
సాధికారత సాధించాలి
జిల్లా జడ్జి అరుణసారిక
ఆదిలాబాద్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక అన్నారు. బుధవారం న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సాధికారత సాధించాలన్నారు. ఉపాధి రంగాల్లో శిక్షణ తీసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు.
మహిళలకు సంబంధించిన చట్టాలను తెలుసుకోవాలన్నారు. భార్యాభర్తలిద్దరూ పనిచేస్తేనే కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వాలు కల్పించే అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఎల్‌ఎస్‌ఏ ప్రధానకార్యదర్శి జీవకుమార్, ప్రభుత్వ న్యాయవాది నరేశ్‌కుమార్, ఏపీపీ రమణారెడ్డి, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.