎక్కడ కొట్టింది!
► టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సొంత సర్వేలు! ► పార్టీ సర్వేపై ‘కౌంటర్ చెక్ ’ ► తమ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం ► పనితీరును బేరీజు వేసుకుంటున్న తక్కువ ర్యాంకు వచ్చిన ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు పలువురు సర్వే పనుల్లో మునిగిపో యారు. తమ పనితీరుపై స్వయంగా అంచనాకు వచ్చేందుకు వీరు సొంత సర్వేలపై ఆధారపడుతున్నారు. పనితీరును మెరుగుపర చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి పదేపదే చెబుతున్నా కొందరు ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టారని తెలుస్తోంది. ఈ విషయం కేసీఆర్ చేయించిన అంతర్గత సర్వేలలో తేటతెల్లం అయ్యిందన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. దీంతో తాము సొంతంగా సర్వేలు చేయించుకుని.. వచ్చిన ఫలితాలతో సీఎం సర్వే ఫలితాలను బేరీజు వేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కేసీఆర్ ఏకంగా ఏడాది సమయంలోనే రెండు సార్లు సర్వే చేయించారు. ఈ ఫలితాలను గత నెల 9వ తేదీన తెలంగాణభవన్‌లో జరిగిన టీఆర్ ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో వెల్లడించి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో వివరిం చారు. ఈ సందర్భంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని ఆయన ప్రకటిం చినా, సర్వేలో మార్కులు, ర్యాంకులు తక్కు వగా వచ్చిన ఎమ్మెల్యేలు నిద్రపోలేక పోతు న్నారని చెబుతున్నారు. తాము కష్టపడి పనిచే స్తున్నా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నా ఇలా ఎందుకు జరిగిందన్న అంశంపై ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైందని పేర్కొంటున్నారు. పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు ఇలా తక్కువ ర్యాంకు వచ్చిన ఎమ్మెల్యేలు పలువురు సొంతంగా సర్వేలు చేయించుకునే పనిలో పడ్డారు. సీఎం సిట్టింగులకే మళ్లీ టికెట్లు అని చెబుతున్నా, నియోజకవర్గంలో తమ పరిస్థితి బాగా లేకుంటే తీరా ఎన్నికల ముందు టికెట్‌కు ఇబ్బంది పడాల్సి వస్తుందని జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ప్రజల్లో సరైన ఆదరణ లేకున్నా, పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు సర్వే ఫలితాల్లో తేలడంతో ఎమ్మెల్యేలు ఆత్మరక్షణలో పడిపోతున్నారు. ఎమ్మెల్యేల అంతర్మథనం ‘అసలు ఎక్కడ బలహీనంగా ఉన్నాం? ప్రజలకు చేరువ కావటంలో ఎక్కడ తేడా వచ్చింది? సీఎం కేసీఆర్ చేస్తున్న సర్వేల్లో మార్కులు ఎందుకు తక్కువగా వచ్చాయి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటేగానీ మెరుగుపడలేం. మొదటి సర్వేలో మంచి మార్కులు, ర్యాంకు వచ్చింది. రెండో సారి సర్వేకు అంతా కిందా మీదా అయ్యింది.. అయినా నిజాలు తెలుసుకోవాలి కదా..’ అని ఒక ఎమ్మెల్యే సర్వేలపై వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ గాలిని తట్టుకుని ఆయా పార్టీల నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార పార్టీ గడపతొక్కారు. కానీ, తీరా సర్వేలో మాత్రం వారి పరిస్థితి ఏమాత్రం బావోలేదని, అదే పార్టీ పరిస్థితి మాత్రం మెరుగ్గా ఉందని ఫలితం తేలడంతో ఈ ఎమ్మెల్యేలు షాక్‌కు గురయ్యారు. సీఎం కేసీఆర్ సర్వేలో తీసుకున్న అంశాలపైనే సర్వే చేయించుకోవడం ద్వారా తమ గ్రాఫ్ ఎక్కడ పడిపోయిందో తెలుసుకోవచ్చని వీరు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ మళ్ళీ సర్వే చేసే నాటికి తమ పరిస్థితిని మెరుగుపరుచుకోవడం ద్వారా మంచి ర్యాంకు తెచ్చుకునేందుకే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మరో టెన్షన్
-
రుణమాఫీ మిగతా రైతులకు చేయరా?
కేంద్రానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రశ్న సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రైతుల రుణమాఫీకి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చి మిగిలిన రాష్ట్రా లను విస్మరించడం దారుణమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, బిగాల గణేశ్‌గుప్తా, చింతా ప్రభాకర్‌లు కేంద్రంపై ధ్వజమెత్తారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రైతుల పరిస్థితే మిటని ప్రశ్నించారు. ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలను ఒకే రకండా చూడాలని, దేశా భివృద్ధి రైతులపైనే ఆధారపడి ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడా రైతులు ఆనందగా లేరని, రైతులందరికీ ఒకే రకమైన జాతీయ విధానం ఉండాలని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రైతుల రుణమాఫీకి అవసరమైన రూ. 50వేల కోట్లను కేంద్ర భరించాలని నిర్ణయించడం చూస్తే.. మిగిలిన రాష్ట్రాల రైతులను వంచించడమేనని ఆయన ఆరోపించారు. దోపిడీకి గురైన తెలంగా ణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వ లేదన్నారు. కేంద్రం వెంటనే స్పందించి రూ. 17వేల కోట్లను ఇవ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఢిల్లీ వెళ్లి తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, రుణమాఫీ నిధులను సమకూర్చాలని కోరాల న్నారు. కేంద్రానిది సవతి తల్లి ప్రేమని గణేశ్‌గుప్తా ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే ప్రయోజనం చేసేలా కేంద్రం వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు. -
కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యేలు
-
ప్రతిపక్షాల వాకౌట్ సిగ్గుచేటు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మండిపాటు సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధగా అసెంబ్లీలో చర్చ జరుగుతోందని, సీఎం కేసీఆర్ అందరికీ సవివరంగా సమాధానం ఇస్తుంటే సభను ముగించిన తర్వాత పాత విషయంపైనే మళ్ళీ పట్టుపట్ట డం సరికాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, గాదరి కిశోర్ విపక్షాలపై మండిపడ్డారు. అయినా, గురువారం మళ్ళీ సభలో చర్చ సందర్భంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నా, ప్రతిపక్షాలు వాకౌట్ చేయడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ, సభలో సింగరేణి గురించి చర్చ జరుగుతుంటే వాళ్ల దగ్గర సబ్జెక్టు లేక బయటకు రావడం ఎంత వరకు సబబని నిలదీశారు. ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినందునే కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సభా సమయాన్ని వృధా చేయద్దని హితవు పలికారు. -
గీత దాటని అధికారపక్షం
- సీఎం ఆదేశాలు పక్కాగా అమలు - అసెంబ్లీలో తొలి రోజు నూరు శాతం హాజరు - సభ ముగిసే వరకు చివరిదాకా సీట్లలోనే ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అధినేత ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజైన శుక్రవారం ప్రతిఒక్కరూ సభకు హాజరయ్యారు. తొలి గంటన్నర సేపు జరిగిన ప్రశ్నోత్తరాలు, ఆ తర్వాత అరగంటపాటు జరిగిన జీరో అవర్‌లో పూర్తిస్థాయిలో పాల్గొన్నారు. సభలో ఎలా వ్యవహరించాలనే విషయం సహా వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ గురువారం చేసిన దిశానిర్దేశం మేరకు నడుచుకున్నారు. ఒక్క సభ్యుడూ సభ నుంచి బయటకు రాలేదు. టీ విరామ సమయంలోనూ వారు లాబీల్లోకి రాకుండా సీట్లకే అతుక్కుపోయారు. ప్రతిపక్ష సభ్యులు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని... దురుసుగా మాట్లాడొద్దని, నోరు జారొద్దని సీఎం చేసిన సూచనలు బాగానే పనిచేశాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరుగుతున్న సమయంలో ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడిన సందర్భంలో అధికారపక్ష సభ్యులు ఎదురుదాడికి దిగుతారేమోననే వాతావరణం కనిపించినా అంతా సంయమనం పాటించారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దుపై తానొక్కడినే మాట్లాడతానని సీఎం కేసీఆర్ ముందే ప్రకటించడంతో సభ్యులకు ఎవరికీ అవకాశం రాలేదు. ఉదయం 10 గంటలకు మొదలైన సభ మధ్యాహ్నం 3.15 గంటల దాకా జరిగింది. అసెంబ్లీలో ‘వ్యూహ కమిటీ’ భేటీ శాసనసభ, శాసన మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై మంత్రులతో కూడిన అసెంబ్లీ వ్యూహ కమిటీ శుక్రవారం అసెంబ్లీ ప్రారంభానికి ముందే సమావేశమైంది. శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు చాంబర్లో సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో ‘రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి’పై శాసన మండలిలో లఘు చర్చ గురించి ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కె. తారక రామారావు, తుమ్మల నాగేశ్వర్రావు, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమై చర్చించారు. మొత్తంగా ముందు అనుకున్న ప్రకారమే ఎక్కడా గీత దాటకుండా అధికార టీఆర్ఎస్ తొలిరోజు సభను ముగిచింది. -
ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కా రం, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి హితబోధ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వాటిలో ఎన్నింటిని పరిష్కరించారన్నది పరిశీలించుకోవాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై తొందరపాటు తగదని... ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా ప్రజల మౌలిక అవసరాలు, ప్రభుత్వ పాలన సరిగా అందేలా పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణలో తమ పార్టీ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తోందని... ప్రజలు, రైతులు, కార్మికుల సమస్యలపై, మహిళాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, వెల్లాల రామ్మోహన్, బండారు వెంకటరమణ, భగవంత్‌రెడ్డి తదితరులతో కలసి శ్రీకాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో ముందుకు సాగుతామన్నారు. తెలంగాణలో తమ పార్టీ బలంగానే ఉందని, వచ్చే ఎన్నికల్లో తమ పట్టు నిరూపించుకుంటామన్నారు. పార్టీ నుంచి కొందరు నాయకులు బయటకు వెళ్లారని, శ్రేణులు మాత్రం పార్టీ వెంటే ఉన్నాయన్నరు. టీఆర్ఎస్లో చేరిన వారంతా అభివృద్ధి కోసమే చేరామని చెబుతున్నారని.. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఏమాత్రం అభివృద్ధి జరిగిందో, ఎన్ని నిధులు ఖర్చు చేశారో చెప్పాలన్నారు. తమ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై అనేకసార్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. కానీ ఆ ఎమ్మెల్యేలు ఇచ్చిన విలీన పత్రంపై రాత్రికి రాత్రే నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిం చారు. ప్రస్తుతం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టామని, 18-28 తేదీల మధ్య అన్ని మండలాల్లో పార్టీ అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 9 జిల్లాల అధ్యక్షులను, 7 జిల్లాల్లో కమిటీలను నియమించామని వెల్లడించారు. -
'గొడవ చేయాలని ముందే వ్యూహం పన్నారు'
హైదరాబాద్: సభలో గొడవ చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంచెలంచెలుగా గొడవ చేయాలనివారు ముందే వ్యూహం పన్ని సభ కొనసాగకుండా కుట్ర చేశారని ఆరోపించారు. చేతనైతే గ్రామాల్లో తిరిగి ఏ రైతు ఆత్మహత్య చేసుకోవద్దని భరోసా కల్పించాలి తప్ప ఇలా రైతుల సమస్యల కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం ప్రత్యారోపణలతో ఆందోళనకు దిగితే రైతులే ప్రతిపక్షాలపై తిరగబడతారని చెప్పారు. అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని చెప్పారు. ఇలాంటి రోజులు చూసేందుకు కొత్త రాష్ట్రం ఏర్పడలేదని, రైతులకు ప్రభుత్వం పూర్తి భరోసాగా ఉంటుందని ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని అన్నారు. ప్రధాన అంశం తెలంగాణ రైతుల ఆత్మహత్యలు, కరువు అని భావించి వెంటనే రెండు రోజులపాటు ఆ అంశాలపై చర్చ జరిపి అన్ని పార్టీల నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేశామని తెలిపారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తామేమన్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నామా అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల నివారణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పడింది రైతుల ఆత్మహత్యలు చూసేందుకు కాదని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. రుణమాఫీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టడం సరికాదని, రైతుల ఆత్మహత్యలు రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. -
'గొడవ చేయాలని ముందే వ్యూహం పన్నారు'
-
అసెంబ్లీ మీడియా పాయింట్
రైతు ఆత్మహత్యలకు వారే కారణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్, టీడీపీలే కారణం. 60 ఏళ్లుగా ఆ పార్టీల రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతులను పిట్టల్లా కాల్చి చంపిన టీడీపీకి రైతు ఆత్మహత్యలపై మాట్లాడే అర్హత లేదు. బండ్లపై అసెంబ్లీకి కాకుండా బషీర్‌బాగ్‌కు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలు అమరులకు నివాళులర్పించి తప్పు ఒప్పుకోవాలి - గువ్వల, జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. రైతు ఆత్మహత్యలు, కరువు, ప్రబలుతున్న వ్యాధుల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫీజురీయింబర్స్‌మెంట్, దళితులకు భూపంపిణీ పథకాలు అమలు కావడం లేదు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నందున కనీసం 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలి. - పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరువు మండలాలను ప్రకటించాలి ఈ ఏడాది వర్షాలు సరిగా కురవక రాష్ట్రంలో కరువు నెలకొంది. వెంటనే కరువు మండలాలను ప్రకటించాలి. ప్రజా సమస్యలపై చర్చకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. మమ్మల్ని సస్పెండ్ చేసి సభను ఏకపక్షంగా నడిపించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పెంచిన పరిహారాన్ని వెంటనే అందజేయాలి. - వివేకానంద, టీడీపీ ఎమ్మెల్యే చర్చించేందుకు ప్రతిపక్షాలకు దమ్ములేదు ప్రతిపక్షాలకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే మేం సమాధానం చెబుతాం. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వాల విధానాలే కారణం. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. - కర్నె ప్రభాకర్, సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. విద్యావ్యవస్థ దారుణంగా తయారైంది. యూనివర్సిటీల్లో వీసీలు లేరు. పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పిల్లలకు పుస్తకాలు లేవు. విశ్వ నగరం చేస్తామంటున్న హైదరాబాద్‌లో పది చినుకులు పడితే చాలు రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఇంత అధ్వానమైన పాలన ఎప్పుడూ చూడలేదు. - చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, బీజేపీ ఎమ్మెల్యేలు సంక్షోభంలో వ్యవసాయం సకాలంలో వర్షాల్లేక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ వైఖరి వల్ల రైతులు ఆత్మహత్యల కు పాల్పడుతున్నారు. పంట నష్టానికి ఒక్క పైసా కూడా అం దజేయలేదు. రుణ మాఫీ చేయకుండా బ్యాంకులు రైతుల నడ్డి విరుస్తున్నాయి. గతేడాది జూన్ 2 నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పెంచిన పరిహారాన్ని అందజేయాలి. - జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి బీసీ, మైనారిటీ సబ్‌ప్లాన్‌ను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లుతున్నాయి. ఆ నిధులను ఎస్సీల అభివృద్ధికి సత్వరమే ఖర్చు చేయాలి. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దీనిపై ప్రభుత్వం వెంటనే తగిన కార్యచరణను రూపొందించాలి. - సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే మోదీ ప్రధానికి తక్కువ.. మంత్రికి ఎక్కువ ఆయన ప్రధానికి తక్కువ.. విదేశాంగ మంత్రికి ఎక్కువ. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి మాట తప్పిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత లేదు. పోలవ రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వం ప్రతిపక్షాల మాట కూడా వినాలి. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అయితే రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాలి. - కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సమస్యలపై విస్తృత చర్చ జరగాలి రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. ముఖ్యంగా కరువు కారణంగా అప్పుల భారం పెరిగి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ, ఎస్సీ, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల అమలు, పెండింగ్‌లోని ప్రాజెక్టులు వంటి అంశాలపై విస్తృత చర్చ జరగాలి. ఇందుకోసం కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి. - రవీంద్రకుమార్, సీపీఐ ఎమ్మెల్యే చర్చలు పూర్తయ్యే వరకు కొనసాగించాలి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోగా అన్ని సమస్యలపై చర్చ జరగాలి. లేదంటే సభా సమయాన్ని పొడిగించాలి. లక్ష ఉద్యోగాలని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఎవరికీ రాలేదు. రైతు సమస్యలు, విష జ్వరాలు, నిరుద్యోగం, రెండు గదుల ఇళ్ల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులు వంటి ఎనోన సమస్యలున్నాయి. వీటన్నింటిపై చర్చ జరపాలి. - కె.లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే -
టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాగ్వివాదం
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాపరిషత్ సమావేశం రసాభాసగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం జరిగింది. శుక్రవారం సమావేశం ప్రారంభమైన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డిలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిల మధ్య కూడా వాదులాట జరిగింది. దీంతో బాలరాజు పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుండగా వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. -
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటేయండి
-
ఓసీటీఎల్ కార్మికులకు అన్యాయం చేస్తే
* ప్రజాకోర్టులో శిక్ష తప్పదు * మంత్రులు నాయిని, హరీశ్‌లకు మావోయిస్టు పార్టీ హెచ్చరిక సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రాంత పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ తెలంగాణ కార్మికులను రోడ్డున పడేస్తున్నారని సీపీఐ మావోయిస్టు తెలంగాణ కమిటీ, విప్లవ కార్మిక సమాఖ్య (వికాస)లు ఆరోపించాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలో ఉన్న ఓసీటీఎల్ సంస్థ యాజమాన్యం మోచేతి నీళ్లు తాగి 500 మంది కార్మికుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాల కార్మిక వైఖరిని ఖండిస్తున్నామని వికాస రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ పేరుతో కరపత్రాలు వెలువడ్డాయి. ఈ కరపత్రాలను బుధవారం ‘సాక్షి’ కార్యాలయానికి పంపారు. గత 28 ఏళ్లుగా ఓసీటీఎల్‌లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ.8 వేల కనీస వేతనం కూడా ఇవ్వడం లేదంటూ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంలకు ఎన్నిసార్లు కార్మికులు మొరపెట్టుకున్నా వారి సమస్యలను పరిష్కరించలేదని ఆ కరప్రతంలో పేర్కొన్నారు. ఓసీటీఎల్ యాజమాన్యంతో కుమ్మక్కయి కార్మికులకు ద్రోహం తలపెడుతున్న ఈ కార్మిక ద్రోహులను ఎండగట్టాలని పిలుపునిస్తున్నామని, కార్మికులకు అన్యాయం చేస్తే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఓసీటీఎల్ సీఎండీ కామినేని సూర్యనారాయణ, మేనేజర్ వేణుబాబు తమ పద్ధతులు మార్చుకోకపోతే కార్మిక ద్రోహులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. -
‘కార్మికులకు అన్యాయం చేస్తే శిక్ష తప్పదు’
నల్లగొండ: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆంధ్ర ప్రాంత పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ తెలంగాణ కార్మికులను రోడ్డున పడేస్తున్నారని సీపీఐ మావోయిస్టు తెలంగాణ కమిటీ, విప్లవ కార్మిక సమాఖ్య (వికాస)లు ఆరోపించాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలో ఉన్న ఓసీటీఎల్ సంస్థ యాజమాన్యం మోచేతి నీళ్లు తాగి 500 మంది కార్మికుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ట్రేడ్యూనియన్లు, ప్రజాసంఘాల కార్మిక ద్రోహపూరిత వైఖరిని తాము ఖండిస్తున్నామని వికాస రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ పేరుతో కరపత్రాలు వెలువడ్డాయి. ఈ కరపత్రాలను బుధవారం నల్లగొండలోని ‘సాక్షి’ కార్యాలయానికి పంపారు. గత 28 ఏళ్లుగా ఓసీటీఎల్ సంస్థలో నెలకు రూ.8వేల కనీస వేతనం కూడా ఇవ్వడం లేదంటూ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కార్మికులను పట్టించుకోలేదని ఆ కరప్రతంలో పేర్కొన్నారు. ఓసీటీఎల్ యాజమాన్యంతో కుమ్మక్కయిన కార్మికులకు ద్రోహం తలపెడుతున్న ఈ కార్మిక ద్రోహులను ఎండగట్టాలని పిలుపునిస్తున్నామని, కార్మికులకు అన్యాయం చేస్తే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఓసీటీఎల్ యాజమాన్యం మొండి వైఖరి విడనాడి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారిపై పెట్టిన కేసులను రద్దు చేసి తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ అభివృద్ధి నిరోధకాలుగా టీడీపీ, కాంగ్రెస్
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాలరాజులు మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధికి నిరోధకాలుగా టీడీపీ, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీయకుండా పాదయాత్ర పేరిట టీడీపీ నేతలు డ్రామా ఆడుతోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ పార్టీ అమలు చేస్తోదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాలరాజు స్పష్టం చేశారు. -
'రేవంత్‌కు తెలంగాణలో జీవించే హక్కు లేదు'
హైదరాబాద్ సిటీ: ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబుకు వంత పాడుతున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి తెలంగాణలో జీవించే హక్కు లేదని మహబూబ్‌నగర్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్ శనివారం అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లా ప్రజల పరువు తీశాడని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా చంద్రబాబు లేఖ రాయడం ఏ మాత్రం తప్పుకాదని రేవంత్‌రెడ్డి వాదిస్తున్నాడని దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతానంటూ రేవంత్‌రెడ్డి స్వయంగా ఒప్పుకుంటున్నారని నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు హామీ ఇచ్చినందునే రేవంత్‌రెడ్డి తెలంగాణలో కోవర్టుగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల విషయంలో రేవంత్‌రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆరోపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్‌రెడ్డి పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు సహనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. -
చంద్రబాబుకు మిగిలింది.. జైలు దారి ఒక్కటే!
సీఎంగా కొనసాగే అర్హత లేదు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫైర్ సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను రూ. కోట్లకు కొనాలని చూసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిప్పులు చెరిగారు. ఓటకు కోట్లు కేసులో బాబు తప్పించుకోలేడని, ఆయనకు అన్ని దారులు మూసుకుపోయాయని, ఒక్క జైలు దారి మాత్రమే తెరిచి ఉందని ఆర్మూరు ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎ.జీవన్ రెడ్డి, బాలరాజు, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్ గురువారం విలేకరులతో వేర్వేరుగా మాట్లాడుతూ.. బాబు సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కించపరిచేలా మాట్లాడుతున్న ఏపీ మంత్రులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్న బాబు సెక్షన్-8ను తెరపైకి తెచ్చి రాద్దాంతం చేస్తున్నాడని ఎమ్మెల్యే బాలరాజు విమర్శించారు. కేసు నుంచి బయటపడేందుకు, హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించాలని బాబు కుట్ర పన్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. అవినీతి కేసులో ఇరుక్కున్న చంద్రబాబుకు సీఎంగా కొనసాగే అర్హత లేదని ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. -
మీపై నమ్మకం ఉంది
♦ తప్పులు చేయకండి.. జాగ్రత్తగా ఓటేయండి ♦ ఐదు స్థానాలూ మనవే ♦ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం ♦ తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ ఎన్నికల ‘మాక్ ’ పోలింగ్ సాక్షి, హైదరాబాద్: ‘మీ పై నాకు విశ్వాసం ఉంది. ఏడాదిగా కలసి పనిచేస్తున్నాం. మీపై నమ్మకం ఉంది. అయితే, తప్పులు చేయకండి. జాగ్రత్తగా ఉండండి..’ అని సీఎం చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అన్నారు. శాసన మండలి ఎన్నికల్లో భాగంగా తమ ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ నాయకత్వం ఆదివారం తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్ నిర్వహించింది. దీనికి హాజరైన సీఎం కేసీఆర్ పదిహేను నిమిషాల పాటు ఎమ్మెల్యేలతో గడిపారు. రెండు రోజుల కిందట జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే, అసెంబ్లీని రద్దు చేయడానికి కూడా వెనకాడ నని కేసీఆర్ ఎమ్మెల్యేలను హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా, ఆదివారం మాక్ పోలింగ్‌కు హాజరైన సీఎం ఎమ్మెల్యేలను బుజ్జగించేలా మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అయిదు స్థానాలనూ గెలుచుకుంటామని అన్నారు. తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్ ముగిశాక, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలకు కలిపి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మరో మారు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. నియోజకవర్గం కోసమే: మాధవరం తెలంగాణ భవన్లో జరిగిన మాక్ పోలింగ్‌కు హాజరైన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్కడే విలేకరులతో మాట్లాడారు. తన నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్లో చేరానని పేర్కొన్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఆయన శనివారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. -
ఆత్మ ప్రభోదం అంటే అసలుకే మోసమే దయాకరన్నా!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారమే ఓటు వేయాలని ఎన్టీఆర్ భవన్ సాక్షిగా సెలవిచ్చారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన మాటలను టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేలు ‘అవునా... అన్నా!’ అని వెటకారం పోతున్నారు. ఆత్మ ప్రబోధం మేరకు ఓటేస్తే టీఆర్ఎస్ లోని అసంతృప్తులు కాదు గానీ టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం కచ్చితంగా గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటేయడం ఖాయమని గంటా భజాయించి మరీ చెపుతున్నారు. టీడీపీ నుంచి గెలిచిన 15 మందిలో నలుగురు ఇప్పటికే టీఆర్ఎస్లోకి జంప్. మిగిలిన 11 మందిలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం కేసీఆర్ ఫాం హౌజ్‌కు వెళ్లి గులాబీ కండువా కప్పుకున్నారు కూడా! గత కొంతకాలంగా ఊగిసలాడుతున్నా ‘సరైన’ సమయంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆత్మ ప్రబోధం మేరకే టీడీపీని వీడినట్టు చెణుకులు విసురుకుంటున్నారు తమ్ముళ్లు. ఇక నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్లు ఇస్తే వెంటనే టీఆర్ఎస్లో చేరుతానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ గత కొన్ని నెలలుగా చెపుతున్నారు.. ఆయనకు రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన తరువాత కూడా ‘అన్న మాట తప్పలేదు’. మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ పడుతున్న తుమ్మల నాగేశ్వర్రావుకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ దగ్గరివారు.. గాంధీ టీఆర్ఎస్లో చేరుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన తుమ్మల కోసం ఈయన కూడా ‘ఆత్మ’ను చంపుకోకపోవచ్చు. వీరందరినీ సముదాయించి, తాయిలాలు ఆశచూపి చంద్రబాబు పార్టీ వీడకుండా కాపాడుకుంటున్నా... చివరికి చేరాల్సిన గూటికే చేరుతున్నారు. దయాకరన్న చెప్పినట్లు ఆత్మ ప్రబోధం మేరకు ఓటేయడం సంగతి తరువాత... పార్టీ మారుతారేమో!! - తెలంగాణ బ్యూరో -
టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఊరట
హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలను వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏడుగురు మ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున తాము ఇప్పుడు ఎటువంటి జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తెలిపింది. ఇటీవల టీడీపీ, కాంగ్రెస్ ల నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ల ఓటుహక్కు చెల్లదంటూ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ నేత సంపత్ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయింపు చట్టం కారణంగా వారికి ఓటు హక్కు ఉండబోదని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారించిన హైకోర్టు.. ఆ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తేల్చి చెప్పింది. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు వీరే.. టీడీపీ నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి (రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం) తీగల కృష్ణారెడ్డి ( రంగారెడ్డి జిల్లా మహేశ్వరం) తలసాని శ్రీనివాస యాదవ్ (హైదరాబాద్ జిల్లా సనత్ నగర్) చల్లా ధర్మారెడ్డి ( వరంగల్ జిల్లా పరకాల) కాంగ్రెస్ నుంచి విఠల్ రెడ్డి (ఆదిలాబాద్ జిల్లా ముధోల్) కనకయ్య (ఖమ్మం జిల్లా ఇల్లెందు) యాదయ్య (రంగారెడ్డి జిల్లా చేవెళ్ల). -
'జానారెడ్డి అవినీతిని త్వరలో బయట పెడతాం'
హైదరాబాద్: ప్రతిపక్ష నేత జానారెడ్డి చేసిన అవినీతిని త్వరలోనే బయట పెడతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. మంగళవారం వారు అసెంబ్లీలో మాట్లాడుతూ...జానారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంమంత్రిగా ఉన్న సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని, త్వరలో ఆయన అవినీతిని బయటపెడతామని వారు హెచ్చరించారు. అంతేకాకుండా జానారెడ్డికి జైలుకు పోతానన్న భయం పట్టుకుందన్నారు. ఆయన అక్రమాస్తులపై ఇప్పటికే విచారణ ప్రారంభమైందన్నారు. అంతేకాకుండా జానారెడ్డిని సొంతపార్టీ ఎమ్మెల్యేలే గుర్తించడం లేదని పేర్కొన్నారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ పేరును నల్గొండ పార్టీగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. -
ప్రాణహిత-చేవెళ్లపై పూర్తిస్థాయి చర్చ
సాక్షి, హైదరాబాద్: శాననసభ సమావేశాలు ముగిశాక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో చర్చించాల్సి ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఎక్కడ ఏర్పాటు చేస్తే ప్రయోజనం అధికంగా ఉంటుందనే దానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వాప్కోస్ను పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ నివేదికపై అందరి సమక్షంలో చర్చిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతం, కృష్ణా పరీవాహక ప్రాంతంలోని వాస్తవ పరిస్థితులపై అందరితో చర్చించి, సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు సాగుతామన్నారు. శనివారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలవనరుల శాఖ (సీడబ్ల్యూసీ) సమ్మతి, తదితర వివరాలు తెలపాలంటూ ఎమ్మెల్సీ బి.వెంకటరావు వేసిన ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుకు సిగ్గుపడాలి
హైదరాబాద్: అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యులని, ఈ సంఘటనకు ప్రభుత్వం సిగ్గుపడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, చింతా సాంబమూర్తితో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో అధికారపార్టీ సభ్యులు వ్యవహరించిన తీరు, శాసనసభ్యులపై దురుసుగా ప్రవర్తించడం వంటి చర్యలకు దిగడానికి సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో బాధ్యత వహిం చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని విమర్శించారు. -
దొరతనానికి శుభదినం: రేవంత్ రెడ్డి
-
దొరతనానికి శుభదినం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మంత్రి హరీశ్ రావు ఉసిగొల్పడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ సభ్యులపై దాడి చేశారని టీడీపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు తమపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ పై చర్య తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.... 'ప్రజాస్వామ్యానికి దుర్దినం, దొరతనానికి శుభదినం' అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని గవర్నర్ ను కోరినా పెడచెవిన పట్టడంతో ఆయన ప్రసంగానికి నిరసన తెలపాలనుకున్నామని చెప్పారు. తమను అడ్డుకున్న మార్షల్స్ పై చర్య తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. -
'ఆయనో అబద్దాల సామ్రాట్'
తెలంగాణపై చంద్రబాబుది దొంగ ప్రేమ: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధ్వజం సాక్షి, హైదరాబాద్: తన చివరి రక్తపుబొట్టు వరకు తెలంగాణకు అన్యాయం చేయబోనని ఏపీ సీఎం చంద్రబాబు అన్న మాటలు పూర్తిగా అబద్దమని, తెలంగాణ ప్రజల చివరి రక్తపు బొట్టును పీల్చడానికే దొంగ ప్రేమ నటిస్తున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. తెలంగాణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన బాబు చివరకు విభజన తర్వాత కూడా తెలంగాణ ప్రజలను పట్టిపీడిస్తున్నారని వారు విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎ.జీవన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు శుక్రవారం తెలంగాణ భవన్లో, టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి 44 టీఎంసీల నీటిని అదనంగా తీసుకుని కూడా, కుడి కాల్వకు నీటిని విడుదల చేయకుంటే డ్యామ్‌ను బద్దలు కొడతామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ప్రకటించడం వెనుక చంద్రబాబు ఉన్నాడని వారు ఆరోపించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. -
'టీడీపీది ప్లాప్ షో'
హైదరాబాద్ : రాజకీయాల్లో అవినీతిని ప్రవేశపెట్టింది ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజ్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై వారు నిప్పులు చెరిగారు. ప్యాకేజీల ద్వారా చంద్రబాబు పార్టీని కాపాడుకుంటున్నారని విమర్శించారు. వరంగల్‌లో చంద్రబాబు ఆధ్వర్యంలో గురువారం టీడీపీ నిర్వహించిన షో ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. -
'తెలంగాణకు శనిలా దాపురించాడు'
హైదరాబాద్: తెలంగాణలో అసలే టీఆర్ఎస్, టీడీపీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయించడంతో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న వైరాన్ని మరింత పెంచింది. డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టవద్దంటూ తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం తీర్మానించింది. దీంతో ఆగ్రహించిన ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీపీ నేతలు శనివారం అధికార టీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. దాంతో ఆదివారం హైదరబాద్‌లో టీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీనివాసగౌడ్, గంగుల కమలాకర్ మాట్లాడుతూ... టీడీపీ అధ్యక్షడు, ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు చంద్రబాబు శనిలా దాపురించారని ఆరోపించారు. చంద్రబాబుకు తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు. స్పీకర్‌పై ప్రతిపక్ష టీటీడీపీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం ఇస్తే అధికార బీసీ ఎమ్మెల్యేలంతా ఏకమై... ఆ అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలా చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. -
అసెంబ్లీలో సస్పెన్షన్ దుమారం!
-
రేవంత్.. మహిళలకు క్షమాపణ చెప్పు!!
-
రేవంత్.. మహిళలకు క్షమాపణ చెప్పు: టీఆర్ఎస్
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీ కవిత పేరు సమగ్ర కుటుంబ సర్వేలో రెండుచోట్ల నమోదైందని అసెంబ్లీలో మంగళవారం నాడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అయితే దానికి ఆధారాలు చూపించాలంటూ ఆయనను మహిళా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఓ పత్రికలో వచ్చిన విషయం గురించే తాను మాట్లాడినట్లు రేవంత్ తెలిపారు. తప్పుడు ఆధారాలతో నిజామాబాద్ ఎంపీపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, అందుకు ఆయన బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే కొండా సురేఖ డిమాండ్ చేశారు. సభను తప్పుదోవ పట్టించినందున రేవంత్‌ను సస్పెండ్ చేయాలని మరో ఎమ్మెల్యే గొంగడి సునీత డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆయన తప్పుడు వ్యాఖ్యలు చేశారని, ఒక ఎంపీమీదే ఇలాంటి ఆరోపణలు చేస్తే, ఇతర మహిళలను ఎలా గౌరవిస్తారని ఆమె ప్రశ్నించారు. -
‘సిద్దిపేట’వెంట 20మంది ఎమ్మెల్యేలు
* సీఎం పదవిని కాపాడుకోవడానికి చేరికలకు ప్రోత్సాహం * కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపాటు తాండూరు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్‌కు నమ్మకంలేదని.. ఉన్న 63 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది ‘సిద్దిపేట’ వైపు ఉన్నారని.. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పరోక్షంగా హరీష్‌రావును ఉద్దేశించి అన్నారు. శుక్రవారం ఆయన తాండూరులో విలేకరులతో మాట్లాడారు. సీఎంకు సొం త పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకంలేకనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని విమర్శించారు. మంత్రి పదవులు పోతాయనే భయంతో కొందరు మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లకు వాళ్లను తీసుకొస్తున్నారన్నారు. ‘తీగల’ వంటి వారు వెళ్తే పార్టీకి ఏం కాదని, వెళ్లిన వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు మంత్రి వర్గంలో, నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. 2005 లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరితే.. అది ప్రజాస్వామ్యపద్ధతి కాదని, వారిపై అనర్హత వేటు వేయాలన్న కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నదేంటని ప్రశ్నించా రు. విద్యుత్ కొరతకు కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమన్నారు. మహబూబ్‌నగర్‌ను నిర్లక్ష్యం చేస్తూ జూరాల,నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల నుంచి నీళ్లు తీసుకువస్తానని చెబుతుం డటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ కాలం పనిచేయదని, టీడీపీని తెలంగాణలో లేకుండా చేయాలనే కేసీఆర్ కల నెరవేరదని అన్నారు. లోకేష్ నాయకత్వంలో పని చేయడానికి ఎలాంటి అ భ్యంతరం లేదన్నారు. అధికారంలోకి వస్తే తాను తెలంగాణ సీఎం అవుతానన్నది కేవలం ప్రచారం మాత్రమేనని అన్నారు. అందరికీ ఆశలు ఉంటా యి.. కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. మంత్రులు డమ్మీలు అని, సీఎం నకిలీ మాటల నాయకుడు అని ఆయన తీవ్ర స్థాయిలో విరు చుకుపడ్డారు. -
జిల్లాల్లో పరిస్థితి ఏంటి?
24న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌కు ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ పరంగా భారీ కసరత్తు చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేసీఆర్ ఇప్పటిదాకా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించలేదు. బడ్జెట్ ముందు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. నవంబరు మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నందున ఈనెల 24న పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అలాగే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ కావాలని నిర్ణయించారు. అదేరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం ఉన్నందున.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే జిల్లాల వారీ సమీక్షల్లో తన దృష్టికి వచ్చిన అంశాలు, ఎమ్మెల్యేలు చేసిన ముఖ్య సూచనలపై చర్చించి బడ్జెట్లో వాటిని పొందుపరిచే విధంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దీపావళి మరుసటి రోజున ఉదయం ముందుగా పార్టీ శాసనభాపక్షం భేటీ కాబోతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, జిల్లాలపై వాటి ప్రభావం, విద్యుత్ సంక్షోభం, వర్షాభావ పరిస్థితులు, ప్రతిపక్షాల విమర్శలు, వాటిని తిప్పికొడుతున్న తీరు... ఇలా అన్ని అంశాలపై అందులో చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ తర్వాత విడివిడిగా ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. అరగంట నుంచి గంట సమయాన్ని ఒక్కో జిల్లాకు కేటాయించనున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు, రైతులు, వ్యవసాయ పరిస్థితి, నిధుల అవసరం, పథకాల తీరుతెన్నులు, వాటిలో మార్పుచేర్పులు, కావాల్సిన నిధులు తదితర అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేల నుంచి సమాచారాన్ని స్వీకరించనున్నారు. -
గ్రానైట్ వార్
ఎమ్మెల్యేల పోరు.. అధికార పార్టీలో చిచ్చు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రజాప్రతినిధుల మధ్య గ్రానైట్ వార్ మొదలైంది. అధికార పార్టీ నేతల మధ్యనే చిచ్చు పెట్టింది. ఇటీవల జిల్లా పరిషత్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్రానైట్ పరిశ్రమపై రెండు వర్గాలుగా చీలిపోవటం చర్చనీయాంశంగా మారింది. పర్యావరణ విధ్వంసంతో పాటు రహదారులను ఛిద్రం చేస్తున్న గ్రానైట్ క్వారీలు.. రవాణాకు అడ్డుకట్ట వేయాలని మంత్రి ఈటెల రాజేందర్ ఎదుట ఎమ్మెల్యేలు బొడిగె శోభ, రసమయి బాలకిషన్ తమ ఆవేదన వెళ్లగక్కారు. గ్రానైట్ లారీలు, క్వారీలతో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయని.. తమ సొంత నియోజకవర్గాల్లో రోడ్లన్నీ పాడైపోయాయని.. గ్రానైట్ రవాణా కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని ఆందోళన వెలిబుచ్చారు. అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులు వారికి మద్దతు పలికారు. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే గ్రానైట్ పరిశ్రమపై ఏకపక్షంగా మాట్లాడటం సరైంది కాదని.. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు సొంత పార్టీ ఎమ్మెల్యేలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి సైతం ఘాటుగానే స్పందించారు. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా విధాన నిర్ణయం తీసుకోవాలని కోరుతామని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం మైనింగ్ అధికారులను పిలిచి గ్రానైట్ ఓవర్‌లోడ్ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించినట్లు తెలిసింది. అదీ మొదలు.. జిల్లాలో గ్రానైట్ ఓవర్‌లోడ్ రవాణాపై అధికారులు కన్నెర్ర జేశారు. వరుసగా వారం రోజుల్లోనే 37 కేసులు నమోదు చేసి జరిమానా విధించటం వెనుక అసలు తతంగం ఇదేనని అర్థమవుతోంది. జిల్లాలో దాదాపు 350 గ్రానైట్ క్వారీలున్నాయి. ప్రతిరోజు దాదాపు 300 లారీల్లో గ్రానైట్ రవాణా అవుతోంది. జిల్లాలో ఉన్న క్వారీల్లో సగానికి పైగా రాజకీయ నేతలకు చెందినవే. కొందరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు.. విపక్షాలకు చెందిన నేతలు సైతం ఈ వ్యాపారంలో పాతుకుపోయారు. దీంతో అధికారులు సైతం గ్రానైట్ క్వారీల నిబంధన ఉల్లంఘన.. అడ్డగోలు ఓవర్‌లోడ్ రవాణా.. సీనరేజీ ఎగవేతపై చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న ఆరోపణలున్నాయి. గ్రానైట్ రాళ్ల రవాణాతో కరీంనగర్, హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, రామడుగు, చొప్పదండి, బోయినపల్లి, వేములవాడ, గంగాధర, కొడిమ్యాల, మల్యాల మండలాల్లో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ మండలాల్లోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నిలిపివేసింది. గ్రానైట్ క్వారీల నుంచి తొలిగించిన మట్టి గుట్టలు కరీంనగర్-వేములవాడ ప్రధాన రహదారిపై ప్రమాదాలకు నిలయంగా మారాయి. గ్రానైట్, ఇనుక లారీలతో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేసేందుకు కనీసం రూ.50 కోట్లకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. కానీ.. ప్రభుత్వం నుంచి నిధులేవీ రాకపోవటంతో ఆర్అండ్బీ విభాగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఓవర్ లోడ్ రవాణాను అనుమతించాలని గ్రానైట్ క్వారీల యజ మానులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మన జిల్లా కు ప్రత్యేకంగా జీవో తెచ్చుకోవటం గమనార్హం. ఇక్కడి రాజకీయాలను.. అధికారులను శాసించే స్థాయికి గ్రానైట్ పరిశ్రమ వేళ్లూనుకుందని వరుసగా జరిగిన ఎన్నికలు.. వాటి ఫలితాలు సైతం రూఢీ చేశాయి. గుట్టలు కనుమరుగవుతున్నాయని.. కొత్తగా క్వారీలకు అనుమతులు ఇవ్వకూడదని గతంలో పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు నిర్వహించాయి. ఎన్నికల తర్వాత ఈ సంస్థలు పెదవి విప్పకముందే.. ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగటం.. అందులోనూ అధికార పార్టీ నేతలే విరుచుకుపడుతున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. -
మెట్రో నుంచి ఎల్ అండ్ టీని తప్పించేందుకు కుట్ర
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జి బాలరాజులు ఆదివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. మెట్రో ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి పదే పదే అబద్దాలు చెప్పి... వాటిని నిజాలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే మెట్రో రైలు ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ఎల్ అండ్ టీ సంస్థకి ఆంధ్ర రాజధానిని ఎరవేసి... ఇక్కడి మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ సంస్థను తప్పించి ఆంధ్ర రాజధానికి పంపించాలని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు విక్రయించిన భూములపై చర్చకు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిలాంటి నాయకుల వల్లే తెలంగాణలో యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జి బాలరాజు అన్నారు. -
ఎమ్మెల్యేల ఆశలపై నీళ్లు చల్లిన కెసిఆర్!
టిఆర్ఎస్ శాసనసభ్యుల ఆశలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నీళ్లు చల్లారు. మంత్రి వర్గం విస్తరణ ఉంటుందని, అందులో తమకూ అవకాశం ఉంటుందని చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. మహిళలు, ప్రాతినిధ్యంలేని జిల్లాల వారు, సామాజిక వర్గాల వారు ఎవరి అంచానాలు వారు వేసుకుంటున్నారు. ఎవరికి వారు తమకు మంత్రి పదవి వస్తుందంటే, తమకు వస్తుందని అనుకుంటున్నారు. ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం లేదని కెసిర్ సంకేతాలు ఇచ్చారు. దాంతో పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు నీరుగారిపోయారు. తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా ఈనెల 15లోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ఆశించారు. వారి ఆశలు ఇప్పట్లో తీరే అవకాశం లేదని తెలుస్తోంది. మంత్రివర్గలో ప్రాతినిధ్యం లేని మహబూబ్‌నగర్‌లో మంత్రి కెటిఆర్, ఖమ్మంలో పద్మారావు స్వాతంత్ర్యదినోత్సవాలకు హాజరవుతారని ప్రకటించారు. దీంతో మంత్రివర్గ విస్తరణ లేదని అందరికీ అర్ధమైపోయింది. ప్రస్తుత స్థితిలో మంత్రివర్గంలో ఆరుగురికి అవకాశం ఉంది. అయితే 15 మంది రేస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ చేపడితే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సిఎం భావిస్తున్నట్లు సమాచారం. అందువల్లే పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పాటును వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఈనెల 20న కెసిఆర్ సింగపూర్ వెళ్ళనున్నారు. ఆయన తిరిగి వచ్చిన తరువాత వచ్చే నెలలో దాదాపు నెల రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత కెసిఆర్ పార్టీపై దృష్టి పెడతారు. అవసరమైతే శిక్షణ తరగతులు కూడా నిర్వహించాలని భావిస్తున్నారు. పార్టీ బాధ్యతలు సమర్ధంగా నిర్వహించిన వారినే మంత్రివర్గంలో చేర్చుకోవాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి కొద్దినెలల పాటు మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేదని స్పష్టమవుతోంది. - శిసూర్య -
'కిషన్‌రెడ్డివి ఉప ఎన్నిక రాజకీయాలు'
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న విమర్శలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలరాజు, దివాకర్‌రావులు తిప్పుకోట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీపై కిషన్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరీపై మండిపడ్డారు. మెదక్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకుని ఆయన ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని... అయినా ఆయన ఏ రోజు స్పందించలేదని కిషన్ రెడ్డిపై వారు విరుచుకుపడ్డారు. తెలంగాణలో బేజేపీ ఉనికి కోల్పోతోందని తెలిపారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే అనవసరంగా కిషన్‌రెడ్డి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని తిరస్కరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాలరాజు, దివాకర్‌రావులు అన్నారు. -
ఆమాత్యుల రేసులో... ఆ ముగ్గురు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ; నెలాఖరులో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జూన్ రెండో తేదీన ఏర్పడిన తొలి తెలంగాణ ప్రభుత్వ కేబినెట్లో జిల్లాలో ఎవరికీ చోటు దక్కలేదు. దీంతో మలి విడత మంత్రివర్గ విస్తరణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీ ఆశలు పెట్టుకున్నారు. సాధారణ ఎన్నికల్లో జిల్లా నుంచి టీఆర్ఎస్ పక్షాన ఏడుగురు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల), వి.శ్రీనివాస్‌గౌడ్ (మహబూబ్‌నగర్) మంత్రి పదవిపై భారీగా లెక్కలు వేసుకుంటున్నారు. మలివిడత మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు కూడా ప్రకటించారు. దీంతో మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వెలమ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో సీఎం కేసీఆర్‌తో పాటు హరీష్‌రావు, కేటీ రామారావులకు ఇప్పటికే చోటు దక్కింది. దీంతో ఇదే సామాజికవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావుకు కుల సమీకరణాలు అడ్డువస్తున్నాయి. అయితే దక్షిణ తెలంగాణ నుంచి ఈ సామాజికవర్గం నుంచి వేరెవరూ లేకపోవడంతో కృష్ణారావుకు మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి విషయంలోనూ ఇవే సమీకరణాలు ఆటంకంగా కనిపిస్తున్నాయి. మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), జగదీష్‌రెడ్డి (నల్లగొండ), నాయిని నర్సింహారెడ్డి (హైదరాబాద్)కు ఇప్పటికే చోటు కల్పించినందున లక్ష్మారెడ్డికి తొలివిడత మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగడం, 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఓటమిపాలు కావడం వంటి కారణాలు కలిసి వస్తాయని లక్ష్మారెడ్డి అంచనా వేసుకుంటున్నారు. ఉద్యమ కోటాపై గౌడ్ ఆశలు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ అధ్యక్షుడిగా ఉంటూ టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీనివాస్‌గౌడ్ మంత్రివర్గంలో స్థానం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన మరో ఉద్యోగ సంఘం మాజీ నేత స్వామిగౌడ్‌కు శాసనమండలి ఛైర్మన్ పదవి దక్కడంతో తనకు లైన్ క్లియర్ అయినట్లేనని శ్రీనివాస్‌గౌడ్ అంచనా వేసుకుంటున్నారు. అయితే ఇదే సామాజికవర్గానికి చెందిన పద్మారావుకు తొలివిడత మంత్రివర్గంలోనే చోటు దక్కడంతో కుల సమీకరణాల కోణంలో శ్రీనివాస్‌గౌడ్ అవకాశాలు సంక్లిష్టంగా కనిపిస్తున్నాయి. ఓ వైపు ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తుండగా, మరికొందరు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను ఆశిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ వ్యాపారవేత్త తెలంగాణ పారిశ్రామిక మౌలిక సౌకర్యాల అభివృద్ధి సంస్థ ైచైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం.ఎమ్మెల్యే టికెట్ ఆశించినా ఇతరుల కోసం సర్దుబాటుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవర మల్లప్ప ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. గద్వాల నుంచి ఓట మి పాలైన కృష్ణమోహన్ రెడ్డి కూడా ప్రాధాన్యత కలిగిన కార్పొరేషన్ ఛైర్మన్‌గా అవకాశం వస్తుందనే అంచనాలో ఉన్నారు. మున్సిపల్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక ముగి యడంతో ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పదవుల కోసం విన్నపాలతో సిద్ధమవుతున్నారు. మార్కెట్ కమిటీ, ఆలయ కమిటీ చైర్మన్ పదవుల కోసం ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల ద్వారా ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. -
అమాత్యుల రాక నేడు
- జిల్లాకు మంత్రులు ఈటెల, కేటీఆర్ - ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు - తెలంగాణ చౌక్‌లో బహిరంగ సభ, ధూంధాం కరీంనగర్ : రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు మంగళవారం జిల్లాకు రానున్నారు. రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి జిల్లాకు వస్తున్న మంత్రులకు ఘనస్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు... మంత్రులు హైదరాబాద్ నుంచి బయల్దేరి మంగళవారం సాయంత్రం 4గంటలకు జిల్లా సరిహద్దులోని శనిగరం చేరుకుంటారు. అక్కడ హుస్నాబాద్, మానకొండూర్ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌బాబు, రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకువస్తారు. బెజ్జంకి క్రాసింగ్ వద్ద నుంచి భారీ బైక్‌ర్యాలీతో మంత్రులకు స్వాగతం పలుకనున్నారు. అల్గునూరులోని పెద్దమ్మ దేవాలయంలో మంత్రులు పూజలు నిర్వహిస్తారు. అక్కడే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం కరీంనగర్ నియోజకవర్గ సరిహద్దులోని మానేరు బ్రిడ్జి వద్ద స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో పార్టీ నేతలు మంత్రులకు ఘనస్వాగతం పలుకుతారు. అక్కడినుంచి భారీ ఊరేగింపుతో నగరంలోకి ప్రవేశించి మహాత్మా జ్యోతిరావుపూలే, మహాత్మగాంధీ విగ్రహాలకు, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం నగరంలోని తెలంగాణ చౌక్‌లో రాత్రి 7గంటలకు నిర్వహించే బహిరంగసభ, ధూంధాంలో మంత్రులతో పాటు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నగరంలోని పలు కూడళ్లలో కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీమయం చేశారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికేందుకు, యువకులతో బైక్‌ర్యాలీ నిర్వహించేందుకు స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మంత్రుల పర్యటనను విజయంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి కోరారు. -
బంద్.. సంపూర్ణం
సాక్షిప్రతినిధి, నల్లగొండ, అధికార పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తొలి పిలుపుతోనే సత్తా చాటింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లాలో బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. పలుచోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బంద్‌లో పాల్గొనడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. జాతీయ రహదారిపై చౌటుప్పల్, టేకుమట్ల, నల్లబండగూడెం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డును దిగ్బంధించడంతో ఆంధ్రా ప్రాంతం నుంచి ఒక్క వాహనమూ సరిహద్దు దాటలేదు. పోలవరం ముంపు మండలాలు ఏడింటిని ఆంధ్రా రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ ప్రధాని మోడి, చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుల దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. బంద్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా పాల్గొనడంతో ఒక్క బస్సూ రోడ్డెక్కలేదు. బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. జిల్లా కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్యలు పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్‌లు తమ తమ నియోజకవర్గాల్లో బంద్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ తదిర పార్టీలు సైతం బంద్‌కు సహరించి ర్యాలీల్లో పాల్గొన్నాయి. ఆర్టీసీ నష్టం రూ. 70 లక్షలు నల్లగొండ రీజియన్‌లో 728 బస్సులు, ఆయా డిపోల్లోనే నిలిచిపోయాయి. దీంతో దాదాపు *70లక్షల రోజువారీ ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. బంద్‌కు పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడ మద్దతు తెలపడంతో డిపోల నుంచి బస్సులు బయటికి కదల్లేదు. నల్లగొండ : నల్లగొండలో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, జేఏసీ నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట మూడు గంటలకు పైగా బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వ్యాపార సంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, హోటళ్లు, ప్రైవేటు సంస్థలు, ప్రభు త్వ కార్యాలయాలు, వర్తక, వాణిజ్య సంస్థలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. వ్యాపార సంస్థలు మూసి వేశారు. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో వేర్వేరుగా బస్టాండు ఎదుట ధర్నాలు నిర్వహించారు. తెలంగాణా జాగృతి సంస్థ, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వేములపల్లిలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దామరచర్లలో ఇండియా సిమెంట్ గేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. సూర్యాపేట : బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుంచే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బస్సు డిపో వద్దకు చేరుకొని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం బైక్‌లపై పట్టణంలో మధ్యాహ్నం వరకు తిరుగుతూ వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలను బంద్ చేయించారు. బంద్‌కు జేఏసీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మద్దతు ప్రకటించాయి. సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. భువనగిరి : బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి వేశారు. ఆర్టీసీ బస్సులు నడవలేదు. భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, వలిగొండల్లో బంద్ స్వచ్ఛందంగా జరిగింది. భువనగిరి పట్టణం, వలిగొండలో జరిగిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పాలొన్నారు. పోచంపల్లిలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో జరిపారు. ఆలేరు : యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆలేరులో టీఆర్ఎస్ కార్యకర్తలు బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. న్యూడెమొక్రసీ, టీఆర్ఎస్లు ర్యాలీలు చేపట్టాయి. రాజపేటలో చంద్రబాబు, వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. బొమ్మలరామారం మండలం రంగాపురం చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. తుర్కపల్లిలో రాస్తారోకో చేశారు. దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. దేవరకొండలో టీఆర్ఎస్, సీపీఎం నాయకులు బస్టాండు ఎదురుగా రాస్తారోకో చేశారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బంద్‌కు మద్దతుగా సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. నకిరేకల్ : నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. నకిరేకల్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. పెట్రోల్ బంక్‌లు, సినిమా థియేటర్లు నడవలేదు. ప్రభుత్వ కార్యాలయాలు తెరవలేదు. టీఆర్ఎస్ మండల కమిటీ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ప్రదర్శన జరిపారు. సీపీఎం ఎంఎల్ నూడెమెక్రసీ, బహుజన కమ్యూనిస్టు పార్టీ (బీసీపీ) ఆధ్వర్యంలో ర్యాలీలు జరిపారు. చిట్యాలలో టీఆర్ఎస్వీ ఆద్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రామన్నపేటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నార్కట్‌పల్లిలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలను మూసివేయించారు. హాలియా : నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు దుకాణాలు మూసివేయించారు. హాలియా, నిడమనూరు. త్రిపురారం, పెద్దవూర, గుర్రంపోడు, నాగార్జునసాగర్‌లలో టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ, ధర్నా, రాస్తారోకో చేశారు. కోదాడ : కోదాడ నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. టీఆర్ఎస్ పార్టీతో పాటు టీజేఏసీ, న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐలు వేర్వేరుగా బంద్ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. తెలంగాణ-ఆంధ్ర ప్రాంత సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఆంధ్ర ప్రాంత వాహనాలను అడ్డుకున్నారు. తిరుమలగిరి : తుంగతుర్తి నియోజకవర్గంలో వ్యాపార , వాణిజ్యసంస్థలు, సినిమాహాళ్లు మూత పడ్డాయి. తిరుమలగిరిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకోలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోత్కూర్, శాలిగౌరారం, నూతన్‌కల్, తుంగతుర్తి, అర్వపల్లిలలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. హుజూర్నగర్ : హుజూర్‌నగర్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు బంద్ పాటించాయి. వివిధ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మఠంపల్లిలో టీఆర్ఎస్, సీపీఎం నాయకులు, గరిడేపల్లిలో టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ, జేఏసీ నాయకులు, నేరేడుచర్లలో టీఆర్ఎస్, సీపీఎం, జేఏసీల ఆధ్వర్యంలో మేళ్లచెరువులో టీఆర్ఎస్, సీపీఎంల ఆధ్వర్యంలో రాస్తారోకోలు జరిగాయి. మునుగోడు : మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో హైవేపై టీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బంద్ లో పాల్గొన్నారు. చండూరులో ర్యాలీ నిర్వహించారు. రాస్తారోకో చేశారు. సంస్థాన్‌నారాయణపురంలో వ్యాపారసంస్థలను బంద్ చేయించి, ధర్నా నిర్వహిం చారు. మర్రిగూడలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చౌటుప్పల్‌లో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. -
బాబు చేతిలో మందకృష్ణ కీలుబొమ్మ
హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, కొప్పుల ఈశ్వర్, రాజయ్య మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేలు దొరల తొత్తులు అన్న మందకృష్ణ దళిత జాతికి క్షమాపణలు చెప్పాలని వారు గురువారమిక్కడ డిమాండ్ చేశారు. మందకృష్ణ నియంత్రత్వ ధోరణితో మాదిగ నేతలంతా ఎమ్మార్పీఎస్‌ను వీడుతున్నారన్నారు. ఎన్నికల్లో మందకృష్ణ మూడుసార్లు పోటీ చేసినా ఎవరూ గెలిపించలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. దళిత సామాజిక న్యాయం టీఆర్ఎస్తోనే సాధ్యమని వారు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలో తమ పార్టీ నిర్ణయిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. -
హంగ్.. కింగ్
పాగా వేసేందుకు దృష్టి సారించిన టీఆర్ ఎస్ - ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలపై కన్ను - అధికార పార్టీ అని ఇండిపెండెంట్ల మొగ్గు - 10 మండలాలపై కన్నేసిన గులాబీ నేతలు సాక్షిప్రతినిధి, నల్లగొండ, ప్రాదేశిక ఎన్నికలు ముగిశాక, వెలువడిన ఫలితాలతో టీఆర్ఎస్ శ్రేణులు ఒకింత నిరాశకే గురయ్యాయి. అటు జెడ్పీ, ఇటు ఎంపీపీల విషయంలో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యం కనబరిచింది. 59 జెడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఏకంగా 43చోట్ల గెలిచింది. టీఆర్ఎస్ 13 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన సీట్లు 30 కాగా, కాంగ్రెస్‌కు అదనంగా మరో 13 సీట్లు చేతిలో ఉన్నాయి. దీంతో జెడ్పీ పీఠాన్ని తారుమారు చేసే అవకాశం ఎవరికీ కనిపించడం లేదు. కానీ, మండలాల్లో అధ్యక్ష పదవులను కైవసం చేసుకోవడానికి ఇప్పుడు టీఆర్ఎస్కు అవకాశం కలిసొచ్చింది. వాస్తవానికి 59 మండలాలకు గాను కాంగ్రెస్ 25 చోట పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి ఆయా మండలాల్లో అవసరమైన మెజారిటీ సాధిచింది. కాగా, టీఆర్ఎస్ కేవలం 3 మండలాల్లోనే పాలకవర్గాలను ఏర్పాటు చేసేంత మెజారిటీ పొందింది. కానీ, 28 మండలాల్లో ఏ పార్టీకి అవసరమైన మెజారిటీ రాక హంగ్ ఏర్పడింది. ఇపుడదేఁహంగ్ మండలాలను తన ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన తుంగతుర్తి, ఆలేరు, మునుగోడు మండలాల్లోని అత్యధిక మండలాలను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇండిపెండెంట్ల సాయంతో మండల పాలక వర్గాలను ఏర్పాటు చేసేందుకు పక్కా వ్యూహంతో ఉంది. అధికార పార్టీ కావడం, స్థానికంగా ఎమ్మెల్యే కూడా ఉండడం వంటి కారణాలతో ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎంపీటీసీ సభ్యులు టీఆర్ఎస్కే జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని చోట్ల ఒకరూ, ఇద్దరు చొప్పున ఉన్న ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు సైతం టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. పెద్దగా కష్టపడకుండానే హంగ్ ఏర్పడిన మండలాల్లో మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే పరిస్థితే కనిపిస్తోంది. ఇదీ.. లెక్క మునుగోడు నియోజకవర్గం పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు 7. కాగా, టీఆర్ఎస్కు ఇక్కడ 4 సీట్లు చేతిలో ఉన్నాయి. మరో ఆరుగురు ఇండిపెండెంట్లు ఉండడంతో వీరిలో ముగ్గురిని తమవైపు లాగేసుకుంటే ఈ మండలం టీఆర్ఎస్ సొంతం అవుతుంది. నాంపల్లి మండలం అధ్యక్ష పదవిని దక్కించుకోవాలంటే 7 సీట్లు కావాలి. కాగా, టీఆర్ఎస్కు 4 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ చేతిలో 5 సీట్లున్నా, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలిచారు. వీరిని టీఆర్ఎస్ తమలో కలిపేసుకునే అవకాశం ఉంది. వీరు మొగ్గితే ఈ మండలమూ టీఆర్ఎస్ ఖాతాలో చేరిపోతుంది. ఆలేరు నియోజకవర్గం పరిధిలోని యాదగిరిగుట్ట మండలంలో పాలకవర్గం ఏర్పాటు చేయడానికి 9 సీట్లు కావాలి. కాగా, ఇక్కడ టీఆర్ఎస్ చేతిలో 8 సీట్లు ఉన్నాయి. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. దీంతో ఒక్కరి మద్దతు పొందితే చాలు, ఈ మండలమూ టీఆర్ఎస్ చేతిలోకి వెళ్లిపోతుంది. రాజాపేట మండలంలోనూ ఇదే రకమైన పరిస్థితి. పాలకవర్గం ఏర్పాటు చేయడానికి 6 సీట్లు అవసరం కాగా, టీఆర్ఎస్కు 5 సీట్లున్నాయి. మరో ఇండిపెండెంటు కూడా ఉన్నారు. ఈయన మద్దతుతో మండల అధ్యక్ష పదవి టీఆర్ఎస్దే. ఇక్కడ కాంగ్రెస్‌కు 4 సీట్లే వచ్చాయి. తుర్కపల్లి మండలంలో టీఆర్ఎస్ 5 సీట్లు గెలుచుకున్నా, పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఒక సీటు తక్కువగా ఉండడంతో ఇతరుల వైపు చూస్తోంది. ఒక సీటు చేతిలో ఉన్న టీడీపీ మద్దతు కూడగ ట్టడం కానీ, లేదంటే 4 సీట్లున్న కాంగ్రెస్ నుంచి ఒకరిని లాగేసుకోవడం కానీ ఇప్పుడు టీఆర్ఎస్ చేయాల్సి ఉంది. ఎమ్మెల్యే ఉండడం కలిసొచ్చే అంశం గుండాలలో ఆరు సీట్లున్న వారే పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాగా, టీఆర్ఎస్ చేతిలో 4 సీట్లున్నాయి. కాంగ్రెస్, సీపీఐలకు చెరో రెండు సీట్లున్నా, మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉండడంతో వారికి టీఆర్ఎస్ గాలం వేస్తోంది. ఇదే జరిగితే, ఈ మండలమూ టీఆర్ఎస్ ఖాతాలో చేరినట్లే. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని అర్వపల్లిలో 7 సీట్లుంటే పాలకవర్గాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ, టీఆర్ఎస్ చేతిలో 5 సీట్లే ఉండడంతో, 3 సీట్లున్న ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకొనే పనిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు కేవలం 2 సీట్లే ఉండడంతో ఆ పార్టీ కనీస ప్రయత్నం చేసే పరిస్థితి కూడా లేదు. ఈ మండలాలే కాకుండా మర్రిగూడ, తిరుమలగిరి, శాలీగౌరారం మండలాల్లోనూ ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుని ఉండడం, ఈ మండల్లాల్లోనూ హంగ్ ఏర్పడినందున మెజారిటీ తక్కువగా ఉన్నా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నందున పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని కూడగట్టే పనిలో ఉన్నారు. -
నేను ఒంటరి కాదు...నాతో మరికొందరు
హైదరాబాద్ : తాను ఒక్కడినే కాదని.... తనతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరతారని ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల శాసనసభ్యుడు అరవింద్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ ఫిబ్రవరి పదో తేదీ తర్వాత మరికొంతమంది తనతో వస్తారని అన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఈరోజు కలిసేందుకు ప్రయత్నిస్తామని అరవింద్ రెడ్డి తెలిపారు. 'తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినందుకే టీఆర్ఎస్లో చేరిన. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ చాలాసార్లు అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ అవసరం ఏమిటి? తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత ఉండొద్దా? కొందరిని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేయడానికే టీఆర్ఎస్ పుట్టిందా?’ అని అరవింద్ రెడ్డి ప్రశ్నించారు. -
'నాతో పాటు మరికొంతమంది కాంగ్రెస్‌లోకి'
హైదరాబాద్ : ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ నేతలు తమ వ్యూహాలు మార్చుతున్నారు. ఏ పార్టీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందో ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుని జంప్ జిలానీలు అవుతున్నారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందే టీఆర్ఎస్లో కలహం మొదలయ్యింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగి.. హస్తాన్ని అంది పుచ్చుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల టీఆర్ఎస్ శాసన సభ్యుడు గడ్డం అరవింద్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. హస్తిన నుంచి తిరిగి వచ్చిన ఆయన తనతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అనుచ బాంబు పేల్చారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చాలాసార్లు తాను కేసీఆర్‌కు చెప్పానన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత సోనియాగాంధీదేని అరవింద్ రెడ్డి కొనియాడారు. ‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ ఆవిర్భవించిన కారణం పూర్తయింది. తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి కృతజ్ఞత చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయండి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలం అంతా మీ వెంటనే ఉంటాం. ఇంకా గడువును పెంచొద్దు’ అని దిగ్విజయ్ సింగ్‌కు అరవింద్‌రెడ్డి వివరించినట్లు సమాచారం. ఊహించని ఈ భేటీ టీఆర్ఎస్ను షాక్‌కు గురి చేసిందని, కాంగ్రెస్ వైఖరిపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. -
నా చొక్కా పట్టుకుంటారా