
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్ చంచల్ గూడ జైల్ నుండి విడుదల అయ్యారు. అయితే జైలు నుంచి బయటకి రాగానే ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నందకుమార్ పై బంజారాహిల్స్ పీఎస్ లో నమోదైన చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతిని ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రభారతి, నందకుమార్ లను పోలీసులు బంజారాహిల్స్ పీఎస్ కి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే సింహయాజీ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్ లకు డిసెంబర్ 1న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పాస్ పోర్టులను సిట్ అధికారులకు అప్పగించడంతో పాటు సాక్ష్యులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని షరతు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment