న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తరువాత వేరొక హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి బెయిల్ లభించింది. బీఎండబ్ల్యూ కారుతో ఇద్దరిని ఢీకొట్టి పారిపోయిన ఘటనలో దోషిగా తేలిన గుజరాత్ వైద్యుడి కుమారుడు విస్మయ్ షాకు సోమవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజురు చేసింది.
విస్మయ్.. 2013లో బీఎండబ్ల్యూ కారుతో ఇద్దరిని ఢీకొట్టి పారిపోయాడు. కేసు నిరూపణ కావడంతో అతడికి స్థానిక కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధించింది. కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. విస్మయ్ తండ్రి అమిత్‌షా అహ్మదాబాద్‌లో కంటి వైద్య నిపుణులు. నిన్న సల్మాన్, ఇవాళ విస్మయ్.. ఇలా దోషులకు వరుసగా బెయిల్ లభిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మరో 'హిట్ అండ్ రన్' దోషికి బెయిల్
Published Mon, Aug 3 2015 12:29 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement