Laws
-
కొత్త బదిలీ చట్టంలోనూ మెలికలు!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల కోసం తీసుకురానున్న కొత్త చట్టం వారికి మరిన్ని కష్టాలకు కారణం కానుంది. గతానికి భిన్నంగా విద్యా సంవత్సరం లెక్కింపును చూపడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త చట్టంపై ప్రణాళిక సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ శనివారం విడుదల చేసిన ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం–2025’ ప్రకారం ఇకమీదట ఏటా బదిలీలు చేపడతామని ప్రకటించింది. జూన్ 1 నుంచి మే 31 వరకు విద్యా సంవత్సరంగా పేర్కొని, దాని ఆధారంగానే బదిలీలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు 9 నెలలు మించిన కాలాన్ని పూర్తి విద్యా సంవత్సరంగా గణిస్తామని తెలిపింది. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు ఒక పాఠశాలలో గరిష్ఠంగా 5 విద్యా సంవత్సరాలు, ఇతర ఉపాధ్యాయులు 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకుంటే బదిలీలకు అనుమతిస్తారు. బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ఠంగా రెండు విద్యా సంవత్సరాలు పూర్తవాలనే నిబంధన విధించారు.ప్రస్తుత ఖాళీలు, భవిష్యత్ ఖాళీలు, కంపల్సరీ బదిలీల ఖాళీలు, స్టడీ లీవ్ ఖాళీలు, ముందస్తు అనుమతుల్లేకుండా ఏడాదికి పైగా గైర్హాజరు ఖాళీలు, రేషనలైజేషన్ వల్ల ఏర్పడే ఖాళీలు.. వీటిని బదిలీల్లో వేర్వేరుగా చూపి, ఏటా మే 31 నాటికి లెక్కించి ఖాళీల బ్లాకింగ్ విధానాన్ని అమలు చేస్తారు. అయితే పాయింట్ల కేటాయింపులో కొందరికి అన్యాయం జరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టీచర్ల బదిలీలకు ప్రత్యేక చట్టం రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం–2025ను శనివారం విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచిన ముసాయిదాపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ విజయ్ రామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఛిట్ఛ.్చp.జౌఠి.జీn వెబ్సైట్లో ఉంచిన ప్రొఫార్మాను డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఛీట్చజ్ట.్చp్ట్ట్చ 2025ఃజఝ్చజీ . ఛిౌఝకు మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ అవార్డు పాయింట్లు ఎత్తివేత ముసాయిదా లోపభూయిష్టంగా ఉన్నట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. గతంలో బదిలీలకు విద్యా సంవత్సరంలో ఆరు నెలలు పూర్తి చేసుకుంటే పూర్తి కాలంగా పరిగణించగా, ముసాయిదాలో దాన్ని 9 నెలలకు పెంచడం ద్వారా చాలామంది నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటిదాకా జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులకు ప్రత్యేక గౌరవంగా బదిలీల్లో 5 స్పెషల్ పాయింట్లు కేటాయిస్తుండగా, ముసాయిదా చట్టంలో వాటిని తొలగించారు. స్టడీ లీవ్ పై వెళ్లే ఉపాధ్యాయులు పనిచేసే ప్రాంతాలను ఖాళీగా చూపడం వల్ల వారు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఖాళీలన్నింటినీ బదిలీల్లో కోరుకునేందుకు వీల్లేకుండా బ్లాకింగ్ విధానాన్ని అమలు చేయడం అన్యాయమంటున్నారు.» ప్రభుత్వం (జీవో ద్వారా) ద్వారా బదిలీ పొందినవారికి పాత, కొత్త ప్రాంతాల సర్వీసును దీర్ఘకాలిక సర్వీస్‌గా పరిగణించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన కొత్త విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే బదిలీలకు వర్తిస్తుందా! లేక పాతవారికీ వర్తిస్తుందా? అన్నది ముసాయిదాలో చెప్పకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. » దీర్ఘకాలం ఒకే పాఠశాలలో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలి. కానీ ఎన్సీసీ టీచర్లకు ఈ నిబంధన వర్తించే అవకాశం లేదు. ఎన్సీసీ ఉపాధ్యాయులు అదే యూనిట్ ప్రాంతాలకే బదిలీ కోరుకోవాలి. ఆ ప్రాంతాలు లేకపోతే ఆ టీచర్లకు దీర్ఘకాలిక సర్వీస్ ఉన్నా అదే పాఠశాలలో కొనసాగిస్తారని ముసాయిదాలో పేర్కొన్నారు. దీంతో సాధారణ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. » హెచ్ఆర్ఏ ఆధారంగా పాఠశాలలను నాలుగు విభాగాలుగా విభజించారు. హెచ్ఆర్ఏ 16 శాతం ఉంటే కేటగిరీ–1, 12 శాతం ఉంటే కేటగిరీ–2, 10 శాతం ఉంటే కేటగిరీ–3గా పేర్కొన్నారు. 10 శాతం హెచ్ఆర్ఏతో పాటు రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాల్లోని స్కూళ్లను కేటగిరీ–4గా చూపారు. వీటికి వరుసగా ఏటా పాఠశాల స సర్వీస్ కు 1, 2, 3, 5 పాయింట్లు చొప్పున బదిలీ సీనియార్టీకి కలుపుతారు. పదోన్నతుల్లో మొదట ఉపాధ్యాయులు కేటగిరీ–3, 4లో ఖాళీలనే ఎంచుకోవాలి, వాటిల్లో ఖాళీలు లేకుంటేనే కేటగిరి–1, 2 ప్రాంతాలకు అవకాశం కల్పించేలా నిబంధన విధించారు. దీనివల్ల సీనియర్లకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. » గతంలో ఒక విద్యా సంవత్సరానికి అర పాయింట్ ఇవ్వగా ఇప్పుడు దాన్ని పాయింట్‌కు పెంచారు. దీనివల్ల జూనియర్ టీచర్లకు అన్యాయం జరిగే ప్రమాదముంది. 2003 నుంచి డీఎస్సీ టీచర్లు నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. » ఇప్పటివరకు 80 శాతం వైకల్యం ఉన్నవారు సంఖ్యతో నిమిత్తం లేకుండా అందరికీ ప్రాధాన్యత కేటగిరీలో అవకాశం కల్పించారు. ప్రస్తుత ముసాయిదా ప్రకారం ఎస్జీటీలు 40 శాతం, స్కూల్ అసిస్టెంట్లు 50 శాతం మందికే ప్రాధాన్యత కేటగిరీలో అవకాశమిస్తారు. మిగిలిన వారు నష్టపోయే అవకాశం ఉంది. » ఇప్పటిదాకా ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్న స్త్రీలకు ప్రాధాన్య కేటగిరీలో ఉంచి బదిలీల్లో మొదట ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు వారికి స్పెషల్ పాయింట్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అవి ఎన్ని పాయింట్లు అనేది స్పష్టత లేదు. గతంలో వయసుతో నిమిత్తం లేకుండా అవివాహిత మహిళలకు స్పెషల్ పాయింట్లు ఇచ్చేవారు. ఇప్పుడు 40 ఏళ్లు దాటినవారికే పాయింట్లు కల్పిస్తున్నట్లు పేర్కొనడం ఆ వర్గం ఉపాధ్యాయినులను నిరాశకు గురిచేస్తోంది. » ముసాయిదాలో ఏడాదికి ఒక్కసారే బదిలీలు ంటాయని పేర్కొన్నారు. కానీ, అభ్యర్థన/పరస్పర/అంతర్ జిల్లా/అంతర్ రాష్ట్ర బదిలీలను పరిగణనలోకి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొనడం ద్వారా ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు బదిలీలు చేస్తామని చెప్పకనే చెప్పారు. -
చిన్నారి పెళ్లికూతుళ్లు
విరిసీ విరియని.. తెలిసీ తెలియని వయస్సులోనే పసిమొగ్గలకు ‘మాంగల్యం తంతునానేనా..’ అంటున్నారు.. యుక్త వయస్సు రాకుండానే తాళి»ొట్టు మెడలో వేయించేస్తున్నారు.. కొద్ది నెలలకే తల్లులవుతున్న ఆ అమ్మాయిలు రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.. అవగాహనా రాహిత్యమో.. గుండెల మీద కుంపటి దింపేసుకోవాలనే అమాయకత్వమో తెలీదు కానీ.. రాజానగరం మండలంలోని పలు గ్రామాల్లో తరచుగా జరుగుతున్న బాల్య వివాహాలు కలవరపెడుతున్నాయి.రాజానగరం: యుక్త వయస్సు రాకుండా బాల్య దశలోనే వివాహాలు చేయడం చట్ట రీత్యా నేరం, అయినప్పటికీ వీటిని నిరోధించడంలో తరచూ అధికార యంత్రాంగం విఫలమవుతూనే ఉంది. బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు, తీసుకుంటున్న చర్యలు ప్రకటనలకే పరిమితమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజానగరం మండలంలోని పలు గ్రామాల్లో తరచుగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న బాల్య వివాహాలే దీనికి సాక్షిగా నిలుస్తున్నాయి. మండలంలోని భూపాలపట్నం, పుణ్యక్షేత్రం, కొత్తతుంగపాడు, పాతతుంగపాడు తదితర గ్రామాల్లో తరచుగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అవగాహన లేకనో.. ఓ పనైపోతుందనే ఉద్దేశమో కానీ.. యుక్త వయస్సు రాకుండానే కొంత మంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు వివాహాలు చేసి, అత్తారిళ్లకు పంపించేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా.. కొత్త తుంగపాడు గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు దొడ్డ మణికంఠ, 16 సంవత్సరాల బాలిక పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. వరుడు రోజువారీ పనులు చేస్తూండగా.. వధువును ఆమె తల్లిదండ్రులు 9వ తరగతి వరకూ చదివించి, మాన్పించేశారు. ఇంటి వద్దనే ఉంటున్న ఆ బాలికతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం కాస్తా పెళ్లి వరకూ వెళ్లింది. వారి వివాహానికి బాలిక తల్లిదండ్రులు తొలుత అంగీకరించలేదు. అయితే, అతడు లేకపోతే తాను బతకలేనంటూ ఆ బాలిక తరచూ అతడి ఇంటికి వెళ్లి వస్తూండేది. ఈ నేపథ్యంలో ఇరువైపుల పెద్దలు అయిష్టంగానే వారిద్దరికీ గుట్టు చప్పుడు కాకుండా బుధవారం రాత్రి ముక్కినాడ గ్రామంలోని దేవాలయంలో సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. ఆపై వారిద్దరినీ తిరుపతి పంపించేశారు. అధికారులకు తెలియకుండా ఇరు వర్గాల పెద్దలు ఈ వివాహం జరిపించినా.. సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బాల్య వివాహం గుట్టు రట్టయింది. గతంలోనూ.. » మండలంలోని పలు గ్రామాల్లో గతంలో కూడా ఇదేవిధంగా బాల్య వివాహాలు జరిగాయి. » పుణ్యక్షేత్రం గ్రామంలో గత ఏడాది అధికారులను బురిడీ కొట్టించి మరీ ఇరు వర్గాల పెద్దలకు బాల్య వివాహం జరిపించేందుకు ప్రయత్నించారు. దీనిపై స్థానిక అంగన్వాడీ కార్యకర్తల నుంచి సమాచారం అందుకున్న ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెంటనే పోలీసులతో కలిసి ఆ గ్రామానికి చేరుకుని, బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. యుక్త వయస్సు రాకుండా పిల్లలకు వివాహం చేయబోమంటూ పెద్దల నుంచి రాతపూర్వకంగా హామీ కూడా తీసుకున్నారు. అంతటితో తమ డ్యూటీ అయిపోయిందని సంబరపడుతూ వెనుదిరిగిన అధికారులు ఆ మర్నాడు అందుకున్న మరో సమాచారంతో షాకయ్యారు. రాతపూర్వక హామీ ఇచ్చిన పెద్దలే.. తమ పిల్లలను వేరొక ప్రాంతానికి తీసుకువెళ్లి, వివాహం చేశారని తెలిసి నిర్ఘాంతపోయారు. » గడచిన నాలుగేళ్లలో భూపాలపట్నంలో 4, పుణ్యక్షేత్రంలో 6, కొత్తతుంగపాడులో 9, పాతతుంగపాడులో 6 బాల్య వివాహాలు జరిగినట్లు సమాచారం. చట్టం ఏం చెబుతోందంటే.. బాల్య వివాహాలను అరికట్టేందుకు స్వాతంత్య్రం రాక ముందు నుంచే చట్టాలున్నాయి. మొదటిసారిగా 1929లో చైల్డ్ మ్యారేజ్ రి్రస్టిక్ట్ యాక్ట్‌ను బ్రిటిష్ వారు తీసుకువచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్–2006 రూపొందించారు. దీని ప్రకారం 18 సంవత్సరాలలోపు అమ్మాయిలు, 21 సంవత్సరాలోపు అబ్బాయిలను బాలల కిందే పరిగణిస్తారు. ఈ యాక్ట్ ప్రకారం బాల్య వివాహాలు చేసిన వారి తల్లిదండ్రులతో పాటు ఆ సమయంలో అక్కడున్న వారు, వివాహ తంతు జరిపించే వారు (ప్రోత్సహించినట్టుగా భావిస్తారు) కూడా శిక్షార్హులే అవుతారు. వీరికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా విధించవచ్చు. దీనిలో నేరస్తులైతే బెయిల్ కూడా లభించదు. అధికారుల నిర్లక్ష్యమే కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొత్తతుంగపాడులో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. గ్రామంలోని అంగన్వాడీ కార్యకర్తలకు, గ్రామ కమిటీకి విషయం ముందుగా తెలిసినా కానీ చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. బాల్య వివాహం జరుగుతున్న సమాచారాన్ని పై అధికారులకు సకాలంలో ఇవ్వడం లేదు. బుధవారం రాత్రి జరిగిన బాల్య వివాహం గురించి, తహసీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేశాను. – యాళ్ల మాచరయ్య, కొత్తతుంగపాడు ఫలితమివ్వని గ్రామ కమిటీలు బాల్య వివాహాలను నిరోధించండి.. అమ్మాయిల జీవితాలను కాపాడండి.. అంటూ ఎంతగా ప్రచారం చేస్తున్నాగానీ, ప్రజల్లో సరైన స్పందన రావడం లేదు. వీటిని ఏవిధంగానైనా అరికట్టాలనే ఉద్దేశంతో గ్రామ మహిళా కార్యదర్శి (పోలీసు), ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, అంగన్వాడీ కార్యకర్తలతో గ్రామ కమిటీలు కూడా వేశాం. అయినప్పటికీ బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం ముందుగా అందడం లేదు. స్థానికంగా ఉండే మొహమాటాలతో తమ ప్రాంతంలో బాల్య వివాహం జరుగుతోందని తెలిసి కూడా చూసీ చూడనట్లు వదిలేసి, తెలిసీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. – టి.నాగమణి, సీడీపీఓ, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం, రాజానగరం -
ప్రతి దాడీ బలోపేతం చేస్తుంది
జైపూర్: అదానీ గ్రూప్‌పై ఇటీవల అమెరికాలో దాఖలైన అభియోగాలపై సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ తొలిసారి బహిరంగంగా స్పందించారు. చట్టాలు, నిబంధనల అమలుకు తమ గ్రూప్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రతి దాడీ తమను మరింత బలోపేతమే చేస్తుందన్నారు. ఆయన శనివారం ఇక్కడ 51వ జెమ్స్, జువెల్లరీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘నిబంధనల అమలుకు సంబంధించి ఇటీవలే అమెరికా నుంచి కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నాం. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం మాకిది మొదటిసారేమీ కాదు. ప్రతి దాడీ మమ్మల్ని మరింత బలోపేతమే చేస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ అంశానికి సంబంధించి మీడియాలో మాపై పుంఖానుపుంఖాలుగా వివక్ష, విద్వేషపూరిత కథనాలు వచ్చాయి. ఇంతా చేస్తే మా సంస్థకు సంబంధించిన వారెవరిపైనా అమెరికాలో ఎఫ్‌సీపీఏ చట్టాలను ఉల్లంఘించినట్టు గానీ, న్యాయ ప్రక్రియను అడ్డుకోజూసినట్టు గానీ ఒక్క అభియోగమూ నమోదు కాలేదు’’ అని అదానీ గుర్తు చేశారు. నియంత్రణ సంస్థల నియమ నిబంధనలన్నింటికీ కట్టుబడి ఉండటంలో తమ సంస్థ ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తుందన్నారు. ‘‘నేటి సమాజంలో వాస్తవాల కంటే పుకార్లే వేగంగా వ్యాపిస్తాయి. ఇన్నేళ్లలో అదానీ గ్రూప్ పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో రంగాల్లో మార్గదర్శకంగా నిలిచినందుకు మేం చెల్లించిన మూల్యమది. ఆ సవాళ్లే మమ్మల్ని తీర్చిదిద్దాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు అధిగమిస్తూనే వస్తున్నాం. సవాళ్లను తట్టుకుని నిలుస్తూ కొత్త దారి వెదుక్కుంటూ ధైర్యంగా సాగడమే మాకు తెలుసు’’ అని అదానీ చెప్పుకొచ్చారు. హిండెన్‌బర్గ్‌పై చట్టపరంగా చర్యలు తమ గ్రూప్‌పై గతేడాది హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను కూడా అదానీ తోసిపుచ్చారు. ఆ సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ‘‘మాపై హిండెన్‌బర్గ్ చేసింది ఆరోపణలు నిజానికి మా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బ తీయడంతో పాటు సంస్థను రాజకీయ వివాదంలోకి కూడా లాగేందుకు చేసిన భారీ కుట్ర. ఆ ఆరోపణలను ఒక వర్గం మీడియా తమ స్వార్థ ప్రయోజనాల కోసం విపరీతంగా ప్రచారం చేసింది. అంతటి సంక్షోభంలో కూడా మేం విలువలతో ఎక్కడా రాజీ పడలేదు. అదే ఏడాది సంస్థను ఆర్థికంగా సమున్నత శిఖరాలకు చేర్చి తలెత్తుకు నిలిచాం. మేం ఎలాంటి అవకతవకలకూ పాల్పడలేదని చివరికి సుప్రీంకోర్టే తేల్చింది’’ అని చెప్పారు. -
ఆదివాసులకు చేయూతనిద్దాం!
ఆంగ్లేయుల దోపిడీని ఎదురించి ఆదివాసులు స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. కానీ కనీస హక్కులు లేకుండా ఇప్పటికీ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తూఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా తక్కువ. సాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. కానీ తమ అటవీ ఉత్పత్తులతో విధ్వంస కోణానికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందించగలరు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. సుస్థిరాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసినప్పుడే, తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది.వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతిలో ఆదివాసులది కీలకమైన భూమిక. ప్రకృతిని దైవంగా భావించే ఆదివాసులు, ఆంగ్లేయుల దోపిడీని ఆది నుంచీ ఎదురించి స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. భారతదేశంలోని అపారమైన సహజ సంపదపై కన్ను వేసిన బ్రిటిష్ పాలకులు 1865లో అటవీ చట్టాన్ని తీసుకువచ్చారు. 1927లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ పేరుతో మరో చట్టం చేశారు.అడవుల పరిరక్షణ ముసుగులో సహజ వనరులను దోచుకునేందుకు ఉద్దేశించిన ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆదివాసులు అనేక పర్యాయాలు తిరుగు బాటు చేసి మరింత అణచివేతకు గురయ్యారు. కానీ, తమ నిరంతర తిరుగుబాటు ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి జీవం పోశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాల చొరవ వల్లనో, ప్రజల పోరాటాల వల్లనో వలస పాలన దుష్పరిణామాల నుంచి బయట పడగలిగాము. అయితే, ప్రధాన స్రవంతికి దూరంగా అడవుల్లో నివసిస్తున్న ఆదివాసులు ఇప్పటికీ వివక్షకు, ఉదాసీనతకు గురవుతూనే ఉన్నారు. తరతరాలుగా తాము కాపాడుకుంటున్న అడవులలో కనీస హక్కులు లేకుండా మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశంలో అడవుల హద్దులను గుర్తించారు, కానీ అడవి బిడ్డల హక్కులను విస్మరించారు. అభివృద్ధి కూడా ఆదివాసుల పాలిటశాపంగా పరిణమించింది. దేశ జనాభాలో వారు సుమారు 8 శాతం ఉంటారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు తెలుపుతున్నాయి. దురదృష్టవ శాత్తూ ఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా అతి తక్కువ. అటవీ చట్టాలు అమలు చేయాలి!స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాల దాకా ఆదివాసు లను ప్రధాన స్రవంతిలో కలిపేందుకు పెద్దగా ప్రయత్నాలు జరగ లేదు. 1996లో వచ్చిన పెసా(పీఈఎస్ఏ– షెడ్యూల్డ్ ప్రాంతాలకుపంచాయతీల విస్తరణ) చట్టం, 2006 నాటి అటవీ హక్కుల చట్టం (ఫారెస్ట్ రైట్స్ యాక్ట్) ఆదివాసులకు జరుగుతూ వచ్చిన అన్యాయాల పరిష్కారం దిశగా మైలురాళ్లుగా చెప్పుకోవచ్చు. పెసా చట్టం అడవి బిడ్డల సంప్రదాయిక వనరుల నిర్వహణ విధానాలను ఆమోదిస్తూ, వారి స్వయం పాలనకు వీలు కల్పించేందుకు తీసుకువచ్చారు. ఎఫ్ఆర్ఏ చట్టం ఇంకొక అడుగు ముందుకు వేసి చారిత్రకంగా ఆది వాసులకు అటవీ హక్కుల విషయంలో జరిగిన అన్యాయాలకుముందుమాటలో క్షమాపణ చెప్పింది. ఉద్దేశాలు ఉన్నతంగా ఉన్న ప్పటికీ ఈ చట్టాల అమలు సంతృప్తికరంగా లేదు. పాలనా యంత్రాంగంలోని కొన్ని వర్గాల వ్యతిరేకత, రాష్ట్ర చట్టాలతో సరైన అనుసంధానం లేకపోవడం వల్ల ఈ చట్టాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాల అమలు విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర కాస్త మెరుగైన స్థానంలో ఉంది. చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ వల్ల ఇది సాధ్యమయింది. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులలో ఐదు శాతం నేరుగా గ్రామ పంచాయతీలకు, గ్రామసభలకు అందించాలని ఆయన నిర్దేశించడం వల్ల షెడ్యూల్డ్ ప్రాంతాలలోని ఆదివాసీ పల్లెల సాధికా రీకరణకు మార్గం సుగమమైంది. వెదురు, బీడీ ఆకుల వంటి చిన్న చిన్న అటవీ ఉత్పత్తులపై గ్రామ సభలకు హక్కులు పునరుద్ధరించారు. తద్వారా అడవులను నమ్ముకున్న స్థానికులకు ఆదాయం పొందే అవకాశం కల్పించారు. గిరిజన గ్రామసభలు అటవీ ఉత్పత్తుల విక్రయం ద్వారా నెలకు 10 నుంచి 80 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాయి. ఆదాయం పొందే అవకాశం కల్పించడం వల్ల ఆదివాసులు అడవుల పరిరక్షణతో పాటు పెంపకం కూడా చేపట్టి ప్రకృతితో తమకున్న అవినాభావ సంబంధాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. దీంతో పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాల వల్ల అడవులు నాశనమవుతాయని కొన్ని వర్గాలు చేసిన ప్రచారంలోని డొల్లతనం కూడా బయటపడింది. పెసా చట్టం అమలులో గడ్చిరోలి జిల్లా దేశంలోనే ముందంజలో ఉండి మార్గదర్శకంగా నిలిచింది. మహారాష్ట్రలో విద్యాసాగర్ రావు చొరవతో 20 లక్షల ఎకరాల అటవీ భూమి నిర్వహణ బాధ్యతను స్థానిక ఆదివాసీ గ్రామసభలకు అప్పగించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ అనుభవాలను పాఠాలుగా తీసుకొని సుస్థిరాభివృద్ధిలో ఆదివాసులను భాగస్వాములను చేయాలి.పర్యావరణ హిత ఉపాధి అవకాశాలుసాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. పరిశ్రమలు ఉపాధికి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ వాటినుంచి వెలువడే వ్యర్థాల వల్ల గాలీ, నీరూ కలుషితమై రకరకాల రోగాలు ప్రబలుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి విధ్వంస కోణా నికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందిస్తారు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. అడవిలో లభ్యమయ్యే పలు వనరులను ప్రపంచానికి అవసరమయ్యే ఉత్పత్తులుగా మలిస్తే పర్యావరణానికి ఏ మాత్రం ముప్పు లేకుండా ఆదివాసులకు ఉపాధి లభిస్తుంది, దేశ ఆర్థికాభివృద్ధిలో వారు భాగస్వాములవుతారు.అడవులలో విస్తృతంగా లభించే వెదురు ద్వారా ప్రపంచానికి అవసరమయ్యే అనేక ఉత్పత్తులను తయారు చేయవచ్చు. గృహోపకర ణాల నుంచి దుస్తుల దాకా సంగీత పరికరాల నుంచి ఔషధాల దాకా రకరకాల అవసరాలకు వెదురును ఉపయోగిస్తున్నారు. అటవీ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థలు ముందుకు వచ్చి ఆదివాసులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రోత్స హించాలి. మహారాష్ట్రలో ఒక విశ్వవిద్యాలయం, మరో స్వచ్ఛందసంస్థ కలిసి ఆదివాసులకు వెదురు నుంచి రాఖీలు తయారు చేయడంలో శిక్షణ ఇచ్చాయి. మిగతా రాష్ట్రాలలో కూడా స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకొని ఆదివాసులకు ఆసరాగా నిలవాలి. సేంద్రీయ ఉత్ప త్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అడవిలో లభించే వనరుల ద్వారా సబ్బులు, షాంపూలు, సుగంధ ద్రవ్యాలు తయారు చేయవచ్చు. వీటికి ఎక్కువ ధర చెల్లించడానికి కూడా వినియోగ దారులు వెనకాడటం లేదు. కాబట్టి స్టార్టప్ కంపెనీలు కూడా అటవీ ఉత్పత్తులపై దృష్టి సారించాలి.ఆదివాసులకు ఆత్మగౌరవం ఎక్కువ. అవసరమైతే ఉపవాసమైనా ఉంటారు కానీ ఇంకొకరి ముందు చేయి చాచడానికి ఇష్టపడరు. అటువంటి వారికి ఆసరాగా నిలబడి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనిస్తే తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది. అంతే కాకుండా వేల ఏళ్లుగా ప్రతిఫలాపేక్ష లేకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ వస్తున్న అడవిబిడ్డల రుణం తీర్చుకున్నట్లవుతుంది.- వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్మొబైల్ : pvg@ekalavya.net - పి. వేణుగోపాల్ రెడ్డి -
ఇండ్రస్టియల్ ఆల్కహాల్‌పై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలదే
న్యూఢిల్లీ: పారిశ్రామిక(ఇండ్రస్టియల్) ఆల్కహాల్ ఉత్పత్తి, సరఫరా నియంత్రపై చట్టాలు చేసే చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 1990లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచి్చన తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రాష్ట్రాలకు ఈ విషయంలో ఉన్న అధికారాన్ని తొలగించలేమని తేలి్చచెప్పింది. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఉత్పత్తి, సరఫరాపై నియంత్రణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని ధర్మాసనం వెల్లడించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 8:1 మెజారీ్టతో బుధవారం తీర్పును ప్రకటించింది. అయితే, ఈ తీర్పుతో ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న విభేదించారు. 1990లో సింథటిక్స్, కెమికల్స్ కేసులో అప్పటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇండ్రస్టియల్ ఆల్కహాల్ ఉత్పత్తిని నియంత్రించే అధికారం కేంద్రానికి ఉందని తీర్పు ఇచి్చంది. దీనిపై పలు అభ్యంతరాలు వచ్చాయి. 2010లో ఈ అంశాన్ని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనానికి సమీక్ష కోసం పంపించారు. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది మానవ వినియోగం కోసం కాదని ఈ ధర్మాసనం పేర్కొంది. -
Mamata Banerjee: రేపిస్టులకు మరణశిక్షే
కోల్‌కతా: అత్యాచారం కేసుల్లో మరణశిక్ష విధించేలా చట్టాలను సవరిస్తామని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. వచ్చేవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను పెట్టి ఈ బిల్లును ఆమోదిస్తామన్నారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రేప్ లాంటి నేరాలను తాము ఏమాత్రం ఉపేక్షించబోమని మమత అన్నారు. అత్యాచారానికి మరణశిక్ష విధించే సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంలో ఆలస్యం చేసినా, రాష్ట్రపతికి పంపినా.. తాను రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తానని ప్రకటించారు. రేప్ కేసుల్లో దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టం తేవాలని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి టీఎంసీ శనివారం నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేస్తుందని తెలిపారు. గవర్నర్ తమ బిల్లును తొక్కిపెడితే రాజ్‌భవన్ ఎదుట మహిళలతో పెద్ద ఎత్తున ధర్మా చేస్తామని మమత అన్నారు. టీఎంసీ ఛాత్ర పరిషద్ వ్యవస్థాపక దినోత్సవం ర్యాలీని ఉద్దేశించి మమత బుధవారం ప్రసంగించారు. రాజ్‌భవన్‌లో తనను లైంగిక వేధింపులకు గురిచేశారని గతంలో ఒక ఉద్యోగిని ఆరోపించడాన్ని ప్రస్తావించారు. గవర్నర్ సి.వి.ఆనంద బోస్ తమ ప్రభుత్వంపై, టీఎంసీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 20 రోజులుగా సమ్మెలో ఉన్న జూనియర్ డాక్టర్లను తక్షణం విధుల్లో చేర్చాల్సిందిగా కోరారు. ‘తమ సహచరిణికి న్యాయం కోరుతున్న డాక్టర్ల ఆవేదన పట్ల నేను మొదటినుంచీ సానుభూతితోనే ఉన్నాను. ఘటన జరిగి చాలా రోజులు గడిచిపోయినా జూనియర్ డాక్టర్లపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు దిగలేదు. వారి ఆవేదనను అర్థం చేసుకోగలం. కానీ రోగులు ఇబ్బందిపడుతున్నారు. దయచేసి విధుల్లోకి తిరిగిరండి’ అని మమత విజ్ఞప్తి చేశారు. మెడికోల కెరీర్‌కు ఇబ్బంది రాకూడదనే ఒక్క డాక్టర్‌పై కూడా ఎఫ్ఐఆర్ను నమోదు చేయలేదన్నారు. ‘ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ స్వా«దీనం చేసుకొని 16 రోజులు అయింది. దర్యాప్తు పురోగతిని సీబీఐ బయటపెట్టాలి’ అని మమత డిమాండ్ చేశారు. శవాలపై రాజకీయ లబ్ధి పొందాలనే బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపిచి్చందని ధ్వజమెత్తారు. వైద్యురాలి హత్యను చూపి బీజేపీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటోందని మండిపడ్డారు. ప్రధాని ఎందుకు రాజీనామా చేయలేదు? ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లపై మమతా తీవ్రంగా స్పందించారు. ‘ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, మణిపూర్‌లతో మహిళలపై లైంగిక దాడులు, హింసను నిరోధించలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు రాజీనామా చేయలేదని నేను బీజేపీ అడుగుతున్నా. అస్సాంలో ఒక నిందితుడినే ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, భవిష్యత్తులో గెలవలేమని తెలుసు కాబట్టే తన రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఆరి్టఫిషియల్ ఇంటలిజెన్స్‌ను వాడి బీజేపీ పెద్ద ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడుతోందని, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తోందని ఆరోపించారు. దుర్గా పూజ సంబరాలను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర పన్నిందన్నారు. బెంగాల్ తగలబెడితే.. ఢిల్లీ కూడా బెంగాల్‌ను అపఖ్యాతి పాల్జేయడానికి కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి కుట్ర పన్నారని బీజేపీపై మమత ధ్వజమెత్తారు. బెంగాల్‌ను తగలబెడితే అసోం, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ, యూపీల్లోనూ అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం సిగ్గుచేటని బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి సుకాంత మజుందార్ అన్నారు. బెంగాల్లో శాంతిభద్రతలు కాపాడాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చేసిన ఫిర్యాదులో కోరారు. -
‘కొత్త నేర చట్టాలకు హిందీ పేర్లు రాజ్యాంగ విరుద్దం’
ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలకు హిందీ, సంస్కృతంలో పేర్లను పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జూలై ఒకటి నుంచి ఈ చట్టాలు అమలులోకి వచ్చాయి.తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆర్. మహదేవన్, జస్టిస్ మహ్మద్ షఫీక్‌ల డివిజన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. తూత్తుకుడికి చెందిన న్యాయవాది బి. రామ్‌కుమార్ ఆదిత్యన్ ఈ మూడు కొత్త చట్టాల పేర్లను ఇంగ్లీషులోకి మార్చాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023, భారతీయ సాక్ష్య అధినియం-2023... ఈ మూడు చట్టాల పేర్లను ఇంగ్లీషులోకి మార్చాలని రామ్‌కుమార్ తన పిటిషన్లో కోరారు.దేశంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ తొమ్మిది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే హిందీ అధికార భాషగా ఉందన్నారు. దేశంలో 43.63% జనాభాకు మాత్రమే హిందీ మాతృభాష అని, మిగిలిన వారు ఇతర భాషలు మాట్లాడుతుంటారని ఆయన ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, దేశంలోని మూడు ముఖ్యమైన క్రిమినల్ చట్టాలకు హిందీ, సంస్కృతంలో పేర్లు పెట్టడం సమంజసం కాదన్నారు. హిందీ రాని వారికి ఈ చట్టాల పేర్లు ఇబ్బందికరంగా మారుతాయని ఆయన పేర్కొన్నారు. -
నిరంతర పఠనంతో చట్టాలపై అవగాహన
సాక్షి, హైదరాబాద్: నిరంతర పఠనంతోనే చట్టాలపై అవగాహన పెంపొందుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ యువ న్యాయవాదులకు సూచించారు. మారుతున్న కాలానుగుణంగా చట్టాల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలపై న్యాయవాదులకు జ్యుడీషియల్ అకాడమీ, బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమీలో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ శ్యామ్ కోషి కార్యక్రమాన్ని ప్రారంభించారు. న్యాయవాదుల కోసం అకాడమీ, బార్ కౌన్సిల్ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అకాడమీని జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ శ్యామ్ కోషి ప్రశంసించారు. దాదాపు 400 మంది న్యాయవాదులు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ఎం.రాజేందర్, డిప్యూటీ డైరెక్టర్ వెంకట్రామ్, బార్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మణ్‌కుమార్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
నీ రైట్ కోసం ఫైట్!
నగరాల్లోని వారికీ తెలియక..ఇతర దేశాల్లో వినియోగదారుల హక్కులకు ప్రాధాన్యత ఎక్కువ. మన దేశంలో అంతంత మాత్రమే. చట్టాలున్నా వాటి అమలులో తీవ్ర నిర్లక్ష్యం ఉంది. గ్రామీణ ప్రజలే కాదు.. నగరాల్లోని వారికి కూడా వినియోగదారుల కమిషన్లను ఎలా ఆశ్రయించాలో తెలియదు. చెప్పుకోవడానికే చట్టాలు అన్నట్టుగా వ్యవస్థ తయారైంది. ప్రభుత్వం ఇతర కోర్టులతోపాటు ఈ కమిషన్లనూ అభివృద్ధి చేసి, ప్రజల చెంతకు చేర్చాలి. చట్టప్రకారం జిల్లాకో కమిషన్ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేస్తే దగ్గరలో సత్వర న్యాయం అందే అవకాశం ఉంటుంది.– ఆకాశ్ బాగ్లేకర్, న్యాయవాది, వినియోగదారుల చట్టాల పుస్తక రచయిత సాక్షి, హైదరాబాద్:⇒ దుర్గాభాయ్ దేశముఖ్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి బేగంపేట్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షాపులో రూ.66 వేలు వెచ్చించి ఓ టీవీ కొనుగోలు చేశారు. కొన్ని రోజులకే టీవీ పనిచేయడం మానేసింది. కస్టమర్ కేర్‌ను సంప్రదించి మరమ్మతులు చేయించినా లాభం లేకపోయింది. దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. పరిశీలించిన కమిషన్.. రూ.66 వేలు రీఫండ్ చేయాలని, అదనంగా రూ.13 వేలు పరిహారం, రూ.5 వేలు కేసు ఖర్చుల కింద వినియోగదారుడికి ఇవ్వాలని ఆదేశించింది. మరో రూ.5 వేలు కన్జ్యూమర్ లీగల్ ఎయిడ్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది.⇒ అధిక బరువుతో బాధపడుతున్న ఓ వ్యక్తి బరువు తగ్గించే చికిత్స కోసం ఒక ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థను సంప్రదించారు. ఈ మేరకు చికిత్స అందిస్తామని హామీ ఇచ్చిన సంస్థ.. రూ.1,30,000 ఫీజును ఈఎంఐ రూపంలో వసూలు చేసింది. కానీ ఆయన ఎంతకీ బరువు తగ్గకపోగా ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడింది. దీంతో తాను చెల్లించిన మొత్తం రీఫండ్ చేయాలని సంస్థను కోరారు. కానీ సంస్థ స్పందించకపోవడంతో.. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్ రూ.1,30,000 సొమ్మును 12 శాతం వడ్డీతో కలిపి రీఫండ్ చేయాలని.. కేసు ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని సంస్థను ఆదేశించింది...వస్తువులు, సేవల్లో లోపాల వల్ల ప్రజలు నష్ట పోయిన మొత్తాన్ని తిరిగి పొందేందుకు విని యోగదారుల కమిషన్లు తీసుకున్న చర్యలు ఇవి. కానీ మనలో చాలా మందికి సరైన అవగాహన లేక, నష్టపోయినా భరించి ఊరుకుండిపోతున్నారు.చట్టం ఎంత బలంగా ఉన్నా.. అమల్లో నిర్లక్ష్యం ఉంటే ఫలితం శూన్యం. ఎవరికోసమైతే ఆ చట్టం చేశామో.. అదొకటి ఉందని వారికి తెలియక పోతే నిష్ప్రయోజనం. అలాంటివే వినియోగదారుల చట్టాలు. గ్రామీణులకే కాదు నగరాల్లో ఉండే వారికి కూడా వాటిపై అవగాహన అంతంతే. ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లోనూ వినియోగదారుల హక్కులేమిటో తెలియని వారు కోకొల్లలు. ప్రభుత్వం కూడా వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించడంపై ఫోకస్ పెట్టని పరిస్థితి. ఏదో తూతూ మంత్రంగా అప్పుడప్పుడు ఏవో కార్యక్రమాలు నిర్వహించడం మినహా పెద్దగా చేస్తున్నదేదీ లేదు. నిజానికి వినియోగదారులు కాని ప్రజలంటూ ఎవరూ ఉండరు. అందుకే అందరూ ఈ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని.. సేవలను హక్కుగా పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.2020లో మార్పులు చేశాక..1986 నుంచి ఉన్న వినియోగదారుల చట్టంలో మార్పులు చేర్పులు చేసి వినియోగదారుల రక్షణ చట్టం–2019ను రూపొందించారు. అది 2020 జూలై 20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. వినియోగ దారుల ఫిర్యాదు లను మరింత వేగంగా పరిష్కరించడా నికి ఇది దోహదం చేస్తోంది. ఈ చట్టం ద్వారా సెంట్రల్ కన్సూ్యమర్ ప్రొటె క్షన్ అథారిటీ (సీసీపీఏ)ని స్థాపించారు. దీనిద్వారా వినియోగదారుల హక్కులను ప్రోత్సహిస్తూ, పరిరక్షిస్తు న్నారు. అలాగే వినియోగదారుల ఫోరంను వినియోగదారుల వివా దాల పరిష్కార కమిషన్ మార్చారు.వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు ఎలా చేయాలి..⇒ వస్తువు లేదా సేవ కోసం చేసిన ఖర్చు విలువ రూ.50 లక్షల వరకు అయితే.. జిల్లా కమిషన్‌లో ఫిర్యాదు చేయాలి. రూ.2 కోట్ల వరకు అయితే రాష్ట్ర కమిషన్‌లో, అంతకుమించితే జాతీయ కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేయాలి.⇒ రాష్ట్ర కమిషన్‌తోపాటు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు హైదరాబాద్‌లో ఉన్నాయి.⇒ ఆన్లైన్ ద్వారా లేదా కమిషన్ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ⇒ దేశవ్యాప్తంగా టోల్ ఫ్రీ నంబర్ 180042500333కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.వినియోగదారుల కమిషన్ల వివరాలివీ..జాతీయ వినియోగదారుల కమిషన్..ఉపభోక్య న్యాయభవన్ఎఫ్ బ్లాక్, జీపీవో కాంప్లెక్స్ఐఎన్ఏ, న్యూఢిల్లీ–110023ఈ–మెయిల్: ఎన్సీడీఆర్సీ ఎట్‌దిరేట్ ఎన్ఐసీ డాట్ ఇన్ఫోన్ నంబర్: 011–24608724⇒ ఇందులో అధ్యక్షుడితోపాటు 11 మంది సభ్యులు ఉంటారు. నేరుగా వేసే పిటిషన్లతోపాటు అప్పీళ్లను కూడా ఎన్సీడీఆర్సీ విచారణ చేస్తుంది. వినియోగదారుల రక్షణ చట్టం–2019లో పేర్కొన్న నిబంధనల ప్రకారం జాతీయ కమిషన్ పనిచేస్తుంది.తెలంగాణ రాష్ట్ర కమిషన్..ఏరువాక బిల్డింగ్, శ్రీధర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా.., ఆనంద్‌నగర్, ఖైరతాబాద్, హైదరాబాద్ఈ–మెయిల్: ఎస్సీడీఆర్సీ–టీఎస్ ఎట్‌దిరేట్ ఎన్ఐసీ డాట్ ఇన్మీనా రామనాథన్, ఇన్చార్జి అధ్యక్షురాలు, ఫోన్: (040) 23394399కె.రంగారావు, సభ్యుడు, ఫోన్: (040) 23394399వీవీ శేషుబాబు (జ్యుడీషీయల్) సభ్యుడు..ఆర్ఎస్ రాజశ్రీ, సభ్యురాలు..వీపీ వెంకటరమణమూర్తి, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఫోన్: 23394399రెండేళ్లలోపు కేసు వేయాలి..⇒ వినియోగదారుల కమిషన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొందరికి అవగాహన ఉన్నా.. కమిషన్‌ను ఎలా సంప్రదించాలో తెలియదు. కాజ్ ఆఫ్ యాక్షన్ (సమస్య ఎదురైనప్పటి) నుంచి రెండేళ్లలోపు కేసు దాఖలు చేయాలి. తర్వాత పెడితే కేసు చెల్లదు. ఏవైనా బలమైన కారణాలుంటే సెక్షన్ 24ఏ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. కొందరు అనవసర కేసులు వేస్తూ విలువైన కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారు. దీంతో నిజంగా లబ్ధిపొందాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు.– మీనా రామనాథన్, రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇన్చార్జి అధ్యక్షురాలుమధ్యంతర ఉత్తర్వులిస్తాం..⇒ రాష్ట్ర కమిషన్‌కు ఎక్కువగా అప్పీల్ కేసులు వస్తున్నాయి. దీంతో పరిష్కారంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కమిషన్‌కు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఓ బిల్డర్ వద్ద ప్లాట్ కొనుగోలు చేశారు. బిల్డర్ ఆ ప్లాట్‌ను రిజిస్టర్ చేయకుండా మరొకరికి అమ్ముతున్నప్పుడు కమిషన్‌ను సంప్రదిస్తే.. ఆ లావాదేవీని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉంటుంది. – పి.భాస్కర్, కోర్టు ఆఫీసర్, రాష్ట్ర కమిషన్చదువుకున్నా అవగాహన తక్కువే..⇒ డిగ్రీ చదివినా కూడా నాకు వినియోగదారుల కమిషన్‌ను ఎలా ఆశ్ర యించాలో తెలియదు. ఎక్కడా ఎలాంటి అవగా హన కార్యక్రమం చేపట్టగా చూడలేదు. కోర్టులు తెలుసుగానీ, వినియోగదారుల కమిషన్‌లో ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది.– ఉపేందర్‌రెడ్డి, ఉప్పల్, హైదరాబాద్⇒ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్‌సీడీఆర్‌సీ ఏర్పాటైంది. 2015లో తొలి అధ్యక్షుడిగా జస్టిస్ బీఎన్.రావు నియమితుల య్యారు. 2018 వరకు పనిచేశారు. తర్వాత జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ నియమితులయ్యారు.⇒ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాకు ఒక జిల్లా కమిషన్ ఉండగా.. హైదరాబాద్ జిల్లాలో మాత్రం మూడు కమిషన్లు ఉన్నాయి.⇒ జిల్లా వినియోగదారుల కమిషన్లలో నేరుగా వినియోగదారుడే వాదనలు వినిపించుకోవచ్చు లేదా న్యాయవాదిని నియమించుకోవచ్చు.⇒ న్యాయస్థానాలే అయినా వినియోగదారులు స్థానిక భాషలో వాదనలు వినిపించుకునే అవకాశం ఉంది.⇒ జిల్లా కమిషన్‌కు రాష్ట్ర కమిషన్, రాష్ట్ర కమిషన్‌కు జాతీయ కమిషన్ అప్పీలేట్గా వ్యవహరిస్తాయి. జాతీయ కమిషన్ తీర్పులను సుప్రీంకోర్టులో మాత్రమే సవాల్ చేయవచ్చు. ఇతర ఏ కోర్టులూ ఈ తీర్పుల్లో జోక్యం చేసుకోలేవు.హైదరాబాద్ జిల్లా కమిషన్లు..జిల్లా వినియోగదారుల కమిషన్–1, 2, 3చంద్రవిహార్ కాంప్లెక్స్, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్ఫోన్ నంబర్లు: 040–24733368, 040–24747733, 040–24746001రంగారెడ్డి జిల్లా కమిషన్..రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ఎన్టీఆర్ నగర్, ఎల్బీనగర్, రంగారెడ్డి ఫోన్: 040–24031275 -
ఖతార్‌లో అత్యాచారానికి విధించే శిక్ష ఎంత కఠినం?
ఖతార్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. భారతదేశానికి చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్లకు ఖతార్ మరణశిక్ష విధించింది. వారందరినీ కొన్ని నెలల క్రితం అరెస్టు చేశారు. వారు గూఢచర్యానికి పాల్పడ్డారని ఖతార్ దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ నేపధ్యంలో ఖతార్‌లో అమలయ్యే వివిధ శిక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని కఠినమైన చట్టాలను ఖతార్ అమలు చేస్తోంది. వీటిలో అత్యాచారానికి సంబంధించిన చట్టం కూడా ఉంది. ఈ శిక్ష గురించి తెలిస్తేచాలు ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఖతార్‌లో ఒక్కో రకమైన నేరానికి ఒక్కో రకమైన శిక్ష విధిస్తారు. ముఖ్యంగా చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలు, అత్యాచారాలకు కఠినమైన శిక్షలు అమలు చేస్తారు. దేశంలో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. మరోమారు ఇటువంటి నేరం చేసే సాహసం చేయలేని రీతిలో శిక్ష విధిస్తారు. ఖతార్‌లో అత్యాచారానికి పాల్పడిన నేరస్తులపై రాళ్లతో దాడిచేస్తారు. తరువాత వారి శరీర భాగాలను కూడా నరికివేస్తారు. అంతేకాదు ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. అంటే అత్యాచారానికి పాల్పడిన తర్వాత దోషికి వీలైనంత త్వరగా శిక్ష పడుతుందన్నమాట. కాగా ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా అత్యాచారాలకు కఠినమైన శిక్షలు విధించే నిబంధనలున్నాయి. ముస్లిం దేశమైన కువైట్‌లో కూడా అత్యాచార నిందితులకు ఏడు రోజుల్లో మరణశిక్ష విధిస్తారు. అదేవిధంగా ఇరాన్లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని 24 గంటల్లో అంతమొందిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కాల్చివేసే శిక్ష అమలు చేస్తారు. ఈ శిక్ష వారంలోపు విధిస్తారు. సౌదీ అరేబియాలో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జననాంగం కోయడం లేదా ఉరి శిక్ష అమలు చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాలను రూపొందించిన దేశాల జాబితాలో ఖతార్ కూడా ఉంది. ఖతార్ తొలిసారిగా ఫిఫా ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఈ చట్టాలు, నియమాలు ప్రపంచానికి మరింతగా తెలిశాయి. ఇది కూడా చదవండి: హమాస్‌ను మట్టికరిపించిన 13 మంది మహిళలు -
గల్ఫ్ చట్టాలు తెలియకే..
గల్ఫ్ దేశాల చట్టాలపై కనీస అవగాహన కూడా లేకపోవడంతో పలువురు భారతీయులు జైళ్ల పాలవుతున్నారు. మన దేశానికి చెందిన కొన్ని రకాల మందులను గల్ఫ్ దేశాలు నిషేధించాయి. ఇది కూడా తెలియనివారు అనేకమంది ఉన్నారు.ఉపాధి కోసం ఎడారి బాట పట్టేవారిలో డిగ్రీ కూడా దాటని వారే అధికంగా ఉంటున్నారు. ఇలాంటి వారిని విడిపించడానికి మన విదేశాంగ శాఖ చొరవ తీసుకోవాల్సి ఉంది. కేంద్రం ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్‌కు నిధులు కేటాయించి గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయసాయం అందించాలి. –మోర్తాడ్ (బాల్కొండ)/జగిత్యాల క్రైం కొందరు ఇలా.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఒళ్లు నొప్పులు తగ్గడానికి వేసుకునే మందులతో పట్టుబడి ఆబుదాబిలోని సుహాన్ సెంట్రల్ జైలులో మగ్గుతున్నాడు. ఇది గడిచిన జనవరిలో జరగ్గా, విచారణ ఖైదీగా జైలుకు పరిమితమయ్యాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ఓ యువ ఇంజినీర్ జాతీయభద్రత కేసులో నాలుగేళ్ల కింద అరెస్టు అయ్యాడు. అప్పటినుంచి అబుదాబి జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, జగిత్యాల జిల్లా కన్నాపూర్, కామారెడ్డి జిల్లా కరడ్‌పల్లికి చెందిన యువకులు నిషేధిత మందులతో పట్టుబడి జైల్లోనే ఉండిపోయారు. దౌత్య, న్యాయ సాయం అందించాలి విదేశీ జైళ్లలో ఉన్న వారికి మన విదేశాంగశాఖ కార్యాలయాల ద్వారా దౌత్యసాయం అందించాలి. న్యాయసాయం అందించి విడుదల అయ్యేలా చూడాలి. రాయభార కార్యాలయాల్లో ప్యానల్ లాయర్ల సంఖ్య పెంచాలి. వలస వెళ్లే కార్మికులకు గల్ఫ్ చట్టాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక సదస్సులు నిర్వహించాలి. – చెన్నమనేని శ్రీనివాసరావు, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, గల్ఫ్ జేఏసీ నేత రాజ్యసభలో ప్రశ్నతో.. ఇటీవల రాజ్యసభలో ఎంపీలు డాక్టర్ మనోజ్ రాజోరియా, రంజితా కోలి, సుమేధానంద సరస్వతిలు గల్ఫ్ జైల్లో మగ్గుతున్న భారతీయుల సంఖ్య ఎంత అంటూ ప్రశ్నించారు. దీనికి విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ సమాధానం ఇస్తూ గల్ఫ్ దేశాల్లోని వివిధ జైళ్లలో మగ్గుతున్న వారు 4,630 మంది ఉన్నారని చెప్పారు. -
ప్రేమించిన వ్యక్తితో సహజీవనం.. పుట్టిన పిల్లలకు ఆస్తి వస్తుందా?
భారత చట్టాల గురించి మీకు ఈ విషయాలు తెలుసా? హిందూ అడాప్షన్ అండ్ మెయిన్టెనెన్స్ యాక్ట్ 1956 దేశంలోని ఏ ఒంటరి స్త్రీ అయినా పిల్లలను దత్తత తీసుకునే హక్కును కల్పిస్తోంది ఈ చట్టం. అమ్మాయి.. అబ్బాయి అనే తేడా లేకుండా వాళ్లకు నచ్చిన పిల్లల్ని దత్తత తీసుకునే వెసులుబాటును ఇస్తోంది. అయితే ఇదే వెసులుబాటును ఒంటరి పురుషులకు ఇవ్వడం లేదు ఈ చట్టం. ఒకవేళ ఒంటరి పురుషుడెవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలను కుంటే కేవలం అబ్బాయిని మాత్రమే దత్తత తీసుకోవచ్చు. అమ్మాయిని కాదు. ఒకవేళ అమ్మాయినే దత్తత తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ చట్టంలోని సెక్షన్ 11 (3) ప్రకారం తన కన్నా 21 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని మాత్రమే దత్తత తీసుకునే వీలు కల్పిస్తోంది. అంటే దత్తత తీసుకోవాలనుకుంటున్న వ్యక్తికి.. దత్తతకు వెళ్లబోతున్న అమ్మాయికి కనీసం 21 ఏళ్ల వయసు అంతరం ఉండాలన్నమాట. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మేజర్లు అయిన అమ్మాయి, అబ్బాయి సహజీవనం చేస్తుంటే దాన్ని చట్టబద్ధమైన బంధంగానే భావించాలని చెబుతోంది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21. దీని ప్రకారం ఏ వ్యక్తికైనా జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. సహజీవనం కూడా దాని కిందకే వస్తుంది. దేశంలో.. 2005 నుంచి సహజీవనం చట్టబద్ధం అయింది. సహజీవనం చేస్తున్న జంటకు పుట్టిన పిల్లలకు ఆస్తిహక్కునూ కల్పిస్తోందిది. జీవించే హక్కు,ఆర్టికల్ 21 దేశంలోని పౌరులు అందరికీ జీవించే హక్కును కల్పిస్తోంది ఈ ఆర్టికల్. ప్రభుత్వంతో సహా ఎవరికీ ఎవరి జీవితాన్ని హరించే హక్కు లేదు. పైపెచ్చు దేశంలోని ప్రతి పౌరుడి జీవితానికి ప్రభుత్వం భద్రత కల్పించాలి. ఎవరి జీవితమైనా ప్రమాదంలో పడితే వారిని రక్షించేందుకు కావలసిన చర్యలను ప్రభుత్వం చేపట్టాలి. జీవించే హక్కుకు అవరోధం కల్పిస్తున్నవారిలో ప్రభుత్వ అధికారులనూ బాధ్యులను చేస్తుందీ ఆర్టికల్. ప్రభుత్వాల జోక్యం వల్ల కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే బాధ్యుల మీద విచారణను కోరే హక్కును పౌరులకు అందిస్తోందీ ఆర్టికల్. చదువుకునే హక్కు, ఆర్టికల్ 21 (ఏ).. ఇది దేశంలోని ఆరేళ్ల నుంచి పద్నాలుగేళ్ల లోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్య హక్కును కల్పిస్తోంది. దీని ప్రకారం దేశంలోని ప్రైవేట్ బడులన్నీ ఉచిత విద్య కింద 25 శాతం సీట్లను రిజర్వ్ చేయాలి. ఆ ఖర్చును ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వామ్యం కింద ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు ప్రభుత్వ గుర్తింపు లేని బడులను రద్దు చేస్తుంది. అలాగే డొనేషన్లు, కార్పొరేట్ ఫీజులు వసూలు చేయకూడదని చెబుతోంది. స్కూళ్లల్లో పిల్లల ప్రవేశ సమయంలో స్కూల్ సిబ్బంది.. పిల్లలను, పిల్లల తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడాన్నీ నిషేధిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఎలిమెంటరీ స్కూల్ విద్య అయిపోయే సమయానికి ఏ విద్యార్థినీ ఫెయిల్ చేయడం కానీ.. పై తరగతికి పంపకుండా మళ్లీ అదే తరగతిలో ఉంచడం కానీ.. బడి నుంచి బహిష్కరించడం కానీ చేయకూడదు. అంతేకాదు బోర్డ్ ఎగ్జామ్ తప్పకుండా పాస్ కావాలనీ బలవంతపెట్టకూడదు. చదువులో వెనుకబడిన పిల్లలను అలా వదిలేయకుండా తోటివారికి సమంగా తయారు చేయాలనీ చెబుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ 1988 మోటార్ వెహికిల్ యాక్ట్, సెక్షన్ 185, 202 ప్రకారం.. మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నప్పుడు.. వంద మిల్లిలీటర్ల రక్తం నమూనాలో 30 మిల్లీ గ్రాముల మద్యం ఉంటే గనుక అరెస్ట్ వారెంట్ లేకుండానే పోలీసులు వాహనం నడుపుతున్న వారిని అరెస్ట్ చేయొచ్చు. ఇదే చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం.. టూ వీలర్‌ను నడిపేవాళ్లు తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందే. పార్ట్ 128.. టూ వీలర్ మీద ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలని చెబుతోంది. ఒకవేళ.. ఏ కారణం లేకుండా ట్రాఫిక్ పోలీసులు.. పౌరుల వాహనం తాళం చెవిని లేదా డాక్యుమెంట్స్‌ను తీసుకుంటే ఆ దృశ్యాన్ని ఫొటో తీసి.. ట్రాఫిక్ పోలీసుల మీద ఫిర్యాదు చేసే హక్కునూ కల్పిస్తోందీ చట్టం. -
మీకు తెలుసా?ఆఫీస్‌లో గర్భిణీలతో అలాంటి పనులు చేయించకూడదు
మీరు టూ వీలర్ డ్రైవ్ చేస్తున్నారు.. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఫాలో అవుతూ! హెల్మెట్ పెట్టుకున్నారు.. ఆర్సీ.. డ్రైవింగ్ లైసెన్స్‌ను క్యారీ చేస్తున్నారు.. బండికి ఇన్సూరెన్స్ ఉంది.. పొల్యూషన్ ఫ్రీ సర్టిఫికెట్ కూడా ఉంది.. అయినా ట్రాఫిక్ పోలీస్ మిమ్మల్ని ఆపారు.. మీ బండి కీ లాక్కున్నారు! ఓ ప్రైవేట్ సంస్థ.. తన ఉద్యోగులకు నెల నెలా సరిగ్గా జీతాలే ఇవ్వట్లేదంట!ఇలా చెప్పుకుంటే బోలెడు.. ట్రాఫిక్ పోలీస్ హెరాస్మెంట్ నుంచి ఎమ్ఆర్పీని మించి ధరను వసూలు చేసే దుకాణదారు దాకా! ఎఫ్ఐఆర్ నమోదు చేయననే పోలీస్ నుంచి చెల్లని చెక్ ఇచ్చే పరిచయస్తుల వరకు!అన్నీ సమస్యలే.. అంతటా మోసాలే!అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష అన్నట్టుగానే పైవాటన్నిటీకీ పరిష్కారం హక్కుల రూపంలో మన రాజ్యాంగంలోనే ఉంది! చట్టాలుగా వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం..!! పోలీస్ యాక్ట్ 1861 ప్రతి భారతీయ పౌరుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన యాక్ట్ ఇది. దీని ప్రకారం పోలీస్‌లు 24 గంటలూ విధినిర్వహణలో ఉండాలి యూనిఫామ్ వేసుకున్నా, వేసుకోకపోయినా! మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 దీని ప్రకారం.. ప్రెగ్నెన్సీ వల్ల విధులకు హాజరు కాలేకపోతున్న ఉద్యోగినిని ఉద్యోగంలోంచి తీసేసే హక్కు ఏ యజమానికి, ఏ అధికారికీ లేదు. తీస్తే అది శిక్షార్హమవుతుంది. గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. పదిమంది ఉద్యోగులున్న ప్రతి ప్రైవేట్ సంస్థ గర్భిణీ ఉద్యోగులకు 84రోజుల పాటు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలి. గర్భిణీ ఉద్యోగులతో ఇలాంటి పనులు చేయించకూడదు ఉద్యోగం కోసం వచ్చిన మహిళ.. ప్రసవమై లేదా గర్భస్రావమై ఆరువారాలు దాటలేదని తెలిస్తే.. ఆమెను వెంటనే ఉద్యోగంలో నియమించకూడదు. ఆరువారాలు దాటితేనే నియమించాలి. ప్రసవమై లేదా గర్భస్రావమైన ఉద్యోగిని ఆరు వారాలు దాటితే కాని తిరిగి విధుల్లో చేర్చుకోకూడదు. అలాగే విధులకు సంబంధించి ఎంతటి అత్యవసర పరిస్థితుల్లోనైనా.. గర్భిణీ ఉద్యోగికి గంటలు గంటలు.. అదీ నిలబడి చేసే పనిని అస్సలు అప్పగించకూడదు. అంతేకాదు గర్భస్థ శిశువు మీద ప్రభావం చూపేంత ఒత్తడినీ ఆమె మీద పెట్టకూడదు. గర్భస్రావానికి దారి తీసే పరిస్థితి.. లేదా ఆమె ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపేంత పనినీ ఆమెకు పురమాయించకూడదు. 1955 హిందూ వివాహ చట్టం భార్యభర్తలు విడాకులు పొందాలనుకుంటే ఈ చట్టం ప్రకారం ఆ జంట పెళ్లయిన ఏడాది వరకు ఆగాల్సిందే. పెళ్లయిన ఏడాదిలోపు విడాకులను మంజూరు చేయదీ చట్టం. అయితే ప్రతి చట్టం ఏదో ఒక వెసులుబాటును ఇస్తున్నట్టే ఫ్యామిలీ లా కూడా ఓ వెసులుబాటును కల్పిస్తోంది. అదేంటంటే.. భార్య, భర్తలు ‘పరస్పర అంగీకారంతో’ పెళ్లయిన ఏడాదిలోపు కూడా విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివాహేతర సంబంధం, శారీరక, మానసిక హింస, నపుంసకత్వం, ఇంట్లోంచి చెప్పకుండా వెళ్లిపోవడం, హిందూ మతంలో ఉన్న భాగస్వామి వేరే మతాన్ని స్వీకరించడం, మానసిక వ్యాధులు, మొండి జబ్బులు, ఏడేళ్ల వరకు భాగస్వామి జాడ తెలియకపోవడం వంటి కారణాల కింద భార్య, భర్తల్లో ఎవరైనా విడాకులు కోరవచ్చు. సమాన పనికి సమాన వేతనం 1976, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ప్రకారం.. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది ఒకేరకమైన వాతావరణం.. ఒకేరకమైన పరిస్థితుల్లో ఒకేరకమైన పనిని ఒకేరకమైన సామర్థ్యంతో చేస్తున్నట్లయితే ఎలాంటి భేదభావం చూపకుండా అందరికీ సమాన వేతనమే ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వనట్లయితే సంబంధిత లేబర్ అధికారికి యజమాని మీద ఫిర్యాదు చేయవచ్చు. ఆ అధికారులు విచారణ చేపట్టి.. అవసరమైన చర్యలు తీసుకుంటారు. -
నిబంధనల కోణంలోనే సోషల్ మీడియాను చూస్తాం..
న్యూఢిల్లీ: ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మీదైనా ప్రభుత్వానికి వ్యక్తిగతంగా వ్యతిరేకత ఏమీ ఉండదని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. చట్టాలు, నిబంధనల అమలు కోణంలో మాత్రమే ప్రభుత్వానికి, సోషల్ మీడియాలకు సంబంధం ఉంటుందని ఆయన తెలిపారు. ప్లాట్‌ఫామ్‌లు కచ్చితంగా భారతీయ చట్టాలను గౌరవించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. కోవిన్ ప్లాట్ఫామ్లో డేటా ఉల్లంఘన జరిగిదంటూ వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. టెలిగ్రాం బాట్ ద్వారా బైటికొచ్చిన వ్యక్తిగత సమాచారమేదీ కోవిన్ డేటాబేస్లోనిది కాదని తెలిపారు. ఒక వ్యక్తికి చెందిన డేటాబేస్ నుంచి సదరు సమాచారం లీక్ అయ్యిందని, అదంతా నకిలీదేనని ఆయన చెప్పారు. అయినప్పటికీ, ఆ సమాచారం ఎంత పాతది, ఎక్కడి నుంచి వచ్చింది మొదలైన అంశాలపై విచారణ జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. రైతుల ఆందోళన సమయంలో తాము చెప్పినట్లు చేయకపోతే ట్విటర్‌ను మూసివేస్తామని ప్రభుత్వం బెదిరించిందంటూ కంపెనీ మాజీ సీఈవో జాక్ డోర్సే చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. ఇది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. భారతీయ చట్టాలకు విరుద్ధంగా పని చేస్తున్నప్పటికీ ట్విటర్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని చెప్పారు. -
రైతులకు చట్టాలపై అవగాహన కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: రైతులకు భూమి, నీరు, క్రిమిసంహారక మందులు, మార్కెటింగ్ చట్టాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు పిలుపునిచ్చారు. రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 176 పారా లీగల్ వలంటీర్లను నియమించిందని వెల్లడించారు. గ్రామీణ భవితకు వలంటీర్లు మార్గదర్శకులు కావాలన్నారు. సాగు చట్టాలపై వలంటీర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నల్సార్ యూనివర్సిటీలో బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ నవీన్‌రావు మాట్లాడుతూ.. ‘దేశంలోని రైతుల్లో పేద, మధ్య తరగతి వారే ఎక్కువ. వారికి చట్టాలపై అవగాహన తక్కువ. న్యాయం పొందడం వారి హక్కే అయినా కోర్టులకు వెళ్లి దాన్ని పొందాలంటే ఆర్థిక భారంతో కూడిన పని. కోర్టు గ్రామ స్థాయికి వెళ్లి న్యాయం అందించలేని పరిస్థితి. అందుకే ఇలాంటి వారి కోసం న్యాయ సేవా సంస్థలు ఆవిర్భవించాయి. వారికి న్యాయసేవలు అందించడమే వలంటీర్ల బాధ్యత. దీని కోసం పుట్టిందే ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’. బమ్మెరలో రెండు నెలల క్రితం ప్రారంభించాం. ఇప్పుడు 67 ప్రాంతాల్లో ఇవి ఏర్పాటయ్యాయి. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రెండు రోజుల పాటు జరిగే శిక్షణలో మీకు తెలియనివి నిపుణుల నుంచి తెలుసుకోండి. ప్రతీ చిన్న విషయానికి కోర్టులను ఆశ్రయించకుండా.. గ్రామీణ స్థాయిలో పరిష్కారం అయ్యేలా చూడాలి. మీరు పరిష్కరించలేని సమస్య వచ్చినప్పుడు మండల, జిల్లా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చు’అని సూచించారు. వారియర్లలా పని చేయాలి... సత్వర న్యాయం అందించేందుకు వలంటీర్లు వారియర్లలా పనిచేయాలని నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ శ్రీకృష్ణదేవరావు సూచించారు. పూర్వం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ‘మధ్యవర్తిత్వం’సంప్రదాయాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. లీగల్ సర్విసెస్ అథారిటీ చట్టాలు, పథకాలపై వలంటీర్లకు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ(టీఎస్ఎల్ఎస్ఏ) సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ విద్యుల్లత, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, రిసోర్స్ పర్స న్లు, ట్రైనీ పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. -
డబ్బు రికవరీకి నూతన చట్టాలు తేవాలి
కాచిగూడ: బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును ప్రభుత్వమే రికవరీ చేసే విధంగా నూతన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. కెనరా బ్యాంకు ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర సదస్సు ఆదివారం కాచిగూడలోని మున్నూరుకాపు భవన్, మ్యాడం అంజయ్య హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్ రాంబాబు ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతమున్న చట్టలు, న్యాయ వ్యవస్థలోని లొసుగులను అసరా చేసుకుని బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగవేస్తున్నారని, దీంతో బ్యాంకులు దివాలతీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అదానీ తీసుకున్న రూ.83వేల కోట్లను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేలాలంటే విచారణకు పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. బ్యాంకింగ్ రంగంలోని 3,4 తరగతులలో ఖాళీగా ఉన్న 2లక్షలకు పైగా ఉద్యోగాను వెంటనే బర్తీ చేయాలని, లేదంటే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ భ్యాంకులను నిర్విర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ చేయాలనే అలోచనలను ప్రభుత్వం మానుకోవాలని, లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసన్, వేణుగోపాల్, కె.శ్రీకృష్ణ, కె.హెచ్. పటా్నయక్, సాయి ప్రసాద్, ఎస్. మధుసూదన్, హరివర్మ, తదితరులు పాల్గొన్నారు. -
స్వలింగ సంపర్కం నేరం కాదు: పోప్
వాటికన్ సిటీ: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఆ చట్టాలు పూర్తిగా అనైతికమైనవి. స్వలింగ సంపర్కం నేరం కాదు. దేవుడు తన పిల్లలందరినీ సమానంగా, బేషరతుగా ప్రేమిస్తాడు’’ అని అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘‘స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను కొందరు క్యాథలిక్ బిషప్‌లు కూడా సమర్థిస్తున్నారని నాకు తెలుసు. కానీ నా విజ్ఞప్తల్లా ఒక్కటే. స్వలింగ సంపర్కుల పట్ల కాస్త మృదువుగా వ్యవహరించాలి. వారిని కూడా చర్చిల్లోకి అనుమతించాలి. వారిని స్వాగతించి గౌరవించాలి తప్ప వివక్ష చూపి అవమానించరాదు’’ అని ఆయన సూచించారు. అయితే, స్వలింగ సంపర్కం పాపమేనని పోప్ పేర్కొనడం విశేషం. ‘‘ఇది ఒక దృక్కోణం. కాకపోతే ఈ విషయంలో సాంస్కృతిక నేపథ్యాలు తదితరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మాటకొస్తే ఇతరులపై జాలి, దయ చూపకపోవడమూ పాపమే. కాబట్టి నేరాన్ని, పాపాన్ని విడిగానే చూడటం అలవాటు చేసుకుందాం’’ అన్నారు. క్యాథలిక్ బోధనలు స్వలింగ సంపర్కాన్ని తప్పుడు చర్యగానే పేర్కొంటున్నా స్వలింగ సంపర్కులను కూడా ఇతరులతో సమానంగా గౌరవించాలని చెబుతాయి. క్యాథలిక్ చర్చి ప్రకారం స్వలింగ వివాహాలు నిషిద్ధం. దాదాపు 67 దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. వీటిలోనూ 11 దేశాల్లో ఇందుకు మరణశిక్ష కూడా విధించే ఆస్కారముందని ఈ చట్టాలను రద్దు చేయాలంటూ ఉద్యమిస్తున్న హ్యూమన్ డిగ్నిటీ ట్రస్ట్ పేర్కొంది. అమెరికాలో కూడా 12కు పైగా రాష్ట్రాలు దీన్ని నేరంగానే పరిగణిస్తున్నాయి. ఇలాంటి చట్టాలను రద్దు చేయాలని ఐక్యరాజ్యసమితి కూడా ప్రపంచ దేశాలకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది. -
ఆటో సంస్థలకు నిబంధనల భారం
న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ కంపెనీలు పాటించాల్సిన చట్టాలు, నిబంధనలు అనేకానేకం ఉంటాయి. అయితే, ఆయా కంపెనీల మేనేజ్మెంట్లోని కీలక హోదాల్లో ఉన్న వారికి (కేఎంపీ)వీటిపై అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. టీమ్‌లీజ్ రెగ్‌టెక్ నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఆటోమొబైల్ పరిశ్రమ పాటించాల్సిన నిబంధనలను సరళతరం చేయాల్సిన ఆవశ్యకతపై రెగ్‌టెక్ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం చిన్నపాటి వాహనాల తయారీ సంస్థ ఒక రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించాలంటే వన్‌టైమ్, ఏటా పాటించాల్సిన నిబంధనలు కనీసం 900 పైచిలుకు ఉంటున్నాయి. వన్‌టైమ్ అంశాలైన రిజిస్ట్రేషన్లు, అనుమతుల్లాంటివి పక్కన పెడితే కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి జాబితా కింద పాటించాల్సిన నిబంధనలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందల కొద్దీ చట్టాలు, నిబంధనలను తెలుసుకుని, పాటించడంపై కేఎంపీల్లో అవగాహన అంతంతమాత్రంగానే ఉంటోంది. అనేకానేక నిబంధనలు, తేదీలు, డాక్యుమెంటేషన్ మొదలైనవన్నీ పాటించడం కష్టతరమవుతోంది. ఫలితంగా అనూహ్యంగా షోకాజ్ నోటీసులు అందుకోవడం, పెనాల్టీలు కట్టడం, లైసెన్సులు రద్దు కావడం వంటి పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్య కాలంలో 34 ఆటోమొబైల్ కంపెనీలపై రెగ్‌టెక్ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం గడిచిన ఏడాది కాలంలో తాము పాటించడంలో విఫలమైన కీలక నిబంధన కనీసం ఒక్కటైనా ఉంటుందని 95 శాతం మంది కేఎంపీలు తెలిపారు. అలాగే జరిమానాలు కట్టాల్సి వచ్చిందని 92 శాతం మంది వెల్లడించారు. నియంత్రణపరమైన నిబంధనల అప్డేట్లను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటం సవాలుగా ఉంటోందని 52 శాతం మంది తెలిపారు. -
మానవ హక్కులకు ప్రాణధార
‘చట్టాలు పేద వర్గాలను పీల్చి పిప్పి చేస్తూంటే, ధనిక వర్గం ఆ చట్టాలతోనే పెత్తనం చలాయిస్తూంది’ అన్నాడు గోల్డ్‌స్మిత్. ఆదర్శంలో ప్రతి ఒక్కరూ వారి స్థాయితో నిమిత్తం లేకుండా తమ ఫిర్యాదును న్యాయస్థానానికి నివేదించుకోగలగాలి. అందుకే జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ధోరణు లకు అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించవలసి వచ్చింది. కానీ ‘చట్టాలు సాలెగూడుల్లాంటివి. ఆ గూట్లోకి బలహీనమైన ప్రాణి దూరితే దాని కథ ముగిసినట్టే’ అన్నాడు సోలన్. అందుకే రాజ్యాంగంలోని 32వ అధికరణానికి ఉన్న పరిమితులను సైతం దృష్టిలో ఉంచుకుని మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న న్యాయమూర్తులు ఉన్నారు. అలాంటివారిలో... జస్టిస్ యతిరాజులు ఒకరు. ‘‘ఎంతటి సాధారణ పౌరుడైనా, జీవి తంలో అతడు ఏ స్థానంలో ఉన్నా, దానితో నిమిత్తం లేకుండా న్యాయస్థానంలో తన కేసును హుందాగా వినిపించే హక్కు అతనికి ఉంది. అంతే హుందా తనంతో కోర్టు అతని వాదనను సానుభూతితో వినే మర్యాదనూ పాటించాలి. ప్రజా సమస్యలను వినడానికే న్యాయస్థానాలు ఉన్నాయి. కోర్టులో న్యాయం కోసం వచ్చే పౌరుల్ని యాచకులుగానూ, పీడకులు గానూ చూడరాదు.’’ – 1988 షీలా బర్సీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు. ‘‘తీర్పు గుడ్డిది కావచ్చుగానీ, తీర్పరి (జడ్జి) గుడ్డివాడు కాకూడదు. – సుధాంశు రంజన్, సుప్రసిద్ధ జర్నలిస్టు, ‘జస్టిస్ వర్సెస్ జ్యుడీషియరీ’ గ్రంథం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2019 భారత రాజ్యాంగ సూత్రాలను, ‘భారత ప్రజలమైన మేము మాకుగా రూపొందించుకున్న సెక్యులర్ రాజ్యాంగాన్ని’ కంటికి రెప్పలా కాపాడుకునే హక్కు మాకు ఉందని రాజ్యాంగం పీఠికలోనే నిర్ద్వంద్వంగా ప్రకటించి ఉన్నందున అది ఎప్పటికీ అనుల్లంఘనీయ మని ప్రముఖ తెలుగు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ జి. యతి రాజులు చాటి చెప్పారు. రాజ్యాంగ అతిక్రమణ జరిగినప్పుడు ‘రాజ్యాంగ పరిహార’ హక్కును 32వ అధికరణం ప్రసాదిస్తోంది. భాగమైన 32వ అధికరణకు ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ– ఆ ఇబ్బందుల ఫలితంగా పాలక వర్గాలు, అధికారులు, పోలీసుల వల్ల సామాన్య ప్రజలు ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తోందో వివరించారు. ‘‘జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ధోరణులకు’’ అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని సుప్రీం కోర్టు ఎందుకు గుర్తించవలసి వచ్చిందో జస్టిస్ యతిరాజులు పదే పదే ప్రస్తావించవలసి వచ్చింది (‘ఆర్టికల్ 32 అండ్ ద రెమెడీ ఆఫ్ కాంపె న్సేషన్’ పేరుతో రాసిన పుస్తకంలో). అయితే, దురదృష్టవశాత్తూ, కాదుకాదు, రాజ్యాంగ ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడి పౌరహక్కుల అధ్యాయానికి తూట్లు పొడవడానికి అలవాటుపడిన పాలకవర్గాలు పౌరులకు ఉపయోగపడాల్సిన అధికరణలను ఆచరణలో అమలు కాకుండా చేసే యంత్రాంగాన్ని చొప్పించాయి. ఆదేశిక సూత్రాల లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన. అవి అమలు జరగాలంటే వాటికి చట్టబద్ధత అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని విస్మరించరాదు. కొంతమంది వ్యక్తులకు సౌకర్యాల పేరిట కల్పించిన ప్రత్యేక హక్కులను అవసరమైతే సవరించయినా సరే ఆదేశిక సూత్రాలను అమలు జరపాలని కనీసం తొమ్మిది, పది కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది (1970–1987 మధ్యకాలంలో). రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రాధా న్యతను నొక్కి చెప్పడానికి జస్టిస్ యతి రాజులు ‘‘మానవ హక్కుల, ప్రాథమిక స్వేచ్ఛా స్వాతంత్య్రాల’’ రక్షణ ప్రాధాన్య తను ఉగ్గడించిన యూరోపియన్ కన్వెన్షన్ అధికరణలో పెక్కింటిని కూడా ఉదాహ రించారు. ఈ 32వ అధికరణ ఆసరాగానే పాలకులు ప్రత్యర్థులపై విధించే అక్రమ కేసుల నుంచి విడిపించే ‘హెబియస్ కార్పస్’ పిటీషన్ కూడా అమలులోకి రాగ ల్గింది! అలాంటి అధికారం ఉన్న 32వ అధిక రణను విధిగా అమలు జరిపే బాధ్యత నుంచి తప్పించి అమలు లోకి రాకుండా చేశారు. అలాంటి 32వ అధికరణ అమలు జరపడా నికున్న అడ్డంకులను ఛేదించిన జస్టిస్ యతిరాజులును న్యాయ శాస్త్రంలో ఉద్దండులైన పలువురు పాత తరం న్యాయ మూర్తులకు దీటైనవారిగా భావించవచ్చు. సుప్రసిద్ధ గోల్డ్‌స్మిత్ అన్నట్టు ‘‘చట్టాలు పేద వర్గాలను పీల్చి పిప్పి చేస్తూంటే, ధనిక వర్గం ఆ చట్టాలతోనే పెత్తనం చలాయిస్తూంది.’’ అయితే గతించిన శతాబ్దంలో ఏథెన్స్లో ధనికులకూ, పేదలకూ మధ్య దుర్భరమైన అంతరం ఏర్పడినప్పుడు రాచరిక కుటుంబీకుడైన సోలన్ రంగంలోకి దిగాడు. స్వయంగా ప్రజలకు ఆర్థిక బానిసత్వం నుంచి, అప్పుల నుంచి విముక్తి కల్పించాడు. జైళ్లపాలైన వారిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశాడు. పేదల్ని పిండి వసూలు చేసే పన్నులకు పన్నెండు రెట్లు ఎక్కువ పన్నును ధనిక వర్గాల నుంచి రాబట్టాడు. కోర్టులను ప్రజాబాహుళ్యం అవసరాలకు అనుగుణంగా సంస్కరిం చాడు. ఏథెన్స్ నగర రక్షణలో ప్రాణాలొడ్డిన వారి పిల్లలను పైకి తెచ్చి, ప్రభుత్వ ఖర్చుపైన విద్య చెప్పించాడు. ఈ సమూల సంస్కరణలకు ధనిక వర్గాలు భీషణమైన నిరసనలకు దిగాయి. అయితే ఇలా – ఒక తరం గడిచే లోగానే సోలన్ పెను సంస్కరణలు ఏథెన్స్ను విరుచుకు పడటానికి సిద్ధంగా ఉన్న విప్లవం నుంచి రక్షించాయి. అందుకే సెయింట్ అగస్తీన్ అన్నాడు: రాజ్యాలు, రాజ్యపాలకు లంటే ఎవరనుకున్నారు? పరమ ఘరానా దోపిడీదారులు, దోపిడీవర్గ సంస్థలు అన్నాడు (ది సిటీ ఆఫ్ గాడ్)! కనుకనే, సోలన్ ‘‘పాలకు డెవరో చెప్పండి – అతను చేసే చట్టం ఎలా ఉంటుందో నేను చెప్తా’’ అన్నాడు. ‘‘ఎందుకంటే చట్టాలు సాలెగూడుల్లాంటివి. ఆ గూట్లోకి బలహీనమైన ప్రాణి (పురుగు) దూరితే దాని కథ ఇక ముగిసి నట్టే. కానీ, ఎదిరించగల శక్తి ఉన్నది దూరితే అది నిభాయిం చుకుని బయటపడగల్గుతుంది’’ అని వివరించాడు. రాజ్యాంగంలోని 32వ అధికరణకున్న పరిమితులను సహితం దృష్టిలో ఉంచుకుని జస్టిస్ యతిరాజులు అదే అధికరణ కింద కక్షి దారుల సహజహక్కుల్ని రక్షించడం, నష్టపరిహారం రాబట్టగల్గడం... మానవహక్కుల సహజ పరిరక్షణకు తనవంతు చారిత్రక బాధ్యతను నెరవేర్చడంగా భావించాలి. ఈ విషయంలో జాతీయస్థాయిలోనూ, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ పలువురు న్యాయమూర్తులు సాధించిన విజయాలకు జస్టిస్ యతిరాజులు కృషి ఏమాత్రం తీసి పోదు. నిజాయితీకి, నిర్మొహమాటానికి పేరొంది, జాతీయ స్థాయిలో అభ్యుదయకర సంస్కరణలకు చేదోడు వాదోడుగా నిలిచిన జస్టిస్ పి.ఎ.చౌదరి, హిదా యతుల్లా, కేహార్, వెంకటాచలయ్య, హెచ్.ఆర్. ఖన్నా, జె.ఎస్.వర్మ, లోకూర్, జె.ఎస్.టాగోర్, భరూచా, కురియన్, జోసఫ్, జాస్తి చలమేశ్వర్ ప్రభృతులు ప్రవేశపెట్టిన నూతన ఒరవడు లకు జస్టిస్ యతిరాజుల కృషి కొనసాగింపుగానే భావించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, జాతీయ స్థాయిలోనూ నూతన ఒర వడిలో తీర్పులు వెలువరించిన పి.ఎ.చౌదరి, జస్టిస్ జీవన్ రెడ్డి ప్రభృ తుల కృషికి ప్రాణధారపోసి చట్టబద్ధతకు దూరంగా ఉండి పోయిన దానిని పలువురి దృష్టిని ఆకర్షించేలా చేసి ప్రజలముందు ప్రయోజ నకర అధికరణగా నిలబెట్టగలిగారు! సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో ఉండ వలసిన సుప్రసిద్ధ పౌరహక్కుల వాణి అయిన ప్రశాంత్ భూషణ్ గొంతు నొక్కేసే సంప్రదాయానికి తలుపులు తెరి చిన మాజీ ప్రధాన న్యాయమూర్తుల వైఖరిని తూర్పారబట్టారు. ఇలాంటి వాతావర ణంలో – చట్టరీత్యా ఆచరణలో అమలు కాకుండా దూరంగా ఉంచేసిన 32వ అధికరణకు ఆచరణలో శాశ్వత విలువను సంతరింపజేయడంలో జస్టిస్ యతిరాజుల కృషి సదా అభినంద నీయం. అయితే, రాజ్యాం గంలో కేవలం పేరుకు మాత్రమే చేర్చి, ఆచరణలో లేకుండా దూరం చేసిన వాటికి పూర్తి చట్టబద్ధత కల్పించే వరకు ప్రజాశ్రేయస్సును కోరే న్యాయమూర్తులు విశ్రమించకుండా ఉంటే ప్రజలు సంతోషిస్తారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
Hyderabad: ‘పింక్ లీగల్’.. మహిళలకు న్యాయ సమాచారం.. ఏ డౌట్ వచ్చినా..
దేశం ఎంత అప్డేట్ అవుతున్నప్పటికీ.. ఆడవాళ్లపై భౌతిక దాడులు, అత్యాచారాలు, అవమానాలు మాత్రం ఆగడం లేదు. వంటింట్లో మొదలు ఆఫీస్, స్కూల్, కాలేజీ, రోడ్డు మీద... ఇలా ప్రతిరోజూ మహిళ అవమానాలను ఎదుర్కొంటూనే ఉంది. మహిళల కోసం ఉన్న చట్టాలు ఏంటి... ఆ చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి, ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో ఉంటే ఆ ఇబ్బందికి పరిష్కార మార్గం ఏ సెక్షన్ ద్వారా దొరుకుతుంది, పోలీసు స్టేషన్లో, కోర్టులో, ఆఫీస్‌లో, బయట అవమానాలు ఎదుర్కొన్న మహిళ ఏయే సెక్షన్ల గురించి తెలుసుకోవడం అవసరం... వంటి వివరాలతో ‘పింక్ లీగల్’ అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు హైదరాబాద్‌కు చెందిన మానసి చౌదరి. ఢిల్లీలోని జిందల్ గ్లోబల్ లా స్కూల్లో మానసి న్యాయశాస్త్రంలో పట్టా పొంది, రాష్ట్రహైకోర్టులో రెండేళ్లపాటు ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్ద అసిస్టెంట్‌గా చేశారు. ఆ సమయంలోనే సెక్షన్ 377పై తీర్పు, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలు ప్రవేశించ వచ్చనే తీర్పు రావడం జరిగింది. సుదీర్ఘ అనుభవం కలిగిన మానసి తనకు వ్యక్తిగతంగా ఎదురైన ఓ పరిణామాన్ని జీర్ణించుకోలేక ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లో మహిళల హక్కులు తెలిపే సెక్షన్లు ఎన్ని ఉన్నాయి, ఏయే సెక్షన్ల కింద ఏయే హక్కులు మహిళలకు ఉన్నాయనే సమాచారాన్ని సంక్షిప్తంగా అందించేందుకు చేసిన కృషి నేడు ఎందరో స్త్రీలకు ఆసరాగా నిలుస్తోంది. ఫలించిన మూడేళ్ల పోరాటం ఐదేళ్ల క్రితం ఓ రోజు రాత్రి ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో నలుగురు యువకులు తప్పు తమదే అయినా మానసిపై భౌతిక దాడి చేసేందుకు సిద్ధపడ్డారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మానసి తన వద్ద ఉన్న సాక్ష్యాలను పోలీసులకు ఇచ్చి ఆ యువకులకు శిక్షపడేలా చేశారు. న్యాయవాదిని కాబట్టి నాకు రూల్స్ తెలుసు. ‘హక్కులు తెలియని మహిళల పరిస్థితి ఏంటి?’ అని ఆలోచించిన మానసి ఆ రోజు నుంచి మూడేళ్లపాటు మహిళలకు న్యాయసమాచారాన్ని అందించేందుకు కసరత్తు చేసింది. ఓ పక్క ఉద్యోగం చేస్తూ.. ఇంకోపక్క సీనియర్ న్యాయవాది వద్ద ప్రాక్టీస్ చేస్తూనే రాత్రివేళల్లో వెబ్సైట్ పనుల్లో నిమగ్నమయ్యేవారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఉన్న లా బుక్స్ తిరగేశారు. రాజ్యాంగంలో మహిళలకు ఉన్న హక్కుల గురించి తెలుసుకున్నారు. 2018లో తొలుత ‘లైంగిక వేధింపులు, మహిళల ఆస్తిహక్కులు’ అనే అంశాలపై పైలట్ ప్రాజెక్ట్‌గా వెబ్సైట్ ద్వారా సమాచారాన్ని అందించారు. దీనికి మంచి ఆదరణ, స్పందన వచ్చినప్పటికీ, మహిళకు దక్కాల్సిన న్యాయం, హక్కుల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే సంకల్పంతో మరో అడుగు ముందుకేశారు. ఇందుకోసం సుప్రీం, హైకోర్టులకు చెందిన సీనియర్ క్రిమినల్ లాయర్లను సంప్రదించారు, సుమారు పదిమంది లా విద్యార్థుల సాయం తీసుకున్నారు. మూడేళ్లపాటు రాత్రింబవళ్లు కష్టపడి చివరికి మహిళలకు ధైర్యం చేకూర్చేలా, వారి హక్కులు తెలుసుకునేలా ‘లైంగిక వేధింపులు, గృహహింస, వివాహం, విడాకులు, ఆస్తిహక్కులు, బాలల హక్కులు, సైబర్ బెదిరింపులు..’ వంటి వాటిపై అవగాహన కలిగించేలా ఓ వెబ్సైట్ ను రూపొందించారు. తన టీమ్‌తో మానసి చౌదరి లక్షమంది ముందడుగు 2020 మార్చి 8న వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు దానికి సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని నిర్వహించారు. ‘పింక్ లీగల్’ కాన్సెప్ట్ నచ్చి ఆమెతో కలసి మహిళలకు అండగా నిలిచేందుకు, న్యాయసలహాలు అందించేందుకు లా స్టూడెంట్స్ కొందరు జత కలిశారు. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో చదువుతున్న సుమారు 30 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహిళల హక్కులు, న్యాయ సలహాలను గుర్తుచేస్తున్నారు. దీనిలోనే‘ఫ్రీ హెల్ప్‌లైన్’ ను ప్రారంభించారు. బాధితులు ఎవరైనా అప్లికేషన్‌ను పూర్తి చేసి దానిలో ఫోన్ నంబర్ రాసి, సబ్మిట్ చేస్తే వాలంటీర్ సదరు మహిళకు ఫోన్ చేసి న్యాయ సలహా అందిస్తారు. అంతేకాదు, ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు వెన్నంటి ఉంటారు. సాంకేతికంగా ఎటువంటి పరిజ్ఞానం లేని వారిని దృష్టిలో పెట్టుకున్న మానసి గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందమయ్యారు. ఆయాప్రాంతాల్లో మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ‘పింక్లీగల్’ గురించి చెప్పి, వారికి ఏయే సెక్షన్లు ఎలా ఉపయోగపడతాయనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఏదైనా అంశంపై వికీపీడియా ఎలా అయితే పూర్తి సమాచారాన్ని అందిస్తుందో.. మహిళలకు చట్టాలు, హక్కులపై ‘పింక్ లీగల్’ అలా ఒక ఎన్‌సైక్లోపిడియాలా పని చేస్తుందంటున్నారు మానసి. పింక్ లీగల్ కాన్సెప్ట్ నచ్చి మానసితో కలసి మహిళలకు అండగా నిలిచేందుకు, న్యాయసలహాలు అందించేందుకు లా విద్యార్థులు జత కలిశారు. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో చదువుతున్న సుమారు 30 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహిళల హక్కులు, న్యాయ సలహాలను గుర్తుచేస్తున్నారు. – చైతన్య వంపుగాని చదవండి: Miss Universe: చారిత్రక మార్పు! ఇకపై వాళ్లు కూడా పాల్గొనవచ్చు! అయితే.. -
సామ్రాజ్య భారతి: 1942,1943/1947 ఘట్టాలు
ఘట్టాలు: క్విట్ ఇండియా తీర్మానం. బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ నిర్ణయం. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కొత్త జంట ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ అరెస్ట్. బెంగాల్ దుర్భిక్షం, పోర్ట్ ఆఫ్ కలకత్తాపై జపాన్ దాడి చట్టాలు కాఫీ మార్కెట్ ఎక్స్పాన్షన్ యాక్ట్ రెసిప్రొసిటీ యాక్ట్, వార్ ఇంజ్యురీస్ (కాంపెన్సేషన్ ఇన్సూరెన్స్) యాక్ట్ జననాలు: అమితాబ్ బచన్ : బాలీవుడ్ నటుడు (అలహాబాద్); ఆశా పరేఖ్ : బాలీవుడ్ నటి (బొంబాయి); అమరీందర్ సింగ్ : రాజకీయనేత (పాటియాలా); రాజేశ్ ఖన్నా : బాలీవుడ్ నటుడు (అమృత్సర్); జతేంద్ర : బాలీవుడ్ నటుడు (అమృత్సర్); కె.రాఘవేంద్రరావు : సినీ దర్శకులు (మద్రాస్ ప్రెసిడెన్సీ); జైపాల్‌రెడ్డి : రాజకీయ నేత (తెలంగాణ); సురవరం సుధాకరరెడ్డి : కమ్యూనిస్టు నేత (మహబూబ్ నగర్); సాక్షి రంగారావు : క్యారెక్టర్ యాక్టర్ (కలవకూరు); సారథి : హాస్య నటుడు (పెనుకొండ). మాధవన్ నాయర్ : ఇస్రో సైంటిస్ట్ (తమిళనాడు); ఇళయరాజా : సంగీత దర్శకులు (పన్నైపురం); కృష్ణ : స్టార్ యాక్టర్ (బుర్రిపాలెం); మనోరమ : రంగస్థల, సినీ నటి (మన్నార్గుడి); టి.సుబ్బరామిరెడ్డి : రాజకీయనేత (నెల్లూరు). (చదవండి: సామ్రాజ్య భారతి 1940,1941/1947) -
సామ్రాజ్య భారతి 1940,1941/1947
ఘటనలు: లాహోర్ సమావేశంలో ఆలిండియా ముస్లిం లీగ్ ‘పాకిస్థాన్ తీర్మానం’. ప్రత్యేక పాకిస్థాన్ కోసం తొలిసారి జిన్నా డిమాండ్. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు ఇండియా మద్దతు ఉపసంహరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపుపై దేశవ్యాప్త సత్యాగ్రహాలు. వారిలో అరెస్ట్ అయిన తొలి సత్యాగ్రహి వినోభా భావే. విశాఖపట్నంలో సింధియా షిప్‌యార్డ్ (నేటి హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్) కు బాబూ రాజేంద్ర ప్రసాద్ శంకుస్థాపన. చట్టాలు: డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్, ఢిల్లీ రిస్ట్రిక్షన్ ఆఫ్ యూజస్ ఆఫ్ ల్యాండ్ యాక్ట్, బేరర్ ‘లా’ స్ యాక్ట్ జననాలు: మురళీమోహన్ : నటుడు (చాటపర్రు); రాజేంద్ర కె. పచౌరి : ఆర్థికవేత్త, పర్యావరణ శాస్త్రవేత్త (నైనిటాల్); అంజాద్ ఖాన్ : నటుడు, దర్శకుడు (బాంబే); శరద్ పవార్ : రాజకీయనేత (బారామతి, మహారాష్ట్ర); ఎ.కె.ఏంటోనీ : రాజకీయనేత (కేరళ); కె.జె.జేసుదాస్ : గాయకులు (కొచ్చి); కృష్ణంరాజు : నటుడు (మొగల్తూరు); వీరప్ప మొయిలీ : రాజకీయనేత (కర్ణాటక); నజ్మా హెప్తుల్లా : రాజకీయనేత (భోపాల్); గోవింద్ నిహలానీ : సినీ దర్శకులు (పాకిస్థాన్); జి.ఎం.సి. బాలయోగి : రాజకీయనేత (తూ.గో.); యామిని కృష్ణమూర్తి : నృత్యకారిణి (మదనపల్లి); వరవరరావు : (వరంగల్); జగ్మోహన్ దాల్మియా : క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ (కలకత్తా). మణిశంకర్ అయ్యర్ : రాజకీయనేత (లాహోర్); భారతీరాజా : తమిళ దర్శకులు (మదురై); మన్సూర్ అలీఖాన్ పటౌడీ : క్రికెటర్ (భోపాల్); అరుణ్‌శౌరీ : జర్నలిస్ట్, రాజకీయనేత (జలంధర్); ఆదూర్ గోపాలకృష్ణన్ : సినీ దర్శకులు (కేరళ); వై.వేణుగోపాల్ రెడ్డి : ఆర్థికవేత్త (కడప); ఆస్కార్ ఫెర్నాండెజ్ : రాజకీయనేత (ఉడుపి). (చదవండి: చైతన్య భారతి: విభజన విషాదానికి ప్రత్యక్ష సాక్షి.. మార్గరెట్ బూర్కి వైట్) -
సామ్రాజ్య భారతి: 1938,1939/1947
ఘట్టాలు: రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం. ఇండియాలో రాజకీయ ప్రతిష్ఠంభన. భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సుభాస్ చంద్రబోస్ రాజీనామా. బ్రిటిష్ అరాచక పాలనకు నిరసనగా ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్న గాంధీజీ. చట్టాలు: గుడ్ కాండక్ట్ ప్రిజనర్స్ ప్రొబేషనల్ రిలీజ్ యాక్ట్, ఇన్సూరెన్స్ యాక్ట్; మనోవర్స్, ఫీల్డ్ ఫైరింగ్ అండ్ ఆర్టిలరీ ప్రాక్టీస్ యాక్ట్, కట్చీ మెమాన్స్ యాక్ట్. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్, పోర్చుగీస్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, కమర్షియల్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ యాక్ట్, డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజస్ యాక్ట్. జననాలు: బి.సరోజాదేవి : నటి (బెంగళూరు); శశి కపూర్ : నటుడు (కలకత్తా); షీలా దీక్షిత్ : రాజకీయనేత (కపుర్తాలా); గిరీష్ కర్నాడ్ : నటుడు (మహారాష్ట్ర); రాహుల్ బజాజ్ : బిజినెస్‌మేన్ (కలకత్తా); సంజీవ్ కుమార్ : నటుడు (సూరత్); ఎస్.జానకి : సి.నే.గాయని (రేపల్లె); హరిప్రసాద్ చౌరాసియా : వేణుగాన విద్వాసులు (అలహాబాద్); గిరిజ : నటి (కంకిపాడు); ఆర్.డి.బర్మన్ : సంగీత దర్శకుడు (కలకత్తా); ములాయం సింగ్ యాదవ్ : రాజకీయనేత (ఉత్తరప్రదేశ్); ఎల్.ఆర్. ఈశ్వరి : సినీ గాయని (మద్రాసు); గొల్లపూడి మారుతీరావు : నటుడు (విజయనగరం). (చదవండి: జమ్మూకశ్మీర్) -
సామ్రాజ్య భారతి: 1936,1937/1947
ఘట్టాలు: ‘టెంపుల్ ఎంట్రీ ప్రొక్లమేషన్’తో హిందూ ఆలయ ప్రవేశానికి ‘అట్టడుగు వర్ణాలు’ అని పిలవబడేవారిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన ట్రావెన్కూర్ మహారాజు చితిర తిరునాళ్ బలరామ వర్మ. కేరళ యూనివర్సిటీ ఏర్పాటు. ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ స్థాపన. చట్టాలు: పేమెంట్ ఆఫ్ వేజస్ యాక్ట్, పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్. అగ్రికల్చరల్ ప్రొడ్యూజ్ (గ్రేడింగ్ అండ్ మార్కింగ్) యాక్ట్, ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్, ఆర్య మ్యారేజ్ వాలిడేషన్ యాక్ట్ వైజయంతిమాల : తమిళనటి, భరతనాట్య ప్రవీణ (మద్రాసు); నూతన్ : బాలీవుడ్ నటి (బాంబే); జుబిన్ మెహ్తా : పాశ్చాత్య శాస్త్రీయ సంగీత నిర్వాహకులు (బాంబే); డి.రామానాయుడు : సినీ నిర్మాత (కారంచేడు); వేటూరి : సినీ గేయ రచయిత (పెదకళ్లేపల్లి); చిట్టిబాబు : సంగీతజ్ఞులు, కర్ణాటక సంగీత వైణికులు (కాకినాడ); విజయబాపినీడు : సినీ రచయిత, దర్శకులు (చాటపర్రు). రామచంద్ర గాంధీ : తత్వవేత్త, గాంధీజీ మనవడు (మద్రాసు); అనితా దేశాయ్ : నవలా రచయిత్రి, (ముస్సోరి); రతన్‌టాటా : పారిశ్రామికవేత్త (బాంబే); శోభన్‌బాబు : సినీ నటులు (నందిగామ); లక్ష్మీకాంత్ శాంతారామ్ : లక్ష్మీకాంత్, ప్యారేలాల్ ద్వయంలో ఒకరు. బాలీవుడ్ సంగీత దర్శకులు (బాంబే); రావుగోపాలరావు : సినీ నటుడు (కాకినాడ). (చదవండి: శతమానం భారతి: కొత్త పార్లమెంట్ ) -
సామ్రాజ్య భారతి:1934,1935/1947 ఘట్టాలు
ఘట్టాలు శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసిన గాంధీజీ. భారత కమ్యూనిస్టు పార్టీపై బ్రిటిష్ ప్రభుత్వ నిషేధం. చట్టాలు: వారానికి 65 గంటల పని చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, సుగర్కేన్ యాక్ట్, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్, పెట్రోలియం యాక్ట్, డాక్ లేబరరర్స్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ –1935 జననాలు: మహేంద్ర కపూర్ : సి.నే. గాయకులు (అమృత్సర్); విజయ్ ఆనంద్ : సినీ దర్శక, నిర్మాత (గురదాస్‌పూర్); కాన్షీరామ్ : బహుజన్ సమాజ్ పార్టీ స్థాపకులు (రూప్‌నగర్); రస్కిన్ బాండ్ : బాలల రచయిత (హిమాచల్‌ప్రదేశ్); ప్రతిభా పాటిల్ : భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి (మహారాష్ట్ర); చో రామస్వామి : ‘తుగ్లక్’ పత్రిక సంపాదకులు (చెన్నై); శ్యామ్ బెనెగల్ : సినీ దర్శకులు (సికింద్రాబాద్); రాజశ్రీ : సినీ గేయ రచయిత, డైలాగ్ రైటర్ (విజయనగరం). జయేంద్ర సరస్వతి : ఆథ్యాత్మిక గురువు (తమిళనాడు); ప్రేమ్ చోప్రా : బాలీవుడ్ నటుడు (లాహోర్); సలీమ్ ఖాన్ : బాలీవుడ్ నటుడు (ఇండోర్); ప్రణబ్ ముఖర్జీ : భారత 13వ రాష్ట్రపతి (ప.బెం.); సావిత్రి : సీనియర్ నటి (చిర్రావూరు); పి.సుశీల : గాయని (విజయనగరం); కైకాల సత్యనారాయణ : నటులు (కౌతారం); రాజసులోచన : నటి, శాస్త్రీయ నృత్యకారిణి (విజయవాడ); డాక్టర్ ప్రభాకరరెడ్డి : నటులు (తుంగతుర్తి); తెన్నేటి హేమలత : రచయిత్రి (విజయవాడ); సి.ఎస్.రావ్ : సినీ రచయిత (ద్రాక్షారామం) (చదవండి: చైతన్య భారతి: ఇరోమ్ చాను షర్మిల, పౌర హక్కుల కార్యకర్త.. నిరశన ఉద్యమం!) -
సామ్రాజ్య భారతి: 1930,1931/1947
ఘట్టాలు: జనవరి 26 ను ‘పూర్ణ స్వరాజ్య దినం’గా ప్రకటించిన భారత జాతీయ కాంగ్రెస్. భౌతికశాస్త్రంలో సర్ సీవీ రామన్‌కు నోబెల్ బహుమతి. మార్చి 12న మొదలై ఏప్రిల్ 6న ముగిసిన గాంధీజీ దండి యాత్ర (ఉప్పు సత్యాగ్రహం). లండన్‌లో తొలి రౌండ్ టేబుల్ సమావేశం భారతదేశ రాజధానిగా ఢిల్లీ. బ్రిటిష్ పోలీసులతో హోరాహోరీ ఎన్కౌంటర్లో చంద్రశేఖర ఆజాద్ మృతి. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరి తీసిన బ్రిటిషర్లు. చట్టాలు: సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, హిందూ గెయిన్స్ ఆఫ్ లర్నింగ్ యాక్ట్, గాంధీ ఇర్విన్ ఒప్పందం, ఇండియన్ టోల్స్ (అమెండ్మెంట్) యాక్ట్, ప్రొవిజినల్ కలెక్షన్ ఆఫ్ టెక్సెస్ యాక్ట్. చట్టాలు: కె.విశ్వనాథ్ : సినీ దర్శకులు (రేపల్లె); కె.బాలచందర్ : తమిళ సినీ దర్శకులు (నన్నీలం); పి.బి.శ్రీనివాస్ : సినీ నేపథ్య గాయకులు (కాకినాడ); మధురాంతకం రాజారాం : కథా రచయిత (తిరుపతి); పిఠాపురం నాగేశ్వరరావు : సినీ నేపథ్య గాయకులు (పిఠాపురం) నిరుపారాయ్ : సినీ నటి (గుజరాత్); షమ్మీ కపూర్ : బాలీవుడ్ నటుడు (బాంబే); రొమిల్లా థాపర్ : చరిత్రకారిణి (లక్నో); సింగీతం శ్రీనివాసరావు : సినీ దర్శకులు (ఉదయగిరి); సి.నారాయణరెడ్డి : కవి (తెలంగాణ); ముళ్లపూడి వెంకట రమణ : రచయిత (ధవళేశ్వరం); అవసరాల రామకృష్ణారావు : కథా రచయిత (తుని) (చదవండి: శతమానం భారతి: పరిరక్షణ) -
సామ్రాజ్య భారతి 1928,1929/1947
ఘట్టాలు: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బి.సి.సి.ఐ) ఏర్పాటు. ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన ఇండియా. న్యూఢిల్లీ అసెంబ్లీ ఛాంబర్లోకి బాంబులు విసిరిన బతుకేశ్వర్ దత్, భగత్‌సింగ్. ఇండియాకు మదర్ థెరిస్సా ఆగమనం. బాంబే ఫ్లయింగ్ క్లబ్‌ను స్థాపించిన జె.ఆర్.డి.టాటా. చట్టాలు: ది హిందు ఇన్హెరిటెన్స్ (రిమూవల్ ఆఫ్ డిస్ఎబిలిటీస్) యాక్ట్, ది చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్. జననాలు: వీరమాచినేని విమలాదేవి : కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు, ఏలూరు ఎంపీ (విశాఖపట్నం); గిరీశ్ చంద్ర సక్సేనా : రాజకీయ నేత, (ఆగ్రా); శివాజీ గణేశన్ : తమిళ నటులు (సురైకోటై్ట); జగ్గయ్య: నటుడు, లోక్‌సభ ఎంపీ (తెనాలి); ఎం.ఎస్.విశ్వనాథన్ : సంగీత దర్శకులు (మద్రాసు ప్రెసిడెన్సీ); జె.వి.సోమయాజులు : నటులు (శ్రీకాకుళం); త్రిపుర (రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు) : కథా రచయిత (విశాఖపట్నం); రావు బాలసరస్వతి : గాయని (హైదరాబాద్) నర్గీస్ : నటి (కలకత్తా); సురయా : నటి (పాకిస్థాన్); కిశోర్ కుమార్ : సినీ నేపథ్య గాయకులు (మధ్యప్రదేశ్); సోమనాథ్ చటర్జీ : కమ్యూనిస్టు యోధులు (అస్సాం); యశ్ జోహార్ : సినీ నిర్మాత (అమృత్సర్); లతా మంగేష్కర్ : సినీ నేపథ్య గాయని (ఇండోర్); మిఖాసింగ్ : ట్రాక్ అండ్ ఫీల్డ్ స్ప్రింటర్ (పాకిస్థాన్); సునీల్ దత్ : సినీ దిగ్గజం, రాజకీయనేత (పంజాబ్); అనంత పాయ్ : కామిక్ క్రియేటర్ (కర్ణాటక); జి.వెంకటస్వామి : రాజకీయనేత (హైదరాబాద్); సిహెచ్. హనుమంతరావు : ఆర్థికవేత్త, రచయిత (కరీంనగర్) -
సామ్రాజ్య భారతి: 1920,1921/1947 ఘట్టాలు
ఘట్టాలు: సహాయ నిరాకరణోద్యమానికి గాంధీజీ పిలుపు. విశ్వ భారతి యూనివర్సిటీ స్థాపన. మహిళలకు కూడా ఓటు హక్కు ఉంటుందని మద్రాసు ప్రావిన్సు ప్రకటన. చట్టాలు: ముంబైలో అడుగుపెట్టిన వేల్స్ ప్రిన్స్ (తర్వాతి కాలంలో ఎనిమిదవ ఎడ్వర్డ్ కింగ్) కు ఖాళీ వీధుల స్వాగతం! ప్రొవిన్షియల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్, పాస్‌పోర్ట్ (ఎంట్రీ ఇన్ టు ఇండియా) యాక్ట్, ఐడెంటికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్, ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ యాక్ట్, చారిటబుల్ అండ్ రెలిజియస్ ట్రస్ట్స్ యాక్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాక్ట్. పర్మినెంట్ అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ ప్రిన్సెస్; కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెయింటెనెన్స్ ఆర్డర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్. జననాలు రవిశంకర్ : సితార్ విద్వాంసులు (బెనారస్); సతీశ్ ధావన్ : ఏరో స్పేస్ ఇంజనీర్ (శ్రీనగర్); బి.విఠలాచార్య : సినీ దర్శకులు (ఉడిపి); బాలాంత్రపు రజనీకాంత రావు : వాగ్గేయకారులు, స్వరకర్త (నిడదవోలు); డి.వి.నరసరాజు : రంగస్థల, సినీ నటులు, దర్శకులు, రచయిత (గుంటూరు); సత్యజిత్ రే : సినీ దర్శకులు (కలకత్తా); దేవరకొండ బాలగంగాధర తిలక్ : కవి (తణుకు); ఆర్.కె.లక్ష్మణ్ : కార్టూనిస్టు (మైసూరు); ఆత్రేయ : సినీ కవి (మంగళంపాడు). (చదవండి: పెనంలోంచి పొయ్యిలోకి పడిన రోజు!) -
సామ్రాజ్య భారతి: 1903/19047 ఘట్టాలు! చట్టాలు
ఘట్టాలు: బ్రిటిష్ ఇండియా చక్రవర్తిగా ఏడవ ఎడ్వర్డ్ బ్రిటిష్ ఆఫీసర్‌ను భుజాలపై మోసుకెళుతున్న కొండప్రాంత భారతీయ మహిళ (1903 నాటి ఫొటో) చట్టాలు వర్క్స్ ఆఫ్ డిఫెన్స్ యాక్ట్, విక్టోరియా మెమోరియల్ యాక్ట్ జననాలు: కమలాదేవి చటోపాధ్యాయ్ : స్వా.స.యో., సంఘ సంస్కర్త (కర్ణాటక); ఎస్.ఎల్. కిర్లోస్కర్ : ప్రముఖ వ్యాపారవేత్త (సోలాపూర్); జైపాల్ సింగ్ ముండా : రాజకీయనేత, రచయిత, క్రీడాకారుడు (జార్ఖండ్); శివరామ్ చక్రవర్తి : బెంగాలీ హాస్య రచయిత (కలకత్తా); ప్రమతేశ్ బారువా : సినీ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్ (అస్సాం); నిడదవోలు వెంకట్రావు : తెలుగు రచయిత, రిసెర్చ్ స్కాలర్ (విజయనగరం); కె.సుకుమారన్ : ‘కేరళ కౌముది’ ఎడిటర్ (మయనాడ్); టి.ఎస్. అవినాశలింగం చెట్టియార్ : స్వా.స.యో., న్యాయ కోవిదులు (తమిళనాడు); ముకత్ బెహారి లాల్ భార్గవ : స్వా.స.యో., రాజకీయవేత్త (జైపూర్) (చదవండి: మహోజ్వల భారతి: భారతజాతి మిత్రుడు బెంజిమన్) -
సామ్రాజ్య భారతి: 1901/1947 ఘట్టాలు, జననాలు...చట్టాలు
ఘట్టాలు: బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం 1901లో విడుదల చేసిన 10 రూపాయల నోటు తొలి ప్రామాణిక జనాభా లెక్కల సేకరణ చట్టాలు: ఇండియన్ టోల్స్ (ఆర్మీ అండ్ ఎయిర్‌ఫోర్స్) యాక్ట్ జననాలు: వి.శాంతారామ్ : సినీ దర్శకులు, నిర్మాత (కొల్హాపూర్); శ్యాం ప్రసాద్ ముఖర్జీ : జాతీయవాద నేత (కలకత్తా); జి.శంకర కురూప్ : మలయాళీ మహాకవి (కేరళ); పొట్టి శ్రీరాములు : స్వా.స.యో. (మద్రాస్ ప్రెసిడెన్సీ); రాజా చంద్రబోస్ : గణితశాస్త్రజ్ఞులు (మధ్యప్రదేశ్); రామకృష్ణ రంగారావ్ : బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు (మద్రాస్ ప్రెసిడెన్సీ); ధనంజయరావ్ గాడ్గిల్ : ఆర్థికవేత్త (మహారాష్ట్ర); పింగళి నాగేంద్రరావు : స్క్రీన్ రైటర్, పాటల రచయిత (రాజాం); నిర్మల్ కుమార్ బోస్ : పురావస్తు పరిశోధకులు (కలకత్తా); ప్రహ్లాద్ బాలాచార్య : భారత సుప్రీంకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తి (బాంబే ప్రెసిడెన్సీ) ; నట్వర్సిన్హ్జీ భావ్సిన్హ్జీ : పోర్బందర్ మహారాజా (గుజరాత్); సుధీంద్రనాథ్ దత్తా : బెంగాలీ కవి, విమర్శకులు (ఉత్తరప్రదేశ్); మొసలికంటి తిరుమలరావు : స్వా.స.యో. (పిఠాపురం); జి.ఎస్.మేల్కోటే : స్వా.స.యో. (ఒరిస్సా); జె.బి.హెచ్. వాడియా : సినీ దర్శకులు (బాంబే). -
సామ్రాజ్య భారతి: 1880/1947
ఘట్టాలు: నైనిటాల్లో ఏకధాటిగా 68 గంటల వ్యవధిలో కుండపోతగా కురిసిన 36 సెంటీమీటర్ల వర్షపాతం 151 మందిని బలిగొంది. కొండ చరియలు విరిగి పడటంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. జననాలు: రాజశేఖర్ బసు : రచయిత, కెమిస్ట్, నిఘంటు నిపుణులు (బెంగాల్); మున్షీ ప్రేమ్‌చంద్ : స్వాతంత్య్ర ఉద్యమకారుడు; హిందూ, ఉర్దూ భాషల్లో రచయిత (బెనారస్); అబ్దుల్ ముహసిన్ ముహమ్మద్ సజ్జద్ : పండితులు, స్వాతంత్య్ర సమర యోధులు, ‘ముస్లిం ఇండిపెండెంట్ పార్టీ’ వ్యవస్థాపకులు (బిహార్ ప్రావిన్స్); బరీంద్రకుమార్ ఘోష్ : స్వాతంత్య్ర సమర తిరుగుబాటు వీరుడు, జర్నలిస్ట్ (కలకత్తా); బళ్లారి రాఘవ : తెలుగు నాటక రంగ ప్రముఖులు, ప్రసిద్ధ న్యాయవాది (అనంతపురం జిల్లా); సుఖ్లాల్ సంఘ్వీ : జైన్ పండితులు, తత్వవేత్త (గుజరాత్); అమరేంద్ర చటర్జీ : స్వాతంత్య్రోద్యమ కార్యకర్త (పశ్చిమ బెంగాల్). చట్టాలు: రెలిజియస్ సొసైటీస్ యాక్ట్, కాజీస్ యాక్ట్, ఈస్టిండియా లోన్ (ఈస్టిండియన్ రైల్వే డిబెంచర్స్) యాక్ట్, ఇండియా స్టాక్ (పవర్స్ ఆఫ్ అటార్నీ) యాక్ట్. (చదవండి: సామ్రాజ్య భారతి 1879/1947) -
వింతైన చట్టాలు...వింటే నవ్వాగదు!
ప్రపంచంలో ప్రతి దేశానికి కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలు ఆయా దేశాల్లోని ప్రజలందరూ ఇబ్బందిపడకుండా అనుసరించే విధంగా చేసుకుంటారు. కొన్ని దేశాల్లోని చట్టాలు చూస్తే చాలా వింతగానూ, నవ్వు వచ్చే విధంగానూ ఉంటాయి. ఎందుకిలాంటి చట్టాలు పెట్టారని అనే సందేహం కూడా కలుగుతుంది. ఆ చట్టాలేంటో? ఏమిటా కథ చూసేద్దామా! ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని వింత చట్టాలు, రూల్స్ ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. ఇంగ్లండ్‌లోని మసాచుసెట్స్‌లో ఓ విచిత్రమైన చట్టం ఉంది. ఇక్కడ స్నానం చేయకుండా నిద్రపోతే జైల్లో పెట్టాస్తారట. స్నానం చేయకపోతే జైల్లో పెట్టడమేంటి రా బాబు అనుకోకండి. ఎందుకంటే ఆ దేశంలో దాన్ని చాలా తీవ్రంగా పరిగణించటమే కాదు చట్టవిరుద్ధంగా భావిస్తారట. చాలా ఫన్నీగా ఉంది కదూ. అలాగే అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఎవరైనా కారును లోదుస్తులతో శుభ్రం చేయడం వంటివి చేస్తే జరిమానా విధిస్తారు. ఇటలీలోని మిలాన్ నగరంలో అయితే నవ్వు పైన నిషేధం. ఆ దేశంలో ఎవరైన నవ్వినట్టు కనిపిస్తే ఫైన్ వేస్తారట. ఈ చట్టాలను చూస్తే చాలా కామెడీగా ఉన్నాయి కదా. ఐతే ఆయా చట్టాల వల్ల ప్రయోజనం ఏంటో తెలయదు గానీ ఆయా దేశాల ప్రజలు మాత్రం ఈ వింత చట్టాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. (చదవండి: బనానా రికార్డు! అరటి పళ్ల ప్రదర్శన) -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం
కాచిగూడ: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాధిక యాదవ్ అన్నారు. కాచిగూడలోని ఎంఎస్ఎస్ లా కాలేజీలో ప్రొఫెసర్ డాక్టర్ విష్ణుప్రియ అధ్యక్షతన లా విద్యార్థులకు ఇండక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో న్యాయ విద్య ఒక ఉన్నతమైన వృత్తి అన్నారు. ప్రస్తుత సామాజిక మార్పులతో విద్యార్థులు చర్చలకు హాజరు కావడం, భాషపై పట్టు సాధించడం, ఆన్లైన్లో చట్టపరమైన వనరులను సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలు, జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఎస్ఎస్ లా కాలేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ డీవీజీ కృష్ణ, కార్యదర్శి ఎస్.బి.కాబ్రా, అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలెన్నుకున్న ప్రభుత్వ ఉసురు తీసే యత్నం: చన్నీ
టాండా (పంజాబ్): ప్రాణ హానిని ఎదుర్కొన్నానని ప్రధాని మోదీ అనడాన్ని పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ గిమ్మిక్కుగా అభివర్ణించారు. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ప్రధాని గౌరవనీయ దేశ నాయకుడని, ఆ స్థాయి వ్యక్తి ఇలాంటి అల్ప నాటకానికి దిగడం ఆయన హోదాకు తగదని చన్నీ పేర్కొన్నారు. ‘రైతులు ఏడాది పొడవునా ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ప్రతికూలతల నడుమ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కొనసాగిస్తే పట్టలేదు కాని 15 నిమిషాలు ప్రధాని రోడ్డుపై వేచి ఉండాల్సి వస్తే ఇంత రాద్దాంతమా? ఇవెక్కడి ద్వంద్వ ప్రమాణాలు’ అని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ ధ్వజమెత్తారు. మోదీ పాల్గొనాల్సిన ఫిరోజ్‌పూర్ ర్యాలీకి కేవలం 500 మంది మాత్రమే వచ్చారన్నారు. -
లోక్‌సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..
సాక్షి, ఢిల్లీ: దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలు చేపట్టేలా తీసుకొచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానించేలా రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు నేడు సభలో ప్రవేశపెట్టారు. చదవండి: కర్ణాటకలో ఒమిక్రాన్ కలకలం.. ఒక్కరోజే 5, దేశంలో 167కు చేరిన సంఖ్య అయితే ఈ బిల్లును కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించాయి. అంతేగాక, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టాయి. అయినప్పటికీ దీన్ని ప్రవేశపెట్టేందుకు స్పీకర్ అంగీకరించడంతో కేంద్రమంత్రి బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. అయితే, ఈ బిల్లుతో పాటు లఖింపుర్ ఘటన, ఇతర అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఈ బిల్లుపై చర్చ మొదలుపెట్టకుండానే లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఏంటీ సవరణ బిల్లు.. ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలున్న ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇటీల ఆమోద ముద్రవేసింది. పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్ ఐడీ లేదా ఎలక్టోరల్ కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు. కాకపోతే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా ప్రజలే అనుసంధానించుకొనేలా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు సమాచారం. అలాగే, కొత్త ఓటర్లు నమోదుకు ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించే మరో ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటితేనే ఓటరుగా నమోదుకు అనుమతించనున్నారు. ఇక, ఎన్నికలు నిర్వహించే ప్రాంగణాల ఎంపికపై కేంద్ర ఎన్నికల సంఘానికే పూర్తి అధికారాలు కట్టబెడుతూ మరో సవరణ చేశారు. ఆధార్ నెంబర్‌తో ఓటర్ ఐడీని అనుసంధానం చేయడం.. గోప్యతా హక్కుకు భంగం కలిగించడమేనని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో నివసించే అందరికీ ఆధార్ కార్డులు జారీచేస్తారని, ఓటువేసే హక్కు కేవలం భారత పౌరులకే ఉంటుందని మరో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. అయితే, విపక్షాల వాదనలను కేంద్రం ఖండించింది. ఎన్నికల ప్రక్రియను విశ్వసనీయంగా ఉంచాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. బోగస్ ఓట్లను నిర్మూలించేందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపారు. -
ధిక్కారణాధికారాన్ని తొలగించలేరు!
న్యూఢిల్లీ: కోర్టులకు ఉండే ధిక్కార శిక్షాధికారాన్ని ఎలాంటి చట్టంతో తొలగించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక ఎన్జీఓ చైర్‌పర్సన్‌ను కోర్టు ధిక్కారం కింద విచారిస్తూ గతంలో విధించిన రూ.25 లక్షల జరిమానాను చెల్లించకపోవడం ధిక్కరణేనని స్పష్టం చేసింది. ముద్దాయివి ధిక్కరణ చర్యలేనని, అలాంటి వాటిని శిక్షించకుండా కోర్టు వదిలేయదని జస్టిస్ సంజయ్ కిషన్‌తో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. సూరజ్ ట్రస్ట్ ఇండియా అనే సంస్థ అధిపతి రాజీవ్ దైయాపై కోర్టు ధిక్కార ఆరోపణలను సుప్రీం విచారించింది. గతంలో రాజీవ్ 64 ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. అయితే ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. దీంతో రాజీవ్‌కు సుప్రీంకోర్టు రూ.25 లక్షల జరిమానాను 2017లో విధించింది. దీనిపై పునఃపరిశీలన జరపాలని రాజీవ్ తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు రాజీవ్‌ది ధిక్కారమేనని తేలి్చచెప్పింది. రాజీవ్ కోర్టులపై బురద జల్లుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ధిక్కారణాధికారం తమకు రాజ్యాంగం ఇచి్చందని తెలిపింది. రాష్ట్రపతితో జస్టిస్ ఎన్.వి. రమణ భేటీ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. శనివారం విజ్ఞాన్ భవన్లో న్యాయ సేవలపై అవగా హనా కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ సదస్సు వివరాలను జస్టిస్ ఎన్.వి.రమణ రాష్ట్రపతికి వివరించారు. -
'భారత్ బంద్‌కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు': రేపు బస్సులు తిరగవు
సాక్షి, కృష్ణా జిల్లా: వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్‌కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్‌లో భాగంగా 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు నడవవు. ఆ తర్వాత నుండి బస్సులు యధావిధిగా తిరుగుతాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతు సంఘాలు శాంతియుతంగా బంద్‌లో పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దని, రైతు చట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్రాన్ని కోరుతున్నాం’ అని పేర్ని నాని విన్నవించారు. చదవండి: (26న ‘గులాబ్’ తుఫాన్.. నేడు, రేపు భారీ వర్షాలు) -
నిబంధనల ఉల్లంఘన, ప్లిప్ కార్ట్‌కు భారీ జరిమానా
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. విదేశీ పెట్టుబడుల చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ఈడీ..ఫ్లిప్ కార్ట్‌కు 100 బిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. గత కొన్నేళ్లుగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్లు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లా నిబంధనల్ని ఉల్లంఘించి మార్కెట్ ప్లేస్‌లో వివిధ రకాల బ్రాండ్ల అమ్మకాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈకామర్స్ కంపెనీల వ్యవహారంపై ఈడీ కన్నేసింది. ఇదే సమయంలో ఈడీ.. ఫ్లిప్ కార్ట్ కు ఫైన్ విధించడం చర్చాంశనీయంగా మారింది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెంగళూరు కేంద్రంగా ఫ్లిప్ కార్ట్‌కు పేటెంట్ కంపెనీగా ఉన్న డబ్ల్యూఎస్ రీటైల్ సర్వీస్‌లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించి.. ఆ పెట్టుబడులతో ఫ్లిప్‌కార్ట్ తన ఈకామర్స్ ప్లాట్ ఫామ్ లో వివిధ రకాల ఉత్పత్తులపై అమ్మకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ పెట్టుబడుల గురించి వెలుగులోకి రావడంతో ఈడీ విచారణ చేపట్టి.. గత నెల చెన్నైలోని ఫ్లిప్ కార్ట్ కార్యాలయానికి సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ పేరుమీద షోకాజు నోటీసులు జారీ చేసింది. కాగా,ఈడీ నోటీసులపై ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి.ఫ్లిప్ కార్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లా నిబంధనలకు లోబడే కార్యకలాపాలు నిర్వహిస్తోందని, 2009 -2015 సంవత్సర మధ్య జరిపిన లావాదేవీలపై షోకాజు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారని సమాచారం.ఇక ఇదే విషయంపై బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్‌లు స్పందించకపోవడం ఈడీ నోటీసులకు ఊతం ఇచ్చేలా ఉంది. -
చట్టాలు మేమెలా రూపొందిస్తాం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: చట్టాలు రూపొందించే బాధ్యత పార్లమెంట్‌దేనని, తామెలా రూపొందిస్తామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై వచ్చే అనర్హత విజ్ఞప్తులపై లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, రాజ్యసభ చైర్పర్సన్ నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితిని విధించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా అనర్హత పిటిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని, ఆయా కేసుల్లో ఏకరూప నిర్ణయం తీసుకొనేలా ఆదేశించాలంటూ ఏఐసీసీ సభ్యుడు రణజిత్ ముఖర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ చేసిన విజ్ఞప్తి పార్లమెంట్ పరిధిలోనిదని, కోర్టు చట్టాల రూపకల్పన చేయదని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘చట్టాలు మేమెలా రూపొందిస్తాం? అది పార్లమెంటుకు సంబంధించిన విషయం’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ‘‘కర్ణాటక ఎమ్మెల్యే విషయంలో అభిప్రాయం ఇప్పటికే చెప్పాం. ప్రస్తుత పిటిషన్‌లోని అంశమే కర్ణాటక ఎమ్మెల్యే కేసులోనూ వచ్చింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఇదే వాదన వినిపించారు. ఆ విషయాన్ని మేం పార్లమెంటుకు విడిచిపెట్టాం. ఆ తీర్పు చదువుకొని సుప్రీంకోర్టుకు రావాల్సింది’’ అని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఫేస్బుక్ వివాదం: మోదీతో ఆస్ట్రేలియా చర్చలు
సిడ్ని: గూగుల్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు.. వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలన్న చట్టం తెస్తున్న ఆస్ట్రేలియాపై దిగ్గజ టెక్ సంస్థ ఫేస్బుక్ సంచలనాత్మక తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆసీస్‌లోని ఫేస్బుక్ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. దీనిపై ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆస్ట్రేలియా పైకి మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తున్నప్పటికీ చర్చలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చలు జరిపింది. దీనిపై ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితిని మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని వివరించారు. అదే సమయంలో ఫేస్‌బుక్‌కు సైతం చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ యథాస్థితిని తీసుకొచ్చేందుకు ఫేస్బుక్ యాజమాన్యం త్వరతగతిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ తరహా యుద్ధం సరైనది కాదని పేర్కొన్నారు. కాగా, ‘ఫేస్బుక్ నిర్ణయం సార్వభౌమ దేశంపై దాడి’అని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ అభివర్ణించారు. ‘ఇది టెక్నాలజీపై నియంత్రణను దుర్వినియోగం చేయడమే’అని మండిపడ్డారు. ఆ బిల్లును ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదించింది. సెనెట్ ఆమోదించాక చట్టరూపం దాలుస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌కు, వార్తాసంస్థలకు మధ్య సంబంధాన్ని ఈ చట్టం తప్పుగా అర్థం చేసుకుందని ఫేస్బుక్ వ్యాఖ్యానించింది. కాగా, ఆసీస్ మీడియా అవుట్ లేట్లను, కొత్తకంటెంట్ను కనబడకుండా నిరోధించారని ఫేస్బుక్ కోశాధికారి ఫైడెన్బర్గ్ తెలిపారు. ఆసీస్ ప్రధాని బెదిరింపు ధోరణిని మానుకోవాలని కూడా కోరారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆసీస్ వైపు చూస్తున్నాయని అన్నారు. ఆసీస్ కంటేంట్‌ను నిలిపడం కన్నావేరే మార్గం కనిపించలేదని అన్నారు. ఇప్పటికే భారత ప్రధాని మోదీతోను, కెనెడాకు చెందిన జెస్టిస్ ట్రూడోతో చర్చించామని ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. కాగా , నిషేధం విధించినప్పటి నుంచి స్వదేశీ, విదేశీ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మైఖేల్ మిల్లర్ తెలిపారు. ఫేస్బుక్ నిషేధ ప్రభావంను ఇంకా ప్రజలు పూర్తిగా ఎదుర్కొలేదని అన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మిల్లర్ కోరారు. ఇక్కడ చదవండి: ఫేస్బుక్ వర్సెస్ ఆస్ట్రేలియా -
ఆడదానివై పోయావ్..ఎమ్మెల్యే వీరంగం
భోపాల్: కాంగ్రెస్‌కు చెందిన మధ్యప్రదేశ్ మాజీ మంత్రి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు దుమారం చల్లారకముందే ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఒక మహిళా అధికారిపై బెదిరింపులకు పాల్పడుతూ కెమెరా కంటికి చిక్కారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతు ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్-రాజస్థాన్ సరిహద్దు సమీపంలోని సైలానా పట్టణంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది, వివరాల్లోకి వెళ్లితే..కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్ష్ విజయ్ గెహ్లాట్ స్థానిక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) కామిని ఠాకూర్‌పై విరుచుకుపడిన వైనం వివాదం రేపుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ తరువాత, ఎమ్మెల్యే నేతృత్వంలోని ఉద్యమకారులు మెమోరాండం సమర్పించడానికి ఎస్డీఎం కార్యాలయానికి చేరుకున్నారు. దీన్ని స్వీకరించేందుకు కామిని ఠాకూర్ ఎంతకీ బయటికి రాకపోవడంతో గెహ్లాట్ తీవ్ర అసహనానికి గురైనారు. ‘‘ఈ నియోజకవర్గం ప్రతినిధిని నేను.. నా మాటను మీరు అర్థం చేసుకోవడంలేదు. మీరొక మహిళా అధికారి అయిపోయారు.. ఈ స్థానంలో మరో పురుష అధికారి వుంటే గల్లా పట్టుకొని మరీ... ఇచ్చేవాడిని అంటూ రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం మవుతోంది. -
హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో వేలాది రైతులు గత కొంత కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులను ఉద్ధేశించి బీజేపీ ఎంపీ, సీనియర్ బాలీవుడ్ నటి హేమమాలిని సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మథుర పార్లమెంట్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బుధవారం హేమమాలిని మాట్లాడుతూ.. అసలు రైతులకు ఏం కావాలో వారికే తెలియదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు రైతులు ఆందోళన చేస్తున్నారో వాళ్లకే తెలియదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏముందో, వాటి వల్ల ఉన్నసమస్య ఏంటో కూడా తమకు తెలియదని పేర్కొన్నారు. దీన్నిబట్టి రైతుల ఆందోళన స్వచ్ఛందమైన కాదని, ఎవరో వారి వెనకుండి చేయిస్తే రైతులు చేస్తున్నారనే విషయం అర్థమవుతుందని హేమమాలిని అన్నారు. చదవండి: సాగు చట్టాల అమలుపై స్టే అదే విధంగా నూతన చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించాడాన్ని హేమమాలిని స్వాగతించారు. తద్వారా పరిస్థితులు చక్కబడేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్నిసార్లు చర్చలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులు ఏకాభిప్రాయానికి రావడం లేదని, వారు ఏం కోరుకుంటున్నారో కూడా తెలియదన్నారు. అలాగే రైతుల నిరసనల వల్ల పంజాబ్‌లో చాలా నష్టం ఏర్పడిందని, ముఖ్యంగా సెల్ టవర్లను ధ్వంసం చేయడం మంచిది కాదన్నారు. ఇదిలా ఉండగా కొత్త చట్టాల వల్ల కేవలం కార్పొరేట్ సంస్థలకే లాంభం చేకూరుతుందని నిరసనలు తెలియజేస్తున్న రైతులు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 1500కు పైగా రిలయన్స్ జియో టెలికాం టవర్లను ధ్వంసం చేశారు. కాగా నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించిన విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే, ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా సూచనలు చేసేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ చట్టాలు అమల్లోకి రాకముందు ఉన్న కనీస మద్దతు ధర వ్యవస్థ కొనసాగుతుందని వివరించింది. -
‘సుప్రీం’ సూచన శిరోధార్యం
సకాలంలో సమస్యపై దృష్టిపెట్టి పరిష్కరించటానికి పూనుకోనట్టయితే అది జటిలంగా మారుతుంది. అనవసర భావోద్వేగాలు పెరిగి పరిష్కారానికి అవరోధమవుతాయి. సాగు చట్టాలకు వ్యతి రేకంగా న్యూఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా రైతులు ఆందోళన సాగిస్తున్నారు. ఇప్పటికి ఎనిమిది దఫాలు కేంద్రం చర్చలు జరిపింది. ఈ నెల 15న మరో దఫా చర్చించబోతున్నారు. ఇంతవరకూ జరిగిన చర్చల సరళి చూస్తుంటే ఈసారైనా పరిష్కారం లభిస్తుందా అన్న సందేహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యమకారులను ఆ ప్రాంతాలనుంచి పంపించేందుకు చర్యలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టు కేంద్రానికి విలువైన సూచన చేసింది. ఆందోళన చేస్తున్న రైతులతో ఒప్పందానికొచ్చేవరకూ వాటి అమలును నిలిపేయాలని సలహా ఇచ్చింది. ఈలోగా చర్చలు జరపడానికి తామే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నది. ఎలా చూసినా ఇది ఆచరణాత్మకమైనది. వాస్తవానికి ప్రభుత్వాలు చేసే చట్టాలకు రాజ్యాంగబద్ధత వుందో లేదో చెప్పటం న్యాయస్థానాల బాధ్యత. అయితే ప్రస్తుత పరిస్థితులు భిన్నమైనవి. రైతుల ఆందోళన వల్ల ప్రజా రవాణాకు, సరుకు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ముడి సరుకు ఆగిపోవటంతో ఉత్పత్తి నిలిచిపోయిందని, తయారైన సరుకు తరలించటం అసాధ్యమవుతున్నదని పారిశ్రామికవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. రాజస్తాన్ వైపున్న సరిహద్దు పరిసరాల్లోని గ్రామస్తులు ఉద్యమకారులపై కారాలుమిరియాలు నూరుతున్నారు. వారికి నిత్యావసరాలు అందకుండా అవరోధాలు కలిగిస్తున్నారు. ఇవన్నీ ప్రమా దకరమైన పరిణామాలు. ఈ సమయంలో కూడా న్యాయస్థానాలు మౌనంగా వుండటం సాధ్యమా? చట్టాలను రద్దు చేయాలని రైతులు పట్టుబడుతుంటే ఆ ప్రశ్నేలేదని కేంద్రం అంటోంది. పైగా న్యాయ స్థానాల్లో వాటిని సవాలు చేసుకోవచ్చని చెబుతోంది. అటు రైతులు అందుకు ససేమిరా అంటు న్నారు. ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రసంగించాల్సిన బహిరంగ సభాస్థలి వేదికనూ, హెలీప్యాడ్‌నూ ధ్వంసం చేశారు. అక్కడా, పంజాబ్‌లోనూ బీజేపీ కార్యక్రమాలను ఉద్యమకారులు అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్ని సకాలంలో చక్కదిద్దటం ఎంతో అవసరం. లేనట్టయితే సమాజంలో తీవ్ర అశాంతి ఏర్పడుతుంది. కొట్లాటలకు, ఘర్షణలకు దారితీస్తుంది. అయినా పాలకులు దిద్దుబాటు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో అనూహ్యం. బహుశా దీన్ని గమనించే సుప్రీంకోర్టు ధర్మాసనం చట్టాల అమలును ఆపుతారా, మమ్మల్నే ఆ పని చేయమంటారా అని ప్రశ్నించింది. ఏదైనా జరిగితే అందరం బాధ్యులం కావాల్సివస్తుందని హెచ్చరించింది. ఉద్యమంతో వ్యవహరిస్తున్న తీరుపై తమకు తీవ్ర అసంతృప్తి వున్నట్టు తెలిపింది. కేవలం పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని రైతులు మాత్రమే చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు కేంద్రం చెబుతున్న మాటల్ని కూడా ధర్మాసనం విశ్వసించినట్టు కనబడటం లేదు. చట్టాలు తీసుకురావటానికి ముందు ఎలాంటి సంప్రదింపుల ప్రక్రియ అనుసరించారో తెలియదు గానీ అనేక రాష్ట్రాలు వీటిని కాదంటున్నాయని కూడా అటార్నీ జనరల్‌ను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే అనడం గమనించదగ్గది. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవటం, వాటిపై ప్రజల్లో వ్యతిరేకత రావటం సర్వ సాధారణం. అటువంటప్పుడు ఆందోళన చేస్తున్నవారితో చర్చించటం, ఆ నిర్ణయాలకు దారితీసిన పరిస్థితుల గురించి వారికి నచ్చజెప్పటం కూడా మామూలే. సుప్రీంకోర్టు లోగడ రైతుల ఆందోళన గురించి అడిగినప్పుడు వారితో చర్చిస్తున్నామని కేంద్రం తెలిపింది. చర్చలైతే జరుగుతున్నాయి. కానీ పరిష్కారం కనుచూపు మేరలో కనబడటం లేదు. సాగు చట్టాల రద్దు ఒక్కటే తమ ఏకైక డిమాండని రైతులు చెబుతున్నది వాస్తవమే అయినా, వారిలో భయాందోళనలు కలిగిస్తున్న అంశాలు ఏ రకంగా అర్థరహితమైనవో చెప్పగలగాలి. ఆర్డినెన్సులు తెచ్చేముందు... వాటి స్థానంలో చట్టాలు చేసేముందు రైతులందరితో చర్చించామని కేంద్రం అంటున్నది. కానీ ఆ చర్చల్లో కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) వంటి ప్రాథమిక అంశాన్నయినా ఎవరూ కేంద్రం దృష్టికి తీసుకురాలేదా అన్న సంశయం కలుగు తుంది. అలాగే ఈ చట్టాల వల్ల మండీలతో సంబంధం లేకుండా రైతులు తమకు నచ్చినచోట సాగు ఉత్పత్తులను అమ్ముకోవచ్చునని చెప్పే మాట కూడా రైతులు నమ్మకపోవటానికి కారణం బిహార్ వంటిచోట్ల వున్న అధ్వాన్న స్థితే. అక్కడ ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు రైతులు తెగనమ్ముకోవాల్సి వస్తున్నదని ఉద్యమకారులు చెబుతున్నారు. సాగు చట్టాలపై రైతుల్లో వున్నవి అపోహలే కావొచ్చు. కానీ వాటిని పోగొట్టడానికి ప్రయత్నించే బదులు అసలు చట్టాలు రద్దు చేసేదే లేదని చెప్పటం వల్ల రైతుల ఆందోళన సమసిపోతుందా? కనుకనే ఈ విషయంలో ప్రతిష్టకు పోవొద్దు. సుప్రీంకోర్టు సూచించిన విధంగా సాగు చట్టాల అమ లును కొంతకాలంపాటు నిలిపివేయటమే మంచిదేమో ఆలోచించాలి. అలా చేయటం వల్ల రైతులు తమ ఆందోళన విరమించి స్వస్థలాలకు వెళ్తారు. ఉద్రిక్తతలు ఉపశమిస్తాయి. ఆ చట్టాలను వివిధ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చూపగలిగితే రైతుల్లో కూడా పునరాలోచన కలగవచ్చు. ఢిల్లీలో వున్న శీతల వాతావరణం ఇప్పటికే రైతుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. ఉద్యమాన్ని నిర్వహిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) చెబుతున్న లెక్కల్ని బట్టి ఇప్పటికి 47మంది అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈ స్థితిని గమనించే వృద్ధులు, మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కనుక ఇరుపక్షాలూ పట్టువిడుపులతో వ్యవహరించటం, ఒక పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించటం అన్నివిధాలా శ్రేయస్కరం. -
మహిళా రైతుల ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయ్
రెండు నెలలుగా ఢిల్లీలో రైతుల పోరు. మళ్లీ ఈరోజు ప్రభుత్వంతో చర్చలు. నేటి చర్చల్లో ప్రభుత్వం ‘ఓకే’ అనలేదా.. ఈ ఏడాది ఢిల్లీలో రెండు పరేడ్లు! ఒకటి.. గణతంత్ర దినోత్సవ శకటాల పరేడ్. రెండు.. రైతుల రణన్నినాద ట్రాక్టర్ పరేడ్. ట్రాక్టర్ పరేడ్‌లోకి మహిళలూ దిగుతున్నారు. అందుకోసమే వాళ్లు హైవే పైకి వచ్చి.. ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు! బండెనక బండి కట్టి మహిళలు కదలక ముందే.. ప్రభుత్వంలో కదలిక వస్తుందా? రైతులకు, ప్రభుత్వానికి కొద్ది వారాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పరోక్ష యుద్ధం జరుగుతోంది. రైతుల కోసం గత సెప్టెంబరులో పార్లమెంటు తెచ్చిన చట్టాలు మంచివని ప్రభుత్వం అంటుంటే.. ఆ చట్టాలు తమ బతుకును కోరేవి కాకపోగా బలి తీసుకునేవని రైతులు భావిస్తున్నారు. అందుకే ఆ చట్టాలను రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఢిల్లీకి నలువైపులా ఎండకు, వానకు, చలికి చలించకుండా సరిహద్దుల్లో టెంట్లు వేసుకుని కూర్చున్నారు. మళ్లీ ఈ రోజు (జనవరి 8) చర్చలు జరుగుతున్నాయి. ఇవీ విఫలమైతే? విఫలమైన మరుక్షణం నుంచే రైతు రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ల నుంచి రైతులు ట్రాక్టర్లు వేసుకుని ఢిల్లీ బయల్దేరతారు. జనవరి 26 నాటికి ఢిల్లీ చేరుకుంటారు. గణతంత్ర దినోత్సవం రోజు రిపబ్లిక్‌డే పరేడ్కి సమాంతరంగా ట్రాక్టర్ పరేడ్ జరుపుతారు. రైతు సంఘాల పోరు ప్రణాళిక ఇది. ఇందుకు మహిళా రైతులూ ట్రాక్టర్లు నడుపుకుంటూ ఢిల్లీ వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ట్రాక్టర్ నడపడం రాని మహిళలు సైతం హైవే మీదకు వెళ్లి ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటున్నారు. మొదట ఇందుకు హర్యానా మహిళా రైతులు మార్గదర్శకులు అయ్యారు. హర్యానాలోని రొహ్టాక్లో ట్రాక్టర్ పరేడ్‌కు రిహార్సల్స్ వేస్తున్న మహిళా రైతులు ట్రాక్టర్ పరేడ్ కోసమే మహిళలు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకోవడం పోరాట పథానికి ఒక కొత్త ఆదర్శం అయింది. అంతే కదా. ఇప్పుడు ఆడవాళ్లూ డ్రైవింగ్ నేర్చుకుని టూ–వీలర్లు, ఫోర్ వీలర్లు నడుపుతున్నప్పటికీ అదంతా ఆసక్తి ఉన్నందువల్లనో, అవసరం అయినందు వల్లో. అయితే ఒక ఉద్యమ పోరాటంలో పాల్పంచుకోడానికి మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవడమే మరింతగా అభినందించాల్సిన సంగతి. అయితే మహిళా రైతు ఉద్యమకారులెవరూ అభినందనల్ని పట్టించుకునేంత స్థిమితంగా లేరు. హర్యానాలోని జింద్ జిల్లాలో గత సోమవారం నుంచీ జింద్–పటియాలా నేషనల్ హైవే మీద ఖట్కర్ టోల్ ప్లాజా సమీపంలో మహిళలు దీక్షగా ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. టోల్ ప్లాజా వాళ్లు కూడా వారి దగ్గర రుసుమేమీ వసూలు చేయడం లేదు! అదీ ఒక విధంగా రైతు ఉద్యమానికి మద్ధతు తెలియజేయడం అనుకోవాలి. ఆ ప్రదేశంలో డ్రైవింగ్ శిక్షణ పగలంతా మూడు విడతలుగా జరుగుతోంది. ట్రాక్టర్ స్టార్ట్ చెయ్యడం, స్టీరింగ్ తిప్పడం, వాహనానికి రెండువైపులా వచ్చే వాహనాలను అద్దాల్లో చూస్తూ రోడ్డు రెండు వైపులను పరిశీలిస్తూ ట్రాక్టర్ నడపడం వంటి ప్రాథమిక విషయాలను డ్రైవింగ్ వచ్చిన బంధువుల నుండి, ప్రత్యేక శిక్షకుల ద్వారా ఈ మహిళలంతా నేర్చుకుంటున్నారు. ‘‘ఇది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వం దిగి రాకుంటే ఈసారి నేరుగా ఎర్రకోటలోకే మా ట్రాక్టర్లు దూసుకువెళ్తాయి’’ అని 38 ఏళ్ల నైన్ అంటున్నారు. ట్రైనింగ్ అవుతున్న మహిళలో నైన్ ఒకరు. నైన్ ఖట్కర్ గ్రామ మహిళ. అదే గ్రామం నుంచి ట్రాక్టర్ నేర్చుకోడానికి వచ్చిన వారిలో సరోజ్ కూడా ఉన్నారు. ఆమెకు 35 ఏళ్లు. ‘‘నేను రైతు కూతుర్ని. రైతులపై ప్రభుత్వం ఇప్పటికే అనేక అరాచకాలకు పాల్పడింది. ఇప్పుడైతే మేము అస్సలు వెనక్కు తగ్గాలని అనుకోవడం లేదు. ఇది రెండో స్వాతంత్య్ర సంగ్రామం అనుకోండి’’ అంటున్నారు సరోజ్. విజయేందర్ సిం«ధూ, సత్బీర్ పెహల్వాల్ కూడా అదే మాట చెబుతున్నారు. సత్బీర్ వయసులో పెద్దావిడ. అయినా ధైర్యంగా ట్రాక్టర్ నేర్చుకోడానికి వచ్చారు. ‘‘ఇప్పుడు మేము మౌనంగా ఉంటే, మా తర్వాతి తరం వారికి ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా నోరు తెరిచే అవకాశమే ఉండదు. మా పిల్లలు సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్నారు. మా భర్తల్ని మాత్రం లోనికి పోనివ్వకుండా ఢిల్లీసరిహద్దుల్లోనే ఆపేశారు. ఏమైనా న్యాయంగా ఉందా?’’ అని సత్బీర్ అడుగుతున్నారు. రైతు సంఘాల వారికి, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య ఇప్పటివరకు ఏడుసార్లు చర్చలు జరిగాయి. ఒక్కటీ సఫలం కాలేదు. ఎనిమిదో రౌంyŠ చర్చలు ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్నాయి. రైతులు కోరుతున్నట్లు ఆ మూడు సాగుచట్టాల్ని ప్రభుత్వం రద్దు చేసిందా, కనీసం మార్పులు చేర్పులు చేసిందా.. ఢిల్లీలో ఒకే పరేడ్ జరుగుతుంది... గణతంత్ర దినోత్సవ పరేడ్. రైతుల డిమాండ్లకు ప్రభుత్వం తలవొగ్గలేదా.. ట్రాక్టర్ పరేడ్ తప్పని వాతావరణం ఏర్పడుతుంది. ‘‘ఇప్పటి వరకు రైతు ఉద్యమాన్ని మాత్రమే ప్రభుత్వం చూసింది. ఇకముందు మహిళా రైతు దళం బలాన్ని కూడా కూడగట్టుకున్న రైతు మహోద్యమాన్ని చూడవలసి ఉంటుంది. అది మరింత తీవ్రంగా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటున్న హర్యానా మహిళలు. -
రైతు పోరాటంపై పంజాబ్ ముద్ర
దేశంలో ఏ ప్రాంతంలోని రైతు సంఘాలకంటే పంజాబ్ రైతు సంఘాలు, రైతులు కేంద్రప్రభుత్వ నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం కొనసాగిస్తున్నారు. కనీస మద్దతు ధరను డిమాండ్ చేయడం కంటే, తమ శ్రమశక్తిని అంగట్లో పెట్టి కొల్లగొట్టాలని చూస్తున్న భారతీయ కార్పొరేట్లను నిలువరించడానికే పంజాబ్ రైతులు ఇప్పుడు పోరాడుతున్నారు. న్యాయమైన పోరాటం చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా రైతుల విశేష మద్దతును వారు కూడగట్టగలిగారు. అదే సమయంలో తమ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ముందుకొచ్చే రాజకీయ జిమ్మిక్కుల పట్ల కూడా పంజాబ్ రైతులు అప్రమత్తంగా ఉంటూవచ్చారు. ఈ అప్రమత్తత, దృఢనిశ్చయమే తమపై జరుగుతున్న హిందుత్వ దాడిని పంజాబ్ రైతులు తిప్పికొట్టగలిగేలా చేసింది. నూతన వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న రైతుల నిరసన.. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని సాధించుకోవడానికి లేక మూడు కొత్త చట్టాల రద్దు కోసం మాత్రమే కాదు. తగిన విలువను చెల్లించకుండానే రైతుల శ్రమశక్తిని అపహరించుకుపోవాలని చూస్తున్న భారతీయ సంపన్న పెట్టుబడిదారులను నిలువరించడానికే ఇప్పుడు రైతుల పోరాటం జరుగుతోంది. ఈ పోరులో సిక్కు కమ్యూనిటీకి చెందిన రైతులే ఎక్కువగా ముందుపీఠిన నిలబడటానికి అనేక కారణాలు తోడవుతున్నాయి. ఎలాంటి చర్చలూ లేకుండా, రైతు సంఘాలను విశ్వాసంలోకి తీసుకోకుండానే.. కేంద్రప్రభుత్వం వివాదాస్పదమైన ఈ మూడు సాగు చట్టాలను పార్లమెంటులో హడావుడిగా ఆమోదింపజేసుకున్నప్పుడే దాంట్లోని ప్రమాదాన్ని పంజాబ్ రైతులే మొట్టమొదటగా గ్రహించారు. పంజాబ్‌లోకి సైనిక దళాలను నాటి ప్రధాని ఇందిరాగాంధీ పాలనాయంత్రాంగం పంపించినప్పుడు అంటే 1980ల మొదట్లో పంజాబ్ సిక్కులు చివరిసారిగా కేంద్రంతో తలపడ్డారు. అప్పట్లో ఖలిస్తాన్ ఉద్యమానికి విస్తృత స్థాయిలో మద్దతు లేదు. కానీ ఇప్పుడు సిక్కు రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా రైతులను సమీకరించడమే కాకుండా, వారి విశేష మద్దతును కూడా కూడగట్టగలిగారు. అందుకే రైతాంగ ఉద్యమంలో ముందుండి పోరాడిన హీరోలుగా వీరు భారతీయ చరిత్రలో స్థానం సంపాదించుకోనున్నారు. సిక్కు రైతులు ఖలిస్తాన్ ఉగ్రవాదులా? ఆరెస్సెస్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కలిసి కంగనా రనౌత్ వంటి ప్రచారకుల దన్నుతో, పంజాబ్ సిక్కు రైతులను ఖలిస్తానీ ఉగ్రవాదులుగా చిత్రించడానికి ప్రయత్నించాయి. కానీ సిక్కు రైతాంగ యువత ఉన్నత విద్యను పొందడమేకాదు.. వారు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నందున హిందుత్వ సైన్యానికి సరైన సమాధానం ఇవ్వగలిగారు. ఆరెస్సెస్, బీజేపీలు నియంత్రణలో లేని తమ బలగాలను ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరీలపై ప్రయోగించినట్లు, పంజాబ్ రైతులపై ప్రయోగిస్తే ఒక జాతిగా భారత్ ప్రమాదంలో పడుతుంది. పైగా దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోని రైతాంగం కంటే సిక్కు రైతులు మెరుగైన పోరాటం చేయగలరు. అదే సమయంలో తమ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ముందుకొచ్చే రాజకీయ జిమ్మిక్కుల పట్ల కూడా పంజాబ్ రైతులు అప్రమత్తంగా ఉంటూ వచ్చారు. ఈ అప్రమత్తత, దృఢనిశ్చ యమే తమపై జరుగుతున్న దాడిని పంజాబ్ రైతులు తిప్పికొట్టగలిగేలా చేసింది. పైగా దేశవ్యాప్తంగా రైతులు వారి ఉద్యమంలో భాగమయ్యేలా కూడా చేసింది. మరొకవైపు బాలీవుడ్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చిత్ర పరిశ్రమ కూడా న్యాయంకోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిలబడింది. రైతులు భారతదేశ ఆహార సైనికులు అని చిత్రసీమ ప్రముఖులు వర్ణించారు. ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న రైతు సైనికులు లేనిదే సరిహద్దుల్లో సైనికులు కూడా నిలబడలేరు. ఆరెస్సెస్, బీజేపీలు రైతు సైనికులను జాతీయవాదులుగా ఎన్నడూ గుర్తించలేదు పైగా దేశంలోని బడా వ్యాపార కుటుంబాలను మాత్రమే వారు నిజమైన జాతీయవాదులుగా ఆరాధిస్తున్నారు. శ్రమను గౌరవించడం సిక్కు రైతులు ఇలా ఇప్పుడు దుడ్డుకర్రలు ఎందుకు పట్టుకున్నారంటే తమ శ్రమను కాపాడుకోవడం కోసమే. సిక్కు మతంలో శ్రమించడానికి అపారమైన విలువ ఉంది. సాపేక్షికంగా చూస్తే సిక్కులలో కులతత్వం తక్కువగా ఉంటున్నందుకు తగిన మూలాలు ఇక్కడే ఉన్నాయి. సిక్కులలో మెజారిటీ ప్రజలు జాట్లు. చారిత్రకంగా వీరు శూద్ర వర్ణానికి చెందినవారు. ఐక్య పంజాబ్‌లో వీరు ద్విజుల చేతుల్లో నానా బాధలకు, అవమానాలకు గురయ్యారు. గురునానక్ సిక్కుమతం స్థాపిం చాక ఆయన, అనంతర సిక్కు గురువుల బోధనలను, శ్లోకాలను గురుగ్రంథ సాహిబ్ గ్రంథంలో పొందుపర్చారు. వర్ణ వ్యవస్థ నుంచి, శ్రమను అగౌరవపర్చడం నుంచి సిక్కు సమాజం విముక్తి పొందడానికి ఇది పునాది వేసింది. ఇది శూద్ర శ్రామికులలో ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చింది. వారి స్థాయిని మార్చి సమానమైన, గౌరవం కలిగిన సభ్యులుగా కలిపేసుకుంది. అయితే పంజాబ్‌లో దళిత సిక్కులు సామాజిక వివక్షను ఎదుర్కొనడం లేదని దీనర్థం కాదు. అయితే సిక్కు కమ్యూనిటీ హిందుత్వ వాదుల స్థాయి కులతత్వాన్ని కలిగిలేదు. అలాగే ఆ స్థాయిలో వీరు వర్ణధర్మాన్ని పాటించడంలేదు. దళిత సిక్కులకు ప్రపంచవ్యాప్తంగా తమవైన రవిదాసి గురుద్వారాలు ఉన్నాయి. పైగా దళిత సిక్కులు ఉన్నత విద్యావంతులై, సిక్కుమతంలో భాగంగా ఉంటూనే తమదైన స్వతంత్ర ఆధ్యాత్మిక, సామాజిక అస్తిత్వాన్ని కలిగి ఉన్నారు. సిక్కు మతాన్ని హిందూ మతంలో భాగంగా చిత్రించడానికి హిందుత్వవాదులు ప్రయత్నిస్తున్నప్పటికీ తమను హిందూమతంలో కలిపేసుకోవడంలో భాగంగా అలా చేస్తున్నారని సిక్కులు స్పష్టంగా గ్రహించారు కాబట్టి హిందుత్వ వాదుల ఆటలు చెల్లడం లేదు. పైగా గురుగ్రంథ సాహిబ్ గురించి తగుమాత్రం జ్ఞానం కలిగి వున్న ఏ సిక్కు అయినా సరే లింగ భేదంతో పనిలేకుండా గ్రంథి అయిపోతారు. ఇది హిందూయిజానికి భిన్నమైనది. సిక్కుమతంలో ఉన్న అలాంటి లింగపరమైన ఆధ్యాత్మిక తటస్థత, ఉత్పత్తి క్రమం, వ్యవసాయ ఉత్పత్తిలో వారి సామూహిక శ్రమ భాగస్వామ్యం, సామర్థ్యత వంటివి పంజాబ్‌ను భారతదేశ ధాన్యాగారంగా మార్చాయి. వ్యవసాయ ఉత్పత్తిలో కులరహిత, లింగ తటస్థతతో కూడిన ఇలాంటి భాగస్వామ్యాన్ని ఆరెస్సెస్, బీజేపీ ఎన్నడూ కోరుకోలేదు. పైగా వర్ణ ధర్మ పరంపరను కొనసాగించడంపై వీరు నొక్కి చెబుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా పొలంలో పనిచేయడం అనే సామాజిక పునాదిలోనే పంజాబ్ వ్యవసాయ పురోగతికి మూలాలున్నాయి. ఇకపోతే గురుద్వారాలలో చేసే కరసేవ ఇప్పటికే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. గురుద్వారాలు ప్రత్యేకించి అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించే ఏ వ్యక్తికైనా అక్కడ ఉచిత భోజనం లభిస్తుంది. కులపరమైన సాంస్కృతిక అగౌరవం చూపకుండానే సంపన్నులు సైతం ఆలయాల్లో శ్రామిక సేవను సాగించే ఇలాంటి సంస్కృతి.. తామే నిజమైన హిందూ జాతీయవాదులుగా ప్రచారం చేసుకుం టూండే ఆరెస్సెస్–బీజేపీ అజెండాలో ఎన్నడూ లేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలను ఘనంగా ప్రచారం చేసుకుంటోంది కానీ, ఆధ్యాత్మిక–మత వ్యవస్థలో శ్రమ గౌరవాన్ని చొప్పించకుండా ఈ పదాలకు అర్థమే ఉండదు. సజీవ వ్యత్యాసం సకల జనుల శ్రేయస్సుకోసం పనిచేయడం, కరసేవ (అందరి శ్రేయస్సు కోసం శారీరక పనిచేయడం) గురించి సిక్కుమతం నొక్కి చెబుతుంటుంది. ఈ రెండూ గురు గ్రంథ్ ఆధ్యాత్మిక సిద్ధాంతంలో రెండు విశిష్ట భావనలు. బ్రాహ్మణవాదానికి వీటి గురించి ఏమీ తెలీని సమయంలోనే సిక్కు గురువులు శ్రమగౌరవానికి చెందిన భావనను గొప్పగా నెలకొల్పారు. హిందుత్వ భావజాలంలో శూద్ర/దళిత రైతులు, కూలీలకు ఏమాత్రం గౌరవం ఉండదు. వీరిని మనుషులుగానే లెక్కించరు. కానీ పంజాబ్ వెలుపల భారతీయ ఆహార వ్యవస్థకు వీరే మూలస్తంభాలుగా ఉంటున్నారు. హిందూ ఆధ్యాత్మిక, సామాజిక వ్యవస్థలో వ్యవసాయ పనికి గౌరవం కల్పించే వైపుగా మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. దానికి బదులుగా సామాజిక, ఆర్థిక మార్పులకు ఎన్నడూ దోహదం చేయని, మేటపడిన తమ సంపదను విస్తృత ప్రజానీకం శ్రేయస్సు కోసం ఖర్చుపెట్టకుండా పేద రైతులను దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉంటున్న గుత్త పెట్టుబడిదారులను అనుమతించే తరహా సాగు చట్టాలను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సిక్కు రైతులు ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తి జ్ఞానాన్ని తమ వెన్నెముకగా చేసుకున్న బలమైన ప్రపంచవ్యాప్త కమ్యూనిటీలో భాగమయ్యారు. అటవీ భూములను సాగు చేయడానికి వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలసపోయారు. ఈ క్రమంలో ఆయా దేశాల గౌరవనీయ పౌరులుగా మారిపోయారు. ఇప్పుడు వీరు కెనడాలో కీలకమైన రాజకీయ శక్తిగా ఉన్నారు. భారతదేశం వినమ్రంగా వీరి నుంచి నేర్చుకోవాలి. అలాగే సిక్కు కమ్యూనిటీని కించపర్చడంకోసమే నిరంతరం ప్రయత్నిస్తున్న తన శక్తులకు ఆరెస్సెస్– బీజేపీ పగ్గాలు వేయాల్సి ఉంది. సిక్కు సమాజాన్ని కించపర్చడాన్ని వీరు ఎంత ఎక్కువగా కొనసాగిస్తే అంతగా వీరు దేశంలోనే కాకుండా ప్రపంచం ముందు కూడా పలచన అయిపోవడం ఖాయం. ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
వివాదాస్పద ట్వీట్ : కంగనాకు కోర్టు ఝలక్
సాక్షి, బెంగళూరు: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు ఎదురు దెబ్బ తగిలింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై ఉగ్రవాదులంటూ నోరు పారేసుకున్న కంగనాకు కర్నాటక కోర్టు ఝలక్ ఇచ్చింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కర్నాటక లోని స్థానిక కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిర్యాదు కాపీని అందించాలని కూడా క్యతాసంద్ర పోలీస్ స్టేషన్ అధికారులకు ఆదేశాల్చింది. తుమకూరులోని ఎల్ రమేష్ నాయక్ అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ చర్య తీసుకుంది. (రోజూ వార్తల్లో ఉండకపోతే కంగనాకు భయం) కాగా వ్యవసాయ బిల్లులకు (చట్ట రూపం దాల్చకముందు) నిరసన తెలుపుతున్న వారిని ఉగ్రవాదులుగా పోలుస్తూ కంగనా సెప్టెంబర్ 21న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. వీటి గురించి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఇదే దేశంలో పలు ప్రాంతాల్లో నిరసనకు దారితీసిందని ఆరోపించింది. అంతేకాదు సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేసినవారే ఈ ఉద్యమాన్ని కూడా చేపట్టారని, భీభత్సం సృష్టిస్తున్నారని కంగనా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. -
డెమోక్రసీ ‘నాల్గవ స్తంభం’లో పగుళ్లు!
పత్రికా స్వేచ్ఛ అనేది వ్యాపార స్వేచ్ఛలో భాగమైపోవడమే అత్యంత విస్మయకరం, విచా రకరం. పత్రిక అనేది ఒక వ్యాపారం కానప్పుడే అది స్వేచ్ఛగా ఉన్నట్టు లెక్క. అందుకే అది వ్యాపారానికి దూరంగా ఉండాలి. – కారల్ మార్క్స్ (లిటరేచర్ అండ్ ఆర్ట్స్) అనుమాన పిశాచమనే నీడలో హేతువు, రుజువు, కారణం నిలవవు, ఓడిపోతాయి. న్యాయం చచ్చిపోతుంది. అలాగే కొందరు జర్నలిస్టులు కూడా తాము ఏదో ఎదిగిపోవాలన్న తొందరలో అర్థసత్యాలతో ఏపగింపు కల్గిస్తూ అవే అంతిమ సత్యాలుగా పాఠకులపై రుద్దేస్తూ తమ స్వేచ్ఛను దుర్వినియోగపరచుకుంటారు. ఈ తెచ్చిపెట్టుకున్న దురద పనికిమాలిన చిల్లర మల్లర చెత్త పత్రికలకు వర్తిస్తుందే గానీ ఉత్తమ ప్రమాణాలతో నడిచే గొప్ప పత్రికలకు వర్తించదు. దేన్ని బడితే దాన్ని, ఎవరు ఏది చెబితే దాన్ని నమ్మేవారు మసాలా కబుర్లలో ఆనందం పొందే బాపతు మాత్రమే, ఏది నిజమో, ఏది కట్టుకథో తేల్చుకోలేని వారు మాత్రమే తాత్కాలిక ఆనందానికి లోనవుతారు. కానీ వ్యక్తుల వ్యక్తిత్వాలను నర్మగర్భంగా, ముసుగువేసి నాశనం చేయడానికి అత్యుక్తులు రాసి సెన్సేషనలిజం ద్వారా సర్క్యులేషన్ పెంచుకునే ధోరణి– ఉత్తమ ప్రమాణాలు గల పత్రికలకు పడదు. పచ్చి అబద్ధాలను ఎదుర్కో వడమూ ఆ క్రమంలో కష్టసాధ్యమే. అందుకే ఉత్తమ ప్రమాణాలు గల పత్రికల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇదే క్షమించదగిన జర్నలిజా నికి, క్షమార్హంకాని జర్నలిజానికి మధ్య ఉన్న తేడా. – జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ (ఫ్రమ్ బెంచ్ టు ది బార్ పేజీ. 210) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) మానవాళికి ఎన్ని రకాల అనంతమైన అవకాశాలను ప్రసాదించిందో అంతకన్నా మించిన అనర్థాలను కూడా బలవంతంగా రుద్దుతోంది. యాప్‌లు, వాట్సాప్‌లు, లింకులు, వెబ్ లింకులు, మొబైల్స్, సూట్ కేసులో ఇమిడిపోయే కూపీ (ట్రాకింగ్) వ్యవస్థలూ, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు (పాత టెలిగ్రామ్ భాషను అప్పటికప్పుడు ఆధునికంగా వండివార్చే, బాజా సాధనం) ఇలా సవాలక్ష ముమ్మరిస్తున్న దశలో ఉన్నాం. జుకర్ బర్గ్ రంగంలోకి వచ్చి ఫేస్ బుక్ అనే కూపీ వ్యవస్థను నర్మగర్భంగా రంగంలోకి దించి దేశీయ సాంకేతిక, ఆర్థిక వ్యవస్థలను దేశాల ప్రయోజనాలకు విరు ద్ధంగా దేశీయ ప్రజలే ప్రయోగించేలా చేశాడు. ఆ మాటకొస్తే ఒకప్పుడు చైనీయులపైన నల్లమందు చల్లి, నల్లమందు భాయిలుగా బ్రిటిష్ వాడు ప్రచారం చేసినట్లే జుకర్‌బర్గ్ కూడా ఫేస్బుక్ ద్వారా భారతీయుల వ్యక్తిగత ఫోన్ల సమాచారాన్ని కోట్ల సంఖ్యలో ఫేస్ బుక్‌లో నమోదు చేసి అమెరికా, బ్రిటన్ మాళిగల్లో నిర్లిప్తంచేసి పెట్టాడు. అలా అని బీజేపీ పాలకులు జుకర్‌బర్గ్ ఫేస్బుక్ మనకే ఉపయోగిస్తుందని మురిసిపోయే సమయానికి మన పాలకుల గుట్టు మట్టుల్ని కూడా ఫేస్బుక్లో నిక్షిప్తం చేసేసరికి పాలకులు లబోదిబో మంటున్నారు. ఈ బాగోతం కాలిఫోర్నియాలో మన ప్రధాని హుషా రుగా జుకర్‌బర్గ్‌ను కలుసుకుని కరచాలనం చేసినంత సేపు పట్టలేదు. ఇప్పుడు బీజేపీ వారు జుకర్‌బర్గ్ బీజేపీ రహస్యాలను ప్రైవేట్ వ్యాపార ప్రయోజనాల్లో భాగంగా ఫేస్బుక్ ద్వారా బట్టబయలు చేస్తున్న దశలో ఫేస్‌బుక్‌పై చర్యలు తీసుకోవాలని గగ్గోలు పెడు తున్నారు. మనం చైనాపై ‘గుర్రు’తో డజన్లకొద్దీ టిక్ టాక్‌లను, అప్పో లను నిషేధించినట్లు ప్రకటించుకున్నా అమెరికాతో మనకు పైన వేసు కున్న లింకుల వల్ల జుకర్‌బర్గ్‌ను వదిలించుకోలేము. అమెరికాలో జూకర్బర్గ్ బంధించి ఉంచిన మన ఫోన్ నంబర్లనూ విడుదల చేయించుకోలేని దుస్థితి ఈ సాంకేతిక ఉచ్చు మనచుట్టూ బిగియడానికి కారణం.. మన సర్వర్ల ‘బిస’ అంతా అమెరికాలోనే ఉండటం! ఆంధ్ర ప్రదేశ్‌లో టెక్నాలజీ మాయ చాటున కొన్ని తొత్తు పత్రికలు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్నీ, అటు రాష్ట్ర న్యాయ వ్యవస్థనూ కూడా అబద్ధాల అల్లికతో అభాసుపాలు చేయడానికి సంకల్పించి తప్పుడు కథనాలకు తెరలేపుతున్నాయి. న్యాయవ్యవస్థకూ చట్టబద్ధంగా ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య గండికొట్టి, అడుగువూడిన పాత పాలకులకు ప్రాణప్రతిష్ట చేయాలన్న తాపత్రయంకొద్దీ ‘న్యాయదేవతపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా’ అంటూ అశరీరవాణి కథనాలు అల్లుతోంది: ఒక్క దానికీ రుజువులు లేవు. పైగా రాష్ట్ర హైకోర్టు పేరును దుర్వినియోగపరుస్తూ, అలాంటి అలవాటులోనే ఉన్న ఆ ‘కెప్ట్ ప్రెస్’ అల్లిన కథనం అంతా ఆధునిక టెక్నాలజీ మెలకువలన్నింటినీ దుర్వినియోగం చేసి, ఆ కథనానికి తానే కర్త, కర్మ, క్రియగా మారిన మాస్టర్ అల్లిక అది. ఆ పత్రిక అల్లికల్లోని అంశాలు స్థూలంగా: ‘న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్? వెబ్‌లింక్ ద్వారా మొబైల్‌పై వల; వాట్సాప్ సందేశాలపైన నియంత్రణ, చదవక ముందే రీడింగ్‌మోడ్ లోకి, మాటల్లో అస్పష్టత, సమస్యలపై సాంకేతిక నిపుణులతో పరీక్ష, నెట్వర్క్ మొబైల్ మాత్రం బాగుందని నిర్ధారణ– అయినా అంతు చిక్కని ఇబ్బందులు అయినా నిఘాయే కారణమని అనుమానం, సూట్‌కేసులో ఇమిడిపోయే ట్రాకింగ్ వ్యవస్థ’ వల్ల ‘ఆధునిక టెక్నాలజీతో ఈ పనులన్నీ అత్యంత సులభమని’ ఆ కథనం సారాంశం. ఆ మొత్తం కథనం అంతా ఆధారపడింది వాస్తవాలపైన కాదు, పూర్తిగా ‘సొంత డబ్బా’పైననే! ‘న్యాయాన్ని అమ్మేవాడూ, దోవలు దోచేవాడూ ఒకటే’నన్న జగమెరిగిన మన తెలుగు సామెత. ఆ మాటకొస్తే అబద్ధం అంటేనే అతుకులమూట అనీ, అల్లిన కథనం దాచినా దాగని సత్యమనీ ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నిజానికి ‘న్యాయదేవతపై నిఘా’ వేసే తెలివితేటలు గాడితప్పి వ్యవహరిస్తున్న నడమంత్రపు పాత్రికేయులకు తప్ప వృత్తి ధర్మాన్ని, ప్రమాణాలను పాటించే వారికి ఉండజాలవు. రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో వైఎస్ జగన్ తనకు మించిన దీటైన పోటాపోటీతో తలపడి ‘ఢీ’కొనగల సత్తా ఉన్నవాడని భావించినందునే లోలోన టీడీపీ అధినేత చంద్రబాబు కుమిలిపోయాడు. అందుకే తప్పుడు ఆరోపణల పైన కుట్ర ద్వారా 16 మాసాలపాటు జైలుపాలు చేశాడని లోకానికి తెలిసి పోయింది. అయినా గత ఆరేళ్లకుపైగా సీబీఐ స్పెషల్ కోర్టులూ ఎంతసేపు ‘ఏవి మీ ఆధారాలు’ అని నిరంతరం ప్రశ్నిస్తూ ఉన్నా ఈ రోజుదాకా జగన్‌పై కేసులు అలా కొనసాగడం రాజ్య వ్యవస్థలో, న్యాయ వ్యవస్థల్లో చెండితనానికి నిదర్శనం కాదా? అంతేగాదు, చివరికి ‘ఆదాని శాసిస్తాడు/మోదీ పాటిస్తాడు/ జగన్ జైలుకు, భార్య భారతి ముఖ్యమంత్రి కుర్చీపైకి’ అనేంతగా పాత్రికేయ అజ్ఞాని బరి తెగించడాన్ని ఇతరులే కాదు, న్యాయ వ్యవస్థ కూడా సహించరానిది. దేశంలో న్యాయవ్యవస్థ పనితీరును గమని స్తున్న వారికి గత 70 ఏళ్లలో మన రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ‘నాలుగు స్తంభాల’లో ఒకటైన పత్రికా వ్యవస్థతో పాటు మిగతా మూడు వ్యవస్థలు కూడా క్రమక్రమంగా ఎలా బీటలిచ్చి పోతు న్నాయో గమనించాల్సిన పరిణామం. దీనికి కారణం– ఈ రాజ్యాంగ వ్యవస్థలేవీ రాజ్యాంగం నిర్దేశిం చిన మౌలిక లక్ష్యాలకు కట్టుబడకుండా గాడితప్పి నడుచుకొంటు న్నాయి. బహుశా అందుకనే సు్రçపసిద్ధ సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ వీఆర్ కృష్ణయ్య కొన్ని విషయాలను ఇలా బాహాటంగా చెప్పగలిగారు: ‘న్యాయమూర్తులుగా పదవీ స్వీకారం చేసే ముందు రాజ్యాంగ నిబంధనలను కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ ప్రతిజ్ఞకు అర్థం– రాజ్యాంగం నిర్దేశించిన సోషలిస్టు, సెక్యులర్, ప్రజాస్వామ్య రాజకీయాలను పాటిస్తానని. ఇదెలా సాధ్యం? న్యాయమూర్తులకు రాజకీయ సిద్ధాంత తాత్వికత అనివార్యం. న్యాయమూర్తుల నియా మకం రాజ్యాంగం ప్రకారం జరిగిందిగానీ రాజ్యాంగానికి అతీతంగా జరగలేదు గనుక ఈ సైద్ధాంతిక నిబద్ధత అనివార్యం. ఒక కోటీశ్వ రుడు– మురికివాడల్లో నివసించే పేదవాడి ముందు నిలబడి నాకు రాజకీయాలు లేవు అని చెబితే అతణ్ణి మీరు నమ్ముతారా? అలాగే ఒక కార్మిక సంఘం నాయకుడు తన పారిశ్రామిక యజమాని ముందు నిల బడి నాకు రాజకీయాలు లేవంటే అది ఒట్టి తొండిమాట. రాజకీయా లున్నంత మాత్రాన వ్యక్తి న్యూనతగా భావించుకోరాదు. ‘నాకు రాజ కీయం’ లేదని దాచటం నేరం. మనం మనసిచ్చి భోళాగా మాట్లా డదాం. ఇతర వృత్తులలో ఉన్నవారి మాదిరిగానే న్యాయమూర్తులకు కూడా రాజకీయాలుంటాయి. కానీ, న్యాయ ప్రక్రియ అనేది మాత్రం కులాలకు, వర్గాలకు, సమూహాలకు అతీతం’! అంతేగాదు, కోర్టు ధిక్కార నేరాధికారాన్ని కోర్టు సమర్థించు కోవాలంటే, జరగాల్సిన న్యాయాన్ని జరగనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నంలో కోర్టు తన ‘ధిక్కార ప్రయోగా’న్ని సమర్థించడం సబబ వుతుందని జస్టిస్ బ్లాక్ (1943) నిర్ధారించాడు. అలాగే కోర్టు తీర్పును సదుద్దేశంతో విమర్శించే ఎవరినీ తప్పుబట్టరాదనీ, అలాంటి విమర్శ సామాన్యుడి హక్కు అనీ ప్రివీకౌన్సిల్‌లో ఏనాడో లార్డ్ అడ్కిన్ ప్రకటిం చాడు. అంతేగాదు, నిజం చెప్పాలంటే, వార్తా పత్రికల్లో వచ్చే విమ ర్శలవల్ల వృత్తి నైపుణ్యంగల ఏ న్యాయమూర్తీ ప్రభావితుడు కాడని క్వీన్స్ కౌన్సిల్ సీనియర్ సభ్యుడు, సుప్రసిద్ధ న్యాయమూర్తి లార్డ్ డెన్నింగ్ స్పష్టం చేశాడు. మీడియాలో వచ్చే విమర్శలకు ఏ న్యాయ మూర్తీ ప్రభావితం కాకనక్కర్లేదనీ, వాటిని వృత్తిరీత్యా వచ్చే ఇబ్బందు లుగానే భావించి న్యాయమూర్తులు కూడా ప్రజల విమర్శను శిరసా వహించడం ధర్మమని లార్డ్ సాల్మన్ ప్రకటించాడు. అన్నింటికన్నా ‘కోర్టు ధిక్కార నేరం’ అనే ఆరోపణల గురించి లార్డ్ డెన్నింగ్ ఒక శిలా శాసనంగానే లభించిన పరిపక్వమైన వాక్యాలను ప్రపంచ న్యాయ శాస్త్రవేత్తలు తరచుగా పేర్కొనడాన్ని మనం మరచిపోరాదు. ‘ఈ కోర్టు ధిక్కారమనే మన అధికారాన్ని మన న్యాయమూర్తుల సొంత గౌరవాన్ని ప్రదర్శించుకోవడానికి ఉపయోగించరాదు. స్పష్ట మైన సాక్ష్యంమీదనే ధిక్కార నేరం మోపాలి. అంతేగానీ మనను విమ ర్శించే వారిని అణచడం కోసం ఈ అధికారాన్ని వినియోగించరాదు. మనం విమర్శకు భయపడరాదు, విమర్శను వ్యతిరేకించరాదు. కానీ అంతకన్నా మనం కోల్పోయే అత్యంత ముఖ్యమైన ప్రాణప్రదమైన స్వేచ్ఛ ఒకటుంది– అదే భావప్రకటనా స్వేచ్ఛ. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన విషయాలపైన సరసమైన వ్యాఖ్య, భోళా విమర్శ చేసే హక్కు పార్లమెంటులోనూ, బయటా, పత్రికల్లోనూ, టీవీలలోనూ పౌరులకు ఉంది. మా ప్రవర్తనే అంతిమ సాక్ష్యంగా నిలబడాలి. అంతే గానీ, చుట్టూ చెడు జరుగుతుంటే మౌనంగా ఉండిపోవటం మార్గం కాదు’ అలా అని, పత్రికలు తమ సర్క్యులేషన్ పెంచుకోవడానికి అవధులు లేని స్వేచ్ఛతో ఇతరులపై తప్పుడు ఆరోపణలు, నిందలు వేయటానికి పూనుకోవటం భావ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే నని డెన్నింగ్ ప్రకటించాడు. అందుకేనేమో క్యూబా విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో అత్యంత స్పష్టంగా హెచ్చరించిపోయాడు– ‘నా ఒక్కడివల్లే, దేశం మారిపోతుందా? అనుకునే ఏ ఒక్కడివల్లా దేశానికి ప్రయోజనం లేదు’ అని!! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్ -
ఆ ‘దిశ’గా అతివకు అండగా...
సాక్షి, విశాఖపట్నం, అల్లిపురం(విశాఖ దక్షిణం): మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ఉద్ధేశించిన చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా బిల్లు చట్టంగా మారితే..అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మరణశిక్ష విధిస్తారు. అత్యాచారాన్ని నిర్ధారించే ఆధారాలు లభ్యమైతే కేవలం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టంలో మార్పులు తీసుకువస్తున్నారు. వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, మరో 14 రోజుల్లో విచారణ జరిపించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టంలో మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. అత్యాచారం, సామూ హిక అత్యాచారం, యాసిడ్ దాడు లు, వేధింపులు, లైంగిక వేధింపులు వంటి నేరాలకు విచారణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కో ర్టులు ఏర్పాటు చేయా లని మంత్రి వర్గం తీర్మానించింది. మహిళా భద్ర తపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తోంది. పోక్సో చట్టం... 18 ఏళ్లలోపు ఉన్న మైనర్లపై అత్యాచారం, అత్యాచారానికి యత్నించడం, నగ్నంగా చిత్రీకరించడం లాంటి వాటికి పాల్పడితే వారికి ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. లైంగిక దాడి చేసినా.. నగ్నంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించినా మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు ఖైదు తప్పదు. ఒక్కోసారి జీవితఖైదు కూడా విధించవచ్చు. అక్రమ రవాణా నిరోధక చట్టం.. బాలికలు, యువతులను అక్రమంగా రవాణా చేయడం, మాయమాటలు చెప్పి.. ఆశచూపి వారిని వ్యభిచార గృహాలకు అమ్మేయడం, బలవంతంగా వ్యభిచారం చేయించడం వంటివి నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనల్లో నిందితులకు రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. కేసు తీవ్రతను బట్టీ ఒక్కోసారి ఏడేళ్ల నుంచి జీవితఖైదు కూడా పడే అవకాశం ఉంది. బాల్య వివాహాల నిషేధ చట్టం... 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేయాలని చూడడం చట్టరీత్యానేరం. బాల్య వివాహాలు చేయాలని ప్రయతి్నంచిన వారికి రెండు ఏళ్ల జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. నిర్భయ చట్టం.. ►మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారికి ఏడేళ్ల పాటు జైలుశిక్ష లేదా.. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. శిక్ష అనుభవించి బయటకు వచ్చిన అనంతరం మరోసారి అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష తప్పదు. ►మహిళలను లైంగికంగా వేధించడం, వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించిన వారికి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ►సామూహికంగా లైంగికదాడికి పాల్పడిన వారికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష, మరోసారి అదేపని చేస్తే వారికి ఉరిశిక్ష తప్పదు. ►యాసిడ్ దాడికి పాల్పడిన వారికి పదేళ్ల జైలుశిక్ష, యాసిడ్ దాడికి ప్రయతి్నంచిన, బెదిరించిన వారికి ఐదేళ్ల పాటు ఖైదు తప్పదు. ► పనిచేసే ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా తాకడం, వేధించడం చేస్తే మూడేళ్ల పాటు జైలుశిక్ష, మహిళను వివస్త్రను చేసి వేధిస్తే మూడేళ్ల జైలు, జరిమానా విధిస్తారు. గృహహింస చట్టం.. భార్యను భౌతికంగా, లైంగికంగా, మానసికంగా, ఆర్థికంగా హింసిస్తే గరిష్టంగా 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. మద్యం తాగి భార్యను కొట్టడం, హింసించడం, వరకట్నం కోసం వేధించడం, చిత్రహింసలు పెట్టడం, ఇళ్లలో నిర్భంధించి కొట్టడంతో పాటు, భర్త, అతని తల్లి, తండ్రి, బంధువులు కుటుంబసభ్యులు ఎవరైనా గృహహింసకు పాల్పడితే వారికి ఈ చట్టం కింద 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తారు. సైబర్‌మిత్ర... వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో మహిళలు, యువతులను కొందరు ఆకతాయిలు వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారు. వారి ఫొటోలను మారి్ఫంగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు పోలీసుశాఖ సైబర్ మిత్రను అందుబాటులోకి తీసుకువచ్చింది. తమ సమస్యలను తెలియజేసేందుకు సైబర్ మిత్ర ఫోన్ నంబరు 91212 11100కు వాట్సప్ చేయవచ్చు. లొకేషన్ షేర్ చేయడం ద్వారా తాము ఆపదలో ఉన్నామని పోలీసులకు తెలియజేసి వెంటనే సాయం పొందవచ్చు. ఈ నెంబరు 24 గంటలూ పనిచేస్తుంది. డయల్ 182.. మహిళలు, ఒంటరిగా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా వేధింపులకు గురిచేసినా, ఆపదలో చిక్కుకున్న సందర్భాల్లో 182 నంబర్‌కు ఫోన్ చేయాలి. ఆ కాల్ రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే రక్షకదళం(ఆర్పీఎఫ్) కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. బాధితులు అందించిన వివరాల ఆధారంగా ఆ రైల్లో ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే బోగీలోకి చేరుకుని సాయం అందిస్తారు. డయల్ 112 ఆపదలోవున్న మహిళల కోసం కేంద్రహోంశాఖ 112 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బాధితులు దేశంలో ఎక్కడినుంచైనా ఈ నంబర్‌కు కాల్ చేసి సమస్యను తెలియజేస్తే ఏ రాష్ట్రం నుంచి కాల్ వచ్చిందో ఆ రాష్ట్ర పోలీసు కంట్రోల్‌రూమ్‌కు విషయాన్ని తెలియజేస్తారు. అక్కడి సిబ్బంది వెంటనే సంబంధిత పోలీసులను అప్రమత్తం చేసి బాధితులకు సాయం అందిస్తారు. అవసరమైతే గస్తీ వాహనాలను సంఘటనాస్థలానికి పంపుతారు. ఈ ప్రక్రియ అంతా నిమిషాల వ్యవధిలోనే జరుగుతుంది. డయల్ 100 రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా 100 నంబర్‌కు డయల్ చేస్తే అది పోలీసు కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. ఫోన్ చేసిన వారు తామెదుర్కొంటున్న సమస్యను వివరిస్తే చాలు.. సిబ్బంది అప్రమత్తమవుతారు. సంబంధిత ప్రాంతంలోని పోలీసులకు సమాచారం అందిస్తారు. అలాగే గస్తీ వాహనాలను కూడా అప్రమత్తం చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో 4 నుంచి 6 నిమిషాలలోపు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుంటారు. జీపీఎస్ లోకేషన్ ఆధారంగా బాధితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కాపాడతారు. అవసరమైతే ఘటనా స్థలానికి చేరుకునేంత వరకు పోలీసులు బాధితులతో ఫోన్లో మాట్లాడుతూ సూచనలు, సలహాలు ఇస్తూ ధైర్యం చెబుతారు. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలి. సంపూర్ణ రక్షణ దిశగా... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీలో మహిళల భద్రతకు చేపడుతున్న చర్యలు దేశ చరిత్రలో ప్రథమంగా నిలుస్తాయి. దిశ చట్టం ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆనందదాయకం. ఈ చట్టం రాష్ట్రంలో మహిళలకు రక్షణ చట్రంగా మారుతుంది. సంపూర్ణ రక్షణకు దోహదపడుతుంది. మన రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం ప్రభుత్వం స్పందించిన తీరు ఆదర్శనీయం. అలాగే సోషల్‌మీడియాలో మహిళలను కించపరిచినా.. కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం శుభపరిణామం. – చెట్టి పాల్గుణ, అరకు ఎమ్మెల్యే నిజమైన మహిళా రక్షకుడు... మహిళల రక్షణ కోసం చర్యలు చేపట్టి సీఎం జగన్మోహన్రెడ్డి దేశ చరిత్రలోనే మహిళా రక్షకుడిగా నిలిచారు. అసెంబ్లీలో మహిళా భద్రతకు సంబంధించిన బిల్లుకు∙ కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు, పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయం. తెలంగాణలో జరిగిన దిశ హత్యాచార ఘటనతో సీఎం జగన్ తీవ్రంగా కలత చెందారు. ఏపీలో మహిళల రక్షణకు దిశ చట్టంను తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇది శుభ పరిణామం. దిశ చట్టం మహిళలకు కొండంత రక్షణగా నిలుస్తుంది. విచారణ పేరుతో సాగదీత ఉండదు. కేవలం 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చట్టం రూపొందించాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరుగుతుంది. మహిళలు స్వేచ్ఛగా జీవించడం కోసం సీఎం కీలక నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయం. చాలా సంతోషంగా ఉంది. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి , పాడేరు ఎమ్మెల్యే చట్టాలు తెలుసుకోండి... ప్రభుత్వం తాజా నిర్ణయం అభినందనీయం. చిన్నారులు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు చేయాలంటే మృగాళ్ల గుండెల్లో వణకు పుట్టాలి. జిల్లాలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు తప్పు చేసిన వారికి త్వరగా శిక్ష పడుతుంది. నేరాలు తగ్గుతాయి. మహిళలందరూ చట్టాలను తెలుసుకోవాలి. మహిళలు క్లిష్ట పరిస్థితుల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. ఆపదని తెలిస్తే పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్‌చేయాలి. –ప్రేమ్‌కాజల్, ఏసీపీ, ఉమెన్ పోలీస్ స్టేషన్ -
58 పురాతన చట్టాల రద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం మరో 58 పురాతన, వాడుకలోలేని చట్టాలను రద్దు చేసింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని రెండు (గత, ప్రస్తుత) ప్రభుత్వాలు కలిసి రద్దు చేసిన పురాతన చట్టాల సంఖ్య 1,824కు చేరింది. చట్టాల రద్దు, సవరణ బిల్లు–2019కు పార్లమెంటు ఆమోదం లభించడంతో త్వరలోనే మరో 137 పురాతన చట్టాలు రద్దు కానున్నాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులకు, ఈ పురాతన చట్టాలకు అసలు సంబంధమే లేదనీ, ఈ కాలానికి అవి పనికిరావని కేంద్రం చెబుతోంది. తాజాగా రద్దు అయిన 58 చట్టాలేవో ఇంకా తెలియరాలేదు. అయితే అవన్నీ ప్రధాన చట్టాలకు సవరణలు చేసేందుకు తీసుకొచ్చినవేనని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. వైద్య విద్యలో ‘నెక్ట్స్’కు ఆమోదం భారత వైద్య మండలి (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) స్థానంలో కొత్తగా జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ–నేషనల్ మెడికల్ కౌన్సిల్)ని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును కేంద్రం 2017 డిసెంబర్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ 16వ లోక్‌సభ గడువు ముగిసే నాటికి అది ఆమోదం పొందకపోవడం కారణంగా రద్దయింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షను అందరికీ ఉమ్మడిగా జాతీయ నిష్క్రమణ పరీక్ష (నెక్ట్స్–నేషనల్ ఎగ్జిట్ టెస్ట్) పేరిట నిర్వహించేలా బిల్లులో నిబంధనలున్నాయి. ఠి 15వ ఆర్థిక సంఘం తన నివేదికను సమర్పించేందుకు గడువును కేంద్రం మరో నెల రోజులు పొడిగించి నవంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. ఠి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ డిజైన్ చట్టం–2014ను సవరించేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును కేబినెట్ ఆమోదించింది. మరో నాలుగు ఎన్ఐడీలను ఈ చట్టం పరిధిలోకి తెచ్చి, వాటిని జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థలుగా ప్రకటించేందుకు ఈ సవరణను చేపడుతున్నారు. అమరావతి, భోపాల్, జొర్హాత్, కురుక్షేత్రల్లోని ఎన్ఐడీలను కొత్తగా ఈ చట్టం పరిధిలోకి తేనున్నారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రతీ విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జీవన్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ము ఖ్యం గా విద్యార్థినులు మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చాలా మంది వీటిపై అవగాహన లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు తోటి విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తారని, దీంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా నిలిచే ప్రమాదం ఉందన్నారు. మహిళల పట్ల గౌరవంగా మెలగాల ని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పల్ జాకిర్ హుస్సేన్, వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్, అధ్యాపకులు మంజుల, శ్రావణి, విజయ్‌కుమార్, జగ్రాం, రమేశ్‌రెడ్డి, నర్సింగ్‌రావు, ప్రతాప్‌సింగ్, తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలి జైనథ్: ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సిటిజన్ ఫోరం మండల ఇన్చార్జి కొం గర్ల గణేశ్ అన్నారు. బుధవారం ఆయన మండలకేంద్రంలో సిటిజన్ ఫోరం సభ్యులు, స్థానిక నా యకులతో కలిసి ఏక్‌సాల్ మే పరివర్తన్ గోడ ప్రతులను విడుదల చేశారు. ఆయన మాట్లాడు తూ ప్రజలంతా ఏకమై గ్రామాలను హరితవనా లుగా తీర్చిదిద్దాలన్నారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తి తో పరిశుభ్రమైన గ్రామాలను తయారు చేయాలన్నా రు. చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెం చుకొని, నేరరహిత సమాజ స్థాపనకు నడుం బిగిం చాలన్నారు. కుల,మత, రాజకీయ, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని బలోపేతం చేసి, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. నాయకులు సర్సన్ లింగారెడ్డి, కిష్ఠారెడ్డి, వెంకట్‌రెడ్డి, గణేశ్‌యాదవ్, రమేశ్, గంగన్న పాల్గొన్నారు. -
‘చట్టాలు చేయాలని కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవు’
సాక్షి, హైదరాబాద్: చట్టాలు చేయాలనిగానీ, అమలులో ఉన్న చట్టాలను ఫలానా విధంగా సవరణలు చేయాలనిగానీ చట్టసభలకు న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయజాలవని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాలు చేయడంతో పాటు ఉన్న చట్టాలకు సవరణలు చేసే అధికారం చట్టసభదేనని, శాసనసభ చట్టం ఏం చేయాలో, అవి ఎలా ఉండాలో న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయబోవని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తన నిర్ణయాన్ని వెల్లడిచింది. నేర శిక్షా స్మృతి (సీఆర్పీసీ)లోని 41(1)(బి) సెక్షన్‌ను సవరించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఈ ఆదేశాలిచ్చింది. ఆ సెక్షన్‌కు సవరణల ప్రతిపాదనలు శాసనసభ ఎదుట లేదా గవర్నర్ లేదా రాష్ట్రపతి వద్ద ఉంచేలా తెలంగాణ హోం శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుబ్బరాయశాస్త్రి అనే వ్యక్తి తరఫున జీపీఏ హోల్డర్ పి.దుర్గాదేవి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. -
ప్రసూతి చట్టంతో 18 లక్షల ఉద్యోగాలకు ఎసరు
కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని సామెత కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రసూతి చట్టం ఈ సామెతకి మరోపేరులా మారిపోనుందా ? గర్భిణుల కెరీర్‌కు ఆటంకాలు ఉండకూడదన్న సదుద్దేశంతో ప్రసూతి చట్టానికి చేసిన సవరణలు వారి ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నాయా ? అవుననే అంటోంది టీమ్‌లీజ్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ సంస్థ తాజాగా చేసిన సర్వేలో ప్రసూతి చట్టం వ్యతిరేక ఫలితాల్నే తీసుకువస్తోందని వెల్లడైంది. తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం, పిల్లలు పుట్టినా మహిళలు ఉద్యోగాల్లో కొనసాగేలా ఉండాలన్న ఉద్దేశంతో ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాల వరకు పెంచుతూ గత ఏడాది ప్రసూతి చట్టానికి చేసిన సవరణలు మహిళలకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయి. ఈ చట్టం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10 సెక్టార్లలో 11 నుంచి 18 లక్షల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోతారని టీమ్‌లీజ్ సర్వీసెస్ లిమిటెడ్ తాజా సర్వేలో వెల్లడైంది. అదే అన్ని రంగాల్లోనూ ఇదే స్థాయిలో చట్టం ప్రభావం ఉంటే కోటి నుంచి 1.2 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోతారని ఆ సర్వే అంచనా వేసింది. ఏయే రంగాల్లో సర్వే విమానయాన రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సర్వీసులు, రియల్ ఎస్టేట్, విద్య, ఈ కామర్స్, తయారీ రంగం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రిటైల్, పర్యాటకం వంటి రంగాలకు సంబంధించిన 300 కంపెనీల యాజమాన్యాల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ రంగాలకి సంబంధించి అతి పెద్ద కంపెనీలు, ఆర్థిక పరిపుష్టి కలిగినవి ప్రసూతి చట్టాన్ని స్వాగతిస్తే, చిన్న మధ్యతరహా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకీ ప్రతికూల ప్రభావం ప్రసూతి సెలవు తర్వాత కూడా మహిళా ఉద్యోగుల్ని కొనసాగించాలంటే సాధారణ కంపెనీలకు ఉద్యోగుల వార్షిక వేతనంలో 80 నుంచి 90 శాతం ఖర్చు అయితే, ఇక శ్రామిక రంగానికి సంబంధించిన ఉద్యోగుల వార్షిక వేతనంలో 135 శాతం ఖర్చు అవుతుంది. అంత ఖర్చుని భరించడానికి చాలా కంపెనీ యాజమాన్యాలు విముఖత ప్రదర్శిస్తున్నాయి. వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ చట్టం ప్రకారం 50మందికి పైగా ఉద్యోగులు ఉన్న ప్రతీ కంపెనీ ఆఫీసుల్లో క్రష్ ఏర్పాటుచేయాలి. అందుకే చిన్న కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు మహిళలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. మరి కొన్ని కంపెనీలు వేరే సాకులతో మహిళల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. విదేశాల్లో ఏం చేస్తారు ? అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు ప్రసూతి సెలవులకయ్యే ఖర్చుని ఆమె పనిచేసే సంస్థలు భరించవు. సదరు కంపెనీలపై పడే ఆర్థిక భారాన్ని ఎంతో కొంత ప్రభుత్వాలే భరిస్తాయి. పన్నుల్లో మినహాయింపులు కూడా ఇస్తాయి. యూకే వంటిదేశాల్లో మహిళలు 52 వారాల వరకు ప్రసూతి సెలవును తీసుకునే సదుపాయం ఉంది. అక్కడ కంపెనీలు ఆదాయం 45 వేల పౌండ్ల కంటే తక్కువ ఉంటే ప్రభుత్వమే మొత్తం భరిస్తుంది. ఇక పెద్ద కంపెనీలకైతే 92 శాతం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. కానీ భారత్‌లో అలా జరగడం లేదు. ఇలాంటి సంస్కరణలు తీసుకువచ్చినప్పుడు చిన్న, మధ్య తరగతి కంపెనీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తే మహిళల ఉద్యోగాలకు భద్రత ఉంటుందని ఒక అంతర్జాతీయ సంస్థకు చెందిన ఎండీ కె. సుదర్శన్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా చిన్న, మధ్య తరగతి కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతోనే నడుపుతాయి. ఒకేసారి అయిదుగురు మహిళల్లో ఇద్దరు ప్రసూతి సెలవు తీసుకుంటే ఆ కంపెనీయే కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. -సాక్షి నాలెజ్డ్ సెంటర్ -
విధాత కోర్టులోనూ ఓడిపోయాడు
ఒక చిన్నారి మరణం వంద ప్రశ్నల్ని లేవనెత్తింది. ఆ తల్లిదండ్రుల కడుపుకోత బ్రిటన్ చట్టాలనే బోనులో ఉంచింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్నంత మాత్రానా చేజేతులారా ఒక ప్రాణాన్ని మొగ్గలోనే తుంచేయడమేనా? మాకు కావల్సింది వ్యాధి తగ్గడం కాదు, ఆ ప్రాణం పదిలంగా ఉండటం అన్న ఆ తల్లిదండ్రులు ఆక్రందన పట్టించుకోకపోవడం ఎంతవరకు సరైనది? మెరుగైన చికిత్స ఇప్పిస్తామన్న పోప్ మాటల్ని మతం పేరుతో పెడచెవిన పెట్టి మరీ లైఫ్ సపోర్ట్ తీసేసే కఠినమైన చట్టాలను ఏం చేయాలి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు లండన్ వీధుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి అల్ఫీ ఇవాన్స్కి నూరేళ్లు నిండిపోయాయి. పుట్టుకతోనే అత్యంత అరుదైన మెదడుకి సంబంధించిన వ్యాధి కలిగిన కన్నబిడ్డను ఎలాగైనా బతికించుకోవాలన్న తల్లిదండ్రుల ఆరాటం, గత కొన్ని నెలలుగా వాళ్లు చట్టంతో చేసిన పోరాటం చివరికి గుండెకోతనే మిగిల్చాయి. తల్లిదండ్రుల కడుపుతీపి ఒకవైపు, ఆధునిక వైద్యం కూడా చేయగలిగిందేమీ లేదన్న వైద్యుల నిస్సహాయత మరోవైపు, బాలల హక్కులపై బ్రిటిష్ చట్టాలు ఇంకో వైపు, వీటన్నింటి మధ్య రెండేళ్ల చిన్నారి ప్రాణం నలిగి నలిగి అనంత వాయువుల్లో కలిసిపోయింది. తల్లిదండ్రులు వద్దు వద్దని మొరపెట్టుకుంటున్నా, వాటికన్ సిటీలో మెరుగైన వైద్యం ఇప్పిస్తామంటూ పోప్ ఫ్రాన్సిస్ హామీ ఇచ్చినా, కోర్టులు చెప్పాయంటూ బ్రిటన్ వైద్యులు ఆ చిన్నారికి లైఫ్ సపోర్ట్ తీసివేయడంతో అల్ఫీ ఇవాన్స్ మరణించాడు. ఈ చిన్నారి మృతి ఎందరినో కదిలించింది. బాలల హక్కులపై వందల ప్రశ్నల్ని లేవనెత్తింది. వేలాది మంది ఆ బాలుడి మృతికి కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్పత్రి దగ్గర పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. చట్టంతో తల్లిదండ్రుల పోరాటం లండన్‌కు చెందిన టామ్ ఇవాన్స్, కేట్ జేమ్స్ దంపతులకు జన్మించిన అల్ఫీ పుట్టుకతోనే మృత్యుముఖానికి దగ్గరయ్యాడు. అత్యంత అరుదైన మెదడులో నరాలకు సంబంధించిన వ్యాధితో జన్మించాడు. ఈ వ్యాధి నెమ్మది నెమ్మదిగా మెదడు పనిచేసే సామర్థ్యాన్ని తగ్గించి చివరికి ప్రాణాలను తీసేస్తుంది. ఏడు నెలలకే కోమాలోకి వెళ్లిపోయిన అల్ఫీ ఇవాన్స్ లండన్‌లోని లివర్పూల్స్ ఆల్డర్ హే చిల్డ్రన్స్ ఆస్పత్రిలో లైఫ్ సపోర్ట్ మీదే ఉన్నాడు. ఇక ఆ బాలుడికి మందులేవీ పని చేయవని, లైఫ్ సపోర్ట్ తీసేయాలని చికిత్స అందించిన వైద్యులు నిర్ణయానికి వచ్చేశారు. కానీ తల్లిదండ్రుల్లో మాత్రం ఏ మూలో రెపరెపలాడే ఆశ ఉండేది. వేరే దేశాల్లో ఆ బాలుడికి చికిత్స ఇప్పించాలని అనుకున్నారు. లైఫ్ సపోర్ట్ తీయొద్దంటూ కోర్టుకెక్కారు. దీంతో ఈ బాలుడి గురించి ప్రపంచ దేశాలకు తెలిసింది. ఏకంగా పోప్ ఫ్రాన్సిస్ మద్దతు ఆ తల్లిదండ్రులకు లభించింది. ఇవాన్స్‌కు ఇటలీ పౌరసత్వం ఇవ్వడమే కాదు మెరుగైన చికిత్స అందించడానికి ఎప్పుడంటే అప్పుడు బాలుడ్ని తీసుకురావడానికి మిలటరీ ఎయిర్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. కానీ బ్రిటన్ వైద్యులు మాత్రం ఆ బాలుడి వ్యాధిని ఎవరూ నయం చేయలేరని, లైఫ్ సపోర్ట్ ఇవ్వడం అంటే ఆ లేత శరీరాన్ని మరింత బాధించడమేనని వాదించారు. బ్రిటన్‌లో 1989 బాలల చట్టం ప్రకారం ఇలాంటి అరుదైన వ్యాధి సోకిన బాలలకు చికిత్స విషయంలో తల్లిదండ్రులు తమకిష్టమైన పద్ధతిలో చేయడానికి వీలు లేదు. కోర్టులు ఏం చెబితే అలాగే నడుచుకోవాలి. బ్రిటన్‌లో కోర్టులు కూడా ఇలాంటి అరుదైన కేసుల్లో భావోద్వేగాలను, తల్లిదండ్రుల కడుపు తీపిని కాస్త కూడా పట్టించుకోవు. వైద్యుల సలహా మేరకే అవి నడుచుకుంటాయి. ఆ బాలుడికి వచ్చిన అరుదైన వ్యాధిని నయం చేయడం అసాధ్యమని మూడు దేశాల్లో ప్రముఖ వైద్యులు తేల్చేయడంతో బ్రిటన్ కోర్టులు కూడా వైద్యుల మాటకే విలువనిచ్చి లైఫ్ సపోర్ట్ తీసేయాలంటూ ఆదేశాలు ఇచ్చాయి. అల్ఫీ మరణంతో బ్రిటన్ చట్టాలపై చర్చ జరగడమే కాదు, ఇవాన్స్ కేథలిక్ కావడం వల్లే చికిత్సకు వాటికన్ సిటీ ముందుకు వచ్చిందంటూ పసి ప్రాణానికి మతాన్ని ముడిపెట్టి కొందరు చేసిన ప్రచారం కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కేథలిక్ దేశాలు బ్రిటన్ వైద్యుల్ని విమర్శిస్తున్నాయి. అంత హుటాహుటిన లైఫ్ సపోర్ట్ తీయాల్సిన పనేముందని నిలదీస్తున్నాయి. -
హక్కుల పరిరక్షణ చట్టాలను నీరుగార్చొద్దు!
అవలోకనం శిక్షల రేటు తక్కువగా ఉన్నదన్న కారణంతో ఒక చట్టం దుర్వినియోగమవుతున్నదని నిర్ధారించడం సబబు కాదు. అపహరణలు, ఫోర్జరీ, మోసం, బలవంతపు వసూళ్ల కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉంటున్నది. కనుక ఆ చట్టాలు దుర్వినియోగమవుతున్నట్లేనా? దుర్బల వర్గాల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాలు మాత్రమే దురుపయోగమవుతున్నాయని నిర్ణయించడం సబబేనా? చట్టాల ‘దుర్వినియోగానికి’ వ్యతిరేకంగా మన సుప్రీంకోర్టు తీసుకుంటున్న చర్యలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈమధ్యే జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ యు యు లలిత్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం ‘అడ్డూ ఆపూ లేకుండా దుర్వినియోగం’ అవుతున్నదని చెప్పి దాన్ని నిరోధించడం కోసం మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ఫలితంగా...దళితులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న చట్టం కాస్తా బలహీనపడుతుంది. తీర్పులో చాలాభాగం నిష్పాక్షిక విచారణ జరగాలని కోరడానికి నిందితులకుగల హక్కును కాపాడటానికి ఉద్దేశించిందే. కానీ ఈ తీర్పు విచిత్రమైన తర్కం చేసింది. కొన్ని హైకోర్టుల తీర్పుల్ని, జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం ‘దోపిడీ, అణచివేత’ శాసనంగా మారిందన్న నిర్ణయానికొచ్చింది. ఇది ‘బ్లాక్మెయిల్ చేయడానికి, వ్యక్తిగత ప్రతీకారాన్ని తీర్చు కోవడానికి’ ఉపయోగపడటంతో పాటు కులతత్వాన్ని శాశ్వతీకరిస్తున్నదని భావిం చింది. వాటికి విరుగుడుగా అనేక మార్గదర్శకాలిచ్చింది. అందులో అన్నిటికన్నా విధ్వంసకరమైనది కుల వివక్షకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు విషయంలో ఎఫ్ఐ ఆర్ దాఖలు చేసే ముందు ‘ప్రాథమిక విచారణ’ను తప్పనిసరి చేయడం. ఈ న్యాయమూర్తులిద్దరూ పరిరక్షణ చట్టాల దుర్వినియోగంపై ఆదేశాలివ్వడం ఇది తొలిసారి కాదు. గత జూలైలో భారత శిక్షాస్మృతిలోని 498ఏ సెక్షన్ (వరకట్న వేధింపుల నిరోధక చట్టం) ‘దుర్వినియోగం’ కాకుండా ఆదేశాలిచ్చారు. వరకట్న వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులొచ్చినప్పుడు వాటిని పరిశీలించడానికి ‘కుటుంబ సంక్షేమ సంఘాలు’ ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. ఎలాంటి చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని ఫిర్యాదులొస్తాయో ఆలో చించండి. వాటిలో–లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పని స్థలాల్లో మహిళల పరి రక్షణకు ఉద్దేశించిన చట్టం), వరకట్న నిరోధక చట్టం (వివాహితల పరిరక్షణకోసం వచ్చిన చట్టం), కుల వివక్షనూ, అఘాయిత్యాలనూ నిరోధించే చట్టం ( దళితులు, ఆదివాసీలకు ఉద్దేశించింది) ఉన్నాయి. చిత్రమేమంటే దుర్బల వర్గాల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాల విషయంలోనే దుర్వినియోగం ఆరోపణలు వస్తాయి. ఇంత క్రితం ప్రస్తావించిన రెండు తీర్పుల విషయంలో నాకు రెండు ప్రశ్నలున్నాయి. ఒకటి–ఇతర చట్టాలకంటే ఇవే దుర్వినియోగానికి అనువుగా ఉన్నాయా? రెండు– ధర్మాసనం సూచించిన చర్యలు నిష్పాక్షిక విచారణకు దోహదపడేవేనా? మొదటి ప్రశ్నలోకి వద్దాం. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టానికి సంబంధించిన తీర్పులో ధర్మాసనం ఉటంకించిన గణాంకాలు చూద్దాం. 2015 జాతీయ క్రైం రికా ర్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) ప్రకారం ఎస్సీ కేసుల్లో 5,347, ఎస్టీ కేసుల్లో 912 తప్పుడు కేసులని నిర్ధారణ అయింది. దళిత సంఘాలు చెబుతున్న ప్రకారం ఆధి పత్య కులాలకు చెందిన పోలీసు సిబ్బంది దళితుల ఫిర్యాదులను స్వీకరించడానికి విముఖంగా ఉంటారు. అది తప్పుడు ఫిర్యాదని అప్పటికప్పుడే తేల్చేస్తారు. 2016 నాటి ఎన్సీఆర్బీ నివేదికలోని గణాంకాలను పరిశీలిద్దాం. ఆ ఏడాది మొత్తంగా ఎస్సీలకు సంబంధించి 56,299, ఎస్టీలకు సంబంధించి 9,096 ఫిర్యాదులు రావ డమో, దర్యాప్తు పెండింగ్‌లో ఉండటమో జరిగిందని ఆ నివేదిక తెలిపింది. అంటే మొత్తం కేసుల్లో 10 శాతం లేదా ప్రతి పది కేసుల్లో ఒకటి తప్పుడు కేసు అని అను కోవచ్చు. దానర్థం పదిలో తొమ్మిది నిజమైన కేసులేనన్నమాట! దీన్ని ‘అడ్డూ ఆపూ లేకుండా దుర్వినియోగం’ అవుతున్నట్టు భావించడం సబబేనా? ఈ గణాంకాలను ఇతర నేరాలతో పోల్చి చూద్దాం. కిడ్నాపింగ్ కేసుల్లో 9 శాతం, ఫోర్జరీ కేసుల్లో 12 శాతం తప్పుడువని పోలీసులు చెబుతున్నారు. అంత మాత్రాన కిడ్నాపింగ్, ఫోర్జరీల నిరోధానికి ఉద్దేశించిన చట్టాలను రద్దు చేయాలని ఎవరైనా అంటారా? 2015లో న్యాయస్థానాలు మొత్తం 15,638 కేసుల్లో తీర్పునిస్తే అందులో 11,024 కేసుల్లో నిందితులు నిర్దోషులని తీర్పులొచ్చాయని, 495 కేసుల్ని ఉపసంహరించుకున్నారని, 4,119 కేసుల్లో శిక్షలు పడ్డాయని సుప్రీంకోర్టు ధర్మా సనం ఉటంకించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కేసుల్లో ‘కేవలం’ 26 శాతం కేసుల్లో మాత్రమే శిక్షపడిన సంగతిని గుర్తు చేసింది. వాటి ఆధారంగా ఆ చట్టం దుర్వినియోగమవుతున్నదని అభిప్రాయపడింది. దర్యాప్తు, విచారణల్లో చోటు చేసుకుంటున్న జాప్యం.. బాధితులు, సాక్షుల వేధింపు.. దళితులకు, ఆదివాసీలకు న్యాయం లభించడానికి ఎదురవుతున్న వ్యవ స్థాపరమైన అడ్డంకులు... ఫలితంగా తగ్గుతున్న శిక్షల రేటు గురించి కాసేపు మరిచి పోదాం. వీటిని ‘దుర్వినియోగానికి’ ప్రమాణంగా తీసుకోదల్చుకుంటే ఎన్సీఆర్బీ తాజా గణాంకాల ప్రకారం మోసం కేసుల్లో 20 శాతం, బలవంతపు వసూళ్లలో 19 శాతం, దహనకాండల్లో 16 శాతం మేరకు మాత్రమే శిక్షలు పడుతున్నాయి. ఈ చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని ఎవరూ చెప్పినట్టు లేదు. కానీ కేవలం కొన్ని చట్టాల పనితీరుపైనే దృష్టిపెట్టి అవి మాత్రమే దుర్వినియోగమవుతున్నాయ నడం సబబేనా. ఇక న్యాయబద్ధమైన విచారణ కోసం ధర్మాసనం జారీచేసిన మార్గ దర్శకాలను పరిశీలిద్దాం. మన దేశంలో బాధితులు లేదా సాక్షుల పరిరక్షణకు సంబంధించిన విధానమేదీ లేదు. కనుక ఇలాంటివారు నిందితుల నుంచి వేధిం పులు, బెదిరింపులు ఎదుర్కొంటారు. దీనికితోడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుకు సిద్ధపడరు. ఇలాంటి స్థితిలో కుటుంబ సంక్షేమ సంఘాల ఏర్పాటు, ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ‘ప్రాథమిక విచారణ’ ఇప్పుడున్న పలురకాల అడ్డంకులకు అదనంగా వచ్చి చేరతాయి. నిరుడు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ ఆదివాసీలు వంద మంది ఎదుర్కొన్న సమస్యను ఉదహరిస్తాను. కొన్ని ప్రైవేటు సంస్థలు ఏజెంట్ల ద్వారా బెదిరించి తమ భూములు కబ్జా చేయడంపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వారు ఫిర్యాదు చేశారు. రాయ్‌గఢ్ పోలీసులు ఆ ఫిర్యాదు తీసుకుని ‘ప్రాథమిక దర్యాప్తు’ పేరిట జాప్యం చేసి కొన్ని వారాల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరించారు. తప్పుడు కేసుల నుంచి రక్షణకు మన చట్టాల్లో ఇప్పటికే పలు ఏర్పాట్లున్నాయి. ఎవరికైనా హాని కలిగించే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తికి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. తప్పుడు సాక్ష్యాలు, వాటిని తారుమారు చేయడం నేర పూరిత చర్యలు. వీటిని పోలీసులు, న్యాయవ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటే తప్పుడు ఫిర్యాదులు ఆగిపోతాయి. దుర్బల వర్గాల కోసం పార్లమెంటు చేసిన చట్టా లను మొద్దు బార్చే మరిన్ని తీర్పులు మనకు అవసరం లేదు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
జాబ్ ఫైరింగ్... మా డ్యూటీ!
ప్రస్తుతం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగిస్తున్నాయి. ఉద్వాసనకు గురికానున్న ఉద్యోగులను పిలిచి వారికి అర్థమయ్యేలా చెప్పి, ఏ మాత్రం నొప్పించకుండా వారిని పంపించేయడం సవాలుతో కూడుకున్న పనే. వారి తప్పేమీ లేకుండానే రాజీనామా చేయమంటే ఎవ్వరూ ఒప్పుకోరు. కొన్ని సందర్భాల్లో స్వల్ప వాదులాటలూ జరుగుతుంటాయి. ఉద్యోగులను భయపెట్టేందుకు కంపెనీలు బౌన్సర్లను కూడా నియమించుకుంటున్నాయని ఇటీవలే తెలిసొచ్చింది. ఆ తర్వాత నష్టపోయిన ఉద్యోగులు చట్టాలను ఆసరాగా చేసుకుని కంపెనీలపై కేసులు పెడుతుండటమూ చూస్తున్నాం. కానీ కంపెనీలకు ఇంత కష్టం కలిగించకుండా, న్యాయపర చిక్కులూ రాకుండానే అనవసరం అనుకున్న ఉద్యోగులను పంపించేసే మార్గాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ విధానంలో ఓ వైపు కొందరికి ఉద్యోగాలు పోతుంటే మరికొందరికి మాత్రం దీని ద్వారా పని దొరుకుతుండటం విశేషం. ఇంతకీ వీరి పనేమిటంటే కంపెనీలు ఏ ఉద్యోగిని చూపిస్తే ఆ ఉద్యోగితో మాట్లాడి, వారిని ఒప్పించి, ఏ గొడవా లేకుండా ఉద్యోగాలు మాన్పించి పంపించేయడమే. ఈ పనులు చేసిపెట్టడానికి ప్రత్యేకంగా ఔట్ సోర్సింగ్ విధానంలో కొన్ని కంపెనీలు విదేశాల్లో ఎప్పటినుంచో ఉన్నాయి. భారత్‌లోనూ వాటి సంఖ్య, అక్కడ పనిచేసే వారికి డిమాండ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. వీటిని ఔట్సోర్సింగ్ కన్సల్టెంట్, ఔట్‌సోర్స్ టర్మినేటర్, ఫైరింగ్ కన్సల్టెంట్ తదితర పేర్లతో పిలుస్తుంటారు. హెచ్ఆర్తో పనిలేకుండానే... సాధారణంగా ఏ కంపెనీలో అయినా మానవ వనరుల (హెచ్ఆర్) విభాగం కీలకమైనది. సంస్థ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉద్యోగులను నియమించుకోవడం, పనితీరును, సామర్థ్యాన్ని మదింపు చేసి బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఏటా వేతనాలు పెంచడంతోపాటు, అనుకున్న విధంగా రాణించలేని వారిని తొలగించడం కూడా వీరి పనే. కానీ కొత్త విధానంలో మాత్రం ఉద్యోగుల తొలగింపులో హెచ్ఆర్ విభాగం పాత్ర చాలా పరిమితం. ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించాలో కంపెనీ నిర్ణయించాక, వారి జాబితాను ఫైరింగ్ కన్సల్టెంట్ కంపెనీలకు ఇస్తే చాలు. ఆ కంపెనీ ఉద్యోగులు వచ్చి, ఉద్వాసనకు గురికానున్న ఉద్యోగులతో మాట్లాడతారు. వారికి పూర్తిగా పరిస్థితిని వివరించి, నచ్చజెప్పి, భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని వాటిపై ఉద్యోగి సంతకాలు తీసుకుని రాజీనామా చేయిస్తారు. ఘర్షణాత్మక వైఖరికి అవకాశం లేకుండా సులువైన పద్ధతులను అనుసరిస్తారు. ఇలాంటి విషయాల్లో హెచ్ఆర్ మేనేజర్లకు శిక్షణ కూడా ఇస్తారు. భారత్‌లోనూ పెరుగుతున్న డిమాండ్ మరొకరి ఉద్యోగాన్ని ఊడగొట్టే ఈ ఉద్యోగాలకు ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాలతోపాటు మన దగ్గరా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు ఈ రంగం కొత్త వృత్తిగా అవతరిస్తోంది. ఈ తరహా సేవల కోసం గతేడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు 88.7 బిలియన్ డాలర్లు ఖర్చుచేసినట్లు అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న ఐడీసీ(ఎన్వైఎస్ఈ–ఐడీసీ) పరిశోధక సంస్థ వెల్లడించింది. పెద్ద కంపెనీలతో పోల్చితే చిన్న కంపెనీలకు ఉద్యోగుల రిక్రూట్మెంట్, పనితీరు సమీక్ష, ఉద్వాసనలు వంటి ముఖ్యమైన విధుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలు లేనందువల్ల ఇటువంటి కన్సల్టెన్సీలపై ఆధారపడుతున్నాయంది. ఈ తరహా సేవలందించే ట్రైనెట్ అనే అమెరికన్ కంపెనీ వ్యవస్థాపకుడు మార్టిన్ బాబినెట్ మాట్లాడుతూ 2002తో పోల్చితే తమ ఆదాయం ఇప్పడు ఎన్నోరెట్లు పెరిగిందన్నారు. కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపించడంలో అనుభవం, నైపుణ్యం ఉన్న వారిని హెచ్ఆర్ విభాగంలో నియమించుకుంటున్నాయి. 2009లో విడుదలైన, ప్రముఖ నటుడు జార్జి క్లూనీ నటించిన హాలీవుడ్ సినిమా ‘అప్ ఇన్ ది ఎయిర్’ ఈ తరహా కథాంశంతో వచ్చిందే. ఈ సినిమా అప్పట్లోనే వివిధ దేశాల్లో కలిపి 44 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. మన దేశంలో ఉన్న రైట్ మేనేజ్మెంట్, ఆప్టిమమ్, హ్యుమన్ డైనమిక్, హ్యుసిస్ కన్సల్టింగ్, షిల్పుట్సీ వంటి కన్సల్టెన్సీ సంస్థలు ఈ కోవకు చెందినవే. ‘మా కంపెనీ సేవలను పొందేందుకు ఒక్కో ఉద్యోగికి రూ.2 లక్షల వరకు ఆయా సంస్థలు వెచ్చిస్తున్నాయి. ఆరేళ్ల క్రితం వరకు మా సేవలను ఎక్కువగా గ్లోబల్ కంపెనీలే ఎక్కువగా ఉపయోగించుకునేవి. రానురాను మా సేవలు కోరుతున్న భారతీయ కంపెనీల సంఖ్య కూడా పెరుగుతోంది’ అని రైట్ మేనేజ్మెంట్ సంస్థకు ఇండియా మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ పాండే తెలిపారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తల్లిదండ్రి.. కడపు మాడిస్తే కటకటాలే..
చిట్యాల (నకిరేకల్) : ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో సంతానానికి తల్లిదండ్రులు భారమవుతున్నారు. తమను పెంచి పెద్ద చేసి.. ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను వీధిన పడేసి.. తమ స్వార్థం చూసుకుంటున్నారు. వారు సంపాదించిన ఆస్తి పాస్తులను అనుభవిస్తూ.. నిర్ధాక్షిణ్యంగా ఇంటి బయటికి గెంటేస్తున్నారు. కొందరు వృద్ధాశ్రమాల్లో చేర్పించి.. చేతులు దులుపుకుంటున్నారు. ఒకవేళ ఇద్దరు కొడుకులు ఉంటే.. వంతువారీగా చూసుకోవడమో.. లేదా వారిద్దరినే.. ఒంటæరిగా వదిలేయడమో చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వృద్ధులు బతుకుదెరువు కోసం.. యాచకులుగా మారుతున్నారు. ఇటీవల సూర్యాపేట, చందంపేట, మునుగోడు ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇలాంటి కొడుకుల పని పట్టేందుకు వృద్ధులకు చట్టాలు అండగా ఉన్నాయి. కుమారులు తల్లిదండ్రులను పోషించాల్సిందే.. లేకపోతే కటకటాల పాలవడం ఖాయం. మమ్ములను అదరించడం లేదని ఎవరైనా వృద్ధులు అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తే.. వారికి న్యాయం చేసేందుకు డివిజన్‌స్థాయిలో ట్రిబ్యునల్స్ సిద్ధంగా ఉన్నాయి. డివిజన్ స్థాయిలో ఆర్డీఓలకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫ్రిసైడింగ్ అధికారిగా ఆర్డీఓ ఉంటారు. ఆయన సమక్షంలో విచారణ జరుగుతుంది. సంబంధిత తహసీల్దార్‌ను క్షేత్రస్థాయిలో విచారణకు ఆర్డీఓ ఆదేశిస్తారు. ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తారు. ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులకు న్యాయం జరిగి.. సమస్య పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో బాధితులే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళ సంఘాలు ఆర్డీఓకు ఫిర్యాదు చేయవచ్చు. సమస్య డివిజన్ స్థాయిలో పరిష్కారం కాకుంటే జిల్లాస్థాయిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అధికారుల చొరవతో.. ఆదరణ ఈ నెల 3వ తేదీన మునుగోడులో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు నారగోని ముత్యాలు, మంగమ్మను కుమారులు నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపారు. ఆస్థిని పంచుకున్న కుమారులు వారి పట్టించుకోకుండా వదిలేశారు. ఈ ఘటన పత్రికల్లో రావడంతో.. అధికారులు వారి కుమారులను పిలిపించి తగిన ఆదరణ దక్కేలా చర్యలు తీసుకున్నారు. భారమైన వృద్ధ తండ్రి.. సూర్యాపేట క్రైం : వృద్ధాప్యంలో తండ్రికి కడుపునిండా బువ్వ పెట్టి కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమారులే చూసుకోకపోవడంతో.. ఆ వృద్ధుడు యాచకుడిలా మారాడు. సూర్యాపేటలోని 27వ వార్డు మామిళ్లగడ్డకు చెందిన కంబాలపల్లి లింగయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన వయసు ప్రస్తుతం 80 ఏళ్లకు పైబడిపోయింది. కుమారులు సాకలేమని చేతులెత్తేశారు. దీంతో దిక్కుతోచని లింగయ్య అదే ప్రాంతంలో లింగయ్య యాచకుడిగా మారాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో లింగయ్య ఇటీవల సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఆరు నెలల క్రితం కుమారులు సరిగా చూసుకోకపోవడంతోనే అనారోగ్యంతో తన భార్య చనిపోయిందని లింగయ్య కన్నీరుమున్నీరయ్యాడు. తనకు కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుందని తనకు ఎలాగైనా న్యాయం చేయాలని ఆ వృద్ధుడు వేడుకుంటున్నాడు. కన్న పేగు కాదంది.. అధికారులు పొమ్మండ్రు చందంపేట (దేవరకొండ) : వద్ధాప్యంలో ఆసరాగా ఉంటారన్న కొడుకులు చీదరించారు. కనీసం ఇంట్లో ఉండేందుకు కూడా వీల్లేదని తేల్చారు.. ఓ వైపు భార్య అనారోగ్యంతో బాధపడుతుడడంతో.. ఆ తండ్రి కలెక్టర్ వద్దకు వెళ్లినా అక్కడా చేదు అనుభవమే ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామానికి చెందిన తంగెళ్ల మల్లారెడ్డి వయస్సు 75 సంవత్సరాలు. ఈయన ఇద్దరు కొడుకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండడంతో వృద్ధుడైన మల్లారెడ్డికి పింఛన్ అందజేయడం లేదు. తనను కొడుకులు సాకడం లేదని మల్లారెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదును చేశాడు. తమను సాకనప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ఏంటి.. చేయకుంటే ఏంటని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నాడు. అధికారులు స్పందించి ఆ వద్ధునికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. శిక్షలు ఇలా.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కుమారులు ఉద్ధేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తే వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007 ప్రకారం శిక్షలు ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం ఈ ఆరోపణ నిర్ధారణ అయితే రూ.ఐదు వేల జరిమానాగానీ మూడు నెలల జైలు శిక్షగానీ విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి బక్కోసారి రెండు శిక్షలూ అమలయ్యే అవకాశం ఉంది. జైలు శిక్ష పొడిగించే అవకాశం ఉంది. సంపాదన లేనివారు, సంతానం లేని వృద్ధులు సైతం తమ ఆస్తులు అనుభవిస్తున్న వారి నుంచి పోషణ ఖర్చులు పొందే హక్కును చట్టంలో పొందుపర్చారు. కుమారులు ఉద్యోగస్తులైతే వారి వేతనంలో కోత విధించి తల్లిదండ్రులకు అందించే విధంగా ఏర్పాటు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఉద్యోగస్తులకు సైతం తగిన శిక్షలు ఉన్నాయి. -
పావురం ఛాతి ఉంటే అన్‌ఫిట్...
న్యూఢిల్లీ: భారత దేశంలో 1914 నాటి మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ పదవికి అర్హులు కావాలంటే తళతళలాడే తెల్లటి పలు వరుస ఉండాలి. అందుకు క్రమం తప్పకుండా బ్రెష్ చేసుకునే అలవాటు ఉండాలి. ముందుకు ఎముక పొడుచుకు వచ్చినట్లుగా పావురం ఛాతి లాంటి ఛాతి ఉండకూడదు. మోకాళ్లు తగిలేలా తాకుడు కాళ్లు ఉండరాదు. బల్లబరుపు పాదాలు ఉండకూడదు. పాదం బొటనవేలు కిందక వంగి ఉండరాదు. 1878 నాటి భారత ఖజానా చట్టం ప్రకారం పది రూపాయలకంటే ఖరీదైనా ఏ వస్తువు ఏ వ్యక్తి కలిగి ఉన్నా దానికి రెవెన్యూ అధికారి అనుమతి తప్పనిసరి. అలా లేకపోతే ఏడాది జైలు శిక్ష తప్పదు. 1934 ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం ప్రకారం విమానాలతోపాటు గాల్లో పతంగులు ఎగరేసేందుకు కూడా అనుమతులు తప్పనిసరి. కొన్ని రాష్ట్రాల్లో ప్రజల ఇళ్లపైకి, పొలాలపైకి ఎలాంటి కరపత్రాలు పడకుండా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల పోలీసుల బాధ్యత. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ప్రచారోద్యమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన నిబంధన. దేశ విభజన సందర్భంగా పాకిస్తాన్ వలసపోయిన ప్రజలకు ఎప్పుడైనా బెంగాల్, అస్సాం, పంజాబ్ కోర్టులను ఉపయోగించుకునే హక్కు ఉంది. గంగా నదిలో ఒక ఒడ్డు నుంచి రెండో ఒడ్డుకు ప్రయాణికులను తీసుకెళ్లే పడవలు రెండు అణాలకు మించి టోల్ టాక్స్ వసూలు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు అణాలే లేవు. 21 ఏళ్లలోపు యువకులు చదవకూడని లేదా హానికరమైన విషయాన్ని ప్రచురించరాదని 1956 నాటి యువకుల హానికర ప్రచురుణ చట్టం తెలియజేస్తోంది. అప్రదిష్టకరమైన ప్రదర్శనలను నిషేధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకుందని 1876 నాటి డ్రామటిక్ పర్ఫార్మెన్స్ చట్టం తెలియజేస్తోంది. భారత కోర్టులిచ్చే ఏ తీర్పునైనా సమీక్షించే అధికారం బ్రిటిష్ రాణికి ఉంది. ఎప్పుడో కాలంతీరి పోయిన ఇలాంటి చట్టాల్లో 1200 చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో రద్దు చేసింది. మరో 1824 చట్టాలను రద్దు చేయాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే కాలంతీరి పోయిన చట్టాలను గుర్తించి వాటిని రద్దు చేయడానికి తన కార్యాలయంలోని కార్యదర్శి ఆర్. రామానుజం అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇదే లక్ష్యంతో 1998లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి కూడా ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ కాలం తీరిపోయిన చట్టాలను గుర్తించింది. అయితే వాటిని రద్దు చేసే ప్రక్రియ కొనసాగలేదు. ఇప్పటి రామానుజం కమిటీ కూడా అప్పటి కమిటీ సమీక్షలను పునర్ సమీక్షించి సముచిత నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాలంతీరి పోయిన 1200 చట్టాలను రద్దు చేయగా, ఇప్పటి ప్రభుత్వం మూడేళ్ల కాలంలోనే ఏకంగా 1300 చట్టాలను రద్దు చేసింది. దీనికి రాజ్యసభబో మెజారిటీ కలిగిన యూపీఏ కూటమి కూడా సహకరించింది. -
ఆ చట్టాలు మరో రాష్ట్రానికి వర్తించవు
విభజన తరువాత పదవీ విరమణ పెంపు సవరణపై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచుతూ ఆంధప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1984కు ఏపీ చేసిన సవరణలు తెలంగాణ ఉద్యోగులకు వర్తించవని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా కొత్త చట్టం లేదా సవరణలు తెచ్చినప్పుడు అవి ఆటోమేటిక్‌గా ఇరు రాష్ట్రాలకు వర్తించవని తేల్చి చెప్పింది. పదవీ విరమణ వయస్సును 60కు పెంచుతూ ఏపీ చేసిన చట్ట సవరణను అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్ (కోఆర్డినేషన్)గా పనిచేస్తున్న అదనపు ఎస్పీ ఎం.సర్వేశ్వర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఉమ్మడి ఏపీలోని ఆంధప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టాన్ని తెలంగాణ వర్తింపచేసుకుందని, అందువల్ల పదవీ విరమణ వయస్సు పెంపు సవరణను కూడా అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వా న్ని ఆదేశించాలని కోరుతూ సర్వేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లో కోరారు. ఆ అధికారం లేదు... ఈ వ్యాజ్యంపై వాదనలు విన్న ధర్మాసనం... ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 101 ప్రకారం అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న చట్టాన్ని తమకు వర్తింప చేసుకోవడం లేదా మార్చడానికే తెలంగా ణకు అధికారం ఉందే తప్ప, రాష్ట్ర విభజన తరువాత ఏపీ చేసిన చట్టాన్ని వర్తింపచేసు కోవడానికి వీల్లేదంది. ఒకవేళ పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తే, తదనుగుణ ఫలితాలు అందరినీ భయపెట్టే విధంగా ఉంటా యంది. చట్టాలు వర్తింపచేసుకునే విషయం లో రాష్ట్రాలు ఏ విధంగా వ్యవహరించాలో కేంద్రం పునర్విభజన చట్టంలో స్పష్టంగా చెప్పిందని వివరించింది. -
చట్టాలపై పట్టు సాధించాలి
ఆదిలాబాద్: బాధితులకు సరైన న్యాయం చేయాలంటే న్యాయస్థానంలో నిందితులపై నేరారోపణలు రుజువు చేసే బాధ్యత పోలీసు అధికారులపై ఉందని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు నూతన చట్టాలపై ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రాసిక్యూషన్ డైరెక్టర్ వైజయంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాధారణంగా పోలీసు అధికారులకు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కేసుల్లో సులువు పరిశోధన చేస్తారని, ప్రస్తుతం మారుతున్న కాలంలో నూతన చట్టాలపై అవగాహన లోపంతో పరిశోధన జరపడంతో న్యాయస్థానంలో కేసులు రుజువు చేయలేకపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రత్యేక చట్టాల్లోని ముఖ్యమైన పద్ధతులను పాటించకపోవడంతో పోలీసు కేసులు న్యాయస్థానాల్లో కొట్టివేస్తున్నారని సూచించారు. చట్టంలోని అంశాలను క్షుణ్ణంగా తెలియక, చట్టాలను కచ్చితంగా అమలు చేయకపోవడంలో జరుగుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రతీ నాలుగో శనివారం అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో వివిధ చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో పరిశోధనలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, నిందితులను శిక్షించే విధంగా ధృడమైన దర్యాప్తు చేయాలన్నారు. అనంతరం అదనపు ఎస్పీ పనసారెడ్డి మాట్లాడుతూ ఎస్పీ ఎం.శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతీనెల నిర్వహించే నేర సమీక్ష సమావేశంలో పోలీసు అధికారులకు ఎప్పటికప్పుడు నూతన చట్టాలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రాసిక్యూషన్ నిపుణులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీసు అధికారులు మరింత రాటుదేలాలని సూచించారు. పోలీసు అధికారులకు సైబర్ నేరాల్లో దర్యాప్తు సామర్థ్యం పెంచేలా కృషిచేయాలని డైరెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా దర్యాప్తులోని ముఖ్య అంశాలైన నేరపరిశోధన, సొత్తు స్వాధీనం, నేరస్థలం పరిశీలించుట, జప్తు, అటాచ్మెంట్, ఇతరుల ఆధీనంలో ఉన్న దస్తావేజులను ఎలా నోటీసులు ఇచ్చి సాక్షులుగా సేకరించవచ్చో అనే అంశాలపై మెలకువలను కొత్తగూడెం జిల్లా అదనపు ప్రాసిక్యూషన్ నిపుణుడు ఫణికుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ దేవేందర్, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి, మృత్యుంజయ, కె.శ్రీరాం, మల్లికార్జున్, డీఎస్పీలు లక్ష్మీనారాయణ, సీతారాములు తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలి
హైకోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ తిరుపతి లీగల్: వయో వృద్ధులకు రక్షణగా ఉన్న చట్టాలు, హక్కులపై వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉమ్మడి హైకోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ చెప్పారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం వృద్ధుల హక్కులు, చట్టాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ, చిత్తూరు జిల్లా న్యాయసేవా సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ రమేశ్‌రంగనాథన్ మాట్లాడుతూ... వృద్ధులపై జరిగిన నేరాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలతో కూడిన ప్రత్యేకమైన రిజిస్టర్‌ను ప్రతి పోలీస్ స్టేషన్లో నిర్వహించాలని సూచించారు. వయోవృద్ధుల సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసులు స్పందించాలన్నారు. నిరుపేద వృద్ధుల కోసం ప్రభుత్వాలు దశలవారీగా వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని చట్టం చెబుతోందన్నారు. న్యాయసేవా సంస్థలు, చిత్తూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధులు సంక్షేమ శాఖ సంయుక్తంగా తెలుగులో ముద్రించిన పుస్తకాన్ని జస్టిస్ రమేశ్‌రంగనాథన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ మెంబర్ సెక్రటరీ పి.రాంబాబు, చిత్తూరు జిల్లా జడ్జి సీహెచ్ దుర్గారావు, జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి నరసింహరాజు, రాష్ట్ర వయోవృద్ధుల సమాఖ్య అధ్యక్షుడు పరమేశ్వర్‌రెడ్డి, 13 జిల్లాల న్యాయసేవా సంస్థల కార్యదర్శులు(న్యాయమూర్తులు), న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
సాధికారత సాధించాలి
జిల్లా జడ్జి అరుణసారిక ఆదిలాబాద్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక అన్నారు. బుధవారం న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సాధికారత సాధించాలన్నారు. ఉపాధి రంగాల్లో శిక్షణ తీసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. మహిళలకు సంబంధించిన చట్టాలను తెలుసుకోవాలన్నారు. భార్యాభర్తలిద్దరూ పనిచేస్తేనే కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వాలు కల్పించే అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఎల్ఎస్ఏ ప్రధానకార్యదర్శి జీవకుమార్, ప్రభుత్వ న్యాయవాది నరేశ్‌కుమార్, ఏపీపీ రమణారెడ్డి, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏజెన్సీలో చట్టాలు ఎవరికోసం?
–ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు. బుట్టాయగూడెం: ఏజెన్సీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక చట్టాలు గిరిజనుల కోసమా.? లేక గిరిజనేతరుల కోసమా? అని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం ఆయన స్ధానిక విలేఖరులతో మాట్లాడుతూ ఆదివాసీలైన గిరిజనులు హక్కులను కాపాడేందుకు ప్రత్యేకమైన చట్టాలను ఏర్పాటు చేస్తే అవి సక్రమంగా అమలు కాకపోవడం వల్ల గిరిజనులు అనేక అవస్ధలు పడే పరిస్ధితి నెలకొందన్నారు. ఏజెన్సీలోని చట్టాలను తుంగలో తొక్కి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూసేకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే గిరిజనులు ఎన్నో ఏళ్ళుగా సాగుచేసుకుంటున్న భూములను సైతం 1(బి)ల్లో మారిపోతున్నాయని గిరిజనులు గగ్గోలు పెడుతున్నారన్నారు. 1/70 చట్టానికి విరుధ్ధంగా 1(బి)లో పేర్లు ఎలా మారిపోతున్నాయో అర్ధం కావడంలేదన్నారు. అలాగే భూసేకరణకు సంబంధించి లోపాలు తలెత్తినట్లు తమ దష్టికి వస్తున్నాయన్నారు. పక్కా రికార్డులు లేని భూములను భూసేకరణ చేస్తే దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయని గిరిజన సంఘాలు గగ్గోలు పెడుతున్నా కొంతమంది వ్యక్తులు అధికారులను మభ్యపెట్టే ఫ్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. -
చట్టాలతో ముస్లిం మహిళలకు రక్షణ
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి గుంటూరు ఈస్ట్: గృహ హింసకు గురయ్యే ముస్లిం మహిళలకు చట్టాలు పటిష్టవంతంగా రక్షణ కల్పిస్తున్నాయని మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. మహిళలు వాటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పొన్నూరు రోడ్డులోని లాల్ జాన్ బాషా కల్యాణ మండపంలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ముస్లిం మహిళా చట్టాలు– హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల హక్కుల రక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు తూర్పు ఎమ్యెల్యే ముస్తఫా మాట్లాడుతూ గృహ హింసకు గురయిన మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులు తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలను సమాజంలోని అందదూ ఖండించాలని కోరారు. అనంతరం మొదటి స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి.జె.సుధా, జిల్లా జువైనల్ కోర్టు ప్రధానన్యాయమూర్తి కె.ప్రత్యూష కుమారి, ఏఎస్పీ భాస్కర్‌రావు మాట్లాడారు. సదస్సులో ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ ఖాజా వలీ, గౌరవాధ్యక్షుడు ఎస్.ఎం.గౌస్ మోహిద్దీన్, ఉపాధ్యక్షుడు డాక్టర్ సయ్యద్రసూల్, ముస్లింలు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
ఎచ్చెర్ల: ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బందికి చట్టాలపై అవగాహన అవసరమని న్యాయవాది ఉషారాణి అన్నారు. ఎచ్చెర్ల సాంకేతిక శిక్షణ కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందికి ‘కోర్టు వ్య వహారాలు, ఎదుర్కొనే న్యాయ పరమైన చిక్కులు’ అంశంపై గురువారం మానవ వనరులు శాఖ ఆధ్వర్యంలో వారం రోజులు శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ చట్ట పరమైన హక్కులుంటాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు సేవలు పొందే హక్కు ఉందని తెలిపారు. పౌరసేవా పత్రం, పరిమితి లోబడి సేవలు పొందుతారన్నారు. వారి హక్కులకు అధికారులు భంగం కలిగేలా వ్యవహరిస్తే తప్పనిసరిగా వారు కోర్టులను అశ్రయిస్తారని చెప్పారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్నారు. ప్రజలకు సేవలు పొందే హక్కు, సేవలు అందించే హక్కు అధికారులకు ఉందని తెలిపారు. కోర్టు కేసుల్లో ఇరుక్కుంటే సమయం వృథాతో పాటు, సజావుగా ఉద్యోగ నిర్వహణ సాధ్యంకాదన్నారు. కార్యక్రమంలో శిక్షణ ఇన్చార్జి జోగారావు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ చట్టాలను పాటించాలి
ఎంజీఎం : గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని ప్రతీ ఒక్కరూ పాటించాలని, దీనిని అతిక్రమించి ఎవరు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ సాంబశివరావు స్పష్టం చేశా రు. వరంగల్ రేడియాలజిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యాన గురువారం డయాగ్నస్టిక్ సెంట ర్లను మూసివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు డీఎంహెచ్ఓ సాంబశివరావును కలిశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌తో పాటు రేడియాలజీ అసోసియేషన్ బాధ్యులు లింగనిర్ధారణ జరుపుతున్న కేంద్రాలను గుర్తించి నిర్వాహకులకు శిక్ష పడే లా సహకరించాలని కో రారు. డీఎంహెచ్ఓను కలిసిన వారిలో రేడియోలజిస్టుల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, తాళ్ల రవి, నర్సింగరెడ్డి, సంతోష్ ఉన్నా రు. వేధింపులు నిలిపివేయాలి న్యూశాయంపేట : చిన్న చిన్న కారణాలను సా కుగా చూపి డయాగ్నస్టిక్ కేంద్రాలపై దాడులు చేయడం మానుకోవాలని ఇండియన్ రేడియాలజికల్ ఇమాజింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ టి.నర్సింగారెడ్డి కోరారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లరికల్ తప్పులను పెద్దవిగా చూపిస్తూ సెంటర్ల పై పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ ప్రయోగించ డం సరికాదన్నారు. జిల్లా అధ్యక్షుడు డాక్టర్ టì..రమేష్ మాట్లాడుతూ శుక్రవారం నుంచి అల్ట్రా సౌండ్ సేవలను నిరవధికంగా నిలిపి వేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో డాక్టర్లు తాళ్ల రవి, కె.పవన్‌రెడ్డి, రమణారెడ్డి, మాధవీలత, మాధురి, స్వప్న, వనజ, పూర్ణచందర్, అఖిల్, వేణు, సంతోష్‌రెడ్డి, కపిల్, సునీల్, ఆఫ్రోజ్, దీప్తి పాల్గొన్నారు. -
చట్టాలకు ప్రభుత్వాలు తూట్లు
హైకోర్టు మాజీ న్యాయమూర్తి లక్ష్మణ్‌రెడ్డి విజయవాడ (మొగల్రాజపురం) : చట్టాలు అమలు చేయాల్సిప్రభుత్వం ఆ చట్టాలకుతూట్లు పొడిచి ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. బందరురోడ్డులోని ఆల్ ఇండియా రేడియో ఎదురుగా ఉన్న ౖవైట్హౌస్ బిల్డింగ్‌లో నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్ (ఎన్ఏపీఎం), ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోషియేషన్ సంయుక్తంగా ‘ప్రజాహిత వ్యాజ్యాలు– న్యాయస్థానాల వైఖరి’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం బుధవారం నిర్వహించారు. లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడటంలో ప్రజాప్రయోజనాల వాజ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. గతంలో ఇదే మాదిరిగా వేసిన ‘ఫిల్స్’ వల్లనే బొగ్గు, 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవినీతి బహిర్గతమై వేల కోట్ల రుపాయలు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడగలిగారన్నారు. అమరావతిలో రైతుల నుంచి భూములను లాక్కుంటున్న వైఖరి, రాజధాని నిర్మాణానికి ని«ధులు అంశాలపై సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిల్‌ను కోర్టు స్వీకరించపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 2013 ల్యాండ్ ఎక్విజేషన్ చట్టాన్ని కేంద్రం పార్లమెంట్లో ఆమోదించి అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే దానిని కాదని ఇక్కడ చంద్రబాబు నాయుడు ల్యాండ్ ఫూలింగ్ అంటూ కొత్త విధానాన్ని అమలు చేస్తుండటం అదేదో గొప్ప కార్యం మాదిరిగా మంత్రివర్గం ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి లాక్కుని ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తుందని పిల్ వేస్తే విచారించకుండా మీకేం సంబంధం అంటూ ప్రశ్నించడం సరికాదన్నారు. పంట పొలాలను తీసుకోవద్దని మేధావులతో పాటుగా శివరామకృష్ణన్ కమిటీ కూడా స్పష్టంగా చెప్పిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయవ్యవస్థ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల వాజ్యం వేసే వారు 50 వేల రుపాయలను డిపాజిట్ చేయాలంటూ విధించిన నిబంధన సరికాదన్నారు. పిల్ వేయడం వల్ల ప్రజాధనం వృద్ధా కాకుండా ప్రభుత్వానికి మేలు జరుగుతుందని, ఈ నిబంధన వల్ల అవినీతి జరుగుతుందని పౌరులకు తెలిసినా పిల్ వేయడానికి ఎవరూ ముందుకు రారన్నారు. సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎన్ఏపీఎం రాష్ట్ర కన్వీనర్ బీఆర్కే రాజు, క్యాపిటల్ రీజియన్ ఫార్మర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మల్లెల శేషగిరిరావు, రైతు, రైతు కూలీ హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్ అనుమోలు గాంధీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతిని«ధులు కొలనుకొండ శివాజి, ఎన్.నరసింహారావు, రాజకీయ విశ్లేషకులు దుగ్గరాజు శ్రీనివాసరావుతో పాటుగా కొంత మంది రైతులు, న్యాయవాదులు పాల్గొన్నారు. తీర్మానాలివే.. సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను అన్ని రాష్ట్రాల హైకోర్టులు అమలు చేయాలని, తక్షణమే నవ్యాంధ్రలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఫిల్ వేసే వారు రూ.50 వేలు చెల్లించాలని హైదరాబాద్ హైకోర్టు విధించిన నిబంధన తొలగించాలని, సుప్రీం, హైకోర్టు ఉన్నత న్యాయమూర్తులు రాజకీయ నాయకులకు వ్యక్తిగత ఇంటర్వూ్యలు ఇవ్వడం వలన ప్రజల్లో అనుమానాలు కలిగే అవకాశం ఉందని, అలాంటి వ్యక్తిగత ఇంటర్వూ్యలు ఇచ్చే ముందు ఒక సారి ఆలోచించాలని తీర్మానాలు చేశారు. -
చట్టాలపై అవగాహన అవసరం
మొబైల్ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్ పటాన్చెరు టౌన్: విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరమని మొబైల్ కోర్టు జడ్జి, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. స్పెషల్ మొబైల్ కోర్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. బాలికలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరిగినా, వరకట్న వేధింపులు, బాలకార్మికులను పనిలో పెట్టుకున్నట్లు తెలిసినా వెంటనే చైల్డ్ లైన్ నం. 1098కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి రత్నం, చైల్డ్‌లైన్ డైరెక్టర్ ఎమ్.ఎస్‌చంద్ర బాలల హక్కులు, పరిరక్షణ, బాలల చట్టాలపై ప్రసంగించారు. జిల్లా ప్రొబేషన్ అధికారి సంగమేశ్వర్, ఏఎస్సై దేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గురుకుల పాఠశాల ప్రాగణంలో జరిగిన ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో సంగారెడ్డి మొబైల్ కోర్టు జడ్జి దుర్గా ప్రసాద్ పాల్గొని, పలువురు విద్యార్థుల చేత ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకున్నారు. -
రేపిస్టుల కాళ్లు, చేతులు నరికేయండి: ఠాక్రే
అహ్మద్ నగర్: మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై 'షరియా' (ఇస్లామిక్) వంటి కఠినచట్టాలను అమలు చేయాలని ఎంఎన్ఎస్ ఛీఫ్ రాజ్ ఠాక్రే అన్నారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో ఓ బాలికపై గ్యాంగ్ రేప్, హత్య జరగడం నిజంగా ఆందోళనకరమన్నారు. మైనర్లు, మహిళలపై నేరాలకు పాల్పడేవారిని కాళ్లు, చేతులు నరికేయడమే సరైన పద్ధతంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా కోపర్ది గ్రామంలో జూలై 13న జరిగిన దారుణ ఘటనపై ఎంఎన్ఎస్ ఛీఫ్ రాజ్ ఠాక్రే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాఛారం చేసి, ఆపై హత్యచేయడం రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయనడానికి నిదర్శనమన్నారు. అందుకే ఇటువంటి తీవ్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ ఘటనతో గత కాంగ్రెస్ ప్రభుత్వంకంటే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధ్వాన్న స్థితికి చేరినట్లు నిరూపించుకుందన్నారు. జిల్లా కేంద్రానికి సుమారు 76 కిలోమీటర్ల దూరంలోని కంర్ణత్ తాలూకా కోపర్ది గ్రామం సందర్శించిన రాజ్ ఠాక్రే.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలంటే ప్రస్తుత చట్టాలను అత్యవసరంగా మార్చాలని, తీవ్ర నేరాలకు పాల్పడేవారిని, సంఘవ్యతిరేక శక్తులను సమూలంగా నిర్మూలించేందుకు 'షరియా' వంటి కఠిన చట్టాలను అమల్లోకి తేవాలని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహా అహ్మద్ నగర్ గార్డియన్ మినిస్టర్ రామ్ షిండే సైతం ఆదివారం కోపర్దిలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. నేరస్థులను ఎట్టిపరిస్థితిలో వదిలి పెట్టేది లేదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నేరస్థులకు కఠినంగా శిక్షపడేట్లు చూస్తామని బాధితకుటుంబానికి భరోసా ఇచ్చారు. -
కొత్త క్రికెట్ 'లా' యాప్!
న్యూ ఢిల్లీః క్రీడాభిమానులకు ఓ కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. క్రికెట్ చట్టాలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా ఈ కొత్త అనువర్తనాన్ని ఓ క్రికెట్ క్లబ్ రూపొందించింది. ఢిల్లీలోని పురాతన క్రికెట్ సంస్థ క్రీడాభిమానుల హైటెక్ అవసరాలకు అనుగుణంగా కొత్త అప్లికేషన్ ను మార్కెట్ లో విడుదల చేసింది. అత్యంత పురాతన క్రికెట్ ఇనిస్టిట్యూట్ మేరీ లెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) క్రికెట్ క్రీడకు సంబంధించిన చట్టాలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా కొత్త యాప్ విడుదల చేసింది. ఈ నూతన ఆవిష్కారం యాండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. 'ఎంసిసి లాస్ ఆఫ్ క్రికెట్' పేరున అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త యాప్ లో... క్రికెట్ చట్టాలు క్రీడాభిమానులకు, వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేందుకు వీలుగా ఫొటోలు, క్విజ్, యానిమేషన్ రూపంలో ప్రత్యేక వివరణలతో విడుదల చేసింది. క్రికెట్ కు సంబంధించిన 42 చట్టాలను ఎంసీసీ యాప్ లో అందుబాటులోకి తెచ్చింది. ఆట సెట్ ఆప్ దగ్గరనుంచీ ప్రతి విషయాన్ని అర్థమయ్యే రీతిలో వివరిస్తూ చట్టాలను ఎనిమిది విభాగాలుగా విభజించి యాప్ లో అందుబాటులోకి తెచ్చింది. -
బెట్టు చేస్తున్న కోడి
సమాజం కోరుకోవడం లేదు. జంతు ప్రేమికులు కోరుకోవడం లేదు. చట్టాలు కోరుకోవడం లేదు. ఆఖరకు కోళ్లు కూడా మాకొద్దు మొర్రో అని బెట్టు చేస్తున్నాయి. కాని బెట్టు కోసం వీటి బెట్టును తీసి గట్టున పెడుతున్నారు. ‘కూస్తే అలారం... కోస్తే పలారం’ అని కోడి గురించి చమత్కరించాడో నానుడికారుడు. నిజమే. అలారం లేని రోజుల్లో కోడి కూతతోనే సుప్రభాతం అయ్యేది. కోడి లేపితేనే ఊరంతా లేచింది. తెలీని రోజుల్లో ఆదిమానవులు కొండ దేవరతో పాటు కోడి దేవరకు కూడా దండం పెట్టుకునేవారు. అయితే క్రమక్రమంగా భ్రమలు తొలగిపోయాయి. ‘తాను కూయకపోతే తెల్లారదు’ అని బెట్టు చేసినా సూరయ్య సరాసరా అని పైకొచ్చేసేవాడు. ఇంకేముంది? కోడి కూరైపోయింది. కోరిన దేవతకు మొక్కయ్యింది. దిష్టి దింపే పక్షి అయ్యింది. బంధువులకు మర్యాద అయ్యింది. పందెం వేస్తే ప్రాణం ఇచ్చే ప్రాణి అయ్యింది. ఆరువేల ఏళ్లుగా... మనిషి ఎక్కడైనా మనిషే. కష్టం చేసిన మనిషి వినోదం కోరుకున్నాడు. ఆ వినోదం చుట్టుపక్కల దొరికి ప్రతి ప్రాణిలో వెతుక్కున్నాడు. అన్ని పందేలకు మల్లే కోడి పందేలు కూడా వినోద సాధనంగా మారాయి. పర్షియాలో దాదాపు ఆరువేల ఏళ్లుగా ఇవి ఉనికిలో ఉన్నట్టు చరిత్ర. కాని 17వ శతాబ్దం నుంచి అధికారికంగా నమోదు అవుతున్నాయి. కోళ్ల పందాలు జరిగే దేశాలలో అమెరికా, జపాన్ వంటి అగ్ర రాజ్యాలు ఉన్నా లాటిన్ అమెరికా దేశాల్లో ఇవి విస్తారం. భారత ఉపఖండంలో తూర్పు ఆసియా దేశాల్లో కోళ్లు కొట్టుకోకపోతే మనుషులు కొట్టుకునేంత వెర్రి ఉంది. ఇక తెలుగువారికైతే పల్నాటి చరిత్రే ఉంది. మనిషికి చెలగాటం... కోడికి ప్రాణసంకటం పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లే కోళ్లయందు పందెపు కోళ్లు వేరేగా ఉంటాయి. పందేలకు పనికొచ్చేవి పుంజులే! ఎంత గతి లేని వాళ్లయినా పెట్టలతో పందేలు ఆడరు. పుంజులలో మేలిజాతివాటిని ఏరి కోరి సాకుతారు. జీడిపప్పు, బాదంపప్పు ఖరీదైన దాణా వేస్తారు. జబ్బులు సోకకుండా ఉండటానికి టీకాలు వేయిస్తారు. ఎప్పటికప్పుడు పశువైద్యులతో పరీక్షలు జరిపిస్తారు. ప్రత్యేక శిక్షకుల ఆధ్వర్యంలో వాటి చేత వ్యాయామాలు చేయిస్తారు. యుద్ధశిక్షణ ఇప్పిస్తారు. బరిలోకి దిగాక హుషారు సన్నగిల్లకుండా ఉండటానికి గొంతులోకి కాస్త ‘చుక్క’ అలవాటు చేస్తారు. ఇలా మేసే పందెం పుంజులు మనుషులను లెక్కజేయవు. లేని గదను ఊహించుకుంటూ సుయోధనుల్లా తిరుగుతుంటాయి. వేళకు కూత పెట్టినా, పెట్టకున్నా యజమానులు వీటిని పల్లెత్తు మాట అనరు. అయితే, ఇదంతా తాత్కాలిక వైభోగమే! పందెంలో గెలవాలి. అప్పుడే మర్యాద. ఓడిందా... వీరమరణం తప్పదు. ఒక్కోసారి పరువు హత్యలు కూడా ఉంటాయి. గెలిచినా ఓడినా పందెం కోడి అంతిమ స్థావరం భోజన ప్రియుల పెద్ద బొజ్జే. కాకి... నెమలి... డేగ... ఇవన్నీ కోళ్లే! పందెం పుంజుల్లో చాలా రకాలు ఉన్నాయి. కాకి, కొక్కిరాయి, నెమలి, డేగ... పక్షుల స్వభావాలను పోలుస్తూ రెక్కలు, తోకల రంగుల బట్టి పందెం కోళ్లకు ఇలా నామకరణం చేస్తారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా డేగ, కాకి రకాలు ఉంటాయి. ఆ తర్వాత నెమలి, పర్ల ఉంటాయి. ఇవి కాకుడా చవల, సేతువ, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుగు గౌడు వంటి రకాలు ఉన్నాయి. దించుడు పందెం... చూపుడు పందెం... కోడి పందేలను నాలుగు రకాలుగా నిర్వహిస్తారు. ఎత్తుడు దించుడు పందెం... చూపుడు పందెం... ముసుగు పందెం... డింకీ పందెం... వీటిలో ఎత్తుడు దించుడు పందేలకే గిరాకీ ఎక్కువ. రెండు పుంజులను బరిలోకి దింపి రెచ్చగొట్టి అవి కయ్యానికి కాలు దువ్విన మరుక్షణం నుంచి పోటీ మొదలైపోతుంది. నిజానికి కోడి యజమానుల కంటే చుట్టూ చేరిన జనాలే ఎక్కువ పందెం కాస్తారు. కత్తుల పందెం అయితే పందెం ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లాంటిది. క్షణాల్లో ముగిసిపోతుంది. ఆయువుపట్టు మీద మొదటి కత్తిదెబ్బ తాకిన కోడి నెత్తురోడుతూ వీరమరణం పొందుతుంది. రెండో కోడి రెక్కలల్లారుస్తూ విజేతగా నిలుస్తుంది. కత్తుల పందెంలో కోడి గెలుపు ఎక్కువగా అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది. కత్తులు లేని పందెమే కోడిపుంజుల శౌర్యప్రతాపాలను నిగ్గుతేల్చే సిసలైన పందెం. ఇది టెస్ట్ మ్యాచ్లలాంటిది. ఇలాంటి పందెం చాలాసేపు కొనసాగుతుంది. కేవులు... తీతలు... పందెం కోళ్ల యజమానుల కంటే పందేలు నిర్వహించేవాళ్లే ఈ పోటీల్లో ఎక్కువ లబ్ధిదారులు. ప్రతి పందెంలో వీరు అన్ని పందేల మీద టెన్ పర్సెంట్ కమీషన్ తీసుకుంటారు. దీనినే కేవులు లేదా తీతలు అంటారు. సంక్రాంతి పండుగలో తూ.గో, ప.గో జిల్లాల్లో ఒక్కో బరిలో ఒక రోజంతా సాగే పందేల్లో నిర్వాహకులకు వచ్చే తీతలే పది నుంచి ముప్పై లక్షలు ఉంటుందని అంచనా. వీళ్లు కాకుండా లబ్ధి పొందేవాళ్లు ఇంకొకరున్నారు. వీళ్లే రూస్టరాలజిస్టులు. అనగా కుక్కుట శాస్త్రవేత్తలు. అంటే పందెం కోళ్ల స్పెషలిస్టులన్న మాట. వీరు బరులన్నీ తిరుగుతూ ఏ రకం కోడిని ఏ రోజు పందెంలో నిలబెడితే గెలుస్తుందో ఏ రకం కోడిని బరిలో ఏ దిక్కున నిలబెడితే గెలుస్తుందో ఈకకు ఈక పరిశీలించి, పంచాంగాలను ‘కోడీ’కరించి మరీ చెబుతారు. ఇలా చెప్పినందుకు భూరి సంభావనలు పుచ్చుకుంటారు. జోస్యం ఫలిస్తే అది తమ ప్రతాపంగా, వికటిస్తే అది సదరు కోడి యజమాని గ్రహచారంగా చెప్పి తప్పించుకుంటారు. నిజానికి కోడి పందేల సీజన్లో పందెం బరి దరిదాపుల్లోనైనా కనిపించని ఇలాంటి కుక్కుటేశ్వర స్వాములే సిసలైన విజేతలు! దుష్ట సంప్రదాయం... నిజంగా వినోదం ఏదైనా స్థాయి మించకపోతే వినోదంగానే ఉంటుంది. రెండు పుంజులు రెండు మూడు నిమిషాల పాటు కాలు దువ్వుకుంటే దేని ప్రాణమూ పోదు. మరు నిమిషం విడిపోయి అవి తమ దారిన తాము పోతాయి. కాని పందెం పెట్టడం వల్ల ఒకటి చావాల్సిన... ఇంకోటి బతకాల్సిన అగత్యం వస్తోంది. దీని కోసం కోళ్లకు స్టెరాయిడ్లు ఇచ్చేవాళ్లు ఉన్నారు. పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవాళ్లు ఉన్నారు. కత్తులకు విషాలు పూసి ఎదుటి పక్షిని విషగ్రస్తం చేసేవాళ్లు ఉన్నారు. ఇవన్నీ సరదాగా సాగాల్సిన పల్లె పందేల్ని కోడి పందేల్లి హింసాత్మకం చేస్తున్నాయి. కాని మానవుల అభిరుచుల్ని చట్టాలు నియంత్రించలేవు. ఇంగ్లాండుతో సహా అనేక దేశాల్లో కోడి పందేలను నిషేధించినా ఎక్కువ తక్కువగా అవి సాగుతూనే ఉన్నాయి. సాగుతాయి కూడా! - సాక్షి ఫ్యామిలీ -
రాజీయే రాచమార్గం
లోక్‌అదాలత్‌లతో బాధితులకు సత్వర న్యాయం మదనపల్లె రూరల్ : రాజీయే రాజ మార్గమని పెద్దలు చెప్పారు. ఇప్పుడు చట్టాలు అందుకు అనుకగుణంగానే ఉన్నా యి. బాధితులను కోర్టుల చుట్టూ తిప్పడం కంటే రాజీతో కేసులు పరిష్కారం చేయాలని నూతన విధానాన్ని అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నారు. తద్వారా ఇరువర్గాలను రాజీ కుదిర్చి అప్పటికప్పుడే కేసులు పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా బాధితులకు తక్షణ సాయంగా పరిహారం అందజేస్తూ న్యాయస్థానాలు మరో అడుగు ముందుకేస్తున్నాయి. ఇక్కడ పరిష్కారమైన కేసులపై తిరిగి పైకోర్టులను ఆశ్రయించిన దాఖలాలు లేకపోవడంతో లోక్ అదాలత్‌లు విజయవంతమైనట్టే చెప్పవచ్చని న్యాయ వాదులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన వందల కేసులకు పరిష్కారమార్గం లభిస్తోంది. జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు జిల్లాలోని 51 కోర్టుల్లో జాతీయ, మెగా లోక్ అదాలత్‌లు 8,092 నిర్వహించగా అందులో 5,075 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ కేసుల్లో బాధితులకు పరిహారంగా రూ.50 కోట్లను అందజేసి రికార్డులు బద్దలు కొట్టారు. అలాంటి వాటిలో ప్రధానంగా క్రిమినల్ కేసులు 3,270, సివిల్ కేసులు 670, ఎన్ఓపీలు169, పీఎల్‌పీలు 853, ఎక్సైజ్ 113 కేసులు పరిష్కారమయ్యాయని అధికారులు తెలిపారు. -
సమాచారం అడగకుండా లంచం ఇస్తారా?
విశ్లేషణ ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వడం నేరం, అతను తీసుకోవడం నేరం. కాని ప్రభుత్వాధికారి ప్రజలలో ఒకరికి లంచం ఇవ్వజూపడం అనేది ఇదివరకెన్నడూ చరిత్ర ఎరుగని సంఘటన. లంచం లేని సమాజాన్ని ఇప్పుడు సామాన్యుడు ఊహించలేడు. ప్రభుత్వ అధికారాలు చలాయించే వ్యక్తి, ఆ అధికారాన్ని వినియోగించేం దుకు తన జీతం కన్న మించి ఏదీ అడగకూడదు. అడిగితే చట్టవ్యతిరేక ప్రతిఫలం అవుతుంది. దాన్నే లంచం అని మనం సామాన్య పరి భాషలో అంటున్నాం. లంచం అడగడం నేరం. అడిగే ప్రయత్నం చేయడం కూడా నేరమే. లంచం ఇవ్వ జూపడం లేదా ఇవ్వడం కూడా నేరాలే. అధికారాన్ని విచక్షణను దుర్వినియోగం చేయడం అందుకు ప్రతిఫలం ఆశించడం కూడా ఈ నేరం కిందికి వస్తాయి. ప్రభుత్వ అధికారం చేతిలో ఉన్న వ్యక్తి దాన్ని తన స్వార్థం కోసం వినియోగించాలనుకునే ప్రైవేటు వ్యక్తి అవినీతి నేరం కింద నిందితులవుతారు. ఇందులో ఒక వివాదం కూడా ఉంది. విధిలేక లంచం ఇవ్వవలసిన పరిస్థితిలో ఉన్న వ్యక్తిని నేరస్తుడనడం న్యాయం కాదు. కావాలని లంచం ఇవ్వడం వేరు. లంచం ఇస్తేనే పని చేస్తానన్నప్పుడు, ఆ పని తప్పనిసరి అవసరం అయి నప్పుడు లంచం ఇస్తే నేరం కాకూడదు. కొంత లంచం ఇచ్చిన తరువాత పనిచేస్తానన్న ప్రభుత్వ అధికారి మరికొంత లంచం అడిగినపుడు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయడం, వారు ప్రచ్ఛన్నంగా దాడిచేసి రంగు పూసిన నోట్లను లంచంగా ప్రవేశ పెట్టడం, తీసు కుంటున్న దశలో పట్టుకోవడం మనం చూస్తున్నాం. అటువంటి కేసుల్లో ఫిర్యాదు చేసిన వ్యక్తిని లంచం ఇవ్వ జూపిన నిందితుడుగా పరిగణించబోరు. తానే చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆ వ్యక్తిని క్రిమినల్ ప్రాసిక్యూష న్కు గురి చేయడం ప్రాథమిక హక్కులకు విరుద్ధం. ఆర్టికల్20(1) కింద ఫిర్యాది దరఖాస్తు ద్వారా అతడినే నేరస్తుడిని చేయడానికి వీల్లేదు. బలవంతపు లంచం నేరం లేదా ఒత్తిడికిలోనై లంచం ఇవ్వడం నేరం కావ డానికి వీల్లేదు. ఇచ్చేవాడు తీసుకునే వాడు కలిసి చేసే లంచగొండితనం నేరమవుతుంది. ఇవి ప్రస్తుతం సూత్రాల రూపంలో ఉన్నాయి. కాని స్పష్టమైన నియ మాల రూపంలో లేవు. అవినీతి నిరోధక చట్టాన్ని సవ రించి ప్రజలకు తెలిసే రీతిలో బలవంతపు లంచం నేరం కాదని, ఇద్దరు కలిసి అంగీకారంతో చేసే లంచగొండి తనం నేరమని వివరించాలని పరిపాలనా సంస్కరణల సంఘం 2007లో సిఫార్సు చేసింది. కాని ఈ సిఫా ర్సును అమలు చేసే తీరిక కేంద్ర ప్రభుత్వానికి ఇంత వరకూ లేకపోయింది. ప్రైవేటీకరణ ఆరంభమైన తరువాత ప్రయివేటు కార్పొరేషన్లు, వ్యక్తులు కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న టువంటి అధికారాలే నిర్వహిస్తున్నారు. ప్రైవేటు కార్పొ రేట్లలో కూడా లంచం గొండితనం విచ్చలవిడిగా ఉన్న మాట తెలిసిందే. కాని ప్రైవేటు అవినీతిని అరికట్టే చట్టాలే ఇంతవరకూ లేవు. కార్పొరేట్ అవినీతిని శిక్షించే శాసనాలు చేయవలసిన అవసరం ఉంది. కాని మరొక కొత్త సమస్య వచ్చి పడింది. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన పౌరుడికి ఒక ప్రభుత్వాధికారి రూ.10 వేలు లంచం ఇవ్వజూపడం నేరమా కాదా అనే సవాల్ కేంద్ర సమాచార కమిషనర్ ముందుకు వచ్చింది. న్యూఢిల్లీలో పాలం శాసనసభ నియోజక వర్గంలో ప్రభుత్వం వారు 32 స్వాగత ద్వారాల వంటివి లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించారు. ఏ అవసరాలకు ఉపయోగపడకుండా వీటిని కట్టారని, ఇవన్నీ దురుపయోగమవుతున్నాయని ఎస్ కె సక్సేనా ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరారు. ఒక్కో గేట్‌కు 8 నుంచి పది లక్షల రూపాయల దాకా వెచ్చించారని, రోడ్డుకు అడ్డంగా ట్రాఫిక్‌ను నిరోధిస్తూ ఈ గేట్లు పోస్టర్లు అంటిం చుకోవడానికి మాత్రమే వినియోగపడుతున్నాయని విమర్శించారు. కనీసం ముందు నిర్ణయించిన ప్లాన్‌కు అనుగుణంగా కూడా వీటిని కట్టలేదని ఆయన విమర్శిం చారు. అసలు ఈ అంశం మీద సమాచారం అడగకూ డదని, అందుకు పదివేల రూపాయల లంచం ఇస్తామని ఒక అధికారి తనకు ప్రతిపాదించాడని సక్సేనా కమిష న్కు ఫిర్యాదు చేశారు. అతని మాటలను రికార్డు చేసిన సీడీని కూడా కమిషన్‌కు సమర్పించారు. లంచం ఇవ్వ జూపిన అధికారిపైన విచారణ జరిపి చర్య తీసుకోవా లని కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వడం నేరం, అతను తీసుకోవడం నేరం. కాని ప్రభుత్వాధికారి ప్రజలలో ఒకరికి లంచం ఇవ్వజూపడం అనేది ఇదివరకెన్నడూ చరిత్ర ఎరుగని సంఘటన. కేవలం సమాచార హక్కు చట్టం ద్వారా మాత్రమే సాధ్యమైంది. అయితే ఒక అధి కారి ఇవ్వజూపినది లంచమైనా కాకపోయినా నేర అయినా కాకపోయినా, అది ఖచ్చితంగా సమాచారం ఇవ్వకుండా నిరోధించే ప్రయత్నమే. సెక్షన్ 20 ఆర్టీఐ చట్టం కింద అందుకు జరిమానా విధించే వీలుంది. సమాచారం కోరుతూ అభ్యర్థి చేసుకున్న రెండు ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు ఏమిటో వివరించాలని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. ఆర్టీఐ కింద ప్రశ్నలడగకుండా ఉండేందుకు లంచం ఇవ్వజూపడం ద్వారా సమాచారం అందకుండా అడ్డుకోవడం సెక్షన్ 20 కింద చట్టఉల్లంఘన అవుతుందని, అందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం వివరించాలని నోటీసు జారీ చేశారు. సమాచారం ఇవ్వకుండా వేధించి నందుకు రూ.10 వేలు పరిహారం కూడా చెల్లించాలని నజఫ్ గర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌ను ఆదేశించారు. మాడభూషి శ్రీధర్ (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
చట్టాలపై హిజ్రాలకు అవగాహన
విజయనగరం: హిజ్రాలకు ప్రత్యేకంగా చేసిన చట్టాలతో పాటు సుప్రీంకోర్టు ఇటీవల కల్పించిన వెసులుబాటు వివరాలపై బుధవారం ఇక్కడ అవగాహన కల్పించారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి నాగశేషనాయుడు హిజ్రాల హక్కులతో పాటు చట్టాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షురాలు వీణ, ఉచిత న్యాయ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
చట్టాలపై విద్యార్థులు అవగాహన కల్గి ఉండాలి
- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నీలిమ స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : విద్యార్థులు, యువత విధిగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నీలిమ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక, సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలను ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల పరిసరాలు, సౌకర్యాలు, విద్యాబోధనను పరిశీలించారు. అనంతరం మెస్‌లు, డైనింగ్ హాల్‌లను తనిఖీ చేసి భోజనం, కూరలను ఆమె తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని, ర్యాగింగ్ చట్టరిత్యా నేరమని చెప్పారు. ర్యాగింగ్ నివారణకు ప్రతీ ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు. 18 సంవత్సరాల వయస్సు నిండకుండా, డ్రైవింగ్ లెసైన్స్‌లు లేకుండా వాహనాలు నడపడం నేరమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ జీవన్‌గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో చట్టాలను నిర్లక్ష్యం చేస్తున్నారు
లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి హైదరాబాద్: పాశ్చాత్య దేశాల్లో చట్టాలను గౌరవిస్తుంటే, మన దేశంలో మాత్రం చట్టాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అన్నారు. గాదలె లక్ష్మీభాయి కృష్ణారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బేగంపేట్ ఫార్చూన్ మనోహర్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుభాషణ్‌రెడ్డి మాట్లాడారు. దే శంలో ఎన్నో చట్టాలు కేవలం పేరుకే ఉన్నాయని, వాటిని అమలు చేయడం లేదని అన్నారు. 2009 లో విద్యాహక్కు చట్టం తీసుకొచ్చినా ఇంకా బడిలో చేరని పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం రోగులు తమ ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు దేశంలో ఇంకా ఉన్నాయన్నారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అందరూ తమ రంగాల్లో సేవాభావాన్ని జోడించి సమాజ హితానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చార్టర్డ్ అకౌంటెంట్ జి.కల్యాణ్ దాస్ జీవిత చరిత్ర పుస్తకం ‘ఏ రివర్ త్రూ హిల్లాక్స్’ ను జస్టిస్ విలాస్ అఫ్జల్‌పుర్కర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సీఏ మనోజ్ ఫడ్నీస్, శక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నారాయణరావు, డాల్ఫిన్ మార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కేవీ రావు తదితరులు పాల్గొన్నారు. -
ది ఫోర్త్ ఎస్టేట్: ఓట్లు, కోట్లు, చట్టాలు
-
చట్టానికి చుట్టాలు
(జీవన కాలమ్) తీరా నేరం చేశాక- ఈ హీరోగారు ఒక ట్రస్టుని ప్రారంభించి ప్రజా సేవ చేస్తున్నారట. కానీ బాధితుల కుటుంబాలకు కేటాయించిన 19 లక్షల్లో ఒక్క రూపాయి కూడా ఈ 13 ఏళ్లలో వారికి చేరలేదు! ఈ దేశంలో దాదాపు అన్ని రంగాలూ అవినీతితో భ్రష్టు పట్టిపోతుండగా ఒక్క చట్ట మూ, న్యాయమూ ఏకాస్తో ఉపశమనం కలిగిస్తున్నదన్న ఆశ సామాన్య మానవునికి మిగిలింది. అయితే డబ్బూ, పరపతి, పదవి, అధికారం వంటివి ఆ చట్టాన్ని కూడా లొంగదీసుకోవచ్చునని ఇప్పుడిప్పుడే రుజువవుతోంది. అలనాడు మహాత్మా గాంధీ ‘యంగ్ ఇండియా’లో అన్నా రు: ‘‘బ్రిటిష్ న్యాయ స్థానాల్లో న్యాయం ఖరీదైన సరు కు. సాధారణంగా బరువైన డబ్బు సంచీదే విజయం’’ అని. మనం బ్రిటిష్ వ్యవస్థ వారసులం. 13 సంవత్సరాల కిందట తాగి, లెసైన్సు లేకుండా కారు నడిపి ఒకరిని చంపి, నలుగురిని గాయపరిచి, సంఘటనా స్థలం నుంచి పారిపోయిన ప్రముఖ నటు డు- సల్మాన్ ఖాన్ ఈ 13 సంవత్సరాలూ ఖరీదయిన లాయర్ల దన్నుతో కేసుని సాగదీశారు. 13 ఏళ్ల తర్వాత కారులోలేని మరొక కొత్త సాక్షిని -డ్రైవర్ని-రంగంలోకి దింపారు. చట్టంలో అలసత్వం కారణంగా న్యాయవ్య వస్థ - ఎంత డబ్బుని, ఎంత సమయాన్ని, ఎంత విలు వైన సిబ్బంది కృషిని వెచ్చించిందో ఆలోచిస్తే ఇలాంటి నేరస్థుల వల్ల వ్యవస్థ ప్రజాధనాన్ని ఎంత వృథా చేస్తోం దో అర్థమవుతుంది. ఇది సామాన్య పౌరుడి పెట్టుబడి. మనందరి సొమ్ము. తీరా న్యాయస్థానం సల్మాన్ ఖాన్ నేరస్థుడని తీర్పు ఇచ్చాక- ఏనాడూ జరగని విధంగా కోర్టులూ, ఆఫీ సులూ రాత్రి ఎనిమిది వరకు పనిచేసి ఈ నేరస్థుడయిన హీరోగారు జైలుకి వెళ్లకుండా కాపాడాయి. 48 గంటల తర్వాత 13 సంవత్సరాల బెయిలుని మరో రెండు రోజులు పొడిగించారు. కోర్టు ఆర్డరు చేతికి రాకుండానే హైకోర్టు రెండు గంటల్లో తీర్పుని ఇచ్చింది! ఈ దేశంలో కనీసం రెండున్నర లక్షల మంది- నూరు రూపాయల లంచం తీసుకున్న పాపానికి బెయి లు డబ్బు కట్టుకోలేక, కోర్టులకు తమ గోడుని ఎలా వినిపించాలో తెలియక సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. 1984లో 57 రూపాయలు మనియా ర్డరు సొమ్ము తిన్న ఒకానొక పోస్టుమాన్ 372 సార్లు - 17 సంవత్సరాలు కోర్టుకు హాజరయాడట! చివరికి అతను నిరపరాధి అని కోర్టు తీర్పు ఇచ్చింది! తీరా నేరం చేశాక- ఈ హీరోగారు ఒక ట్రస్టుని ప్రారంభించి ప్రజా సేవ చేస్తున్నారట. చేతులు కాల్చుకు న్నాక, చేతులు కాలాయని తెలిసిన గడుసయిన ‘డబ్బు న్న’ నటుడు ఆకులు పట్టుకున్న తెలివైన ప్రణాళిక. ఇం తకీ చచ్చిపోయిన వ్యక్తి కుటుంబానికీ, గాయపడినవారి కుటుంబాలకూ కేటాయించిన 19 లక్షల్లో ఒక్క రూపా యి కూడా ఈ 13 ఏళ్లలో బాధితులకి చేరలేదు! ఇంతకూ సల్మాన్ ఖాన్ జైలుకి వెళ్తారా? వారి పట్ల అభిమానులు ఎలా ఆవేశపడుతున్నారు? సినీ ప్రపంచం ఏకమయి ఎలా సానుభూతి పలుకుతోంది? ఆయన్ని కోర్టులో చూసి తరించిన పోలీసులు అతి ఆనందంగా వారితో ఎలా కరచాలనం చేస్తున్నారు? చట్టాన్ని అటకె క్కించి తనని జైలు నుంచి తప్పించిన లాయర్లని హీరో గారు ఎంత ఉదారంగా కావలించుకుంటున్నారు?- ఈ దృశ్యాల్ని కేవలం 72 గంటలు చూపించి చానళ్లు సమృ ద్ధిగా డబ్బు చేసుకున్నాయి. ఇదంతా పెద్ద తమాషా. మరో పంచ రంగుల కల. 1988లో 28 ఏళ్ల ఫిలిం డెరైక్టర్ చారుదత్ ఆచా ర్యని ఓ ప్రముఖ దర్శకుడు, కవి కూతురు కారుతో గుద్దేసింది. అతని కాలు నుగ్గు నుగ్గు అయి శాశ్వతంగా కుంటి అయ్యాడు. ఆమె యాక్సిడెంటు స్థలం నుంచి యథాప్రకారంగా నిష్ర్కమించింది. ఈ ఆచార్యగారి మాటలు: ‘‘ఢీకొట్టి, పారిపోవడంలో (హిట్ అండ్ రన్) రెండు అంశాలున్నాయి. ఢీకొట్టడం, పారిపోవడం. చాలా సందర్భాల్లో-రక్తంలో విస్కీ పాలు ఎక్కువయి ఢీకొట్టవచ్చు. కాని పారిపోవడం- వ్యక్తిలో మానవతా విలువలు పూర్తిగా లోపించాక, రక్తంలో అహంకారం ప్రబలినప్పుడు మాత్రమే జరుగుతుంది. విస్కీ మత్తులో ఉన్నవాడు కారు నడపడం రద్దీగా ఉన్న వీధిలో చింపాం జీ చేతికి ఏకే-47 రైఫిల్ ఇచ్చినట్టు. ఇది కేవలం తాగు బోతు కారు నడిపిన కేసు మాత్రమే కాదు. సిగ్గూ యెగ్గూ లేకుండా పరారీ అయిన నేరస్థుడి కథ. తమ కోటీశ్వరుల క్లబ్బులో వాటాదారుడయిన ఒక స్టార్‌కి వెన్నెముకలేని పరిశ్రమ మద్దతు పలికే సిగ్గు మాలిన కథ.’’ ఇవి నా మాటలు కావు. 17 సంవత్సరాలు ఇలాం టి యాక్సిడెంటులో ఎన్నో ఆపరేషన్లు, ఎన్నో వైఫ ల్యాలు, రోగాలు తట్టుకుని ఉపాధిని కోల్పోయి చేతి కర్రతో మిగిలిన ఓ దురదృష్టవంతుడి గొంతు. చట్టాలకు కొందరు చుట్టాలుంటారు. వారిలో డబ్బులేని పేద నేర స్థులకి చోటు లేదు. ఆ కారణానికే ఈ దేశంలో ఖరీద యిన చింపాంజీలు చాలా వున్నాయి. (గొల్లపూడి మారుతీరావు) -
‘ఎన్‌జేఏసీ చట్టంపై ఫిర్యాదులు స్వీకరించొద్దు’
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొత్తగా రూపొందించిన రెండు చట్టాలను సవాలు చేస్తూ వేసే పిటిషన్లను ఇకపై దిగువ కోర్టులు స్వీకరించరాదని సుప్రీంకోర్టు బుధవారం నిర్దేశించింది. రాజ్యాంగ సమ్మతి ఉన్న ఈ రెండు చట్టాలకు సంబంధించిన ఎలాంటి విషయాలపై పిటిషన్లు వచ్చినా హైకోర్టుతో సహా దిగువ కోర్టులు ఏవీ కూడా విచారించరాదని జస్టిస్ దవే నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ రెండు చట్టాలను సవాలు చేస్తూ వేసే పిటిషన్లను విచారించాలా... వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది. కాగా, సైన్యానికి సంబంధించిన వివాదాల్లో సాయుధ బలగాల ట్రిబ్యునల్(ఏఎఫ్‌టీ) ఇచ్చే తీర్పులను సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను విచారించేందుకు హైకోర్టులకు అధికారం లేదని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. -
చట్టాల గురించి తెలుసుకోండి
పౌరకార్మికులకు హైకోర్టు న్యాయమూర్తి ఎన్.కె.పాటిల్ సూచన బెంగళూరు(బనశంకరి):చట్టాల గురించి తెలుసుకుంటే జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని పౌరకార్మికులకు హైకోర్టు న్యాయమూర్తి ఎన్.కె.పాటిల్ సూచించా రు. బీబీఎంపీ కార్యాలయంలో పౌర కార్మికులకు శని వారం ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన శిబిరంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధి పొందాలంటే వాటిపై సంపూర్ణంగా అవగాహన ఉండాలని, ఇది చట్టాల గురించి తెలుసుకున్నప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. పౌరకార్మికులకు సకాలంలో వేతనాలను కాంట్రాక్టర్లు అందించడం లేదని అన్నారు. ఫలితంగా వారి పరిస్థితి మరింత దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరకార్మికుల వేతనాలనున సకాలంలో అందించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. మ్యాన్‌హోల్‌లను శుభ్రం చేయడానికి యంత్రాలు వచ్చినా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సఫాయి కార్మికులతోనే పనులు చేయిస్తున్నారని, ఫలితంగా వారు రోగాల బారిన పడుతుండడంతో వారి కుటుంబంపై ఆ ప్రభావం తీవ్రంగా చూపుతోందని ఆందోళన వ్యక్తతం చేశారు. ఈ దయనీయ పరిస్థితిని అధిగమించేందుకు శాస్త్రీయ పద్ధతులను అవలంభించాలని అన్నారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య చికిత్సలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ మేయర్ శాంతకుమారి, డిప్యూటీ మేయర్ రంగణ్ణ, పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ పాల్గొన్నారు. -
బాల్యానికి భరోసా ఉన్నట్టేనా?!
బడి ఈడు పిల్లలను పనిలో పెట్టుకోవడాన్ని మన రాజ్యాంగం 24వ అధికరణం ద్వారా నిషేధించి దశాబ్దాలు గడుస్తున్నా, అందుకనుగుణంగా రకరకాల చట్టాలొచ్చినా... తదనంతరకాలంలో వాటికి సవరణలు తెచ్చినా అమలులో మాత్రం వరస వైఫల్యాలే ఎదురవుతున్నాయి. పదేళ్లలో బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలని 1978లో తీర్మానించారు. 1988లో దాన్నే మరోసారి పునరుద్ఘాటించారు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త గడువు విధించుకోవడం తప్ప సమస్య పరిష్కారం మాత్రం సాధ్యపడటంలేదు. అందువల్లే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల ముందుకు మరింత పకడ్బందీగా బాల కార్మిక వ్యవస్థ(నిషేధం, నియంత్రణ) సవరణ బిల్లు తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. చేసిన చట్టాలు ఎందుకు చట్టుబండలయ్యాయో, లోపం ఎక్కడున్నదో గమనించుకుని అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ, ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నదా అనే అనుమానం అందరికీ కలుగుతున్నది. వాస్తవానికి ఈ సవరణ బిల్లును రూపొందించి రెండేళ్లు దాటుతోంది. ఇన్నాళ్లకు ఇప్పుడు పార్లమెంటు ముందుకు వస్తున్నది. బాల కార్మికులు గనుల్లో లేదా పరిశ్రమల్లో ఉండరాదని భారతీయ కర్మాగారాల చట్టం (1948), గనుల చట్టం (1952) నిషేధించాయి. ఆ తర్వాత చాన్నాళ్లకు బాలకార్మికుల నిషేధం, నియంత్రణ చట్టం (1986) వచ్చింది. దానికి కొనసాగింపుగా జాతీయ బాలకార్మిక విధానం (1987) వచ్చింది. వీటన్నిటివల్లా తగిన ఫలితాలు రాలేదన్న ఉద్దేశంతో 1986 నాటి చట్టానికి 2006లో మరోసారి సవరణలు తీసుకొచ్చారు. ఇవిగాక బాలలందరూ తప్పనిసరిగా బడికెళ్లేలా చూడాలని 2010లో అమల్లోకొచ్చిన విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తున్నది. ఇంత చేసినా బాల కార్మికులు అడుగడుగునా తారసపడుతూనే ఉన్నారు. మన వ్యవస్థ చేతగానితనాన్ని వెక్కిరిస్తూనే ఉన్నారు. కార్పెట్ పరిశ్రమల్లో, బీడీల తయారీలో, మరమగ్గాల పనుల్లో, క్వారీల్లో, ఇటుక బట్టీల్లో, రోడ్డు పక్కన కనబడే టీ దుకాణాల్లో, మెకానిక్ షెడ్లలో...ఎక్కడ చూసినా బాల కార్మికులే కనిపిస్తారు. వీరంతా 5-14 ఏళ్ల మధ్య వయసున్నవారే. కేవలం పేదరికం కారణంగానే బాల్యం చాకిరీలో మగ్గవలసి వస్తున్నదన్నది పాక్షిక సత్యమేనని... పిల్లలు చదువుకు దూరమై పనుల్లో ఉండటంవల్ల నిరుపేదలు ఎప్పటికీ అదే స్థితిలో కొనసాగవలసి వస్తున్నదని ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నదాంట్లో నిజముంది. పిల్లలకైతే తక్కువ వేతనాలివ్వొచ్చునని, లెక్కకు మిక్కిలి సమయం పని చేయించుకున్నా నోరెత్తర ని యజమానులు భావిస్తున్నారు. కనుకనే నిరుపేద వర్గాలకు సాయం చేసే వంకన పిల్లలతో చాకిరీ చేయిస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) లెక్కల ప్రకారం ఆఫ్రికన్ దేశాల తర్వాత అత్యధిక బాల కార్మికులున్న దేశం మనదే. ఇన్ని చట్టాలున్నా, ఇన్నేళ్లు గడుస్తున్నా దేశంలో బాల కార్మిక వ్యవస్థ అదృశ్యం కాకపోవడానికి కారణాలేమిటి? సమస్య మూలాల్లోకి వెళ్లి అందుకు అనుగుణమైన చట్టాలను తయారుచేయకపోవడంవల్లనా లేక వాటిని అమలు చేస్తున్న అధికార యంత్రాంగంలో అలసత్వమా అనే విషయంలో ఎంత వరకూ సమీక్ష జరిగిందో తెలియదు గానీ 1986 చట్టానికి మరిన్ని సవరణలు తీసుకురావడంతోపాటు దాన్ని బాలలు, కౌమార కార్మికుల నిషేధ చట్టంగా మార్చాలని రెండేళ్లక్రితం యూపీఏ సర్కారు సంకల్పించింది. ఆ బిల్లును పార్లమెంటు స్థాయీ సంఘానికి పంపడం, ఆ సంఘం దాన్ని కూలంకషంగా పరిశీలించి కొన్ని సవరణలు సూచించడం పూర్తయింది. వాస్తవానికి నరక కూపంలో మగ్గుతున్న లక్షలాదిమంది పిల్లలకు విముక్తి కలిగించడానికి ఉద్దేశించిన ఈ బిల్లు విషయంలో పార్లమెంటు ఇంకాస్త చురుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. కనీసం ఇన్నాళ్లకైనా ఈ బిల్లు సభ ముందుకు రాబోతుండటం మెచ్చదగిందే. 1986 నాటి చట్టప్రకారం వ్యవసాయంవంటి ప్రమాదరహిత రంగాల్లో బాల కార్మికులను పనిలో ఉంచుకోవడం శిక్షార్హమైన నేరం కాదు. తాజా సవరణల ప్రకారం ఇకపై ఏ రంగంలో బాల కార్మికులతో పని చేయించినా నేరమే అవుతుంది. అలాగే, ప్రమాదకర పనుల్లో బాల కార్మికులను ఉంచితే ప్రస్తుత చట్టం ఏడాది జైలు, రూ. 20,000 జరిమానా నిర్దేశిస్తుండగా... వారిని ఏ పనులకు వినియోగించుకున్నా రెండేళ్ల జైలు, రూ. 50,000 జరిమానా విధించాలని ప్రస్తుత సవరణ చెబుతున్నది. అయితే, ఇవన్నీ పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన టాస్క్ఫోర్స్లుండాలి. వాటికి లక్ష్య నిర్దేశం జరగాలి. మన దేశంలో అసలు చట్టాల రూపకల్పనలోనే లోపమున్నది. ఏ చట్టం రూపొందించినప్పుడైనా అందుకు సంబంధించి అప్పటికే అమల్లో ఉన్న ఇతర చట్టాలేమిటో పరిశీలించడం కనీస ధర్మం. కానీ, దాన్ని సరిగా పాటించడం లేదని పదే పదే రుజువవుతున్నది. ఉదాహరణకు విద్యా హక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. కానీ, అమలులో ఉన్న బాల కార్మికుల నిషేధం, నియంత్రణ చట్టం ప్రకారం కొన్ని రంగాల్లో పిల్లలతో పనిచేయించుకోవడం నేరం కాదు. అలాగే, 2000నాటి జువెనైల్ చట్టం ప్రకారం 18 ఏళ్ల వయసు లోపువారిని బాలలుగానే పరిగణిస్తారు. చట్టాలు ఇలా పరస్పర వైరుధ్యాలతో ఉన్నప్పుడు ఆచరణలో అనేక సమస్యలు ఎదురవుతాయి. అమలు చేసేవారిలో అయోమయం ఏర్పడుతుంది. ఇప్పుడు తీసుకొస్తున్న సవరణ బిల్లుకు అనుగుణంగా ఇతర చట్టాల్లో నిబంధనలను కూడా సవరిస్తే ఈ లోపాన్ని కొంతవరకూ సరిదిద్దడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు...పిల్లలను బడికి పంపించే నిరుపేద కుటుంబాలకు నగదు రూపేణా సాయం చేస్తామని చెప్పడం వల్లా, వారి జీవనప్రమాణాలను పెంచేందుకు అవసరమైన ఇతర చర్యలు తీసుకోవడం వల్లా కాస్తయినా ఫలితం లభిస్తుంది.