trial
-
ISRO SpaDeX Mission: స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రయోగం సక్సెస్: ఇస్రో
భారత స్పేడెక్స్ ఉపగ్రహాల పనితీరుపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అప్డేట్ ఇచ్చింది. నేడు(ఆదివారం) ఈ ఉపగ్రహాలు మరింత దగ్గరయ్యాయి. శనివారం వీటి మధ్య దూరం 230 మీటర్లుగా ఉంది. తాజాగా వీటి దూరం తొలుత 15 మీటర్లకు చేరుకోగా, ఆ తరువాత ఇస్రో ఆ రెండు శాటిలైట్లను మూడు మీటర్ల మేరకు దగ్గరకు తీసుకువచ్చి, తరువాత సురక్షితంగా తిరిగి వెనక్కు తీసుకురాగలిగింది. SpaDeX Docking Update:A trial attempt to reach up to 15 m and further to 3 m is done.Moving back spacecrafts to safe distanceThe docking process will be done after analysing data further. Stay tuned for updates.#SpaDeX #ISRO— ISRO (@isro) January 12, 2025ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను సమగ్రంగా విశ్లేషించిన అనంతరం డాకింగ్ ప్రక్రియను చేపడతామని ఇస్రో వెల్లడించింది. శాటిలైట్లలోని వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది. ప్రస్తుతానికి అన్ని సెన్సార్ల పనితీరును విశ్లేషిస్తున్నామని, ప్రస్తుతం ఎస్డీ01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) రెండూ సక్రమమైన స్థితిలోనే ఉన్నాయని తెలిపింది. వాటి మధ్య ఉన్న దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించే ట్రయల్ ప్రక్రియ ముగిసిందని, ఆ తరువాత ఆ రెండు శాటిలైట్లను(Satellite) సురక్షితమైన దూరానికి తరలించామని ఇస్రో ఒక ట్వీట్లో పేర్కొంది.SpaDeX Docking Update:SpaDeX satellites holding position at 15m, capturing stunning photos and videos of each other! 🛰️🛰️#SPADEX #ISRO pic.twitter.com/RICiEVP6qB— ISRO (@isro) January 12, 2025కాగా ఈ ఉపగ్రహాల అనుసంధానాన్ని (డాకింగ్) ఎప్పుడు చేపడతామన్నది ఇస్రో ఇంకా వెల్లడించలేదు.2025 జనవరి 7, 9 తేదీల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తామని గతంలో ఇస్రో ప్రకటించింది. ఆ తర్వాత ఇస్రో ఈ ప్రయోగాన్ని వాయిదా వేసింది. ఇస్రో 2024 డిసెంబర్ 30న ఎస్‌డీఎక్స్01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) శాటిలైట్లను పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహాల బరువు 220 కిలోగ్రాములు. వీటిని భూమి నుంచి 475 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ స్పేడెక్స్ ప్రయోగం(Spadex experiment) పూర్తిగా విజయవంతమైతే ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నాలుగవ దేశంగా భారత్ నిలవనుంది.ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌కు స్టీవ్ జాబ్స్ సతీమణి -
విద్వేష వ్యాఖ్యలొద్దు
న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భంగా వాడే పదజాలం విషయంలో న్యాయస్థానాలు అత్యంత జాగరూకత వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. పురుషాధిక్య భావజాలం, స్త్రీద్వేషం తదితరాలతో కూడిన వ్యాఖ్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని హితవు పలికింది. కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీశానంద ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా బెంగళూరులో ఒక ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని పాకిస్తాన్‌తో పోల్చడం, మహిళా న్యాయవాదిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ ఉదంతంపై సుమోటో విచారణను సీజేఐ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం ముగించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్‌తో పోల్చకూడదని కుండబద్దలు కొట్టింది. అవి దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని గుర్తు చేసింది. ఇలా ప్రాంతాలను, సామాజికవర్గాలను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేసింది. ‘‘న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై సమాజంలో అన్ని వర్గాల ప్రజలకూ పూర్తి విశ్వాసముండాలి. దీన్ని కాపాడాల్సిన బాధ్యత లాయర్ల నుంచి జడ్జిల దాకా అందరిపైనా ఉంది. న్యాయమూర్తులు యథాలాపంగా చేసే ఇలాంటి వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలకు, రాగద్వేషాలకు అద్దం పడతాయి. వాటి ప్రభావం మొత్తం న్యాయవ్యవస్థపై పడుతుంది’’ అంటూ హెచ్చరించింది.మరింత వెలుగే పరిష్కారం!న్యాయవ్యవస్థలో పారదర్శకత చాలా ముఖ్యమని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. కోర్టుల విచారణ ప్రక్రియపై సోషల్ మీడియాలో విద్వేష వ్యాప్తి పెద్ద సవాలుగా మారిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. దీనిపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘వెలుగుకు మరింత వెలుగే పరిష్కారం తప్ప చీకట్లు కాదు. అన్నిరకాల కోర్టుల్లోనూ విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడం, తద్వారా న్యాయవ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడమే సమస్యకు పరిష్కారం’’ అని కుండబద్దలు కొట్టారు. -
బెయిల్ కాదు.. జైలు
సాక్షి, హైదరాబాద్: ‘జైలు కాదు.. బెయిల్’అన్న సుప్రీంకోర్టు న్యాయసూత్రం ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న వారిలో రెండింట మూడో వంతు విచారణ ఖైదీలే. బెయిల్ లాంటి అంశాల్లో సత్వర విచారణ జరపాలని న్యాయ కోవిదులు చెబుతున్నా అమలు మాత్రం ఆమడ దూరం అన్నట్టుగానే ఉంది. బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక, పూచీకత్తు ఇచ్చేవారు లేక విడుదలకు నోచుకోని వారు కూడా ఉండటం మరింత దారుణం.విచారణ జరిగి శిక్షపడే నాటికి.. వారికి పడే శిక్షాకాలం కూడా పూర్తవుతున్న వారు కొందరు ఉండగా, ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలవుతున్న వారు మరికొందరు. అంటే నేరం చేయకున్నా కొందరు జైళ్లలో మగ్గుతున్నారన్న మాట. ఏళ్లుగా జైళ్లలో ఉండి ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలైనా.. వారి జీవితం, కుటుంబాలు ఆగమైనట్టే కదా అనేది బాధితుల వాదన. మరి ఈ విచారణ ఖైదీల సమస్యకు పరిష్కారం ఎప్పుడు.. ఎలా.. అన్నది ప్రశ్నార్థకం. అయితే గత నెల జైలు అధికారులకు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు కొంత ఉపశమనం కలిగించనున్నాయి. యువతే అధికం... విచారణ ఖైదీల్లో అత్యధికం యువతే. 2022 గణాంకాలను పరిశీలిస్తే.. 18–30 ఏళ్ల మధ్య ఖైదీలు 2,15,471 మంది ఉండగా, 30–50 ఏళ్ల మధ్య 1,73,876 మంది ఉన్నారు. మొత్తం 4,34,302 విచారణ ఖైదీల్లో రెండింట మూడోవంతు(66శాతం) యువతే ఉండటం గమనార్హం.విచారణా ఖైదీల హక్కులు.. ⇒సత్వర విచారణ పొందేందుకు అర్హులు ⇒హింస, అమానవీయ ప్రవర్తనకు గురికాకుండా హక్కు ఉంటుంది ళీ సరైన కారణాలను అందించకపోతే జైలు నుంచి కోర్టుకు తరలించేటప్పుడు సంకెళ్లు వేయడానికి వీలులేదు. ⇒కేసు విషయంలో కోర్టుకు దరఖాస్తు చేసుకొని ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు. ⇒అరెస్టు చేసే సమయంలో వారి కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడికి తెలియజేయాలి. ⇒నిర్దిష్ట భద్రతా ప్రమాణాలకు లోబడి కుటుంబ సభ్యులకు ఖైదీని సందర్శించే అవకాశం.సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. 2023లో, అంతకుముందు.. ‘జైలు కాదు.. బెయిల్’అనే సూత్రం ప్రమాణంగా విచారణ సాగాలి. విచారణ ఖైదీలతో జైళ్లు కిక్కిరిసిపోవడం న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఒక వ్యక్తిని కోర్టులో నిలబెట్టి, దోషిగా నిరూపించాలని పోలీసులు ఎక్కువగా భావిస్తున్నారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయం ప్రమాదకరం. ఇది పేద, బలహీన వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బెయిల్ పొందినా ఆర్థిక స్తోమత, పూచీకత్తు ఇచ్చేవారు లేక చాలా మంది జైళ్లలోనే మగ్గుతున్నారు. ఈ కారణాలతో జైళ్లలో సంఖ్య పెరిగిపోతోంది. 2024, ఆగస్టులో... దేశవ్యాప్తంగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్న అండర్ ట్రయల్ ఖైదీలను త్వరితగతిన విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జైళ్ల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం. కొత్త క్రిమినల్ న్యాయచట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 479 ప్రకారం సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మూడు నెలల్లోగా అండర్ ట్రయల్ ఖైదీల దరఖాస్తులను ప్రాసెస్ చేయాలి. అయితే, ఈ నిబంధన మరణశిక్ష లేదా జీవిత ఖైదు వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన అండర్ ట్రయల్‌లకు వర్తించదు. – సుప్రీంకోర్టుఅండర్ ట్రయల్ ఖైదీలకు లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ద్వారా న్యాయ సాయం అందిస్తాం. దీని కోసం జైళ్లకు కూడా వెళతాం. న్యాయ సాయం కావాల్సిన వారికి న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం. బెయిల్ వచి్చన తర్వాత ఒకవేళ పెద్ద మొత్తంలో షూరిటీలు చెల్లించలేని వారు ఉంటే.. కోర్టును సంప్రదించి ఆ మొత్తాన్ని తగ్గించేలా తోడ్పాటునందిస్తాం. –తెలంగాణ లీగల్ సరీ్వసెస్ అథారిటీ -
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం జస్టిస్ స్వర్ణకాంతశర్మ విచారించారు. కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్‌చౌదరి వాదనలు వినిపిస్తూ కవితను అరెస్టు చేసే క్రమంలో పలు ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. ఈ కేసులో నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, చట్టాలు అనుసరించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు.కేసు నమోదు చేసిన తొలినాళ్లలో కవిత పేరు లేదని అప్రూవర్లుగా మారిన వారి స్టేట్మెంట్ల ఆధారంగా ఆమెను అరెస్టు చేశారన్నారు. అభిõÙక్ బోయినపల్లి, విజయ్‌నాయర్‌లకు బెయిలు వచి్చన విషయాన్ని విక్రమ్‌చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడీ కేసులో కౌంటర్ దాఖలు చేసినట్టు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ తెలిపారు. తమ కౌంటర్ ఈ నెల 27లోగా దాఖలు చేస్తామని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొనగా, ఆదివారం రాత్రి పది గంటలలోపు దాఖలు చేయాలని న్యాయమూర్తి తెలిపారు. వీలైనంత వరకూ శనివారమే దాఖలు చేయడానికి యత్నిస్తామని సీబీఐ తరఫు న్యాయ వాది కోర్టుకు తెలిపారు, అనంతరం, సోమవారం కవిత తరఫు వాదనలు పూర్తి చేయాలని, మంగళవారం దర్యాప్తు సంస్థల వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంతశర్మ విచారణ వాయిదా వేశారు. -
మరో ‘వందే భారత్’ ట్రయల్ రన్ విజయవంతం
ఇది రామ భక్తులకు పండుగలాంటి వార్త. అయోధ్యలోని రాములోరిని చూసేందుకు యూపీ భక్తులు ఇకపై కాషాయ రంగులో మెరిసిపోయే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ వందే భారత్ రైలు యూపీ రాజధాని పట్నా నుండి అయోధ్య మీదుగా లక్నో వరకు నడుస్తుంది. ఈ రైలుకు సంబంధించిన తుది ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఈ ట్రయల్ రన్లో ఈ రైలు నిర్ణీత సమయానికి ముందుగానే లక్నోకు చేరుకుంది. ఈ రైలును మార్చి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. కాగా అధికారికంగా ఈ రైలు టైమ్ టేబుల్‌ను ఇంకా విడుదల చేయలేదు. పట్నా నుంచి అయోధ్య మీదుగా లక్నో వరకు నిర్వహించిన ఈ రైలు ట్రయల్ రన్లో నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందుగా వారణాసి, 12 నిమిషాల ముందుగా అయోధ్య , 20 నిమిషాల ముందుగా లక్నో చేరుకుంది. ట్రయల్ రన్లో ఈ రైలు ఉదయం 6:05 గంటలకు పట్నా నుంచి లక్నోకు బయలుదేరింది. ఈ సమయంలో రైలు వేగం 130 కి.మీ.గా ఉంది. -
జయప్రదను అరెస్ట్ చేయండి..
రామ్‌పూర్(యూపీ): గత లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగినపుడు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన కేసులో మాజీ ఎంపీ, నటి జయప్రదను అరెస్ట్‌చేయాలని అక్కడి రామ్‌పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అరెస్ట్‌చేసి మార్చి నెల ఆరోతేదీన తమ ఎదుట ప్రవేశపెట్టాలని సూచించింది. 2019లో ఎన్నికల ప్రవర్తనానిబంధనావళి ఉల్లంఘనపై కేమారి, స్వార్ పోలీస్స్టేషన్లలో జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయమై తమ ముందు హాజరుకావాలని ప్రత్యేక ఎంపీ – ఎమ్మెల్యే కోర్టు జయప్రదకు సూచించింది. అయినా ఆమె రాకపోవడంతో ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ – బెయిలబుల్ వారెంట్లు జారీఅయ్యాయి. ఇంత జరిగినా ఆమె కోర్టుకు రాకపోవడంతో జయను ‘పరారీలో ఉన్న వ్యక్తి’గా జడ్జి ప్రకటించారు. -
చంద్రబాబుకు సుప్రీంలో నో రిలీఫ్
సాక్షి, న్యూఢిల్లీ: ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిలు కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నవంబరు 9వ తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం వద్దకు రాగా చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. మొత్తంగా మూడు ఎఫ్ఐఆర్లు దాఖలు కాగా ఒకటి తీర్పు రిజర్వు అయిందని నివేదించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు వెలువడే వరకు ఈ కేసులో వేచి చూద్దామా? అని జస్టిస్ బోస్ ప్రశ్నించగా, ఆ విషయాన్ని ధర్మాసనానికే వదిలేస్తున్నట్లు లూథ్రా బదులిచ్చారు. అయితే, చంద్రబాబుకు మధ్యంతర రక్షణ కొనసాగించాలని లేదంటే ఈ పిటిషన్‌కు కాలపరిమితి ముగిసిపోతుందన్నారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ జోక్యం చేసుకుంటూ ఒక వ్యక్తి ఒకసారి కస్టడీలో ఉన్నప్పుడు మరోసారి అరెస్టు ఉత్పన్నం కాదని, జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని తెలిపారు. ఇదే అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్నట్లు చెప్పారు. స్కిల్ కేసులో తీర్పు కోసం వేచి చూస్తున్నామన్నారు. చంద్రబాబు కస్టడీలో ఉన్నందున ప్రశ్నించుకోవచ్చని జస్టిస్ బోస్ పేర్కొనగా, ఇంటరాగేషన్ చేయాలంటే కోర్టు అనుమతి అవసరమని, సెక్షన్ 267 కింద వారెంటు జారీ చేశామని రంజిత్ కుమార్ తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాతే పోలీసు కస్టడీని కోరగలమన్నారు. ఈ సమయంలో లూథ్రా జోక్యం చేసుకుంటూ ఇదంతా అబద్ధమని, చట్టాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. సెప్టెంబరు 9న కస్టడీలో తీసుకున్న నాటి నుంచి చంద్రబాబును ఏ ప్రశ్నా అడగలేదన్నారు. ఈ సమయంలో జస్టిస్ బోస్ జోక్యం చేసుకుంటూ ముందస్తు బెయిలుపై నవంబరు 8న విచారిస్తామని తొలుత ప్రకటించారు. అయితే విచారణను నవంబరు 9కి వాయిదా వేయాలని సిద్ధార్థ లూథ్రా అభ్యర్థిచడంతో న్యాయస్థానం అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై తొలుత తీర్పు వెలువరిస్తామని, తర్వాత ఈ అంశాన్ని పరిగణిస్తామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి వరకు చంద్రబాబు అరెస్టు ఉండదని తెలిపింది. కాగా, ఈ నెల 29వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు కావడంతో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తీర్పు ఆ తర్వాతే వెలువడే అవకాశం ఉంది. -
శవ రాజకీయాల కోసమే టీడీపీ విధ్వంసకాండ
మదనపల్లె: పోలీసులను రెచ్చగొట్టి, కాల్పులకు ప్రేరేపించి, ఆ కాల్పుల్లో పదుల సంఖ్యలో అమాయక టీడీపీ కార్యకర్తలు చనిపోతే వారి శవాలతో కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పరేడ్ నిర్వహించి రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహంతోనే అంగళ్లు, పుంగనూరుల్లో టీడీపీ నాయకులు విధ్వంసకాండకు పాల్పడ్డారని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. అంగళ్లు, పుంగనూరు విధ్వంసకాండలో అరెస్టయిన 120 మంది టీడీపీ నాయకుల బెయిల్ పిటిషన్లపై గురువారం మదనపల్లె రెండో ఏడీజే కోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ సుధాకర్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి, ఏపీపీలు రామకృష్ణ, జనార్ధనరెడ్డి, చంద్రకుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. పుంగనూరు, అంగళ్లులో విధ్వంసాన్ని, టీడీపీ అధినేత చంద్రబాబు పిచ్చలవాండ్లపల్లె ప్రాజెక్టు ఆయకట్టు రైతులపైకి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టిన వీడియోలను న్యాయమూర్తి అబ్రహాంకు ఏఏజీ సుధాకర్‌రెడ్డి చూపించారు. ఆగస్టు 4న చంద్రబాబు ములకలచెరువు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్‌ను పరిశీలించి అంగళ్లు, మదనపల్లె, పుంగనూరు బైపాస్ మీదుగా చిత్తూరు వెళ్లేందుకు డీజీపీ నుంచి అనుమతి తీసుకున్నారన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం పిచ్చలవాండ్లపల్లె ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు ఎన్జీటీ కోర్టులో స్టే తేవడంపై నిరసన తెలిపేందుకు ఆయకట్టు రైతులు నల్లబ్యాడ్జీలు ధరించి అంగళ్లుకు రాగా, వారిని చూసిన చంద్రబాబు ‘కొట్టండి.. చంపండంటూ’ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టినందుకే అల్లర్లు చెలరేగాయన్నారు. అంగళ్లులో మొదలైన విధ్వంసకాండ 30 కిలోమీటర్ల మేర కొనసాగి పుంగనూరులో పరాకాష్టకు చేరిందన్నారు. పుంగనూరు టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి 5,000 మంది కార్యకర్తలతో చంద్రబాబును పట్టణంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని చెప్పారు. బాబు పర్యటనలో పట్టణం లేదని, బైపాస్ వరకే ఉందని పోలీసులు అడ్డుకొన్నారని, వెంటనే టీడీపీ శ్రేణులు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై విచక్షణారహితంగా దాడిచేసి, విధ్వంసం సృష్టించారన్నారు. ఈ ఘటనలో 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని, మహిళా ఎస్ఐ కాలు విరిగిందని, ఓ కానిస్టేబుల్ కన్ను కోల్పోయారని తెలిపారు. ఎస్పీలు రిశాంత్‌రెడ్డి, గంగాధరరావు సంయమనం పాటించి కాల్పులు జరపకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. కాల్పులు జరిగి కార్యకర్తలు చనిపోతే శవ రాజకీయాలు చేసి, శాంతిభద్రతలు క్షీణించాయంటూ రాష్ట్రపతి పాలన కోరాలన్నదే టీడీపీ నేతల వ్యూహమని చెప్పారు. ఇందులో ప్రైవేటు వ్యక్తులు సాక్షులుగా ఉన్నారని, అరెస్ట్ చేయాల్సిన వారు ఇంకా పరారీలో ఉన్న కారణంగా బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేస్తారని, సమాజంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పారు. పోలీసులపై దాడులు చేసి చట్టంలోని సెక్షన్ 438 ద్వారా బెయిల్ తీసుకోవచ్చనే ధైర్యం నిందితులకు ఉందన్నారు. బెయిల్ మంజూరు చేస్తే చట్టం ఏమీ చేయలేదనే సందేశం సమాజంలోకి వెళ్లి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం తరపున కాకుండా ఓ సాధారణ పౌరుడిగా సమాజశ్రేయస్సు, భద్రతను కాంక్షించి బెయిల్ నిరాకరించాల్సిందిగా కోరామన్నారు. నిందితుల తరపున హైకోర్టు న్యాయవాదులు హరిబాబు, కోటేశ్వరరావు తదితరులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. బాబు అధికారంలోకి రావాలనే ఈ కుట్రంతా అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ఏఏజీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చి అధికారంలోకి రావాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి సమాజంలో అల్లకల్లోలం సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, క్షీణించాయని ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. ప్రజలను భయò³ట్టి అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. చట్టం ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి సమాజాన్ని నెట్టవద్దని అన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ కేశప్ప, సీఐలు సత్యనారాయణ, శివాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
పొలాల్లో కుప్పకూలిన డీఆర్డీఓ డ్రోన్.. దృశ్యాలు వైరల్..
బెంగళూరు: రక్షణ శాఖ(డీఆర్డీఓ)కు చెందిన డ్రోన్ కుప్పకూలింది. కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో పంట పొలాల్లో ఈ మానవ రహిత డ్రోన్ కూలిపోయింది. ప్రమాద ఘటనకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాద ప్రదేశానికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు గుమిగూడారు. #WATCH | A Tapas drone being developed by the DRDO crashed today during a trial flight in a village of Chitradurga district, Karnataka. DRDO is briefing the Defence Ministry about the mishap and an inquiry is being carried out into the specific reasons behind the crash: Defence… pic.twitter.com/5YSfJHPxTw — ANI (@ANI) August 20, 2023 డీఆర్డీఓ మానవ రహిత డ్రోన్లపై పరిశోధనలో భాగంగా.. ఆదివారం తాపస్ అనే డ్రోన్‌ను ట్రయల్ రన్ చేశారు. ఈ క్రమంలో అది కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దీనిపై రక్షణ శాఖ దర్యాప్తు చేపడుతోంది. ప్రమాద స్థలంలో డ్రోన్ ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: చంద్రయాన్-3: చంద్రుడికి అడుగు దూరంలో ఇస్రో ‘విక్రమ్’.. ఇక చివరి ఘట్టం అదే -
భారత రెజ్లింగ్ ట్రయల్స్ 25, 26వ తేదీల్లో
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లను ఖరారు చేసే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్íÙప్లో పాల్గొనే భారత జట్లను ఈనెల 25, 26వ తేదీల్లో ఎంపిక చేయనున్నారు. పాటియాలాలో నిర్వహించే ఈ ట్రయల్స్ నుంచి ఎవరికీ మినహాయింపు లేదని... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనుకుంటే అందరూ ఈ ట్రయల్స్‌కు హాజరు కావాల్సిందేనని భారత రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అడ్–హక్ ప్యానెల్ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం నిర్వహించిన ట్రయల్స్ నుంచి స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్‌లకు మినహాయింపు ఇవ్వడం వివాదాస్పదమైంది. సెపె్టంబర్ 16 నుంచి 24 వరకు బెల్గ్రేడ్లో ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుంది. ప్రపంచ చాంపియన్íÙప్లో ఆయా కేటగిరీల్లో టాప్–5లో నిలిచిన రెజ్లర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. -
కట కటా... మర్కటా!
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ కోతి వీడియో వైరల్ అయింది. మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అనగా....ఒకాయన ఏదో ఆలోచిస్తూ ఆలయం మెట్లు ఎక్కుతూ వస్తుంటాడు. ఆ మెట్ల పక్కన గద్దెపై కూర్చున్న కోతి ఆ వ్యక్తి కళ్లద్దాలను లాగేసుకుంది. ఇతడు బిత్తరపోతూ ఉండగానే ‘ఈ అద్దాలు నాకు సెట్ అవుతాయా’ అన్నట్లుగా ట్రయల్స్ స్టార్ట్ చేసింది కోతి. ఈలోపు అక్కడికి వచ్చిన ఒక మహిళ కొన్ని పండ్లను కోతి ముందు పెట్టింది. అంతే...ఆ అద్దాలను పక్కన పెట్టి పండ్ల పని పట్టింది కోతి. ఈ వీడియోను చూస్తూ బిగ్గరగా నవ్వుతున్న వాళ్లతో పాటు ‘అయ్యో..ఈ వనజీవులు ఎంత ఆకలితో అల్లడుతున్నాయో కదా!’ అని బాధపడుతున్న వారూ ఎందరో ఉన్నారు. -
రేపే సుప్రీంకోర్టు ముందుకు అవినాష్ రెడ్డి మ్యాటర్
ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. సంఖ్య విషయం సంబంధిత సమాచారం 1 డైరీ నెంబర్ 20416/2023 2 కేసు నెంబర్ MA 00 1285 3 విచారణ తేదీ 23 మే 2023 4 CL నెంబర్ 36 5 కేటగిరీ క్రిమినల్ మ్యాటర్స్ 6 సబ్జెక్ట్ బెయిల్ 7 బెంచ్ 1. జస్టిస్ J.K.మహేశ్వరీ 2. జస్టిస్ పమిడిగంఠం శ్రీ నరసింహా 8 పిటిషనర్ సునీత నర్రెడ్డి 9 రెస్పాండెంట్స్ 1. Y.S.అవినాష్ రెడ్డి 2. డైరెక్టర్, CBI 10 సునీత తరపు న్యాయవాది జెసల్ వాహి 11 అవినాష్ తరపు న్యాయవాది ముకుంద్ P.ఉన్నీ ఈ పిటిషన్ ను సునీత నర్రెడ్డి గతంలో దాఖలు చేశారు. మరో వైపు ఇదే వ్యవహారంపై అవినాష్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ విచారించేలా హైకోర్టు వెకేషన్ బెంచ్‌ను ఆదేశించాలని విజ్ఙప్తి చేశారు. తల్లి అనారోగ్యం వల్ల వారంపాటు సిబిఐ విచారణకు రాలేనని, సిబిఐ విచారణకు హాజరుపై మినహాయింపు కావాలని కోరారు. తన తల్లికి చికిత్స జరుగుతున్న దృష్ట్యా ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు అవినాష్ రెడ్డి. ఇదే విషయాన్ని సిబిఐకి కూడా లిఖిత పూర్వకంగా తెలిపారు. (చదవండి : అమ్మ పరిస్థితి సీరియస్, 7 రోజులు గడువివ్వండి : సీబీఐకి అవినాష్ విజ్ఞప్తి) -
డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లను విచారించవచ్చు
న్యూఢిల్లీ: డిఫాల్ట్ బెయిల్ కోరుతూ దాఖలయ్యే పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టతనిచ్చింది. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు అధికారులు గడువులోగా చార్జిషీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ కోరుతూ నిందితులు దాఖలు చేసే పిటిషన్లను హైకోర్టులు, ట్రయల్ కోర్టులు విచారించవచ్చంది. 60 నుంచి 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయకుంటే నిందితులు ఢిపాల్ట్ బెయిల్‌కు అర్హులు. విచారణ పూర్తవకుండానే అసంపూర్తి చార్జిషీట్‌ను దాఖలు చేసినా డిఫాల్ట్ బెయిల్ పొందవచ్చని రీతూ ఛాబ్రియా కేసులో జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 26న తీర్పు వెలువరించింది. కేవలం నిందితులకు డిఫాల్ట్ రావొద్దన్న కారణంతో చార్జిషీల్ దాఖలు చేయొద్దని సూచించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తీర్పును ఉపసంహరించుకోవాలని కోరింది. ఈడీ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కింది కోర్టులు రీతూ ఛాబ్రియా కేసు తీర్పుపై ఆధారపడాల్సిన అవసరం లేదని, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. కేంద్రంపై సుప్రీంకు ఆప్ ఢిల్లీ ప్రభుత్వాధికారులపై పాలనపరమైన అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానివేనంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఈ విషయమై కేంద్రానికి, ఆప్ సర్కారుకు మధ్య గొడవలు సద్దుమణగడం లేదు. ప్రభుత్వ సేవల శాఖ కార్యదర్శి ఆశిష్ మోరే బదిలీని కేంద్రం అడ్డుకుంటోందని కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణకు వచ్చే వారం ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ పేర్కొన్నారు. ‘అదానీ’ విచారణకు 3 నెలలు? అదానీ గ్రూప్ అవకతవకల ఆరోపణలపై విచారణకు సెబీకి మరో మూడు నెలలు గడువివ్వాలని యోచిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. విచారణలో సెబీ వైఫల్యముందన్న వాదనలను తిరస్కరించింది. సెబీ నివేదికను తమ నిపుణుల కమిటీ అధ్యయనం చేశాక దానిపై తేలుస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది. కేరళ స్టోరీపై నిషేధం ఎందుకు ? ది కేరళ స్టోరీ సినిమాను ఎందుకు నిషేధించారో చెప్పాలంటూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సీజేఐ ధర్మాసనం నోటీసులిచ్చింది. ‘‘ఇతర రాష్ట్రాలు ఏ సమస్యా లేకుండా సినిమాను ప్రదర్శిస్తున్నాయిగా! దానివల్ల ఏమీ జరగలేదు. మరి మీరెందుకు నిలిపివేశారు? సినిమా నచ్చకపోతే ప్రజలే తిరస్కరిస్తారు’’ అని వ్యాఖ్యానించింది. -
అవినాశ్‌పై తొందరపాటు చర్యలొద్దు: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అన్ని విచారణ ఫైళ్లను, రికార్డులను న్యాయస్థానం ముందు ఉంచాలని సీబీఐ దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. విచారణ వివరాలను పెన్‌డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్‌లో పూర్తిగా సీల్డ్ కవర్లో సోమవారం కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. వివేకా హత్య జరిగిన చోట లభించిన లేఖ, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికను కూడా సమర్పించాలని సూచించింది. అప్పటి వరకు అరెస్టు సహా ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని దర్యాప్తు అధికారి (ఐవో)ని ఆదేశించింది. పిటిషనర్ (కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి) 14న ఉదయం 11 గంటలకు సీబీఐ ముందు హాజరు కావాలని సూచించింది. ఆయన వెంట న్యాయవాది వెళ్లొచ్చని చెప్పింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం విచారణకు హాజరు కావాలనడంపై స్టే విధించాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ విచారణ చేపట్టినా.. అదంతా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, సీబీఐ తరఫున అనిల్ కొంపెల్లి వాదనలు వినిపించారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు.. ‘వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ నిమిత్తం సీఆర్పీసీ 160 కింద జనవరి 24న హాజరు కావాలని ఒకరోజు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. 24న ఎంపీ విచారణకు హాజరయ్యారు. తన విచారణ వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని, విచారణ సమయంలో తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ జనవరి 27న దర్యాప్తు అధికారులకు అవినాశ్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. దీన్ని దర్యాప్తు అధికారి అనుమతించలేదు. మళ్లీ ఫిబ్రవరి 24న హాజరు కావాలంటూ ఫిబ్రవరి 16న నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 22న కూడా అవినాశ్‌రెడ్డి వీడియో, ఆడియో రికార్డింగ్‌పై విన్నవించారు. అప్పుడు కూడా అనుమతించలేదు. మరోసారి మార్చి 10న విచారణకు రావాలని మార్చి 5న సీఆర్పీసీ 160 కింద మరో నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో విచారణ పారదర్శకంగా సాగడం లేదని, నిష్పక్షపాతంగా సాగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ హైకోర్టు ను ఆశ్రయించారు’ అని నిరంజన్‌రెడ్డి వివరించారు. విచారణ పేరుతో వేధిస్తున్నారు.. ‘వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ ముందు పిటిషనర్ విచారణ ముగియగానే, మీడియా ఇష్టం వచ్చినట్లు కథనాలు రాస్తూ, ఆయన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తోంది. వాస్తవాలను పట్టించుకోవడం లేదు. అందువల్లే వీడియో, ఆడియో రికార్డు చేయాలని దర్యాప్తు అధికారులను ఎంపీ కోరారు. అయినా దర్యాప్తు అధికారి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. విచారణ సమయంలో పిటిషనర్ చెబుతున్న అంశాలను టైపిస్ట్ టైప్ చేస్తుండగా, దర్యాప్తు అధికారి కంప్యూటర్ మౌస్‌ను పలుమార్లు తన చేతుల్లోకి తీసుకుని కొన్ని లైన్లు తీసివేయాలంటూ టైపిస్ట్‌కు సూచించారు. కంప్యూటర్ స్క్రీన్ దర్యాప్తు అధికారికి, టైపిస్ట్‌కు మాత్రమే కనిపించేలా ఉండటంతో ఏం డెలీట్ చేస్తున్నారో పిటిషనర్ చూడలేకపోయారు. అవినాశ్‌ను విచారణ చేసే సమయంలో నలుగురైదుగురు అధికారులు ఉన్నారు. విచారణ ముగిశాక దీనికి సంబంధించిన ఓ ప్రతిని ఇవ్వమని కోరినా, దర్యాప్తు అధికారి నిరాకరించారు. నిబంధనలు అంగీకరించవని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పిటిషనర్ వెంట న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలివ్వాలి. ఎఫ్ఐఆర్ సహా ఎక్కడా అవినాశ్ పేరు లేదు. అయినా పలుమార్లు విచారణ పేరుతో వేధిస్తున్నారు. దర్యాప్తు అధికారి.. ముందే ఓ ఊహాజనిత స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని, ఆ మేరకు కావాల్సిన విధంగా సాక్షులను సిద్ధం చేస్తున్నారు. అవినాశ్‌రెడ్డితోపాటు భాస్కర్‌రెడ్డిని కూడా దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. దస్తగిరిని వారికి అనుకూలంగా మలచుకుని, ఆ మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు’ అని వాదనలు వినిపించారు. వీడియో రికార్డింగ్‌తోనే విచారణ వీడియో, ఆడియో రికార్డింగ్‌పై దర్యాప్తు అధికారి వివరణ తీసుకుని కోర్టుకు తెలియజేయాలని న్యాయమూర్తి.. సీబీఐ న్యాయవాదిని ఆదేశించారు. భోజన విరామం అనంతరం వాదనలు పునః ప్రారంభం కాగా, వీడియో, ఆడియో రికార్డింగ్‌లతోనే పిటిషనర్ విచారణ సాగుతోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. వివేకా హత్య జరిగిన చోట దొరికిన లేఖను ఫోరెన్సిక్‌కు పంపినట్లు చెప్పారు. లేఖ విషయాన్ని 2021 జనవరి 31 నాటి అనుబంధ చార్జీషీట్లో పేర్కొన్నట్లు చెప్పారు. అవినాశ్‌రెడ్డి.. సాక్షినా? లేక నిందితుడా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా, అవినాశ్‌రెడ్డికి సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చామని.. అవసరమైతే ఆయన్ను, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని సీబీఐ న్యాయవాది చెప్పారు. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన సీబీఐ ఎస్పీ.. ఆడియో, వీడియో రికార్డుల హార్డ్‌డిస్క్, కేసు ఫైళ్లను ఇప్పుడే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సోమవారం సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. కాగా, ఈ పిటిషన్లో వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ అయ్యారు. పిటిషన్లో తన పేరు ప్రస్తావించినందున తన వాదనలు కూడా వినాలని కోరారు. వివేకా లేఖను తొక్కిపెట్టారు.. ‘వివేకా హత్య జరిగిన చోట దొరికిన లేఖను దర్యాప్తు అధికారులు తొక్కిపెడుతున్నా రు. వైఎస్ వివేకా అల్లుడే ఆయన్ను హత్య చేశాడని నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే ఈ కేసు అంశాలను మాత్రం సీబీఐ అధికారులు ఇప్పటివరకు పట్టించుకోలేదు. సీఆర్పీసీలో పేర్కొన్న నిబంధనల మేరకు దర్యాప్తు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించడం లేదు. ఈ నేపథ్యంలో పిటిషనర్ వీడియో, ఆడియో రికార్డు చేసేలా, న్యాయవాదిని విచారణ సమయంలో అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలి’ అని పిటిషనర్ న్యాయవాది నివేదించారు. -
గుడ్‌న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే ఆఫీస్.. ఉద్యోగులు ఫుల్ ఖుష్.!
లండన్: ఉద్యోగులు వారానికి నాలుగు రోజులే పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని బ్రిటన్ చేపట్టిన అతిపెద్ద ట్రయల్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. వివిధ రంగాలకు చెందిన 61 కంపెనీలు 6 నెలల పాటు నిర్వహించిన ఈ పైలట్ స్కీమ్‌లో పాల్గొన్నాయి. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ ట్రయల్ జరిగింది. ఇందులో మొత్తం 3,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వారానికి ఐదు రోజులు పనిచేసినప్పుడు ఎంత జీతం ఇచ్చారో.. నాలుగు రోజులు పనిచేసినా అంతే మొత్తాన్ని చెల్లించారు. చిన్న పెద్ద కంపెనీలు అనే తేడా లేకుండా అన్ని సంస్థలు ఈ ప్రయోగంలో ఆశాజనక ఫలితాలు సాధించినట్లు చెప్పాయి. ట్రయల్‌లో పాల్గొన్న 91 శాతం కంపెనీలు ఈ విధానాన్నే తాము కొనసాగిస్తామని చెప్పాయి. 4 శాతం సంస్థలు కాస్త సందిగ్ధత వ్యక్తం చేయగా.. మరో 4 శాతం కంపెనీలు తాము పాత పద్ధతినే(ఐదు రోజుల పనిదినాలు) కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. 35 శాతం పెరిగిన రెవెన్యూ.. వారానికి నాలుగు రోజుల పనిదినాల అనుభవంపై కంపెనీలు 10 పాయింట్లకు సగటున 8.5 రేటింగ్ ఇచ్చాయి. బిజినెస్ ప్రొడక్టివిటీ, బిజెనెస్ పర్ఫామెన్స్‌కు 7.5 రేటింగ్ ఇచ్చాయి. ఈ విధానం వల్ల గతేడాదితో పాల్చితే రెవెన్యూ 35 శాతం పెరిగిందని సంస్థలు వెల్లడించాయి. కొత్త నియామకాలు పెరిగాయని, ఆఫీసులకు గైర్హాజరు శాతం తగ్గిందని పేర్కొన్నాయి. ఉద్యోగులకు సంతృప్తి.. నాలుగు రోజుల పనిదినాల వల్ల ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని ట్రయల్‌లో తేలింది. చాలా మంది వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించారని, ఉద్యోగ సంతృప్తిలో గణనీయమైన పెరుగుదల కన్పించిందని వెల్లడైంది. అలాగే ఉద్యోగులకు ఒత్తిడి, అలసట, నిద్ర సమస్యలు కూడా తగ్గాయి. పర్యావరణ ఫలితాలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నాలుగు రోజులే పనిదినాలు కాడవంతో ఆపీస్‌కు వెళ్లే సమయంతో పాటు వాహనాల వినియోగం కూడా తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతోంది. మహిళలకే ఎక్కువ బెనిఫిట్.. ఈ కొత్త విధానం వల్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మేలు జరుగుతున్నట్లు ట్రయల్‌లో తేలింది. ఇంటి పనులు, పిల్లలను చూసుకునేందుకు పురుషులు సమయం కేటాయించడంతో మహిళలకు ఆ భారం తగ్గినట్లు వెల్లడైంది. వారానికే నాలుగు రోజుల పనిదినాలు విధానాన్ని భవిష్యత్తులో తాము ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నట్లు '4 డే వీక్ గ్లోబల్' స్వచ్ఛంద సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ, చార్లోటె లాక్హార్ట్ చెప్పారు. చదవండి: 'రెచ్చిపోతున్న కిమ్.. మౌనంగా ఉంటే ప్రపంచానికే ప్రమాదం..' -
బోల్సోనారోపై విచారణకు బ్రెజిల్ సుప్రీంకోర్టు ఓకే
రియోడీజనీరో: జనవరి 8వ తేదీన బ్రెజిల్ రాజధానిలో జరిగిన విధ్వంసానికి కారకులను గుర్తించేందుకు మాజీ అధ్యక్షుడు బోల్సోనారో తదితరులపై విచారణకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అల్లర్లు జరిగిన రెండు రోజుల తర్వాత బోల్సోనారో ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘దేశ సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం కారణంగానే లులా డిసిల్వా అధ్యక్షుడయ్యారే తప్ప, ప్రజల ఓట్లతో కాదు’ అంటూ అందులో వ్యాఖ్యానించారు. దీనిని బట్టి బోల్సోనారో కొట్లాటలను ప్రేరేపించినట్లుగా ఉందని దేశ ప్రాసిక్యూటర్ జనరల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన చేసిన వినతిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరెస్ విచారణకు అనుమతి మంజూరు చేశారు. కాగా, ఆ వీడియోను అనంతరం బోల్సోనారో తొలగించారు. -
బిల్కిస్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం
న్యూఢిల్లీ: బిల్కిస్ బాను అత్యాచార ఘటన దోషుల ముందస్తు విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు సీపీఎం నేత సుభాషిణీ అలీ, తృణమూల్ కాంగ్రెష్ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా ఎం.త్రివేదీల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కాసేపటికే, ఈ విషయమై గతంలో బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌పై విచారణ నుంచి గత డిసెంబర్ 13న జస్టిస్ త్రివేదీ తప్పుకున్న విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాంతో న్యాయమూర్తులిరువురూ కాసేపు చర్చించుకున్నారు. అనంతరం ఈ విచారణ నుంచి కూడా ఆమె తప్పుకుంటున్నట్టు జస్టిస్ రస్తోగీ చెప్పారు. ఆమె స్థానంలో మరో న్యాయమూర్తితో కలిసి ఫిబ్రవరి నుంచి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. తాజా పిటిషన్లను బిల్కిస్ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌కు కలిపి విచారిస్తామని వెల్లడించారు. -
సాయిప్రణీత్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: థామస్ కప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో భారత స్టార్ షట్లర్ సాయిప్రణీత్ విఫలమయ్యాడు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ట్రయల్స్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ 2ఎ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచాడు. నలుగురు చొప్పున ఉన్న నాలుగు గ్రూప్‌ల నుంచి ‘టాప్’లో నిలిచిన నలుగురే తదుపరి ట్రయల్స్ దశకు అర్హత పొందుతారు. 2ఎ గ్రూప్‌లో కిరణ్ జార్జి (కేరళ) అగ్రస్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందగా... సాయిప్రణీత్ రెండో స్థానంలో నిలిచాడు. కిరణ్ జార్జితో జరిగిన కీలక మ్యాచ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ 21–23, 21–11, 16–21తో ఓడిపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా సింగిల్స్ కోసం లక్ష్య సేన్, శ్రీకాంత్... ఇటీవల కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ప్రణయ్‌ను ‘బాయ్’ నేరుగా భారత జట్టులోకి ఎంపిక చేసింది. మిగిలిన ఒక బెర్త్ కోసం కిరణ్ జార్జి, రవి, సమీర్ వర్మ, ప్రియాన్షు తలపడతారు. -
ఆ డ్రగ్స్‌ను ఎవరు, ఎక్కడి నుంచి తెచ్చారు?
బంజారాహిల్స్: పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ పార్టీలో ప్రధాన నిందితులుగా ఉన్న పబ్ భాగస్వామి ఉప్పల అభిషేక్, మేనేజర్ అనిల్ కుమార్‌లను గురువారం కస్టడీకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు రెండోరోజైన శుక్రవారం కూడా ప్రశ్నించారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు విభాగం ఏసీపీ నర్సింగ్‌రావు, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, లంగర్‌హౌస్ డీఐ భాస్కర్‌రెడ్డి, హుమాయున్‌నగర్ డీఐ కోటేశ్వర్రావు, బంజారాహిల్స్ డీఐ హఫీజుద్దీన్, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావులతో కూడిన బృందం వీరిని 4 గంటలపాటు విచారించింది. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు..? ఎవరెవరికి సరఫరా చేశారు..? ఆ రోజు ఎవరెవరు తీసుకున్నారు..? అన్న కోణంలో ప్రశ్నలు సంధించగా తమకు తెలియదని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. పబ్‌లో డ్రగ్స్ తీసుకొని పారేసిన వందలాది సిగరెట్ పీకలను సీజ్ చేసిన పోలీసులు వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న కోణంలో కూడా ప్రశ్నించారు. ఇద్దరి మొబైల్ ఫోన్లలో ఉన్న పలువురు మాదకద్రవ్యాల విక్రేతల నంబర్లను బట్టి గోవా, ముంబై, నైజీరియా నుంచి కొకైన్ తీసుకొచ్చి పబ్‌లో అమ్ముతున్నట్లుగా గుర్తించి ఆ దిశలోనే వీరిని ప్రశ్నించారు. ఈ పబ్ ప్రధాన భాగస్వాములు వీరమాచినేని అర్జున్, కిరణ్‌రాజ్‌ల పాత్రపై కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నారు. పార్టీలు ఏర్పాటు చేసినప్పుడు ఈ నలుగురు తలా కొంత మందిని పబ్‌కు పంపిస్తున్నట్లుగా, వీరికి సినీతారలు, సంపన్న వర్గాల పిల్లలతో సత్సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఇద్దరు నిందితులను మరో రెండురోజులపాటు పోలీసులు విచారించనున్నారు. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
Russia-Ukraine War: పుతిన్‌ను బోనెక్కించగలరా?
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర విచక్షణారహితంగా సాగుతోంది. బుచా పట్టణంలో సాధారణ పౌరుల్ని వెంటాడి వేటాడిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా మిలటరీపైనా , అధ్యక్షుడు పుతిన్‌పైనా యుద్ధ నేరాల కింద విచారణ జరిపించాలని ప్రపంచ దేశాలు గర్జిస్తున్నాయి. యుద్ధం అంటేనే ఒక ఉన్మాద చర్య. అలాంటప్పు డు అందులో నేరాలుగా వేటిని పరిగణిస్తారు ? రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై యుద్ధ నేరాల విచారణ సాధ్యపడుతుందా ? ఇప్పుడు దీనిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్‌లో రష్యా మిలటరీ సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. బుచా పట్టణం శవాల దిబ్బగా మారింది. రక్తమోడుతూ, మసిబొగ్గుల్లా మారిన 300 మంది అన్నెం పున్నెం ఎరుగని పౌరుల మారణహోమం వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఏ క్షణంలో ఏమవుతుందోనన్న భయంతో చిన్నారుల శరీరాలపై తల్లిదండ్రులు వారి వివరాలు రాయడం మనసుని పిండేస్తోంది. గత నెలలోనే మారియూపోల్‌లోని ప్రసూతి ఆస్పత్రి, థియేటర్లపై బాంబు దాడులతో రష్యా యుద్ధ నేరాలకు దిగింది. తాజాగా బుచా పట్టణంలో రష్యా మిలటరీ చేసిన మారణకాండతో ఆ దేశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం బోనులోకి ఎక్కించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అయితే రష్యా మాత్రం బుచాలో తాము జరిపింది మిలటరీ ఆపరేషనేనని ఉక్రెయిన్ చూపిస్తున్న ఫొటోలు, వీడియోలు అన్నీ ఉక్రెయిన్ కవ్వింపు చర్యల్లో భాగమేనని ఎదురుదాడి చేస్తోంది. యుద్ధ నేరాలు అంటే ..? ఆయుధ బలం ఉంది కదాని ఒక దేశం ఇష్టారాజ్యంగా మరో దేశాన్ని నాశనం చేస్తామంటే కుదరదు. బలవంతుడి చేతిలో బలహీనులు బలికాకుండా ఉండడం కోసం 19వ శతాబ్ది ప్రారంభంలోనే అంతర్జాతీయ మానవతా చట్టం ద్వారా కొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధ నేరాలపై ప్రపంచ దేశాలు విస్తృతంగా చర్చించి ఒక అవగాహనకి వచ్చాయి. 1949 ఆగస్టు 12న జరిగిన జెనీవా ఒప్పందం యుద్ధ నేరాల గురించి స్పష్టతనిచ్చింది. వివిధ ఒడంబడికల ఆధారంగా యుద్ధ నేరాలుగా వేటిని పరిగణించాలో యూఎన్ సభ్యదేశాలు నిర్ణయించాయి. దీని ప్రకారం యుద్ధ నేరాలంటే.. ► యుద్ధంలో పాల్గొనని పౌరుల్ని ఉద్దేశపూర్వకంగా చంపడం ► సాధారణ పౌరుల్ని హింసించడం, గాయపరచడం, వారిపట్ల అమానవీయంగా ప్రవర్తించడం ► ఆసుపత్రులు, స్కూళ్లు, ప్రార్థనాలయాలపై దాడులు జరపడం ► పౌరుల్ని బందీలుగా పట్టుకోవడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం. యుద్ధప్రభావం పౌరులపై పడేలా ధ్వంసం సృష్టించడం ► కొన్ని రకాల మారణాయుధాలు, రసాయన బాంబుల్ని వాడడం ఇవన్నీ యుద్ధ నేరాలుగానే పరిగణిస్తారు. యుద్ధ నేరాలకు సంబంధించి జెనీవా ఒప్పందంలో ఉన్నవన్నీ తమకు సమ్మతమేనని 1954లోనే నాటి సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్) అంగీకరించింది. 2019లో కూడా రష్యా ఈ ఒప్పందాలకు కట్టుబడి ఉంటామనే స్పష్టతనిచ్చింది. యుద్ధనేరాల కేసు ముందుకెళుతుందా ? రష్యా మిలటరీ లేదంటే ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై యుద్ధ నేరాల కేసుని ముందుకు తీసుకువెళ్లడం అంత సులభం కాదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో నేరారోపణల్ని నమోదు చేయడానికే కనీసం మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది. ఉక్రెయిన్ నుంచి యుద్ధ నేరాలకు సంబంధించిన ఆధారాలను సేకరించడం అంత సులభంగా జరిగే అవకాశం లేదని హార్వార్డ్ లా స్కూల్ ప్రొఫెసర్ అలెక్స్ వైటింగ్ అభిప్రాయపడ్డారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఫొటోలు, వీడియోలు వంటి ఆధారాలు సేకరించినప్పటికీ ఆ మారణకాండకి ఆదేశాలు ఇచ్చిన నాయకులెవరని రుజువు చేయడం సులభం కాదన్నారు. అందుకే నేరారోపణలు నమోదైన తర్వాత కూడా విచారణకు ఏళ్లకి ఏళ్లు పట్టే అవకాశం ఉంది. నెదర్లాండ్స్‌లోని ద హేగ్ కేంద్రంగా పనిచేసే స్వతంత్ర సంస్థ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) యుద్ధనేరాలు, మారణకాండలు, ఊచకోతలపై విచారణ జరుపుతూ ఉంటుంది. ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ గత నెలలోనే రష్యా యుద్ధనేరాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఐసీసీలో 123 దేశాలకు సభ్యత్వం ఉన్నప్పటికీ రష్యా, ఉక్రెయిన్ సభ్య దేశాలు కాదు. రష్యా ఐసీసీని కనీసం గుర్తించలేదు సరికదా ఆ కోర్టు విచారణకు సహకరించకూడదని నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఏర్పాటైన దగ్గర్నుంచి యుద్ధ నేరాలకు సంబంధించి 30 కేసుల్ని విచారించింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
సజ్జనార్‌ను విచారించనున్న ఎన్హెచ్ఆర్సీ
-
కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో విచారణ వేగవంతం
-
3,518 మంది హత్యలకు సహకారం.. 75 ఏళ్ల తర్వాత విచారణ
బెర్లిన్: అడాల్ఫ్ హిట్లర్ పేరు చేబితే ఇప్పటికి జర్మనీలో కొందరు వణికిపోతారు. అవును మరి అతడు చేసిన దురాగతాలకు లెక్కే లేదు. జర్మనీ నియంతగా మారిన తర్వాత హిట్లర్ యూదులను తీవ్రంగా ద్వేషించాడు. దేశం మొత్తం జల్లెడ పట్టి.. యూదులను ఊచకోత కోశాడు. ఏకంగా కాన్సెంట్రేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి.. యూదులను అత్యంత దారుణంగా హత్య చేశాడు. దాదాపు ఏడున్నర లక్షల మంది యూదులు నాజీ శిబిరాలలో రాక్షసంగా మరణించారు అంటే ఎంత దారుణంగా ప్రవర్తించాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నియంత పేరు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే.. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన డెబ్భైఐదు సంవత్సరాల తర్వాత జర్మనీ కోర్టు.. మాజీ నాజీ కాన్సంట్రేషన్ గార్డు ఒకరిని విచారిస్తుంది. జర్మనీ చట్టాల ప్రకారం నిందితుడి పేరు వెల్లడించలేదు. సదరు గార్డు 1942 నుంచి 1945 వరకు సచ్సెన్హాసన్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో క్యాంప్ గార్డ్‌గా పనిచేశాడు. సదరు గార్డు 3,518 మంది హత్యలకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ అక్టోబర్‌లో ప్రారంభమవుతుందని, సెషన్ రోజుకు రెండున్నర గంటలకు పరిమితం చేస్తామని అధికారులు తెలిపారు. ప్రాసిక్యూటర్ల ప్రకారం, ప్రస్తుతం 100 ఏళ్ల వయసు ఉన్న ఆ వ్యక్తి 75 ఏళ్ల క్రితం నిర్బంధ శిబిరం వద్ద గార్డుగా పని చేశాడు. ఆ సమయంలో అతడు 3,518 హత్యలకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడైన క్యాంప్ గార్డుపై 1942 లో మాజీ సోవియట్ యుద్ధ ఖైదీలను కాల్చడం, విషపూరిత వాయువు జైక్లాన్ బీని ఉపయోగించడంతో సహా ఉరితీయడానికి సహకరించినట్లు అభియోగాలు ఉన్నాయి. సచ్సెన్హాసన్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో కనీసం 2,00,000 మందిని ఖైదు చేయగా.. 20,000 మందిని హత్య చేశారు. ఈ ఆరోపణల విచారణల నేపథ్యంలో ప్రాసిక్యూటర్ నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించాడు, ఆ తర్వాత అతను విచారణకు ఫిట్‌గా ఉన్నాడని ప్రకటించారు. గత నెలలో జర్మనీ కోర్టు 95 ఏళ్ల నాజీ గార్డుని విచారించినట్లు తెలియజేసింది. అక్టోబర్ 1943 నుంచి ఏప్రిల్ 1945 వరకు స్టాలగ్ 6సీ బాథోర్న్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో సదరు వ్యక్తి గార్డుగా పని చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అనేక మంది మాజీ సోవియట్ సైనికులు స్టాలగ్ 6సీ బాథోర్న్ శిబిరంలో పెద్ద సంఖ్యలో మరణించినట్లు నివేదిక తెలిపింది. తరువాత దీనిని పోలిష్ దళాలు విముక్తి చేశాయి. ఇక ఈ ఏడాది మార్చిలో, ప్రాసిక్యూటర్లు అమెరికా నుంచి బహిష్కరించబడిన 95 ఏళ్ల మాజీ నాజీ డెత్ క్యాంప్ గార్డ్ ఫ్రెడరిక్ కార్ల్ బెర్గర్‌పై కేసును కొట్టేశారు. బెర్గర్‌ను విచారించడానికి తగిన సాక్ష్యాలు లేనందున ఈ కేసును కొట్టేస్తేన్నట్లు కోర్టు తెలిపింది. -
మీడియా ‘దర్యాప్తు’ మాకొద్దు: శిల్పాశెట్టి
ముంబై: నీలి చిత్రాల చిత్రీకరణ కేసులో అరెస్ట్ అయిన వ్యాపారి రాజ్‌కుంద్రాపై దేశంలోని ప్రసార మాధ్యమాలన్నీ కోర్టుతో పాటు సమాంతర దర్యాప్తు కొనసాగిస్తున్నాయని రాజ్‌కుంద్రా భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ కుటుంబ గోపత్యకూ ప్రజలు గౌరవం ఇవ్వాలని, ముఖ్యంగా పిల్లలున్న కుటుంబాల ప్రైవసీకి భంగం కల్గించొద్దని ఆమె హితవు పలికారు. మీడియా సొంత ‘దర్యాప్తు’కు స్వస్తి పలకాలని, చట్టం తన పని తాను చేయనివ్వండని ఆమె మీడియాను కోరారు. నీలి చిత్రాలను నిర్మించి, వాటిని ‘హాట్ షాట్స్’ తదితర యాప్‌ల ద్వారా ప్రచారంలోకి తెచ్చారనే ఆరోపణలపై జూలై 19వ తేదీన ముంబై నేరవిభాగ పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయడం తెల్సిందే. గత బుధవారం ఆయన చేసిన బెయిల్ అభ్యర్థనను దిగువ కోర్టు కొట్టేయడం విదితమే. కుంద్రా అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అరెస్టు, అరెస్ట్‌కు కారణాలు, కుంద్రా చట్టవ్యతిరేక చర్యలు అంటూ పలు మాధ్యమాల్లో కథనాలు వచ్చాయని, దీంతో తన కుటుంబానికి ప్రైవసీ లేకుండా పోయిందంటూ శిల్పా శెట్టి సోమవారం ‘ఇన్స్టాగ్రామ్’లో వివరణ ఇచ్చారు. ముంబై పోలీసులపై, భారత శాసన వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. ‘ఆరోపణల నుంచి కుంద్రాను విముక్తుణ్ణి చేసేందుకు, శాసనవ్యవస్థ ద్వారా మాకున్న అన్ని సహాయ అవకాశాలను మేం అన్వేషిస్తున్నాం. నా పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని తల్లిగా నేను కోరేది ఒక్కటే. అసంపూర్ణ సమాచారంతో తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం ఆపండి. మా కుటుంబం ప్రైవసీకి భంగం కల్గించొద్దు. సమాంతర దర్యాప్తు చేయకండి. సత్యమేవ జయతే’ అని శిల్ప పోస్ట్ చేశారు. -
పాక్షికంగా కేసుల భౌతిక విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో కేసుల విచారణను ఈ నెల 9 నుంచి సెప్టెంబర్ 9 వరకు ప్రయోగాత్మకంగా పాక్షికంగా భౌతిక పద్ధతిలో చేపట్టడంతోపాటు ఆన్‌లైన్‌లోనూ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. అయితే ఈ నెల 8 వరకు మాత్రం ప్రస్తుతమున్న ఆన్లైన్ విధానంలోనే కేసుల విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సోమ, మంగళవారాల్లో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనంతోపాటు ముగ్గురు సింగిల్ జడ్జీలు భౌతికంగా కేసులను విచారిస్తారని, బుధ, గురువారాల్లో న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్. రామచందర్‌రావు, జస్టిస్ టి. వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనంతోపాటు ముగ్గురు సింగిల్ జడ్జీలు భౌతికంగా కేసులను విచారిస్తారని హైకోర్టు తెలిపింది. ఆ తర్వాత రెండు రోజులు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనంతోపాటు ముగ్గురు సింగిల్ జడ్జీలు భౌతికంగా కేసులను విచారిస్తారని పేర్కొంది. హైకోర్టుతోపాటు కింది కోర్టుల్లో వ్యాక్సిన్ వేయించుకున్న న్యాయవాదులనే కోర్టు హాల్లోకి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్‌ను వెంట ఉంచుకోవాలని సూచించింది. అలాగే హైకోర్టుతోపాటు కిందిస్థాయి కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఆయా రోజుల్లో కేసులు విచారణలో ఉన్న న్యాయవాదులనే అనుమతిస్తామని పేర్కొంది. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని హైకోర్టు రిజిస్ట్రార్ వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రేపట్నుంచి సెప్టెంబర్ 9 వరకు కింది కోర్టుల్లోనూ... సోమవారం నుంచి సెప్టెంబర్ 9 వరకు కింది కోర్టులు, ట్రిబ్యునళ్లలో పాక్షికంగానే భౌతికంగా కేసుల విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మాత్రం ఈ నెల 8 వరకు ఆన్లైన్లోనే విచారణ కొనసాగించాలని స్పష్టం చేసింది. సీబీఐ, ఏసీబీ, నాంపల్లి, సిటీ సివిల్ కోర్టు, వరంగల్ జిల్లా కోర్టుల్లో ప్రస్తుతం కొనసాగిస్తున్న విధానంలోనే పాక్షికంగా ప్రత్యక్షంగా కేసులను విచారించాలని పేర్కొంది. తుది విచారణ దశలో ఉన్న కేసుల్లో ముందుగా సమాచారం ఇచ్చి భౌతికంగా లేదా ఆన్లైన్ ద్వారా వాదనలు వినిపించే అవకాశం న్యాయవాదులకు ఉంటుందని తెలిపింది. -
Corona Vaccine: సనోఫీ–జీఎస్కే వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్
న్యూఢిల్లీ: సనోఫీ పాయిశ్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్–జీఎస్కే ఫార్మాస్యూటికల్ కంపెనీ సంయుక్తంగా కొవిడ్–19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇది ప్రోటీన్ ఆధారితం. తాజాగా ఈ టీకా మూడో దశ ట్రయల్స్‌కు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతి మంజూరు చేసింది. ఈ దశలో టీకా భద్రత, సమర్థత, కరోనా వైరస్‌పై పనితీరును క్షుణ్నంగా పరీక్షించనున్నారు. భారత్‌తోపాటు అమెరికా, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో 35,000కు పైగా వలంటీర్లపై తమ టీకా ప్రయోగాలు నిర్వహించనున్నట్లు సనోఫీ సంస్థ కంట్రీ హెడ్ అన్నపూర్ణ దాస్ చెప్పారు. ఇందుకోసం 18 ఏళ్లు పైబడిన వలంటీర్లను నియమించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక టీకా అభివృద్ధి విషయంలో మూడో దశ ట్రయల్స్ చాలా కీలకమని పేర్కొన్నారు. కరోనా వైరస్‌లో మార్పులు కొనసాగుతున్నాయని, కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించామని తెలిపారు. -
ఆ ఎన్నారై భర్తలపై జూలైలో విచారణ
న్యూఢిల్లీ: భార్యలను వదిలేసిన, కట్నం కోసం వేధించిన ఎన్నారై భర్తలను తప్పనిసరిగా అరెస్టు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై జూలైలో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. బాధిత మహిళల తరఫున వాదించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీనియర్ న్యాయవాది కొలిన్ గొన్సాల్వెజ్ సోమవారం జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ ఎస్.రామసుబ్రమణియన్ల ధర్మాసనానికి నివేదించారు. ఈ అంశంపై తాము వేరుగా పిటిషన్ వేశామనీ, దీనిపై న్యాయస్థానానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రవాసీ లీగల్ సెల్ తరఫున సంజయ్ హెగ్డే పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం..ఈ పిటిషన్లపై జూలైలో విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రం బదులిచ్చినట్లు కూడా ధర్మాసనం తెలిపింది. కట్నం కోసం వేధించిన, భార్యలను వదిలివెళ్లిపోయిన ఎన్నారై భర్తలపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వేరుగా ఉంటున్న తమ భర్తలను అరెస్టు చేయాలనీ, ఈ విషయంలో విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ద్వారా తమకు సాయం అందించాలని వారు తమ పిటిషన్లలో అభ్యర్థించారు. ఇటువంటి కేసుల్లో సదరు భర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేసి, అరెస్టు చేయాలంటూ వారి తరఫు న్యాయవాది సత్య మిత్ర కోరారు. ‘ఇటువంటి కేసుల్లో సదరు ఎన్నారై భర్తలు, న్యాయస్థానానికి హాజరు కాకుండా తప్పించుకోవడం, భారత్‌కు తిరిగి రాకపోవడం జరుగుతున్నాయి. ఈ విషయంలో వారి పాస్‌పోర్టు లను స్వాధీనం చేసుకుని, స్వదేశానికి రప్పించేం దుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లలో కోరారు. ఇందుకోసం బాధితుల పక్షాన మానవీయ దృక్పథంతో పనిచేసేలా చూడాలని పేర్కొన్నారు. -
ఢిల్లీలో 26నాటి ఘటనపై న్యాయ విచారణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26వ తేదీన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. అప్పటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వం రైతులపై తప్పుడు ఆరోపణలతో కేసులు బనాయించిందని ఆరోపించాయి. సింఘు వద్ద సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు శనివారం మీడియాతో మాట్లాడారు. పోలీసు నోటీసులు అందుకున్న రైతులు నేరుగా వారి వద్దకు వెళ్లకుండా, అవసరమైన సాయమేదైనా రైతు సంఘాల న్యాయ విభాగాల నుంచి పొందాలని సూచించారు. జనవరి 26వ తేదీ నాటి హింసాత్మక ఘటనలకు, రైతులపై తప్పుడు కేసులు నమోదు చేయడం వెనుక కుట్ర దాగుందని ఎస్కేఎం న్యాయ విభాగం సభ్యుడు కుల్దీప్ సింగ్ ఆరోపించారు. ఈ ఘటనలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న 16 మంది రైతుల ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదన్నారు. ఆ ఘటనలపై నమోదైన మొత్తం 44 ఎఫ్ఐఆర్లలో 14 ఎఫ్ఐఆర్లకు సంబంధించి 122 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారని, వారందరికీ న్యాయ, ఆర్థిక సాయం అందజేస్తామని మరో నేత రవీందర్ సింగ్ తెలిపారు. కొందరు రైతులపై దోపిడీ, హత్యాయత్నం వంటి కేసులు కూడా పెట్టారన్నారు. భోజనం ఖర్చుల కోసం జైలులో ఉన్న రైతులకు రూ.2 వేల చొప్పున ఎస్కేఎం అందజేస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు జైలులో ఉన్న 10 మంది రైతులకు బెయిల్ మంజూరు కాగా, మరో ఐదుగురి బెయిల్‌కు దరఖాస్తు చేశామన్నారు. తీవ్ర సెక్షన్ల కింద కేసులు నమోదు కాని వారిపై మొదట దృష్టి పెట్టినట్లు చెప్పారు. తీహార్ జైలులో ఉన్న 112 మంది రైతులను తమ న్యాయ విభాగం కలిసిందని వెల్లడించారు. ఇలా ఉండగా, ట్రాక్టర్ పరేడ్ సమయంలో ఎర్రకోట వద్ద జరిగిన ఘటనలకు కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న నటుడు దీప్ సిద్దు, ఇక్బాల్ సింగ్ అనే మరో వ్యక్తిని దర్యాప్తులో భాగంగా ఢిల్లీ నేర విభాగం పోలీసులు శనివారం ఘటనాస్థలికి తీసుకువచ్చి, సీన్ రిక్రియేట్ చేయించారు. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 500 మంది పోలీసులు గాయపడగా, ఒక ఆందోళనకారుడు చనిపోయిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు గాంధీజీ మనవరాలు మద్దతు ఘజియాబాద్: మహాత్మాగాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాచార్జీ(84) రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపారు. గాంధీ నేషనల్ మ్యూజియం చైర్ పర్సన్ కూడా అయిన భట్టాచార్జీ శనివారం ఘాజీపూర్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులతో మాట్లాడారు. నిరసనలు శాంతియుతంగా కొనసాగించాలని వారిని కోరిన ఆమె.. రైతులపట్ల శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయ కార్యక్రమంలో భాగంగా మేం ఇక్కడికి రాలేదు. మనల్ని పోషిస్తున్న రైతుల కోసం మాత్రమే వచ్చాం. అన్నదాతల కష్టాన్ని విస్మరించరాదు. రైతులకు లబ్ధి దేశానికే లబ్ధి’అని ఆమె అన్నారని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) తెలిపింది. ఆమె వెంట మహాత్మా స్మారక్ నిధి చైర్మన్ రామచంద్ర రాహి, ఆల్ ఇండియా సర్వ్ సేవా సంఘ మేనేజింగ్ ట్రస్టీ అశోక్ సరన్, గాంధీ స్మారక్ నిధి డైరెక్టర్ సంజయ్ సింఘా, నేషనల్ గాంధీ మ్యూజియం డైరెక్టర్ అన్నామలై ఉన్నారు. -
యూఏఈ ప్రధానికి ట్రయల్ కరోనా వ్యాక్సిన్
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మంగళవారం కరోనా వైరస్ వ్యాక్సిన్ టీకా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో ప్రకటించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ అందుకుంటున్నప్పుడు అంటూ ఒక చిత్రాన్ని ఆయన షేర్ చేశారు. యూఏఈలో భవిష్యత్ తుఎపుడూ బావుంటుందని ట్వీట్ చేశారు. మరోవైపు ఈ వ్యాక్సిన్ దేశ చట్టాలకు అనుకూలంగా ఉందని దేశ ఆరోగ్య మంత్రి అబ్దుల్ రెహ్మాన్ అల్-ఓవైస్ ప్రకటించారు. షేక్ మొహమ్మద్ తనకు వైద్య సిబ్బంది టీకాలు వేస్తున్నట్లు ట్విటర్లో ఒక చిత్రాన్ని పోస్ట్ చేసారు. రోజు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నా.. ప్రతి ఒక్కరికీ భద్రత, గొప్ప ఆరోగ్యాన్ని ఇవ్వాలన్ని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. యుఎఈలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన తమ బృందాలను చూసి గర్వంగా ఉందన్నారు. కాగా గత కొన్ని వారాలుగా కొంతమంది యుఏఈ మంత్రులు కూడా కరోనా టీకా షాట్స్ తీసుకున్నారు. ముఖ్యంగా కోవిడ్-19 రోగులతో సన్నిహితంగా ఉన్న ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ కార్మికులకు ట్రయల్ వ్యాక్సిన్‌కు సెప్టెంబర్‌లో యుఏఈ అత్యవసర అనుమతి ఇచ్చింది. ఆరోగ్య కార్యకర్తల రక్షణ, భద్రత కోసం దేశం తీసుకున్న చర్యలలో భాగంగా టీకా అత్యవసర వాడకానికి యుఎఈ అనుమతించింది. గత నెల ప్రారంభంలో, దేశ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా ట్రయల్ కరోనావైరస్ వ్యాక్సిన్ అందుకున్న సంగతి తెలిసిందే. While receiving the COVID-19 vaccine today. We wish everyone safety and great health, and we are proud of our teams who have worked relentlessly to make the vaccine available in the UAE. The future will always be better in the UAE. pic.twitter.com/Rky5iqgfdg — HH Sheikh Mohammed (@HHShkMohd) November 3, 2020 -
వ్యాక్సిన్ వల్లే ఆ డాక్టర్ మరణించారా?!
రియో డీ జెనెరో: కరోనా వైరస్ బారిన పడిన 28 ఏళ్ల బ్రెజీలియన్ యువ డాక్టర్ మరణంపై ప్రపంచ వ్యాప్తంగా రాద్ధాంతం చెలరేగుతోంది. రియో డీ జెనెరోకు చెందిన డాక్టర్ జోవా పెడ్రో రో ఫైటోసా కరోనా వైరస్ కారణంగా అనారోగ్యానికి గురై అక్టోబర్ 15వ తేదీన మరణించారు. అయితే ఆయన ఆస్ట్రాజెనేకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సంయుక్తంగా నిర్వహిస్తోన్న కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొంటున్నారని, ఆ టీకా వికటించడం వల్ల డాక్టర్ మరణించారంటూ ముందుగా వార్తలు వెలువడ్డాయి. దాంతో పరిశోధకులు వెంటనే వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిలిపి వేశారు. వ్యాక్సిన్ కంటే కరోనా ప్రభావం నుంచి బయట పడేందుకు వాడిన మందుల వల్ల డాక్టర్ మరణించారని ట్రయల్స్ సన్నిహిత వర్గాలకు ఉటంకిస్తూ బ్రెజిల్ పత్రిక గ్లోబో, వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ తెలియజేసింది. రియో డీ జెనెరోలోని రెండు ఆస్పత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో డాక్టర్ జోవా గత మార్చి నెల నుంచి పని చేస్తున్నారు. ఆయన ప్రధానంగా కరోనా రోగులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆయన గతేడాదే వైద్య కళాశాలలో చదువు పూర్తి చేసుకొని వచ్చారని, కరోనా బారిన పడేంత వరకు ఆయన ఆరోగ్యం బాగుందని ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు గ్లోబో వార్తా పత్రికకు తెలియజేశారు. డాక్టర్ జావో ఆస్పత్రిలో రోగుల నుంచి తన కరోనా వైరస్ సోకకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోక పోవడం వల్లనే ఆయన వైరస్ బారిన పడినట్లు సావో పావ్లో ఫెడరల్ యూనివర్శిటీ వర్గాలు తెలిపాయి. ఆరోగ్యంగా ఉన్న యువ డాక్టర్ కరోనా కారణంగా పోవడం ఏమిటని కుటుంబ సభ్యులు, మిత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాము వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిలిపి వేయడం లేదని, స్వతంత్ర కమిటీ కూడా తమకు ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బ్రెజిల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ మూడవ ట్రయల్స్‌కు సహకరిస్తోన్న పావ్లో యూనివర్శిటీ వర్గాలు తెలిపాయి. -
బియ్యం డోర్ డెలివరీకి 8న ట్రయల్‌రన్
-
సైక్లింగ్ తెచ్చిన అవకాశాలు..
కోల్‌కతా: గాయపడిన తన తండ్రిని సైకిల్ పై కూర్చొబెట్టుకొని ఢిల్లీ నుంచి దర్భంగా వరకు 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన బిహార్‌కు చెందిన విద్యార్థిని జ్యోతి కుమారికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్ ఎత్తేశాక జ్యోతిని సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే ట్రయల్స్‌కు పంపుతామని, అయితే చదువే తమ మొదటి ప్రాధాన్యమని ఆమె తండ్రి మోహన్ పాశ్వాన్ తెలిపారు. వలస కార్మికులంతా ఇళ్లకు తిరిగి వెళుతుంటే తమకు మరో మార్గం లేక పాత సైకిల్ కొని ప్రయాణం సాగించినట్లు తెలిపారు. దారి మధ్యలో తాము ట్రక్కులు, ట్రాక్టర్లను పట్టుకొని ప్రయాణం చేసినట్లు తెలిపారు. దర్భంగా జిల్లా కలెక్టర్ జ్యోతిని ఇటీవల పిండారుచ్ హైస్కూల్లో 9వ తరగతిలో చేర్పించారు. ఆమెకు కొత్త సైకిల్, యూనిఫాం, షూ అందించారు. జ్యోతి చదువుయ్యే ఖర్చును భరిస్తామని లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. మరోవైపు జ్యోతికి సైక్లింగ్ లో ట్రైనింగ్, స్కాలర్ షిప్ ఇచ్చే అవకాశాలను పరిశీలించాలంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ క్రీడల మంత్రి కిరెన్ రిజిజును కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. -
పీఎన్బీ స్కాం: నీరవ్ మోడీ విచారణ షురూ!
సాక్షి. న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ (49) పై లండన్ కోర్టులో విచారణ మొదలు కానుంది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడీని విచారణ కోసం యుకె కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం సౌత్‌వెస్ట్ లండన్‌లోని వర్డ్స్‌వర్త్ జైల్లో ఉన్న ఆయనను అధికారులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మోడీని భారత్‌కు అప్పగించాలని దాఖలైన పిటిషన్‌పై 5 రోజుల పాటు విచారణ జరగనుంది. వేలకోట్ల రూపాయల మేర బ్యాంకును మోసం చేసి లండన్‌కు పారిపోయిన మోడీని అప్పగించాలంటూ భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. కోవిడ్-19 వాప్తి, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో వీడియో లింక్ ద్వారా ఆయనను విచారించే విషయాన్ని కూడా డిస్ట్రిక్ జడ్జి శామ్యూల్ గూజీ పరిశీలిస్తున్నారు. ''కొన్ని జైళ్లు నిందితులను వ్యక్తిగతంగా ప్రవేశపెడుతున్నందున ఈ నెల 11న నీరవ్ మోదీని కోర్టు ముందుకు తీసుకురావాలని ఆదేశిస్తాం. ఒకవేళ ఇది సాధ్యం కాని పక్షంలో లైవ్ వీడియో లింక్ ద్వారా విచారిస్తాం..'' అని న్యాయమూర్తి గూజీ పేర్కొన్నారు. (మరో మెగా డీల్‌కు సిద్ధమవుతున్న అంబానీ) నీరవ్ మోడీని అప్పగించాలంటూ గతేడాది భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నుంచి ఐదు రోజుల పాటు లండన్ కోర్టు విచారణ జరపనుంది. గత ఏడాది మార్చి 19న అరెస్టు అయినప్పటి నుండి నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో మోడీ పీఎన్బీని రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. (కరోనా : అనుకోని అతిధి వైరల్ వీడియో) -
నల్లగొండ కోర్టులో హాజీపూర్ హత్య కేసు విచారణ
-
23 నుంచి 31 వరకు సాక్షుల విచారణ
ఆదిలాబాద్‌టౌన్: సమత కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. డిశ్చార్జ్ పిటిషన్‌ను శుక్రవారం కోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా డిశ్చార్జ్ పిటిషన్‌పై నిందితుల తరపు లాయర్ రహీం, పీపీ రమణారెడ్డి ఇద్దరు తమ తమ వాదనలు వినిపించారు. చార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాత డిశ్చార్జ్ పిటిషన్ వేయడం నిబంధనలకు వ్యతిరేకమని, గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను పీపీ రమణారెడ్డి వాదనలు వినిపించారు. దీంతో న్యాయవాది రహీం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సోమవారం నుంచి షెడ్యూల్ ప్రారంభించాలని ఆదేశించింది. ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాలంది. చార్జ్‌షీట్‌లో పొందుపర్చిన 44 మంది సాక్షులను రోజువారీగా కోర్టు విచారణ చేపట్టనుంది. -
మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు లండన్ హైకోర్టులో విచారణ
-
జంట పేలుళ్ల కేసులో 27న తీర్పు
సాక్షి, హైదరాబాద్: పుష్కరకాలం క్రితం చోటు చేసుకున్న గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ జంట పేలుళ్ల కేసు విచారణ మంగళవారంతో పూర్తయింది. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిగ్నేటెడ్ న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ కేసులో తీర్పును ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 27న వెలువరించనుంది. కొన్నాళ్ల క్రితం వరకు నాంపల్లి కోర్టులోనే ఈ కేసుల ట్రయల్ నడిచినప్పటికీ వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రత్యేక కోర్టును జైలు ఆవరణలోనే ఏర్పాటు చేశారు. దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసుల విచారణకు వినియోగించిన స్పెషల్ కోర్టు ప్రాంగణాన్నే ఈ కేసుల కోసం వినియోగించారు. రెండు నెలల నుంచి ట్రయల్ ప్రక్రియ వేగవంతమైంది. 2007 ఆగస్టు 25న జరిగిన ఈ ఉగ్రవాద చర్యలో 42 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 300 మంది వరకు క్షతగాత్రులయ్యారు. అదే రోజున దిల్సుఖ్ నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో ఉన్న పేలని బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతాలకు సంబంధించి నమోదైన మూడు వేర్వేరు కేసుల్లో మొత్తం 8 మంది ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు నిందితులుగా ఉన్నారు. పరారీలో ఉన్న అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ మినహా మిగిలిన అనీఖ్, సాదిక్, ఫారూఖ్, ఇస్మాయిల్, తారీఖ్ అంజుమ్ ఎహసాన్లపై విచారణ జరిగింది. ఈ నెల 27న తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పోలీసు విభాగం జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనుంది. -
టీడీపీ మాహాసంప్రోక్షణనుపై హైకోర్టులో విచారణ
-
1,700 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజా సేవ చేస్తామంటూ రాజకీయ క్షేత్రంలో ఉన్న దాదాపు 1,700 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరారోపణలు ఉన్నాయి. వీరంతా దాదాపు 3,045 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. కాగా, ఈ కేసులు ఎదుర్కొంటున్నవారిలో ఉత్తరప్రదేశ్ నుంచే ఎక్కువ మంది ఉన్నారని, ఆ తర్వాత తమిళనాడు, బిహార్, పశ్చిమ బెంగాల్ వరుసగా ఉన్నట్లు కేంద్ర సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 248మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమిళనాడు, బిహార్, బెంగాల్లో వరుసగా 178, 144, 139 మంది ఎమ్మెల్యేలు విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో 100 మందికిపైగా ఎంపీలు, ఎమ్మెల్యేపై కూడా వివిధ నేరాల్లో పాలుపంచుకున్నట్లు, స్వయంగా చేసినట్లు కేసులు ఉన్నాయి. -
అత్యాచార ఘటనపై డీఎస్పీ విచారణ
కంబదూరు: మండల కేంద్రం కంబదూరులో కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ మంగళవారం విచారణ చేపట్టారు. సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ ఉన్న రక్తపు మరకలను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. బాలిక చదువుతున్న కేజీబీవీకి కూడా వెళ్లి అక్కడి సిబ్బందితో కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ వెంట ఎస్ఐ నరసింహుడు, సిబ్బంది ఉన్నారు. -
అది రోడ్డు ప్రమాదం కాదు.. హత్య!
♦ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఘటనపై పలు అనుమానాలు ♦ హత్యకు గురయ్యాడన్న సమాచారంతో ఆ కోణంలో విచారణ ♦ పోలీసుల అదుపులో ఐదుగురు తండావాసులు! బొల్లాపల్లి (వినుకొండ) : వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పలు రకాల వదంంతులు విన్పిస్తున్నాయి. మండలంలోని కనుమలచెర్వు పంచాయతీ శివారు బ్రిడ్జి తండాలో ఈ నెల 11న ఉదయం గుర్తు తెలియని ఆటో డీకొని భూక్యా రూప్లానాయక్ (42) మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బండ్లమోటు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో ఇటీవల పోలీసులకు అజ్ఞాత వ్వక్తి ఫోన్ చేసి రూప్లానాయక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని, హత్యకు గురయ్యాడని సమాచారం అందజేసినట్లు మండలంలో పుకార్లు విన్పిస్తున్నాయి. దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా బ్రిడ్జితండాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. మృతుడి కుటుంబ సభ్యులు సైతం రూప్లానాయక్ హత్య చేయబడ్డాడని పోలీసుల వద్ద వాపోయారని తెలుస్తోంది. కేసు కొత్త మలుపు తిరగడంతో ఈ ఘటన తండాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై బండ్లమోటు ఎస్సై ఎంవీ చరణ్‌ను వివరణ కోరగా ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దాంతో అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని తెలిపారు. -
అర్ధరాత్రి పోలీస్ వేట
♦ సినీ ఫక్కీలో దోపిడీ దొంగలను వెంటాడిన పోలీసులు ♦ మూడు చోట్ల తప్పించుకున్న దుండగులు ♦ ఇంటిదొంగల సహకారంతోనే విజయవాడలో భారీ దోపిడీ? ♦ విచారణను వేగవంతం చేసిన పోలీసులు సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు: విజయవాడలో తుపాకులు, కత్తులతో బెదిరించి 7 కిలోల బంగారం దోచుకెళ్లిన దుండగుల కోసం పోలీసులు మంగళవారం అర్ధరాత్రి వేట సాగించారు. సినీ ఫక్కీలో దోపిడీ దొంగలను వెంటాడారు. దుండగులు విజయవాడ నుంచి గుంటూరు వైపునకు వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు అర్బన్ ఎస్పీ విజయారావు నేతృత్వంలో గుంటూరు నగర శివారు ప్రాంతాలు, హైవేలపై భారీగా మోహరించి వాహనాలను తనిఖీ చేశారు. ఎంహెచ్03 బీసీ 9810 నంబర్ గల వాహనంలో దొంగలు ఉన్నట్లు గుర్తించి, పాత గుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కింగ్ హోటల్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, వాహనాన్ని వేగంగా నడుపుతూ దుండగులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నగరంపాలెం పోలీసు స్టేషన్ పరిధిలోని చుట్టుగుంట వద్ద మరోసారి పోలీసుల నుంచి తప్పించుకున్న దుండగులు వాహనాన్ని హైవే వైపు మళ్లించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు చిలకలూరిపేట వై–జంక్షన్ వద్ద హైవేను పూర్తిగా మూసివేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో దుండగులు ప్రయాణిస్తున్న వాహనం ఆ ప్రాంతానికి వచ్చి ఆగింది. పోలీసులు తనిఖీలు చేస్తున్న విషయం గమనించిన దుండగులు వాహనాన్ని అక్కడే నిలిపివేసి పక్కనే ఉన్న పొలాల్లోకి పరారయ్యారు. సుమారు 8 మంది తుపాకులు చేతబూని పరారైనట్లు పోలీసులు గుర్తించారు. రెండు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం దొంగలు వదిలేసిన వాహనం, అందులో ఉన్న ఓ తుపాకి, 2 బుల్లెట్లు, ఓ సెల్‌ఫోన్, కొన్ని బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కనే ఉన్న కాలువలో మరో తుపాకి దొరికింది. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెం సమీపంలో అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో పోలీసులు జల్లెడ పట్టారు. ఇంటి దొంగల సహకారం? కార్ఖానాలో భారీ దోపిడీ వెనుక విస్మయకర అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఇంటిదొంగల సహకారంతోనే దొంగల ముఠా దోపిడీకి పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతా పశ్చిమ బెంగాల్ వారే: విజయవాడలోని గోపాల్‌రెడ్డి రోడ్డులో ఓ ఇరుకు సందులో మొదటి అంతస్తులో బంగారు నగల కార్ఖానా ఉంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సోదరులు శంకర్ మున్నా, సుభాష్ మున్నా ఆ కార్ఖానా యజమానులు. అందులోని సిబ్బంది దాదాపు అంతా పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే. ఆ కార్ఖానాలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో దొంగల ముఠా ఆయుధాలతో సహా ప్రవేశించి బీభత్సం సృష్టించి, 7 కిలోల బంగారం, రూ. 2.50 లక్షల దోపిడీకి పాల్పడింది. ఆ కార్ఖానాలో ఆ సమయంలో పనిచేస్తూ ఉంటుందని, అందులోనూ అంతటి బంగారం ఉంటుందన్న సమాచారం అంతర్రాష్ట్ర దొంగలకు ఎలా తెలిసిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కార్ఖానాలోని సీసీ కెమెరాలు రెండు నెలలుగా పనిచేయడం లేదు. పోలీసుల అదుపులో ముగ్గురు దోపిడీ సమాచారం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీంలు బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించాయి. పోలీసులు ఆ కార్ఖానాకు ఎదురుగా ఉన్న ఓ దుకాణంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా, 10 మంది దొంగలు వేగంగా పరిగెత్తుతున్నట్లు అందులో ఉంది. కానీ, వాన వల్ల అందులో దొంగల ముఖాలు స్పష్టంగా కనిపించలేదు. ముగ్గురు అనుమానితులను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 8 బృందాలతో గాలింపు: దోపిడీ ముఠాను పట్టుకునేందుకు 8 ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దొంగలంతా ఉత్తరప్రదేశ్, బిహార్‌లకు చెందినవారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల విశాఖ, కర్నూలులో జరిగిన దొంగతనాలకు, ఈ దోపిడీ దొంగలకు సంబంధం ఉందా? అనే కోణంలో విచారిస్తున్నారు. రాజధానిలో భద్రతపై ఉదాసీనత రాష్ట్ర రాజధానిలో భద్రతపై ప్రభుత్వం, పోలీసుల ఉదాసీన వైఖరే దోపిడీ ముఠాకు కలిసి వచ్చింది. దాదాపు 200 మంది దొంగలు రాష్ట్ర రాజధానిలో తిష్టవేశారని నిఘా వర్గాలు ఇటీవలే హెచ్చరించాయి. అయినా ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ ముఠాల ఆటకట్టించడంపై దృష్టి సారించలేదు. కాగా, దోపిడీ కేసును త్వరలోనే ఛేదిస్తామని విజయవాడ పోలీస్ కమిషర్ గౌతం సవాంగ్ బుధవారం చెప్పారు. -
తలాక్‌పై సుప్రీంకోర్టులో రెండోరోజూ విచారణ
-
కృష్ణా జలాలపై విచారణ వాయిదా
-
‘పాలమూరు’పై నేడు గ్రీన్ ట్రిబ్యునల్ ముందు విచారణ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బుధవారం చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మరోమారు విచారణ జరుగనుంది. ఎంకే నంబియార్‌తో కూడిన ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం, పిటిషన ర్లు తుది వాదనలు వినిపించనున్నారు. దీనికోసం నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ప్రాజెక్టు సీఈ లింగరాజు తదిత రులు మంగళవారం సాయంత్రమే చెన్నై వెళ్లారు. అటవీ చట్ట నిబం ధనలకు విరుద్ధంగా ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు పనులను చేపట్టిందని, ఈ వ్యవ హారంలో జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిష న్పై ఇప్పటికే ట్రిబ్యునల్ పలు మార్లు విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగా.. పూర్తిగా తాగునీటికి ప్రాధా న్యమిస్తూ ప్రాజెక్టును చేపట్టామని, ఆ దిశగానే పనులు కొనసాగిస్తున్నామని ప్రభు త్వం తెలిపింది. ప్రాజెక్టు మొదటి దశలో తాగునీటిని, రెండో దశలో సాగునీటిని అందిస్తామని వివరిం చింది. సాగునీటి సరఫరా జరిపే నాటికి పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందుతామని, ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తున్నామని ధర్మాసనానికి నివేదిం చింది. దీనికి అంగీకరించిన ట్రిబ్యునల్, పనులను తాగునీటి అవసరాలకే పరిమితం చేయాలని, సాగునీటి ప్రాజెక్టుకు అనుమతు లు పొందే వరకు సంబంధిత పనులు చేపట్టరాదని చెప్పింది. అయితే ఈ విష యంలో ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని, తాగునీటి పనుల పేరుతో సాగు కాల్వలు, రిజర్వాయర్లు నిర్మాణం చేపడుతోందని పిటిషనర్లు వాది స్తున్నారు. పూర్తిగా తాగునీటి పనులే చేపడుతున్నా మంటూ అందుకు సంబంధించిన డ్రాయిం గ్లను ప్రభుత్వం సమర్పించనుంది. -
కాణిపాకం కేంద్రంగా పైరసీ సీడీల తయారీ
పోలీసుల అదుపులో నిందితులు...? సెల్, కంప్యూటర్ దుకాణదారులే సూత్రదారులు వివరాలు గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్న పోలీసులు కాణిపాకం(ఐరాల): కాణిపాకం కేంద్రంగా పైరసీ సీడీలను తయారు చేస్తున్నట్టు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిందితులను కాణిపాకం, స్పెషల్ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి సీడీలను చిత్తూరు, తిరుపతికి సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు నుంచి సీడీల దిగుమతి కాణిపాకం అటు తమిళనాడుకు ఇరవై కిలోమీటర్లు, కర్ణాటకకు యాభై కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడున్న సెల్, కంప్యూటర్ దుకాణదారులు సీడీలను చెన్నై, బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. చిత్తూరుతోపాటు, కాణిపాకానికి కొత్త సినిమా వచ్చిన గంటల వ్యవధిలోనే వాటి ప్రింట్లు సెల్ షాపు, కేఫ్ల్లోకి చేరిపోతున్నాయి. ఇక్కడి నుంచి మెయిల్, వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా జిల్లా, రాష్ట్రం నలుమూలలకు క్షణాల్లో చేరిపోతున్నాయి. అలాగే సీడీలు, డీవీడీలుగా మార్చి చిత్తూరు, తిరుపతి, పలమనేరు పట్టణాలకు చేరవేస్తున్నారు. థియేటర్ సిబ్బందితో సత్సంబందాలు కాణిపాకం, చిత్తూరుకు చెందిన థియేటర్ సిబ్బందితో సంబందాలు కలిగిన కొందరు వ్యక్తులు కొత్త సినిమా వచ్చిన వెంటనే పైరసీ తయారీ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అలా తీసిన ప్రింట్‌ను నాణ్యతను బట్టి రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు పైరసీ తయారీదారులకు విక్రయిస్తున్నారు. ఫ్యాన్స్ చేతికి చిక్కిన సందర్బాలు ఉన్నాయి కాణిపాకం సినిమా థియేటర్లో ఇటీవల కొందరు వ్యక్తులు సెల్ కెమెరాల్లో కొత్త సినిమా రికార్డు చేస్తుండగా ఫ్యాన్స్ పట్టుకున్నారు. వారిని థియేటర్ యజమానులు అదుపులోకి తీసుకొని వారించి పంపేశారు. అలాగే మొబైల్స్‌ను తీసుకొని సినిమా విజువల్స్‌ను తొలగించిన సందర్భాలూ ఉన్నాయి. వీటిపై ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైరసీ చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు పైరసీ చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. సినిమా చట్టం ప్రకారం పైరసీ సీడీలు, డీవీడీలను తయారు చేసిన వా రు, కొనుగోలు చేసిన వారు కూడా శిక్షార్హులే. వారిని ఉపేక్షించేది లేదు. అభిమానులు ఎవరైనా పోలీసులకు సమాచారం ఇవ్వచ్చు. సెల్ షాపులు, కంప్యూటర్ కేంద్రాలపై నిఘా పెంచుతాం. – ఆదినారాయణ, చిత్తూరు వెస్ట్ సీఐ -
సలహాదారులకు కేబినేట్ హోదాపై విచారణ
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ హోదా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. కేబినెట్ హోదాలో నియమించిన వారికి ఎలాంటి అర్హతలు లేవని , దీనివల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలు కాదు కాబట్టి వీరి అధికారాలు అర్హతలు తెలపాలంటూ తెలంగాణ అడ్వకేట్ జనరల్‌ను ప్రధాన న్యాయమూర్తి కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి కేసు విచారణను వచ్చేవారానికి వాయిదా వేశారు. -
మరోసారి వాయిదాపడ్డ కృష్ణా ట్రిబ్యునల్ విచారణ
ఈనెల 23న జరగాల్సిన సమావేశం 31కి వాయిదా ఇప్పటికి మూడుసార్లు వాయిదా సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ సమావేశాలు ముచ్చటగా మూడోసారి వాయిదా పడ్డాయి. కృష్ణానీటి పంపకాలపై గత ఏడాది డిసెంబర్ 14న జరగాల్సిన సమావేశాలు తెలుగు రాష్ట్రాల వినతి నేపథ్యంలో జనవరి 23కు వాయిదా పడగా, ప్రస్తుతం మరోమారు జనవరి 31కి వాయిదా పడ్డాయి. కాగా, ఈ తేదీలోగా కృష్ణాజలాల వివాదంపై సుప్రీంకోర్టులో ఉన్న ప్రధాన పిటిషన్ విచారణకు వస్తేనే ట్రిబ్యునల్‌లో అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–89 పరిధి, విçస్తృతిపై జస్టిస్ బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలో జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ బి.పి.దాస్ సభ్యులుగా గల ట్రిబ్యునల్ గత ఏడాది అక్టోబర్‌లో తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలే పంచుకోవాలి... ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కృష్ణా జలాల కేటాయింపుల నుంచే రెండు కొత్త రాష్ట్రాలు పంచుకోవాలని ట్రిబ్యునల్ తన తీర్పులో స్పష్టం చేసింది. నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల మధ్య ఆపరేషన్ ప్రొటోకాల్ (ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్లు ఇవ్వాలి) తెలంగాణ, ఏపీకే పరిమితమని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. సెక్షన్ 89 పరిధి వివాదం పరిష్కారమైందని, కొత్త రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, ఆపరేషన్ ప్రొటోకాల్ తేల్చేందుకు తదుపరి విచారణను డిసెంబర్ 14న చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 89లోని ఏ, బీ క్లాజులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాలుగు వారాల్లో తమ అభిప్రాయాలను సమర్పించాలని సూచించింది. అయితే ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లినందున అఫిడవిట్ సమర్పణకు అదనపు సమయం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరడంతో గడువును జనవరి 23కి పెంచింది. అయితే ఈలోగా రాష్ట్రం వేసిన స్పెషల్‌లీవ్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, దానిని కొట్టివేసింది. అంతకుముందు ఇదే విషయమై తెలంగాణ సహా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలు వేసిన ప్రధాన పిటిషన్ విచారణ యథాతథంగా జరుగుతుందని తెలిపింది. ఈ పిటిషన్ విచారణ సైతం ఈ నెల 18నే జరగాల్సి ఉన్నా అనివార్య కారణాలతో విచారణకు రాలేదు. దీంతో ట్రిబ్యునల్‌కు రాష్ట్రం అఫిడవిట్ సమర్పిం చాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తాజాగా మళ్లీ సమావేశాలు వాయిదా పడటంతో రాష్ట్రానికి కొంత ఊరట దక్కినట్లైంది. జనవరి 31కి ముందే సుప్రీంలో ప్రధాన పిటిషన్‌విచారణకు వచ్చే అవకాశం ఉందని, అందులో సుప్రీం ఇచ్చే ఆదేశాల మేరకు అఫిడవిట్‌పై నిర్ణయం చేయాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. -
నిర్భయ కేసు విచారణ డిసెంబర్ 5కు వాయిదా
ఢిల్లీ: నిర్భయ కేసు విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. నిందితులు ముఖేష్, రాంసింగ్‌ల మొబైల్ లొకేషన్లు వేరు వేరుగా ఉన్నాయని అమికస్ క్యూరీ కోర్టుకు వెల్లడించింది. రాంసింగ్ ఘోరానికి పాల్పడుతున్నప్పుడు ముఖేష్ అక్కడ లేడని శనివారం విచారణలో సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ తెలిపింది. అలాగే ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలపై అమికస్ క్యూరీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
హైకోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
-
పోలీసుల తీరుపై ఎస్పీకి ఫిర్యాదు
కడప అర్బన్ : కడపలోని ఓ ప్రధాన పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కేసు విషయమై అత్యుత్సాహం చూపి బాధితులకు న్యాయం చేయలేదని జిల్లా ఎస్పీ పిహెచ్డి రామకృష్ణకు ఫిర్యాదు చేసినట్లు శ్రీవిజయసేవా సమితి కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెహ్రూ యువ కేంద్రంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న మస్తానయ్య స్థలాలు ఇప్పిస్తామని కొంత మంది వద్ద నుంచి రూ. 1,60,000 వసూలు చేశాడని, బాధితుల తరపున అడిగితే కట్టుకథ అల్లి, తప్పుడు కేసు పెట్టారన్నారు. కనీస విచారణ చేయకుండా కేసు నమోదు చేశారన్నారు. స్థలాల పేరుతో డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. స్పందించిన ఎస్పీ విచారణ చేసి న్యాయం చేస్తామనీ తెలిపినట్లు ఆయన వివరించారు. -
నెహ్రూ యువ కేంద్రం, తప్పుడు కేసు, విచారణ
కడప అర్బన్ : కడపలోని ఓ ప్రధాన పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కేసు విషయమై అత్యుత్సాహం చూపి బాధితులకు న్యాయం చేయలేదని జిల్లా ఎస్పీ పిహెచ్డి రామకృష్ణకు ఫిర్యాదు చేసినట్లు శ్రీవిజయసేవా సమితి కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెహ్రూ యువ కేంద్రంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న మస్తానయ్య స్థలాలు ఇప్పిస్తామని కొంత మంది వద్ద నుంచి రూ. 1,60,000 వసూలు చేశాడని, బాధితుల తరపున అడిగితే కట్టుకథ అల్లి, తప్పుడు కేసు పెట్టారన్నారు. కనీస విచారణ చేయకుండా కేసు నమోదు చేశారన్నారు. స్థలాల పేరుతో డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. స్పందించిన ఎస్పీ విచారణ చేసి న్యాయం చేస్తామనీ తెలిపినట్లు ఆయన వివరించారు. -
స్విస్ చాలెంజ్‌పై దిగొచ్చిన సర్కారు!
-
స్విస్ చాలెంజ్‌పై దిగొచ్చిన సర్కారు!
హైదరాబాద్: స్విస్ చాలెంజ్ విధానంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. స్విస్ చాలెంజ్‌కు సంబంధించి ప్రభుత్వం ఎందుకు గోప్యతను పాటిస్తుందంటూ హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఇవాళ జరిగిన విచారణలో స్విస్ చాలెంజ్‌కు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. అయితే.. ఈ విషయాన్ని ముందే చెప్పి ఉంటే మరిన్ని కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొనేవని హైకోర్టు తలంటింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది. -
ఆచూకీ చెప్పమంటే.. ప్రాణాలు తీసుకున్నాడు!
♦ రెండు రోజుల కిందట పోలీసుస్టేషన్ పైనుంచి దూకిన యువకుడు ♦ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ♦ మృతుడు పరారైన జీవిత ఖైదీకి స్వయూనా తమ్ముడు ♦ అన్న ఆచూకీ చెప్పమన్నందుకే తమ్ముని అఘాయిత్యం.. మార్కాపురం : హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ పెరోల్‌పై బయటకొచ్చి తప్పించుకుని తిరుగుతున్న కురుకుందు శ్రీనివాసులు తమ్ముడు వెంకట్రావును రెండు రోజుల కిందట మార్కాపురం రూరల్ పోలీసులు విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లగా పైనుంచి కిందకు దూకటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనను పోలీసులు గోప్యంగా ఉంచి క్షతగాత్రుడికి గుంటూరులో చికిత్స చేయిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకట్రావు గురువారం సాయంత్రం మృతి చెందాడు. వివరాలు.. పలు హత్య కేసుల్లో మార్కాపురం మండలం అమ్మవారిపల్లెకు చెందిన కురుకుందు శ్రీనివాసులు నిందితుడు. నెల్లూరు సెంట్రల్ జైలులో జీవిత కాల శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఏడాది మే 31న శ్రీనివాసులు సోదరుడు చిన్న వెంకటేశ్వర్లు మతి చెందటంతో పెరోల్‌పై స్వగ్రామం వచ్చాడు. ముద్దాయి వెంట ముగ్గురు పోలీసులు ఎస్కార్ట్‌గా ఉన్నారు. అంత్యక్రియల అనంతరం శ్రీనివాసులు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. ముద్దాయి శ్రీనివాసులును ఇటీవల అమ్మవారిపల్లెకు వచ్చినట్లు రూరల్ పోలీసులకు సమాచారం అందటంతో రెండు రోజుల కిందట అక్కడికి వెళ్లి ఆయన మరో తమ్ముడు వెంకట్రావును విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసుస్టేషన్‌పైకి ఎక్కి భవనం నుంచి కిందకు దూకాడు. కాళ్లు, చేతులు, తలకు బలమైన గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మతి చెందాడు. ఈ విషయంపై మార్కాపురం డీఎస్పీ శ్రీహరిబాబును వివరణ కోరగా ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి పరారైన ముద్దాయి కురుకుందు శ్రీనివాసులు అమ్మవారిపల్లె ప్రాంతంలో సంచరిస్తున్నాడనే సమాచారం అందటంతో పోలీసులు అక్కడికి వెళ్లారని, అక్కడ ఉన్న ముద్దాయి తమ్ముడు వెంకట్రావును తీసుకొచ్చి విచారణకు ప్రయత్నించారని చెప్పారు. ముద్దాయి ఫోన్ నంబర్‌ను అడగ్గా తప్పించుకునే ప్రయత్నంలో పోలీసుస్టేషన్ భవనం పైకి ఎక్కి దూకటంతో గాయాలయ్యాయని, చికిత్స పొందుతూ మతి చెందాడని డీఎస్పీ వివరణ ఇచ్చారు. -
'నేను ఆమెకు అన్యాయం చేయలేదు'
ముంబై : 'బాలికా వధు' ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ ను పోలీసులు మరోసారి ప్రశ్నించారు. మానసిక అనారోగ్యానికి గురైన కారణంగా రాహుల్‌ను ప్రస్తుతం అరెస్ట్ చేయకుండానే విచారణ కొనసాగించాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్‌కు హాజరైన రాహుల్‌ను గంటపాటు ప్రశ్నించారు. 'నేను అమాయకుడిని, ప్రత్యూషకు ఎటువంటి అన్యాయం చేయలేదు' అంటూ రాహుల్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ సారి పోలీసులు ప్రత్యూష బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ప్రశ్నించారు. 'ఆమె ఆర్థికపరమైన సమస్యల్లో ఉంది. ఈ విషయంలో మా మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి.. అయితే అది ఏ బంధంలోనైనా సాధారణమైన విషయమే కదా' అంటూ రాహుల్ బదులిచ్చాడు. ఇక స్టేషన్ బయట మీడియాతో మాట్లాడుతూ.. 'నేనిప్పుడిప్పుడే కోలుకుంటున్నాను, గతం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను. సరైన సమయం వచ్చినప్పుడు నేనే మీ ముందుకొచ్చి మాట్లాడతాను, నిజానిజాలు తప్పకుండా బయటపడతాయి' అంటూ అక్కడి నుంచి తిరిగి హాస్పిటల్‌కు వెళ్లిపోయాడు. కాగా ప్రత్యూష తండ్రి.. రాహుల్ కు చికిత్స అందిస్తున్న శ్రీసాయి హాస్పిటల్ మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. డబ్బు తీసుకుని అక్కడి వైద్యులు రాహుల్ ని పరోక్షంగా కాపాడుతున్నారని తెలిపారు. -
విచారణలో ఉన్న దొంగల పరారీ
తడ: నెల్లూరు జిల్లా తడ పోలీస్ స్టేషన్ నుంచి విచారణలో ఉన్న ఇద్దరు దొంగలు పరారయ్యారు. వివరాలు.. పోలీసులు ఓ లారీ దొంగతనం కేసులో తమిళనాడులోని వేలూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని విచారణలో ఉంచారు. వారిని బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు కలసి వెళ్లారు. అనంతరం ఇద్దరు దొంగలను స్టేషన్‌లోని ఓ గదిలో ఉంచగా, పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. -
ఆయనకి కొద్దిగా క్లోజ్‌గా మూవయ్యాను...
లీగల్ కౌన్సెలింగ్ మా వివాహమై నాలుగు సంవత్సరాలైంది. ఇరువురమూ లెక్చరర్లం. ఒకే కళాశాలలో పనిచేస్తున్నాము. కాలేజీకి కలసి వచ్చేవాళ్లం. కలిసి ఇంటికి వెళ్లేవాళ్లం. నాకు ఆరు నెలల క్రితం వేరే కాలేజీలో ఎక్కువ జీతంపై మంచి పోస్టింగ్ వచ్చింది. నా భర్త అంగీకారంతోనే జాయిన్ అయ్యాను. అక్కడ ఎక్కువ మంది పురుష లెక్చరర్లే ఉన్నారు. నా యూనివర్శిటీ క్లాస్మేట్ కూడా అక్కడే పని చేస్తుండడంతో పూర్వ పరిచయంతో నేనతనితో కొద్దిగా క్లోజ్‌గా మూవయ్యాను. అంటే కూరలూ వగైరా షేర్ చేసుకోవడం, ఇంటికి లంచ్‌కి పిలవడం వంటివి. ఎందుకంటే అతను బ్యాచిలర్. పైగా తలిదండ్రులు వేరే రాష్ట్రంలో ఉంటారు. మొదట్లో నా భర్త కూడా అతనితో కలివిడిగానే ఉన్నారు. తర్వాత ఏమైందో ఏమో కానీ, నన్ను తీవ్రంగా అనుమానించడం మొదలెట్టారు. చీటికిమాటికీ చిరాకు పడటం, ఆఖరికి కొట్టడం కూడా ప్రారంభించారు. భరించలేక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరాను దూరంగా ఉంటే మారతాడని. కానీ మొన్న నాకు కోర్టునుండి విడాకుల నోటీసులు పంపారాయన. అదీ కూడా అడల్టరీ గ్రౌండ్స్మీద! నాకేపాపమూ తెలీదు. ఇది తెలిసి నా స్నేహితుడు రిజైన్ చేసి వెళ్లాడు. నాకు కోర్టు విచారణ భయంగా ఉంది. అంతమంది మధ్యలో ఈ ఆరోపణలు ఎలా ఎదుర్కోవాలి? నా నిజాయితీని నిరూపించుకోగలను కానీ, కోర్టునిండా న్యాయవాదులూ, కక్షిదారులూ ఉంటారు కదా! వాళ్లను చూస్తేనే భయం. పైగా తెలిసిన వాళ్లు కూడా కనపడుతుంటారు కదా! అవమానకరంగా ఉంటుంది. నేను ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? - పుష్పకుమారి, ఆదోని. అడల్టరీ గ్రౌండ్‌ను నిరూపించడం చాలా కష్టం. పైగా మీ వారిది కేవలం అనుమానం.. అందులో వాస్తవం లేదు కూడా! కాబట్టి మీరు తప్పకుండా కేసు గెలుస్తారు. కాకపోతే మీరు అంతలా భయపడ వలసిన అవసరం లేదు. ఇలాంటి సున్నితమైన విషయాలు విచారణకు వచ్చినప్పుడు సెక్షన్ 11, కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984 ప్రకారం అడల్టరీ ఆరోపణలు, పిల్లల లెజిటిమసీ గురించిన ఆరోపణలు, లైంగిక ప్రవర్తనల గురించి, నపుంసకత్వం గురించిన ఆరోపణలు మొదలైన విషయాలకు సంబంధించిన విచారణలను గోప్యంగా జరపమని కోరవచ్చు. అంతేకాకుండా హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 22 కూడా రహస్యంగా విచారణ జరపాలని తెలియజేస్తుంది. కనుక ఇన్‌కెమెరా ప్రొసీడింగ్స్ కావాలని అడగండి. కోర్టువారు తప్పకుండా అనుమతిస్తారు. అంటే విచారణ సమయంలో మీరు, మీ భర్త, మీ ఇరువురి న్యాయవాదులు, న్యాయమూర్తిగారు మాత్రమే కోర్టులో ఉంటారు. మిగతా వారినందరినీ బయటకు పంపించి, తలుపులు మూసివేసి, విచారణ ప్రారంభిస్తారు. మీరు స్వేచ్ఛగా, భయం లేకుండా మీ వాదనలను న్యాయమూర్తిగారికి విన్నవించుకోవచ్చును. మేడమ్, నేను డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మాకు ఒక బాబు ఉన్నాడు. ఒక్కడే చాలని సరిపెట్టుకున్నాము. వాడికిప్పుడు 6 సంవత్సరాలు. స్కూలుకు వెళుతున్నాడు. నాకు ఇప్పుడు వీడితోపాటు ఒక పాప కూడా ఉంటే బాగుండుననిపిస్తోంది. కానీ నాకిక పిల్లలు పుట్టే అవకాశం లేదు. గైనకాలజిస్టుగా ఆ సంగతి నాకు తెలుసు. ఒక పాపను దత్తత తీసుకొని, తల్లిగా పెంచుకోవాలని కోరికగా ఉంది. బాధాకరమైన విషయమేమిటంటే, నేను ముస్లిమ్‌ని కనుక దత్తత తల్లిగా ఉండే అవకాశం లేదని, మమ్ములను చట్టం దత్తత తల్లిగా పరిగణించదని చెబుతున్నారు. దీనికి కారణమేమిటి? నా కొలీగ్. డా. సావిత్రి ఒకపాపను దత్తత తీసుకుని చట్టప్రకారం తల్లి అయారు. మరి నాకు ఆ అవకాశం ఎందుకు లేదు? - హసీనా, గుంటూరు పిల్లలను దత్తత తీసుకోవాలంటే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం తీసుకోవాలి. తీసుకున్న వారు చట్టప్రకారం తలిదండ్రులుగా పరిగణింపబడతారు. కానీ ఆ చట్టప్రకారం హిందువులు, సిక్కులు దత్తత తీసుకోవచ్చు. ముస్లిమ్‌లకు అది వర్తించదు. వీరికి సంబంధించి ప్రత్యేక చట్టం లేదు. అయినా మీకొక అవకాశ ం ఉంది. ‘గార్డియన్స్ అండ్ వార్డ్స్’ చట్టప్రకారం ఒక పాపను పెంచుకోవచ్చు. అంటే గార్డియన్‌గా మాత్రమే. అలాగని కోర్టు డిక్లేర్ చేస్తుంది. చట్టం మిమ్మల్ని గార్డియన్‌గా ఉండమంటుంది. కానీ అమ్మ అని పిలిపించుకోవద్దని శాసించలేదు కదా! తప్పకంండా పాపను పెంచుకోండి. గార్డియన్‌గా ఉంటూ అమ్మగా చలామణి అవుతూ అమ్మ అని పిలిపించుకోండి. మేము గత పది సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నాము. మేము వివాహం చేసుకోలేదు. అలాగే ఇరువురమూ అవివాహితులమే. ఇటీవల కాలంలో నా సహచరుడు నన్ను తీవ్రంగా వేధిస్తున్నాడు. నా జీతం మొత్తం తనే తీసుకుని, దుర్వ్యసనాలకు ఖర్చు చేస్తున్నాడు. నేను డి.వి. కేస్ వేయవచ్చా? - రజిత, హైదరాబాద్ తప్పకుండా. వివాహం లేని బాంధవ్యాన్ని కూడా గృహహింస చట్టం వివాహ బాంధవ్యంగానే పరిగణిస్తుంది. అయితే మీరు భార్యాభర్తలుగా జీవించారని రుజువు చేయడానికి రే షన్ కార్డ్, ఓటర్ కార్డ్, సర్వీస్ రిజిస్టర్, బ్యాంక్ అకౌంట్స్ మొదలైన ఆధారాలను కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
హైకోర్టులో 'అక్షయగోల్డ్' కేసు విచారణ
హైదరాబాద్ : లక్షలాదిమంది డిపాజిటర్ల డబ్బును గోల్మాల్ చేసిన అక్షయ గోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం విదితమే. విచారణ సందర్భంగా గురువారం.. ప్రతి వాయిదాకు యాజమాన్యం తప్పక హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆస్తుల డాక్యుమెంట్లను ఎందుకు ఇవ్వలేదంటూ కోర్టు ప్రశ్నించింది. అక్షయ గోల్ట్ పై చర్యలు తీసుకోవాలని సీఐడీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. -
క్రైమ్ మ్యాపింగ్!
ప్రత్యేక యాప్ రూపొందించిన ఐటీ సెల్ నేరాలు జరిగే ప్రాంతాల డిజిటలైజేషన్ త్వరిత గతిన సమాచార సేకరణ..నేరాల నియంత్రణే లక్ష్యం అన్ని స్థాయిల సిబ్బందికీ అందుబాటులోకి నేరాల నియంత్రణకు...కేసుల విచారణ త్వరితగతిన చేపట్టేందుకు...దోషుల్ని వేగవంతంగా పట్టుకునేందుకు నగర పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు టెక్నాలజీని వినియోగించుకుంటోంది. తాజాగా సిటీ పోలీస్ ఐటీ సెల్ ‘క్రైమ్ మ్యాపింగ్’ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. త్వరిత గతిన నేరాల సమాచారం అందించడం..అవసరమైన వివరాలు వేగవంతంగా తెలుసుకోవడం..మరిన్ని నేరాలు జరగకుండా నియంత్రించడానికి ఈ క్రైమ్ మ్యాపింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: ⇔నగరంలోని ఏ ప్రాంతంలో ఏ తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి..? ⇔ఏదైనా నేరం చోటు చేసుకున్న ప్రాంతానికి సమీపంలో ఎక్కడ సీసీ కెమెరాలున్నాయి..? ⇔ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ నగరంలో నేరాలు చేసే ముఠాలు ఎన్ని? ఏ తరహావి? ⇔ఫలానా ప్రాంతంలో జరిగిన నేరానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత? కేసు ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది? నేరాల నియంత్రణ (ప్రివెన్షన్), కేసుల్ని కొలిక్కి తేవడం (డిటెక్షన్)కు ఈ వివరాలు ఎంతో కీలకం. అయితే వీటిని మాన్యువల్‌గా తీసుకోవాలంటే... దాదాపు వారం రోజులు పడుతుంది. ఈ లోపు నేరం చేసిన వ్యక్తి ‘తీరం’ దాటిపోయే అవకాశం ఉంటుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న సిటీ పోలీసు ఐటీ సెల్ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. క్రైమ్ మ్యాపింగ్ పేరుతో తయారు చేసిన దీన్ని కమిషనరేట్‌లోని అన్ని స్థాయిల అధికారులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌లో ఉండే ప్రత్యేకతల్లో కీలకమైనవి... థిమేటిక్ క్రైమ్ మ్యాప్ నగర కమిషనరేట్ పరిధిలో మొత్తం ఐదు జోన్ల పరిధిలో 60 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఒకే సమయంలో ఒకే తరహా నేరాలు జరుగవు. అయితే ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి నేరాలు జరుగుతున్నాయన్నది తెలుసుకోవడం ద్వారానే వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు నిర్ధిష్టంగా తెలుసుకోవడానికి ‘క్రైమ్ మ్యాపింగ్’లో ‘థిమేటిక్ క్రైమ్ మ్యాప్’ విభాగం ఏర్పాటు చేశారు. ఓ అధికారి/సిబ్బంది ఇందులోకి ప్రవేశించడం ద్వారా తనకు అవసరమైన తేదీల మధ్య ఏ ప్రాంతంలో, ఏ తరహా నేరాలు జరిగాయో సంఖ్యలతో సహా తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఫలితంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విభాగంలో బాడీలీ అఫెన్సులుగా పిలిచే హత్య, హత్యాయత్నం... ప్రాప ర్టీ అఫెన్సులుగా పిలిచే చోరీలు, దొంగతనాలు తదితరాలతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల వివరాలనూ పొందుపరిచారు. క్రైమ్ ప్రోన్ రిపోర్ట్ కమిషనరేట్‌లోని జోన్లు, సబ్-డివిజన్లు, పోలీసుస్టేషన్ల వారీగా ఏ తరహా నేరాలు, ఏ సమయంలో, ఏఏ రోజుల్లో, ఏ విధంగా జరుగుతున్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పాటు నగరంలో ఓ ఠాణా పరిధిలో ఉన్న ప్రాంతంలో ఎక్కడ నేరాలు జరుగుతున్నాయనేది స్పష్టంగా చూపిస్తుంది. ఆ ఠాణా పరిధిలో ఏ పరిధి (కిలోమీటర్ల విస్తీర్ణంతో సహా) నేరాలకు ఆలవాలంగా మారిందనేదీ మ్యాప్పైన చూపిస్తుంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఆయా రోజులు, సమయాల్లో ప్రత్యేక దృష్టి సారించేలా క్షేత్రస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయవచ్చు. మరోపక్క ఠాణాల పరిధిలో గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలు, రక్షక్లను ఆయా సమయాల్లో నిర్దేశిత ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి పెట్టేలా ఠాణా అధికారులూ వ్యూహం సిద్ధం చేసుకునే ఆస్కారం ఏర్పడుతుంది. క్రైమ్ రాడార్ సిటీలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న నేరాలు జరిగే ప్రాంతాలను డిజిటలైజ్ చేసినట్లే... ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను మ్యాప్ పైకి తీసుకువచ్చారు. స్నాచింగ్, అటెన్షన్ డైవర్షన్‌తో పాటు ఇతర నేరాలు చోటు చేసుకున్న సమయంలో ఘటనాస్థలికి పోలీసులు చేరుకుంటారు. అయితే అనుమానితుల గుర్తింపు, ఆధారాల సేకరణకు ఆ క్రైమ్ సీన్‌కు సమీపంలో, దారితీసే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి? అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం కొంత సమయం పడుతోంది. అలాంటి జాప్యానికీ తావులేకుండా క్షేత్రస్థాయి అధికారులు ఈ యాప్‌లోని క్రైమ్ రాడార్లోకి ప్రవేశిస్తే చాలు. ఈ నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఎక్కడెక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయనేది చూపిస్తుంది. మ్యాప్ పైన కనిపించే కెమెరా మార్క్ వద్ద క్లిక్ చేస్తే.. అది ఎక్కడ ఉందనే చిరునామా సైతం పాప్అప్ రూపంలో ప్రత్యక్షమవుతుంది. సీసీఆర్బీ సెర్చ్ నగరంలో చైన్ స్నాచింగ్స్, సూడో పోలీసు, దృష్టి మళ్లించి దండుకోవడం తదితర నేరాలు చేసే ముఠాల్లో అనేకం బయటి రాష్ట్రాల నుంచే వచ్చిపోతుంటాయి. ఒకప్పుడు ఏ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన ముఠా నగరంలో ఏ తరహా నేరాలు చేసింది అనే వివరాలు కేవలం సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్బీ)తో పాటు కొన్ని ప్రత్యేక విభాగాల దగ్గరే అందుబాటులో ఉండేవి. దీంతో ఠాణా అధికారులు వీరిని సంప్రదించి, ఆయా నేరగాళ్ల చిరుమానాలు తెలుసుకున్న తర్వాతే తదుపరి చర్యలకు ఆస్కారం ఉండేది. ‘క్రైమ్ మ్యాపింగ్’లో ఏర్పాటు చేసిన సీసీఆర్బీ సెర్చ్‌లో నేరం స్వభావం లేదా అనుమానితుల పేర్లు తదితరాలను ఎంటర్ చేస్తే చాలు... దేశంలోని ఏ ప్రాంతంలో వారు ఉంటారు అనేది చూపిస్తుంది. ఎఫ్ఐఆర్తో పాటు ఎంట్రీలు ఈ ‘క్రైమ్ మ్యాపింగ్’ యాప్‌లోకి ఎంట్రీలన్నీ పోలీసుస్టేషన్ స్థాయిలోనే జరిగేలా ఐటీ సెల్ ఇన్చార్జ్ శ్రీనాథ్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదు అందుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలోనే ఠాణాల్లో ఉండే ఈ-కాప్స్ సిబ్బంది ఆ వివరాలను క్రైమ్ మ్యాపింగ్‌లో పొందుపరుస్తారు. ఈ నేపథ్యంలోనే థిమేటిక్ క్రైమ్ మ్యాప్, క్రైమ్ ప్రోన్ రిపోర్ట్ విభాగాల్లో సెర్చ్ చేసినప్పుడు ఆయా కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్లు, అవి నమోదైన తేదీలు సైతం ప్రత్యక్షమయ్యే సౌలభ్యం ఉంది. మ్యాప్‌లో దర్యాప్తు అధికారులు తమకు అవసమైన చోట కల్సర్ పెడితే.. పాప్అప్ రూపంలో అదనపు సమాచారం కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ క్రైమ్ మ్యాపింగ్‌లో మరికొన్ని చేర్చవచ్చు. -
అగ్రిగోల్డ్ కేసు విచారణ తీరుపై హైకోర్టు అసంతృప్తి
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసును ఆంధ్రప్రదేశ్ సీఐడీ విచారణ జరుపుతున్న తీరుపై శుక్రవారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సంస్థ బ్యాంకు ఖాతాలు, నగదు వివరాలపై విచారణ సందర్భంగా కోర్టు ప్రశ్నిచగా.. 22 ఖాతాల్లో రూ. 6 లక్షల నగదు ఉన్నట్లు సీఐడీ కోర్టుకు తెలిపింది. అయితే దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించిన సంస్థ ఖాతాల్లో కేవలం ఆరు లక్షలే ఉండటమేంటని కోర్టు సీఐడీని ప్రశ్నించింది. రెండేళ్లలో సంస్థ ఖాతాల్లో నుండి డ్రా అయిన డబ్బు వివరాలను చెప్పాలని కోర్టు కోరింది. ఇలా అయితే బాధితులకు న్యాయం ఎలాచేస్తారని సీఐడీని ప్రశ్నించిన కోర్టు.. కస్టడీ విచారణ వివరాలను కోర్టుకు తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. -
కృష్ణవేణి మృతిపై వీడని మిస్టరీ
హత్యా ? ఆత్మహత్యా ? ఎటూ తేల్చని పోలీసులు ఇప్పటికి ఆరుగురు నిందితుల అరెస్టు కొనసాగుతున్న విచారణ సూత్రధారి తప్పించుకున్నట్లు ప్రచారం ? పరకాల : తల్లి లేని బిడ్డను బలి తీసుకున్న దుర్మార్గులు ఎవరనేది నేటికి స్పష్టం కావడం లేదు. పొట్టకూటి కోసం వచ్చి కామాంధుల చేతిలో బలైన బాలిక కృష్ణవేణి మరణం వెనుక ఉన్న మిస్టరీ వీడడం లేదు. సంచలనం కలిగించిన కృష్ణవేణిది హత్యానా లేక ఆత్మహత్యానా అనేది నిర్ధారణ కావడం లేదు. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ కోతులాపురం గ్రామానికి చెందిన ఇరుగుదిండ్ల వెంకటేష్, అతడి కుమార్తె కృష్ణవేణి(17) 13 నెలల క్రితం మండలంలోని నర్సక్కపల్లి గ్రామానికి జీవనోపాధి కోసం వలస వచ్చారు. గ్రామంలో క్రేన్‌సాయంతో బావుల్లో పూడికతీత పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణవేణి జనవరి 27న డీజిల్ మంటల్లో కాలిపోయింది. ఈ ఘటన జరిగి పక్షం రోజులు దాటినా ఎలా జరిగిందనే విషయం మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేముల రాజును జనవరి 29న, పంప్ ఆపరేటర్ బాషబోయిన కుమారస్వామి, బండి మహేందర్‌ను ఈ నెల 1న, కందికొండ కార్తీక్, బండి శ్రావణ్, గట్టు సాయిలును 4న అరెస్టు చేశారు. కీలకవ్యక్తి తప్పించుకున్నట్లు ప్రచారం ? ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు వేముల రాజు, కుమారస్వామితోపాటు వారితోపాటు ఉన్న నలుగురిని జైలుకు తరలించారు. అయితే వీరు మాత్రమేగాక కృష్ణవేణి మరణం వెనుక ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. అరెస్టయిన ఆరుగురిలో కీలకవ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు వేముల రాజుకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా రాజును దెబ్బతీయాలని ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి కృష్ణవేణి అంశాన్ని అనుకూలంగా మార్చుకుని కుట్ర చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజు కృష్ణవేణి కలిసి ఉన్న విషయాన్ని మద్యం మత్తులో ఉన్న పంప్ ఆపరేటర్ భాషబోయిన కుమారస్వామి సదరు వ్యక్తికి ఫోన్ చేసి చెప్పడంతో ఆ వ్యక్తి అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. కుమారస్వామి, తన స్నేహితుడు మహేందర్‌తోపాటు ఫోన్‌కాల్‌తో వచ్చిన వ్యక్తి కలిసి కృష్ణవేణిని మానసికంగా వేధించి శారీరకంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారని భావిస్తున్నారు. తాము వ్యవహరించిన తీరు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం పాశవికంగా హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాము ఏం చేసినా ఆమె ప్రియుడు రాజుపైనే పోతుందని దురాలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ముందు కృష్ణవేణి కేసులో సాక్షులుగా ఉన్న పంప్ ఆపరేటర్ కుమారస్వామి, మహేందర్ కేసును పక్కదారి పట్టించబోయి చివరికి నిందితులుగా మారి అరెస్టయ్యారు. జరిగింది హత్యానా లేక ఆత్మహత్యానా అనే అంశం ఇప్పుడు పోస్టుమార్టం నివేదికపై ఆధారపడి ఉండడంతో దాని కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. -
రాజయ్య కుటుంబానికి బెయిల్ నిరాకరణ
వరంగల్ లీగల్: వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, అయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌కుమార్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను బుధవారం రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి యార రేణుక తిరస్కరించారు. గత సంవత్సరం నవంబర్ 4న అర్ధరాత్రి రాజయ్య కోడలు, ఆమె మనవళ్లు మతిచెందడంపై అనిల్‌కుమార్, రాజయ్య, మాధవి, అనిల్‌కుమార్ రెండో భార్య సనాలపై కేసు నమోదు చేశారు. బెయిల్ కోసం రాజయ్య, మాధవిలు ఇప్పటి వరకు నాలుగుమార్లు, అనిల్‌కుమార్ మూడవసారి కోర్టును ఆశ్రయించగా కోర్టు బెరుుల్ తిరస్కరించింది. కేసు విచారణ కొనసాగుతుందని ఇంకా రిపోర్టులు రావాల్సి ఉందని, నిందుతులకు బెయిల్ ఇస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. -
నా కుమారుడిది హత్యే
♦ రోహిత్ తండ్రి వేముల మణికుమార్ ♦ సుప్రీంకోర్టు సిటింగ్‌జడ్జితో విచారణ జరిపించాలి ♦ మాది ముమ్మాటికీ వడ్డెర కులమే విజయవాడ(గాంధీనగర్): ‘‘సెంట్రల్ యూనివర్సిటీ నా పెద్దకుమారుడిని బలితీసుకుంది. నా పిల్లవాడు చచ్చిపోయేంత పిరికివాడు కాదు. ఇది కచ్చితంగా హత్యే, ఆత్మహత్య కాదు’’ అని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ తండ్రి వేముల మణికుమార్ అనుమానం వ్యక్తం చేశారు. రోహిత్ న్యాయపోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోహిత్ మృతిపై సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరూ చనిపోయిన తన కుమారుడి గురించి ఆలోచించట్లేదని, కేవలం కుల, శవ రాజకీయాలు చేస్తున్నారని మణికుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. నేను, నా భార్య వడ్డెర కులస్తులమే.. తమ ఇంట్లోనే తాను వడ్డెర అని చెబుతుంటే.. తన భార్యాపిల్లలు మాల కులమని చెబుతున్నారని, మాల ఎలా అయ్యారంటే రకరకాల కారణాలు చెబుతున్నారని ఆయన వాపోయారు. తాను వడ్డెర కులస్తురాలినే పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేశారు. తన భార్య రాధిక తన మనసులో మాట చెబుతోందో? బయటినుంచి వచ్చిన ఆదేశాల మేరకు చెబుతుందో? అర్థం కావట్లేదని ఆయనన్నారు. ముమ్మాటికీ తాము వడ్డెర కులస్తులమేనని ఆయన స్పష్టం చేశారు. దెయ్యాల నిలయాలుగా మారాయి రోహిత్ దళితులు, బీసీలు, ఓసీలకోసం చావలేదని, యూనివర్సిటీ వేధింపులే కారణమని మణికుమార్ అన్నారు. సస్పెండైన ఐదుగురు దీక్ష చేస్తుంటే తన కుమారుడు ఒక్కడే ఎందుకు చనిపోయాడు? మిగిలినవారు ఎందుకు తప్పుకున్నారని ఆయన ప్రశ్నించారు. రోహిత్‌ను చంపి ఉరివేశారన్న ఆనుమానాన్ని వ్యక్తం చేశారు. విద్యే ప్రధానంగా, దేవాలయాల మాదిరి ఉండాల్సిన యూనివర్సిటీలు దెయ్యాలకు నిలయాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ న్యాయ పోరాట కమిటీ కన్వీనర్ సంగం మాట్లాడుతూ.. రోహిత్ మృతి అనుమానాలకు తావిస్తోందన్నారు. అంబేడ్కర్ విద్యార్థి సంఘం, ఏబీవీపీ, రోహిత్‌తో కలసి ఉంటున్న నలుగురు స్నేహితులతోపాటు దత్తాత్రేయ, స్మృతిఇరానీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. -
బాక్సైట్ ఉద్యమాన్ని అణిచేందుకే అక్రమ అరెస్టులు
-
బాక్సైట్ ఉద్యమాన్ని అణిచేందుకే అక్రమ అరెస్టులు
ఆరు రోజులైనా తమవారి జాడ చెప్పకపోవడం అన్యాయం ఐటీడీఏ పీవో ఎదుట గోడు వెళ్లబోసుకున్న గిరిజన కుటుంబాలు పాడేరు రూరల్: గిరిజన ప్రాంతంలో బాక్సైట్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స ఆరోపించారు. ఆయన బుధవారం స్థానిక గిరిజన సంఘ కార్యాలయంలో బాధిత గిరిజన కుటుంబాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జీకేవీధి మండలం జర్రెల పంచాయతీ మాజీ సర్పంచ్ సాగిన వెంకటరమణను మావోయిస్టులు హత్య చేయడం వెనుక గిరిజనుల హస్తం ఉందని ఆరోపిస్తూ అమాయక గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అన్యాయమన్నారు. జర్రెల పంచాయితీ కోండ్రుపల్లి గ్రామానికి చెందిన 10 మంది గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకొని 6 రోజులవుతున్నా వారి జాడ బైట పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. విచారణ పేరుతో అమాయక గిరిజనులను అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గిరిజనులు సాగు చేస్తున్న అపరాలు, కాఫీ గింజలు చేతికొచ్చిన సమయంలో గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబాలకు తిండి గింజలు కూడా కరువయ్యాయని చెప్పారు. అదుపులోకి తీసుకున్న గిరిజనులను నేటికీ కోర్టులో హాజరుపర్చకుండా మానవహక్కులను పోలీసులు హరిస్తున్నారని, నిర్బంధంలో ఉన్న గిరిజనుల యోగక్షేమాలు వారి కుటుంబాలకు తెలియజేయకపోవడంతో బాధిత కుటుంబాలు తిండీ తిప్పలు లేకుండా పిల్లా పాపలతో పస్తులు ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. అదుపులో ఉన్న గిరిజనులకు హాని జరిగితే గిరిజన ప్రాంతం భగ్గుమంటుందని హెచ్చరించారు. ఈ విషయంపై ప్రభుత్వం, జిల్లా అదనపు మెజిస్ట్రేట్ జోక్యం చేసుకొని పోలీసుల అదుపులో ఉన్న గిరిజనులను విడిపించి, రక్షణ కల్పించాలని, అక్రమంగా గిరిజనులను అదుపులోకి తీసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విడుదల చేయండి.. లేదా కోర్టులో హాజరుపర్చండి చింతపల్లి రూరల్: పోలీసుల నిర్బంధంలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను విడుదలైనా చేయండి.. లేదా కోర్టులో హాజరుపర్చడని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. ఆమె బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. జీకేవీధి మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ అడపా విష్ణుమూర్తి, జర్రెల ఎంపీటీసీ భర్త, పార్టీ మండల కార్యదర్శి ప్రసాద్‌లను అక్రమ నిర్బంధంలో ఉంచి కుటుంబీకులకు సైతం ఆచూకి తెలపకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారనే నెపంతో సంబంధం లేని తమ పార్టీ నాయకులను అక్రమంగా నిర్బంధించడం సమంజసం కాదన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అదుపులోకి తీసుకున్న వారిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నప్పటికీ ఆరు రోజులుగా తమ పార్టీ నాయకులతోపాటు అదే ప్రాంతానికి చెందిన ఆదివాసీ గిరిజనులు ఆచూకీ చెప్పకపోవడం పోలీసులు చేస్తున్న దమన నీతికి నిదర్శనమని దుయ్యబట్టారు. గిరిజనుల నిర్బంధంపై మానవహక్కుల సంఘాన్ని కూడా కలవనున్నామని, ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. బాధిత కుటుంబాలకు ఓదార్పు : జర్రెల సంఘటనలో పోలీసు ల నిర్బంధంలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకుల కుటుంబాలను బుధవారం ఎమ్మెల్యే ఓదార్చారు. జెడ్పీటీసీ పద్మకుమారి గృహంలో కుటుంబీకులను ఓదార్చుతూ, ఆదివాసీ కుటుంబాలన్నింటికీ అందుబాటులో ఉంటానని, మీ కోసం ఇప్పటికే ఉన్నతాధికారులతో మాట్లాడానని భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్రెల సర్పంచ్ విజయకుమారి, పార్టీ నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు. పీవో ఎదుట గోడు వెల్లబోసుకున్న గిరిజనులు పోలీసుల అదుపులో ఉన్న తమ కుటుంబ సభ్యులను బేషరతుగా విడుదల చేసేందుకు చొరవ చూపాలని బాధిత గిరిజన కుటుంబాలు ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్, సబ్‌కలెక్టర్ లోతేటి శివశంకర్ ఎదుట బుధవారం తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ బాధను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. -
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ ఘటనపై సోమవారం హై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసుపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఈ నెలాఖరు కల్లా నివేదిక ఇస్తామని కోర్టుకు తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఎప్రిల్ 7న శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలు ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. -
ఆ హత్యలు చేసింది చింటూనే : ఎస్పీ
చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ ల హత్యను తానే చేసినట్లు ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ఒప్పుకొన్నాడని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. హత్యకు ఆర్థిక, కుటుంబ తగాదాలే ప్రధాన కారణమని తమ విచారణలో తేలిందని ఆయన చెప్పారు. మేయర్ దంపతులను హత్య చేసేందుకు చింటూ ఆరు నెలల ముందే ప్రణాళిక రచించాడని...గతంలో రెండుసార్లు ప్రయత్నించి విఫలమైనట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందిని అరెస్ట్ చేశామని.. మరో ముగ్గురు నిందితులను పట్టుకోవాల్సిందని చెప్పారు. హత్యకు ఉపయోగించిన 7 రివాల్వర్లు, 13 కత్తులు, 31 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు విచారణ కొనసాగుతుందని అందులో భాగంగా మరో 12 మందిని విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు. -
రైతుల ఆత్మహత్యలపై విచారణ వాయిదా
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అయితే సోమవారం విచారణకు ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో న్యాయస్ధానం అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు అగ్రిగోల్డ్ ఆస్తులపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి సంబంధించి సీ1 ఏజెన్సీని తప్పిస్తూ మరో సంస్థకు అప్పగించే విషయమై నిర్ణయాన్ని రేపు హైకోర్టు వెల్లడించనుంది. -
విచారణ ఖైదీలకు ’న్యాయ భారతి’
కోర్టు ఖర్చుల కోసం భారతీ ఎంటర్ప్రైజెస్ ఫండ్ ఏటా రూ.10 కోట్ల వ్యయం.. వేతనం నుంచి రూ.5 కోట్లు ఇవ్వనున్న సునీల్ మిట్టల్ న్యూఢిల్లీ: చిన్న చిన్న కోర్టు కేసులకు సంబంధించి తొలిసారిగా విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలకు(అండర్‌ట్రైయల్స్) భారతీ ఎంటర్ప్రైజెస్ న్యాయపరమైన సహాయాన్ని అందించనుంది. ఇందుకోసం ‘న్యాయ భారతి’ పేరుతో ఏటా రూ.10 కోట్ల మొత్తాన్ని వెచ్చించనున్నట్లు ప్రకటించింది. జిల్లా కోర్టుల స్థాయిలో అండర్‌ట్రయల్స్‌కు బెయిలు, జామీను ఖర్చుల చెల్లింపు ఇతరత్రా సహాయాన్ని ఈ నిధి నుంచి కల్పించనున్నట్లు తెలిపింది. కాగా, తన వేతనం నుంచి వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టు ఫండ్‌కు ప్రతియేటా రూ.5 కోట్లను ఇవ్వనున్నట్లు భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ చెప్పారు. న్యాయ భారతి సేవలను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మొట్టమొదట ఢిల్లీ-ఎన్సీఆర్, పంజాబ్‌లలో ప్రారంభించనున్నామని, తర్వాత జమ్ము-కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్ వంటి మరిన్ని రాష్ట్రాలకు దీన్ని విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)లో భాగంగా భారతీ ఎయిర్టెల్ ఈ ప్రాజెక్టుకు రూ. 10 కోట్లను అందిస్తుందని.. ఇందులో సగం తనకు లభించే వేతనం నుంచి వెళ్తుందని ఆయన వివరించారు. గత ఆర్థిక సంవత్సరం(2014-15)లో సునీల్ మిట్టల్ రూ. రూ.27.17 కోట్ల వేతన ప్యాకేజీని అందుకున్నారు. కాగా, ప్రస్తుతం దేశంలో 1,387 జైళ్లలో దాదాపు 2.8 లక్షల మందికిపైగానే అండర్‌ట్రయల్స్‌గా ఉన్నట్లు మిట్టల్ చెప్పారు. మొత్తం ఖైదీల్లో వీరి సంఖ్య సుమారు 68 శాతమని ఆయన పేర్కొన్నారు. తొలిసారిగా ఏదైనా కేసుల్లో చిక్కుకున్నవారికి, అదీకూడా చిన్నచిన్న తప్పులు చేసి విచారణ ఎదుర్కొంటున్నవారికి మాత్రమే ఈ సేవలను అందిస్తామని కూడా మిట్టల్ స్పష్టం చేశారు. చట్టాల గురించి సరిగ్గా తెలియకపోవడం, బెయిల్ మొత్తాన్ని చెల్లించే ఆర్థిక స్తోమత లేకపోవడం, జామీను ఇచ్చేందుకు ఎవరూ సహకరించకపోవడం వంటి కారణాలవల్లే చాలావరకూ అండర్‌ట్రయల్స్ జైళ్లలో మగ్గుతున్నారని ఆయన గుర్తుచేశారు. -
ఉచ్చు బిగుస్తోంది
‘కల్తీ’ వ్యవహారంలో మరింతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు, వైద్యుల పాత్రపైనా ఆరా ‘విజిలెన్స్’పైనా విచారణ విజయవాడ సిటీ : అజిత్‌సింగ్‌నగర్‌లోని ఇందిరానాయక్ నగర్ (పోలీసు కాలనీ)లో కర్మాగారం ఏర్పాటు చేసి కల్తీ నెయ్యి, ఇతర ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్న ఆవుల ఫణీంద్ర కుమార్ అలియాస్ ఫణిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రెండో నిందితుడైన ఫణి బావ అనిల్ కుమార్‌తో పాటు మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు. ఫణి వ్యాపార విస్తరణకు 150 మంది వరకు సహకరించినట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. వారిలో 30 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్టు చెపుతున్నారు. వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పోలీసు విచారణలో ఫణి పలు ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు కొందరు రాజకీయ నేతల పేర్లు కూడా చెప్పినట్టు తెలిసింది. చూసీచూడనట్టు వదిలేశారు... కల్తీ నెయ్యి తయారీలో ఫుడ్ ఇన్స్పెక్టర్ల పాత్ర కూడా ఉందని పోలీసు అధికారులు గుర్తించారు. పలుమార్లు పట్టుబడినప్పటికీ అతని వ్యాపారాన్ని నిలువరించేందుకు చర్యలు చేపట్టకపోగా చూసీచూడనట్టుగా వ్యవహరించారని చెపుతున్నారు. గతంలో గుట్కా వ్యాపారులకు సహకరించిన ఆరోపణలు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లపై ఉన్నాయి. అప్పట్లోనే క్రిమినల్ కేసుల నమోదుకు పోలీసు కమిషనర్ ఆదేశించారు. అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఘం రంగంలోకి దిగి మరోసారి ఇలాంటి తప్పులు జరగవంటూ పోలీసు కమిషనర్ సవాంగ్‌ను కోరడంతో వదిలేశారు. తిరిగి ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడే కల్తీ నెయ్యి, ఇతర ఆహార ఉత్పత్తుల వ్యవహారంలో వీరి పాత్ర వెలుగు చూడటంతో వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించినట్లు సమాచారం. ప్రాంతీయ ఫోరెన్సిక్ లేబరేటరీకి నమూనాలు గతంలో పలుమార్లు ఫణీంద్ర పట్టుబడినా కల్తీ లేదంటూ వైద్యులు ధృవీకరించారు. ఇటీవల మరోసారి పట్టుబడిన ఫణీంద్ర కూడా తాను కల్తీ చేయట్లేదనడానికి ఆరోగ్యశాఖ లేబరేటరీ ఇచ్చిన సర్టిఫికెట్ నిదర్శనమని చెప్పాడు. పోలీసు విచారణలో మాత్రం తాను కల్తీ వాస్తవమేనని అంగీకరించినట్టు తెలిసింది. దీంతో గతంలో మాదిరి ఫుడ్ ఇన్స్పెక్టర్లకు కాకుండా పోలీసు శాఖ ఆధీనంలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ లేబరేటరీకి నెయ్యి, ఇతర నమూనాలు పంపారు. ఆ నివేదిక ఆధారంగా గతంలో సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులు, ఇతరులపై చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. విజిలెన్స్‌నూ వదలొద్దు కల్తీ నెయ్యి వ్యాపారంలో చూసీచూడనట్టుగా వ్యవహరించిన విజిలెన్స్ అధికారులను కూడా వదలొద్దంటూ దిగువ స్థాయి అధికారులకు ఆదేశాలు అందాయి. అతని వ్యాపారంపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా మొక్కుబడి దాడులు నిర్వహించారనేది వారిపై అభియోగం. పోలీసు విచారణలో నిందితుడు ఫణీంద్ర ఈ విషయం స్పష్టం చేసినట్టు తెలిసింది. -
సినీ ఫక్కీలో బంకులో మోసం
సీసీ కెమెరాలో చిక్కిన నిందితుడు రావికమతం : రావికమతంలోని ఓ వ పెట్రోల్ బంకులో ఓ అపరిచిత వ్యక్తి సినీ ఫక్కీలో మోసం చేసి రూ.25 వేల అపహరించుకుపోయాడు. దీనిపై బంకు యజమాని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ ఫుటేజీల ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎస్ఐ వెంకటరావు తెలిపిన వివరాల మేరకు.. రావికమతం సుశీల ఏజెన్సీ ఆధ్వర్వంలో నడుస్తున్న బంకుకు సోమవారం ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. అక్కడ సూపర్ వైజర్ అప్పారావుతో మాట్లాడుతూ.. తనను తహశీల్దార్ కుమార్ పంపించారని, బంకు యజమాని తనకు తెలుసని తెలిపాడు. రూ. 25 వేలకు ఎన్ని లీటర్ల డీజిల్ వస్తుందో అంతటి కి బిల్లు కావాలని, తర్వాత వచ్చి డీజిల్ తీసుకెళ్తామని చెప్పాడు. అత్యవసరంగా రూ. 25 వేలు కావాలని, ఆ మొత్తం చోడవరం పంపించాలని వారిని నమ్మబలికాడు. మొత్తం రూ.50 వేలు కార్యాలయానికి వస్తే ఇస్తానని వారితో చెప్పాడు. దీంతో వారు బంకు యజ మాని శేషుతో మాట్లాడారు. ఆయన సైతం నమ్మి బిల్లుతో పాటు, రూ.25 వేలు ఆ వ్యక్తికి ఇవ్వాలని సూచించారు. అతని వెంట వెళ్లి రూ. 50 వేలు తేవాలని సిబ్బందికి సూచించాడు. దీంతో రూ. 25 వేలు తీసుకున్న ఆ వ్యక్తి మరొకరికి ఇచ్చి పంపేశాడు. మొత్తం రూ. 50 వేలు తన వెంట వస్తే ఇస్తానంటూ.. బంకు ఉద్యోగి ఈశ్వరరావును వెంట తీసుకుని రావికమతం ఉన్నత పాఠశాలకు వెళ్లాడు. అక్కడ ఈశ్వరరావును చెట్టుకింద కూర్చొమని చెప్పి.. ఆ వ్యక్తి ఉన్నత పాఠశాలలోకి ప్రవేశించాడు. అక్కడే 20 నిముషాలు వేచి ఉన్న ఈశ్వరరావు.. లోపలికి వెళ్లిన వ్యక్తి రాకపోవడంతో అనుమానం వచ్చి చుట్టూ పక్కల వెతికాడు. ఆ వ్యక్తి ఆచూకీ కనిపించ కపోవడంతో ఉపాధ్యాయులను అడిగాడు. ఎవరో వ్యక్తి వచ్చారని,వెనుక గేటు నుంచి వెళ్లిపోయాడని చెప్పడంతో మోసపోయినట్టు గ్రహించి, బంకు యాజమానికి ఫోన్లో జరిగింది వివరించాడు. వెంటనే బంకు యాజమాని పోలీసులు ఫిర్యాదు చేయగా.. వారు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీని సేకరించి విచారణ చేపడుతున్నారు. -
నాగాయలంకలో భారీ పోలీసు బందోబస్తు
కృష్ణా జిల్లా నాగాయలంక, ఎదురుమొండి పట్టణాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మండలంలోని ఎదురుమొండిలో 2007లో అప్పటి ఎంపీపీ కన్నా జనార్దనరావు హత్యకు గురయ్యారు. ఆకేసు విచారణ పూర్తయిన తర్వాత నేటి సాయంత్రం దీనిపై బందరులోని జిల్లా కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ సందర్భంగా జనార్దన్ స్వగ్రామం ఎదురుమొండి, మండల కేంద్రం నాగాయలంకలో పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. అల్లర్లు జరగొచ్చనే అనుమానంతోనే ముందు జాగ్రత్తగాఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
జిల్లా సహకార అధికారిపై విచారణ
కొవ్వూరు (పశ్చిమగోదావరి) : జిల్లా సహకార అధికారి డి.వెంకటస్వామిపై వచ్చిన ఆరోపణలపై తూర్పుగోదావరి జిల్లా సహకార అధికారిణి టి.ప్రవీణ సోమవారం విచారణ చేపట్టారు. స్ధానిక డివిజనల్ సహకార అధికారి కార్యాలయంలో డీసీవోపై ఫిర్యాదు చేసిన పీఎసీఎస్ కార్యదర్శుల నుంచి వ్యక్తిగతంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల జిల్లాలోని 164 మంది కార్యదర్శులు రాష్ట్ర సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డికి డీసీవో వైఖరిపై ఫిర్యాదు చేశారన్నారు.దీంతో సహకార శాఖ కమీషనర్ విచారణకు ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ప్రధానంగా సొసైటీలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా సంఘాల మనుగడను దెబ్బతీస్తున్నారని.. డీసీవోను బదిలీ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆమె తెలిపారు. దీనిలో భాగంగా 164 మంది కార్యదర్శులను సోమవారం విచారణకు హాజరు కావాల్సినదిగా నోటీసులు పంపామని ప్రవీణ తెలిపారు. ఆరోపణలకు సంబంధించిన రుజువులతో హాజరు కావాలని కార్యదర్శులకు సూచించామన్నారు. విచారణ అనంతరం నివేదికను సహకార ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఆమె తెలిపారు. డివిజన్ సహకార అధికారి జీవీ రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. -
నారాయణ కళాశాలలో డీఐజీ విచారణ
చింతకొమ్మదిన్నె (వైఎస్సార్ జిల్లా) : నారాయణ కళాశాలలో విద్యార్థినుల మృతిపై త్వరలోనే నిజానిజాలు వెల్లడవుతాయని డీఐజీ రమణ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన కడప సమీపంలోని కృష్ణాపురం వద్దనున్న నారాయణ జూనియర్ కళాశాలకు ఎస్పీ నవీన్ గులాటితో కలసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులు మృతి చెందిన స్థలాన్ని పరిశీలించారు. కళాశాల యాజమాన్యం, హాస్టల్ సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థినుల మరణాలకు గల కారణాలు పోస్టుమార్టం నివేదిక అందిన అనంతరమే వెల్లడవుతాయని తెలిపారు. -
ర్యాగింగ్‌పై విచారణ ప్రారంభం
యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీయూలో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై ఆదివారం అధికారులు విచారణ ప్రారంభించారు. ఎస్వీయూలో ర్యాగింగ్ అంశంపై ఆదివారం సాక్షి దినపత్రికలో సోమవారం నుంచి సినిమా చూపిస్తాం అన్న శీర్షికతో కథనం వెలువడింది. దీనికి అధికారులు స్పందించారు. మధ్యాహ్న సమయంలో రెక్టార్ జయశంకర్, ప్రిన్సిపాల్ భగవాన్ రెడ్డి, డెప్యూటీ వార్డన్ రమేష్‌బాబు డి.బ్లాక్‌ను సందర్శించారు. ఘటనపై విద్యార్థులను విచారించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ
గొల్లప్రోలు : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పత్తి కొనుగోలు కేంద్రంలో అవకతవకలపై విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. నలుగురు అధికారులతో కూడిన బృందం మంగళవారం గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో పలువురు రైతులను విచారిస్తోంది. రైతుల పేర్లతో వ్యాపారులే సీసీఐకి పత్తిని విక్రయించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాటిపత్తి గ్రామంలోని రైతుల నుంచి అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. రెండు నుంచి మూడు రోజుల పాటు విచారణ ఉంటుందని, రైతులు సహకరించాలని కోరారు. విచారణ అనంతరం ఎంత మొత్తంలో అవకతవకలు జరిగాయన్నది తెలుస్తుందని అధికారులు తెలిపారు. -
కుంభకోణాలవల్లే మాట్లాడ్డం లేదు
{పత్యేక హోదాపై చంద్రబాబు తీరును విమర్శించిన వాసిరెడ్డి పద్మ ఆయన కేంద్రాన్ని నిలదీయలేరు.. వారంటే ఆయనకు భయం.. ‘ఓటుకు కోట్లు’లో ఇరుక్కున్న బాబు ఢిల్లీముందు సాగిలపడ్డారు.. తన కేసులకోసం కక్కుర్తిపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు హైదరాబాద్: తాను చేస్తున్న కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడంతోపాటు తనపై ఎలాంటి విచారణలు, కేసులు లేకుండా ఉండేందుకే సీఎం చంద్రబాబు ఏపీ ప్రత్యేకహోదా కోసం ఎన్డీయే ప్రభుత్వంపై గట్టిగా పోరాడలేకుండా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజ మెత్తారు. పార్టీ కేంద్రకార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేకహోదాపై చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేరని, ఆయనకు వారంటే భయమని అన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇరుక్కున్న చంద్రబాబు ఢిల్లీ ముందు సాగిలపడి తనపైకి రాకుండా చేసుకున్నారని, బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును కాపాడలేడనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఆ కేసు చార్జిషీటులో చంద్రబాబు పేరు ఉంటుందో లేదో తెలియని దశలో ఉందని ఆమె చెప్పారు. అవసరం లేకున్నా పోలవరాన్ని నీరుగార్చేలా పట్టిసీమ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అందులో భారీగా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని పద్మ ఆరోపించారు. రాజధాని నిర్మాణం విషయంలో బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని, జపాన్, సింగపూర్ ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారినుంచి లబ్ధి పొందుతున్నారని ధ్వజమెత్తారు. వీటన్నింటిపైనా విచారణ జరిగితే చంద్రబాబు జైల్లో ఉండాల్సి వస్తుందని, అందుకనే కేంద్రంతో పోరాడాలంటే భయపడుతూ.. తన కేసులకోసం కక్కుర్తిపడి రాష్ట్రప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబుకు తన ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్రప్రజలు ఎటుపోయినా, విద్యార్థులు, నిరుద్యోగులు ఎటుపోయినా ఆయనకు పట్టదన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే తమకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మేలు జరుగుతుందని ఎదురుచూస్తున్న వారి ప్రయోజనాల్ని తాకట్టుపెట్టి ప్రత్యేకహోదాపై మాట్లాడ్డం లేదని ఆమె దుయ్యబట్టారు. ప్రజల్ని ఎందుకుమభ్యపెడుతున్నారు? ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశమే లేదని ఓవైపు కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా తెగేసి చెబుతూ ఉంటే.. మరోవైపు చంద్రబాబు ప్రత్యేకహోదా వస్తుందని ఇంకా ప్రజల్ని ఎందుకు మభ్యపెడుతున్నారని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. ప్రత్యేకహోదా రాదనే విషయం చంద్రబాబుకు ముందే తెలుసని, వారి ఎంపీయే ఆ విషయం బయటకు చెప్పారని ఆమె గుర్తు చేశారు. కేంద్రమంత్రి చేసిన ప్రకటన ఏపీకి సంబంధించింది కాదంటున్న చంద్రబాబు.. తాను స్వయంగా ఢిల్లీకెళ్లి ఎన్డీయే పెద్దల్ని కలసి ఆ ప్రకటన ఏపీకి సంబంధించింది కానే కాదని ఎందుకు చెప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు టర్కీకి వెళ్లేబదులు తన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల్ని తీసుకెళ్లి ఢిల్లీ నడిబొడ్డున ప్రత్యేకహోదాపై ఎన్డీయే సర్కారును నిలదీయాలని పద్మ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మౌనం వహించినా తాము మాత్రం పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు. -
తొక్కిసలాటను మర్చిపోయారా?
పుష్కరాలు పూర్తయినా విచారణ ఊసే లేదు ఆధారాల మాయంపై అనుమానాలు ‘సిట్’పై ఉన్న శ్రద్ధ ఇప్పుడు లేకపోవడంపై విమర్శలు హైదరాబాద్: గోదావరి పుష్కరాల్లో తొలి రోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 27 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘటనపై ఇంకా విచారణ ప్రారంభించడం లేదు. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటులో చూపిన శ్రద్ధ ఇప్పుడెందుకు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుపై ఆరోపణలు వస్తే వేగంగా స్పందించిన ప్రభుత్వం పుష్కరాల్లో తొక్కిసలాట అంశాన్ని ఎందుకు విస్మరిస్తోందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పుష్కరాల తొలిరోజైన జూలై 14న తొక్కిసలాట చోటు చేసుకుంది. పుష్కరాలపై డాక్యుమెంటరీ చిత్రీకరణ, సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో కాకుండా పుష్కర ఘాట్‌లో పుణ్య స్నానం ఆచరించడం, భక్తులను రెండున్నర గంటల పాటు ఆపేయడం... ఇవన్నీ తొక్కిసలాటకు కారణమనే విమర్శలు వచ్చాయి. దీనిపై పుష్కరాలు ముగిశాక ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామని జూలై 15న ప్రభుత్వం ప్రకటించింది. జూలై 25తో పుష్కరాల ఘట్టం ముగిసినా విచారణ అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలోనూ.. పుష్కరాల నిర్వహణ అద్భుతమని కీర్తించుకోవడం మినహా తొక్కిసలాటపై నిర్ణయం తీసుకోలేదు. విచారణ జరిగితే సీఎంకు ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. పుష్కర ఘాట్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లు సహా తొక్కిసలాటకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమవుతున్నాయనే వాదనలున్నాయి. ఆధారాలు, రికార్డుల్లో ఎన్ని ‘మార్పులు చేర్పులు’ జరుగుతాయో? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
నేడు హైకోర్టులో ప్రత్యూష కేసు విచారణ
-
అక్రమార్కులను కాపాడుతున్నారా?
సిద్ధు సర్కార్‌కు గవర్నర్ లేఖ బెంగళూరు :అధికార కాంగ్రెస్ పార్టీ పాలనా విధానం పట్ల గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా గరం అయ్యారు. అనేక అక్రమాలకు పాల్పడిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను విచారణ చేయడానికి లోకాయుక్తకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. ‘ప్రభుత్వ తీరు అక్రమార్కులను రక్షించేలా ఉన్నట్లు భావించాలా?’ అంటూ ఘాటు వాఖ్యలతో మూడు పేజీల లేఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కార్‌కు రాశారు. వివరాలు... అధికార దుర్వినియోగానికి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం, ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ ధనాన్ని స్వప్రయోజనానికి వాడుకోవడం, లంచాలు తీసుకోవడం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను విచారించడానికి, వారిపై ఛార్జ్‌షీట్ వేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి లోకాయుక్త ఎన్నోసార్లు లేఖ రాసింది. అక్రమాలు రుజువైన కొంతమంది అధికారులను విధుల నుంచి తొలగించాల్సిందిగా సిఫార్సు కూడా చేసింది. ఇప్పటి వరకూ 107 కేసుల్లో ఇలాంటి సూచనలు చేస్తూ లోకాయుక్త ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందించింది. నిబంధనల ప్రకారం లోకాయుక్త సిఫార్సులను మూడు నెలల్లోపు అమలు చేయాలని అలా కాని పక్షంలో అందుకు గల కారణాలను తెలియజేయాలని గతంలో సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. అయితే కొన్ని కేసులకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరికొన్ని కేసుల్లో మంత్రి మండలిలో చర్చించి లోకాయుక్త సిఫార్సులను సిద్ధరామయ్య ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ విషయాలన్నింటి పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో లోకాయుక్త సిఫార్సుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యధోరణికి కారణం ఏంటని ప్రశ్నిస్తూ గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ప్రభుత్వానికి లేఖ రాశారు. సిఫార్సులను అమలు చేయకపోవడానికి గల కారణాలతో వారంలోపు తనకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా గవర్నర్ లేఖలో పేర్కొన్నారు. అన్నదాతల బలవన్మరణాల విషయం కూడా... రాష్ట్రంలో జరుగుతున్న రైతుల బలవన్మరణాల విషయాన్ని కూడా వజుభాయ్ రుడాభాయ్ వాలా తన లేఖలో పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రైతుల బలవన్మరణాలకు గల కారణాలు, ఇప్పటి వరకూ ప్రభుత్వం రైతులకు అందించిన పరిహారం తదితర విషయాలను కూడా నివేదికలో పొందుపరిచాలని గవర్నర్ వజుభాయ్ తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు లోకాయుక్త సిఫర్సుల అమలు విషయంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందంటూ కొంతమంది ప్రజా హక్కుల కార్యకర్తలు హై కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ విషయమై ఈనెల 22లోపు సమాధానం ఇవ్వాల్సిందిగా కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
విశాఖ పోలీసుల అదుపులో ఆశ్రమ స్వామీజీ!
విచారణకు విశాఖకు తరలింపు బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో ఉద్రిక్తత మహర్షి వెంట తరలివెళ్లిన శిష్యులు పాడేరు రూరల్: పాడేరు మండలం వంతాడపల్లి చెక్‌పోస్టు సమీపంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆశ్రమ స్వామీజీని బుధవారం పోలీసులు విచారణ కోసం విశాఖకు తీసుకెళ్లారు. ఈ ఆశ్రమాన్ని మొదటి నుంచి వివాదాలు వెంటాడుతున్నాయి. 2011లో ఆశ్రమం నిర్మాణం కోసం అమెరికాకు చెందిన గోకరాజు వినీత, శ్రీధర్, విశాఖకు చెందిన పుండరీకాక్షుడు, సుహాసినీ, సుధ, మోహన్ దంపతులు సుమారు రూ.35 లక్షల విరాళం ఇచ్చినట్లు తెలిసింది. ఈ సొమ్మును సక్రమంగా ఖర్చు చేయలేదని, ఆశ్రమంలో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని 2013లో దాతలు విశాఖపట్నం, పాడేరు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ స్థాయి అధికారి రెండు రోజుల క్రితం ఆశ్రమంలో స్వామీజీని విచారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం స్పెషల్‌బ్రాంచి సీఐ పి.సూర్యనారాయణ ఆశ్రమానికి వచ్చి విశాఖపట్నంలో ఎస్పీ ఎదుట విచారణకు హాజరుకావాలని స్వామీజీకి సమాచారం అందించారు. దీంతో స్వామీజీ పోలీసుల వాహనంలో కాకుండా తన సొంత వాహనంలో విశాఖకు వెళ్లారు. ఆయన వెంట వారి శిష్యులు కూడా ట్రక్కులో విశాఖపట్నం వెళ్లారు.ఈ విషయంపై స్పెషల్ బ్రాంచి సీఐ సూర్యనారాయణను విలేకరులు వివరణ కోరగా స్వామీజీపై వచ్చిన అభియోగాల విచారణ నిమిత్తం విశాఖపట్నం ఎస్పీ వద్దకు తీసుకు వెళుతున్నామని తెలిపారు. ఆరోపణలు అవాస్తవం: దయానిధి తనపై నమోదైన అభియోగాలు అవాస్తవమని ఆశ్రమ స్వామీజీ కీర్తి దయానిధి మహర్షి స్పష్టం చేశారు. ఆశ్రమంలో బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో హిందూ మతం వినాశనానికి కొంత మంది దుష్టశక్తులు కంకణం కట్టుకున్నాయని, అందులో భాగంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతంలో హిందూమతం పరిరక్షణకు, గిరిజనులను భక్తి, సన్మార్గంలో నడిపించేందుకే తాను కృషి చేస్తున్నానని చెప్పారు. ఆశ్రమ ప్రతిష్టను దెబ్బతీయడానికే కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆశ్రమం నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చిన సొమ్మును తరువాత అప్పుగా ఇచ్చామని, వెంటనే తిరిగి చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. తనపై వచ్చిన అభియోగాలు సరైనవి కావని నిరూపించుకునేందుకే విశాఖపట్నంకు వెళుతున్నానని, శిష్యులు అధైర్య పడవద్దన్నారు. -
పోలీసుల అదుపులో డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులు
రహస్య ప్రాంతాల్లో తమిళనాడు పోలీసుల విచారణ వేలూరు(తమిళనాడు): ఎర్రచందనం కేసులో ఎక్సైజ్ డీఎస్పీ, నలుగురు కానిస్టేబుళ్లు సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూరుకు చెందిన పాట్టాలి మక్కల్ పార్టీ కార్యకర్త చిన్నపయ్యన్ ఈనెల 26న హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి వేలూరు డీఐజీ తమిళ్‌చంద్రన్ విచారణ జరిపారు. విచారణలో శేషాచలం అడవుల నుంచి తీసుకొచ్చే ఎర్రచందనాన్ని చిన్నపయ్యన్ కోళ్లపారంలో ఉంచి వాటిని వేలూరుకు సమీపంలోని అలిమేలు మంగాపురానికి చెందిన నాగేంద్రన్ లారీలో చెన్నై, ఇతర ప్రాంతాలకు తరలించే వారని తెలిసింది. అయితే ముఠా సభ్యులకు తెలియకుండా ఎర్రచందనాన్ని చిన్నపయ్యన్ విక్రయించడంతో అతన్ని హత్య చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు తిరుమాల్కుప్పానికి చెందిన వెంకటేషన్, తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలూకా ఇరుముడిచూర్కు చెందిన తంగరాజ్,పెరుమాల్, సత్యమూర్తిలను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. చిన్నపయ్యన్, నాగేంద్రన్ స్మగ్లింగ్ వ్యవహారం, చిన్నపయ్యన్ హత్య కేసు నుంచి కాపాడేందుకు ఎక్సైజ్ డీఎస్పీ తంగవేలు, హెడ్ కానిస్టేబుళ్లు సామువేల్, సౌందర్‌రాజన్, కానిస్టేబుళ్లు రాజేష్, శ్రీనివాసన్ కలిసి లారీ యజమాని నాగేంద్రన్ వద్ద రూ. 35 లక్షలు తీసుకున్నట్లు తేలింది.లారీ యజమాని నాగేంద్రన్ భార్య జ్యోతిలక్ష్మి, ఎక్సైజ్ డీఎస్పీ, 4 పోలీసులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
వికార్ఎన్కౌంటర్పై ‘సిట్’ విచారణ
ఆలేరు: నల్లగొండ జిల్లా ఆలేరులోని కందిగడ్డతండా శివారులలో గత నెల 7వ తేదీన జరిగిన తీవ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై బుధవా రం ఆలేరు పోలీస్‌స్టేషన్‌లో సిట్ (ప్రత్యేక విచారణ బృందం) విచారణ జరిపింది. ఉదయం 7.30 గంటలకే సిట్ బృందం సభ్యులు ఆలేరు పోలీస్‌స్టేషన్‌కు వివిధ వాహనాల్లో చేరుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఉన్న ఎన్కౌంటర్ జరిగిన బస్సు ను వారు సుమారు మూడు గంటల పాటు పరిశీలించారు. మధ్యాహ్నం తిరిగిహైదరాబాద్కు వెళ్లారు. పోలీస్‌స్టేషన్‌లోకి ఇతరులను అనుమతించలేదు. విచారణ జరిపిన వారిలో సిట్ బృందం ఐజీ సందీప్ శాండీల్యా, ఎస్పీ షానవాజ్‌ఖాసీం, మాదాపూర్ ఐజీ రవికుమార్ ఉన్నారు. -
కోర్టుకు హాజరైన స్పీకర్
ములుగు : స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సోమవారం వరంగల్ జిల్లా ములుగు సివిల్ కోర్టుకు హాజరయ్యారు. 2014 శాసనసభ ఎన్నికల సందర్భంగా గణపురం మండలం బంగ్లపల్లిలో పార్టీ కార్యకర్త రాజేశ్వరరావు వద్ద రూ. 20 లక్షలు దొరకగా, ఈ కేసులో రాజేశ్వరరావు ఏ-1గా, మధుసూధనాచారి ఏ-2గా ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన కోర్టుకు హాజరు కాగా, కేసు ఈ నెల 29కి వాయిదా పడింది. -
‘ఎర్ర’ ఎన్‌కౌంటర్‌పై విచారణ వేగవంతం
శేషాచలంలో ఏప్రిల్ ఏడో తేదీ జరిగిన ఎర్ర’కూలీల ఎన్‌కౌంటర్‌పై విచారణను వేగవంతం చేస్తామని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రత్యేక బృందం సభ్యుడు పీడీ ప్రసాద్ తెలిపారు -
వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై ఆర్డీవో విచారణ
నల్లగొండ: గత నెల 7న నల్లగొండ జిల్లా ఆలేరులోని కందిగడ్డతండా శివారులో తీవ్రవాది వికారుద్దీన్, అతని అనుచరుల ఎన్‌కౌంటర్‌పై గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నల్లగొండ ఆర్డీవో వెంకటాచారి విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి 22 మందికి నోటీసులు జారీ చేయగా గురువారం విచారణకు 8 మంది హాజరయ్యారు. హాజరైన వారిలో నలుగురు వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. కాగా, మిగతా నలుగురు పోలీసు సిబ్బంది. ఆర్డీవో వెంకటాచారి వారి నుంచి వాంగ్ములాలను తీసుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆలేరుకు చేరుకున్న ఆర్డీవో సాయంత్రం 5 గంటల వరకు తహశీల్దార్ కార్యాలయంలోనే ఉన్నారు. శుక్రవారం కూడా విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. (ఆలేరు) -
పాతికేళ్ల పోరాటం వృథా!
హాశింపురా హత్యాకాండ కేసులో 16 మంది విడుదల నిందితులను గుర్తించేందుకు సాక్ష్యాలు లేవన్న ఢిల్లీ కోర్టు యూపీ కానిస్టేబుళ్లపై అభియోగాల కొట్టివేత న్యూఢిల్లీ: కుటుంబసభ్యులను కోల్పోయిన ఆ బాధితులు పాతికేళ్లకుపైగా చేసిన పోరాటం వృథా అయింది! సాయుధ పోలీసుల కర్కశత్వానికి బలైన ఆ కుటుంబాలు న్యాయం కోసం చేసిన సుదీర్ఘ నిరీక్షణ ఫలించలేదు. హాశింపురా హత్యాకాండ కేసులో నిందితులైన 16 మంది యూపీ ప్రాంతీయ సాయుధ కానిస్టేబుళ్ల(పీఏసీ) దళం సిబ్బందిని ఢిల్లీ కోర్టు శనివారం నిర్దోషులుగా ప్రకటించింది. 1987లో యూపీలోని మీరట్ జిల్లా హాశింపురా గ్రామంలో 42 మంది ముస్లింలను హతమార్చిన ఘటనలో ఇన్నేళ్ల విచారణ తర్వాత నిందితులంతా కేసు నుంచి విముక్తులయ్యా రు. వీరిని గుర్తించడానికి తగిన సాక్ష్యాధారాలు లేనందువల్ల సంశయలాభం కింద వారిని విడుదల చేస్తున్నట్లు అదనపు సెషన్స్ జడ్జి సంజయ్ జిందాల్ తన తీర్పులో పేర్కొన్నారు. అలాగే బాధిత కుటుంబాల పునరావాసం ఈ కేసును ఢిల్లీ రాష్ర్ట న్యాయసేవల సంస్థ పరిశీలనకు పంపారు. గత జనవరిలోనే ఈ కేసులో తుది వాదనలు పూర్తయ్యాయి. ఆ తర్వాత తీర్పును కోర్టు ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. అయితే గత నెలలో ఇరుపక్షాల తరఫు న్యాయవాదుల నుంచి మరికొంత సమాచారా న్ని కోరిన కోర్టు.. తాజాగా ఈ తీర్పునిచ్చింది. హాశింపురాలో ఏం జరిగిందంటే.. బాధితుల కథనం ప్రకారం.. 1987లో మీరట్ జిల్లాలో అల్లర్లు చోటుచేసుకున్న సమయంలో మే 22న హాశింపురా గ్రామానికి వచ్చిన ప్రాంతీయ సాయుధ కానిస్టేబుళ్ల(పీఏసీ) దళాలకు చెందిన 41వ బెటాలియన్ సభ్యులు అక్కడి ఓ మసీదు వద్ద గుమిగూడిన 500 మందిలో 50 మంది వరకు ముస్లింలను తమ వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. ఆ తర్వాత వారిని కాల్చి చంపి సమీపంలోని ఓ కాలువలో పడేశారు. ఈ హత్యాకాండలో మొత్తం 42 మంది చనిపోయినట్లు అనంతరం గుర్తించారు. దీనిపై విచారణ జరిపిన యూపీ సీఐడీ విభాగం 1996లో గజియాబాద్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. హత్య, హత్యాయత్నం, కుట్ర, సాక్ష్యాధారాలను మార్చడం వంటి పలు అభియోగాలతో 19 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 2002లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది. అక్కడ 2006లో 17 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఇన్నేళ్ల విచారణ సందర్భంగా నిందితుల్లో ఒకరు చనిపోయారు. 161 మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్న కోర్టు.. తాజాగా నిందితులందరినీ నిర్దోషులుగా వదిలేసింది. -
ట్రక్షీట్ల మాయాజాలంపై విచారణకు ఆదేశం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ట్రక్షీట్ల మాయాజాలంైపై కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సీరియస్‌గా స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని జాయింట్ కలెక్టర్ రామారావును ఆదేశించారు. సీరియల్ నంబర్లు లేకుండా ట్రక్షీటులను ఎలా ముద్రించారని, రైసు మిల్లర్ల చేతికి ఎలా వెళ్లాయో నిగ్గుతేల్చాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉండాల్సిన ట్రక్‌షీటు మిల్లర్ల చేతికి వెళ్లాయని, వీటిని ఆధారంగా చేసుకుని పలువురు మిల్లర్లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, రూ.కోట్లలోనే కుంభకోణం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ‘ట్రిక్’షీట్లు అనే శీర్షికతో ‘సాక్షి’లో బుధవారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీన్ని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సీఎస్‌డీటీల చేత విచారణ జరిపించి, నివేదిక ఇవ్వాలని జేసీని ఆదేశించారు. అలాగే, మిల్లులు కొనుగోలు చేసిన ధాన్యమెంత ? ఉన్న నిల్వలెంత? కస్టమ్ మిల్లింగ్ ఎంత? తదితర వాటిపై కూడా విచారణ జరపాలని ఆదేశించారు. -
బోగస్ సర్టిఫికెట్లపై సీబీసీఐడీ విచారణ!
రవాణా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి సీఎం ఆదేశాలు గుర్తింపు లేని వర్సిటీ సర్టిఫికెట్లతో ఆర్టీఏలో పదోన్నతులు సిటీబ్యూరో: రవాణా శాఖలో గత సంవత్సరం తీవ్ర కలకలం సృష్టించిన రాజస్థాన్ వర్సిటీ సర్టిఫికెట్ల ఉదంతంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మకు ఈ నెల 19వ తేదీన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. చెల్లుబాటు కాని ఆటోమోబైల్ డిప్లొమా సర్టిఫికెట్ల ఆధారంగా కొందరు ఆర్టీఏ కానిస్టేబుళ్లు సహాయ మోటారు ఇన్స్పెక్టర్లుగా (ఏఎంవీఐలు) పదోన్నతులు పొందడమే కాకుండా, ప్రస్తుతం మోటారు వాహన ఇన్స్పెక్టర్లుగా (ఎంవీఐలు) కూడా మరోసారి పదోన్నతిని పొం దేందుకు సిద్ధంగా ఉన్నారు. రవాణా శాఖలో ఏడాది కాలంగా వివిధ స్థాయిల్లో చర్చనీయాంశంగా మారిన ఈ ఉదంతంపై ఇటీవల కొందరు నిరుద్యోగులు, ‘తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రివెన్షన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ’ ప్రతినిధులు ఇటీవల సీఎంను కలిసి ఈ అక్రమ పదోన్నతులపై ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను సైతం సీఎంకు అందజేయడంతో ఆయన దీనిపై సమగ్రమైన విచారణ కోరినట్లు తెలిసింది. చెల్లుబాటు కావు.... ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అప్పటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి సంస్థలు రాజస్థాన్ వర్సిటీ సర్టిఫికెట్లు చెల్లబోవని ఏడాది క్రితమే తేల్చిచెప్పాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ డీమ్డ్ వర్సిటీ (ఐఏఎస్ఈ) అందజేసే ఈ ఆటోమోబైల్ డిప్లొమా సర్టిఫికెట్ ఆధారంగా గతంలో ఏఎంవీఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న జితేందర్ అనే ఓ నిరుద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం ఏపీపీఎస్సీ వాదననే బలపరిచింది. అయినప్పటికీ ఈ సర్టిఫికెట్ల ఆధారంగానే 50 మందికి పైగా ఆర్టీఏ కానిస్టేబుళ్లు పదోన్నతి పొందారు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులుమారినట్లు సమాచారం. -
జయలలిత కేసు విచారణ నేటికి వాయిదా
బెంగళూరు: అక్రమాస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసు విచారణను మంగళవారానికి వాయిదా పడింది. ఇక్కడి ప్రత్యేక కోర్టులో సోమవారం వాదనలు మొదలైన వెంటనే జయలలితపై తాను కేసు దాఖలు చేశానని, అందువల్ల ఈ కేసును వాదించేందుకు తనకు అనుమతివ్వాలంటూ న్యాయమూర్తి పి.ఆర్.కుమారస్వామిని సుబ్రహ్మణ్యస్వామి కోరారు. ఈ విషయాన్ని రాత పూర్వకంగా ఇవ్వాలని ఆయనకు న్యాయమూర్తి సూచించారు. అనంతరం జయలలిత తరుఫు న్యాయవాది పి.కుమార్ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను మంగళవారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. -
‘లింక్’ తేలుస్తాం
మెహ్దీ ల్యాప్‌టాప్‌లో ఉన్న వివరాలను సేకరిస్తున్నాం : పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి బెంగళూరు : ఐఎస్ఐఎస్ సంస్థ తరఫున ప్రచోదిత ట్వీట్లు నిర్వహిస్తున్న ఆరోపణలపై అరెస్ట్ అయిన మెహ్ది నుంచి సమాచారాన్ని సేకరించేందుకు గాను విచారణను వేగవంతం చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి వెల్లడించారు. మెహ్ది నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో ఉన్న సమాచారాన్ని తెలుసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. ఇందుకు గాను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సైతం వినియోగిస్తున్నట్లు చెప్పారు. మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెహ్ది ల్యాప్‌టాప్‌లో ఉన్న సమాచారాన్ని తెలుసుకున్న అనంతరం మెహ్దికి ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలున్నాయా లేదా అనే అంశంపై స్పష్టత వస్తుందని తెలిపారు. మెహ్ది పోలీస్ కస్టడీ ఈనెల 18తో ముగియనుందని, అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. అవసరమైతే మరికొన్ని రోజులు మెహ్దిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరుతామన్నారు. ట్విట్టర్ ద్వారా మెహ్ది ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నాడనే విషయమై ట్విట్టర్ సంస్థ వద్ద పూర్తి సమాచారం ఉందని, తాము నోటీసులు ఇచ్చిన తర్వాత సంస్థ ప్రతినిధులు తమకు అనుకూలంగా స్పందిస్తున్నారని వెల్లడించారు. ఇక మెహ్దిని స్వయంగా కమిషనర్ ఎంఎన్ రెడ్డి, జాయింట్ పోలీస్ కమిషనర్ హేమంత్ నింబాళ్కర్లే స్వయంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. నగరంలోని ఓ రహస్య ప్రదేశంలో మెహ్దీ విచారణ కొనసాగుతోందని తెలుస్తోంది. -
రుణాల స్వాహాపై విచారణ
నర్సీపట్నం ఆంధ్రా బ్యాంకు, చెట్టుపల్లి పీఏసీఎస్‌లో అక్రమాలపై ఆరా నర్సీపట్నం టౌన్ : ఆంధ్రా బ్యాంకు, ప్రాథమిక స హకార సంఘంలో జరిగిన అక్రమాలపై ఆర్డీవో కె.సూర్యారావు శుక్రవారం విచారణ నిర్వహించారు. ఆం ధ్రా బ్యాంక్ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధి తనయుడు కుమ్మక్కై రైతు రుణాల పేరిట కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనిని గతంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇందుకు పాల్పడిన బ్యాంకు మేనేజర్ బదిలీ కావడం, కొత్తగా వచ్చిన మేనేజర్ అక్రమాలపై దృష్టిసారించి సంబంధిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. ఈ అక్రమాలపై విచారణకు జిల్లా కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నర్సీపట్నం ఆంధ్రా బ్యాంకు, చెట్టుపల్లి ప్రాథమిక సహకార సంఘంలో విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కోటవురట్ల మండలం రాజుపేట సర్పంచ్ తనయుడు సూరిశెట్టి గంగాధర్ (బ్రాంచ్ పోస్టుమాస్టర్), భార్య సత్య సుజాత (అంగన్వాడీ సూపర్వైజర్) ఆంధ్రా బ్యాంక్ పాత మేనేజర్ ఆడమ్‌రాజు, ఫీల్డ్ ఆఫీసర్ రాజేశ్వర్‌రెడ్డి కుమ్మక్కై 152 మంది రైతుల రుణాల పేరిట రూ.38 లక్షలు కాజేశారని ప్రచారంలో ఉంది. దీంతో కొత్తగా వచ్చిన మేనేజర్ జయంతి శ్రీనివాసరావు ఈ వ్యవహారాన్ని బయటకు తీశారు. పై నలుగురిపై ఆయన ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశారు. ఇదిలావుండగా, చెట్టుపల్లి ప్రాథమిక సహకార సొసైటీలో రైతులకు తెలియకుండా సొసైటీ కార్యదర్శి పిట్టా చలపతి రూ.లక్షలు స్వాహా చేశాడు. దీనిపై కూడా కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ యువరాజ్ ఆదేశాలతో శుక్రవారం ఆర్డీవో కె.సూర్యారావు విచారణ చేపట్టారు. జరిగిన అక్రమాలపై అధికారుల సమాధానాలను, బాధితుల వ్యాజ్యాలను డెప్యూటీ తహశీల్దార్ ప్రసాద్, తహశీల్దార్ పార్వతీశ్వరరావు రికార్డు చేశారు. లోన్ల వ్యవహారంలో రుణమాఫీ పొందే అవకాశం ఏ మేరకు ఉంది, రుణమాఫీ ఆశించి కుంభకోణం జరిగిందా అనే విషయాలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారని ఆర్డీవో తెలిపారు. అప్పటి బ్యాంక్ మేనేజర్ ఎం.ఆడమ్‌రాజు, అప్పటి గ్రామీణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌రెడ్డి, గంగాధర్ శ్రీనివాస్, సత్య సుజాత ఈ వ్యవహారానికి పాల్పడినట్టు బ్యాంక్ మేనేజర్ జయంతి శ్రీనివాసరావు ఆర్డీవోకు వివరించారు. ఈ అంశంపై బ్యాంకు జోనల్ అధికారులు తనిఖీ చేసి అక్రమాలకు పాల్పడ్డ అధికారులను బదిలీ చేశారని, గంగధార్ శ్రీనివాస్, అతని భార్య సత్యసుజాత, సహకరించిన అధికారులపై పోలీసు కేసు నమోదు చేసినట్టు ఆర్డీవోకు తెలిపారు. చెట్టుపల్లి సొసైటీలో కూడా విచారణ చేపట్టి అధికారులు, బాధితుల నుంచి వివరాలు నమోదు చేశారు. -
ఇద్దరిపైనా విచారణ చేయించండి
నెల్లూరు (సెంట్రల్) : ఎటువంటి ఆధారాలు లేకుండా మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నాపై బురద చల్లే ఆలోచనలతో చేసిన విమర్శలపై సీబీఐ, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా ఇంకేదైనా దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురువారం లేఖ రాశారు. లేఖ సారాంశం..‘ఇటీవల మీ పార్టీకి చెందిన కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నాపై ఆరోపణలు చేశారు. నేను అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డానని, కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎండీతో కలిసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని నాపై ఆరోపణలు చేశారు. మా తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి మరణించిన తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి మీకందరికి తెలుసు. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాపైన, మొత్తం నా కుటుంబం పైనా కూడా విచారణ జరిపించండి. పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గతంలో హైదరాబాద్‌లోని నాచారంలో వెల్డింగ్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తుండేవారు. ఇతను ఉమ్మడి రాష్ట్రంలో చాలా జిల్లాలో అనేక మనీ స్కీంలు కార్యాలయాలు తెరచి అవినీతి, మోసాలు, అక్రమాలకు పాల్పడి ప్రజలను మోసం చేశారనే అభియోగాలు కూడా ఉన్నాయి. ఇతనిపై చాలా జిల్లాల్లో కోర్టుల్లో కేసులు కూడా నడిచాయి. ఇప్పటికీ కూడా కొన్ని కోర్టుల్లో ఇతనిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. అదే విధంగా ఘట్కేసరి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడనే ప్రచారం కూడా ఉంది. మీ పార్టీకి సంబంధించినకోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నాచారంలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నప్పుటి నుంచి ఇప్పటి వరకు అతనిపై కూడా విచారణ జరిపించండి.’ నేను కోరిన ప్రకారం నాపై ఏ సంస్థతోనైనా విచారణ జరిపించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అదే విధంగా మీ ఎమ్మెల్యేపై కూడా అదే సంస్థతో విచారణ చేయించండి. రాష్ట్రంలో మీ ప్రభుత్వం, కేంద్రంలో మీ మిత్రపక్షమైన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ విచారణలో నాపై ఏదైనా అవినీతి నిరూపించబడితే నేను ఎటువంటి శిక్షకైనా సిద్ధమని చంద్రబాబుకు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణకు రాసిన లేఖలో ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. -
బొగ్గు గనులకు పరిహారం అంచనాకు కమిటీ
న్యూఢిల్లీ: ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్న, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న బొగ్గు గనులకు చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని అంచనా వేసేందుకు మాజీ సీవీసీ ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బొగ్గు, ఇంధన, ఆర్థిక, న్యాయశాఖ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. నవంబర్ 10 కల్లా కమిటీ తన సిఫారసులను సమర్పిస్తుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బొగ్గు గనుల కేటారుుంపుల కుంభకోణంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత సెప్టెంబర్ 24న.. 1993-2009 మధ్యకాలంలో వివిధ కంపెనీలకు కేటారుుంచిన 204 బొగ్గు గనులను రద్దు చేస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో 37 ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్న గనులు కాగా, మరో 5 వచ్చే ఏప్రిల్ నాటికల్లా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నారుు. ఈ 42 గనులకు సంబంధించిన ఆస్తుల విలువను విడివిడిగా అంచనా వేయూల్సిందిగా కమిటీని ప్రభుత్వం ఆదేశించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. -
మైనర్‌పై అత్యాచార యత్నం
నిందితుడు పంచాయతీ కార్యదర్శి పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు నిర్భయ చట్టం కింద కేసు నమోదు మాకవరపాలెం: మాయమాటలతో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నించిన ఓ కార్యదర్శి చివరికి కటకటాలపాలయ్యాడు. ఇంటికి పిలిచి మోసగించేందుకు నిందితుడు చేసిన ప్రయత్నాన్ని పసిగట్టిన బాలిక తప్పించుకుని విషయం తల్లిదండ్రులకు చేరవేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాకవరపాలెం మండలం పెద్దిపాలెం పంచాయతీ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ రామారావు తెలిపిన వివరాలు ఇవీ. పెద్దిపాలెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న నర్సింగరావు స్థానికంగా నివాసముంటున్నాడు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలికను తన ఇంటికి పిలిచాడు. ఆమెకు ఎగ్‌పఫ్ ఇచ్చి తినమన్నాడు. అనంతరం నిన్ను పట్నం తీసుకు వెళ్తానని ఆశచూపి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ బాలిక తప్పించుకుని ఇంటికి పరుగుతీసింది. అన్నం కూడా తినకుండా రాత్రంతా ఏడుస్తూ కూర్చుంది. ఉదయం ఆమెను గమనించిన తండ్రి ఎందుకు ఏడుస్తున్నావంటూ ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. దీంతో కుమార్తెను తీసుకుని అతను స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన కార్యదర్శిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెద్దిపాలెంలో ఎస్ఐ విచారణ అత్యాచార యత్నంపై అందిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.రామారావు పెద్దిపాలెంలో విచారణ నిర్వహించారు. కార్యదర్శి ఉంటున్న ఇంటితోపాటు బాలిక ఇంటి చుట్టు పక్కల వారిని పిలిచి విచారణ చేశారు. వారు చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారు. కార్యదర్శిని అరెస్టు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
‘ఎంసెట్’పై వాదనలకు పదును
‘రెండో విడత కౌన్సెలింగ్’ అంశంపై 10న సుప్రీంకోర్టు విచారణ సానుకూల పరిస్థితులు ఉన్నాయంటున్న ఉన్నత విద్యామండలి వర్గాలు సమయాభావంతో ఈ ఏడాది ఈసెట్ కౌన్సెలింగ్ ఒక విడతతోనే పూర్తి హైదరాబాద్:ఎంసెట్ మలివిడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ఈ నెల పదో తేదీన సుప్రీంకోర్టు ముందు విచారణ జరగనుండడంతో తమవాదనలను వినిపించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాయత్తమవుతోంది. వేలాది మంది విద్యార్థులు, వందలాది కాలేజీలు మలివిడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సుప్రీం తీర్పు ప్రాధాన్యత సంతరించుకోనుంది. దాదాపు 70 వేల సీట్లు మిగిలి పోవడంతో పాటు తొలివిడతలో అవకాశాలు రాని వారు, అవకాశం వచ్చినా మలివిడతపై ఆశతో సీట్లలో చేరని వారు వేలాదిగా ఉన్నారు. వీటితో పాటు తెలంగాణ ప్రాంతంలో మొదటి విడతలో అవకాశం కోల్పోయిన 174 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. వాటికి షరతులతో ప్రవేశాలకు అవకాశం కల్పించారు.రెండో విడత కౌన్సెలింగ్ లేక వీరంతా నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారు. మలివిడతకోసం విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు, ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలుచేశాయి. ఇవి ఈ నెల 10న విచారణకు రానున్నాయి. వేలాది మంది విద్యార్థుల భవితవ్యం ఈ కౌన్సిలింగ్‌తో ముడిపడి ఉందని, అదే విధంగా వందలాది కాలేజీలు మూతపడే పరిస్థితి ఉందని.. కాబట్టి మలివిడతకు అవకాశం కల్పించాలని ఉన్నత విద్యామండలి నివేదించనుంది. ఇటీవల ఇరు రాష్ట్రాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లు అజయ్‌జైన్ (ఏపీ) శైలజారామయ్యర్ (తెలంగాణ)లు సుప్రీంకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై చర్చించారు. ఆమేరకు తమ న్యాయవాదులకు సుప్రీంకోర్టులో వినిపించాల్సిన వాదనలపై సూచనలు ఇచ్చారు. సమయాభావం వల్లే ... ఈసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఒక విడతతోనే అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచేశారు. మలివిడతకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించలేదు.ఈసెట్ ముందుగా పూర్తయిందని, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయి తరగతులు కూడా ప్రారంభమవడంతో రెండో విడతకు అవకాశం కల్పించలేదని ఉన్నత విద్యామండలి అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది సమయానుకూలంగా ఈసెట్‌లో తొలి, మలివిడతల కౌన్సెలింగ్‌లపై నిర్ణయిస్తామని చెప్పారు. -
నటి మైత్రేయితో ముఖ పరిచయమే
*మైత్రేయాతో సంబంధాలపై కార్తీక్ *పోలీసుల విచారణకు హాజరైన వైనం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వర్ధమాన నటి, మోడల్ మైత్రేయా గౌడ ఫిర్యాదుతో ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడ ఎట్టకేలకు శుక్రవారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. అత్యాచారం, వంచన ఆరోపణల కింద మైత్రేయా చేసిన ఫిర్యాదుపై ఇక్కడి ఆర్టీ నగర పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తునకు హాజరు కావాల్సిందిగా పోలీసులు రెండు సార్లు పంపిన సమన్లపై కార్తీక్ స్పందించక పోవడంతో ఇక్కడి ఎనిమిదో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. అనంతరం సిటీ సివిల్ కోర్టు అతనికి ముందుస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. మైత్రేయా చెబుతున్నట్లు, తాను ఆమెను అపహరించి అత్యాచారానికి పాల్పడలేదని దర్యాప్తు అధికారి, ఏసీపీ ఓంకారయ్యకు కార్తీక్ సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం. స్నేహితుల ద్వారా ఆమె పరిచయమైందని, మూడు, నాలుగు పార్టీల్లో మాట్లాడుకున్నామని, తర్వాత స్నేహంగా మారిందని వివరించారు. ఉదయం 6.15 గంటలకే ఆర్టీ నగర పోలీసు స్టేషన్‌కు వచ్చిన కార్తీక్, మైత్రేయా ఫిర్యాదుపై ఏసీపీ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంతరం అతనిని వైద్య పరీక్షల కోసం అంబేద్కర్ వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. తర్వాత మళ్లీ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు పరిచారు. మైత్రేయా ఫిర్యాదులోని సత్యాసత్యాలను కనుగొనడానికి ఏసీపీ అతనిని పలు విధాలుగా ప్రశ్నించారు. పసుపు కొమ్ముతో తాళి కట్టి కార్తీక్ తనను వివాహమాడాడని మైత్రేయా చేసిన ఫిర్యాదును కార్తీక్ తోసిపుచ్చారు. స్నేహితులుగా ఫోనులో మాట్లాడుకున్న విషయాలను రికార్టు చేసుకుని మైత్రేయా కట్టు కథలు అల్లుతోందని ఆరోపించారు. మంగళూరుకు పిలిపించుకున్నానని, తామిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మైత్రేయాను స్నేహితులకు పరిచయం చేశానని... ఆమె చెబుతున్నదంతా బూటకమేనని కార్తీక్ కొట్టి పారేసినట్లు తెలిసింది. కేంద్ర మంత్రిగా ఉన్న తన తండ్రిని రాజకీయంగా దెబ్బ తీయడానికి ప్రత్యర్థులు పన్నిన కుట్రలో మైత్రేయా పావుగా మారిందని ఆరోపించారు. స్నేహితురాలు కావడంతో పాటు సినీ నటి కనుక సహజంగానే ఆకర్షణ ఉంటుందని వివరణ ఇచ్చారు. తదుపరి దర్యాప్తునకు పిలిస్తే రావాలని సూచిస్తూ, దర్యాప్తు అధికారి అతనిని పంపించివేశారు. కాగా గత నెల 30న కొడగు జిల్లాలోని కుశాల నగరలో పారిశ్రామికవేత్త నాణయ్య కుమార్తె స్వాతితో కార్తీక్‌కు నిశ్చితార్థమైంది. వెనువెంటనే మైత్రేయా అతనిపై అపహరణ, అత్యాచారం, వంచన ఆరోపణల కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
చుండూరు కేసులో సుప్రీంకోర్టు స్టే
విడుదలైన నిందితులకు నోటీసులు న్యూఢిల్లీ: చుండూరు దళితుల హత్య కేసులో 123 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో దాఖ లైన అప్పీళ్లలో తదుపరి విచారణను సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. సుప్రీంకోర్టులో కేసు తేలేం త వరకు ఆ అప్పీళ్లపై విచారణ చేపట్టవద్దని సుప్రీంకోర్టు బుధవారం హైకోర్టును ఆదేశించిం ది. ఇదే సమయంలో హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించిన 56 మందికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై దాఖలైన అప్పీళ్లను ఎందుకు విచారణకు స్వీకరించరాదో.. ఆ తీర్పును ఎందుకు రద్దు చేయరాదో వివరించాలని ఆ 56 మందిని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ సి.నాగప్పలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 1991 ఆగస్టు 6న గుం టూరు జిల్లా, చుండూరులో ఎనిమిది మంది దళితులు ఊచకోతకు గురయ్యారు. దీనిపై సుదీర్ఘ విచారణ తరువాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనీస్ 2007 జూలై 31న తీర్పు వెలువరించారు. ఈ మొత్తం 179 నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. మిగిలిన వారిలో 21 మందికి యావజ్జీవం, మరో 35 మందికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించా రు. ఈ తీర్పులోని కొన్ని అంశాలపై సందేహాలను లేవనెత్తుతూ బాధిత కుటుంబాలు, అదే విధంగా శిక్ష పడిన 56 మంది తమ శిక్షను రద్దు చేయాలంటూ, నిర్దోషులుగా విడుదలైన వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిలో శిక్షపడిన వారు దాఖలు చేసిన అప్పీళ్లను విచారించిన హైకోర్టు.. 56 మంది శిక్షను రద్దు చేస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై అటు ప్రభుత్వం, ఇటు బాధితులు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. హైకోర్టు అసలు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద విచారణ చేపట్టలేదని, అందువల్ల ఆ చట్టం కింద కూడా విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలంటూ బాధితులు సుప్రీంకోర్టులో మరో అప్పీల్ దాఖలు చేశారు. ఇదే సమయంలో 123 మందిని నిర్దోషులుగా కింది కోర్టు ప్రకటించడంపై దాఖలైన అప్పీళ్లను విచారించకుండా హైకోర్టును ఆదేశించాలంటూ మరో అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మొత్తం 4 అప్పీళ్లను విచారిం చిన సుప్రీం.. పై ఆదేశాలు జారీ చేసింది. కాగా, చుండూరులో దళితుల ఊచకోత కేసులో నిందితులందరికీ ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద శిక్షలు విధించాలని సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు స్టే పట్ల ఏపీ దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు గుంటూరు జిల్లా పొన్నూరులో హర్షం వ్యక్తంచేశారు. -
అగస్టా మాతృసంస్థపై విచారణ నిలిపివేత
రోమ్: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో అగస్టావెస్ట్‌ల్యాండ్ కంపెనీ మాతృ సంస్థ ఫిన్మెకానికాపై విచారణను ప్రాసిక్యూటర్లు మంగళవారం నిలిపివేశారు. హెలికాప్టర్ల కొనుగోలు కోసం రూ.3,600 కోట్ల విలువైన ఒప్పందం వెనక భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు రాగా.. ఈ అవినీతి ఆరోపణలపై ఫిన్మెకానికా చేయాల్సింది ఏమీ లేదంటూ ప్రాసిక్యూటర్లు అభిప్రాయపడ్డారని ఈ మేరకు ఇటాలియన్ వార్తాసంస్థ ‘అన్సా’ వెల్లడించింది. -
‘బగ్గింగ్’ ఉత్తదే: కేంద్రం
గడ్కారీ నివాసంలో నిఘా పరికరాలు దొరకలేదు న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ నివాసంలో నిఘా పరికరాలు లభ్యమైనట్లు వచ్చిన వార్తలను హోంశాఖ ఖండించింది. ఇవన్నీ ఊహాగానాలని గడ్కారీ కూడా ఇప్పటికే తోసిపుచ్చారని, దీనిపై ఎలాంటి విచారణకు ఆదేశించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరన్ రిజ్జూ స్పష్టం చేశారు. గడ్కారీ స్వయంగా ఈ ఆరోపణలను ఖండించినందున ఇక ఇందులో తాము స్పందించటానికి ఏముందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం ప్రశ్నించా రు. తన నివాసంలో ఎక్కడా బగ్గింగ్ పరికరాలు దొరకలేదని గడ్కారీ పునరుద్ఘాటించారు. కాగా, ఈ అంశంపై విచారణ జరపాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. ‘ఇది మంత్రివర్గంలో కీలక వ్యక్తి భద్రతతో ముడిపడ్డ అంశం. ఆయనకే ఇలా జరిగితే దేశాన్ని భగవంతుడు కూడా రక్షించలేరు’ అన్నారు. ఇందులో ప్రధాని కార్యాలయం లేదా ఇతర శక్తుల ప్రమేయం ఉందేమో బహిర్గతం చేయాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. -
దళితుల ముంగిట న్యాయ దేవత
లక్ష్మీపేట(వంగర), న్యూస్‌లైన్:లక్ష్మీపేట దళితుల చిరకాల కోరిక నెరవేరింది. తమపై జరిగిన అమానుష దాడి ఘటనపై తమ సమక్షంలోనే విచారణ జరపాలన్న వారి డిమాండ్‌ను మన్నించి సాక్షాత్తు న్యాయదేవతే వారి ముంగిటికి వచ్చింది. ఇక న్యాయ ప్రక్రియ వేగం పుంజుకుంటుందన్న భరోసా కల్పించింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన 2012 జూన్ 12నాటి లక్ష్మీపేట దళితుల ఊచకోత కేసు విచారణకు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు శనివారం వంగర మండలం లక్ష్మీపేటలో ప్రారంభమైంది. హైకోర్టు పోర్టుఫోలియో జడ్జి ఏవీ శేషసాయి దీన్ని ప్రారంభించారు. కోర్టును ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం కోర్టు లోపలి భాగాన్ని పరిశీలించారు. కోర్టు లోపల విచారణను కూడా పర్యవేక్షించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయం ప్రజల ముంగిటికే వస్తోందని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం, చట్టాల ప్రకారం అందరికీ సహజ, సమాన న్యాయం అందజేయడమే న్యాయవ్యవస్థ లక్ష్యమని అన్నారు. చట్ట ప్రకారం లక్ష్మీపేట కేసు విచారణ జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలు మంచివారని కితాబిస్తూ.. జిల్లాలో కోర్టుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా జడ్జి డి.ఎస్.భానుమతి మాట్లాడుతూ లక్ష్మీపేటలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనమన్నారు. బాధితులకు ఈ కోర్టు ద్వారా న్యాయం జరుగుతందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులకు సకల సౌకర్యాలు:ఏజేసీ లక్ష్మీపేట ఘటనను జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుందని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్ఎస్ రాజ్‌కుమార్ అన్నారు. బాధితులైన దళితులను ఆదుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఘటనలో మృతి చెందిన ఐదుగురి కుటుంబాలకు రూ.18.75 లక్షలు, 19 మంది క్షతగాత్రులకు రూ. 22.08 లక్షల నష్టపరిహారం అందించామని చెప్పారు. ఐదు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 88 కుటుంబాలకు అంత్యోదయ అన్నయోజన కార్డులు, మిల్క్‌మిషన్ పథకం కింద పాడిగేదెలు మంజూరు చేశామన్నారు. బాధితులకు పునరావాసం, ఉపాధి హామీ పనుల కల్పన తదితర చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి సతీమణి దుర్గాంబ, లక్ష్మీపేట ప్రత్యేక కోర్టు ఇన్చార్జి జడ్జి బి.వెంకటేశ్వరరావు, జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి ఎన్.మలయాద్రి, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు వి.వెంకటరమణ, జిల్లా ఏఎస్పీ బీడీవీ సాగర్, పాలకొండ ఆర్డీవో తేజ్‌భరత్, జిల్లాలోని వివిధ కోర్టుల జడ్జిలు, బార్ అసోషియేషన్ల ప్రతినిధులు, న్యాయవాదులు. డీఎస్పీ దేవానంద్‌శాంతో, సోషల్ వెల్ఫేర్ డీడీ అచ్చుతానందగుప్త, ఎస్సీ కార్పొరేషన్ ఈఈ జగ్గారావు, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు, లక్ష్మీపేట బాధితులు పాల్గొన్నారు.