Hit and run case
-
పోలీసులు దర్యాప్తు కొనసాగించవచ్చు
సాక్షి, హైదరాబాద్: చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత.. సమాచారం అందించి కోర్టు అనుమతితో పోలీసులు దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారులు అనుమతి కోరితే అనుమతించే అధికారం కోర్టుకు ఉందని స్ప ష్టం చేసింది. ఇలాంటి అంశాల్లో నిందితుల వాదన వినాలన్న నిబంధన ఎక్కడా లేదని తేల్చిచెప్పింది. రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కారుపై స్టిక్కర్ ఆధారంగా మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా గుర్తించిన పోలీసులు.. ప్రమాద సమయంలో కారులో షకీల్ కొడుకు రాహిల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే అనూహ్యంగా కారు తానే నడిపాను అంటూ ఆఫ్నా న్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులు ఈ కేసులో ఏ1గా ఉన్న రాహిల్‌ను ఏప్రిల్ 8న అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ కేసు తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటి షన్‌పై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టారు. కింది కోర్టులో విచారణ ప్రక్రి య ప్రారంభించాక, సాక్షుల వాంగ్మూలం నమోదు దశలో దర్యాప్తునకు అనుమతించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ న్యాయవాది వాదించారు. రాజకీయ కారణాలతోనే కేసును తిరగదోడుతున్నారన్నారు. కింది కోర్టు ఉత్తర్వులు చట్టబద్ధమేనని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. గతంలో దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందంటూ డీసీపీ ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఆదేశించారని వెల్లడించారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. జూబ్లీహిల్స్ కేసులో విచారణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని అభిప్రాయపడ్డారు. కేసులో దర్యాప్తు కొనసాగించినంత మాత్రాన నిందితులకు ఇబ్బంది ఏం కాదంటూ చెప్పారు. రాహిల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. -
పూణే తరహాలో మరో హిట్ అండ్ రన్.. బైకర్ మృతి
ముంబై: మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఓ మైనర్ బాలుడు మద్యం సేవించి కారు నడిపి.. బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాద ఘటనలో కారు నడిపిన మైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున మైనర్(17) ఎస్యూవీ కారును రాంగ్ రూట్లో నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న నవీన్ వైష్ణవ్(24) తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం, కారు పక్కనే ఉన్న కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మైనర్ గాయపడటంతో కిందపడిపోయాడు. ప్రమాదం జరిగిన తర్వాత మైనర్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికులు అతడిని పట్టుకున్నారు.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని నవీన్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే నవీన్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, నవీన్ వైష్ణవ్ ఆ ఏరియాలో పాలు అమ్మే వ్యక్తిగా గుర్తింంచారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మైనర్‌ను అరెస్ట్ చేశారు. మైనర్‌ను ముంబైకి చెందిన ఇక్బాల్ జివానీ కుమారుడిగా గుర్తించారు. ఈ సందర్భంగా ఇక్బాల్‌పై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు.. ప్రమాదం సమయంలో నిందితుడు మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
నెల వ్యవధిలో మూడు హిట్ అండ్ రన్ కేసులు
ముంబై: మహారాష్ట్రలో వరుసగా చోటు చేసుకుంటున్న హిట్ అండ్ రన్ ఉదంతాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా.. నగరంలో మరో ప్రమాదం జరగ్గా, బాధితుడు ప్రాణం కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 20వ తేదీన వర్లీ ప్రాంతంలో ఓ బీఎండబ్ల్యూ కారు వేగంగా వెళ్తూ.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన బైకర్.. జూలై 27న మృతి చెందారు. ఈ ఘటన జూలై 20న ముంబైలోని వర్లీ ప్రాంతంలో చోటుచేసుకుంది. క్షతగాత్రుడ్ని వినోద్ లాల్(28)గా పోలీసులు నిర్ధారించారు. ఇక ప్రమాదానికి కారణమైన వ్యక్తిని కిరణ్ ఇందుల్కర్గా గుర్తించి అరెస్ట్ చేశారు. ముంబైలో ఈ నెలలో ఇది మూడో హిట్ అండ్ రన్ కేసు. జూలై 7న ముంబైలోని వర్లీలో శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు మిహిర్ షా నడిపిన బీఎండబ్ల్యూ.. ముందు వెళ్తున్న ఓ స్కూటర్‌ను ఢీకొట్టడంతో ఒక మహిళ మరణించగా.. ఆమె భర్త గాయపడ్డాడు. జూలై 22 న ముంబైలో వేగంగా వెళ్తున్న ఆడి కారు రెండు ఆటో-రిక్షాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు ఆటో రిక్షాల డ్రైవర్లు, ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. -
Hit And Run Case: రూ. 1.98 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశం
న్యూఢిల్లీ: గత ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కేసులో దాదాపు రెండు కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ట్రిబ్యూనల్ ఆదేశించింది. రూ.1.21 కోట్లను పరిహారంగా, 77.61 లక్షలను వడ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను మృతుడి తల్లిదండ్రులకు 30 రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించింది.వివరాలు 2016 ఏప్రిల్ 4న ఢిల్లీలో హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. సివిల్స్ లైన్ ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా మెర్సిడెస్ బెంజ్ కారు నడపడంతో రోడ్డు దాటుతున్న 32 ఏళ్ల సిద్ధార్థ్ శర్మ అనే వ్యక్తి మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సిద్ధార్థ్‌ను ఢీకొట్టిన తర్వాత కారు ముందు టైర్ పగిలిపోవడంతో దూరంగా వెళ్లి ఆగిపోయింది. ఘటన అనంతరం నిందితుడైన మైనర్ కారును అక్కడే వదిలి తన స్నేహితులతో కలిసి పారిపోయాడు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైనర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. కారు ఢీకొన్న సమయంలో సిద్ధార్థ్ 20 అడుగుల దూరంలో ఎగిరిపడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. తాజాగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యూనల్ బాధతుడైన సిద్ధార్థ శర్మ తల్లిదండ్రులకు రూ.1.21 కోట్లను పరిహారంగా, 77.61 లక్షలను వడ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను 30 రోజుల్లోగా ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. అంతేగాక కారు రిజిస్ట్రేషన్ చేసిన మైనర్ తండ్రి నుంచి పరిహారం మొత్తాన్ని రికవరీ చేసుకునేదుకు బీమా కంపెనీకి కోర్టు అనుమతినిచ్చింది. మైనర్ కుమారుడిని మెర్సిడెస్ కారు నడుపడం అడ్డుకోవడంలో తండ్రి విఫలమైనట్లు చెబుతూ అతన్ని కూడా బాధ్యులుగా ట్రిబ్యునల్ పేర్కొంది. -
ముంబై బీఎండబ్ల్యూ కేసు: మిహిర్ షాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ముంబై: ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షాకు మంగళవారం ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కోర్డు ఆదేశాల మేరకు నిందితుడు జూలై 30 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారు. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు మిహిర్ షాను పోలీసులు జూలై 9న అరెస్ట్ చేశారు. ఇక ఇదే కేసులో మిహిర్ షా డ్రైవర్ అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేయగా జూలై 11వ తేదీన అతనికి కూడా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితుడి తండ్రి రాజేశ్ షాను పోలీసులు జూలై 7న అరెస్ట్ చేయగా.. ఆయన జూలై 8న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.జులై 7 ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముంబైలోని వర్లీ ప్రాంతంలో మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందువెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల కావేరీ నఖ్వా మృతి చెందగా.. ఆమె భర్త ప్రదీప్ నక్వా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. నిందితుడు తండ్రి మహరాష్ట్ర పాల్ఘర్ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాజేష్ షా కావడంతో ఈ ప్రమాదంపై విమర్శలు వెల్లువెత్తాయి.దీంతో మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే రంగంలోకి దిగారు. నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అతడి ఆచూకీ కోసం 11 పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన 72 గంటల అనంతరం ప్రధాన నిందితుడు మిహిర్ షాను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
మిహిర్ షా : కటింగ్,షేవింగ్ చేసి.. రూటు మార్చి..పోలీసుల్ని ఏమార్చి!
ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా (24) పచ్చి తాగుబోతని (Habitual Drinker) పోలీసులు నిర్ధారించారు. హిట్ అండ్ రన్ కేసులో అరెస్టైన మిహిర్షాను విచారించగా ఈ విషయాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. జులై 7 ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముంబైలోని వర్లీ ప్రాంతంలో మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందువెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల కావేరీ నఖ్వా మృతి చెందగా.. ఆమె భర్త ప్రదీప్ నక్వా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు.నిందితుడు తండ్రి మహరాష్ట్ర పాల్ఘర్ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాజేష్ షా కావడంతో ఈ ప్రమాదంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే రంగంలోకి దిగారు. నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అతడి ఆచూకీ కోసం 11 పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన 72 గంటల అనంతరం ప్రధాన నిందితుడు మిహిర్ షాను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నేను పెద్ద తప్పే చేశాతాజాగా, కేసు విచారణలో మిహిర్షా హిట్ అండ్ రన్లో మహిళ ప్రాణాలు తీసినందుకు పశ్చాతాపపడుతున్నట్లు సమాచారం. మహిళ ప్రాణం తీసి నేను పెద్ద తప్పే చేశా. నా కెరియర్ ఇక ముగిసిందని విచారణలో పోలీసుల ఎదుట విచారం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.కటింగ్, షేవింగ్ చేసిఇక కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు విశ్వప్రయత్నాలు చేశాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు మీసాలు, గడ్డాలు తొలిగించాడు. కటింగ్ కూడా చేయించుకున్నాడని బార్బర్ షాపు యజమాని ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. రాజేష్ షా అరెస్ట్.. బెయిల్‌పై విడుదలహిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా తండ్రి రాజేశ్ షాను పోలీసులు అరెస్ట్ చేసి ముంబై కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు రాజేష్ షా, డ్రైవర్ రాజరిషి బిదావత్లకు వరుసగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, ఒకరోజు పోలీసు కస్టడీ విధించింది. అయితే ఈ కేసులో రాజేష్ షాకు బెయిల్ లభించగా, బిదావత్ పోలీసు కస్టడీని జూలై 11 వరకు పొడిగించింది.కుమారుడు చేసిన ఘన కార్యం.. ముగిసిన తండ్రి పొలిటిక్ కెరియర్కుమారుడు మిహిర్ షా చేసిన ప్రమాదంతో రాజేష్ షా పొలిటికల్ కెరియర్ ఓ రకంగా ముగిసినట్లేనని శివసేన నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి తొలగించినట్లుగా శివసేన వర్గాలు వెల్లడించాయి. పాల్ఘర్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాజేష్ షా హిట్ అండ్ రన్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. -
ముంబై బీఎండబ్ల్యూ ఘటన.. మిహిర్ షాకు పోలీస్ కస్టడీ
ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను జూలై 16 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు. దీంతో నేటి నుంచి ఏడు రోజులపాటు మిహిర్ షాను ముంబై పోలీసులు విచారించనున్నారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలను నిందితుడి నుంచి రాబట్టనున్నారు. అయితే మిహిర్ మొబైల్ ఇంకా రికవరీ కాలేదని పోలీసులు తెలిపారు.కాగా జులై 7న (ఆదివారం తెల్లవారుజామున) మద్యం మత్తులో మిహిర్ షా బీఎండబ్ల్యూ కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 45 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె భర్త గాయాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి మిహిర్ షా పరారీలో ఉన్నాడు. దాదాపు 72 గంటల తర్వాత నిందితుడిని విహార్‌లో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితుడు తండ్రి, శివసేన నాయకుడు రాజేష్ షాను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక ప్రమాదం తర్వాత మిహిర్ తన ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను కారుతో గుద్ది చంపిన తర్వాత కారును విడిచిపెట్టి ఆటో ఎక్కి ఆమె ఇంటికి వెళ్లిన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవచ్చని పేర్కొన్నారు.చదవండి: ముంబై బీఎండబ్ల్యూ ఘటన... నిందితుడి తండ్రిపై శివసేన చర్యలు -
హిట్ అండ్ రన్ కేసు: నిందితుడు మందు తాగిన బార్ కూల్చివేత
ముంబయి: బీఎండబ్ల్యూ కారు హిట్ అండ్ రన్ కేసును మహారాష్ట్ర సర్కారు సీరియస్‌గా తీసుకుంది. కారును వేగంగా నడిపి మహిళ మృతికి కారణమైన మిహిర్ షాను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు కేసులో వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదానికి ముందు నిందితుడు మిహిర్ షా మందు తాగిన జుహూ తారారోడ్లోని బార్పైనా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.తాజాగా బుధవారం(జులై 10) బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ)అధికారులు బార్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పోలీసుల బందోబస్తుతో వచ్చి మరీ కూల్చివేత ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మిహిర్షా అధికార శివసేన పార్టీకి చెందిన నేత రాజేష్ షా కుమారుడు కావడంతో ప్రభుత్వంపై ఈ కేసులో ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. కాగా, ఆదివారం(జులై 7) ఉదయం వర్లిలో చేపలు కొనేందుకు బైక్‌పై వెళ్లిన దంపతులను వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది. ఢీవ కొట్టడమే కాకుండా మహిళను ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలయింది. -
ముంబై బీఎండబ్ల్యూ కేసు.. కీలక నిందితుడి అరెస్ట్
ముంబై: ముంబైలోని వర్లీలో జరిగిన బీఎండబ్ల్యూ కారు రోడ్డు ప్రమాదం కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. మద్యం మత్తులో లగ్జరీ కారు నడుపుతూ దంపతులను ఢీకొట్టి మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైన నిందితుడు మిహిర్ షాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అతడు పరారీలో ఉండగా.. 72 గంటల తర్వాత ముంబయికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరార్‌లోని అపార్ట్మెంట్లో మిహిర్ షాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతని తల్లి, సోదరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని వర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే గత మూడు రోజులుగా కొడుకును దాచి పెట్టడంతో తండ్రి, శివసేన(ఏక్నాథ్ షిండే) నేత రాజేష్ షాా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక షాు అరెస్టుకు ముందు అతడి తప్పతాగి రూ. 18 వేల బిల్ చేసిన ద వైస్ గ్లోబల్ తపస్ బార్‌ను పోలీసులు సీజ్ చేశారు. కాగా ఈ హిట్ అండ్ రన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు కావేరీ నక్వాను నిందితుడు మిహిర్ షా కారు తన బానెట్‌పై సుమారు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన్నట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.కారు బలంగా ఢీకొట్టడంతో కావేరీ నక్వా ఎగిరి కారు బానెట్‌పై పడగా.. అలాగే కిలోమీటర్ దూరం పైగా ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారుమీదున్న బాడీని కిందకు దించాడు. అనంతరం అదే కారు రివర్స్ చేసి ఆమె శరీరం మీద నుంచి పోనిచ్చినట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయని స్థానిక పోలీసులు కోర్టులో వెల్లడించారు అసలేం జరిగిందంటే.. ముంబైలోని వర్లీలో ఆదివారం ఉదయం వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడం వల్ల కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త ప్రదీప్‌కు స్వల్పగాయాలయ్యాయి. చేపలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఈ దంపతులు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు రాజేష్ షా పేరుతో రిజిస్టర్ అయింది. ప్రమాదం అనంతరం నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు తెలిపారు.కారునిందితుడు మిహిర్ శనివారం అర్ధరాత్రి జూహూలోని ఓ బార్లో మద్యం తాగి.. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కారు తానే నడుపుతానని పట్టుబట్టి డ్రైవరు సీటులోకి మారి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే స్పందించారు. చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. ఎవరినీ విడిచిపెట్టబోమని చెప్పారు.కాగా ఈ ప్రమాదం పుణెలో జరిగి పోర్చే కారు ప్రమాద ఘటనను గుర్తు చేసింది. 17 ఏళ్ల మైనర్ బాలుడు మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక ట్విస్టుల అనంతరం నిందితుడు తల్లి, తండ్రి, తాత అరెస్ట్ అయ్యారు. చివరికి నిందితుడైన మైనర్‌ను అతని అత్త సంరక్షణలో ఉండేలా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
ముంబై హిట్ అండ్ రన్ కేసు: ఒళ్లు గగుర్పొడిచేలా.. వెలుగులోకి సంచలన విషయాలు
ముంబై : ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు మిహిర్ షా బాధితురాలు కావేరీ నక్వాను కారు బానెట్‌పై సుమారు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.గత ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో ముంబై వ్రోలి అనే ప్రాంతంలో బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. స్థానిక కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హిట్ అండ్ రన్ ఎలా జరిగిందో పోలీసులు కోర్టుకు వివరాలు అందించారుఈ కేసులో ప్రధాన నిందితుడైన శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా.. పూటుగా మద్యం సేవించి ఉదయం చేపల మార్కెట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న కావేరీ నక్వా, పార్ధిక నక్వా ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టాడు. బలంగా ఢీకొట్టడంతో కావేరీ నక్వా ఎగిరి కారు బానెట్‌పై పడ్డారు. అలాగే కిలోమీటర్ దూరం పైగా ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారుమీదున్న బాడీని కిందకు దించాడు. అనంతరం అదే కారు రివర్స్ చేసి ఆమె శరీరం మీద నుంచి పోనిచ్చినట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయని స్థానిక పోలీసులు కోర్టులో వెల్లడించారు. స్థానికుల సమాచారం, బాధితురాలి భర్త ఫిర్యాదు, సీసీటీవీ పుటేజీ వీడియోల ఆధారంగా ప్రమాదం తర్వాత మిహిర్ షా కారును వదిలేసి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. తప్పించుకునేందుకు అక్కడి నుంచి మరో ప్రాంతానికి పరారయ్యాడని పోలీసులు గుర్తించారు. మిషిర్ షా ప్రియురాల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కాగా ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు మిహిర్ జుహూ ప్రాంతంలోని ఓ బారులో పీకల వరకు మద్యం సేవించినట్టు దర్యాప్తులో తేలింది. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. ఆ బార్లో నిందితుడు రూ.18వేల బిల్లు చేసినట్లు తేలింది.ప్రమాద సమయంలో కారులో మిహిర్‌తో పాటు అతడి డ్రైవర్ కూడా ఉన్నాడు. బార్ నుంచి ఇంటికి వెళ్తూ కారు తానే నడుపుతానని పట్టుబట్టి నిందితుడు డ్రైవర్ సీట్లోకి మారినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతుంది. కాగా,ఇదే కేసులో మిహిర్ మిషిర్ షా తండ్రి శివసేన నేత రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు సోమవారం సాయంత్రం రాజేష్ షాకు కోర్టు బెయిల్ రూ.15వేల పూచీకత్తుతో ప్రొవిజినల్ బెయిల్‌ను మంజూరు చేసింది. -
ముంబై హిట్ అండ్ రన్ కేసు.. అతడికి బెయిల్ మంజూరు
ముంబై: మహారాష్ట్రలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు మిషిర్ షా తండ్రి, శివసేన నేత రాజేష్ షాకు బెయిల్ లభించింది. సోమవారం సాయంత్రం రాజేష్ షాకు కోర్టు బెయిల్ రూ.15వేల పూచీకత్తుతో ప్రొవిజినల్ బెయిల్‌ను మంజూరు చేసింది.ఇక, ఈరోజు ఉదయం హిట్ రన్ కేసులో భాగంగా పోలీసులు రాజేష్, కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సిటీ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రాజేష్‌కు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇక, తాజాగా కోర్టు రాజేష్ షాకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా.. కారుతో ఢీకొట్టి మహిళ మరణానికి కారణమైన మిషిర్ షాకు లుక్ అవుట్ నోటీస్‌ను పోలీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి.VIP hit & run coward Mihir Shah's father Rajesh Shah (Shinde Faction Sena leader) gets bail a day after he was arrested. Son still absconding.#EknathShinde pic.twitter.com/iuzOMUlwqb— Kedar (@shintre_kedar) July 8, 2024మరోవైపు.. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అంతా సమానమేనని షిండే తెలిపారు. ఈ ఘటనలో ఉన్నది ఎంత పెద్ద ధనవంతుడైనా, రాజకీయ నాయకుడైన ఎవరినీ వదిలి పెట్టేది లేదన్నారు. ఇక, షిండే ఇలా వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే రాజేష్ షాకు బెయిల్ రావడం మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: ముంబై హిట్ అండ్ రన్ ఘటనపై సీఎం షిండే సంచలన కామెంట్స్.. -
శివసేన నేత కుమారుడికి చెక్!.. సీఎం షిండే సంచలన కామెంట్స్
ముంబై: మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ కేసు సంచలనంగా మారింది. ఈ ప్రమాదానికి శివసేన నేత కుమారుడు మిహిర్ షానే కారణమని బాధితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, సీఎం షిండే సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హిట్ రన్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఈ ప్రమాదంలో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదన్నారు. చట్టం తన పని తాను చేస్తుంది. నిందితులకు శిక్ష పడేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజలే మాకు ముఖ్యం. ప్రజల భద్రత కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం అని కామెంట్స్ చేశారు. ఇక, ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్టు పోలీసు అధికారులు చెప్పారు.మరోవైపు.. మహారాష్ట్రలోని వర్లీ పోలీసులు మిహిర్‌పై ర్యాష్ డ్రైవింగ్, హత్యకు సంబంధించి కేసుతోపాటు, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మిహార్ షా పారారీలో ఉండటంతో ఆరుగురు పోలీసుల బృందం అతనికోసం గాలిస్తుంది.జరిగింది ఇది.. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ఆదివారం ఉదయం బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు.. బైక్‌ను ఢీకొట్టడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ముంబై వర్లిలోని సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్ నుంచి భార్య కావేరీ నక్వాతో పార్థిక్ నక్వా బైక్‌పై వెళ్తున్నారు. ఈ సమయంలో బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కావేరీ నక్వా మరణించగా.. ఆమె భర్త పార్థిక్ నక్వాకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే జంప్..మిహిర్ షా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు. రాజేష్ షా వ్యాపారాల్లో మిహిర్ షా సహకారం అందిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటుఉన్నాడు. ఇక, ఈ ప్రమాదానికి ముందు.. మిహిర్ మద్యం మత్తులో ఉన్నాడు. డ్రైవర్‌తో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని సూచించాడు. జుహూ నుంచి వర్లీకి వెళ్లే మార్గంలో డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్ ను పక్కకు తప్పించి మిహిర్ షానే స్వయంగా డ్రైవ్ చేశాడు. ప్రమాదం తరువాత కారును బాంద్రా కళానగర్‌లో వదిలి అక్కడి నుంచి మిహిర్ షా పరారయ్యాడు. అంతకుముందు.. కారుపై ఉన్న శివసేన స్టిక్కర్ ను తొలగించే ప్రయత్నం చేశాడు. కారున తన తండ్రి పేరుపై ఉందని తెలియకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్ ను సైతం తొలగించాడని పోలీసులు గుర్తించారు. -
మద్యం మత్తులో బీభత్సం.. కేసు నుంచి అధికార పార్టీ నేత కుమారుణ్ని తప్పిస్తున్నారా?
ముంబై అధికార శివసేన పార్టీ నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా (24) హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఉదయం మిషిర్ షా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు ఢీకొట్టడంతో ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. అయితే ఈ కేసులో మిషిర్ షాను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో మిహిర్ షా ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు ముంబై వర్లిలోని సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న భార్య కావేరీ నక్వా,ఆమె భర్త పార్థిక్ నక్వా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాధితురాలు కావేరీ నక్వా మరణించగా.. భర్త పార్థిక్ నక్వా గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుడున్నాడు.అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగే సమయంలో కారులో కారు డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్‌తో పాటు మిహిర్ షా ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన మిహిర్ షా కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. డ్రైవర్‌ను బిజావత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికార పార్టీ నేత కుమారుడికి అనుకూలంగాహిట్ అండ్ రన్ కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై వివాదం నెలకొంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద అంటే హత్యతో సమానం కాని నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. హిట్ అండ్ రన్ కేసులో సాధారణంగా నేరపూరిత నరహత్య, ర్యాష్ డ్రైవింగ్,సాక్ష్యాలను ధ్వంసం చేయడం మొదలైన వాటిపై కేసు నమోదు చేస్తారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మద్యం సేవించిన కారు డ్రైవర్ బిజావత్ నుంచి రక్త నమోనాలకు సేకరించారు.రిపోర్ట్స్ రావాల్సి ఉంది.వాళ్లు సమాజంలో పేరున్న పెద్దోళ్లు.. మనమేం చేయలేంరోడ్డు ప్రమాదంపై తన భార్య కావేరీ నక్వా మరణంపై ఆమె భర్త పార్థిక్ నక్వా కన్నీరు మున్నీరవుతున్నారు. ‘‘ఫిష్ మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న తమ వెహికల్‌ను బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. నా భార్య ఎగిరి 100 మీటర్ల అవతల పడింది. నాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో నా భార్యను కోల్పోయా. నాకు ఇద్దరు పిల్లలు. వారి సంరక్షణ ఎవరు చూసుకోవాలి. వాళ్లంటే సమాజంలో పేరున్న పెద్ద మనుషులు. వారిని ఎవరు ఏం చేయలేరు. చివరికి బాధపడాల్సి మనమే అంటూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన కారకుడైన మిహిర్ షా‘‘ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.పోలీసులు వెర్షన్ ఎలా ఉందంటే? బీఎండబ్ల్యూ కారు మిహిర్ షా పేరు మీద రిజిస్టర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మిహిర్ షా, డ్రైవర్ ఇద్దరు కారులో ఉన్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మిహిర్ షా గత రాత్రి జుహులోని ఓ బార్లో మద్యం సేవించాడు. ఇంటికి వెళుతుండగా, డ్రైవర్ని లాంగ్ డ్రైవ్ చేయమని అడిగాడు. వర్లీ ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తున్న మిహిర్ షా.. కావేరీ నక్వా ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సీఎం ఏక్ నాథ్ షిండ్ ఏమన్నారంటే?మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండ్ హిట్ అండ్ రన్ కేసుపై స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమే దేశంలో చట్టం ముందు అందరూ సమానమేనని, ఆ విషయంలో ఎవరి పట్ల వివక్ష చూపబోమని, ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా.. నిందితులకు శిక్షపడేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఏక్ నాథ్ షిండ్ వెల్లడించారు. -
హిట్ అండ్ రన్ : మహిళ ప్రాణం తీసిన అధికార పార్టీ నేత కుమారుడు!
ఓ అధికార పార్టీకి చెందిన నేత కుమారుడి నిర్వాకంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు తన లగ్జరీ బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారుతో మహిళ, ఆమె భర్త ప్రయాణిస్తున్న స్కూటీని అతివేగంతో ఢీకొట్టాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ హిట్ అండ్ రన్ ప్రమాదంలో బాధితురాలు గాల్లోంచి ఎగిరి దూసుకెళ్లింది. 100 మీటర్ల అవతల పడిపోయింది. చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇంతకీ ఆ రాజకీయ నేత ఎవరు?ముంబై వర్లిలోని అట్రియా మాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 5.30గంటల సమీపంలో బీఎండబ్ల్యూ కారు దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య కావేరీ నక్వా దుర్మరణం చెందగా.. భర్త పార్థిక్ నక్వా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే ఆ బీఎండబ్ల్యూ కారు ముంబై అధికార ఏక్ నాథ్ షిండ్ నేతృత్వంలోని శివసేన పార్టీ నేత రాజేష్ షాకి చెందినదిగా పోలీసులు గుర్తించారు.Hit and run case in Mumbai.A BMW car hit a scooty in the Worli area. One female dead.#Mumbai pic.twitter.com/rFdfir4pjF— Vivek Gupta (@imvivekgupta) July 7, 2024ప్రమాద సమయంలో మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లా శివసేన నేత రాజేష్ షా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారును ఆయన కుమారుడు మిహిర్ షా డ్రైవ్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఆదివారం ఉదయం 5.30గంటల సమయంలో మిహిర్ షా తన బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారుతో వ్రోలి ప్రాంతానికి వెళుతున్నాడు. అదే సమయంలో సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న దంపతులు ప్రయాణిస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టారు.ఈ కారు ప్రమాదంతో బాధితురాలు గాల్లోకి దూసుకెళ్లింది. సుమారు 100 మీటర్ల అవతల పడిపోవడంతో తీవ్రగాయాల పాలైంది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం నాయర్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న భార్య మరణించగా.. భర్తకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. కారు ఎవరిదో.. నిర్ధారించే పనిలో పోలీసులు మరోవైపు రోడ్డు ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును వ్రోలీ పోలీసులు సీజ్ చేశారు. ఈ కారు ఎవరిది? శివసేన పార్టీ నేత రాజేష్ షాకి చెందినదేనా? ప్రమాదానికి కారకులు ఎవరనేది త్వరలో నిర్ధారిస్తామన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీఎం షిండే ఆగ్రహం.. పోలీస్ శాఖకు ఆదేశాలుతన పార్టీకి చెందిన నేత కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో ఓ మహిళ ప్రాణాలు పోయిందంటూ అటు జాతీయ మీడియా, ఇటు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో ముంబై సీఎం ఏక్నాథ్ షిండ్ స్పందించారు. ప్రమాదానికి కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నిందితుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వ్రోలీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. -
Hyderabad: హిట్ అండ్ రన్ కేసు నమోదు
నల్లకుంట: మద్యం మత్తులో కారు నడిపి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి వీరంగం సృష్టించిన ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన యడవల్లి శ్రీనివాస్ సీతారమేష్(46)టీచర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 18న రాత్రి అతను బైక్‌పై విద్యానగర్ లక్కీ కేఫ్ సమీపంలోని ఐరావత్ ఐ క్లినిక్ రోడ్డులో వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా దూసుకువచి్చన కారు ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టడంతో రమేష్ కిందపడ్డాడు. ఈ ఘటనపై బాధితుడు రమేష్ ఈ నెల 19న నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రమాదేవి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎస్సై పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశామన్నారు. స్థానికులు కారును అడ్డుకుని కారు నడుపుతున్న వ్యక్తిని నిలదీస్తూ సెల్ ఫోన్లో వీడియో తీశారు. ప్రమాద సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.కారు కుడివైపు ముందు డోర్ పక్కన బీరు బాటిల్ ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది. కాగా ఘటన జరిగిన సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి పక్కన ఓ చిన్నారి కూడా ఉండటం గమనార్హం. -
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో అరెస్టై ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న రాహిల్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు 20 వేల షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే హైకోర్టు ఆదేశాలను పాటించాలని రాహిల్‌కు సూచించింది. ఈ మేరకు పోలీస్ కస్టడీ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. కాగా ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో రాహిల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత రాహిల్ దుబాయ్‌కు పారిపోయాడు. అతడి కోసం గత కొంత కాలం గాలించిన పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో రహేల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా(ఏప్రిల్ 8న) పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం జడ్జీ ముందు హాజరు పరచగా.. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. -
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ఓ కారు ఇద్దరు యువకుల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్నారు ఇద్దరు. ఆ సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వీళ్లను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయిన వ్యక్తిని అనిల్‌గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన అజయ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినట్లు తెలుస్తోంది. -
హిట్ అండ్ రన్.. బ్రెయిన్ డెడ్ విద్యార్థి అవయవదానం
హైదరాబాద్: కోకాపేటలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. వేగంగా వచ్చిన ఆటో ఓ బైకును ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో బైక్ పై ఉన్న విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. అయితే పుట్టెడు శోకంలోనూ.. బ్రెయిన్ డెడ్ అయిన ఆ విద్యార్థి అవయవదానానికి అతని తల్లిదండ్రులు ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే బిస్వాల్ ప్రభాస్ అనే విద్యార్థి హైదరాబాద్ కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద బైక్ పై వస్తున్నాడు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఆటో ప్రభాస్ ను ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే విద్యార్థిని సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు. బిస్వాల్ ప్రభాస్ అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. లివర్, కిడ్నీలు దానం చేస్తున్నట్టు తెలిపారు. అవయవ దానం చేసిన బిస్వాల్ ప్రభాస్ కు సెల్యూట్ చేస్తూ ఆస్పత్రి సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నార్సింగీ హిట్ అండ్ రన్ కేసుపై అనుమానాలు
సాక్షి, రంగారెడ్డి: నార్సింగీలో సోమవారం మరో హిట్ అండ్ రన్ కేసు చోటుచేసుకుంది. ఔటర్ రింగు రోడ్డుపై రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయినా వాహనం ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్ఆర్పై ప్రమాద సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్ అయిన వాహనాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. యువకుడిని ఢీకొట్టి పరారైంది రెడీ మిక్సర్ వాహనంగా పోలీసులు గుర్తించారు. పోలీసుల అనుమానం.. రోడ్డు ప్రమాదంలో మృతుడిని ఆర్మీ సైనికుడిగా గుర్తించారు. గోల్కొండ ఆర్టలరీ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ కులాన్గా గుర్తించారు. హింట్ అండ్ రన్ కేసులో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు అసలు ఔటర్ రింగ్ రోడ్ వైపు ఎందుకు వచ్చాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్మీ జవాన్లు ప్రమాద స్థలానికి భారీగా చేరుకున్నారు. -
జూలై 1 నుంచి ‘భారత’ చట్టాలు
న్యూఢిల్లీ: వలసపాలన నాటి నేర న్యాయ వ్యవస్థ చట్టాలను సంస్కరించి నేటి ఆధునిక సమాజ అవసరాలకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన నిబంధనలు మాత్రం ఇప్పుడే అమలుకావు. హిట్ అండ్ రన్ కేసులపై ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా కొద్దివారాల క్రితం ధర్నాకు దిగిన నేపథ్యంలో ఈ నిబంధనల అమలును ప్రస్తుతానికి పక్కనబెట్టారు. ఈ మూడు నూతన చట్టాలకు గత ఏడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం తెలపగా డిసెంబర్ 25వ తేదీన రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్1872ల స్థానంలో ఈ మూడు చట్టాలు తెచి్చన సంగతి తెల్సిందే. దోషులను శిక్షించడంకంటే ముందు బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతోనే ఈ చట్టాలను తెచ్చామని బిల్లులపై చర్చ సందర్భంగా పార్లమెంట్లో హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఐపీసీలో లేని ఉగ్రవాదం అనే దానికి తొలిసారిగా కొత్త చట్టంలో సరైన నిర్వచనం పొందుపరిచారు. రాజదోహ్రం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘దేశ వ్యతిరేక నేరాలు’ అనే సెక్షన్‌ను జతచేశారు. వేర్పాటువాదం, సాయుధపోరాటాలు, దేశ సార్వ¿ౌమత్వాన్ని భంగపరిచే చర్చలు, దేశ, విదేశాల్లో ఉంటూ చేసే విధ్వంసకర కుట్రలు, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే కుట్ర విద్వేష ప్రసంగాలు.. ఇలా పలు రకాల నేరాలను ఇకపై దేశవ్యతిరేక నేరాలుగా పరిగణిస్తారు. ఈ నేరాలకు గరిష్టంగా జీవితఖైదు పడొచ్చు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దేశద్రోహం అనే నిర్వచించారు. దోషులకు మేజిస్ట్రేట్ విధించే జరిమానా మొత్తాలను పెంచారు. అన్ని భాగస్వామ్య వర్గాల సలహాలు, సూచనలు స్వీకరించి సమగ్ర చర్చలు, సంప్రతింపుల తర్వాతే ముసాయిదా బిల్లులు చట్టాలుగా రూపుదాల్చాయని అమిత్ షా అన్నారు. -
హైదరాబాద్ బొల్లారంలో మరో హిట్ అండ్ రన్ కేసు
-
HYD: తోపుడుబండిపైకి దూసుకెళ్లిన కారు.. పరారీలో డాక్టర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బొల్లారంలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. గురువారం తెల్లవారుజామున బొల్లారం పరిధిలో వేగంగా కారు నడుపుతూ ఓ వైద్యుడు.. ఫుట్‌పాత్ వెంట ఉన్న తోపుడుబండిపైకి దూసుకెళ్లాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న పలువురు వ్యక్తులు వెంటాడి కారును అడ్డగించి డాక్టర్ కార్తీక్‌ను పట్టుకున్నారు. ప్రమాదానికి కారణమైన డాక్టర్.. హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా సమాచారం. ఈ ఘటనలో సయ్యద్ పాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా, తాను పని చేస్తున్న ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తానని చెప్పిన డాక్టర్.. బాధితుడిని తన కారులో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి, ఆ వైద్యుడు పరారయ్యాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: షణ్ముక్ గంజాయి కేసు.. దర్యాప్తులో సంచలన విషయాలు! -
పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ అప్డేట్
-
Hit And Run Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో స్పోర్ట్స్ కారు బీభత్సం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో మరో హిట్ అండ్ రన్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద బైకును కారు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన మరువకముందే మరో ఘటన కలకలం రేగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వైట్ డెకో స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగాంగా వెళ్లి ఎదురుగా ఉన్న రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నాచెల్లితో పాటు మరో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్ నెంబర్ ఆధారంగా గుంటూరుకు చెందిన బిక్కి అశోక్‌గా పోలీస్ గుర్తించారు. గుంటూరు బయల్దేరిన జూబ్లీహిల్స్ పోలీస్ బృందం -
‘హిట్ అండ్ రన్’కు ఏ దేశంలో ఎటువంటి శిక్ష?
కేంద్ర ప్రభుత్వం ‘హిట్ అండ్ రన్’ కేసులో కఠినమైన నిబంధనలను రూపొందించింది. పదేళ్ల జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా విధించింది. దేశంలో చాలావరకూ రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. మనదేశాన్ని మినహాయించి ఇతర దేశాల్లో ‘హిట్ అండ్ రన్’ కేసులలో ఎలాంటి శిక్ష ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్ బంగ్లాదేశ్‌లో వాహన చట్టం, 1927 ప్రకారం ప్రమాదం జరిగిన తర్వాత, పోలీసులు అక్కడికి వచ్చి చర్యలు చేపట్టే వరకు వాహనం డ్రైవర్ తన వాహనంతో పాటు అక్కడే ఉండాలి. బంగ్లాదేశ్‌లో హిట్ అండ్ రన్ లేదా ఏ వాహన సంబంధిత ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే అందుకు కారకులైనవారు నేరస్తులవుతారు. ‘హిట్ అండ్ రన్’కేసులో మరణశిక్ష విదించే అవకాశం కూడా ఉంది. ఇటువంటి కేసులో డ్రైవర్‌ను వెంటనే అరెస్టు చేస్తారు. అతనికి బెయిల్ లభించే అవకాశం కూడా ఉండదు. చైనా చైనాలో ‘హిట్ అండ్ రన్’లో పెను ప్రమాదం జరిగితే నేరస్తుని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. జీవితకాల నిషేధం కూడా ఉండవచ్చు. చైనా క్రిమినల్ కోడ్, ఆర్టికల్ 133 కింద హిట్ అండ్ రన్ కేసులో తీవ్రమైన శారీరక హాని లేదా మరణం సంభవించినట్లయితే, నేరస్తునికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. బ్రిటన్ యూకేలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్ తన పూర్తి పేరు, చిరునామాను పోలీసులకు తెలియజేయాలి. అలాంటి సందర్భాలలో నేరస్తునికి గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష, ఐదు వేల పౌండ్ల జరిమానా కూడా ఉంటుంది. దీనితో పాటు అతను డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధిస్తారు. అమెరికా యునైటెడ్ స్టేట్స్లో ‘హిట్ అండ్ రన్’లో విధించే శిక్ష ప్రతీ రాష్ట్రానికీ మారుతూ ఉంటుంది. దీనిని థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణిస్తారు. శిక్షాకాలం ఒకటి నుంచి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. దీంతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో హిట్ అండ్ రన్ ఉదంతంలో డ్రైవర్ ప్రమాద స్థలంలో వాహనాన్ని ఆపి, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆస్ట్రేలియాలో ట్రాఫిక్ నేరాల కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఉంది. ఇది ప్రతి రోడ్డు ప్రమాదంలో దాని తీరుతెన్నులను గమనించి డ్రైవర్‌కు ఒక పాయింట్‌ను ఇస్తుంది. దీని ప్రకారం డ్రైవర్‌కు జరిమానా విధించవచ్చు. లేదా అతని లైసెన్స్‌ను సస్పెండ్ లేదా రద్దు చేసే అవకాశం ఉంది. కెనడా కెనడాలో క్రిమినల్ కోడ్ ప్రకారం ‘హిట్ అండ్ రన్’ను నేరంగా పరిగణిస్తారు. ఇటువంటి కేసులో ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే అందుకు కారకులపై గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. దక్షిణ కొరియా దక్షిణ కొరియాలో ‘హిట్ అండ్ రన్’ తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలాంటి ప్రమాదంలో ఎవరైనా చనిపోయి, డ్రైవర్ పరారైతే అతనికి కనీసం ఐదేళ్ల జైలు లేదా గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. దీనితో పాటు భారీ జరిమానా కూడా ఉంటుంది. హాంకాంగ్ హాంకాంగ్‌లో ప్రమాదం జరిగిన తర్వాత, డ్రైవర్ వెంటనే వాహనం ఆపివేయాలి. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నేరస్తుడు హిట్ అండ్ రన్ ప్రమాదంలో బాధితులకు సహాయం చేయకపోతే, అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ న్యూజిలాండ్‌లో ప్రమాదానికి కారణమైన డ్రైవర్లు వాహనాన్ని తప్పనిసరిగా ఆపాలి. ఒకవేళ డ్రైవర్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి పారిపోతే, అతనికి మూడు నెలల జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అతని డ్రైవింగ్ లైసెన్స్ కనీసం ఆరు నెలల పాటు సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే అందుకు కారకులపై ఐదేళ్ల జైలు శిక్ష లేదా 20 వేల న్యూజిలాండ్ డాలర్లు జరిమానాగా విధించే అవకాశం ఉంది. అలాగే అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను ఏడాది పాటు రద్దు చేసేందుకు అవకాశం ఉంది.