బొగ్గు గనులకు పరిహారం అంచనాకు కమిటీ
న్యూఢిల్లీ: ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్న, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న బొగ్గు గనులకు చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని అంచనా వేసేందుకు మాజీ సీవీసీ ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బొగ్గు, ఇంధన, ఆర్థిక, న్యాయశాఖ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. నవంబర్ 10 కల్లా కమిటీ తన సిఫారసులను సమర్పిస్తుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
బొగ్గు గనుల కేటారుుంపుల కుంభకోణంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత సెప్టెంబర్ 24న.. 1993-2009 మధ్యకాలంలో వివిధ కంపెనీలకు కేటారుుంచిన 204 బొగ్గు గనులను రద్దు చేస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో 37 ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్న గనులు కాగా, మరో 5 వచ్చే ఏప్రిల్ నాటికల్లా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నారుు. ఈ 42 గనులకు సంబంధించిన ఆస్తుల విలువను విడివిడిగా అంచనా వేయూల్సిందిగా కమిటీని ప్రభుత్వం ఆదేశించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.