విచారణ ఖైదీలుగా ఏళ్లుగా కటకటాల్లోనే..
బెయిల్ ఇచ్చేవారు లేక..రాక ఇబ్బందులు
వచి్చనా పూచీకత్తు ఇచ్చేవారూ లేని జైలు పక్షులు
శిక్ష పడిన వారి కంటే విచారణ ఖైదీలే అధికం
సాక్షి, హైదరాబాద్: ‘జైలు కాదు.. బెయిల్’అన్న సుప్రీంకోర్టు న్యాయసూత్రం ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న వారిలో రెండింట మూడో వంతు విచారణ ఖైదీలే. బెయిల్ లాంటి అంశాల్లో సత్వర విచారణ జరపాలని న్యాయ కోవిదులు చెబుతున్నా అమలు మాత్రం ఆమడ దూరం అన్నట్టుగానే ఉంది. బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక, పూచీకత్తు ఇచ్చేవారు లేక విడుదలకు నోచుకోని వారు కూడా ఉండటం మరింత దారుణం.
విచారణ జరిగి శిక్షపడే నాటికి.. వారికి పడే శిక్షాకాలం కూడా పూర్తవుతున్న వారు కొందరు ఉండగా, ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలవుతున్న వారు మరికొందరు. అంటే నేరం చేయకున్నా కొందరు జైళ్లలో మగ్గుతున్నారన్న మాట. ఏళ్లుగా జైళ్లలో ఉండి ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలైనా.. వారి జీవితం, కుటుంబాలు ఆగమైనట్టే కదా అనేది బాధితుల వాదన. మరి ఈ విచారణ ఖైదీల సమస్యకు పరిష్కారం ఎప్పుడు.. ఎలా.. అన్నది ప్రశ్నార్థకం. అయితే గత నెల జైలు అధికారులకు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు కొంత ఉపశమనం కలిగించనున్నాయి.
యువతే అధికం...
విచారణ ఖైదీల్లో అత్యధికం యువతే. 2022 గణాంకాలను పరిశీలిస్తే.. 18–30 ఏళ్ల మధ్య ఖైదీలు 2,15,471 మంది ఉండగా, 30–50 ఏళ్ల మధ్య 1,73,876 మంది ఉన్నారు. మొత్తం 4,34,302 విచారణ ఖైదీల్లో రెండింట మూడోవంతు(66శాతం) యువతే ఉండటం గమనార్హం.
విచారణా ఖైదీల హక్కులు..
⇒సత్వర విచారణ పొందేందుకు అర్హులు
⇒హింస, అమానవీయ ప్రవర్తనకు గురికాకుండా హక్కు ఉంటుంది ళీ సరైన కారణాలను అందించకపోతే జైలు నుంచి కోర్టుకు తరలించేటప్పుడు సంకెళ్లు వేయడానికి వీలులేదు.
⇒కేసు విషయంలో కోర్టుకు దరఖాస్తు చేసుకొని ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు.
⇒అరెస్టు చేసే సమయంలో వారి కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడికి తెలియజేయాలి.
⇒నిర్దిష్ట భద్రతా ప్రమాణాలకు లోబడి కుటుంబ సభ్యులకు ఖైదీని సందర్శించే అవకాశం.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
2023లో, అంతకుముందు..
‘జైలు కాదు.. బెయిల్’అనే సూత్రం ప్రమాణంగా విచారణ సాగాలి. విచారణ ఖైదీలతో జైళ్లు కిక్కిరిసిపోవడం న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఒక వ్యక్తిని కోర్టులో నిలబెట్టి, దోషిగా నిరూపించాలని పోలీసులు ఎక్కువగా భావిస్తున్నారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయం ప్రమాదకరం. ఇది పేద, బలహీన వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బెయిల్ పొందినా ఆర్థిక స్తోమత, పూచీకత్తు ఇచ్చేవారు లేక చాలా మంది జైళ్లలోనే మగ్గుతున్నారు. ఈ కారణాలతో జైళ్లలో సంఖ్య పెరిగిపోతోంది.
2024, ఆగస్టులో...
దేశవ్యాప్తంగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్న అండర్ ట్రయల్ ఖైదీలను త్వరితగతిన విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జైళ్ల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం. కొత్త క్రిమినల్ న్యాయచట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 479 ప్రకారం సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మూడు నెలల్లోగా అండర్ ట్రయల్ ఖైదీల దరఖాస్తులను ప్రాసెస్ చేయాలి. అయితే, ఈ నిబంధన మరణశిక్ష లేదా జీవిత ఖైదు వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన అండర్ ట్రయల్‌లకు వర్తించదు. – సుప్రీంకోర్టు
అండర్ ట్రయల్ ఖైదీలకు లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ద్వారా న్యాయ సాయం అందిస్తాం. దీని కోసం జైళ్లకు కూడా వెళతాం. న్యాయ సాయం కావాల్సిన వారికి న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం. బెయిల్ వచి్చన తర్వాత ఒకవేళ పెద్ద మొత్తంలో షూరిటీలు చెల్లించలేని వారు ఉంటే.. కోర్టును సంప్రదించి ఆ మొత్తాన్ని తగ్గించేలా తోడ్పాటునందిస్తాం. –తెలంగాణ లీగల్ సరీ్వసెస్ అథారిటీ
Comments
Please login to add a commentAdd a comment