Bail
-
నాన్న కోసం అల్లు అర్హ ఎదురుచూపులు.. వీడియో వైరల్
స్టార్ హీరో అల్లు అర్జున్.. చంచల్‌గూడ జైలు నుంచి ఉదయం 6:45 గంటలకు విడుదలయ్యాడు. సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4 రాత్రి జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జైలుకి తీసుకెళ్లేలోపు 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది. (ఇదీ చదవండి: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల.. అసలేం జరిగింది?)బెయిల్ వచ్చినా సరే తమకు సమర్పించిన పేపర్లలో సమాచారం సరిగా లేదని.. చంచల్‌గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది. అండర్ ట్రైల్ ఖైదీగా.. ఖైదీ నంబర్ 7697 ఇచ్చి మంజీరా బ్యారక్ క్లాస్-1 రూంలో రాత్రంతా ఉంచారు. అయితే భోజనం చేయకుండా రాత్రంతా నేలపైన బన్నీ పడుకున్నట్లు తెలుస్తోంది.ఉదయం జైలు గేటు ముందు ఫ్యాన్స్, మీడియా ఉండగా.. వెనక గేటు నుంచి బన్నీని పోలీసులు బయటకు పంపించారు. అయితే నేరుగా ఇంటికెళ్లకుండా గీతా ఆర్ట్స్ కార్యాలయాలనికి వెళ్లాడు. మరోవైపు ఇంటి దగ్గర తండ్రి కోసం అర్హ ఎదురుచూస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు)#alluarha waiting for her Dad #AlluArjun #alluaarjunarrest pic.twitter.com/pkWDdYQGjA— SRK (@SRKofficial67) December 13, 2024 -
ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేం
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుపై సినీ నటుడు మంచు మోహన్‌బాబు దాడి చేసిన కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఆ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి (19వ తేదీ)వాయిదా వేసింది. తన కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలోని ఇంటి ఆవరణలో మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి చేశారంటూ పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారమే కేసు నమోదైనప్పటికీ న్యాయ సలహాలు తీసుకున్న పోలీసులు, గురువారం బీఎన్ఎస్ 109 (హత్యాయత్నం) సెక్షన్ జోడించారు.కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్‌బాబు హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జర్నలిస్ట్లమంటూ చాలామంది ఇంట్లోకి తోసుకొచ్చారని, ఈ క్రమంలో అనుకోకుండా దాడి జరిగింది తప్ప కావాలని చేసింది కాదని చెప్పారు. ఏపీపీ జితేందర్‌రావు వాదనలు వినిపిస్తూ..మోహన్‌బాబు కుమారుడు మనోజ్ ఆహ్వానం మేరకే వారు వచ్చారని చెప్పారు. చానల్ లోగోతో కొట్టడంతో జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారని.. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. -
అల్లు అర్జున్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ను శుక్రవారం అరెస్టు చేశారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు, గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపు, చంచల్‌గూడ జైలుకు తరలింపు అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. అదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై వాదనలు, సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. రాత్రి వరకు కాపీ అందకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.అదే సమయంలో అల్లు అర్జున్ను తరలించిన ప్రతిచోటా భారీగా పోటెత్తిన అభిమానులు, ప్రముఖుల రాకతో దాదాపు 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. చివరికి అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఆయనను శనివారం ఉదయం విడుదల చేయనున్నట్టు జైలు సూపరింటెండెంట్ ప్రకటించారు. బెడ్రూమ్ వరకు వెళ్లి అరెస్టు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి ఠాణాలో నమోదైన కేసులో పోలీసులు ఠాణాలో నమోదైన కేసులో పోలీసులు ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు. శుక్రవారం అల్లు అర్జున్ను అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఉదయం నుంచీ తగిన ఏర్పాట్లు చేసుకున్న టాస్‌్కఫోర్స్, చిక్కడపల్లి పోలీసులు 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో అర్జున్ తండ్రి అల్లు అరవింద్, భార్య స్నేహరెడ్డి ఇంట్లోనే ఉన్నారు. వారిద్దరూ బయటికి వెళ్లేవరకు సమీపంలోనే వేచి ఉన్న పోలీసులు.. ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించారు.ఆ సమయంలో అల్లు అర్జున్ షార్ట్స్, టీ–షర్ట్ ధరించి.. ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ సమీపంలో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నారు. ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు.. సంధ్య థియేటర్ కేసులో అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ‘సరే మీ పని మీరు చేసుకోండి’ అంటూ పోలీసులకు సహకరించిన అల్లు అర్జున్.. బట్టలు మార్చుకోవడం కోసం రెండు నిమిషాలు సమయం కోరారు. దీనికి అనుమతించిన పోలీసులు.. ఆయన వెంటే బెడ్రూమ్ వరకు వెళ్లారు. ఈలోపు విషయం తెలుసుకున్న అరవింద్, స్నేహరెడ్డి, అర్జున్ సోదరుడు శిరీష్ ఇంటికి చేరుకున్నారు. అరెస్టు చేసినా ఫర్వాలేదు.. కాఫీ తాగండి! పోలీసులు అల్లు అర్జున్ను ఆయన ఇంటి మొదటి అంతస్తులో ఉన్న బెడ్రూమ్ నుంచి కింద ఉన్న హాల్లోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడున్న తండ్రి అల్లు అరవింద్ కాసింత ఆందోళన చెందారు. అర్జున్ను హత్తుకుని ‘అరెస్టు చేస్తున్నారు.. చెయ్యనీ.. నువ్వేమీ కంగారు పడకు’ అంటూ ధైర్యం చెప్పారు. తర్వాత అల్లు అర్జున్, పోలీసులు ఇంటి బయట పోరి్టకో వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ పోలీసు వాహనాలను సిద్ధం చేశారు. అల్లు అర్జున్ కాఫీ తాగడానికి ఆగారు. ఇంట్లో నుంచి తెచ్చిన కాఫీని తన సమీపంలో ఉన్న ఓ పోలీసు అధికారికి ఇవ్వబోయారు. అధికారి కాఫీ వద్దని చెప్పడంతో ‘అది అదే (అరెస్టు చేసుకోండి).. ఇది ఇదే (కాఫీ తాగండి)’ అని నవ్వుతూ పేర్కొన్నారు. కాఫీ తాగడం పూర్తయ్యాక పోలీసులను ఉద్దేశించి ‘రెడీ సార్.. కాఫీ అయిపోయింది’ అంటూ ముందుకు నడిచారు. బెడ్రూం వరకు రావడం సరికాదు.. ఇంటి ముందు పోలీసు వాహనం ఎక్కే సమయంలో అల్లు అర్జున్ పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘బట్టలు మార్చుకోవడానికి వెళ్లి వస్తానని, ఒకరిని పంపాలని కోరితే ఇంత మంది పోలీసుల బెడ్రూమ్ వరకు వచ్చారు. నన్ను అరెస్టు చేయడంలో తప్పులేదు, తీసుకువెళ్లడం తప్పులేదు. కానీ రెండు నిమిషాలు టైమ్ ఇవ్వాలని కోరితే బెడ్రూమ్ వరకు వచ్చి ఇలా చేశారు. ఇది సరికాదు..’’ అని పేర్కొన్నారు. తర్వాత తన భార్యకు వీడ్కోలు చెప్పారు. అయితే అల్లు అర్జున్ పోలీసు వాహనం ఎక్కుతుండగా.. తానూ అదే వాహనంలో వస్తానంటూ అల్లు అరవింద్ బయలుదేరారు.అయితే తన తండ్రి పోలీసు వాహనంలో రాకూడదని భావించిన అర్జున్.. ‘మీరు పోలీసు వాహనంలో ఉంటే మీడియాలో అలానే వస్తుంది. ఏ క్రెడిట్ వచ్చినా నా మీదనే ఉండాలి. గుడ్ అయినా, బ్యాడ్ అయినా..’’ అని ఆపేశారు. దీంతో పోలీసులు అల్లు అర్జున్ను తీసుకుని చిక్కడపల్లి ఠాణాకు బయలుదేరారు. అప్పటికే ఆ ప్రాంతమంతా అల్లు అర్జున్ అభిమానులతో నిండిపోయింది. ఠాణాలో గంటన్నర పాటు విచారణ.. పోలీసులు అల్లు అర్జున్ను చిక్కడపల్లి ఠాణాలో దాదాపు గంటన్నర పాటు విచారించారు. ఠాణా వద్దకు అల్లు శిరీష్, అల్లు అరవింద్, అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి, దిల్ రాజు సహా పలువురు సినీ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. పోలీసులు అల్లు అర్జున్‌తోపాటు శుక్రవారం ఉదయమే అదుపులోకి తీసుకున్న సంధ్య థియేటర్ పర్సనల్ మేనేజర్ జేబీ సంతోష్‌కుమార్‌ల అరెస్టు ప్రక్రియను పూర్తి చేసి, రిమాండ్ రిపోర్టులు తయారు చేశారు. ఇద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నేరుగా సూపరింటెండెంట్ రాజకుమారి చాంబర్‌కు తీసుకెళ్లి.. అప్పటికే సిద్ధంగా ఉంచి పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహించారు.అనంతరం వారిని నాంపల్లి కోర్టుకు తరలించారు. గాంధీ ఆస్పత్రికి వచ్చిన అల్లు అరవింద్ వైద్య పరీక్షల సమయంలో కుమారుడి వెంటే ఉన్నారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. గాంధీ ఆస్పత్రి చుట్టుపక్కల ప్రాంతాలు సైతం అభిమానులతో నిండిపోయాయి. ఆస్పత్రి సిబ్బంది అభ్యర్థన మేరకు వారితో అల్లు అర్జున్ ఫొటోలు దిగారు. మరోవైపు సినీ నటుడు చిరంజీవి, ఆయన భార్య సురేఖ, నాగబాబుతోపాటు పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు అల్లు అర్జున్, సంతోష్‌లను చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దాదాపు గంటన్నరకుపైగా ఇరుపక్షాల న్యాయవాదుల వాదోపవాదాలు జరిగాయి. చివరికి అల్లు అర్జున్, సంతో‹Ùలకు 14 రోజుల జ్యుడిíÙయల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు ఇరువురినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు అదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. దీంతో అల్లు అర్జున్ నాలుగు గంటలకుపైగా జైలు రిసెప్షన్లోనే వేచిచూశారు. చివరికి హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అవుతారని భావించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. రిమాండ్ ఖైదీ నంబర్ 7697తో.. అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతో ఆయన శుక్రవారం రాత్రి రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా.. దానికి సంబంధించిన కాపీ రాత్రి వరకు కూడా ఆన్లైన్లో అప్లోడ్ కాలేదు. అల్లు అర్జున్ న్యాయవాదులు సరి్టఫైడ్ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చినా.. ఒరిజినల్ పత్రాలు కావాలంటూ జైలు అధికారులు అంగీకరించలేదు. రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్ను జైలు రిసెప్షన్లోనే ఉంచిన సిబ్బంది.. ఆపై మంజీరా బ్యారక్‌లోని క్లాస్–1 రూమ్‌కు తరలించారు. రిమాండ్ ఖైదీగా నంబర్ 7697ను కేటాయించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ రాత్రి 10.30 గంటల వరకు చంచల్‌గూడ జైలు వద్దే ఉన్నారు. బెయిల్ కాపీ అందితే తన కుమారుడిని వెంట తీసుకువెళ్లాలని భావించారు. కానీ బాధగా ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటికి వెళ్లిపోయారు. ఇక తమ అభిమాన హీరోకు బెయిల్ వచ్చినా విడుదల చేయకపోవడంపై అర్జున్ అభిమానులు జైలు వద్ద నిరసన తెలిపారు. క్షణక్షణం హైడ్రామా.. ఉత్కంఠ మధ్య.. ఉదయం 11.45: అల్లు అర్జున్ ఇంట్లోకి పోలీసులు మధ్యాహ్నం 12: అరెస్టు చేస్తున్నట్టు అల్లు అర్జున్‌కు చెప్పిన పోలీసులు 12.20: జూబ్లీహిల్స్ నివాసం నుంచి చిక్కడపల్లికి తరలింపు 12.40: చిక్కడపల్లి ఠాణా వద్దకు వచ్చిన దిల్ రాజు, ఇతర ప్రముఖులు 1.00: చిక్కపడపల్లి ఠాణాకు అల్లు అర్జున్‌తో చేరుకున్న పోలీసులు 1.10: పోలీసుస్టేషన్ వద్దకు అల్లు శిరీష్, అరవింద్ 1.15: రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసిన దర్యాప్తు అధికారి 2.00: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ తరలింపు 2.19: అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు ప్రారంభించిన వైద్యులు 2.30: అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, ఆయన భార్య సురేఖ 2.45: అల్లు అర్జున్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి 3.10: నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్.. లాయర్ల వాదనలు 5.00: అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధింపు 5.28: చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్ తరలింపు 5.40: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు 7.15: బెయిల్ పేపర్లతో చంచల్‌గూడ జైలుకు చేరుకున్న లాయర్లు 7.30: ఆ పత్రాలు సక్రమంగా లేకపోవడం, ఆర్డర్ ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో జైల్లోనే బన్ని 10.00: జైలు రిసెప్షన్ నుంచి మంజీరా బ్యారక్‌కు అల్లు అర్జున్ -
అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్
-
మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు: RGV
-
ఆధారాల్లేకుండా అరెస్టులా?
సాక్షి, అమరావతి : పోలీసులు ఆయా కేసుల్లో నిందితులు ఇచ్చే వాంగ్మూలాలను సాక్ష్యంగా పరిగణించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేసుల దర్యాప్తు విషయంలో రాష్ట్ర వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. వాంగ్మూలాలను అడ్డం పెట్టుకుని నిందితులను నెలల తరబడి జైళ్లలో ఉంచాలంటే సాధ్యం కాదని తేల్చి చెప్పింది. వాంగ్మూలాలను సాక్ష్యాలుగా పరిగణించాలన్న ప్రభుత్వ వాదనను సైతం తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. ఈ వాదనతో ఏ మాత్రం ఏకీభవించలేమంది. సహ నిందితుల వాంగ్మూలాలను తమను (కోర్టులను) కూడా పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారని, ఇది ఎంత మాత్రం సాధ్యం కాని పని అని స్పష్టం చేసింది. ఆధారాలు సేకరించకుండా వాంగ్మూలాలపై ఆధార పడాలంటే ఎలా? అంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. వాంగ్మూలాల ఆధారంగా ఇతరులను నిందితులుగా చేర్చి, అరెస్ట్ చేస్తున్న పోలీసులు.. ఆ తర్వాత ఎలాంటి దర్యాప్తు చేయకుండా, ఎలాంటి ఆధారాలు సేకరించకుండా నెలల తరబడి నిందితులను జైళ్లలో ఉంచుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. వాంగ్మూలాలు కేవలం దర్యాప్తునకు ఓ దారి చూపుతాయే తప్ప, వాటిని సాక్ష్యంగా తీసుకోజాలమంది. దర్యాప్తు చేయనప్పుడు నిందితులను జైళ్లలో ఉంచడం అనవసరమంది. వాళ్లను ఊరికే జైళ్లలో ఉంచి, ప్రజల డబ్బును ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించింది. పేపర్ ఖాళీగా ఉందని వాంగ్మూలాల పేరుతో ఏది పడితే అది రాసేస్తామంటే ఎలా అంటూ నిలదీసింది. వాంగ్మూలాలను చూస్తుంటే నిందితులంతా రాష్ట్రానికి విశ్వాస పాత్రులుగా కనిపిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేనప్పుడు ఏ కారణంతో బెయిల్ ఇవ్వొద్దని కోర్టులను కోరుతారని పోలీసులను నిలదీసింది. చాలా కేసుల్లో ఇంతే.. ఆయా కేసుల్లో రాష్ట్రం తీరు ఎంత మాత్రం సరిగా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్ల విషయంలో రాష్ట్రం చాలా రొటీన్‌గా వ్యవహరిస్తోందని, దీంతో హైకోర్టులో పుంఖాను పుంఖాలుగా బెయిల్ పిటిషన్లు దాఖలవుతున్నాయని తెలిపింది. వీటి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి న్యాయం కోసం ఎంతో మంది హైకోర్టును ఆశ్రయిస్తున్నారని చెప్పింది. వీళ్లంతా నవ్వులాటకు ఈ బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని అనుకుంటున్నారా? అంటూ తీవ్ర స్వరంతో పోలీసులను ప్రశి్నంచింది. గంజాయి కేసులో విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమిట్ట గ్రామం వద్ద పట్టుబడిన లారీ డ్రైవర్ వాంగ్మూలం ఆధారంగా హనుమంతరావు అనే వ్యక్తిని నిందితునిగా చేర్చి, అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను సేకరించకుండా అతన్ని నాలుగు నెలలుగా జైల్లో ఉంచడంపై మండి పడింది. అతనికి బెయిల్ ఇవ్వొద్దని కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హనుమంతరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హనుమంతరావు నుంచి ఎలాంటి గంజాయిని స్వాదీనం చేసుకోలేదని తెలిపింది. అతనికి వ్యతిరేకంగా పోలీసులు ఒక్క కాగితం ముక్కను కూడా ఆధారంగా చూపలేకపోయారని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ రాష్ట్రం తీరును తీవ్రంగా గర్హించారు. పీపీ వాదనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దానిని తన ఉత్తర్వుల్లో రికార్డ్ చేశారు. -
HYD: కౌశిక్‌రెడ్డికి అర్ధరాత్రి బెయిల్
సాక్షి,హైదరాబాద్:బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ సీఐని దుర్భాషలాడిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం(డిసెంబర్5)అర్ధరాత్రి ఒంటిగంటకు కొత్తపేటలోని జడ్జి నివాసంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు.రూ.5వేల పూచీకత్తుతో కౌశిక్‌రెడ్డికి బెయిల్ ఇచ్చారు.కౌశిక్‌రెడ్డికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా జడ్జి నివాసం వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్,రాగిడి లక్ష్మారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులతో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. కౌశిక్‌రెడ్డిని గురువారం ఉదయం ఆయన ఇంటివద్ద బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు హైడ్రామా జరిగింది. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగి అడ్డుకోవడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం విడుదల చేశారు. ఇదీ చదవండి: కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత -
అత్యాచారం కేసులో నటుడు సిద్ధిఖీకి ఊరట
మలయాళ నటుడు సిద్ధిఖీకి భారీ ఊరట లభించింది. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటులతో పాటు దర్శకులు కూడా నటీమణులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని జస్టిస్ హేమ కమిటీ చేసిన రిపోర్ట్‌తో అక్కడి నటీమణులు చాలామంది గతంలో తమకు జరిగిన అన్యాయాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలో కొందరు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు.2016లో నటిపై అత్యాచారంమలయాళ నటి రేవతి సంపత్ చేసిన ఆరోపణలతో సిద్ధిఖీపై కేసు నమోదైంది. 2016లో తిరువనంతపురంలోని మస్కట్ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ముందుగా ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఫేస్బుక్ ద్వారా తనకు సిద్ధిఖీ పరిచయం అయ్యాడని, ఆపై తన కోరికను తీర్చాలని బలవంతం చేసినట్లు పేర్కొంది. అందుకు తాను నిరాకరించడంతో ఒక పథకం ప్రకారం తనను హోటల్‌కు రప్పించి సిద్ధిఖీ అత్యాచారం చేసినట్లు రేవతి తెలిపింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే, చాలారోజులుగా పరారీలో ఉన్న ఆయనకు తాజాగా బెయిల్ లభించింది. సిద్ధిక్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ, నటుడు ఎలాంటి తప్పు చేయలేదని, ఫిర్యాదుదారు అభియోగాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఫిర్యాదుకు ఎనిమిదేళ్లు ఎందుకు: కోర్టుసిద్ధిఖీకి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరును జస్టిస్ బేలా త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తాజాగా తీర్పు వెల్లడించింది. అయితే, ఈ కేసులో సిద్ధిఖీపై ఫిర్యాదు చేయడానికి ఎనిమిదేళ్ల జాప్యం ఎందుకు అయిందని కోర్టు ప్రశ్నించింది. ఈ కారణంతోనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ, అవసరమైతే పోలీసుల విచారణకు సిద్ధిఖీ సహకరించాలని సూచించింది. ఈ క్రమంలో తన పాస్‌పోర్ట్‌ను ట్రయల్ కోర్టులో డిపాజిట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఫిర్యాదు విషయంలో ఆలస్యానికి బాధితురాలి తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ ఇలా మాట్లాడారు. హేమా కమిటీ నివేదికను విడుదల చేయడం ఆపై కేరళ హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే అత్యాచార బాధితురాలికి ఫిర్యాదు చేయడానికి ధైర్యం వచ్చిందని వారు అన్నారు. -
దర్శన్‌కు దీపావళి!
సాక్షి, బళ్లారి, బనశంకరి: దీపావళి సంబరాల సమయంలో ప్రముఖ నటుడు దర్శన్‌కు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. ఆయనకు బెంగళూరులోని హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. చిత్రదుర్గానికి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, ప్రియురాలు పవిత్రగౌడ సహా మరికొందరు నిందితులు 140 రోజుల నుంచి జైలులో ఉన్నారు. దర్శన్‌కు 6 వారాలు పాటు బెయిలు అమల్లో ఉంటుంది.కోర్టులో వాదనలు..తీవ్రమైన వెన్నునొప్పి సమస్యను చూపుతూ బెయిలు పిటిషన్ వేయగా కొన్నిరోజులుగా విచారణ సాగుతోంది. న్యాయమూర్తి విశ్వజిత్శెట్టి ధర్మాసనం చివరకు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. దర్శన్‌కు వెన్నులో ఎల్–5, ఎస్–1 డిస్క్‌లలో సమస్య ఉంది. మైసూరులో చికిత్స తీసుకోవాలని దర్శన్ న్యాయవాది నాగేశ్ వాదించారు. సర్కారు వకీలు ప్రసన్నకుమార్ బెయిలు ఇవ్వరాదని వాదించారు. కాలిలో శక్తి కోల్పోయినట్లు ఉందని, చికిత్స తీసుకోకపోతే మూత్ర నియంత్రణ కోల్పోవడంతో పాటు మునుముందు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రి నరాలరోగ నిపుణుడు విశ్వనాథ్ నివేదిక ఇచ్చారని నాగేశ్ తెలిపారు. దర్శన్ ఇప్పటికే రెండుసార్లు మైసూరు ప్రైవేటు ఆసుపత్రి శస్త్రచికిత్స చేసుకున్నారని చెప్పారు.జైలువద్దకు భార్యాపిల్లలుబెయిల్ లభించగానే దర్శన్ సతీమణి విజయలక్ష్మి, కుమారుడు, బంధువులు బళ్లారి సెంట్రల్ జైలుకు వచ్చారు. కోర్టు నుంచి పత్రాలు అందిన తరువాతే జైలు నుంచి దర్శన్‌ను విడుదల చేస్తారని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. జైలు వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు.తప్పుచేసిన వారికి శిక్షపడాలిరేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య హరిహరలో విలేకరులతో మాట్లాడుతూ కొడుకు హత్యతో చాలా బాధలో ఉన్నాము. కోడలు కాన్పు కోసం ఇక్కడ పుట్టింటికి వచ్చింది. కొడుకు పుట్టిన సంతోషం కూడా లేకుండా పోయింది. ఎవరు తప్పుచేసినా శిక్షపడాలనేది మా డిమాండ్. నిందితులకు శిక్ష పడేవరకు పోరాటం ఆపేది లేదని చెప్పారు. -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు ఇద్దరి పూచీకత్తును రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టులో మేజి్రస్టేట్‌కు సమర్పించాలని జానీని ఆదేశించింది. బాధితురాలి వ్యక్తిగత జీవితంలో జానీగాని, అతని కుటుంబ సభ్యులుగానీ ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, బాధితురాలిని కలిసే ప్రయత్నం కూడా చేయవద్దని స్పష్టం చేసింది. జానీ మాస్టర్ తనను వేధించారని, పలుమార్లు అత్యాచారం చేశారని, మైనర్‌గా ఉన్నప్పుడే తనపై అత్యాచారం చేశారంటూ అతని అసిస్టెంట్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.పైగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. గత నెలలో గోవాలో అరెస్టు చేశారు. అయితే, జాతీయ అవార్డు తీసుకునేందుకు ఈ నెల 6 నుంచి 10 వరకు ట్రయల్ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచి్చంది. కానీ ఆయనకు ఇచి్చన అవార్డును వెనక్కు తీసుకోవడంతో బెయిల్ రద్దయింది. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. హైకోర్టుకు మాజీ డీసీపీ
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్‌లో కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు హైకోర్టులో శుక్రవారం(అక్టోబర్18) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావు అరెస్టయి రిమాండ్‌లో ఉన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావును పంజాగుట్ట పోలీసులు ఏ4గా చేర్చారు. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బెయిల్‌పై తదుపరి విచారణ ఈనెల 23కు హైకోర్టు వాయిదా వేసింది. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మరో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. పోలీసులు ఆయనను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదీ చదవండి: స్పెల్లింగ్ చెబితే.. రేవంత్‌కు రూ.50 లక్షల బ్యాగ్ గిఫ్ట్ ఇస్తా: కేటీఆర్ -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు పోలీసులు బిగ్ షాక్
-
రేణుకాస్వామి హత్యకేసులో ఇద్దరికి బెయిల్
బనశంకరి: సంచలనాత్మక రేణుకాస్వామి హత్య కేసులో ఇద్దరు నిందితులకు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ప్రముఖ నటుడు, రెండవ నిందితుడు దర్శన్ బెయిల్ అర్జీ విచారణను 27వ తేదీకి నగర 57వ సీసీహెచ్.కోర్టు వాయిదావేసింది. కానీ 15, 17 నిందితులుగా ఉన్న కార్తీక్, నిఖిల్నాయక్కు బెయిలు జారీ చేసింది. సాక్షులపై ఒత్తిడి చేయరాదని, పూచీకత్తు ఇవ్వాలని కోర్టు తెలిపింది. పవిత్రాగౌడ బెయిల్ విచారణ 25 కి వాయిదా పడింది. -
బెయిల్ కాదు.. జైలు
సాక్షి, హైదరాబాద్: ‘జైలు కాదు.. బెయిల్’అన్న సుప్రీంకోర్టు న్యాయసూత్రం ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న వారిలో రెండింట మూడో వంతు విచారణ ఖైదీలే. బెయిల్ లాంటి అంశాల్లో సత్వర విచారణ జరపాలని న్యాయ కోవిదులు చెబుతున్నా అమలు మాత్రం ఆమడ దూరం అన్నట్టుగానే ఉంది. బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక, పూచీకత్తు ఇచ్చేవారు లేక విడుదలకు నోచుకోని వారు కూడా ఉండటం మరింత దారుణం.విచారణ జరిగి శిక్షపడే నాటికి.. వారికి పడే శిక్షాకాలం కూడా పూర్తవుతున్న వారు కొందరు ఉండగా, ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలవుతున్న వారు మరికొందరు. అంటే నేరం చేయకున్నా కొందరు జైళ్లలో మగ్గుతున్నారన్న మాట. ఏళ్లుగా జైళ్లలో ఉండి ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలైనా.. వారి జీవితం, కుటుంబాలు ఆగమైనట్టే కదా అనేది బాధితుల వాదన. మరి ఈ విచారణ ఖైదీల సమస్యకు పరిష్కారం ఎప్పుడు.. ఎలా.. అన్నది ప్రశ్నార్థకం. అయితే గత నెల జైలు అధికారులకు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు కొంత ఉపశమనం కలిగించనున్నాయి. యువతే అధికం... విచారణ ఖైదీల్లో అత్యధికం యువతే. 2022 గణాంకాలను పరిశీలిస్తే.. 18–30 ఏళ్ల మధ్య ఖైదీలు 2,15,471 మంది ఉండగా, 30–50 ఏళ్ల మధ్య 1,73,876 మంది ఉన్నారు. మొత్తం 4,34,302 విచారణ ఖైదీల్లో రెండింట మూడోవంతు(66శాతం) యువతే ఉండటం గమనార్హం.విచారణా ఖైదీల హక్కులు.. ⇒సత్వర విచారణ పొందేందుకు అర్హులు ⇒హింస, అమానవీయ ప్రవర్తనకు గురికాకుండా హక్కు ఉంటుంది ళీ సరైన కారణాలను అందించకపోతే జైలు నుంచి కోర్టుకు తరలించేటప్పుడు సంకెళ్లు వేయడానికి వీలులేదు. ⇒కేసు విషయంలో కోర్టుకు దరఖాస్తు చేసుకొని ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు. ⇒అరెస్టు చేసే సమయంలో వారి కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడికి తెలియజేయాలి. ⇒నిర్దిష్ట భద్రతా ప్రమాణాలకు లోబడి కుటుంబ సభ్యులకు ఖైదీని సందర్శించే అవకాశం.సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. 2023లో, అంతకుముందు.. ‘జైలు కాదు.. బెయిల్’అనే సూత్రం ప్రమాణంగా విచారణ సాగాలి. విచారణ ఖైదీలతో జైళ్లు కిక్కిరిసిపోవడం న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఒక వ్యక్తిని కోర్టులో నిలబెట్టి, దోషిగా నిరూపించాలని పోలీసులు ఎక్కువగా భావిస్తున్నారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయం ప్రమాదకరం. ఇది పేద, బలహీన వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బెయిల్ పొందినా ఆర్థిక స్తోమత, పూచీకత్తు ఇచ్చేవారు లేక చాలా మంది జైళ్లలోనే మగ్గుతున్నారు. ఈ కారణాలతో జైళ్లలో సంఖ్య పెరిగిపోతోంది. 2024, ఆగస్టులో... దేశవ్యాప్తంగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్న అండర్ ట్రయల్ ఖైదీలను త్వరితగతిన విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జైళ్ల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం. కొత్త క్రిమినల్ న్యాయచట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 479 ప్రకారం సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మూడు నెలల్లోగా అండర్ ట్రయల్ ఖైదీల దరఖాస్తులను ప్రాసెస్ చేయాలి. అయితే, ఈ నిబంధన మరణశిక్ష లేదా జీవిత ఖైదు వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన అండర్ ట్రయల్‌లకు వర్తించదు. – సుప్రీంకోర్టుఅండర్ ట్రయల్ ఖైదీలకు లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ద్వారా న్యాయ సాయం అందిస్తాం. దీని కోసం జైళ్లకు కూడా వెళతాం. న్యాయ సాయం కావాల్సిన వారికి న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం. బెయిల్ వచి్చన తర్వాత ఒకవేళ పెద్ద మొత్తంలో షూరిటీలు చెల్లించలేని వారు ఉంటే.. కోర్టును సంప్రదించి ఆ మొత్తాన్ని తగ్గించేలా తోడ్పాటునందిస్తాం. –తెలంగాణ లీగల్ సరీ్వసెస్ అథారిటీ -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్
-
బెయిల్‌పై విడుదలైన ఇంజినీర్ రషీద్.. మోదీపై పోరాటం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ బుధవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఢిల్లీ కోర్టు రషీద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. త్వరలో జరగనున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం నిర్వహించేందుకు వీలుగా అక్టోబర్ 2 వరకు బెయిల్ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయన నేడు జైలు నుంచి బయటకు వచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్’ కట్టు కథకు వ్యతిరేకంగా పోరాడతానని శపథం చేశారు. తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ‘అయిదున్నర సంవత్సరాలు జైలులో ఉన్న తర్వాత.. నన్ను నేను బలంగా భావిస్తున్నాను. అలాగే నా నియోజకవర్గ ప్రజల గురించి గర్వపడుతున్నాను.నా ప్రజలను ఎప్పుడూ నిరాశపరచనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లో ఘోరంగా విఫలమైన మోదీ 'నయా కాశ్మీర్' కథనంపై పోరాడతాను. ఆగస్ట్ 5, 2019న ఆయన ఏం చేసినా (ఆర్టికల్ 370 రద్దు) ప్రజలు తిరస్కరించారు’ అని రషీద్ పేర్కొన్నారు.VIDEO | Lok Sabha MP from Jammu and Kashmir's Baramulla Engineer Rashid walks out of Tihar Jail, a day after he was granted interim bail in a terror funding case."After remaining in jail for 5.5 years, I feel myself stronger and proud of my people. I take a pledge that I will… pic.twitter.com/SdsIc9vsu0— Press Trust of India (@PTI_News) September 11, 2024మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పినదాని కన్నా తన పోరాటం పెద్దదని రషీద్ తెలిపారు. ‘ఆయన (ఒమర్ అబ్దుల్లా) పోరాటం కుర్చీ కోసం. నా పోరాటం ప్రజల కోసమని అన్నారు. బీజేపీ తనపై అణచివేత వ్యూహాలను ప్రయోగిస్తోందని ఆరోపించారు. తాను బీజేపీ బాధితుడినని, చివరి శ్వాస వరకు ప్రధాని మోదీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతానని అన్నారు.కాగా 2017లో టెర్రర్ ఫండింగ్ కేసులో ఆయనను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 2019 నుంచి రషీద్ జైలులోనే ఉన్నారు. జైలు నుంచే లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి పోటీ చేసిన రషీద్.. ఒమర్ అబ్దుల్లాను ఓడించి ఎంపీగా గెలుపొందారు. -
అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చేనా..?
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం (సెప్టెంబర్10) విచారించనుంది. బెయిల్ పిటిషన్‌తో పాటు అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.సుప్రీం కోర్టు విచారణలో భాగంగా కేజ్రీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించనున్నారు. ఇది చదవండి: బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సం -
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ
-
స్వాతి మలివాల్‌పై దాడి కేసు: బిభవ్ కుమార్‌కు బెయిల్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్) ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీపై దాడి కేసులో బెయిల్, అరెస్ట్‌ను సవాల్ చేస్తూ బిభవ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీలో 100 రోజులు ఉన్నారని, ఛార్జ్‌షీట్ నమోదైనట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ‘స్వాతి మలివాల్‌కు గాయాలు అయ్యాయి. కానీ ఈ కేసులో బెయిల్ ఇవ్వడాన్ని అడ్డుకోలేం. బెయిల్ నిరాకరిస్తూ జైలులోనే ఉంచేలా చేయలేం’ అని న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ఢిల్లీ పోలీసుల తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఈ కేసులో కొందరు ముఖ్యమైన సాక్షులపై నిందితుడు బిభవ్ కుమార్ ప్రభావం ఉంది. వారిని విచారించడానికి అనుమతి ఇవ్వండి. అప్పుడు తాము బెయిల్‌ను వ్యతిరేకించమని కోర్టుకు తెలిపారు. అలా అయితే.. సొలిసిటర్ జనరల్ చెప్పిన విధంగా తాము ఎవరికీ బెయిల్ మంజూరు చేయలేమని జస్టిస్ భుయాన్ అన్నారు. బెయిల్ మంజూరు చేయకుండా ఉంచటం ఆందోళన కలిగించే విషయమని సుప్రీకోర్టు పేర్కొంది. ఈ దాడి కేసులో సాక్షులందరినీ విచారించే వరకు నిందితుడు బిభవ్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించవద్దని సుప్రీం కోర్టు షరుతు విధించింది.మే 13న స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్‌పై పోలీసులు మే 18న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై తాను చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలకు సంబంధించి పత్రికల్లో వచి్చన కథనాలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తనకు న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉందని, కోర్టు భావనను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘భారత న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆగస్టు 29, 2024న పలు పత్రికల్లో నా పేరిట వచి్చన వార్తల ఆధారంగా గౌరవ న్యాయస్థానం విచక్షణను నేను ప్రశ్నించినట్టుగా కోర్టు భావించడాన్ని అర్థం చేసుకోగలను. న్యాయ ప్రక్రియ పట్ల నాకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని మరోమారు తెలియజేస్తున్నాను. పత్రికల్లో ఆ వ్యాఖ్యలను అసందర్భంగా నాకు ఆపాదించారు. న్యాయవ్యవస్థ, ఆ వ్యవస్థకున్న స్వతంత్రతపై నాకు అపార గౌరవం ఉంది. రాజ్యాంగాన్ని సంపూర్ణంగా విశ్వసించే నేను న్యాయ వ్యవస్థ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాను..’ అని సీఎం పేర్కొన్నారు. -
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీమ్ కోర్టు ఆగ్రహం..
-
కవిత బెయిల్ పై బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
-
సీఎం హోదాలో ఉండి సుప్రీం తీర్పుపై వ్యాఖ్యలా!
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు బెయిలు మంజూరుపై స్పందిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా ఎలా మాట్లాడతారంటూ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తప్పుబట్టారు. ఇలాంటి ప్రకటనల వల్ల ప్రజల్లో భయాందోళనలు కలగొచ్చని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటుకు కోట్లు కేసు దర్యాప్తు హైదరాబాద్ నుంచి భోపాల్‌కు బదిలీ చేయాలంటూ, బీఆర్ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, కల్వకుంట్ల సంజయ్, మొహమ్మద్ అలీలు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ గవాయి, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మార్పు అంశం ప్రస్తావనకు వచ్చిన సమయంలో.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం వల్లే కవితకు బెయిలు వచ్చిందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తులు ఘాటుగా స్పందించారు.మనస్సాక్షి ప్రకారమే విధులు నిర్వర్తిస్తాం‘సుప్రీంకోర్టు తీర్పులపై వచ్చే విమర్శలు పట్టించుకోబోం. మాకెలాంటి ఇబ్బందీ లేదు. మనస్సాక్షి ప్రకారమే విధులు నిర్వర్తిస్తాం. ఇష్టం ఉన్నా లేకపోయినా మా విధులు మేం నిర్వర్తిస్తాం. కానీ న్యాయమూర్తులను అవమానించేలా ఇలాంటి ప్రకటనలు చేయకూడదు. ఆ తరహా ప్రకటనలు ఎలా చేయగలరు? రాజకీయ పార్టీలతో సంప్రదించిన తర్వాత ఆదేశాలు జారీ చేయాలా? రాజకీయ సంప్రదింపుల వరకూ వేచి ఉండాలా? సుప్రీంకోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేసే ధైర్యం ఎవరికైనా ఉంటే, మా తీర్పులపై గౌరవం లేకుంటే.. కేసు విచారణ సుప్రీంకోర్టులో కాకుండా మరెక్కడైనా జరగనివ్వండి..’ అంటూ జస్టిస్ గవాయి ఘాటుగా వ్యాఖ్యానించారు. పదే పదే అలాంటి వ్యాఖ్యలా?‘ఆ తరహా వ్యాఖ్యలు..మళ్లీ గురువారం ఉదయం కూడా! బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తొలి వంద రోజుల్లోనే ఈ తరహా స్టేట్మెంట్లు ఇవ్వడాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. కోర్టుపై ఆక్షేపణలు చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి చేసే బాధ్యతాయుతమైన ప్రకటనేనా ఇది? న్యాయవ్యవస్థకు ఆమడ దూరంలో ఉండడమే కార్యనిర్వాహకుల ప్రాథమిక విధి. విమర్శించండి.. కానీ ఆక్షేపణలు వద్దు..’ అని జస్టిస్ విశ్వనాథన్ స్పష్టం చేశారు.అలాగైతే న్యాయాధికారులపై విశ్వాసం లేనట్లే అవుతుంది..‘ఓటుకు నోటు కేసు విచారణ బదిలీ చేయాలన్న పిటిషన్లు విచారణకు స్వీకరిస్తే న్యాయాధి కారులపై కోర్టుకు విశ్వాసం లేనట్లే అవుతుంది. ఎన్నికల సమయంలో ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తారు. చట్టసభల్లో జోక్యం చేసుకోబోమని ఎప్పుడూ చెబుతుంటాం. వారికీ ఇది వరిç్తÜ్తుంది..’ అని జస్టిస్ గవాయి పేర్కొన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరిగే అవకాశం లేదు: పిటిషనర్ల తరఫు న్యాయవాదివ్యాఖ్యల సవరణకు ప్రయత్నిస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గీ తెలిపారు. అయితే జరగా ల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని, అటువంటి వ్యాఖ్యలు న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకు రావడంతోపాటు దిగువ కోర్టులకూ వ్యాపించే అవకాశం ఉందని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సి.సుందరం పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రస్తుతం సీఎం కావడంతో పాటు ఏసీబీని కూడా తన అధికార పరిధిలో ఉంచుకున్నారని, దర్యాప్తు పారదర్శకంగా జరిగే అవకాశం ఉండదని అన్నా రు. దర్యాప్తు అధికారులు కూడా మారారని చెప్పా రు. గతంలో దాఖలు చేసిన కౌంటరుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పోలీసులపై కూడా రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అని, ఏ వ్యక్తీ తన సొంత విషయంలో న్యాయ మూర్తి కాకూడదనే సహజ న్యాయసూత్రం గుర్తుచేశారు. న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచాలిఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మా సనం.. స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తే దర్యాప్తుపై విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. గతంలో దర్యాప్తుపై స్టే ఇచ్చిన అంశం, సీబీఐకి బదిలీ తదితర అంశాలపై ఆరా తీసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై తెలంగాణకు చెందిన సహచరులను సంప్రదిస్తామని తెలిపింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తామని, అయితే ప్రస్తుత పిటిషన్‌ను కొట్టివేస్తామని పేర్కొంది. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంచాలని, అందరికీ విశ్వాసం కలిగేలా నియామకం చేపడతామని జస్టిస్ గవాయి చెప్పారు. ప్రస్తుత పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్రరావుతో పాటు మరో న్యాయవాది ఉమా మహేశ్వరరావు ఉత్తమమని భావిస్తున్నామ న్నారు. అయితే తమకు పోలీసు అధికారుల విషయంలో ఆందోళన ఉందని పిటిషనర్ల తరఫు మరో సీనియర్ న్యాయవాది శేషా ద్రినాయుడు చెప్పారు. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. -
బెయిల్ నిబంధనలపై సుప్రీం హాట్ కామెంట్స్
-
తెలంగాణలో కవిత బెయిల్ పై రాజకీయ యుద్ధం