న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొత్తగా రూపొందించిన రెండు చట్టాలను సవాలు చేస్తూ వేసే పిటిషన్‌లను ఇకపై దిగువ కోర్టులు స్వీకరించరాదని సుప్రీంకోర్టు బుధవారం నిర్దేశించింది. రాజ్యాంగ సమ్మతి ఉన్న ఈ రెండు చట్టాలకు సంబంధించిన ఎలాంటి విషయాలపై పిటిషన్లు వచ్చినా హైకోర్టుతో సహా దిగువ కోర్టులు ఏవీ కూడా విచారించరాదని జస్టిస్ దవే నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ రెండు చట్టాలను సవాలు చేస్తూ వేసే పిటిషన్లను విచారించాలా... వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది. కాగా, సైన్యానికి సంబంధించిన వివాదాల్లో సాయుధ బలగాల ట్రిబ్యునల్(ఏఎఫ్‌టీ) ఇచ్చే తీర్పులను సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను విచారించేందుకు హైకోర్టులకు అధికారం లేదని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.