The Supreme Court
-
‘ఆధార్ తప్పనిసరి’పై స్టే ఇవ్వలేం: సుప్రీం
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేష న్ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆధార్ గుర్తింపు లేదన్న కారణంతో ప్రజలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కోల్పోతారంటూ పిటిషనర్ వ్యక్తం చేసిన సందేహం ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై జడ్జీలు జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ‘కేవలం మీ సందేహాలపైనే ఉత్తర్వులు జారీ చేయలేం. పథకాల ప్రయోజనాలు కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే కోర్టు ముందుకు తీసుకురండి. సమస్య ఏంటో చెప్పండి’ అని పిటిషనర్లకు సూచించింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ఆధార్ లేకున్నా సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు తదితర గుర్తింపు కార్డులతో పథకాల లబ్ధి పొందవచ్చని విన్నవించారు. ఆధార్ లేకుండా పథకాల లబ్ధి పొందేందుకు గడువును సెప్టెంబర్ 30కి పొడిగించినట్లు వివరించారు. -
తలాక్‌పై సుప్రీంకోర్టులో రెండోరోజూ విచారణ
-
‘ట్రిపుల్ తలాక్’ చెత్త విధానం
-
‘ట్రిపుల్ తలాక్’ చెత్త విధానం
సుప్రీం కోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ: ముస్లిం సమాజంలో వివాహ రద్దుకు అనుసరిస్తున్న ట్రిపుల్ తలాక్ అత్యంత చెత్త, అవాంఛనీయ విధానమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ట్రిపుల్ తలాక్ చట్టబద్ధమేనని కొన్ని ఇస్లాం మత శాఖలు చెబుతున్నప్పటికీ అతి చెత్త విధానమని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం రెండో రోజు విచారణలో పేర్కొంది. ఈ అంశం న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదగింది కాదని, నిఖానామా ప్రకారం ట్రిపుల్ తలాక్‌ను తిరస్కరించే హక్కు మహిళలకు ఉందని కోర్టు సలహాదారు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నివేదించడంతో ధర్మాసనం పైవిధంగా స్పందించింది. ఈ తలాక్ విధానంపై నిషేధం ఉన్న ఇస్లామిక్, ఇస్లామిక్యేతర దేశాల జాబితాను రూపొందించాలని ఆయనను కోరింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, మొరాకో, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ట్రిపుల్ తలాక్‌కు అనుమతి లేదని ఖుర్షీద్ తెలిపారు. తలాక్ బాధితుల తరఫున న్యాయవాది రాం జెఠ్మలానీ వాదిస్తూ.. ఈ విధానం సమానత్వ హక్కుతోపాటు పలు రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమన్నారు. ‘ట్రిపుల్ తలాక్ చెప్పే అవకాశం భర్తకే ఉంది కానీ భార్యకు లేదు. ఇది రాజ్యాంగంలోని సమానత్వ హక్కును ఉల్లంఘించడమే. కాగా, ట్రిపుల్ తలాక్ మహిళల హక్కుల అంశమైనప్పటికీ.. సుప్రీం బెంచ్‌లో మహిళా జడ్జి లేకపోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలితా కుమారమంగళం ప్రశ్నించారు. -
తగని నిర్ణయం తీసుకుంటే ‘సుప్రీం’కు
సీఓఏ నిర్ణయం న్యూఢిల్లీ: ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎమ్)లో బీసీసీఐ భారత క్రికెట్ భవిష్యత్తుకు మింగుడు పడని నిర్ణయం తీసుకుంటే సుప్రీం కోర్టుకు వెళదామని పరిపాలక కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. దేశ క్రికెట్ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించాలని... అలా కాకుండా ప్రతిష్టకు పోయి ఏకపక్షంగా మొండివైఖరి అవలంభిస్తే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర సంఘాలకు రాసిన లేఖలో సీఓఏ హెచ్చరించింది. ‘బిగ్–3’ ఫార్ములాకు వ్యతిరేకంగా ఐసీసీ వ్యవహరించడంతో ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చే చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాలని బీసీసీఐలోని కొందరు పెద్దలు గట్టిగా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు ముందే తెలపాలని సీఓఏ సూచించిన సంగతి తెలిసిందే. ఐసీసీతో ఇంకా సంప్రదింపుల ప్రక్రియ ముగిసిపోలేదని ఏదేమైనా చర్చల ద్వారా సాధించుకోవాలని సీఓఏ భావిస్తోంది. దీనిపై ఆ లేఖలో పాయింట్ల వారిగా పలు అంశాలను ప్రస్తావించింది. లేఖలోని 13వ పాయింట్లో ‘మొత్తం భారత క్రికెట్ ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకునే నిర్ణయాలకు సీఓఏ మద్దతిస్తుంది’ అని స్పష్టం చేసింది. అయితే దీనికి విరుద్ధంగా ప్రయోజనాలను పక్కనబెట్టి కేవలం తమ ప్రతిష్టకు పోతే సహించమని... తప్పకుండా సుప్రీమ్ కోర్టును ఆశ్రయిస్తామని సీఓఏ హెచ్చరించింది. ఇందులో అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలను కోరతామని చెప్పింది. ఆదాయ పంపిణీపై ఐసీసీతో వైరం కాకుండా ముందుగా చర్చల ద్వారా పరిష్కారానికే ప్రాధాన్యమివ్వాలని 10వ పాయింట్లో ఉదహరించింది. మొండి పట్టుదలకు పోకుండా పట్టువిడుపులు ప్రదర్శించాలని సీఓఏ ఆ లేఖలో పేర్కొంది. ఎస్‌జీఎమ్‌లో ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా లోతైన కసరత్తు చేయాలని రాష్ట్ర సంఘాలకు సూచించింది. -
'రైతు ఆత్మహత్యలపై ఏం చేస్తారో చెప్పండి'
న్యూఢిల్లీ: అత్యంత తీవ్రమైన అంశంగా మారిన రైతు ఆత్మహత్యల నిరోధానికి ఏం చేస్తారో చెప్పాలని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. నాలుగు వారాల్లోగా ఈ నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. రైతులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణాలను అధ్యయనం చేసి, వాటిని నిరోధించడానికి ఒక పాలసీని తీసుకురావాలని సూచించారు. గుజరాత్లో రైతుల దీనిస్థితిపై ఓ ఎన్జీవో సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు అసలైన కారణాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన పాలసీని తీసుకొచ్చి అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరింది. అయితే, కేవలం గుజరాత్ అనే కాకుండా ఇది దేశం మొత్తానికి సంబంధించిన అంశం కావడంతో ఈ పిటిషన్ పరిధిని ధర్మాసనం విస్తరించింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ వాదనలు వినిపించారు. రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తోందని, అలాగే రుణాల మంజూరు, పంట నష్ట పరిహారం, బీమా పరిధిని పెంచినట్లు వివరించారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఒక నూతన పాలసీని తీసుకొస్తోందని తెలిపారు. న్యాయమూర్తులు స్పందిస్తూ.. వ్యవసాయ రంగం రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, కేంద్రం వాటికి తగిన సహకారం అందించాలని సూచించారు. అలాగే రైతు ఆత్మహత్యలకు గల ప్రధాన కారణాలను పరిష్కరించే విధానాలతో ముందుకు రావాలని ఆదేశించారు. -
స్పాన్సర్షిప్ కొనసాగించేది లేదు
స్టార్ ఇండియా గ్రూప్ స్పష్టీకరణ ముంబై: బీసీసీఐకి ప్రస్తుతం ఏదీ కలిసి రావడం లేదు. అటు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బలు.. ఐసీసీలో ఆధిపత్యం కోల్పోవడంతో పాటు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లి సేన దారుణ పరాజయం తెలిసిందే. దీనికి జతగా ఇప్పుడు టీమిండియా జెర్సీ హక్కుల కోసం తాము బరిలో ఉండడం లేదని ప్రస్తుత స్పాన్సరర్ స్టార్ గ్రూప్ తేల్చి చెప్పింది. ప్రస్తుతం బీసీసీఐ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, స్పష్టత కనిపించడం లేదని స్టార్ ఇండియా చైర్మన్ అండ్ సీఈవో ఉదయ్ శంకర్ అన్నారు. దేశవాళీ, గ్లోబల్ ప్రసార హక్కుల కోసం కూడా స్టార్ గ్రూప్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సహారా 12 ఏళ్ల ఒప్పందం తర్వాత 2013, డిసెంబర్లో భారత క్రికెట్ అధికారిక స్పాన్సరర్‌గా స్టార్ ఇండియా బిడ్ గెలుచుకుంది. దీంతో అప్పటి నుంచి ఆటగాళ్ల దుస్తులపై స్టార్ లోగో దర్శనమిస్తోంది. ఇందుకుగాను ద్వైపాక్షిక సిరీస్‌లో జరిగే మ్యాచ్‌కు దాదాపు రూ. 2 కోట్లు, ఐసీసీ టోర్నీల్లో రూ.61 లక్షలు బీసీసీఐకి ఇస్తోంది. ఈ నాలుగేళ్ల ఒప్పందం వచ్చే నెల మార్చి 31తో ముగుస్తుంది. కానీ మరోసారి టీమ్ స్పాన్సరర్ హక్కుల కోసం మాత్రం బరిలో ఉండే అవకాశం లేదని స్టార్ స్పష్టం చేసింది. ఈ దశలో టీమిండియాతో ముందుకెళ్లలేమని వివరించింది. -
ఇకపై చెల్లదు..
‘ప్రీయాక్టివేషన్’ దందాకు బ్రేక్! సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు సిమ్‌కార్డు తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి ‘ప్రీ పెయిడ్’ పక్కాగా అమలుకు ఆదేశాలు కేంద్రానికి ఏడాది గడువు ఇచ్చిన న్యాయస్థానం నగరంలో యథేచ్ఛగా లభిస్తున్న ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల దుర్వినియోగానికి మచ్చుతునకలివి. పోలీసు రికార్డుల్లోకి కొన్నే ఎక్కుతున్నా... బయటపడని ఉదంతాలు ఎన్నో ఉంటున్నాయి. నేరగాళ్ళతో పాటు అసాంఘికశక్తులు, ఉగ్రవాదులకు కలిసి వస్తున్న ఈ దందాకు ఇకపై చెక్ పడనుంది. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. – సాక్షి, సిటీబ్యూరో సినిమాపై మోజుతో సాయి, రవి, మోహన్ అనే యువకులు టెన్త్ క్లాస్ విద్యార్థి అభయ్‌ను కిడ్నాప్ చేయాలని పథకం వేశారు. బేగంబజార్ ప్రాంతం నుంచి రెండు ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డులు కొన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మరో రెండు ఖరీదు చేశారు. ఈ సిమ్స్ అన్నీ వేరే వ్యక్తుల పేర్లతో, గుర్తింపుతో ఉన్నవే. వీటిని వినియోగించే అభయ్ కుటుంబీకులతో బేరసారాలు చేశారు. ఆ కిడ్నాప్, హత్య కేసు దర్యాప్తు క్లిష్టంగా మారడానికి ఈ సిమ్కార్డులూ ఓ కారణమే. జేకేబీహెచ్ పేరుతో హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఐదుగురు ఉగ్రవాద అనుమానితుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు పట్టుకున్నారు. ఈ ముష్కరులు తమ కుట్రలు అమలు చేయడంలో భాగంగా సంప్రదింపులు జరుపుకునేందుకు ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల్నే ఆశ్రయించారు. ముఠాలో కీలకంగా వ్యవహరించిన ఫహద్ ఈ తరహాకు చెందిన తొమ్మిది సిమ్‌కార్డుల్ని చార్మినార్ బస్టాప్ ఎదురుగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఔట్లెట్లో ఖరీదు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఫీల్డ్ వెరిఫికేషన్‌నూ పక్కాగా చేయాల్సిందే.. కేవలం గుర్తింపులు తీసుకుని సిమ్కార్డ్స్ ఇచ్చే విధానం అమలైనా పూర్తి స్థాయి ఫలితాలు ఉండవన్నది పోలీసుల మాట. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బోగస్ ధ్రువీకరణల్ని తీసుకువచ్చే నేరగాళ్లు వాటి ఆధారంగా సిమ్‌కార్డుల్ని తేలిగ్గా పొందవచ్చని చెప్తున్నారు. ఈ దందాను అరికట్టాలంటే సిమ్‌కార్డ్ జారీ తర్వాత, యాక్టివేషన్‌కు ముందు సర్వీస్ ప్రొవైడర్లు కచ్చితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే విధానం ఉండాలని అభిప్రాయపడుతున్నారు. పోస్ట్‌పెయిడ్ కనెన్షన్ మాదిరిగానే ప్రీ–పెయిడ్‌ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తరవాత యాక్టివేట్ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయని వివరిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు వినియోగదారుడు అందించిన ఆధార్ కార్డ్ వివరాలు, పూర్వాపరాల ను తనిఖీ చేసే మెకానిజం ఆయా సర్వీస్ ప్రొవైడర్లు ఏర్పా టు చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు పట్టించుకోని ఔట్లెట్స్.. సెల్‌ఫోన్ వినియోగదారుడు ఏ సర్వీసు ప్రొవైడర్ నుంచి అయినా సిమ్‌కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సిమ్‌కార్డులు దుర్వినియోగం కాకుండా, నేరగాళ్లకు ఉపయుక్తంగా ఉండకూడదనే ఈ నిబంధనల్ని రూపొందించారు. ప్రస్తుతం నగరానికి చెందిన అనేక మంది సిమ్కార్డ్స్ రిటైలర్లు, తాత్కాలిక ఔట్లెట్ నిర్వాహకులు తమ దగ్గరకు సిమ్‌కార్డుల కోసం వచ్చే సాధారణ కస్టమర్ల నుంచి గుర్తింపులు తీసుకుని సిమ్‌కార్డు విక్రయిస్తున్నారు. పనిలో పనిగా వారికి తెలియకుండా స్కానింగ్, జిరాక్సు ద్వారా ఆయా గుర్తింపుల్ని పదుల సంఖ్యలో కాపీలు తీస్తున్నారని స్పష్టమవుతోంది. వీటి ఆధారంగా ఒక్కో వినియోగదారుడి పేరు మీద దాదాపు 100 నుంచి 150 సిమ్‌కార్డులు (కనెక్షన్లు) ముందే యాక్టివేట్ చేస్తున్నారు. ఇది డీఓటీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. నామ్‌కే వాస్తే చర్యలతో హడావుడి.. దేశ భద్రతను పెనుముప్పుగా మారడంతో పాటు నేరగాళ్లకు కలిసి వస్తున్న ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల వ్యాపారం నగరంలో జోరుగా సాగుతోంది. అభయ్ కేసులో నిందితుల్ని అరెస్టు చేసినప్పుడు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఆ వ్యవహారాలు సాగిస్తున్న వ్యక్తులు, ముఠాలపై స్పెషల్‌డ్రైవ్స్ చేపడతామనీ పేర్కొన్నారు. నాలుగైదు రోజుల పాటు శాంతిభద్రతల విభాగం అధికారులతో పాటు ప్రత్యేక విభాగాలూ రంగంలోకి దిగి, సెల్‌ఫోన్ దుకాణాలు, సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన తాత్కాలిక ఔట్‌లెట్స్‌లో వరుస తనిఖీలు చేశాయి. ఈ ‘స్పెషల్ డ్రైవ్’లో ఎంతమంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించారో తెలియదు కానీ... వారం రోజులకే ఈ విషయాన్ని మర్చిపోవడంతో అక్రమార్కులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అనారోగ్యకర పోటీ నేపథ్యంలో.. సర్వీసు ప్రొవైడర్ల మధ్య ఉన్న అనారోగ్యకర పోటీతో ఈ ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల దందా మరింత పెరిగింది. రిటైలర్లతో పాటు సిమ్‌కార్డుల డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ వ్యవహారాన్ని జోరుగా సాగిస్తుండటంతో అనామకులు, నేరగాళ్ల చేతికి సిమ్స్ చేరుతున్నాయి. రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చే సిమ్‌కార్డు దరఖాస్తులను పూర్తిస్థాయిలో సరిచూసి, అనుమానాస్పదమైన వాటి యాక్టివేషన్‌ను 24 గంటల్లో కట్ చేయాల్సిన బాధ్యత సర్వీస్ ప్రొవైడర్లపై ఉన్నప్పటికీ వారు కూడా పట్టించుకోకపోవడమేగాక, టార్గెట్లు ఇచ్చి మరీ ప్రీ–యాక్టివేటెడ్ కార్డులు విక్రయానికి ప్రోత్సహిస్తున్నారనే అనుమానం వ్యక్త మవుతున్నాయి. సర్వీసు ప్రొవైడర్ల మధ్య నెలకొన్న అనారోగ్యకర పోటీనే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏడాది గడువిచ్చిన సుప్రీం కోర్టు.. దేశంలో సిమ్‌కార్డుల దుర్వినియోగాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి మొబైల్ వినియోగదారులు గుర్తింపును కచ్చితంగా రిజిస్టర్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి స్పష్టం చేసింది. పోస్ట్ పెయిడ్తో పాటు ప్రధానంగా ప్రీ–పెయిడ్ కనెక్షన్లు ఇచ్చేందుకు, అవి కలిగి ఉన్న వారికి ఆధార్ నమోదు తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది. దుర్వినియోగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రీ–పెయిడ్ కనెక్షన్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేంద్రానికి ఏడాది గడువు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఈలోపు తమ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ప్రీ–యాక్టివేషన్ దందాకు పూర్తిస్థాయిలో చెక్ పడుతుందని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. -
ఆటగాళ్ల ఖర్చులకు డబ్బులివ్వని బోర్డు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోనే ధనవంతమైన క్రికెట్ బోర్డు... కానీ ప్రస్తుతం ఆటగాళ్ల రోజు ఖర్చులకు కూడా డబ్బులివ్వలేకపోతోంది. దీనికి రెండు కారణాలున్నాయి. కార్యదర్శి అజయ్ షిర్కేను సుప్రీంకోర్టు తప్పించడంతో చెక్‌లపై సంతకాలు చేసేవారు లేకపోవడం... నోట్ల రద్దు వల్ల పెద్ద మొత్తాన్ని విత్‌డ్రా చేయలేకపోవడం. దీంతో కుర్రాళ్లు తమ సొంత ఖర్చులతో మ్యాచ్‌లాడారు. ఈ జూనియర్ జట్టుకు కోచ్ అయిన దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సహా సహాయక సిబ్బంది అంతా వారివారి ఖర్చులతో సిరీస్‌ను నెట్టుకొచ్చారు. చివరకు నెగ్గుకొచ్చారు. నగదు, చెక్ చెల్లింపుల సమస్య నిజమేనని బీసీసీఐ అధికారులు అంగీకరించారు. అయితే సిరీస్ ముగిసిన తర్వాత ఒకేసారి చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. -
ఇక ఫాస్ట్‌ట్రాక్ విచారణ
సీజేఐ జేఎస్ ఖేహర్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న దాదాపు 61వేల కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ మోడ్‌లో పనిచేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ స్పష్టం చేశారు. పలు అంశాలపై వేసిన వ్యాజ్యాలను తొలగించబోమని ఆయన భరోసా ఇచ్చారు. ‘మేం ఫాస్ట్‌ట్రాక్‌లో పనిచేస్తాం. ఆందోళన వద్దు. ఏ వ్యాజ్యాన్నీ రద్దుచేసే ప్రసక్తే లేదు’ అని సీజేఐ జస్టిస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న 15 రోజుల్లోనే సామాజిక న్యాయానికి సంబంధించిన కేసుల వాదనలు వినే ధర్మాసనాన్ని జస్టిస్ ఖేహర్ పునరుద్ధరించారు. ఈ సామాజిక న్యాయ బెంచ్‌ను మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు 2014లో స్థాపించారు. కాగా, ఈ ధర్మాసనానికి జస్టిస్ మదన్ బీ లోకుర్ నాయకత్వం వహిస్తారు. ఈ బెంచ్ ప్రతి శుక్రవారం రెండు గంటలపాటు కూర్చుని.. ప్రజాపంపిణీ వ్యవస్థ మొదలుకుని కరువు పరిస్థితులు, కబేళాలు, రాత్రి ఆవాసాలు, ఆరోగ్యం, శుభ్రత, పిల్లల అక్రమ రవాణా వంటి కేసులను విచారించనుంది. -
మాకు సంబంధం లేని విషయం: విజయ్ గోయెల్
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులను సుప్రీం కోర్టు తొలగించడంపై స్పందించేందుకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయెల్ నిరాకరించారు. ఈ కేసులో తమకెలాంటి పాత్ర లేదని తేల్చారు. ‘సుప్రీం కోర్టు, బీసీసీఐ, అనురాగ్ ఠాకూర్ అంశంలో క్రీడా శాఖ పాత్ర ఏమీ లేదు. ఈకేసులో మా భాగస్వామ్యం లేదు. లోధా కమిటీ నిర్ణయాలతోనూ మాకు సంబంధం లేదు. ఇక స్పందించడానికి ఏముంటుంది’ అని తేల్చారు. మరోవైపు జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్‌ను మరింత మెరుగుపర్చేందుకు క్రీడా శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), దేశ అత్యున్నత న్యాయస్థానానికి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ‘సంఘర్షణ’కు ఎట్టకేలకు సంచలన తీర్పుతో తెర పడింది. క్రికెట్ ప్రక్షాళన కోసమంటూ చేసిన సిఫారసులను అమలు చేయమంటూ పదే పదే తాము చెప్పినా పట్టించుకోని బీసీసీఐపై సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది. సమస్యకు కారణంగా మారిన ‘మూల స్థంభాల’ను ఒక్క ఆదేశంతో కుప్పకూల్చింది. బోర్డు అధ్యక్షుడు ఠాకూర్, కార్యదర్శి షిర్కేలను పదవుల నుంచి తప్పించింది. ఒకవైపు లోధా కమిటీ సిఫారసులు అమలు చేయకుండా నాన్చుడు ధోరణి కనబరుస్తూ సర్వం తానేగా వ్యవహరించడంతోపాటు, మరోవైపు తన చర్యలతో సుప్రీం కోర్టుతోనే తలపడేందుకు సిద్ధపడిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చివరకు అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. ఆయనకు తోడుగా కార్యదర్శి అజయ్ షిర్కే కూడా అదే మార్గంలో బయటకు వెళ్లక తప్పలేదు. అనూహ్య పరిణామాల మధ్య ఇద్దరు ‘పెద్దలు’ తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐలో మున్ముందు వచ్చే మార్పులు ఆసక్తికరం. -
వెళ్లగొట్టారు...
బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులపై సుప్రీం కోర్టు వేటు ఠాకూర్, షిర్కేలను తప్పిస్తూ ఉత్తర్వులు లోధా కమిటీ సిఫారసులు అమలు చేయని ఫలితం అనర్హులైన ఇతర ఆఫీస్ బేరర్లూ ఇదే జాబితాలోకి! భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), దేశ అత్యున్నత న్యాయస్థానానికి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ‘సంఘర్షణ’కు ఎట్టకేలకు సంచలన తీర్పుతో తెర పడింది. క్రికెట్ ప్రక్షాళన కోసమంటూ చేసిన సిఫారసులను అమలు చేయమంటూ పదే పదే తాము చెప్పినా పట్టించుకోని బీసీసీఐపై సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది. సమస్యకు కారణంగా మారిన ‘మూల స్థంభాల’ను ఒక్క ఆదేశంతో కుప్పకూల్చింది. బోర్డు అధ్యక్షుడు ఠాకూర్, కార్యదర్శి షిర్కేలను పదవుల నుంచి తప్పించింది. ఒకవైపు లోధా కమిటీ సిఫారసులు అమలు చేయకుండా నాన్చుడు ధోరణి కనబరుస్తూ సర్వం తానేగా వ్యవహరించడంతోపాటు, మరోవైపు తన చర్యలతో సుప్రీం కోర్టుతోనే తలపడేందుకు సిద్ధపడిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చివరకు అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. ఆయనకు తోడుగా కార్యదర్శి అజయ్ షిర్కే కూడా అదే మార్గంలో బయటకు వెళ్లక తప్పలేదు. అనూహ్య పరిణామాల మధ్య ఇద్దరు ‘పెద్దలు’ తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐలో మున్ముందు వచ్చే మార్పులు ఆసక్తికరం. న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసులను అమలు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న బీసీసీఐకి భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘ కాలంగా సాగిన వాదప్రతివాదాలు, వాయిదాల అనంతరం సుప్రీం తన తీర్పును ప్రకటించింది. లోధా కమిటీ ప్రతిపాదించిన అన్ని అంశాలను ఇకపై బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, బోర్డు అనుబంధ సంఘాలు పాటించాల్సిందేనని, దానికి విరుద్ధంగా వ్యవహరించే వారు ఎవరైనా సరే పదవులు కోల్పోతారని సుప్రీం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి వారంతా హామీ పత్రం దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. చీఫ్ జస్టిస్ తీరథ్ సింగ్ (టీఎస్) ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. బీసీసీఐని నడిపించేందుకు కొత్త పరిపాలకులతో కూడిన కమిటీని సుప్రీం ఈ నెల 19న ప్రకటిస్తుంది. ఇందులో సభ్యుల కాగల అర్హత ఉన్నవారి పేర్లను ప్రతిపాదించాలంటూ ప్రభుత్వ న్యాయవాదులు గోపాల్ సుబ్రహ్మణియమ్, ఫాలీ ఎస్ నారిమన్‌లకు కోర్టు సూచించింది. అప్పటి వరకు మాత్రం బోర్డులో సీనియర్ ఉపాధ్యక్షుడు అయిన వ్యక్తి అధ్యక్షుడిగా, సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి కార్యదర్శిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే సీఈఓ హోదాలో రాహుల్ జోహ్రి ఇప్పటి కే రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. రెండేళ్ల తర్వాత... 2013 ఐపీఎల్ సందర్భంగా బయటపడ్డ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో దోషులకు శిక్షలు ఖరారు చేసే విషయంలో జనవరి 2015లో జస్టిస్ రాజేంద్ర మల్ (ఆర్ఎం) లోధా కమిటీ ఏర్పాటైంది. దీంతో పాటు బీసీసీఐ మరింత సమర్థంగా పని చేసేలా మార్పులు సూచించే బాధ్యత కూడా సుప్రీం కోర్టు ఈ కమిటీకే అప్పగించింది. ఏడాది తర్వాత 2016 జనవరిలో బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ లోధా కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. చర్చోపచర్చలు, వాదనల తర్వాత గత ఏడాది జులై 18న లోధా సూచించిన వాటిలో ఎక్కువ భాగం ప్రతిపాదలను ఆమోదించిన సుప్రీం కోర్టు వీటిని పాటించాల్సిందంటూ బోర్డును ఆదేశించింది. అయితే ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్నోసార్లు మళ్లీ మళ్లీ సమయం ఇచ్చినా కూడా బీసీసీఐ దీనిని పట్టించుకోలేదు. పైగా తమ రాష్ట్ర సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయంటూ లోధా కమిటీకి తగిన విధంగా సహకరించలేదు. అధ్యక్షుడు ఠాకూర్ అయితే తన మాటలు, చేతల్లో లెక్కలేనితనాన్ని ప్రదర్శించారు. ఇది సుప్రీంకు మరింత ఆగ్రహం తెప్పించింది. చివరకు ఈ పరిణామాలు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం కఠిన ఆదేశాలు జారీ చేసేందుకు దారి తీశాయి. మరోవైపు అసత్య ప్రమాణం చేసినందుకు, కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు తమపై ఎందుకు చర్య తీసుకోరాదో కూడా వివరణ ఇవ్వాలని కూడా ఠాకూర్, షిర్కేలను సుప్రీం ఆదేశించింది. నాకు ఇబ్బంది లేదు: షిర్కే సుప్రీం ఇచ్చిన తీర్పుతో కార్యదర్శి పదవిని కోల్పోవడాన్ని అజయ్ షిర్కే తేలిగ్గా తీసుకున్నారు. ‘దీనిపై ఏమని స్పందిస్తాం. నన్ను తప్పిస్తున్నట్లు సుప్రీం చెప్పింది కాబట్టి బోర్డులో నా పాత్ర ముగిసింది. ఈ పదవితో నాకేమీ వ్యక్తిగత అనుబంధం లేదు. సభ్యులకు మద్దతుగా నిలబడాలి కాబట్టి సిఫారసులు అంగీకరించలేకపోయాం. అప్పట్లో పదవి ఖాళీగా ఉండి నా అవసరం ఉండటంతో నన్ను తీసుకున్నారు. ఇప్పుడు వెళ్లిపోవడానికి ఎలాంటి బాధా లేదు. నేను చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ పరిణామాల వల్ల మున్ముందు ప్రపంచవ్యాప్తంగా మన దేశం పరువు పోకూడదని కోరుకుంటున్నా’ అని షిర్కే అన్నారు. రిటైర్డ్ జడ్జీలకు బెస్టాఫ్ లక్! వ్యంగ్యంగా స్పందించిన ఠాకూర్ సుప్రీం కోర్టుతో నేరుగా తలపడే సాహసం చేసి తన పదవిని పోగొట్టుకున్న అనురాగ్ ఠాకూర్ మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. తీర్పుపై స్పందిస్తూ ఆయన వ్యంగ్య రీతిలో వ్యాఖ్యానాలు చేశారు. ‘ఇది నా వ్యక్తిగత పోరు కాదు. ఒక క్రీడా సంఘం స్వతంత్రతకు సంబంధించిన అంశం. అందరు పౌరుల్లానే నేనూ సుప్రీం కోర్టును గౌరవిస్తాను. ఒకవేళ రిటైర్డ్ జడ్జీలు బీసీసీఐని సమర్థంగా నడిపిస్తారని సుప్రీం కోర్టు భావిస్తే వారికి బెస్టాఫ్ లక్ చెబుతున్నా. వారి నేతృత్వంలో భారత క్రికెట్ ఇంకా బాగుంటుందని నమ్ముతున్నా. సౌకర్యాలు, స్థాయి, క్రికెటర్లపరంగా చూసినా కూడా ప్రపంచంలోనే బీసీసీఐ అత్యుత్తమంగా నిర్వహించబడుతున్న సంస్థ’ అని ఠాకూర్ చెప్పారు. ► ‘నేను ఉత్తర్వుల పట్ల సంతృప్తిగా ఉన్నా. ఇకపై బోర్డు మళ్లీ సరైన దారిలో నడుస్తుందని ఆశిస్తున్నా’ – బిషన్ సింగ్ బేడి ► ‘సుప్రీం ఉత్తర్వులను బోర్డు అమలు చేయని ఫలితాన్ని ఇప్పుడు ఠాకూర్, షిర్కే అనుభవిస్తున్నారు’ – జస్టిస్ ముకుల్ ముద్గల్ ►‘ముంబై క్రికెట్‌కు ఇదో విషాదకరమైన రోజు. ముంబై ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను అందించింది. 41 సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటింగ్ హక్కు లేదనడం బాధాకరం’ – శరద్ పవార్ ► ‘సుప్రీంకోర్టు తీర్పు శిరోధార్యం. మేం పాటిం చాల్సిందే’ – నిరంజన్ షా -
బెల్టు మాటేంటి?!
గుడుంబా నిర్మూలనకు రంగంలోకి దిగిన అధికారులు అది జరిగినా బెల్టు దుకాణాలు ఉంటే ఫలితం సున్నా.. జిల్లాలో విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలు వెయ్యికి పైగానే ఉన్నట్లు అంచనా హన్మకొండ : గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపించే మద్యం బెల్టు దుకాణాలు వరంగల్ రూరల్ జిల్లాలో విచ్చలవిడిగా నడుస్తుంటే అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా జిల్లాలను గుడుంబా రహితంగా తీర్చిదిద్దేందుకు రంగంలోకి దిగిన అధికారులు బెల్టు షాపుల మాటెత్తకపోవడాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దినా బెల్టు షాపులు కొనసాగితే అధికారుల కృషికి ఫలితం ఉండకపోవచ్చు. అధికారికంగా 57 వైన్స్.. మూడు బార్లు వరంగల్ రూరల్ జిల్లాలోని 15మండలాల్లో 57 వైన్స్, మూడు బార్లు ఉన్నాయి. అయితే, వీటికి అనుబంధంగా జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి వరకు మద్యం అమ్మే బెల్టు దుకాణాలు ఉన్నట్లు అంచనా. ప్రధాన దుకాణాలకు సమానంగా ‘బెల్టు’ వ్యాపారం కొనసాగుతుందనేది బహిరంగ రహస్యం. కొన్ని గ్రామాల్లోనైతే బెల్టు దుకాణం నడపడం కొందరికి ఉపాధిగా మారిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణాభివృద్ధిపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే జిల్లాలోని అనేక గ్రామాల్లో మద్యం మత్తు కారణంగా, గుడుంబా ప్రభావంతో వందలాది కుటుంబాలు ఛిద్రమయ్యాయి. వివిధ గ్రామాల్లో మత్తుకు చిత్తై అనేక మంది మృతి చెందగా 80శాతం మంది వితంతువులే కనిపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గుడుంబా నిర్మూలనకు కమిటీలు మత్తు అనేక కుటుంబాలను చిత్తు చేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో గుడుంబా, నల్లబెల్లాన్ని సమూలంగా నిర్మూలించి గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 24న జిల్లా యంత్రాంగంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కమిటీలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో వరంగల్ పోలీసు కమిషనర్‌తో పాటు ఎక్సైజ్, రెవెన్యూ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 70 గ్రామాల్లో తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న గుగుంబా మహమ్మారిని తరిమివేయడంలో భాగంగా తయారీ, రవాణా, అమ్మకందారులపై నిఘా పెట్టాలని ఈ సమావేశంలో కలెక్టర్ ఆదేశించారు. అలాగే, నల్లబెల్లం రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ, మహిళాసంఘాలు, సాక్షరభారత్ కోఆర్డినేటర్లతో గ్రామాల్లో కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. గుడుంబా, నల్లబెల్లం దొరికితే పీడీ చట్టం కింద కేసులు పెట్టడంతో పాటు, రూ.లక్ష వరకు జరిమానా విధించాలని పోలీసులకు సూచించారు. అదేవిధంగా గుడుంబాపై ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబరుతో పాటు ప్రత్యేక వాట్సాప్ నంబరును నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశంలో తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నా... మద్యం షాపులకు సమాంతంగా నడుస్తున్న బెల్టు షాపుల నిరోధానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మద్యం దుకాణాల తరలింపు జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాలు, బార్లను వచ్చే మార్చి 30లోగా 500మీటర్ల లోపలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించారు. దీంతో రహదారుల వెంట ఉన్న షాపుల యజమానులకు ఆబ్కారీ అధికారులు తాజాగా జిల్లాలోని 21దుకాణాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రహదారుల పక్కన ఉన్న ఈ దుకాణాలను తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఎక్సైజ్ ఆబ్కారీ సూపరింటెండెంట్ తెలిపారు. అలాగే, ఎనిమిది కల్లు దుకాణాలను సైతం హైవేల పక్క నుంచి తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇంకా గుడుంబా రహిత జిల్లాగా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం బెల్టు షాపుల నిర్మూలన విషయమై కూడా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అయితే, దీనికి కూడా న్యాయస్థానాలే ఆదేశాలు జారీ చేయాలా అని వారు ప్రశ్నిస్తున్నారు. -
రాజ్యాంగ బెంచ్‌కు నోట్ల రద్దు
► 9 అంశాలపై విస్తృత ధర్మాసనం విచారణ జరపుతుందన్న సుప్రీం ► పాత నోట్ల వినియోగాన్ని పొడిగించాలన్న పిటిషన్ల తిరస్కరణ న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల రద్దు చేసిన రూ. 500, రూ. 1,000 నోట్లను ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే టికెట్లు, వినియోగ బిల్లుల చెల్లింపులకు అనుమతించాలన్న విజ్ఞప్తులను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ వినతులతో దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది. అలాగే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతను తేల్చే బాధ్యతను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఈ బెంచ్ మొత్తం 9 అంశాలపై విచారణ జరుపుతుందని తెలి పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 8న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వచ్చిన ఫిర్యాదులకు ఉన్న ప్రజా ప్రాముఖ్యత దృష్ట్యా ఈ అంశాన్ని విస్తృత బెంచ్‌కు అప్పగించడం సముచితమని భావిస్తున్నట్టు పేర్కొంది. ‘రద్దు చేసిన నోట్ల వినియోగాన్ని పొడిగింపుపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రమే సరైనది’ అని పేర్కొంది. ‘24 వేల విత్‌డ్రా’ను నెరవేర్చండి బ్యాంకుల్లో వారానికి విత్‌డ్రా పరిమితిని రూ. 24 వేలుగా నిర్ణయించినా.. బ్యాంకులు ఆ మొత్తాన్ని అందజేయడం లేదని, ఆ మొత్తాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని వచ్చిన పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. ప్రభుత్వం కోరిన 50 రోజుల గడువు ఇంకా ముగియలేదని, ఆ సమయానికల్లా నగదు చలామణి పెరుగుతుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పిన మాటలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటి వరకూ 40 శాతం పాతనోట్లను కొత్త రూ.2,000, రూ.500 నోట్లతో భర్తీ చేసినట్టుగా కేంద్రం చెప్పింది. వారానికి రూ. 24 వేల విత్‌డ్రా చేసుకోవచ్చన్న కేంద్రం ఆ హామీని నెరవేర్చాలని సూచించింది. హైకోర్టుల్లో నోట్ల రద్దు విచారణపై స్టే నోట్ల రద్దును సవాల్ చేస్తూ వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీం స్టే విధించింది. వీటన్నింటిని తామే విచారిస్తామంది. ఇకపై దీనికి సంబంధించిన రిట్ పిటిషన్లను ఇతర కోర్టు స్వీకరించరాదని పేర్కొంది. హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు అవసరమనుకుంటే తమను ఆశ్రయించవచ్చంది. అలాగే నవంబర్ 11 నుంచి 14 వరకూ దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లు స్వీకరించిన రూ.8,000 కోట్లను కొత్త కరెన్సీతో నిబంధనల మేరకు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న అటార్నీ జనరల్ హామీకి సుప్రీంకోర్టు అంగీకరించింది. -
విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల రిలే దీక్షలు
ఆదిలాబాద్ టౌన్ : విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రలోని విద్యుత్ శాఖ ఎస్ఈ కా ర్యాయలం ఎదుట ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల ట్రెడ్ యూ నియన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం చైర్మన్ వెంకటేశ్వర్లు మా ట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న జెఎల్ఎం, జెపీఏ, జూని యర్ అసిస్టెంట్, సబ్ ఇంజినీర్, వాచ్మెన్, డ్రైవర్ పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయాలని తెలిపారు. ఈపీఎఫ్ పొందుతున్న ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలుగా మార్చాలని అన్నారు. గతంలో కాంట్రాక్టు కార్మికులతో విద్యుత్ శాఖ మంత్రి చర్చలు జరిపిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలని అన్నారు. సంఘం కన్వీనర్ గోపాల్‌రావు, డివిజన్ చైర్మన్ రాజేశ్వర్, డివిజన్ కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు. దీక్షలు చేపట్టిన వారిలో నర్సింగరావు, చంద్రశేఖర్, ప్రేమ్‌కుమార్, ప్రసాద్, బాపురావు, సుభాష్, అజయ్, రామకృష్ణ, రవి, నిశ్కాంత్ ఉన్నారు. వీరికి పలువురు సంఘీభావం ప్రకటించారు. -
‘సుప్రీం’ ఆదేశించినా స్పందించలేదు: సంపత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో తెలపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందిచకపోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో ఈనెల 8లోపు చెప్పాలని సుప్రీంకోర్టు.. శాసనసభ స్పీకర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. అరుుతే ప్రభుత్వం మాత్రం సుప్రీం ఆదేశాలపై ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయలేదని చెప్పారు. రాజ్యాంగంపై ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో ఇది తెలియజేస్తోందని ఆరోపించారు. అత్యున్నత ధర్మాసనం ఆదేశించినా ప్రభుత్వం స్పందించకుండా అనైతిక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. -
పైసా కూడా ఇవ్వొద్దు
రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ నిధుల నిలిపివేత మ్యాచ్‌ల నిర్వహణకూ ఇవ్వరాదు ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు ‘లోధా’ సిఫారసులు అమలు చేసే వరకు ఇదే పరిస్థితి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆర్థిక స్వేచ్ఛకు దేశ అత్యున్నత న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది. గతంలో రెండు పెద్ద అకౌంట్ల కార్యకలాపాలను మాత్రమే నిలిపివేయాలన్న సుప్రీం కోర్టు... ఇప్పుడు నేరుగా రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఇచ్చే నిధులకే బ్రేక్ వేసింది. లోధా కమిటీ సిఫారసులు అమలు చేసే వరకు బీసీసీఐ ముందుకు వెళ్లలేని పరిస్థితి సృష్టించింది. రోజులు గడుస్తున్న కొద్దీ మరింత కఠినమైన ఆదేశాలు జారీ చేస్తున్న అత్యున్నత న్యాయ స్థానం ముందు ‘బలమైన’ బోర్డు ఇంకా ఎంత కాలం నిలవగలదో! న్యూఢిల్లీ: కొన్నాళ్ల క్రితం లోధా కమిటీ తమ రెండు అకౌంట్లను నిలిపివేసిన సమయంలో బీసీసీఐ తీవ్రంగా గగ్గోలు పెట్టింది. డబ్బులు లేకపోతే క్రికెట్ ఎలా, కివీస్‌తో సిరీస్ రద్దు చేస్తాం అంటూ బోర్డు బెదిరింపు ధోరణిలో మాట్లాడింది. అరుుతే తాము రాష్ట్ర సంఘాల నిధులను ఆపలేదని చివరకు లోధా కమిటీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు దానిని నిజం చేసింది. లోధా కమిటీ సిఫారసుల అమలు అంగీకరించే వరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు కూడా బీసీసీఐ నిధులు ఇవ్వరాదని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. బోర్డు అకౌంట్ల నుంచి రాష్ట్ర సంఘాలకు డబ్బులు బదిలీ కాకుండా నిలిపివేసింది. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులతో కూడిన బెంచ్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 17న వాదోపవాదనల అనంతరం తమ తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు శుక్రవారం దానిని ప్రకటించింది. మ్యాచ్‌లు నిర్వహించడం కోసం కూడా నిధులు అందించరాదని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. తాము లోధా కమిటీ సిఫారసలు అమలు చేస్తామంటూ రాష్ట్ర సంఘాలు రెండు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు సూచించింది. అప్పటి వరకు నిధుల బదిలీకి అవకాశం ఉండదు. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను నవంబర్ 3లోగా లోధా కమిటీ ముందు హాజరై సిఫారసులు అమలు చేసేందుకు తమకు ఎంత సమయం కావాలో చెబుతూ హామీ పత్రం దాఖలు చేయాలని కూడా సుప్రీం ఆదేశించింది. ఈ అంశంలో డిసెంబర్ 5న తదుపరి విచారణ జరుగుతుంది. ఆ నిధులు వాడరాదు... లోధా సిఫారసుల చర్చలో భాగంగా రాష్ట్ర సంఘాలను తాము నియంత్రించలేమని, వారు ముందుకు రాకపోవడం వల్లే తామూ నిర్ణయం తీసుకోలేకపోతున్నామంటూ బీసీసీఐ వాదనలు వినిపించింది. ఇప్పుడు అదే వాదనపై సుప్రీం దెబ్బ కొట్టింది. బోర్డు నుంచి నిధులు ఆపేయడం ద్వారా నేరుగా ఆయా సంఘాల ఉద్దేశాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. లోధా ప్రతిపాదనలు అమలు చేస్తేనే డబ్బులు వస్తారుు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర క్రికెట్ సంఘాలు కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో నిలిచారుు. ఆయా సంఘాలు తాము సిఫారసులు అమలు చేస్తున్నామంటూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. మరోవైపు త్వరలో మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉన్న 13 సంఘాలకు ఇప్పటికే బోర్డు నిధులు చేరారుు. అరుుతే దీనిపై కూడా సుప్రీం ఆంక్షలు విధించింది. సంస్కరణల అమలుపై హామీ ఇచ్చే వరకు ఆ డబ్బును ఖర్చు చేయరాదని కూడా ఆదేశించింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్ తర్వాత ఇంగ్లండ్ జట్టుతో మన జట్టు మ్యాచ్‌లు ఆడనుంది. మరోవైపు దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ కూడా కొనసాగుతోంది. స్వతంత్ర ఆడిటర్ నియామకం... మరోవైపు బీసీసీఐ వివిధ సంస్థలతో చేసుకునే ఒప్పందాలు, కాంట్రాక్ట్‌ల విషయంలో లోధా కమిటీకి సుప్రీం తగు సూచనలిచ్చింది. బోర్డు చేసుకునే కాంట్రాక్ట్ మొత్తాల విషయంలో ఏదైనా ఒక పరిమితి విధించాలని కోరింది. అంతకుమించి చేసే ఏ ఒప్పందమైనా కమిటీ ద్వారా మాత్రమే ఖరారు కావాలని చెప్పింది. ఈ నెల 25న ఐపీఎల్ ప్రసార హక్కులను బీసీసీఐ కేటారుుంచనుంది. ఈ నేపథ్యంలో ఆ భారీ ఒప్పందం విషయంలో బోర్డు ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరం. బోర్డు అకౌంట్లను పర్యవేక్షించేందుకు కమిటీ స్వతంత్ర ఆడిటర్‌ను నియమించాలని కూడా సుప్రీం ఆదేశించింది. ‘జులై 18నాటి తమ ఉత్తర్వులను అమలు చేసేందుకు ఏమేం చేయాలో సుప్రీం కోర్టు అదంతా చేస్తోంది. దీనిని బీసీసీఐ ఎంత వరకు పాటిస్తుందో చూడాలి. అనురాగ్ ఠాకూర్ వచ్చి చర్చిస్తానంటే మేం అందుకు సిద్ధంగా ఉన్నాం. గతంలోనూ ఆయనను ఆహ్వానించాం’ అని తాజా పరిణామాలపై జస్టిస్ లోధా వ్యాఖ్యానించారు. నాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. సుప్రీం ఉత్తర్వుల వల్ల క్రికెట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఇప్పుడే చెప్పలేను. తీర్పు కాపీ వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తాం. రాష్ట్ర సంఘాలతో ఈ అంశంపై చర్చించడం అన్నింటికంటే ముఖ్యం. సిఫారసుల అమలులో కొన్ని సమస్యలు ఉన్నారుు. వాటిని గతంలోనే కోర్టు ముందు ఉంచాం. -అనురాగ్ ఠాకూర్, బీసీసీఐ అధ్యక్షుడు -
అమలు చేస్తారా? తప్పించమంటారా?
-
అమలు చేస్తారా? తప్పించమంటారా?
లోధా కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాల్సిందే లేదంటే బోర్డులో అందరినీ మార్చేస్తాం బీసీసీఐకి నేటి వరకు గడువు నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా ప్రతిపాదనల అమలులో జాప్యం చేస్తున్న బీసీసీఐపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర స్థారుులో విరుచుకుపడింది. ‘సంస్కరణలను అమలు చేస్తారా? లేక మమ్మల్నే ఆదేశించమంటారా?’ అంటూ ప్రశ్నించింది. బేషరతుగా అన్ని ప్రతిపాదనలను అమలు చేయాల్సిందేనంటూ బోర్డుకు నేటి (శుక్రవారం) వరకు గడువునిచ్చింది. ఎటూ తేల్చుకోకుంటే తామే తుది తీర్పునిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో బీసీసీఐ వైఖరేమిటో కనుక్కోవాలని వారి కౌన్సిల్ కపిల్ సిబల్‌ను కోర్టు అడిగింది. అరుుతే వీటి అమలు కోసం ఆయన మరికొంత సమయం గడువు కోరినా కోర్టు తిరస్కరించింది. ‘అసలేం కావాలి మీకు? ప్రతిపాదనలు ఆమోదిస్తామని రేపటి కల్లా(శుక్రవారం) లిఖితపూర్వకంగా సమాధానమివ్వండి. లేకపోతే మేమే తుది తీర్పు ఇచ్చేస్తాం’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఘాటుగా హెచ్చరించారు. బీసీసీఐ నిర్లక్ష్య వైఖరిపై గత వారం లోధా కమిటీ ఇచ్చిన నివేదికపై గురువారం కోర్టులో ఈ విచారణ జరిగింది. అందరినీ తొలగిస్తాం.. బోర్డు ప్రక్షాళన కోసం లోధా కమిటీ ప్రతిపాదనల్లో కొన్నింటిని బీసీసీఐకి పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అందుకే తమ అభ్యంతరాలపై కోర్టులో మరోసారి వాదనలను వినిపించింది. అరుుతే అసలుకే మోసం వచ్చేలా పరిస్థితి మారింది. ఎట్టిపరిస్థితిల్లోనూ సంస్కరణలను నూటికి నూరు శాతం అమలు చేయాల్సిందేనని, లేని పక్షంలో ప్రస్తుతం కొనసాగుతున్న కార్యవర్గాన్ని, అధికారులందరినీ మార్చి బోర్డు నిర్వహణకు కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. కానీ తమిళనాడు సొసైటీల చట్టం ప్రకారం బీసీసీఐ నమోదైందని, దీని ప్రకారం వీటిని అమలు చేయాలంటే అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాల నుంచి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం ఉంటుందని సిబల్ వాదించారు. దీనికి జస్టిస్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ‘అసలు అన్ని సంఘాలను బీసీసీఐయే నడిపిస్తోంది. అదే ఇప్పుడు లోధా ప్రతిపాదనలకు అడ్డంకులను సృష్టిస్తోంది. వ్యతిరేకించే సంఘాలకు ఆర్థిక సహాయాన్ని నిలిపేయండి లేదా నిషేధించండి. అంతేకానీ మా సమయాన్ని వృథా చేయకండి. మెజారిటీయే అవసరమని మీరు భావిస్తే అమలు కోసం మేం ఆదేశాలు జారీ చేస్తాం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనూ కెప్టెన్‌నే... బీసీసీఐ ఆఫీస్ బేరర్ల అర్హత గురించి వచ్చిన చర్చ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనురాగ్ ఠాకూర్ క్రికెటర్ అరుుతే తాను కూడా క్రికెటర్‌నే అన్నారు. ‘బోర్డుకు ఎన్నికయ్యే ఆఫీస్ బేరర్లకు ఏమైనా ప్రత్యేక అర్హత ఉండాలా? బీసీసీఐ అధ్యక్షుడు రాజకీయ నాయకుడు కదా?’ అని కపిల్ సిబల్‌ను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అరుుతే అనురాగ్ ఠాకూర్ సీరియస్ క్రికెటర్ అని కపిల్ రెట్టించి చెప్పడంతో తానూ సుప్రీం కోర్టు జడ్జిల జట్టుకు కెప్టెన్‌నే అని జస్టిస్ ఠాకూర్ చెప్పారు. -
న్యాయమూర్తులకు ఆమాత్రం తెలియదా..!
బెంగళూరు : ‘కర్ణాటకలో ప్రజలకు కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, అలాంటి పరిస్థితిలో ఏడాదికి మూడు పంటలు పండించుకునే పరిస్థితుల్లో ఉన్న తమిళనాడుకు తాగడానికి నీరు లేదని చెబుతున్నారంటే న్యాయమూర్తులకు అసలే మాత్రమైనా తెలుసా అన్న అనుమానం కలుగుతోంది’ అని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ సుప్రీంకోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావేరి న దీ జలాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కావేరి నదీ జలాల పంపిణీ విషయంలో కర్ణాటకకు అన్యాయం జరిగింది. అయితే ఆవేశపూరితంగా, హింసాత్మకంగా నిరసనను తెలియజేయడం సరికాదు. నిరసన కార్యక్రమాలన్నీ శాంతియుతంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో కర్ణాటక తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఫాలి నారిమన్‌ను ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించడం వల్ల వచ్చే లాభం ఏదీ ఉండదు. ఫాలి నారిమన్‌కు కావేరి వివాదానికి సంబంధించిన పూర్తి విషయాలపై అవగాహన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను కాదని మరో వ్యక్తిని నియమిస్తే సమస్య మరింత ఆలస్యమవుతుంది’ అని దేవెగౌడ వివ రించారు. కార్యక్రమంలో జేడీఎస్ ఎంపీ సి.ఎస్.పుట్టరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘సుప్రీం’ ఆదేశాలు...మరణ శాసనమే
⇒భగ్గుమన్న కర్ణాటక ⇒మండ్య బంద్ విజయవంతం ⇒కేఆర్ఎస్ వద్ద నిషేధాజ్ఞలు ⇒ బెంగళూరు-మైసూరు, ⇒బెంగళూరు-చెన్నై బస్ సర్వీసులు నిలిపివేత = 9న కర్ణాటక బంద్‌కు పిలుపు బెంగళూరు: కావేరి నదీ జలాల వివాదం మరో సారి రాష్ట్రంలో భగ్గుమంది. కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేసేలా ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కావేరి నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ద్విసభ్య పీఠం విచారణను జరిపింది. ఇక సోమవారం ఇరు రాష్ట్రాల వాదనలను విన్న ధర్మాసనం రోజుకు 15 వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సిందిగా కర్ణాటకను ఆదేశించింది. తమిళనాడులో తాగేందుకు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని అందువల్ల, కావేరి నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు మండ్య, మైసూరు, హాసన్, హుబ్లీ, తుమకూరు, చామరాజన గర ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు కర్ణాటకలోని రైతుల పాలిట మరణశాసన మంటూ మండిపడ్డాయి. ఇక మండ్య ప్రాంతంలోని వివిధ కన్నడ సంఘాలు మంగళవారం మండ్య బంద్ నిర్వహించాయి. ఈ బంద్‌లో కన్నడ సంఘాలతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన డంతో బంద్ విజయవంతమైంది. మంగళవారం ఉదయం నుంచే మండ్య నగరంలోని రోడ్ల పైకి చేరుకున్న ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండ్య ప్రాంతంలో ఎమ్మెల్యే అంబరీష్ కటౌట్లను నిరసనకారులు ధ్వంసం చేశారు. ఇదే సందర్భంలో మండ్య మాజీ ఎంపీ రమ్యపై సైతం నిరసనకారులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మండ్య రైతుల ప్రయోజనాల కోసం తమ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం శోచనీయమంటూ నిరసనకారులు నినదించారు. ఇక ఇదే సందర్భంలో మండ్యలో నిరసనలు తీవ్రమవడంతో పాటు బంద్ పాటించిన నేపథ్యంలో బెంగళూరు నుంచి మైసూరు వెళ్లాల్సిన బస్ సర్వీసులన్నీ రద్దయ్యాయి. ఇదే సందర్భంలో బెంగళూరు-చెన్నై సర్వీసులను కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేఎస్ఆర్టీసీ రద్దు చేసింది. అంతేకాక తమిళనాడు నుంచి బెంగళూరుకు వచ్చే సర్వీసులను తమిళనాడు రోడ్డు రవాణా సంస్థ రద్దు చేయడంతో బెంగళూరు నుంచి చెన్నైతో పాటు తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. విధానసౌధ వద్ద కట్టుదిట్టమైన భద్రత... ఇక బెంగళూరులోని వివిధ కన్నడ సంఘాలు విధానసౌధ వద్ద నిరసన కార్యక్రమాలకు దిగుతున్న నేపథ్యంలో విధానసౌధ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. విధానసౌధ వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఒక డీసీపీ, ఒక ఏసీపీ, ఆరుగురు ఇన్స్పెక్టర్లు, 80 మంది కానిస్టేబుళ్లతో పాటు అదనపు బలగాలను విధానసౌధ భద్రత కోసం మోహరించారు. ఇక సీఎం అధికారిక నివాసం ‘కావేరి’ని సైతం కర్ణాటక రక్షణా వేదిక (కరవే) మహిళా కార్యకర్తలు ముట్టడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయరాదంటూ నినదించారు. సీఎం నివాసం ఎదుట ధర్నాకు దిగిన వారికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 9న కర్ణాటక బంద్... సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ కన్నడ సంఘాలన్నీ బంద్ నిర్వహించ తలపెట్టాయి. ఈనెల 9న కర్ణాటక బంద్‌కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. కన్నడ ఒక్కూటతో పాటు దాదాపు 800కు పైగా కన్నడ సంఘాలు బంద్‌లో పాల్గొననున్నాయి. ఇక ఈ బంద్‌కు రాష్ట్రంలోని వివిధ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు సైతం ఈ బంద్‌కు మద్దతు తెలపనున్నాయి. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని థియేటర్లలో తమిళ చిత్రాల ప్రదర్శనను సైతం రద్దు చేశారు. కేఆర్ఎస్ వద్ద మూడు రోజుల పాటు నిషేధాజ్ఞలు... కావేరి నదీ జలాల విషయమై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కృష్ణరాజసాగర రిజర్వాయర్ (కేఆర్ఎస్) వద్ద నిషేధాజ్ఞలను జారీ చేశారు. తమిళనాడుకు నీటిని విడుదల చేస్తే కేఆర్ఎస్ను ముట్టడిస్తామంటూ కన్నడ సంఘాలు హెచ్చరించిన నేపథ్యంలో మండ్య జిల్లా అధికారులు కేఆర్ఎస్ వద్ద మూడు రోజుల పాటు నిషేధాజ్ఞలు జారీ చేశారు. -
‘వేలూరు కోట’పై కోర్టుకు వెళ్తాం: ఒవైసీ
వేలూరు (తమిళనాడు): వేలూరు కోటలోని మసీదులో ప్రార్థనలు చేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్లు ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. వేలూరులో ఎంఐఎం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కోటలో ముస్లింలు ప్రార్థన చేయకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ముస్లింలకు 7 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభు త్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లింలు ఎంఐఎం ఆధ్వర్యంలో పోటీ చేసి తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. -
సుప్రీం కోర్టుకు వెళతాం: అసదుద్దీన్
తమిళనాడు వేలూరు కోటలోని మసీదులో ప్రార్థనలు చేసే విధంగా సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్లు పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ తెలిపారు. వేలూరులోని మండీ వీధిలో ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు ఏడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వేలూరు కోటలో పలు సంవత్సరాలుగా ముస్లింలు ప్రార్థన చేయకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని వీటిపై సుప్రీంకోర్టులో కేసు వేసి ముస్లింలకు న్యాయం చేస్తామన్నారు. ముస్లింలు రాజకీయ అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్కరూ ఏకమై పోరాటాలు చేస్తే రిజర్వేషన్‌ను తప్పక సాధించవచ్చన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లింలు ఎంఐఎం ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోను పోటీ చేసి తమ సత్తా చాటుకోవాలన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు లేక పోవడంతో అన్ని విభాగాల్లో వెనుకబడి పోతున్నారన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్‌పై మసూదా ఇచ్చామని అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్బాల్ మాట్లాడుతూ డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్య కేసులో నేటికి కాలయాపన జరుగుతోందని వీటిపై ముగింపు చర్యలు చేపట్టాలన్నారు. ఆమె ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జాయింట్ కార్యదర్శులు సయ్యద్ సవాలుద్దీన్, ఇంతియాస్, ముహమద్ షరీఫ్, కోశాధికారి మసుద్దీన్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ముహ్మద్ అల్తాఫ్, తదితరులు పాల్గొన్నారు. -
వీసీ సాంబయ్యకు మరో నెల ఊరట
తెయూ(డిచ్పల్లి) : సుప్రీం కోర్టు తీర్పుతో తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సాంబయ్యకు మరో నెల ఊరట లభించినట్లయింది. గత నెల 25న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు వీసీ లను నియమించింది. ఈ విషయమై హైకోర్టులో కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. అదే నెల 27న హైకోర్టు వీసీ ల నియామకాన్ని కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ప్రభుత్వ వినతి మేరకు తీర్పు అమలును నెల రోజుల పాటు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సోమవారం తెలంగాణలో వీసీ ల నియామకంలో యథాస్థితిని కొనసాగించాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు తీర్పును మరో నెల రోజుల పాటు వాయిదా వేసింది. ఒక వేళ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పుకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినట్లయితే తెయూ వీసీ సాంబయ్యతో పాటు మిగిలిన యూనివర్సిటీల వీసీ తమ పదవులను కోల్పోయేవారు. -
చెన్నమనేని పౌరసత్వంపై తేల్చండి: సుప్రీం
వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని మూడు నెలల్లోపు నిర్ధారిస్తూ హైకోర్టుకు తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం హైకోర్టు ఈ కేసును విచారణ చేపడుతుందని పేర్కొంది. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ప్రఫుల్లా సి.పంత్‌తో కూడిన ధర్మాసనం ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించింది. చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ గతంలో ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈపిటిషన్ను విచారించిన హైకోర్టు రమేశ్ ఎన్నిక చెల్లదని, ఆయన భారత పౌరుడు కాదని 2013లో తీర్పు ప్రకటించింది. చెన్నమనేని రమేశ్ సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఆయన తిరిగి 2014 ఎన్నికల్లో మళ్లీ వేములవాడ నుంచి గెలుపొందారు. అయితే హైకోర్టు ఇచ్చిన స్టే ను తొలగించాలని ఆది శ్రీనివాస్‌ను దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. గురువారం తుది విచారణ జరిపిన సుప్రీం కోర్టు కేంద్రం చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై మూడు నెలల్లో తేల్చాలని, ఆ నివేదికన హైకోర్టుకు సమర్పించాలని, హైకోర్టు విచారణ చేపడుతుందని ఆదేశాలు జారీచేసింది. -
'జీవో 123పై అప్పీల్ చేస్తే మేమూ ఇంప్లీడ్'
రాష్ర్టప్రభుత్వం జీవో 123 రద్దుపై హైకోర్టులో అప్పీల్ చేస్తే తాము కూడా ఇంప్లీడ్ అవుతామని సీపీఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. భూసేకరణ జీవోను కొట్టేసి హైకోర్టు వేసిన చెంపదెబ్బ నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ఆ తీర్పుపై అప్పీల్ చేస్తామని మంత్రి హరీష్‌రావు చెబుతున్నారన్నారు. అయితే ప్రభుత్వం, మంత్రి హరీష్‌రావు అప్పీల్ ప్రకటనను పక్కనపెట్టి హైకోర్టు లేవనెత్తిన ఆయా అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరించడం, పేదలకు కాకుండా పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని హైకోర్టు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. అయినా పేదలకు తాము వ్యతిరేకమన్న విధంగా ప్రభుత్వం ముందుకు సాగడం సరికాదన్నారు. -
బహిష్కరించినా విప్‌కు కట్టుబడాల్సిందే
పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తన తీర్పు పునస్సమీక్షకు నో అమర్‌సింగ్, జయప్రదల పిటిషన్ కొట్టివేత న్యూఢిల్లీ: ఒక రాజకీయ పార్టీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికైన లేదా నామినేట్ అయిన సభ్యుడు బహిష్కరణకు గురైనా కూడా అతను పార్టీ విప్‌కు కట్టుబడి ఉండాల్సిందేనని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి 1996లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీం కోర్టు బుధవారం నిరాకరించింది. ఈ తీర్పు ఇప్పటికీ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. 2010 ఫిబ్రవరి 2న రాజ్యసభ సభ్యుడైన అమర్‌సింగ్‌ను, లోక్‌సభ ఎంపీ అయిన జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించింది. 2012లో బిజూ జనతాదళ్ పార్టీ నుంచి ప్యారీమోహన్ మహాపాత్ర బహిష్కరణకు గురయ్యారు. వీరు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి 1996 నాటి తీర్పును పునస్సమీక్షించాలని కోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్.. పిటిషనర్ల పదవీకాలం ముగిసిందని, దీనిపై సుదీర్ఘ వాదనలు విన్నామని, ఈ ప్రశ్నకు ఇప్పుడు జవాబివ్వకపోవడమే సరైనదని పేర్కొంది. ఆ పిటిషన్లు ఇప్పుడు వ్యర్థమంటూ తోసిపుచ్చింది. అంతకుముందు జయప్రద, అమర్ల లాయర్లు వాదనలు వినిపిస్తూ.. 1996 నాటి జి.విశ్వనాథన్ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు తమకు వర్తించదని, తాము పార్టీకి రాజీనామా చేయలేదని, సొంత పార్టీ పెట్టుకోలేదని తెలిపారు. పార్టీకి రాజీనామా చేసిన వారికి లేదా పార్టీలో ఉండి విప్‌ను ధిక్కరించిన వారికే ఈ చట్టం వర్తిస్తుందన్నారు. పార్టీయే తమను బహిష్కరించింది కనుక ఏ పార్టీకీ చెందని సభ్యులుగా ఉంటామని, అందువల్ల పార్టీ విప్‌కు కట్టుబడాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు కేంద్రం ఒక పార్టీ నుంచి ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యుడు బహిష్కరణకు గురైనా కూడా అతను పార్టీ నియంత్రణలోనే ఉంటారని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. -
ఢిల్లీలో అమల్లోకి డీజిల్ క్యాబ్‌ల నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీలో డీజిల్ క్యాబ్‌లపై ఆదివారం నుంచి నిషేధం అమల్లోకి రావడంతో 27 వేల వాహనాలు రోడ్డెక్కలేదు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఆదివారం కావడంతో నిషేధం వల్ల ప్రజా రవాణాకు పెద్ద ఇబ్బంది లేకపోయినా... నేటి నుంచి క్యాబ్‌ల కొరత ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఇదే అదనుగా ఉబర్ క్యాబ్స్ చార్జీల్ని ఒక్కసారిగా పెంచేసింది. డీజిల్‌తో నడిచే క్యాబ్‌లను సీఎన్జీకి మార్చేందుకు గడువు పెంచాలన్న విజ్ఞప్తిని శనివారం సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. గత రెండు నెలల్లో 2 వేల ట్యాక్సీల్ని డీజిల్ నుంచి సీఎన్జీకి మార్చారు. -
యడ్డి కేసులపై ‘సుప్రీం’కు వెళ్తాం
బెంగళూరు: బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు యూడ్యరప్పపై ఉన్న 15 కేసులకు సంబంధించి సుప్రీం కోర్టుకు వెళ్లాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర తెలిపారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరఫున ఈ కేసుల విషయమై న్యాయవాది జోసెఫ్ అరిస్టాటిల్ వాదించనున్నారన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు తావు లేదని యడ్యూరప్పపై ఉన్న కేసులను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జయచంద్ర తెలిపారు. -
‘దారి’లో ‘దేవుడు’!
నగరంలో నడిరోడ్డుపై పలు ప్రార్థనా స్థలాలు అత్యధికం అనధికారికంగానే నిర్మితం తొలగింపులో అడుగడుగునా అడ్డంకులు సమష్టి కృషితోనే ఆశించిన ఫలితాలు ‘బహిరంగ ప్రదేశాల్లో అనధికారికంగా కొనసాగుతున్న ప్రార్థనా మందిరాలను తొలగిం చడమో... మరో ప్రదేశానికి తరలించడమో చేయాలి. రెండు వారాల్లో చర్యలు తీసుకోని పక్షంలో స్వయం గా కోర్టుకు హాజరుకావాల్సిదిగా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీ చేయాల్సి ఉంటుంది.’ - జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం చేసిన వ్యాఖ్యలివి. సిటీబ్యూరో: రాజధాని సైతం ఈ తరహా ప్రార్థనామందిరాలకు ఏమాత్రం అతీతం కాదు. ఎన్నో ఏళ్లుగా ఇవి అడుగడుగునా ట్రాఫిక్ అడ్డంకుల్ని సృష్టిస్తూనే ఉన్నాయి. ‘మెట్రో’ పనులతో పలు కీలక ప్రాంతాల్లో ఈ ఇబ్బందులు మరింతగా పెరిగాయి. సమస్య పరిష్కారానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగినా, పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించలేదు. తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి తెరమీదికి వచ్చింది. నగర ట్రాఫిక్ విభాగం గణాంకాల ప్రకారం నగరంలో ఈ తర హా ప్రార్థనా స్థలాలు 253 వరకు ఉన్నాయి. వీటికి తోడు మరికొన్ని ప్రాంతాల్లో స్మశానాలు అడ్డంకులుగా మారుతున్నాయి. ఫలక్నుమలో అత్యధికం ట్రాఫిక్ కమిషనరేట్‌లోని 25 ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో 253 ‘అక్రమ’ ప్రార్థనా స్థలాలు ఉండగా వాటిలో అత్యధికం ఫలక్నుమలోనే ఉన్నాయి. ఇక్కడ గరిష్టంగా 43 కొలువైనట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. చార్మినార్ పరిధిలో అతి తక్కువ ప్రార్థనాస్థలాలు ఉన్నాయి. కాగా ఇక్కడ కేవలం ఒకే ప్రార్థనా స్థలం ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా ఉంది. ఈ అక్రమ ప్రార్థనాస్థలాల్లో మసీదులు, చిల్లాలు, దర్గాలు 129, దేవాలయాలు 117, చర్చీలు 7 ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు తొలగింపు ప్రహసనమే... అనేక సందర్భాల్లో ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్న ప్రార్థనా స్థలాల తొలగింపు పెద్ద ప్రహసనంగా మారిపోయింది. నగరంలోని పరిస్థితుల నేపథ్యంలో దీనిని అత్యంత సున్నితమైన అంశంగా పరిగణించాల్సి వస్తోంది. గతంలో కోఠిలోని ఉమెన్స్ కాలేజీ బస్టాప్ వద్ద ఉన్న నల్లపోచమ్మ ఆలయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ‘తాకడం’తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో దర్గాల విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఫలితంగా వీటి విషయంపై మాట్లాడటానికే సంబంధిత అధికారులు పలుమార్లు ఆలోచించాల్సి ఉంది. అధికార యంత్రాంగం ఈ కోణంలో అడుగు వేయాలని ప్రయత్నించినా... అనేక రాజకీయాలు అడ్డం తగులుతున్నాయి. అంతా కలిసి ముందువెళితేనే... ఎన్నో ఏళ్లుగా నగరాన్ని వేధిస్తున్న ఈ సమస్యను పరిష్కరించి, అరుణాచల్‌ప్రదేశ్ తరహాలో భాగ్యనగరాన్నీ తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాలు, శాఖల అధికారులతో పాటు రాజకీయ వర్గాలు కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలు ఒకే చోట ఉన్నాయి. వీటి విషయంలో తరచూ ఎదురవుతున్న వాదన ‘ముందు వారిది తొలగించండి’. ఈ కారణంతోనే ఏళ్లుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. సాధారణ సమయాల్లో కంటే పర్వదినాలప్పుడు ఈ ఇబ్బందులు మరింత ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం ‘మెట్రో’ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సమస్య మరీ జఠిలంగా మారింది. ఉమ్మడి కమిటీలు ఏర్పాటు చేయాలి: నిపుణులు ఈ సమస్యను పరిష్కరించేందుకు ‘పీస్’ కమిటీల తరహా లోనే వివిధ వర్గాల పెద్దలతో కూడిన ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతాల వారీగా సాధారణ పౌరులు, అధికారుల, భిన్న వర్గాలకు చెందిన పెద్దలు, వ్యాపార యూనియన్ లీడర్లతో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. అంతా కలిసి సమావేశాలు ఏర్పా టు చేసుకుని సదరు ప్రార్థనా స్థలం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలపై క్షేత్రస్థాయిలో చర్చించాలని, పూ ర్తిగా తొలగించే విషయం కాకపోయినా కనీసం ఇబ్బందులు లేని స్థానాలకు మార్చేందుకు అందరినీ ఒప్పించగలిగితే ఈ సమస్య తీరుతుందని వారు పేర్కొంటున్నారు. అయితే ఎలాంటి వివాదం లేని ప్రత్యామ్నాయ స్థలాలను చూపడానికి జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. -
మా వాటా పోస్టుల భర్తీకి మేం సిద్ధం
గ్రూప్-1 పెండింగ్ కేసుపై ఏపీ నిర్ణయం తెలిపేందుకు రెండు వారాల గడువు కోరిన తెలంగాణ మే 3కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించడంపై తమ వైఖరిని తెలపాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇందుకు తమకు రెండు వారాల గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది విన్నవించగా అందుకు సమ్మతిస్తూ మే మూడో తేదీకి విచారణను వాయిదా వేసింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అనుసరించి ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించడం లేదని పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను, ఇదివరకే మౌఖిక పరీక్షలు కూడా పూర్తయినందున ఫలితాలు ప్రకటించాలని దాఖలైన ఇతర పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు విచారించింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా భాగస్వామిని చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కూడా విచారించింది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రేతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. గ్రూప్-1 పరీక్ష పునర్ నిర్వహణపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలను గత విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కోరింది. సోమవారం ఈ విషయాన్ని మరోసారి ధర్మాసనం ప్రస్తావించగా పరీక్షల నిర్వహణపై తమ వైఖరి వెల్లడించేందుకు మరో రెండు వారాల గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టును కోరింది. కాగా రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కోటాలో వచ్చిన ఖాళీలను భర్తీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ న్యాయస్థానానికి నివేదించారు. పూర్తి స్థాయి వాదనలు వినాలి ఏపీపీఎస్సీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేసుకుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 పునర్ నిర్వహణకు ఉమ్మడి సర్వీసు కమిషన్ ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడిన ధర్మాసనం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో సిలబస్‌లో వచ్చిన మార్పులపై ఆరా తీసింది. ‘రాష్ట్ర విభజన అనంతరం గ్రూప్-1 పరీక్షలో సిలబస్‌తో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును సైతం పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశంపై పూర్తిస్థాయి వాదనలు వినాల్సిన అవసరం ఉంది..’ అని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. విచారణను మే 3వ తేదీకి వాయిదా వేశారు. 2011లో ఏపీపీఎస్సీ 312 ఖాళీలను భర్తీ చేసేందుకు పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో తప్పులు దొర్లిన అంశంపై అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని 2013లో సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశం పెండింగ్‌లో ఉండటంతో అభ్యర్థులు తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. -
‘నీట్’ పరీక్షపై విచారణ వాయిదా
వైద్య విద్య ప్రవేశ పరీక్షల కోసం జాతీయ వైద్యమండలి ప్రతిపాదించిన నీట్ పరీక్షపై విచారణను సుప్రీం కోర్టు వచ్చే నెల ఏడో తేదీకి వాయిదా వేసింది. మార్చి 31 నాటికి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘానికి నిర్ధేశించింది. తదుపరి నాలుగు రోజుల్లో ప్రతిస్పందనలు ఇవ్వాలని జాతీయ వైద్య మండలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
రాజ్యాంగం తల్లితో సమానం
సుప్రీం కోర్టు న్యాయమూర్తి గోపాలగౌడు అట్టహాసంగా ఐలు రాష్ట్ర 10వ మహాసభలు ప్రారంభం కర్నూలు(లీగల్): భారత రాజ్యాంగం ప్రజలకు తల్లితో సమానమని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడు అన్నారు. జిల్లాలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) రాష్ట్ర 10వ మహాసభలు శనివారం కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ప్రారంభమయ్యాయి. ఐలు రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సభలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు రిజర్వేషన్లలో 33 శాతం మాత్రమే కల్పించడం సమంజసమా? అని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాలకు మానవతా విలువలు, నీతి, న్యాయం, సామాజిక స్పృహతో కూడిన విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ, మైనార్టీ ప్రజలు అనే తేడా ఉండదని, రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసేలా ఉండాలన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చట్టాలు న్యాయపాలన అనే అంశంపై జూనియర్ న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. ఇలాంటి సెమినార్లతో ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం జూనియర్లకు కలుగుతుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత మాట్లాడుతూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే సమయంలో ఐలు నిర్వహించిన శిక్షణ శిబిరం తాను న్యాయమూర్తిగా ఎంపిక అయ్యేందుకు దోహదపడిందన్నారు. ఏపీ రాష్ట్ర ఐలు అధ్యక్షుడు ఎస్.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ న్యాయవాద సమస్యలు, సంక్షేమంతో పాటు వృత్తి పరిరక్షణకై సంఘం నిరంతరం కృషి చేసుందన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేసే విధంగా న్యాయమూర్తులు కృషి చేయాలని కోరారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు స్టైఫండ్, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ కర్నూలు న్యాయవాదులకు నూతన కార్యాలయ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐలు జాతీయ అధ్యక్షులు బట్టాచార్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు, కర్ణాటక, తెలంగాణ ఐలు నాయకులు నారాయణస్వామి, కోటేశ్వరరావు, కొల్లి సత్యనారాయణ, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా, జిల్లా జడ్జిలు ప్రేమావతి, రఘురామ్, శేషుబాబు, కె.సుధాకర్, సబ్ జడ్జిలు సోమశేఖర్, శివకుమార్, గాయత్రిదేవి, జూనియర్ సివిల్ జడ్జిలు రామచంద్రుడు, బాబు, స్వప్నారాణి, పి.రాజు, జిల్లా ఐలు నాయకులు పి.వెంకటస్వామి, పి.నిర్మల, కె.కుమార్, రవి, లక్ష్మణ్, తిరుపతమ్మ, న్యాయ వాదులు పాల్గొన్నారు. -
నేడు బీసీసీఐ ఎస్జీఎం
జస్టిస్ లోధా కమిటీ నివేదికపై చర్చ ముంబై: జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదనల అమలుపై చర్చించేందుకు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) శుక్రవారం జరగనుంది. కమిటీ నివేదికను అమలు చేసే విషయంలో స్పష్టతనిచ్చేందుకు మార్చి 3 వరకు సుప్రీం కోర్టు బోర్డుకు గడువునిచ్చింది. బీసీసీఐలోని అధికారుల గరిష్ట వయస్సు 70 ఏళ్లు, ఒక రాష్ట్రానికి ఒక ఓటుతో పాటు ఆఫీస్ బేరర్లుగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులను దూరంగా ఉంచాలని కమిటీ కీలక ప్రతిపాదనలను చేసిన విషయం తెలిసిందే. ఈ నెలారంభంలో తమ న్యాయ కమిటీ సమావేశం అనంతరం బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఎస్జీఎం ఏర్పాటుకు నిర్ణయించారు. దీంట్లోని కొన్ని సూచనలు అమలుకు సాధ్యం కాకుండా ఉన్నాయని, ఇందుకోసం నిపుణుల అభిప్రాయం తీసుకోవాలనే ఆలోచనలో బోర్డు ఉంది. మరోవైపు ఐసీసీ సభ్యదేశాల ఆర్థిక పరిస్థితిపై కూడా ఎస్‌జీఎంలో చర్చించనున్నారు. శ్రీనివాసన్ హయాంలో మూడు దేశాల (భారత్, ఆసీస్, ఇంగ్లండ్)కు ఇచ్చిన సూపర్ పవర్‌ను ప్రస్తుత ఐసీసీ చైర్మన్‌గా ఉన్న శశాంక్ తొలగించారు. న్యాయ సలహా తీసుకుంటా..: హర్భజన్ వివిధ రాష్ట్ర జట్లకు ‘భజ్జీ స్పోర్ట్స్’ పేరిట కిట్స్‌ను సరఫరా చేస్తున్న హర్భజన్ పరస్పర విరుద్ధ ప్రయోజాలనాలకు పాల్పడుతున్నట్టు బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఏపీ షా తేల్చడంపై న్యాయ సలహా తీసుకుంటానని స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపారు. ‘బోర్డు నుంచి ఈ విషయంలో ఈమెయిల్ అందింది. మా న్యాయ సలహాదారునితో అన్ని విషయాలను చర్చించిన అనంతరం ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచిస్తా’ అని హర్భజన్ తెలిపాడు. సామాజిక కార్యకర్త నీరజ్ గుండే లేవనెత్తిన అంశాలపై షా విచారణ చేపట్టారు. మరోవైపు ఈ కంపెనీ భజ్జీ తల్లి అవతార్ కౌర్ పేరిట నడుస్తోంది. -
దేశం మార్కు... అతిక్రమణ!
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన రహదారుల మధ్యలో పైలాన్ల నిర్మాణం సీఎం చంద్రబాబు కార్యక్రమానికి ప్రాధాన్యం చిలకలూరిపేటలో అధికారుల అత్యుత్సాహం సాక్షి ప్రతినిధి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని విజయవంతం చేసే ఆరాటంలో జిల్లా యంత్రాంగం సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోవడం లేదు. ఈ నెల 18న చిలకలూరిపేట నియోజకవర్గంలోని కార్యక్రమాలకు హాజరుకానున్న సీఎంను మరింత సంతృప్తి పరిచేందుకు అనుమతులు లేని ఆర్భాటాలకు తెరతీశారు. రహదారులు, ప్రధాన కూడలి ప్రాంతాల్లో విగ్రహాలు, పైలాన్ల నిర్మాణాలు చేపట్టకూడదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించి, హడావుడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో జరగనున్న ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’అనే రీతిలో ఇద్దరి ప్రశంసలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హడావుడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులను కూడా సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు భిన్నంగా వ్యవహరించే వ్యక్తులుగా మార్చేస్తున్నారు. వివరాలు ఇవి.... 2012లో సుప్రీం తీర్పు .....రహదారులు, కూడలి ప్రాంతాల్లో విగ్రహాలు, ఇతర కట్టడాల నిర్మాణాల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని 2006 లో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై రహదారులు, కూడలి ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు 2012లో తీర్పునిచ్చింది. దీని ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ అన్ని ప్రభుత్వశాఖలకు 2013 ఫిబ్రవరి 18న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని రహదారులు, కూడలి ప్రాంతాలు, పేవ్మెంట్లకు సమీపంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని పేర్కొన్నారు. ఇటువంటి నిర్మాణాలు చేపట్టడానికి ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల్లోని అంశాలను జిల్లా స్థాయి అధికారులకు అందే విధంగా చేయడంతోపాటు వాటిని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడిలా.... రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గానికి ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద నిర్మించనున్న గృహ సముదాయంతో పాటు రూ. 10 కోట్లతో టౌన్‌హాలు, రూ.11 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ. 143 కోట్లతో అమృత పథకం కింద మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన, రూ. 4 కోట్లతో స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. ఇంకా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనచేస్తారు. రూ. 2 కోట్లతో నిర్మించిన అర్బన్ మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ మూడు పైలాన్లు నిర్మిస్తున్నారు. రహదారులు, ప్రధాన కూడలి ప్రాంతాల్లో వీటిని నిర్మించరాదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించారు. మూడు సెంటర్లలో అధికారులు భారీ ఎత్తున పైలాన్లను నిర్మిస్తున్నారు. నరసరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పీ కెనాల్స్ కార్యాలయ ప్రాంగణంలో రూ. 10 లక్షలు అంచనా వ్యయంతో ఒకటి, ఎన్ఆర్టీ సెంటర్ (అమృత్ పథకం తాలూకు)లో, పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు సెంటర్(స్వచ్ఛాంధ్ర పథకం తాలుకు)లో పైలాన్లు నిర్మిస్తున్నారు. ఈ మూడింటిలో రెండు పైలాన్లు జాతీయ రహదారుల మధ్యలోనే నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం ద్వారా సుప్రీంకోర్టు ఉత్తర్వులనుఅధికారులుధిక్కరించారనేవిమర్శలుబాహాటంగావినపడుతున్నాయి. ఆర్భాటపు పైలాన్లు .... ప్రతి పనికి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొంటున్నప్పటికీ, అధికారులు ఆ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మూడు పైలాన్ల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించకుండా ఒక్కోదానిపై రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. రూ.5 లక్షలకు మించిన పనులకు టెండర్లు ఆహ్వానించాలనే నిబంధన ఉన్నప్పటికీ, నామినేషన్ పద్ధతిపై పైలాన్ నిర్మాణాలను ఓ కాంట్రాక్టరుకు అప్పగించారు. -
మళ్లీ వస్తా!
పై స్థాయిలో ఆశీస్సులు ఉన్నాయంటూ ప్రచారం ఆయన హయాంలో పలు అవినీతి ఆరోపణలు కొత్త అధికారి వస్తే బయటపడుతుందేమోనని ఆందోళన సిబ్బంది నోరు మెదపకుండా ముందస్తు జాగ్రత్త కర్నూలు: సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ)లో గతంలో పనిచేసిన అధికారి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మళ్లీ ఎస్ఎస్ఏ అధికారిగా తానే వస్తానంటూ అక్కడి ఉద్యోగుల వద్ద చేస్తున్న వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఇందుకోసం తనకు పైస్థాయిలో ఆశీస్సులు కూడా ఉన్నాయని ఆయన చెప్పుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన అధికారి మొదట్లో విధుల్లో చేరకుండా అడ్డుకోగలిగానని కూడా ఆయన వ్యాఖ్యానిస్తుండటం చర్చకు దారితీస్తోంది. రెండు నెలల్లోగా తానే మళ్లీ అధికారిగా వస్తానని ఆయన నిర్దిష్ట సమయాన్ని కూడా చెబుతుండటం దుమారం రేపుతోంది. ఇదే సమయంలో ఎస్ఎస్ఏ వ్యవహారాలపై ఆరోపణలు రావడం కూడా చర్చనీయాంశమవుతోంది . అన్నీ ఆరోపణలే.. వాస్తవానికి ఎస్ఎస్ఏ వ్యవహారంలో మొదటి నుంచీ ఆరోపణల పర్వం కొనసాగుతోంది. అధికారుల పుణ్యమా అని 2015-16 ఆర్థిక సంవత్సరంలో అదనపు తరగతుల నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఇందుకు కారణం 2014-15లో కేంద్రం మంజూరు చేసిన నిధులన్నీ ఖర్చు చేయకపోవడమే. దీంతో పాటుగా జిల్లాలో పాఠశాలన్నింటిలోనూ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామని ప్రభుత్వానికి ఎస్ఎస్ఏ అధికారులు నివేదించారు. అదేవిధంగా కేవలం ఈ విద్యా సంవత్సరంలో 700 పైచిలుకు పాఠశాలల్లోని మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించామని బిల్లులు కూడా చూపించారు. అయితే, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తాజాగా జిల్లాలో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ పర్యటించిన సందర్భంలోనూ ఇదే విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో కొత్త అధికారి రావడంతో తాను చేసిన మొత్తం వ్యవహారాలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న అనుమానం గతంలో పనిచేసిన అధికారికి కలుగుతోందని సమాచారం. -
హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి జరిమానా
పరిగి: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా వేస్తామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎస్ఐ నగేష్‌తో కలిసి శనివారం ఆయన వాహనాల తనిఖీ నిర్వహించారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహన చోదకులకు జరిమానా విధించారు. హెల్మెట్ వాడకం, టూ వీలర్ ప్రమాదాల పెరుగుదల నేపథ్యంలో ఇటీవల ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించ డంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రమాదాలను నివారించే చర్యలపై దృష్టి సారించాలని ఆర్టీఏ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆ శాఖ అధికారులు హెల్మెట్ వాడకాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో టూ వీలర్లు ఢీకొని, జారి కిందపడి మృత్యువాత పడుతున్న సంఘటనలు కోకొల్లలుగా మారాయని.. ఇందులో కేవలం హెల్మెట్ లేని కారణంగానే 90 శాతం మృత్యు ఒడికి చేరుతున్నారని అన్నారు. ఇప్పటివరకు 70 శాతం మంది హెల్మెట్లు కొంటున్నా వారిలో 10 శాతం మంది కూడా వాడడం లేదని ఆయన వివరించారు. హెల్మెట్ల వాడకంపై అందరూ సహకరించాలన్నారు. ప్రధానంగా హెల్మెట్లు వాడటం, లెసైన్సు కలిగి ఉండడం, ఇన్సూరెన్సు చేయించుకోవటం తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. -
కరువు రాష్ట్రాల్లో ‘సంక్షేమం’పై నివేదికివ్వండి
కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: కరువు అలముకున్న రాష్ట్రాల్లో ఏమేం సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎంజీఎన్ఆర్ఈజీఏ, జాతీయ ఆహార భద్రత, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు, వర్షపాతాల నమోదుపై నివేదిక ఇవ్వాలని జస్టిస్ లోకూర్, ఆర్కే అగర్వాల్‌తో కూడిన బెంచ్ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సోమవారం సూచించింది. 22వ తేదీలోపు నివేదికలివ్వాలంది. కరువు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, యూపీ, ఎంపీ, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్, బిహార్, హరియాణా, గుజరాత్, మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్‌ల్లో బాధితులను ఆదుకునే దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై కోర్టు స్పందించింది. ఎన్నికల సర్వేలు నిర్వహించే యోగేంద్ర యాదవ్ తదితరుల ఆధ్వర్యంలోని ‘స్వరాజ్ అభియాన్’ స్వచ్ఛంద సంస్థ ఈ పిల్ వేసింది. వారి తరుఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ... కరువు ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చూపాయన్నారు. ఎంతో మంది మరణించారని, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 24 ఉల్లంఘనే అవుతుందన్నారు. బిహార్, మధ్యప్రదేశ్ మినహా మరే కరువు బాధిత రాష్ట్రాలూ ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదన్నారు. ఇతర రాష్ట్రాలు ఏపీఎల్-బీపీఎల్ల మధ్య వ్యత్యాసం ఆధారంగా ప్రజా పంపిణీ వ్యవస్థను నడిపిస్తున్నాయని, ఈ విధానం వల్ల ఉపయోగం లేదని పరిశోధనల్లో తేలిందన్నారు. ‘ఎన్ఎఫ్ఎస్ఏ’ను అమలు చేయడం వల్ల బిహార్, మధ్యప్రదేశ్‌ల్లో సత్ఫలితాలు వచ్చాయని ప్రశాంత్‌భూషణ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు... బాధితులు, బాధిత ప్రాంతాల్లో కనీసం అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలపై ఏమేం చర్యలు తీసుకున్నారో తెలపాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌ను అడిగారు. రంజిత్‌కుమార్ వివరణనిస్తూ... రాష్ట్ర విపత్తుల సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తుల సహాయ నిధిల నుంచి ఆర్థిక సాయం అందించామన్నారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఎంపీ, మహారాష్ట్రలకు వరుసగా రూ.1,500 కోట్లు, రూ.1,276 కోట్లు, రూ.2,032 కోట్లు, రూ.3,044 కోట్లు మంజూరు చేశామన్నారు. 2015-20 కాలానికి మొత్తం రూ.61,291 కోట్లు సహాయ నిధిని ఏర్పాటు చేశామన్నారు. -
బీసీసీఐ సమూల ప్రక్షాళన
♦ బీసీసీఐలో మార్పులకు లోధా కమిటీ ప్రతిపాదనలు ♦ సుప్రీం కోర్టు చేతుల్లో తుది నిర్ణయం ♦ అమల్లోకి వస్తే ప్రస్తుత పెద్దలంతా అవుట్ భారత క్రికెట్ నియంత్రణ మండలి పుట్టిన దగ్గరినుంచి నియంత్రణ లేకుండా సాగుతున్న పరిపాలనకు త్వరలోనే ఫుల్స్టాప్ పడనుందా... తాము ‘ఆడించిందే’ ఆట అన్నట్లుగా బోర్డులో సుదీర్ఘంగా పాతుకుపోయిన పెద్దలకు చెక్ చెప్పే సమయం ఆసన్నమైందా... మేం రాసుకుందే రాజ్యాంగం, ప్రభుత్వానికి కూడా మేం జవాబుదారీ కాదు అన్నట్లుగా వ్యవహరించే క్రికెట్ అడ్డా... ఇకపై అడ్డగోలుగా వ్యవహరించకుండా బంధనాలు రాబోతున్నాయా..? ఐపీఎల్లో ఫిక్సింగ్, బెట్టింగ్తో మొదలైన వివాదానికి క్లైమాక్స్‌గా జస్టిస్ లోధా కమిటీ భారీ నివేదిక ఇచ్చింది. పలు మార్పులు సూచిస్తూ సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. ఇది అమల్లోకి వస్తుందా? రాదా? అనేది సుప్రీం కోర్టు చేతుల్లో ఉంది. న్యూఢిల్లీ: బీసీసీఐలో సమూల ప్రక్షాళనకు సిఫారసు చేస్తూ జస్టిస్ లోధా కమిటీ సంచలన నివేదిక ఇచ్చింది. బోర్డులో మార్పులతో పాటు భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అనేక ప్రతిపాదనలు చేసింది. ఆఫీస్ బేరర్ల పదవీకాలానికి పరిమితులు విధించడం మొదలు రాష్ట్ర సంఘాల్లో ఓటింగ్ హక్కు, సెలక్షన్ కమిటీ ఎంపిక, బోర్డును ఆర్టీఐ పరిధిలోకి తీసుకు రావడం వరకు అనేక అంశాలు ఉన్నాయి. బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని సూచించడం కూడా కమిటీనుంచి వచ్చిన అనూహ్య ప్రతిపాదన. ఐపీఎల్-2013లో ఫిక్సింగ్ వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది జనవరిలో కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ లోధాతో పాటు జస్టిస్ అశోక్ భాన్, జస్టిస్ ఆర్. రవీంద్రన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఐపీఎల్లో చెన్నై, రాజస్థాన్ జట్ల రద్దు, మెయప్పన్, రాజ్ కుంద్రాలకు శిక్షలు ప్రతిపాదించడంతో పాటు బీసీసీఐ పనితీరుపై తగిన ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు కమిటీని కోరింది. తాజా నివేదికను కమిటీ సుప్రీంకే సమర్పిస్తుంది. ఇందులోని చాలా అంశాలు ప్రస్తుతం సాగుతున్న పరిపాలనా శైలికి ముగింపు పలికే విధంగానే ఉన్నాయి. కమిటీ చేసిన ప్రతిపాదనలు అవి అమల్లోకి వస్తే పడే ప్రభావం ఏమిటో చూద్దాం.... 1 ప్రతిపాదన: 70 ఏళ్లు పైబడిన వారు బీసీసీఐలో, రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు కాకూడదు. ప్రభావం: ఇది అమల్లోకి వస్తే శరద్‌పవార్ (75 ఏళ్లు), శ్రీనివాసన్ (71), నిరంజన్ షా (71)లతో పాటు పాండోవ్, ఐఎస్ బింద్రా లాంటి అనేకమంది క్రికెట్ పరిపాలనకు దూరమవుతారు. 2 ప్రతిపాదన : ఒక రాష్ట్రానికి ఒక్కటే ఓటు. రాష్ట్రంలోని మిగిలిన సంఘాలు అనుబంధసభ్యులు మాత్రమే. ప్రభావం: ఇది అమల్లోకి వస్తే శశాంక్ మనోహర్ కనీసం బీసీసీఐ సమావేశంలో ఓటు వేయలేరు. మహారాష్ట్ర సంఘానికి మాత్రమే ఓటు ఉంటుంది. విదర్భ, ముంబై సంఘాలు నామమాత్రంగా మారిపోతాయి. ఇలాగే గుజరాత్‌లోనూ జరుగుతుంది. నగరం ఆధారంగా ఉన్న సంఘాలు పోయి చత్తీస్‌గఢ్, తెలంగాణ, బీహార్‌లకు ఓటు హక్కువస్తుంది. 3 ప్రతిపాదన: ఒక సభ్యుడు మూడేళ్లు పదవిలో ఉంటే విరామం తీసుకుని తిరిగి మరో పదవి తీసుకోవాలి. అదే సమయంలో ఒక సభ్యుడు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పదవిలో ఉండాలి. ప్రభావం: అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం బోర్డు కార్యదర్శి. తన పదవీకాలం పూర్తి కాగానే తిరిగి అధ్యక్ష పదవికో, కార్యదర్శి పదవికో పోటీ చేయలేరు. మూడేళ్లు విరామం తీసుకోవాల్సి ఉంటుంది. 4.ప్రతిపాదన: బీసీసీఐ అధ్యక్షుడిగా ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే (మూడేళ్ల చొప్పున) పదవిలో ఉండాలి. ఆ త ర్వాత మరే పదవిలోనూ ఉండకూడదు. ప్రభావం: శశాంక్ మనోహర్ ప్రస్తుత పదవీకాలం ముగిస్తే ఆరేళ్లు పూర్తవుతుంది. ఇక ఆ యన బీసీసీఐలో ఎలాంటి పదవిలోనూ ఉండరు. 5.ప్రతిపాదన: ఒకే వ్యక్తి బీసీసీఐలో, రాష్ట్ర సంఘంలోనూ ఒకే సమయంలో సభ్యుడుగా ఉండకూడదు. ప్రభావం: ప్రస్తుతం బీసీసీఐలో ఉన్న పెద్దలంతా తమ రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు. వారంతా ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. 6.ప్రతిపాదన: సెలక్షన్ కమిటీలో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండాలి. వాళ్లు కూడా కచ్చితంగా టెస్టు క్రికెట్ ఆడినవారై ఉండాలి. ప్రభావం: ప్రస్తుత సెలక్టర్లలో ఖోడా కేవలం వన్డేలు ఆడాడు. కాబట్టి తను అనర్హుడు. అలాగే రాథోడ్, సాబా కరీమ్, ఎమ్మెస్కే ప్రసాద్, సందీప్ పాటిల్ (చైర్మన్)లలో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. 7.ప్రతిపాదన: బెట్టింగ్‌ను చట్టబద్దం చేయడం ప్రభావం: విదేశాల్లో ముఖ్యంగా ఇంగ్లండ్‌లోని ప్రముఖ బెట్టింగ్ కంపెనీలు భారత్‌లోనూ తమ కార్యకలాపాలు చేపడతాయి. 8. ప్రతిపాదన: బోర్డును ఆర్టీఐ పరిధిలోకి తేవాలి. ప్రభావం: ఇకపై సామాన్యులు కూడా బీసీసీఐ వ్యవహారాలను, చెల్లింపులను తెలుసుకోవచ్చు. ఏం జరుగుతుంది? లోధా కమిటీ ప్రస్తుతం ప్రతిపాదనలు మాత్రమే చేసి సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. ఇవన్నీ కచ్చితంగా అమలు కావాలని నిబంధన ఏమీ లేదు. ముందుగా ఈ నివేదికపై సుప్రీంకోర్టు బీసీసీఐ అభిప్రాయాన్ని కోరుతుంది. వాటి అమలు సాధ్యాసాధ్యాల గురించి బోర్డు తరఫున వివరణ ఇచ్చుకునే అవకాశం ఇస్తుంది. అయితే ఈ ప్రతిపాదనలు ఇప్పటికే బోర్డు పెద్దలకు మింగుడుపడటం లేదు. ముఖ్యంగా వయో పరిమితి, రెండు సార్లు ఎన్నిక కావడానికి మధ్య విరామం ఇవ్వాలనే అంశాలే బోర్డు పెద్దలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. దీనిపై బోర్డు గట్టిగా వాదించే అవకాశం ఉంది. ‘నివేదికను పూర్తిగా చదివిన తర్వాతే నా అభిప్రాయం చెబుతాను’ అని బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ వెల్లడించారు. అయితే శరద్‌పవార్‌లాంటి వారు ఇప్పటికీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని, 70 ఏళ్లు దాటారని పని చేయకూడదా అని ఒక బోర్డు సభ్యుడు ప్రశ్నిస్తే... బాగా పని చేసినప్పుడు వరుసగా ఎన్నిక కాకుండా ఎందుకు నిరోధించాలని మరొకరు అడుగుతున్నారు. అన్నింటికి మించి ముగ్గురు సెలక్టర్లు 27 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను ఎలా చూడగలరనేది మరొకరి సందేహం. మొత్తానికి సుప్రీం కోర్టులో బీసీసీఐ ఎలాంటి వాదన వినిపిస్తుందనేది ఆసక్తికరం. బోర్డు తన వాదనలు వినిపించి సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేయడానికి బాగానే సమయం పట్టొచ్చు. మరికొన్ని ప్రతిపాదనలు... ♦ బోర్డు అధ్యక్ష పదవిని రొటేషన్ పద్ధతిలో ఒక్కో జోన్‌కు కేటాయిస్తున్నారు. ఈ విధానాన్ని తొలగించాలి. బోర్డు ఎన్నికల సమయంలో అధ్యక్షుడికి ఇప్పుడు మూడు ఓట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి తప్పించాలి. ♦రోజూవారీ కార్యకలాపాలను పర్యవేక్షించించేందుకు సీఈఓను నియమించాలి. ఆటగాళ్ల తరఫున మాట్లాడేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు ప్లేయర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. 9 మంది సభ్యులతో అపెక్స్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసి ఒక మహిళ సహా ముగ్గురు ఆటగాళ్లు అందులో సభ్యులుగా ఉండాలి. ♦ 9 మంది సభ్యులతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను విస్తరించి అందులో ఇద్దరు ఫ్రాంచైజీల తరఫున, ఒకరు ప్లేయర్స్ అసోసియేషన్ తరఫున ఉండేలా చూడాలి. మరొకరు ప్రభుత్వ ప్రతినిధిగా ‘కాగ్’ నామినేట్ చేసిన వ్యక్తిని నియమించాలి. ♦ ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’పై దృష్టి పెట్టేందుకు ఒక నైతిక విలువల అధికారిని నియమించాలి. సుందర్ రామన్‌కు క్లీన్ చిట్ బుకీలకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొన్న ఐపీఎల్ మాజీ సీఓఓ సుందర్ రామన్‌కు కమిటీ క్లీన్చిట్ ఇచ్చింది. అతడిని దోషిగా తేల్చేందుకు ఎలాంటి ఆధారం లభించలేదని కమిటీ పేర్కొంది. అతనిపై వచ్చిన ఏడు రకాల ఆరోపణల్లో ఒక్కదాంట్లోనూ బలం లేదని, కాబట్టి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని కమిటీ స్పష్టం చేసింది. త్వరలో బోర్డు ఎస్జీఎం న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సుప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండు వారాల్లోపే ఎస్‌జీఎంను సమావేశపరచాలని బోర్డు భావిస్తోంది. వాస్తవానికి బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం కోసం నేడు (మంగళవారం) ఉన్నతాధికారులంతా ముంబైకి రానున్నారు. ఇక్కడే ఎస్జీఎం ఎప్పుడనేది తేలనుంది. నివేదికలోని కొన్ని అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. మరోవైపు ఈ రిపోర్టుపై బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్పందించేందుకు నిరాకరించారు. ఒక్కడే 652 నాటౌట్! స్కూల్ కుర్రాడి ప్రపంచరికార్డు ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే సంచలనం సృష్టించాడు. ఒకే రోజు 652 పరుగులు సాధించి మైనర్ క్రికెట్లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సోమవారం ముంబై క్రికెట్ సంఘం నిర్వహించిన ఇంటర్ స్కూల్ టోర్నీలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్ బ్యాట్స్‌మన్ ప్రణవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 199 బంతుల్లో అతను 652 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 78 ఫోర్లు, 30 సిక్సర్లు ఉన్నాయి. మైనర్ క్రికెట్లో ఈ రికార్డు నమోదు చేసినా... ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచ రికార్డు ఏఈజే కొలిన్స్ (628 పరుగులు-1899లో) పేరిట ఉంది. ఇప్పుడు ప్రణవ్ 116 సంవత్సరాల ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో 2014లో ముంబైలోనే పృథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది. -
ఒక్క రాష్ట్రానికి ఒక్కటే సంఘం!
► బీసీసీఐలో మార్పుల గురించి లోధా కమిటీ సూచనలు ► నివేదిక జనవరి 4న కోర్టు ముందుకు న్యూఢిల్లీ: బీసీసీఐ నిర్వహణలో వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఉండకూడదు... ఒక్క రాష్ట్రానికి ఒక్కటే క్రికెట్ సంఘం ఉండాలి... బీసీసీఐలో ఉండే వ్యక్తులు రాష్ట్ర సంఘాల్లో ఎలాంటి పదవుల్లో ఉండకూడు... సుప్రీం కోర్టుకు జస్టిస్ లోధా కమిటీ సమర్పించబోతున్న నివేదికలోని కొన్ని అంశాలు ఇవి. జనవరి 4న కమిటీ తన తుది నివేదికను కోర్డుకు సమర్పించబోతోంది. విశ్వసనీయ సమచారం ప్రకారం... ఆ నివేదికలో బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని లోధా కమిటీ సూచించబోతోంది. ప్రస్తుతం బీసీసీఐ 1975 తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజస్టర్ అయి ఉంది. దీనిని పబ్లిక్ ట్రస్ట్ లేదా కంపెనీగా మార్చాలనేది సూచన. ఈ నివేదిక రూపొందించేందుకు క్రికెటర్లు, మాజీ కెప్టెన్లు, లాయర్లు, ప్రముఖ వ్యక్తులతో వివిధ అంశాలతో కమిటీ చర్చించింది. ‘కమిటీ ప్రతిపాదనలు మెజారిటీ అభిప్రాయాన్ని వ్యక్తపరచనున్నాయి. క్రికెటర్లు కానివారికి ఇవి రుచించకపోవచ్చు. ఆయా క్రికెట్ సంఘాలకు వారే అధ్యక్షులుగా ఉంటున్నారు. పలుకుబడి ఉన్నవారి స్టేట్‌కే ప్రధాన మ్యాచ్‌లు వెళుతున్నాయి’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. -
'డీజిల్ కార్లను నిషేధిస్తారా?'
న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీని బయటపడేసేందుకు ఒక్కో ప్రయత్నం ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని కాలుష్యానికి ఎక్కువకారణం అవుతున్న డీజిల్ కార్లను నిషేధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ధర్మాసనం పేర్కొంది. వచ్చే మంగళవారం నాటికి కోర్టు నిర్ణయాన్ని వెలువరిస్తామని చెప్పారు. డీజిల్ కార్లను ఢిల్లీ నగర వీధుల్లో నుంచి పూర్తిగా బహిష్కరించాలా లేక పరిమితులు విధిస్తే సరిపోతుందా అనే అంశాలను సుప్రీంకోర్టు వచ్చే మంగళవారం వెల్లడించనుంది. ఏదేమైనా ఢిల్లీ గుండా ట్రక్కులను వెళ్లకుండా తీసుకునే నిర్ణయానికి సుప్రీంకోర్టు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క, కాలుష్యాన్ని అదుపుచేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం తెస్తున్న సరి-భేసి పాలసీపై స్పందిస్తూ ఏదో ఒక పరిష్కారంతో సమస్య మొత్తం అంతంకాదని, ఇందుకోసం బహుళకార్యక్రమాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. -
ప్రసవ ఆవేదన
తొమ్మిదినెలలు మోసి పేగు తెగగానే బంధం తెగితుందా? జీవితం నడవడానికి కొంచెం డబ్బు రావచ్చుకానీ... పుట్టిన బిడ్డ నడవకముందే వదులుకోవడం ఎంత వేదన?మహిళకున్న కష్టాల గురించిపుటలు పుటలు రాస్తున్నా కొత్త కష్టాలుపుట్టుకొస్తూనే ఉన్నాయ్!ఇదంతా డబ్బుకోసమే చేస్తున్నా స్త్రీ తనకోసం చేసుకోవడం లేదుతన కుటుంబం కోసమో..బంధువుల కోసమోకడుపును అద్దెకిచ్చిపేగు బంధాన్నే త్యజించిఒక ఫ్యాక్టరీగా మారిందిప్రసవ వేదన గురించి విన్నాం..ప్రసవం తర్వాత ఉండే వేదన గురించీ విన్నాం..కానీ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ మూత పడ్తుందేమోనన్న ఆవేదన గురించి వింటున్నాం! ఆనంద్... మిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా! గుజరాత్ నుంచి పొంగే పాలధార. క్షీర విప్లవం వల్ల కళకళలాడిన ఊరు. అయితే అది ఇంకొకందుకు కూడా ఖ్యాతి గాంచింది. సరోగసీకి. అవును... అక్కడ నిత్యం పసిపిల్లల కేర్‌కేర్‌మనే ఏడుపులు వినిపిస్తాయి. వారిని ఒడిలోకి తీసుకున్న తల్లిదండ్రుల ఆనందబాష్పాలు కనిపిస్తాయి. ఆ ఆనందబాష్పాలకు వెల నిర్ణయించి స్థిరపడిన జీవితాలు కూడా కనిపిస్తాయి. అద్దె గర్భాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆనంద్ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ దేశంలోని అమ్మలు తమ గర్భాన్ని విదేశీ జంటలకు అద్దెకివ్వడానికి వీల్లేదు అనే ఆ తీర్పు మీద చర్చ జరుగుతున్న దరిమిలా ఆనంద్ అమ్మల ఆలోచనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బేబీ ఫ్యాక్టరీస్ అహ్మాదాబాద్ నుంచి వదోదరా వెళుతుంటే మార్గమధ్యంలో కనిపించే ఆనంద్ గత పదేళ్ల నుంచి సంతానలేమితో బాధపడ్తున్న భార్యభర్తలకు బిడ్డల్నిచ్చే కర్మాగారాల నెలవుగా మారింది. ఇక్కడి మెటర్నీటీ నర్సింగ్‌హోమ్స్ అన్నీ సరోగసీ సెంటర్సే అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆనంద్‌ను సిటీ ఆఫ్ బేబీ ఫ్యాక్టరీస్ అని కూడా అంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అతి పెద్ద సరోగసీ కేంద్రం ఇది. ఈ ఊళ్లోని ఒక్క ఆకాంక్ష ఇన్ఫెర్టిలిటీ క్లినిక్కే ఇప్పటి వరకు వెయ్యిమంది సరోగసీ బిడ్డలకు పురుడు పోసిందంటే అదేం చిన్న సంఖ్య కాదు. ఈ క్లినిక్‌లో వారానికి ఇద్దరు సరోగసీ బిడ్డలు కేర్మంటున్నారంటే సరోగసికి ఉన్న డిమాండ్ అర్థం అవుతుంది. ఇక్కడ యేడాదికి 13 వందల కోట్ల పై చిలుకు వ్యాపారం జరుగుతోంది కనుకనే దీనిని ‘సరోగసీ ఇండస్ట్రీ’ అని సగౌరవంగా పిలుస్తున్నారు. భారతదేశం నుంచే కాదు నైజీరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, ఇరాన్ పొరుగునే ఉన్న పాకిస్తాన్ జంటలు కూడా ఆనంద్‌కు చేరుకుంటుంటాయి. వేలమందికి ఉపాధి ఆనంద్‌లో వెయ్యిమంది సరోగసీ మదర్స్ ఉన్నారని అంచనా. ఆరోగ్యాన్ని బట్టి, రూపాన్ని బట్టి, ఎదుటి వారి అవసరాన్ని బట్టి ఒక్కో అమ్మ తన గర్భాన్ని అద్దెకివ్వడానికి నాలుగు నుంచి పదకొండు లక్షలు చార్జ్ చేస్తోంది. హ్యుమన్‌రైట్స్ కమిషన్ ఫ్యాక్ట్ ఫైండింగ్‌లో ఇలాంటి విశేషాలు అనేకం తెలిశాయి. బీనా అనే 34 ఏళ్ల సరోగసీ మదర్ తన గర్భాన్ని అద్దెకు ఇచ్చి ఆ వచ్చిన ఆదాయంతో మంచి ఇల్లు కట్టుకుందట. కొడుకుని ఇంజనీరింగ్ చదివించిందట. భర్తకు రద్దీ చోట మంచి హోటల్ పెట్టించిందట. అంతే కాదు సరోగసీ వల్ల తనకు కలిగిన లాభాన్ని మరో ఇద్దరు పేద మహిళలకు వివరించి వారికి కూడా సరోగసీ ద్వారా ఉపాధి చూపించిందట. రాంజుది కూడా అలాంటి పరిస్థితే. ఆమె వయసు 32 ఏళ్లు. ఒక అగ్ని ప్రమాదంలో రాంజు భర్త గాయపడ్డాడు. ఆపరేషన్ కోసం పెద్దమొత్తంలోనే డబ్బులు కావాల్సి వచ్చింది. కూలీనాలీ చేసుకునే జీవితాలకు అంత డబ్బు అప్పుగా దొరకడం కల్లే కనుక ఎవరో చెప్తే విని సరోగసీ మదర్‌గా ఉండడానికి తన పేరును రిజిస్టర్ చేయించుకుంది. ఒక కెనడియన్ జంటకు బిడ్డను కనిచ్చింది. అప్పటికే ఒక బిడ్డ తల్లి అయిన రాంజుకి ఈ ఒప్పందం ద్వారా ఎనిమిది లక్షలు వచ్చాయి. భర్తకు ఆపరేషన్ చేయించడమే కాక మిగిలిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంది. తర్వాత రెండో విడతలో జర్మనీ జంటకు బిడ్డకు కనిచ్చింది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో భర్తకు ఆటో కొనిపెట్టి తానూ ఓ బడ్డీ కొట్టు పెట్టుకుంది. కొడుకును పె చదువులకు ముంబై పంపించింది. సరోగసీ ద్వారా ఆర్థికంగా బలపడ్డ కుటుంబాలెన్నో కనిపిస్తాయ్ ఆనంద్‌లో. ఇతర వ్యాపారాలు పిల్లల కోసం యేడాదికి రెండువందల విదేశీ జంటలు ఆనంద్‌కు చేరుకుంటాయి. కనీసం ఆర్నెల్ల దాకా బస చేసే ఈ జంటల వల్ల అక్కడి ఆసుపత్రులు, సరోగసీ సెంటర్సే కాదు... ఎయిర్పోర్ట్ నుంచి ఆనంద్‌కు తీసుకొచ్చే ట్రావెల్ ఏజెన్సీలకు, వాళ్లకు వసతి కల్పించే హోటళ్లకు, ఆయా దేశ వాసులకు వాళ్ల ఆహారాన్ని వండిపెట్టే రెస్టారెంట్లకు, గుజరాతీ థాలీ రుచులను చూపించే గుజరాతీ కిచెన్లకు, ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్‌ను అందించే స్టోర్స్‌కు, డైపర్స్ నుంచి మల్టీవిటమిన్ డ్రాప్స్ దాకా ఫారిన్ కంపెనీల మందులను అమ్మే మెడికల్ షాప్స్‌కు, ఇంగ్లిష్ మాట్లాడే స్థానికులకు ఉపాధి దొరుకుతోంది. గుజరాత్ టూరిజం డిపార్ట్మెంట్ ఖజానా నిండుతోంది. నిజానికి ఆనంద్ శాకాహార రెస్టారెంట్లకు పేరు. కాని సరోగసీ సంతానం కోసం వస్తున్న విదేశీయుల కోసం నాన్‌వెజ్ రెస్టారెంట్ల డిమాండ్ ఏర్పడింది. అవి తెరవక తప్పలేదు. అన్నిటికీ మించి విదేశీ జంటలకు, సరోగసీ మదర్స్‌కు మధ్య లీగల్ అగ్రీమెంట్స్ కుదర్చడం లాయర్లకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. సుప్రీంకోర్టు ప్రస్తుత తీర్పుతో వీరందరి ఆదాయానికి గండిపడే ప్రమాదం ఉందని అంటున్నారు మార్కెట్ అనలిస్ట్‌లు. మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా సరోగసీ మదర్స్ మాత్రం ‘సరోగసీకి మేం ఇష్టపడే ఒప్పుకున్నాం. తొమ్మిది నెలల్లో మంది సంపాదననిచ్చే మార్గం ఇది. కోర్టు తీర్పు వల్ల విదేశీయులు రాకపోవచ్చట. వాళ్లు ఇచ్చినంత డబ్బులు మన వాళ్లు ఇవ్వరు. మాకైతే సంపాదన పోయినట్టే. మళ్లీ కూలీనాలీ అంటే కష్టమే’ అని వాపోతున్నారు.. - సాక్షి ఫ్యామిలీ తెలుగు రాష్ట్రాల ఆనంద్ దేశంలో సరోగసీకి గుజరాత్ తర్వాత తెలుగు రాష్ట్రాలే ప్రధాన కేంద్రాలు. ముఖ్యంగా తెలంగాణలోని కరీంనగర్ ఈ విషయంలో ముందంజలో ఉంది. విదేశీ జంటల దృష్టి ఇంకా పడకపోయినా ప్రవాస భారతీయ జంటల సంతాన సాఫల్య కేంద్రంగా ఇది ప్రచారం పొందుతోంది. గత అయిదేళ్లలో 100 మందికి పైగా సరోగసీ బిడ్డలకు ఈ నగరం జన్మనిచ్చింది. ఇక్కడి సరోగసి మదర్ కూడా 5 నుంచి 10 లక్షల వరకు డబ్బులను డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. సరోగసీ వల్ల ఆనంద్ లాంటి మౌలిక సదుపాయాలు, వ్యాపారం ఇక్కడ పెరగకపోయినా, సరోగసీ మదర్స్‌ను కంటికి రెప్పలా కాపాడే అత్యంతాధునిక వైద్యసదుపాయాలున్న ఆసుపత్రులు, సకల సౌకర్యాలున్న హాస్టల్స్, లైబ్రరీలు, వీడియో లైబ్రరీలు వెలుస్తున్నాయి. ప్రవాస జంటలు తమ బిడ్డ ఉన్న సరోగసీ మదర్‌కు ఎటువంటి ఆహారం ఇవ్వాలి అనే విషయంలో శ్రద్ధ చూపుతుండటం వల్ల డైటీషీయన్లకూ డిమాండ్ పెరుగుతోంది. ప్రవాస భారతీయ జంటలకు గర్భం అద్దెకివ్వచ్చు అన్న వెసులుబాటు సుప్రీం కోర్టు ఇచ్చింది కాబట్టి ఆనంద్‌కు ఉన్న గిరాకీ ఇక మీద కరీంనగర్‌కు మారవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్‌లోని సంతాన సాఫల్యకేంద్రాల్లోని గైనకాలజిస్ట్లు. -
ఆధార్‌పై నిర్ణయాన్ని విస్తృత ధర్మాసనానికి ఇవ్వండి
సుప్రీంను కోరిన కేంద్రం శుక్రవారం నిర్ణయం చెబుతామన్న సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ: ప్రజాపంపిణీ వ్యవస్థ, ఎల్పీజీలకు మాత్రమే ఆధార్ అనుసంధానాన్ని పరిమితం చేస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సవరించడానికి విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలని కేంద్రం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం సాయంత్రం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. ‘పిటిషన్ విచారణకు తొమ్మిది మంది జడ్జిలతో కూడిన బెంచ్ అవసరం. అంతమందిని ఇస్తే మిగతాపనులు ఏమవ్వాలి. అందుకే రేపు సాయంత్రం వరకు నాకు సమయం ఇవ్వండి’ అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు చెప్పారు. కేవలం పీడీఎస్, ఎల్పీజీలకు మాత్రమే ఆధార్ స్వచ్ఛంద వినియోగానికి అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును మార్చాలని రోహత్గీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, హరీశ్ సాల్వే కూడా మద్దతు తెలిపారు. ఉపాధి హామీ, జన్‌ధన్ యోజన లాంటి పథకాలకు ఆధార్ అనుసంధానం ప్రాముఖ్యతను గురువారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించిన రోహత్గీ.. పిటిషన్‌ను త్వరగా పరిష్కరించాలని కోరారు. -
ధోనికి ఊరట
న్యూఢిల్లీ: భారత వన్డే జట్టు కెప్టెన్ ధోనికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనను విష్ణుమూర్తిగా చూపిస్తూ ఓ బిజినెస్ మేగజైన్ ముఖచిత్రం ప్రచురించడంతో ధోనిపై బెంగళూరు ట్రయల్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. దీంతో ఈ కేసును కొట్టివేయాలంటూ ధోని సుప్రీం కెళ్లాడు. ఇప్పుడు తాజాగా ఆ కేసు విచారణపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, ఆర్కే అగర్వాల్‌లతో కూడిన బెంచ్ స్టే విధిం చింది. విచారణ కొనసాగించాల్సిందేనంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా స్టే విధించింది. అంతేకాకుండా ధోనిపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త జయకుమార్‌కు నోటీసులు పంపింది. -
‘కృష్ణా’పై కేంద్రం వైఖరేమిటో?
10న సుప్రీంకోర్టులో తన వైఖరిని చెప్పనున్న కేంద్రం ట్రిబ్యునల్ సభ్యుడి ఎంపికపైనా స్పష్టత వచ్చే అవకాశం హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదంలో నీటి పంపకాలకు సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు 4 రాష్ట్రాల వాదనలు వినాలా? లేక తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకే వాదనలను పరిమితం చేయాలన్న దానిపై కేంద్రం చెప్పే వైఖరిపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 10న సుప్రీంకోర్టులో జరగనున్న విచారణలో కేంద్రం ఏం చెబుతుందన్న దానిపై నాలుగు రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ మాత్రం మరోమారు నాలుగు రాష్ట్రాల వాదనలు విని పునఃకేటాయింపులపై నిర్ణయం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పనుంది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును యథావిధిగా అమలుచేస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగే దృష్ట్యా, దాన్ని కొట్టేసి, కొత్తగా తీర్పునిచ్చేలా ఆదేశాలివ్వాలని రాష్ట్రం సుప్రీంను అభ్యర్థించింది. దీనిపై గత నెలలో విచారణ జరిపిన సుప్రీం.. తెలంగాణ వినతిపై వైఖరిని చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. గతంలోనే ఒకమారు వైఖరిని చెప్పాలని సుప్రీం సూచించినా కేంద్రం ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నందున త్వరగా వైఖరిని చెప్పాలని సుప్రీం గట్టిగానే చెప్పడంతో ఈ నెల 10న జరగబోయే విచారణలో ఏదో ఒక వైఖరిని వెల్లడించే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటే బ్రిజేశ్ ట్రిబ్యునల్ సభ్యుడు డీకే సేథ్ మరణంతో ఖాళీ అయిన స్థానంలో మరో సభ్యుడి నియామకంలో చేపట్టిన చర్యలపైనా కేంద్రం స్పష్టతనిచ్చే అవకాశముంది. -
ఆ ముగ్గురు దోషులే!
కటారా కేసులో హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: నితీశ్ కటారా హత్య కేసులో వికాస్ యాదవ్, విశాల్ యాదవ్, సుఖ్‌దేవ్ పహిల్వాన్లు దోషులేనని సుప్రీంకోర్టు తేల్చింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే వారికి శిక్షాకాలం పొడిగించడంపై 6 వారాల్లో వివరణ ఇవ్వాలని ఢిల్లీ సర్కారును ఆదేశించింది. వికాస్, అతని బంధువు విశాల్‌కు విధించిన జీవితఖైదును హైకోర్టు ఫిబ్రవరిలో 25 ఏళ్లకు పెంచింది. శిక్ష త గ్గిస్తూ ఎలాంటి సడలింపులు ఇవ్వొద్దని ఆదేశించింది. కేసులో ఆధారాలు నాశనం చేసినందుకు మరో ఐదేళ్ల అదనపు జైలు శిక్ష విధించింది. సుఖ్‌దేవ్‌కూ శిక్షను 25 ఏళ్లుగా నిర్ధారించింది. దీన్ని సవాలు చేస్తూ వారు సుప్రీంలో పిటిషన్ వేశారు. సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. దోషులకు శిక్షాకాలం పెంపుపై మాత్రమే దృష్టిసారిస్తామని, వారి దోషిత్వంపై మళ్లీ ఎలాంటి విచారణ జరిపేది లేదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ దేశంలో నేరగాళ్లే న్యాయం కోసం పోరాడుతున్నారని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. తన సోదరి భారతిని ప్రేమించినందుకు 2002, ఫిబ్రవరి 17న నితీశ్ కటారాను వికాస్ యాదవ్ దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
సిద్ధార్థ యాజమాన్యం దిగివచ్చేనా!
సుప్రీంకోర్టులో దుర్గగుడి ఈవో పిటిషన్ దాఖలు పిటిషన్ దాఖలులో ప్రభుత్వం తాత్సారం కాగితాలకే పరిమితమైన లీజుల పెంపు ప్రతిపాదన విజయవాడ : సిద్ధార్థ అకాడమీ ఆధీనంలో ఉన్న దుర్గగుడి దేవస్థానం భూములను తిరిగి స్వాధీనం చేసుకునే విషయం మూడు అడుగులు ముందుకు... ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ఎండోమెంట్ డెప్యూటీ కమిషనర్ కోర్టు నుంచి హైకోర్టు వరకు దేవస్థానమే గెలిచినప్పటికీ సిద్ధార్థ యాజమాన్యం ఆ భూములను వదల కుండా సుప్రీం కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న ఈ కేసును ఒక కొలిక్కి తీసుకువచ్చి దుర్గగుడికి చెందిన భూములను దేవస్థానానికి ఇప్పించడంతో ఉన్నతాధికారులు, ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా జరిగింది.... శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 8.22 ఎకరాల స్థలంలో సిద్ధార్థ మహిళా కళాశాల, 5.98 ఎకరాల స్థలంలో సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉన్నాయి. ఈ రెండుస్థలాలను సిద్ధార్థ సంస్థలకు 50 ఏళ్లకు లీజుకు ఇస్తూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను 2006లో ప్రభుత్వమే రద్దు చేసింది. అయినప్పటికీ ఆ స్థలాలను ఖాళీ చేయకపోవడంతో దేవస్థానం అధికారులు ఎండోమెంట్ డెప్యూటీ కమిషనర్ కోర్టుకెళ్లారు. అక్కడ దేవస్థానానికి అనుకూలంగా రావడంతో సిద్ధార్థ విద్యాసంస్థల యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. అక్కడా చుక్కెదురు కావడంతో 2013 ఆగస్టులో సుప్రీంకోర్టుకు వెళ్లగా ‘యథాతథ స్థితి’ కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిషనర్, ప్రభుత్వం తాత్సారం.... దుర్గగుడి దేవస్థానంతోపాటు దేవాదాయశాఖ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం కూడా దుర్గగుడి భూములపై స్టే ఎత్తివేయాలని, దేవస్థానానికి భూములు ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే పిటిషన్ దాఖల చేసేందకు ఈవోకు అనుమతి మంజూరులోనే దేవాదాశాఖ కమిషనర్ కార్యాలయం తీవ్ర తాత్సారం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం, దేవాదాయశాఖ కమిషనర్లు ఎప్పుడు పిటిషన్లు దాఖలుచేస్తారో ఆ కనకదుర్గమ్మకే తెలియాలి. వేగవంతంగా ఫైల్స్ కదిపి సుప్రీం కోర్టులో తమ వాదన వినిపిస్తే సాధ్యమైన త్వరగా భూములు స్వాధీనం చేసుకునే అవకాశ ఉంటుంది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో కావాలనే తాత్సారం చేస్తోందని భక్తులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అద్దెలు పెంచడం పై భేదాభిప్రాయాలు సిద్ధార్థ సంస్థల ఆధీనంలో ఉన్న భూముల అద్దె ధరలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఇక్కడ ఉన్న అద్దెల ధరలకు యాజమాన్యం చెల్లిస్తున్న అద్దెల రేట్లకు ఎంతో వ్యత్యాసం ఉంది. సిద్ధార్థ యాజమాన్యం అద్దెలకు తీసుకునేడప్పుడు ఎకరాకి రూ.5 వేల చొప్పున అద్దె చెల్లించేలా, ఆ తరువాత ప్రతి ఏడాది రూ.500 పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు ప్రకారం తమ భూములకు అద్దె చెల్లించాలని దేవస్థానం డిమాండ్ చేస్తోంది. అయితే ఆ స్థాయిలో అద్దెలు పెంచితే తమకు భారం అవుతుందని సిద్ధార్థ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. సిద్ధార్థ యాజమాన్యం ఆధ్వర్యంలోని భూముల లీజు పెంచేందుకు ప్రభుత్వం గతంలో ఒక కమిటీని వేయాలని భావించింది. రెండు వర్గాలతో సంప్రదించి లీజు ఖరారు చేసి విభేదాలు లేకుండా చేయాలనే ప్రతిపాదన కేవలం ఆలోచనలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవస్థానం వాదన ఇదీ... సుప్రీంకోర్టులో ఇచ్చిన స్టే ఉత్తర్వులను తొల గించి, గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తమకు భూమి అప్పగించాలని కోరుతూ తాజాగా దుర్గగుడి ఈవో సీహెచ్ నర్సింగరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దుర్గగుడికి చెందిన ఆస్తిపై పూర్తి హక్కులు దేవస్థానానికే ఉంటాయని, సెక్షన్ 15 ప్రకారం దేవస్థానం భూములను లీజుకు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని దేవస్థానం న్యాయవాదులు గతంలో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాదనను హైకోర్టు అంగీకరించింది. ఆ వాదన ప్రకారం భూములను సిద్ధార్థ యాజమాన్యం నుంచి ఇప్పిం చాలని ఈవో పిటిషన్ దాఖలుచేశారు. -
నాగపూర్ సెంట్రల్ జైల్లో నేడు మెమన్‌కు ఉరి
-
మెమన్‌కు ఉరి
నాగపూర్ సెంట్రల్ జైల్లో నేడు ఉదయం అమలు ► స్టే పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ►క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ ►సుప్రీం తీర్పును స్వాగతించిన బీజేపీ, కాంగ్రెస్.. ►ముంబై, నాగపూర్లలో భద్రత కట్టుదిట్టం ►1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో శిక్ష ఉరిపై ఉత్కంఠకు తెరపడింది! చర్చోపచర్చలు, వాదోపవాదాలు ముగిశాయి. 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు మరణశిక్ష అమలు ఖరారైంది. శిక్షను తప్పించుకునేందుకు అతడు చివరికి వరకూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం నాగ్‌పూర్ జైల్లో మెమన్ను ఉరి తీయనున్నారు. ఇదే రోజు అతడి పుట్టిన రోజు కూడా! శిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు బుధవారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను సైతం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు తిరస్కరించారు. ఇక ఆఖరిగా.. క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మరోసారి రాష్ట్రపతిని ఆశ్రయించారు. రాత్రి 10.45 గంటల సమయంలో.. క్షమాభిక్షను తోసిపుచ్చుతూ రాష్ట్రపతి నిర్ణయం వెలువరించారు. ఇక ఉదయం శిక్ష అమలు కావడమే మిగిలింది!! న్యూఢిల్లీ/నాగపూర్: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్(53) ఉరిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మరణశిక్ష అమలు ఖరారైంది. మరణశిక్షను తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం నాగపూర్ సెంట్రల్ జైల్లో మెమన్ను ఉరి తీయనున్నారు. ఇదే రోజు మెమన్ పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఈ జులై 30న మెమన్ను ఉరితీయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 30న ముంబైలోని టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్లో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని తేల్చిచెప్పింది. ఆ ఉత్తర్వులను తప్పుబట్టలేమంటూ మెమన్ పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు, రాజ్యాంగ అధికరణ 161 కింద మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ తిరస్కరించారు. ఉరిపై స్టే విధించాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టేసిన కాసేపటికే గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆ నిర్ణయం తీసుకున్నారు. చివరి ప్రయత్నంగా, క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మళ్లీ రాష్ట్రపతిని ఆశ్రయించారు. ఈ రెండో పిటి షన్నూ రాష్ట్రపతి బుధవారం రాత్రి పొద్దుపోయాక తిరస్కరించారు. మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఇప్పటికే ఒకసారి తిరస్కరించారు. 1993 మార్చి 12న, 12 వేర్వేరు చోట్ల జరిగిన వరుస పేలుళ్లతో ముంబై(నాటి బొంబాయి) వణికిపోయింది. ఆ భీకర పేలుళ్లలో 250 మందికి పైగా చనిపోగా, సుమారు 700 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రాత్రి 10.45 ప్రాంతంలో రాష్ట్రపతి నిర్ణయం మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్, సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్‌లతో బుధవారం రెండు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం రాత్రి 10.45 గంటల సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఈ నిర్ణయం వెలువరించారు. రాష్ట్రపతితో భేటీకి ముందు, ప్రధాని నివాసంలో రాజ్‌నాథ్, గోయల్ ఇతర ఉన్నతాధికారులు ప్రధాని మోదీతో సమావేశమై, మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతికి ప్రభుత్వం తరఫున ఏ సూచన ఇవ్వాలనే విషయంపై చర్చించారు. సాధారణంగా ఈ విషయాల్లో కేంద్ర మంత్రిమండలి సలహా ప్రకారం రాష్ట్రపతి నడుచుకుంటారు. ఉరిని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేసిన మెమన్ లాయర్లు బుధవారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాక అర్ధరాత్రి మళ్లీ సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. క్షమాభిక్ష పిటిషన్ నిరాకరణ తర్వాత ఉరి అమలుకు 14 రోజుల గడువు ఇవ్వాలని సుప్రీం మార్గదర్శకాలు సూచిస్తున్నాయని, అందువల్ల మెమన్‌కు 14 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. సుప్రీంలో.. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ దవేల ద్విసభ్య బెంచ్ మంగళవారం ఉరిని నిలిపేసే అంశంపై విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. ఆ అంశపై తుది నిర్ణయం తీసుకునేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ రాయ్ సభ్యులుగా త్రిసభ్య బెంచ్‌ను చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఏర్పాటుచేయడం తెలిసిందే. విచారణ తర్వాత టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్ సక్రమమేనని ఆ త్రిసభ్య బెంచ్ తేల్చింది. అలాగే, మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టేయడం సరైన చర్యేనంది. తన వాదనలు వినకుండానే ఉరిశిక్ష ఉత్తర్వులను టాడా కోర్టు జారీ చేసిందని, తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాత ఉరిశిక్ష అమలు తేదీని తనకు తెలియజేసే విషయంలో పాటించాల్సిన 14 రోజుల గడవు నిబంధనను ఆ కోర్టు పాటించలేదని మెమన్ చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. క్షమాభిక్ష పొందే విషయంలో తనకింకా న్యాయపరమైన అవకాశాలున్నాయన్న వాదననూ కొట్టేసింది. తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2015, జూలై 21న కొట్టేసిన తరువాతే.. క్షమాభిక్ష కోరుతూ మెమన్ మహారాష్ట్ర గవర్నర్‌ను ఆశ్రయించారని గుర్తు చేసింది. మెమన్ పిటిషన్‌ను ఏప్రిల్ 11, 2014న రాష్ట్రపతి తిరస్కరించారని, ఆ విషయాన్ని మే 26, 2014న మెమన్‌కు తెలియజేశారని పేర్కొంది. మొదటి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేసేందుకు మెమన్ ప్రయత్నించలేదని, అందువల్ల తాజాగా రాష్ట్రపతికి ఆయన పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్.. ఉరిశిక్ష అమలులో అడ్డుకాబోదని స్పష్టం చేసింది. తనకు అనుకూలంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ (రా) మాజీ అధికారి రాసిన ఒక వ్యాసాన్ని, అలాగే స్కీజోఫ్రీనియాతో బాధపడుతున్నాననే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ మెమన్ రాష్ట్రపతికి పెట్టుకున్న రెండో క్షమాభిక్ష పిటిషన్ గురించి తాము ప్రస్తావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టేసిన సమయంలో ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ జడ్జీలు ముగ్గురు( చీఫ్ జస్టిస్ సహా) నిబంధనల ప్రకారం నడుచుకోలేదన్న జస్టిస్ జోసెఫ్ కురియన్ అభిప్రాయంతో బెంచ్ ఏకీభవించలేదు. మెమన్ క్యూరేటివ్ పిటిషన్‌ను మళ్లీ విచారించాలని జస్టిస్ కురియన్ మంగళవారం అభిప్రాయపడిన విషయం తెలిసిందే. మెమన్ ద్రోహి.. ఏజీ.. విచారణ ముగింపు దశలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చేసిన వ్యాఖ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. మెమన్ను ద్రోహి అని రోహత్గీ పేర్కొనడంపై సీనియర్ న్యాయవాది టీఆర్ అంధ్యార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదంటూ మెమన్‌కు మద్దతుగా వాదించబోతున్న అంధ్యార్జునను రోహత్గీ అడ్డుకున్నారు. ‘క్షమాభిక్ష పిటిషన్ అనేది గౌరవానికి సంబంధించిన అంశం కాదు. అది దోషుల రాజ్యాంగ హక్కు. న్యాయపరమైన అన్ని అవకాశాలు పూర్తికాకుండా మెమన్ను ఉరితీయడం అన్యాయం’ అని అంధ్యార్జున అన్నారు. దానికి ‘పేలుళ్లలో చనిపోయిన 250 మంది హక్కుల మాటేమిటి? ద్రోహిని సర్థిస్తూ మీరు మాట్లాడుతున్నారు’ అని రోహత్గీ అన్నారు. ‘మరణం అంచున ఉండి, జీవితం కోసం పోరాడుతున్న వ్యక్తిని పరిహసించకూడద’ని అంధ్యార్జున పేర్కొనడంతో.. మెమన్ను ద్రోహి అని సుప్రీంకోర్టే పేర్కొందని రోహత్గీ గుర్తుచేశారు. కలాంకు నివాళిగా.. ఉరిని నిలిపేయండి! సోమవారం మరణించిన మాజీ రాష్ట్రపతి కలాం సిద్ధాంతాలను గౌరవిస్తూ.. మెమన్‌కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించాలని పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. మరణ శిక్షను కలాం వ్యతిరేకించేవారని, అందువల్ల మెమన్‌కు విధించిన ఉరిశిక్షను తగ్గించడం కలాంకు సరైన నివాళి ఇవ్వడం అవుతుందన్నారు. సుప్రీం తీర్పును పలువురు న్యాయనిపుణులు తప్పుపట్టారు. సాక్ష్యాలను తీసుకొచ్చి, దర్యాప్తులో సాయపడ్డ వ్యక్తిని ఉరితీస్తున్నారని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. ఉరి తీయాల్సిందే..మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేయాల్సిందేనని ముంబై పేలుళ్ల బాధితులు పలువురు స్పష్టం చేశారు. వారంతా కలసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు వినతి పత్రం సమర్పించారు. దానిపై 1,600 మంది సంతకాలు చేశారు. ‘ఆత్మీయులను కోల్పోయి మా కుటుంబాలు ఎంతో వేదనను అనుభవించాయి. మెమన్‌కు ఉరిశిక్ష విధించాల్సిందే’ అని పేలుళ్లలో తన తల్లిని కోల్పోయిన తుషార్ దేశ్‌ముఖ్ డిమాండ్ చేశారు. పార్టీల స్పందన..ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ముంబై పేలుళ్ల బాధితులకు న్యాయం జరిగింది. ఈ దేశ ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మరింత పెరిగింది’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ వ్యాఖ్యానించారు. ముంబై పేలుళ్ల బాధితులకు పాక్షిక న్యాయమే అందింది. పేలుళ్ల కీలక సూత్రధారి టైగర్ మెమన్ను పాక్ నుంచి తీసుకువచ్చి శిక్ష విధించిననాడే వారికి పూర్తి న్యాయం జరిగినట్లు అవుతుంది’ అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జెవాలా పేర్కొన్నారు. మెమన్‌కు క్షమాభిక్ష ప్రసాదించకూడదనేది దేశప్రజలందరి ఆకాంక్ష అని శివసేన పేర్కొంది. న్యాయవర్గాల్లో మాత్రం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిరుత్సాహపరచింది.. ఒవైసీ: కోర్టు తీర్పు నిరుత్సాహపరచిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజకీయ మద్దతు లేకపోవడం వల్లనే మెమన్‌కు ఉరిశిక్ష విధించారన్నారు. పేలుళ్లలో మెమన్ పాత్ర ఉందని, అయితే, అందుకు ఉరిశిక్ష విధించడం మాత్రం సరికాదన్నారు. ‘అప్పటి పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెమన్ను మోసం చేయడం వల్లనే మెమన్‌కు ఉరి శిక్ష పడింది. రాజీవ్ హంతకులు, పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హంతకులకు ఉన్నట్లుగా మెమన్‌కు రాజకీయపరమైన మద్దతు లేకపోవడం కూడా ఒక కారణం’ అని వ్యాఖ్యానించారు. బాబ్రీమసీదు కూల్చివేతదారులకు కూడా ఉరిశిక్ష విధించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఉరి అమలు ఎలా..! జైలు మాన్యువల్ ప్రకారం.. యాకూబ్ మెమన్ను గురువారం వేకుజామున నిద్ర లేపుతారు. స్నానాదికాలు పూర్తయ్యాక తేలిగ్గా ఉండే ఆహారం అందిస్తారు. తర్వాత ప్రార్థన చేసుకునేందుకు అవసరమైన పుస్తకాలు ఇస్తారు. మరణశిక్ష అమలు చేసే ముందు వైద్యులు మెమన్ను పరీక్షిస్తారు. ఆ తరువాత ఉరికంబం వద్దకు తీసుకువెళ్తారు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎంఎం దేశ్‌పాండే టాడా కోర్టు ఉత్తర్వుల్లోని ఉరిశిక్ష అమలు భాగాన్ని మెమన్‌కు చదివి వినిపిస్తారు. మెజిస్ట్రేట్ నుంచి ఆదేశాలు రాగానే తలారి తన చేతిలో ఉన్న లివర్‌ను లాగి, ఉరిశిక్ష అమలు చేస్తాడు. అరగంట పాటు ఆ శరీరం అలాగే ఉరికంబంపై వేలాడుతూ ఉండాలని జైలు మాన్యువల్ స్పష్టం చేస్తోంది. ఆ తరువాత వైద్యుడు పరీక్షించి, చనిపోయినట్లుగా నిర్ధారిస్తారు. ఆ తరువాత పోస్ట్‌మార్టం నిర్వహిస్తారు. ఉరి అమలు చేసే ముందు, మెమన్ బరువును ఉరికంబం, ఉరితాడు తట్టుకోగలదా? లేదా? అనే విషయాన్ని పరీక్షిస్తారు. మెమన్ బరువుకు ఒకటిన్నర బరువున్న వస్తువుతో ప్రయోగం చేసి ఆ విషయాన్ని నిర్ధారిస్తారు. ఎరవాడ జైల్లో అఫ్జల్ కసబ్‌ను ఉరితీసిన బృందాన్ని మెమన్ ఉరి ప్రక్రియను పర్యవేక్షించేందుకు నాగపూర్ జైలుకు రప్పిస్తున్నారు. జైలు వద్ద పటిష్ట భద్రత యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసేందుకు అవసరమైన సన్నాహాలన్నీ పూర్తయ్యాయని నాగపూర్ జైలు వర్గాలు వెల్లడించాయి. అదనపు డీజీపీ(జైళ్లు) మీరా బోర్వాంకర్ ఆ సన్నాహాలను పర్యవేక్షించారు. ఆమెకు డీఐజీ(జైళ్లు) రాజేంద్ర దామ్నె, జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయి సహకరించారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పుణేలోని ఎరవాడ జైల్లో ఉరితీసిన సమయంలో కూడా యోగేశ్ దేశాయి అక్కడే విధుల్లో ఉన్నారు. జైళ్లో భద్రతను పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. యాకూబ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చగానే బుధవారం మధ్యాహ్నం నాగ్‌పూర్ జైలు వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ముంబై పోలీసు విభాగానికి చెందిన సుశిక్షిత ‘క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ)’ను రంగంలోకి దింపారు. యాకూబ్‌ను ఉంచిన సెల్ వద్ద కూడా పహారా బాధ్యతలను ఈ టీమ్‌కే అప్పగించారు. జైలు పరిసరాల్లో జనం గుమిగూడకుండా 144 సెక్షన్‌ను విధించారు. ఉరిఅనంతరం, మెమన్ మృతదేహాన్ని జైళ్లోనే ఖననం చేస్తారా? లేక బంధువులకు అప్పగిస్తారా? అనే విషయంపై జైలు సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. ఒకవేళ, మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలని నిర్ణయిస్తే.. పోస్ట్‌మార్టమ్ పూర్తిచేసి యాకూబ్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగిస్తారు. ఆ తర్వాత నాగ్‌పూర్ నుంచి విమానంలో మృతదేహాన్ని ముంబైకి తరలిస్తారు. ముందు జాగ్రత్తగా, ముంబైలోని మెమన్‌ల నివాసం వద్ద ఏకంగా ఐదువేల మంది పోలీసులను నియమించారు. నేరచరిత్ర కలిగిన వారిని ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. శాంతిని కాపాడాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ఇదివరకే పోలీసులు మతపెద్దలను కోరారు. కాగా, చట్టం తనపని తాను చేసుకుపోతుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. సంయమనం పాటించాలని ప్రజలను కోరారు. యాకూబ్ వీలునామా రాయలేదు యాకూబ్ మెమన్ ఎలాంటి వీలునామానూ రాయ లేదని ఆయన న్యాయవాది అనిల్ గెదామ్ తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి కానీ, రాష్ట్రపతికి సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్ ద్వారా కానీ తనకు ఏదో ఊరట లభిస్తుందని యాకూబ్ ఆశిస్తున్నట్లు చెప్పారు. అందుకే వీలునామా రాయలేదని అన్నారు. మరణశిక్ష అమలు చేసిన తర్వాత అతడి మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు కోరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. -
ఉరికంబానికీ ఉంది వివక్ష
కొత్త కోణం కులంతో పాటు పేదరికం కూడా చాలా మందికి ఉన్నత న్యాయస్థానాల్లో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని నిరాకరిస్తోంది. న్యాయం కోసం హైకోర్టు, సుప్రీం కోర్టుల తలుపులు తట్టడమంటే లక్షల రూపాయలతో పని. ధన బలం ఉన్నవారే ఆ పని చేయగలరు. అలాంటి వారే తమ శిక్షలను తగ్గించుకోగలుగుతున్నారు. దేశంలో గత 15 ఏళ్లలో 1,600 మందికి మరణశిక్ష విధించగా, అందులో 5%కు ఆ శిక్ష ఖరారైంది. వారిలో అత్యధికులు దళితులు, మైనారిటీలేనన్న కఠోర వాస్తవం తెలియజేస్తున్నది అదే. ‘‘మరణశిక్షను ఖరారు చేయడం రాష్ట్రపతిగా నేను ఎదుర్కొన్న అతి కఠిన మైన సమస్య. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేసులే ఎక్కు వగా పెండింగ్‌లో ఉన్నాయి.’’ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్న మాటలివి. మరణశిక్ష విధింపులో ధన, కుల పక్షపాతం కనిపిస్తున్నదని ఆయన సుస్పష్టంగా తెలిపారు. కలాంను వేనోళ్ల కొనియాడుతున్న వాళ్ళు ఆయనలోని ఆ మానవత్వాన్ని పుణికిపుచ్చుకొని, ఎంతవరకు ఆచరణలో పెట్టగలరనేది అనుమానమే. కనీసం ఆలోచించడం మొదలు పెట్టినా అది ఆయనకు ఘన నివాళే. కులం, ధనం కలవారిదే ‘ఉన్నత’ న్యాయం కలాం అభిప్రాయం అక్షర సత్యమని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యా లయం విద్యార్థులు, అధ్యాపకుల అధ్యయనం రుజువు చేసింది. మరణశిక్ష పడ్డ ఖైదీలలో నాలుగింట మూడువంతులు వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలేనని తేల్చింది (93% దళితులు, మైనారిటీలు). 23% నిరక్షరా స్యులు కాగా, మిగతావారిలో చాలా మంది హైస్కూల్ విద్యకు నోచుకోని వారు. వీరిలో చాలా మందిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచనూ లేదు, న్యాయవాదులతో తమ కేసును చర్చించే అవకాశమూ ఇవ్వలేదు. మరీ దుర్మార్గంగా మరణ శిక్షకు గురైనవారిలో చాలా మందిని ప్రత్యేక గదుల్లో బంధించి, ఎవరితో కలవకుండా చేశారు. కులంతో పాటు పేదరికం కూడా చాలా మందికి ఉన్నత న్యాయస్థానాల్లో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని నిరాకరించింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల తలుపులు తట్టడ మంటే లక్షల రూపాయలతో పని. ధన బలం ఉన్నవారే ఆ పని చేయగలరు. అలాంటి వారే తమ శిక్షలను తగ్గించుకోగలిగారు. దేశంలో గత 15 ఏళ్లలో 1,600 మందికి మరణశిక్ష విధించగా, అందులో 5%కు ఆ శిక్ష ఖరారైంది. వారిలో అత్యధికులు దళితులు, మైనారిటీలేనన్న కఠోర వాస్తవాన్ని ఈ అధ్య యనం బయటపెట్టింది. భారత న్యాయవ్యవస్థ... బొమ్మా బొరుసు ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో వైపున ఇంకో కథ ఉంది. దళితులు నిందితులుగా ఉన్న కేసుల్లో శిక్షలు ఖరారై ఉరికంబం ఎక్కితే, దళితులు ఊచ కోతకు గురైన కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. ఇది, నిగ్గు తేలిన నిజాలు చెబుతున్న కథ. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో దళితులపై జరి గిన రెండు ఘోర దురాగతాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి చర్చను రేకెత్తించాయి. అయినా ఆ రెండు కేసుల్లోనూ నిందితులు నిర్దోషులుగానో, లేదా తక్కువ శిక్షలతోనో బయటపడ్డారు. ఒకటి ‘చుండూరు’. 1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో అగ్రవర్ణాల వారు దళితవాడపై దాడి చేసి, వేట కొడవళ్ళతో, గొడ్డళ్లతో, బరిసెలతో దళితులను వెంటాడి, వేటాడి చంపారు. ఆ మారణ కాండలో ఎనిమిది మంది దళితులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి, గోనెసంచుల్లో మూటగట్టి, రాళ్ళు కట్టి తుంగభద్రలో పడే శారు. ఇద్దరు అన్నదమ్ములను మల్లెతోటలోనే చంపి భూమిలో తొక్కేశారు. ఒకరిని సజీవంగానే సంచులలో కుక్కి కాలువలో పడేశారు. ఈ ఘోరంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం కారణంగా ఏర్పాటైన ప్రత్యేక కోర్టు 16 ఏళ్ల సుదీర్ఘ విచారణ తదుపరి, 2007లో తీర్పును వెలువరించింది. ఇది అరుదైన వాటిలో కెల్లా అత్యంత అరుదైన కేసు కాదంటూ నిందితులకు మరణశిక్ష గాక, యావ జ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రత్యేక కోర్టు చేసిన ఈ వ్యాఖ్య నేరం తీవ్ర తను తగ్గించేసింది. ఏడేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు... అంతా నివ్వెరపోయేలా ప్రాసిక్యూషన్ నేరాన్ని నిరూపించడంలో విఫలమైందంటూ నిందితులందరినీ విడుదల చేయాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ఉన్నత న్యాయస్థానాల్లో నిరుపేదలకు, దళితులకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం సన్నగిల్లింది. చుండూరు కేసు అరుదైనది కాకపోతే, అరుదైనవిగా పేర్కొన్న చాలా కేసులు కూడా అరుదైనవి కాకపోయే ఉండాలి. జరిగిన ఘోర దురంతం కాదనలేనిదై నప్పుడు... ప్రాసిక్యూషన్ విఫలమైతే, ఆ కేసును తిరిగి పరిశోధించాలని, అవసరమైతే అందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని హైకోర్టు ఆదేశించాల్సింది. కానీ అలా చేయలేదు. దీంతో న్యాయస్థానం తన బాధ్యతను విస్మరించిందని విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సరిగ్గా విరుద్ధమైన పరిస్థితి విజయవాడ శ్రీలక్ష్మి హత్య కేసు. ఆ విద్యార్థినిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపినందుకు మనోహర్ అనే యువకుడికి మరణ శిక్ష విధించాలని పలు మహిళా సంఘాలు, పార్టీలు డిమాండ్ చేశాయి. నిందితుడి తరఫున వాదించరాదని న్యాయవాదులు ఏకగ్రీ వంగా తీర్మానించారు. న్యాయస్థానం సైతం మనోహర్‌కు మరణ శిక్ష విధిం చింది. మంచిదే అలాంటి దుర్మార్గుడికి ఆ శిక్ష పడాల్సిందే. కానీ ఈ హత్యతో పోలిస్తే, చుండూరు మారణకాండ కొన్ని వేల రెట్లు అమానుషమైనది. మనో హర్ కేసులో ఏడాదిలోగానే విచారణ పూర్తయింది, శిక్ష పడింది. కానీ చుం డూరు కేసు విచారణకు 16 ఏళ్లు పట్టింది, నలుగురు జడ్జీలు మారారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకానికే తొమ్మిదేళ్ళు పట్టింది! సాక్షులు సైతం చాలా మంది చనిపోయారు. ఈ రెండు కేసుల్లో ఎందుకింత వ్యత్యాసం? ఢిల్లీ అధ్యయనం పేర్కొన్నట్టు న్యాయ ప్రక్రియలో, శిక్షల విధింపులో కులం, ధనం ప్రాబల్యం వహిస్తున్నాయనేది సులభంగానే అర్థమవుతుంది. దళితులపై దురాగతాలు ‘అరుదైనవి’ కాలేవు ఇక మహారాష్ట్రకు వస్తే, నాగపూర్ సమీపంలోని భండార జిల్లా ఖైర్లాంజిలో ఒక భూవివాదం సాకుతో ఆధిపత్య కులాల వారు భూత్ మాంగే అనే ఒక దళితుని కుటుంబంలోని నలుగురిని కిరాతకంగా చంపేశారు. దాదాపు 40 మంది మారణాయుధాలతో చుట్టుముట్టి మాంగే గుడిసెను తగులబెట్టి, ఆయన భార్యను, ఇద్దరు కొడుకులను, కూతురిని చిత్రహింసలకు గురిచేసి, తల్లీ కూతుళ్ళిద్దరిపై నడిబజారులో అత్యాచారం జరిపి అతి అమానుషంగా చం పారు. ఈ ఘోరాన్ని ఆధిపత్య కులాల మహిళలు ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా పొదల మాటున దాగి చూసిన భూత్ మాంగే స్వయంగా కేసుపెట్టారు. 2008లో ఆరుగురు నిందితులకు ప్రత్యేక న్యాయ స్థానం మరణ శిక్ష విధించింది. కానీ తర్వాత బొంబాయి హైకోర్టు దీన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది! ఇక ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో ఐదుగురు దళిత యువకులు, ఒక జాట్ అమ్మాయిపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు పెట్టిన కేసులో నిందితులకు మరణశిక్ష విధించారు. కాగా, 1999 డిసెంబర్ 31 అర్ధరాత్రి మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని ఒక హోటల్లో పనిచేస్తున్న లక్ష్మి (పేరు మార్చాం) అనే దళిత యువతి అత్యాచారానికి గురైంది. ఆమె నిందితులను గుర్తుపట్టి, జరిగిన దురాగతాన్ని కోర్టులో పూసగుచ్చినట్టు వివ రించింది. అయినా ఆ కేసులోని నిందితులంతా నిర్దోషులుగా బయట పడ్డారు! దీన్ని బట్టి మన దేశంలో అమలవుతున్న నేరము-శిక్ష స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. మనుస్మృతి ఆధారంగానే నేరము-శిక్ష ఇలా ఒక్కొక్కటొక్కటిగా చూస్తుంటే న్యాయం త్రాసులో బలిపశువులుగా మారుతున్న వారంతా దళితులు, పేదలేనని రుజువవుతుంది. నేరం చేసిన వారెవ్వరైనా శిక్ష అనుభవించాల్సిందే, తప్పించుకోడానికి వీల్లేదు. నేరస్తుల విచారణ, విధిస్తున్న శిక్షల్లోని అంతరాలను గమనిస్తే నేరం తీవ్రతేగాక కులం, ధనం వంటి ఇతర అంశాల ప్రభావం తీర్పులపై అధికంగా ఉంటున్నట్టు స్పష్టమవుతోంది. ఢిల్లీ అధ్యయనం దీన్ని మరోమారు రుజువు చేసింది. రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రం కేవ లం రాతలకే పరిమితమైంది. వాస్తవంగా అమలవుతున్నది భారత రాజ్యాం గం కాదు. రెండు వేళ ఏళ్ల నాటి మనుస్మృతి. దానిలో 8, 9, 11 అధ్యాయాల లోని నేరము-శిక్షకు సంబంధించిన అంశాలన్నీ పుట్టుకను బట్టి, వర్ణాన్ని బట్టి శిక్షలని నిర్దేశించాయి. చాతుర్వర్ణ వ్యవస్థలోని ప్రజలకు వారి వారి వర్ణ నేప థ్యాన్ని బట్టి మనువు శిక్షలను ఖరారు చేశాడు. ఆ మనుధర్మాన్ని మెదళ్ల నిండా నింపుకొని మనం భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాం. ఆరు దశాబ్దాల స్వతంత్ర భారత న్యాయ చరిత్ర దాన్నే రుజువు చేస్తోంది. ఈ తీరు మారాలి, తీర్పులూ మారాలి. అప్పుడే న్యాయానికి ధనిక, పేద, కుల, మత, ప్రాంతీయ భేదాలుండకూడదన్న అబ్దుల్ కలాం కల నిజమవుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 -
యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖాయం
1993 ముంబయి పేలుళ్ల కేసులో తొలి మరణశిక్ష క్యూరేటివ్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు; జూలై 30న ఉరి న్యూఢిల్లీ: ముంబయిలో 1993 నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో నేరస్థుడు యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో అతని ఉరిశిక్ష అమలు ఖరారైనట్లయింది. మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు సహ కుట్రదారులుగా యాకూబ్ మెమన్ అతని సోదరుడు టైగర్ మెమన్లను న్యాయస్థానం నిర్ధారించి మరణ శిక్షను విధించింది. 1993 తరువాత టైగర్ దేశం విడిచి పారిపోయాడు. 1994లో నేపాల్ సరిహద్దులో యాకూబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తనకు మరణ శిక్ష నుంచి మినహాయింపునివ్వాల్సిందిగా యాకూబ్ మెమన్ సర్వోన్నత న్యాయస్థానంలో నిరుడు క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అతను పిటిషన్ లో పేర్కొన్న కారణాలు క్షమాభిక్షకు అర్హమైనవి కావని తేల్చిచెప్పింది. ఈ కేసులో మరణ శిక్ష అమలవుతున్న తొలి నేరస్థుడు మెమనే. తాను 1996 నుంచి దాదాపు 20 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నానని, మనోవైకల్యంతో బాధపడుతున్నానని యాకూబ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఒక నేరస్థుడికి ఒక నేరంలో జీవితఖైదు, ఉరిశిక్ష రెండు శిక్షలు వేయజాలరని యాకూబ్ తరపు న్యాయవాదులు వాదించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఏఆర్ దవేలతో కూడిన ధర్మాసనం ఈ వాదనలను కొట్టివేసింది. సుప్రీం తీర్పుతో జూలై 30న యాకూబ్ ఉరికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నాగపూర్ సెంట్రల్ జైలులో కానీ, పూణె ఎఱవాడ జైలులో కానీ ఉరిశిక్ష అమలు చేయవచ్చని నాగపూర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయ్ తెలిపారు. చరిత్రాత్మకం: ఉజ్వల్ నికమ్ యాకూబ్ మెమన్ క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించటం చరిత్రాత్మకమని ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ అన్నారు. సుప్రీం తీర్పును శివసేన కూడా హర్షించింది. ఇదేకేసులో గతంలో అరెస్టయి ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా ఉన్న అబూ ఆజ్మీకూడా ఆహ్వానిస్తున్నానని అన్నారు. గవర్నర్‌ను క్షమాభిక్ష కోరిన యాకూబ్ క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించటంతో తుది ప్రయత్నంగా మహారాష్ట్ర గవర్నర్‌ను క్షమాభిక్ష కోరుతూ యాకూబ్ మెర్సీ పిటిషన్ దాఖలు చేశారు. నాగపూర్ సెంట్రల్ జైలు అధికారులకు ఈ పిటిషన్‌ను అందజేశారు. తొలి క్షమాభిక్ష పిటిషన్‌ను యాకూబ్ సోదరుడు సులేమాన్ వేశారని, ఇప్పుడు యాకూబ్ స్వయంగా క్షమాభిక్ష కోరుతున్నందున రెండో క్షమాభిక్ష పిటిషన్ చెల్లుతుందని ఆయన లాయర్ అనిల్ గెడెమ్ తెలిపారు. ముంబయి పేలుళ్ల కేసు పరిణామ క్రమం 1993 మార్చి 12: ముంబైలో 13 ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి.. 713మందికి పైగా గాయాలు 1993 నవంబర్ 4: 189 మంది నిందితులపై దాదాపు 10వేల పేజీల చార్జిషీటు దాఖలు 1995 ఏప్రిల్ 10: 26మంది నిందితులను విడుదల చేసిన టాడా కోర్టు. 2001 జూలై18: 684మంది సాక్షుల స్టేట్మెంట్ల రికార్డు పూర్తి 2003 సెప్టెంబర్: పూర్తయిన విచారణ.. రిజర్వులో తీర్పు 2006 సెప్టెంబర్ 12: తీర్పు వెల్లడి. యాకూబ్ మెమన్‌తో సహా అతని నలుగురు కుటుంబ సభ్యులు దోషులుగా ఖరారు. యాకూబ్ సహా 12మంది నిందితులకు మరణ శిక్ష. మరో 20మందికి జీవిత ఖైదు. 2013 మార్చి 21:యాకూబ్ ఉరిశిక్షను సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. 2014 మే: యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. 2014 జూన్ 2: సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్‌ను వేసిన యాకూబ్ 2015 జూలై 21: క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత -
రాజీవ్ హంతకులు క్షమాభిక్షకు అనర్హులు
సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులకు క్షమాభిక్ష పొందే అర్హత లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఆ హత్య విదేశీయుల పాత్ర ఉన్న కుట్ర ఫలితమని పేర్కొంది. రాజీవ్ హత్య కేసులో దోషులుగా తేలి, జైలుశిక్ష అనుభవిస్తున్న శ్రీలంకకు చెందిన శ్రీహరన్ అలియాస్ మురుగన్, శాంతన్, రాబర్ట్ పియస్, జయకుమార్లతో పాటు, భారతీయులైన నళిని, రవిచంద్రన్, అరివులకు క్షమాభిక్ష ప్రసాదించి, జీవిత ఖైదునుంచి విముక్తి కల్పించాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్.. రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించడంపై కేంద్ర అభిప్రాయాన్ని ప్రధానన్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి వివరించారు. ‘వీరు మన మాజీ ప్రధానమంత్రిని చంపారు. ఇందులో విదేశీయుల కుట్ర ఉంది. వారికి క్షమాభిక్ష ఏంటి? వారి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి, గవర్నర్(తమిళనాడు) ఇద్దరూ తిరస్కరించారు’అని రంజిత్ వివరించారు. దోషుల్లో మురుగన్ తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ హాజరయ్యారు. వాదనల సమయంలో జరిగిన చర్చ సందర్భంగా.. ‘నేరస్థుల మరణ శిక్షను మేం ఇప్పటికే జీవిత ఖైదుగా మార్చాం. ఇప్పుడు మళ్లీ మా తీర్పును రాష్ట్ర ప్రభుత్వం మార్చాలనుకుంటోంది. సీబీఐ దీన్ని సవాలు చేయొచ్చా? వారికి శిక్ష పడింది కూడా సీబీఐ దర్యాప్తుతోనే కదా!’ అని ధర్మాసనం ప్రశ్నిం చింది. మరోవైపు, ‘ఒక సారి మేం మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చిన తరువాత వారికి శిక్ష తగ్గించే విషయంలో అధికారం రాష్ట్రాలకు ఉంటుం ది. దోషులు ఇప్పటికే 23 ఏళ్లుగా జైళ్లోనే ఉన్నారని, అది చాలని తమిళనాడు ప్రభుత్వంవాదిస్తోంది. ఈ విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు?’అని కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్ర దర్యా ప్తు సంస్థలు విచారణ జరిపిన కేసుల్లో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే లేదాశిక్షను తగ్గించే అధికారం కేంద్రాలకు ఉంటుందా? లేక రాష్ట్రాలకు ఉంటుందా? అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. -
తల్లిదండ్రుల వద్దకు వీధి బాలలు
విజయవంతంగా ‘ఆపరేషన్ ముస్కాన్’ సత్ఫలితాలిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారించి.. బాలల అప్పగింత హైదరాబాద్: ఇంటినుంచి పారిపోయి వీధి బాలలుగా మారిన చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు రా్రష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ సత్ఫలితాలిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో ఈ కార్యక్రమం అమలు బాధ్యతను మహిళా శిశు సంక్షేమ, పోలీసు శాఖలు సంయుక్తంగా చేపట్టాయి. రాష్ట్రంలోని పది జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్‌ల నిమిత్తం పోలీసు, కార్మిక, శిశు సంక్షేమ, విద్యా శాఖల నుంచి ఒక్కో అధికారి, స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థల నుంచి మరికొందరు సభ్యులుగా బృందాలను ఏర్పాటుచేశారు. ప్రధాన కూడళ్ల వద్ద భిక్షాటన చేస్తున్న వీధి బాలలు, కాగితాలు ఏరుకునే వారు, రైల్వే ఫ్లాట్‌ఫారాలపై ఉంటున్నవారు, దుకాణాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి.. వారందరినీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతి గృహాలకు తరలిస్తారు. బాలల నుంచి వారి స్వస్థలం, కుటుంబ వివరాలను సేకరించి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందజేస్తారు. ఆపై ఎవరైనా తామే తల్లిదండ్రులమని తగిన గుర్తింపు పత్రాలతో వస్తే.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)ల సమక్షంలో విచారించి బాలలను అప్పగిస్తారు. వారం రోజుల్లో 970 మంది పట్టివేత వారం రోజులుగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో బాలల పరిరక్షణ బృందాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 970 మంది బాలలను పట్టుకున్నారు. వీరిలో బాలకార్మికులే ఎక్కువమంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో దొరికిన బాలలను ఆయా జిల్లా కేంద్రాల్లోని తాత్కాలిక వసతి గృహాల్లో ఉంచి, చదువు నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన బాలలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు అందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ ముస్కాన్‌ను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించారు. ఆపరేషన్ ముస్కాన్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఐసీపీఎస్) నుంచి నిధులను కేటాయించారు. -
రేపు తేలకపోతే కష్టమే!
హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌పై సోమవారం కూడా స్పష్టత రాలేదు. అన్ని కాలేజీలకు సంబంధించిన కేసులను జేఎన్టీయూహెచ్ ఫైల్ చేయనందున ఈ కేసు విచారణను హైకోర్టు బుధవారానికి (ఈనెల 15కు) వాయిదా పడింది. మరోవైపు ప్రవేశాల ముగింపు, తరగతుల ప్రారంభ గడువు సమీపిస్తోంది. బుధవారం నాటి విచారణలో ప్రవేశాలపై స్పష్టతరాకపోతే.. ఈ నెలాఖరుకు ప్రవేశాలు పూర్తయి, వచ్చే నెల 1న తరగతులు ప్రారంభం కావడం కష్టమనే అభిప్రాయాన్ని అధికారులే వ్యక్తం చేస్తున్నారు. ఇక కాలేజీల అఫిలియేషన్ల కేసులో సోమవారం స్పష్టత వస్తుందని, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎదురుచూసిన తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు. కౌన్సెలింగ్‌కు అనుమతి వస్తేనే.. ఇంజనీరింగ్ ప్రవేశాల వ్యవహారంలో ఈనెల 15వ తేదీన స్పష్టత వస్తేనే నెలాఖరుకు ఒకటి, రెండు దశల ప్రవేశాల కౌన్సెలింగ్‌ను పూర్తి చేయవచ్చని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. 16న వెబ్ ఆప్షన్లు ప్రారంభించినా.. ఆ తరువాత 3 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని, తర్వాతే సీట్లను కేటాయించాల్సి ఉంటుందని, విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు గడువు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియకు పది రోజులు పడుతుందని చెప్పారు. ఇక రెండోదశ కౌన్సెలింగ్‌కు కనీసం ఐదు రోజులు పడుతుందన్నారు. 15న స్పష్టత రాకపోతే ఆగస్టు 1న తరగతుల ప్రారంభం కష్టమేనని, ఇందుకు గడువు కోసం మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. -
‘వ్యాపమ్’ దర్యాప్తునకు 40 మందితో సీబీఐ బృందం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణంపై దర్యాప్తు చేయటానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం 40 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారి సారథ్యంలోని ఈ బృందం సోమవారం భోపాల్ చేరుకుని దర్యాప్తు స్వీకరిస్తుందని.. సీబీఐ మీడియా సమాచార అధికారి ఆర్.కె.గౌర్ తెలిపారు. వ్యాపమ్ కుంభకోణం పైనా, ఆ కుంభకోణానికి సంబంధించిన వారి అసహజ మరణాలపైనా సీబీఐ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. సీబీఐ ఈ దర్యాప్తుపై ఈ నెల 24వ తేదీలోగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. -
దేశానికి పంగనామాలు పెట్టొద్దు
తానా రెండో రోజు మహా సభల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలుగు లిపి అజంతా శిల్పమంతటి అందమైనదన్న జస్టిస్ ఎన్వీ రమణ డెట్రాయిట్: అమెరికా తెలుగు అసోసియేషన్(తానా) మహాసభలు రెండోరోజు ఘనంగా జరిగాయి. ఈ సభలకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మతం ఏదైనా, కులం ఏదైనా జనాలందరూ తమకు కావల్సినట్లు అడ్డనామమో, నిలువునామమో పెట్టుకోండిగానీ దేశానికి మాత్రం పంగనామాలు పెట్టొద్దని అన్నారు. భారతీయ విధానాల్లో సైన్స్ నిగూఢంగా దాగుందన్నారు. ధ్యానం దేవుడితో మాట్లాడే వైర్లెస్ టెక్నాలజీ అని చెప్పారు. జస్టిస్ నూతలపాటి వెంకటరమణ మాట్లాడుతూ 36.5 కోట్ల మంది యువతతో భారత్ నవయవ్వనంతో తొణికిసలాడుతోందని అన్నారు. తెలుగు లిపి అజంతా శిల్పమంతటి అందమైనదని, జపాన్, చైనా దేశాలు భాషనే ఆయుధంగా మలుచుకుని ప్రపంచ వాణి జ్యాన్ని శాసిస్తున్నాయని అందుకే అందరూ భాషను గుర్తించి గౌరవించాలని కోరారు. అనంతరం వెంకయ్య నాయుడు వేడుకల సావనీర్‌ను విడుదల చేశారు. చిత్తూరు ప్రవాసులు న్యూట్రిన్ సంస్థల ఉపాధ్యక్షురాలు అనితారెడ్డికి ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఈ సభల సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్ ఆధ్వర్యంలో రాజకీయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు రైతులకు పింఛను పథకాన్ని అమలు చేయాలని సభల్లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అందరూ తనను మౌనముని అంటారని కానీ తనను తాను మహామౌనమునిగా పిలుచుకుంటానని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సభలో చమత్కరించారు. రెండోరోజు జరిగిన పలు కార్యక్రమాల్లో నిర్మాత సురేశ్‌బాబు, ఏపీ స్పీకర్ కోడెల, మేరీల్యాండ్ ప్రతినిధుల సభ సభ్యురాలు కాట్రగడ్డ అరుణ మిల్లర్ , ఎంపీ సీఎం రమేశ్, ఏపీ మంత్రులు అయ్యనపాత్రుడు, కామినేని, పరిటాల, క్యూబాలో భారత రాయబారి రవి, పితాని, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ , టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సినీనటుడు వెంకటేశ్, నటులు నారా రోహిత్, హరినాథ్ పొలిచెర్ల తదితరులు పాల్గొన్నారు. -
సుప్రీంకు దిగ్విజయ్
ఒకరి తరువాత ఒకరుగా నిందితులు అనుమానాస్పద పరిస్థితిలో మరణిస్తున్న మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షల బోర్డు స్కాం(వ్యాపమ్)ను తక్షణం సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ జూన్ 30న సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దేశంలోనే ఏ కేసులోనూ జరగని విధంగా ఇందరు నిం దితులు అనుమానాస్పదంగా మరణించడం ఆందోళనకరమనీ, అనధికార వార్తల ప్రకారం 40మంది చనిపోయినట్లు సమాచారముందని దిగ్విజయ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సక్రమంగా విచారించలేకపోతున్నందువల్ల.. అత్యున్నత ధర్మాసనం పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరగాలని దిగ్విజయ్ కోరారు. -
ఆమె శరీరం మీద ఆమెదే సంపూర్ణ హక్కు..
ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో... అది భారతదేశం అవుతుంది. అమ్మను, చెల్లిని, బిడ్డను... ‘తల్లీ’ అని పిలుచుకోవడం మన ఆచారం. జన్మనిచ్చిన తల్లి అని కాదు... ముక్కోటి దేవతల ప్రతీక అని. దేవుడి కోసం మనం గుడి కడితే... దేవుడు తన కోసం కట్టుకున్న గుడి... స్త్రీ అని నమ్ముతాం. ‘ఈ గుడి పవిత్రతను కాపాడడంలో రాజీ ఉండదు, ఉండకూడదు’ అని ఉపదేశించిన మరో మహోన్నత దేవాలయమే... సమాజం కట్టిన సుప్రీం దేవాలయం. స్త్రీని పూజించే కంటే ముందు... స్త్రీని రక్షించే ఈ దేవాలయానికి కృతజ్ఞతాపూర్వక సాష్టాంగ వందనాలు. 2004.. జనవరి.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని ఓ గ్రామం. స్నేహితురాలు వనజ ఇంటి నుంచి బయలుదేరింది పద్మ (పేరు మార్చాం). ఆ అమ్మాయి పదవ తరగతి చదువుతోంది. వనజ వాళ్లన్నయ్య దగ్గర లెక్కలు చెప్పించుకోవడానికి స్కూల్ అవగానే వనజతో కలిసి వాళ్లింటికి వెళ్తుంటుంది. ఆ రోజు ట్యూషన్ అయిపోయాక సాయంత్రం ఆరున్నరకు ఇంటికి బయలుదేరింది. వనజ వాళ్లింటికి పద్మ వాళ్లింటికి అట్టే దూరం లేకపోయినా మధ్యలో పొదలు ఉంటాయి. చుట్టుపక్కల ఇళ్లేవీ ఉండవు. పద్మ సరిగ్గా ఆ పొదల దగ్గరకు రాగానే సంతోష్ (పేరు మార్చాం) ఆమె దారికి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు. సంతోష్ ఆ ఊరి మోతుబరి కొడుకు. ఆకతాయి. సంతోష్ గురించి తెలిసిన పద్మ తలవంచుకొని తానే పక్కనుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. వెళ్లనివ్వలేదు సంతోష్. పైగా తాగి ఉన్నాడు. పద్మ వెన్నులో సన్నని వణుకు. అరవబోయింది. చేత్తో నోటిని మూసి పద్మను పొదల్లోకి ఎత్తుకెళ్లాడు. గంట తర్వాత పద్మ ఇంటికి చేరింది.. సంతోష్ పారిపోయాడు. రాత్రి తొమ్మిదింటికి ఊళ్లో పంచాయితీ. ‘పోలీస్ స్టేషన్‌కి వెళ్లకుండా పంచాయితీలోనే రెండు కుటుంబాల వాళ్లు కాంప్రమైజ్ అయిపోండి’ అని పంచాయితీ పెద్దలు చెప్పారు. పద్మ వాళ్లన్నయ్య ‘అట్లెట్టా ఊరుకుంటాం.. వాడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సిందే’ అని పట్టుబట్టాడు. ఆ రాత్రికి రాత్రే చెల్లెలిని, తండ్రిని తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు పద్మవాళ్లన్నయ్య. కంప్లయింట్ ఇచ్చారు. పద్మను మెడికల్ టెస్ట్‌కు పంపారు. మరుసటి రోజు... మెడికల్ రిపోర్ట్ వచ్చింది పద్మ రేప్‌కి గురైనట్టు. పారిపోయిన సంతోష్‌ను పట్టుకొచ్చారు పోలీసులు. గ్రామ పెద్దతో పాటు రెండు కుటుంబాల వాళ్లూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కేసులు పెట్టుకొని ఎంత దూరం పోతరు? ఆడపిల్ల.. ఆలోచించుండ్రి’ అన్నడు గ్రామపెద్ద. ‘మావాడు చేసింది తప్పే.. మా తాహతుకు తగకపోయిన వాడు చేసిన తప్పుకి శిక్షగా మీ పిల్లను మా ఇంటి కోడల్ని చేసుకుంటం.. దీన్ని ఇక్కడితోనే ఇడిచిపెట్టుండ్రి’ అన్నాడు సంతోష్ మేనమామ. పద్మ మేనమామా ఆ పరిష్కారానికి అంగీకరించాడు. పద్మతల్లిదండ్రులనూ ఒప్పించాడు. ఒప్పందం కుదిరింది. రెండు కాళ్లమధ్య తలపెట్టుకొని వెక్కివెక్కి ఏడుస్తున్న పద్మకు సంబంధం లేకుండానే ఒప్పందం కుదిరింది. సంతోష్‌ని చూస్తే వణికిపోతున్న పద్మ అంగీకారం లేకుండానే అతనితో ఆమె పెళ్లి నిశ్చయమైంది. టెన్త్‌లో స్కూల్ ఫస్ట్ రావాలనే లక్ష్యం తప్ప ఇంకే ఆలోచనా లేని ఆమె ఈసారి పెళ్లి అనే బలవంతానికి గురైంది! ఇది పదకొండేళ్ల నాటి మాట.. ఊరి పెద్దలు, పోలీసులు, తల్లిదండ్రులు కలిసి చేసిన మధ్యవర్తిత్వానికి ఓ అమాయకురాలు బలైంది. పైకి పొక్కింది ఇదొక్క సంఘటనే. పొక్కనివి, బాధితురాలి నోరు నొక్కి పెళ్లి చేసినవీ ఎన్నో! 2015.. జూలై.. ఇక నుంచి ఇలాంటి మధ్యవర్తిత్వాలు చెల్లవు. రేప్ చేసిన వాడు శిక్షను అనుభవించాల్సిందే! ‘స్త్రీ దేహం.. ఆమెకు దేవాలయం! ఆమె శరీరం మీద ఆమెదే సంపూర్ణహక్కు. స్త్రీ ఆత్మగౌరవాన్ని కించపరిచే నిర్ణయాలతో, ఒప్పందాలతో ఆమె సమాధానపడవల్సిన అవసరం లేదు. రేప్‌కి గురైన స్త్రీ తల్లిదండ్రులతో నేరస్థుడు ఎలాంటి మధ్యవర్తిత్వం నెరపడానికీ వీల్లేదు. పెళ్లి చేసుకుంటానని, నష్టపరిహారమిస్తాననే ప్రలోభాలతో కేస్‌ను విత్‌డ్రా చేయించే ప్రసక్తే లేదు. నేరస్థుడు శిక్ష అనుభవించాల్సిందే ’ అంటూ మూడ్రోజుల క్రితమే జూలై ఒకటో తారీఖున సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుకి కారణమైన కేసు ఇదే 2008లో మధ్యప్రదేశ్‌లో ఏడేళ్ల పాప రేప్‌కి గురైంది. నేరస్థుడికి సెషన్స్‌కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. పాప తల్లిదండ్రులకు నష్టపరిహారం పేరుతో కొంత డబ్బిచ్చి రాజీ కుదుర్చుకున్న నేరస్థుడు శిక్ష రద్దు చేయించుకోవడానికి మధ్యప్రదేశ్ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని 2009లో హైకోర్టు నేరస్థుడి శిక్షను తగ్గించి యేడాదికి కుదించింది. ఈ తీర్పు వెలువడే సరికి యేడాది కాలం పట్టింది కాబట్టి ఆ యేడాదీ శిక్షా పూర్తయిందని కేస్ కొట్టేసింది హైకోర్టు. అయితే హైకోర్టు తీర్పు మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీకోర్టుకు అప్పీలు చేసింది. అదే సమయంలో తమిళనాడులో ఓ రేప్ కేసు నమోదై మద్రాస్ హైకోర్టుకు వచ్చింది. అందులో కూడా అత్యాచార బాధితురాలు మైనర్ బాలికే (15). రేప్‌వల్ల గర్భవతి అయింది. మద్రాస్ హైకోర్టు జడ్జి ఆ అమ్మాయితో... ‘నీకు పుట్టబోయే బిడ్డ శ్రేయస్సు కోసం అతడిని (రేపిస్టుని) పెళ్లిచేసుకో’ అంటూ రాజీకుదిర్చాడు. మధ్యప్రదేశ్ హైకోర్టు కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు ఆ తీర్పుతోపాటు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పునూ తూర్పార బడుతూ స్త్రీ ఆత్మగౌరవాన్ని భంగపరిచే రాజీలు కుదరవు. నేరస్థుడు శిక్ష అనుభవించాల్సిందే అంటూ తన తీర్పును స్పష్టం చేసింది. - సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మధ్యవర్తిత్వం అంటే ఏంటి? అఈఖ.. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) 89 సెక్షన్ కింద 2002 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం సులభంగా పరిష్కారం అయ్యే కేసులను కోర్టులో విచారణ ప్రారంభానికి ముందు ఈ మీడియేషన్ సెంటర్‌కి జడ్జి రిఫర్ చేస్తారు. సివిల్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులనే ఈ మీడియేషన్ సెంటర్‌కి రిఫర్ చేస్తారు. లైంగికదాడులు, యాసిడ్దాడులు, హత్యలు, ఆత్మహత్యలు, డౌరీ డెత్కేసులు, డెకాయిటీ కేసులను మీడియేషన్ సెంటర్‌కి రిఫర్చేయరు. చేయకూడదు కూడా! - ఇ. పార్వతి, హైకోర్టు అడ్వొకేట్ సమర్థించే అంశాలు కావు ఆడపిల్లలపై లైంగిక దాడి కేసుల్లో మధ్యవర్తిత్వం, రాజీ కుదుర్చు కోవడం లాంటివి సమర్థించే అంశాలు కావు. రాజీకి రావడానికి సమాజం కూడా ఓ కారణం. కాబట్టి మార్పనేది సమాజం నుంచే రావాలి. ప్రతి ఒక్క పౌరుడు దేశంలో జరుగుతున్న హింసను అరికట్టడంలో తమ వంతు బాధ్యతను నిర్వహించాలి. - డాక్టర్ లక్ష్మీదేవి, కేశవ్‌మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ ఈ తీర్పు మీద ఏమంటున్నారంటే.. ఏ ఆడపిల్లా కోరుకోదు రేప్ చేసిన మృగాన్ని పెళ్లి చేసుకోవాలని ఏ ఆడపిల్లా కోరుకోదు. ఇలాంటి వ్యక్తులకు పడే శిక్షలు వెలుగు చూస్తే ఇలాంటివి రిపీట్ కావు. - మౌనిక, సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఏ రకంగానూ భర్తీ చేయలేం రాజీ కుదుర్చుకోవడం కరెక్ట్ కాదు. ఆడపిల్లకు ఇలాంటి సంఘటనల కారణంగా కలిగే నష్టాన్ని ఏ రకంగానూ భర్తీ చేయలేం. ముందు అతనికి శిక్ష పడాలి. అలాగే ప్రభుత్వం బాధితురాలి కెరీర్‌కు ఆసరానివ్వాలి - సరోజినీ వల్లారపు, సాఫ్ట్వేర్ ఉద్యోగి మనకన్నా న్యాయంగా... మన కన్నబిడ్డ మనసు గురించి మనకన్నా సుప్రీంకోర్టే న్యాయంగా ఆలోచిస్తుందని తల్లిదండ్రులు ఇప్పటికైనా గ్రహించాలి. రేప్‌కు గురైన అమ్మాయిని సమాజం ఆమెను చూసే విధానంలో మార్పు రావాలి. -మాధవీలత, సామాజిక పరిణామాల విశ్లేషకురాలు ప్రక్షాళన కావాలి తీర్పు సరే.. అసలు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, సభ్యసమాజం పూర్తిగా ప్రక్షాళన కావాలి. - శిలాలోలిత, లెక్చరర్, రచయిత్రి పెళ్లేమిటి!? సుప్రీం తీర్పు ఆహ్వానించదగ్గదే. రేప్ చేసిన వాడితో పెళ్లేమిటి? వాడిని కఠినంగా శిక్షించకుండా! -సతీష్, కాప్రికాన్ సిస్టమ్స్ -
ఎనిమిది వారాలు గడువు
పాలికె ఎన్నికల నిర్వహణపై సుప్రీం తీర్పు బెంగళూరు: బీబీఎంపీ ఎన్నికల నిర్వహణకు మరో ఎనిమిది వారాల పాటు గడువునిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. దీంతో ఈనెల 28న జరగాల్సిన బీబీఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ వెనక్కు వెళ్లనుంది. ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు తీర్పు ప్రతి తమకు అందినతర్వాతే ఈ విషయంపై మాట్లాడగలనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీనివాసాచార్ తెలిపారు. వివరాలు... ఆగస్టు 5లోపు బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న సుప్రీం తీర్పును రాష్ట్ర హైకోర్టు సమర్థించడమే కాకుండా ప్రభుత్వానికి రూ.10వేల అపరాధ రుసుం విధించిన విషయం విషయం తెలిసిందే. అయితే హైకోర్టును తీర్పును ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈకేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తుతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. వాదనల్లో భాగంగా బీబీఎంపీ వార్డులను పునఃవిభజన చేయడంతో పాటు నూతనంగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందన్నారు. అందువల్ల ఎన్నికల నిర్వహణకు కనీసం మరో మూడు నెలల సమయం కావాలని ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరపున వాదనలు వినిపించిన ఫణీంద్ర....‘ప్రస్తుత తరుణంలో వార్డుల పునఃవిభజ చేయడం వల్ల ఓటర్ల జాబితాను మార్చాల్సి వస్తుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా వార్డుల రిజర్వేషన్ల జాబితా అధికారికంగా ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు అందజేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. అందువల్ల రిజర్వేషన్ జాబితా మార్చడానికి కాని, ఎన్నికల వాయిదా వేయడం కాని సరికాదు.’ అని వివరించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయపీఠం బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియను ముగించడానికి మరో ఎనిమిది వారాల పాటు గడువు ఇస్తూ తీర్పు చెప్పింది. కాగా, ఈ విషయమై ఫణీంద్ర మాట్లాడుతూ...తాజా తీర్పు వల్ల వార్డుల పునఃవిభజనకు అవకాశం కలగదు. అంతేకాకుండా రిజర్వేషన్ల జాబితాలో ఎటువంటి మార్పు ఉండదన్నారు.అయితే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఎనిమిది వారాలు వెనక్కు వెళ్లేఅవకాశం ఉందన్నారు. ఈ ఎనిమిది వారాల వాయిదా నేటి (శుక్రవారం) నుంచి అన్వయిస్తుందా లేదా ఆగస్టు 5 నుంచి అన్వయిస్తుందా అనే విషయంపై తీర్పు ప్రతి అందిన తర్వాత స్పష్టత వస్తుంది.’ అని వివరించారు. ఇదిలా ఉండగా రాష్ర్ట ఎన్నికల కమిషనర్ శ్రీనివాచార్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత పరిశీలించి న్యాయనిపుణులతో చర్చించి నూతన ఎన్నికల షెడ్యూల్ వెళ్లడించడం పై అధికారిక ప్రకటన చేస్తానన్నారు. ఇదిలా ఉండగా సుప్రీం తీర్పు వల్ల గతంలో వలే ఆగస్టు 5 లోపు కాకుండా అక్టోబర్ 5లోపు బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. -
రాష్ట్రంలో ఎస్మా
బెంగళూరు : రాష్ట్రపతి అంగీకారంతో కర్ణాటకలో ‘ఎస్మా’ చట్టం అమల్లోకి వచ్చిం దని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర వెల్లడించారు. ఎస్మాను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ప్రయోగించబోదని, అయితే ప్రభుత్వ అమ్ముల పొదిలో ఒక అస్త్రంగా మాత్రం ఉండనుందని తెలిపారు. మంగళవారమిక్కడి కేపీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో వైద్యులు, ఉపాధ్యాయుల నిరసనకు దిగిన సందర్భంలో ఎస్మా చట్టం అమల్లో లేక పోవడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. అయితే ఎస్మా చట్టం ఇక పై అమల్లో ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో వారం లోపు పిటీషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పోస్టు ప్రస్తుతానికి అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మంత్రిమండలి పునఃవ్యవస్థీకరణ, విస్తరణకు సంబంధించి హై కమాండ్‌తో సీఎం సిద్ధరామయ్య చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇస్తే తనకు అభ్యంతరం లేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి టీ.బీ జయచంద్ర సమాధానం చెప్పారు. -
బీసీసీఐకి లోధా కమిటీ ప్రశ్నావళి
న్యూఢిల్లీ: బీసీసీఐలో పరిపాలనా సంస్కరణల కోసం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన లోధా కమిటీ కార్యరంగంలోకి దిగింది. దీంట్లో భాగంగా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ 80కి పైగా ప్రశ్నలను బోర్డుకు పంపింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జీలు అశోక్ భాన్, ఆర్వీ రవీంద్రన్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ... బోర్డుకు సంబంధించి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు, ఆడిట్స్, ఖాతాల నిర్వహణ, కమిటీలు.. ఎన్నికలు, ఆటగాళ్ల సంక్షేమం, పారదర్శకత, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఏడు ఉప శీర్షికలతో ఈ ప్రశ్నావళిని రూపొందించింది. వీటికి బీసీసీఐ ఉన్నతాధికారులు సమాధానమివ్వాల్సి ఉంటుంది. -
భావ ప్రకటనకూ పరిమితులున్నాయి: సుప్రీం
న్యూఢిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛ నిరపేక్షమేం కాదని, దానికీ పరిమితులుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘భావ ప్రకటన స్వేచ్ఛను విశాల కోణంలో అర్థం చేసుకోవాలి. అదే సమయంలో దానికి అంతర్గతంగా స్వతఃసిద్ధ పరిమితులు కూడా ఉండాలి. అవి రాజ్యాంగ ప్రమాణాలకు లోబడి ఉండాలి. రాజ్యాంగంలోని 19(1) అధికరణ అందించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు నిరపేక్షమేం కాదని, దానికీ అదే అధికరణంలోని రెండవ భాగం 19(2) కింద పరిమితులుంటాయని మేం ఇదివరకే స్పష్టమైన వివరణ ఇచ్చాం’ అని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ పీసీ పంత్‌ల ధర్మాసనం గురువారం తేల్చి చెప్పింది. మహాత్మాగాంధీపై అనుచిత రీతిలో, అభ్యంతరకర పదజాలం ఉపయోగిస్తూ వసంత్ దత్తాత్రేయ గుర్జార్ అనే మరాఠీ కవి రాసిన కవితను 1994లో ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ యూనియన్ వారి ఇన్‌హౌజ్ జర్నల్‌లో ప్రచురించిన ప్రచురణ కర్త దేవీదాస్ రామచంద్ర తుల్జాపుర్కర్పై దాఖలైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చిన సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. -
2011 గ్రూప్-1కు సొంత ఏర్పాట్లు
హైదరాబాద్: 2011లో నిర్వహించిన గ్రూపు-1 మెయిన్స్‌ను మళ్లీ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయంలో ఏపీతో సంబంధం లేకుండా విడిగా మెయిన్స్ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రిలిమ్స్‌లో తప్పులు దొర్లిన ప్రశ్నలను తొలగించి, అభ్యర్థులను మళ్లీ మెయిన్స్‌కు ఎంపిక చేసి పరీక్షను నిర్వహించడమా లేక ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త పరీక్షకు వెళ్లాలా అని సర్కారు యోచి స్తోంది. 2011లో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో 6 తప్పులు దొర్లడంతో తాము మెయిన్స్‌కు అర్హత పొందలేకపోయామని అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మొత్తం ప్రక్రియను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని గతేడాది కోర్టు ఆదేశించింది. -
జవాబుదారీతనం ఎలా?
ఎన్‌జేఏసీపై సుప్రీం కోర్టు ప్రశ్న న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) పనితీరుకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం పలు ప్రశ్నలు సంధించింది. ‘న్యాయ వ్యవస్థ పనితీరును ఆ కమిషన్ ఏ విధంగా అర్థవంతంగా, జవాబుదారీగా మారుస్తుంది?’ అని జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎంబీ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ప్రశ్నించింది. ‘ప్రభుత్వాన్ని అడిగేముందు, మేం అర్థం చేసుకోవడం కోసం ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాం’ అని ఎన్‌జేఏసీకి వ్యతిరేకంగా వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్‌కు వివరించింది. ఆ కమిషన్ ప్రభుత్వానికే జవాబుదారీ కనుక ఈ ప్రశ్నలను ప్రభుత్వాన్నే అడగడం మంచిదని ధావన్ బదులిచ్చారు. ఎన్‌జేఏసీ చట్టంలోని ‘లక్ష్యాలు- కారణాలు’లో పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ ధర్మాసనం పై సందేహాలను వ్యక్తం చేస్తూ.. వారు చెబుతున్న అర్థవంతమైన పాత్ర అంటే ఏమిటి? అని ధర్మాసనం ప్రశ్నించింది. కమిషన్‌లో సభ్యులుగా ఇద్దరు ప్రముఖులను నియమించే కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేదా లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి సభ్యులుగా ఉండటంపై.. ‘ఇద్దరు రాజకీయ నేతలు, వారిమధ్య ఇరుక్కుపోయిన చీఫ్ జస్టిస్.. వీరు ముగ్గురు న్యాయ నియామకాల్లో జోక్యం చేసుకోగల ఇద్దరు వ్యక్తులను ఎలా నిర్ణయిస్తారు?’ అని ప్రశ్నించింది. ‘న్యాయవ్యవస్థలో ప్రాథమిక, దిగువ స్థాయి నియామకాలకు వారి(ప్రముఖులైన ఇద్దరు సభ్యులు) స్థాయి సరిపోతుంది కావచ్చు కానీ ఉన్నతస్థాయి నియామకాల్లో న్యాయమూర్తిగా, లేదా న్యాయవాదిగా అభ్యర్థి సామర్ధ్యాన్ని గుర్తించగలగడం ముఖ్యం. అది వారు చేయగలరా’ అని జస్టిస్ గోయెల్ వ్యాఖ్యానించారు. ఆ సభ్యులకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుందని, ఆ మూడేళ్లూ వారిని భరించాల్సిందేనని ధావన్ పేర్కొన్నారు. ఎన్‌జేఏసీ చట్టం 2014, సంబంధిత రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పై ప్రశ్నలను ధర్మాసనం సంధించింది. న్యాయవాదికి సుప్రీంకోర్టు నోటీసు ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)లో నిరాధారమైన, అభ్యంతరకరమైన ఆరోపణలు చేసినందుకు సుప్రీంకోర్టు ఎం.ఎల్.శర్మ అనే న్యాయవాదికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇది రాజకీయ వేదిక కాదని జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆయనను మందలించింది. ఈ తరహాలో పిల్ దాఖలు చేసినందుకు ఇక ముందు మరెప్పుడూ పిల్ దాఖలు చేయకుండా ఎందుకు అనర్హుడిగా చేయకూడదో చెప్పాలని, దీనికి వారంలోగా సమాధానం ఇవ్వాలని శుక్రవారం కోర్టు ఆదేశించింది. శర్మ దాఖలు చేసిన పిల్లోని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. శర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై సుప్రీంకోర్టులో అనవసరంగా పిల్లు దాఖలు చేస్తున్న విషయాన్ని తాము గుర్తించామని, చెత్త ఆరోపణలతో ఇలా ఎవరంటే వారిపై పిల్లు దాఖలు చేయడానికి కోర్టు రాజకీయ వేదిక కాదని ధర్మాసనం పేర్కొంది. -
‘బ్లాక్‌మనీపై దర్యాప్తు పురోగతి చెప్పండి’
న్యూఢిల్లీ: నల్లధనంపై దర్యాప్తు పురోగతిని వివ రిస్తూ మే 12కల్లా తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు సిట్‌ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి లోకూర్, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. వచ్చేనెల 12కల్లా నివేదిక సమర్పిస్తే వేసవి సెలవులకు ముందు ఈ అంశాన్ని పరిశీలించే వీలుంటుందని సిట్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సోలి సొరాబ్జీకి ధర్మాసనం సూచించింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని సిట్ నల్లధనంపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
పరువునష్టం కేసుల్లో కేజ్రీవాల్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ఆయనపై ఢిల్లీ ట్రయల్ కోర్టుల్లో దాఖలైన రెండు క్రిమినల్ పరువు నష్టం కేసుల విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులపై ఆయన పిటిషన్‌కు సంబంధించి 6 వారాల్లో స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అత్యంత అవినీతిపరుల జాబితాలో కేజ్రీవాల్ తన పేరు చేర్చారంటూ కేంద్రమంత్రి గడ్కారీ కోర్టుకెక్కగా, ఆప్ విద్యుత్ చార్జీల తగ్గింపు ఉద్యమంలో నాటి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్‌పై కేజ్రీవాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె మాజీ రాజకీయ కార్యదర్శి కేసు పెట్టారు. -
మందిరాన్ని పునర్నిర్మించండి: పాక్ సుప్రీంకోర్టు
ఇస్లామాబాద్: గతంలో ధ్వంసం చేసి, మతపెద్ద ఆక్రమించుకున్న ఓ హిందూ మందిరాన్ని పునర్నిర్మించి పరిరక్షించాల్సిందిగా పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఖైబర్ పక్తూంక్వా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హిందూ దేవాలయాల పవిత్రతకు భంగం కలిగేలా జరుగుతున్న అసాంఘిక సంఘటనల్లో జోక్యం కల్పించుకోవాల్సిందిగా రమేశ్ కుమార్ వంక్వాని అనే హిందువు కోర్టును కోరారు. అలాగే ఖైబర్ పక్తూంక్వాలోని ఓ గ్రామంలో శ్రీ పరమహంస జీ మహరాజ్ సమాధిని కూల్చివేసి, ఆక్రమించుకోవడాన్ని కోర్టులో సవాల్ చేశారు. ఈ విషయంలో సామరస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని అదనపు అడ్వొకేట్ జనరల్ వకార్ అహ్మద్.. ద్విసభ్య ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ దేవాలయాన్ని పునర్ నిర్మించి పరిరక్షించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
పరువు నష్టం కేసుల్లో కేజ్రీవాల్‌కు ఊరట
- సమాధానం ఇవ్వాల్సిందిగా - కేంద్ర న్యాయశాఖకు నోటీసు - జారీ చేసిన సుప్రీం - అంతవరకూ రెండు కేసులపై - విచారణ నిలిపేయాలని ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ఆయనపై ఢిల్లీలోని ట్రయల్ కోర్టుల్లో దాఖలైన రెండు క్రిమినల్ పరువు నష్టం కేసుల విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే పరువు నష్టాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట్ట్టాల రాజ్యాంగ బద్దతను సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర న్యాయశాఖకు నోటీసు జారీ చేసింది. సమాధానం వచ్చేంతవరకూ కేజ్రీవాల్‌పై దిగువ న్యాయస్థానంలో దాఖలైన రెండు నేరపూర్వక పరువు నష్టం కేసులపై విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్‌కు తాత్కాలికంగా ఊరట లభించింది. ఈ పరువు నష్టం కేసులపై తదుపరి విచారణ జులై 8న జరుగనుంది. కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్‌ను, ఇదే విషయమై బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన పెండింగ్ పిటిషన్ విచారణతో జోడించాలని న్యాయస్థానం ఆదేశించింది. కే జ్రీవాల్పై దాఖలైన పరువు నష్టం కేసుల్లో ఒకటి గడ్కరీ కేసిన పరువు నష్టం పిటిషన్ కాగా మరొకటి సురేందర్‌కుమార్ శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్. గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్‌పై పటియాలా హౌజ్ కోర్టు విచారణ జరుపుతోంది. తనను అత్యంత అవినీతిపరుడైన నేతగా ఆరోపణలు చేయడాన్ని సవాలుచేస్తూ గడ్కరీ కేజ్రీవాల్‌పైనా, ఆయన సహచరులపైనా పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో కేజ్రీవాల్ జైలుకు కూడా వెళ్లారు. ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని ఆశ చూపి ఆ తరువాత తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాక అవినీతిపరుడినంటూ తనపై అభాండాలు మోపారని ఆరోపిస్తూ న్యాయవాది సురేందర్ శర్మ సీఎం కేజ్రీవాల్‌పైనా, ఆప్ నేతలపైనా పరువు నష్టం దావా వేశారు. అ కేసు కడ్కడూమా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. -
‘గాంధీపై అశ్లీల కవిత్వం’ కేసులో తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: మహాత్మునిపై మరాఠీ కవి వసంత్ దత్తాత్రేయ గుర్జర్ రాసిన కవిత్వం అసభ్యకరంగా ఉందంటూ ఓ ఉద్యోగి వేసిన పిటిషన్‌పై తీర్పును గురువారం సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 1984లో రాసిన ఈ కవితను 1994లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్‌కు చెందిన పత్రికలో ప్రచురించారు. -
సుప్రీంకు విన్నవించిన అంశాలపై ‘మీడియా’లో చర్చ సరికాదు: సహారా
న్యూఢిల్లీ: తమ చీఫ్ సుబ్రతోరాయ్ విడుదల బెయిల్‌కు రూ.10,000 కోట్ల సమీకరణ అంశాలపై సుప్రీంకోర్టు ముందు పేర్కొన్న అంశాలపై బహిరంగ చర్చ, మీడియా ఊహాగానాలు సరికాదని సహారా పేర్కొంది. ఆయా అంశాలు పూర్తిగా కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొంది. సహారా నిధుల సమీకరణపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. నిధుల సమీకరణకు సుప్రీంకోర్టుకు తాజాగా సంస్థ ఒక ప్రతిపాదనను తెలియజేసింది. చైనా బ్యాంక్ నుంచి సహారా ఆస్తుల తనఖా విడుదలకు స్పెయిన్ బ్యాంక్ బీబీవీఏ రుణం అందించనుందన్నది దీని సారాంశం. అయితే తమ వద్ద ఇటువంటి ప్రతిపాదన ఏదీ లేదని బీబీవీఏ పేర్కొన్నట్లు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నుంచి వార్తలు వెలువడుతున్నాయి. ఇక హెచ్ఎస్బీసీ రూ.5,000 కోట్లకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనుందని సహారా పేర్కొంటున్నప్పటికీ, ఆ బ్యాంకు నుంచి సైతం ఈ మేరకు ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. హెచ్ఎస్బీసీ ప్రతినిధి అసలు దీనిపై ఎటువంటి వ్యాఖ్యా చేయడానికి నిరాకరించగా, పేరు తెలపడానికి ఇష్టపడని మరో అధికారి అసలు ఇటువంటి ప్రతిపాదనే తమ వద్ద లేదని పేర్కొన్నారు. విదేశాల్లోని ఆస్తుల అమ్మకం, బెయిల్‌కు నిధుల సమీకరణకు సోమవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడు నెలల సమయం ఇచ్చింది. -
అవసరమైతే మార్పులు చేస్తాం..!
న్యూఢిల్లీ: ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ విషయంలో తమ ప్రభుత్వానికి, గత యూపీఏ ప్రభుత్వానికి పోలిక లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘భావప్రకటన స్వేచ్ఛ హక్కుకు కట్టుబడి ఉన్నామని మేం లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపాం. యూపీఏ ప్రభుత్వం మాత్రం తమను వ్యతిరేకిస్తున్నవారిపై, వ్యంగ్యంగా చిత్రిస్తున్నవారిపై కక్షసాధింపునకు మార్గంగా ఈ చట్టాన్ని ఉపయోగించుకుంది’ అన్నారు. ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కానీ ఈ తీర్పు నేపథ్యంలో చట్టంలో ఏమైనా మార్పులు అవసరమని భద్రతా సంస్థలు భావిస్తే.. చట్టపరంగా, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలగకుండా.. అవసరమైన చర్యలు చేపడతాం’ అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ముందు ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ రాజ్యాంగబద్ధతను కేంద్రప్రభుత్వం సమర్ధించిన విషయం తెలిసిందే. -
‘ఎన్‌జేఏసీ చట్టంపై ఫిర్యాదులు స్వీకరించొద్దు’
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొత్తగా రూపొందించిన రెండు చట్టాలను సవాలు చేస్తూ వేసే పిటిషన్లను ఇకపై దిగువ కోర్టులు స్వీకరించరాదని సుప్రీంకోర్టు బుధవారం నిర్దేశించింది. రాజ్యాంగ సమ్మతి ఉన్న ఈ రెండు చట్టాలకు సంబంధించిన ఎలాంటి విషయాలపై పిటిషన్లు వచ్చినా హైకోర్టుతో సహా దిగువ కోర్టులు ఏవీ కూడా విచారించరాదని జస్టిస్ దవే నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ రెండు చట్టాలను సవాలు చేస్తూ వేసే పిటిషన్లను విచారించాలా... వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది. కాగా, సైన్యానికి సంబంధించిన వివాదాల్లో సాయుధ బలగాల ట్రిబ్యునల్(ఏఎఫ్‌టీ) ఇచ్చే తీర్పులను సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను విచారించేందుకు హైకోర్టులకు అధికారం లేదని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. -
‘వర్కింగ్ కమిటీకి ఎందుకు వెళ్లారు’
న్యూఢిల్లీ: ఈనెల 8న జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ హాజరు కావడాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ మీటింగ్‌కు కోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ శ్రీని హాజరు కావడమే కాకుండా అధ్యక్షత వహించారని బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ పిటిషన్ వేయగా కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, కేవలం ఏజీఎం తేదీని మాత్రమే ఖరారు చేశారని శ్రీని తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనకూడదనే కోర్టు తీర్పునిచ్చిందని, కానీ ఎన్నికలయ్యే వరకు తన పదవికి దూరంగా ఉండమని చెప్పలేదని అన్నారు. వచ్చే శుక్రవారంలోపు తాము పూర్తి వివరణ ఇస్తామని ఆయన కోర్టుకు తెలిపారు. -
జేడీఎస్ కార్యాలయం ఖాళీ
నేడు కేపీసీసీకి అప్పగింత : దేవెగౌడ బెంగళూరు : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జేడీఎస్ పార్టీ కార్యాలయాన్ని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీ. పరమేశ్వర్‌కు నేడు (ఆదివారం) అప్పగించబోతున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ తెలిపారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌ను శనివారం ఆయన దగ్గరుండీ మరీ మరో ప్రాంతానికి మార్పించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... చివరి వరకూ కార్యాలయాన్ని దక్కించుకోవడానికి చాలా పోరాడమన్నారు. అయితే న్యాయస్థానంలో కాంగ్రెస్ పార్టీకే విజయం దక్కిందని వాపోయారు. న్యాయస్థానం ఆదేశాలను ఎవరైనా పాటించక తప్పదన్నారు. ఇందుకు తాను అతీతుడేమి కాదని తెలిపారు. సరైన భవనం దొరికినప్పుడు తమ కార్యాలయాన్ని అందులో కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఆనందరావ్ సర్కిల్లో ఉన్న జేడీఎస్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీకి చెందినదని అందువల్ల ఆ కార్యాలయాన్ని కర్ణాటక కాంగ్రెస్ పార్టీకు అప్పగించాలని ఆ పార్టీ నాయకులు న్యాయస్థానంలో కేసు వేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
సుప్రీం ఆదేశాల మేరకు చర్యలు
సీ కేటగిరీ గనుల వేలంపై స్పందించిన సీఎం తుంగభద్ర పూడికతీత అసాధ్యం ప్రత్యామ్నాయలపై దృష్టి మంత్రి జారకిహోళికి శాఖ మార్పు మార్చిలో బడ్జెట్ సమావేశాలు బళ్లారి : రాష్ట్రంలో చిత్రదుర్గం, బళ్లారి, తుమకూరు జిల్లాల పరిధిలోని 51 సీ కేటగిరి గనుల వేలానికి సంబంధించి సుప్రీంకోర్టు, సీఈసీ ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన శనివారం బెంగళూరు నుంచి బాగల్‌కోటకు వెళుతూ జిందాల్ విమానాశ్రయంలో కాసేపు బస చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికే ఆ గనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించారని, ఆయనతో చర్చించిన అనంతరం సుప్రీంకోర్టు, సీఈసీ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పలు జిల్లాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర డ్యాంలో పూడికతీత సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ చేస్తున్నామన్నారు. తుంగభద్రలోని పూడిక ద్వారా నష్టపోతున్న నీటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై నిపుణులతో చర్చిస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి సతీష్ జారకిహోళి శాఖ మార్పు, ఆయనకు ఏ శాఖ కేటాయించాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల అనంతరం జారకిహోళికి సముచిత శాఖ కల్పిస్తామన్నారు. 2014-15వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్నారు. ఈసారి రాష్ట్ర ప్రజలు మెచ్చే విధంగా బడ్జెట్ ఉంటుందన్నారు. వచ్చే వారం బడ్జెట్‌కు సంబంధించి నిపుణులతో చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. -
బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాలి: సోనోవాల్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చేసిన సలహాలు, సూచనల మేరకు బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. క్రికెట్ బోర్డును సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం కృత నిశ్చయంతో ఉందన్నారు. ‘బీసీసీఐ పబ్లిక్ బాడీ అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కాబట్టి కచ్చితంగా జవాబుదారీతనం ఉండాలి. రోజువారి కార్యకలాపాలను మరింత పారదర్శకంగా నిర్వహించాలి. అన్ని విషయాలు ప్రజలకు తెలిసేలా ఉండాలి’ అని సోనోవాల్ వ్యాఖ్యానించారు. -
స్పాట్ ఫిక్సింగ్పై తీర్పు నేడు
-
స్పాట్ ఫిక్సింగ్పై తీర్పు నేడు
వెల్లడించనున్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు తుది తీర్పును సుప్రీంకోర్టు నేడు (గురువారం) వెల్లడించనుంది. ఈ కేసులో గతేడాది డిసెంబర్ 17న తుది వాదనలు విన్న జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలీఫుల్లాతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. 18 నెలల కిందట ఈ స్కాండల్ బయటపడిన తర్వాత జరిగిన పరిణామాలపై విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం ముద్గల్ కమిటీని నియమించడంతో పాటు కొన్ని మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించిన కమిటీ... ఫిక్సింగ్‌లో బీసీసీఐలోని కొంత మంది పెద్దలు, ఆటగాళ్ల ప్రమేయం ఉన్నట్లు తేల్చడంతో కేసు అనేక మలుపులు తీసుకుంది. -
సంబరాలు
గాలి జనార్దనరెడ్డికి బెయిల్‌తో సంబరాలు బళ్లారిలో పండగ వాతావరణం పెద్ద ఎత్తున బాణసంచా మోత బళ్లారి : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి మంగళవారం అన్ని కేసులకు సంబంధించి సుప్రీం కోర్టులో బెయిల్ లభించడంతో బళ్లారిలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మూడేళ్ల క్రితం మైనింగ్ కేసులకు సంబంధించి సీబీఐ గాలి జనార్దనరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి విదితమే. మూడేళ్లుగా హైదరాబాద్, బెంగళూరు జైళ్లలో ఉన్న గాలి జనార్దనరెడ్డికి ఎట్టకేలకు అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో బళ్లారిలో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులు, గాలి జనార్దనరెడ్డి అభిమానుల నేతృత్వంలో బళ్లారిలోని ఎస్పీ సర్కిల్, రాయల్ సర్కిల్, తాళూరు రోడ్డు సర్కిల్, ఏపీఎంసీ సర్కిల్, మోతీ సర్కిల్ తదితర అన్ని ప్రధాన కూడళ్లలో బాణసంచా పేల్చి ఆనందోత్సాహాలతో సీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. తమ అభిమాన నేతకు బెయిల్ లభించడంతో బళ్లారిలో పండుగ వాతావరణం నెలకొందని ఒకరికొకరు ఆలింగనం చేసుకుని సంతోష క్షణాలు పంచుకున్నారు. మూడేళ్లుగా గాలి జనార్దనరెడ్డి జైలులో ఉండటంతో అభిమానులతో పాటు బళ్లారిలో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు కుదేలైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జనార్దనరెడ్డికి బెయిల్ లభించడంతో బళ్లారికి తిరిగి కొత్త కళ సంతరించుకునే అవకాశం ఉందని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు మోత్కర్ శ్రీనివాస్‌రెడ్డి, గోవిందరాజులు, బీజేపీ నాయకులు వీరశేఖర్రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు నగరంలో ర్యాలీ చేపట్టి సంబరాల్లో పాలు పంచుకున్నారు. ఇక ప్రజలు గాలి జనార్దనరెడ్డికి బెయిల్ లభించిన సంగతి తెలియడంతో ఎక్కడికక్కడ టీవీలకు అతుక్కుపోయారు. ఇక జనార్దనరెడ్డి ఒకటి రెండు రోజుల్లో విడుదల కానుండటంతో ఆయనను చూసేందుకు బెంగళూరుకు పెద్ద సంఖ్యలో వాహనాలలో తరలి వెళ్లేందుకు అభిమానులు, మద్దతుదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బెయిల్ లభించడం హర్షణీయం : గాలి సోమశేఖర్‌రెడ్డి తన సోదరునికి బెయిల్ లభించడం ఎంతో సంతోషంగా ఉందని కేఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గాలి జనార్దనరెడ్డికి బెయిల్ లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన సాక్షితో మాట్లాడారు. భగవంతుని కృప, బళ్లారి జిల్లా ప్రజల ఆశీస్సుల వల్ల తన సోదరునికి బెయిల్ లభించిందన్నారు. బళ్లారి జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు జనార్దనరెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారన్నారు. బళ్లారి అభివృద్ధికి బాటలు : కార్పొరేటర్ మోత్కర్ శ్రీనివాస్‌రెడ్డి గాలి జనార్దనరెడ్డికి బెయిల్ లభించడంతో నిస్తేజంగా ఉన్న బళ్లారి జిల్లా అభివృద్ధి చెందడం ఖాయమని బీజేపీ నేత, కార్పొరేటర్ మోత్కర్ శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గాలి జనార్దనరెడ్డి అరెస్టయినప్పటి నుంచి జిల్లా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఆయన నేతృత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నారు. గాలి బెయిల్‌తో బళ్లారిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు. -
బెంగళూరులో భద్రత రెట్టింపు
బెంగళూరు : అన్ని కేసులకు సంబంధించి మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డికి సుప్రీం కోర్టులో బెయిల్ లభించిన నేపథ్యంలో బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం వద్ద భద్రతను రెట్టింపు చేశారు. ఆయన విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనకు బెయిల్ లభిం చిన వెంటనే బళ్లారితో పాటు బెంగళూరులో ఉన్న జనార్ధనరెడ్డి అభిమాను లు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. ఆయన విడుదలకు సంబంధించిన కాగితాలు తొలుత హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు పరిచిన అనంతరం బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం నాలుగు రోజుల సమయం పట్టనున్నట్లు జనార్ధనరెడ్డి తరుఫు న్యాయవాది హనుమంతరాయ పేర్కొన్నారు. కాగా, జైలులో ఉన్న తమ అభిమాన నేత గాలి జనార్ధనరెడ్డిని కలవడానికి బుధవారం నుంచి బళ్లారితోపాటు వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. మరోవైపు విడుదల రోజున ఎక్కువ మంది జనసందోహం చేరే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. -
కోఢీ
కత్తి కట్టి బరికి సిద్ధమైన కోళ్లు గోదావరి జిల్లాలకు దీటుగా నిర్వహణకు సన్నద్ధం జిల్లాలో 15 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేతులు మారనున్న రూ.700 కోట్లు! జిల్లాలో తొలిసారి పందెంకోడి బహిరంగంగా కాలు దువ్వుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ‘సంప్రదాయం’ ముసుగు తొడిగి అనధికారికంగా అనుమతులు ఇచ్చేశారు. కోడి పందేల నిర్వహణకు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు తీర్పును ఎవరికివారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో కోడి పందేల నిర్వహణకు అడ్డంకులు తొలగినట్టేనంటూ ప్రజాప్రతినిధుల అనుయాయులు కోళ్లకు కత్తులు కట్టి సిద్ధం చేస్తుంటే.. పందెం రాయుళ్లు నోట్ల సంచులు భుజాన వేసుకొని జిల్లాకు చేరుతున్నారు. సంక్రాంతికి రెండు రోజుల ముందే జిల్లాలో కోడి పందేల జోరు ప్రారంభమైంది. విజయవాడ సిటీ : కోడి పందేల నిర్వహణకు జిల్లా సిద్ధమైంది. జిల్లాలో కోడిపందేలు తొలిసారి బహిరంగంగా జరగనున్నాయి. కోడి పందేలు అంటే గుర్తుకొచ్చే ‘గోదావరి జిల్లాల’కు దీటుగా నిర్వహించేందుకు అన్ని ప్రాంతాలూ సిద్ధమయ్యాయి. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో సంక్రాంతి మూడు రోజులు నిర్వహించనున్న కోడి పందేలకు లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పందేల రూపంలో రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్లు చేతులు మారే అవకాశముంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కోడి పందేల నిర్వహణకు ఒప్పించారు. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా కోడి పందేలు నిర్వహించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు ముందుగానే సిద్ధమయ్యారు. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సర్దుబాటు చేశారు. ఈలోగా వచ్చిన సుప్రీం ఆదేశాలు తమకు అనుకూలంగా అన్వయించుకొని బహిరంగ ఏర్పాట్లు చేస్తున్నారు. బరులు సిద్ధం...: జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు బరులు సిద్ధం చేశారు. ఏటా ఒకటి రెండు ప్రాంతాల్లో, నూజివీడు డివిజన్లో ఒకటి రెండుచోట్ల చాటుమాటుగా జరిగేవి. ఈసారి ఐదారు చోట్ల నిర్వహించేందుకు మామిడి తోటల్లో పొక్లెయిన్లతో చదును చేసి తగిన ఏర్పాట్లుచేశారు. తూర్పు కృష్ణాలోని గుడివాడ, మచిలీపట్నం డివిజన్లలోని పలు ప్రాంతాల్లో కూడా ఈసారి పెద్ద ఎత్తున కోడి పందేలు జరుగనున్నాయి. రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు వెచ్చించి కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 15 ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగినట్టు చెబుతున్నారు. సకల సౌకర్యాలు పందెగాళ్ల కోసం నిర్వహకులు అన్ని సౌకర్యాలూ ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చే పందెగాళ్ల కోసం విజయవాడలోని పలు హోటళ్లలో రూమ్‌లు బుక్ చేస్తున్నారు. ఇదే సమయంలో పందేలు నిర్వహించే సమయంలో అవసరమైన వారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే వారి స్థాయిని బట్టి అవసరమైతే ఏసీలు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక మద్యం, భోజనం సహా అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. కొన్నిచోట్ల రాత్రివేళల్లో ఆటవిడుపు కోసం రికార్డింగ్ డ్యాన్స్‌ల నిర్వహణ ఏర్పాట్లు కూడా ఉన్నట్టు తెలిసింది. పేకాట శిబిరాలు కూడా కోడి పందేలు నిర్వహించే చోటుకు సమీపంలో పేకాట శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందేలు బోర్ కొట్టినవారు వెళ్లిపోకుండా పేకాట ఆడేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ఉవ్విళ్లూరుతున్న జిల్లావాసులు పలు చోట్ల జరిగే కోడి పందేలు తిలకించేందుకు జిల్లా, నగర వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో పోలీసులకు భయపడి వెళ్లేందుకు సాహసించనివారు సైతం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వాటిని తిలకించాలని భావిస్తున్నారు. పోలీసుల ప్రేక్షక పాత్ర ప్రభుత్వ పెద్దల సూచన మేరకు పోలీసులు ప్రేక్షక పాత్రకు సిద్ధమవుతున్నారు. పందేలు జరిగే ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ‘కాపలా’ మాత్రమే ఉండాలని ఇప్పటికే దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. -
శిరసా వహిస్తాం
సుప్రీం తీర్పు మేరకు కార్యాలయాన్ని అప్పగించేందుకు మేం సిద్ధం జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ బెంగళూరు : సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి బెంగళూరులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకు అప్పగించనున్నామని జేడీఎస్ పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన న్యూ ఇయర్ డైరీ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కార్యాలయాన్ని నమ్ముకుని తాను పార్టీని స్థాపించలేదన్నారు. కార్యకర్తల నుంచి విరాళాలు సేకరించి నూతన కార్యాలయాన్ని నిర్మించగలనని దేవెగౌడ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘జేడీఎస్ రాజకీయ పార్టీ. రాజకీయ కార్యకలాపాల కోసం కార్యలయ స్థాపనకు సరైన చోట స్థలాన్ని కేటాయించండి. పూర్తి స్థాయి కార్యాలయాన్ని నిర్మించేంత వరకూ లీజు ప్రతిపాదికన ఓ కట్టడాన్ని కేటాయించండి’ అని బీడీఏకు లేఖ రాసినా అధికారులు స్పందించడం లేదన్నారు. దీని వెనుక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తముందని ఆరోపించారు. జేడీఎస్‌ను రూపుమాపాలని ఆయన భావిస్తున్నారని, అయితే అది ఎన్నటికీ జరగదని దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అన్నింటికీ ఆ‘ఢర్’..
సంక్షేమ పథకాలతో ఆధార్ లింక్ జనవరి 1 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తోంది. సంక్షేమ పథకాలన్నింటికీ ఆధార్ లింక్ పెడుతోంది. ఆధార్‌ను అడ్డం పెట్టుకుని పేదలకు సంక్షేమ ఫలాలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. జిల్లా జనాభాకు..ఆధార్ ఎన్రోల్మెంట్, జనరేట్ అయిన ఆధార్ నంబర్లకు పొంతన లేకున్నా శత శాతం ఆధార్ జరిగినట్టుగా కాకిలెక్కలు వేస్తూ సంక్షేమ పథకాలకు వర్తింప చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. గతంలో అమలు చేసి విఫలమైన గ్యాస్‌కు నగదు బదిలీని జనవరి 1 నుంచి అమలు చేయనుంది. విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఆధార్ తప్పనిసరి చేయకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా లెక్కచేయకుండా సంక్షేమ పథకాలను వర్తింపుజేస్తోంది. ప్రజల్లో ఆందోళన రేపుతోంది. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 42,90,589 మంది కాగా వారిలో మహిళలు 21,51,679 మంది, పురుషులు 21,38,910 మంది ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 20,35,922 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 22,54,667 మంది ఉన్నట్టుగా ప్రకటించారు. జనాభా లెక్కలు ఇలా ఉంటే. జిల్లాలో ఇప్పటివరకు 44,40,240 మంది ఆధార్ కోసం ఎన్రోల్ చేసుకోగా, వాటిలో 17,62,725మంది అర్బన్ప్రాంతాల్లోనూ, 26,77,515 మంది గ్రామీణ ప్రాంతాల్లో ఎన్రోల్ చేసుకున్నారు. ఇప్పటివరకు అర్బన్ ప్రాంతాల్లో 13,52,419 మందికి, గ్రామీణప్రాంతాల్లో 26,06,348 మందికి ఆధార్ కార్డులు జనరేట్ అయ్యాయి. జిల్లా జనాభాకు ఆధార్ ఎన్రోల్మెంట్, జనరేట్ అయిన కార్డుల సంఖ్యకు పొంతన లేకుండా ఉంది. ఏవి సరైనవో..వేటిని ప్రామాణికంగా తీసుకోవాలో తెలియని అయోయమ పరిస్థితి నెలకొంది. ఎన్రోల్ చేసుకున్న వారిలో ఆధార్ సంఖ్య జనరేట్ అయిన వారి నిష్పత్తి జిల్లా సరాసరి 92శాతం కాగా, అర్బన్ ప్రాంతాల్లో 88శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 97 శాతం ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా ఆధార్ ఎన్రోల్ చేసుకోని వారి కోసం జిల్లాలో ఇంకా 16 పర్మినెంట్ ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేశారు. గ్యాస్‌కు నగదు బదిలీతో ఇక్కట్లు మొదలు జనవరి 1 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ అమల్లోకి వస్తుంది. జిల్లాలో 8,18,897 గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 7,32,317 కనెక్షన్లకు మాత్రమే ఆధార్ సీడింగ్ జరిగింది. మిగిలిన 86,580 మందిలో 45 వేలమందికి పైగా ఆధార్ నంబర్ జనరేట్కాలేదు. మరో 41,586మందికి అసలు ఆధార్ ఎన్‌రోల్‌మెంటే జరగలేదు. ఇక ఈ పథకం అమలుకు కీలకమైన అకౌంట్ సీడింగ్ కేవలం 48 శాతం వినియోగదారులకు మాత్రమే జరిగింది. దీంతో ఆధార్ సీడింగ్ కాని వారే కాదు.. అకౌంట్ సీడింగ్ కానీ వారిలో రోజులు గడుస్తున్న కొద్దీ ఆందోళన రెట్టింపవుతుంది. ఆధార్‌తో కార్డులకు మంగళం విశాఖసిటీతో పాటు విశాఖ రూరల్ జిల్లా పరిధిలో 11,26,649 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 39,84,288 యూనిట్స్ (మంది) ఉన్నాయి. ఇప్పటి వరకు 33,75, 537 యూనిట్స్‌కు ఆధార్ సీడింగ్ పూర్తయింది. 4,13,283 అన్‌సీడెడ్ యూనిట్లను తిరస్కరించారు. ఇప్పటి వరకు అధికారికంగా 9,50,336 రేషన్ కార్డులను పూర్తిగా తొలగించగా, వినియోగంలో ఉన్న కార్డుల్లో మరో 1,75,699 యూనిట్స్‌ను తొలగించారు. ఇంకా సీడింగ్ కాని యూనిట్స్ 1,25,519 ఉంటే, పెండింగ్ ఫర్ కన్ఫర్మేషన్ కోసం సస్పెండ్‌లో పెట్టినవి మరో 58,240 యూనిట్స్ ఉన్నాయి. అన్‌సీడెడ్ యూనిట్స్‌ను ఈ నెలాఖరులోగా సీడింగ్ చేయించుకోకుండే తొలగిస్తామని ఇప్పటికే ప్రకటించారు. విద్యార్థుల్లో ఆధార్ భయం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు 1-10 తరగతి చదువుతున్న 6,45,814 మంది విద్యార్థులుంటే ఇప్పటి వరకు 4,10,637 మంది విద్యార్థులకు ఆధార్ సీడింగ్ జరిగింది. ఇంకా 2,35,552 మందికి ఆధార్ సీడింగ్ జరగాల్సి ఉంది. వీరిలో గిరిజన ప్రాంతాల్లో 86,515 మంది ఉండగా, అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో మరో 1.50 లక్షలమంది వరకు ఉన్నారు. సీడింగ్ కాని వారిలో లక్ష మందికి పైగా ఆధార్ నంబర్లు ఇంకా జనరేట్ కాలేదని చెబుతున్నారు. స్కాలర్షిప్లు పొందే వారంతా తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేసుకోవాలని చెప్పడంతో నంబర్ జనరేట్ కానీ విద్యార్థుల్లో గుబులు మొదలైంది. ఉపాధి కూలీల్లో ఆందోళన ఇక జిల్లాలో 4.67 లక్షల జాబ్‌కార్డులుంటే వాటి పరిధిలో 7,16,130 మంది ఉపాధి కూలీలున్నారు. వీరిలో 3.74 లక్షల మందికి ఆధార్ సీడింగ్ పూర్తికాగా, ఇంకా లక్షా 38 వేల 488 మందికి ఆధార్ సీడింగ్ జరగాల్సి ఉంది. ఆధార్ సీడింగ్ చేయించుకోలేని పక్షంలో యాక్టివ్ లేబర్ ఉపాధిని పొందే అర్హతను కోల్పోయే అవకాశాలున్నాయి. పౌష్టికాహారం అందేనా జిల్లాలో 4,952 అంగన్వాడీలుండగా, వాటి పరిధిలో జీరో నుంచి ఏడాది లోపు చిన్నారులు 9,392 మంది ఉండగా, ఇప్పటి వరకు 6515 మంది చిన్నారులకు మాత్రమే ఆధార్ సీడింగ్ జరిగింది. ఇక 55,287 మంది గర్భిణీలుండగా, 90 శాతం సీడింగ్ జరిగినట్టుగా చెబుతున్నారు. సీడింగ్ చేయించకుంటే వీరికి పౌష్టికాహారానికి కోత పడే అవకాశాలు లేకపోలేదంటున్నారు. పింఛన్‌దారుల్లో భయం జిల్లాలో 3.55లక్షల పింఛన్లుండగా, సుమారు 25వేల వరకు పింఛన్‌దారులకు సీడింగ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే అనర్హత పేరుతో 40వేల వరకు పింఛన్లకు కోత పెట్టిన ప్రభుత్వం సీడింగ్ బూచితో పైన పేర్కొన్న 25వేల పింఛన్లకు మంగళం పాడే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇక జిల్లాలో 66,340 డ్వాక్రా సంఘాల పరిధిలో ఏడున్నర లక్షల మంది సభ్యులుగా ఉంటే సుమారు లక్ష మందికి పైగా డ్వాక్రా మహిళలకు ఆధార్ సీడింగ్ జరగలేదు. దీంతో సమీప భవిష్యత్‌లో వీరికి జీరో పర్సంట్ వడ్డీలతో పాటు మ్యాచింగ్ గ్రాంట్‌లో కోతపడే అవకాశాలున్నాయి. ఇక అన్నింటికి లింక్ పెడుతున్న వాహనాలకు సంబంధించి సీడింగ్ ఇప్పుడి ప్పుడే మొదలైంది. జిల్లాలో 4.5లక్షల ద్విచక్ర వాహనాలుంటే, 1.50 లక్షల కార్లు, మరో 4,500 వరకు భారీ వాహనాలున్నాయి. పెట్రోల్ బంకుల్లో వీటికి ఆధార్ సీడింగ్ ప్రారంభమైంది. అలాగే ఇంటిపన్నులు, కుళాయి పన్నులకు కూడా ఆధార్ సీడింగ్ మొదలైంది. మరో పక్క ట్యాక్స్పేయిర్స్కు కూడా ఆధార్ సీడింగ్ చేపట్టారు. -
ఇ‘లా పట్టా’భిషేకం...
జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. బెస్ట్ ఆల్ రౌండ్ స్టూడెంట్‌గా నిలిచిన పూసర్ల బయోలా కిరణ్‌కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు గోల్డ్‌మెడల్, ప్రశంసాపత్రాలను అందజేస్తున్న దృశ్యమిది. చిత్రంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.జీవితంలో పైకి ఎదగాలంటే స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి. ధర్మం ఎక్కడ ఉంటే న్యాయం అటువైపు ఉంటుందని మహాభారతంలో చెప్పిన విషయాన్ని మరచిపోరాదు. పాండవుల వైపు ధర్మం ఉన్నందు వల్లే వారికి విజయం కలిగింది. కృషి, పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చుననడానికి నోబెల్ బహుమతి గ్రహీతలు కైలాస్ సత్యార్థి, మలాలాలే ఉదాహరణ. రోజు రోజుకు న్యాయవాద వృత్తిలో ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ వృత్తిలోకి వచ్చే వారు వాటిని అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. న్యాయవాదులకు సమాజం పట్ల బాధ్యత ఉంది. వారు కేవలం తమ వృత్తికే పరిమితం కారాదు. -
న్యాయవ్యవస్థ సుప్రీం
సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా న్యాయం అందాలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు బెంగళూరు : ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు అత్యంత ప్రాముఖ్యత ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో ఏదైనా సమస్య తలెత్తితే అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థపైనే ప్రభావం చూపుతుందని అన్నారు. శనివారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన ‘న్యాయశాఖ అధికారుల 17వ ద్వైవార్షిక సమ్మేళనం’లో ఆయన మాట్లాడారు. సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి సైతం న్యాయాన్ని చేరువ చేసే దిశగా న్యాయమూర్తులు, న్యాయశాఖలోని అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యాయమూర్తులు సరిగా పనిచేయకపోవడం వల్లే దేశంలోని అనేక కోర్టులలో కోట్ల సంఖ్యలో కేసులు అపరిష్కృతంగా ఉన్నాయనడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. ఒక వైపు కేసులు పరిష్కారం అవుతూనే ఉన్నా మరో వైపు రోజూ కొత్త కొత్త కేసులు న్యాయస్థానం ముందుకు వస్తూ ఉంటాయని పేర్కొన్నారు. కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు బాధితులకు అన్యాయం కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉంటుందని తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టులో నిర్వహించిన జాతీయ అదాలత్‌లో ఒకే రోజున 1.25కోట్ల కేసులను పరిష్కరించినట్లు దత్తు వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు కేసులను త్వరిత గతిన పరిష్కరించేందుకు ఎంతైనా అవసరమని అన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి వాఘేలా మాట్లాడుతూ... కర్ణాటక ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అవసరమైన అన్ని విధాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చిందని తెలిపారు. అయితే రాష్ట్రంలోని వివిధ కోర్టులలో ఖాళీగా ఉన్న ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, డి గ్రూప్ ఉద్యోగుల భర్తీ విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, లోకాయుక్త భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రమేశ్ పౌరసత్వం కేసు నేటికి వాయిదా
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కేసు సుప్రీంకోర్టులో గురువారానికి వాయిదా పడింది. రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని 2009 ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రమేశ్ ఎన్నిక చెల్లదని హైకోర్టు గతేడాది తీర్పునివ్వగా రమేశ్ సుప్రీంకోర్టు ద్వారా స్టే పొందారు. స్టే వెకేట్ చేయాలని ఆది శ్రీనివాస్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ ఉండగా, బెంచ్‌పై దీనికి ముందు కేసు విచారణ సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో రమేశ్ కేసును గురువారం విచారణకు స్వీకరించనున్నట్లు ధర్మాసనం ప్రకటించిందని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. -
జిల్లాకు సుప్రీంకోర్టు బృందం
22, 23 తేదీల్లో పాఠశాలల తనిఖీ ప్రధానంగా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలపై దృష్టి అప్రమత్తమైన విద్యాశాఖాధికారులు గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలపై సుప్రీం కోర్టు నియమించిన ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయిలో తనిఖీకి రానుంది. ఈ నెల 22, 23 తేదీల్లో జిల్లాలో పర్యటించనుంది. పాఠశాలల్లో మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీటి కల్పనతో పాటు ఇతర అవసరాలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్)ద్వారా ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తోంది. పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా ఈ నిధులు ఖర్చు చేసి విద్యార్థులకు సదు పాయాలను కల్పించాల్సి ఉంది. అయితే నిధుల దుర్వినియోగం, నిర్లక్ష్యం మినహా క్షేత్ర స్థాయిలో మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీటి వసతుల కల్పన కలగానే మిగిలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా వాటిలో పూర్తిస్థాయిలో వినియోగంలో ఉన్నవి కేవలం 30 శాతం మాత్రమే. నిర్వహణ లోపంతో అవి శిథిలావస్థకు చేరాయి. ఫలితంగా బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేకపోవడం, నీటి సదుపాయం ఉన్నచోట పరిశుభ్రత పాటించకపోవడంతో ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. ఈ తరహా వాటిపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది.ఈ క్రమంలో పాఠశాలల్లో ఆయా వసతుల కల్పనకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన బృందం స్వయంగా పరిశీలనకు రానుంది. జిల్లాలో సుప్రీం కోర్టు బృందం పర్యటిస్తుందనే సమాచారంతో విద్యాశాఖాధికారులు ఒక్కసారిగా కదిలారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల కల్పనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో కేవీ శ్రీనివాసులు రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరుగు దొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.సుప్రీంకోర్టు బృందం పర్యటనతోనైనా జిల్లాలోని పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉన్నదేమో చూడాలి. -
దోషులుగా తేలితే ఇలా చర్యలు...
ఐదు ప్రత్యామ్నాయాలు సూచించిన బీసీసీఐ సుప్రీం విచారణ నేటికి వాయిదా న్యూఢిల్లీ: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదంలో దోషులుగా తేలిన వారిపై తాము ఎలాంటి చర్యలు తీసుకుంటామనే విషయంలో సుప్రీం కోర్టుకు బీసీసీఐ ఐదు ప్రత్నామాయాలు సూచించింది. సోమవారం వాయిదా పడిన విచారణ మంగళవారం కొనసాగింది. స్పాట్ ఫిక్సింగ్‌లో దోషులపై తాము కఠినంగా చర్యలు తీసుకుంటామని బోర్డు మరోసారి ఉద్ఘాటించింది. ఈనేపథ్యంలో దోషులపై తాము తీసుకోబోయే చర్యల గురించి కోర్టుకు వివరించింది. 1.బీసీసీఐ అంతర్గత క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారం చూసుకోవడం.. 2.ఇద్దరు స్వతంత్ర నిపుణుల కమిటీని బోర్డు నామినేట్ చేయడం.. 3.కోర్టు ఓ క్రమశిక్షణ కమిటీని నియమించడం.. 4.ఇద్దరు జ్యుడీషియల్ అధికారులను కోర్టు నియమించడం.. 5.ముద్గల్ కమిటీయే చర్య లేక శిక్షను నిర్ణయించడం.. వంటి ప్రతిపాదనలను బీసీసీఐ కోర్టు ముందుంచింది. అయితే వీటిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా విచారణను నేటి (బుధవారం) ఉదయానికి వాయిదా వేసింది. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఈ విషయంలో శ్రీనివాసన్ బీసీసీఐకి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే శ్రీని కౌన్సిల్‌కు కోర్టు మూడు ప్రత్యామ్నాయాలను సూచించింది. శ్రీనివాసన్ లేకుండా బోర్డు ఎన్నికలకు వెళ్లడం.. కొత్తగా ఎన్నికైన బాడీ గురునాథ్‌పై చర్య తీసుకోవడం; బీసీసీఐ పాలక మండలి సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి వారు చర్య తీసుకోవడం; మాజీ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసి బీసీసీఐ ఎన్నికల గురించే కాకుండా ఇతర విషయాలను చూసుకోవడం. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలుంటే ఇవ్వాల్సిందిగా శ్రీనివాసన్ కౌన్సిల్‌ను కోర్టు అడిగింది. అలాగే క్రికెట్ పరిపాలను దూరంగా ఉండాల్సిందిగా తాము ఆదేశించినప్పటికీ తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్ష హోదాలో సమావేశాలకు వెళ్లడాన్ని కోర్టు ప్రశ్నించింది. అయితే ఇది తప్పేనని, మున్ముందు హాజరుకానని శ్రీని తెలిపారు. ఇక బోర్డు ఎన్నికల్లో పోటీ చేయడమా? చెన్నై జట్టు యజమానిగా ఉండడమా? ఏదో ఒకటే తేల్చుకోవాలని కోర్టు శ్రీనివాసన్‌కు స్పష్టం చేసింది. -
అందరూ సచ్ఛీలురుగా ఉండాలి
బీసీసీఐ ఆఫీస్ బేరర్లపై సుప్రీం కోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత్‌లో క్రికెట్ మచ్చలేకుండా కొనసాగాలంటే బీసీసీఐ సక్రమంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. బోర్డు అధికారులెవరైనా సచ్ఛీలురుగా, ఎలాంటి అనుమానాస్పద వ్యవహార శైలి లేకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు విచారణ సందర్భంగా సోమవారం జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ కలీఫుల్లాలతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ విషయంలో తనకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేవని ఎన్.శ్రీనివాసన్ చేసిన అప్పీల్‌ను అంగీకరించడం చాలా కష్టమని కోర్టు తెలిపింది. అయితే ప్రపంచ క్రీడారంగంలో పరస్పన ప్రయోజనాలు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయని... హాకీ సమాఖ్య, ఫిఫా దీనికి అంగీకరిస్తున్నాయని శ్రీనివాసన్ కౌన్సిల్ కపిల్ సిబల్ వాదించారు. మరోవైపు బీసీసీఐ ఎన్నికలకు తాము అంగీకరిస్తే అందులో ఎవరు పోటీ చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ మంగళవారం కొనసాగుతుంది. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగా శివలాల్ యాదవ్‌ను నియమించడాన్ని హైదరాబాద్ రంజీ మాజీ ఆటగాడు ఒకరు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిని కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. -
పెండింగు కేసులు మూడు కోట్లు
పరిష్కరించాలని హైకోర్టులకు సీజేఐ లేఖ ఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో పెండింగులో ఉన్న మూడు కోట్ల కేసులను వీలైనంత వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు హైకోర్టులకు లేఖలు రాశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉన్నతాధికారి ఒకరు వివరాలు వెల్లడిస్తూ కిందిస్థాయి కోర్టుల్లో అయిదేళ్లు అంతకుమించిన కాలంగా పరిష్కారం కాకుండా పలు కేసులు ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఇరవై నాలుగు హైకోర్టుల్లో 44.5 లక్షల కేసులు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఇక కింది స్థాయి కోర్టుల్లో 2.6 కోట్ల కేసులు పెండింగులో పడ్డాయన్నారు. అత్యధికంగా అలహాబాద్ హైకోర్టులో పదివేలకు పైగా అపరిష్కృత కేసులుండగా సిక్కింలో అత్యల్పంగా 123 కేసులున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీం సీజే ఇలాంటి కేసులను త్వరితంగా పరిష్కరించేందుకు ప్రత్యేక బెంచిని ఏర్పాటు ప్రతిపాదన తెచ్చినట్లు ఆ అధికారి పేర్కొన్నారు. -
చెన్నై జట్టును ఎందుకు రద్దు చేయకూడదు?
బీసీసీఐకి సుప్రీం కోర్టు ప్రశ్న న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు గురువారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను ఎందుకు లీగ్ నుంచి తొలగించకూడదని బీసీసీఐ కౌన్సిల్‌ను ప్రశ్నించింది. అలాగే ముద్గల్ క మిటీ నివేదికలో పేర్కొన్న వ్యక్తులు బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చే యరాదని సూచించింది. ఈ విచారణను జస్టిస్ టీఎస్ ఠాకూర్, కలీఫుల్లాతో కూడిన బెంచ్ చేపట్టింది. ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కనిపిస్తున్న కారణంగా ఇండియా సిమెంట్స్‌కు చెందిన చెన్నై జట్టును రద్దు చేస్తే ఏం జరుగుతుంది?’ అని బెంచ్ ప్రశ్నించింది. ఇండియా సిమెంట్స్‌కు చెందిన షేర్‌హోల్డర్స్, డెరైక్టర్ల వివరాలను అందించాలని ఆదేశించింది. మరోవైపు గురునాథ్ మెయ్యప్పన్‌ను సీఎస్కే టీమ్ అధికారిగా ఇండియా సిమెంట్స్ అంగీకరించింది. తదుపరి విచారణ డిసెంబర్ 1కి వాయిదా పడింది. -
మీరు క్రికెట్‌ను చంపేస్తున్నారు!
న్యూఢిల్లీ: బీసీసీఐ వ్యవహార శైలిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీవ్రంగా విరుచుకుపడింది. క్రికెట్‌ను ఓ మతంలా ఆరాధిస్తున్న భారత్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తూ ఈ ఆటను చంపేస్తున్నారంటూ పరుషంగా వ్యాఖ్యానించింది. జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ అందించిన తుది నివేదికపై సోమవారం సుప్రీం కోర్టులో జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ మొహ మ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లాలతో కూడిన బెంచ్ విచారణ ప్రారంభించింది. ‘దేశంలోని ప్రజలు క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడుతుంటారు. ఈ ఆటను నిజమైన క్రీడా స్ఫూర్తితో ఆడాలి. జెంటిల్మన్ గేమ్‌గానే ఉండాలి. ఒకవేళ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లాంటి కార్యకలాపాలను అనుమతిస్తే.. మీరు (బీసీసీఐ) క్రికెట్‌ను చంపుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. మ్యాచ్‌లన్నీ ముందుగానే ఫిక్స్ అయ్యాయని తెలిస్తే వాటిని చూసేదెవరు? అభిమానుల విశ్వాసం కోల్పోతే క్రికెట్ అంతరిస్తుంది. ఐపీఎల్, బీసీసీఐకి మధ్య తేడా ఏమీ లేదు. బోర్డు నుంచి వచ్చిన ఉత్పత్తే ఐపీఎల్’ అని సుప్రీం తేల్చింది. క్రికెట్‌కు ఇంత పేరు తెచ్చింది ప్రేక్షకులే కదా: కోర్టు ఐపీఎల్ ప్రారంభించినప్పుడే వాణిజ్యపరంగా విజయవంతమైందని, దీనిపై వచ్చే ఆదాయం ద్వారా చాలా మంది జీవిస్తుండడంతో ఈ లీగ్ కొనసాగాలని బోర్డు తరఫు న్యాయవాది సీఏ సుందరం వాదించారు. భారత్‌లో క్రికెట్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉందని, ఈ విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అయితే ఈ వాదనపై కోర్టు ఘాటుగా స్పందించింది. ‘క్రికెట్‌కు ఆ గుర్తింపు ఎవరి ద్వారా వచ్చింది? ఈడెన్ గార్డెన్లో లక్ష మంది ప్రేక్షకులు కూర్చుని ఆటను ఆస్వాదించినప్పుడే ఇలాంటి గుర్తింపు వస్తుంది. అందుకే ఇది ఇచ్చిపుచ్చుకునే ధోరణికి సంబంధించింది’ అని తేల్చింది. స్పాట్ ఫిక్సింగ్‌లో దోషులుగా తేలిన వారిపై కేవలం పరిపాలనాపరమైన చర్యలే ఉంటాయా? అని బీసీసీఐని కోర్టు ప్రశ్నించింది. అయితే అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బోర్డు సమాధానమిచ్చింది. అధ్యక్షుడిగా ఉంటూ ఫ్రాంచైజీ నిర్వహిస్తారా? మరోవైపు ముద్గల్ కమిటీ నివేదికలో తన పాత్రపై ఎలాంటి ఆధారాలు లేవని తేలడంతో బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు అనుమతించాలని శ్రీనివాసన్ కోర్టును కోరారు. అయితే ఆయన వాదనపై కోర్టు విభేదించింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటూనే మరోవైపు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ యజమానిగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించింది. ‘ఐపీఎల్‌ను నిర్వహించే బోర్డుకు మీరే అధ్యక్షులు. అదే లీగ్‌లో తలపడే జట్టుకు యజమానిగా కూడా ఉంటున్నారు. ఇది పరస్పర ప్రయోజనాల సంఘర్షణ కిందికి రాదా? ఐపీఎల్ పాలక మండలిని ఏర్పాటు చేసింది ఎవరు? బీసీసీఐ ఏమైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అధ్యక్షుడు ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటారా?’ అని శ్రీని తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌ను ప్రశ్నించింది. అలాగే శ్రీనివాసన్ పునరాగమనం అంత సులువు కాదని చెప్పింది. ‘ముద్గల్ కమిటీ క్లీన్చిట్ ఇచ్చిందని మీరు ఊహించుకుంటున్నారు. ఎన్నికల్లో నిలబడేందుకు బీసీసీఐ నిబంధనలు ఉపయోగించుకుంటే సరిపోదు. అందుకు ప్రజల విశ్వాసం కూడా తోడుగా ఉండాలి’ అని శ్రీనికి కోర్టు సూచించింది. ఆటగాళ్ల పేర్లు బయటపెట్టం: కోర్టు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్ల పేర్లను వెల్లడించాలని బీహార్ క్రికెట్ సంఘం కౌన్సిల్ నళిని చిదంబరం కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. ఈ విషయంలో ఈనెల 15న తామిచ్చిన తీర్పుకు కట్టుబడే ఉంటామని స్పష్టం చేసింది. -
ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు..
టీ పీసీసీ సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయం హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేల అనర్హతపై అక్కడే తేల్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అధ్యక్షతన ఈ కమిటీ ఆదివారం తొలిసారిగా సమావేశమైంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేల అంశంపైనే ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్‌కు, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని, అందువల్ల సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కేసును కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సమన్వయపరుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన దిగ్విజయ్‌సింగ్ కూడా ఈ అంశాలను ధ్రువీకరించారు. శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్ పేరు మార్పుపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. -
నన్ను అనుమతించండి
బీసీసీఐ అధ్యక్ష పదవిపై సుప్రీంకు శ్రీనివాసన్ అభ్యర్థన న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ క్లీన్చిట్ ఇచ్చినందున.... బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఎన్.శ్రీనివాసన్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. అలాగే కమిటీ నివేదికలోని అభ్యంతరాలపై ఆయన శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేశారు. ‘ప్యానెల్ పరిశోధన పూర్తయ్యింది. దాంట్లో ఎలాంటి నేరారోపణలు నాపై లేవు. నేను అమాయకుడిని. నాపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టంగా తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు కూడా బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉండడంలో ఎలాంటి అర్థం లేదు. ఇప్పటికే పస లేని ఆరోపణలతో దాదాపు ఏడాది కాలంగా పదవికి దూరంగా ఉన్నాను. తిరిగి నేను అధ్యక్షుడిగా కొనసాగేలా అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక నివేదికలో ఓ క్రికెటర్ తప్పు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపిన విషయం చాలా చిన్నది. అది నాపై నేరారోపణ చేసినట్టు కాదు’ అని ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్న శ్రీనివాసన్ అన్నారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాంపై విచారణ పారదర్శకంగా కొనసాగేలా.. బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనిని తప్పుకోవాలని ఈ ఏడాది మార్చిలో సుప్రీం ఆదేశించింది. మరోవైపు వచ్చే నెల 17న జరిగే బీసీసీఐ ఏజీఎంకు ముందే అధ్యక్ష పదవి చేపట్టేందుకు శ్రీనివాసన్ ఆసక్తి చూపుతున్నారు. ఈస్ట్ జోన్ మద్దతుతో మరో దఫా ఈ పదవిలో కొనసాగేందుకు శ్రీని పావులు కదుపుతున్నారు. ‘సీఎస్కేను రద్దు చేయొద్దు’ ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఉద్వాసన పలికేలా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇండియా సిమెంట్స్ సుప్రీం కోర్టును కోరింది. ఆ టీమ్ ప్రిన్సిపల్‌గా ఉన్న గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్‌కు పాల్పడ్డాడని ముద్గల్ కమిటీ నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో లీగ్ నిబంధనల ప్రకారం సీఎస్కే ఫ్రాంచైజీని రద్దు చేయాల్సి ఉంటుంది. ‘ఐపీఎల్లో సీఎస్కే చాలా ప్రాముఖ్యమైన జట్టు. చెన్నై ఆటగాళ్లకు విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ జట్టును పక్కకు తప్పిస్తే అది ఒక్క సీఎస్కేకే కాకుండా మొత్తం ఐపీఎల్‌లోనే తీవ్ర పర్యవసానాలకు దారి తీస్తుంది. అసలు గురునాథ్ ఈ జట్టు భాగస్వామి కాదు.. డెరైక్టర్, కంపెనీ ఉద్యోగి కూడా కాదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీకి చెందిన కంపెనీ లేక యజమాని మాత్రమే అనైతిక కార్యకలాపాలకు పాల్పడితే జట్టు రద్దు అవుతుంది’ అని ఇండియా సిమెంట్స్ పేర్కొంది. -
2జీ నుంచి రంజిత్ ఔట్
కేసు దర్యాప్తు నుంచి సీబీఐ డెరైక్టర్ని తప్పించిన సుప్రీంకోర్టు సంబంధిత అన్ని కేసులకూ దూరంగా ఉండాలని ఆదేశాలు సిన్హా తర్వాత సీనియర్ మోస్ట్ అధికారికి బాధ్యతలు వివరణాత్మక ఆదేశాలివ్వలేమన్న ధర్మాసనం పదవీ విరమణకు ముందు సిన్హాకు ఎదురుదెబ్బ న్యూఢిల్లీ: పదవీ విరమణకు కేవలం 12 రోజులు మిగిలి ఉండగా సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు దర్యాప్తు నుంచి సుప్రీంకోర్టు ఆయన్ను తప్పించింది. ఈ కేసులో కొందరు నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయనపై వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా విశ్వసనీయమైనవిగా కనపడుతున్నాయని పేర్కొంది. 2జీ స్కామ్‌కు సంబంధించిన ఏ కేసులోనూ జోక్యం చేసుకోవద్దంటూ సిన్హాను ఆదేశించింది. సిన్హా తర్వాత అత్యంత సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ విషయమై వివరణాత్మక ఆదేశాలు వెలువరించేందుకు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఉన్నత దర్యాప్తు సంస్థ ప్రతిష్టను ఇది మసకబారుస్తుందని పేర్కొంది. సిన్హా 2జీ కేసును నీరుగారుస్తున్నారంటూ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (సీపీఐఎల్) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ మదన్ బీ లోకుర్, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం గురువారం మరోమారు విచారించింది. ఈ ఆరోపణల్లో నిజం లేదని ఆయన తరఫు న్యాయవాది వికాస్ సింగ్ గట్టిగా వాదించారు. ఆ ఆదేశాలు పాటిస్తే కేసు నాశనం: ఎస్పీపీ ఈ కేసులో సీబీఐ చీఫ్ పాత్రను సుప్రీంకోర్టు నియమిత ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్పీపీ) ఆనంద్ గ్రోవర్‌తోపాటు సీబీఐ తరఫు న్యాయవాది కె.కె.వేణుగోపాల్‌లు దుయ్యబట్టారు. దర్యాప్తు బృందంలోని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని వేగుగా సిన్హా పేర్కొనడాన్ని ప్రశ్నించారు. సిన్హా విశ్వసనీయతపైనా, న్యాయశాఖ మాజీ మంత్రి పాత్రపైనా ఎస్పీపీ తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. విచారణలో కనుక సిన్హా ఆదేశాలు పాటించి ఉన్నట్లైతే కొందరు నిందితులకు సంబంధించి కేసు యావత్తూ నాశనమై పోయేదన్నారు. ఈ కేసులో సిన్హా వైఖరి.. సీబీఐ వైఖరికి పూర్తి భిన్నంగా ఉందని గ్రోవర్ చెప్పారు. కేసు తుది దశలో ఉండగా, ప్రాసిక్యూషన్ తరఫు సాక్ష్యాల నమోదు దాదాపు పూర్తై దశలో జోక్యం చేసుకునేందుకు సీబీఐ డెరైక్టర్ ప్రయత్నించారన్నారు. కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను కూలంకషంగా పరిశీలించిన తర్వాత తాను సేకరించిన సమాచారం దిగ్భ్రాం తిని కలిగించేదిగా ఉందని, బహిరంగ కోర్టులో దాన్ని తాను వెల్లడించలేనని ఎస్పీపీ అన్నారు. న్యాయ శాఖను తప్పుబట్టిన గ్రోవర్ 2జీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కొన్ని సంస్థలకు అనుకూలంగా ఉన్న న్యాయ శాఖ అభిప్రాయాన్ని ఎస్పీపీ గ్రోవర్ తప్పుబట్టారు. న్యాయశాఖ పని తీరును ఓ విచారకరమైన కథగా పేర్కొన్నారు. మంత్రి (అప్పటి) ఫైల్ నోట్లో పేర్కొన్నదాని ఆధారంగా అలా చేసినట్లు ఓ అధికారి సాక్ష్యం చెప్పారని, అయితే ఆ మంత్రి వెనుక ఉన్న వ్యక్తి ఎవరనేదే ప్రశ్న అన్నారు. ఈ దశలో విచారణ కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో వాదించవద్దని సీబీఐ న్యాయవాది కె.కె.వేణుగోపాల్‌ను సిన్హా ఆదేశించినట్లు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. దీంతో ఇలాంటి ఆదేశాలు ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. ఆ సమయంలో కోర్టు హాల్లోనే ఉన్న సీబీఐ జేడీ అశోక్ తివారీ.. వేణుగోపాల్ సీబీఐ న్యాయవాదిగా కొనసాగుతున్నారని గుర్తుచేస్తూ, తన బాస్‌ను రక్షించేందుకు ఆయన కూడా ప్రయత్నించారన్నారు. దీనిపై కోర్టు అభ్యంతర ం వ్యక్తం చేసింది. తివారీ తన బాస్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. సీబీఐ అధికారులపై కోర్టు ఆగ్రహం కోర్టు హాల్లో సుమారు తొమ్మిది మంది సీనియర్ సీబీఐ అధికారులు ఉండటంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు డెరైక్టర్ ఏజెంట్లు కాదు.. మీకు ఇక్కడేం పని? కోర్టు గదిని విడిచి వెళ్లి విచారణపై దృష్టిపెట్టండి’’ అని ఆదేశించింది. ఆ తర్వాత.. ప్రశాంత్ భూషణ్‌కు ఉప్పందించిన వేగుగా డీఐజీ ర్యాంకు అధికారి సంతోష్ రస్తోగిని సిన్హాను పేర్కొనడానికి సంబంధించిన మీడియా రిపోర్టులను సీబీఐ న్యాయవాది వేణుగోపాల్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆయన్ను ఆదేశించాలంటూ కోర్టును కోరారు. సీబీఐ అధికారిని వేగుగా పేర్కొనడానికి సంబంధించిన సాక్ష్యం ఏదైనా ఉంటే ప్రవేశపెట్టాలన్నారు. ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ఆ అధికారిని తానెన్నడూ కలవలేదని, మరొక వ్యక్తి తనకు పత్రాలు ఇచ్చారని చెప్పారు. దీంతో కేసు విచారణ సమయంలో ఆ అధికారి పేరును ప్రస్తావించడం తప్పని కోర్టు... సిన్హా తరఫు న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అలాగే సిన్హా నివాసంలోని సందర్శకుల డైరీతో పాటు పలు డాక్యుమెంట్లు అందజేసిన వ్యక్తి పేరును వెల్లడించాల్సిందిగా గతంలో తాము సీపీఐఎల్ను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం ఉపసంహరించుకుంది. కోర్టు ఆదేశాలను శిరసావహిస్తా: సిన్హా న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసుల దర్యాప్తు నుంచి తప్పుకోవాలంటూ సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలను శిరసావహిస్తానని సీబీఐ చీఫ్ రంజిత్‌సిన్హా తెలిపారు. ఈ ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోనన్నారు. ఈ కేసు దర్యాప్తును తాను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు కీలక పత్రాలను ‘ఇంటి దొంగే’ (సీబీఐ డీఐజీ సంతోష్ రస్తోగీ) ఇచ్చారంటూ సుప్రీంకోర్టుకు తాను చెప్పినట్లు వచ్చిన వార్తలను సిన్హా తోసిపుచ్చారు. తాను ఎవరి పేరునూ ‘ఇంటి దొంగ’గా ప్రస్తావించలేదన్నారు. కోర్టు ఉత్తర్వులు అందుకున్నాక భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచిస్తానన్నారు. నిప్పులేనిదే పొగ రాదు: సీబీఐ మాజీ చీఫ్ జోగిందర్‌సింగ్ 2జీ కేసు నుంచి రంజిత్‌సిన్హాను సుప్రీంకోర్టు తప్పించడంపై సీబీఐ మాజీ చీఫ్‌లు విచారం వ్యక్తం చేశారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదని.. సిన్హా విశ్వసనీయతపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని సీబీఐ మాజీ డెరైక్టర్ జోగిందర్‌సింగ్ చెప్పారు. ఈ ఆరోపణల్లో పసలేకుంటే సుప్రీంకోర్టు ఆషామాషీగా ఆదేశాలు జారీ చేయదన్నారు. కేసులో స్పష్టత కోసం సీబీఐ చీఫ్ నిందితులను కలవడం తప్పనిసరన్న వాదనను మరో సీబీఐ మాజీ డెరైక్టర్ ఆర్.కె. రాఘవన్ తోసిపుచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో రంజిత్‌సిన్హా వ్యవహారంపై కేంద్రం తగు రీతిలో స్పందిస్తుందని భావిస్తున్నట్లు మరొక సీబీఐ మాజీ డెరైక్టర్ విజయ్ శంకర్ తెలిపారు. స్వాగతిస్తున్నాం... కానీ ఉత్తర్వులు గందరగోళం: కాంగ్రెస్ 2జీ కేసు నుంచి రంజిత్‌సిన్హాను తప్పించడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే ఇంత కీలక కేసులో మెరుగైన పనితీరు కనబరచని అధికారిని.. ఇతర కేసులు చూసుకోవాలని కోర్టు ఆదేశించడం పరస్పర భిన్న సంకేతాలను ఇస్తోందని అభిప్రాయపడింది. కాగా, సిన్హాను 2జీ కేసు నుంచి తప్పుకోవాలని సుప్రీం ఆదేశించడం సరైనదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ్ గురువారం పేర్కొన్నారు. గతంలోనూ పలు మరకలు రంజిత్‌సిన్హా 1974 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సీబీఐ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించకముందు ఐటీబీపీ డీజీపీగా, ఆర్పీఎఫ్ డీజీగా, సీఆర్పీఎఫ్ ఐజీగా పనిచేశారు. 1996లో సీబీఐలో డీఐజీగా పనిచేశారు. దాణా కుంభకోణం కేసు దర్యాప్తులో నిందితుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌కు అనుకూలంగా వ్యవహరించారని, ఆ కేసుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన నివేదికను మార్చారని తేలడంతో ఆయనను కేసు దర్యాప్తు నుంచి కోర్టు తప్పించింది. 2013, మేలో బొగ్గు కుంభకోణం దర్యాప్తు ముసాయిదా నివేదికను సుప్రీంకు సమర్పించడానికి ముందే.. నాటి న్యాయ మంత్రి అశ్విన్ కుమార్‌కు సిన్హా చూపారని తేలింది. దీంతో కేంద్రప్రభుత్వంపై మండిపడిన సుప్రీంకోర్టు సీబీఐ కేంద్రప్రభుత్వ చెప్పే మాటలే పలికే పంజరంలోని చిలుకలా మారిందని ఆక్షేపించింది. ఆర్పీఎఫ్లో డీజీగా పనిచేస్తున్న సమయంలో సిన్హా అవినీతి కార్యకలాపాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వారిపై కక్ష సాధింపుకు దిగేవారని రైల్వే పోలీస్ సంఘం ఆరోపించింది. ఆ కక్ష సాధింపులో భాగంగానే మహేశ్‌కుమార్ ఫోన్ ట్యాపింగ్‌కు సిన్హా ఆదేశించడం, ఆ క్రమంలోనే రైల్వే శాఖలో ‘క్యాష్ ఫర్ పోస్ట్స్’ కుంభకోణం బయటపడటం విశేషం. రైల్వే మంత్రి పదవి వదిలేసిన తర్వాత కూడా ఆర్పీఎఫ్ కమాండోల భద్రతను మమత బెనర్జీకి కొనసాగించడాన్ని ఆర్పీఎఫ్ డీజీగా సిన్హా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో మమత ఆయనను ఐటీబీపీ డీజీగా బదిలీ చేశారు. సిన్హాకు రాజకీయ నేతల్లో లాలు అత్యంత సన్నిహితుడు. ఆర్పీఎఫ్ డీజీగా ఆయనను నియమించేందుకు ఆ పోస్ట్‌ను మూడు నెలల పాటు రైల్వే మంత్రిగా లాలు ఖాళీగా ఉంచారు. ‘సీపిల్’ విజయం 2014, సెప్టెంబర్ 2: 2జీ కేసు నిందితులను సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా తన నివాసంలో పలుమార్లు కలిశారని, ఆయనను కేసు దర్యాప్తు నుంచి తొలగించాలని స్వచ్ఛంద సంస్థ ‘సీపిల్(సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్)’ సుప్రీం ను ఆశ్రయించింది. అందుకు సిన్హా ఇంటి విజిటర్స్ డైరీ రుజువని పేర్కొంది. సెప్టెంబర్ 8: ‘సీపిల్’ ఆరోపణలు తీవ్రమైనవని, వాటిపై రాతపూర్వకంగా స్పందించాలని సిన్హాకు సుప్రీం ఆదేశాలు. సెప్టెంబర్ 18: సిన్హా ఇంటి సందర్శకుల వివరాలు అందించినవ్యక్తి పేరును వెల్లడించేందుకు సీపిల్ నిరాకరణ. అక్టోబర్ 15: మొత్తం వివాదంపై నివేదిక సమర్పించాలంటూ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్పీపీ) ఆనంద్గ్రోవర్ను నియమించిన సుప్రీం అక్టోబర్ 16: సీపిల్ ఆరోపణలకు ఎస్పీపీ సమర్థన నవంబర్ 18: తాము అందించిన సమాచారం తప్పని తేలితే విచారణకు సిద్ధమని సీపిల్ స్పష్టీకరణ నవంబర్ 19: 2జీ స్కామ్ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సీబీఐ డీఐజీ సంతోశ్ రస్తోగీనే న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు కేసు సమాచారం అందించి ఉండొచ్చని కోర్టుకు తెలిపిన సిన్హా. నవంబర్ 20: ‘2జీ’ దర్యాప్తు నుంచి సిన్హాను తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు -
ఇక హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్ రాజారత్నం పేర్కొన్నారు. మంగళవారం ఆర్టీవో కార్యాలయంలో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చే విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండాలని తెలిపారు. టీఎస్ సిరీస్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితోపాటు పాత వాహనదారులూ వీటిని అమర్చుకోవాలని సూచించారు. నాలుగు నెలల్లో వీటిని అమర్చుకోకుంటే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నంబర్ ప్లేట్లు ఆర్టీవో కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. నంబర్ ప్లేట్లను క్రోమియోనిక్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసినట్లు వివరించారు. వీటి తయారీని లింక్ ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించినట్లు పేర్కొన్నారు. నంబర్ ప్లేట్ల కోసం ద్విచక్రవాహనాలకు రూ.245, మూడు చక్రాల వాహనాలకు రూ. 282, నాలుగు చక్రాల వాహనాలకు రూ.619 చొప్పున రుసుం తీసుకుంటామన్నారు. హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లతో వాహనాలు చోరీకి గురైనప్పుడు దొంగలు వాటిని మార్చే వీలుండదని, దీని ద్వారా త్వరగా పట్టుకునే వీలుంటుందన్నారు. అదేవిధంగా ఆర్టీవో కార్యాలయంలో రూ.42 వేలతో ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు రిజిస్ట్రేషన్ల కోసం దళారులను ఆశ్రయించొద్దని, నేరుగా కార్యాలయంలోనే సంప్రదించాలన్నారు. నిబంధనలు పాటించని పాఠశాలల బస్సులపై చర్యలు చేపడుతామని, ఫిట్నెస్ లేని బస్సులు నడుపకూడదని సూచించారు. -
కృష్ణా జలాలను మళ్లీ కేటాయించండి
సుప్రీంలో తెలంగాణ వాదన బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు ఏపీ మా ఆకాంక్షలను వినిపించలేదని వెల్లడి కేటాయింపులు మళ్లీ చేయొద్దన్న మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎస్ఎల్పీని విచారణకు స్వీకరించిన ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల కేటాయింపు లు మళ్లీ మొదట్నుంచీ చేపట్టాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ)ను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. గతవారం ఈ పిటిషన్ జస్టిస్ సుధాంశుజ్యోతి ముఖోపాధ్యా య, జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు రాగా.. ‘నాట్ బిఫోర్ మీ’ అని పేర్కొంటూ.. మరో బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌కు సూచించిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ కేసు జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ ప్రఫుల్లా సి.పంత్‌తో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. తొలుత తెలంగాణ తరపున అడ్వొకేట్ ఆన్ రికార్డ్ కృష్ణమూర్తి స్వామి పిటిషన్‌లోని విజ్ఞాపనను ధర్మాసనానికి వివరించారు. ‘‘కృష్ణా జలాల కేటాయింపులు జరుపుతూ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించింది. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెబుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అవార్డును తాము చెప్పేవరకు గెజిట్‌లో నోటిఫై చేయరాదని న్యాయస్థానం కేం ద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏపీ విభజన నేపథ్యంలో జూన్ 2నుంచి తెలంగాణ ప్రత్యే క రాష్ట్రంగాఉంది. ఆంధ్రప్రదేశ్ పిటిషన్‌తో సంబంధం లేకుండా ఇప్పుడు మేం స్వతంత్రంగా పిటిషన్ దాఖలు చేశాం. ఎందుకంటే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ తమ వాదనలు వినిపించినప్పుడు మా ప్రాంత ఆకాంక్షలు, అవసరాలు వ్యక్తపరచలేదు. అందువల్ల కృష్ణా జలాల కేటాయింపులు మళ్లీ జరపాలని మా అ భ్యర్థన’’ అని విన్నవించారు. మహారాష్ట్ర తరపు న్యాయవాది అంధ్యార్జున తన వాదనలు విని పిస్తూ.. ‘ ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో వివాదం కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యే ఉన్నం దున అన్ని రాష్ట్రాలకు తిరిగి కేటాయించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ న్యాయవాది కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇదే అంశంలో ఏపీ దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అవార్డును గెజిట్‌లో నోటిఫై చేయాలన్న మహారాష్ట్ర పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అన్ని అంశాలను మరోసారి పరిశీలించాలన్నదే మా అభ్యర్థన.. ప్రస్తుతం మా సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా వారంపాటు విచారణనువాయిదా వేయగలరని కోరుతున్నాం’’ అని విన్నవించారు. దీంతో ధర్మాసనం ఈ కేసును డిసెంబర్ 1కి వాయిదా వేసింది. -
ముద్గల్ నివేదికలో ఆ నలుగురు
న్యూఢిల్లీ: ఐపీఎల్-2013 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుకు సంబంధించి జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ నివేదికలో ఉన్న నలుగురి పేర్లను జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఎఫ్ఎం ఖలీఫుల్లాతో కూడిన ప్రత్యేక బెంచ్ వెల్లడించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముఖ్య పరిపాలనా అధికారి (సీఓఓ) సుందర్ రామన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్‌ల పేర్లు ముద్గల్ కమిటీ నివేదికలో ఉన్నాయని తెలిపింది. ‘మేం ఆ నివేదిక చదివాం. అందులో కొంత మంది వ్యక్తులు తమ వృత్తికి విరుద్ధమైన పనులకు పాల్పడినట్టు ఉంది. ఆటగాళ్లతో పాటు తెరపై కనిపించని పాత్రధారులు కూడా వీరిలో ఉన్నారు. కమిటీ తాము కనుగొన్న అంశాలను ఇందులో పొందుపరిచింది. ఆయా వ్యక్తుల ప్రవర్తనపై పరిశోధించగా వారు దోషులేనని తేలింది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ నలుగురికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ రిపోర్ట్‌లో వారికి ఏమైనా అభ్యంతరాలుంటే నాలుగు రోజుల్లోగా తెలపాలని కోరింది. ఈ విచారణకు సంబంధించి ముద్గల్ నివేదికను ఇరు వర్గాల (బీసీసీఐ/శ్రీనివాసన్... బీహార్ క్రికెట్ సంఘం) న్యాయవాదులకు ఇవ్వనున్నట్టు తెలిపింది. దీని ఆధారంగా ఈనెల 24న జరిగే తదుపరి విచారణలో తమ వాదనలు వినిపించవచ్చని సూచించింది. మరోవైపు నివేదికలో ఉన్న ముగ్గురు క్రికెటర్ల పేర్లను మాత్రం ప్రస్తుతానికి బహిరంగపరచడం లేదని బెంచ్ తెలిపింది. కానీ నివేదికలో ఎవరు క్రికెటర్లు.. ఎవరు అధికారులు అనే విషయం తెలియక ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ల పేర్లను అనుకోకుండా జడ్జి చదివారు. ఆ తర్వాత ఆటగాళ్ల పేర్లను తాము బయటపెట్టదలుచుకోలేదని, ఈ విషయంలో సహాయపడాలని లాయర్ హరీష్ సాల్వేను కోర్టు కోరింది. బీసీసీఐ ఏజీఎం మరోసారి వాయిదా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సాధారణ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) మరోసారి వాయిదా పడింది. ఈనెల 20న జరగాల్సిన ఏజీఎంను ప్రస్తుత పరిణామాలతో మరో నాలుగు వారాల పాటు వాయిదా వేశారని బోర్డు కౌన్సిల్ సీఏ సుందరం కోర్టుకు తెలిపారు. శ్రీనివాసన్ తిరిగి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు శ్రీనిని అనుమతిస్తారా? అని సుందరం కోర్టును అడగ్గా.. ‘ఈ కేసు విషయం తేలేదాకా ఆ ఎన్నికల్లో శ్రీనివాసన్ పోటీ చేయాలా? వద్దా? అనే విషయంపై మేం ఎలాంటి స్పష్టతను ఇవ్వలేం’ అని స్పష్టం చేసింది. బీసీసీఐ ఏజీఎంను నెల రోజుల పాటు వాయిదా వేయడం సరైన చర్య కాదని, ఇది బోర్డు రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమని మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఆరోపించారు. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో శ్రీనివాసన్‌ను ఈస్ట్ జోన్ నుంచి నామినేట్ చేసే విషయంలో బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) వేచి చూసే ధోరణిని అవలంభిస్తోంది. తాము అరుణ్ జైట్లీ సూచనల మేరకు నడుచుకుంటామని దాల్మియా చెబుతున్నట్లు సమాచారం. -
మాజీ మంత్రి పీఆర్ కేసు తీర్పుపై ఉత్కంఠ
జమ్మలమడుగు: మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి జంట హత్య కేసులకు సంబంధించిన తీర్పుపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ఆగస్టు 21న, సెప్టెంబర్ 18 వతేదీన సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చి తీర్పు వెలువడుతుందని భావించారు. అయితే రెండు సార్లూ వారుుదా పడింది. ఈనెల 12,13 తేదీల్లో విచారణతోపాటు తీర్పు వెలువడుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1990లో హైదరాబాద్‌లోని జడ్చర్ల, షాద్‌నగర్‌లో దేవగుడి శంకర్‌రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్‌రెడ్డిలను హత్య చేశారు. ఈ హత్య కేసులో 11మంది నిందితులుగా ఉన్నారు. నిందితుల్లో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడా ఉన్నారు. 2004లో నాంపల్లి కోర్టు రామసుబ్బారెడ్డిని దోషిగా తీర్పునిచ్చింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రరుుంచారు. కోర్టు ఇద్దరు జడ్జీలతో కూడిన ధర్మాసనానికి అప్పగించింది. జడ్జీలు భాను, మీనాకుమారిలతో కూడిన ధర్మాసనం తీర్పును చెరో రకంగా ఇచ్చారు. దీంతో హైకోర్టు జడ్జి బిలాల్ న క్వీ రామసుబ్బారెడ్డి నిర్దోషి అంటూ తీర్పు నిచ్చారు. ఈ తీర్పుపై స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి 2008లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2009లో ప్రత్యేక ధర్మాసనంలో పిటిషన్ అడ్మిట్ అయింది. దాదాపు 24 సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తోంది. ఢిల్లీలో మకాం వేసిన నాయకులు షాద్‌నగర్ జంట హత్యలకు సంబంధించిన కేసు బుధ, గురువారాల్లో తీర్పు వెలువడుతుందనే ఉద్ధేశ్యంతో స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి ఢిల్లీలో మకాం వేసినట్లు తెలుస్తోంది. ఈకేసును సుప్రీం కోర్టు కొట్టేస్తుందని టీడీపీ నాయకులు కార్యకర్తలు భావిస్తుండగా, ఎమ్మెల్యే అనుచరులు మాత్రం తప్పకుండా శిక్ష పడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బు చెల్లించకపోతే జైలు శిక్ష
ఎన్ఎఫ్ఎల్ కేసులో కె.ఎస్.రాజుకు కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: కోర్టు ధిక్కారం కేసులో నాగార్జున ఫైనాన్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్) మాజీ ప్రమోటర్ డెరైక్టర్ కె.ఎస్.రాజును సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఏడుపుగంటి బాపనయ్య అనే ఇన్వెస్టరుకు డిపాజిట్ వెనక్కి ఇవ్వాలన్న కంపెనీ లా బోర్డు(సీఎల్బీ) ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించనందుకు కోర్టు ఆయనను దోషిగా గుర్తిం చింది. 6 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. 60 రోజుల్లో బాధితుడికి రూ.40 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో కె.ఎస్.రాజుకు ఆరు నెలల జైలు శిక్ష తప్పదని జస్టిస్ విక్రమజిత్ సేన్, ప్రఫుల్ల సి పంత్‌ల బెంచ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్ఎఫ్ఎల్లో 1997లో రూ.4 లక్షలను బాపనయ్య డిపాజిట్ చేశారు. 45 నెలల్లో రెట్టింపు సొమ్ము ఇస్తామని కంపెనీ నమ్మబలికింది. డబ్బు వెనక్కి చెల్లిస్తానని కంపెనీ లా బోర్డుకు 2000 ఫిబ్రవరి 14న కె.ఎస్.రాజు వాగ్ధానం ఇచ్చి కూడా హామీని నిలబెట్టుకోలేదంటూ 2001లో బాధితుడు ఏపీ హై కోర్టును ఆశ్రయించారు. కాగా, 2000 సెప్టెంబరులో కె.ఎస్.రాజు ఎన్ఎఫ్ఎల్కు రాజీనామా చేశారు. సీఎల్బీ ఆదేశాల నుంచి తప్పించుకోవడానికే ఆయన రాజీనామా చేశారంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్‌ఎఫ్‌ఎల్‌ను 2000 సెప్టెంబరులో మహాలక్ష్మి ఫ్యాక్టరింగ్ సర్వీసెస్‌కు విక్రయించారు. -
సగం ఖాతాల్లో డబ్బే లేదు..!
* హెచ్ఎస్బీసీ ‘నల్ల’ ఖాతాలపై సిట్ నివేదికలో వెల్లడి * వంద మందికిపైగా పేర్లు రెండుసార్లు ప్రస్తావన * 300 మందిపై చర్యలకు సమాయత్తమవుతున్న ఐటీ శాఖ న్యూఢిల్లీ: నల్లధనానికి సంబంధించి 600కు పైగా హెచ్ఎస్బీసీ బ్యాంకు అకౌంట్లలోని సగం ఖాతాల్లో అసలు డబ్బే లేదని నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గుర్తించింది. అలాగే ఈ జాబితాలోని ఖాతాల్లో వంద మందికిపైగా పేర్లు పునరావృతమైనట్టుగా తేల్చింది. మిగిలిన 300 మందికిపైగా ఖాతాదారులపై ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకునేందుకు ఆదాయపుపన్ను శాఖ యోచిస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నల్లధనానికి సంబంధించి హెచ్ఎస్బీసీ జెనీవా బ్రాంచ్‌కు చెందిన 628 పేర్లతో జాబితాను కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఖాతాలను పరిశీలించిన సిట్ సుమారు 289 ఖాతాల్లో అసలు డబ్బే లేదని, అలాగే 122 మంది పేర్ల ప్రస్తావన రెండుసార్లు వచ్చినట్టు గుర్తించింది. ఈ ఖాతాలకు సంబంధించిన కార్యకలాపాల వివరాలు లేకపోవడంతో ఈ జాబితాలో ఉన్న వారిపై చర్యలు తీసుకునేందుకు పెద్ద అవరోధమని పేర్కొంది. తమకు ఇచ్చిన జాబితాలో ఈ ఖాతాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి.. వాటి కార్యకలాపాల చరిత్ర ఏమిటి అనే వివరాలు లేవని తెలిపింది. ఇటువంటి ఖాతాల వివరాల జాబితాను సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని సిట్ నల్లధనం జాబితాలోని 150 ఖాతాలపై ఐటీ శాఖ పరిశీలన జరిపిందని, అయితే ప్రాసిక్యూషన్‌కు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తన నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఐటీ శాఖ 300 ఖాతాలపై ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. విదేశాల్లో నల్లధనానికి సంబంధించి వివిధ దేశాలతో మరోసారి సంప్రదింపుల ప్రక్రియను పునఃప్రారంభించాలని సిట్ సూచించింది. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రానికి సమర్పించిన నివేదికలోనూ సిట్ ఇదే తరహా సూచన చేసింది. అయితే విదేశాలతో సంప్రదింపుల ప్రక్రియను ఇప్పటికే పునఃప్రారంభించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సిట్‌కు తెలిపింది. మరోవైపు స్విస్ బ్యాంకులకు సంబంధించిన ఖాతాల వివరాలను స్వ యంగా వెల్లడించినట్లయితే వారికి తక్కువ శిక్ష పడేలా చేస్తామన్న సీబీడీటీ సూచనను సిట్ సమర్థించింది. నల్లధనంపై ప్రజలు తెలిసిన సమాచారాన్ని తెలియజేయాలని ఇటీవల కోరిన సిట్.. దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి త్వరలోనే ప్రజలకు తెలియజేయనుంది. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు గ్రీన్‌సిగ్నల్..
శాతవాహన యూనివర్సిటీ : ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహించాలని సంబంధిత అధికారుల నుంచి ఆదేశాలు అందారుు. దీంతో ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్, క్యాంప్ ఆఫీసర్ బి.మధుసూదన్‌రెడ్డి, కోఆర్డినేటర్ నితిన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. గతంలో అనుమతి నిరాకరించిన 174 కళాశాలల్లో మాత్రమే విద్యార్థులు వారి సీట్లు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కౌన్సెలింగ్‌కు హాజరైనవారు, హాజరుకాని వారందరూ కౌన్సెలింగ్ అర్హులే. అరుుతే అభ్యర్థులు వారి వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉంటేనే హాజరుకావాలి. గతంలో కౌన్సెలింగ్‌కు వచ్చి ప్రొసెసింగ్ ఫీజు కట్టినా.. మళ్లీ విధిగా రుసుం చెల్లించాల్సిందే. తీసుకురావాల్సిన ధ్రువీకరణ పత్రాలు.. ఎంసెట్ హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్సెస్సీ, ఇంటర్ మార్కుల జాబితా, టీసీ, ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్, ఆదాయం, కులధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలి. -
3న సుప్రీంకు ముద్గల్ నివేదిక
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై విచారణ చేస్తున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తమ తుది నివేదికను నవంబర్ 3న సుప్రీం కోర్టుకు అందించనుంది. ‘మా విచారణ నివేదికను 3న సుప్రీం కోర్టు ముందుంచనున్నాం. ఇప్పుడు అంతకు మించి వివరాలేమీ చెప్పను’ అని కమిటీకి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ముద్గల్ తెలిపారు. ఈ కేసుపై 10న సుప్రీంలో విచారణ జరుగనుంది. అటు కోర్టు తీర్పు కోసం బీసీసీఐ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. -
ఎంసెట్ కౌన్సెలింగ్ లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ లేకపోవడమంటే ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు తెలంగాణాలో ని 174 కళాశాలలకు మాత్రమే రెండో విడత కౌన్సెలింగ్ వర్తిస్తుందని బుధవారం తీర్పు ఇవ్వడంపై వారి అభిప్రాయాలు. -కురబలకోట పరిశీలించాలి సుప్రీం కోర్టు తీర్పు నిరాశ కలిగించింది. కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌన్సెలింగ్‌లో ఓ కళాశాలలో చేరి అది ఇష్టపడక మరో కళాశాలకు వెళ్లాలనుకున్న వారికి ఇక చాన్స్ ఉండదు. మొదటి విడత కౌన్సెలింగ్ కూడా అస్తవ్యస్తంగా సాగింది. -ఎం.అమరావతి, డెరైక్టర్, విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కళాశాల, అంగళ్లు ప్రభుత్వం చొరవ చూపాలి రాష్ట్ర ఎంసెట్ విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్ లేకపోవడం ఒక విధంగా రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యమే. తన వాదనను గట్టిగా వినిపించకపోవడం వల్లే ఇలా జరిగిందని భావించాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే మరో పిటిషన్ దాఖలు చేయాలి. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడాలి. -ఎన్వీ.రమణారెడ్డి, కరస్పాండెంట్, గోల్డన్‌వ్యాలీ ఇంజనీరింగ్ కళాశాల, అంగళ్లు ఏడాది నష్టపోవాల్సిందేనా ఇప్పటికే ప్రారంభమైన డిగ్రీలో చేరలేక రెండో విడత కౌన్సెలింగ్ లేక విద్యార్థులు అవస్థల పాలయ్యారు. మేనేజ్మెంట్లో చేరడానికి ఆర్థిక స్థోమత లేనివారు సంవత్సర కాలాన్ని పోగొట్టుకోవాల్సి వస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించాలి. -మారుతీ ప్రసాద్, పీఆర్వో, మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, అంగళ్లు -
అన్ని పార్టీలతో చర్చ!
‘ఢిల్లీ’ సర్కారు ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై వివిధ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరపాలని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నిర్ణయించారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో... ప్రభుత్వ ఏర్పాటు లేదా తిరిగి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని తేల్చేందుకు నజీబ్ జంగ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం.. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి అనుమతించినందున, జంగ్ కొద్దిరోజుల్లో అక్కడి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. అయితే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని మొదటగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. బీజేపీ ముందుకు రాకపోతే అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని, కాంగ్రెస్‌ను ఆహ్వానించవచ్చని పేర్కొన్నాయి. కాగా, ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోతే.. ఎన్నికలు నిర్వహించడం తప్పదన్నాయి. కాగా, జంగ్ ఎన్డీయే ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తూ.. రాజ్యాంగ పదవికి మచ్చతెచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఢిల్లీలో పరిస్థితిపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆమ్ఆద్మీపార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. -
కోలీకి ఉరిశిక్షపై పునస్సమీక్షకు ‘సుప్రీం’ నో
న్యూఢిల్లీ: రింపా హల్దార్ హత్యకేసులో తనకు విధించిన మరణశిక్షను ధ్రువీకరిస్తూ ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని నిఠారి హత్యలకేసులో దోషి, సురీందర్ కోలీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. మరణశిక్ష విధించిన కేసుల్లో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై తొలిసారిగా జరిగిన కోర్టు బహిరంగ విచారణ అనంతరం చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తుతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది. కోలీ మరణశిక్షను ధ్రువీకరిస్తూ ఇచ్చిన తీర్పునువుళ్లీ సమీక్ష జరపాల్సినంత పొరపాటు ఏదీ జరగలేదని కోర్టు సంతృప్తిచెందినట్టు ధర్మాసనం అభిప్రాయుపడింది. -
ఢిల్లీలోనూ సర్కారు ఏర్పాటు!
బీజేపీని ఆహ్వానించేందుకు మార్గం సుగమం లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతిపాదనకు రాష్ర్టపతి ఆమోదం సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, లేఖ సమర్పణ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలగిపోతోంది. సుప్రీంకోర్టుతో పాటు రాష్ర్టపతి కూడా ఈ అంశంపై నిర్ణయాలు తీసుకుంటుండటంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమవుతోంది. ఇందుకు ఆ పార్టీని ఆహ్వానిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) చేసిన ప్రతిపాదనను రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించినట్లు కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయితే సర్కారు ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడంలో ఐదు నెలలుగా జాప్యం చేయడంపై కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ రాష్ర్టపతి పాలన కొనసాగరాదని అభిప్రాయపడిన కోర్టు.. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని పేర్కొంది. ఈ కేసు విచారణకు వచ్చిన ప్రతిసారీ కేంద్రం ఏకవాక్య సమాధానం చెబుతూ నెట్టుకొస్తోందని అక్షింతలు వేసింది. ఎల్జీ ప్రతిపాదనను ఆమోదిస్తూ రాష్ర్టపతి ఇచ్చిన లేఖను కేంద్రం సమర్పించడంతో.. ఈ పనిని చాలా ముందే చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎల్జీ రెండు రోజుల్లో బీజేపీని ఆహ్వానించే అవకాశం ఉంది. ఎన్నికలంటే బీజేపీకి భయం: సుప్రీం తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆప్, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించాయి. ఎన్నికలంటే బీజేపీ దూరంగా పరిగెడుతోందని ధ్వజ మెత్తాయి. ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేకే నీచ రాజకీయాలకు పాల్పడుతూ బీజేపీ జాప్యం చేస్తోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా ఒక పార్టీ పక్షాన్నే నిలుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించడం సబబు కాదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. మెజారిటీ లేని పార్టీకి ఎలా అవకాశమిస్తారని డీపీసీసీ చీఫ్ అరవిందర్ సింగ్ ప్రశ్నించారు. ఈ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ప్రధాని పదవిపై ఆశలతో ఢిల్లీ ప్రజలను మధ్యలోనే వదిలేసి సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారని మండిపడింది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రస్తుతం మూడు ఖాళీలున్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నికవడంతో బీజేపీ బలం 31 నుంచి 28కి తగ్గిపోయింది. మిత్రపక్షం అకాలీదళ్ ఎమ్మెల్యే మద్దతు కూడా ఉంది. మెజారిటీకి 34 సీట్లు అవసరం. కాగా, ఖాళీ స్థానాలకు వచ్చే నెలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఓ ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆప్ బలం కూడా 27కు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సర్కారు ఏర్పాటు ఇంకాఉత్కంఠను రేపుతోంది. ఎటూ తేల్చుకోని బీజేపీ: ప్రభుత్వ ఏర్పాటును వేగవంతం చేసేందుకు సుప్రీంప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఈ విషయంలో ఎలాం టి నిర్ణయం తీసుకోనట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ ఢిల్లీ శాఖ భావిస్తుండగా, పార్టీ అధిష్ఠానం మాత్రం ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. -
బొగ్గు గనులకు పరిహారం అంచనాకు కమిటీ
న్యూఢిల్లీ: ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్న, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న బొగ్గు గనులకు చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని అంచనా వేసేందుకు మాజీ సీవీసీ ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బొగ్గు, ఇంధన, ఆర్థిక, న్యాయశాఖ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. నవంబర్ 10 కల్లా కమిటీ తన సిఫారసులను సమర్పిస్తుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బొగ్గు గనుల కేటారుుంపుల కుంభకోణంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత సెప్టెంబర్ 24న.. 1993-2009 మధ్యకాలంలో వివిధ కంపెనీలకు కేటారుుంచిన 204 బొగ్గు గనులను రద్దు చేస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో 37 ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్న గనులు కాగా, మరో 5 వచ్చే ఏప్రిల్ నాటికల్లా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నారుు. ఈ 42 గనులకు సంబంధించిన ఆస్తుల విలువను విడివిడిగా అంచనా వేయూల్సిందిగా కమిటీని ప్రభుత్వం ఆదేశించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. -
‘కోకాపేట్’ కేసు మళ్లీ వాయిదా
బెంచ్‌కి రాకుండానే నవంబర్ 11కు విచారణ సిటీబ్యూరో : కోకాపేట భూముల వేలం వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. సుప్రీం కోర్టులో మంగళవారం బెంచ్‌పైకి రావాల్సిన ఈ కేసు నవంబర్ 11కు వాయిదా పడినట్లు హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు. సుధీర్ఘకాలంగా నడుస్తున్న ఈ కేసు మంగళవారం బెంచ్‌పైకి వస్తే అటో ఇటో తేలిపోతుందని అధికారులు ఉత్కంఠ తతో ఎదురు చూశారు. అయితే...అనూహ్యంగా వాయిదాపడడంతో ఉసూరుమంటున్నారు. అసలే పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన హెచ్ఎండీఏ ఎలాగైనా ఈ కేసులో గెలిస్తే రూ.1500 కోట్లు అదనపు ఆదాయం ఖజానాకు వస్తుందని కొండంత ఆశతో ఉంది. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే మాత్రం వెయ్యి కోట్లు చెల్లించక తప్పదేమోనని ఉత్కంఠకు గురవుతోంది. కాగా కోకాపేట భూముల వేలం కేసులో తమ వాదనలను బలంగా విన్పించేందుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్, పలువురు సుప్రీం న్యాయవాదులతో హెచ్ఎండీఏ సర్వసన్నద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హెచ్ఎండీఏ అధికారులు సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకున్నారు. 26న టైటిల్ కేసు... కోకాపేటలో 1650 ఎకరాల భూమికి సంబంధించిన టైటిల్ కేసు కూడా నవంబర్ 26న బెంచ్ పైకి రానుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. కోకాపేటలోని 1650 ఎకరాల భూమి ప్రభుత్వానిది కాదనీ, మహ్మద్ నస్రత్ జంగ్ బహద్దూర్-1 వారసులదనీ, వారి ప్రతినిధిని తానంటూ గతంలో కె.ఎస్.బి.అలీ కోర్టులో రిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదోపవాదనల అనంతరం ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ 2012 జులైలో తీర్పునిచ్చింది. ఆ తీర్పును ఛాలెంజ్ చేస్తూ కె.ఎస్.బి.అలీ సుప్రీం కోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేయడంతో సుప్రీం కోర్టు స్టేటస్ కోను కొనసాగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై హెచ్ఎండీఏ కౌంటర్ దాఖలు చేయడంతో పాటు వెకేషన్ పిటిషన్ కూడా వేసింది. -
ఖాయమైన హైకోర్టు విభజన
హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజన ఖాయమైంది. కేంద్రం హైకోర్టు విభజనకు సానుకూలంగా ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దత్తు విభజనకు సుముఖంగా ఉండటంతో, సర్వోన్నత న్యాయస్థానం నుంచి అధికారిక ఆమోదం వచ్చిన వెంటనే విభజన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి నాలుగు నుంచి ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. విభజన ప్రక్రియ ప్రారంభమైన వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ఇక్కడకు వచ్చి, హైకోర్టు విభజనకు సంబంధించిన వివరాలతో నివేదిక తయారు చేసి సుప్రీంకు సమర్పిస్తారు. ఈ నివేదికపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుని, దాన్ని కేంద్రానికి పంపుతుంది. అప్పుడు కేంద్రం విభజనను ప్రారంభిస్తుంది. ఇది పూర్తయ్యేందుకు ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. విభజన తరువాత కూడా ఏపీ హైకోర్టు ఇప్పుడున్న చోటే కొనసాగవచ్చునని చెబుతున్నారు. తెలంగాణ హైకోర్టును మరో చోటుకు మార్చే అవకాశం ఉంది. అయితే ఈ పరిణామాన్ని టి. న్యాయవాదులు ఎంత వరకు స్వాగతిస్తారన్న విషయంపై సందేహాలు నెలకొని ఉన్నాయి. -
క్రమశిక్షణతో ముందడుగు
సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మచిలీపట్నం: విద్యార్థి దశలో క్రమశిక్షణ అలవరుచుకుంటే ఉన్నత స్థానానికి ఎదిగేందుకు మార్గం సుగమం అవుతుందని సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సెంట్రల్ బోర్డు ఆఫ్ డెరైక్ట్ టాక్సెస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చైర్మన్ కేవీ చౌదరి అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హిందూ కళాశాల ఆడిటోరియంలో వారిద్దరినీ సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తామిద్దరం హిం దూ కళాశాలలోనే చదువుకున్నామన్నారు. అప్ప ట్లో పాఠ్యాంశాలు బోధించిన రామచంద్రశాస్త్రి, వైజేఎల్ లక్ష్మణస్వామి, ఎం.హనుమంతరావు తదితర ఉపాధ్యాయుల ప్రభావం తమపై ఎంతగానో పడిందన్నారు. హిందూ హైస్కూల్, కళాశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు, అధ్యాపకు లు తమకు విద్యతో పాటు మంచి నడవడికను నేర్పారన్నారు. విద్యార్థులు కష్టపడేతత్వంతో పాటు క్రమశిక్షణ అలవరుచుకుని ముందడుగు వేయాలని సూచించారు. కార్యక్రమంలో బంద రు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్, చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అసెంబ్లీ డెప్యూటీ స్పీకరు మండలి బుద్ధప్రసాద్, హిందూ అనుబంధ సంస్థల కార్యదర్శి దైతా రామచంద్రశాస్త్రి, కృష్ణా యూనివర్సిటీ వీసీ వున్నం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్, కేవీ చౌదరి దంపతులను పట్టణ ప్రముఖులు ఘనంగా సత్కరించారు. -
‘సుప్రీం’కు వెళ్లకపోవడం సరికాదు..
హన్మకొండ చౌరస్తా : పోలవరం ప్రాజెక్టును నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని అధికారంలోకి రాకముందు బంద్‌కు పిలుపునివ్వడ మే కాకుండా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న పార్టీ.. అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ అంశాన్ని పక్కనపెట్టడం అప్రజాస్వామికమని సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. అప్పట్లో బంద్‌కు ప్రజ లు పూర్తి మద్దతు తెలిపినా వారి ఆకాంక్షను నెరవేర్చేలా రాష్ర్టప్రభుత్వం పోలవరానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లకపోవడం సరికాదని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను ఆయన విమర్శిం చారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్(టీపీఎఫ్) నాలుగో ఆవిర్భావ దినోత్సవ సభ హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానం లో ఆదివారం జరిగింది. అంతకుముందు సుబేదారిలోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి టీపీఎఫ్ నాయకులు కళాకారు లతో ర్యాలీగా మైదానానికి చేరుకున్నారు. అనంతరం అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సం దర్భంగా టీపీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు బి.రమాదేవి అధ్యక్షతన జరిగిన సభలో హరగోపాల్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఒడిశా అసెంబ్లీలో పార్టీలకతీతంగా పోలవరాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానించారు.. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా మావోయిస్టులు సైతం పోలవరాన్ని వ్యతిరేకించారు... కానీ, ఆ తర్వాత తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గి కేంద్రాని కి తలొగ్గిందని ప్రశ్నించారు. గిరిజనులను నట్టే ట ముంచే పోలవరంతో ఆంధ్ర మత్స్యకారులకు కూడా ప్రమాదమేనన్నారు. కాగా, వరంగల్ ప్రజల్లో తాను పాఠాలు చెప్పినప్పటి చైతన్యం ఇప్పుడు లేదని. ఆ చైతన్యం అవసరమని హరగోపాల్ వ్యాఖ్యానించారు. ఎవరు ఇస్తే తీసుకోలేదు.. అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందే తప్ప ఎవరో ఇస్తే తీసుకోలేదని టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పులిమామిడి మద్దిలేటి అన్నారు. రాష్ట్ర ఏర్పాటు వెనుక ఎం దరో అమరవీరుల త్యాగాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పటికి కూడా హైదరాబాద్‌లోని విలువైన భూములను రాయలసీమ, ఆంధ్రా నాయకులు కబ్జాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భూములు, నిరుద్యోగులకు ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు ఏ హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఇది పోను సీమాంధ్ర సినీ మాఫియాకు మాత్రం ఐ దు ఎకరాలు ఇస్తానని చెప్పడమేమిటని ప్రశ్నిం చారు. గవర్నర్ నరసింహన్ పీఎం నరేంద్రమోడీకి అనుకూలంగా ఉండడమే కాకుండా.. చంద్రబాబు, కేసీఆర్ నడుమ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు వారి ద్దరు కలిసి హైదరాబాద్‌ను దోచుకునేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. కాగా, పోలవ రం ప్రాజెక్టును రద్దు చేసే వరకు టీపీఎఫ్ పోరాడుతుందని మద్దిలేటి స్పష్టం చేశారు. ఇక టీఎన్జీఓ నాయకులు కూడా ఎమ్మెల్యే, ఎంపీ పదవుల కోసం పాకులాడడం సరికాదని పే ర్కొన్నారు. తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని చూ డాలన్న తన కల నెరవేరినందున, పోలవరం ను రద్దు చేసేందుకు నిరాహార దీక్ష చేసేందుకైనా సిద్ధమేనని ప్రకటించారు. ఆజంజాహి మి ల్లు మూతపడడానికి పురుషోత్తంరావు, గండ్ర వెంకటరమణారెడ్డిలే కారణమని ఆరోపించా రు. సభలో ప్రొఫెసర్ ఈసం నారాయణ, అన్వర్‌ఖాన్, నలమాస కృష్ణ, నర్సింహరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. -
ప్రమాదకర స్థితిలో తెలుగుభాష
కడప: నేడు తెలుగుభాష ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి 90వ జయంతి సందర్బంగా ఆదివారం వైఎస్సార్ జిల్లా కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో జానమద్ది కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ భాషకు పడుతున్న దురవస్థను తలచుకుంటే బాధ కలుగుతోందన్నారు. తరం గడిస్తే తెలుగు మాట్లాడేవారు ఎందరుంటారని ఆలోచిస్తేనే భయమేస్తుందన్నారు. తెలుగుభాషకు, బ్రౌన్ స్మారక గ్రం థాలయ నిర్మాణానికి జానమద్ది చేసిన సేవలు అపూర్వమని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దేశాభివృద్దికి దోహదపడే సైన్స్-టెక్నాలజీతోపాటు భాషా, సాహిత్యాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని జస్టిస్ జాస్తి అన్నారు. పిల్లలు 1వ తరగతి నుంచి కంప్యూటర్ పరిజ్ఞానం తప్ప పురాణ ఇతిహాసాల గురించి తెలుసుకోవడం లేదన్నారు. కంప్యూటర్లు క్యాలిక్యులేషన్స్ చెబుతాయేతప్ప అనుబంధాలను నేర్పలేవని, అది సాహిత్యం వల్లే సాధ్యమవుతుందన్నారు. -
బీజేపీ యూటర్న్ ను ప్రశ్నించిన తృణమూల్
కోల్ కతా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువస్తామని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన నరేంద్ర మోదీ సర్కారు వెనక్కి తగ్గడాన్ని ప్రశ్నించింది. నల్లధనం వ్యవహారానికి సంబంధించి అసలు బీజేపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం నిజంగా బాధాకరమని తృణమూల్ రాజ్యసభ అభ్యర్థి ఓబ్రెయన్ విమర్శించారు. దేశంలోని అవినీతి కారణంగానే కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీచాయని ఆయన తెలిపారు. ఇదే తరహాలో బీజేపీ కూడా వ్యవహరించడం రెండు పార్టీలు దొందూ దొందూగానే వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.' నల్లధనంపై చేపట్టే చర్యలు ఏమిటి? దీనిపై ఉపయోగంలేని కమిటీ ఏర్పాటు ఒక్కటే చాలదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి తృణమూల్ సిద్ధంగా ఉందని తెలిపారు. భారత్‌తో రెండుసార్లు పన్ను పడకుండా మినహాయింపు ఒప్పందం(డీటీఏఏ) కుదుర్చుకున్న దేశాలు అందించిన భారతీయుల ఖాతాల మొత్తం వివరాలను బహిర్గతం చేయలేమని శుక్రవారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. డీటీఏఏ ఒప్పందం ఉన్న దేశాలు అందించే సమాచారాన్ని వెల్లడిస్తే ఆ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయంది. ఒకసారి బహిర్గతం చేస్తే ఇక ఆ దేశాలు సమాచారం ఇవ్వక పోవచ్చని, ఇతర దేశాలతో డీటీఏఏ కుదుర్చుకోవడం కూడా కష్టమవుతుందని కేంద్రం తెలిపింది. దీనిపై తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడింది.నల్లధనం విషయంలో ఎన్డీయే సర్కారు కూడా గత యూపీఏ బాట పట్టిందని అభిప్రాయపడింది. -
నల్లధనం వివరాలన్నీ వెల్లడించలేం
విదేశీ ఖాతాల సమాచారంపై సుప్రీంకు కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ: నల్లధనం విషయంలో ఎన్డీయే సర్కారు కూడా గత యూపీఏ బాట పట్టింది. భారత్‌తో రెండుసార్లు పన్ను పడకుండా మినహాయింపు ఒప్పందం(డీటీఏఏ) కుదుర్చుకున్న దేశాలు అందించిన భారతీయుల ఖాతాల మొత్తం వివరాలను బహిర్గతం చేయలేమని తాజాగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. డీటీఏఏ ఒప్పందం ఉన్న దేశాలు అందించే సమాచారాన్ని వెల్లడిస్తే ఆ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయంది. ఒకసారి బహిర్గతం చేస్తే ఇక ఆ దేశాలు సమాచారం ఇవ్వక పోవచ్చని, ఇతర దేశాలతో డీటీఏఏ కుదుర్చుకోవడం కూడా కష్టమవుతుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనానికి శుక్రవారం 800 పేజీల నివేదిక సమర్పించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ వివరాలను కోర్టుకు వివరించారు. భారతీయుల ఖాతాల వివరాలను బహిర్గతం చేసే విషయంలో జర్మనీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని, విచారణ జరపాలని భావిస్తున్న ఖాతాలను మాత్రం వెల్లడించేందుకు సుముఖంగా ఉందన్నారు. అందువల్ల ఆ దేశానికి చెందిన లీచెన్‌స్టెయిన్ బ్యాంకు అందించిన ఖాతాల వివరాలను బహిర్గతం చేయాలన్న గత ఆదేశాలను సవరించాలని కోరారు. ఈ వాదనను పిటిషనర్, సీనియర్ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ వ్యతిరేకించారు. విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్న వారిని కాపాడేం దుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. విదేశాల్లో భారతీయులు దాచుకున్న సొమ్మునంతా నల్లధనంగా చూడలేమని, విదేశాల్లో ఖాతాలు తెరవడం నేరమేమీ కాదని రోహత్గీ వ్యాఖ్యానించారు. -
డిసెంబర్ 6న జాతీయ లోక్ అదాలత్
కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి: జస్టిస్ నర్సింహారెడ్డి హైదరాబాద్: వచ్చే డిసెంబర్ 6న కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నాయని, ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ ఉపయోగించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. హైకోర్టులో శుక్రవారం విలేకరులతో జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29,357 కేసులు, తెలంగాణ రాష్ట్రంలో 14,605 కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకంతో ప్రజలు చిన్న చిన్న సమస్యలకు కూడా కోర్టులను ఆశ్రయిస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు తక్షణ పరిష్కారంగా లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇరు రాష్ట్రాల్లోని కింది కోర్టుల్లో దాదాపు 10 లక్షల వరకు పెండింగ్ కేసులున్నాయని తెలిపారు. కాగా డిసెంబర్ 6న తలపెట్టిన జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ శుక్రవారం అన్ని రాష్ట్రాల సీజేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
తప్పును ఎత్తిచూపితే వేధిస్తారా?
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం నల్లధనం వెలికితీతపై పిల్ వేిసిన ఐఏఎస్‌కు బాసట ఆయనపై కక్ష సాధింపులకు దిగిన కేంద్రానికి తలంటు రూ. 5 లక్షల జరిమానా హైదరాబాద్: వ్యక్తిగత లేదా ప్రజా సంబంధిత సమస్యల విషయంలో న్యాయ పరిష్కారం కోరే హక్కు రాజ్యాంగ హక్కులకు సంబంధిం చిదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకూ ఈ హక్కులు వర్తిస్తాయని పేర్కొంది. తద్వారా ప్రభుత్వాల తప్పులను, లోటుపాట్లను ఎత్తిచూపుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)ను దాఖలు చేయొచ్చని పరోక్షంగా చెప్పినట్లయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ సిక్రితో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ప్రభుత్వ తప్పులను, లోటుపాట్లను ఎత్తిచూపుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిం చారన్న కారణంతో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా అతనికి పదోన్నతి నిరాకరించి, అభియోగాలు మోపడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేంద్రం తప్పులను ఎవరైనా ఎత్తి చూపితే వారికీ ఇదే గతి పడుతుందనే హెచ్చరికలు పంపడానికే ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలా చేసినందుకు కేంద్రానికి రూ. 5 లక్షల జరిమానా విధించింది. వేధింపులకు గురైన ఐఏఎస్ అధికారికి ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. బాధ్యులైన వారిని గుర్తించి, వారి నుంచే ఈ మొత్తాలను వసూలు చేసుకోవాలని వ్యాఖ్యానించింది. నల్లధనం వెలికితీత విషయంలో ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్‌శంకర్ పాండే సుప్రీం కోర్టులో గతంలో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కేంద్రానికి పలుమార్లు తలంటింది. ఇవ న్నీ ఇబ్బందిగా పరిణమించడం తో, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా పిల్ దాఖలు చేయడం క్రమశిక్షణారాహిత్యమేనంటూ పాండేపై చర్యలు తీసుకుంది. అతనిపై ఐదు అభియోగాాలు మోపుతూ విచారణకు సైతం ఆదేశించింది. దీనిపై అతను అలహాబాద్ హై కోర్టు, అక్కడి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో చివరకు అతను సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు. దీనిపై ధర్మాసనం లోతుగా విచారణ జరిపింది. వాదనల అనంతరం జస్టిస్ చలమేశ్వర్ తీర్పు వెలువరిస్తూ కేంద్రం తీరును తప్పుబట్టారు. పిటిషనర్ విజయ్‌శంకర్ పాండేకు విచారణాధికారి క్లీన్చిట్ ఇస్తూ నివేదిక ఇస్తే దాన్ని తిరస్కరించి, మరో విచారణ కమిటీని ఏర్పాటు చేయడాన్ని తీర్పులో ఎత్తిచూపారు. పాండేపై మోపిన అభియోగాలు ఇక్కడ వర్తించవని తేల్చి చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వం తన రాజ్యాంగపరమైన విధులను నిర్వహించడంలో విఫలమైదన్న ఆరోపణలతో పిటిషన్ దాఖలు చేస్తే అది ఏ విధంగా క్రమశిక్షణారాహిత్యం అవుతుందో.. విధుల పట్ల చిత్తశుద్ధి కనబరచకపోవడం కిందకు వస్తుందో మాకు అర్థం కాకుండా ఉంది. నల్లధనంపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయడం ద్వారా దేశాన్ని ఆర్థికంగా, భద్రతాపరంగా బలహీనపరచారన్న కేంద్రం వాదన ఎంత మాత్రం నమ్మశక్యంగా లేదు’ అని ధర్మాసనం పేర్కొంది. -
ఇక జైళ్లు సగం నోరు తెరుచుకుంటాయి!
విచారణ పూర్తయి శిక్ష అంటూ పడితే, ఎంత శిక్ష పడుతుందో, దానిలో సగ కాలం విచారణ లేకుండా జైళ్లలో గడిపి ఉంటే, వారిని వెంటనే విడుదల చేయవలసిందిగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వాస్తవానికి ఈ రకమైన తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వనవసరం లేదు. విచారణకు నోచుకోకుండా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న అభాగ్యులకు ఎట్టకేలకు విముక్తి లభించింది! ఏదో అభియోగం మీద అరెస్టు చేసి, అతను నేరం చేశాడా లేదా అని విచారణ చేయకుండా జైల్లో పెట్టేసి, ఇక వారి సం గతి మరచిపోతారు. అరెస్టు ఎందుకు చేశారో అత నికి తెలియదు. తనపై ఉన్న అభియోగం ఏమిటో తెలియదు! తనపై నేరారోపణ ఎవరు చేశారో తెలి యదు! విచారణ ఎప్పుడు మొదలవుతుందో తెలి యదు! తనపై మోసిన అభియోగానికి విచారణ అంటూ జరిపితే ఎంత శిక్ష పడుతుందో తెలియదు! అటువంటి వారికి 5, అక్టోబర్ 2014 నాడు సుప్రీం కోర్టు గొప్ప ఊరట కల్పించింది. వీరి విచారణ ఒక వేళ పూర్తయి, శిక్ష అంటూ పడితే, ఎంత శిక్ష పడుతుందో, దానిలో సగ కాలం విచారణ లేకుండా జైళ్లలో గడిపి ఉంటే, వెంటనే విడుదల చేయవలసిందిగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ దానికి సంబంధించిన అంశాలపై అవసరమైన ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ రకమైన తీర్పు సుప్రీం కోర్టు ఇవ్వనవసరం లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 436ఏలోనే ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని ఆజ్ఞ ఉన్నది. అయితే దానిని పట్టించుకొనే వారెవరు? డబ్బున్న వాళ్లకు, అధికారం ఉన్న వాళ్లకు ఈ బాధలు ఉండవు! ముందే అన్నీ చక్కబెట్టుకుంటారు! ఇటువంటి సౌకర్యం 2005లో సీఆర్పీసీకి సవరణ ద్వారా తీసుకువచ్చారు. ఇది 2006 నుంచి అమలులోకి వచ్చినా, దీని ప్రయోజనం జైళ్లలో ఉన్న వారికి అందటం లేదు. చట్టం ఉన్నది, ప్రయోజనం ప్రజలకు అందాలి. ఇది వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. కాని చట్ట ప్రయోజనం అందక కొన్ని వేల మంది అభాగ్యులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నుంచి అంద వలసిన ప్రయోజనం అందటం లేదని గ్రహించి, వెంటనే అటువంటి ప్రయోజనానికి అర్హత కలిగిన వాళ్లను ఇప్పుడు సుప్రీంకోర్టు వెంటనే విడుదల చేయమన్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశం లోని జైళ్లలో సుమారు 3.18 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2.54 లక్షల మంది విచారణ జరగవలసి ఉన్నవారు. ఇందులో వాళ్లపై వచ్చిన అభియోగానికి పడే శిక్షకంటే ఎక్కువ కాలమే వాళ్లు ఏ విచారణా లేకుండా జైళ్లలో ఉన్నారు. ఇది ఎంత అన్యాయం? ఈ విషయం ప్రభుత్వాలకు గాని, జైళ్ల అధికారులకు గాని తెలియనిది కాదు. అయితే వారు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే జైళ్లలో ఈ రకంగా మగ్గిపోతున్న వారు పేదవారు కాబట్టి! ఇంతకుముదు ఒక ప్రయత్నం బీహార్ జైళ్ల విషయంలో సుప్రీంకోర్టు చేసింది. అనవసరంగా ఎక్కువ కాలం జైళ్లలో మగ్గిపోతున్న వారిని విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతే మళ్లీ అటువంటి వారి సంగతి ఎవరూ పట్టించుకోవటం లేదు. చట్టం వచ్చి ఎనిమిదేళ్లయినా ఇప్పుడూ పట్టించుకోవటం లేదు. సుప్రీంకోర్టు ఇప్పటికైనా చట్ట ప్రయోజ నాన్ని ప్రజలకు అందించవలసిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఉత్తర్వులు ఇచ్చి సుప్రీంకోర్టు ఊరుకోలేదు. న్యాయాధి కారులను, అంటే మేజిస్ట్రేట్లను వారానికి ఒకసారి జైలును సందర్శించి, ఈ విధంగా జైళ్లలో ఎంత మంది అనవసరంగా ఉంటున్నారో లెక్కలు తీసి, వారికి పైన చెప్పిన ప్రయోజనం అందవలసి ఉంటే, వారిని వెంటనే విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చెయ్యాలని ఆదేశించింది. ఈ విధంగా మొత్తం రెండు నెలలు ప్రతి వారానికి ఒకసారి మేజిస్ట్రేట్లు జైలుకు వెళ్లి విడుదలకు అర్హులైన వారిని మొత్తంగా విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియలో న్యాయవాదుల ప్రమేయం ఏదీ ఉండకూడదు. దీనికి సహకరించాలని జైలు అధి కార్లను కూడా ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసి ఒక నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సమర్పించాలి. అంటే సుప్రీంకోర్టు కేవలం ఉత్తర్వులు జారీ చేసి కూర్చోలేదు. ఇచ్చిన ఉత్తరువుల అమ లును కూడా పర్యవేక్షిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం రెండు నెలలలో పూర్తయినట్టు తనకు నివేదిక కూడా అందజేయాలని ఆదేశించింది. ఎందుకంటే చట్టం ఉన్నప్పటికీ ఎనిమిది ఏళ్లుగా దాని ప్రయోజనం జైళ్లలో ఉన్న వారికి అందటం లేదు. ఎవరూ పట్టించుకోవటం లేదు. ఏళ్ల తరబడి ముద్దాయిలను పదిహేను రోజులకొకసారి జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్లటం, మళ్లీ వెనక్కి తీసుకురావటంతోటే అయిపోతున్నది. అందుకని చట్ట ప్రయోజనం ప్రజలకు అందుతున్నదా లేదా అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షించే పని పెట్టుకున్నది. అధికార్లు తమ విధి నిర్వహణలో విఫలమవుతున్నారు కాబట్టి సుప్రీం కోర్టు నేరుగా ఆ బాధ్యతను కూడా స్వీకరించింది. అందుకు అవసరమైన ఉత్తర్వులను సంబంధిత మేజిస్ట్రేట్లకు, జైలు అధికార్లకు, తన తీర్పు ద్వారా జారీచేసింది. ఈ ఉత్తర్వులు పేద ప్రజలకు ఎంతో గొప్ప మేలు చేశాయి. చెయ్యని నేరానికి జైలుకు వెళ్లేది వారే! విచారణ లేకుండా జైళ్లలో మగ్గిపోయేది వారే! ఒక అంచనా ప్రకారం నూటికి అరవై మందికి పైగా ఈ ప్రయోజనం అందుతుంది. అయితే మరణశిక్ష పడే కేసుల్లో ఉన్న వారికి ఈ ప్రయోజనం అందదు! ఈ ఒక్కటీ చాలదు! జైళ్ల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళనం కావా లి. నేర విభాగానికి సంబంధించిన ప్రక్రియలో కూడా మార్పు రావాలి. జైళ్ల పరిస్థితులలో కూడా మార్పు తేవాలి. నేరాలు, శిక్షలు, జైళ్లకు సంబంధించిన సీఆర్పీసీని 1860లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చింది. భారతదేశ ప్రజలపై అజమాయిషీ చేయటానికి, వారిని అదుపులో ఉంచడానికి శిక్షలు వేసి, జైళ్లలో పెట్టి వీరిని భయభ్రాంతులను చేయటానికి తీసుకువచ్చిన చట్టం ఇది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్ని చిన్న చిన్న సవ రణలు తీసుకువచ్చారు గాని, సమగ్రమైన మార్పులు తేలేదు. ఇప్పుడు తీసుకువచ్చిన ప్రక్రియ పాతదే! అయితే అమలుకు నోచుకోలేదు. సుప్రీంకోర్టు పుణ్యమా అని ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుంది. స్వతంత్ర భారతదేశంలో దాదాపు 250 ఏళ్ల క్రితం చేసిన చట్టాలను ఈ నాటికీ పట్టుకు వేలాడటం సిగ్గుచేటు. జైళ్ల విధానం, నిర్వహ ణలో చాలా దేశాలలో చెప్పుకోదగ్గ మార్పులు వస్తున్నాయి. మార్పు అంటే భయపడేది మన దేశమే! ఈ సందర్భాన్ని తీసు కొని కనీసం జైళ్ల వ్యవస్థను ప్రజాస్వామ్యీకరించడానికి ముం దుకు రావాలి! బొజ్జా తారకం సీనియర్ న్యాయవాది -
పదవులు... ప్రమాణాలు!
రాజ్యాంగమైనా, చట్టాలైనా సర్వ సమగ్రంగా ఉండటం సాధ్యంకాదు. ప్రజాస్వా మ్యంలో ఉన్నత స్థానాల్లోని వ్యక్తులకుండే అధికారాలు, పరిధులు, పరిమితుల వంటి అంశాలపై రాజ్యాంగం సవివరంగానే ప్రస్తావించినా...అన్నిటినీ ముందే ఊహించి చెప్పడం కుదరదు గనుక అది సంపూర్ణమనలేం. అందుకే అవసరాన్ని బట్టి రాజ్యాంగానికి సవరణలొస్తున్నాయి. కొత్త కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. అయినా సమస్యలు వస్తూనే ఉంటాయి. పరిష్కారాన్ని కోరుతూనే ఉంటాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినవారు ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లడం సబబేనా అనేది అలాంటి సమస్యే. ఉన్నత స్థానాల్లోని వ్యక్తులు తమ నిర్ణయాలద్వారా, తమ ప్రవర్తనద్వారా ఉన్నత ప్రమాణాలను నెలకొల్పు తారు. కాలక్రమంలో అవి సంప్రదాయంగా స్థిరపడతాయి. ఆ సంప్రదాయాన్నే అందరూ పాటిస్తారని, పాటించాలని కోరుకోవడం కూడా అత్యాశే. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం కేరళ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఏకవాక్యంతో తోసిపుచ్చింది. న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు రిటైరయ్యాక ఏ ఇతర పదవినైనా చేపట్టడానికి నిర్దిష్ట కాలావధిని నిర్దేశించాలని పిటిషనర్ కోరారు. ఇలాంటి నిబంధనలను రూపొందించే పని నిజానికి న్యాయవ్యవస్థది కాదు. ఆ పని చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ. జస్టిస్ సదాశివం నిరుడు జూలై నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకూ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. నాలుగు నెలల విరామం అనంతరం గత నెల 5న కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. మామూలు సందర్భాల్లో ఏమయ్యేదోగానీ ఎన్డీయే సర్కారు యూపీఏ హయాంలో నియమి తులైన గవర్నర్లను రాజీనామా చేయాలని హుకుం జారీచేయడం, అందుకు ససేమిరా అన్నవారిని మారుమూల రాష్ట్రాలకు బదిలీ చేయడం వంటి చర్యలు తీసుకోవడంతో వాటి చుట్టూ బోలెడంత వివాదం అలుముకున్నది. ఈ నేప థ్యంలో అలాంటి వివాదాస్పద పదవిని అంగీకరించడం ఏమిటని కొందరు అభ్యం తరం చెప్పగా... సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి అంతకంటే తక్కువ స్థాయి పదవిని ఒప్పుకోవడం సబబుగాలేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. రిటైర్మెంట్ అనంతరం గవర్నర్ పదవి వంటి రాజకీయ నియా మకానికి సంసిద్ధత చూపడంవల్ల న్యాయవ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆందోళనపడినవారు కూడా ఉన్నారు. జస్టిస్ రాజిందర్ సచార్ వంటి న్యాయ కోవిదులైతే సదాశివం చర్య ఔచిత్యభంగమేకాక...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి పదవికుండే గౌరవప్రపత్తులకు కూడా విఘాతమని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులుగా పనిచేసి రాజకీయ పదవులను అంగీకరించడం సదాశివంతోనే ప్రారంభం కాలేదు. గతంలో కాంగ్రెస్ పాలకులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైరైన ఫాతిమా బీవీని తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. అలాగే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణచేసిన రంగనాథ్ మిశ్రాను రాజ్యసభకు నామినేట్ చేశారు. యూపీఏ పాలనా కాలంలో 22మంది న్యాయమూర్తులు పదవీ విరమణ చేయగా వారిలో 18మందికి వివిధ కమిషన్లలోనూ, ట్రిబ్యునల్స్‌లోనూ పునరావాసం లభించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసినవారు పదవులను అంగీకరించవచ్చునా, అంగీకరిస్తే అవి ఏ స్థాయి పదవులై ఉండాలన్న విషయంలో స్పష్టత లేదు. రాజ్యాంగం దాన్ని గురించి ఏమీ చెప్పడం లేదు. రాజ్యాంగ పదవుల్లో పనిచేసినవారు రిటైరయ్యాక కనీసం రెండేళ్ల అనంతరం మాత్రమే ఎలాంటి పదవినైనా అంగీకరించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ ఒక సందర్భంలో సూచించారు. రిటైర్మెంట్ అనంతరం కొన్నేళ్లపాటు కొత్త పదవులకు దూరంగా ఉండాలని ఈమధ్యే రిటైరైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లోథా అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్‌గా ఉంటూ 1969లో హిదయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు. అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉంటూ తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చూస్తున్న వి.వి.గిరి పదవినుంచి తప్పుకుని రాష్ట్రపతి పదవికి పోటీచేయడంతో హిదయతుల్లా ఆ బాధ్యతలు చేపట్టాల్సివచ్చింది. కనుక ప్రొటోకాల్ ప్రకారమైతే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిల తర్వాత ప్రాధాన్యతాక్రమంలో మూడో స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిదే. అంతటి ఉన్నత స్థానంలో పనిచేసివున్న సదాశివం అంతకంటే తక్కువ స్థాయిలోని గవర్నర్ పదవిని అంగీకరించడం సబబుగా లేదన్నది కొందరి అభ్యంతరం. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉంటున్నారు గనుక అరుణ్‌జైట్లీ ఏమంటారో గానీ... రెండేళ్లక్రితం విపక్ష నేతగా ఉన్నప్పుడు మాత్రం న్యాయమూర్తులుగా పనిచేసేవారు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ పదవులను అంగీకరించరాదని సూచించారు. అంతేకాదు...కొందరు న్యాయమూర్తులు ఈ తరహా పదవులు ఆశించి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాస్తున్నారని కూడా ఆరోపించారు. దీనికితోడు సదాశివంను గవర్నర్‌గా నియమించగానే అమిత్ షాపై ఉన్న కేసు విషయంలో ఉదారంగా వ్యవహరించడంవల్లనే ఆయనకు ఈ పదవి దక్కిందని కాంగ్రెస్ ఆరోపించింది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల మాటెలా ఉన్నా న్యాయవ్యవస్థ విశ్వనీయతనూ, ప్రమాణాలనూ కాపాడాలనుకుంటే ఇలాంటి రాజకీయ నియామకాలకు న్యాయమూర్తులు మొగ్గు చూపకపోవడమే ఉత్తమం. అలా చేయొద్దని రాజ్యాంగం చెప్పకపోవచ్చు. సీవీసీ వంటి పదవుల విషయంలో ఉన్నట్టు చట్టమూ ఉండకపోవచ్చు. కానీ, తమ నిర్ణయం ఒక సత్సంప్రదాయానికి బాటలువేయాలి తప్ప అనవసర వివాదాలకు తావీయరాదని సదాశివం వంటి వారు గుర్తిస్తే మంచిది. -
‘ఎంసెట్’పై వాదనలకు పదును
‘రెండో విడత కౌన్సెలింగ్’ అంశంపై 10న సుప్రీంకోర్టు విచారణ సానుకూల పరిస్థితులు ఉన్నాయంటున్న ఉన్నత విద్యామండలి వర్గాలు సమయాభావంతో ఈ ఏడాది ఈసెట్ కౌన్సెలింగ్ ఒక విడతతోనే పూర్తి హైదరాబాద్:ఎంసెట్ మలివిడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ఈ నెల పదో తేదీన సుప్రీంకోర్టు ముందు విచారణ జరగనుండడంతో తమవాదనలను వినిపించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాయత్తమవుతోంది. వేలాది మంది విద్యార్థులు, వందలాది కాలేజీలు మలివిడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సుప్రీం తీర్పు ప్రాధాన్యత సంతరించుకోనుంది. దాదాపు 70 వేల సీట్లు మిగిలి పోవడంతో పాటు తొలివిడతలో అవకాశాలు రాని వారు, అవకాశం వచ్చినా మలివిడతపై ఆశతో సీట్లలో చేరని వారు వేలాదిగా ఉన్నారు. వీటితో పాటు తెలంగాణ ప్రాంతంలో మొదటి విడతలో అవకాశం కోల్పోయిన 174 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. వాటికి షరతులతో ప్రవేశాలకు అవకాశం కల్పించారు.రెండో విడత కౌన్సెలింగ్ లేక వీరంతా నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారు. మలివిడతకోసం విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు, ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలుచేశాయి. ఇవి ఈ నెల 10న విచారణకు రానున్నాయి. వేలాది మంది విద్యార్థుల భవితవ్యం ఈ కౌన్సిలింగ్‌తో ముడిపడి ఉందని, అదే విధంగా వందలాది కాలేజీలు మూతపడే పరిస్థితి ఉందని.. కాబట్టి మలివిడతకు అవకాశం కల్పించాలని ఉన్నత విద్యామండలి నివేదించనుంది. ఇటీవల ఇరు రాష్ట్రాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లు అజయ్‌జైన్ (ఏపీ) శైలజారామయ్యర్ (తెలంగాణ)లు సుప్రీంకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై చర్చించారు. ఆమేరకు తమ న్యాయవాదులకు సుప్రీంకోర్టులో వినిపించాల్సిన వాదనలపై సూచనలు ఇచ్చారు. సమయాభావం వల్లే ... ఈసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఒక విడతతోనే అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచేశారు. మలివిడతకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించలేదు.ఈసెట్ ముందుగా పూర్తయిందని, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయి తరగతులు కూడా ప్రారంభమవడంతో రెండో విడతకు అవకాశం కల్పించలేదని ఉన్నత విద్యామండలి అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది సమయానుకూలంగా ఈసెట్‌లో తొలి, మలివిడతల కౌన్సెలింగ్‌లపై నిర్ణయిస్తామని చెప్పారు. -
ఒక నేతకు నివాళిగా ఒకే వాణిజ్య ప్రకటన
న్యూఢిల్లీ: మీడియాకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు నియమించిన ఓ కమిటీ పేర్కొంది. అదే సమయంలో అధికారంలో ఉన్నవారిని స్తుతించేలా ఆ ప్రకటనలు ఉండకూడదని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపు దారుల ధనాన్ని వాణిజ్య ప్రకటనల రూపంలో దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వాలను నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్ మేరకు ఓ కమిటీని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో నియమించింది. ఈ విషయమై సంబంధిత కమిటీ తాజాగా సుప్రీం కు పలు సిఫారసులు చేసింది. ఏ ఏ ప్రముఖ వ్యక్తుల జయంతి, వర్ధంతికి ప్రకటనలు ఇవ్వాలనే దానిని ప్రభుత్వం ముందుగానే నిర్ణయించాలని, ఆ ప్రకటనను ఏ విభాగం ఇవ్వాలో కూడా ఖరారు చేయాలని సూచించింది. దీనివల్ల ఒకే నేతకు నివాళిగా పలు ప్రకటనలు ఇవ్వడాన్ని నిరోధించవచ్చని పేర్కొంది. అలాగే ఆ ప్రకటనల్లో రాజకీయ నేతల ఫొటోలు ఉండరాదని స్పష్టం చేసింది. -
మెడికల్ సీట్ల భర్తీలో గందరగోళం
సీట్లు పొందినా కౌన్సెలింగ్‌కు రాని మూడు కళాశాలలు 550 సీట్లకు గాను 250 సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్ హైదరాబాద్: సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఎంబీబీఎస్ సీట్లు పొందిన ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాల కోసం మంగళవారం జరిగిన కౌన్సెలింగ్ గందరగోళానికి దారితీసింది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలో పలువురు అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. నల్లగొండ జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్, కొంతమంది అభ్యర్థుల తల్లిదండ్రులు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఒకే సామాజిక వర్గానికి 97 సీట్లు ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు. తాము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వ్యవహరించామని జేఎన్టీయూ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు గతంలో మంచి ర్యాంకులొచ్చినా సీటు రాకపోవడంతో యాజమాన్య కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులు చాలామంది మంగళవారం కౌన్సెలింగ్‌కు వచ్చారు. తమకు మంచి ర్యాంకులు వచ్చినా సీట్లు దక్కలేదని, ఇప్పుడేమో సరైన ర్యాంకులు రాని వారికి కన్వీనర్ కోటాలో సీట్లు ఇవ్వడం దారుణమన్నారు. చేతులెత్తేసిన మూడు కళాశాలలు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సీట్లు పొందినా మూడు కళాశాలలు సీట్లు తీసుకునేందుకు నిరాకరించాయి. రెండు రాష్ట్రాల్లోని 5 కళాశాలల్లో 550 సీట్లకు సుప్రీం అనుమతి ఇచ్చింది. అరుుతే 250 సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్ జరిగింది. కాటూరి, జెమ్స్, బీఆర్కే కళాశాలలు తమకు సీట్లు వద్దంటూ కౌన్సెలింగ్ ప్రక్రియ నుంచి తప్పుకున్నారుు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ కళాశాలల్లో ఏడాదికి కేవలం రూ.10 వేలు వసూలు చేయాలి. అంతేకాదు రూ.10 కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఎంసీఐకి ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లోనే పై మూడు కళాశాలలు తమకు సీట్లు అక్కర్లేదని చెప్పేశాయి. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ ప్రారంభం కాగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కేంద్రంలో అడ్మిషన్ల ప్రక్రియకు హాజరైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు వర్సిటీ గేటు ముందు ధర్నాకు దిగారు. నిబంధనల మేరకు మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియను మంగళవారమే ముగించాల్సి ఉండగా.. వర్సిటీ అధికారులు సోమవారం అర్థరాత్రి తరువాత నోటిఫికేషన్‌ను వెబ్సైట్లో పెట్టారు. అరుుతే ఏపీలోని జెమ్స్, కాటూరి మెడికల్ కళాశాలల యాజమాన్యాలు తాము సుప్రీం తీర్పు మేరకు ప్రవేశాలకు కల్పించలేమని పేర్కొంటూ వర్సిటీ అధికారులకు లేఖలు సమర్పించాయి. దీంతో ఏపీలోని మైనార్టీ కళాశాలైన ఫాతిమా మెడికల్ కళాశాలలో మాత్రమే సీట్లు భర్తీ చేశారు. దీంతో ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో సీట్లే లేకుండా పోయాయి. ఏయూ అభ్యర్థులు తెలంగాణలోని మల్లారెడ్డి, మెడిసిటీ కళాశాలల్లోని 15 శాతం అన్ రిజర్వుడ్ సీట్ల కోసం పోటీపడాల్సి వచ్చింది. అరుుతే ఆ సీట్లు ఓయూ ప్రాంత అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో కైవసం చేసుకున్నారు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియకు హాజరైన అభ్యర్థులు, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యూరు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్ కేటగిరీ అభ్యర్థులకు కూడా కౌన్సెలింగ్ నిర్వహించారు. -
నైతిక విలువలకు నీరాజనం!
జయలలిత మాదిరిగానే ఈ దేశంలో పాలనకు అనర్హులయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. అందుకే కాస్త ఆలస్యంగానే అయినా, కొద్ది రోజుల క్రితం దేశ అత్యున్నత స్థానం ఇచ్చిన తీర్పును గుర్తు చేసుకోవాలి. సుప్రీంకోర్టు ధర్మాసనం (ఆగస్ట్ 27, 2014) ఇచ్చిన ఆ తీర్పు విశిష్టమైనది. చరిత్రాత్మకమైనది. అధికారిక స్థానాలలో అవినీతికి ఆలవాలమైన, ఆర్థిక గూండాయిజం కన్నా ఈ దేశంలోని ‘మేధావి’ గుడ్డిలో మెల్లలాగా కొంత మెరుగు. సోమనాథ్ చటర్జీ (లోక్‌సభ మాజీ సభాపతి, ఆగస్ట్ 23, 1995) ‘పట్టుకో పట్టుకోమనేవాడే గానీ, పట్టుకున్నవాడు ఒక్కడూ లేడు’ అని సామెత. ఒకవేళ పట్టుబడవలసిన వాళ్లు పట్టుబడితే అనేక రకాల వలస ప్రభుత్వ చట్టాలతో కుదిరిన ‘వియ్యం’ తరువాత ఆ అవకాశవాద చట్టాల ఆధారంగా రూపొందించిన భారత రాజ్యాంగ వ్యవస్థ కింద పనిచేస్తున్న పాలక వ్యవస్థలు ఎలా అవినీతిమయంగా వ్యవహరిస్తాయో 65 ఏళ్ల రాజకీయ స్వాతంత్య్రం నిరూపించింది. ఏమున్నది గర్వకారణం? 1947 తరువాత, తొలి దశాబ్దంలో కొంత మినహా, మిగిలిన యాభైఅయిదేళ్ల కాలాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ‘దేశంలో చిట్టచివరి పేదజీవి కూడా దారిద్య్రం బాధ నుంచి, పీడన నుంచి విముక్తి పొందేవరకు స్వాతంత్య్రం వచ్చినట్టు కాదు’ అన్న జాతిపిత గాంధీ మాట ఎంత దూరదృష్టి గలదో దేశ ప్రజలు ఆలోచించుకోవలసిన దశలోకి ప్రవేశించారనిపిస్తుంది. ఆరు దశాబ్దాల కాలంలోనే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎంతో చేటు జరిగింది. ఎన్నికలలో మోసాలు, అవినీతి కారణంగా సివిల్, క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న ఎంపీలు దాదాపు 200 మందికి పైగానే ఉన్నారని ఇటీవలి సర్వేలలో తేలింది. వీరిలో ప్రధానులు, మంత్రుల స్థాయి వారు కూడా ఉన్నారు. పక్షపాత రాజకీయాలలో భాగంగా మైనారిటీలపైన జరిపిన హత్యాకాండతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు కూడా ఉన్నారు. ఇలాంటి వారు అన్ని పార్టీలలోను ఉన్నారు. అవినీతి సామ్రాజ్ఞి ఈ పూర్వరంగం నుంచి చూస్తే తమిళనాడుకు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత కూడా కనిపిస్తారు. ఇంతకు ముందు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి కూడా ఇందుకు మినహాయింపు కాదు. జయలలిత అవినీతి ఆరోపణల కేసు విచారణ పూర్తి కావడానికి 18 ఏళ్లు పట్టింది. విచారణ ప్రహసనంలో 259 మంది సాక్షులను విచారించారు (వీరిలో కొందరు తరువాత జారుకున్నారు. ఆమె తరఫున డిఫెన్స్ సాక్షులుగా 99 మంది ఉన్నారు.) మద్రాసు హైకోర్టు, మరికొన్ని కింది కోర్టులు ఆమెపై నమోదైన కొన్ని కేసులను కొట్టివేశాయి. మిగిలినవి చివరికి మద్రాస్ నుంచి బెంగళూరులో ఏర్పాటు చేసిన జడ్జి జాన్ మైఖేల్ డి కున్హా ప్రత్యేక న్యాయస్థానానికి చేరుకున్నాయి. సాక్ష్యాలకు సంబంధించిన 1,066 పత్రాలను, 2,341 అనుబంధ (ఎగ్జిబిట్) పత్రాలను పరిశీలించి జస్టిస్ కున్హా సెప్టెంబర్ 27న తీర్పు వెలువరించారు. న్యాయమూర్తి జయలలితకు భారీ శిక్షే విధించారు. ఆమె అధికారంలో ఉండగా జరిగిన రూ.65 కోట్ల రూపాయల అవినీతి కుంభకోణానికి రూ.100 కోట్లు జరిమానా విధించారు. జైలుకు పంపారు. ఈ తీర్పుతో జయలలిత తన శాసనసభ్యత్వాన్నీ, తద్వారా ముఖ్యమంత్రి పదవినీ కోల్పోయారు. అంతేకాదు, పదేళ్ల వరకు (ఇక్కడ చెన్నారెడ్డి ఎన్నిక చెల్లక ఆరేళ్లపాటు ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హుడైనట్టు) ఆమె ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హురాలవుతారు. ఇలా ఇంకెందరో? జయలలిత మాదిరిగానే ఈ దేశంలో పాలనకు అనర్హులయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. అందుకే కాస్త ఆలస్యంగానే అయినా, కొద్ది రోజుల క్రితం దేశ అత్యున్నత స్థానం ఇచ్చిన తీర్పును గుర్తు చేసుకోవాలి. సుప్రీంకోర్టు ధర్మాసనం (ఆగస్ట్ 27, 2014) ఇచ్చిన ఆ తీర్పు విశిష్టమైనది. చరిత్రాత్మకమైనది. అవినీతిపరులైన రాజకీయ పాలకులకూ, చట్టసభల సభ్యులకు, అధికార గణాలకు నసాళానికి అంటే విధంగా వెలువడిన తీర్పు ఇది. గత ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన ప్రధానులు, ప్రభుత్వాలలో భాగస్వాములైన మంత్రులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు, లెజిస్లేటర్లు ఈ తీర్పు పరిధిలోకి రారని చెప్పలేం. నిజానికి ప్రత్యేక కోర్టులో జడ్జి కున్హా చెప్పిన తీర్పు కన్నా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. ఎం.లోధా అధ్యక్షతన ధర్మాసనం తాజాగా ఇచ్చిన తీర్పు విస్తృతిలో ఎంతో పెద్దది. దేశ వ్యాప్తంగా వర్తించగలిగేది. అన్ని నైతిక విలువలను పాతిపెట్టి పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు ఏ విధంగా ఎన్నికలలో, పాలనలో క్రిమినల్ చర్యలకు తెగబడ్డారో ఇంతకు ముందు అనేక కమిషన్లూ, కమిటీలూ వెల్లడించాయి. కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రులు ఎలాంటి దురాగతాలకు పాల్పడ్డారో కూడా ఆయా సంఘాలు నిర్ధారించాయి. ఈ కమిటీలు, కమిషన్లతో పాటు లా కమిషన్ కూడా ప్రత్యేక నివేదికను వెలువరించినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ‘మనోజ్ నరూలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీం కోర్టు తీవ్ర స్వరంతో ఆ తీర్పును వెలువరించింది. ధర్మాసనం తరఫున జస్టిస్ దీపక్ మిశ్రా మెజారిటీ తీర్పును ఇలా ప్రకటించారు: ‘పాలకులు పాలనా పగ్గాలను చేపట్టే ముందు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని ప్రమాణం చేస్తారు. అది ప్రజలు వారిపై ఉంచిన విశ్వాసం (ట్రస్ట్). అందువల్ల ప్రధానమంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ తీవ్రమైన క్రిమినల్ కేసులు, ఆరోపణలు ఉన్నవారిని మంత్రివర్గంలోకి తీసుకొనరాదు. రాజ్యాంగం చెప్పేది కూడా అదే.’ ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనకర్తలు విధి నిర్వహణలో పాటించవలసిన నైతిక విలువలను, సంప్రదాయాలను ఉటంకిస్తూ ఎన్నికల కమిషన్, లా కమిషన్ కూడా సమగ్రమైన నివేదికలు ఇచ్చాయి. వీటితో పాటు అధికారిక స్థానాలలో జరిగే అవినీతి గురించి సంతానం కమిటీ, దినేశ్ గోస్వామి కమిటీలతో పాటు, కేంద్ర నేర పరిశోధన, హోంశాఖలకు శాఖకు చెందిన వోహ్రా కమిటీ కూడా పాలనా రంగంలో పెరిగిపోతున్న అవినీతి చర్యలనూ, నేరపూరిత రాజకీయాల తీరును ఎండగడుతూ నివేదించాయి. ఇంతటి సవివరమైన నివేదికలు ప్రభుత్వానికి సమర్పించినా ఫలితం మాత్రం లేదు. సివిల్, క్రిమినల్ చట్టాలకు కొన్ని సవరణలు వచ్చినా మార్పు లేకపోగా, నానాటికీ తీసికట్టు నాగంభొట్లు తీరుగా పరిస్థితులు మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితులకు ప్రధాన కారణంగా వోహ్రా కమిటీ (1993) ఒక అంశాన్ని పేర్కొన్నది. ‘భారతీయ సమాజంలో నేరగాళ్ల సిండికేట్లు పెరిగిపోతున్నాయి. అనేక రంగాలతో నేరగాళ్లు తమ సంబంధాలను విస్తరించుకున్నారు. ఈ క్రిమినల్ ముఠాలకు, రాజకీయులకు, పోలీసులకు, అధికార గణాలకు మధ్య దేశ వ్యాప్తంగా సంబంధాలున్నాయని స్పష్టమైంది’ అని కమిటీ వెల్లడించింది. చట్టాలలోని లొసుగులను ఆధారం చేసుకుని నేరం రుజువయ్యేదాకా నిందితుడు నేరగాడు కాదన్న పద్ధతితో కేసులను ఏళ్లూ పూళ్లూ కొనసాగిస్తున్నారు. ఈలోగా ధనబలంతో సాక్షులను తారుమారు చేస్తున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులకూ లెజిస్టేటర్లకూ ఎలాంటి క్రిమినల్ జాతకాలు ఉన్నాయో లోక్‌సత్తా జరిపిన సర్వేక్షణలో రుజువైంది. ఇంతకూ ఆదర్శపాలన అందించవలసిన పాలక పక్షాలు ఇలా అవినీతికీ, మోసాలకూ ఎందుకు పాల్పడుతున్నాయి? ఆ ఉత్తమ లక్ష్యానికి ఎందుకు దూరమైపోతున్నాయి? ఇందుకు మూల కారణం - దేశంలో తమ ఊడలను బలంగా దించుకోవడానికీ, ఇందుకు అవసరమైతే షరతులతో కూడిన విదేశీ, స్వదేశీ గుత్తపెట్టుబడులతో బాహాటంగా షరీకై ప్రజల మీద మరింత పీడనను కొనసాగించడానికీ సంపన్న వర్గాలు ఎంచుకున్న పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యవస్థే. ఇందులో ప్రజాబాహుళ్యానికి ఎలాంటి పాత్రా లేదు. కానీ ఇంత జరుగుతున్నా, ఇన్ని కిరాతకాలకు పాలక పక్షాలు పాల్పడుతున్నా ప్రజాబాహుళ్యం కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవడానికి కారణం- చైతన్యాన్ని పెంచగల నాయకత్వం కొరవడడమే. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఏబీకే ప్రసాద్ -
సీజేఐగా జస్టిస్ దత్తు ప్రమాణం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 42వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హంద్యాల లక్ష్మీనారాయణ స్వామి దత్తు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో దత్తుతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్.ఎం.లోధా ఈ నెల 27 పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ దత్తు బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో 2015 డిసెంబర్ 2 వరకు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి అన్సారీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు, బీజేపీ సీనియర్ నేత అద్వానీ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఓ సామాన్యుడిగానే బెంచ్(ధర్మాసనం)పై కూర్చుంటానని జస్టిస్ దత్తు చెప్పారు. సుప్రీం కోర్టులో కేసుల విచారణ సందర్భంగా భిన్న వర్గాల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని భారత ప్రధాన న్యాయమూర్తిగా తన పనితీరు ఎలా ఉండబోతోందో పరోక్షంగా స్పష్టం చేశారు. సీజేఐగా ప్రమాణం తర్వాత ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జడ్జిలు రోజుకు 16 గంటలు పనిచేయాలన్నారు. జస్టిస్ దత్తు 1950 లో కర్ణాటకలోని హందిహళ్లో జన్మించారు. 1975లో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, పన్నులు, రాజ్యాంగ కేసులను వాదించారు. 1983 నుంచి కర్ణాటక హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 1995లో కర్ణాటక హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత ఛత్తీస్‌గఢ్, కేరళ హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2007లో సుప్రీం జడ్జిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన కేసులను విచారించిన సుప్రీం బెంచ్‌కు ఆయనే నేతృత్వం వహించారు. -
జయకు అచ్చిరాని సెప్టెంబర్!
చెన్నై: జయలలితకు రాజకీయంగా సెప్టెంబర్ మాసం కలిసిరానట్లు కనిపిస్తోంది. 2001 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆమెను సీఎం పీఠం నుంచి దింపగా తాజాగా బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ప్రకటించిన తీర్పు సైతం జయ సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. తాన్సీ భూఒప్పందం కేసులో ట్రయల్ కోర్టు దోషిగా తేల్చినా జయ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆమె సీఎం పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి పగ్గాలను మంత్రివర్గ సహజరుడైన ఓ. పన్నీర్‌సెల్వంకు అప్పగించారు. ట్రయల్ కోర్టు తీర్పును మద్రాస్ హైకోర్టులో ఆమె సవాల్ చేయగా అనుకూలంగా తీర్పు రావడంతో 2002లో అందిపట్టి స్థానం నుంచి ఉప ఎన్నికలో గెలిచి తిరిగి సీఎం పీఠాన్ని అధిష్టించారు. -
18 ఏళ్లు సాగిన విచారణ
సుబ్రమణ్యస్వామి పిటిషన్‌తో 1996లో విచారణ ప్రారంభం చెన్నై: జయలలితపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ దాదాపు 18 ఏళ్లు సాగింది. 1996లో సుబ్రమణ్య స్వామి పిటిషన్‌తో చెన్నైలో ప్రారంభమైన విచారణ 2014లో బెంగళూరులో ముగిసింది. ఇంతకాలం ఈ విచారణ సాగడానికి కారణాలను విశ్లేషిస్తే.. విచారణ ప్రారంభం నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో నిందితులు వేసిన లెక్కకు మించిన పిటిషన్లు, అభ్యర్థనలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సాక్షులు మాట మార్చడం, పునర్విచారణ కోరడం, విచారణను చెన్నై కోర్టు నుంచి బెంగళూరు కోర్టుకు మార్చడం మరికొన్ని కారణాలు. విచారణ చివరలో కోర్టు అడిగిన 1,339 ప్రశ్నలకు జయలలిత జవాబిచ్చారు. అయితే, అందులో చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ఆమె సమయమడిగి, వాయిదా కోరారు. 1996 నుంచి..2014 వరకు 1996: తమిళనాడు ముఖ్యమంత్రిగా 1991 నుంచి 1996 వరకు ఉన్న జయలలిత.. ఆ కాలంలో ఆదాయానికి మించి రూ. 66.65 కోట్లను అక్రమంగా సంపాదించారని అప్పుడు జనతాపార్టీలో, నేడు బీజేపీలో ఉన్న సుబ్రమణ్య స్వామి కేసు వేశారు. సీఎం కాకముందు 1991లో ఆమె ఆస్తులు రూ. 2.01 కోట్లని, ముఖ్యమంత్రిగా నెలకు ఒక్క రూపాయి మాత్రమే ఆమె వేతనంగా తీసుకున్నారని, 1996లో ఆమె ఆస్తుల విలువ రూ. 66.65 కోట్లకు చేరిందని అందులో ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరపాల్సిందిగా రాష్ట్ర నిఘా, అవినీతి నిరోధక విభాగాన్ని కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ సహా పలు చోట్ల సోదాలు జరిపి కిలోల కొద్దీ నగలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీన పర్చుకున్నారు. డిసెంబర్ 7న జయలలితను అరెస్ట్ చేశారు. 1996లో డీఎంకే అధికారంలోకి వచ్చాక ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. 1997: చెన్నైలో జయలలితతో పాటు ఆమెకు అత్యంత సన్నిహితురాలైన శశికళ, ఆమె బంధువు ఇళవరసి, జయ దత్త పుత్రుడు సుధాకరన్‌లపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణ ప్రారంభం. 2000: పదిమంది మినహా 260 మంది ప్రాసిక్యూషన్ సాక్షుల విచారణపూర్తి. 2001: అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఘనవిజయం. సీఎంగా జయలలిత ప్రమాణం. టాన్సి కేసులో దోషిగా తేలినందున సీఎంగా జయలలిత అనర్హురాలంటూ సుప్రీం తీర్పు. దాంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా. అనంతరం ఆ కేసులో జయను నిర్దోషిగా తేలడంతో మళ్లీ అధికార పీఠంపైకి జయలలిత.రాజీనామా చేసిన ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులు. మాటమార్చిన పలువురు ప్రాసిక్యూషన్ సాక్షులు(గతంలో వీరంతా జయకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చారు). 2003: జయలలిత అధికారంలో ఉండటం వల్ల విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, విచారణను కర్ణాటక కోర్టుకు మార్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన డీఎంకే నేత అన్బళగన్. కేసును బెంగళూరు కోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు. 2005: ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్పీపీ)గా బీవీ ఆచార్యను నియమించిన కర్ణాటక ప్రభుత్వం. 2011: కోర్టు విచారణకు హాజరైన జయలలిత. 2012: ఎస్‌పీపీగా కొనసాగలేనంటూ కర్నాటక ప్రభుత్వానికి ఆచార్య అభ్యర్థన. 2013: ఆచార్య రాజీనామా ఆమోదం. ఎస్‌పీపీగా భవానీ సింగ్ నియామకం. అనంతరం ఎలాంటి కారణాలు చూపకుండా, కర్ణాటక హైకోర్టును సంప్రదించకుండా భవానీసింగ్‌ను విధుల నుంచి తప్పిస్తూ కర్ణాటక ప్రభుత్వ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు. జయలలిత నుంచి 1997లో స్వాధీనం చేసుకున్న నగలు ఇతర విలువైన వస్తువులను చెన్నై ఆర్బీఐ శాఖలో భద్రపరచాలని ప్రత్యేక కోర్టు ఆదేశం. 2014: సెప్టెంబర్ 20న తీర్పు ఇస్తామని, ఆ రోజు నిందితులంతా హాజరు కావాలని ప్రత్యేక కోర్టు ఆదేశాలు. పోలీసులు భద్రతాకారణాలు చూపడంతో కోర్టును బెంగళూరు శివార్లలో ఉన్న ఒక జైలు ఆవరణలోకి మారుస్తూ.. తీర్పును సెప్టెంబర్ 27కి వాయిదా వేసిన కోర్టు. సెప్టెంబర్ 27: జయలలితను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు. జయకు కేసులు కొత్తకాదు! పురచ్చితలైవి జయలలితకు కేసులు కొత్త కాదు. డజనుకు పైగా కేసులను ఆమె ఎదుర్కొన్నారు. వాటిలో చాలా కేసుల నుంచి నిర్దోషిగా బయటపడ్డారు.తమిళనాడు చిన్న తరహా పరిశ్రమల సంస్థ(తాన్సీ) కేసుల్లో చెన్నై ప్రత్యేక కోర్టు 2000 సంవత్సరంలో ఆమెను దోషిగా నిర్ధారించి, ఒక కేసులో మూడేళ్లు, మరో కేసులో రెండేళ్లు శిక్ష విధించింది. అనంతరం మద్రాస్ హైకోర్టు ఆ కేసుల్లో జయలలితను నిర్దోషిగా తేల్చింది.రాష్ట్రంలో డీఎంకే అధికారంలో ఉన్న 1996-2001 మధ్య జయలలితపై నమోదైన 14 కేసుల్లో చాలా కేసుల నుంచి ఆమె నిర్దోషిగా బయటపడ్డారు. ప్రభుత్వ నిబంధనలను కాదని, పర్యావరణ ప్రాముఖ్యత కలిగిన కొడెకైనాల్లో ‘ప్లజంట్ స్టే’ హోటల్‌కు అనుమతించిన కేసులో ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా తేల్చి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆ తరువాత ఆ కేసును మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. 1996లో అధికారం కోల్పోయాక ‘కలర్ టీవీ’ కేసులో జయలలితను అరెస్ట్ చేశారు. అనంతరం ఆ కేసునూ కొట్టేశారు.బొగ్గు దిగుమతుల ఒప్పందం కేసు నుంచి 2001లో, రూ. 28.28 కోట్ల స్పిక్ పెట్టుబడుల ఉపసంహరణ కేసు నుంచి 2004లో ఆమె నిర్దోషిగా బయటపడ్డారు. సుప్రీంకోర్టు అనుమతితో లండన్ హోటల్స్ కేసును ప్రభుత్వమే ఉపసంహరించుకుంది. 3 లక్షల డాలర్ల బహుమతి కేసును 2011లో మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది.ఆదాయపన్ను రిటర్న్స్ కేసు విచారణలో ఉంది. -
అవన్నీ తప్పుడు కేటాయింపులే!
-
కోల్గేట్ పై సుప్రీంకోర్టు
-
కేటాయింపులన్నీ రద్దు
‘కోల్గేట్’పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం 1993 నుంచి కేటాయించిన 218 బ్లాకుల్లో 214 రద్దు న్యూఢిల్లీ: దేశంలో 1993 నుంచి చేసిన బొగ్గు బ్లాకుల కేటాయింపులన్నింటినీ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఇరవయ్యేళ్లలో కేటాయించిన 218 బొగ్గు బ్లాకుల్లో 214 బ్లాకులను రద్దు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన 4 బ్లాకులకు మినహాయింపు ఇచ్చింది. రద్దు చేసిన బ్లాకుల్లో పనిని నిలిపేసి.. ప్రభుత్వానికి అప్పగించేందుకు మైనింగ్ సంస్థలకు ఆరు నెలల గడువు ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా, మదన్ బి.లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం 163 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఆయా బొగ్గు గనుల కేటాయింపు కోసం కేంద్రం తిరిగి వేలం నిర్వహించేందుకు అవకాశం లభించనుంది. ‘కోల్’గేట్ దుమారం: యూపీఏ హయాంలో బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విష యం తెలిసిందే. ‘కోల్గేట్’ స్కామ్‌గా పేరు పొందిన ఈ వ్యవహారంలో.. ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లుగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ అప్పటి ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌కు కూడా దీనితో సంబంధం ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి. యూపీఏ ప్రభుత్వం గద్దెదిగాలంటూ విపక్షాలు కొద్దిరోజుల పాటు పార్లమెంటును స్తంభింపజేశాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. దీంతో స్పందించిన సుప్రీంకోర్టు విస్తృత దర్యాప్తునకు ఆదేశించి, విచారణ చేపట్టింది. రద్దు చేయవద్దన్న యూపీఏ: బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేయవద్దని అప్పట్లో జరిగిన విచారణ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆ బ్లాకులను పొందిన సంస్థలు వాటిల్లో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు పెట్టాయని.. దీంతోపాటు ఈ కేటాయింపులను రద్దు చేస్తే పెద్ద సంఖ్యలో పరిశ్రమలకు ఇబ్బంది కలుగుతుందని వాదించింది. కానీ ఈ వాదనలను కోర్టు అంగీకరించలేదు. అసలు ఆ బొగ్గు బ్లాకుల కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమేనని స్పష్టం చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం... బొగ్గు కేటాయింపులను రద్దు చేయడం వల్ల నెలకొంటాయని భావిస్తున్న పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపింది. దీనిని కూడా పరిగణనలోకి తీసుకున్న కోర్టు 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేసింది. అన్నీ చట్ట విరుద్ధమే..: ‘కోల్’గేట్ కుంభకోణం విచారణలో భాగంగా 1993 నుంచి 2010 వరకూ కేంద్రంలో ఉన్న వివిధ ప్రభుత్వాలు చేసిన బొగ్గు గనుల కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమేనని సుప్రీం కోర్టు నిర్ధారించింది. ఇష్టం వచ్చినట్లుగా, తమకు నచ్చినవారికి బొగ్గు కేటాయింపులు చేశారని.. ఈ విషయంలో ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిందని వ్యాఖ్యానించింది. పారదర్శకత ఏ మాత్రం లేని విధానం వల్ల జాతీయ సంపద అయిన బొగ్గు అక్రమ కేటాయింపులకు కారణమైందని ధర్మాసనం పేర్కొంది. అసలు స్క్రీనింగ్ కమిటీ ఎప్పుడూ నిలకడగా లేదని.. సరైన విధానమేదీ లేకుండానే, నిబంధనలను పాటించకుండానే ప్రతిపాదనలు చేసిందంటూ ధర్మాసనం తప్పుబట్టింది. నాలుగింటికే మినహాయింపు..: 1993 నుంచి చేసిన 218 బొగ్గు బ్లాకుల కేటాయింపులో.. ఎన్టీపీసీ, సెయిల్లకు కేటాయించిన ఒక్కో బ్లాకు, అల్ట్రామెగా పవర్ ప్రాజెక్ట్స్ సంస్థకు కేటాయించిన 2 బ్లాకులు మాత్రమే సుప్రీంకోర్టు మినహాయింపును ఇచ్చింది. మిగతా 214 బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేసింది. ఈ బ్లాకులు పొందిన సంస్థలన్నీ కూడా.. ఆయా చోట్ల తమ వ్యాపారాన్ని ముగించి, బ్లాకులను ప్రభుత్వానికి అప్పగించడానికి ఆరు నెలల గడువు ఇచ్చింది. ప్రభుత్వానికి పరిహారం చెల్లించండి: కొన్ని సంస్థలు బొగ్గు కేటాయింపులు పొంది ఎలాంటి పనులూ ప్రారంభించకపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ధర్మాసనం పేర్కొంది. దీని పై కాగ్ సూచించిన మేరకు ఆయా సంస్థలు బొగ్గు వెలికితీత అంచనాపై ఒక్కో టన్నుకు రూ. 295 చొప్పు న ప్రభుత్వానికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం! న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో... భవిష్యత్తులో బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించిన అంశంపై సంబంధిత భాగస్వాములు (బొగ్గు బ్లాకుల కేటాయింపు పొందిన సంస్థల) అందరి ఆందోళనను దృష్టిలో పెట్టుకుంటామని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ విషయంలో కోర్టు ఆరునెలల పాటు గడువు ఇచ్చిందని.. ఈ లోగా అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల హర్షణీయమని.. ఇది సరికొత్త విధానానికి తోడ్పడుతుందని కేంద్ర న్యాయ, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులో యూపీఏ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ బీజేపీ చేసిన ఆరోపణల్లోని డొల్లతనం సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ‘కోల్’ వివాదమిదీ..! ► 1992 జూలై: ప్రైవేటు సంస్థలకు తొలుత వచ్చి న వారికి తొలుత ప్రాతిపదికన బొగ్గు గనుల కేటాయింపు ప్రతిపాదనల కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటుకు బొగ్గు శాఖ ఆదేశాలు. ► 1992 జూలై 14: కోల్ ఇండియా, సింగరేణి సంస్థల ప్రణాళికల్లో లేని 143 కొత్త బొగ్గు బ్లాకుల గుర్తింపు, జాబితా తయారీ. ► 1993 -2010: దాదాపు 1993 నుంచి 2005 మధ్య 70 బొగ్గు బ్లాకులు, 2006లో 53, 2007లో 52, 2008లో 24, 2009లో 16, 2010లో 1.. మొత్తంగా 216 బొగ్గు బ్లాకులను వివిధ సంస్థలకు కేటాయించారు. వీటిలో 24 బ్లాకుల కేటాయింపును మధ్యలో రద్దు చేశారు. ► 2012 మార్చి: బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయని కాగ్ వెల్లడించింది. 2004-09 మధ్య దాదాపు రూ.10.7 లక్షల కోట్ల లబ్ధి ఆయా సంస్థలకు చేకూరిందని పేర్కొంది. దీంతో వివాదం మొదలైంది. ► 2012 మే 31: ఇద్దరు బీజేపీ ఎంపీల ఫిర్యాదు ఆధారంగా ఈ అంశంపై సీబీఐ విచారణకు కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) ఆదేశించింది. ► 2012 జూన్: ఈ అంశంపై సమీక్షకు బొగ్గు మంత్రిత్వశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సూచనల మేరకు 80 బొగ్గు బ్లాకులను వెనక్కి తీసుకుని, 42 సంస్థలకు చెందిన బ్యాంకు గ్యారెంటీలను స్వాధీనం చేసుకుంది. ► 2012 సెప్టెంబర్ 6: బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేయాలంటూ సుప్రీంలో పిల్ . సీబీఐ దర్యాప్తును పర్యవేక్షణలోకి తీసుకున్న కోర్టు. ► 2013 మార్చి: దర్యాప్తు వివరాలను ప్రభుత్వానికి అందజేయొద్దని సీబీఐకి ఆదేశం. ► 2013 ఏప్రిల్ 23: ఈ అంశంపై ఏర్పాటు చేసిన స్థాయీ సంఘం నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రం. 1993-2008 మధ్య కేటాయింపులన్నీ అసంబద్ధమేనని అందులో వెల్లడి. ► 2013 ఏప్రిల్ 26: దర్యాప్తు అంశాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీకుమార్‌కు అందజేసినట్లు కోర్టుకు సీబీఐ చీఫ్ రంజిత్‌సిన్హా వెల్లడి ► 2013 మే 10: అశ్వనీకుమార్ రాజీనామా ► 2013 జూన్ 11: ‘బొగ్గు’ కేసులో పారిశ్రామిక వేత్తలు నవీన్ జిందాల్, దాసరి నారాయణరావు పేర్లను పేర్కొంటూ సీబీఐ ఎఫ్ఐఆర్. ► 2014 జూలై: ‘బొగ్గు’ కేసులన్నింటి విచారణకు ప్రత్యేక సీబీఐ కోర్టు ఏర్పాటు. ► 2014 ఆగస్ట్: బిర్లా, పరేఖ్‌లపై కేసును మూసివేయాలని సీబీఐ నిర్ణయం ► 2014 ఆగస్ట్ 25: 1993 నుంచి 2010 మధ్య కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమని తేల్చిన సుప్రీంకోర్టు. ► 2014 సెప్టెంబర్ 24: 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీం తీర్పు. -
సీబీఐ ప్రక్షాళనకు మార్గం!
సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా నివాసంలోని లాగ్ బుక్‌ను బయటపెట్టిన వ్యక్తుల వివరాలివ్వాలంటూ కొన్నిరోజులక్రితం ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు పునరాలోచన చేయడం అవినీతి, అక్రమాలను వెల్లడించేందుకు ముందుకొచ్చేవారికి ఊరటనిస్తుంది. సిన్హాను కలిసిన ప్రముఖుల్లో 2జీ స్కాం మొదలుకొని అనేక కేసుల్లో కీలక నిందితులైనవారున్నారు. వీరి వివరాలన్నీ సిన్హా ఇంటివద్ద నిర్వహిస్తున్న లాగ్‌బుక్‌లో నమోదై ఉన్నాయి. ఒకపక్క సీబీఐకి ఇవ్వాల్సిన స్వయం ప్రతిపత్తి, దానికి ఉండాల్సిన జవాబుదారీతనంపై చర్చ నడుస్తుంటే రంజిత్ సిన్హా ఇలా నిందితులుగా ఉన్నవారితో సమావేశంకావడం దిగ్భ్రాంతిపరిచింది. ఈ విషయంలో నిజానిజాలు తేలేవరకూ కీలక కేసుల దర్యాప్తు బాధ్యతలనుంచి సిన్హాను తప్పించాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు... ఈ సమాచారం ఎవరిచ్చారో తమకు సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సాధారణంగా అవినీతి, అక్రమాలు జరిగాయని తమ దృష్టికొచ్చినప్పుడు దర్యాప్తునకు ఆదేశించడం తప్ప అందుకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం పిటిషనర్లకు ఎలా వచ్చిందన్న లోతుల్లోకి న్యాయస్థానాలు వెళ్లవు. వారు లేవనెత్తిన అంశాల్లో నిజానిజాలేమిటో పరిశీలిస్తాయంతే. అయితే, రంజిత్‌సిన్హా కలిసినవారి విషయంలో ఇలా ఆదేశించడానికి ఒక కారణం ఉంది. సిన్హా ఇంటివద్ద సందర్శకుల వివరాలను నమోదుచేసే లాగ్‌బుక్ ఉన్నమాట వాస్తవమే అయినా... న్యాయస్థానానికి సమర్పించిన జిరాక్స్ కాపీలోని కొన్ని పేజీలు అందులోనివి కాదని ఆయన తరఫు న్యాయవాది ఆరోపిస్తు న్నారు. సిన్హాను అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు నిందితుల పేర్లను కావాలని చేర్చి ఈ పేజీలను సృష్టించారని ఆయన వాదన. ఈ క్రమంలో అసలు ఈ జాబితా మీకు ఎవరి ద్వారా వచ్చిందో చెప్పాలని ప్రశాంత్ భూషణ్‌నూ, ఆయనతో పాటు పిటిషన్ దాఖలు చేసిన మరో స్వచ్ఛంద సంస్థనూ న్యాయమూర్తులు ఆదేశించారు. ఏదైనా సంస్థలోనో, ప్రభుత్వంలోనో అక్రమాలు జరిగాయని సమాచారం ఇచ్చేవారు నూటికి నూరుపాళ్లూ నిజాయితీపరులే కానక్కరలేదు. అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులు తమకు వ్యతిరేకులు కావడంవల్ల కావొచ్చు, ఆ అక్రమాల్లో తమకు దక్కాల్సిన వాటా దక్కడంలేదని కావొచ్చు, తమకు రావల్సింది మరొకరు తన్నుకు పోయారన్న దుగ్ధ కావొచ్చు...ఏదో ఒక కారణంతో అందుకు సంబంధించిన సమాచారాన్ని బయటివారికి వెల్లడించేవారుంటారు. కామన్వెల్త్ స్కాం అయినా, మరొకటైనా లోకానికి వెల్లడైంది ఈ విధంగానే. ఇలాంటి కుంభకోణాల్లో తీగలాగితే డొంకంతా కదులుతుంది. దర్యాప్తు ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఇప్పుడు రంజిత్‌సిన్హా నివాసగృహానికి సంబంధించిన లాగ్‌బుక్‌లోని పేజీలుగా చెబుతున్నవి కూడా ఆ విధంగా బయటపడినవే. గుజరాత్లో జరిగిన ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో తమను ఇబ్బందులు పెడుతున్న సిన్హాను ఇరుకున పెట్టేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో వలపన్ని ఈ లాగ్‌బుక్ వ్యవహారాన్ని బయటకు లాగిందని ఆరోపిస్తున్నవారూ ఉన్నారు. పనిలోపనిగా కేసును ‘బలంగా’ మార్చేందుకు కొన్ని బోగస్ ఎంట్రీలను కూడా చేర్చిందని వారంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏమైనప్పటికీ సిన్హాను వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు కలిసిన మాట వాస్తవం. ఆ సంగతి ఆయనే అంగీకరించారు. అందువల్ల ఆయా కేసుల్లో సీబీఐ వైఖరేమైనా మారిందా అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ సమస్య వైఖరి మారిందా, లేదా అని కాదు... అసలు తాము దర్యాప్తు చేస్తున్న కేసుల్లోని నిందితులను కలవడం నైతికంగా సమర్ధనీయమేనా అన్నది కీలకం. ఆ సంగతిని రంజిత్‌సిన్హా ఆలోచించాలి. తాము నిష్పక్షపాతంగా ఉన్నామని చెప్పడమే కాదు... వారలా ఉంటున్నారని అందరికీ అన్పించాలి. సీబీఐ ఏ కేసు విషయంలో ఏం చేస్తున్నదో, ఎలా మాట మారుస్తున్నదో తెలుసుకోవడం సామా న్యులకు సాధ్యం కాదు. వారికి తెలిసినదల్లా నిందితులుగా ఉన్నవారితో కేసు దర్యాప్తు చేస్తున్నవారు చెట్టపట్టాలేసుకుని తిరగకూడదన్నదే. ఈ చిన్న విషయం సిన్హాకు అర్ధంకావడంలేదు. ఇప్పుడు లాగ్‌బుక్ వ్యవహారంలో తాను లోగడ ఇచ్చిన ఆదేశాల విషయంలో సుప్రీంకోర్టు పునరాలోచన చేస్తున్నదని ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చూస్తే అర్ధమవుతుంది. కీలక సమాచారం అందించేవారికి రక్షణ లేకపోతే ఏ కుంభకోణమూ వెల్లడికాదు. పాలనలో పారదర్శకత కోసం దాదాపు పదేళ్లకిందట మనకు సమాచార హక్కు చట్టం వచ్చింది. ప్రభుత్వాల నిర్ణయ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తున్నది. అయితే, దీనికి అనుబంధంగా అవినీతి, అక్రమాలపై పోరాడేవారికి రక్షణ కల్పించే చట్టాన్ని కూడా తీసుకొస్తే సమాచార హక్కు చట్టం మరింత సార్థకమ య్యేది. అయితే, ఆ చట్టం తీసుకురావడంలో మన పాలకులు విఫలమ య్యారు. ఇప్పుడు సిన్హా ప్రశాంత్‌భూషణ్ వెల్లడించిన జాబితాలోని పేర్లు అన్నీ బోగస్ అనడంలేదు. అందులో కొన్ని మాత్రమే తప్పుల తడక అంటున్నారు. కనుక సిన్హాను కలిసిన నిందితులెవరో, అలా కలవడంలోని హేతుబద్ధతేమిటో తేల్చడమే సరైంది. ఇప్పుడు కేసు ఆ దిశగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. రంజిత్‌సిన్హా స్వయంప్రతిపత్తి కోసం పాకులాడుతున్నారు తప్ప జవాబుదారితనానికి సిద్ధపడటంలేదని ఆయన మాటల్నిబట్టి చూస్తే అర్ధమవుతున్నది. ఈ స్థితిలో ప్రస్తుత కేసు విచారణ సీబీఐ ప్రక్షాళనకు దోహదపడితే దేశానికి ఎంతో మేలు కలుగు తుంది. ఆ సంస్థకు సారథ్యంవహిస్తున్నవారితోసహా ఎవరూ దాన్ని దుర్వినియోగం చేయడానికి ఆస్కారం ఉండదు. -
తుది నిర్ణయూలు తీసుకోవద్దు
కోల్గేట్ కేసులపై సీబీఐకి సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఉత్పన్నమయ్యే ఏ కేసు విషయంలోనూ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్న కొందరిని రక్షించేందుకు ప్రయత్నించారంటూ సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. పన్ను చట్టాల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మాంసం ఎగుమతిదారు మెురుున్ ఖురేషీకి సంబంధించిన ఐటీ మదింపు నివేదికను అందజేయూల్సిందిగా చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. ఖురేషీ పలుమార్లు సీబీఐ ఉన్నతాధికారిని ఆయన అధికార నివాసంలో కలుసుకున్నట్టుగా ఆరోపణలున్నారుు. ‘ఎలాంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దు. తదుపరి విచారణలో బెంచ్ ఈ అంశాన్ని చేపట్టేవరకు ఆగండి. ఏ కేసు విషయంలోనూ తుది నిర్ణయం తీసుకోకండి..’ అని ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ డెరైక్టర్‌పై వచ్చిన ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయూల్సిందిగా అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 17వ తేదీకి వారుుదా వేసింది. -
సీవీసీ ఎంపికలో పారదర్శకత ఏది?
-
మాజీ మంత్రి పీఆర్ కేసు తీర్పుపై ఉత్కంఠ
జమ్మలమడుగు: మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి జంట హత్యకేసులకు సంబంధించిన తీర్పుపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత నెల 21వతేదీన సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణలో తీర్పు వెలువడుతుందని భావించారు. కానీ సెప్టెంబర్18కి వాయిదా వేశారు. గురువారం సుప్రీంకోర్టులో విచారణతోపాటు తీర్పు వెలువడుతుందని అందరూ భావించారు. అయితే కోర్టు ఈ కేసును తిరిగి నవంబర్ 12,13వతేదీలకు వాయిదా వేసింది.పట్టణంలో భారీగాపోలీసు బలగాల మోహరింపు..మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో పట్టణంలో భారీగా పోలీసు బలగాలతోపాటు సబ్‌డివిజన్‌లోని ఎస్ఐలు పట్టణంలో మోహరించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు సంజామలమోటు, పలగాడివీధి, పాతబస్టాండ్, మోరగుడి మూడు రోడ్లు తదితర ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. పట్టణంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఏఎస్పీ వెంకట అప్పలనాయుడు పట్టణంలో తిరుగుతూ పహారా కాశారు. ముందస్తుగా బాష్ఫవాయువు ప్రయోగించే వజ్ర వాహనాన్ని తీసుకొచ్చారు. వంద మందికి పైగా స్పెషల్ పోలీసులు, చుట్టూ పక్కల పోలీసు స్టేషన్లనుంచి సివిల్ పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేశారు. 1990 లో జడ్చర్లలోని షాద్‌నగర్‌లో దేవగుడి శంకర్‌రెడ్డి,లక్కిరెడ్డి గోపాల్‌రెడ్డిలను హత్య చేశారు. ఈహత్య కేసులో11మంది నిందితులుగా ఉన్నారు. అందులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నిందితుడుగా ఉండటంతో 2004లో నాంపల్లి కోర్టు జడ్జి దోషిగా పేర్కొంటూ తీర్పునిచ్చారు. దీంతో మాజీ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగించింది. జడ్జిలు భాను,మినాకుమారిలతో కూడిన ధర్మాసనం తీర్పును చెరోరకంగా ఇచ్చారు. దీంతో హైకోర్టు జడ్జి బిలాల్ న క్వీ రామసుబ్బారెడ్డి హత్యకేసులో నిర్దోషి అంటూ తీర్పు నిచ్చారు. దీనిపై స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి 2008లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2009 లో ప్రత్యేక ధర్మాసనంలో పిటిషన్ అడ్మిట్ అయింది. అప్పటి నుంచి ఈ కేసు నడుస్తోంది. -
సీవీసీ ఎంపికలో పారదర్శకత ఏది?
కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ), విజిలెన్స్ కమిషనర్ల ఎంపిక ప్రక్రియులో పారదర్శకత కొరవడిందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని వుందలించింది. పారదర్శకత లేకపోవడం వల్ల ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతి పెరిగిపోతుందని కోర్టు చురక వేసింది. ఈ పోస్టులకు కేవలం బ్యూరోక్రాట్లనే ఎందుకు ఎంపిక చేస్తున్నారని నిలదీసింది. సావూన్యులకు ఎందుకు ఈ పోస్టులను ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. సీవీసీ పోస్టుకు సంబంధించి ప్రభుత్వం ప్రవుుఖంగా ప్రకటనలు ఇవ్వకుండా నియూవుకాలు చేపడుతోందని ఆరోపిస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్‌ను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయువుూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. దేశంలో ప్రతిభావంతులకు కొదవ లేదని, ప్రజలు పారదర్శకతను కోరుకుంటున్నారని ధర్మాసనం అభిప్రాయుపడింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వుుకుల్ రోహత్గి వాదిస్తూ, నిబంధనల ప్రకారం సావూన్యులనుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించలేదని, సీవీసీ, విజిలెన్స్ కమిషనర్ల ఎంపిక ప్రక్రియును పూర్తి చేయుడానికి ఒక నెల సవుయుం పడుతుందని తెలిపారు. అక్టోబర్ 9 లోగా స్పందన తెలపాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. -
భ్రూణ హత్యలకు అడ్డేది...?
ఖమ్మం వైరారోడ్ : భ్రూణ హత్యలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాల అమలులో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టింది. లింగ నిర్ధారణనిషేధ చట్టం అమలు విషయంలో తీసుకున్న చర్యలు, వాటివల్ల వచ్చిన ఫలితాలు ఏమిటో నాలుగు వారాల్లో చెప్పాలని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ దశలో జిల్లాలో ఈ చట్టం ఏమేరకు అమలవుతోంది, ఇందుకోసం అధికారులు తీసుకుంటున్న చర్యలేమిటో పరిశీలిద్దాం... పురుషుల కంటే మహిళల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గర్భంలోనే శిశువును గుర్తించి అమ్మాయి అయితే అంతం చేస్తున్నారు. దీనిపై అన్ని వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు ఉద్యమాలు చేపట్టినా.. భ్రూణహత్యల నివారణకు ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ చట్టాలు అక్రమార్కులకు చుట్టాలుగా మారాయి. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం నెలకు లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని, అన్ని స్థాయిల అధికారులకు మామూళ్లు ముడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికారులు డయాగ్నస్టిక్ సెంటర్లను తనిఖీ చేయడం లేదని, ఇందుకోసం నిర్వహించే డెకాయి ఆపరేషన్‌కు వారు ముందుకు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో జిల్లాతోపాటు వరంగల్, నల్గొండ, కృష్ణా జిల్లాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, ఆడపిల్ల అని తేలితే ఇక్కడే ఆబార్షన్ చేయించుకుంటున్నారని సమాచారం. డెకాయి ఆపరేషన్లు నిల్... లింగ నిర్ధారణ నిషేధ చట్టం ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షణలో తరచూ డెకాయి ఆపరేషన్లు నిర్వహించాలి. జిల్లాలో సంబంధిత అధికారులు ఈ ఆపరేషన్‌ను నిర్వహించకపోవడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. ఫలితంగా పలువురు రహస్యంగా లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. జిల్లా వైద్య శాఖ అధికారి ఆధ్వర్యంలో రహస్యంగా డెకాయి ఆపరేషన్ నిర్వహిస్తారు. దానికి కొందరు సిబ్బందిని ఒక టీంగా ఏర్పాటు చేసి స్కానింగ్ సెంటర్ల వద్ద నిఘా పెట్టిస్తారు. స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చినట్లు నటించి, ముందుగానే తాము ఏర్పాటు చేసిన దంపతులను స్కానింగ్ సెంటర్‌కు పంపిస్తారు. పరీక్షలు చేయించుకునే వారి వద్ద డబ్బు తీసుకుని లింగ నిర్ధారణకు అంగీకరిస్తే వారిని చాకచక్యంగా వల పన్ని పట్టుకోవడాన్ని డెకాయి ఆపరేషన్ అంటారు. అలా చేయటం వల్ల ఈ హత్యలను చాలా వరకు నివారించే అవకాశం ఉంటుంది. అయితే గతంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి జయకుమార్ కొంత మేర చట్టం అమలుపై దృష్టి సారించారు. డెకాయి ఆపరేషన్ నిర్వహించి లిగనిర్దారణ చేస్తున్న ఓ వైద్యుడిని పట్టుకోవడంతో పాటు ఆ ఆస్పత్రిని సీజ్ చేశారు. నిబంధనల అమలేది..? లింగ నిర్ధారణకు పాల్పడితే చేసిన వారికి, చేసుకున్నవారికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవుతుంది. మొద టి సారి చట్ట పరిధిలో చేసిన తప్పుకు 3 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఆ తర్వాత అదే నేరానికి పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేయాలి. లింగ నిర్ధారణ చేసిన సంబంధిత సెంటర్‌ను వెంటనే సీజ్ చేయాలి. అయితే గత రెండేళ్లుగా డెకాయి ఆపరేషన్ నిర్వహించకపోవటంతో స్కానింగ్ సెంటర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏం జరుగుతోంది... చట్టం ప్రకారం అన్ని జన్యు సంబంధిత పరీక్షలు నిర్వహించే సంస్థలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వద్ద నిర్దేశించిన రుసుముతో తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా జిల్లాలో ఇప్పటి వరకు 101 స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెపుతున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పరీక్షలు చేయించు కోవడానికి చట్టం అనుమతిస్తుంది. జన్యు సంబంధమైన, గర్భస్థ శిశువుకు సంబంధించిన వ్యాధులు కనుగొనడానికి అల్ట్రా సౌండ్, స్కానింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. రెండుసార్లు, అంత కంటె ఎక్కువ సార్లు గర్భ స్రావం జరిగినప్పుడు, గర్భిణి, ఆమె భర్త కుటుంబీకులలో ఎవరికైనా మానసిక బుద్ధి మాంద్యం, శారీరక వైక ల్యం, జన్యు సంబంధిత వ్యాధులు కలిగి నప్పుడు మాత్రమే గర్భస్థ పిండానికి పరీక్షలు చేయించు కోవాలని చ ట్టం చెబుతోంది. కానీ చట్టాన్ని రక్షించాల్సిన ఆరోగ్యశాఖ మొద్దునిద్ర పోతుండటంతో పలు స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారిని వివరణ కోరగా స్పందించకపోవడం గమనార్హం. -
‘భ్రూణ హత్యల నియంత్రణలో నిర్లక్ష్యం’
న్యూఢిల్లీ: ఆడ శిశువుల భ్రూణ హత్యలను అరికట్టడంలో కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు విరుచుకుపడింది. చట్టాలను ప్రభుత్వం అమలు చేయకుండా విధికి వదిలేస్తోందని దుయ్యబట్టింది. లింగ నిర్ధరణ నిషేధ చట్టం అమలుకుతీసుకున్న చర్యలు, వాటి వల్ల వచ్చిన ఫలితాలు ఏమిటో నాలుగు వారాల్లో చెప్పాలని కేంద్రంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలో ఆరేళ్లలోపు బాలబాలికల నిష్పత్తి తగ్గిపోతోందంటూ ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిల్‌పై ఈ ఆదేశాలు జారీ చేసింది. 2011 సెన్సస్ ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 914 మంది బాలికలే ఉన్నారు. వారిపై చర్యలెందుకు తీసుకోకూడదు? ఆయుధాలను అక్రమంగా అమ్ముతూ పట్టుబడి నామమాత్రపు జరిమానాతో బయటపడ్డ సైనికాధుకారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది -
మలి విడత కౌన్సెలింగ్‌పై.. ‘సుప్రీం’కు విద్యార్థులు అనుమతించాలని కోరుతూ
నేడు పిటిషన్ దాఖలు హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి మలివిడత కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఎంసెట్‌లో ర్యాంకులు సాధించి న విద్యార్థులు, కొన్ని కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ మేరకు వారు వేర్వేరుగా సోమవారం సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేయనున్నారు. మలివిడత కౌన్సెలింగ్‌కు అనుమతించి తమను ఆదుకోవాలని వారు కోర్టుకు విన్నవించాలని నిర్ణయించారు. కాగా, ఇదే విషయమై ఏపీ ఉన్నత విద్యామండలి ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీం ఆదే శాలతో తాము నష్టపోతామని చెబుతున్న వేలాది మంది విద్యార్థులు తిరిగి అదే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు. అదేవిధంగా మలి విడత కౌన్సెలింగ్ జరగని పక్షంలో తమ కళాశాలలను మూసివేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటూ కొన్ని కళాశాలల యాజమాన్యాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నాయి. -
ఢిల్లీ డ్రామా!`
సంపాదకీయం దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రభుత్వాన్ని ప్రతిష్టించడం కోసం వారంరోజులుగా సాగుతున్న డ్రామాకు సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో తాత్కాలిక విరామం ఏర్పడింది. అక్కడ ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభన పరిష్కారానికి ఏం చేయదల్చుకున్నదీ వచ్చే నెల 10లోగా చెప్పాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరుడు నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకున్నా ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత ప్రకటించిన బీజేపీ ఇప్పుడు అందుకోసం తహతహలాడుతున్నది. ఏ పార్టీకైనా అధికారమే పరమావధి గనుక ఈ విషయంలో బీజేపీని తప్పుబట్టవలసిన అవసరం లేదు. కానీ, అందుకు లెక్కలన్నీ సహకరించాలని, ఎంచుకున్న తోవ కూడా సరి అయినదై ఉండాలని ఆ పార్టీ మరిచిపోయినట్టు కనబడుతున్నది. తమ ఎమ్మెల్యేలను భారీయెత్తున కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఇన్నాళ్లూ ఆరోపిస్తూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అందుకు సాక్ష్యంగా ఒక వీడియోను కూడా బయటపెట్టింది. అందులోని నిజానిజాల సంగతి ఇంకా తేలవలసే ఉన్నా సర్కారు ఏర్పాటు విషయంలో బీజేపీ ప్రదర్శిస్తున్న ధీమా, తొందర ఆ ఆరోపణలు నిజమేమోనన్న అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో బీజేపీకి 31, దాని మిత్రపక్షమైన అకాలీదళ్‌కు ఒకటి లభించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి 28, కాంగ్రెస్‌కు 8 వచ్చాయి. జేడీ(యూ), ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఇద్దరున్నారు. వీరిద్దరి మద్దతూ పొందగలిగినా బీజేపీకి అధికారం అసాధ్యమని ఈ లెక్కలనుబట్టి సులభంగానే తెలుస్తుంది. పైగా బీజేపీ ఎమ్మెల్యేల్లో ముగ్గురు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికయ్యారు. పర్యవసానంగా బీజేపీ బలం ఇప్పుడు 29కి చేరుకుంది. ఎన్నికైన ఆరునెలల్లోగా ఏదో ఒక సభ్యత్వాన్ని వదులుకోవాలన్న నిబంధన ఉన్నది గనుక ఆ ముగ్గురి ఓట్లూ వచ్చే నవంబరు వరకూ బీజేపీకి అక్కరకొచ్చే అవకాశం లేకపోలేదు. అలా చూసుకున్నా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను ‘కొనడం’ ఆ పార్టీకి తప్పనిసరి. ఆప్ ఆరోపణలూ, అందుకు ఆ పార్టీ చూపుతున్న సాక్ష్యాధారాలూ నిజం కాదని దబాయించినా ప్రభుత్వం ఏర్పాటు ఎలా సాధ్యమనుకుంటున్నదో, ఏ బలం చూసుకుని అందుకోసం ప్రయత్నిస్తున్నదో బీజేపీ చెప్పాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ప్రధానంగా రెండు సమస్యలు ముందుకొచ్చాయి. అందులో శాంతిభద్రతలు, మరీ ముఖ్యంగా మహిళల భద్రత మొదటిది కాగా... రెండోది మౌలిక సదుపాయాల లేమి. మహిళలపై పెరిగిపోయిన లైంగిక నేరాలు, తరచు జరుగుతున్న హత్యలు, దోపిడీలు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అలాగే, దేశం నలుమూలల నుంచీ ఉపాధి కోసమని ఢిల్లీకి వలస వస్తున్నవారితో అక్కడి జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఇంత మందికి అవసరమైన మంచినీళ్లు, విద్యుత్తు, పారిశుద్ధ్యం వంటి కనీస సదుపాయాలు కల్పించలేక ఢిల్లీ ప్రభుత్వం సతమతమవుతున్నది. తమను ఎన్నుకుంటే ఈ రెండు ప్రధాన సమస్యలతోపాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించగలమని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఆప్ కూడా హామీ ఇచ్చింది. మొదట్లో సర్కారు ఏర్పాటుకు అరవింద్ కేజ్రీవాల్ ససేమిరా అన్నా చివరకు కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకొచ్చారు. రెండునెలలైనా గడవకుండానే ఆయన రాజీనామా చేశారు. ఆ స్వల్ప వ్యవధిలో కేజ్రీవాల్ ప్రతి కుటుంబానికీ రోజూ 667 లీటర్ల ఉచిత మంచినీరు ఇవ్వడం దగ్గరనుంచి అవినీతిపై హెల్ప్‌లైన్ ప్రారంభించడం వరకూ కొన్ని హామీలు అమల్లో పెట్టారు. గత ఫిబ్రవరిలో ఆప్ ప్రభుత్వం రాజీనామా చేశాక ఇంతవరకూ అసెంబ్లీ సుప్తచేతనా వస్థలోనే ఉన్నది. ప్రజా ప్రభుత్వం లేని కారణంగా సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సామాన్యులు సతమతమవుతున్నారు. ఆ సమస్యలు తీరడం మాట అటుంచి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. నిజానికి ఇది పెద్ద సమస్యగా మారాల్సిన అవసరం లేదు. ఉన్నంతలో అధిక సంఖ్యాబలం ఉన్న బీజేపీ, ఆప్‌లు రెండూ సర్కారు ఏర్పాటు తమవల్ల కాదని మరోసారి చెబితే సరిపోతుంది. వాస్తవానికి బీజేపీ మొదట్లోనే ఈ మాట చెప్పగా, అనంతర కాలంలో ఆప్ సైతం ఇదే వైఖరి తీసుకుంది. అలాంటపుడు అసెంబ్లీని ఆర్నెల్లుగా సుప్తచేతనావస్థలో ఉంచాల్సిన అవసరమేమిటో అర్ధంకాదు. ఎలాంటి రాజకీయ ఉద్దేశాలూ లేనపుడు, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించదల్చుకున్నప్పుడు అసెంబ్లీ రద్దుకు సిఫార్సుచేయడం తప్ప ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నవాబ్ జంగ్కు మరో ప్రత్యామ్నాయం లేదు. కానీ, ఆయన ఆ పని చేయడానికి సిద్ధంగా లేరు సరిగదా ‘సుస్థిర ప్రభుత్వం’ ఏర్పాటుకు బీజేపీకి అవకాశం ఇవ్వడానికి అనుమతించాల్సిందిగా రాష్ట్రపతికి లేఖ రాశారు. అటు ఆయన లేఖ రాయడం, ఇటు తామే ప్రభుత్వం ఏర్పాటుచేయబోతున్నట్టు బీజేపీ హడావుడి చేయడం పర్యవసానంగానే ఎమ్మెల్యేల బేరసారాలపై ఆరోపణలు గుప్పుమన్నాయి. కేంద్రంలో తమ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉన్నది గనుక ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకో వడం, దాన్ని అవసరమనుకున్నంత కాలమూ నిలబెట్టుకోవడం సులభమని బీజేపీ అనుకొని ఉండొచ్చు. దేశాన్నేలుతూ దేశ రాజధాని నగరంలో తమ సర్కారు లేకపోవడం నామర్దాగా ఆ పార్టీ భావించి ఉండొచ్చు. కానీ, అందుకోసం అడ్డదారులు తొక్కడంవల్ల అంతకన్నా ఎక్కువ నష్టం కలుగుతుందని బీజేపీ గుర్తించాలి. మరీ ముఖ్యంగా మరికొన్ని నెలల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు బెడిసికొడతాయని గమనించాలి. -
సుదీర్ఘ రిమాండ్ ఖైదీలెవరూ లేరు
‘సుప్రీం తీర్పు’ నేపథ్యంలో లెక్క తేల్చిన జైళ్ల శాఖ హైదరాబాద్: సుదీర్ఘకాలంగా విచారణను ఎదుర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా విడుదల చేయాల్సిన రిమాండ్ ఖైదీలు (విచారణ ఖైదీలు) ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరు కూడా లేరని అధికారులు తేల్చారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టుకు నివేదించినట్లు జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ టి.కృష్ణరాజు మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఏపీలో ఉన్న 116 కారాగారాల్లో ప్రస్తుతం 8,234 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 5,667 మంది విచారణ ఖైదీలు. వీరు నేరం రుజువైతే పడే శిక్ష కాలంలో ఇప్పటికి పావు వంతు కాలం కూడా జైల్లో లేరని అధికారుల పరిశీలనలో స్పష్టమైంది. రాష్ట్రంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ క్రియాశీలకంగా వ్యవహరించడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. నిరుపేదలైన ఖైదీల న్యాయ సహాయానికి అయ్యే ఫీజును లీగల్ సర్వీసెస్ అథారిటీ చెల్లించి న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది. బెయిల్‌కు పూచీకత్తు మొత్తాన్ని కూడా చెల్లిస్తుంది. నిందితులు షూరిటీలను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఈ కారణంగానే రాష్ట్రంలో సుప్రీంకోర్టు సూచించిన తరహా రిమాండ్ ఖైదీలు లేరని అధికారులు తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టుకు విన్నవించినట్లు చెప్పారు. -
బూత్‌లవారీ కౌంటింగ్ రద్దుపై మీరేమంటారు?: సుప్రీం
కేంద్రానికి నోటీసులు నాలుగు వారాల్లో సమాధానం చెప్పండి న్యూఢిల్లీ: ఎన్నికల్లో బూత్‌లవారీగా ఓట్ల లెక్కింపును రద్దు చేయాలన్న ఎన్నికల కమిషన్ (ఈసీ)విజ్ఞప్తిపై కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ అంశంపై 4 వారాల్లోగా తమ నిర్ణయమేంటో తేల్చి చెప్పాలని కేంద్రాన్ని సోమవారం ఆదేశించింది. ప్రస్తుత నిబంధనలను సవరించకుండా ఈ చర్య చేపట్టవచ్చో లేదో చెప్పాలంటూ ఈసీకి సూచించింది. ఎన్నికల్లో గెలిచినవారు.. తమకు తక్కువ ఓట్లువచ్చిన ప్రాంతంపై కక్షసాధింపునకు దిగడానికి ఈ బూత్‌ల వారీ లెక్కింపు ఆస్కారమిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. కేంద్రం ఈ అంశంపై ఐదేళ్లుగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని, దీన్ని న్యాయ కమిషన్‌కు ఎందుకు రిఫర్ చేసిందని ప్రశ్నించింది. ‘ఈ విషయంలో ఎన్నికల సంఘం తన విధిని సక్రమంగా నిర్వర్తించగలదు. కానీ ఈ అంశంలో లా కమిషన్ ఏం చేస్తుందని.. వారి అభిప్రాయం అడిగారు. ఐదేళ్లుగా ఈ అంశాన్ని ఇలా నాన్చడంలో మీ ఉద్దేశం ఏమిటి’ అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పంజాబ్‌కు చెందిన అడ్వొకేట్ వేసిన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
కోలీకి ఉరిశిక్ష నిలిపివేత
నిఠారీ హత్యల కేసులో దోషికి వారం పాటు ఊరట న్యూఢిల్లీ: నిఠారీ వరుస హత్యల దోషి సురేందర్ కోలీ ఉరిశిక్ష అమలును సుప్రీంకోర్టు వారం పాటు నిలిపేసింది. ఈ మేరకు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఏఆర్ దవేతో కూడిన ధర్మాసనం సోమవారం తెల్లవారుజామున ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించిన పిటిషన్‌ను అర్ధరాత్రి పరిశీలించిన ధర్మాసనం ఆ వెంటనే .. స్టే విధించినట్లు కోర్టు అధికారులు తెలిపారు. మీరట్ జైలులో కట్టుదిట్టమైన భద్రత గల బ్యారక్‌లో ఉన్న 42 ఏళ్ల కోలీని సోమవారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. అయితే అందుకు కొద్ది గంటల ముందే కోర్టు ఆదేశాలు అందడంతో జైలు వర్గాలు శిక్ష అమలును నిలిపేశాయి. సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ నేతృత్వంలోని లాయర్ల బృందం కోలీ తరఫున తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శిక్ష అమలుపై స్టే కోరుతూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను జూలైలో కోర్టు కొట్టేయడం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోలీ లాయర్లు రివ్యూ పిటిషన్ వేశారు. ఖైదీల రివ్యూ పిటిషన్‌పై బహిరంగ విచారణ జరపాలని ఈ నెల 2న సుప్రీం ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. అప్పటివరకు ఉరి అమలును నిలిపేయాలన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. శిక్ష అమలుపై స్టే విధించింది. సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ఫ్యాక్స్ ద్వారా కోర్టు ఆదేశాలను మీరట్ జైలుకు పంపారు. దీన్ని అందుకున్నట్లు ఉదయం 4.30 గంటలకు జైలు వర్గాలు ధ్రువీకరించాయి. దీంతో శిక్ష అమలును అధికారులు నిలిపేసినట్లు పేర్కొన్నాయి. -
పునఃపంపకంతోనే రాష్ట్రానికి న్యాయం
కృష్ణా జలాలను పూర్తిగా సమీక్షించాలి పరీవాహకం ఆధారంగా దక్కాల్సిన వాటా దక్కలేదు సుప్రీంలో బలమైన వాదనలు వినిపించేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు కేసులో వాదనలకోసం సుప్రీం న్యాయవాది వైద్యనాథన్‌తో అధికారుల సమావేశం మిగులు జలాల పంపిణీలో అన్యాయాన్ని కోర్టు దృష్టికి తేవాలని నిర్ణయం హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించి పూర్తిగా సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు పునఃపంపకం చేసేలా సుప్రీం కోర్టును అభ్యర్థించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న పరివాహకం ఆధారంగా రాష్ట్రాని కి రావాల్సిన న్యాయమైన వాటా దక్కని దృష్ట్యా కొత్తగా కేటాయింపులు జరపాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాలని నిశ్చయించింది. కృష్ణా జలాల వివాదాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచాయతీగా చూడరాదని, కృష్ణా నది నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నప్పుడు, కేటాయింపుల్లో నూ నాలుగు రాష్ట్రాలు న్యాయమైన వాటాకు భాగస్వాములు అవుతాయనే విషయాన్ని సుప్రీం దృష్టికి తెచ్చేందుకు రాష్ట్రం సిద్ధవువుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కృష్ణా పరి వాహక ప్రాంతం రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నా, కేటాయింపులు మాత్రం ఆంధ్రాకు వెళ్లాయని.., మిగులు జలాల వాడకంలో గతంలో జరిగిన ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ విస్మరించిందనే విషయాలన్నింటిపై గట్టిగా వాదనలు చేసేలా కసరత్తు చేపట్టింది. కృష్ణా జల వివాదాలపై ఏర్పాై టెన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తుది గెజిట్‌లో ప్రచురించరాదని, ఈ కేసులో తమ వాదనలు పరిగనణలోకి తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీని పై ఆగస్టులోనే విచారించిన సుప్రీం, రాష్ట్ర అభ్యర్థనకు సమ్మతిస్తూనే, నాలుగు రాష్ట్రాల నుంచి కౌం టర్ దాఖలుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు పూర్వాపరాలపై పూర్తి అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వైద్యనాధన్ ఆదివారం రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర నదీ నిర్వహణ బోర్డు అధికారులు, రాష్ట్ర న్యాయవాదులతో సమావేశమయ్యారు. సుప్రీంలో వినిపించాల్సిన వాదనలపై చర్చించారు. కృష్ణా నది జలాల కేటాయింపులు రాష్ట్ర ప్రాజెక్టులకు ఏ రీతిన ఉన్నది సేకరించి నివేదికల రూపంలో సిద్ధపరిచారు. పరివాహకం మనది.. కేటాయింపులు వారికి.. ఈ సవూవేశం సందర్భంగా నీటి లభ్యతను అం చనా వేయడానికి తీసుకున్న 65శాతం డిపెండబులిటీ పద్ధతి, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేం దుకు అనుమతించడం వంటి కారణాలతో రా ష్ట్రం 130 టీఎంసీల వరకు నీటిని కోల్పోతోందని అధికారులు న్యాయనిపుణుల దృష్టికి తెచ్చారు. నీటి ప్రవాహాన్ని లెక్కించడానికి కేవలం 47ఏళ్ల సమయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సైతం రాష్ట్రానికి శరాఘాతంగా మారిందని వివరించారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5శాతం, ఆంధ్రా, రాయలసీమలు కలుపుకొని 31.5శాతం మాత్రమే ఉన్నా కేటాయింపులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ చేశారని అధికారులు న్యాయునిపుణులకు వివరించా రు. ఆంధ్రప్రదేశ్‌కు 512.04 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 298.96 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారని చెప్పారు. మిగులు జలాలను సైతం 150 టీఎంసీల మేర ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తే తెలంగాణకు కేవలం 77 టీఎంసీల మేర మాత్రమే కేటాయింపులు జరగాయని వివరిం చారు. బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్ల ముందు ఇదివరకు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించే వెసులుబాటు లేదని, ప్రస్తుతం కొత్త రాష్ట్రం ఏర్పడిన దృష్ట్యా తవు వాదనలు వినిపిం చేందుకు అవకాశం కల్పించేలా సుప్రీంని కోరాలని అధికారులు న్యాయునిపుణులకు తెలిపారు. అన్నింటా ఉల్లంఘనలే! ఉమ్మడి ఏపీలో నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు అవసరానికి మించి నీటి కేటాయింపులు జరిపారని వివరించారు. గత ఒప్పందాల మేరకు తెలంగాణలోని ఆర్డీఎస్కు, రాయలసీమలోని సుంకేశుల కేసీ కెనాల్‌కు సమాన కేటాయింపులు జరుపాల్సి ఉన్నా, ఆర్డీఎస్కు 12 టీఎంసీలు కేటాయించి, సుంకేశులకు 39 టీఎంసీలు కేటాయించి న విషయాన్ని గట్టిగా చెప్పాలన్నారు. తుంగ భద్ర కెనాల్‌నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు 19 టీఎం సీల నీరు రావాల్సి ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి ప్రయత్నం జరుగని విషయాన్ని అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. 4 రాష్ట్రాలకు కేటాయింపులు కోరాలి! కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వాదనలపై ఏపీ సర్కారు వ్యూహం ఖరారు హైదరాబాద్: దిగువ రాష్ట్రమైన ఏపీకి మిగులు జలాల మీద పూర్తి హక్కు కోరాలని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గత తీర్పులో జరి గిన అన్యాయాన్ని సరిదిద్దుకొనే దిశగా వాదనలు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను రెండేళ్ల పాటు కొనసాగించిన విషయం విదితమే. విభజన వల్ల ఏపీ, తెలంగాణల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారానికే పరిమితం కా కుండా.. పూర్తిస్థాయి ట్రిబ్యునల్‌గా పనిచేయాలని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. కృష్ణా బేసిన్లో నాలుగు రాష్ట్రాలకు తాజాగా నీటి కేటాయిం పులు జరపాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆదివారం ఖరారు చేసింది. ట్రిబ్యునల్ ముందు వాదించడానికి ప్రభుత్వం నియమించిన న్యాయవాది గంగూలీ ఆదివారం హైదరాబాద్‌లో సాగునీటి శాఖ అధికారులతో సమావేశమయ్యారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గత తీర్పు వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని, మిగులు జలాలను కూడా మూడు రాష్ట్రా లు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర)కు పంపిణీ ఫలితంగా.. దిగువ రాష్ట్రానికి దక్కాల్సిన మిగులు జలాలపై పూర్తి హక్కు కోల్పోవాల్సి వస్తోం దని, ఏపీ, తెలంగాణ మధ్య కేటాయింపులకే ట్రిబ్యునల్ పరిమితమైతే.. గతంలో జరిగిన అన్యాయాన్ని కొనసాగించినట్లువుతుందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమయింది. గత తీర్పులో జరిగిన అన్యాయాన్ని సవరించడంతో పాటు దిగువ రాష్ట్రంగా మిగులు జలాలపై పూర్తి హక్కు కోరడానికి వీలుగా నాలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసే విధంగా పూర్తిస్థాయి ట్రిబ్యునల్‌గా పనిచేయాలని కోరితే రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందని న్యాయవాదికి అధికారులు సూచించారు. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాయాలని కూడా నిర్ణయించారు. -
సుప్రీం, గణాంకాలపై దృష్టి
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కు సంబంధించి సుప్రీం కోర్టులో మంగళవారం విచారణకు తెరలేవనుంది. గత రెండు దశాబ్దాలలో(1993 నుంచి 2010 వరకూ) వివిధ ప్రభుత్వాలు చేపట్టిన కేటాయింపులన్నీ అక్రమమేనంటూ ఇప్పటికే సుప్రీం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో జరగనున్న విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు ఈ వారంలో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలతోపాటు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు వె ల్లడికానున్నాయి. ఈ అంశాలన్నింటినీ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని, దీంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చవిచూసే అవకాశాలున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే బుల్లిష్ ధోరణిలో సాగుతున్న మార్కెట్లకు ఇకపై ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కేసులో హియరింగ్ ప్రభావం మెటల్, పవర్ షేర్లపై కనిపిస్తుందని పేర్కొన్నారు. మరింత ముందుకు.... జూలై నెలకు ఐఐపీ, ఆగస్ట్ నెలకు సీపీఐ గణాంకాలు శుక్రవారం(12న) వెలువడనున్నాయి. వీటితోపాటు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ మార్కెట్ల సంకేతాలు వంటి అంశాలు సైతం సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు వివరించారు. గడచిన వారంలో సెన్సెక్స్ 389 పాయింట్లు లాభపడి 27,027 వద్ద ముగిసింది. ఒక దశలో 27,226 పాయింట్ల కొత్త గరిష్టానికి సైతం చేరింది. డెరివేటివ్ లావాదేవీలు, ట్రేడర్ల ఆసక్తి, బలపడ్డ సెంటిమెంట్ వంటి అంశాల ఆధారంగా ఈ వారంలోనూ మార్కెట్లు మరింత పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్లు బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. కొనసాగుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కూడా ఇందుకు సహకరిస్తాయని అభిప్రాయపడ్డారు. జీడీపీతో జోష్: ఈ ఏడాది తొలి క్వార్టర్లో జీడీపీ 5.7%కు పుంజుకోవడం గత వారంలో ఇన్వెస్టర ్లకు ప్రోత్సాహాన్నిచ్చిందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్ఐఐల పెట్టుబడులు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం చల్లబడటం వంటి అంశాలు దీనికి జతకలిశాయని చెప్పారు. ఇకపై ఐఐపీ, సీపీఐ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. ఇంతక్రితం విడుదలైన ఈ గణాంకాల్లో వృద్ధి నమోదుకావడంతో వీటిపై సానుకూల అంచనాలున్నాయని తెలిపారు. కాగా, సాంకేతిక అంశాల ప్రకారం మార్కెట్లు మరింత పురోగమిస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. అయితే బొగ్గు క్షేత్రాల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో పరిమాణాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని తెలిపారు. గడచిన శుక్రవారం యూరోపియన్ కేంద్ర బ్యాంక్(ఈసీబీ) పాలసీ రేట్లను తగ్గించడంతోపాటు, అదనపు సహాయక ప్యాకేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మరిన్ని విదేశీ నిధులు భారత్ వంటి వర్ధమాన మార్కెట్లకు తరలి వస్తాయన్న అంచనాలు పెరిగాయని డీలర్లు చెప్పారు. తొలి వారం రూ. 9,000 కోట్ల పెట్టుబడులు దేశీ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ నెల తొలి వారంలో నికరంగా రూ. 9,000 కోట్లను(150 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. వీటిలో రూ. 3,972 కోట్లను(65.6 కోట్ల డాలర్లు) స్టాక్స్ కొనుగోలుకి వెచ్చించగా, రూ. 5,013 కోట్లను(82.8 కోట్ల డాలర్లు) బాండ్లలో ఇన్వెస్ట్ చేశారు. -
శ్రీవారి సుప్రభాత సేవలో సుప్రీం చీఫ్ జస్టిస్ లోధా
తిరుమల: వేంకటేశ్వరస్వామి వారి సుప్రభాత సేవలో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం. లోధా పాల్గొన్నారు. ఆదివారం వేకువజామున 2.30 గంటలకు జస్టిస్ లోధా తమ కుటుంబ సభ్యులతో కలసి తొలుత ధ్వజ స్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం.. బంగారు వాకిలి వద్దకు చేరుకుని సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో తిరుమల ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజులు జస్టిస్ లోధా కుటుంబ సభ్యులకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
స్వామి చల్లగా చూస్తారు: సీజే
తిరుమల : దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానని, స్వామి కూడా చల్లగా చూస్తారని,సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం లోధా అన్నారు. ఆయన శనివారం సాయంత్రం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు మహద్వారం వద్దకు చేరుకున్న లోధా దంపతులకు టీటీడీ ఈవో గిరిధర్‌గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. లోధా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పన్న సన్నిధిలో హైకోర్టు సీజే సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం రాష్ర్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయ దర్శించుకున్నారు. ఈవో రామచంద్రమోహన్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
ఇద్దరు దేవుళ్లు!
దైవికం కష్టాల్లో దేవుడు గుర్తొస్తాడు. లేదంటే, దేవుడిలాంటి మనిషైనా గుర్తొస్తారు. అయితే దేవుడి లాంటి మనిషికన్నా కూడా, దేవుడే ఎక్కువగా మనిషికి అందుబాటులో ఉంటాడు! దేవుడు.. గుడిలో ఉంటాడని మనకు నమ్మకంగా తెలుసు. పరుగున వెళ్లి ‘దేవుడా నువ్వే దిక్కు’ అని వేడుకోవచ్చు. బైబిల్లో, భగవద్గీతలో, ఖురాన్లో, తక్కిన పవిత్ర గ్రంథాలలో అక్షరాల రూపంలో దేవుడి స్వరూపం సాక్షాత్కరిస్తుంది కనుక దైవవాక్యాలను గుండెకు హత్తుకుని మనసుకు మరమ్మతులు చేసుకోవచ్చు. ఆకాశం దేవుడి నివాసం అని కూడా మనకో నమ్మకం కనుక కన్నీళ్లతోనో, నీళ్లింకిన కళ్లతోనో నింగి వంక చూస్తూ దేవుడిని ప్రార్థించవచ్చు. అయితే దేవుళ్లా వచ్చి గట్టెక్కించే వరకు దేవుడిలాంటి మనిషి ఎలా ఉంటారో తెలియదు. ఎక్కడుంటారో తెలీదు. ఏ రూపంలో వస్తారో తెలీదు. అమ్మ, నాన్న, తోబుట్టువు, స్నేహితుడు, బంధువు... ఎవరైనా కావచ్చు. ఆఖరికి శత్రువు కూడా దేవుడు పంపిస్తే వచ్చినట్లు రావచ్చు. ఒకటే తేడా. దేవుడిని మనం వెతుక్కుంటూ పోతాం. దేవుడి లాంటి మనిషి మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. దేవుడు ఎంతో కరుణిస్తే తప్ప దేవుడి లాంటి మనిషి దొరకరు. సాధారణంగా కష్టాలు, కన్నీళ్లు మామూలు వ్యక్తులకే వస్తాయని, వాళ్లకే తరచు దేవుడి అవసరం కలుగుతుంటుందని అనుకుంటాం. అయితే దేశంలోనే అత్యున్నత హోదాలలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఈ మధ్య దేవుడు గుర్తొచ్చాడు. వాళ్లలో ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోథా! ఇంకొకరు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ! ‘‘ఫర్ గాడ్స్ సేక్, న్యాయవ్యవస్థ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని చెక్కు చెదరనియ్యకండి. న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేస్తూ పోతుంటే జాతికి తీరని హాని జరుగుతుంది’’ అని లోథా ఆగ్రహంతో అభ్యర్థించారు. ‘న్యాయమూర్తుల నియామకాల్లోని గుట్టుమట్లను బహిర్గత పరచి, ఆ వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టండి’ అని ఒక పౌరుడు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంలో లోథా పై విధంగా స్పందించారు. ‘ఫర్ గాడ్స్ సేక్’ అని ఆయన అనడంలో ‘భగవంతుడా ఏమిటీ విపరీతం’ అన్న నిస్పృహ ఉంది. ఇలాంటి నిస్పృహకే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా లోనయ్యారు. ఇటీవల ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు ప్రదానం చేస్తున్న ఉమ్మడి సభలో తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎంపీలు ‘చోటు’ కోసం గొడవ పడడం చూసి ఆయన ఎంతో ఆవేదన చెందారు. ప్రజాస్వామ్యానికి ఆలయం లాంటి పార్లమెంటు భవనంలో సభ్యులు కనీస గౌరవ మర్యాదలు కూడా విస్మరించి సభ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించడం ఆయనను బాధించింది. ‘‘ప్లీజ్.. ఫర్ గాడ్స్ సేక్, హుందాగా వ్యవహరించండి. మీరంతా ప్రజాప్రతినిధులన్న సంగతి మర్చిపోయి, సభలో గందరగోళం సృష్టిస్తే పవిత్రమైన పార్లమెంటు అపహాస్యం పాలవుతుంది’’ అని ఆక్రోశించారు. ఆ ఆక్రోశంలో ‘దేవుడా, వీళ్లకు మంచి బుద్ధిని ప్రసాదించు’ అన్న వేడుకోలు ఉంది. అదే సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ.. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు భవనంలోకి అడుగుపెట్టేముందు, అక్కడి మెట్లకు శిరస్సుతో నమస్కరించడాన్ని గుర్తు చేస్తూ.. మోడీని కొనియాడారు కూడా. లోథాకు, ప్రణబ్‌కి వచ్చిన కష్టం.. పెద్ద కష్టంగా మనకు అనిపించకపోవచ్చు. అసలవి కష్టాలే కాదని కూడా అనిపించవచ్చు. అయితే ఏ మనిషి కష్టాన్నయినా మనం అనుకునే హెచ్చుతగ్గులను బట్టి అంచనా వెయ్యకూడదు. కష్టం తీవ్రత దేవుడిని తలచుకోవడంలో ఉంటుంది. ఎవరైనా బాధగా ‘దేవుడా’ అనుకున్నారంటే అది కష్టం అవుతుంది తప్ప, చిన్నకష్టమో, పెద్ద కష్టమో కాదు. కష్టాల్లో.. దేవుడు గానీ, దేవుడి లాంటి మనిషిగానీ గుర్తొస్తారని కదా అనుకున్నాం. అంటే ప్రతి మనిషికి ఇద్దరు దేవుళ్లు. ఒకరు దేవుళ్లలో దేవుడు. ఇంకొకరు మనుషుల్లో దేవుడు. మనకిక భయం ఏమిటి? దేవుడు తప్పక మన కష్టం తీరుస్తాడు. లేదా కష్టం తీర్చి రమ్మని తన తరఫున మనిషినైనా పంపిస్తాడు. అలా కూడా జరగలేదంటే.. ఎవరి వల్ల కష్టం వచ్చిపడిందో వారిలో పరివర్తన తెచ్చి, వారినే కష్టం తీర్చే మనిషిగా మన ముందుకు పంపే ఆలోచనలో ఆయన ఉన్నాడని. అప్పటి వరకు కష్టాన్ని ఓర్చుకోవడమే దేవుడికి మనం చెల్లించగల స్తుతి. - మాధవ్ శింగరాజు -
మా వాదనలూ వినండి!
{బిజేష్ ట్రిబ్యునల్‌పై సుప్రీంలో తెలంగాణ ఇంప్లీడ్ పిటిషన్ {sిబ్యునల్ తీర్పుపై రేపు విచారణ.. ఇంప్లీడ్ పిటిషన్‌పైనా కోర్టు నిర్ణయం హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై గతంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై జరుగుతున్న విచారణలో తమ వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు బుధవారం ఇంప్లీడ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం నీటి కేటాయింపులపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరింది. కాగా ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరుగనుంది. ఇదే సమయంలో ఇంప్లీడ్ పిటిషన్‌పైనా కోర్టు నిర్ణయం తీసుకోనుంది. కృష్ణానది జలాల కేటాయింపుపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్రాలు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రం తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను నియమిం చింది. నీటి లభ్యత, కేటాయింపులు, వినియో గం విషయాల్లో తెలంగాణకు న్యాయం జరగాలంటే ప్రస్తుత ట్రిబ్యునల్ పరిధిని విస్తరించాలని, లేదంటే కొత్త ట్రిబ్యునల్ వేయాలని సుప్రీంను కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. మళ్లీ పంపిణీ చేయాలి.. తెలంగాణ వాదన వినకుండా బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది అవార్డును అమలు చేస్తే తీరని అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ వాదనగా ఉంది. దీంతోపాటు ట్రిబ్యునల్ ఇప్పటివరకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపలేదన్న అంశాన్ని కోర్టు దృష్టికి తేనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నది జల వివాదాలకు ఉద్దేశించిన బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో నాలుగు రాష్ట్రాలను లెక్కలోకి తీసుకుని నీటిని కేటాయించాలని ఇప్పటికే కోరిన అంశాన్ని కోర్టు దృష్టికి తేవాలని నిర్ణయిం చింది. ఈ కేసు విషయమై ప్రభు త్వ సలహా దారు విద్యాసాగర్‌రావు ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘బుధవారమే ఈ కేసుకు సంబంధించి ఇంప్లీడ్ పిటిషన్ వేశాం. తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి తమ వాదనలకు అవకాశమివ్వాలని కోరాం. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు, ట్రిబ్యునల్ పరిధి పెంపుపై ప్రస్తావన చేయలేదు.’’ అని తెలిపారు. -
మార్కెట్లు అక్కడక్కడే...
ఆసియా మార్కెట్ల నష్టాల ప్రభావంతో దేశీ స్టాక్ సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. రోజు మొత్తం స్వల్ప స్థాయి కదలికలకే పరిమితమయ్యాయి. చివరికి సోమవారం ముగింపును పోలి మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 26,315-26,482 పాయింట్ల మధ్య ఒడిదుడుకులకు లోనైంది. చివరికి 6 పాయింట్ల స్వల్ప లాభంతో 26,443 వద్ద ముగిసింది. ఇది కొత్త గరిష్ట ముగింపుకాగా, నిఫ్టీ మాత్రం ఒక పాయింట్ తగ్గి 7,905 వద్ద నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాలలో ప్రభుత్వాలు చేపట్టిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులు అక్రమమంటూ సుప్రీం కోర్టు పేర్కొనడం, గురువారం ముగియనున్న ఆగస్ట్ ఎఫ్‌అండ్‌వో సిరీస్ వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారంటూ నిపుణులు పేర్కొన్నారు. హెల్త్‌కేర్ ఓకే, పవర్ డీలా బీఎస్ఈలో ప్రధానంగా హెల్త్‌కేర్ ఇండెక్స్ 1%పైగా లాభపడగా, పవర్ అదే స్థాయిలో డీలాపడింది. సెన్సెక్స్‌లో హిందాల్కో, టాటా స్టీల్, గెయిల్, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా 3.6-1.4% మధ్య పుంజుకోగా, టాటా పవర్, ఓఎన్జీసీ 2.5% చొప్పున నష్టపోయాయి. -
కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమే
కోల్గేట్పై సుప్రీంకోర్టు తీర్పు 218 గనులు, రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల భవితవ్యం ప్రశ్నార్ధకం 1993-2010 లలో చేసిన కేటారుుంపులన్నీ నిర్హేతుకమన్న ధర్మాసనం {స్కీనింగ్ కమిటీ ఆలోచన లేకుండా వ్యవహరించిందని వ్యాఖ్య {పజా ప్రయోజనాలు భారీగా దెబ్బతిన్నాయని స్పష్టీకరణ బొగ్గును నల్ల వజ్రమనడంలో అతిశయోక్తి లేదని వెల్లడి న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటారుుంపులను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వేలం విధానం ప్రవేశపెట్టక మునుపు, 1993 నుంచి 2010 మధ్యకాలంలో పలు ప్రభుత్వాల హ యూంలో చేసిన బొగ్గు గనుల కేటారుుంపులన్నీ చట్టవిరుద్ధం, నిర్హేతుకమని సోమవారం తీర్పు చెప్పింది. తాత్కాలికమైన, ఆషామాషీ పద్దతుల్లో, ఏమాత్రం ఆలోచన చేయకుండా గనులు కేటారుుంచారని అభిప్రాయపడింది. 1993 మొదలు 36 స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు అవలంభించిన విధానాలను ఖండించేందుకు చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం దాదాపు అన్ని పదాలను ఉపయోగించింది. అరుుతే ఈ కేటారుుంపుల్ని రద్దు మాత్రం చేయని న్యాయమూర్తులు మదన్ బి.లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో కూడిన బెంచ్.. కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్పన్నమయ్యే పరిణామాలేమిటన్న అంశమే తమ ముందు మిగిలి ఉందని పేర్కొంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో 218 బొగ్గు బ్లాకులు, వాటి ఆధారంగా పెట్టిన సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. మొత్తం 218 బొగ్గు బ్లాకుల కేటారుుంపులను పరిశీలించిన ధర్మాసనం 163 పేజీల తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 1న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. న్యాయవాది ఎం.ఎల్.శర్మ, కామన్ కాజ్ అనే ప్రభుత్వేతర సంస్థ 2012లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సుప్రీం సుదీర్ఘంగా విచారించింది. ధర్మాసనం ఇంకా ఏమన్నదంటే.. ఇటు స్క్రీనింగ్ కమిటీ మార్గాన, అటు ప్రభుత్వ పంపిణీ మార్గంలో.. రెండు పద్దతుల్లోనూ నిర్హేతుకంగా, చట్టవిరుద్ధంగా కేటారుుంపులు జరిగారుు.1993 జూలై 14 మొదలు 36 సమావేశాలలో స్క్రీనింగ్ కమిటీ సిఫారసుల మేరకు యూవత్ కేటారుుంపులు చట్టవిరుద్ధంగా జరిగింది.{స్కీనింగ్ కమిటీ స్థిరంగా వ్యవహరించలేదు. మార్గదర్శకాలను తక్కువగా పాటించారు. పారదర్శకత లేదు. విజ్ఞతఉపయోగించలేదు.వాణిజ్య ప్రయోజనాల కోసం బొగ్గు తవ్వకాలు జరిపే అర్హత ఏ రాష్ట్రానికీ లేదా దాని పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థకు లేదు. వీటివల్ల జాతి సంపద, పరిశ్రమల ప్రభువ రుున బొగ్గుఅన్యాయంగా పంపిణీ అరుుంది. బొగ్గును నల్ల వజ్రంగా పేర్కొనడంలో అతిశయోక్తి లేదు. చాలా దేశాలలో బొగ్గు ఆధారంగానే పారిశ్రామిక ప్రగతి చోటు చేసుకుంది.మన దేశంలో ఆర్ధిక అభివృద్ధికి దోహదపడే బొగ్గు గని కేటారుుంపు కంపెనీలపై ఉదారతకు సంబంధించిన వ్యవహారమయింది.పరిపాలన మార్గం ద్వారా కేటారుుంపు జరిపేందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానం ఇప్పటికే ఉన్న చట్టానికి అనుగుణంగా లేదు. యూఎంపీపీలు బొగ్గును మళ్లించకూడదు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల (యూఎంపీపీలు) నుంచి బొగ్గును వేరే అవసరాలకు మళ్లించేందుకు కొన్ని కేసుల్లో ప్రభుత్వం అనుమతించడాన్ని నిరోధించాలన్న ఎన్జీవో వాదనను సుప్రీం అంగీకరించింది. అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులకు (యూఎంపీపీలు) తక్కువ ధరకు బొగ్గు గనులు కేటారుుంచడంపై ఎలాంటి సవాలూ తమ ముందు లేదని బెంచ్ స్పష్టం చేసింది. యూఎంపీపీలకు కేటారుుంచిన క్షేత్రాలను వాటి నిమిత్తమే ఉపయోగించాలని. బొగ్గును మళ్లించడం కానీ వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడం కానీ చేయరాదని ఆదే శాలిచ్చినట్టు తెలిపింది. గనుల కేటారుుంపు కోసం ఏళ్ల తరబడి కాంపిటీటివ్ బిడ్డింగ్‌ను అనుసరించకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఈ విషయంలో కోర్టు జోక్యం అవసరమైనంత నిర్హేతుకంగా ఉందని, అర్ధరహితంగా ఉందని చెప్పజాలమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బొగ్గు క్షేత్రాలకు సంబంధించిన గణాంకాలను అటార్నీ జనరల్ ఇచ్చినప్పటికీ, వాటిని సరిచూడలేదని తీర్పు అనంతరం ధర్మాసనం మౌఖికంగా చెప్పింది. వీటిని పరిశీలించాల్సి ఉందని, తీర్పు వల్ల తలెత్తే పరిణామాలను నిర్ధారించేందుకు మరింత విచారణను సెప్టెంబర్ 1వ తేదీన చేపడతామని తెలిపింది. యూపీఏపై ఆరోపణలు యూపీఏ హయూంలో కేటారుుంచిన 194 బొగ్గు బ్లాకులకు సంబంధించి అవకతవకలు జరిగినట్టు పిటిషనర్లు అరోపించారు.సుప్రీం తన విచారణను 1993జూలై 14 నుం చి జరిగిన కేటారుుంపులకు పొడిగించింది. {Oపెవేటు కంపెనీలు, పార్టీలకు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఎంపీ రాష్ట్రాల్లో గనులు కేటారుుంచారు. కేసు విచారణకు వచ్చినప్పుడు కేంద్రం 218 క్షేత్రాల సమాచారం అందజేసింది. 2012లో పిటిషన్ దాఖలైనప్పుడు.. గనుల కేటారుుంపుల్లో రూ.1.64 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు కాగ్ అంచనా వేసిందన్నారు.కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి సీబీఐ దర్యాప్తును సైతం పర్యవేక్షించింది. దాఖలయ్యే కేసుల ప్రాసిక్యూషన్ కోసం ప్రత్యేక కోర్టును సైతం నెలకొల్పారు. కోల్గేట్ ప్రస్థానం జూలై 1992:బొగ్గు బ్లాకుల కేటాయింపుల కో సం వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు. జూలై 14న సింగరేణి కాలరీస్, కోల్ఇండియా లిమిటెడ్‌ల ఉత్పత్తి ప్రణాళికల్లో లేని బ్లాకుల గుర్తింపు. 1993- 2010: 1993-2005 మధ్య 70 బ్లాకులను, 2006లో 53 బ్లాకులను, 2007లో 52 సహా మొత్తం 216 బ్లాకుల కేటాయింపు. వాటిలో నుంచి 24 బ్లాకుల కేటాయింపును రద్దు చేశారు.మార్చి 2012: 2004-2009 మధ్య బొగ్గు బ్లాకుల కేటాయింపులో ప్రభుత్వం అసమర్ధంగా వ్యవహరించిందని, దానివల్ల కేటాయింపులు పొందిన కంపెనీలు రూ. 10.7 లక్షల కోట్లు ఆర్జించారని కాగ్ ముసాయిదా నివేదిక వెల్లడి. మే 31, 2012: సీబీఐ విచారణకు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఆదేశాలు జూన్ 2012: బొగ్గు బ్లాకుల కేటాయింపుపై సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, అనంతరం 80 బ్లాకుల కేటాయింపు ఉపసంహరణ, ఆగస్ట్, 2012: పార్లమెంట్లో కాగ్ రిపోర్ట్. ఖజానాకు రూ. 1.86 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని వెల్లడి. మైనింగ్ ప్రారంభం కాకుండానే నష్టం జరిగిందని ఎలా చెబుతారని ప్రభుత్వ అభ్యంతరం. సెప్టెంబర్, 2012: బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్. సీబీఐ దర్యాప్తుపై సుప్రీం పర్యవేక్షణ ప్రారంభం. మార్చ్, 2013: దర్యాప్తు వివరాలను ప్రభుత్వానికి చెప్పొద్దంటూ సీబీఐకి సుప్రీం ఆదేశాలు. జూన్ 11, 2013: నవీన్ జిందాల్, దాసరి నారాయణ రావులపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన సీబీఐ. అక్టోబర్‌లో కుమారమంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి కేసీ పరేఖలపై ఎఫ్ఐఆర్ నమోదు. జూలై, 2014: కేసుల విచారణ కోసం ప్రత్యేక సీబీఐ కోర్టును ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. -
ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్
దేశవ్యాప్తంగా 4.5 లక్షలమంది హాజరు న్యూఢిల్లీ/సాక్షి,విజయవాడ/తిరుపతి: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. 59 నగరాల్లోని 2,137 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించగా 4.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. సివిల్స్ పరీక్షా విధానంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేయాలంటూ డిమాండ్ రాగా.. సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఎక్కడా ఎలాంటి ఆటంకాలు, నిరసనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. రెండు పేపర్ల(పేపర్-1, పేపర్-2)తో కూడిన ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. మొదటి పరీక్ష ఉదయం తొమిదిన్నర గంటలకు ఆరంభమవగా.. రెండో పరీక్ష మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైంది. ఒక్కో పరీక్షకు రెండు గంటలు కేటాయించారు. కాగా పేపర్-1లోని ప్రశ్నలకు సంబంధించి హిందీ అనువాదంలో తప్పులు దొర్లినట్టు కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ప్రిలిమ్స్కోసం మొత్తం 9,44,926 మంది దరఖాస్తు చేయగా.. పరీక్షకు 4,51,602 మంది హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.27 లక్షల మంది అధికంగా హాజరవడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతిల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విజయవాడలో 31 పరీక్ష కేంద్రాల్లో 32 శాతానికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 14,640 మందికిగాను ఉదయం జరిగిన పరీక్షకు 4,805 మంది(32.82 శాతం), మధ్యాహ్నం పరీక్షకు 4,755 మంది(32.48 శాతం) హాజరైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తిరుపతిలో నిర్వహించిన పరీక్షకు 38 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 13 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 7,796 మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం జరిగిన పరీక్షకు మూడువేల మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 2,984 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో...సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు హైదరాబాద్లోప్రశాంతంగా కొనసాగాయి. నగరంలోని 83 కేంద్రాల్లో మొత్తం 47శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 38,798 మంది అభ్యర్థులకుగాను పేపర్-1 పరీక్షకు 18,377 మంది, పేపర్-2కు 18,161 మంది అభ్యర్థులు హాజరయ్యారు.