
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో అరెస్టై ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న రాహిల్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు 20 వేల షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే హైకోర్టు ఆదేశాలను పాటించాలని రాహిల్‌కు సూచించింది. ఈ మేరకు పోలీస్ కస్టడీ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది.
కాగా ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో రాహిల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత రాహిల్ దుబాయ్‌కు పారిపోయాడు. అతడి కోసం గత కొంత కాలం గాలించిన పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో రహేల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా(ఏప్రిల్ 8న) పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం జడ్జీ ముందు హాజరు పరచగా.. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment