Womens Day
-
women's day : హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?
-
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు. -
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్‌లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. -
నేటి యువత..అలనాటి రెట్రో ఫ్యాషన్ తో కిస్సిక్ (ఫొటోలు)
-
లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు. -
Women's Day : మహిళలకు ప్రతీ నెల రూ. 2,500!
ఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచితంగా నెలకు రూ. 2,500 చొప్పున అందిస్తామని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. ‘మహిళా సమృద్ధి యోజనా’ పథకంలో భాగంగా ఈ హామీని అమలు చేయాలని ఢిల్లీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో మహిళలకు రూ. 2500 స్కీమ్‌కు ఆమోద ముద్ర పడింది. దీనిపై సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. ‘ ఈరోజు మహిళల దినోత్సవం. మన క్యాబినెట్ సమావేశం కూడా అందుకే ఈరోజున పెట్టాం. మహిళా సమృద్ధి యోజనా పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ హామీని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చాం. దాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నాం’ అని ఆమె తెలిపారు. ఈ స్కీమ్ కోసం రూ. 5,100 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఇందుకోసం ఒక కమిటీని తన నేతృత్వంలోనే ఏర్పాటు చేసి మరీ పథకాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకోసం ఒక వెబ్ పోర్టల్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్లు అతి త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు రేఖా గుప్తా.మహిళా సమృద్ధి యోజనా పథకానికి ఆమోద ముద్ర పడింది. ఇందుకోసం పోర్టల్ త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. ఇక్కడ నుంచి అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు సంబంధించిన వివరాలను పోర్టల్ పొందుపరుస్తాం. దీనికి ముగ్గురు మంత్రుల కమిటీ ఉంది. కపిల్ శర్మ, అశిష్ సూద్, పర్వేష్ వర్మలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని మంత్రి మన్ జిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. -
మహిళా దినోత్సవం సందర్భంగా తన ఫిట్నెస్ ప్రయాణంపై నీతా వీడియో
-
కాటుక కళ్ళతో మాయచేస్తున్న.. మిర్నా మీనన్ అందానికి బంధీ అయిపోవాల్సిందే!
-
ఉమెన్స్ డే ఎందుకు.. శ్రృతీహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతీహాసన్(Shruti Haasan )..తనదైన నటనతో తక్కువ సమయంలోని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ కలిసి సినిమాలు చేసింది. చివరిగా సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కోలీవుడ్ టు బాలీవుడ్.. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నప్పటికీ శ్రుతీ హాసన్‌పై పెద్దగా పుకార్లేవి రాలేదు. ఏ విషయంలో అయినా ఆమె నిక్కచ్చిగా ఉండమే దానికి కారణం. ఏ అంశంపై అయినా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంటారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై కూడా శ్రుతీ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ..అసలు ఉమెన్స్ డేని జరుపుకోవడం దేనికని ప్రశ్నించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతీ మాట్లాడుతూ.. ‘మేల్ డే అనేది లేనప్పడు ప్రత్యేకంగా ‘ఉమెన్స్ డే’ ఎందుకు ? అంటే ఇంకా స్త్రీ వెనకబడి ఉందని చెప్పడానికే ఈ స్పెషల్ డేస్ జరుపుకుంటున్నారా? అలాగే ఉమెన్ ఓరియెంటెడ్’ సినిమా అంటారు. ‘మేల్ ఓరియెంటెడ్’ మూవీ అనరు. ముందు ఈ తేడా పోవాలి. మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా లేని రోజు ఉమెన్ ఎదిగినట్లు లెక్క’అని తనదైన శైలీలో చెప్పుకొచ్చింది. -
కుటుంబానికి అన్నీ తానే అయిన పిఠాపురానికి చెందిన వెంకటలక్ష్మి
-
వుమెన్స్ డే.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma )..ఎప్పుడు ఏ పని చేస్తాడో, ఎలాంటి కామెంట్స్ చేస్తాడో ఎవరికీ తెలియదు. ఓ అంశంపై అందరూ ఒకలా అభిప్రాయం వ్యక్తం చేస్తే.. ఆయన మాత్రం కాస్త డిఫరెంట్‌గా స్పందిస్తుంటాడు. దానికి లాజికైన సమాధానం కూడా ఆయన దగ్గర ఉంటుంది. అందుకే ఆర్జీవీ ట్వీట్స్ ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. కేవలం సినిమాల గురించే కాదు.. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై ఇతరులకు భిన్నంగా స్పందిస్తుంటాడు. నేను(మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’s Day 2025 ). ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్జీవీకి కూడా వుమెన్స్ డే విషెస్ తెలియజేశాడు. అయితే అందరిలా శుభాకాంక్షలు తెలిపితే ఆర్జీవీ ఎందుకు అవుతాడు? ఆయన విషెస్ కూడా కాస్త డిఫరెంట్‌గానే ఉంటాయి. ‘నా ఉనికి లేకుండా నేను జీవించగలను, కానీ స్త్రీల ఉనికి లేకుండా నేను జీవించలేను .. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆర్జీవీ కూడా ఇలాంటి పోస్టులు పెడతారా’ అని కొంతమంది షాకవుతుంటే.. ‘సూపర్ సార్.. మీకు మీరే లెజెండ్’, ‘భళే చెప్పావ్ సర్’ అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్లో ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ‘శారీ’అనే మూవీని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో సత్య యాదు, ఆరాధ్య జంటగా నటించారు. మార్చి 21న ఈ చిత్రం రిలీజ్ కానుంది. I can live without my existence , but i can’t live without women’s existence ..HAPPY WOMEN’S DAY🙏🙏🙏— Ram Gopal Varma (@RGVzoomin) March 8, 2025 -
మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
-
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
పుణ్యమూర్తివి నీవమ్మా.. మా ఇంటి కావలి తల్లివి నీవమ్మా
ఆధునిక సమాజంలో మహిళలకు గౌరవం దక్కడం ఇప్పిడిప్పుడే మొదలైంది. స్త్రీ విద్య.. స్త్రీలకు ఉద్యోగాలు.. రాజకీయ పదవులు.. సామాజిక హోదా ఈమధ్యనే పెరుగుతూ వస్తోంది. కానీ, ఈ మారుమూల పల్లెల్లో స్త్రీమూర్తులను సాక్షాత్తుగా దేవతలుగా కొలుస్తారు. తమ ఇంటి ఇలవేల్పులుగా ఆరాధిస్తారు. తమ కుటుంబాలను కాపాడే శక్తిగా.. అమ్మవారిగా పూజిస్తారు.. తమ ఇంట పండిన పంటలో తోలి గంపను ఆమెకు సమర్పిస్తారు.. తమ ఇంట వండిన వంటలు తొలిముద్దను ఆమెకు సమర్పిస్తారు. ఇంట్లో ఏదైనా పండగొచ్చినా పబ్బమొచ్చినా ఇళ్లలో వండుకునే పిండివంటల్లో తొలివాయి ఆమెకే ఇచ్చి.. అమ్మా నీ చలవతోనే మేమంతా చల్లగా ఉన్నాం.. నువ్విచ్చిన ఆస్తిపాస్తులు.. ఆశీస్సులతో ఇలా సాగుతున్నాం.. నువ్వు లేకున్నా నీ జ్ఞాపకాలు చాలు.. ఇదిగో నిన్ను చూస్తూ బతికేస్తాం అంటూ భక్తి.. ప్రేమ నిండిన కళ్ళతో ఆ స్మారకాలవద్ద పవిత్రంగా ప్రమిదలు వెలిగిస్తారు.. ఏదైనా ఇంట్లో ఒక మహిళా పుణ్యస్త్రీగా కన్నుమూస్తే ఆమెను పేరంటాలుగా గౌరవిస్తారు. ఆమె పేరిట ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తారు.. వీటిని గుండాం అంటారు. భర్తకన్నా ముందే తనువు చలించడం ఒక మహిళకు దైవత్వాన్ని తెచ్చిపెడుతోంది. అంటే ఆమె పుణ్యస్త్రీగా ముత్తైదువుగా కన్నుమూసి ఆ ఇంటి వారి పాలిట ఇలవేల్పుగా కొలువైపోతుంది. భారతీయ సమాజంలో విధవగా జీవించడం మహిళ ఒక శాపంలా భావిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భర్తకన్నా ముందుగానే ప్రాణం విడిచివెళ్లిన స్త్రీ ఏకంగా దైవత్వాన్ని సంతరించుకుని ఆయా కుటుంబాల్లో దేవతలుగా కొలువుదీరుతారు. విజయనగరం జిల్లాలోని రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో వందలాది పల్లెల్లో ఈ ఆచారం ఉంది.పంటపొలాలకు.. పాడిపశువుల నువ్వే అండాదండాఇక్కడ పొలాల్లో, రోడ్లకు ఇరువైపులా కనిపిస్తున్న ఈ చిన్న చిన్న నిర్మాణాలను ఇక్కడి స్థానికులు గుండాలు అని పిలుస్తారు. ఇటువంటి గుండాలు ప్రతీ గ్రామంలో వందల సంఖ్యలో ఉంటాయి. బొమ్మనాయుడువలస, బొద్దూరు, గుళ్ళ సీతారాంపురం, గడ్డి ముడిదాం, ఉణుకూరు, అరసాడ, కాగితాపల్ల వంటి పల్లెల్లో ప్రతి ఇంటికీ ఇలాంటి గుండాలు ఒంటరి.. వారువారు స్థోమతను బట్టి తమ పొలాల్లోను.. కల్లంలోనూ వీటిని నిర్మించి అందులో ఆ మహిళా ఆత్మను ప్రతిష్టించి ఆ గుండంలో ఆమె జీవించి ఉన్నట్లుగా భావిస్తారు. ఆ ఇంట జరిగే శుభ కార్యాల్లో తోలి కబురు ఆమెకే చెబుతారు. గర్భిణీలు.. పెళ్లికూతుళ్ళు కూడా అక్కడకు వెళ్లి దీపం పెట్టి.. నీలాగే గొప్ప ముత్తైదువులా జీవించేలా ఆశీర్వదించాలమ్మా అని ప్రార్థిస్తారు. అంతేకాకుండా పంటపొలాలు.. పాడిపశువులను సైతం ఆ పేరంటాలు కాపాడుతుందని.. వ్యవసాయపనుల సందర్భాల్లో ఎలాంటి ఇబ్బందులు.. ప్రమాదాలు కూడా రాకుండా ఆమె కావలి ఉంటుందని .. ఇంటికి చీడపీడలు.. అనారోగ్యాలు రానివ్వకుండా ఆ పేరంటాలు అడ్డంగా నిలబడుతుందని విశ్వాసంతో ఉంటారు. అందుకే ప్రతి గుండానికి లలితమ్మ పేరంటాలు.. లక్షమ్మ పేరంటాలు.. రాధమ్మ పేరంటాలు అని పేర్లు పెడుతూ మరణించిన తరువాత కూడా తమ భక్తిప్రపత్తులు చాటుకుంటారు. ఈ గ్రామాల్లో వందలాది ఇలాంటి స్మారకాలు ( గుండాలు) కనిపిస్తాయి. వాటికి ఏటా రంగులు వేసి.. చక్కగా ముస్తాబు చేసి అందులో తమ ఇంటి ముత్తైదువను చూసుకుంటారు. ఈరోజుల్లో మహిళలను గౌరవించడం మాట అటుంచి వారికి రక్షణ కూడా లేకుండా పోతున్న పరిస్థితుల్లో ఉండగా వందల ఏళ్ళనుంచీ ఆ పల్లెవాసులు మహిళలకు ఏకంగా దేవతా స్థానం కల్పించి మరణించాక కూడా ఆమెను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తూ.. ఏటా కొత్తబట్టలు.. పిండి వంటలు.. పళ్ళు ఫలాలు.. సమర్పిస్తారు.. ఇది కదా అసలైన మహిళా సాధికారత.. ఇది కదా మహిళలకు అసలైన గౌరవం..-సిమ్మాదిరప్పన్న. -
హైదరాబాద్‌లో మహిళా దినోత్సవ సంబరాలు (ఫొటోలు)
-
రూ.260 కోట్లు.. ఆర్జనలోనూ అతివలే..
మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఇప్పుడిప్పుడే ఆధిపత్యాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ ప్రముఖ అంతర్జాతీయ ఆతిథ్య సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ.. మహిళల వ్యాపార పురోభివృద్ధిపై ఆసక్తికర విశేషాల్ని వెల్లడించింది.ఎయిర్‌బీఎన్‌బీలో భారతీయ మహిళా హోస్ట్‌లకు (హోటల్స్, పీజీలు అద్దెకిచ్చే వారు) 2024 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది. వారు ఆ ఏడాదిలో రూ.260 కోట్లు ఆర్జించారు. ఇది ఆ ప్లాట్‌ఫామ్ ఆతిథ్య ల్యాండ్ స్కేప్‌కు గణనీయంగా దోహదం చేసింది. దేశంలోని ఎయిర్‌బీఎన్‌బీ హోస్ట్ లలో దాదాపు 30% ఉన్న మహిళలు సమ్మిళితతను పెంపొందించడం, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా సాంప్రదాయ ఆతిథ్య పరిశ్రమను పునర్నిర్మించారు. దేశవ్యాప్తంగా ట్రావెల్ అనుభవాలను పునర్నిర్వచించడంలో మహిళల ప్రాముఖ్యత పెరుగుతోందనడానికి వారి సాధనలే నిదర్శనం.పెరుగుతున్న మహిళా హోస్ట్లుదేశంలో మహిళా హోస్ట్‌లు గణనీయమైన విజయాన్ని సాధించారు. భారత్‌లో ఎయిర్‌బీఎన్‌బీ గెస్ట్ ఫేవరెట్ లిస్టింగ్స్‌లో దాదాపు 35% మహిళా హోస్ట్‌లే నిర్వహిస్తుంటం విశేషం. చిరస్మరణీయమైన, సౌకర్యవంతమైన బసలను అందించడంలో వారి అసాధారణ సామర్థ్యాన్ని ఇది హైలైట్ చేస్తుంది. సుందరమైన ప్రదేశాలలో సౌకర్యవంతమైన హోమ్ స్టేల నుండి ఆధునిక పట్టణ అపార్ట్ మెంట్ల వరకు, మహిళలు సృజనాత్మకత, శ్రద్ధ, అతిథి అంచనాలపై లోతైన అవగాహనను ప్రదర్శించారు.భారతీయ మహిళల్లో ట్రావెల్ ట్రెండ్స్దేశీయ, అంతర్జాతీయ పర్యటనలకు ఎయిర్‌బీఎన్‌బీని భారత మహిళా ప్రయాణికులు వేదికగా ఎంచుకున్నారు. 2024లో భారతీయ మహిళా ప్రయాణికులకు అత్యంత డిమాండ్ ఉన్న దేశీయ గమ్యస్థానాలలో గోవా, ఢిల్లీ, బెంగళూరు, పూణే, జైపూర్ ఉన్నాయి. అంతర్జాతీయంగా లండన్, దుబాయ్, బ్యాంకాక్, పారిస్, రోమ్ వంటి నగరాలు వారి ట్రావెల్ విష్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచాయి.మిలీనియల్ మహిళలు (1981-1996 మధ్య పుట్టినవారు) తమ ప్రయాణ ప్రణాళికల కోసం ఎయిర్‌బీఎన్‌బీని ఉపయోగించడంలో ముందంజలో ఉన్నారు. వారి తరువాత వరుసలో జెన్‌జెడ్ మహిళలు (1996-2012 మధ్య పుట్టినవారు) ఉన్నారు. సౌలభ్యం, ప్రత్యేకమైన అనుభవాలు, స్థోమత కోసం వారి ప్రాధాన్యత ఎయిర్‌బీఎన్‌బీ ప్రజాదరణను పెంచింది. డుయో ట్రావెల్ అత్యంత ఇష్టమైన ట్రిప్ టైప్ గా అవతరించింది. తరువాత సమూహ ప్రయాణాలు, మహిళల్లో భాగస్వామ్య ప్రయాణ అనుభవాల పెరుగుతున్న ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. -
మహిళా పారిశ్రామిక వేత్తలకు సాధికారత
న్యూఢిల్లీ: మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం ఎస్ఎంఈ ఫోరమ్, నీతి ఆయోగ్ సంయుక్తంగా ‘ఏ మిలియన్ ఉమెన్ అరైజ్’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాయి. దేశవ్యాప్తంగా 6 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలు ఉంటే, అందులో 35 శాతం మహిళల నిర్వహణలోనివేనని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ డైరెక్టర్ అంకితా పాండే ఈ సందర్భంగా తెలిపారు. అయినప్పటికీ లింగపరమైన పక్షపాతం, మార్కెట్లో పరిమిత అవకాశాల వంటి వినూత్న సవాళ్లను వారు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. సంఘటితం చేయడం, మార్గదర్శకం, సామర్థ్య నిర్మాణం, ఈ–కామర్స్‌తో అనుసంధానం ద్వారా ఈ అంతరాలను పరిష్కరించేందుకు ఎంఎస్ఎంఈ శాఖ కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మహిళా వ్యాపారవేత్తలకు మద్దతుగా మహిళా ఎంటర్ప్రెన్యుర్షిప్ ప్లాట్‌ఫామ్ (డబ్ల్యూఈపీ)ను ఏర్పాటు చేసినట్టు నీతి ఆయోగ్ డైరెక్టర్ అన్నారాయ్ తెలిపారు.మహిళ వ్యాపారవేత్తలకు రుణ సదుపాయం, నిబంధనలపరమైన మద్దతు, నైపుణ్య కల్పన, మార్గదర్శకం, నెట్వర్కింగ్ పరంగా సాయమందించనున్నట్టు చెప్పారు. నీతి ఆయోగ్ సహకారంతో డబ్ల్యూఈపీ కార్యక్రమాన్ని లక్షలాది మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు చేరువ చేయగలమని ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ చెప్పారు. ఎంఎస్ఎంఈలకు మెరుగైన రవాణా పరిష్కారాలను అందించే లక్ష్యంతో ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగోతో ఎస్ఎంఈ ఫోరమ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా కుదుర్చుకుంది. రెట్టింపు సంఖ్యలో మహిళలకు రుణాలు: సరళ్ ఎస్సీఎఫ్ బ్లాక్‌సాయిల్ క్యాపిటల్‌కు చెందిన ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ‘సరళ్ ఎస్సీఎఫ్’ 2025లో రెట్టింపు మహిళా వ్యాపారవేత్తలకు సాయమందించాలనుకుంటోంది. ఇప్పటికే 150 మంది మహిళా వ్యాపారవేత్తలకు రూ.64 కోట్ల రుణాలను సమకూర్చినట్టు ప్రకటించింది. వృద్ధికి పెట్టుబడి, దీర్ఘకాల స్థిరత్వం దిశగా వారికి మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. 2024లో ఈ సంస్థ అంతక్రితం సంవత్సరంతో పోల్చితే 34 శాతం అధికంగా రూ.1,237 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు ప్రకటించింది. -
సక్సెస్ 'కీ' పవర్ డ్రెస్సింగ్
పవర్ డ్రెస్సింగ్ అనేది ఫ్యాషన్ ఎంపికలను అధిగమిస్తుంది. ఇది స్వీయ అవగాహన, వృత్తిపరంగా తమను తాము చూపాలనుకునే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన దుస్తులు మానసిక కవచంగా పనిచేస్తాయి. మహిళలు కార్పొరేట్ రంగంలోకి ప్రవేశించడం, వృత్తినైపుణ్యాలను ప్రదర్శించడం, గౌరవాన్ని పొందడం లక్ష్యంగా పవర్ డ్రెస్సింగ్ ఉద్భవించింది.1920లలో జాకెట్, స్కర్ట్‌తో మహిళల పవర్ డ్రెస్సింగ్ వెలుగులోకి వచ్చింది. ఇది మహిళల దుస్తులు ధరించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సౌకర్యం విషయంలో రాజీపడకుండా ఆధునికంగా కనిపించడానికి వీలు కల్పించింది. పనిలో లింగసమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. ‘విజయం కోసం డ్రెస్సింగ్’ అనడానికి నిదర్శనంగా ఇంటర్నేషనల్ ఉమెన్ డ్రెస్సింగ్ బ్రాండ్ ‘క్వా’ ఒక ఆన్లైన్ పోల్ నిర్వహించింది. ఇందులో 100 మంది మహిళల్లో 99 మంది పవర్ డ్రెస్సింగ్ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు.వృత్తికి తగిన డ్రెస్సింగ్ఉపాధ్యాయులు, వైద్యులు, రాజకీయ నాయకులు, ఐఎఎస్ అధికారులు, ఆర్కిటెక్ట్‌లు, కార్పొరేట్ లీడర్లు, వ్యాపార మహిళలు, ఆర్థిక నిపుణులు వంటి విభిన్న స్థాయిలలో పనిచేసే మహిళలకు పనిజీవితంలో సౌకర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చే వర్క్‌వేర్ అవసరం. ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ శక్తిని వెలికితీసేందుకు ప్యాంటుతో పాటు డిజైనర్ బ్లేజర్‌ను ధరిస్తారు. ఒక రాజకీయ వ్యక్తి పరిపూర్ణతకు అనుగుణంగా చీర లేదా కుర్తాను ధరించవచ్చు. టీచర్ లేదా డాక్టర్ తమ వృత్తినైపుణ్యానికి రాజీ పడకుండా తమ పనిని నిర్వహించడానికి సౌకర్యవంతమైన కుర్తా లేదా ఇండో–వెస్ట్రన్‌ను ఎంచుకోవచ్చు. విధి నిర్వహణలోని మహిళలు భారతీయ ప్రింట్లను ఆధునిక కట్లతో కలిపే దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. ఈ కాంబినేషన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది.పవర్ డ్రెస్సింగ్‌కి ప్రేరణ కోసం...→ వృత్తికి అనుగుణమైన దుస్తులు ధరించాలి. అప్పుడు పనితీరులో కూడా మెరుగుదల ఉంటుంది → పర్యావరణ స్పృహతో కూడిన ఫ్యాషన్‌ని అనుసరించడం మేలు. కాలర్ బ్లౌజ్‌లు, ఫంక్షనల్ పాకెట్స్, తక్కువ జ్యువెలరీ... వీటిలో ప్రధానమైనవి → డ్రెస్ నాణ్యత, ఫిటింగ్ మీరు హుందాగా, శక్తిమంతంగా ఉన్నారని తెలియజేస్తుంది → ఎవరికి వారు ఓన్ స్టైల్‌ను అభివృద్ధి చేసుకోవాలి. తమ డ్రెస్సింగ్ ద్వారా తమని తాము వ్యక్తీకరించుకోవడమూ అవసరమే. రంగులతో ప్రయోగాలు, ఫిట్‌గా ఉండే దుస్తుల ద్వారా మీరేమిటనేది చాటవచ్చు → ప్యాంట్ సూట్స్, కో–ఆర్డ్ సెట్స్, మిడీస్, జాకెట్స్.. ఇలా ఏ డ్రెస్ ఎంపిక అయినా ఇస్త్రీ చేసిన దుస్తులను ధరించండి. లేత రంగులు, తక్కువ ఆభరణాలతో సింపుల్‌గా ఉండేలా చూసుకోండి.సందర్భానికి తగిన ఎంపికలుభారతీయ వనిత హుందాతనానికి, మనదైన సంస్కృతికి, చక్కదనానికీ బహుముఖాల డ్రెస్సింగ్ శైలులను ఎంచుకుంటోంది. సందర్భానికి తగిన ఎంపిక ఇప్పుడు సాధారణంగా ఉంటోంది..డ్రేపింగ్ శైలులతో ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తూ మహిళను పవర్ ఫుల్‌గా చూపుతోంది చీర. మన దేశీయ చేనేతలైన కంచి, బనారసి, చందేరీ, పోచంపల్లి, నారాయణపేట్, ధర్మవరం, ... ఇలా మనదేశంలో ఒక్కో ప్రాంత ప్రత్యేకతను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి ఘనంగా చూపుతున్నాయి. ఈ చేనేతల కట్టుతో మన మహిళలు తమ హుందాతనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు.సల్వార్ కమీజ్భారతీయ మహిళల ఫార్మల్ దుస్తులలో మరొక ప్రధానమైనది సల్వార్ కమీజ్. సౌకర్యం, శైలి రెండింటినీ ఈ డ్రెస్ అందిస్తుంది. అధికారిక కార్యక్రమాలు, పార్టీలకు అనుకూలంగా ఉంటుంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ అలంకరణతో వెలిగే అనార్కలీ సూట్లు గొప్పగా వెలుగుతుంటే, మరోవైపు స్ట్రెయిట్కట్ సూట్స్ ్ర΄÷ఫెషనల్ లుక్‌ని అందిస్తున్నాయి. ఆఫీస్‌వేర్‌గానూ, సంప్రదాయం, అధునిక మినిమలిజం మధ్య సమతుల్యతను అందిస్తున్నాయి.ఇండో– వెస్ట్రన్ ఫ్యూజన్భారతీయ దుస్తులలో అంశాలను పాశ్చాత్య సిల్హౌట్‌లతో మిళితం చేయడం దీని ప్రత్యేకత. ఆధునిక అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకమైన, స్టైలిష్ దుస్తులను సృష్టిస్తాయి. కుర్తా, పలాజో సెట్ అందుకు ఒక ఉదాహరణ. సాంస్కృతిక కార్యక్రమాలకు ఉల్లాసభరితంగానూ, అనువైనదిగానూ నిలిచింది ధోతీ ప్యాంట్‌ను కుర్తాతో జత చేయడం.వెస్ట్రన్ గౌన్లు పాశ్చాత్య శైలి దుస్తులలో ప్రధానంగా చెప్పుకునేవి గౌన్లు. అధికారిక కార్యక్రమాలలో గణనీయమైన ప్రజాదరణ పొందాయి. ఎ–లైన్ గౌన్లు, ఫ్యూజన్ టచ్ కోసం భారతీయ మోటిఫ్స్, ఎంబ్రాయిడరీతో ఇవి పార్టీలు, అధికారక విందులు, సమావేశాలలో ఈవెనింగ్ గౌన్లు అద్భుతమైన ఎంపికను అందిస్తున్నాయి. సిల్క్, శాటిన్ లేదా వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన గౌన్లపై బీడ్‌వర్క్, స్వీక్వెన్లు కలిగి మహిళ చక్కదనానికి, ఆధునికతకు అద్దం పడుతూ రిచ్ లుక్‌ను ఇస్తున్నాయి. ఫార్మల్ వేర్మన దేశం ఉష్ణమండలం అవడం వల్ల సౌకర్యం కోసం ఖాదీ, కోటా డోరియా వంటి కాటన్స్‌ను ఎంచుకుంటున్నారు. వీటిమీద ఎంబ్రాయిడరీలు, టై అండ్ డైలు, పెయింటింగ్‌లా ఉన్నవాటితో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.ఇతర అలంకారాలకూ...మ్యాచింగ్, ఎంబ్రాయిడరీ, సందర్భానికి తగిన విధంగా దుస్తుల ఎంపిక ఎలా ఉంటుందో, అలాగే ఫుట్‌వేర్ ఎంపిక కూడా ముఖ్యమైన జాబితాలో ఉంది. బంగారు, వజ్రాలు, కుందన్, పోల్కీ.. ఆభరణాలు సంప్రదాయ దుస్తులకు, ఆక్సిడైజ్డ్ ఆధునిక దుస్తులకు ఎంపికగా మారాయి. ఇండో–వెస్ట్రన్ శైలులు ఆభరణాల జాబితాలోనూ ప్రథమంగా ఉంటోంది. రీసైక్లింగ్ బెస్ట్ ఛాయిస్టెక్స్టైల్ ఇండస్ట్రీలో సస్టెయినబుల్, ఇండియన్ ఆర్ట్, ఇండియన్ టెక్స్టైల్, కెమికల్ ఫ్రీగా ఉండే హ్యాండ్లూమ్స్ని మహిళలు ఇష్టపడుతున్నారు. పవర్‌లూమ్స్, సింథటిక్స్ని దూరం పెడుతున్నారు. అంతర్జాతీయంగానూ ఎక్స్పరిమెంటల్ ప్యాషన్లోనూ రీ సైక్లింగ్ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. పాత కాలం నాటి బామ్మల పట్టుచీరలను కూడా తిరిగి ఉపయోగిస్తున్నారు. కట్ సిల్టౌట్స్, ఎంబ్రాయిడరీలో థ్రెడ్ వర్క్.. వంటి పాత కాలం స్టైల్స్ ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు.. పాత బనారసి, పాత కంచి శారీస్‌ను తీసుకొని ప్యాచ్‌వర్క్‌తో మరో కొత్త డిజైనర్ శారీని తయారుచేస్తున్నారు. ఇండో–వెస్ట్రన్స్ విషయంలో చూస్తే రీ సైక్లింగ్కి బాగా డిమాండ్ ఉంది. ఉన్న వాటినే రీ క్రియేట్ చేస్తున్నారు. అమ్మమ్మ, అమ్మల చీరలను ఇన్నోవేషన్‌గా రీ సైక్లింగ్ చేయించుకొని తమ పెళ్లిళ్లకు ధరిస్తున్నారు. ఒక డ్రెస్‌ను పది మోడల్ డ్రెస్సులుగా ధరిస్తున్నారు. ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండేది మహిళలే కాబట్టి. ఈ అవగాహన మహిళల నుండి వచ్చిందే. నార్త్ ఇండియన్స్ కూడా పాత చీరలు, వస్త్రాలతో ప్యాచ్‌వర్క్ చేసి బ్యాగ్స్, ఫుట్‌వేర్, క్విల్ట్‌లను సృష్టిస్తున్నారు. ఇది ఇంకా విస్తృతం అవుతుంది. మా దగ్గర పాతికమంది మహిళలు మేం ఉపయోగించగా మిగిలిన వేస్ట్ ఫ్యాబ్రిక్స్‌తో టాజిల్స్, రిబ్బన్స్, పౌచ్‌లు, జ్యువెలరీ, బ్యాంగిల్స్ తయారు చేసి అమ్ముతున్నారు. ఇవి ఇండోవెస్ట్రన్ ఔట్‌ఫిట్స్‌కు స్టైలిష్ లుక్‌నిస్తాయి. యువతరం, మహిళల ఆలోచనలకు తగినట్టుగా కెమికల్ ఫ్రీగా ఫ్యాషన్ ఇండస్ట్రీ తయారు కావడం ముదావహం. ‘పవర్ డ్రెస్’నుచూపినవారిలో...∙భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫొటోజర్నలిస్ట్ హోమై వ్యారవల్లా. బ్రిటిష్ కాలం నుండి కొత్తగా స్వతంత్రదేశంగా మారడాన్ని డాక్యుమెంట్ చేయడంలో ప్రసిద్ధి చెందారు. గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన ఆమె పార్సీ సమాజానికి చెందింది. తన వృత్తికి తగినట్టుగా హై రౌండ్ నెక్ బ్లౌజ్, లేతరంగు కాటన్ చీరలను ధరించేవారు. గౌన్లు, పలాజో ప్యాంట్లు ధరించి ఆమె తనదైన స్టైల్ స్టేట్మెంట్ను సృష్టించారు → నేతలలో తలమానికమైన ఇందిరాగాంధీ నేత చీరల కట్టు ఇప్పటికీ ఆమె ఆహార్యాన్ని కళ్లకు కడుతుంది. పాలిటిక్స్‌లో తన చీరకట్టు, హెయిర్ స్టైల్‌తో పవర్ఫుల్ ఐకాన్‌గా నిలిచారు. ఒక నిర్దిష్ట సందేశాన్ని ఇవ్వడానికి డ్రెస్సింగ్‌ని ఒక శక్తిమంతమైన మాధ్యమంగా ఉపయోగించారు. ఆమె చూపిన మార్గంలో చాలామంది మహిళా రాజకీయ వేత్తలు నేత చీరలను ధరించడం చూస్తున్నాం → సినీతారలు సందడి చేసే ఈవెంట్లను చూస్తే తమదైన స్టైలింగ్ డ్రెస్సులతో ఆకట్టుకునే తారలు ఎందరో. వారిలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచే బాలీవుడ్ నటి రేఖతోపాటు దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, కరీనా, సోనమ్ .. వంటి తారలు ఏ ఈవెంట్లోనైనా తమ స్టైల్స్టేట్మెంట్ను చూపుతుంటారు. ఇటీవల నీతాఅంబానీప్రాచీన కళకు, రిచ్లుక్కి ఐకాన్‌గా మారడం గమనిస్తున్నాం. -
ప్రవచన శిరోమణులు
అడిగేవారికి చెప్పేవారు లోకువ అని సామెత. అయితే అవతలి వారు ఏమీ అడగకున్నా, వారికి ఏం కావాలో, ఏం చెబితే బాగుంటుందో తామే తెలుసుకుని నాలుగు మంచిమాటలు .. అందులోనూ ఆధ్యాత్మిక విషయాలు, వ్యక్తిత్వ వికాసానికి పాదులు తీసే అంశాలూ చెబుతుంటారు ప్రవచనకారులు. ఇక్కడ ప్రవచనకారులు అనగానే ముందుగా గుర్తొచ్చేది పురుషులే. అలాగని స్త్రీలు అసల్లేరని కాదు. అయితే వారి పేర్లు చెప్పాలంటే చేతివేళ్లు సరిపోతాయి. 8న మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ హితంకోసం ప్రవచనాలు చెబుతున్న కొందరు మహిళామణుల గురించి తెలుసుకుందాం. వారి ప్రయాణంలోని సాధక బాధకాలు వారి మాటల్లోనే...మహిళలు ప్రవచనాలా?– డా. ఎన్. అనంతలక్ష్మి‘‘ఈ రోజు ప్రేయర్ అయినాక నువ్వు మాట్లాడు’’ అన్నారు మాస్టర్ గారు. సంతోషం, భయం ఒకేసారి కలిగాయి. నా కంగారు అర్థం కాదా! పిలవలేదు. ఊపిరి పీల్చుకున్నా కాని, కొంచెం నిరాశ. తర్వాత జనకులం (తల్లి తండ్రులు స్కూలు తర్వాత పిల్లలకి సంప్రదాయం సంస్కారం నేర్పే వ్యవస్థ)లో పెద్దలకి ఆముక్తమాల్యదలో విష్ణుచిత్తుడి కథాభాగం చెప్పమన్నారు. ఎం. ఏ; లో అది మాకు పాఠ్యభాగం కాదు. మాస్టర్ గారికే నమస్కరించుకుని చెప్పాను. అది వాళ్ళకి కాదు నాకు శిక్షణ. వేదవాఙ్మయాన్ని, పురాణేతిహాసాలను, కావ్యాలను శాస్త్రవిజ్ఞానంతో సమన్వయం చేసి, నేటితరానికి పనికి వచ్చే అంశాలని వివరించి, వాటి సార్వకాలీనతను ప్రపంచానికంతటికి వెల్లడించటం మా గురువరేణ్యులు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల పద్ధతి. అది శిష్యులలో కొద్దిగానైనా ప్రతిఫలించటం సహజం. ఈ కారణంగా నా సాహిత్య ప్రసంగాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు అయ్యాయి. వీలైనంత మందికి మాకు తెలిసిన విషయాలను చెప్పాలనే తపన తప్ప అది ప్రసంగమో, ప్రవచనమో పట్టించుకోలేదు. అందరూ అవి ప్రవచనాలు అని నిర్ధారించారు. అందరూ నన్ను ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త అంటుంటే వింతగా ఉంటుంది. నేను మామూలు గృహిణిని, ఉద్యోగినిని, తల్లిని అంతే! నన్ను అందరూ ఆ విధంగా గుర్తించటానికి నా కుటుంబ సభ్యులు అందరు కారణం. నా పిల్లలు, విద్యార్థులు అడిగే అనుమానాలని తీర్చటానికి మరింత అధ్యయనం చేయవలసి వచ్చింది. అనుకున్న ప్రయోజనాన్ని సాధించాననే అనుకుంటాను. సాధారణంగా ఆడవాళ్ళు ప్రవచనాలు అంటూ బయలుదేరితే ఇంట్లోనే ఇబ్బందులని ఎదుర్కోవలసి వస్తుంది, అనేకరకాలుగా. అటువంటి సమస్య నాకు కుటుంబం నుండి రాలేదు. (ఎవరికీ ఇబ్బంది కలుగని విధంగా జాగ్రత్తలు తీసుకునే దాన్ని.) కాని, బయటి నుండి తప్పవు. ‘‘ఆడవాళ్ళు ప్రవచనాలు చేయటం ఏమిటి?’’,‘‘ముందు ఇల్లు చూసుకో మనండి.’’ ‘‘దీనికి కూడా ఆడవాళ్ళు పోటీకి వస్తే మా సంగతి ఏమిటి?’’ ఇటువంటివి చాలానే విన్నాం. పైగా మగవాళ్లు వినరు ఆడవాళ్ళు చెపితే వినేది ఏమిటి? అని. చేస్తున్నది ధర్మబద్ధం అయితే అటువంటి వ్యాఖ్యలని పట్టించుకో నవసరం లేదు. తల్లిలాగా లాలించినట్టు చెపితే మంచి వైపుకి సమాజం మళ్లుతుంది అనుకుని చెప్పాలి. అలాగే చెబుతున్నాను కూడా!వ్యక్తిత్వ వికాసానికి.. ఆధ్యాత్మిక భావోన్నతికి...– డా. తుమ్మలపల్లి వాణీకుమారివృత్తిరీత్యా నేను అధ్యాపకురాలిని. సుమారు 35 సంవత్సరాల బోధనానుభవంలో నాకు తెలిసినంతవరకు విద్యార్థులకు బోధించగలిగాననే సంతృప్తి నాకు నిండుగా ఉంది. నేను చాలాకాలంగా ప్రసార మాధ్యమాలలో, ఇతర సాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటున్నా ప్రవచనాల వైపు మరల లేదు. ఒకసారి రామాయణం గురించి నేను వ్రాసిన పుస్తకాలను చూసి శ్రీ చాగంటి కోటేశ్వరరావు ‘‘ఇన్ని మంచి విషయాలను వ్రాసిన మీరు ప్రవచనాలను చెప్పకపోవడం ఏమిటి? పైగా హైదరాబాదులో ఉంటూ కూడా!’’ అన్నారు. వారి వాక్ప్రభావమో, దైవసంకల్పమో కానీ తరువాత కొన్ని ఆలయాలలో, ఇతర వేదికలలో ప్రవచనాలకు అవకాశం వచ్చింది. మామూలు సాదం (అన్నం) భగవదర్పితమయితే ప్రసాదమైనట్లు మామూలు వచనం భగవత్సంబంధితమయితే అది ప్రవచనం అవుతుంది. ఆ విధంగా చెప్పేవారికి, వినేవారికి కూడా మనసు ఆధ్యాత్మికత వైపు మరలుతుంది కాబట్టి నాకు ప్రవచనాల పట్ల మక్కువ కలిగింది. అయితే ప్రవచనాలను వినేవారు పెద్దవారు. ప్రవచనకారులు చెప్పే విషయాల పట్ల కొంత అవగాహన ఉన్నా ఆసక్తిగా వింటారు. చెప్పే విషయాలలో, తీరులో వైవిధ్యం ఉండటమే ఇందుకు కారణమనుకుంటాను. తెలుగు రాష్ట్రాలలో విఖ్యాతులైన ప్రవచనకారులు ఎంతోమంది ఉన్నా, నేను చెప్పినప్పుడు ఆసక్తిగా వినే శ్రోతలు లభించటం నా అదృష్టం. మంచి విషయాలను పదేపదే చెప్పటం వలన చెప్పేవారికి, వినటం వలన వినేవారికి మనసులో నాటుకుపోతాయి. మానవ సహజమైన బలహీనతలను అధిగమించే స్థైర్యం అలవడుతుంది. నా వరకు ఇది నా వ్యక్తిత్వ వికాసానికి, ఆధ్యాత్మిక భావోన్నతికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాను.చిన్నప్పుడే పునాది పడింది– ఖుర్షీదా బేగం షేక్నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం అలవాటు. అలా ధార్మిక పుస్తకాలు, ఇస్లాం సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ, ధార్మిక రచనలు చేస్తూ ఉండటం మూలాన నా జీవితంలో ఆధ్యాత్మికతకు బలంగా పునాది పడింది. ఒక నిజమైన ముస్లిం విశ్వాసి నుండి దైవం ఏమి కోరుకుంటున్నాడో అది చేయడం మాత్రమే నా మోక్షానికి, దైవప్రేమకు, పరలోక జీవిత సాఫల్యానికి మార్గం అని గ్రహించాను. అంతిమ దైవగ్రంథం దివ్య ఖుర్ ఆన్, ప్రవక్త ముహమ్మద్(స) బోధించిన హాదీసు బోధలను, మహాప్రవక్త ముహమ్మద్ (స) వారి జీవిత చరిత్రను అధ్యయనం చేశాను. అవే నాకు ఆధ్యాత్మిక ప్రేరణ. ఒక విశ్వాసిగా ఇస్లాం అడుగుజాడల్లో నడుస్తున్నా సాటి విశ్వాసులకు ఏదో చేయాలనే తపన ఉండేది.గ్రామీణ ప్రాంతాలలో స్త్రీలు ఆధ్యాత్మికంగా చాలా వెనుకబడి ఉండేవారు. ధార్మిక సమావేశాల్లో వారికి ఖుర్ ఆర్, హాదీసు బోధనలను వివరించేదాన్ని. వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా విని, తమకు తెలియని ఎన్నో మంచి విషయాలను తెలుసుకునేవారు. మూఢనమ్మకాలు, అజ్ఞానం, నిరక్షరాస్యత, అనాగరిక ఆచార, సంప్రదాయాలు వారిలో ఎక్కువగా ఉండేవి. ఇస్లాం వాస్తవ బోధనలను వారికి తెలిపి వారి జీవితంలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగిస్తే వారి ఇహ, పర జీవితాలు అల్లాహ్ కరుణను పొందుతాయని వారి ఇహ, పరలోకాలు ఆదర్శంగా, గౌరవంగా ఉత్తమ, ఉన్నత నైతికతతో ఉండి తద్వారా పరలోకంలో శాశ్వత సాఫల్యం లభిస్తాయని ధార్మిక సమావేశాల్లో వివరించేదాన్ని. నా రచనలు, ప్రసంగాల ద్వారా చాలామంది తమలోని నైతిక రుగ్మతలను దూరం చేసుకొని, ఒక ముస్లిం ఎలా ఉండాలో అలా మారే విధంగా తమను తీర్చిదిద్దుకుంటున్నామని చెప్పినప్పుడు చాలా తృప్తిగా అనిపిస్తుంది. నా జీవితానికి సార్థకత లభించిన అనుభూతి కలుగుతుంది.నేర్చుకున్నాను...నేర్పిస్తున్నాను– షకీనా గ్లోరి, సువార్తికురాలునేను ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి పట్టణంలో భక్తిగల దైవసేవకుల కుటుంబంలో జన్మించాను. బాల్యం నుండే మా తల్లిదండ్రులు మాకు బైబిల్ ను బోధించేవారు.‘‘బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైన తర్వాత దానినుండి తొలగిపోడు’’ అని బైబిల్ వాక్యప్రకారం సమాజంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో వారు మాకు నేర్పించారు. తదనుగుణంగా నేను బైబిల్లో ఉన్న యేసుప్రభువు బోధలకు, వాక్యాలకు ప్రభావితమొందాను.నీతి నియాలు పాటించి బతికితే ఈ లోకంలో బతికినంత కాలం శాంతి–సమాధానం పొందుకుంటాము. ఒకవేళ ఏదో ఒక రోజున కన్నుమూస్తే దేవుడుండే తన రాజ్యానికి చేరుకుంటాము అనే సత్యాన్ని అనేకులకు తెలియజేయాలని, భయంకర సమస్యలకు దేవుడు పరిష్కారమిస్తాడు. మీకు మేళ్లు కలిగిస్తాడు. మిమ్మును ఆదరిస్తాడు. రక్షిస్తాడు. మీ బుద్ధిని మారుస్తాడనే శుభవార్తను అందరికీ అందించాలని, సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే నేను నా జీవితాన్ని ఈ పనికి అంకితం చేసుకున్నాను.ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని బీఈడీ చేసి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కూడా కొనసాగించుచున్న నాకు దైవస్వరం వినిపించగా నా శేషజీవితమంతా దేవుని పనిలో వాడబడాలని, ఆశలు అడియాశలైన వారినెందరినో బలపరచి, వారికి ఆనందకరమైన జీవితాన్నందించాలని ఈ సేవలో సాగిపోతున్నాను. మా తండ్రిగారైన జోసఫ్ విజయకుమార్ గారే నాకు ప్రేరణ. చాలా ఒడిదొడుకులు, అభ్యంతరాలు, ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు ఎదురౌతున్నా మొక్కవోని ధైర్యంతో క్రీస్తుబోధలను మననం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నాకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. నా కుటుంబానికి, పిల్లలకు ప్రాధాన్యతనిస్తూ... అందరం సమైక్యంగా ఈ పనిలో ఆనందిస్తుంటాము. నేను అందించిన ఈ బైబిల్ ప్రవచనాలు తమ కన్నీటిని తుడిచాయని, తమలో ధైర్యాన్ని నింపాయని, తమను వెన్నుతట్టి ప్రోత్సహించాయని, మంచిమార్గంలో నడిచేలా సహాయం చేస్తున్నాయని, చెడు వ్యసనాలతో, చెడు బుద్ధులతో ఉన్న తమను విడిపించి, సరిౖయెన, నిజమైన మార్గాన్ని చూపించాయనే సాక్ష్యాలు వింటున్నప్పుడు సంతోషం కలుగుతుంటుటుంది. -
ప్రొటెక్షన్ ప్లీజ్...హెల్త్ చూస్తుంది
కుటుంబ ఆరోగ్యాన్నే కాదు సమాజ ఆరోగ్యాన్నీ రెప్పవేయకుండా కనిపెట్టుకోగలదు స్త్రీ! ఆ ఓపిక, శ్రద్ధ మెడిసిన్ డిగ్రీతో వచ్చినవి కావు.. డీఎన్ఏలో భాగమై వచ్చినవి!వాటి బలంతోనే డాక్టరమ్మగా అలుపులేని సేవలందిస్తోంది.. దేశ ఆరోగ్య నాడి లయ తప్పకుండా చూసుకుంటోంది! కానీ ఆమె సహనాన్ని బలహీనతగా తీసుకుని.. వైద్యరంగంలో ఆమె భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు! అది ప్రభుత్వ వైద్యరంగంలో స్త్రీల ప్రవేశానికి అడ్డంకిగా మారకముందే మేలుకుని.. నాయకత్వ హోదాల్లో మహిళలకు అవకాశాన్ని ఇచ్చి.. భద్రతను కల్పిస్తే... హెల్త్‌కేర్ సెక్టార్లో సాధికారత సాధ్యం కాదు తథ్యం!→ ఆనందిబాయీ జోషీ ఆమె బాల్యవివాహ బాధితురాలు. వైద్య సదుపాయాల్లేక పురిట్లోనే బిడ్డను పోగొట్టుకుంది. అప్పుడనుకుంది.. మెడిసిన్ చదవాలని! చదివింది.. అదీ అమెరికా, పెన్సిల్వేనియాలోని విమెన్స్ మెడికల్ కాలేజ్‌లో. అలా చేతిలో మెడిసిన్ డిగ్రీ, మెడలో స్టెత్, దేశ తొలి మహిళావైద్యురాలిగా సొంతగడ్డ మీద అడుగుపెట్టింది. ఆవిడే డాక్టర్ ఆనందీబాయి జోషీ. మన సమాజం ఆమెను ప్రశంసించక పోగా.. తీవ్రంగా విమర్శించింది. వివక్షకు గురైనా వెరవక వైద్యసేవలందించింది. దురదృష్టం.. పిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. → డాక్టర్ కాదంబినీ గంగూలీ మన దేశ తొలి మహిళావైద్యుల్లో మరో డాక్టర్.. కాదంబినీ గంగూలీ. యూరప్‌లో శిక్షణ పొందిన ఆమె మెడికల్ కెరీర్ అంతా దేశంలోని మహిళల ఆరోగ్యం, మాతా.. శిశు మరణాలను అరికట్టే ప్రయత్నానికే అంకితమైంది. → ఇంకా.. ∙మేరీ పూనెన్ ల్యుకోస్ మన తొలి మహిళా గైనకాలజిస్ట్ మేరీ పూనెన్ లుకోస్, దేశంలో క్యాన్సర్ రీసెర్చ్ సాగడానికి శ్రమించిన కమల్ రణదివే.. వీళ్లంతా స్వాతంత్య్రానికి పూర్వమే తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. స్త్రీ సాధికారతకు చిహ్నంగా నిలిచారు. వీళ్ల స్ఫూర్తితో స్వాతంత్య్రానంతరం.. దేశంలో క్యాన్సర్ చికిత్సలో సమర్థమైన మార్పులకై కృషి చేసిన డాక్టర్ వి.శాంత, రేడియాలజిస్ట్ డా. కె.ఎ.దిన్షా, కార్డియాలజిస్ట్ డా.పద్మావతి అయ్యర్, డా. నీలమ్ క్లేర్, డా. అజితాచక్రవర్తి, డా. శశి వాధ్వా, డా. కామినీ రావు, డా. ఇందిరా హిందుజా లాంటివాళ్లెందరో వారి వారి విభాగాల్లో రాణించారు. మహిళలకు ఆరోగ్యం పట్ల స్పృహ కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ పాజిటివ్ నోట్ చూస్తుంటే వైద్యరంగంలో మన మహిళలు ఎంతో ముందుకెళ్లారనే భావన కలుగుతుంది. కానీ అధ్యయనం (2021 ప్రకారం) చేసి లెక్కలు తీస్తే ఆ సంఖ్య 29 శాతమే అని తేలింది. బోర్డ్ మెంబర్స్‌గా ఉన్నది 17 శాతమే. నర్సింగ్సేవల్లో మహిళల సంఖ్య 80 శాతం. దేశంలోని మొత్తం హెల్త్‌కేర్ వర్క్‌ఫోర్స్‌లో 54 శాతం ప్రైవేట్ వైద్యరంగానిదే వాటా! అందులో కూడా నాయకత్వ హోదాల్లో ఉన్న మహిళల సంఖ్య 30 శాతానికి మించిలేదు. అంతర్జాతీయ స్థాయిలో.. హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో ఆంట్రప్రెన్యూర్స్ గా రాణిస్తున్న అను ఆచార్య, కిరణ్ మజుందార్ షా, మీనా గణేశ్, డాక్టర్ నందితా షా, నాన్కీ లఖ్విందర్‌సింగ్, నటాషా పూనావాలా, సునీతా మహేశ్వరి, సమీనా హమీద్, సౌమ్య స్వామినాథన్, డాక్టర్ వి. శాంత సహా తెలుగు వనితలు సంగీతారెడ్డి, శోభనా కామినేని, ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి లాంటి వాళ్లెందరి పేర్లో వినిపిస్తాయి. వీళ్లంతా తమ రంగాలలో తమ ముద్రను చూపించుకుంటున్నారు.ప్రమాదం అంచున... జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఏదో ఒకరకమైన శారీరక హింసకు గురవుతున్నారు. ఇది హెల్త్‌కేర్ సెక్టార్లోకీ విస్తరించి మహిళావైద్యులు, నర్సుల భద్రతను ప్రమాదంలోకి నెడుతోంది. దీనికి ఉదాహరణ ఇటీవలి కోల్‌కతా కేజీ కర్ ఆసుపత్రి పీజీ స్టూడెంట్ హత్యాచారమే! ఈ దారుణాలకు కారణం ఆయా విభాగాల్లో నాయకత్వ హోదాలో మహిళల సంఖ్య కనీసం 30 శాతం కూడా లేకపోవడమే. పైస్థాయిలో ఎక్కువమంది మహిళలున్న చోట పనిప్రదేశం భద్రంగా ఉంటుంది. భరోసా పెరుగుతుంది. మహిళలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు జరుగుతుంది.ముంబై.. దిక్సూచీ... ఈ విషయంలో ‘దిలాసా క్రైసిస్ సెంటర్’ను ఏర్పాటు ద్వారాదేశానికి మార్గదర్శిగా నిలిచింది ముంబై! ఇది మహిళల మీద హింస ఎన్ని రకాలుగా జరుగుతుంది, దాన్నెలా గుర్తించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా సహాయం పొందాలి, ఎలా సహాయం అందించాలి వంటి వాటి మీద ఆసుపత్రుల్లోని సిబ్బందికి శిక్షణనిచ్చింది. జనాభాలో సగభాగం ఉన్న మహిళల ఆరోగ్య సంరక్షణ, అవగాహనలో వైద్యరంగంలోని మహిళలదే కీలకపాత్ర. కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం వీరి ప్రాతినిధ్యం శూన్యం. అది గ్రహించి ఇటు ప్రభుత్వ రంగం, అటు ప్రైవేట్ రంగం మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచి, వచ్చే మహిళా దినోత్సవానికల్లా వైద్యరంగంలో మహిళల విజయగా«థను చెప్పుకునే అవకాశాన్నిస్తాయని ఆశిద్దాం! మహిళలతోనే భరోసానేను మహిళా బాస్‌ల కిందే పనిచేస్తున్నాను. ఏ చిన్న సమస్య అయినా వారితో షేర్ చేసుకుంటాను. వెంటనే స్పందిస్తారు. నేను కూడా నా కింది ఉద్యోగుల విషయంలో అలాగే ఉంటాను. మన బాసులుగా కానీ, కొలీగ్స్‌గా కానీ మహిళలే ఉంటే ఇలాంటి భరోసా వస్తుంది. అయితే అవకాశాలను వెదుక్కుంటేనే మహిళా శక్తి పెరుగుతుంది. ఆ బలం పెరిగితే ఆటోమేటిగ్గా పని ప్రదేశం విమెన్ ఫ్రెండ్లీగా మారుతుంది. – డాక్టర్ మౌనిక నేలపట్ల అసిస్టెంట్‌ప్రొఫెసర్, జనరల్ సర్జన్, ప్రభుత్వాసుపత్రి, కామారెడ్డిమేము వారధులంఒక రకంగా మేము ప్రభుత్వాలకు.. ప్రజలకు మధ్య వారధిలాంటి వాళ్లం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో, వారి ఆరోగ్యసంరక్షణలో మా పాత్ర ముఖ్యమైనది. వృత్తిరీత్యా ఎప్పుడూ ప్రజల్లోనే ఉండాలి కాబట్టి.. భద్రత, రక్షణ వంటి వాటిలో ఇబ్బందులుంటాయి. కొన్నిసార్లు అవమానాలూ ఎదురవుతుంటాయి.– జంగం రమాదేవి, ఆశ వర్కర్,పాల్వంచ, కామారెడ్డి జిల్లా. -
అ‘టెన్’షన్ ప్లీజ్...కేర్ తీసుకోండి
ఆమె ఆరోగ్యమే ప్రపంచ భాగ్యంమహిళల ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవసరాలపై అవగాహనపెరుగుతోంది. మహిళా దినోత్సవాలలో ‘మహిళల ఆరోగ్యం’ అనేది ప్రధాన అంశంగా మారింది. ఇరవైలలో...మున్ముందు ఆరోగ్యాల కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన వయసు ఇది.→ మీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇందుకోసం ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకేందుకు తగిన వ్యాయామాలు చేయాలి. పాల వంటి క్యాల్షియమ్ సమృద్ధిగా ఉండే పదార్థాలు తీసుకుంటూ మున్ముందు ఆస్టియోపోరోసిస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి → శబ్దకాలుష్యం నుంచి మీ చెవులను కాపాడుకోండి. ఎక్కువ శబ్దంతో వినకుండా మీరు రేడియో, టీవీ, మొబైల్... ఏది వింటున్నా వాల్యూమ్ తగ్గించుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోండి → రుతుక్రమం సక్రమంగా రాకుండా ఉంటుంటే డాక్టర్లను సంప్రదించి, తగిన చికిత్స తీసుకుని దాన్ని క్రమబద్ధం చేసుకోండి → ఆటల్లో, వ్యాయామాల్లో గాయాలు కాకుండా చూసుకోండి. ఇవ్వాళ్టి గాయాలు భవిష్యత్తులో గండాలుగా పరిణమించకుండా జాగ్రత్త పడండి → మనం ఏమి తింటున్నామనే విషయంపై దృష్టి సారించండి. ఇవ్వాళ్టి మీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే... భవిష్యత్తులో మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాదులని గుర్తుంచుకోండి → వయసు పెరిగేకొద్దీ నిద్ర తగ్గే అవకాశముంది కాబట్టి వీలైనంత వరకు కనీసం తొమ్మిది గంటలపాటు కంటినిండా నిద్రపొండి. ముప్ఫైలలో...ఈ వయసులో కనిపించే కొద్దిపాటి మార్పులపై దృష్టిసారించండి. → మీ బరువును గమనించండి. మీరు బరువు పెరుగుతున్నారంటే జీవక్రియలు మందగించాయని అర్థం. మొదట్లో కొద్దిగానే పెరిగినట్లు కనిపిస్తున్నా జీవక్రియలు చురుగ్గా జరిగేలా చూస్తూ వెంటనే బరువు తగ్గడానికి ప్రయత్నించండి. → చర్మాన్ని రక్షించుకోడానికి అవసరమైన చర్యలు తీసుకోండి. కనీసం 15 ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉండటం చాలా అవసరం. అది క్యాన్సర్‌తో సహా పలు చర్మ సమస్యలను కాపాడుతుంది → ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉండండి. ఒత్తిడి వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు కలుగుతాయి → ఈ వయసులోనే క్రమం తప్పకుండా అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలూ, మెడికల్ చెక్అప్స్ ప్రారంభించాలి. ఇది భవిష్యత్తులో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది → ప్రెగ్నెన్సీతో వచ్చే ముప్పులను గుర్తుంచుకోండి. ఎందుకంటే... 35 ఏళ్లు దాటాక వచ్చే ప్రెగ్నెన్సీలతో బిడ్డకు ఎన్నో రకాలుగా ముప్పు వచ్చే అవకాశాలుంటాయి. ఈ వయసులో గర్భధారణ కోసం ప్రయత్నిస్తుంటే తప్పనిసరిగా ఆబ్స్టేట్రీషియన్ను సంప్రదించండి. నలభైలలో...వయసు తాలూకు సంధి దశ అయిన ఈ ఈడులో కనిపించే మార్పులకు సిద్ధంకండి.→ మెనోపాజ్‌కు ముందుగా కనిపించే ‘పెరీ–మెనోపాజ్’ మార్పులను గమనిస్తూ ఉండండి. ఈస్ట్రోజెన్ మోతాదులు తగ్గడం వల్ల ఒంట్లోంచి వేడి ఆవిర్ల మాదిరిగా వస్తున్నాయా, నిద్ర పట్టడంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయా, త్వరగా చిరాకుపడటం వంటి మార్పులు కనిపిస్తుంటే పాప్ స్మియర్ పరీక్షతోపాటు పెల్విస్ పరీక్షలు చేయించుకోండి → రొమ్ముక్యాన్సర్‌కు స్క్రీనింగ్ పరీక్ష మామోగ్రామ్ కూడా చేయించుకోండి → తీసుకుంటున్న ఆహారంపై దృష్టి నిలపండి. మీ జీవక్రియల వేగానికి తగినట్లుగా ఆహారం అందేలా... కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తింటున్నారా అన్న విషయాన్ని గమనించుకోండి ∙కంటి పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే చాలారకాల కంటి సమస్యలు ఈ వయసులోనే బయటపడతాయి. దాదాపు ప్రతి ఒక్కరికీ 40లలోనే కళ్లజోడు ధరించాల్సి వస్తుందనే విషయాన్ని గ్రహించండి → మీ కుటుంబంలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు ఉన్నట్లయితే కొలనోస్కోపీకి ΄్లాన్ చేసుకోండి. ఎందుకంటే కుటుంబ ఆరోగ్య చరిత్రలో జీర్ణ సంబంధమైన సమస్యలున్నవారి లో ఎంత త్వరగా సమస్యను కనుగొంటే అంత ఎక్కువ ప్రయోజనమని తెలుసుకోండి → రక్తంలో చక్కెర మోతాదులెలా ఉన్నాయో చూసుకోండి. చాలావరకు 40 ల లోనే టైప్–2 డయాబెటిస్ వస్తుందని గుర్తుంచుకోండి. ఇది చాలామందిలో ఎలాంటి లక్షణాలూ లేకుండానే వచ్చేందుకు అవకాశమున్నందున ఒకసారి మీ డాక్టర్‌తో పరీక్షలు చేయించుకోవడం వల్ల ఎలాంటి నష్టమూ ఉండదు.యాభైలలో...మీ గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన వయసు ఇది.→ మెనోపాజ్ కోసం సిద్ధం కండి. 51 అన్నది చాలామందికి మెనోపాజ్ వచ్చే సగటు వయసు ∙చురుగ్గా ఉండండి. చురుకుదనం తగ్గిపోయే ఈ వయసులో చురుకుదనాన్ని పెంచుకోవడం వల్ల మున్ముందు చాలాకాలం పాటు మరింత ఆరోగ్యంగా ఉండగలరు → ఒకసారి మొత్తం దేహానికి సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకోండి. వీలైతే మీ యాభైలనుంచి ప్రతి రెండేళ్లకోమారు అన్ని బేసిక్ హెల్త్ పరీక్షలూ చేయించుకుంటూ ఉండటం మంచిది. → ఒకసారి ఈసీజీ తీయించుకోండి. సాధారణంగా గుండెజబ్బులు కనిపించేది ఈ వయసులోనే కాబట్టి ఒకసారి ఆ పరీక్ష చేయించుకుని, మీకు ఎలాంటి గుండెజబ్బులూ లేవని నిర్ధారణ చేసుకుని ఆనందంగా ఉండండి.అరవైలలో...ఈ వయసు... ఆరోగ్యానికి సంబంధించిన మరో దశకు మొదటి మెట్టు.→ ఆహారంలో మరింత పీచు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ వయసులో ఆహారంలో పీచు సమృద్ధిగా ఉండటం వల్ల పెద్దపేగుల్లో కండపెరగడం, ఇతరత్రా పెద్దపేగు సమస్యలను రాకుండా నివారించవచ్చు → నడక వంటి వ్యాయామాలు చేయండి. ఈ వయసులో చేసే వ్యాయామాలన్నీ దేహానికి మరింత ఎక్కువ శ్రమ కలిగించనివీ, మరీ తీవ్రమైనవి కాకుండా ఉండేవి అవసరం. వారంలో కనీసం 150 నిమిషాల పాటు దేహానికి మంచి కదలికలు ఉండే వ్యాయామం దొరికేలా చూసుకోండి. దీనివల్ల మీలో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు కనీసం 15 శాతం తగ్గుతాయి → ఈ వయసులో అవసరమైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలూ, మామోగ్రామ్ పరీక్షలూ చేయించుకోండి. బరువు పెరగకుండా చూసుకోండి. పెరుగుతున్న బరువు క్యాన్సర్‌తో సహా అనేక అనారోగ్యాలకు హేతువని గుర్తుంచుకోండి → పెద్ద వయసులో తీసుకోవాల్సిన టీకాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు ఫ్లూ, నిమోనియా వంటివి. → పెద్దవయసులో తీసుకోవల్సిన వ్యాక్సినేషన్ల గురించి తెలుసుకుని, వాటిని తీసుకోవడం వల్ల ఆ వయసులో అవి సోకకుండా జాగ్రత్త తీసుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే మంచి వయసులో ఉన్నప్పుడు వాటిని తట్టుకునేంత సామర్థ్యం వయసు పైబడ్డాక ఉండకపోవచ్చు.డెబ్భైలలో...వయసు పెరగడాన్ని గమనించుకుంటూ... ఆ ఈడుకు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోండి.→ ఈ వయసులో బాధలను దరిజేరనివ్వకండి. సంతోషంగా గడపడానికి ప్రాధాన్యమివ్వండి. మోకాళ్లు అరగడం వంటివి ఈ వయసులో సాధారణంగా కనిపించే సమస్యలు. మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్స్ వంటివి ఈ వయసులోనే చేయించుకోండి. మరింత వయసు పెరిగితే అంతగా సాధ్యం కాకపోవచ్చు → ఈ వయసులో కళ్ల సమస్యలు మామూలే. సాధారణంగా క్యాటరాక్ట్ వంటివి ఈ వయసులో కళ్లకు వచ్చే సమస్యలు. వీలైనంత త్వరగా కాటారాక్ట్ సర్జరీ చేయించుకుని సుదీర్ఘకాలం పాటు మీ కళ్లతో ప్రపంచాన్ని చూడటాన్ని ఎంజాయ్ చేయండి.డాక్టర్ కె. ఉషారాణిసీనియర్ ఫిజీషియన్ ఇలా ప్రతి పదేళ్ల కాలానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని, పది పదుల ఏళ్ల పాటు పదిలంగా ఉండండి. -
మా అమ్మ మాకు ఇన్స్పిరేషన్
-
మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు తన తల్లి & భార్య గురించి...
-
Womens Day: కన్న పేగు బంధం అమ్మది..
-
Upasana Konidela Photos: కొణిదెలవారి కోడలు ఉపాసన.. ప్రత్యేక క్షణాలు (ఫొటోలు)
-
మై ఛాయిస్!
భారతీయ మహిళలకు కుర్తాలు ఇష్టమైన దుస్తులు. వృత్తిరీత్యా టీషర్ట్లు ధరించడం అందరికీ సౌకర్యం కాకపోవచ్చు. అందుకే ‘విమెన్స్ డే’ సందర్భంగా జొమాటో తన మహిళా డెలివరీ పార్టనర్లకు ఎర్ర కుర్తాలను బహూకరించింది. ఇకపై వారు డ్యూటీలో నచ్చిన టీ షర్ట్గాని, కుర్తా గాని ధరించవచ్చు. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్ యాడ్ ఇంటర్నెట్లో కుతూహలం రేపుతోంది. జొమాటోలో దేశమంతా మూడున్నర లక్షల మంది డెలివరీ పార్టనర్లు ఉన్నారు. అంటే ఫుడ్ డెలివరీ చేసే బోయ్‌లు. వీరిలో స్త్రీలు కేవలం 1500 నుంచి 2000 మంది మాత్రమే ఉన్నారు. టూ వీలర్ మీద వేళకాని వేళలో తిరగాల్సి రావడం వల్ల ఇదొక ఛాలెంజింగ్ జాబ్ అయ్యింది మహిళలకు. అయినప్పటికీ సవాలుగా తీసుకుని వందల ఆర్డర్లు డెలివరీ చేస్తున్న జొమాటో మహిళలు ఉన్నారు. వృత్తిరీత్యా వారు టీషర్ట్ ధరించాల్సి ఉంటుంది. అది అందరికీ సౌకర్యం కాకపోవచ్చు. అందుకే జొమాటో మొన్నటి విమెన్స్ డే రోజు కుర్తాలు బహూకరించింది. ‘మీ చాయిస్. మీరు టీషర్ట్ వేసుకోవచ్చు లేదంటే కుర్తాలు వేసుకోవచ్చు’ అని చెప్పింది. ఇందుకోసం ప్రమోషన్ యాడ్ చేస్తే మహిళా డెలివరీ పార్టనర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘జేబులున్న కుర్తా నాకు నచ్చింది’ అని ఒక మహిళ చెప్పింది. ‘ఫోటోలు బాగా తీయండి’ అని మరో మహిళ ఉత్సాహపడింది. ‘పదండి అందరం మనాలి వెళ్దాం’ అని మరో మహిళ ఉత్సాహ పరిచింది. కొత్త ఉపాధి మార్గంలో వెరవక నడిచే వీరందరినీ చూసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. దేశీయ దుస్తుల్లో బాగున్నారంటూ కితాబిచ్చారు. -
నాడు టీవీ యాంకర్.. నేడు అసెంబ్లీ స్పీకర్!
Mizoram First Woman Speaker : అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈశాన్య రాష్ట్రం మిజోరాం రాజకీయాల్లో చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. 40 మంది సభ్యులున్న మిజోరాం రాష్ట్ర అసెంబ్లీకి మొట్టమొదటి సారిగా ఓ మహిళ స్పీకర్‌గా నియమితులయ్యారు. జోరెమ్ పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు, ఎమ్మెల్యే బారిల్ వన్నెహసాంగి మార్చి 7న జరిగిన అసెంబ్లీ సెషన్లో స్పీకర్ స్థానాన్ని అధిష్టించారు. మిజోరాం అసెంబ్లీకి ఇది ఒక ముఖ్యమైన చారిత్రక మైలురాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి, జోరెమ్ పీపుల్స్ మూవ్మెంట్ అగ్రనేత లాల్దుహోమా పేర్కొన్నారు. సాంప్రదాయ పరిమితులను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఈ మైలురాయి ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు. మిజోరాం మొదటి మహిళా స్పీకర్ బారిల్ వన్నెహసాంగి మార్చి 7న మిజోరాం మొదటి మహిళా అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రంలో మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం చూపారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో జోరెమ్ పీపుల్స్ మూవ్మెంట్ కి చెందిన వన్నెహసంగి ఒకరు. మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఎఫ్. లాల్నున్మావియాపై ఆమె 9,370 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా కూడా 32 ఏళ్ల బారిల్ వన్నెహసాంగి చరిత్ర సృష్టించారు. రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకముందు వన్నెహసాంగి ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్‌గా పనిచేశారు. మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ నుండి ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె టెలివిజన్ యాంకర్‌గా పనిచేశారు. వన్నెహసాంగికి ఆకట్టుకునే సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహిళా దినోత్సవం
-
మహిళలకు ప్రధాని మోదీ ఉమెన్స్ డే కానుక
-
సాయి ధరమ్ తేజ్ 'సత్య' ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
సమాజాన్ని అద్దంలో చూపించాను
‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ పేరుతో తన జర్నలిస్ట్ జీవితాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించారు అరుణా రవికుమార్. ముప్ఫై ఎనిమిదేళ్ల కిందట ‘అరుణా అశోకవర్ధన్’ పేరుతో తొలిసారి బైలైన్ చూసుకోవడం నుంచి నేటి వరకు సాగిన అక్షరయానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నేను మీడియా రంగంలోకి రావడమే ఒక ఆశ్చర్యం. నా చదువు ఇంగ్లిష్ మీడియంలో, గ్రాడ్యుయేషన్ సైన్స్‌లో సాగింది. అమ్మ రచయిత కావడంతో తెలుగు సాహిత్యం మీద అభిరుచి మెండుగా ఉండేది. నా లక్ష్యం సివిల్స్. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ పరీక్షల నాటికి తాతగారు పోవడంతో రాయలేకపోయాను. ఆ తర్వాత అనుకోకుండా ఓ ఇంగ్లిష్ పత్రికలో జర్నలిస్టుగా చేరాను. నా తొలి రిపోర్టింగ్ జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ రిపోర్ట్ మీద. బై లైన్‌తో వచ్చింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు, ప్రపంచ విజేతనైన భావన. అలా మొదలైన నా జర్నీ ఎలక్ట్రానిక్ మీడియాకు మారింది. తెలుగులో ప్రైవేట్ టీవీ రంగంలో రిపోర్టర్ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళను. పెళ్లి చేసుకున్న తర్వాత విజయవాడకు బదిలీ కావడం కూడా చాలా కీలకమైన అనుభవాన్నిచ్చింది. అది 1988, మార్చి నెల పదవ తేదీ. విజయవాడ వెళ్లిన తొలి రోజు, దేవినేని మురళి హత్య. సూపర్ మార్కెట్లో ఉన్నాను. ఓ కుర్రాడు పరుగున లోపలికి వచ్చి షట్టర్ వేసేశాడు. భయం కలిగినప్పటికీ నిబ్బరంగా ఉండిపోయాను. ఓ అరగంట తర్వాత షట్టర్ తీశారు. రోడ్డు మీదకు వస్తే... అంతకు ముందు ఏమీ జరగనట్లు తుపాను తర్వాత ప్రశాంతతలా ఉంది వాతావరణం. జర్నలిస్టుగా కొత్త ప్రపంచాన్ని చూశాను. చీరాలలో చేనేతకారుల ఆకలి చావులను రిపోర్ట్ చేయగలిగాను. సమాజంలో వేళ్లూనికొని ఉన్న ఆవేదనలు, ఆందోళనలకు అద్దం పట్టాను. ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు సాంబశివుడి ఇంటర్వ్యూ చేశాను. ఎలిమినేటి మాధవరెడ్డి గారి హత్యకు కొద్దిగా ముందు ఆయనతోపాటు వారి వాహనంలోనే ప్రయాణించాను. అప్పటికే రెక్కీ నిర్వహించి హత్యకు ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆ తర్వాత నాకు తెలిసింది. బళ్లారిలో ఎన్నికలను కవర్ చేశాను. భ్రూణహత్యల మీద పరిశోధనాత్మక కథనాలకు యూనిసెఫ్ అవార్డు వచ్చింది. స్టూడియో లో ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల ఇంటర్వ్యూలు ఎన్ని చేసినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలనా కథనాలు ఎక్కువ సంతోషాన్నిస్తాయి. ఫ్లోరోసిస్ బాధితుల కథనాలకు స్పందనగా ప్రభుత్వాలు నీటి సౌకర్యాన్ని కల్పించడం రిపోర్టర్‌గా నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సందర్భం. లంబాడా తండాల్లో ఆడపిల్లలను పుట్టగానే చంపేయడం, కుటుంబాన్ని పోషించడానికి ఓ మహిళ మూడుసార్లు సరోగసీ ద్వారా బిడ్డను కని అనారోగ్యం పాలు కావడం వంటి కథనాలెన్నింటికో నేను అక్షరసాక్షిని కావడం ద్వారా నాకు ఈ రంగం ఎంతో సంతృప్తినిచ్చింది. మా వారి బదిలీల రీత్యా, పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ల చదువులు కీలక దశల్లో ఉన్నప్పుడు కెరీర్లో విరామాలు తీసుకుంటూ నా వృత్తిని కొనసాగిస్తున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ‘మరాడర్స్ ఆఫ్ హోప్’ నా తొలి రచన. ‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ నా రెండవ రచన. ఇండిపెండెంట్ జర్నలిస్టుగా హైదరాబాద్‌లో ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పటికీ రోజూ చదువుతాను, రాస్తుంటాను. మహిళ ఎన్ని సాధించినప్పటికీ సమాజంలో సమానత్వం మాత్రం పూర్తిస్థాయిలో రాలేదనే చెప్పాలి. అయితే నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో సమాజంలో స్త్రీ–పురుషుల మధ్య అసమానత్వం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అంత తీవ్రంగా లేదు. కానీ సమానత్వం మాత్రం ఇంకా రాలేదు’’ అంటూ తన అక్షరయానం గురించి వివరించారు అరుణ. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫొటో: అనిల్‌కుమార్ మోర్ల -
శ్రామికలోక శక్తిమంతులు
‘చీకటిని చూసి విచారించవద్దు. అదిగో చిరుదీపం’ అంటుంది ఆశావాదం. ‘ఏమీ లేదని బాధ పడవద్దు. నేనే నీ ఆయుధం, బలం’ అంటుంది ఆత్మవిశ్వాసం. ఆశావాదం వెల్లివిరిసే చోట ఆత్మవిశ్వాసం ఉంటుంది. జయంతి బురడ, రాణిమా దాస్, మలీషా ఖర్వాలకు ఘనమైన కుటుంబ నేపథ్యం లేదు. ‘జీరో’ నుంచి ప్రయాణం ప్రారంభించిన వీరు తమను తాము తీర్చిదిద్దుకుంటూ ‘హీరో’లుగా పేరు తెచ్చుకున్నారు. ఫోర్బ్స్ ఇండియా టాప్ సెల్ఫ్–మేడ్ ఉమెన్ 2024 (డబ్ల్యూ–పవర్ లీస్ట్)లో చోటు సాధించారు... గిరిజన గొంతుక గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసురావడానికి జర్నలిస్ట్ కావాలనుకుంది అడవి బిడ్డ జయంతి బురుడ. అయితే ఇంట్లో మాత్రం ‘చదివింది చాలు’ అనే మాట ఎప్పడూ వినిపించేది. దీంతో ఇంటిని విడిచిపెట్టి స్నేహితుల సహాయంతో ఒడిషా సెంట్రల్ యూనివర్శిటీలో జర్నలిజంలో డిగ్రీ చేసింది. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లాలోని సెర్పల్లి ఆమె స్వగ్రామం. 2015లో భువనేశ్వర్‌లోని కళింగ టీవీ న్యూస్ చానల్ రిపోర్టర్‌గా చేరిన జయంతి బురుడ జర్నలిస్ట్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. తన రిపోర్టింగ్ టూర్లలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, మౌలిక సదుపాయాల లేమిపై దృష్టి పెట్టడమే కాదు వాటి పరిష్కారానికి కూడా కృషి చేసింది. ఆడపిల్లల చదువు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 2018లో ‘బడా దీదీ యూనియన్’ అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టింది. ‘బడా దీదీ యూనియన్’ ద్వారా గిరిజన మహిళల కోసం ఎన్నో అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించింది. తమను వేధిస్తున్న సమస్యలపై గిరిజన మహిళలు ధైర్యంగా గొంతు విప్పలేకపోవడాన్ని జయంతి గ్రహించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, ధైర్యంగా గొంతు విప్పడానికి 2022లో ‘జంగిల్ రాణి’ పేరుతో వేదిక ప్రారంభించింది. ‘మన కథ– మన కోసం’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇది. మల్కన్‌గిరిలోని ఏడు బ్లాక్‌లకు చెందిన యాభై మంది గిరిజన మహిళలు ఈ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్నారు. స్క్రిప్ట్‌లు రాయడం, వీడియోలు చిత్రీకరించడం, ఎడిటింగ్....మొదలైవాటిని వీరికి నేర్పించింది బురుడ. సంస్కృతి నుంచి తాము ఎదుర్కోంటున్న సమస్యల వరకు చేతిలోని సెల్‌ఫోన్‌తో వీడియో స్టోరీలు చేస్తున్నారు గిరిజన మహిళలు. ఈ స్టోరీలను ‘జంగిల్ రాణి’ ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేస్తారు. గిరిజన సమాజానికి, అడవులు, జీవనవైవిధ్యానికి ఉన్న సంబంధానికి అద్దం పట్టే సహజ కథనాలు ఇవి. ఎంతోమంది సాధారణ మహిళలలో అసాధారణ ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ఎంతో కృషి చేసింది జయంతి బురుడ. ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్ ‘ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్’గా పేరు సంపాదించిన మలీషా ఖర్వా ఫోర్బ్స్ ఇండియా ఉమెన్–పవర్ 2024 జాబితాలో చోటు సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ హాఫ్మన్తో కలిసి నటించిన తరువాత మలీషా జీవితం మారిపోయింది. ముంబైలోని ధారవి మురికివాడలో ఒక గుడిసెలో నివసిస్తున్న మలీషా రాబర్ట్ హాఫ్మన్ దృష్టిలో పడింది. ఆ అమ్మాయిలోని వెలుగేదో రాబర్ట్‌ను ఆకట్టుకుంది. ‘ఈ మట్టిలో మాణిక్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి’ అనుకున్నాడు. మోడల్, డ్యాన్సర్ కావాలన్న మలీషా కలను సాకారం చేసేందుకు తన వంతు సాయం అందించాడు. మలీషాకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో 4,50,000 మంది ఫాలోవర్లు, 88,700 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన మలీషా లగ్జరీ ఇండియన్ కాస్మోటిక్స్ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. పదహారు సంవత్సరాల మలీషా ఖర్వా మోడల్, కంటెట్ క్రియేటర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ‘కల నిజం చేసుకోవడానికి పేదరికం ఎంతమాత్రం అడ్డు కాదు’ అని నిరూపించిన మలీషా ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అంగన్వాడీ అక్క దేశంలోని 23 లక్షల అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ప్రతినిధిగా రాణిమా దాస్‌ను ఫోర్బ్స్ ఇండియా ‘ఉమెన్ పవర్ లిస్ట్ 2024’లో చోటు కోసం ఆల్ ఇండియా అంగన్ వాడీ వర్కర్ ఫెడరేషన్ నామినేట్ చేసింది. అస్సాంలో పరఖోవా గ్రామానికి చెందిన రాణిమా దాస్ ఎవరికి ఏ సమస్య వచ్చినా ‘నేను ఉన్నాను’ అంటూ ముందుకు వచ్చేది. సమస్యల పరిష్కారంతో పాటు మహిళలకు ఆరోగ్యానికి సంబంధించిన నలహాలు ఇవ్వడంలో మంచి పేరు తెచ్చుకుంది. అంకితభావం, నిబద్ధతతో వ్యవహరించే రాణిమాను ‘అక్కా’ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. గత పదిహేడేళ్లుగా పిల్లలను బడిలో చేర్పించడం, గర్భిణి స్త్రీలకు సూచనలు...మొదలైన ఎన్నో విషయాల్లో కృషి చేస్తోంది రాణిమా దాస్. సలహాలు, సహాయం విషయంలో ముందు ఉన్నట్లే పోరాట విషయంలో ముందుంటుంది. అస్సాం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెండ్ అయిన రాణిమా దాస్ అంగన్వాడీ వర్కర్ల వేతన పెంపుదల కోసం పోరాటం చేసింది. అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎప్పుడూ పోరాడతాం’ అంటున్న రాణిమా దాస్‌కు పోరాటం కొత్త కాదు. -
Infosys Sudha Murty: రాజ్య సుధ
సాటి మనుషుల కోసం పని చేయడం సామాజిక సేవ ద్వారా పరిస్థితులను మెరుగుపరచడం యువతకు స్ఫూర్తిగా నిలవడం.. రచయితగా ఎదగడం ఇన్ఫోసిస్ దిగ్గజంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం సుధామూర్తిని నేడు రాజ్యసభకు చేర్చాయి. ఉమెన్స్ డే రోజు ఆమెను రాష్ట్రపతి ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి జీవన విశేషాలు. ► తొలి పాఠాలు సుధామూర్తి బాల్యం హుబ్లీలో గడిచింది. తండ్రి కులకర్ణి డాక్టర్. ఆయన రోజూ టీ సేవించేవాడు. ఒకరోజు పాలు రాలేదు. తండ్రి టీ తాగక వేరే ఏ పనీ మొదలుపెట్టలేక కూచుని ఉన్నాడు. ‘ఏంటి నాన్నా?’ అని అడిగింది సుధామూర్తి. ‘ఉదయాన్నే టీకి నేను అలవాటు పడ్డానమ్మా. ఇవాళ టీ తాగక తలనొప్పి వచ్చింది. నువ్వు మాత్రం దేనికీ అతిగా అలవాటు పడకు.. కాఫీ, టీలకైనా సరే’ అన్నాడు. సుధామూర్తి ఆ పాఠాన్ని గుర్తు పెట్టుకుంది. ఇవాళ ఆమెకు డెబ్బై నాలుగు ఏళ్లు. నేటికీ ఉదయాన్నే లేచి టీగానీ కాఫీ గాని తాగి ఎరగదు. సుధామూర్తి హుబ్లీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే షిగావ్‌లో పుట్టింది. అక్కడ ఆమె అమ్మమ్మ, తాతయ్య ఉండేవారు. తాతయ్య స్కూల్ టీచర్. ఆయన తనకంటే వయసులో ఎంత చిన్నవారినైనా ‘మీరు’ అని బహువచనం వాడేవారు. ‘నీ కంటే చిన్న కదా తాతయ్య’ అని సుధామూర్తి అంటే ‘లోపలి ఆత్మ పెద్దదే కదమ్మా’ అనేవారు. ఎదుటివారిని గౌరవించడం అలా నేర్చుకుందామె. తాతయ్య ఆమెకు మూడు జీవన పాఠాలు నేర్పారు. 1.సింపుల్‌గా జీవించు 2.జ్ఞానాన్ని సముపార్జిస్తూనే ఉండు 3. పుస్తకాలు చదువు. ఇవి సుధామూర్తి నేటికీ పాటిస్తూనే ఉంది. అమ్మమ్మ ‘ఆకలితో ఉన్నవారిని గమనించు’ అని చెప్పింది. వాళ్ల ఇంటికి రోజూ ఒక భిక్షకుడు వస్తే ఇంట్లో మంచి బియ్యం నిండుకుని ముతకబియ్యం ఉన్నా అమ్మమ్మ మంచి బియ్యమే భిక్షకుడికి వేసేది. ‘ముతక బియ్యం మనం తినొచ్చులే’ అనేది. ఇదీ సుధామూర్తికి తొలి పాఠమే. ఇక అమ్మ విమల నేర్పిన పాఠం– ‘ఎంతో అవసరమైతే తప్ప డబ్బు ఖర్చు పెట్టకు’ అని. అంతే కాదు నీకు బాల్యంలో మంచి అలవాట్లు ఉంటే అవే కాపాడతాయి అని కూడా ఆమె అనేది. ఉదయాన్నే లేచి కాగితం మీద 10 సార్లు ‘దేవుడికి నమస్కారం’ అని రాయించేదామె. నేటికీ సుధా మూర్తి ఆ అలవాటును మానలేదు. ఇక స్కూల్ టీచరు రాఘవేంద్రయ్య... ‘నీకు లెక్కలు భలే వస్తున్నాయి. లెక్కల్ని వదలకు. పైకొస్తావ్‘ అన్నాడు. ఆమె ఆనాటి నుంచి లెక్కల్నే రెక్కలుగా చేసుకుంది. ► కుతూహలమే గురువు చిన్నప్పుడు సుధామూర్తికి ప్రతిదీ కుతూహలమే. వీధుల్లో కొట్లాటలు అవుతుంటే అక్కడకు పరిగెత్తి వెళ్లి నిలబడేది. వినోదం కోసం కాదు. కారణం ఏమై ఉంటుందా అని. చిన్న ఊళ్లో ప్రతి ఇల్లూ అందరికీ పరిచయమే. అందరి జీవితాలనూ ఆమె పరిశీలిస్తూ ఉండేది. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగితే ఆమె తప్పని సరిగా ఒక స్టీలు క్యారేజీ తీసుకుని బయలుదేరేది. విందులో ఏ పదార్థాలు బాగున్నాయో ఏ పదార్థాలు బాగలేవో మొత్తం రుచి చూసి వస్తూ వస్తూ బాగున్న వాటిని క్యారేజీలో అడిగి తెచ్చుకునేది. కాలేజీ రోజుల వరకూ కూడా పెళ్ళిళ్లకు క్యారేజీ తీసుకోకుండా సుధామూర్తి వెళ్లేది కాదు. ‘ఎందుకో నాకు గిన్నెల క్యారేజీ అంటే నేటికీ ఇష్టం’ అంటుందామె. ► మసాలా దోసె పార్టీ లెక్కలు బాగా నేర్చుకున్న సుధా హుబ్లీలోని బి.వి.బి. కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో చేరింది. ఇక ఆ రోజు నుంచి ఊళ్లోని పెద్ద మనుషులంతా ఆమె తండ్రి దగ్గరకు వచ్చి వాపోవడమే. ‘అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తున్నావ్. పెళ్లెవరు చేసుకుంటారు’ అని బెంగపడటమే. తండ్రి కూడా ఒక దశలో తప్పు చేశానా అనుకున్నాడు. కాని సుధామూర్తి మొదటి సంవత్సరానికి ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. తండ్రికి సంతోషం కలిగింది. ‘ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నావ్ కదా... పద మసాలా దోసె పార్టీ చేసుకుందాం’ అని తీసుకెళ్లాడు. ప్రతి సంవత్సరం ఆమె ఫస్ట్‌క్లాస్ తెచ్చుకోవడం.. తండ్రి తీసుకెళ్లి మసాలా దోసె తినిపించడం. ఆ తండ్రీ కూతుళ్ల జీవితంలో పార్టీ చేసుకోవడం అంటే అదే. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ‘కాని ఆ పార్టీ ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. అపురూపం అనిపించేది’ అంటుందామె. ► చరిత్ర మార్చిన కార్డు ముక్క 1974లో టాటా వారి ‘టెల్కో’ సంస్థలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు పడ్డాయి. పేపర్లో ఆ యాడ్ చూసింది సుధామూర్తి. అర్హతలు అన్నీ ఆమెకు ఉన్నాయి. కాని యాడ్ కింద ‘స్త్రీలు అప్లై చేయాల్సిన పని లేదు’ అని ఉంది. అప్పుడు సుధామూర్తికి ఆగ్రహం వచ్చింది. రోషం కలిగింది. జె.ఆర్.డి.టాటాకు ఒక కార్డు గీకి పడేసింది. ‘దేశంలో ఉన్న ఇంతమంది స్త్రీలకు పని చేసే హక్కు లేకపోతే వారు ఎలా అభివృద్ధిలోకి వస్తారు?’ అని ప్రశ్న. ఆ కార్డు జె.ఆర్.డి. టాటాకు చేరింది. ఆ వెంటనే ఆమెకు ఇంటర్వ్యూకు పిలుపు, ఆపై ఉద్యోగం వచ్చాయి. పూణెలో సుధామూర్తి తొలి ఉద్యోగం చేసింది. ఆమె రాసిన లేఖను టాటా సంస్థ నేటికీ భద్రపరిచి ఉంచింది. 1974లో టెల్కోలో సుధామూర్తి ఒక్కతే మహిళా ఉద్యోగి. దాదాపు 50 ఏళ్ల తర్వాత సుధామూర్తి పూణెలో ఆ సంస్థను సందర్శిస్తే (ఇప్పుడు టాటా మోటార్స్) 900 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ‘నేను అక్కడ నిలబడి మా తండ్రిని తలుచుకుని ఉద్వేగంతో కన్నీరు కార్చాను. ఎవరు భయపెట్టినా నన్ను ఆయన చదివించాడు. నా వల్ల ఇవాళ ఇంతమంది మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారు అని’ అందామె. ► జీవితం అంతులేని పోరాటం ‘జీవితం అంటే అంతులేని పోరాటం. ఎవరికీ ఏ వయసులో ఉన్నా కన్సెషన్ ఉండదు. పోరాటం చేయాలి. ఓడిపోయినా పోరాట అనుభవం మిగులుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. క్షమిస్తే మంచిది. మర్చిపోతే ఇంకా మేలు. కాని ముందుకు సాగడమే అన్నింటికన్నా ఉత్తమమైనది. చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని మెరిపిస్తాయి. ప్యాషన్‌తో పని చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. ఒక మనిషిని పైకి తెచ్చేది డబ్బు కాదు ప్యాషన్. నమ్మిన పనిని విలువలతో ఆచరిస్తే ఎవరైనా పైకి రావాల్సిందే’ అంటుందామె. ► రాజ్యసభ సభ్యురాలు ‘ఇది ఊహించలేదు. రాష్ట్రపతి నన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీని గురించి నేను కూచుని ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. ఏం చేయగలనో అంతా చేయాలి. ఇప్పుడు నేను భారత ప్రభుత్వ సేవకురాలిని’ అని కొత్త బాధ్యతకు సిద్ధమవుతోంది సుధామూర్తి. ఇల్లాలే శక్తి నారాయణ మూర్తితో వివాహం అయ్యాక ఇన్ఫోసిస్ సంస్థను ఆయన స్థాపించాలనుకున్నప్పుడు 10 వేల రూపాయలు పెట్టుబడి తనే ఇచ్చింది సుధామూర్తి. అయితే ఆమెను ఇన్ఫోసిస్‌కు బయటి వ్యక్తిగానే ఉండటం మంచిదని సూచించాడు నారాయణమూర్తి. ఆమె కొంచెం బాధపడింది. ఎప్పటికైనా ఇన్ఫోసిస్ సంస్థలో చేరతాననే భావించింది. అదే సమయంలో చాలా కాలం పాటు పిల్లల కోసం గృహిణిగా ఉండిపోయింది. ‘సంవత్సరంలో 200 రోజులు ప్రయాణాల్లో ఉండేవాడు నారాయణమూర్తి. ఆ రోజుల్లో ఫోన్ లేదు. కారు లేదు. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక్కదాన్నే వెళ్లాలి. సంస్థ ఆర్థిక కష్టాలు.. ఇంటి కష్టాలు.. అన్నీ తట్టుకుని నారాయణమూర్తికి వెన్నుదన్ను అందించాను. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చైర్మన్ అయ్యాను. ఆ ఫౌండేషన్‌తో వేలాది మంది జీవితాల్లో వెలుగు తెచ్చే వీలు నాకు కలిగింది. ఈ సంతృప్తి ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా పని చేసి ఉంటే నాకు దక్కేది కాదు’ అంటుందామె. -
'రామ్ చరణ్ గారు.. ఈ రోజు ఏం చేస్తున్నారు'.. ఉపాసన వీడియో వైరల్!
మెగాస్టార్ తనయుడు, మెగా హీరో రామ్ చరణ్ చెఫ్ అవతారమెత్తారు. ఉమెన్స్ డే సందర్భంగా సరికొత్తగా వంటలు చేస్తూ కనిపించారు. ఉమెన్స్ డే సందర్భంగా అమ్మ సురేఖతో కలిసి ఇంట్లో వంటలు చేస్తున్న వీడియోను ఉపాసన పోస్ట్ చేసింది. ఉమెన్స్ డే స్పెషల్ అంటూ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఏంటి? మన చరణ్ అన్నయ్య ఇలా మారిపోయాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. వీడియోలో ఉపాసన మాట్లాడుతూ..' అత్తమ్మగారు.. ఈ రోజు మీ కిచెన్‌లో ఏం చేస్తున్నారు? రామ్ చరణ్ గారు మీరు ఏం వంటలు చేస్తున్నారు' అంటూ ఫన్నీగా ప్రశ్నలు అడిగింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ సర్కార్: ఎమ్మెల్సీ కవిత ఫైర్
-
మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాం: సీతక్క
-
మహిళా దినోత్సవం: ఈ సవాళ్లపై దృష్టిసారించమంటున్న యూఎన్!
ప్రతి ఏడాది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవా(మార్చి 8)న్ని ఘనంగా జరుపుకోవడానికి ప్రపంచమంతా కలిసి ఒక్కతాటిపైకి రావడం విశేషం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేస్తున్న అద్భుతమైన పనులను గుర్తించే చర్చించే రోజు. సామాజిక న్యాయయోధుల నుంచి శాస్త్రవేత్తలు, కళాకారులు, రాజకీయ నాయకులు వరకు మహిళలు ప్రతి రంగంలో శరవేగంగా దూసుకుపోతున్నారు. ఈ రోజు గతం గురించి మాట్లాడటం కంటే భవిష్యత్తు వైపుకే దృష్టిసారించాలి. ఎందుకంటే? స్త్రీలు కొన్ని విషయాల్లో సవాళ్లు ఎదుర్కుంటూనే ఉన్నారు. ఎంతలా స్త్రీలు ఉద్యోగాల్లో రాణిస్తున్నా పురుషులతో సమానంగా జీతాన్ని మాత్రం పొందలేకపోతున్నారు. అలాగే మంచి విద్యను అందుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి "మహిళల కోసం పెట్టుబడి పెట్టండి: పురోగతిని వేగవంతం చేయండి" అని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తోంది. మహిళలకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రపంచం ఆమోదయోగ్యమైనదిగా అనిపిస్తుంది. సమిష్టిగా పని చేయాల్సిన ఐదు కీలక విభాగాలు.. లింగ సమానత్వం అనేది గొప్ప మానవ హక్కుల సమస్యగా ఉంది. అందువల్ల మహిళల కోసం పెట్టుబడులు పెట్టండి అని పిలుపునిస్తోంది ఐక్యరాజ్యసమితి. దీన అర్థ స్త్రీ పురుష లింగ సమానత్వం కోసం పెట్టుబడులు పెట్టమని ఘంటా పథంగా చెబుతోంది. పేదరికాన్ని అంతం చేయడం!: కోవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు 75 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో పడిపోయారు. అందువల్ల 2030 నాటికి సుమారు 342 మిలియన్లకు పైగా మహిళలు, బాలికలు పేదరికంలో పడకుండా నిరోధించేలా తక్షణ చర్య తీసుకోవడం కీలకం. లింగ సమానంగా ఫైనాన్సింగ్ అమలు చేయడం: పెరుగుతున్న ధరల కారణంగా 2025 నాటికి దేశాలు ప్రజలపై ఖర్చు చేయడం 75% మేర తగ్గించొచ్చు. ఆ ప్రభావం మహిళలు వారి అవసరమైన సేవలపై ప్రతికూల ప్రభావం ఏర్పడవచ్చు హరిత ఆర్థిక వ్యవస్థగా, సురక్షిత సమాజంగా మార్చడం!: ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మహిళలను అసమానంగా ఉంది. ముఖ్యంగా న్యాయవాద మహిళల గొంతులు విస్తరించేలా గ్రీన్ ఎకనామీగా సురక్షిత సమాజంగా మారాలని ప్రతిపాదించారు ఫెమినిస్ట్ మార్పు మేకర్లకు మద్దతు ఇవ్వడం: ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ స్త్రీవాద సంస్థలు అధికారిక అభివృద్ధి సహాయంలో 0.13% మాత్రమే పొందుతున్నాయి. (చదవండి: ఇల్లాలిగా, బిజినెస్ విమెన్‌గా సరిలేరామెకు! దటీజ్ నీతా!) -
మహిళకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి: సత్య కృష్ణణ్
-
మహిళా కండక్టర్ అనుభవాలు
-
మహిళా కండక్టర్లతో కలిసి సాక్షి ఒక రోజు
-
అత్తమ్మపై మెగా కోడలు ప్రశంసలు.. ఎందుకంటే?
మెగా కోడలు ఉపాసన గురించి పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో సంబంధం లేనప్పటికీ ఎంటర్‌ప్రెన్యూరర్‌గా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అపోలో ఆస్పత్రి ద్వారా మహిళల గతేడాది ఈ జంటకు కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వూలోనే మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే రెండో బిడ్డను కనేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇవాళ అంతర్జాతీయ మహిళ దినోత్సవం కావడంతో ప్రత్యేకంగా విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది. అదేంటో చూసేద్దాం. తాజాగా మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాసన కొణిదెల ట్వీట్ చేసింది. అత్తమ్మ, చిరంజీవి భార్య సురేఖపై ప్రశంసలు కురిపించింది. ఈ మహిళ దినోత్సవం రోజున 60 ఏళ్లలో మా అత్తమ్మ ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తోంది. మనదేశంలో చాలామంది అత్తమ్మలు, అమ్మలు బిజినెస్‌లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమకు ఇష్టమైన వృత్తిలో సాధించిన విజయాలను ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవాలంటూ ఉపాసన పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా..ఇటీవల ఉపాసన నాలెడ్జి సిటీలోని టి–హబ్‌లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మా అత్తమ్మ ఎంతో ప్రేమగల వ్యక్తి.. ఆమే నాకు స్ఫూర్తి అని చెప్పారు. ప్రస్తుత కాలంలో ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చానన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. This Women’s Day my mother-in-law is making her debut as an entrepreneur in her 60’s 🙌 Imagine how rich our country would be if more athammas & amma’s became entrepreneurs!! Let’s celebrate more women joining the workforce & following their passion https://t.co/WhQ2JmjsaG pic.twitter.com/05tz4UPBfE — Upasana Konidela (@upasanakonidela) March 8, 2024 -
తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
-
లావుగా ఉన్నావంటూ బిడ్డతో సహా భార్యను వదిలేశాడు..కానీ ఆమె..!
ప్రతి ఆడపిల్ల పెళ్లి తర్వాత జీవతం గురించి ఎన్నో కలలు కంటుంది. అందరికి మెట్టినిల్లు పుట్టినిల్లులా ఉండకపోవచ్చు. కొందరికి అది ముళ్లమీద సాగుతున్న జీవితంలా ఉండొచ్చు. అయినప్పటికి పుట్టింటి గౌరవం కాపాడేందుకు అన్నింటిని ఓర్చుకుంటుంది. కానీ అది హద్దు దాటి ఆమె ఆత్మగౌరవాన్నే కించే పరిచలే చేస్తే తట్టుకోలేదు. అదికూడ కట్టుకున్నవాడే తన ఉనికినే సహించలేనంటే.. ఆ మహిళ పరిస్థితి మాటలకందని వేదన అని చెప్పొచ్చు. అలాంటివి అధిగమించి తానెంటో ప్రూవ్ చేసుకున్న ఓ ధీర వనిత గాథ ఇది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహిళ స్ఫూర్తి కథేంటో చూద్దామా!. 32 ఏళ్ల సుస్మితా దాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందరి ఆడపిల్లలా పెళ్లి గురించి ఎన్నో కలలు కంది. ఎంతో ఆనందంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తమ ప్రేమకు గుర్తుగా పండంటి బాబుని కంది. అదే ఆమె పాలిట శాపంగా మారి వైవాహిక జీవితాన్ని నిలువునా కూలుస్తుందని ఊహించలేదు. సాధారణంగా ప్రసవానంతరం వచ్చే మహిళల్లో చాలా మార్పులు వస్తాయి. కొందరూ బాగా లావవ్వడం జరుగుతుంది. పిల్లలు ఎదిగే క్రమంలో కొందరూ తగ్గుతారు, మరికొందరూ కాస్త శరీరంపై దృష్టిపెట్టి తగ్గించుకోవడం వంటివి చేస్తారు. అలానే సుస్మిత డెలివరీ తర్వాత ఊహించిన విధంగా బరువు పెరిగింది. ఈ శరీర మార్పులను అంగీకరించకపోగా బాషీ షేమింగ్‌తో ఇబ్బంది పెట్టేవాడు. లావుగా ఉన్న నీతో కాపురం చేయలేను అని బిడ్డతో సహా ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మానసికంగా కుంగిపోయింది. ఏం చేయాలో ఎలా లైప్ లీడ్ చేయాలో తెలియని అగమ్య గోచరంలా కనిపించింది కళ్లముందున్న జీవితం. తల్లిదండ్రులు సుస్మితను అక్కున చేరుకుని భరోసా ఇచ్చారు. అది ఆమెలో కొండంత ధైర్యం ఇచ్చింది. ఏ బాడీ షేమింగ్ కారణంగా తన జీవితాన్ని కోల్పోయానో దాని మీద దృష్టిపెట్టి మంచి ఫిట్నెస్గా ఉండాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. ఫిట్నెస్ కమ్యూనిటీలో ఓ మెంబర్‌గా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఏ ఒక్క రోజు వర్కౌట్లు మిస్సవ్వదు. అందరికంటే ఎక్కువ బరువులు అలవోక ఎత్తేయగలదు. పైగా తాను పెళ్లి కారణంగా మధ్యలోనే ఆపేసిన ఎంబీఏని చదువుని పూర్తి చేయడమే గాక మంచి కార్పోరేట కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించడమే గాకు తన కుంటుంబాన్ని పోషించుకుంటోంది. అంతేగాదు తనలా బాడీషేమింగ్‌తో బాధపడే మహిళలకు మంచి ఫిట్నెస్ గురువుగా సలహలిస్తూ వారిని మంచి టోన్డ్ బాడీగా మార్చుకునేలా సాయం చేస్తోంది. అలా మహిళలను కించపరచడం తప్పని నిరూపించడమేగాక వారు తమను తాము ప్రేమించుకుంటేనే ధైర్యంగా నిలబడగలరని ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. (చదవండి: మహిళా దినోత్సవం: మహిళల ప్రాతినిథ్యం ఎలా ఉంది?) -
ఏపీ జేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం (ఫొటోలు)
-
మహిళలు తీసుకోవాల్సిన పాలసీలు
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో నారీమణులు క్రమంగా అన్ని విభాగాల్లో రాణిస్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం ముందుకు సాగుతున్నారు. దాంతో వారు తమ వ్యక్తిగత వృద్ధితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావాన్ని చూపుతున్నారు. దేశపురోభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తున్న మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి ఆసుపత్రిపాలైతే ఆర్థికంగా చితికిపోకుండా బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు తమ ఆర్థిక రక్షణ కోసం కొన్ని రకాల సాధారణ బీమా పాలసీలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అందులో ప్రధానంగా.. ఆరోగ్య బీమా ఇంట్లో మహిళలతోపాటు కుటుంబం అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. కొన్ని బీమా పాలసీలు ప్రసూతి ఖర్చులను చెల్లిస్తాయి. కొత్తగా వివాహం అయిన వారు ఇలాంటి పాలసీలను పరిశీలించాలి. డెలివరీకి 90 రోజుల ముందు నుంచీ, డెలివరీ అయిన 90 రోజుల వరకూ ఏదైనా చికిత్స తీసుకుంటే ఆ ఖర్చులను పాలసీలు చెల్లిస్తాయి. తీవ్ర వ్యాధులకు.. కొన్ని జీవన శైలి, తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు ఆర్థిక రక్షణ కల్పించేలా పాలసీలు తీసుకోవాలి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటివి మహిళలకు మాత్రమే వస్తాయి. ఇలాంటి వ్యాధులను గుర్తించినప్పుడు క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు ఒకేసారి 100 శాతం పాలసీ విలువను చెల్లిస్తాయి. అనారోగ్యం వల్ల ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో 3 నెలల జీతాన్ని అందించే ఏర్పాటూ ఇందులో ఉంటుంది. వాహన బీమా మెట్రోనగరాలతోపాటు ఇతర సిటీల్లో దాదాపు చాలామంది మహిళలు వాహనాలు నడుపుతున్నారు. అయితే చాలా మంది వాహన ఇన్సూరెన్స్ అయిపోయన తర్వాత రెన్యూవల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కచ్చితంగా వాహన బీమా ఉండేలా చూసుకోవాలి. కనీసం థర్డ్ పార్టీ బీమా పాలసీ లేకుండా వాహనాన్ని నడపకూడదు. ఇదీ చదవండి: ‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’ టర్మ్ పాలసీ ఏ క్షణాన ఏ ప్రమాదం ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ప్రమాదవశాత్తు మనకు ఏదైనా జరిగితే మన కుటుంబం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోకుండా టర్మ్ పాలసీ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ప్రముఖ కంపెనీలను నడిపిస్తున్న మహిళలు వీరే.. (ఫొటోలు)
-
గ్లామర్, డ్యాన్స్‌లకు మాత్రమే పరిమితం కాదని నిరూపించిన హీరోయిన్లు
డ్యాన్స్ మాత్రమే వచ్చా? అలా అంటారేంటీ.. ఫైట్స్ కూడా చేస్తారు. కాకపోతే ఆ ఒక్క చాన్స్ రావాలి. ఆ చాన్స్ వచ్చినప్పుడు హీరోయిన్లు యాక్షన్‌లోకి దిగుతారు. అలా కొందరు కథానాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు పెరిగాయి. ఈ మహిళా దినోత్సవానికి కథానాయికల పరంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక సినిమాలో సమస్యలపై పోరాడుతున్న హీరో‘యిన్ యాక్షన్’ గురించి తెలుసుకుందాం. యువతి పోరాటం ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’.. ఇలా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో అనుష్కా శెట్టి సూపర్ హిట్. తాజాగా ఆమె మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ సైన్ చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. ఆంధ్రా – ఒడిస్సా సరిహద్దు లొకేషన్స్‌లో ఇటీవల షూటింగ్ జరి΄ారు. ఓ యువతి పోరాటంతో సాగే ఈ సినిమాకు ‘శీలవతి’ టైటిల్‌ను అనుకుంటున్నారట. సత్యభామ పోలీసాఫీసర్ సత్యభామగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. ఓ అమ్మాయి హత్య కేసులో నిజమైన దోషులను పోలీస్ ఆఫీసర్ సత్యభామ ఏ విధంగా పట్టుకుంది? అనే అంశంతో ఈ సినిమా సాగుతుంది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే హిందీలో కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ‘ఉమ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిటెక్టివ్ అను ఓ కొత్త చిత్రం కోసం చెన్నైలో డిటెక్టివ్ ఏజెన్సీ ఆరంభించనున్నారు శ్రుతీహాసన్. ఈ సినిమాకు ఫిలిప్ జాన్ దర్శకుడు. ఇందులో డిటెక్టివ్ అను ΄ాత్రలో కనిపిస్తారు శ్రుతీహాసన్. ఈ సినిమాకు ‘ది చెన్నై స్టోరీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. తన నాన్న ఆచూకీ తెలుసుకోవాల్సిందిగా ఓ ఇంగ్లిష్ కుర్రాడు చెన్నైకి వచ్చి, డిటెక్టివ్ అనుని కలిశాక ఏం జరిగింది? అనే అంశం చుట్టూ ఈ సినిమా ఉంటుంది. అలాగే శ్రుతీహాసన్ నటించిన ఇంగ్లిష్ చిత్రం ‘ది ఐ’. చనిపోయిన భర్త అస్తికలను సముద్రంలో కలిపేందుకు మరో చోటుకు వెళ్లిన ఓ మహిళ ఎలాంటి నిజాలు తెలుసుకుంది? ఎవరెవర్ని హత్య చేయాలనుకుంటుంది? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. కాలేజ్ స్టూడెంట్ రష్మికా మందన్నా తొలిసారి రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘చిలసౌ’ (2018)తో దర్శకుడిగా హిట్టైన నటుడు రాహుల్ రవీంద్రన్ ఇటీవల ‘ది గాళ్ ఫ్రెండ్’ కోసం మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఈ సినిమాలో రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక కాలేజ్ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ఓ కాలేజ్ స్టూడెంట్ ప్రేమ, సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. రష్మిక నటిస్తున్న మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రెయిన్ బో’. ఈ సినిమాకు శాంతరూబన్ దర్శకుడు. ఓ మనిషి తన జీవితంలో ఎదుర్కొనే వివిధ దశల పరిస్థితులను ‘రెయిన్ బో’లో చెబుతున్నారట. హక్కుల కోసం పోరాటం ‘మహానటి’ (2018) సినిమాతో నటిగా తనలో ఎంత ప్రతిభ ఉందో నిరూపించుకున్నారు కీర్తీ సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ‘రఘు తాతా’, ‘రివాల్వర్ రీటా’, ‘కన్నె వెడి’ వంటి మూడు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఉన్నాయి. ‘రఘు తాతా’కు సుమన్‌కుమార్ దర్శకుడు. బలవంతంగా హిందీ భాష నేర్చుకోవాలన్నప్పుడు ఓ యువతి ఏ విధంగా పోరాటం చేసింది? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. అలాగే కీర్తి మరో ఫిల్మ్ ‘రివాల్వర్ రీటా’ కూడా పోరాటం నేపథ్యంలో సాగే సినిమాయే. ‘కన్నె వెడి’ సినిమాకు గణేశ్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హీరోయిన్గా ‘బేబీ జాన్’ చిత్రంతో హిందీకి పరిచయం అవుతున్నారు కీర్తి. గీతాంజలి మళ్లీ వచ్చింది తెలుగు హీరోయిన్ అంజలి నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గీతాంజలి’. 2014లో విడుదలైన ఈ హారర్ కామెడీ ఫిల్మ్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ వస్తోంది. అంజలి మెయిన్ లీడ్ రోల్ చేశారు. ఏప్రిల్ 11న విడుదల కానుంది. శివ తుర్ల΄ాటి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించిన ‘గీతాంజలి 2’ అంజలి కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఓ ఇంట్లో చోటు చేసుకునే హారర్ ఎలిమెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. రోడ్ ట్రిప్ హీరోయిన్లు అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత కలిసి రోడ్ ట్రిప్‌కు వెళ్లారు. వెకేషన్ కోసం కాదు.. సినిమా కోసమే. రోడ్ ట్రిప్ నేపథ్యంలో ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, దర్శన, సంగీత లీడ్ రోల్స్ చేస్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ వరుసగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు హన్సిక. గత ఏడాది హన్సిక మెయిన్ లీడ్ రోల్ చేసిన ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’, ‘105 మినిట్స్’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది మరో రెండు రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. తమిళ ‘గార్డియన్’ చిత్రం నేడు విడుదల అవుతోంది. కాగా హన్సిక సైన్ చేసిన ‘రౌడీ బేబి’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. జేఏమ్ రాజశరవణన్ ఈ మూవీకి దర్శకుడు. ఇవి కాకుండా హన్సిక చేతిలో మరో రెండో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలు ఉన్నాయి. ఇలా మరికొందరు హీరోయిన్లు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌కి సై అన్నారు. -
International Womens Day 2024: ప్రతి రంగంలో ప్రతిభ
వివిధ రంగాలలో విజయపథంలో దూసుకుపోతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళలు వినీతసింగ్ (కాస్మెటిక్స్) వినీతసింగ్కు తండ్రి తేజ్‌సింగ్ స్ఫూర్తిప్రదాత. ఆయన శాస్త్రవేత్త. ఏడాదిలో 365 రోజులూ పనిచేసేవాడు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో డిజిటల్–ఫస్ట్ కాస్మటిక్ బ్రాండ్ ‘సుగర్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది వినీత. ఐఐటీ–మద్రాస్, ఐఐఎం–అహ్మదాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వినీత ఒక ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో అధిక వేతనంతో కూడిన జాబ్ ఆఫర్‌ను వదులుకొని వ్యాపారరంగంలోకి అడుగు పెట్టింది. మొదటి స్టార్టప్ ‘క్వెట్జాల్’ ఘోరంగా విఫలమైంది. 2012లో మన దేశంలో ఇ–కామర్స్ ఊపందుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలకు ప్రతినెలా వివిధ రకాల బ్యూటీ ప్రాడక్ట్స్ తక్కువ ధరకు అందించే ‘ఫ్యాబ్ బ్యాగ్’ అనే సబ్స్క్రిప్షన్స్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ వ్యాపారం హిట్ అయింది. అయితే ఈ మేకప్ బ్రాండ్లు మన భారతీయ స్కిన్‌టోన్, జీవన విధానానికి అనుగుణంగా లేవని గ్రహించింది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని 2015లో కాస్మటిక్ ‘సుగర్’ను స్టార్ట్ చేసి తిరుగులేని విజయం సాధించింది. నేహా సతక్ (ఆస్ట్రోమ్ టెక్నాలజీ) టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసింది నేహా సతక్.‘ఆస్ట్రోమ్ టెక్నాలజీ’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన సత్తా చాటింది. ‘నన్ను నేను ఒక ఇన్నోవేటర్‌గా భావిస్తాను’ అంటుంది ‘ఆస్ట్రోమ్ టెక్నాలజీ’ కో–ఫౌండర్, సీయీవో నేహా సతక్. ‘ఇన్నోవేటివ్ హై– బ్యాండ్‌విడ్త్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి, ఇంటర్నెట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటు ధరలోక్లి తీసుకురావడానికి, మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలనే ఆలోచనలో ఆస్ట్రోమ్ టెక్నాలజీ మొదలు పెట్టాం. ఆస్ట్రోమ్ గిగామెష్ డివైజ్ చుట్టుపక్కల ఉన్న నాలుగు డివైజ్‌లను కనెక్ట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఒక పరికరాన్ని మాత్రమే కనెక్ట్ చేయగలదు’ అంటుంది నేహా సతక్. హర్దిక షా (ఫిన్‌టెక్) ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది హర్దిక షా. చిన్నపాటి వ్యాపారం నిర్వహించడానికి తల్లి పడే కష్టాలను దగ్గరి నుంచి చూసిన షా యూఎస్‌లో కంప్యూటర్ సైన్స్ చేసింది. కొలంబియా బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పూర్తయిన తరువాత టాప్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంది. మన దేశంలో చిన్న వ్యాపారాలు చేస్తున్నవారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిపుణులతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఆ తరువాత బెంగళూరు కేంద్రంగా ‘కినార క్యాపిటల్’ అనే ఫిన్‌టెక్‌ను ప్రారంభించింది. ఈ ఫిన్టెక్కు ఆరు రాష్ట్రాల్లో 110 శాఖలు ఉన్నాయి. ‘గ్యారెంటీ లేని బిజినెస్. చాలా రిస్క్’ అన్నారు హర్థిక షా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు. అయితే ఆ మాటలేవీ ఆమెపై ప్రభావం చూపలేదు. తొలి అడుగుల్లోనే కస్టమర్లు, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని గెలుచుకుంది. ‘ఫిన్ టెక్’ ఫీల్డ్‌లో విజయకేతనం ఎగరేసింది. డా. ప్రియా అబ్రహం, వైరాలజిస్ట్ మన దేశంలోని ప్రసిద్ధ వైరాలజిస్ట్‌లలో డా. ప్రియా అబ్రహం ఒకరు. కేరళలోని కొట్టాయం జిల్లాలో పుట్టిన ప్రియ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు(సీఎంసీ)లో బయాలజీలో పీహెచ్డీ చేసింది. సీఎంసీ ‘క్లినికల్ వైరాలజీ సెక్షన్’ హెడ్‌గా పనిచేసింది. వైరల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన ఎన్నో కమిటీల్లో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీలో పనిచేసింది. నేషనల్ వైరల్ ఇన్ఫెక్షన్ సర్వైలెన్స్ రిసెర్చ్‌లో భాగం అయింది. కోవిడ్–19కి జస్ట్ రెండు నెలల ముందు పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ హెడ్‌గా బాధత్యలు చేపట్టింది. ‘ఆ టైమ్‌లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను’ అని కరోనా కాలాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ప్రియ. టెస్టింగ్ కిట్లను వివిధ టెస్టింగ్ ల్యాబ్‌లకు పంపే లాజిస్టిక్స్‌ను నిర్వహించడం నుంచి కొత్తగా పుడుతున్న వేరియెంట్లను నిశితంగా పరిశీలించడం వరకు వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో ప్రియ ఆమె బృందం ఎంతో కృషి చేసింది. లాజిస్టిక్స్ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా మన దేశంలో జరిగిన అన్ని వ్యాక్సిన్ ట్రయల్స్ పర్యవేక్షణలోనూ కీలక పాత్ర పోషించింది. ‘గుర్తింపు, విజయం రావాలని ఆశగా పరుగెత్తినంత మాత్రాన రావు. మనం చేసిన కృషిని బట్టి వెదుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి’ అంటుంది ప్రియా అబ్రహం. రిమ్జిమ్ అగర్వాల్ (న్యూరో–ఇన్ఫర్మేటిక్స్) లైనా ఇమాన్యుయేల్‌తో కలిసి న్యూరో–ఇన్ఫర్మేటిక్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్రెయిన్‌సైట్’ను ప్రారంభించింది రిమ్జిమ్ అగర్వాల్. బ్రెయిన్‌సైట్ ఏఐ సాఫ్ట్వేర్ మెంటల్ హెల్త్ ప్రాక్టిషనర్స్కు, న్యూరోసర్జన్స్ బాగా ఉపయోగపడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్‌లో పీహెచ్డీ చేసిన అగర్వాల్ మెంటల్ హెల్త్‌కు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) అప్లికేషన్లను స్టడీ చేసింది. ‘గూగుల్ మ్యాప్ ఆఫ్ ది బ్రెయిన్’గా ‘బ్రెయిన్‌సైట్’ ప్లాట్‌ఫామ్ గుర్తింపు పొందింది. ఈ ప్లాట్‌ఫామ్‌ను నాలుగు రకాల టెక్నాలజీలతో రూపొందించారు. స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్‌లాంటి మానసిక వ్యాధులకు సంబంధించి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. మెదడులో ఏం జరుగుతుందో అనేదానిపై ‘బ్రెయిన్‌సైట్’ సాంకేతికత దృష్టి సారిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే మానసిక సమస్యతో బాధపడుతున్న వారి గురించి సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ‘మా పరిశోధనలను ఎక్కువమందికి చేరువ చేయాలనే లక్ష్యంతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాను. ఫంక్షనల్ అంశాలకు కృత్రిమ మేధస్సును వర్తింప చేస్తున్న ప్రపంచంలోని అతి కొద్ది కంపెనీలలో మా కంపెనీ ఒకటి’ అంటుంది అగర్వాల్. అశ్వినీ అశోకన్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఇంటరాక్షన్ డిజైన్ కోర్సు చదువుతున్న రోజుల నుంచి అశ్వినీ అశోకన్‌కు కంప్యూటర్‌కు సంబంధించి విషయాలపై ఆసక్తి ఉండేది. ‘ఇంటెల్’లో దశాబ్దం పాటు వివిధ రకాల ఇంటర్నెట్ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన విభాగాల్లో పనిచేసింది. ఈ అనుభవ జ్ఞానంతో ‘మ్యాడ్స్ట్రీట్ డెన్’ను ప్రారంభించింది. డిజిటల్, ఏఐ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించి కంపెనీల జర్నీలో ‘మ్యాడ్స్ట్రీట్’ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. 2020–2021లో కంపెనీలో రకరకాల పరిశ్రమలలోకి విస్తరించింది. వ్యాపార విజయాలకు మాత్రమే కాదు ఉద్యోగాలలో జెండర్ ఈక్వాలిటీకి కూడా ప్రాధాన్యత ఇస్తోంది అశ్విని. కోవిడ్ సమయంలో ఉద్యోగాలు మానేసిన ఎంతోమందిని తిరిగి పనిలో చేరేలా కృషి చేసింది. ‘అన్ని రకాల కంపెనీలను నడిపించడంలో మహిళలు ముందుండాలి’ అని కోరుకుంటున్న అశ్వినీ అశోకన్ ఈ భూగోళంలో ప్రతి ఉద్యోగి, ప్రతి వ్యక్తిని ఏఐ నేటివ్‌గా చూడాలనుకుంటుంది. అపర్ణ పురోహిత్ (వినోద రంగం) మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అపర్ణ పురోహిత్ ఎన్నో కలలతో దిల్లీ నుంచి ముంబైలోకి అడుగు పెట్టింది. ముంబైకి వచ్చిన ఐదేళ్ల తరువాత ఇండిపెండెంట్ డైరెక్టర్–ప్రొడ్యూసర్ కావాలనే తన కలను సాకారం చేసుకుంది. కథలు చెప్పాలనే కలతో ముంబైకి వచ్చిన అపర్ణ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజనల్స్’ హెడ్‌గా కొత్త ప్రయాణం ప్రారంభించింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఎన్నో ప్రాజెక్ట్‌లలో పనిచేసింది. ‘ఇది నా పని కాదు’ అని ఎప్పుడూ అనుకోలేదు. ట్యూషన్ల్ చెప్పడం నుంచి వాయిస్ ఓవర్ వరకు ఎన్నో పనులు చేసింది. ‘అమెజాన్ ప్రైమ్వీడియో–ఇండియా’ హెడ్ హోదాలో పాతాళ్ లోక్, మీర్జాపూర్ మేడ్ ఇన్ హెవెన్, ది ఫర్గెటన్ ఆర్మీలాంటి ఒరిజినల్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ కంటెంట్‌తో మంచి పేరు తెచ్చుకుంది. ‘సూపర్మెన్లాగా సూపర్ ఉమెన్ అనే మాట ఎందుకు వినిపించదు’ అనే మాటకు అపర్ణ పురోహిత్ ఇచ్చిన జవాబు... ‘తమ దైనందిన జీవితంలో మహిళలు ఎప్పుడూ సూపరే’. -
International Womens Day 2024: ఆర్థిక స్వాతంత్య్రం అంటే?
స్త్రీలు సంపాదనపరులైతే ఏమవుతుంది? ఆర్థికంగా సమృద్ధి సాధిస్తే ఏమవుతుంది? తమ జీవితాలపై అధికారం వస్తుంది. కీలక నిర్ణయాలప్పుడు గొంతెత్తే ఆత్మవిశ్వాసం వస్తుంది. తమకు ఏ హక్కులు రక్షణ ఇస్తాయో ఎరుక కలుగుతుంది. స్త్రీ ఇవన్నీ కుటుంబ సంక్షేమానికే వెచ్చిస్తుంది. స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం ఇంటా, బయటా స్త్రీ, పురుషుల సమ భాగస్వామ్యాన్ని ప్రతిపాదిస్తుంది. కాని స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రానికి ఇంకా ఎంతో చైతన్యం కావాలి. స్త్రీలు సాధికారత పొందటం అంటే ఏమిటి? పరాధీనత నుంచి బయటపడటమే. అంటే? మరొకరు తనను పోషించే స్థితి నుంచి బయటపడటమే. తండ్రి, భర్త, కుమారుడి సంపాదన వల్ల మాత్రమే జీవితం గడుస్తూ ఉంటే కనుక ఆ పరాధీనత నుంచి బయట పడటం. అంటే బంధం నుంచి బయటపడటం కాదు. స్థితి నుంచి మాత్రమే. స్త్రీలు సాధికారత ఎప్పుడు పొందుతారంటే ఆర్థికంగా వారు స్వేచ్ఛ పొందినప్పుడు. స్త్రీలకు సామాజికంగా, కుటుంబపరంగా హక్కులు ఉంటాయి. అయితే ఆ హక్కులను దక్కించుకోవాలంటే వారికి ఆర్థిక ఆత్మవిశ్వాసం ఉండాలి. పుట్టుక నుంచే స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలనే భావన ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచే తీసివేయడం నేటికీ జరుగుతోంది. ‘ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టడానికి’ అనుకునే తల్లిదండ్రులు, భర్త సంపాదన వల్ల మాత్రమే ఆమె బతకాలనుకునే తల్లిదండ్రులు ఆమె చదువును నిర్లక్ష్యం చేయడం గ్రామీణ భారతంలో నేటికీ జరుగుతూనే ఉంది. ఆడపిల్లకు ఆస్తిపాస్తులు ఇచ్చినా చదువు వల్ల వచ్చే, ఆమెకై ఎంచుకునే ఉపాధి నుంచి వచ్చే సంపాదన కలిగించే ఆత్మవిశ్వాసం వేరు. స్త్రీలను ‘అదుపులో ఉంచడం’ అంటే వారిని ఆర్థిక వనరుల నుంచి దూరంగా పెట్టడమే. పోపుల డబ్బాలో కొద్దిపాటి చిల్లరకే ఆమె హక్కుదారు. దానివల్ల న్యూనతతో ఉండాలి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాల సమయంలో భర్త/తండ్రి/కుమారుడి మాట చెల్లుబాటు కావడానికి కారణం వారు ‘ఆర్థిక వనరులు కలిగి ఉండటం’. ‘రూపాయి సంపాదన లేని దానివి నువు కూడా మాట్లాడేదానివేనా’ అని స్త్రీలను పరోక్షంగా అనడం. అదే ఆమెకు సంపాదన ఉంటే నా వల్ల కూడా కుటుంబం నడుస్తోంది కాబట్టి కుటుంబ సంక్షేమం కోసం నా పాయింట్ చెప్పాల్సిందే అని అనగలదు. కుటుంబపరంగా, సామాజికంగా తన జీవితం ఏ విధంగా గడవాలని స్త్రీ ఆశిస్తుందో ఆ నిర్ణయాన్ని వెల్లడించే శక్తి ఆర్థిక స్వావలంబన వల్ల కలుగుతుంది. ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రం అవసరం. అందుకు చదువు ముఖ్య సాధనం. సాధికారత అంటే? స్త్రీలు సాధికారత పొందాలంటే వారి ఆకాంక్షలకు సమాజం ఆమోదం తెలపాల్సిందే. ఒక స్త్రీ అంట్రప్రెన్యూర్ కావాలనుకున్నా, పెద్ద పెద్ద సంస్థల్లో నాయకత్వ స్థానానికి ఎదగాలనుకున్నా, కాన్పు సమయంలో బ్రేక్ తీసుకుని నాలుగైదేళ్ల తర్వాత తిరిగి తన ఉద్యోగం చేయాలని అనుకున్నా, పెళ్లి తర్వాత పై చదువులకు వెళ్లాలనుకున్నా, గృహిణిగా ఉంటూ ఇంటిపట్టునే ఏదైనా పనిచేసి సంపాదించాలనుకున్నా వారికి అడ్డుగా నిలవకపోవడమే చేయవలసింది. ఒక అధ్యయనం ప్రకారం స్త్రీలు తమ సంపాదనలో 90 శాతం కుటుంబం కోసం ఖర్చు పెడతారు. పురుషులు నలభై–యాభై శాతం ఖర్చు పెడతారు. స్త్రీలు సాధికారత పొందడం అంటే తాము ఏం చేసినా పడి ఉంటుందనే భావన నుంచి పురుషులను బయట పడేయడం. ఎక్కువ తక్కువ లేని గౌరవ బంధాలను ప్రతిపాదించడం. ఆర్థిక అక్షరాస్యత స్త్రీలు సాధికారత, ఆర్థిక స్వావలంబన పొందాలంటే ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి స్త్రీలకు ఆర్థిక అక్షరాస్యతను కలిగించాలి. వ్యక్తిగత ఖర్చులు, కుటుంబ బడ్జెట్, పొదుపు, ఆదాయం తెచ్చే పెట్టుబడి... వీటి గురించి అవగాహన ఉండాలి. ‘మీ జీవితం మీ చేతుల్లో ఉండాలంటే’ మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలి... అందుకు ఏమి చేయాలో తెలుసుకోవాలి. సొంత ఆస్తి, స్వీయపేరు మీద పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, ఎమర్జన్సీ ఫండ్ కలిగి ఉండటం, డిజిటల్ పరిజ్ఞానం పొంది ఉండటం– అంటే ఆర్థిక లావాదేవీలు ఫోన్‌మీద, కంప్యూటర్ మీద చేయగలిగి వేగంగా పనులు నిర్వర్తించ గలగడం. కుటుంబ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అనుకుంటే కుటుంబంలో కీలకమైన వాటాదారైన స్త్రీ ఎంత ఆర్థిక సమృద్ధితో ఉంటే దేశ సమృద్ధి అంతగా పెరుగుతుంది. ఉమెన్స్ డే సందేశం అదే. -
Womens Day: 'జనతనయ బస్తర్..' చరిత్ర ఒక భద్రత.. భరోసా..!
"బస్తర్.. కొండకోనల్లో.. వాగువంకల్లో ఒదిగిన ఈ ప్రాంతానికి లోకం పోకడలతో పెద్దగా పరిచయం లేదు! కాని దానికి సంబంధించిన ఏదో ఒక వార్తను ఈ ప్రపంచం నిత్యం వింటూనే ఉంటుంది! బస్తర్‌ను కమ్యూన్స్కి నమూనాగా మలచాలని మావోయిస్ట్‌లు.. మోడర్న్ వరల్డ్‌కి అనుసంధించాలని ప్రభుత్వాలు.. ఏ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తోందో.. ఏ ప్రయోజనాన్ని చేకూరుస్తోందో.. అక్కడి జనమే చెప్పాలి! కానీ రెండు పరస్పర విరుద్ధమైన తీరులు.. తరీఖాల మధ్యనున్న బస్తర్ వాసులు గుంభనంగానే ఉంటారు.. ఇంకా చెప్పాలంటే భయంగా ఉంటారు! ఆ భయాన్ని పోగొట్టి.. వారి మంచిచెడులను అడిగే దళం ఒకటి అక్కడి గూడేల తలుపులు తడుతుంది! ఆ దళంలో ఉన్నవాళ్లంతా ఆదీవాసీల కూతుళ్లు.. అక్కాచెల్లెళ్లే! వాళ్లకు శిక్షణనిచ్చి సాయుధులుగా పంపిస్తోంది ప్రభుత్వమే! అయినా ఆ బిడ్డలను చూస్తే ఆ గిరిజనులకు ఒక భరోసా.. భద్రత! ఆ విశ్వాసం పొందడానికి ఈ బిడ్డలు సర్కారు నమూనాను అనుసరించట్లేదు.. ఆత్మీయతను పంచుతున్నారు! అనునయిస్తున్నారు. తమ జనానికి ఏం కావాలో.. ఏం అవసరమో తెలుసు కాబట్టి ఆ దిశలో నడుస్తున్నారు.. నడిపిస్తున్నారు! ఇది జనతన సర్కార్‌కి.. సర్కార్‌కి మధ్య పోరును వివరించే వ్యాసం కాదు! ఆ రెండిటి నడుమ ఘర్షణకు గురై.. తలుపులు మూసేసుకున్న జనాలను అక్కున చేర్చుకుని సర్కారు అభివృద్ధిలో తమ వాటాను వారు అందుకునేలా చేస్తున్న ఆ కూతుళ్లు.. అక్కాచెల్లెళ్ల గురించి! మార్చి 8 విమెన్స్ డే సందర్భంగా ఈ విమెన్ పవర్ గురించి! వివరాల్లోకి వెళ్లేముందు బస్తర్ చరిత్రనూ తెలుసుకుందాం క్లుప్తంగా.." రామాయణంలో దండకారణ్యంగా చెప్పుకునే దట్టమైన అటవీ ప్రాంతం తెలంగాణకు ఆవల ఛత్తీస్‌గఢ్‌లో గోదావరి, ఇంద్రావతి, శబరి నదుల నడుమ విస్తరించి ఉంది. ఈ అడవుల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉన్నారనే అంశాలపై రెండు దశాబ్దాల కిందటి వరకు స్పష్టమైన లెక్కలు లేవు. అక్బర్ కాలంలో తొలిసారి, ఆ తర్వాత బ్రిటిష్ హయాంలో మరోసారి ఇక్కడి ప్రజలు, వారి సంస్కృతి, ఆహారపు అలవాట్లు తదితర వివరాలను తెలుసుకునేందుకు కొంత ప్రయత్నం జరిగింది. అయితే దట్టమైన అడవుల కారణంగా ఈ ప్రయత్నాలు తుదివరకు సాగలేదు. ఇక్కడి ఆదివాసీ తెగ ప్రజలకు అడవే లోకం. బయటి ప్రపంచంతో సంబంధం లేదు. వీళ్లకు దేవుడైనా, దయ్యమైనా ప్రకృతే! ఆ తర్వాత బ్రిటిష్ వారి రాక, వారు రూపొందించిన కఠినమైన చట్టాల ఆసరాతో అటవీశాఖ సిబ్బంది అడవుల్లోకి అడుగు పెట్టారు. దీంతో ఆదివాసీలపై అటవీశాఖ ఆగడాలు శ్రుతి మించాయి. అటవీశాఖ సిబ్బంది అంటే అడవుల్లో ఆదివాసీల జీవనానికి అడ్డుతగిలే వారుగా ముద్ర పడిపోయారు. జనతన సర్కార్.. తెలంగాణలో 1980వ దశకంలో మావోయిస్ట్ ఉద్యమం తీవ్రమైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పల్లెలు అన్నలకు అడ్డాలుగా మారాయి. ఇదే క్రమంలో 1982లో కొందరు మావోయిస్ట్‌లు ఏటూరునాగారం వద్ద గోదావరి తీరం దాటి బస్తర్ అడవుల్లోకి చొచ్చుకుపోయారు. అటవీశాఖ సిబ్బంది అణచివేతతో ఇబ్బంది పడుతున్న ఆదివాసీలకు అండగా నిలిచారు. వారు మాట్లాడే భాష నేర్చుకున్నారు. వారి తిండికి అలవాటు పడ్డారు. క్రమంగా ఆదివాసీలను ఐక్యం చేసి, అటవీశాఖ సిబ్బంది ఆగడాలను నిలదీయడం నేర్పారు. ఫలితంగా ఈ శతాబ్దం ఆరంభానికి వచ్చేసరికి ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 92 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించిన బస్తర్ ఏరియా అన్నల నీడలోకి వెళ్లింది. గ్రామాల వారీగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన విద్య, వైద్య, రక్షణ కమిటీలు పరిపాలనలో చురుగ్గా వ్యవహరించసాగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి యాభై ఏళ్లు పూర్తయ్యేటప్పటికి బస్తర్ అడవుల్లో మావోయిస్టులు అనధికారిక పాలకులుగా మారారు. బస్తర్‌తో బంధం.. 'ఢిల్లీ సుల్తానుల దండయాత్ర తర్వాత 13వ శతాబ్దంలో కాకతీయులు తమ రాజధాని ఏకశిలా నగరాన్ని వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలో గోదావరి తీరం దాటి ఇంద్రావతి ఒడ్డున విస్తరించిన అడవుల్లోకి వెళ్లి, బస్తర్ కేంద్రంగా మరో రాజ్యాన్ని స్థాపించారు. రాచరిక పాలన అంతమైనా నేటికీ అక్కడ మన కాకతీయుల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణలో మావోయిస్ట్ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడే భావజాల వ్యాప్తిలో భాగంగా ఆనాటి అన్నలు గోదావరి తీరం దాటి బస్తర్లోకి వెళ్లారు. అక్కడి ప్రజలతో మమేకమై, వారి సహకారంతో జనతన సర్కార్‌ను నడిపించడం ప్రారంభించారు. కాలాలు మారినా అలా బస్తర్‌తో తెలుగువారికి బంధం కొనసాగుతూనే ఉంది.' సల్వాజుడుం.. ఆరంభంలో బాగున్నా, బస్తర్ అడవులు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. అడవుల్లోని గ్రామాలకు సరైన రోడ్లు లేవు, కరెంటు లేదు. ఆధునాతన విద్య, వైద్యం, కమ్యూనికేషన్ ్స అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. అడవుల్లోకి అభివృద్ధిని తెస్తామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాయి. అడవుల్లోని సహాజ సంపదను కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టేందుకే ప్రభుత్వాలు అడవుల్లో అభివృద్ధి మంత్రం జపిస్తున్నాయంటూ మావోయిస్ట్‌లు ఎదురుతిరిగారు. దీంతో మావోయిస్ట్‌ల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు తొలిదశలో 2005లో స్థానిక ఆదివాసీలతో సల్వాజుడుం పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది అప్పటి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. అయితే అది వికటించి, అడవుల్లో అన్నలకు మరింత పట్టు పెరిగింది. దాంతో అటవీశాఖ సిబ్బంది అడుగు పెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రీన్‌హంట్.. 2012లో బస్తర్ ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో మెజారిటీ గిరిజనులు మావోయిస్ట్‌లనే తమ పాలకులుగా భావిస్తున్నారని తేలింది. ఈ ఫలితం సంచలనం రేపింది. దాంతో మావోయిస్ట్‌లను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2012లో ఆపరేషన్ గ్రీన్ హంట్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా సీఆర్పీఎఫ్ బలగాలను తరలించింది. కేవలం మావోయిస్ట్‌ల కోసమే కోబ్రా దళాలను ఏర్పాటు చేసింది. మరోవైపు రాష్ట్రప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ (సీఏఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ)ని ఏర్పాటు చేసింది. బస్తర్ పరిధిలో ఉన్న సుక్మా, బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, దంతేవాడ, బస్తర్, కొండగావ్ జిల్లాల్లోని అటవీ గ్రామాల ప్రజలకు ఎలాగైనా అభివృద్ధి ఫలాలను అందించాలనే లక్ష్యంగా ఉక్కుపాదాలతో ముందుకు సాగింది ప్రభుత్వ యంత్రాంగం. ఫలితంగా గత పదిహేనేళ్లుగా గోదావరి, ఇంద్రావతి, శబరి నదులు సరిహద్దులుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని పచ్చని అడవులు మరింతగా రక్తసిక్తమయ్యాయి. ఇబ్బంది లేదు.. 'చిన్నప్పుడే మావోయిస్టుల్లో కలసిపోయాను. ఏళ్ల తరబడి అడవుల్లోనే జీవితం గడచింది. అక్కడ అనారోగ్యం పాలయ్యాను. నేనక్కడ ఉద్యమంలో ఉన్న సమయంలో ఇక్కడ నా కుటుంబానికి అండగా ఎవరూ లేరు. దాంతో అడవుల్లోంచి బయటకు వచ్చాను. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్‌లో మహిళా కమెండోగా పని చేస్తున్నాను. నా కుటుంబానికి అండగా ఉంటున్నాను. అలవాటైన పని కావడంతో ఆయు«ధంతో అడవుల్లో పని చేయడం ఇబ్బందిగా ఏమీ అనిపించడం లేదు.' – సబిత (పేరు మార్చాం) మహిళా కమెండో భయం నీడన.. మైదానప్రాంత గిరిజనులు సైతం ఇతరులతో అంత సులువుగా కలసిపోరు. ఇక కొండ ప్రాంతాల్లో, అడవుల్లో నివసించే గిరిజన, ఆదివాసీలైతే తమ గ్రామాల దగ్గరికి ఎవరైనా కొత్తవారు వస్తే వెంటనే ముడుచుకుపోతారు. అలాంటిది ఆలివ్‌గ్రీన్ యూనిఫామ్ ధరించి ఆయుధాలతో వచ్చిన భద్రతా దళాలను చూసేసరికి మరింతగా కుంచించుకుపోయారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు గిరిజనుల నుంచి కనీస సమాచారం అందడం కూడా దుర్లభమైంది. అడవుల్లో తమను చూసి బెదిరిపోయే ఆదివాసీలు.. మావోయిస్ట్‌లకు అండగా ఉంటున్నారనే అపోహ భద్రతా దళాల్లో పెరిగిపోయింది. బలవంతంగా తమ నోరు విప్పించేందుకు భద్రతా దళాలు చేసే ప్రయత్నాలు ఆదివాసీలను మరింతగా బెదరగొట్టాయి. దాంతో ఇటు భద్రతా దళాలు, అటు ఆదీవాసీలు ఒకనొకరు విశ్వసించుకోని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఎదురు కాల్పులు, కోవర్టుల ఘాతుకాలు, ఇన్ ఫార్మర్ల హత్యలతో హింసాకాండ పెరిగింది. హక్కుల ఉల్లంఘన దట్టమైన అడవుల్లోకి వెళ్లినప్పుడు సెర్చింగ్ పేరుతో ఆదివాసీ గూడేలపై అకృత్యాలకు, అమానవీయ చర్యలకు పాల్పాడుతున్నారనే ఆరోపణలు భద్రతా దళాలను చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు ఇబ్బంది కలిగే విధంగా కమెండోల (మగవాళ్లు) చర్యలు ఉంటున్నాయనే విమర్శలు పెల్లుబికాయి. భద్రతా దళాలను చూస్తేనే ఆదివాసీ గూడేలు గడగడలాడిపోతున్నాయంటూ మానవ హక్కుల సంఘాలు గొంతెత్తాయి. అప్పటికే చెలరేగుతున్న హింసకు మానవ హక్కుల హననం అనే ఆరోపణలు తోడవడంతో ప్రభుత్వాలు ఇరకాటంలో పడ్డాయి. మానవీయ కోణం.. భద్రతా దళాల సంఖ్యను పెంచినా, అధునాతన ఆయుధాలు అందించినా.. సరికొత్త వ్యూహాలను అమలు చేసినా అడవుల్లోకి చొచ్చుకుపోవడం సాధ్యపడలేదు ప్రభుత్వాలకు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఆయుధాలతో ఆదివాసీల మనసులను గెలుచుకోవడం కష్టమని భావించారు అధికారులు. దాంతో తమ పట్ల, తాము వినిపిస్తున్న అభివృద్ధి నినాదం పట్ల గిరిజనానికి విశ్వాసం కలగాలంటే వారిపట్ల సహానుభూతి అవసరమని గ్రహించారు. మానవీయకోణం లేని ప్రయత్నాలు వ్యర్థమని అర్థం చేసుకున్నారు. అభివృద్ధి ఫలాలు అనే నినాదానికి మానవీయ కోణం జత చేయాలనే వ్యూహానికి రూపకల్పన చేశారు. ఆ బాధ్యతను మహిళలు సమర్థంగా నిర్వహించగలరనే నిర్ణయానికి వచ్చారు. దంతేవాడలో తొలి అడుగు! పారా మిలటరీ దళాల్లో మహిళలకు స్థానం కల్పించాలని నిర్ణయం తీసుకున్నంత ఈజీగా అమలు సాగలేదు. రిక్రూట్మెంట్ ప్రక్రియ కష్ట సాధ్యమైంది. అప్పటికే మావోయిస్ట్‌లు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో వందల మంది చనిపోయారు. దాంతో ఆలివ్‌గ్రీన్ దుస్తులు ధరించి, భుజాన తుపాకి మోసేందుకు ముందుకొచ్చిన మహిళలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంతే మిగిలారు. ఆ వచ్చిన కొద్దిమంది కూడా అప్పటికే అక్కడ చెలరేగుతున్న హింసలో పెద్దదిక్కును కోల్పోయిన వారు, లొంగిపోయిన మావోయిస్టులే! అలా 2019లో దంతెవాడ జిల్లాలో తొలి విమెన్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ దళం ఏర్పడింది. మూడు నెలల శిక్షణ ఫ్రంట్ లైన్ యాంటీ మావోయిస్ట్ ఫోర్స్‌లో భాగంగా ప్రారంభమైన తొలి దళంలో పదిమంది లొంగిపోయిన మహిళా మావోయిస్టులు, పదిమంది సల్వాజుడుం పూర్వసభ్యులు ఉండగా మిగిలిన పదిమంది రిక్రూట్మెంట్ సెల్ ద్వారా నియమితులయ్యారు. అలా మొత్తం ముపై ్ప మందిని తీసుకున్నారు. మావోయిస్ట్‌లకు వ్యతిరేకంగా చేపట్టే జంగిల్ వార్ఫేర్లో వారికి మూడు నెలల కఠిన శిక్షణ ఇచ్చారు. దాంతోపాటుగా దట్టమైన అడవుల్లో సురక్షితంగా వాహనాలు నడపడం, మ్యాప్ రీడింగ్, కౌంటర్ ఆంబుష్ స్ట్రాటజీ, ఆ ప్రాంతంలో ఉన్న మావోయిస్ట్ నేతల ప్రొఫైల్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మారువేషాల్లో మెరుపుదాడులు చేయడంలోనూ మెలకువలు నేర్పించి, కార్యక్షేత్రంలోకి దింపారు. అర్థం చేసుకోవడం తేలిక.. 'నేను ఛత్తీస్‌గఢ్ ఆదివాసీ మహిళను. గతంలో మా గ్రామంలోకి పోలీసులు, భద్రతా బలగాలు వస్తే గ్రామమంతా వణికిపోయేది. ఆ భయం నుంచే వారికి వ్యతిరేకంగా పోరాడాలని అడవిబాట పట్టాం. ఇప్పుడు భద్రతాదళంలో మహిళా కమెండోగా పని చేస్తున్నా. భద్రతా దళాలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు అక్కడి ప్రజల మానసిక స్థితి ముఖ్యంగా మహిళలు ఎలా భయపడతారో నాకు బాగా తెలుసు. కాబట్టి వాళ్లలో ఉన్న భయాన్ని పోగొట్టి భరోసా కల్పించడం ఎలాగో మాకు తెలిసినంతగా ఇతరులకు తెలియదు. అందువల్లే మహిళా కమెండోలు వచ్చిన తర్వాత స్థానిక ప్రజలు, భద్రతా దళాలకు మధ్య సంబంధాలు∙మెరుగవుతున్నాయి గతంతో పోలిస్తే!' – జయంతి (పేరు మార్చాం) మహిళా కమెండో మహిళా కమెండోలు.. ఈ మహిళా దళ సభ్యులను బృందాలుగా వేరు చేస్తారు. వీరు మెన్ స్క్వాడ్ కూంబింగ్‌కు వెళ్లినప్పుడు వారి వెంట అడవుల్లోకి వెళ్తారు. ఉదాహరణకు పాతిక మంది కమెండోల బృందం అడవుల్లోకి వెళితే అందులో నలుగురైదురుగు మహిళా కమెండోలు ఉండేలా కూర్పు చేశారు. వీరు అటవీ మార్గంలో వెళ్తున్నప్పుడు, దారిలో ఏదైనా గూడెం వస్తే మహిళా కమెండోలు గూడెం లోపలికి వెళ్తారు. అక్కడున్న వారితో మాట్లాడతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తీర్చగలిగే సమస్య అయితే అక్కడిక్కడే తమ సామర్థ్యం మేరకు పరిష్కారం చూపుతారు. అక్కడికి రావడం వెనుక తమ ఉద్దేశం ఏంటో చెబుతారు, సహకరించాలని కోరుతారు. స్త్రీల సమస్యలు.. మహిళా కమెండోలు స్త్రీల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారం చూపించడంలో సఫలం అవుతున్నారు. ముఖ్యంగా చిన్న వయస్సులో పెళ్లిళ్లు, పిల్లలు, పోషకాహార లోపంతో బాధపడే ఛత్తీస్‌గఢ్ మహిళలు తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. వ్యక్తిగత పరిశుభ్రత, గైనిక్ సమస్యలపై తమకున్న అవగాహన మేరకు వారికి తోడ్పాటును అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి తమ కిట్లలో ఉండే మాత్రలు, టానిక్స్‌ను వారికి అందిస్తుంటారు. దీంతో బస్తర్ ప్రాంతంలోని ప్రజలకు భద్రతా దళాలపై ఉండే అపారమైన భయం స్థానంలో క్రమంగా నమ్మకం చిగురించసాగింది. మార్పు మొదలైంది.. మహిళా కమెండోలు వచ్చాక మార్పు మొదలైందంటున్నారు ఛత్తీస్‌గఢ్ గ్రామీణులు. ‘ఇంతకుముందు భద్రతా దళాలు మా ఊళ్లవైపు వస్తున్నాయని తెలిస్తే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరం అడవుల్లోకి పరుగెట్టేవాళ్లం. ఆరోగ్యం బాగాలేని వారు, ముసలి వాళ్లు మాత్రమే ఊళ్లల్లో ఉండేవారు. భద్రతా దళాలు మా ఊళ్లను విడిచిపెట్టాయని నిర్ధారించుకున్న తర్వాతే తిరిగి ఇళ్లకు చేరుకునేవాళ్లం. అయితే వాళ్లు వస్తున్నారని తెలిసి ఉన్నపళంగా ఊరంతా ఖాళీ అయ్యేసరికి ఏదో జరగబోతోందనే అనుమానంతో జవాన్లు ఊళ్లల్లోనే తిష్టవేసే వాళ్లు. వాళ్లంతా ఎక్కడికి వెళ్లారంటూ ఊళ్లల్లో ఉన్న వారిని గదమాయించే వారు. దాంతో మా పల్లెల్లో ఘర్షణ వాతావరణం ఉండేది. కానీ మహిళా కమెండోలు వచ్చిన తర్వాత భద్రతా దళాల మాటతీరులో మార్పు వచ్చింది. మా మీద భద్రతా దళాలకు చెందిన మగ కమెండోలు దాష్టీకాలు చేయకుండా అడ్డుకునే మహిళా కమెండోలు ఉన్నారనే నమ్మకం కలిగింది. మా బాధలు చెబితే అర్థం చేసుకునే మనుషులకు భద్రతా దళాల్లో స్థానం ఉందనే భరోసా వచ్చింది. రోజులు గడిచే కొద్దీ, నెలలు ముగిసే కొద్దీ భద్రతా దళాలను చూసి అడవుల్లోకి పారిపోయే పరిస్థితి తగ్గిపోయింది. సర్కారుకు, మాకు మధ్య వారధిగా నిలుస్తున్నారు మహిళా జవాన్లు’ అని చెప్పుకొచ్చారు స్థానిక జనం. పట్టాలపైకి అభివృద్ధి! చత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాలు, అక్కడి ప్రజలతో భద్రతా దళాలు మమేకం అవడం మొదలైన తర్వాత అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ముందుగా మహిళా జవాన్లతో కూడిన భద్రతా దళాలు అడవుల్లోకి వెళ్లి, వాళ్లు అక్కడి ప్రజలతో కలసిపోతారు. ఆ తర్వాత అక్కడ భద్రతా దళాల క్యాంప్ ఏర్పడుతుంది. ఆ వెంటనే ఆ గ్రామానికి కరెంటు వస్తుంది. అనంతరం రోడ్డు నిర్మాణ పనులు మొదలవుతాయి. వీటికి సమాంతరంగా మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ పనులన్నీ శరవేగంగా జరిగిపోతాయి. ఆ తర్వాత అక్కడ కొంతమంది సభ్యులను ఉంచేసి మిగిలిన దళ సభ్యులు ముందుకు సాగుతారు. రోడ్డు, కరెంటు సౌకర్యాలు వచ్చిన గ్రామాల్లోకి దశల వారీగా స్కూళ్లు, ఆస్పత్రులు తదితర వసతులూ అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో.. మానవ హక్కుల సంఘాల ఆరోపణలూ అంతగా వినిపించడంలేదని పరిశీలకుల అభిప్రాయం. ఎన్నికల విధుల్లో.. బస్తర్ ప్రాంతంగా చెప్పుకునే ఏడు జిల్లాల పరిధిలో మహిళా కమెండోలను ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. ఇప్పుడు మహిళా దళాల్లో చేరే వారికి పద్దెనిమిది నెలల శిక్షణ కాలాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 450 మందికి పైగా మహిళా కమెండోలు ఛత్తీస్‌గఢ్‌లో పని చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. దట్టమైన అడవుల్లో ఉన్న 35 పోలింగ్ బూత్‌ల రక్షణ బాధ్యతను మహిళా కమెండోలకే అప్పగించింది ఎన్నికల సంఘం. ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా ఆ 35 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సాఫీగా సాగాయి. ఆదివాసీలంతా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఘనత మహిళా కమెండోలదే! మహారాష్ట్రలో.. ఛత్తీస్‌గఢ్‌లో మహిళా కమెండోలు తెచ్చిన మార్పు ఇతర రాష్ట్రాలనూ ఆలోచింపచేసింది. దండకారణ్యంలో భాగంగా ఉండే మçహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలోనూ మహిళా కమెండో దళాన్ని నెలకొల్పారు. పదకొండు మంది సభ్యులతో కూడిన ఈ దళం గడ్చిరోలి జిల్లా వంగేటూరి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, దేశ సైనికదళంలోనూ మహిళా కమెండోలు తమ సత్తా చూపిస్తున్నారు. మొత్తానికి.. కరకుదనం ఖాకీ సొత్తు. కరడుగట్టిన కాఠిన్యానికి సైన్యం చిరునామా! ఈ రెండిటితో పరిచయమేలేనిది మహిళ! తోటి వాళ్లను వినగలిగే ఓర్పు, అవతలి వాళ్ల కోణంలోంచి ఆలోచించగలిగే నేర్పు, ఎదుటి వాళ్ల బాధను అర్థం చేసుకోగలిగే దయ, వీటన్నిటినీ మించి ఏటికి ఎదురీదగల ధైర్యంతోనే ఆయుధాలకు సాధ్యం కాని మార్పును తీసుకురాగలిగింది. తూటాలతో దద్దరిల్లిన ప్రాంతంలో సంతోషాల సవ్వళ్లు వినిపించేలా చేస్తోంది. ల్యాండ్ మైన్స్ నాటుకున్న ప్రదేశాల్లో శాంతిని పండించగలుగుతోంది. – కృష్ణగోవింద్ ఇవి చదవండి: అందమైన జీవితం కోసం ఐన్ స్టీన్ సూత్రాలు -
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా టోర్నమెంట్
-
క్వీన్స్ ఎక్స్‌ప్రెస్
‘టికెట్ కలెక్టర్‌గా అమ్మాయి!’‘ట్రైన్ డ్రైవర్ అమ్మాయట!’‘ట్రైన్ గార్డ్‌గా అమ్మాయి!’... ఇలాంటి ఎన్నో ఆశ్చర్యాలను చూసింది కాలం.వివిధ హోదాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్న వారిని చూసి గర్వించింది కాలం.పరుగెత్తే కాలంలో ప్రత్యేక సందర్భాలు ఉంటాయి. ఆరోజు అచ్చంగా అలాంటిదే! కాస్త సరదాగా చెప్పుకోవాలంటే ‘కన్నుల పండగ’ అనేది పండగరోజు మాత్రమే రావాల్సిన అవసరం లేదు. ప్రత్యేక దినాలలో కూడా రావచ్చు. మొన్నటి మహిళా దినోత్సవం రోజు అలాంటి కన్నుల పండగ జరిగింది.సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ అందరూ మహిళలే ఉన్న బృందానికి ముంబై–పుణె దక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించే బాధ్యతను అప్పగించింది. ఆరోజు ఆ ట్రైన్‌లోకి అడుగు పెడితే...డ్రైవర్ సీట్లో దర్జాగా కూర్చున్న లోకో–పైలట్ సురేఖ యాదవ్, టికెట్ కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న నీతు, రుబినా, బీనా, సురక్ష, జెన్, దీపలతో రైలు కొత్తగా కనిపించింది.‘ఈరోజు నిజంగా మరిచిపోలేని రోజు. రైలును మహిళలే నడిపిస్తున్నారనే భావన గర్వంగా ఉంది. నా వృత్తిజీవితంలో ఇది గుర్తుంచుకోదగిన రోజు’ అంటుంది లోకో–పైలట్ సురేఖ యాదవ్. లోకో–పైలట్‌గా వృత్తిజీవితంలోకి అడుగుపెట్టడానికి ముందు...‘అది కఠినమైన వృత్తి. ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. మహిళలకు ఎంతమాత్రం సరిపడని వృత్తి’ అని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు.వాటిని పట్టించుకొని ఉంటే ఆమె పేరు పక్కన ‘లోకో–పైలట్’ అనే విశేషణం గర్వంగా కాలర్ ఎగరేసేది కాదు.‘ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావాలి’ అంటుంది అసిస్టెంట్–లోకో పైలట్ లీనా ఫ్రాన్సిస్. చిన్నప్పుడెప్పుడో ట్రైన్ ముందు బోగీలో గంభీరంగా కూర్చున్న డ్రైవర్‌ను చూసిన తరువాత తాను కూడా డ్రైవర్ కావాలనుకుంది.‘అలా కుదరదు. వీలు కాదు’ అనే మాటల మధ్య కూడా తన ఆశను కోల్పోలేదు.వృత్తిజీవితంలోకి అడుగుపెట్టిన తరువాత కూడా ‘హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని చేసే ఉద్యోగం కాకుండా ఈ ఉద్యోగం ఎందుకు ఎంచుకున్నావు తల్లీ. ట్రైన్ యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. జాగ్రత్త’ అన్నవాళ్లు కూడా ఉన్నారు. శుభమా అని ఉద్యోగంలోకి అడుగు పెడుతుంటే ఈ మాటలేమిటని లీనా ఫ్రాన్సిస్ చిన్న బుచ్చుకోలేదు. ‘వాళ్లంతేలే!’ అని మాత్రమే అనుకుంది.సురేఖ యాదవ్ నుంచి రుబినా వరకు తమకు ఇష్టమైన వృత్తిలోకి రావడానికి ముందు ఎంతో కష్టపడి ఉంటారు. అందుకే ఈ బండి ప్రయాణికులనే కాదు వారి విజయాలను కూడా మోసుకుంటూ వెళ్లింది! -
మళ్లీ కశ్మీర్‌పై పాక్ ఏడుపు
ఐక్యరాజ్య సమితి: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఒక చర్చాకార్యక్రమంలోనూ కశ్మీర్ అంశాన్ని లేవదీసి పాకిస్తాన్ భారత్‌పై తన అక్కసును మరోసారి వెళ్లబోసుకుంది. దీంతో భారత్ ఘాటుగా స్పందించింది. పాకిస్తాన్ చేసే ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలకు కనీసం స్పందించాల్సిన అవసరం తమకు లేదని భారత్ తేల్చిచెప్పింది. నెలపాటు మొజాంబిక్ దేశ అధ్యక్షతన ఐరాస భద్రతా మండలిలో సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగానే ‘ మహిళలు, శాంతి, భద్రత’ అంశంపై చర్చలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అసంబద్ధంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ఆ తర్వాత ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంభోజ్ మాట్లాడారు. ‘ బిలావల్ వ్యాఖ్యానాలు పూర్తిగా నిరాధారం. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిన ప్రసంగమిది. మహిళలకు భద్రతపై చర్చాకార్యక్రమాన్ని మేం గౌరవిస్తున్నాం. మహిళా దినోత్సవ కాల విలువకు గుర్తించాం. ఈ అంశంపైనే మనం దృష్టిసారిద్దాం. అసందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై కనీసం స్పందించాల్సిన అగత్యం భారత్‌కు లేదు. గతంలో చెప్పాం. ఇప్పుడూ, ఇకమీదటా చెప్పేది ఒక్కటే. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమే. దాయాదిదేశం పాక్‌తో పొరుగుదేశ సంబంధాలను సాధారణస్థాయిలో కొనసాగించాలని భారత్ మొదట్నుంచీ ఆశిస్తోంది. అలాంటి వాతావరణం నెలకొనేలా చూడాల్సిన బాధ్యత పాక్‌పై ఉంది. కానీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారి శత్రుత్వాన్ని పెంచుకుంటోంది’ అని రుచిరా ఘాటుగా వ్యాఖ్యానించారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై దారుణ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని బాలాకోట్‌లో కొనసాగుతున్న జైషే మొహమ్మద్ ఉగ్ర శిబిరంపై భారత వాయుసేన మెరుపుదాడి తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీశాక భారత్‌పై పాక్ ఆక్రోశం మరింతగా ఎగసింది. -
ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్!
భారత బ్యాంకింగ్ రంగంలో మహిళలు కీలక స్థానాలను అధిరోహించారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను విజయవంతంగా నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే మహిళ అధినేత్రిగా ఉన్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి కొన్ని ఇతర బ్యాంకుల్లో డైరెక్టర్, మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏకైక మహిళా సీఈవో, ఎండీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుతం మణిమేఖలై సీఈవో, ఎండీగా ఉన్నారు. చురుకైన నిర్ణయాలతో బ్యాంకును విజయవంతంగా నడిపిస్తున్నారు. 1988లో విజయా బ్యాంక్‌లో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె అక్కడ ఆమె పలు కీలక పదవులు నిర్వహించారు. 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్ విలీనం అయిన తర్వాత ప్రభుత్వం ఆమెను కెనరా బ్యాంక్‌లో మూడేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించింది. ఇందులో ఆమె వ్యూహాత్మక ప్రణాళిక, క్రెడిట్ సంబంధిత అంశాలు, తనిఖీ, మార్కెటింగ్, ఫైనాన్సియల్ ఇన్‌క్లూషన్, రాష్ట్ర స్థాయి లీడ్ బ్యాంక్ బాధ్యతలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరును పర్యవేక్షించారు. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ల విలీనంలో కీలక పాత్ర పోషించారు. కాన్‌బ్యాంక్ ఫ్యాక్టర్స్, కాన్‌బ్యాంక్ కంప్యూటర్ సర్వీసెస్, కెనరా హెచ్ఎస్బీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్సూరెన్, జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీలలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఆమెకు విశేష అనుభవం ఉంది. అలాగే కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ సంస్థకు ట్రస్టీగా వ్యవహరించారు. మణిమేఖలై బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (మార్కెటింగ్) పట్టా పొందారు. ముంబైలోని నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో డిప్లొమా పూర్తి చేశారు. ఇతర బ్యాంకుల్లో.. కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి మరికొన్ని బ్యాంకుల్లో డైరెక్టరియల్, మేనేజ్మెంట్ వంటి కీలక స్థానాల్లో మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బిజినెస్ ఫైనాన్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గ్రూప్ హెడ్‌గా అషిమా భట్ సేవలు అందిస్తున్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ వినియోగదారుల బ్యాంకింగ్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా శాంతి ఏకాంబరం ఉన్నారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ డైరెక్టర్లలో బృందా జాగీర్దార్ ఒకరు. గతంలోనూ అరుంధతీ భట్టాచార్య, ఉషా అనంతసుబ్రమణియన్, పద్మజ చుండూరు, శిఖా శర్మ, చందా కొచర్ వంటి వారు పలు బ్యాంకులకు నాయకత్వం వహించారు. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! -
Womens Day: వనిత జీవితం మనందరికీ ఆదర్శం.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన వనిత గారి జీవితం మనందరికీ ఆదర్శం అంటూ ట్వీట్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన వనిత తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం చేస్తూ సమాజానికి ప్రేరణగా నిలిచారంటూ కొనియాడారు. వనితతోపాటు మహిళాలోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని, తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం చేస్తూ సమాజానికి ప్రేరణగా నిలిచిన చిత్తూరు జిల్లాకు చెందిన వనిత గారి జీవితం మనకు ఆదర్శం. వనిత గారికి, మరియు రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.#InternationalWomensDay pic.twitter.com/rtRHf3O1pF — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2023 ఈ వీడియోలో వనిత ఏం చెప్పారంటే.. వివాహమయ్యాక ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో భర్తతో తనకు గొడవలు అయ్యి పుట్టింటికి వెళ్లిపోయినట్లు టీ వనిత తెలిపారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం తనపైనే పడిందన్నారు. కష్టాల్లో ఉన్న తనకు వలంటీర్ ఉద్యోగం ఇప్పించారని పేర్కొన్నారు. ఆసరా డబ్బులు, సున్నా వడ్డీ డబ్బులు, అమ్మఒడి డబ్బులు అన్నీ అందుతున్నాయని వివరించారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న తన జీవితంలో సీఎం జగన్ వెలుగులు నింపారని చెప్పారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కొలమానం: సీఎం జగన్ -
పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న మహిళామణులు
-
ఉమెన్స్ డే స్పెషల్: తెలంగాణలో ఆరోగ్య మహిళ పథకం ప్రారంభం
సాక్షి, కరీంనగర్: మహిళా దినోత్సవం సందర్బంగా ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆరోగ్య మహిళ పథకాన్ని కరీంనగర్లో ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ పథకం కింద 100 ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకు ముందు ఆరోగ్య మహిళ కిట్‌ను, లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆరోగ్య మహిళ పథకంలో ఎనిమిది రకాలు సేవలు అందించునున్నారు. ప్రతీ మహిళా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. వాటి పరిష్కారం కోసమే ఈ పథకం తీసుకువచ్చినట్టు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదట 100 ఆరోగ్య మహిళ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి సంఖ్య పెంచుతామన్నారు. పెద్ద ఆసుపత్రుల్లో అందించే చికిత్సలు కూడా ఇక్కడ లభిస్తాయన్నారు. శ్రీరామ నవమి తరువాత న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలు గర్భం దాల్చిన తర్వాత వారికి పోషకాహరం కోసం న్యూట్రిషన్ కిట్ ఇవ్వనున్నట్టు చెప్పారు. మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను అందిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆరోగ్య మహిళ కార్యక్రమంతో మహిళల పక్షపాతిగా నిలిచారన్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని జిల్లాలలోనూ ఆరోగ్య మహళ క్లినిక్ లను ఆయా జిల్లాలలోని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తున్నారని తెలిపారు. -
ఫిలిం మేకింగ్‌లోకి ‘మేడమ్స్’.. ప్రొడ్యుసర్స్‌గా రాణిస్తున్న నారీమణులు
ఒక సినిమాను నిర్మించాలంటే చాలా కష్టం. కేవలం డబ్బు పెడితే సరిపోదు..ఎంతో మందిని మేనేజ్ చేయాలి...ఎన్నో టెన్షన్స్ పడాలి. అందుకే సినిమా నిర్మాణ విషయంలో మహిళలు దూరంగా ఉండేవారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ప్రతి విభాగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా నిర్మాణ రంగంలో లేడీ ప్రొడ్యూసర్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కంటెంట్ ఉన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ...నిర్మాతలుగా దూసుకుపోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకొని ఫిలిం మేకింగ్(నిర్మాణం)లో రాణిస్తున్న ‘మేడమ్స్’ గురించి తెలుసుకుందాం. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు నిర్మించాడు. అశ్వనీదత్ కుమార్తెలు స్వప్నదత్...ప్రియాంక దత్. ఈ ఇద్దరు ఇండస్ట్రీలో నెంబర్ వన్ లేడీ ప్రొడ్యూసర్స్ అనే చెప్పాలి. స్వప్న సినిమాస్ బ్యానర్ స్థాపించి భారీ చిత్రాలను నిర్మించటమే కాదు..బిగ్గెస్ట్ హిట్స్ కూడా అందుకున్నారు. డైరెక్టర్ నాగ్అశ్విన్ తో మహానటి నిర్మించిన ఈ లేడీ ప్రొడ్యూసర్స్...సేమ్ డైరెక్టర్ తో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 500 కోట్లు బడ్జెట్ కేటాయించారు. సమంత నటిస్తున్న మైధిలాజికల్ మూవీ శాకుంతలం...ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. తన తండ్రి గుణశేఖర్ సినిమాలకు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తోంది. రుద్రమదేవి సినిమాకి కూడా నీలిమ గుణ ప్రొడ్యూసర్ గా చేసింది. నిన్నటి వరకు చిరంజీవి సినిమాలకు , క్యాస్టూమ్స్ డిజైనర్ గా ఉన్న మెగాస్టార్ డాటర్ సుస్మిత కొణిదెల కూడా ప్రొడ్యూసర్ గా మారింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షూట్ అవుట్ ఎట్ ఆలేర్ లాంటి వెబ్ సిరీస్ తో పాటు ..సేనాపతి, శ్రీదేవి శోభన్ బాబు సినిమాలు నిర్మించారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు డాటర్..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సిస్టర్ ప్రసీద కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో అడుగుపెట్టింది. ప్రసీద..ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీకి కో-ప్రొడ్యూసర్ గా వర్క్ చేసింది. అలాగే ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ కూతురు, దివ్య దీప్తి నిర్మాతగా మారి... హీరో కిరణ్ అబ్బవరంతో నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ నిర్మించింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి కూడా నిర్మాణ రంగంపై దృష్టి సారిస్తున్నారు. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘దిల్’ రాజు డిజిటల్ కంటెంట్‌ను నిర్మిస్తున్నారు. మరో నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ కూడా ప్రొడ్యూసర్స్ గా సినిమాలు నిర్మిస్తున్నారు. కేవలం సినిమాల మీద ఇంట్రెస్ట్ తో డైరెక్టర్ వెంకటేష్ మహా ను నమ్మి...ప్రొడ్యూసర్ గామారింది పరుచూరి విజయ ప్రవీణ. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో నిర్మాతగా మారిన ఈమె వరుసగా సినిమాలను నిర్మిస్తోంది. ఏడిద నాగేశ్వరరావు వారసురాలిగా ఆయన మనవరాలు ఏడిద శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రం ద్వారా నిర్మాతగా తొలి అడుగు వేశారు.. వీళ్లే కాదు..కొంతమంది హీరోయిన్స్ కూడా ప్రొడ్యూసర్స్ గా...కో ప్రొడ్యూసర్ గా మారుతున్నారు. హీరోయిన్ చార్మి నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా సెటిలైపోయింది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. హీరోయిన్ అవికా గోర్ పాప్ కార్న్ సినిమాని తనే సొంతంగా నిర్మించింది. -
IWD 2023: అటు ఇటు అన్నింటా.. మగువా జగమంతా..! (ఫొటోలు)
-
మహిళా దినోత్సవ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
మహిళా దినోత్సవ సందర్భంగా చిత్తూరు మేయర్ పై స్పెషల్ స్టోరీ
-
మహిళాజర్నలిస్టుల కోసం స్పెషల్ యాక్సిలేటరీ ప్రోగ్రాం
ఖైరతాబాద్: మహిళాజర్నలిస్టులను మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున వి హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాక్సిలేటరీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కె.తారకరామారావు తెలిపారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్‌ప్లాజాలో మహిళాజర్నలిస్టులను మంత్రి కేటీఆర్, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సన్మానించారు. కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మంత్రులు జగదీష్ రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులతో కలిసి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళా జర్నలిజం అంటే కత్తిమీద సాములాంటిది. అలాంటి వారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎల్రక్టానిక్, ప్రింట్ మీడియాలతో పాటు డిజిటల్ మీడియాలో రాణిస్తున్న మహిళా జర్నలిస్టులను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరి, మున్సిఫల్ అడ్మిని్రస్టేషన్ అరవింద్ కుమార్, చీఫ్ విఫ్ బాల్కసుమన్, ఎమ్మెల్యే చందర్లతో పాటు అధికారులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా సాక్షి టీవీ తరపున పద్మావతి, సుస్మిత, కావేరి, సాక్షి దినపత్రిక నుంచి కట్ట కవిత, డి.జి.భవానీ, వి.మంజుల, జి.నిర్మల, ఎస్.సరస్వతి రమలను సన్మానించారు. -
WPL 2023: క్రికెట్.. బిర్యానీ.. అంతే..!: విశాఖ క్రికెటర్ షబ్నమ్
WPL 2023- Shabnam- Gujarat Giants: ఎనిమిదేళ్ళవయసులో సరదాగా తండ్రితో గ్రౌండ్‌కు వెళ్ళేది. అక్కడ కొంతమంది అమ్మాయిలు క్రికెట్ ఆడుతుంటే ఎంతో ఆసక్తిగా చూసేది. ఓ రోజు తనకూ క్రికెట్ ఆడాలనివుందనే అభిలాషను వ్యక్తపరిచింది. తల్లిదండ్రులుప్రోత్సహించడంతో క్రికెట్ బాల్ అందుకుంది. నేడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ తరపున ఉమెన్ ప్రీమియర్ లీగ్ స్థాయికి ఎదిగిపోయింది. ఇటీవల అండర్19 టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ సొంతం చేసుకున్న జట్టుకు ఆడింది. ఆరేళ్లలోనే తన మీడియం పేస్‌తో ప్రత్యర్థుల్ని బెంబెలెత్తించే స్థాయికి చేరుకుంది విశాఖ ఉమెన్ క్రికెటర్ షబ్నమ్ మహ్మాద్ షకీల్. ఆటే శ్వాసగా రాణిస్తున్న రైట్ ఆర్మ్ మీడియం పేసర్ షబ్నమ్ మహిళా దినోత్సవసందర్భంగా తన అంతరంగాన్ని సాక్షితో పంచుకుంది. క్రికెట్ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది... 2017లో క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేసవి శిబిరాల్లో పా ల్గొన్నాను. నాకు మొదట్నించీ బ్యాటింగ్ కంటే బౌలింగ్‌లోనే ఇష్టం ఉండేది. రెండేళ్ళలో మీడియం పేసర్‌గా ఎదిగాను. పేస్‌లో వేరియేషన్స్‌తో బంతులు విసురుతుండటంతో అండర్ 16 జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. అనతికాలంలోనే ఆంధ్రజట్టుకు ఆడాను. రైల్వేస్ జట్టుతో ప్రాక్టీస్‌లో నెట్‌బౌలర్‌గా సీనియర్స్‌తో ఎలా ఆడాలో నేర్చుకున్నాను. అనంతరం ఏకంగా ఉమెన్ అండర్ 19 వరల్డ్‌కప్, జాతీయ జట్టుకు ఎంపికయ్యాను. ప్రస్తుతం ఉమెన్ ఐపీఎల్లో గుజరాత్ జెయింట్స్‌కు ఆడుతున్నాను. చదువెలా సాగుతోంది... పదో తరగతి చదువుతున్నాను. ఏప్రిల్‌లో పరీక్షలున్నాయి. ఉమెన్ ఐపీఎల్ పూర్తికాగానే పరీక్షలు రాస్తాను. మా టీచర్లు ఓ ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేశారు. సబ్జెక్ట్ డౌట్స్ వివరిస్తుంటారు. ప్రాక్టీస్, పా ఠాలు ఏకకాలంలో సాగుతున్నాయి. ప్రస్తుతం ఉమెన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ తరపున ఆడుతూ ముంబయ్‌లో ఉన్నాను. ఇటీవలే అండర్ 19 ఉమెన్ వరల్డ్ కప్‌లోనూ ఆడాను. ప్రస్తుత లక్ష్యం... సీనియర్ ఉమెన్ జట్టులో ఇండియా తరపున ఆడటమే నా లక్ష్యం. అండర్–19 వరల్డ్‌కప్‌కు ఆడిన జట్లలో నేనే చిన్నదానిని. ఇప్పుడు ప్రీమియర్ లీగ్‌లోనూ చిన్న దాన్ని. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమెన్ ఐపీఎల్‌కు ఎంపికైన తొలి క్రికెటర్‌ను. పదినేహేళ్ల ప్రాయంలోనే ఇది సాధ్యపడటం చాలా సంతోషాన్నిచ్చింది. జూనియర్ వుమెన్ టీ20 వరల్డ్‌కప్‌లో... జూనియర్స్ వరల్డ్‌కప్ ఆడుతున్నప్పుడు, సీనియర్ల నుంచి చాలా సలహాలు తీసుకున్నాను. కోచ్‌లు నీనియర్ సభ్యులు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని, అప్పుడే ఎక్స్పోజర్ వస్తుందని సూచించారు. ముందు మన బలహీనతలు తెలుసుకుని, వాటి ని అధిగమించాలని కూడా చె΄్పారు. అందుకు తగినట్టు గానే మ్యాచ్‌ల్లో సీనియర్స్‌ను జాగ్రత్తగా గమనిస్తున్నాను. అందరిలోకి చిన్నదాన్ని కావడంతో ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారు. ఇన్స్పిరేషన్ ఎవరు... జులన్ గోస్వామి ఆట తీరును జాగ్రత్తగా గమనిస్తుంటాను. ఫాస్ట్ బౌలింగ్‌లో ఆమె నా స్ఫూర్తి. ఏ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారు? యూనిఫామ్ వేనుకునే జాబ్ చేయాలనేది నా ఆకాంక్ష. దేశం పట్ల నాకు చాలా గౌరవం. డిఫెన్స్, పోలీస్ లాంటి రంగాల్లో పని చేయాలని ఉంది. మీ హాబీలేంటి? నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటేనే ఇష్టం ఏర్పడటంతో మిగిలిన విషయాల పట్ల పెద్దగా ఆసక్తి కలగలేదు. అందుకే హాలిడే ఎంజాయ్ చేయాలని, ఏవైనా కొత్త ప్రదేశాలకు వెళ్లాలనే ఆలోచన కూడా రాలేదు. నాన్న షకీల్ తన జట్టుకు ఆడుతుంటే సరదాగా చెల్లెలు షాజహానాతో కలిసి కామెంటరీ చెప్పేదాన్ని. అలా సరదాగా ప్రారంభమైన నా క్రికెట్ కెరీర్ నేడు ప్రీమియర్ లీగ్, జూనియర్ వరల్డ్ కప్ ఆడేస్థాయికి చేరింది. మ్యాచ్‌లలో భాగంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళాను తప్ప ప్రదేశాలను చూడడం కోసం ఎక్కడికీ వెళ్లలేదు. ఏ రంగు ఇష్టం? నీలం రంగు అంటే ఇష్టం. లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటూ ఉంటాను. ఇక బాగా ఇష్టమైనది నిద్ర. ఖాళీ దొరికితే ఎక్కువగా పడుకుంటాను. సరదాగా మ్యాచ్‌లు చూసే స్థాయి నుంచి సీరియస్‌గా మ్యాచ్‌లాడే స్థాయికి ఎదగడంతో తీరిక అనేది ఉండటం లేదు. ఈ నెల 27న తిరిగి విశాఖ చేరుకోగానే పరీక్షలపై దృష్టి పెట్టాలి. చెస్, బ్యాడ్మింటన్ సరదాగా ఆడుతుంటాను. డైట్ ఎలా? నాకు బిరియానీ అంటే ఇష్టం. అమ్మ రాత్రికి పుల్కాల్లో రకరకాల వంటలు చేస్తుంది. డైట్ పట్ల చాలా శ్రద్ధ వహిస్తాను. ఆహారసూచనలను పా టిస్తాను. డ్రైప్రూట్స్ ఎక్కువగా తీసుకుంటాను. స్వీట్స్ జోలికి వెళ్ళను. ఎలాంటి సినిమాలిష్టం? సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి లేదు. ఇప్పటివరకు ఆట, చదువే నా లోకం. కానీ ఆటల మీద వచ్చిన సినిమాల్ని చూస్తాను. ఉదయాన్నే ఐదుగంటల కల్లా ప్రాక్టీస్ చేసుకోవడానికి గ్రౌండ్‌కు వెళ్తాను. కోచ్‌లు చెప్పిన వాటిని తూచ తప్పకుండా ఆచరించడం. వీలు దొరికినప్పుడల్లా సబ్జెక్ట్ బుక్స్ ముందేసుకు కూర్చోవడమే ప్రస్తుత నా దినచర్య. – డాక్టర్ ఎ. సూర్యప్రకాశరావు మాడిమి, విశాఖపట్నం -
9 సార్లు కీమోథెరపీ..అంతలోనే మరో రొమ్ముకి కూడా కేన్సర్: హంసా నందిని
‘‘కేన్సర్ అని నిర్ధారణ అయ్యాక గతం తాలూకు భయాలు, అయోమయాలు, ఒత్తిడి... అన్నీ మళ్లీ నన్ను చుట్టుముట్టినట్లు అనిపించింది. పలుమార్లు వైద్య పరీక్షలు, పలు స్కానింగ్స్ చేయించుకుని, శస్త్ర చికిత్స పూర్తయ్యాక ఇక ఏ భయం లేదు అనుకుంటున్న సమయంలో మరో రొమ్ముకి కూడా కేన్సర్ సోకే ప్రమాదం ఉందని నిర్ధారణ అయింది. మళ్లీ పోరాటం ఆరంభం’’ అని హంసా నందిని చెప్పా రు. 2020లో ఆమెకు గ్రేడ్ 3 ‘కార్సినోమా’ (రొమ్ము కేన్సర్) నిర్ధారణ అయింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా హంసా నందిని ఆ సంగతులు పంచుకున్నారు. ‘‘18 ఏళ్ల క్రితం మా అమ్మగారికి బ్రెస్ట్ కేన్సర్ అని నిర్ధారణ అయింది. దురదృష్టం కొద్దీ ఆ పో రాటంలో ఆమె ఓడిపోయారు. ఇక నాకు కేన్సర్ నిర్ధారణ అయ్యాక 9 సార్లు కీమోథెరపీ జరిగింది. ఈ క్లిష్ట పరిస్థితి ముగిసిందనుకున్నాను. కానీ ఆ ఆనందం కొన్నాళ్లే. ఎందుకంటే ‘బీఆర్సీఏ1’ (వంశపారంపర్య రొమ్ము కేన్సర్) అని, జీవితంలో మరో రొమ్ముకి కూడా 70 శాతం కేన్సర్ సోకే ప్రమాదం ఉందని తేలింది. దాంతో పలు శస్త్ర చికిత్సలు, మరో ఏడు సార్లు కీమోథెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. నిజానికి ఇది ఎంతో సవాల్‌తో కూడుకున్నది. అందుకే ‘చిరునవ్వుతో పోరాడాలి. మళ్లీ స్క్రీన్ మీద (నటించాలి) కనబడాలి. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచేలా మన జీవితం గురించి చెప్పా లి’ అని నాకు నేనుగా వాగ్దానం చేసుకున్నాను. నేను జీవించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ముందుగా రోగ నిర్ధారణ కావడం, మంచి డాక్టర్లు, నా ఫ్యామిలీ, నా పాజిటివ్ మైండ్ కారణం. గత నవంబర్‌లో షూటింగ్ సెట్లోకి కూడా అడుగుపెట్టాను. ఎప్పటికప్పుడు అందరూ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి. నేను సజీవంగా ఉన్నందుకు ఈ విశ్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను. కీమోథెరపీ చేయించుకుంటున్నప్పుడు నాకు నేనుగా ఓప్రామిస్ చేసుకున్నాను. ‘ప్రతి నిమిషాన్ని ఇదే చివరి నిమిషం అనుకుని బతకాలన్నది’ ఆప్రామిస్. ఈ సందర్భంగా మా అమ్మగారి పేరు మీద ‘యామినీ కేన్సర్ ఫౌండేషన్’ని ఆరంభించాలనుకుంటున్న విషయాన్ని ఆనందంగా పంచుకుంటున్నాను. -
రంగుల ప్రపంచంలో వెండితెరను ఏలిన మహిళా దర్శకులు..
సినిమాకు కెప్టెన్ డైరెక్టర్. 24 క్రాప్టులను సమన్వయపరుస్తూ సినిమాను రూపొందించాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే దర్శకత్వ విభాగంలోనూ తొలితరం నుంచే తమదైన ముద్ర వేశారు మహిళా దర్శకులు. మరికొంత మంది నటిగా వెండితెరకు పరిచయమైనా, ఆ తర్వాత దర్శకురాలిగానూ సత్తాచాటారు. మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళా దర్శకులపై స్పెషల్ స్టోరీ. సావిత్రి మహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉండగానే చిన్నారి పాపలు, మాతృ దేవత, వింత సంసారం వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించి సత్తా చాటారు. జీవితా రాజశేఖర్ జీవితా రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అరంగేట్రం చేసిన జానకి రాముడు, ఆహుతి, అంకుశం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. 1990లో డా.రాజశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నటనకు దూరమైన ఆమె శేషు సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత సత్యమేవజయతే, మహంకాళి, శేఖర్ వంటి సినిమాలను రూపొందించారు. తాజాగా 33 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి నటిగా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. విజయనిర్మల విజయనిర్మల తన ఏడో ఏటనే ‘మత్స్యరేఖ’అనే సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన ఆమె.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. 1971లో ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా 44 సినిమాలకు తెరకెక్కించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా2002లో గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం. నందినీ రెడ్డి అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా మారింది నందినీ రెడ్డి. తొలి సినిమాతోనే ఆమె డైరెక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత జబర్ధస్థ్, కల్యాణ వైభోగమే వంటి చిత్రాలు తెరకెక్కించింది. సమంతతో తీసిన ఓ బేబీ సినిమా దర్శకురాలిగా నందినీరెడ్డిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా అన్నీ మంచి శకునములే అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. మంజుల ఘట్టమనేని సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మంజుల ఘట్టమనేని. తొలుత మళయాళ చిత్రం ‘సమ్మర్ ఇన్ బెత్లేహామ్’లో నటించిన ఆమె ఆ తర్వాత తొలిసారిగా ‘షో’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత నాని, పోకిరి,కావ్యాస్ డైరీ వంటి చిత్రాలను నిర్మించింది. మెగాఫోన్ పట్టి ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘ఆరెంజ్, సేవకుడు, మళ్ళీ మొదలైంది’ వంటి సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం నిర్మాతగా, నటిగా, దర్శకురాలిగా కొనసాగుతున్నారు. సుధా కొంగర ఒకప్పుడు విమర్శించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నారు డైరెక్టర్ సుధా కొంగర.2008లో కృష్ణ భగవాన్ హీరోగా వచ్చిన ఆంధ్రా అందగాడు సినిమాతో దర్శకురాలిగా మారింది సుధా కొంగర. ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. ఆ తర్వాత ద్రోహి, గురు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2020లో సూర్య హీరోగా ఆకాశం నీ హద్దురా సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది సుధా కొంగర. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమా సూపర్ హిట్‌తో ఎంతోమంది స్టార్ హీరోలు ఆమెతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. -
నెక్లెస్‌రోడ్డులో రన్ ఫర్ విమెన్ (ఫొటోలు)
-
Ishita Sharma: మేమే మా ధైర్యం!
ముంబై జూహూ గ్రౌండ్స్‌లో విమెన్స్ డే సందర్భంగా 1500 మంది ఆడపిల్లలు కరాటేలో తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. వీళ్లంతా ఎవరో చదవండి... ‘మన దేశంలో 11 నుంచి 14 ఏళ్ల లోపు ఆడపిల్లలు రెండున్నర కోట్ల మంది ఉన్నారు. వీరు స్కూల్లో సైన్సు నేర్చుకున్నట్టు లెక్కలు నేర్చుకున్నట్టు ఆత్మరక్షణ ఎందుకు నేర్చుకోరు? ఎందుకు నేర్పించరు?’ అని అడుగుతుంది ఇషితా శర్మ. ముంబైలో డాన్స్ స్కూల్‌ను నడిపే ఇషితా శర్మ ఐదేళ్ల క్రితం ఒకరోజు రాత్రి కారులో వెళుతుంటే కొంతమంది పోకిరి కుర్రాళ్లు ఆమెను ఫాలో అయ్యారు. ముందామెకు ఏం చేయాలో తోచలేదు. భయపడింది. కాని చివరకు ధైర్యం కూడగట్టుకుని అద్దం దించి పెద్దగా అరిచింది. అంతే. వాళ్లు పారిపోయారు. ‘ఇంత వయసు వచ్చిన నేనే ఇలా భయపడ్డాను. చిన్నపిల్లలు ఎంత భయపడిపోతారో అనే ఆలోచన నాకు వచ్చింది’ అంటుందామె. ఈ ఆలోచన నుంచే ‘ముక్కా మార్’ ఆవిర్భవించింది. 11 నుంచి 14 ఏళ్ల లోపు ఆడపిల్లలకు కరాటే, కుంగ్ ఫూ వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పాలని అనుకుంది ఇషిత. తనకు తెలిసిన ఒక కరాటే మాస్టర్ని సహాయం అడిగింది. అతను అంగీకరించాడు. ముంబైలోని వెర్సోవా బీచ్‌లో ఐదుమంది ఆడపిల్లలతో 2018లో ‘ముక్కా మార్’ (దెబ్బ కొట్టు) కార్యక్రమం మొదలైంది. అయిదు పది, పది వంద అవడానికి ఎంతో సమయం పట్టలేదు. దేహం, గళం, బుద్ధి ‘ఆడపిల్లలు మగవాళ్ల కంటే బలహీనులు అనే భావనతోనే పెంచుతారు. అబ్బాయిలను మగాడిలా పోరాడు అంటారు. మేము– ఆడపిల్లను ఆడపిల్లలా పోరాడు అని చెబుతాం. ఆడపిల్ల ఎందులోనూ తక్కువ కాదు అని చెబుతాం. మన పెంపకంలో ఆడపిల్లకు ఏ అన్యాయం జరిగినా ఊరికే ఉండు, సహించు అనే బోధిస్తారు. మేము ఎదిరించు, నీ గళం వినిపించు, బుద్ధిని ఉపయోగించు అని చెబుతాం. ముఖ్యంగా హింసను ఎదిరించాలంటే ఈ మూడు తప్పవు’ అంటుంది ఇషిత. ‘ముక్కా మార్ శిక్షణలో చేరాక ఏదైనా ప్రమాదం వస్తే పెద్దగా అరిచి ప్రతిఘటించాలని, తర్వాత బుద్ధిని ఉపయోగించి అక్కడి నుంచి బయటపడాలని ఆ రెండూ సాధ్యం కాకపోతే శారీరకంగా తలపడి పోరాడాలని మాకు తెలిసొచ్చింది’ అని ఒక అమ్మాయి అంది. 1100 స్కూళ్లలో ‘ముక్కా మార్’ శిక్షణ అవసరం మహరాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ఎం.సి.జి.ఎం (మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై) పరిధిలోని 1100 పైగా స్కూళ్లలో ‘ముక్కా మార్’ కార్యకర్తలను వారానికి రెండు రోజులు ఆత్మరక్షణ విద్యలు నేర్పేందుకు ప్రోత్సహించింది. 6,7,8 తరగతులు విద్యార్థినులకు స్కూళ్లలో వారానికి రెండు రోజులు కరాటే, కుంగ్ ఫు, కుస్తీ క్లాసులు నేర్పిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ ద్వారా అంటే వాట్సప్ చాట్‌బోట్ ద్వారా క్లాసులు కొనసాగాయి. ఈ క్లాసులు దేశంలోని ఏ ప్రాంతం ఆడపిల్లలైనా నేర్చుకోవచ్చు. ఇప్పటికి ‘ముక్కా మార్’ ద్వారా 5 వేల మంది ఆడపిల్లలు నేరుగా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకున్నారు. ఆన్లైన్ ద్వారా 16 వేల మంది అమ్మాయిలు నేర్చుకున్నారు. దాదాపు 300 మంది మహిళా టీచర్లకు శిక్షణ ఇవ్వడం వల్ల ఆ టీచర్ల ద్వారా 50 వేల మంది ఆడపిల్లల వరకూ నేర్చుకుంటున్నారు. మన సమాజంలో రోజురోజుకూ ఆడపిల్లల మీద హింస, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. అయితే వాటికి భయపడి ఆడపిల్లను ఇంట దాచడం అంటే వారి భవిష్యత్తును నాశనం చేయడమేనని అంటుంది ఇషితా శర్మ. ‘వారు ధైర్యంగా సమాజంలో తిరగాలి. ప్రమాదం ఎదురైతే ఎదిరించేలా ఉండాలి. ఆత్మరక్షణ విద్యలు నేర్పడం ద్వారా మాత్రమే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి భయం పోతుంది’ అంటుందామె. నిజంగానే ప్రతి స్కూల్లో మేథ్స్ టీచర్, సైన్స్ టీచర్ ఉన్నట్టుగా ఆడపిల్లల కోసం ఒక కరాటే టీచర్ ఉండాలని ఈ విమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వాలు ఆలోచిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది. -
ఆడబిడ్డల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
దిల్సుఖ్నగర్: రాష్ట్రంలోని ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) తెలంగాణ స్టేట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్కేపురంలోని కిన్నెర గ్రాండ్ హోటల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత మహిళలు, యువతుల్లో భయాన్ని పోగొట్టి, వారిలో ధైర్యం నింపేందుకు షీ–టీమ్స్ ఏర్పాటు చేసిందన్నారు. మహిళలను తమను తాము రక్షించుకునేందుకు సిద్ధం కావాలన్నారు. అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు, దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా జీహెచ్ఎంసీలో అదనంగా మరో పది సీట్లు కేటాయించారన్నారు. మార్కెట్ కమిటీల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిం చి రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పిం చారన్నారు. ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ప్రతి మగవాడి విజయం వెనుక మహిళ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఒక మొక్క నాటాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఐవీఎఫ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళ రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, యాంకర్ రవి, బిగ్ బాస్ ఫేమ్ హిమాజా రెడ్డి, లహరి , ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, ఐవీఎఫ్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, ఐవీఎఫ్ మహిళా విభాగం ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, స్టేట్ ట్రెజరర్ కోడిప్యాక నారాయణ గుప్తా, యూత్ విభాగం నరేష్ గుప్తా, మహిళా విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ క్యాంపులు, సన్మానాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8 నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. సమాజంలో మహిళల శక్తిని, పాత్రను తెలిపేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలన్నారు. వారోత్సవాల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు వైద్య, ఇతర అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపుల నిర్వహణ, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. పురపాలికల్లో డ్రై కంపోస్ట్, కిచెన్ కాంపోస్టింగ్, నీటి సంరక్షణ తదితర రంగాల్లో ఆదర్శప్రాయంగా నిలుస్తున్న పురపాలక సిబ్బంది లేదా పట్టణంలోని మహిళలను ప్రత్యేకంగా గుర్తించి సన్మానించాలన్నారు. పట్టణాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తయారైన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల క్యాంపులు నిర్వహించాలని, ప్రభుత్వ రుణాలు, సబ్సిడీల వంటి వాటిని వినియోగించుకొని స్వయం సమృద్ధి సాధించిన వీధి వర్తకులు మొదలుకొని వివిధ రంగాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వరకు ప్రత్యేకంగా గుర్తించాలని మంత్రి సూచించారు. కంటివెలుగు ద్వారా పురపాలక శాఖలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా రక్షణ, ఆరోగ్య సంరక్షణ, సాధికారికత వంటి అంశాలపై చర్చాగోషు్టలు నిర్వహించి అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. వారోత్సవాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమాలను కూడా సిద్ధం చేయాలన్నారు. ఈ సంబరాలకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, మహిళా జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, మహి ళా జడ్జీలను ప్రత్యేక అతిథులుగా ఆహా్వనించాలన్నారు. మంత్రి ఆదేశంతో పురపాలక శాఖ మహిళా వారోత్సవాల కార్యాచరణను ప్రకటించింది. -
కదిలించే కావ్యం మహిళ
సృష్టిలో ఒక గొప్ప సృష్టి మహిళ. మహిళ గొప్పతనం గురించి గొప్పవాళ్లు ఎందరో ఎంతో గొప్పగా చెప్పారు. ఆ చెప్పినది అంతా మహిళ గొప్పతనానికి ఎంతమాత్రమూ న్యాయం చెయ్యలేదు, సరితూగలేదు. మహిళ గొప్పతనం గురించి ఎవ్వరూ గొప్పగా కాదుకదా తగినట్లుగా కూడా చెప్పలేదేమో? చెప్పలేరేమో?! అమ్మ అయింది, తోబుట్టువు ఆయింది, ఆలి అయింది; అడుగడుగునా మనతోడై నిలిచింది మహిళ. అనురాగం ఆప్యాయతల కలబోత అయిన మహిళ ఆనందానికి ఆలయం తానై వెలిసింది. మన ఉనికికి మూలం, మనుగడకు ఆలవాలం మహిళ. మూగిన జీవనచీకటిలో కాంతి మహిళ. మానవ బంధాలను, సంబంధాలను కలుపుతూ కదిలే కావ్యం మహిళ. మనల్ని కదిలించే కావ్యం మహిళ. మానవ జీవితకథకు ఇతివృత్తం మహిళ; మానవ జీవనకథనానికి గమనం మహిళ. మానవచరిత్రకు ఆత్మ మహిళ. అత్యుదాత్తతకు ఆకృతి మహిళ. తత్త్వంపరంగానూ, వ్యక్తిత్వంపరంగానూ, ప్రవర్తనపరంగానూ మహిళ ఎంతో విశిష్టమైంది. ‘మహిళ ఒకదాన్ని స్వీకరిస్తుంది ఆపై దాంతో సృజన చేస్తుంది; ఆ సృజన సూత్రం విశ్వంలోనే అత్యంత అద్భుతమైంది’ అని చైనీస్ తత్త్వవేత్త, కవి జుషి వందలయేళ్ల క్రితమే చెప్పా రు. ‘సారంలేని ఈ లోకంలో సారాన్ని ఇచ్చేది మహిళ అని తెలుసుకునే కాబోలు శివుడు తన అర్ధశరీరాన్ని మహిళకు ఇచ్చాడు’ అని ఒక పూర్వ సంస్కృతశ్లోకం మనకు చెబుతోంది. మనవాళ్లు మహిళకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు; మహిళకు ప్రశస్తమైన స్థానాన్ని ఇచ్చారు. వేదంలో ఒక వధువు, వరుడితో ‘‘నేను ఋక్ (సాహిత్యం), నువ్వు సామం (గానం)’’ అని అంటుంది. గానానికి సాహిత్యంలాగా మగవాడికి మహిళ ముఖ్యం. మహిళను సాహిత్యం అనడమే ఆమె గొప్పతనాన్ని చాటుతోంది. సాహిత్యం మనసుల్నీ, మస్తిష్కాల్నీ కదిలిస్తుంది. మహిళ కూడా అంతే. మన భారతదేశంలోని ఋషులలో రోమశ, లోపా ముద్ర, గార్గి, మైత్రేయి, అదితి, విశ్వనార, స్వస్తి, శశ్వతి, సూర్య, ఇంద్రాణి, శుచి, ఆపరి, ఉశన, గౌరివీతి, చైలకి, జయ, ్రపా దురాక్షి, మేధ, రమ్యాక్షి, లౌగాక్షి, వారుని, విదర్భి, విశ్వనార, వృష , సర్పరాజ్ఞి, సునీతి, హైమ ఇంకా కొందరు మహిళలు ఉండేవారు. కొన్ని మంత్రాలకు ఋషులైన మహిళలు ద్రష్టలు. వేదంలో ఒక మహిళ ‘‘నేను శిరస్సును, నేను జెండాను, నేను నిప్పుల మాటలు పలుకుతాను. నా భర్త నన్ను అనుసరించనీ’’ అంటుంది. ఈ మాటల్నిబట్టి వేదకాలంలో మహిళకు స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం నిండుగా ఉండేవని, మహిళకు విశేషమైన, ప్రత్యేకమైన స్థానాలు ఉండేవని తెలియవస్తోంది. ‘సమాజానికి, కుటుంబానికి మహిళ రక్షకురాలిగా వ్యవహరించాలి’ అనీ, ‘మహిళలు యుద్ధంలో పా ల్గొనాలి’ అనీ చెప్పిన వేదం ‘భర్తకు సంపా దించే మార్గాలు నేర్పించు’ అనీ మహిళకు చెబుతూ ఆమె ఆవశ్యకతను మనకు తెలియజేస్తోంది. ‘అదిశక్తి అంటూ శక్తి అంటే మహిళే అని మనకు తెలియ చెప్పడం జరిగింది. ‘శివుడు శక్తితో కలిస్తేనే జగత్తును సృష్టించే శక్తి కలవాడు అవుతాడు’ అని ఆదిశంకరులు సౌందర్యలహరిలో తెలియజెప్పా రు. మహిళ లేకపోతే శక్తే లేదు. మహిపై దేవుడి మహిమ వెల్లివిరిసింది, అది మహిళ అయింది. వ్యాఖ్యానించబడలేని ఔన్నత్యం ఒక మూర్తిమత్వాన్ని పొందింది; అదే మహిళ. మహిళను సరిగ్గా అర్థం చేసుకోవడం, సరిగ్గా గౌరవించడం మనం నేర్చుకోవాలి. సరైన మహిళకు సాటి సరైన మహిళతత్త్వమే. సరైన మహిళ లేదా సరైన మహిళతత్త్వం ప్రేరణ, స్ఫూర్తి కాగా మనం సరైన మనుగడ చెయ్యాలి. – రోచిష్మాన్ -
8న ‘ఆరోగ్య మహిళ’
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆరోగ్య మహిళ‘ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర మహిళలకు బహుమతిగా ఈ నెల 8న ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం బీఆర్కేఆర్ భవన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి మహిళా ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. దశలవారీగా విస్తరణ.. మొదటి దశలో వంద ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించి ఆపై 1,200 కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు. మహిళకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు కొనసాగుతాయన్నారు. రెఫరల్ ఆసుపత్రుల్లో మహిళలు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మార్చి 8న ప్రారంభించే ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాలని, ఇందుకు జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్వోలు చొరవ తీసుకోవాలన్నారు. సీపీఆర్‌పై విస్తృత ప్రచారం గుండెపోట్లు, కార్డియాక్ అరెస్ట్‌లకు గురైన వారిని సత్వరమే కాపాడటంలో దోహదపడే ప్రాథమిక చికిత్స కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. కరోనా తర్వాత సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరిగినట్లు వైద్య నిపుణులు, పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఇలా అరెస్ట్అయిన ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారని, అయితే సీపీఆర్ చేస్తే కనీసం ఐదుగురిని బతికించవచ్చన్నారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యేవారికి చికిత్సలో భాగంగా ఉపయోగించే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ)ల కోసం మొదటి దశలో రూ.18 కోట్లతో 1,200 పరికరాలు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వాటిని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. ‘కంటివెలుగు’ అందరికీ చేరాలి కంటివెలుగు పథకంలో భాగంగా అందిస్తున్న కంటి పరీక్షలు అందరికీ చేరాలని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇప్పటివరకు 63.82 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. మహిళలకు నిర్వహించే 8 పరీక్షలివే.. 1.మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు. 2. ఓరల్, సర్వ్యకిల్, రొమ్ము కేన్సర్ల స్క్రీనింగ్. 3. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషక లోపాల గుర్తింపు, అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం, విటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు, చికిత్స, మందులు. 4.మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు,పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు. 5.మెనోపాజ్ దశకు సంబంధించిన పరీక్షలు, అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, కౌన్సెలింగ్. 6. నెలసరి సమస్యలపై పరీక్షలు, సంతాన సమస్యలపై ప్రత్యేక పరీక్షలు, అవసరమైనవారికి అ్రల్టాసౌండ్ టెస్టులు. 7.సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు, అవగాహన. 8.బరువు నియంత్రణ, యోగా, వ్యాయామంపై అవగాహన -
ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. మహిళల కోసం స్పెషల్ ఆఫర్: ఎక్కడో తెలుసా?
సమ్మర్ ఆఫర్స్, ఫెస్టివల్ ఆఫర్స్ మాదిరిగానే రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ వండర్లా ఒక ప్రత్యేకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇది కేవలం మహిళల కోసం మాత్రమే. ఇందులో భాగంగానే ఆ రోజు ఒక టికెట్ కొంటె మరో టికెట్ ఉచితంగా పొందవచ్చు. వండర్లా ఎంట్రీ టికెట్ జిఎస్టితో కలిపి రూ. 999. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ధరకు మహిళలు రెండు టికెట్స్ పొందవచ్చు. మహిళలు సరదాగా ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడానికి ఈ రోజులలో ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మార్చి 8న 10 ఏళ్లకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులను అనుమతించరు. మార్చి 8న సరదాగా గడపాలనుకునే మహిళలు ఈ ఆఫర్‌తో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్లి కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ రుగు పురుషులు బుక్ చేసుకుంటే అనుమతించబడదు. బుక్ చేసుకున్న ఏ టికెట్ అయినా రద్దు చేస్తారు. వండర్లా హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన అన్ని అవసరమైన మార్గదర్శకాలను తప్పకుండా అనుసరిస్తుంది. పరిశుభ్రత, భద్రతలను దృష్టిలో ఉంచుకుని అతిథులు రైడ్లు, రెస్టారెంట్లు, క్యూ ప్రాంతాలలో భౌతిక దూరాలు వంటివి పాటించాల్సిన అవసరం ఉంది. వండర్‌లాలోని మొత్తం సిబ్బంది మాస్క్‌లు ధరించడం తప్పనిసరి, అన్ని రైడ్లు, రెస్టారెంట్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఇతర ఎంట్రీ పాయింట్ల వద్ద ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్లు అందించబడుతుంది. మొత్తానికి సమ్మర్ సీజన్లో మహిళలు ఎంజాయ్ చేయడానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. -
అన్ని రంగాల్లో సత్తాచాటుతున్న మహిళలు
సాక్షి, హైదరాబాద్: నేటి మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్నారని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రాధారాణి అన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలకు క్వీన్ అఫ్ ది నేషనల్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ రాధారాణి మహిళలను సన్మానించి ప్రసంగించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం, విశ్రాంత ఐపీఎస్ అధికారి డాక్టర్ గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ... మహిళలకు ఓర్పు సహనంతో పాటు ఏకాగ్రత అంకితభావం అమితంగా ఉంటాయన్నారు. అవి వారికి దేవుడు ఇచ్చిన వరాలని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన 33 మంది మహిళలను వారు ఘనంగా సన్మానించారు. సంస్థ వ్యవస్థాపకుడు, కార్యనిర్వాకులు సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ సత్యవోలు పూజిత, సలహాదారు సుందరపల్లి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్.. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: ఆ మహిళలవి ప్రాణాలు కావా!!) కార్యక్రమంలో భాగంగా సత్యవోలు రాంబాబు తన ప్రతిభను ప్రదర్శించారు. ముక్కుతో బొమ్మ గీసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. -
'నారీ శక్తిమతి' రాధికా మెనన్
అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా భారత రాష్ట్రపతి భవనం వేడుకలకు వేదికైంది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను రాష్ట్రపతి స్వయంగా ‘నారీశక్తి పురస్కారం’తో సత్కరిస్తున్నారు. వారిలో రాధికా మెనన్ కూడా ఉన్నారు. తుపానులో నడి సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులను రక్షించిన ధీర ఆమె. కెప్టెన్‌గా తొలి మహిళ రాధికామెనన్ పుట్టింది కేరళలోని కోదుంగళ్లూర్‌లో. కొచ్చిలోని ‘ఆల్ ఇండియా మెరైన్ కాలేజ్’లో కోర్సు పూర్తయిన తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రేడియో ఆఫీసర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత 2012లో ఇండియన్ మర్చంట్ నేవీలో కెప్టెన్ అయ్యారు. మర్చంట్ నేవీలో ఒక మహిళ కెప్టెన్ కావడం ఆమెతోనే మొదలు. మెనన్ అదే ఏడాది దాదాపుగా 22 వేల టన్నుల అత్యంత కీలకమైన ఆయిల్ ట్యాంకర్ ‘సువర్ణ స్వరాజ్య’ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. ఆమె ధైర్యసాహసాల గురించి తెలుసుకోవాలంటే ఏడేళ్లు వెనక్కి వెళ్లాలి. లంగరు తెగిపోయింది అది 2015, జూన్ నెల. బంగాళాఖాతంలో పెను తుపాను. సముద్రం అల్లకల్లోలంగా సుడులు తిరుగుతోంది. అలలు 15 అడుగుల ఎత్తు ఎగిసిపడుతున్నాయి. చేపల వేటకు వెళ్లిన జాలర్ల పడవ ‘దుర్గమ్మ’ ఆ సుడుల్లో చిక్కుకుపోయింది. లంగరు తెగిపోవడంతో పడవ గమ్యం లేకుండా అలల తాకిడికి అల్లల్లాడుతూ కొట్టుకుపోతోంది. ఆహారపదార్థాలు, తాగునీరు ఉప్పునీటి పాలయ్యాయి. పడవలో ఉన్న ఏడుగురు జాలర్లు ప్రాణాలను చిక్కబట్టుకుని తీరం చేరే దారి కోసం చూస్తున్నారు. వారి ఇళ్లలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రోజులు గడుస్తున్నాయి. సముద్రంలోకి వెళ్లిన వాళ్ల జాడలేకపోవడంతో ఆశలు కూడా వదులుకున్నారు. ఆచూకీ దొరకని జాలర్లు పదిహేనేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్య వయసు వాళ్లు. అన్ని ఇళ్లలో తల్లులు, భార్యాపిల్లలు తమ తమవాళ్ల కోసం ఆశగా ఎదురు చూసి చూసి ఇక ఆశ చంపుకుని మనసు చిక్కబట్టుకుని అంత్యక్రియలకు సన్నద్ధమవుతున్నారు. ఆ సమయంలో సముద్రంలో రాధికా మెనన్ తన టీమ్‌తో ఈ మత్స్యకారులను రక్షించడంలో మునిగిపోయి ఉన్నారు. పడవలో చిక్కుకున్న వాళ్లకు లైఫ్‌జాకెట్లు అందచేసి, పైలట్ ల్యాడర్ సహాయంతో దుర్గమ్మ పడవలో నుంచి ఒక్కొక్కరిని షిప్ మీదకు చేర్చారామె. అలా అందరూ ప్రాణాలతో తమవాళ్లను చేరుకున్నారు. తుపాను సమయంలో నడిసముద్రంలో అంతటి సాహసోపేతంగా విధులు నిర్వర్తించినందుకు గాను 2016 సంవత్సరానికి గాను ఆమె అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ప్రదానం చేసే ‘ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అవార్డు’ను, ఐఎమ్‌వో బ్రేవరీ అవార్డును అందుకున్నారు. షిప్ కమాండర్‌గా ఇవన్నీ విధుల్లో భాగమేనంటారు రాధిక. తోటి మహిళా నావల్ అధికారులు సునీతి బాల, శర్వాణి మిశ్రాలతో కలిసి ముంబయి కేంద్రంగా ‘ఇంటర్నేషనల్ ఉమెన్ సీ ఫారర్స్ ఫౌండేషన్ స్థాపించి యువతులను ఈ రంగంలోకి ప్రోత్సహిస్తున్నారామె. అలాగే ఢిల్లీ నుంచి వెలువడుతున్న మ్యారిటైమ్ మ్యాగజైన్ ‘సీ అండ్ కోస్ట్’ కు సలహామండలి సభ్యురాలు కూడా. ఇవన్నీ తెలిసే కొద్దీ రాధికామెనన్ నారీశక్తి పురస్కారానికి అచ్చంగా మూర్తీభవించిన రూపం అనిపిస్తుంది. -
పుతిన్‌కు ఘోర అవమానం!
ఉక్రెయిన్‌పై సైనిక చర్యతో పాశ్చాత్య దేశాల దృష్టిలోనే కాదు.. సొంత దేశంలోనూ కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆంక్షలు ఇప్పటికే రష్యాకు ఆర్థికంగా ప్రభావితం చేస్తుండగా.. మరోవైపు రష్యన్ సోషల్‌మీడియా పుతిన్‌కు వ్యతిరేకంగానే కూస్తోంది. ఈ క్రమంలో.. పుతిన్‌కు ఘోర అవమానం.. అదీ సొంత గడ్డపైనే జరిగింది. మహిళా దినోత్సవం వేడుకల్ని Russia లో పలు చోట్ల బహిష్కరించారు. సాధారణంగా.. ఉమెన్స్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తుంటాడు పుతిన్. కానీ, ఈసారి ఈ వేడుకల్లో చేదు అనుభవం ఎదురయ్యింది. పుతిన్ లక్ష పువ్వుల పంపకం ఈసారి బెడిసి కొట్టింది. వలంటీర్ల సాయంతో మాస్కో నగరంలో మహిళలకు లక్ష పువ్వుల్ని పంచడం ఆనవాయితీగా కొనసాగిస్తోంది అక్కడి ప్రభుత్వం. మహిళా డ్రైవర్లు, ఇతర సిబ్బందికి వలంటీర్ల సాయంతో పూలు పంచాలంటూ అధ్యక్ష భవనం నుంచే ఈ ఆదేశాలు వెలువడుతుంటాయి కూడా. అయితే.. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చాలామంది పువ్వుల్ని తీసుకోవడానికి నిరాకరించారట. ఈ విషయాన్ని టాస్ న్యూస్ ఏజెన్సీ ప్రముఖంగా ప్రచురించింది. పువ్వులతో పాటు ఫ్లవర్ బొకేలను సైతం తిరస్కరించారట. అంతేకాదు కొన్నిచోట్ల వాటిని చెత్త కుప్పల్లోనే పడేసిన దృశ్యాలు సైతం వైరల్ అయ్యాయి అక్కడ. సోషల్ మీడియాలో పుతిన్ యుద్ధకాంక్షను ఛీ కొడుతూ.. ఆ వ్యతిరేకత తారాస్థాయిలో కనిపించింది. దీంతో ఆ పోస్టులు, ఫొటోల్ని తొలగించాలని రష్యన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి ఉమెన్స్ డే సందర్భంగా.. మహిళా మిలిటరీ, వైద్య సిబ్బందిని ఉద్దేశించి పుతిన్ ప్రసగించిన కార్యక్రమానికి టీఆర్పీ దారుణంగా పడిపోవడం సైతం చర్చనీయాంశంగా మారింది. -
చాన్స్ మిస్.. ఆధార్ లేకపాయే.. ఆర్టీసీ ఆఫర్ ఆగమాయే..
మహిళా దినోత్సవం సందర్భంగా అరవై ఏళ్లు పైబడిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో మంగళవారం ఉచిత ప్రయాణం ఆఫర్ ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై పెద్దగా ప్రచారం చేయకపోవడంతో చాలా మందికి తెలియలేదు. దీనికి తోడు ఉదయం ఒకరిద్దరు ఈ విషయమై అడిగినా తమకేం ఆదేశాలు రాలేదని కండక్టర్లు చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆర్ఎం ఆదేశాలతో కండక్టర్లు అనుమతించినప్పటికీ.. అవగాహన లోపంతో చాలా మంది మహిళలు ఆధార్ కార్డులు వెంట తెచ్చుకోలేదు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలు ఆధార్ కార్డు ఉంటేనే ఉచిత ప్రయాణమని, లేకపోతే టికెట్ తీసుకోవాల్సిందేనని చెప్పడంతో ఆఫర్ మిస్ అయినట్లయింది. ఆర్భాటంగా ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ అధికారుల.. రెండు, మూడు రోజుల ముందు నుంచి ప్రచారం చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమైంది. కాగా, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ‘సాక్షి’ జిల్లా కేంద్రంతో పాటు సత్తుపల్లి, మధిర, వైరాల్లో పరిశీలించగా.. ఎక్కువ మంది ఉపయోగించుకోలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. – ఖమ్మం మామిళ్లగూడెం / వైరా / సత్తుపల్లి టౌన్ / మధిర రూరల్ టికెట్ తీసుకోక తప్పలేదు.. నాకు ఫించన్ కూడా వస్తుంది. వయస్సు ఎప్పుడో 60 ఏళ్లు దాటింది. కానీ గుర్తింపు కార్డు తెచ్చుకోవటం మర్చిపోయాను. దీంతో కండక్టర్ కార్డు ఉంటేనే ఆఫర్ ఉంటుందన్నారు. ఇక టికెట్ తీసుకోక తప్పలేదు. – చింతలపాటి వరమ్మ, సత్తుపల్లి ముందే చెబితే బాగుండు.. వరంగల్ వెళ్దామని బస్సు ఎక్కా. ప్రయాణంలో ఆఫర్ ఉందని బస్సులోకి ఎక్కాక చెప్పారు. తీరా చూస్తే నా దగ్గర గుర్తింపు కార్డు లేదు. ప్రభుత్వం కల్పించిన ఆఫర్ వాడుకోలేకపోయా. ఇలాంటివి ముందే చెబితే బాగుండేది. – మాదాసి లక్ష్మమ్మ, సత్తుపల్లి వైరా నుంచి మధిర.. అరవై ఏళ్లు నిండిన మహిళలకు మహిళా దినోత్సవ కానుకగా బస్సుల్లో ఉచిత ప్రయాణం కానుక బాగుంది. నేను వైరా నుంచి మధిర వరకు ప్రయాణించా. ఇంకా ఎక్కువ మందికి తెలియజేస్తే ఆధార్ కార్డు తెచ్చుకునేవారు. – గంగసాని అరుణ, బ్రాహ్మణపల్లి, మధిర ఆనందంగా ఉంది మహిళా దినోత్సవం సందర్భంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉంది. ముందుగా తెలియడంతో ఆధార్‌కార్డు తెచ్చుకున్నా. కండక్టర్‌ను చూపించి మధిర నుంచి రాపల్లికి వెళ్లా. – వాసిరెడ్డి రజిని, రాపల్లి అభినందనీయం మహిళలను గౌరవించడం సంప్రదాయం. మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అభినందనీయం. వయోవృద్ధులైన మహిళలకు బస్సులు, బస్టాండ్లలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. – గరిక సరోజిని, గంపలగూడెం కార్డు తెచ్చుకోలే.. ఆర్టీసీ బస్సులో ఈరోజు ఉచితంగా వెళ్లొచ్చని నాకు తెలియదు. ఈ విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఆధార్‌కార్డు తెచ్చుకోలేదు. ఆధార్‌కార్డు ఉంటేనే టికెట్ లేకుండా ప్రయాణించొచ్చని కండక్టర్ చెప్పాడు. దీంతో టికెట్ కొన్నా. – కరి కమల, అనాసాగరం ఆధార్ అడగలేదు నేను బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కండక్టర్ టికెట్ కొట్టా రు. ఆధార్‌కార్డు ఉందా అని కానీ ఇతర గుర్తింపు కార్డులు ఉన్నాయా అని కానీ అడగలేదు. దీంతో టికెట్ తీసుకునే ప్రయాణం చేశాను. ఆ తర్వాత ఆఫర్ ఉందనే విషయం తెలిసింది. – స్వరూప, ప్రయాణికురాలు ఆధారాలు లేకపోవడంతోనే... అరవై ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇందుకోసం ఆధార్ కార్డు.. ఇతర గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఎక్కువ మంది కార్డులు లేకుండా రావడంతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. – సోలోమన్, రీజియన్ మేనేజర్ (ఇది చదవండి: వంట నూనెల సలసల.. 15 రోజుల్లో భారీగా పెరిగిన ధర, ఇలా అయితే కష్టమే!) -
సారీ.. తప్పు జరిగింది.. కస్టమర్లకు క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ప్లిప్‌కార్ట్.. చిన్న తప్పిదం కారణంగా తమ కస్టమర్లకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్లిప్‌కార్ట్ కిచెన్ అప్లెయెన్స్‌ను ప్రమోట్ చేసుకుంది. మార్చి 8వ తేదీన(అంతర్జాతీయ మహిళా దినోత్సవం) రూ.299 నుంచి కిచెన్ అప్లెయెన్స్‌ను పొందవచ్చునని ప్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే, ఈ ఆఫర్‌ను బేస్ చేసుకొని కొంత మంది మహిళలు ప్లిప్ కార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం రోజున వంట గదికి సంబంధించిన ఆఫర్‌ను మాత్రమే ఎందుకు ప్రకటించారు. వంట గది మాత్రమే మా ప్రపంచం కాదంటూ ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలోనే మీ ఆఫర్‌కు నో థ్యాంక్స్ అంటూ కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ప్లిప్కార్ట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో తమ తప్పును తెలుసుకున్న ప్లిప్ కార్ట్.. ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పింది. తాము ఎవరి మనోభావాలను కించపరచాలని అనుకోవడంలేదని, ఆందోళన చెందుతున్నామని తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కిచెన్ సామాగ్రిని ప్రమోట్ చేస్తూ వార్త ప్రచురించిన ఈ-కామర్స్ సైట్ మార్కెటింగ్ విభాగం తప్పు చేసిందని ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లను క్షమాపణలు కోరింది. మరోవైపు.. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ప్లిప్‌కార్ట్ హోలీ పండుగ సందర్బంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్చి 12-16వ తేదీ వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌ను ప్రారంభించనుంది. హోలీ పండుగ సేల్స్‌లో భాగంగా పలు ప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్, యాపిల్, శాంసంగ్, రియల్ మీ, ఒప్పో వంటి స్మార్ట్ ఫోన్లపై 60 శాతం వరకు భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. It's offensive Why women are being identified with kitchen appliance..only ?? Whole world is ours & certainly kitchen is not our whole world!! No thanks!! — Harmeet Kaur (@iamharmeetK) March 8, 2022 We messed up and we are sorry. We did not intend to hurt anyone's sentiments and apologise for the Women's Day message shared earlier. pic.twitter.com/Gji4WAumQG — Flipkart (@Flipkart) March 8, 2022 -
గతంలో ఆ ఉద్యోగాలు పురుషులకే పరిమితం.. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది!
సాక్షి,బళ్లారి: ఇంటి నుంచి మింటి వరకు దూసుకెళ్తున్న నారీమణులు రైళ్లను కూడా నడిపిస్తున్నారు. ఒకప్పుడు పురుషులకే పరిమితమైన లోకోపైలెట్ ఉద్యోగాల్లో మహిళలు కూడా కొలువుదీరి సత్తా చాటుతున్నారు. మంగళవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హుబ్లీ రేల్వే అధికారులు హుబ్లీ నుంచి గదగ్ మీదుగా కారటిగి వెళ్లే రైలు నిర్వహణను మహిళా సిబ్బందికే అప్పగించారు. లోకో పైలెట్, టీటీఈలు, పోలీసులు ఇతర సిబ్బంది మొత్తం 15 మంది మహిళలను నియమించి రైలు నడిపించారు. అంబికా అంకలిగి అనే మహిళా పైలెట్ ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా 200 కిలోమీటర్ల మేర రైలును నడిపించారు. మహిళా దినోత్సవం రోజున రైలును నడిపే బాధ్యతలను తమకు అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నారు. -
ఆమె మాటలు గుర్తుకొస్తున్నాయి
-
ఇళ్లు-ఇళ్ల స్థలాలు-ఆస్తి
-
ఇంత మంది ప్రజా ప్రతినిధులు
-
మన మహిళలకు దక్కిన గౌరవం
-
Sakshi Cartoon: ఉమెన్స్ డే స్పెషల్ అని రొయ్యల వేపుడు, మటన్ కీమా, చేపల పులుసు..
ఉమెన్స్ డే స్పెషల్ అని రొయ్యల వేపుడు, మటన్ కీమా, చేపల పులుసు, చికెన్ టిక్కా, వెజ్ మంచూరియా, బిర్యానీ చేయమన్నా.. చేశావా! -
లైఫ్ ఈజ్ రయ్రయ్
సింథియా (విశాఖ పశ్చిమ): అవమానాలు ఎదుర్కొంది..సమాజ వివక్షకు గురైంది..అయినా ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. నా అన్నవాళ్లు ఎవరూ లేకపోయినా తన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంది. తలెత్తుకుని తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఆటో డ్రైవర్‌గా దూసుకుపోతూనే సేవా కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి చాటుకుంటోంది. జీవీఎంసీ 62వ వార్డులో ఉంటున్న 28 ఏళ్ల గొందేశి నూకలక్ష్మి. దశాబ్ద కాలం నుంచి ఎన్నో అవమానాలను, సమాజ వివక్షను తట్టుకుని నూకలక్ష్మి నిలబడిన వైనం ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం. 2013లో డ్రైవింగ్ లైసెన్స్‌ను పొంది, ఆటో స్టీరింగ్ పట్టుకోగా ఆటో డ్రైవర్‌గా ఎందరి నుంచో ప్రశంసలు అందుకుంటోంది. గాజువాక నుంచి సింథియా వరకు ఎంతో మంది ప్రేమాభిమానాలను సంపాదించుకోగా, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదుల, విద్యార్థులకు ఆమెకు విశ్వయనీయ ఆటో డ్రైవర్‌గా ఉండడం విశేషం. జెండర్ సమస్య కారణంగా ప్రయాణికులు నూకలక్ష్మి డ్రైవింగ్ నైపుణ్యాన్ని తక్కువగా అంచనా వేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక తన ఆటో నుంచి బరువైన వస్తువులను లోడింగ్, అన్లోడ్ చేసే విషయంలో పురుషుల సహాయాన్ని సైతం నిరాకరించడం నూకలక్ష్మి ఆత్మబలానికి నిదర్శనం గాకా, వృద్ధులు, గర్భిణుల నుంచి డబ్బులను కూడా తీసుకోకపోవడం తన ఉదార స్వభావానికి నిదర్శనం. అయితే డ్రైవింగ్ అంత ఈజీ కాదని. అందులోను ఆటో నడపడం అనేది అస్సలు సులభతరం కాదని. అనాథనైన తాను డాక్‌యార్డ్‌లో పని చేస్తూ ఆటో నడపడం నేర్చుకున్నానని చెప్పింది. 8 ఏళ్ల నుంచి ఆటో నడుపుకుంటూ సమాజంలో గౌరవంగా తలెత్తుకుంటూ జీవిస్తున్నానని చెప్పింది. తన సంపాదనలో కొంత పేదవృద్ధులకు, అనాథలకు ఇవ్వడం, తనలాగే ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి తోచిన సాయం చేస్తున్నట్టు నూకలక్ష్మి చెప్పింది. ఆటో నడుపుతూ గౌరవంగా.. డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ఒక్కొక్కరిది ఒక్కో బతుకు పోరు. పురుషులతో సమానంగానే మహిళలు కూడా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. భర్త తెచ్చే ఆదాయం చాలక..పిల్లల చదువులు..ఇంటి అవసరాలు..ఖర్చులు పెరుగుతున్న దృష్ట్యా మహిళలు కూడా పనులు చేసుకుంటూ ఆర్థిక భాగస్వాములవుతున్నారు. ఆరిలోవకు చెందిన వాసంశెట్టి వాణికుమారి 22ఏళ్లకు పైగా ఆటో నడుపుతోంది. ఈమెకు భర్తలేడు. కుమార్తె బేబీ డిగ్రీ పూర్తి చేసింది. ఆరిలోవ..జగదాంబ జంక్షన్, తిరిగి జగదాంబ జంక్షన్–ఆరిలోవ వరకు టిక్కెట్ సర్వీస్ చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా టిక్కెట్ సర్వీస్ చేస్తోంది. ఓ వైపు ఆటో రుణం తీరుస్తూ, మరో వైపు కుమార్తె బాగోగులు, ఇంకోవైపు కుటుంబ పోషణకు తనకొచ్చే ఆదాయంతోనే సరిపెట్టుకుంటున్నామని చెప్పింది. తనకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందని, రుణం తీసుకుని తానే ఆటోను సొంతగా కొనుగోలు చేశానని, ఎవరూ సాయం చేయలేదని చెప్పింది. -
ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్
-
సీఎం జగన్ కి మహిళల అరుదైన గౌరవం
-
ఉమెన్స్ డే: యాంకర్ అనసూయ కాంట్రవర్సీ ట్వీట్
యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేకపాత్రల్లో అలరిస్తూ ఫుల్ జోష్ మీద ఉంది అనసూయ. రీసెంట్గా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అటు బుల్లితెర షోస్‌తో పాటు ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియాలోనూ అనసూయ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేసింది. 'ట్రోలర్, మీమర్స్ ఈరోజు మహిళల దినోత్సవం అని గుర్తొచ్చి హఠాత్తుగా మహిళలను గౌరవించడం ప్రారంభిస్తారు. అయినా ఈ గౌరవం ఎలాగో 24 గంటల్లో ముగుస్తుందనుకోండి. కాబట్టి మహిళలందరికి హ్యాపీ ఫూల్స్ డే' అంటూ ట్వీట్ చేసింది. అనసూయ ట్వీట్ పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే, మరికొందరేమో ప్రతీసారి కాంట్రవర్సీయేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Oh! Suddenly realised its the day every troller and meme maker suddenly starts respecting women.. of course it expires in 24 hours! So all you women out there! Happy fools day!! 🙄 — Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2022 -
రాజన్న కలను జగనన్న నిజం చేస్తున్నారు: మంత్రి తానేటి వనిత
-
సీఎం జగన్ గురించి అనురాధ అద్భుత ప్రసంగం
-
ఆ ఘనత సీఎం జగనన్నదే: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
-
పచ్చ రంగు, పిచ్చి గెడ్డం.. బాబుని ఉతికారేసిన వాసిరెడ్డి పద్మ
-
మోడ్రన్ మహారాణి
-
దిశా మహిళా పోలీసుల మనోభావాలు ఫ్యామిలీ విశేషాలు
-
'తోడు లేకపోతే ఆడపిల్ల ఎలా?’ అనే స్థితి నుంచి యుద్ధంలో కూడా...
నేలపై సైకిల్ తొక్కుతూ కరోనా బాధితులను ధైర్యంగా ఆదుకున్న స్త్రీ... నింగిలోకి దూసుకెళ్లి అంతరిక్షాన్ని అవలీలగా చుంబించి వచ్చిన యువతి... ఫుడ్ డెలివరీ గర్ల్‌గా బైక్ ఎక్కిన కాలేజీ అమ్మాయి... యుద్ధ విమానం నడిపేందుకు సిద్ధమైన మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్... భర్త వదిలేసి వెళ్లిన వ్యాపారాన్ని చక్కదిద్దిన భార్య, తండ్రి కట్టబెట్టిన సాంకేతిక సామ్రాజ్యాన్ని ఏలుతున్న కూతురు... స్త్రీలు.. స్త్రీలు.. స్త్రీలు... ‘స్త్రీలు మారితే సమాజం మారుతుంది’ అని గతంలో అనేవారు. స్త్రీలు ఎప్పుడో మారారు. వారి వేగాన్ని, విజయాన్ని అర్థం చేసుకోవలసిందీ మారవలసిందీ ఇక మగవారే. ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతోంది. దేశం కాని దేశం నుంచి మన విద్యార్థులు తిరిగి వస్తున్నారు. అలా వస్తున్న విద్యార్థులను అందరూ గమనించి చూస్తున్నారు. ఎందుకంటే వారిలో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారో అంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఆడపిల్లలను వీధి చివర బడికి పంపడానికి కూడా అంగీకరించని ఒకనాటి భారతీయ కుటుంబాల భావజాలం నుంచి దేశం కాని దేశానికి ఒక్కర్తినే పంపే ధైర్యం చేసే వరకు మన కుటుంబాలు మారాయి. ఆ మార్పును సాధించుకున్నది కూతుళ్లే కాదు ఆ ఇళ్ల తల్లులు కూడా. స్త్రీలు ఒప్పించుకోకపోతే మగవారు అంత సులువుగా ఒప్పుకోరు. అంత యుద్ధంలో హరియా ణకు చెందిన ఒకమ్మాయి తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని ఉక్రెయిన్ పక్షాన యుద్ధానికి వెళ్లిపోతే అతని భార్య ముగ్గురు చిన్నపిల్లలతో మిగిలిపోతే– నేను మా దేశానికి వెళ్లను... మీకు తోడుగా ఉంటాను అని ఆగిపోయింది. బంకర్లో ఆ కుటుంబంతో ఉండిపోయింది. ‘తోడు లేకపోతే ఆడపిల్ల ఎలా?’ అనే స్థితి నుంచి యుద్ధంలో కూడా తోడు నిలిచే స్థితికి మన అమ్మాయిలు ఎదిగారు. చూడాల్సింది ఈ మార్పును. గమనించాల్సింది ఈ ఎదుగుదలను. ∙∙ ఊహ తెలిసిన వెంటనే పసిబిడ్డ కూడా గోడ మీద గీతలు గీసి తన ఉనికిని చాటుతాడు. మరి బుద్ధి, దేహం, వయసు, తెలివి, సామర్థ్యం ఉన్న స్త్రీలు తమ ఉనికిని నిరాకరించి నాలుగు గోడల మధ్యన ఎందుకు ఉండిపోవాలి. కుటుంబ బాధ్యత స్త్రీ, పురుషులది. దానిని పంచుకోవాలి. నిజమే. తల్లిగా స్త్రీ బాధ్యత మరింత ఎక్కువ. అవును. అంగీకారమే. కాని దాంతోపాటు చదువుకున్న చదువుకు, సాధన చేసి సాధించుకున్న ప్రావీణ్యానికి, పెంచుకున్న అభిరుచికి, ఏర్పరుచుకున్న లక్ష్యానికి కూడా స్త్రీలు న్యాయం చేయాలనుకుంటారు. భార్యగా, తల్లిగా వారు పొందే బాంధవ్యాల సంతృప్తితో పాటు సామాజిక జీవనంలో సాధించాలనుకున్న విజయాల సంతృప్తి కూడా వారికి కావాలి. ‘మేము చేయగలము’ అని స్త్రీలు ప్రపంచమంతటా అరిచి చెబుతూనే ఉన్నారు. మనదేశం చాలా ఆలస్యంగా వినడం మొదలెట్టింది. ఇంత కాలం గడిచినా వినాల్సిన, వినిపించుకోవాల్సిన మగ సమాజం ఇంకా ఉండనే ఉంది. ∙∙ హిమాలయాల పర్వతారోహకుల సమాఖ్యకు ఇప్పుడు ఒక స్త్రీ డైరెక్టర్‌గా ఉంది. స్త్రీలు తాము అధిరోహించడమే కాదు పర్వతారోహకులకు మార్గదర్శకులుగా మారారు. అలాగే 2017లో మొదలెట్టి 6 మంది మన నేవీ మహిళా ఆఫీసర్లు 254 రోజుల పాటు మగవారి ప్రమేయం లేకుండా మూడు మహా సముద్రాలను అనంత జలరాశిని దాటి వచ్చారు. ఒకప్పుడు స్త్రీలకు పర్వతాలపై ప్రవేశం లేదు. ఓడల మీద అడుగు పెట్టనివ్వలేదు. కాని ఇవాళ ఎత్తయిన తలాలను, లోతైన అగాధాలను స్త్రీలు జయిస్తున్నారు. వీటినే జయిస్తున్నప్పుడు మైదానాలలో వారికి ఎదురేముంది? పని చోట్ల ఎదురయ్యే సవాళ్లు వారికేం లెక్క? ∙∙ తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని కొడుకులు అందిపుచ్చుకోవడం పాత చరిత్ర. ఇవాళ అలాంటి బాధ్యత దక్కిన కుమార్తెలు వ్యాపార దక్షులుగా నిలస్తున్నారు. భర్త అకాల మరణం చెందితే పగ్గాలు చేతబట్టి భారీ సంస్థలను కూడా గాడిలో పడేస్తున్నారు. విద్య, వైద్య, సాంకేతిక రంగాలనే కాదు ఆర్థిక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. భర్త ఇచ్చే నెల ఖర్చుల కోసం ఎదురు చూసే స్త్రీలు ఉండే దశ నుంచి మన సమాజం దేశం పద్దును తయారు చేసే స్త్రీల వరకూ చేసిన ప్రయాణం చూడతగ్గది. ఆ సామర్థ్యం గమనించదగ్గది. ∙∙ చదువు ముఖ్యం అని ఇల్లు, సమాజం, పాలన గ్రహించాయి స్త్రీలకు. ఉపాధి, ఉనికి కూడా ముఖ్యం అనేచోటే ఇంకా ఘర్షణ కొనసాగుతూ ఉంది. స్త్రీ ఉనికిని అంగీకరించి, ఆమె విజయానికి తోడు నిలిచి, ఆమె ప్రయాణాన్ని ప్రోత్సహించే తండ్రి/భర్త/కొడుకు గురించే ఇప్పుడు చింత. ఈ ముగ్గురూ బయట పౌరులుగా ఉంటూ తయారు చేసే ‘పౌర సమాజపు’ ఆలోచనా రీతి గురించే చింత. స్త్రీల కట్టు, బొట్టు, ఆహార్యం... వారి భుజాల మీద ‘కుటుంబ పరువు’ తాలూకు బరువు, సంస్కృతిని పరిరక్షించాలనే కట్టుబాటు, ప్రవర్తన మీద ఆంక్ష... వీటి గురించే మగవారి ఆలోచన మారాల్సి ఉంది. కుటుంబం కోసం, సమాజం కోసం, దేశం కోసం అన్నింటికి మించి తమ ఆత్మసంతృప్తి కోసం స్త్రీలు రెక్కలు సాచినప్పుడల్లా వాటిని కత్తించే భావజాలం నుంచి ‘మగభావజాలంతో నిండిన సమాజం’ బయటపడాలి. పురోగామి స్త్రీ వికాసాన్ని హేళన చేసే స్త్రీలను తయారు చేసే కుట్రను అర్థం చేసుకోవాలి. ∙∙ సమస్య ఎప్పుడూ ‘ఎక్కువ.. తక్కువ... సమానం’ గురించి కానే కాదు. స్త్రీల ఆకాంక్షలను, మనోభావాలను గౌరవించడం. ప్రతి వ్యక్తికి తనకు ఇష్టమైన పని చేసే హక్కు ఉంటుంది. తనకు ఇష్టం లేనిది చేయకూడని హక్కు కూడా ఉంటుంది. మగ సమాజం తనకు ఇష్టమైనది మాత్రమే స్త్రీలు చేయాలనుకుంటూ ఉంటే, వారి చేత వారికి ఇష్టం లేనిది చేయించాలి అనుకుంటూ ఉంటే ఆ రోజులు ఇంకా చెల్లవు అని అర్థం చేసుకోవాలి. స్త్రీలు తమ ఉమ్మడి శక్తితో ప్రభుత్వాలనే నిలదీసే శక్తి చూపుతూ, వాటిని ఓడగొడుతున్న ఉదంతాలు ఇటీవలే కనిపించాయి. స్త్రీల ఆలోచన ఎప్పుడూ కుటుంబాన్ని, కుటుంబం వంటి దేశాన్ని చక్కదిద్దాలనే ఉంటుంది. అందుకై వారు బాగా చదివి, బాగా పని చేస్తూ, కుటుంబ బాధ్యతలు కూడా బాగా నిర్వహించాలి అని అనుకుంటే దానిని ఎలా అడ్డుకోవాలా అని కాకుండా ఎలా సపోర్ట్ చేయాలా అనుకునే పురుషుల భావజాలం ఇప్పుడు కావలసింది. స్త్రీ వికాసంలో స్త్రీ, పురుషులిద్దరూ పాల్గొన్నప్పుడు ప్రతిరోజూ నిజమైన విమెన్స్ డే అవుతుంది. హ్యాపీ విమెన్స్‌డే. -
ఎస్తేర్ ‘జిమ్’దాబాద్.. ఏపీ తొలి మహిళా బాడీబిల్డర్
సృష్టికి మూలం స్త్రీ. ప్రతి మగాడి గెలుపు వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. కానీ ఈ వనితల విజయం వెనుక వారి స్వయంకృషి ఉంది. అచెంచల ఆత్మవిశ్వాసం.. మొక్కవోని దీక్ష.. కఠోర సాధనతో వీరు తాము అనుకున్న లక్ష్యం సాధించారు. అవరోధాలను అవకాశాలుగా మలుచుకుని శక్తిసామర్థ్యాలకు పదునుపెట్టారు. ఉరిమే ఉత్సాహంతో ముందుకురికారు. జయభేరి మోగించి విజయతీరాలు చేరారు. తమ రంగాల్లో అనితరసాధ్యమైన ప్రతిభ కనబరిచారు. మహిళా లోకం సగర్వంగా తలెత్తుకునేలా.. కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించారు. చదవండి: ఇదేం కోడిగుడ్డు? వింత ఆకారాన్ని చూసేందుకు ఎగబడుతున్న జనం తెనాలి(గుంటూరు జిల్లా): రావూరి ఎస్తేరు రాణి.. ఈమె జీవితం వడ్డించిన విస్తరి కాదు.. చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమయ్యారు. పేదరికం శాపంలా వెంటాడుతున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. జిమ్ ట్రైనర్‌గా ఉపాధి పొందుతూనే బాడీబిల్డర్గానూ రాణించారు. రాష్ట్ర తొలి మహిళా బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందారు. ఫలితంగా ఈనెల 11న సిక్కింలో జరగనున్న నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీలకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్తేరురాణి సొంతూరు తెనాలి సమీపంలోని వేమూరు. నాలుగున్నరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను, ఆమె తమ్ముడినీ నాయనమ్మ చేరదీసింది. ఇద్దరినీ చదివించింది. గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ వరకు చదివిన ఎస్తేరు రాణి పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఇంటికి దగ్గర్లో ఉన్న జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేసేవారు. కొద్దినెలల్లోనే అక్కడ జిమ్ ట్రైనర్‌గా మారారు. ఆ తర్వాత శరీర సౌష్టవ పోటీలకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. కఠోర సాధనతో ఏడాదిన్నరలోపే అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు గత జనవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో సత్తాచాటారు. ఏపీ నుంచి జాతీయ పోటీల్లో పాల్గొనబోతున్న తొలి బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందారు. ప్రముఖుల ప్రోత్సాహం ఎస్తేరురాణికి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ రూ.లక్ష, అడిషనల్ డీజీపీ శ్రీధర్, సునీల్ కలిసి రూ.50 వేలు చొప్పున సాయాన్ని సమకూర్చారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. నిత్యం ఆరు గంటల కఠోర సాధన ఎస్తేరురాణి రోజూ ఆరు గంటలు కఠోర సాధన చేస్తారు. ఈ సాధన ఫలించాలంటే రోజూ కిలో చికెన్, ఇరవై గుడ్లు మెనూలో ఉండాలి. వచ్చే జీతం సరిపోకపోయినా.. కొందరి సాయంతో మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. నేషనల్స్‌లో పతకం సాధించి ఉద్యోగం పొందాలనేదే లక్ష్యమని ఎస్తేరు రాణి చెబుతున్నారు. ప్రతిభా ‘మాధవీ’యం తెనాలి: చుండూరు మండలం మోదుకూరుకు చెందిన ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గాలి మాధవీలతకు ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, మేనేజ్మెంట్ విభాగాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సేవలందించిన 75 మంది మహిళల జాబితాను ప్రకటించింది. అందులో మాధవీలతకు స్థానం లభించింది. భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె.విజయరాఘవన్, బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ఈ నెల 3న ఈ జాబితాను ప్రకటించారు. వీరి స్ఫూర్తిదాయక సేవలను ‘షి ఈజ్ 75 విమెన్ ఇన్ స్టీమ్’ పేరుతో పుస్తక రూపంలో తీసుకురానున్నారు. నేటి తరానికి స్ఫూర్తినిచ్చేందుకు వీరి వీడియోలను ప్రదర్శిస్తారు. సదస్సులో వీరిని పరిచయం చేస్తారు. ఆ జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సైంటిస్ట్‌లు, కళాకారులు, సమాజ సేవకులు, మానవతావాద డాక్టర్ల సరసన చుండూరు మండలం మోదుకూరుకు చెందిన కనకారెడ్డి, శివలీల కోడలు మాధవీలతకు స్థానం లభించింది. సాధారణ రైతు కుటుంబం నుంచి.. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామం మాధవీలత స్వస్థలం. 1971లో సాధారణ రైతు కుటుంబంలో అన్నపూర్ణమ్మ, వెంకారెడ్డి దంపతులకు జని్మంచారు. జేఎన్టీయూ, కాకినాడలో ఇంజినీరింగ్ పూర్తిచేసి, స్వగ్రామంలో తొలి ఇంజినీరుగా గుర్తింపును పొందారు. ఎన్ఐటీ, వరంగల్‌లో ఎంటెక్, ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని సర్వోత్తమ విశ్వవిద్యాలయం ఐఐఎస్సీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇదే విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్‌పర్సన్‌గా మాధవీలత సైన్స్‌ని, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువచేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. భారతదేశంలో జమ్ములో గల చీనాబ్ నదిపై రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోని అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జి డిజైన్, నిర్మాణంలో మాధవీలత ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగత విషయానికొస్తే గృహిణిగా, అమ్మగా తన పాత్రపోషిస్తూనే వృత్తిపరంగానూ రాణిస్తున్న మాధవీలత అభిరుచిలోనూ తనదైన శైలి కబరుస్తుంటారు. కవితలనూ రాస్తుంటారు. ‘ఆశా’వహ దృక్పథంతో.. గుంటూరు వెస్ట్: ఆశావహ దృక్పథమే ఆమెను ముందుకు నడిపింది. పరిస్థితులకు ఎదురీదుతూనే ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. రూ.200తో వ్యాపారం మొదలు పెట్టి రూ.40లక్షల టర్నోవర్‌కు చేర్చారు. ఆమె పేరు ఆశా సేకూరు. ఊరు గుంటూరు. సహజసిద్ధ ఉత్పత్తుల తయారీతో సమున్నత ప్రగతి సాధించారు. ఇప్పుడు విదేశాలకూ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆశా విజయగాథ ఆమె మాటల్లోనే.. ఆలోచనాత్మకంగా ముందడుగు.. 2008లో విజయ్ ప్రసాద్‌తో పెళ్లయింది. నేను గర్భిణిగా ఉండగా ఆయన నడిపే యానిమేషన్ స్టుడియో ఆర్థిక ఇబ్బందులతో మూతపడింది. ఎనిమిదో నెలలోనే కూతురు తన్వీ పుట్టింది. సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయినా బెదిరి పోలేదు. ఆ సమయంలో పాప రంగు రావాలని కొన్ని లోషన్స్ వాడాను. అవి వికటించి ర్యాషెస్ వచ్చాయి. అమ్మమ్మకు చెబితే వంటగదిలో లభించే కొన్ని వస్తువులతో సున్నిపిండి చేసి ఇచ్చింది. ఇది పాపకు బాగా పనిచేసింది. అప్పుడే సహజసిద్ధ ఉత్పత్తులు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. సున్నిపిండి తయారీకి కేవలం రూ.200 ఖర్చయింది. ఆచరణ ఇలా.. ఆ తర్వాత పాప శరీరానికి బాదం ఆయిల్ మంచిదని రూ.5.000 వెచ్చించి చత్తీస్‌గఢ్ నుంచి ఆయిల్ ఎక్స్్రస్టేట్ మిషన్ కొన్నాను. కేజీ బాదం పప్పును పిండితే కేవలం 150 గ్రాములే వచ్చింది. దానిలో మరికొన్ని వస్తువులు కలిపి పాపకు వాడాను. బాగా పనిచేసింది. ఆ తర్వాత సహజసిద్ధ ఉత్పత్తుల తయారీలో ఆయుర్వేదిక్ కాస్మొటాలజీ, ఆర్గానిక్, ఇతర సర్టిఫికేట్ కోర్సులు చేశా. సొంతంగా సహజసిద్ధ సౌందర్య ఉత్పత్తులు తయారు చేసి మొదట నా బిడ్డకు వాడేదాన్ని. వాటి ఫలితాల ఆధారంగా తన్వీ నేచురల్స్ పేరిట సంస్థ స్థాపించి మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టా. ప్రస్తుతం 25 రకాల వస్తువులు తయారు చేస్తున్నా. సంస్థ టర్నోవర్ ఇప్పుడు రూ.40లక్షలు. విదేశాలకూ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నా. ప్రస్తుతం 600 మంది రెగ్యులర్ వినియోగదారులు ఉన్నారు. యువతకూ ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా అనుభవాలు వారికి మార్గదర్శకంగా ఉంటాయని భావిస్తున్నాను. -
Yogita Satav: ఒక్కసారి కూడా బస్సు నడపలేదు.. కానీ ఆపత్కాలంలో ఏకంగా 35 కి.మీ.!
మహిళలు తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించగలరు. ధైర్యంతో ముందడుగు వేసి అద్భుతాలు సృష్టించగలరు. పుణెకు చెందిన యోగిత సతవ్ ఇందుకు చక్కని ఉదాహరణ. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడారామె. ఆమె ఆత్మవిశ్వాసం, ప్రదర్శించిన ధైర్య సాహసాలే ఓ కుటుంబాన్ని నిలబెట్టాయి. జనవరి 7, 2022. 20 మంది మహిళలు కలిసి ఓ మినీ బస్సులో పిక్నిక్కు బయల్దేరారు. పుణె శివార్లలో సరదాగా గడపాలని భావించారు. కానీ ఇంతలో అనుకోని ఉపద్రవం ముంచుకువచ్చింది. బస్సు నడుపుతున్న డ్రైవర్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు అతడిని ఎలా కాపాడాలో అర్థంకాక బిక్కచచ్చిపోయారు. 42 ఏళ్ల యోగిత మాత్రం అలా చూస్తూ ఊరుకోలేకపోయారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. గతంలో కారు నడిపిన అనుభవం ఉన్న ఆమె.. బస్సును ముందుకు పోనిచ్చారు. 35 కిలోమీటర్ల పాటు డ్రైవింగ్ చేసి సదరు డ్రైవర్‌ను ఆసుపత్రికి చేర్చారు. కథ సుఖాంతమైంది. హాట్సాఫ్ యోగిత కొటక్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ #DriveLikeALady క్యాంపెయిన్‌లో భాగంగా యోగిత ధైర్యసాహసాలపై ఓ యాడ్ ఫిల్మ్ రూపొందించింది. ఆపత్కాలంలో ఆమె వ్యవహరించిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడింది. మహిళా డ్రైవర్ల సేవల పట్ల సానుకూలతతో ముందుకు సాగేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో యోగితపై ప్రశంసల జల్లు కురుస్తోంది. హ్యాట్సాఫ్ యోగిత అంటూ ఆమెను కొనియాడుతున్నారు. ఇక బస్సు నడపడం గురించి యోగిత గతంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత 20 ఏళ్లుగా మారుతి సెలరియో, అసెంట్, ఓమిని వ్యాన్ నడుపుతున్నాను. అయితే, బస్సు నడపడం ఇదే తొలిసారి. ఆ సమయంలో నాకు వేరే మార్గం కనిపించలేదు’’ అని పేర్కొన్నారు. మరి మహిళా దినోత్సవం సందర్భంగా మనం కూడా యోగితకు ముందుగానే విషెస్ చెప్పేద్దాం! చదవండి: Fashion Blouse Trend: డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి -
‘రన్’ అదిరిందిగా!
-
సినీ ఇండస్ట్రీలో జెండా పాతిన స్త్రీలు, ఆ కథేంటో చూద్దామా?
హీరోల చాటు హీరోయిన్లు... కొడుకు డిగ్రీ పాసై వస్తే ఆనందబాష్పాలు రాల్చే తల్లులు... గయ్యాళి అత్తగార్లు.. క్లబ్‌సాంగ్స్ చేసే వ్యాంప్‌లు.. మహిళా ప్లేబ్యాక్ సింగర్లు.. గ్రూప్ డాన్సర్లు.... ఇంతకు మాత్రమే ప్రవేశం ఉన్న భారతీయ సినిమా నేడు క్రమంగా స్త్రీలు శాసించే స్థితికి చేరింది. ఇన్నాళ్లయినా ఇంకా మగ ప్రపంచపు లక్షణాలు ఉన్న సినీ ఇండస్ట్రీలో స్త్రీలు తమ జెండా పాతేశారు. రాబోయే రోజుల్లో సినిమా యూనిట్ అంటే పురుషులు ఎంతమందో స్త్రీలు అంతేమంది కనిపించనున్నారు. కోట్ల విలువ చేసే గ్లామర్ ఇండస్ట్రీలో స్త్రీల సృజనాత్మక సమర్థ భాగస్వామ్యం కనిపిస్తున్నది. ఇప్పుడు ‘యాక్షన్ సీన్’ వారిది కూడా. ముందు ‘రైటింగ్ విత్ ఫైర్’కు బెస్ట్ విషెస్ చెబుదాం.. ఎందుకంటే మార్చి 27న జరగనున్న ఆస్కార్ వేడుకలో ఈ డాక్యుమెంటరీకి అవార్డు వస్తే భారతీయ సినిమా రంగంలో అదో గొప్ప మహిళా విజయం అవుతుంది. ఘన చరిత్రగా నిలుస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్ బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కొంతమంది దళిత మహిళలు స్మార్ట్ఫోన్లు ఉపయోగించి ‘ఖబర్ లెహరియా’ పేరుతో న్యూస్ బులెటిన్‌ను, న్యూస్‌పేపర్‌ను వెలువరించడాన్ని డాక్యుమెంటరీగా తీసిన ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్‌కు నామినేట్ అయిన సందర్భంలో ఈ మహిళా దినోత్సవం జరగడం ఒక విశేషం. ఈ డాక్యుమెంటరీకి ఒక దర్శకురాలు రింతు థామస్. కార్యదర్శులు సూపర్‌స్టార్‌కు మేనేజర్ అంటే మహరాజుకు మంత్రితో సమానం. ఒకప్పుడు మంత్రులూ ఆ తర్వాత మేనేజర్లూ అంతా మగవారే. కాని మీరు షారూఖ్ ఖాన్‌తో సినిమా తీయాలని బయలుదేరండి... ముందు అతని మేనేజర్ పూజా దద్లానీని కలవాలి. 2012 నుంచి షారూఖ్ ఖాన్ మేనేజర్‌గా ఉన్న దద్లానీ అతని కుటుంబ సభ్యురాలన్నంతగా కలిసిపోయింది. షారూఖ్ ఖాన్ తన కుమారుడు ఆర్యన్ ఖాన్ కేసులో ఆందోళనలో ఉన్నప్పుడు ఆమే సకల వ్యవహారాలు చూసింది. జీతాలు, భత్యాలు కలిపి నేటికి ఒక 50 కోట్లు ఆమె రాబడి పొంది ఉంటుందని అంచనా. ప్రేక్షకులు స్టార్ మీద ఆధారపడితే స్టార్ ఒక మహిళా మేనేజర్ మీద ఆధారపడే సినిమా యుగం ఇది. అయితే ఆమిర్ ఖాన్ మేనేజర్ ఎవరు? బింకీ మెండెస్. ఆమె అతని పక్కనే ఉండి నిమిష నిమిషం అతనేం చేయాలో చెబుతుంటుంది. సరే.. మీకు కరీనా కపూర్ డేట్స్ కావాలా? ఆమె మేనేజర్ పూనమ్ దమానియాను కలవాలి. రణ్వీర్ సింగ్ యాడ్ చేయాలన్నా, సినిమాకు సైన్ చేయాలన్నా అతని మేనేజర్ సుశాన్ రోడ్రిగ్స్‌ను దాటి రావాలి. ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్... వీళ్లందరి మేనేజర్లు ఇప్పుడు స్త్రీలే. ఒకప్పుడు బాలీవుడ్లో మేనేజర్లుగా మగవారు రాజ్యం ఏలారు. కాలక్రమంలో వారు ప్రొడ్యూసర్లుగా కూడా మారారు. కాని స్త్రీలే తమ కెరీర్‌ను మెరుగ్గా మలచగలరని స్టార్లు భావిస్తున్నారు. నేటి ముఖ్యమైన మార్పు ఇది. కార్యనిర్వాహకులు టాప్ ప్రొఫెషనల్ ప్రొడక్షన్ హౌస్‌లు తమ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా మహిళలనే ఇప్పుడు నియమించుకుంటున్నాయి. యశ్‌రాజ్ ఫిల్మ్స్ వంటి సంస్థల్లో ఒక సినిమా ప్రపోజల్ గట్టెక్కాలంటే ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లను ఒప్పించాలి. ముంబైలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మహిళా కంటెంట్ హెడ్స్‌తో నిండి ఉన్నాయి. కంటెంట్‌ను తీసుకెళ్లి వీరి ముందు పెట్టి ప్రాజెక్ట్స్ ఫైనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అపర్ణా పురోహిత్ అమెజాన్ ఒరిజినల్స్‌కు హెడ్‌గా ఉంది. మోనికా షేర్గిల్ ‘నెట్‌ఫ్లిక్స్’లో కంటెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉంది. ఇక ఏఎల్టీ బాలాజీ ప్రొడక్షన్స్‌ని ఏక్తా కపూర్ చూస్తుందన్న సంగతి తెలిసిందే. ‘స్త్రీలు ఎంత సమర్థంగా ఇంటిని నడపగలరో అలాగే ప్రొడక్షన్ హౌస్ అనే ఇంటిని కూడా నడపగలరు’ అనే భావన రావడం వల్లే స్త్రీలకు బాధ్యతలు ఇవ్వడం జరుగుతోంది. ఆ బాధ్యతలను స్వీకరించాక వారు గొప్పగా పని చేస్తున్నారు కూడా. బిహైండ్ ది స్క్రీన్ సినిమా రంగంలో నేటికీ ‘స్పాట్ బాయ్’, ‘లైట్ బాయ్’ ఉన్నారు తప్ప ‘స్పాట్ గర్ల్’, ‘లైట్ గర్ల్’ లేరు. సినిమా ఇంతకాలం పురుష ఆధారిత రంగంగానే పురుషుల నియంత్రణలోనే ఉంది. ప్రొడక్షన్ హౌస్‌ల అధిపతులుగా మగవారే ఉన్నారు. దశాబ్దాల పాటు మగ ప్రొడ్యూసర్ల, హీరోల, డైరెక్టర్ల దయాదాక్షిణ్యాల మీద, మెహర్బానీ మీద స్త్రీలు ఆ రంగంలో మనుగడ సాగించాల్సి వచ్చింది. అయితే అందరూ కాదు. ఏం మాకేం తక్కువ... మేమూ చేసి చూపించగలం అని మగవారినీ ఉలిక్కిపడేలా చేసిన ధీరలూ వీర వనితలూ ఉన్నారు. మీర్జాపురం రాజావారిని వివాహం చేసుకుని శోభనాచల స్టూడియో బాధ్యతలు చూస్తూ హిట్ సినిమాల నిర్మాతగా ఉన్న చిత్తజల్లు కృష్ణవేణికి ‘మన దేశం’లో ఏకంగా ఎన్టీఆర్‌కు అవకాశం ఇచ్చిన ఘనత ఉంది. స్టూడియో స్థాపించడమే కాదు నటిగా, గాయనిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా చక్రం తిప్పిన తెలుగు మూర్తి భానుమతి రామకృష్ణను యావత్ దక్షణాది పరిశ్రమ నెత్తిన పెట్టుకుంది. హిందీలో దాదాసాహెబ్ ఫాల్కేకు దీటుగా 1926–28 మధ్య సినిమాలు తీసిన తొలి మహిళ ఫాతిమా బేగమ్ కీర్తి బయటకు రాలేదు. ఆ ప్రింట్లు అందుబాటులో లేకపోవడమే కారణం. లండన్‌లో సినిమా కళను చదువుకొని వచ్చిన దేవికా రాణి ‘బాంబే టాకీస్’ స్థాపించి దేశానికి దిలీప్ కుమార్ వంటి హీరోని ఇచ్చింది. సరస్వతి దేవి, జద్దన్ బాయి (నర్గిస్ తల్లి) హిందీ రంగంలో తొలిగా బాణీలు కట్టిన మహిళా సంగీతకారులు. ఇస్మత్ చుగ్తాయ్ స్క్రిప్ట్‌లు రాసింది. జొహ్రా సైగల్ కొరియోగ్రఫీ చేసింది. స్త్రీలు సగర్వంగా తమ ప్రాతినిధ్యం చూపారు. కాని ఈ కొద్దిమంది ప్రతిభను మించిన మగవారి ప్రాతినిధ్యం వారిని వెనుకగానే ఉంచింది. తెరమరుగవుతున్న స్టీరియోటైప్ సినిమా రంగం అనేది ఒక విచిత్రమైన పని తీరు ఉన్న రంగం. మగవాళ్లు ఉన్న గదిలో మరో మగాడు సులభంగా దూరి పనికి సంబంధించిన చర్చను సాగిస్తాడు అక్కడ. కథ కోసం సిట్టింగ్‌కు ఎక్కడికో కొందరు మగవాళ్లు వెళతారు. లొకేషన్స్ వెతకడానికి కొందరు మగవాళ్లు వెళతారు. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కొందరు మగవాళ్లు కూచుంటారు. సినిమా వ్యాపార లావాదేవీల్లో కొందరు మగవాళ్లు కూచుంటారు. స్త్రీలు సులువుగా అతి మామూలుగా ఈ చోట్లలోకి వెళ్లే పరిస్థితులు ఆ కాలంలో లేవు. పైగా పెద్దగా చదువు లేని దిగువ సిబ్బంది చాలామంది లొకేషన్లో పని చేస్తారు. వారికి ‘మగవారి మాట’ వినాలనే కండిషన్ ఉన్న మైండ్‌సెట్ ఉంటుంది. దానికి భిన్నంగా స్త్రీ నిర్మాతనో, స్త్రీ దర్శకురాలినో, సినిమాటోగ్రాఫర్నో వారు అంగీకరించరు. అదే కాక పని నేర్పించడానికి కూడా మగ సీనియర్లు సిద్ధంగా ఉండరు. ఇవన్నీ స్త్రీలు సినిమా రంగంలోని వివిధ క్రాఫ్ట్స్‌లలో ప్రవేశించడానికి నిన్న మొన్నటి వరకూ అడ్డంకిగా నిలిచాయి. ఇప్పుడూ నిలుస్తూ ఉన్నా స్త్రీలు గేట్లు తోసుకుని వెళ్లి తాము కూచుంటున్నారు. ఓనర్ ఆఫ్ ది షిప్ భానుమతి, అంజలీ దేవి, బి.శాంతకుమారి తో మొదలెట్టి జయసుధ, జీవిత, మంచు లక్ష్మి వరకూ నటీమణులు నిర్మాతలుగా మారడం సినీ పరిశ్రమలో ఆనవాయితీ. స్త్రీలు ఇవాళ నిర్మాతలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా సినిమాలను డిసైడ్ చేస్తున్నారు. ఏక్తా కపూర్ టెలివిజన్ రంగంతో పాటు సినిమా రంగంలో కూడా ప్రొడ్యూసర్‌గా ఒక బలమైన శక్తిగా నిలిచింది. దీపికా పడుకోన్, అనుష్క శర్మ, ప్రియాంకా చోప్రా నిర్మాతలుగా మారి చాలా సీరియస్‌గా సినిమాలను నిర్మిస్తున్నారు. రెడ్ చిల్లీస్ బ్యానర్లో జూహీ చావ్లాతో పాటు గౌరీ ఖాన్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ తరఫున కిరణ్ రావు మేలిమి సినిమాలు తీస్తున్నారు. ‘లంచ్ బాక్స్’ సినిమా నిర్మించిన గునీత్ మోంగా మరో ముఖ్య నిర్మాత. తెలుగులో ఇప్పుడు యువ మహిళా నిర్మాతలు ఉత్సాహంగా సినిమాలు తీస్తున్నారు. సునీత తాటి (ఓ బేబీ, శాకినీ డాకినీ, దొంగలున్నారు జాగ్రత్త), పరుచూరి ప్రవీణ (కేరాఫ్ కంచరపాలెం), కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య (నేను మీకు బాగా కావాల్సినవాడిని), సుస్మిత కొణిదెల (సేనాపతి, శ్రీదేవి శోభన్‌బాబు), నాగబాబు కుమార్తె నిహారిక (ముద్దపప్పు ఆవకాయ, సూర్యకాంతం), కృష్ణంరాజు కుమార్తె ప్రసీద (రాధేశ్యామ్), దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి, గుణశేఖర్ కుమార్తె నీలిమా గుణ (శాకుంతలం), అమలా పాల్ (తెలుగు–తమిళ ‘కడవేర్’) వీరంతా సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే సుప్రియా యార్లగడ్డ, స్వప్నా దత్, ప్రియాంకా దత్‌లు నిర్మాతలుగా ప్రూవ్ చేసుకున్నారు. తెలుగులోనే నిత్యా మీనన్ ‘స్కైల్యాబ్’ను, కాజల్ అగర్వాల్ ‘మను చరిత్ర’ను నిర్మించారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. మన విజయనిర్మల 40కి పైగా కమర్షియల్ సినిమాలకు దర్శకత్వం వహించడం, కెప్టెన్లా సమర్థంగా యూనిట్‌ను నడపడం ఒక పెద్ద ఘనత. ఈ కెప్టెన్ స్థానాన్ని స్త్రీలు ఇప్పుడు మరింత సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఈ పని అన్ని భాషల్లోనూ జరుగుతోంది. 1980లలో సాయి పరాంజపే, కల్పనా లాజ్మీ, మీరా నాయర్, అపర్ణాసేన్ వచ్చి మహిళా దర్శకుల ఉనికిని దేశమంతా చాటారు. ఆ తర్వాత దీపా నాయర్ అంతర్జాతీయ ఖ్యాతి పొందుతూ భారతీయ మహిళా దర్శకుల మేధను చాటింది. నిజానికి స్త్రీలు పారలల్ సినిమాలు మాత్రమే తీస్తారు అనే ముద్ర నుంచి నేడు జోయా అఖ్తర్ వంటి మహిళా దర్శకులు హిందీ సినిమాను బయట పడేశారు. ఆమె తీసిన ‘గల్లీ బాయ్’, ‘జిందగీ నా మిలేగీ దుబారా’ వంటి సినిమాలు కలెక్షన్ల రికార్డులు తిరగరాశాయి. ఆమె అడిగితే సూపర్స్టార్లు డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెలాగే ఎందరో యువ మహిళా దర్శకులు సినిమాలు తీస్తున్నారు. గౌరి షిండే (డియర్ జిందగీ, ఇంగ్లిష్ వింగ్లిష్), అలంకృతా శ్రీవాస్తవ (లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా), మేఘనా గుల్జార్ (తల్వార్, రాజీ, చపాక్), రీమా కాగ్తీ ( తలాష్, గోల్డ్), నందితా దాస్ (మంటో), ఫర్హా ఖాన్ (మై హూనా, ఓమ్ శాంతి ఓమ్), అశ్విని అయ్యర్ తివారీ (నీల్ బత్తి సన్నాట, బరేలీకి బర్ఫీ), తనూజా చంద్ర (కరీబ్ కరీబ్ సింగిల్), అనూష రిజ్వీ (పీప్లీ లైవ్)... బాలీవుడ్లో తమ వాటా సినిమాలను పొందుతున్నారు. దక్షిణాదిన నటిగా మంచి గుర్తింపు పొందిన రేవతి ఇంగ్లిష్ చిత్రం ‘మిత్ర్ మై ఫ్రెండ్’తో దర్శకురాలిగానూ నిరూపించుకున్నారు. ప్రస్తుతం కాజోల్‌తో ‘సలామ్ వెంకీ’ తెరకెక్కిస్తున్నారు. దక్షిణాదిలో సుధా కొంగర (గురు, ఆకాశమే నీ హద్దురా), అంజలీ మీనన్ (బెంగళూరు డేస్) గుర్తింపు పొందారు. తెలుగులో నందినీ రెడ్డి (అలా మొదలైంది, ఓ బేబీ), సుజనా రావు (గమనం), లక్ష్మీ సౌజన్య (వరుడు కావలెను), గౌరీ రోణంకి (పెళ్లి సందడి), గంటా దీప్తి (మీట్ క్యూట్ వెబ్ ఆంథాలజీ), నటి కల్యాణి తదితరులు ఉన్నారు. అలాగే తెలుగులో స్క్రిప్ట్, పాటలు, డైలాగులు రాస్తున్న స్త్రీలు ఉన్నారు. చైతన్య పింగళి, శ్రేష్ఠ, చల్లా భాగ్యలక్ష్మి, లక్ష్మీ ప్రియాంక, కడలి సత్యనారాయణ వంటి లిరిసిస్ట్లు ఇప్పటికే పదుల కొద్దీ పాటలు రాయడం విశేషం. స్క్రీన్ప్లేస్ కాలం చాలా మారింది. స్త్రీల ఉద్యమాలు, విద్య, ఉపాధి స్త్రీలను సినిమా రంగంలో కూడా ప్రయత్నం చేయమంటున్నాయి. స్త్రీల విజయగాధలు ఇప్పుడు కథాంశాలు అయ్యాయి. ‘మేరీ కోమ్’, ‘సైనా నెహ్వాల్’, ‘మిథాలీ రాజ్’ వంటి క్రీడాకారిణుల కథలు తెరకు ఎక్కుతున్నాయి. కరణం మల్లీశ్వరి గుర్తుకు వస్తోంది. ‘మిషన్ మంగళ్’లో ఆడవారి భాగస్వామ్యం సినిమా అవుతోంది. ‘పింక్’ వంటి కథాంశాలతో స్త్రీల హక్కులను చర్చిస్తున్నారు. మగవాడికి ఒక్క చెంపదెబ్బ కొట్టే అధికారం కూడా లేదని ‘థప్పడ్’ వంటి సినిమాల్లో చూపిస్తున్నారు. వారి లైంగిక ఉద్వేగాలు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల చర్చకు వస్తున్నాయి. ఇవన్నీ స్త్రీలను సినిమా కథాంశంలోనే కాదు సినిమా నిర్మాణంలో కూడా పాలుపంచుకునే ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఒక్క అమ్మాయిని పెట్టుకోవడానికి ఇష్టపడని సినిమా ఆఫీసులు ఇవాళ ప్రతి సినిమాకు ఒకరో ఇద్దరో అమ్మాయిలకు జాబ్ ఇస్తున్నాయి. ఆర్ట్ డైరెక్టర్లుగా, కాస్ట్యూమ్ డిజైనర్లుగా, మేకప్ విమెన్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా స్త్రీలు తమ ఉనికి ప్రదర్శించేంత స్పేస్‌ను తీసుకుంటున్నారు. ఇది చిన్న విషయం కాదు. చిన్న విజయం కాదు. అయినప్పటికీ... అయితే సినిమా పరిశ్రమ స్త్రీలకు పూలదారిగానే ఉందా? అలా చెప్పలేము. ఇటీవలి ‘మీటూ’ ఉద్యమం సినిమా రంగంలో చాలా మందినే వేలెత్తి చూపింది. స్టూడియోల్లో, ఔట్‌డోర్స్‌లో స్త్రీలకు వారి అవసరాలకు సున్నితత్వాలకు తగినట్లుగా ఏర్పాట్లు జరగడం లేదు. వారి మాటకు విలువ రావాలంటే వారు ఎంతో ప్రతిభ చూపించాల్సి వస్తోంది. నేటికీ పది మంది నిర్మాతల్లో ఇద్దరే మహిళా దర్శకురాళ్ల మీద నమ్మకం ఉంచి ప్రాజెక్ట్‌లు ఇస్తున్నారు. హీరోలు కూడా మరింత ఎరుకతో మహిళా టెక్నిషియన్లను ఎంకరేజ్ చేయాల్సి ఉంది. కాని ఇప్పటికి చాలానే జరిగినట్టు లెక్క. స్త్రీలు సినిమా ఆవరణంలో ఉన్నారు. వారు మరింతమంది స్త్రీలను ఆవరణంలోకి తెచ్చుకుంటారు. భారతీయ సినిమా రంగంలో స్త్రీల జయకేతనం కొనసాగుతుంది. షీరోస్ సమాజానికి ప్రతిబింబమే సినిమా. అది ఆకాశంలో నుంచి ఊడిపడలేదు. సమాజం ఫలానా విధంగా ఉంటే అదీ ఫలానా విధంగానే ఉంది. దేశానికి పెద్ద, రాష్ట్రానికి పెద్ద, ఆఫీసుకు పెద్ద, ఇంటికి పెద్ద మగవాడు అయినప్పుడు సినిమాకి పెద్ద కూడా మగవాడే అవుతాడు. నాయకుల కథలే ప్రజలు వింటున్నప్పుడు సినిమాలు కూడా నాయక పాత్రల కథలే చెప్పాయి. అయినప్పటికీ శక్తిమంతమైన స్త్రీ పాత్రలను భారతీయ సినిమా రంగం హిందీలోకాని, దక్షణాదిలోగాని నిలబెట్టుకోగలిగింది. ప్రతిభావంతమైన నటీమణుల వల్లగాని, కుటుంబ మనుగడకు ఆధారం స్త్రీ గనుక స్త్రీ ప్రేక్షకులను కూడా ‘వినిమయ వర్గం’గా చూడటం వల్లగాని సినిమాల్లో స్త్రీ ఉనికి నిలబడుతూ వచ్చింది. మహబూబ్ ఖాన్ తీసిన ‘మదర్ ఇండియా’ ఈ మేరకు ఒక ఉదాత్త సందేశం ఇచ్చింది. దక్షిణాదిలో ఈ స్థాయి కథలు లేకపోయినా స్త్రీని సెంటిమెంట్‌కు మూలకారణంగా తీసుకుంటూ వందల సినిమాలు తయారయ్యాయి. ‘చరణదాసి’, ‘సుమంగళి’, ‘నాదీ ఆడజన్మే’, ‘మూగనోము’, ‘దేవత’, ‘చిట్టిచెల్లెలు’, ‘కోడలు దిద్దిన కాపురం’, ‘అమ్మ కడుపు చల్లగా’... వంటివి స్త్రీ కథలుగా వచ్చాయి. కాని అదే సమయంలో టాలెంట్‌ను గ్లామర్‌ను రంగరిస్తూ హీరోలతో సమానంగా సినిమాను శాసించగల స్థితికి హిందీలో నర్గిస్, నూతన్, మధుబాల, మీనాకుమారి, వైజయంతి మాల దక్షిణాదిలో సావిత్రి, జమున, జయలలిత, బి.సరోజాదేవి, వాణిశ్రీ తదితరులు ఎదిగారు. ఒక దశలో టాప్ హీరోయిన్ల డేట్ల కోసం హీరోలు పడిగాపులు గాచే స్థితి వచ్చింది. ‘ఇగో’ క్లాషెస్ వంటివి దారి తీసి జమునతో ఇద్దరు సూపర్స్టార్లు ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ నటించము అనే నిర్ణయం తీసుకునే వరకు పరిస్థితులు వెళ్లాయి. ఇవన్నీ స్త్రీలు సినిమా పరిశ్రమలో తమ ఉనికిని ప్రతిపాదించడానికి తొలినాళ్లలో చేసిన పెనుగులాటగా చూడాలి. కెమెరా కన్నులు సీనియర్ దర్శకుడు బి.ఆర్.పంతులు కుమార్తె బి.ఆర్.విజయలక్ష్మిని భారతదేశంలో తొలి మహిళా సినిమాటోగ్రాఫర్‌గా చెప్పుకోవచ్చు. ఆమె కె. భాగ్యరాజా హీరోగా నటించిన ‘చిన్నవీడు’ (చిన్నిల్లు) వంటి సినిమాలకు పని చేసింది. 40 ఏళ్ల క్రితం ఒక మహిళా సినిమాటోగ్రాఫర్ ఉండటం చాలా వింత. ఇవాళ అన్ని భారతీయ సినిమా పరిశ్రమల్లో కలిపి కెమెరా అసిస్టెంట్లుగా, కెమెరా విమెన్‌గా, డీఓపీలుగా పని చేస్తున్న స్త్రీలు కనీసం వందమంది ఉన్నారు. వీరంతా ‘ఇండియన్ విమెన్ సినిమాటోగ్రాఫర్స్ కలెక్టివ్’ (ఐడబ్ల్యూసీసీ)గా ఒక గ్రూప్‌గా పరస్పరం మద్దతు ఇచ్చుకుంటున్నారు. ఇవాళ బాలీవుడ్లో భారీ సినిమాలకు మహిళా సినిమాటోగ్రాఫర్లు పని చేస్తున్నారు. ప్రియా సేథ్ (ఎయిర్ లిఫ్ట్, చెఫ్), సవితా సింగ్ (హవాయిజాదా), ఫౌజియా ఫాతిమా (మిత్ర్– మైఫ్రెండ్), దీప్తి గుప్తా (హనీమూన్ ట్రావెల్స్ ప్రయివేట్ లిమిటెడ్), తమిళంలో ప్రీతా జయరామన్... వీళ్లందరూ తమ కన్నుతో సినిమా చూపిస్తున్నారు. ఏ మాత్రం జంకక క్రేన్ షాట్స్‌ను షూట్ చేస్తున్నారు. -
పింఛన్ తప్ప ఆస్తులేం లేవు, అయినా పెళ్లికి రెడీ..
కరీంనగర్‌టౌన్: కండరాల క్షీణత వ్యాధి అతడిని మంచానికే పరిమితం చేసింది. కూర్చోవాలన్నా.. పడుకోవాలన్నా.. అన్నం తినాలన్నా ఒకరు ఉండాల్సిందే. వ్యాధితో నరకయాతన భరించలేక 2012లో మెర్సికిల్లింగ్(కారుణ్య మరణం)కు దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి కట్టిన రేకుల షెడ్డు.. వికలాంగుల పింఛన్ తప్ప ఎలాంటి ఆస్తులు లేవు. అయినా అతడిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చిందో మహిళ. మూడేళ్లుగా సేవ చేస్తున్న ఆమె మూడు ముళ్ల బంధంతో అతడికి భార్యగా మారింది. మహిళా దినోత్సవం సోమవారం రోజు ఆ జంట ఏకమైంది. కరీంనగర్‌లోని హౌజింగ్‌బోర్డు కాలనీ మధురానగర్‌లో నివాసం ఉంటున్న కట్ల శంకరయ్య, అనసూయ దంపతుల కుమారుడు శ్రీనివాస్(48)కు పద్దెనిమిదేళ్ల వయస్సులో ఎడమకాలు శీలమండ వద్ద స్పర్శ లేకుండా పోయింది. క్రమంగా కాళ్లు, చేతులు, శరీరానికి పాకింది. వైద్యులు పరీక్షించి కండరాల క్షీణత వ్యాధి సోకినట్లు తెలిపారు. అప్పటి నుంచి శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణిస్తూ పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాడు. తల్లిదండ్రులే సేవ చేసేవారు. మూడేళ్ల క్రితం తండ్రి మృతిచెందాడు. దీంతో శ్రీనివాస్‌కు సపర్యలు చేసేందుకు ఇంటి సమీపంలోనే ఉండే కంచర్ల శాంతమ్మ, గట్టయ్య దంపతుల కూతురు పద్మ(31)ను వేతనానికి నియమించారు. మూడేళ్లుగా సేవలు చేస్తుండడంతో ఇద్దరి మనసులు కలిశాయి. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులను ఒప్పించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో దండలు మార్చుకున్నారు. బతుకుపై భరోసా పెరిగింది : శ్రీనివాస్ పద్మ నా జీవితంలోకి వచ్చాక బతుకుపై భరోసా పెరిగింది. ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు. కానీ బతికినంత కాలం పద్మతో సంతోషంగా బతుకుతాను. రాత్రి, పగలు తేడా లేకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు నాకు అన్నీ తానై చూసుకుంటుంది. చావు అంచుల వరకు వెళ్లిన నాకు పద్మ చక్కటి తోడైంది. బతికున్నంత వరకు సేవ చేస్తా : పద్మ శ్రీనివాస్‌ను నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నా. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. మూడేళ్లుగా సేవ చేస్తున్నా. భార్యగా ఇంకా గొప్పగా చూసుకుంటాననే నమ్మకం నాకుంది. ఒకరి కోసం ఒకరన్నట్లు జీవిస్తం. శ్రీనివాస్‌కు గానీ, నాకు గానీ ఎలాంటి ఆస్తులు లేవు. మా పరిస్థితి చూసి ప్రభుత్వం గానీ, దాతలు గానీ సహకరిస్తే బతికున్నంత వరకు సేవ చేస్తూ ఉంటా. చదవండి : (73 ఏళ్ల వృద్ధుడికి పెళ్లి ఆశ చూపించి.. రూ.కోటి టోకరా) (జీతం రూ.7,500.. అయితేనేం మనసు పెద్దది!) -
మార్చి 8 తప్ప మిగతావన్నీ మా దినోత్సవాలే.. మేడం!
-
రంగమేదైనా మహిళలే రాణిస్తున్నారు..
చిత్తూరు: వంటింటి నుంచి మొదలైన అతివ అడుగులు అంతరిక్షాన్ని స్పృశిస్తున్నాయి. సాగరం కన్నా లోతైన ఆమె మదిలో పుడుతున్న ఆలోచనలు ప్రపంచ దిశను మార్చేస్తున్నాయి. ఇంటా బయట ఆమె తల్లిగా.. చెల్లిగా.. భార్యగా.. కోడలిగా.. ఎలాంటి బాధ్యతనైనా నిర్వర్తించడంలో ఆమె నిరుపమాన ప్రేమమూర్తి. కలెక్టర్.. డాక్టర్..డ్రైవర్.. రచయిత.. సమాజసేవకురాలు.. రాజకీయనేత.. రంగం ఏదైనా ఇంతింతై రాణించగల సత్తా ఆమె సొంతం. తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలు సాధిస్తూ, విభిన్న రంగాల్లో విజయగీతిక ఆలపిస్తున్న మహిళల గాధలు మహిళాదినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం. పల్లె నుంచి ఆర్థిక రాజధానికి.. ఈమె పేరు ఉషారాణి. పెద్దతిప్పసముంద్రం మండలంలోని మారుమూలపల్లెలో పుట్టింది. ప్రభుత్వ పాఠశాలల చదువుకుంది. అయితేనేం.. దేశ ఆర్థిక రాజధాని మంబైలోని ఎస్బీఐ పధాన కార్యాలయంలో డీజీఎంగా పనిచేస్తున్నారు. ఆమె ప్రస్థానం విద్యారి్థనులకు స్ఫూర్తిదాయకం. బి.కొత్తకోట మండలం బడికాయలపల్లెకు చెందిన కొటికె మీనాక్షమ్మ, పట్టాభి రామచంద్రారావ్ దంపతులకు ఏడుగురు సంతానం. వీరిలో ఐదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. చిన్న కుమార్తె ఉషారాణి స్వగ్రామం బడికాయలపల్లె నుంచి మదనపల్లెకు మకాం మారింది. ఏడో తరగతి వరకు మదనపల్లె మున్సిపల్ స్కూల్, పదో తరగతి ప్రభుత్వ జీఆర్టీ స్కూల్, ఇంటర్, డిగ్రీ బీటీ కాలేజీలో చదివారు. అనంతపురం ఎస్కే. యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. మదనపల్లెలో ఏడేళ్లు లా ప్రాక్టీస్ చేశారు. 1995లో ఎస్బీలో లా ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరారు. 2018 వరకు వరంగల్, హైదరాబాద్ బ్రాంచ్‌ల్లో డిప్యూటీ మేనేజర్, మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. 2019 నుంచి ముంబయిలోని ఎస్బీఐ కార్పొరేట్ సెంటర్లో డీజీఎంగా కొనసాగుతున్నారు. ప్రకాశం జిల్లా చెన్నుపల్లెకు చెందిన మురళీమోహన్‌తో ఉషారాణికి వివాహం జరిగింది. భర్త హైదరాబాద్‌లో హైకోర్టు న్యాయవాది. ఒక్కకే కుమార్తె యశస్విని ఢిల్లీ వర్సిటీలో ఎంఎస్సీ సైకాలజీలో పీహెచ్డీ చేస్తోంది. – పెద్దతిప్పసముద్రం మహిళలే పాలకులు మదనపల్లె : ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం. ఈ మాట మున్సిపల్ పాలకవర్గంలో సార్థకమైంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారితకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రపంచ మహిళా దినోత్సవ కానుకగా వారికే అధిక సీట్లు కేటాయింది. దీంతో మున్సిపాలిటీలో 58 ఏళ్ల చరిత్ర తిరగరాశారు. సుదీర్ఘకాల యానంలో ఏడుగురు పురుషులే ఇప్పటి వరకు చైర్మన్లుగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ప్రాధాన్యం వల్ల తొలిసారి మహిళ చైర్పర్సన్ పాలన సాగించనున్నారు. పట్టణంలో 35 వార్డుల్లో మహిళలు 9 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 9వార్డుల్లో పోటీలో ఉన్నారు. దీంతో మహిళల సాధికారితకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. -
ఏపీలో దిశతో మారుతున్న మహిళల దశ
-
వంద శాతం సమాన హక్కులు కల్పిస్తున్న దేశాలు ఇవే..
ఆకాశంలో సగం.. అన్నింటా సమానం.. మహిళా దినోత్సవం వస్తే చాలు..మనం ఎప్పుడూ చెప్పుకునేది ఇదే.. నిజంగానే ఆకాశంలో సగమేనా? అన్నింటా సమానమేనా? దీనిపై తాజాగా ప్రపంచబ్యాంకు ‘వుమెన్, బిజినెస్ అండ్ ద లా’ పేరిట ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. 194 దేశాల లెక్క తీస్తే.. కేవలం పది దేశాల్లోనే స్త్రీలకు పూర్తిస్థాయిలో సమాన హక్కులను కల్పిస్తున్నారు. పురుషులతో సమాన హక్కులు అంటే ఇక్కడ నోటి మాటలా చెప్పడం కాదు.. వాటిని పరిరక్షిస్తూ.. ఆయా దేశాల్లో చట్టపరమైన, న్యాయపరమైన రక్షణ కూడా కలిగి ఉండటం. అంటే.. స్వేచ్ఛగా తిరగడం, తనకు నచ్చిన పనిని ఎంచుకునే హక్కు కలిగి ఉండటం, వివాహం విషయంలో స్వేచ్ఛ, సమాన వేతనం, పింఛన్లు, వ్యాపార నిర్వహణ, ఆస్తిపాస్తులు కలిగి ఉండటం ఇలా చాలావాటికి సంబంధించి ఆయా దేశాల్లో చేసిన చట్టాలను ఈ నివేదిక తయారీలో పరిగణనలోకి తీసుకున్నారు. 2019 జాబితాలో చివరి స్థానంలో ఉన్న సౌదీ అరేబియా.. 2020కి వచ్చేసరికి చాలా మెరుగైన ర్యాంకును సాధించింది. అక్కడ కొత్తగా తెచ్చిన చట్టాలే ఇందుకు కారణమని సదరు నివేదిక పేర్కొంది. 2020 జాబితాలో యెమెన్(26.9%) చివరి స్థానంలో నిలిచింది. ఇంతకీ మహిళలకు వందకు వంద శాతం సమాన హక్కులు కల్పిస్తున్న ఆ పది దేశాలు ఏమిటో.. మిగతావాటి పరిస్థితి ఏంటో కొన్ని దేశాల వారీగా ఓసారి చూసేద్దామా.. -
కన్నతల్లే ఆమెను బ్రోకర్లకు అప్పగించింది
'దేవదాసి’ ఆచారం పేరుతో కొన్నిచోట్ల, ఆకలి చంపుకొనే మార్గం కానరాక మరికొన్నిచోట్ల, బలవంతంగా ఇంకొన్నిచోట్ల.. వేశ్యావాటికలకు చేరుతున్న వాళ్లెందరో! ఇలాంటి వాళ్లలో చాల్వాడి భీమవ్వ ఒకరు. కుటుంబం కోసం విధిలేక విషయంలో చిక్కినప్పటికీ ఓ స్వచ్ఛంద సంస్థ చేయూతతో బయటపడి, బలపడిన ఆమె.. ఆ తర్వాత తనలా ఇంకెవరూ ‘దేవదాసి’ బాట పట్టకూడదని చేస్తున్న పోరాటం ప్రశంసనీయమైనది. దేశానికి పశ్చిమాన, కొంకణ్ తీరంలో ఉండే చిన్న రాష్ట్రం గోవా. అక్కడే ఓ చిన్నపట్టణమైన వాస్కోలోని ఓ మురికివాడలో పుట్టింది భీమవ్వ. ఐదుగురు చెల్లెళ్లు్ల. తండ్రి తాగుబోతు. తల్లి చిత్తుకాగితాలు, గాజు సీసాలు ఏరుకొని, వాటిని అమ్ముతూ కుటుంబాన్ని పోషించేది. బతుకు పోరాటం చాలా కష్టంగా సాగేది. భీమవ్వకు పదిహేనేళ్లు రాగానే ‘దేవదాసి’ దురాచారంలోకి మభ్యపెట్టి దింపింది ఆమె తల్లి. కుటుంబం బతకాలంటే తప్పదని ఒప్పించింది. నాలుగు నెలలు గడిచాయో లేదో ఓ బ్రోకర్ చేతికి చిక్కిన భీమవ్వ వాస్కోలోని బైనా అనే వేశ్యావాటికకు చేరింది. అక్కడ లైంగికంగా చిత్రహింసలకు గురైంది. తప్పించుకోవటానికి రెండు, మూడుసార్లు ప్రయత్నించి పట్టుబడింది. ఒకసారి తల్లే తిరిగి బ్రోకర్లకు అప్పగించింది. చివరికి విధిలేక అక్కడే కొససాగింది. ఆ సమయంలోనే.. అక్కడ తనలాంటి అభాగ్యులు, బలవంతంగా తీసుకు రాబడిన వాళ్లు చాలామంది ఉన్నట్లు గుర్తించింది. స్వచ్ఛంద సంస్థ చేయూత దాదాపు రెండేళ్లు గడిచాక 2003లో ఓ రోజు స్థానిక క్రైంబ్రాంచ్ అధికారులు ‘అన్యాయ్ రహిత్ జిందగీ(ఏఆర్‌జడ్)’ స్వచ్ఛంద సంస్థతో కలసి బైనాపై దాడి చేశారు. భీమవ్వతోపాటు చాలామందిని అక్కడి నుంచి బయటపడేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఓ కేంద్రంలోకి వీరిని తరలించారు. ఆ కేంద్రం నుంచి భీమవ్వ విడుదలయ్యాక ఆమె బాగోగులు చూసుకునే బాధ్యతను ఏఆర్‌జడ్ సంస్థే తీసుకుంది. తమ ఆఫీసులో ఉద్యోగం ఇచ్చింది. ఈ క్రమంలో భీమవ్వ ఎంతో మంది మహిళలను కలుసుకొని, వారి గాథలు వింది. తానంటే తప్పించుకుంది. మరి అదే వేశ్యావృత్తిలోకి బలవంతంగా నెట్టివేయబడుతున్న అమ్మాయిల పరిస్థితేంటీ?’ అని ఆలోచింది. వారికోసం ఏమైనా చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే తనలాంటి దేవదాసీలతో కలసి ఓ సంఘం ఏర్పాటు చేసింది. అమ్మాయిల్ని దేవదాసిగా మార్చబోతున్న కుటుంబాలను గుర్తించి, వారిని అడ్డుకుంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా సుమారు 800 మంది బాలికలను వీరు కాపాడింది. అంతేకాదు, వారి ఉపాధికి తగిన మార్గాలనూ చూపింది. వేశ్యావృత్తిలోని వందలాది మందికి విముక్తి కల్పించి, వారికి దారి దివ్వె అయింది. సీఐఐ అవార్డు దేవదాసి వ్యవస్థ నుంచి బాలికలను కాపాడడం, మహిళల అక్రమ రవాణాను అడ్డుకోవడం, వేశ్యావృత్తి నుంచి బయటపడిన వారికి ఉపాధి కల్పించడడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్న భీమవ్వను 2019లో సీఐఐ ఉమెన్ ఎగ్జమ్‌ప్లర్ అవార్డు వరించింది. ఈ పురస్కారం తనకెంతో ప్రోత్సాహం ఇచ్చిందంటుందామె. ‘అవార్డు వచ్చిందని తెలియగానే నమ్మలేకపోయా. చాలాసేపటి వరకు ఏడుపు ఆపుకోలేకపోయాను. దాదాపు 200 మంది ఈ అవార్డు బరిలో ఉన్నా నాకు దక్కడమంటే అద్భుతం అనిపిస్తోంది. చదువులేని, వాస్కో పట్టణం తప్ప మిగిలిన ప్రపంచాన్ని చూడని నాకు ఈ అవార్డు దక్కడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అయితే భవిష్యత్తులో నా పనిని నేను మరింత బాధ్యతగా నిర్వహించేందుకు ఈ అవార్డు నాకో ప్రోత్సాహం కలిగించింది’ అని దృఢనిశ్చయంతో చెబుతోంది భీమవ్వ. -
వైఎస్ విజయమ్మ సైకత శిల్పం
చిల్లకూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, నవ్యాంధ్రకు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రులుగా చేయడంలో వైఎస్ విజయమ్మ కీలకంగా వ్యవహరించారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన సైకత శిల్పి మంచాల సనత్‌కుమార్ ప్రశంసించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె సైకత శిల్పాన్ని రూపొందించానని ఆయన చెప్పారు. -
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఎనిమిది 12 అయితే ఆమెకు ఎదురీతే..
ఈ కాలం అమ్మాయిలు.. చదవని డిగ్రీ లేదు.. చేయని ఉద్యోగం లేదు.. పొందని అవకాశం లేదు.. రాష్ట్రాలూ ఏలుతున్నారు..అరే.. స్పేస్లోకీ వెళ్తుంటే!! వాళ్లకు అండగా ఎన్ని చట్టాలు? 498 (ఏ), డొమెస్టిక్ వయొలెన్స్, నిర్భయ..! బస్సుల్లో వాళ్లకు సీట్లు.. స్థానిక పాలనాసంస్థల్లో సీట్లు.. ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్స్.. ఇంకా.. ఆగొచ్చు అక్కడితో! ఎంత చదువుకుంటున్నా.. ఎన్నో కొలువుల్లో ఉన్నా.. ఆఖరికి అంతరిక్షంలోకి వెళ్లినా ఎక్కడా నాయకత్వంలో లేరు. మహిళాపాలకులనూ వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు! ఎన్ని చట్టాలు వచ్చినా వాళ్ల మీద హింస మాత్రం ఆగట్లేదు. బస్సుల నుంచి స్థానిక పాలనా సంస్థల దాకా ఉన్న సీట్లూ వాళ్లను నాయకులుగా నిలబెట్టేవి కావు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లూ ఆడవాళ్లను బాసులుగా చేయట్లేదు. అన్నీ నేర్చుకొని.. లేదా నేర్చుకోవాలనే తపన చూపించి నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలనుకుంటే... ‘నేను డ్రైవింగ్ నేర్చుకోనా?’ ఉత్సుకతో అడిగిన భార్యకు ‘ముందు పరాఠా చేయడం నేర్చుకో.. డ్రైవింగ్ సంగతి తర్వాత’ అని భర్త చెప్పే సీన్ల (థప్పడ్ అనే బాలీవుడ్ సినిమాలోనిది)వంటివే ఎదురవుతుంటాయి. తప్ప ‘మిష్టర్ పెళ్లాం’ సినిమాలో లాగా ‘మీ సరకుల్లో చచ్చులు, పుచ్చులు ఉండవని.. ఉంటే చూపించమని సవాల్ చేయండి.. క్వాలిటీనే మీ బ్రాండ్‌గా మార్చుకోండి.. సేల్స్ ఎందుకు పెరగవో చూద్దాం’ అని సలహా ఇచ్చిన మహిళలోని ప్రతిభను మెచ్చి, ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాన్నీ గుర్తించి మేనేజర్ స్థాయి ఉద్యోగం ఇచ్చిన యాజమాన్యం.. అలాంటి సీన్లు కనిపించవు. చర్విత చర్వణంలాంటి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి యూఎన్ విమెన్ ఈ ఏడు ప్రకటించిన థీమ్.. ‘‘విమెన్ ఇన్ లీడర్షిప్: అచీవింగ్ ఏన్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ ఏ కోవిడ్–19 వరల్డ్’’. మహిళలు నాయకత్వం వైపు అడుగులేస్తూ స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించాలని యూఎన్ విమెన్ వింగ్ ఏటా ఒక్కో థీమ్‌తో ప్రపంచాన్ని చైతన్య పరుస్తోంది. ఆ స్ఫూర్తిని అందుకుంటున్న దేశాలున్నాయి. ఆ ప్రయాణాన్ని ఇదివరకే ప్రారంభించిన దేశాలూ ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తున్న దేశాలూ లేకపోలేదు. మనం ఏ జాబితాలో ఉన్నామో మహిళలకు సంబంధించి తాజా పరిస్థితులు, పరిణామాలు, పర్యవసానాలను బట్టి అర్థమవుతూనే ఉంది. సందర్భం కాబట్టి ఇటీవల కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ చేసిన పన్నెండు పని గంటలు, మూడు రోజుల సెలవులు అనే ప్రతిపాదనను మహిళా కోణంలోంచి చూద్దాం. ప్రభుత్వాలు ఎలాంటి ప్రతిపాదన చేసినా.. చేయాలనుకున్నా దాని ప్రభావం స్త్రీల మీద ఎలా ఉంటుందో.. ఎలా ఉండబోతుందో ఒకటికిపదిసార్లు చర్చించి, తరచి చూసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. చట్టాలుగా తేవాలి. ప్రతిపాదన దశలో మహిళా వర్గం నుంచి వస్తున్న స్పందన, ప్రతిస్పందనలనూ పరిగణనలోకి తీసుకోవాలి. కార్మికశాఖ ప్రతిపాదించిన ఈ పనిదినాల మార్పు మీద మెట్రో నగరాల్లో చర్చ మొదలై పోయింది. ‘రోజూ పన్నెండు గంటల చొప్పున వారానికి నాలుగు పనిదినాలు, మూడు వారాంతపు సెలవులు లేదా ఇప్పుడెలా ఉందో అలాగే అంటే రోజుకి ఎనిమిది గంటల చొప్పున వారానికి ఆరు పనిదినాలనే అనుసరించడం. ఇది ఐచ్ఛికం. ఈ రెండింటిలో ఉద్యోగి ఏ పద్ధతినైనా అవలంబించవచ్చు’ అనేదే ఆ ప్రతిపాదన. ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదుకదా.. ఉద్యోగులు అందరికీ కదా? అవును. కానీ ప్రభావం మాత్రం మొత్తం స్త్రీల మీదే ఉంటుంది. అన్నేసి గంటల పనివేళలు ఎవరికైనా ఇబ్బంది. మగవాళ్లు రోజంతా ఆఫీస్‌లో గడిపితే ఇంట్లోని మహిళలు అదనపు భారాన్ని మోయాలి. ఆఫీస్‌కెళ్లే ఆడవాళ్ల తిప్పలైతే చెప్పక్కర్లేదు. విలువలేని ఇంటి చాకిరీతోపాటు ఎంతోకొంత విలువ చేసే ఆఫీస్ చాకిరీ కలసి రోజుకు 24 గంటలూ సరిపోవు. ‘ఎనిమిది, తొమ్మిది గంటల పనివేళలకే ఇంట్లోంచి ఉదయం బయలుదేరితే రాత్రికి గానీ ఇల్లు చేరని పరిస్థితి. నగరాల్లోని ట్రాఫిక్ ఇక్కట్లు ఆ సమయాల్ని మరింత సాగదీస్తాయి. రోజుకి పన్నెండు గంటలంటే ఊహించుకోవడానికేమీ లేదు. ‘అయినా ఇది ఐచ్ఛికమే అంటున్నారు కదా?’ అని కొంతమంది ఉద్యోగినులు, ఉద్యోగులనూ అడిగితే.. ‘ముందు ఆప్షన్‌గానే ఇస్తారు తర్వాత అది తప్పనిసరి నిబంధనగా మారుతుంది. సపోజ్.. మా ఆఫీస్ (ప్రభుత్వ కార్యాలయం)లో కొంతమందిమి ట్వల్వ్ అవర్స్, త్రీ డేస్ వీకెండ్‌ను ఆప్షన్‌గా తీసుకున్నాం అనుకోండి. ఇంకొంతమంది వన్ డే వీకెండ్ ఆప్షన్లో ఉన్నారనుకోండి. ఒక పనికి సంబంధించి ఆ టూ కేటగిరీస్ మధ్య కో ఆర్డినేషన్ ఎలా కుదురుతుంది? యూనిఫార్మిటీ ఉన్నప్పుడే పనులు సవ్యంగా జరగడం కష్టం.. ఇక ఒకే సెక్షన్లో ఇలా డిఫరెంట్ కేటగిరీస్‌లో పనిచేసే వాళ్ల మధ్య ఎలా కుదురుతుంది? దాంతో అందరికీ పన్నెండు గంటల పనివేళలే తప్పనిసరి చేసేస్తారు’ అని చెప్పారు. ఉద్యోగినులు, అందులోనూ వర్కింగ్ మదర్స్‌ను కదిలిస్తే.. ‘ట్వల్వ్ వర్కింగ్ అవర్స్ కన్నా త్రీ డేస్ వీకెండే అట్రాక్ట్ చేస్తుంది ఎవరినైనా. అబ్బా.. మూడు రోజులు హాలీడేస్ అనిపిస్తుంది. కానీ దానికి మొత్తం నాలుగు రోజులను పణంగా పెడుతున్నామన్న ధ్యాస రాదు. ఒకవేళ ఉద్యోగులుగా మనం లాజికల్‌గా ఉండి వన్ డే వీకెండ్ ఆప్షన్‌కి వెళితే ఇంట్లో ప్రెజర్ మొదలవుతుంది. మూడు రోజులు సెలవులిస్తుంటే హాయిగా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండక ఒక్క రోజు సెలవుకి వెళ్లడం ఎందుకు? అని. రోజూ పన్నెండు గంటలు ఆఫీస్‌లో.. ప్లస్ నాలుగ్గంటలు ట్రాఫిక్‌లో ప్రయాణాలతో పదహారు గంటలు బయటే గడిపితే ఇంటి పని ఎప్పుడు చేసుకోవాలి? ఎన్నింటికి నిద్రపోవాలి? ఉదయం ఎన్నింటికి లేవాలి? పిల్లలను ఎవరు చూసుకోవాలి? వాళ్ల తిండీతిప్పలకు అత్త, అమ్మ మీదో.. లేకపోతే సర్వెంట్ మెయిడ్ మీదో ఆధారపడ్డా.. వాళ్ల చదువుసంధ్యలు ఎవరు పట్టించుకోవాలి? దీని బదులు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవడం బెటర్ అనిపిస్తుంది. ఆ వెసులుబాటైనా కల్పించేలా లేవు కదా పెరిగిన ధరలు. మొండికేసి ఉద్యోగమే ముఖ్యం అనుకుంటే ఏదోకరోజు రోగాల కుప్పై సంపాదించుకున్నదంతా మెడికల్ బిల్లులకు పే చేయాల్సి వస్తుంది. అమ్మో... తలచుకుంటేనే భయంగా ఉంది’ అంటున్నారు. నిజమే.. ఇంకా చట్టంగా రాకుండా.. కేవలం చర్చల్లోనే ఈ ప్రతిపాదన ఇంతగా వణికిస్తోంది. బయట పనుల్లో స్త్రీలు భాగస్వాములైనంత చొరవగా, వేగంగా ఇంటి పనుల్లో మగవాళ్లు భాగస్వాములు కాలేదు. మనకది నేటికీ వింత సంస్కృతే. అమ్మాయి ఉద్యోగం చేయాలి, ఇంట్లో పనీ చూసుకోవాలి. పిల్లల పెంపకమూ ఆమె బాధ్యతే. అసలు మహిళా దినోత్సవం వచ్చిందే పనివేళల కుదింపు, శ్రమకు తగ్గ వేతనం, ఓటు వేసే హక్కు కావాలనే డిమాండ్‌తో. వందేళ్ల పైబడ్డ చరిత్ర ఆ విప్లవానిది. ఈ వందేళ్లలో సాధించిన నాగరికత ఆధునిక స్త్రీ సవాళ్లను గుర్తించాలి.. సమానత్వాన్ని చేకూర్చాలి. శ్రమకు తగ్గ వేతనం నుంచి సమాన వేతన లక్ష్యానికి చేరాలి. కానీ సాంకేతిక యుగంలో కూడా స్త్రీ విషయంలో ఇంకా ప్రాథమిక దశే మనది. మహిళలు గడప దాటితే ఎక్కడికి వెళ్తున్నారో పోలీస్‌స్టేషన్‌లో చెప్పి, వివరాలు నమోదు చేసి వెళ్లాలనే నిబంధన (మధ్యప్రదేశ్‌లో) పెట్టే స్థితిలో ఉంటే సమానత్వం మాటెక్కడిది? పాశ్చాత్య దేశాలు మనకు భిన్నంగా ఉన్నాయి. ఫ్రాన్స్‌లో వారానికి 35 గంటల పని నియమం. అమెరికాలో వారానికి 40 గంటలు. మన దగ్గర వారానికి 48 గంటలు. లేబర్ యాక్ట్ ప్రకారం రోజుకి తొమ్మిది గంటలు గరిష్ట పరిమితి. ఏ రోజైనా తొమ్మిది గంటలకంటే ఎక్కువ పనిచేయించుకుంటే దాన్ని ఓటీగా పరిగణించి రెట్టింపు డబ్బులు చెల్లించాలి. స్వీడన్లో ఎనిమిది గంటల పనివేళలను ఆరు గంటలకు మార్చారు. దీనివల్ల ఉత్పత్తిలో ఎలాంటి ఆటంకాలు రాకపోగా పని సామర్థ్యం పెరిగినట్టుగా గమనించారు. అంతేకాదు ఉద్యోగుల ఇళ్లల్లోనూ ఆరోగ్యకర వాతావరణం నెలకొందని అధ్యయనాలు తెలిపాయి. కాలక్రమేణా ఈ పనిగంటల విధానాన్ని ఇలా సరళం చేసేలా ఆలోచించాలి కాని క్లిష్టతరం చేయడమేంటి? పారిశ్రామిక విప్లవ పూర్వకాలానికి వెళ్తున్నామా అనిపిస్తోంది కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆలోచనలు వింటూంటే’ అని ప్రశ్నిస్తున్నారు సామాజికవేత్తలు. తలనొప్పి వ్యవహారంగా.. సాంకేతికత తెచ్చిన ఆధునికత ఎంత విస్తృతమైనా ఇంటా, బయటా మహిళల భద్రత విషయంలో మనం అనాగరికంగానే ఉన్నాం. ఆడవాళ్లకు ఉద్యోగాలిస్తే అన్నీ సవాళ్లే అని విసుక్కునే యాజమాన్యాలే ఎక్కువ. అమ్మాయిలకు ఉద్యోగాలంటే ఆఫీస్ డెకొరమ్ను డిసిప్లిన్‌లో పెట్టాలి, రాత్రి తొమ్మిది దాటితే రవాణా సౌకర్యం కల్పించాలి, యాంటీ సెక్సువల్ హెరాస్మెంట్ సెల్‌ను ఏర్పాటు చేయాలి, మెటర్నిటీ లీవ్‌ను ఇవ్వాలి.. ఇదంతా తలనొప్పి వ్యవహారంగా భావించే యాజమాన్యాలు చాలానే ఉన్నాయి. దీని కన్నా మహిళలను తీసుకోకుండా ఉంటేనే నయం కదా అనే ఆచరణలోకి వచ్చేస్తున్నాయి. పని ప్రదేశాల్లో స్త్రీలకు ఎదురయ్యే ఇబ్బందులను అరికట్టే సరైన యంత్రాంగం లేదు. ఇప్పుడీ పనిగంటల పెంపు మహిళల ఉద్యోగ జీవితాన్ని మరింత అభద్రతలోకి నెట్టడమే కదా! మా ఉద్యోగ హక్కును, అవకాశాలను హరించేయడమే కదా? అంటున్నారు ఈ తరం అమ్మాయిలు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడమే.. మహిళలు లీడర్షిప్ వైపు రావాలి. ఆర్థిక, సాంఘిక, రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి అని ఉపన్యాసాలు ఇస్తున్నాం.. వింటున్నాం. ఇలా మహిళా దినోత్సవాల పేరిట స్ఫూర్తినీ పంచుతున్నాం. ఇంకో వైపు ఈ గంటల పెంపు వంటివాటినీ అమలు చేయచూస్తున్నాం. మహిళా కోణంలోంచి చూస్తే పొమ్మనలేకుండా పొగబెట్టే కార్యక్రమంగానే తోస్తోంది. వాళ్లంతట వాళ్లు ఉద్యోగాల నుంచి తప్పుకునేలా చేసే ప్రణాళికే ఇది. యాజమాన్యాల కోసం చేస్తున్న ప్రతిపాదన. ఇలాంటి అడ్డంకులను పేరుస్తూ కమాన్ లేడీస్.. మీరు సాధించగలరు.. అన్నిరంగాల్లో మీరు లీడర్స్‌గా రావాలి అని ప్రోత్సహించడంలో అర్థం ఉందా? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా ఇది .. అని అభిప్రాయపడుతున్నారు నాయకత్వ బరిలో ఉన్న చాలా మంది మహిళలు. ఈ అభిప్రాయం అపోహ కాదనే అనిపిస్తోంది. దీని మీద చర్చలు విస్తృతం కావాలి. పురుషులూ పాలుపంచుకోవాలి. ఇంట్లో అయినా బయట అయినా శ్రమలో స్త్రీ, పురుషుల సమభాగస్వామ్యం ఉండాలి. మహిళలు ఐచ్ఛికంగా ఉద్యోగాలు వదులుకోవడం కాదు.. ఇన్నాళ్లుగా ఈ సమాజం పురుషుడికి ఇచ్చిన నాయకత్వ వరాన్ని వాళ్లు వదులుకోవాలి. స్త్రీలకూ ఆ అవకాశం ఉండాలని గ్రహించాలి. ఆ హక్కును మహిళలూ తీసుకోవాలి. దీని కోసం మహిళల పరిధిని కుదించే నిబంధనలు కాదు.. వాళ్ల స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, ప్రజ్ఞ, సామర్థ్యాలను గౌరవించే ప్రతిపాదనలు, చట్టాలు కావాలి. సవాళ్లు.. అవకాశాల తీరు ► మన చట్టసభల్లో కేవలం 14 శాతం మంది మాత్రమే మహిళలు. ► పారిశ్రామిక సంస్థల విషయానికి వస్తే పేరున్న అయిదు వందల కంపెనీల్లో కేవలం అయిదు శాతం స్త్రీలు మాత్రమే సీఈఓలుగా ఉన్నారు. ప్రపంచంలో మనం ► 193 దేశాల్లోని చట్టసభల్లో స్త్రీల భాగస్వామ్యం లెక్క తీస్తే మనం 150వ స్థానంలో ఉన్నాం. భద్రత స్కేలు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం 2018తో పోల్చితే 2019లో మహిళల మీద నేరాల సంఖ్య 7.3 శాతం పెరిగింది. ఈ నేరాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దళితుల మీద నేరాల విషయానికి వస్తే ఆ స్థానాన్ని రాజస్థాన్ తీసుకుంది. ► 2019లో మహిళల మీద జరిగిన నేరాల సంఖ్య 4,05,816 (నమోదైన కేసులు). 2018లో ఈ సంఖ్య 3,78,236. ► లైంగిక దాడుల విషయానికి వస్తే 5వేల 997 కేసులతో రాజస్థాన్ ఆ అపఖ్యాతిని మోస్తోంది. ఆ వరుసలో 3,065 కేసులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలబడింది. ► పోక్సోయాక్ట్ కింద నమోదైన నేరాల్లో 7,444 కేసులతో ఉత్తరప్రదేశ్ ముందుంది. తర్వాత మహారాష్ట్ర. అక్కడ నమోదైన కేసుల సంఖ్య 6,402. ► వరకట్న కేసుల్లోనూ ఉతర్తప్రదేశ్కే అపకీర్తి కిరీటం. నమోదైన కేసుల సంఖ్య 2,410. తర్వాత బిహార్. కేసుల సంఖ్య.. 1,220. ► యాసిడ్ దాడుల్లోనూ ఉత్తరప్రదేశ్‌దే ప్రథమ స్థానం. నమోదైన కేసులు 42. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. నమోదైన కేసులు 36. ( ఎన్సీఆర్బీ 2019 ) 12 గంటల పనిదినం అకాల మరణమే! ఉద్యోగుల చేత వారానికి 4 రోజులే పని చేయించి, రోజుకి 8 గంటల బదులు 12 గంటలు పని చేయించుకోవచ్చుననే ప్రతిపాదన వల్ల ప్రధానంగా స్త్రీలకు జరిగే నష్టం.. స్త్రీలు నాయకత్వ స్థానాల్లోకి ఎదగడానికి కావలిసిన పరిస్థితులు.. స్త్రీ–పురుష సమానత్వ సాధనకు పురుషులు చేయాల్సిన కృషి.. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఇప్పుడున్న పెట్టుబడిదారీ విధానాన్ని తీసెయ్యడమే. అది ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు కాబట్టి, తాత్కాలిక పరిష్కారాల గురించి ఆలోచించాలి. ప్రస్తుతం నూటికి 90 శాతం పని స్థలాల్లో, 8 గంటల పని దినం అయినా అమలులో లేదు, కాయితాల మీద తప్ప. రోజుకి 8 గంటల చొప్పున వారంలో 6 రోజుల పని అయినా, రోజుకి 12 గంటల చొప్పున వారంలో 4 రోజులే పని అయినా, పని చేసేది 48 గంటలే గదా? అని ప్రభుత్వమూ, యజమానులూ వాదించవచ్చును. కానీ, 12 గంటల పని దినంలో, 8 గంటల పని దినంలో కన్నా శ్రమ తీవ్రత ఘోరంగా వుంటుంది. యజమానులు ఉత్పత్తి సాధనాలను, ఎప్పటికప్పుడు మార్చివేసి, ఉద్యోగులు (కార్మికులు) సృష్టించే అదనపు విలువని పెద్ద ఎత్తున గుంజు కోగలుగుతారు. 12 గంటల పని దినంలో వుండే శ్రమ తీవ్రత, మార్క్స్ తన ‘కాపిటల్’ పుస్తకం లో చెప్పినట్టు ‘‘అది కార్మికుని వాస్తవ ఆయుష్షును తగ్గించడం ద్వారా ఒక నిర్ణీత కాల పరిమితిలో అతని ఉత్పత్తి కాలాన్ని పొడిగిస్తుంది.’’ అది క్రమంగా ‘‘అకాల అశక్తతనీ, మరణాన్నీ ఉత్పత్తి చేస్తుంది.’’ కాబట్టి, కార్మికులు 8 గంటల పనిదినం అనే నియమాన్ని యజమానులు కచ్చితంగా అమలు పరచాలని డిమాండు చేయడమే తాత్కాలిక పరిష్కారం. ఇంటి పని అనేది ఇప్పటికీ ప్రధానంగా స్త్రీల బాధ్యతగానే వుంది కాబట్టి, 12 గంటల పని దినం వల్ల, బైటికి వెళ్ళి పనులు చేసే స్త్రీల మీద, శారీరకం గానూ, మానసికంగానూ ఒత్తిడి పెరుగుతుంది. ఆ స్త్రీలు పిల్లలకెప్పుడు తిండి పెడతారు? పిల్లల్ని ఎప్పుడు బడికి పంపుతారు? ఇంట్లో వుండే వృద్ధుల్ని ఎలా చూసుకుంటారు? రోజుకి 12 గంటల చొప్పున కాక, 24 గంటల చొప్పున అయితే, 2 రోజుల్లోనే కార్మికులు ఇళ్ళకు వెళ్ళకుండా 48 గంటలు పని ఇచ్చేస్తారు గదా! అది యజమానులకు ఎంత మేలు! స్త్రీలు నాయకత్వ స్థానాలలోకి ఎదగడం అంటే, ఉద్యోగాలలో, పని స్థలాల్లో, శారీరక శ్రమలు చేసే వారిపైనా, కొన్ని రకాల మేధా శ్రమలు చేసే వారి పైనా‘అధికార’ స్థానాల్లో వుండడమే! ఇప్పుడు ఆ స్థానాల్లో మొగవాళ్ళే ఎక్కువగా వున్నారు కాబట్టి. ఆ అధికార స్థానాల్లో, పురుషులకైనా, స్త్రీలకైనా ‘పర్యవేక్షణ’ అనే సహజంగా అవసరమయ్యే పనీ వుంటుంది. ‘పెత్తనం’ అనే అసహజ కార్యమూ వుంటుంది. పర్యవేక్షణ శ్రమలు చేసే అవకాశం కోసం స్త్రీలు డిమాండు చెయ్యవచ్చును. పెత్తనం శ్రమ చేసే అవకాశం ఎవ్వరికీ వుండకూడదు. కానీ, ‘తప్పుడు సామాజిక సంబంధాల’(‘‘ఫాల్టీ సోషల్ రిలేష¯Œ ్స’’) వల్ల ఆ స్థానాలు అవసరం అయ్యాయి. స్త్రీ–పురుష సమానత్వం కోసం స్త్రీలూ, పురుషులూ కృషి చేయవలిసింది, సమసమాజం కోసమే! అంటే, స్తీలకీ, పురుషులకీ ఇద్దరికీ ఇంటి పనీ, ఇద్దరికీ బైటి పనీ అనే శ్రమ విభజన అమలు జరిగే సమాజం కోసం కృషి చెయ్యాలి. భిన్నంగా ఉంటుందని ఊహించలేం ఆడవాళ్ల జీవితాలు ఎన్నో సమస్యలతో ముడిపడి ఉంటాయి. ఇంటి, వంట పని దగ్గర్నుంచి భర్తకు, పిల్లలకు లంచ్ బాక్స్‌లు సర్దివ్వడం వరకు ఒత్తిడి అంతా ఆడవాళ్లే భరించాల్సి వస్తోంది. కాబట్టి పన్నెండు గంటల ఆఫీస్ పనివేళల వల్ల రోజూ వారి జీవితం మరింత భారమవుతుంది. లాక్డౌన్ టైమ్‌లో మహిళల మీద పెరిగిన హింసను గమనిస్తే వారానికి మూడు సెలవులు ఆ హింసకు భిన్నంగా గడుస్తాయని ఊహించలేం. అలాగని పన్నెండు గంటల సమయాన్ని ఆఫీస్‌కూ వెచ్చించలేరు కదా. ఇంటి, వంట పనిలో మగవాళ్లు విధిగా భాగస్వాములైతే తప్ప మహిళలపై భారం, హింస తగ్గే సూచనలు లేవు. మారిన కాలానికి అనుగుణంగా మగవాళ్ల మనస్తత్వం మారకుండా ఎంతకాలం నిర్లజ్జగా, స్తబ్ధుగా, కటువుగా ఉంటుందో అంతకాలం స్త్రీ, పురుషుల సంబంధాలు హింసాపూరితంగానే ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ కోణంలో ఆలోచన చేయకుండా తెచ్చే ఎలాంటి పాలసీలైనా మహిళా సాధికారతకు అడ్డంకులే తప్ప వాళ్ల లీడర్షిప్ను పెంచే ప్రయత్నాలు కావు. – అంకురం సుమిత్ర, సామాజిక కార్యకర్త వలంటరీగా ఇంటికి పంపించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ ప్రతిపాదన వింటుంటే ఆ మధ్య జరిగిన ఓ సంఘటన గుర్తొస్తోంది. ఆడవాళ్లు ఆటోలు నడుపుతుంటే మేల్ ఆటోడ్రైవర్లంతా స్ట్రయిక్ చేశారు. ఇదొక్కటే కాదు గ్లోబలైజేషన్ తొలినాళ్లనాటి సంఘటనలూ గుర్తొస్తున్నాయి. అప్పుడూ ఇంతే.. అసంఘటిత రంగంలో ఉన్న ఆడవాళ్లంతా పనులు మానేసేట్టు చేశారు. దానికి అతీతంగా ఏమీ ఉండబోదు ఈ పన్నెండు గంటల పనివేళలు, మూడు రోజుల సెలవు దినాల ప్రతిపాదన. ఆర్గనైజ్డ్ సెక్టార్లోంచి కూడా మహిళలను వలంటరీగా ఇంటికి పంపించే ప్రయత్నం ఇది. మళ్లీ మహిళలను నాలుగు గోడలకే పరిమితం చేసే కుట్ర ఇది. ఎన్టీఆర్ ఇలాగే ఇష్టం వచ్చినట్టు పనిగంటలను మార్చాడు. ప్రభావం ఆడవాళ్ల మీదే పడింది. ఇప్పుడూ అలాగే ఉంటుంది. కుటుంబంలోని స్త్రీ, పురుషుల మధ్య ఎలాంటి అవగాహన, అండర్స్టాండింగ్ పెంచే వాతావరణం కల్పించకుండా ఇలాంటి చట్టాలు తెస్తే బలయ్యేది మహిళలే. పురుషాధిపత్య మైండ్‌సెట్‌ను మార్చకుండా నాయకత్వం దిశగా మహిళలు నడవాలి అనడం మీనింగ్ లెస్. – కొండవీటి సత్యవతి, భూమిక ఎడిటర్ మానవ హక్కుల ఉల్లంఘనే.. పన్నెండు గంటల పనివేళలు, మూడు రోజుల సెలవులు అనేది కచ్చితంగా రాంగ్ డైరెక్షనే. ఉద్యోగినులకే కాదు, ఇంట్లో ఉన్న స్త్రీలకూ ఇది భారమే. నిజానికి ఇప్పుడున్న వారానికి 48 గంటల పనివేళలన్నదే చాలా బర్డెన్. దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి కాని రోజులో శ్రమ భారాన్ని పెంచే ప్రయత్నం ఏంటి? ఇదంతా ఉద్యోగుల కోణంలోంచి జరుగుతున్న మేలు కాదు.. యాజమాన్యాలకు చేయాలనుకున్న మేలుగానే అనిపిస్తోంది. ఒకరంగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ప్రభావం తప్పకుండా మహిళ మీదే పడుతుంది. మహిళలు నాయకత్వం వైపుగా రావడానికి సహజంగా ఉండే అడ్డంకులే సవాలక్ష. వాటి దృష్ట్యా మహిళలకు వెసులుబాటు కల్పించాల్సింది పోయి ఇలాంటి ప్రతిపాదనలతో మరింత క్లిష్టం చేస్తున్నాం. ఈ ప్రతిపాదన ఆప్షన్ అంటున్నారు కాని ఒకసారి మొదలైతే అది ఆప్షన్‌గా ఉండదు. అనివార్యంగా మారుతుంది. తప్పనిసని అవుతుంది. ఈ సందర్భంగా గృహిణుల శ్రమనూ చర్చించాలి. – విస్సా కిరణ్ కుమార్, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు. లీడర్షిప్ ప్రతిబంధకాలు ఇప్పటికే వర్క్‌ప్లేస్‌లో ఉన్న సెక్సువల్ హెరాస్మెంట్స్కి ఈ పని గంటల పెంపు కూడా తోడైతే ఆ స్ట్రెస్ తట్టుకోలేక మహిళలు ఉద్యోగాలు మానేసే అవకాశాలే ఎక్కువ. ఇంట్లో ఆడవాళ్ల పనినీ అన్‌పెయిడ్ లేబర్‌గా చూస్తున్నాం. ఆఫీస్ పని చేసినా ఇంటి పనీ ఆమె బాధ్యతే అన్నట్టుగా ఉంటుంది మన ధోరణి. ఈ క్రమంలో ఈ ప్రపోజల్, రిఫార్మ్స్ అన్నీ కూడా విమెన్ లీడర్షిప్కు ప్రతిబంధకాలుగా ఉంటున్నాయే తప్ప వాళ్లను ప్రోత్సహించేలా ఉండట్లేదు. ట్వల్వ్ అవర్స్ వర్కింగ్ అనేది అయితే కచ్చితంగా కంపెనీలకు లాభమయ్యేదే. – స్వేచ్ఛ, న్యాయవాది ప్రైవేట్ యాజమాన్యాలకు ఆహ్వానం ఈ ప్రతిపాదన చాలా అశాస్త్రీయమైంది. ఇది ప్రైవేట్ యాజమాన్యాలకు ఆహ్వానంగా ఉందే తప్ప ఉద్యోగులకు ఒరగబెట్టేదేం లేదు. ముఖ్యంగా మహిళల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వాళ్ల మానసిక, శారీరక అరోగ్యాన్ని దెబ్బతినే ప్రమాదం ఉంది. రోజూ పన్నెండు గంటలు ఆఫీస్ పనితోనే సరిపోతే మిగిలిన వ్యక్తిగత పనుల సంగతేంటి? వాటికి వాళ్లెప్పుడు సమయం వెచ్చించాలి? అలాగే భద్రతా ప్రశ్నార్థకమే. – గౌతమ్, న్యాయవాది -
విదేశాల్లో మన మహిళలు రయ్ రయ్..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లోనే కాదు.. విదేశాల్లోనూ సిటీ లేడీస్ టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, తదితర అవసరాల కోసం విదేశాలకు వెళ్తున్న నగరవాసులు ఆ దేశాల్లో సొంత డ్రైవింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. విశాలమైన రోడ్లు, సురక్షితమైన డ్రైవింగ్ సదుపాయం ఉండడంతో మహిళలు సైతం సొంత వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉద్యోగాల కోసం వెళ్లిన వాళ్లే కాకుండా సాధారణ గృహిణులు కూడా సొంత వాహనాలపైన ఎక్కువగా ఆధారపడాల్సి రావడం వల్ల డ్రైవింగ్‌ను తప్పనిసరిగా భావిస్తున్నారు. దీంతో నగరంలో అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లకు పురుషులతో పాటు మహిళలు సైతం పోటీ పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి ఏడాది సుమారు 8 వేల నుంచి 10 వేల అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు జారీ అవుతుండగా అందులో 1500 నుంచి 2000 వరకు మహిళల పర్మిట్లు ఉంటున్నాయి. రవాణా శాఖ అందజేసే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు విదేశాల్లో ఏడాది పాటు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. ఈ పర్మిట్లతో అక్కడ ఏడాది పాటు వాహనాలు నడుపొచ్చు. ఆ లోపు అక్కడి రవాణాశాఖ ప్రమాణాల మేరకు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకోవలసి ఉంటుంది. హెచ్ 4 వీసాపై డిపెండెంట్‌గా వెళ్తున్న మహిళలు అక్కడికి వెళ్లిన తరువాత ఉద్యోగాన్వేషణలో భాగంగా డ్రైవింగ్‌ను తప్పనిసరిగా భావిస్తున్నారు. పెరుగుతున్న అంతర్జాతీయ పర్మిట్లు.. అమెరికా వంటి దేశాల్లో చాలా చోట్ల పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ తక్కువ. దీంతో ప్రతి ఒక్కరు సొంత వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. హైదరాబాద్‌లో సొంత వాహనాలపైన పరుగులు తీసిన వాళ్లు అక్కడికి వెళ్లిన తరువాత మరింత ఉత్సాహంగా దూసుకెళ్తున్నారు. అక్కడి పటిష్టమైన డ్రైవింగ్ నిబంధనలు కూడా అందుకు ఇతోధికమైన ప్రోత్సాహాన్ని అందజేస్తున్నాయి. సాధారణంగా మన రోడ్డు నిబంధనలకు విదేశాల్లో నిబంధనలకు మధ్య ఎంతో తేడా ఉంటుంది. అక్కడ స్టీరింగ్ ఎడమ వైపు ఉంటే మన దగ్గర కుడి వైపునకు ఉంటుంది. రోడ్లకు అనుగుణమైన వేగ నియంత్రణ వ్యవస్థ అమలవుతుంది. దీంతో మహిళలు ధైర్యంగా వాహనాలు నడుపుతున్నారు. 24 గంటల్లోనే... డ్రైవింగ్ లైసెన్సుతో పాటు, విదేశాలకు వెళ్లేందుకు వీసా కలిగిన వాహనదారులు అంతర్జాతీయ పర్మిట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రస్తుతం ఆన్లైన్లో స్లాట్ సమోదు చేసుకొనే సదుపాయం ఉంది. దరఖాస్తు చేసుకొన్న 24 గంటల వ్యవధిలోనే అంతర్జాతీయ పర్మిట్లను వాహనదారులకు అందజేస్తారు. ఎంతో భరోసా హైదరాబాద్‌లో డ్రైవింగ్‌లో ఎంత అనుభవం ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్లిన తరువాత కొద్దిగా భయం ఉంటుంది. అధికారులు వాహనాలను నిలిపివేసినప్పుడు గందరగోళంగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో హైదరాబాద్ నుంచి వెంట తెచ్చుకున్న అంతర్జాతీయ పర్మిట్ ఒక భరోసానిస్తుంది. డ్రైవింగ్‌లో అనుభవానికి అది ప్రామాణికంగా దోహదం చేస్తుంది. – జ్యోతి, న్యూజిల్యాండ్ -
సకల రంగాల్లో నారీలోకం ముందంజ
మనుస్మృతిలోని ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా/ యత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్ర ఫలాః క్రియా’ అనే శ్లోకం సమాజంలో అంతర్లీనంగా వున్న మహిళల శక్తిని చాటింది. ఎక్కడైతే మహిళలు గౌరవించ బడతారో అక్కడ దేవతలు నడయాడతారని... ఎక్కడ వారికి అగౌరవం ఎదురవుతుందో అక్కడ తలపెట్టే ఎంతటి మంచి కార్యమైనా నిష్ఫలమవు తుందని దీని సారాంశం. మహిళలంటే దేవతాంశ. వారు ప్రేమకూ, దయా కారుణ్యాలకూ చిహ్నం. పవిత్రతకు మారుపేరు. అమ్మగా, సోదరిగా, బిడ్డగా, భార్యగా పురుషుల జీవితంలో వారి పాత్ర బహుముఖమైనది. స్త్రీ మూర్తి లేని సృష్టిని ఊహిం చలేం. అందుకే వారు సృజనాత్మక శక్తికి ప్రతీకగా, అజరామరమైన మన సంస్కృతీ సంప్రదాయాలకు వాహికలుగా నిలుస్తున్నారు. ఆమె మనిషికి, మాన వీయతకు మాత్రమే కాదు... సర్వ మానవాళికీ మాతృమూర్తి. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో మహిళలు సాధించిన అభివృద్ధికి గుర్తుగా ఏటా మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుతున్నారు. ఇదే రోజున 1908లో 15,000మంది మహిళలు న్యూయార్క్ నగరంలో తమ హక్కుల కోసం, మెరుగైన వేతనాల కోసం, ఓటు హక్కు కోసం ఉద్యమించారు. ఏ దేశంలోనైనా సమాజ నిర్మాణంలో, దాని అభివృద్ధిలో మొదటినుంచీ మహిళల పాత్ర ప్రముఖమైనదని చరిత్ర చాటుతోంది. మహిళా దినోత్సవంనాడు ఈ వాస్తవాలను చాటేలా, మహిళా శక్తిని అందరూ గుర్తించేలా కార్యక్రమాలు రూపొందించటం అవ సరం. అవి మహిళాభ్యున్నతికి దోహదపడతాయి. మన జాతి నాగరికతలో, సంస్కృతిలో మహిళల పాత్ర ఎనలేనిది. మన ప్రాచీన శ్రుతులు, స్మృతులు ఆనాటి సమాజంలో మహిళలకున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అధికమేనని చాటుతున్నాయి. సమస్త జీవన రంగాల్లో వారు పురుషులతో సమా నంగా పాల్గొన్న అంశాన్ని తెలియజెప్పాయి. అరుం ధతి (మహర్షి వశిష్టుడి సతీమణి), లోపాముద్ర (మహర్షి అగస్త్యుడి భార్య), అనసూయ((మహర్షి అత్రి భార్య) తదితర సాధ్వీమణులు ఇందుకు చిహ్నం. ప్రాచీన భాష్యకారులు పతంజలి, కాత్యా యన్ వేదకాలం తొలినాళ్లలోనే మహిళలు విద్యా వంతులని చెప్పారు. యుక్తవయసు వచ్చాక తమ జీవిత భాగస్వాములను ఎంచుకునే స్వేచ్ఛ ఆడ వాళ్లకు వుండేదని రుగ్వేద మంత్రాలు చాటుతు న్నాయి. అలాగే మైత్రేయి, గార్గి వంటి మహిళా రుషులు కూడా వుండేవారని రుగ్వేదం, ఉపనిష త్తులు చెబుతున్నాయి. రామాయణంలోని సీతా మాత, మహాభారతంలోని మహారాణి ద్రౌపది మన ప్రాచీనకాలంనాటి మహిళా శక్తికి నిదర్శనం. ప్రాచీన సంప్రదాయాల్లో, దుర్గాదేవి సమక్షంలో ఉన్న దేవతలు కిరీటధారిణులై ఉండటం గమనించవచ్చు. అయితే మహిళల పరిస్థితి దిగజారిపోవడం అనేది మధ్యయుగాల్లోనే మొదలైంది. మొఘలులు, తర్వాత బ్రిటిష్ పాలనలో మహిళల స్వేచ్ఛకు, హక్కులకు పరిమితులు ఏర్పడ్డాయి. బాల్యవివాహం అనే దురాచారం 6వ శతాబ్ది నుంచే ప్రారంభమైందని భావిస్తున్నారు. భారతదేశాన్ని విదేశీయులు దురాక్రమించిన తర్వాత పరిణామాలు మరింతగా దిగజారిపోయాయి. ఈ కాలంలోనే పరదా సంస్కృతి, బాల్య వివాహాలు, సతీ సహగమనం, జోహార్, దేవదాసీ వ్యవస్థ వంటి మత దురాచారాలు వ్యాప్తిలోకి వచ్చాయి. అయితే 19వ శతాబ్ది మధ్యలో బ్రహ్మసమాజ్, ఆర్యసమాజ్, దివ్యజ్ఞాన సమాజం, రామకృష్ణ మిషన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే వంటి సంస్థలూ, వ్యక్తులు పలు సంస్కరణోద్యమాలకు నాంది పలికి మహిళల ప్రయోజనాల కోసం కృషి చేశారు. అనేక పురాతన సంప్రదాయాలు, ఛాందసభావాలకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. ఇంటిపనికి వెలుపల అన్ని రంగాల్లోనూ మహిళలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. అంతరిక్షం, పాలనా రంగ సేవ, విద్య, రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం, సాహిత్యం, సైన్యం, మీడియా వంటి పలు వైవిధ్యపూరితమైన రంగాల్లో మహిళలు తమ ప్రతిభాపాటవాలను చాటుకుంటున్నారు. ఈరోజు మహిళలే అభివృద్ధికి కేంద్రబిందువు అని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. మహిళకు సంఘటితపరమైన, గౌరవప్రదమైన స్థానం లభించని చోట మంచి క్రమశిక్షణాయుతమైన సమాజాన్ని కూడా సృష్టించలేం. హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, సైనా నెహ్వాల్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా క్రీడారంగంలో సాధిస్తున్న విజయాలు మనందరికీ తెలుసు. అంతర్జాతీయ మహిళా బాక్సర్ మేరీ కోమ్, అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి మిథాలి రాజ్ నేటి సమాజ నడకకు ఉదాహరణలు. గత ఆరేళ్లుగా సైన్యంలో మహిళల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఇప్పుడు భారతీయ సైన్యం, నేవీ, వాయుసేనలో 9,118 మంది మహిళలు పనిచేస్తున్నారు. వైద్య విభాగాన్ని మినహాయిస్తే సైన్యంలో ఇప్పుడు 6,807 మంది, వాయుసేనలో 1,607, నావిగాదళంలో 704 మంది మహిళాధికారులు పనిచేస్తున్నారు. భారత నావికాబలగానికి చెందిన నావికా సాగర్ పరిక్రమలో పూర్తిగా మహిళా అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం ప్రపంచం మొత్తం సముద్రాల్లో చాపచుట్టి వచ్చింది. ఇది ప్రపంచ నావికా చరిత్రలోనే అరుదైన ఘటన. భారతీయ మిస్సైల్ మహిళగా పేరొందిన టెస్సీ థామస్ డీఆర్డీఓలో సైంటిస్టుగా పనిచేస్తూ అగ్ని–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహిరించారు. అయితే సామాజికపరమైన గణాంకాలు, నేరాల రేటు చూస్తే విచారం కలుగుతుంది. జాతీయ నేర నివేదికా మండలి ప్రకారం 2019లో మహిళలపై రోజుకు 87 అత్యాచార కేసులు నమోదు కాగా, మహిళలపై దాడి ఘటనలు 4 లక్షలకుపైగా నమోదయ్యాయి. ఏడాది మొత్తంలో 32 వేలమందికిపైగా మహిళలపై అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. మహిళల రక్షణకు, వారి సమానత్వానికి తీసుకుంటున్న ప్రతి చర్యా మహిళల పరిస్థితిని ఏదో మేరకు మెరుగుపరుస్తూనే ఉంది. కానీ సామాజిక సంస్కరణా ప్రక్రియే నత్తనడకన సాగుతోంది. ఈ రంగంలో ప్రజా చైతన్యాన్ని వేగవంతం చేయాల్సి ఉంది. విద్యను కేంద్రబిందువుగా తీసుకుని చట్టాలను సమర్థంగా అమలు చేయగలిగితే మహిళలపై నేరాలు జరగని దేశంగా భారత్‌ను సమున్నతంగా నిలపవచ్చు. భారతీయ సంస్కృతిలో స్త్రీలను దుర్గా, లక్ష్మి వంటి దేవతలకు సమానస్థాయినిచ్చారు. కాబట్టి వారికి యావత్ సమాజం తగిన గౌరవం ఇవ్వాల్సి ఉంది. (రేపు మహిళా దినోత్సవం సందర్భంగా) బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ -
‘షీ’టీమ్ మహిళా దినోత్సవ వేడుకలు
-
ఈ తరంలో పుట్టడం నా అదృష్టం: మిస్ ఇండియా ఎర్త్
సనత్‌నగర్: వజ్ర సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం మహిళా పోలీసు అధికారులని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కొనియాడారు. కరోనా లాక్డౌన్ సమయంలో మహిళా పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని స్ఫూర్తిగా నిలిచారన్నారు. ‘షీ’టీమ్, హైదరాబాద్ పోలీసు సంయుక్తంగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లోని ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను రెండు రోజుల ముందుగానే శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన అంజనీకుమార్ మాట్లాడుతూ మహిళా శక్తి సామర్థ్యాలను సమాజానికి తెలియపర్చాలనే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రెండు రోజులు ముందుగానే నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలు సహనానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆర్మీ, నేవీ, పారామిలటరీ, పోలీసు వంటి విభాగాల్లో ప్రత్యేక యూనిఫాం వేసుకుని మహిళలు తమ సేవలను అందించడం గర్వకారణమన్నారు. నగర పోలీసు విభాగంలో 33 శాతం మంది మహిళలు ఉన్నారన్నారు. సిటీ పోలీసు కమిషనరేట్‌తో పాటు హెడ్ క్వార్టర్స్‌కు మహిళా పోలీసులు భద్రతగా నిలుస్తున్నారన్నారు. మహిళా పోలీసు అధికారులు అందించే ఈ రకమైన సేవలు దేశంలో మరే ఇతర నగరాల్లోనూ లేవన్నారు. షీ టీమ్స్, భరోసా సెంటర్, ఐటీ సెల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. నగరంలోని అన్ని పోలీస్స్టేషన్లలో మహిళా పోలీసు అధికారుల కోసం ప్రత్యేకమైన విశ్రాంతి గదులు, వాష్‌రూమ్‌లు, ఛేంజింగ్ గదులను కేటాయించామన్నారు. 2020 ఏడాది పోలీసు అధికారులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని, ఎందరో పోలీసు అధికారులు కరోనా బారిన పడ్డారన్నారు. అందులో మహిళా అధికారులు కూడా ఉన్నారన్నారు. కరోనా బారిన పడినప్పటికీ 14 రోజుల క్వారంటైన్లో ఉండి ఆ వెనువెంటనే విధుల్లోకి చేరడం వారి అంకితభావానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. మహిళా పోలీసు అధికారులైతే ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దలు ఉన్నప్పటికీ కరోనా సమయంలో ఏమాత్రం వెరవకుండా అర్ధరాత్రి సైతం సేవలు అందించారని, వారందరికీ నా సెల్యూట్ అన్నారు. మార్చి 8 ఒక్కరోజు మాత్రమే కాదని, ప్రతిరోజూ మహిళా దినోత్సవమేనన్నారు. మహిళలను గౌరవించడం ప్రధాన బాధ్యత అన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన మిస్ ఇండియా ఎర్త్, ఆల్ ఇండియాస్ బెస్ట్ క్యాడెట్ డాక్టర్ తేజస్విని మనోజ్ఞ మాట్లాడుతూ తాను ఈ తరంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నిరంతరం ప్రజాభద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్న పోలీసులు అధికారులకు ఆమె సెల్యూట్ చేశారు. ‘ఆడ పిల్లగా పుట్టినందుకు మనమందరంగా గర్వపడదాం..మార్పు కోసం ప్రయత్నిద్దాం..దేశం కోసం పాటుపడదామని’ ఈ సందర్భంగా ఆమె నినదించారు. కార్యక్రమంలో ఆదాయపన్ను శాఖ చీఫ్ కమిషనర్, నగర పోలీసు కమిషనర్ సతీమణి వసుంధర సిన్హా, ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్, పోలీసు అదనపు కమిషనర్లు డీఎస్ చౌహాన్, జాయింట్ కమిషనర్(ఎస్బీ) తరుణ్ జోషి, నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగనవర్, శిరీష తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘అమ్మా నన్ను కన్నందుకు’.. మేడమ్ మీవల్లే (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
500 రోజులైనా వెనక్కి తగ్గేది లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఎటు చూసినా రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు.. వేలాదిగా మోహరించిన పారా మిలటరీ బలగాలు.. ఆందోళనకారులపై ఝుళిపించేందుకు సిద్ధంగా ఉన్న లాఠీలు..పరిస్థితి చేయిదాటితే నిలువరించేందుకు వాటర్ కేనన్లు, బాష్పవాయు గోళాలు.. 100 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లోని ఏ ప్రాంతంలో చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. వ్యవసాయ చట్టాల విషయంలో దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన ప్రారంభించిన రైతులతో కేంద్రప్రభుత్వం 11 విడతల్లో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అంతేగాక సుప్రీంకోర్టు జోక్యంతో ఏర్పాటైన కమిటీ ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులు అంగీకరించలేదు. దీంతో వ్యవసాయ చట్టాల విషయంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఎముకలు కొరికే చలిలో, భారీ వర్షంలోనూ ఆందోళనలను కొనసాగించిన రైతులు, ఇప్పుడు ఉత్తరాదిన మండిపోయే ఎండల్లోనూ తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా గత 100 రోజులుగా రైతుల ఆందోళనలకు కేంద్రంగా ఉన్న సింఘు సరిహద్దులో రైతులు తమ ఆందోళనలను తీవ్రతరం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. నవంబర్ 26న రైతులు తమ నిరసన ప్రారంభించిన రోజు ఏ విధంగానైతే వాతావరణం ఉందో, ఇప్పటికీ అలాగే ఉంది. ట్రాక్టర్లు, ట్రాలీలు, లంగర్లు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు, తాత్కాలిక ఆసుపత్రులు, గుడారాలు 100 రోజులు అయినప్పటికీ అలానే ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆందోళన ప్రారంభించిన రైతుల సంకల్పం ఎక్కడా చెక్కుచెదరలేదు. గతేడాది నిరసన ప్రారంభమైనప్పుడు దేశ రాజధానిలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు ఇప్పుడు నిరసన వేదికకు 4–5 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటుచేశారు. అయితే జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీ అనంతరం 14 మంది పంజాబ్ రైతుల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. మూడు నెలల్లో తీవ్రమైన చలి కారణంగా రైతు ఉద్యమంలో 108 మంది రైతులు కన్నుమూశారని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. నల్లజెండాలు ఎగురవేయాలని పిలుపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన శనివారానికి (మార్చి 6వ తేదీ) 100 రోజులు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత సజీవంగా ఉంచేందుకు ఢిల్లీ వెలుపల ఉన్న కుండ్లి–మనేసర్–పాల్వాల్ వెస్ట్రన్ ఫెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేను నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఐదు గంటలపాటు అడ్డుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా గతంలోనే ప్రకటించింది. శనివారం రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించేందుకు ఇళ్ళు, కార్యాలయాలపై నల్ల జెండాలు ఎగురవేయాలని ఎస్కేఎం కోరింది. ఈ చర్యతో ప్రభుత్వం మళ్ళీ తమతో చర్చలు జరిపేందుకు ముందుకు వస్తుందని రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారు. జనవరి 26న రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలు జరిగాక రైతు ఉద్యమంలో మార్పు మొదలైంది. విధ్వంసానికి వ్యతిరేకంగా పలు సంఘాలు రైతు ఉద్యమం నుంచి దూరమవుతున్నట్లుగా ప్రకటించాయి. దాదాపు అన్ని రాజకీయ పక్షాలు విధ్వంసాన్ని తప్పుబట్టాయి. ఆ సమయంలో రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ రంగంలోకి దిగారు. రైతులు తమ డిమాండ్లను సాధించుకొనే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి 500 రోజులు పట్టినా ఆందోళనలను ఆపే ప్రసక్తిలేదని రైతు సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. ఎంఎస్పీ దిలావ్ అభియాన్‌కు శ్రీకారం మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా కిసాన్ దివస్‌గా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్త నిరసనలలో మహిళలు ఎక్కువగా పాల్గొంటారని రైతు సంఘాలు తెలిపాయి. మార్చి 15వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ వ్యతిరేక దినంగా గుర్తించనున్నాయి. ఈ రోజును కార్పొరేటీకరణ వ్యతిరేక దినంగా పాటించాలన్న కార్మిక సంఘాల పిలుపునకు ఎస్కేఎం మద్దతు ప్రకటించింది. వీటికితోడు దేశమంతటా కనీస మద్దతు ధరపై ప్రజల్లోనూ అవగాహనను పెంచేలా ఎంఎస్íపీ దిలావ్ అభియాన్ వంటి వినూత్న కార్యక్రమానికి ఎస్కేఎం శ్రీకారం చుట్టనుంది. మొదట ఈ విభిన్న కార్యక్రమాన్ని ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధంచేశారు. -
‘అమ్మా నన్ను కన్నందుకు’.. మేడమ్ మీవల్లే
మార్చి 8 మహిళాశక్తి బర్త్ డే! బాయ్స్ అండ్ బిగ్ బాయ్స్.. ఆరోజు మీరు మీ మహిళకు.. మీ బాస్, మీ కొలీగ్, మీ టీచర్, మీ మదర్, వైఫ్, సిస్టర్ .. వారెవరైనా సరే.. శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోకండి. ‘మేడమ్ మీవల్లే’ ‘అమ్మా నన్ను కన్నందుకు’ ‘సోదరీ తోడున్నావు’ ‘సహచరీ నీడవయ్యావు’ కృతజ్ఞతగా ఒక్కమాట. ఒక్క ప్రణామం. ప్లస్.. వాళ్లను రెస్పెక్ట్ చేస్తూ ఒక ‘ఉమెన్స్ డే’ గిఫ్ట్! బార్బీ బొమ్మల తయారీ కంపెనీ ‘మటెల్’ కూడా ఈ ఏడాది ఉమెన్స్ డే కి మహిళాశక్తిని రెస్పెక్ట్ చేస్తూ డీజే క్లారా గా ఒక కొత్త బార్బీని మార్కెట్ లోకి తెస్తోంది. 36 ఏళ్ల క్లారా బ్రిటిష్ రేడియో ప్రెసెంటర్. ‘పవర్ గర్ల్’ బార్బీ, ‘సూపర్ ఉమన్’ క్లారా ప్రతి మహిళలోనూ ఉంటారు. మహిళే మన రోల్ మోడల్. అమ్మాయిలూ.. (లేదా) మహిళలూ.. మీరొక సెలబ్రిటీ అనుకుందాం. ‘అనుకోవడం ఏంటీ! నేను సెలబ్రిటీనే’ అంటారా! మరీ మంచిది. ‘ఉమెన్స్ డే’ కి మీకు రెండు గిఫ్టులు. అయితే రెండూ కాదు. ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాలి. మొదటిది: ఆస్కార్ అవార్డు. రెండోది: మీ తెలివి తేటలతో, మీ రూపలావణ్యాలతో, మీ ప్రొఫెషనల్ ప్రతిభా సామర్థ్యాలతో, అచ్చంగా మీలా ఉండే బార్బీ డాల్ మీ పేరిట మార్కెట్లో రిలీజ్ అవడం. రెండిట్లో ఏది కోరుకుంటారు? పైకి చెప్పక్కర్లేదులెండి. డీజే క్లారా సంతోషాన్ని చూసినవాళ్లు ఎవరైనా ఏమంటారంటే.. మీరసలు ఆస్కార్ వైపే చూడరని! ‘ఎలా చెప్పగలరు మీరలా!’.. అంటారా? డీజే క్లారా ప్రస్తుతం ఆకాశం పట్టనంత సంతోషంగా ఉన్నారు. ఆమెను రోల్ మోడల్‌గా చూపుతూ.. బార్బీ బొమ్మలు తయారు చేస్తుండే ప్రపంచ ప్రసిద్ధ ‘మటెల్’ టాయ్స్ కంపెనీ ‘డీజే క్లారా బార్బీ’ని మార్కెట్లోకి విడుదల చేసింది. సందర్భం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ‘ఒక మహిళకు ఇంతకన్నా గౌరవం ఏముంటుంది?’ అంటున్నారు క్లారా. తన రూపంలో ఉన్న ఆ కొత్త బార్బీ డాల్‌ను రెండు చేతులతో అందుకుని అపురూపంగా చూసుకుంటూ ఆమె మురిసిపోతున్నారు. 36 ఏళ్ల క్లారా యాంఫో (ఆమె పూర్తి పేరు) ఆఫ్రికన్ సంతతి బ్రిటిష్ మహిళ. లండన్‌లో బి.బి.సి. రేడియో ప్రెజెంటర్. బి.బి.సి టెలివిజన్ లో వ్యాఖ్యాత. క్లారాయాంఫో డాట్ కామ్‌లోకి వెళ్లి చూస్తే ఆమె గురించి అంతా తెలిసిపోతుంది. అంత ఓపిక లేకపోతే క్లారా బార్బీ డాల్‌ను చూసినా సరే. క్లారా బాహ్య సౌందర్యాన్ని, ఆమె అంతఃశక్తిని ప్రతిఫలించేలా ఉంది క్లారా బార్బీ. కంగ్రాట్స్ క్లారా. మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ∙∙ బార్బీ ‘గర్ల్ పవర్’ అయితే, క్లారా ‘సూపర్ ఉమెన్’, ఇద్దరూ కలిసిన ‘పవర్ ఉమన్’.. మహిళ. ఫలానా మహిళ అని కాదు. ప్రతి మహిళా! మన మేడమ్, మన కొలీగ్, మన టీచర్, మన సహోద్యోగి, స్నేహితురాలు, అమ్మ, సోదరి, జీవిత సహచరి.. చుట్టూ ఎంత శక్తి! మనల్ని బతికిస్తున్న, మనల్ని నడిపిస్తున్న, మనిషంటే ఎలా ఉండాలో నేర్పిస్తున్న శక్తులు. ఆ శక్తులకు, సామర్థ్యాలకు ప్రతీకలే క్లారా, క్లారా బార్బీ. క్లారా మొదట డాన్సర్. తర్వాత డీజే (డిస్క్ జాకీ). బి.బి.సి. టీవీలో ‘స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్సింగ్’ అనే డాన్స్ పోటీల ప్రోగ్రామ్ వస్తుంటుంది. ఇప్పటికీ వస్తోంది. ‘స్ట్రిక్ట్లీ’ అంటారు షార్ట్‌కట్‌లో. ఆ ప్రోగ్రామ్ కంటెస్టెంట్‌గా వచ్చి, బి.బి.సి.లోనే రేడియో ప్రెసెంటర్‌గా ప్రసిద్ధి చెందారు క్లారా. అయితే బార్బీగా ఆమె అవతరించడానికి అదొక్కటే కారణం కాదు. జాతి వివక్షకు, జాత్యహంకారానికి వ్యతిరేకంగా గళమెత్తారు. తన జాతి హక్కుల కోసం నిలబడ్డారు. గత ఏడాది మేలో అమెరికాలో నల్లజాతి పౌరుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా బ్రిటన్‌లో జరిగిన అనేక సభల్లో ఆమె ప్రసంగించారు. బి.బి.సి.లో ఉద్యోగం పోతుందనీ, ఉద్యోగం పోతే గుర్తింపు ఉండదని అనుకోలేదు. ఆమె నిబద్ధతని బ్రిటన్ గుర్తించింది. ‘ది ఫేసెస్ ఆఫ్ హోప్’ అంటూ బ్రిటిష్ ‘వోగ్’ పత్రిక 2020 సెప్టెంబర్ సంచిక కోసం తను ఎంపిక చేసిన 40 మంది సామాజిక కార్యకర్తల్లో ఒకరిగా క్లారాకు స్థానం కల్పించింది. బార్బీగా కూడా ఇప్పుడు స్థానం పొందడాన్ని క్లారా తన అదృష్టంగా భావిస్తున్నారు. ‘‘నా ప్రొఫెషనల్ లైఫ్‌కు లభించిన గౌరవమిది. శక్తికి, ఆత్మవిశ్వాసానికి ఆదర్శవంతమైన ఒక బార్బీని అవడం కన్నా అదృష్టం ఏమంటుంది!’’ అంటున్నారు క్లారా ఎంతో గర్వంగా. ‘మిల్క్ హనీ బీస్’ అని లండన్‌లో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ నల్లజాతి మహిళలకు, బాలికలకు సృజనాత్మక రంగాలలో చేదోడుగా ఉంటుంది. ఆ సంస్థకు చేదోడుగా కూడా క్లారా ఉంటున్నారు. కలలకు రూపం బార్బీ ప్రపంచంలో ఎన్ని రంగాల్లోనైతే మహిళలు రాణిస్తున్నారో అన్ని రంగాల మహిళలకూ బార్బీలో రోల్ మోడల్స్ వచ్చేశాయి. ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్) సహా దాదాపు 200 జాబ్ ఫీల్డ్స్‌లో బార్బీ బొమ్మలు ఉన్నాయి. ఆడపిల్లల ఆశలకు, వాస్తవాలకు మధ్య ఉండే ‘డ్రీమ్ గ్యాప్’ను చెరిపేయడానికే బార్బీ ఆవిర్భవించింది. తొలి బార్బీ 1959లో ఫ్యాషన్ డాల్‌గా అమెరికన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ బార్బీ సృష్టికర్త రూత్ హ్యాండ్లర్ అనే మహిళ. ఆగమనంతోనే ఆడపిల్లలకు ఆత్మీయనేస్తం అయింది బార్బీ. తోబుట్టువు పుట్టినంతగా సంతోషించారు. ఆడపిల్లల్ని కనుక మనం సంతోషంగా ఉంచగలిగితే వాళ్లు ఏదైనా సాధించగలరు అని మార్లిన్ మన్రో అంటుండేవారు. ఒక బార్బీని కొనిచ్చినా వారు ఏదైనా సాధించగలరు. అయితే వారు కోరుకున్న బార్బీని మాత్రమే. ఎడ్యుకేషన్, మెడిసిన్, మిలటరీ, పాలిటిక్స్, ఆర్ట్స్, బిజినెస్, సైన్స్.. ఏ రంగలోని బార్బీని కోరుకుంటే ఆ బార్బీ. ‘స్పెషల్లీ ఏబుల్డ్’ బార్బీలు కూడా ఉన్నాయి. గత ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి (అక్టోబర్ 11) మానసి జోషీ బార్బీ విడుదలైంది. మానసి ప్యారా–బాడ్మింటన్ ప్లేయర్. అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి గత ఏడాది వచ్చిన తన రోల్ మోడల్ బార్బీతో మానసి జోషి -
మ్యూచువల్ ఫండ్స్‌లో రా‘రాణులు’
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మహిళలు క్రమంగా పాగా వేస్తున్నారు. ఫండ్ మేనేజర్ల విభాగంలో మహిళల ప్రాతినిధ్యం భారత్‌లో పెరిగినట్టు మార్నింగ్‌స్టార్ నివేదిక తెలియజేసింది. అయితే దేశంలోని మొత్తం ఫండ్ మేనేజర్లలో మహిళల వాటా ఇప్పటికీ 8 శాతం స్థాయిలోనే ఉన్నట్టు పేర్కొంది. ‘‘376 ఫండ్ మేనేజర్లకు గాను 30 మందే మహిళలు ఉన్నారు. వీరు ప్రైమరీ లేదా సెకండరీ ఫండ్ మేనేజర్లుగా ఈక్విటీ, డెట్ ఫండ్స్‌కు సేవలు అందిస్తున్నారు. గతేడాది మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య 28. మొత్తం 19 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పరిధిలో 30 మంది మహిళా ఫండ్ మేనేజర్లు పనిచేస్తున్నారు. వీరి కాల వ్యవధిని పరిశీలిస్తే.. 10 మంది గడిచిన ఐదేళ్లుగా నిలకడగా ఫండ్స్ నిర్వహణ చూస్తున్నారు. మరో 12 మంది మూడు నుంచి ఐదేళ్లుగా ఫండ్స్ నిర్వహణ బాధ్యతలో ఉన్నారు. ఇక 8 మంది మహిళా ఫండ్ మేనేజర్ల కాల వ్యవధి చాలా తక్కువగానే ఉంది’’ అని మార్నింగ్ స్టార్ నివేదిక వివరించింది. 2021 జనవరి నాటికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఇన్వెస్టర్ల ఆస్తులు రూ.30.50 లక్షల కోట్లకు వృద్ధి చెందిన విషయం తెలిసిందే. ‘‘మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2017లో మార్నింగ్ స్టార్ నివేదికను విడుదల చేసే నాటికి మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య 18గా ఉంది. 2018లో 24కు, 2019లో 29కు చేరుకోగా, 2020లో 28.. 2021 నాటికి 30కు చేరుకుంది. 8 శాతం మంది మహిళా మేనేజర్లు అంటే మ్యూచు వల్ ఫండ్స్ పరిశ్రమలో చాలా తక్కువ ప్రాతినిధ్యమే’’ అని మార్నింగ్ స్టార్ నివేదిక పేర్కొంది. -
తెలంగాణ గవర్నర్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రతిష్టాత్మక టాప్-20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్ కాంగ్రెస్‌మ్యాన్ డానికే డేవిస్ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ ఈ అవార్డును ప్రకటించింది. గవర్నర్‌తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మందికి ఈ గౌరవం దక్కింది. 9వ వార్షిక కాంగ్రెషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ నెల 7న అమెరికా నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డును అందజేస్తారు. సమాజహితం కోసం అత్యున్నత సేవలు చేసినందుకు గవర్నర్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. -
మహిళల భద్రతపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు
-
మహిళల భద్రతపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి: అంగన్వాడీల్లో నాడు–నేడు, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్, సంపూర్ణ పోషణ పథకం, అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని తెలిపారు. దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్‌తో 2000 స్టాండ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవం రోజున ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలన్నారు. మహిళా భద్రత, సాధికారితపై షార్ట్‌ఫిల్మ్ పోటీలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి వింగ్ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలన్నారు. పోలీసు డిపార్ట్మెంటులో పనిచేస్తున్న మహిళలందరికీ ఆరోజు స్పెషల్ డే ఆఫ్‌గా ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. అదనంగా మహిళా ఉద్యోగులకు 5 క్యాజువల్ లీవ్స్ ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. నాన్ గెజిటెడ్ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. చేయూత కిరాణా దుకాణాల్లో అందుబాటులో శానిటరీ పాడ్స్, దానికోసం సెర్ప్, మెప్మా, హెచ్ఎల్ఎల్ మధ్య ఎంఓయూ చేసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. పదో తరగతి పూర్తిచేసిన బాలికలకు ప్లస్–1, ప్లస్–2ల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను అదేశించారు. జూనియర్ కాలేజీల నుంచి పైస్థాయి కాలేజీల వరకు ‘దిశ’ పై ప్రచారం నిర్వహిస్తూ హోర్డింగులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అందులో ‘దిశ యాప్’ సహా అన్నిరకాల వివరాలు ఉంచాలని సూచించారు. దిశ కింద తీసుకుంటున్న చర్యలు, వాటిపై అవగాహన కోసం విస్తృతంగా ప్రచారంకొనసాగించాలని అధకారులకు సీఎం జగన్ సూచించారు. వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్‌పై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్‌కు మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అంగన్వాడీల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఇవ్వనున్న పుస్తకాలు, బోధనోపకరణాలను చూపించగా వాటిని సీఎం జగన్ పరిశీలించారు. అంగన్వాడీల్లో నాడు–నేడు 44,119 అంగన్ వాడీల్లో నాడు–నేడు కింద ఉన్నవాటి అభివృద్ధి, కొత్త నిర్మాణాలు చేపట్టాలని సీఎం జగన్ అధికారలును ఆదేశించారు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఏక కాలంలో అంగన్వాడీ భవనాల పనులు ప్రారంభం కావాలన్నారు. పీపీ–1 పిల్లలకు 4,17,508 పుస్తకాలు, అలాగే పీపీ–2 పిల్లలకు 4,17,508 పుస్తకాలను ప్రభుత్వం అందించనున్నట్లు తెలిపారు. మార్చి 20 నుంచి మొదలు కానున్న పుస్తకాల పంపిణీ ఏప్రిల్ 5 నాటికి పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. వాటితోపాటు అంగన్వాడీలకు ఇవ్వనున్న 26 బోధనోపకరణాల్లో ప్రభుత్వం ఇప్పటికే 16పంపిణీ చేసిందని, మిగిలిన 10 బోధనోపకరణాలు నెల రోజుల్లోగా పంపిణీ చేయనున్నట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. స్కూళ్లలో పిల్లలకు ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ కూడా ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలని సూచించారు. ఈ తరహాలోనే అంగన్వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాలపై పోస్టర్ల ద్వారా వివరాలు అందిస్తున్నామని అధికారులు సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ, వార్డు సచివాలయం, అంగన్వాడీ సెంటర్లలో కూడా ఈ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అలాగే పిల్లలకు మంచి ఆహారం అందించడం, శుభ్రతలపై నిర్దేశించిన విధివిధానాలతో ఎస్ఓపీ బుక్‌ను అందిస్తున్నామని అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. దానిపై రూపొందించిన వీడియోలను వారికి షేర్ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో మహిళా, శిశు సంక్షేమశాఖా మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ఏ రవిశంకర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్, డీఐజీ (టెక్నికల్ సర్సీసెస్) జి పాలరాజు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: సహకార రంగం.. బలోపేతం -
ఐ యామ్ రెబల్
బాయ్స్.. ఈ ‘ఉమెన్స్ డే’ కి అమ్మాయిలు పాడబోయే ఒక కొత్త సాయుధ గీతాన్ని మీ వీధి మైక్ లో నేషనల్ యాంథమ్ గా వినేందుకు సిద్ధంగా ఉండండి. చూస్తుంటే పాప్ గాయని రాజకుమారి సృష్టించిన ఈ సరికొత్త ‘ఐ యామ్ రెబల్..’ ట్రాక్ పురుషాధిక్యాన్ని అవనతం చేయబోతున్నట్లే ఉంది. ఇండిపెండెన్స్ డే కి ‘మా తుఝే సలామ్’, వినాయక చవితికి ‘జై జై గణేశా’ వినిపించినట్లుగా ఉమెన్స్ డే కి ఇక పై.. ‘ఐ యామ్ రెబెల్’ మార్మోగవచ్చు. ఇదొక జెండర్ ఈక్వాలిటీ జాతీయగీతం అనుకోండి!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం! తెలుగులో ఏమిటి? ఇది తెలుగే కదా! పోనీ తేలిగ్గా ఏమిటి? ‘ఇది నా రోజు. దిస్ ఈజ్ మై డే!’ ఎంత సింపుల్‌గా ఉంది. కరెక్ట్ అర్థం కూడా. ప్రతి‘ఉమెన్స్ డే’కి మనకు వినిపించే మాటలు.. స్త్రీ సాధికారత, స్త్రీ పురుష సమానత్వం. మరి ఆ మాటలకు అర్థం ఏమిటి? అదే.. తేలికైన భాషలో ఎలా చెప్తాం? పాప్ సింగర్ రాజా కుమారి అయితే చక్కగా, అబ్బాయిలకు అర్థమయ్యేలా చెబుతారు. అబ్బాయిలకా! అమ్మాయిలకు కదా అర్థం కావలసింది. కాదు. అబ్బాయిలకే. స్త్రీ సాధికారతకు, స్త్రీ పురుష సమానత్వానికి రాజా కుమారి చెబుతున్న అర్థం.. ‘ఐ యామ్ రెబల్’. అదే మాటను ఆవిడ కియారా అద్వానీ, బాణి జె లతో కలిసి పాటగా చెబుతున్నారు. ఆటగా చెబుతున్నారు. ఆ పాట, ఆట ఉన్న వీడియో ట్రాకే.. ఐ యామ్ రెబల్. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో విడుదల అయింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఈ ట్రాక్‌ను విడుదల చేశారు రాజా కుమారి. ఆ హిప్–హాప్ ట్రాక్ ఇప్పుడు అమ్మాయిల చేత ‘ఐ యామ్ రెబల్’ అంటూ సాయుధ గీతం పాడిస్తోంది. ఫెమినిస్టు ఉద్యమానికి రాగల కొద్ది రోజుల్లోనే ఈ ట్రాక్ ఒక సిగ్నేచర్ సాంగ్ అయినా కావచ్చు. స్వాతంత్య్ర దినోత్సవానికి.. ‘మా తుఝే సలాం’, వినాయక చవితికి.. ‘జై జై గణేశా..’, ఇప్పుడిక మార్చి ఎయిత్కి ‘ఐ యామ్ రెబల్’!! అంతుందా? ఉంది. ఓసారి ఆ వీడియో చూడండి. 2 నిముషాల 11 సెకన్లు. అందులో మీకు మీరు కనిపిస్తారు. (బాయ్స్.. మీరు కాదు). అమ్మాయలూ.. మీరెలానైతే, ఎంతగానైతే దూకుడు గా ఉండాలనుకుంటారో.. అలాగే మీ ప్రతిరూపం అందులో కనిపిస్తుంది. పాడింది రాజా కుమారి. రాసింది రాజా కుమారి. ఆమె భావాలకు ఫీచరింగ్ ఇచ్చింది కియారా అద్వానీ. మ్యూజిక్ దంచేసింది.. అవును, దంచుడే.. డీజే సా! సంకేత్ అర్జున్వాడే. కియారాతో పాటు చిన్న స్లిప్‌గా వి.జె.బాణి కూడా జర్రున జారి వెళతారు. మొత్తం ముగ్గురమ్మాయిల తీన్మార్! రాజా కుమారి అసలు పేరు శ్వేత. తను ఈ సాంగ్‌ని హిందీలో.. ‘నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను. నేను రెబెల్’ను అని రాశారు. శ్వేత ర్యాపర్, సింగర్, సాంగ్ రైటర్. ఇక రెండో అమ్మాయి కియా అద్వాని. బాలీవుడ్ నటి. మూడో అమ్మాయి బాణి.. వీజే, మోడల్, టెలివిజన్ హోస్ట్. సమాజంలో స్త్రీలు, ఆడపిల్లల పట్ల ఏవైతే పురుషాధిక్య భావాలు ఉన్నాయో వాటిని ఈ ‘ఐ యామ్ రెబల్’లో ప్రశ్నించారు, ధిక్కరించారు, వెక్కిరించారు.. వీళ్లు ముగ్గురూ. ఇంటర్నేషల్ ఉమెన్స్ డేకి వీధి వీధిలో మోగాల్సిన, మార్మోగాల్సిన స్త్రీవాద జాతీయ గీతం అని మీకు అనిపిస్తే కనుక ఆశ్చర్యం లేదు. అంతగా గర్ల్ పవర్‌ను దట్టించి వదిలారు. పాటను లాస్ ఏంజెలిస్‌లో కొంత, ముంబైలో కొంత షూట్ చేశారు. రాజా కుమారి, కియారా, వి.జె. బాణితో పాటు మరికొందరు అమ్మాయిలు కూడా రెబలియన్లుగా కనిపించి, కవ్వించి, మెరుపులా మాయమైపోతారు. రాజా కుమారి (శ్వేత) -
ఆ పని చేస్తేనే మహిళలపై వేధింపులు ఆగుతాయ్..
సాక్షి, హైదరాబాద్: చట్టాలను పకడ్బందీగా అమలు చేసినప్పుడే పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులకు కళ్లెం పడుతుందని వివిధ రంగాల మహిళా ప్రముఖులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం వార్షికోత్సవం, మరోవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో సోమవారం వెబినార్ ద్వారా వర్క్‌షాప్ జరిగింది. ఇందులో ‘పని ప్రాంతాల్లో మహిళలపై వేధింపులు-అధిగమించే మార్గాలు’ అనే అంశంపై వివిధ రంగాల మహిళా ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అడిషనల్ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. పని ప్రాంతాల్లో వేధింపులు, గృహహింసకు సంబంధించి అధిక శాతం కేసులు నమోదు కావడం లేదన్నారు. కాగా, ఇటీవల వచ్చిన మీ-టూ ఉద్యమం నేపథ్యంలో పని ప్రాంతాల్లో వేధింపులపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందని చెప్పారు. వర్క్‌ప్లేస్‌లో మహిళలపై వేధింపులు, ఇతర విధానాల్లో జరిగే వేధింపులపై నమోదయ్యే కేసుల దర్యాప్తును నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని హిమాచల్ ప్రదేశ్‌లోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వీసీ నిష్టా జైస్వాల్ వెల్లడించారు. పని ప్రాంతాల్లో వేధింపులను ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా స్వాతి లక్రా ఆవిష్కరించారు. కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ జెండర్ విభాగం వైస్ చైర్మెన్ శృతి ఉపాధ్యాయ్, డీఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ వెనక ఉన్న ఆ స్త్రీ మూర్తులు వీరే!
-
వైఎస్ జగన్ విజయం వెనుక.. ఆ ముగ్గురు!
సాక్షి, అమరావతి: ‘ప్రతి పురుషుడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుందంటారు.. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుక ఉన్న ఆ ముగ్గురు స్త్రీ మూర్తులు వీరే’.. అన్న వీడియో మహిళా దినోత్సవం సందర్భంగా వైరల్ అవుతోంది. ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షి టీవీ రూపొందించిన ఈ వీడియోను వైఎస్సార్సీపీ తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసింది. సోషల్ మీడియా విభాగం ఈ వీడియోను విస్తృతంగా వివిధ గ్రూప్‌లలో పోస్టు చేసింది. రాష్ట్ర ప్రజలను ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. రాజకీయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇబ్బందులకు గురిచేశారని, ఆ సమయంలో ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి, సోదరి షర్మిల ఆయనకు అండగా నిలిచారని అందులో పేర్కొన్నారు. వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు ‘నేను మీ రాజన్న బిడ్డను.. జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ వైఎస్ షర్మిల చేసిన ప్రచారాన్ని గుర్తుచేశారు. ఓ మంచి ముఖ్యమంత్రిని రాష్ట్రానికి అందించిన వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిలకు కృతజ్ఞతలు అంటూ వీడియోను ముగించారు. -
లెట్స్ టాక్ టు జ్వాల
-
ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు జరిపించుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతల్లో తలమునకలై ఉండాల్సి రావడంతో మహి ళలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యోగా, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గవర్నర్ తమిళిసై బుధవారం రాజ్‌భవన్‌లో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఏపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు వంటింటినుంచి బయటకొచ్చి వివిధ రంగాల్లో బాగా కష్టపడుతున్నారని, అలా చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి తాను తమిళిసై లాగా రాలేదని, తెలుగుసైలా వచ్చానని చెప్పి అందర్నీ నవ్వించారు. వివిధ రంగాల్లో రాణించిన 21 మంది మహిళలను ఈ కార్యక్రమంలో గవర్నర్ ఘనంగా సత్కరించి పురస్కారాలు అందజేశారు. పురస్కార విజేతలు వీరే పీవీ సింధు (క్రీడలు), డాక్టర్ జ్యోతి గౌడ్ (పరిశోధనలు), సంగారెడ్డి జిల్లా హుమ్నపూర్ వాసి బేగారి లక్ష్మమ్మ (వ్యవసాయంపై సినిమా రూపకల్పన), సిద్దిపేట జిల్లావాసి గొట్టే కనకవ్వ (జానపద గాయని), డాక్టర్ ఎస్వీ కామేశ్వరి(వైద్యురాలు), జగిత్యాల జిల్లా లంబాడిపల్లి వాసి మిల్కూరి గంగవ్వ (యూట్యూబ్స్టార్), జగిత్యాల జిల్లావాసి గుడేటి సరిత (క్రీడలు), ఆదిలాబాద్ జిల్లావాసి ఆత్రం సుశీల బాయి (సామాజిక చైతన్యం), రంగారెడ్డి జిల్లా వాసి తారాబాయి (స్వయం ఉపాధి), యోగిని అరుణా దేవి (యోగా గురు), రంగారెడ్డి జిల్లా వాసి మల్లారి (సాంప్రదాయ జాపపద కళాకారిణి), కొత్తగూడెం జిల్లావాసి రాజేశ్వరి (వైద్య సేవలు), నిఖత్ జరీన్ (క్రీడలు), దేవరకొండ వనజ(స్వచ్ఛంద సేవ), బూర రాజేశ్వరి(అక్షరాస్యత), తరుణి సంస్థ (మహిళల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడం), సురేఖారెడ్డి (సమాజ సేవ), మహమ్మద్ సుమ (స్వచ్ఛంద సేవ), వనమాల రమ్యశ్రీ (క్రీడలు), సూరి జ్యోతి (స్వచ్ఛంద సేవలు) గవర్నర్ నుంచి పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. -
‘సోషల్ మీడియా సన్యాసం’పై మోదీ మరో ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాను వీడాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో అనునిత్యం చురుగ్గా ఉండే మోదీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వేలాది మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇక ప్రతిపక్ష నేతలు సైతం మోదీ ప్రకటనపై తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పలు అనుమానాలు లేవనెత్తారు. అయితే వీటన్నింటికీ నరేంద్ర మోదీ మంగళవారం క్లారిటీ ఇచ్చారు. తాను ఈ ఒక్క ఆదివారం మాత్రమే సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించారు. (చదవండి : ‘సోషల్ మీడియాను బ్యాన్ చేస్తారేమో’) తానెందుకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లను వదిలేస్తానన్నది స్పష్టం చేస్తూ మోదీ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆదివారం ఒక్కరోజే తన సోషల్ మీడియా అకౌంట్లను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. ‘ వచ్చే ఆదివారం .. మహిళా దినోత్సవం. మనకు స్ఫూర్తిగా నిలిచిన మహిళల కోసం నా సోషల్ మీడియా అకౌంట్లను వారికి అప్పగిస్తున్నాను. అలా చేయడం వల్ల వాళ్లు లక్షలాది మందిని ఉత్సాహపరిచినట్లు అవుతుంది. మీరు అలాంటి మహిళేనా? లేదా అలాంటి మహిళలు మీకు తెలుసా? అయితే అలాంటి మహిళల స్టోరీస్ #SheInspireUsతో ట్యాగ్ చేయండి’ అని ట్వీట్ చేశారు. (చదవండి : ప్రధాని మోదీ సోషల్ మీడియా సన్యాసం!) కాగా, ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో మోదీ చాలా చురుగ్గా ఉంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. ట్విటర్లో మోదీకి 5.33 కోట్లమంది ఫాలోవర్లున్నారు. 5 కోట్లకు పైగా ట్విటర్ ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడు మోదీనే. ఫేస్బుక్లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు. ప్రధాని కార్యాలయ ట్వీటర్ అకౌంట్‌ను 3.2 కోట్ల మంది అనుసరిస్తున్నారు. సెప్టెంబర్ 2019లో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్లో అత్యధికులు ఫాలో అవుతున్న మూడో నేత నరేంద్ర మోదీనే. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు. This Women's Day, I will give away my social media accounts to women whose life & work inspire us. This will help them ignite motivation in millions. Are you such a woman or do you know such inspiring women? Share such stories using #SheInspiresUs. pic.twitter.com/CnuvmFAKEu — Narendra Modi (@narendramodi) March 3, 2020 -
పదహారు రోజుల ఉద్యమ ప్రణాళిక
ఐక్యరాజ్య సమితి నవంబర్ 25ని ‘మహిళలపై హింసను నిర్మూలించే దినం’ గా పాటిస్తోంది. ఈ రోజు మొదలు.. ప్రపంచ మానవహక్కుల దినమైన డిసెంబర్ 10 వరకు 16 రోజులపాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏటా పిలుపునిస్తోంది. ఆధునిక చైతన్యాన్ని అందిపుచ్చుకొన్న మహిళాప్రపంచం ‘మీ టూ’ లాంటి ఉద్యమాలతో గొంతుపెకిలించుకొని తమపై జరుగుతున్న అత్యాచారాలనూ, లైంగిక వేధింపులను సవాల్ చేస్తూ బాహ్యప్రపంచంలోకి దూసుకొచ్చారు. అయితే మీటూ లాంటి పోరాటాలు సముద్రంలో నీటి బొట్టులాంటివేనన్నది గ్రహించాలి. ఈ సాంకేతిక ప్రపంచాన్ని చేరుకోవడానికి అవకాశమేలేని అట్టడుగు వర్గాల్లో లక్షలాది మంది స్త్రీలు అనేక రకాల లైంగిక వేధింపులకూ, హింసకూ గురవుతూనే ఉన్నారు. పనిలో, గనిలో, కార్ఖానాల్లో పరిశ్రమించే స్త్రీలు మొదలుకొని ధనిక, పేద, కుల, మత, ప్రాంత తారతమ్యాలకు అతీతంగా స్త్రీజాతి ఎదుర్కొంటోన్న పురుషాధిపత్య హింస నుంచి బయటపడాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలని ప్రపంచదేశాలకు తొలిసారి 1993లో పిలుపును ఇచ్చింది. ఆ క్రమంలోనే మహిళలపై హింసను నిర్మూలించే పదహారు రోజుల మహిళా ఉద్యమ ప్రణాళికను రూపొందించింది. బాధితులెవరు? ఇప్పటికింకా సాధారణ సమాజంలో మానవహక్కుల్లో భాగంగా గుర్తింపునకు నోచుకోని వర్గాలు ట్రాన్స్‌జెండర్, లెస్బియన్లు, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్, వలసవెళ్లిన స్త్రీలు, మహిళా శరణార్థులు, మైనారిటీలు, హెచ్ఐవీ బాధితులైన బాలికలు, స్త్రీలూ, శారీరక వైకల్యం కలిగిన స్పెషల్లీ చాలెంజ్డ్ చిన్నారులు అత్యధికంగా లైంగిక వేధింపులకు గురవుతున్న వర్గాలుగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ‘ఆరెంజ్ ద వరల్డ్’ థీమ్ అంతర్జాతీయంగా మహిళలపై హింసా వ్యతిరేక దినం నవంబర్ 25ని ప్రతి యేటా ఒక్కో థీమ్‌తో నిర్వహిస్తారు. ఈ యేడాది 2019ని ‘‘ఆరెంజ్ ద వరల్డ్: జెనరేషన్ ఈక్వాలిటీ స్టాండ్స్ ఎగెనెస్ట్ వుమన్’ జరుపుకుంటున్నారు. నవతరం.. అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తోందనీ, సమానత్వాన్ని కాంక్షిస్తోందనీ దీని ఉద్దేశం. మహిళా విముక్తి సంకేతానికి గుర్తుగా ‘ఆరెంజ్ ద వరల్’్డ అని జగమంతా ప్రతిధ్వనించేలా ఆ రోజు మహిళా శక్తి నినదిస్తుంది. ఈ గొప్ప కార్యానికి నారింజరంగుని ఎంపిక చేసుకోవడానికి కారణం ఆ రంగు ఉజ్వల భవిష్యత్తుకి, హింసారహిత సమాజానికీ ప్రతీక. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసల నుంచి విముక్తికి ఈ రంగు సంఘీభావ చిహ్నం. – అరుణ అత్తలూరి యూఎన్ డిక్లరేషన్ శారీరకంగా, లైంగికంగా, మానసికంగా మహిళలపై జరుగుతోన్న లింగ వివక్షతో కూడిన అన్ని రకాల హింసను అరికట్టాల్సిందిగా 1993లో తొలిసారి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటన చేసింది. అందులో భాగంగానే ప్రతి యేటా నవంబర్ 25ని ప్రపంచ దేశాల్లోని మహిళలు హింసా నిర్మూలనా దినంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్కడా చర్చకు కూడా నోచుకోని స్త్రీల పునరుత్పత్తి హక్కులు మొదలుకొని, విద్య, ఆరోగ్యం, ఉపాధి, సమానావకాశాలూ, శ్రామిక మహిళలు, వివక్షలపై పదహారు రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రమాద ఘంటికలు ►ప్రతి ముగ్గురు మహిళలు లేదా బాలికలు ఒకరు తమ జీవితకాలంలో అత్యంత దగ్గరిగా ఉన్న సహచర పురుషుల కారణంగా భౌతిక, లైంగిక దాడులకు గురవుతున్నారు. ►వివాహిత, లేదా సహజీవనం చేస్తోన్న వారిలో కేవలం 52 శాతం మంది మహిళలు మాత్రమే లైంగిక సంబంధాల విషయంలోనూ, గర్భధారణ, ఆరోగ్య విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నారు. ►ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 75 కోట్ల మంది మహిళలు, బాలికలు 18 ఏళ్లు నిండకుండానే వివాహాలు జరిగాయి. 20 కోట్ల మంది మహిళలు, బాలికలు లైంగిక కోర్కెలను అణచివేసే క్రమంలో భాగంగా ‘జెనిటల్ మ్యుటిలేషన్’కు గురయ్యారు. ►2017లో ప్రపంచవ్యాప్తంగా హత్యకుగురైన ప్రతి ఇద్దరి మహిళల్లో ఒకరు తన స్వంత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయినవారే. ► ప్రపంచ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా బాధితుల్లో 71 శాతం మంది మహిళలు బాలికలే ఉన్నారు. వీరిలో ప్రతి నలుగురిలో ముగ్గురు బాధితులు లైంగికంగా హింసకు గురయ్యారు. -
పేద పిల్లల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు
చికాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పేద పిల్లల ఆకలి తీర్చేందుకు మేముసైతం అంటూ ముందుకొచ్చింది. నాట్స్చికాగో మహిళా బృందం 62 వేలమందికి ఆహారాన్ని సిద్ధం చేసి ఉచితంగా అందించింది. చికాగో నాట్స్ మహిళా నాయకులు రామ్ కొప్పాక, శైలజ ముమ్మనగండి, రాధ పిడికిటి, సుమతి నెప్పల్లి, లక్ష్మి కలగర, రోజా శీలంశెట్టి, కల్పన సుంకర, రాజీవ్ మన్నె, కల్యాణి కోగంటి తదితురులు ఆహారాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. తమకు తెలిసిన ప్రతి ఒక్కరి సహకారాన్ని కూడా తీసుకుని పేద పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేశారు. ఇలా తయారైన 62 వేల మీల్స్‌ను స్కాంబర్గ్లోని ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్కు నాట్స్ విరాళంగా అందించింది. -
బాలికా విద్యకు అదే విఘాతం..!
సాక్షి, హైదరాబాద్: ఒకరిపై ఆధారపడి స్కూల్‌కు వెళ్లే బాలికలు అశక్తులుగా మారుతున్నారని.. దాదాపు 90 శాతం మందిపై ఈ ప్రభావం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైల్డ్ రైట్స్ అండ్ యూ (సీఆర్‌వై) హరియాణా, బిహార్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పాఠశాలలకు వెళ్లే బాలికల ప్రతికూల, అనుకూల అంశాలపై అధ్యయనం నిర్వహించింది. అలాగే ప్రభుత్వాల వివిధ పథకాలు దేశంలో బాలికలను విద్య వైపు ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది. ఎవరో ఒకరిపై ఆధారపడుతూ విద్యాసంస్థలకు వెళ్లడం బాలికలను అశక్తులుగా మారుస్తుందని.. దీని ప్రభావం 90 శాతం మంది బాలికలపై ఉందని అధ్యయనం వివరించింది. ‘తరచుగా స్కూళ్లకు గైర్హాజరయ్యే బాలికలు 29 శాతం ఉంటే, మహిళా టీచర్లు లేక 18 శాతం మంది స్కూళ్లకు హాజరుకావడం లేదు. ఇవి బాలికలను మధ్యలోనే స్కూల్ మానివేసే పరిస్థితికి తీసుకొస్తున్నాయి..’అని నివేదికలో పేర్కొంది. ఇక తరచూ అనారోగ్యం కారణంగా 52 శాతం మంది, ఇంటిలో నెలకొన్న పరిస్థితుల కారణంగా 46 శాతం మంది విద్యార్థినులు పాఠశాలలకు గైర్హాజరువుతున్నారని.. సంబంధిత నాలుగు రాష్ట్రాల్లో ఈ విధమైన బాలికల సంఖ్య ఎక్కువగానే ఉందని తెలిపింది. అలాగే మౌలిక వసతులు, సరైన రోడ్లు, రవాణా సదుపాయాలు లేక చాలామంది బాలికలు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారంది. 87 శాతం స్కూళ్లు బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల్ని కోరినట్లు సీఆర్‌వై నివేదికలో తెలిపింది. సంబంధిత నాలుగు రాష్ట్రాల్లోని 1,604 ఇళ్లలోని 3 వేలకు పైగా మంది అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించినట్లు సీఆర్‌వై వెల్లడించింది. -
రాష్ట్రంలోనే తొలి మహిళా కమాండో వింగ్
-
ఆమె అందరికీ అమ్మ
సాక్షి, విజయనగరం : ఆమె అందరు ఆడపిల్లల్లాగే చదువుకుంది. గ్రూప్–1 ఉద్యోగాన్ని సంపాదించింది. ఆకర్షణీయమైన ప్రభుత్వ ఉద్యోగం.. హాయిగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు.. కానీ ఆమె ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. సమాజ సేవ చేయాలి. ఆ సేవ చేయడంలోనే ఆనందం పొందాలి.. ఆ ఆలోచనలతోనే ఆమె అన్నింటినీ త్యజించి అనాథలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఆలోచన రావడమే మొదలు ఇక ఆగలేదు. సమాజ సేవే లక్ష్యంగా ముందుకెళ్తూ.. ప్రస్తుతం అందరికీ అమ్మ అయ్యింది. ఆమె ప్రకాశం జిల్లాకు చెందిన వెనిగండ్ల పద్మజ. ఎమ్మెస్సీ చదివిన పద్మజ ప్రకాశం జిల్లాలో ఎంపీడీఓగా, హైదరాబాద్‌లో చైల్డ్ లేబర్ కో–ఆర్డినేటర్‌గా పనిచేశారు. అయినప్పటికీ ఆమెకు ఆ ఉద్యోగాలు సంతృప్తిని ఇవ్వలేదు. అభాగ్యులకు సేవచేయాలి.. అందులోనే నిజమైన ఆనందం పొందాలని భావించారు. అమాయక గిరిజనులకు సేవ చేయాలనే ధృడ సంకల్పం ఆమెలో మెండుగా ఉండేది. దీంతో శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజన్సీలో గిరిజనులకు సేవలు అందించాలని నిర్ణయించారు. అప్పట్లో సెర్స్ సీఈఓగా పనిచేసిన విజయకుమార్ పరిచయంతో విజయనగరం జిల్లా పార్వతీపురంలోని జట్టు ఆశ్రమాన్ని సందర్శించారు. 2004లో జట్టు ఆశ్రమాన్ని చూసేందుకు వచ్చిన ఆమె ఇక్కడి పిల్లలు, వాతావరణాన్ని చూసి ఈ ప్రాంత గిరిజనులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. 2007లో పూర్తిగా కుటుంబ సభ్యులను విడిచిపెట్టి కట్టుబట్టలతో వచ్చేశారు. అప్పటినుంచి ఆశ్రమ బాధ్యతలు ఎన్నో ఒడిదొడుకుల నడుమ నిర్వర్తిస్తూ ఆశ్రమంలోని పిల్లలకు ఆమ్మయ్యారు. వివాహం చేసుకుంటే ఆ బంధం ఎక్కడ అడ్డు వస్తుందో.. ఎక్కడ సమస్యలు ఉత్పన్నమవుతాయో అని భావించి ఒంటరిగా ఉంటున్నారు. పిల్లల యోగ క్షేమాలను చూసుకుంటున్నారు. నాటి నుంచి నేటి వరకు 150 మంది వరకు పిల్లలను అక్కున చేర్చుకుని చదివిస్తున్నారు. ఏటా నలుగురైదుగురు పిల్లల వివాహాలు కూడా చేస్తున్నారు. ఆశ్రమాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. గాంధేయ మార్గంలో తెలుపు నూలు వస్త్రాలను ధరిస్తూ సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. సమాజ సేవ చేయడంలో తాను పొందుతున్న ఆనందం చెప్పలేనిదని.. అది అనుభవిస్తే తప్ప అర్థం కాదంటున్నారు. స్త్రీ శక్తిమంతురాలని.. ఆ శక్తిని పదిమందికి ఉపయోగపడేలా వినియోగించాలి తప్ప.. వినిమయ వస్తువుగా మిగిలిపోరాదని హితవు పలికారు. -
డేటా బాబా.. బేటా బాబాలకు బుద్దిచెప్పాలి: రోజా
-
‘డేటా బాబా.. బేటా బాబాలకు బుద్దిచెప్పాలి’
సాక్షి, అమరావతి: టీడీపీ రాక్షస పాలనలో మహిళలను రక్షణలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రశ్నించినందుకు తనను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి బహిష్కరించారని మండిపడ్డారు. మంత్రిస్థానంలో ఉండి పరిటాల సునీత మహిళలను వేధించడం దుర్మార్గమన్నారు. రాప్తాడులో కుటుంబ పాలన జరగుతోందని, పరిటాల వర్గీయులు హింసా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మహిళల మంగళసూత్రాలు తెగిపడుతున్నా మంత్రులు సునీత, అఖిలప్రియ స్పందించకపోవడం దారుణమన్నారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా రోజా మాట్లాడుతూ.. మహిళల వేదింపుల్లో ఏపీని నెంబర్‌వన్‌గా నిలిపిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు. చంద్రబాబుని డాటా బాబాఅని, ఆయన కుమారుడు బేటా బాబా అని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజల సమాచారాన్ని చోరీ చేసిన డేటా, బేటా బాబాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు చెక్కులతో మోసం చేస్తున్నారని, వైఎస్ జగన్‌కు ఆడపడుచులు అండగా నిలవాలని రోజా కోరారు. -
స్త్రీ మూర్తికి ‘కళాత్మక’ అభినందన
సాక్షి, నెల్లూరు(బృందావనం): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింహపురికి చెందిన కళాకారులు తమ భావాలను కళారూపంలో వ్యక్తీకరించారు. సందేశాత్మకంగా మహిళలకు స్ఫూర్తినిస్తూ కళాభివందనాలతో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని మూలాపేటకు చెందిన సూక్ష్మకళాకారుడు గంధవళ్ల ఉమాశంకర్ కోకకోలా శీతలపానీయం డబ్బా పై పిడికిలి బిగించి, జై కొడుతున్న మహిళ చిత్రాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. మహిళలు ఏ రంగంలో తీసిపోరని, సమాజంలో మహిళాసాధికారత సాధించాలని కాంక్షిస్తూ రెండు గంటల సమయంలో స్త్రీ మూర్తి రూపాన్ని తీర్చిదిద్దానన్నారు. నెల్లూరు నగరంలోని భక్తవత్సలనగర్‌కు చెందిన కార్పెంటర్ శ్రీనివాసులు తన వృత్తి నైపుణ్యంతో 8 అంగుళాల ఎత్తు, రెండున్నర అంగుళాల వెడల్పు ఉన్న కొయ్య ముక్కపై స్త్రీ రూపాన్ని రెండు గంటల సమయంలో తీర్చిదిద్దారు. మహిళలు అన్ని రంగాల్లో సత్తాచాటాలని కాంక్షించారు. ముత్తుకూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని నారికేళపల్లి పంచాయతీ సుబ్బారెడ్డిపాళెం యూపీ స్కూల్ తెలుగు పండిట్ సోమా పద్మారత్నం గురువారం సీసాలో ‘జాగృతి మహిళ’ చిత్రాన్ని నిక్షిప్తం చేశారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళా లోకానికి తన కళారూపం ద్వారా అభినందనలు తెలిపారు. నెల్లూరుకు చెందిన సూక్ష్మరూప చిత్ర కళాకారుడు వెంకటశేషగిరిరావు చిన్న రబ్బర్ ముక్క(ఎరేజర్)పై అర సెంటీమీటర్ ఎత్తు, అర సెంటీమీటర్ వెడల్పుతో కలర్ పెయింటింగ్‌ను తీర్చిదిద్దారు. రెండు గంటల పాటు శ్రమించి చిత్రానికి రూపమిచ్చానని చెప్పారు. సుద్ద ముక్కపై మహిళకు సూక్ష్మరూపం అనుమసముద్రంపేట: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏఎస్‌పేట మండలంలోని హసనాపురం ప్రాథమిక పాఠశాల ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు పార్థసారథి సుద్ద ముక్కపై కూర్చున్న మహిళ ఆకృతిని తయారు చేశారు. ఒక మహిళ దుఃఖిస్తూ, ప్రాధేయపడుతూ దేశంలో ఉన్న మహిళలు అనేక రకాలుగా హింసకు గురవుతున్న అర్థం తెలిపేలా ఈ సూక్ష్మరూపాన్ని చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. మూడు సెంటీమీటర్ల ఎత్తు ఉండేలా చాక్‌పీసులతో ఈ బొమ్మను తయారు చేశారు. -
ఆగని వేధింపుల పర్వం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మహిళలపై వివిధ రకాల వేధింపులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వేధింపులపై 2016లో 12,80 కేసులను షీ బృందాలు నమోదు చేశాయి. 2017లో 16,94 కేసులు నమోదు కాగా.. 2018లో 18,80 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పని చేస్తున్న మహిళల్లో 80 శాతం మంది వేధింపులకు గురవుతున్నట్లు షీ బృందాల అధ్యయనంలో తేలింది. మిగతా 20 శాతం మందిలో రిటేల్ దుకాణాల్లో పనిచేసేవారు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగినులున్నట్లు స్పష్టమైంది. మీటూపైనా మహిళలు మౌనం వహిస్తున్నట్లు షీబృందం అధ్యయనంలో వెలడవ్వడం గమనార్హం. ఇదో మచ్చుతునక.. ‘ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ప్రణతి (పేరు మార్చాం) తన టీం లీడర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆమె తన ఉద్యోగాన్ని సైతం కోల్పోవాల్సి వచ్చింది.’ ప్రస్తుతం ఈ కేసు పురోగతిలో ఉంది. తాను ఆరు నెలలుగా ఉద్యోగంలో లైంగిక వేధింపుల కారణంగా నరకం అనుభవించినట్లు ఆమె తెలిపింది. తన టీం లీడర్ పనివేళలు ముగిసిన తర్వాత కూడా లేట్‌నైట్ ఆఫీసులో ఉండాలని వేధించారని.. తన వాంఛలు తీర్చాలని కోరినట్లు వేధించినట్లు తెలిపింది’ భాగ్యనగరంలో పరిస్థితి ఇలా.. ♦ వేధింపుల విషయంలో 70 శాతం మంది మహిళలు సామాజిక కట్టుబాట్లు, భయం కారణంగా ఫిర్యాదుకు ముందుకు రావడంలేదు ♦ 30 శాతం మంది వేధింపులపై ఫిర్యాదు చేసిన వెంటనే తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు ♦ వేధింపులకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలన్న విషయంపై మహిళలకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండటంలేదు ♦ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి లోకల్ కంప్లైంట్ కమిటీని ఆయా కంపెనీల యాజమాన్యాలు ఏర్పాటు చేయడంలేదు ♦ 2018లో లోకల్ కంప్లైట్ కమిటీలకు నగరంలో కేవలం మూడు ఫిర్యాదులు మాత్రమే అందాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు ♦ అన్ని రకాల వేధింపులపై లోకల్ కంప్లైట్ కమిటీకి ఫిర్యాదు చేసేందుకు హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబరుతో పాటు ఈ– మెయిల్ ద్వారానూ ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలి ♦ పనిప్రదేశంలో వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు గ్రేటర్లో మహిళలు ముందుకు రావడంలేదు. ♦ నగరంలోని ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు మరింత భద్రత, పనిచేసే వాతావరణం కల్పించాలి ♦ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వేధింపులపై ఏర్పాటు చేసిన అంతర్గత ఫిర్యాదుల కమిటీపై కంపెనీ ఉన్నతాధికారులు అజమాయిషీ చేయవద్దు ♦ ఆయా కార్యాలయాల్లో మహిళలు తమకు ఎదురవుతున్న సమస్యలు, వేధింపులు, సవాళ్లపై ధైర్యంగా ముందుకొచ్చేలా సుహృద్భావ వాతావరణం కల్పించాలి ♦ మహిళలపై వేధింపుల నిరోధానికి స్వచ్ఛంద సంస్థలు, కంపెనీల యాజమాన్యాలు, ప్రభుత్వం, పోలీసులు సమన్వయంతో పనిచేయాలి ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి మహిళలను గౌరవించడం అనే సంస్కారం ప్రతి ఒక్క ఇంటి నుంచి మొదలవ్వాలి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు చేసినా సమాజంలో మార్పు రానిదే అవేవీ సత్ఫలితాన్నివ్వవు. వేధింపులను నిరోధించేందుకు ప్రతిఒక్కరూ సంఘటితంగా పోరాడాలి. మహిళలకు భరోసా కల్పించాలి. మహిళలపై అన్ని రకాల హింస, వేధింపులకు వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పనిచేయాలి.– శ్రావ్యారెడ్డి,వీఅండ్‌షీ ఫౌండేషన్ -
అంతులేని వివక్ష.. అతివకేదీ రక్ష!
అతివ పురోగమిస్తోంది. అద్భుత విజయాలను సాధిస్తోంది. అత్యున్నత శిఖరాలను చేరుకుంటోంది. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం ఇతోధికంగా పెరుగుతోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నగరంలో మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది. డిజిటలైజేషన్, సోషల్ మీడియా సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థల్లో ఎందరో మహిళలు ప్రతిభా పాటవాలు చాటుతున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అన్ని రంగాల్లోనూ మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఇంటా, బయటా అణచివేతకు గురవుతున్నారు. లింగ వివక్షను నేరంగా పరిగణించే చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ మహిళల ప్రాతినిధ్యాన్ని,విస్తృతిని సమాజం ఆమోదించలేకపోతోంది. దీంతో సంఘర్షణ, అణచివేత, హింస, వేధింపులు, నిత్యకృత్యంగా మారాయి. సుమారు కోటి జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 25 లక్షల మందికిపైగా మహిళలు వివిధ రంగాల్లో ఉన్నారు. అసంఘటిత కార్మికులుగా, అత్యున్నత మేధోవర్గంగా, సాఫ్ట్వేర్ నిపుణులుగా, బహుముఖ ప్రజ్ఞావంతులుగా ప్రతిభను చాటుకుంటున్నవాళ్లు ఉన్నారు. కానీ ఇంట్లోనూ, బయటా ఏదో ఒక రూపంలో వివక్షను ఎదుర్కొంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు. సాక్షి, సిటీబ్యూరో : తాము ఎంచుకున్న రంగంలో అద్భుతమైన ఫలితాలను సాధించినప్పటికీ మహిళల సమర్థతపై సందేహాలు నెలకొన్నాయి. ఐటీ రంగంలో ఎంతో పురోగమిస్తున్నారు. వందలాది అంకుర పరిశ్రమలను స్థాపించిన ఔత్సాహిక మహిళలు ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ప్రతిభను చాటుకుంటున్నారు. అయినా కీలకమైన బాధ్యతల నిర్వహణలో మాత్రం పురుషుల తర్వాతే మహిళలు ఉన్నట్లు సాఫ్ట్వేర్ వర్గాలు పేర్కొంటున్నాయి. నగరంలోని హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో సుమారు 600కుపైగా సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నాయి. వీటిలో మొత్తం 5 లక్షల మందికిపైగా పని చేస్తున్నారు. వీరిలో 1.25 లక్షల వరకు మహిళలు ఉన్నారు. ప్రాజెక్టు మేనేజర్లు మొదలుకొని సీనియర్ స్థాయి అధికారుల వరకు ఉన్నారు. కానీ కీలక పోస్టుల్లో మాత్రం మహిళల కంటే మగవారికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగిని ఒకరు తెలిపారు. ‘ప్రెగ్నెన్సీ, పెళ్లి వంటి అంశాలు మహిళల పట్ల వివక్షకు కారణమవుతున్నాయి. పెళ్లి చేసుకొంటే ఉద్యోగం చేయకపోవచ్చని, గర్భిణిగా ఉన్న మహిళలు కీలకమైన విధులు నిర్వహించలేరని, సెలవుల కారణంగా సంస్థకు నష్టం వస్తుందనే సందేహలు ఉన్నాయి. ఇది సాఫ్ట్వేర్ రంగంలో మహిళలపై కొనసాగుతున్న వివక్షే’ అని ఐడెంట్‌సిటీ వ్యవస్థాపక డైరెక్టర్ విశాలాక్షి ఆందోళన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు మృగ్యం.. షాపింగ్‌మాల్స్, సూపర్మార్కెట్లు, చిరు వ్యాపార సంస్థలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ రంగాలు, పెట్రోల్ బంకులు, తదితర అన్ని చోట్ల మహిళల శ్రమ, ప్రతిభ ఉంది. వీరి అవసరాలకు తగిన మౌలిక సదుపాయాలు మాత్రం అందుబాటులో లేకుండాపోయాయి. నగరంలో కార్పొరేట్, పెద్ద పెద్ద ప్రభుత్వ ఆస్పత్రులు మినహాయిస్తే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు 105 మాత్రమే. నగర జనాభా అవసరాల మేరకు కనీసం మరో 100కుపైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండాలి. మహిళల కోసం ప్రత్యేక వైద్య నిపుణులు అవసరం. వైద్య రంగంలో ఈ కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు రవాణా రంగంలోనూ మహిళలకు అరకొర సదుపాయాలే. గ్రేటర్ హైదరాబాద్‌లో 3,550 ఆర్టీసీ బస్సులు ఉంటే అందులో మహిళల కోసం ఏర్పాటు చేసినవి 150 నుంచి 200 సర్వీసులు మాత్రమే. పైగా ఈ లేడీస్ స్పెషల్ బస్సులు సైతంకొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్సర్వీసులు నడుస్తున్నాయి. మహిళల కోసం ఒక్క ‘మాతృభూమి’ ట్రైన్లో నాలుగు బోగీలు మాత్రమే వాళ్ల కోసం ఉన్నాయి. మెట్రో రైళ్లలో మాత్రం ప్రతి సర్వీసులో మహిళలకు ఒక బోగీని ప్రత్యేకంగా కేటాయించారు. లేడీస్ స్పెషల్ మెట్రోలు మాత్రం ఇంకాఅందుబాటులోకి రాలేదు. చదువులకు దూరమై.. హైదరాబాద్‌లో సుమారు 1100 వరకు మురికి వాడలు ఉన్నాయి. ఈ బస్తీల్లో ఉండే 80 శాతం మహిళలు ఇళ్లల్లో పని చేస్తున్నారు. ఇళ్లల్లో పని చేస్తున్న తల్లులకు సహాయం చేసేది అమ్మాయిలే కాని అబ్బాయిలు కాదు. దీంతో చిన్న వయసులోనే చాలామంది అమ్మాయిలు చదువులకు దూరమై ఇళ్లల్లో పనిచేసే కార్మికులుగా మిగిలిపోతున్నారు. – మంజుల, ఎంఎస్ఐ సంస్థ ప్రతినిధి తప్పని ఘర్షణ, వేధింపులు.. బహిరంగ స్థలాలు, రవాణా సదుపాయాల్లో, ఆఫీసులు, ఇతర చోట్ల వివక్ష కనిపిస్తోంది. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు సమానంగా చదువుకుంటున్నారు. పోటీ పడుతున్నారు. కానీ అమ్మాయిలపై వివక్ష చూపుతున్నారు. తన ఇష్టానుసారంగా జీవించేందుకు అమ్మాయిలు, మహిళలు ఎంతో ఘర్షణ, హింసను, వేధింపులను ఎదుర్కోవాల్సివస్తోంది. – బి.గిరిజ,స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్, సఖి మార్పు ఇంటి నుంచే రావాలి.. కొడుకులను, కూతుళ్లను సమాన అవకాశాలతో పెంచి పోషించే స్థాయికి కుటుంబాలు ఎదగాలి. వివక్ష, అణచివేత కుటుంబం నుంచే మొదలవుతోంది. పరువు పేరిట సొంత కూతుళ్లను హతమార్చే వరకు వెళుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పేద కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా అబ్బాయిల్లా అమ్మాయిలు స్వేచ్ఛగా ఎదగలేకపోతున్నారు.– సుమిత్ర,‘అంకురం’ వ్యవస్థాపకురాలు -
ధైర్యంగా ముందుకొస్తున్నారు
సాక్షి, సిటీబ్యూరో: మహిళల రక్షణ కోసం సైబరాబాద్ షీ బృందాలు ఎంతో కృషి చేస్తున్నాయి. వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకొస్తున్నారు. సామాజిక మాధ్యమాలతో పాటు నేరుగా బాధిత మహిళలు ఫిర్యాదు చేస్తుండటంతో వీరి అవసరాలకు అనుగుణంగా షీ బృందాలను ఆరు నుంచి ఎనిమిది బృందాలకు పెంచినట్లు షీ టీం ఇన్చార్జి అనసూయ తెలిపారు. ఏ సమయంలో ఫిర్యాదు వచ్చినా తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటూ అతివల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తున్నామని ఆమె చెప్పారు. పాఠశాల, కళాశాలల విద్యార్థినులు, ఉద్యోగినులు.. ఇలా ప్రతి ఒక్కరూ వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారని ఆమె చెప్పారు. అనసూయ మాటల్లోనే ఆ వివరాలు.. కౌన్సెలింగ్‌తో తప్పు తెలుసుకుంటున్నారు.. ముఖ్యంగా కళాశాలల ప్రాంగణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్‌లో ఆకతాయిల బారిన పడిన మహిళలు వాట్సాప్ ద్వారా షీ బృందాలకు ఫిర్యాదు చేస్తున్నారు. తక్షణమే సంబంధిత షీ బృందాలు మఫ్టీలో వెళ్లి ఈవ్టీజర్ల అకృత్యాలను పరిశీలించి లైవ్ రికార్డు చేస్తున్నారు. ఆ వెంటనే ఆకతాయిని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగిస్తున్నాయి. మేజర్ అయితే పెట్టీ కేసులు, మైనర్ అయితే తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్ ఇస్తున్నాం. తద్వారా 90 శాతం మంది తమ తప్పును తెలుసుకుంటున్నారు. షీ బృందాలకు చిక్కుతున్న వారిలో అన్ని వయసుల వారూ ఉన్నారు. ‘ఆమె’కు అవగాహన కలిగిస్తూ.. పాఠశాలలు, కాలేజీలు, ట్యుటోరియల్స్, రైల్వే స్టేషన్లు, మాల్స్, బస్తీ తదితర ప్రాంతాల్లో మహిళా చట్టాలపై షీ బృందాలు పూర్తి స్థాయిలో అవగాహన కలిగిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ భరోసా కల్పిస్తున్నాయి. తద్వారా అతివలు వేధింపులు ఎదురైతే వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. నేరుగా ఫోన్‌కాల్స్ కూడా చేస్తున్నారు. గతంలో ఠాణా గడప తొక్కేందుకు ఆలోచించిన మహిళలు ఇప్పుడూ అవే వేధింపులపై గళం విప్పుతుండటం శుభ పరిణామం. రేపు మహిళా సమాఖ్య రాష్ట్రస్థాయి సదస్సు హిమాయత్‌నగర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఆధ్వర్యంలో ‘పెట్టుబడిదారుల ధోరణులు, ఫాసిస్ట్ శక్తులకు తిప్పికొడదాం– మహిళా సాధికారత సాధిద్దాం’ అంశంపై శుక్రవారం రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు పోటు కళావతి, తెలంగాణ శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేంపావని, ఛాయాదేవి, నండూరి కరుణకుమారి పాల్గొన్నారు. -
బండెడు చాకిరీలో బాల్యం
బాలకార్మికులుగా మగ్గుతున్న వారిలోనూ, పేదరికం కారణంగా చదువులకు దూరమవుతున్న వారిలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 6 లక్షల మంది ఇళ్లల్లో పని చేస్తుండగా, వారిలో కనీసం 2.5 లక్షల మంది బడి ఈడు అమ్మాయిలే కావడం గమనార్హం. చాలా కుటుంబాల్లో అబ్బాయిలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తుండగా, అమ్మాయిలను మాత్రం సర్కారీ బడులకు పంపుతున్నారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. చదువుతో పాటు పని తప్పనిసరిగా మారుతుంది. కుటుంబ భారాన్ని మోసేందుకు ఇళ్లల్లో పనికి వెళ్తున్న మహిళలతో పాటు వారి కూతుళ్లు కూడా తప్పనిసరిగా పనిబాట పడుతున్నారు. అమ్మకు ఆసరా.. రామంతాపూర్‌నకు చెందిన మౌనిక ఓ స్వచ్ఛంద సంస్థ నడిపే స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. పేదరికం కారణంగా చదువు మానేసిన సోదరి, బేకరీలో పని చేసే అన్నయ్యతో పాటు తల్లిదండ్రులు ఉన్నారు. అందరూ ఏదో ఒక పని చేస్తున్న వాళ్లే. అయినా స్కూల్కెళ్లి చదువుకుంటున్న మౌనికకు సైతం తల్లితో పాటు ఇళ్లల్లో పని తప్ప లేదు. ఇద్దరూ కలిసి ఐదారు ఇళ్లల్లో పని చేస్తున్నారు. ‘చదువుకుంటుందని చెప్పి పనికి తీసుకెళ్లకుండా ఉంటే ఇల్లు గడుస్తుందా’ అని అంటోంది మౌనిక తల్లి యాకమ్మ.‘బాగా చదువుకోవాలని ఉంది. కానీ పనికెళ్లకుండా ఎలా సాధ్యం’ అంటోంది మౌనిక. పేదరికం కారణంగా అక్క చదువు ఆగిపోయినట్లు తన చదువు ఆగిపోకూడదని ఆ బాలిక కోరుకుంటోంది. చదువు సాగేదెట్లా.. పద్మకు ఒక్కగానొక్క కూతురు వేదిత. తొమ్మిది చదువుతోంది. పద్మ భర్త ఈశ్వర్ పక్షవాతంతో మంచాన పడ్డాడు. దీంతో భారమంతా పద్మపైనే పడింది. ఒకప్పుడు బాగానే బతికినా ఆకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఇళ్లల్లో పని చేస్తోంది. కానీ తనతో పాటు కూతురి శ్రమ కూడా తప్పనిసరైంది. ‘నా కూతురును బాగా చదివించాలనుకుంటున్నాను. కానీ పేదరికం వల్ల ఎక్కడ ఆమె చదువుకు ఆటంకం కలుగుతుందోననే భయంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో పాటు పనికి రావద్దని కోరుకుంటా. అయినా తప్పడం లేదు.’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది పద్మ. -
సూర్యచంద్రికలు
‘సూర్యుడిలా ప్రకాశించాలంటే ముందు సూర్యుడిలా ప్రజ్వలించాలి’’అని అబ్దుల్ కలామ్ అనేవారు. ఈ మహిళామణులంతా అలా ప్రజ్వరిల్లి, ప్రకాశించినవారే. అందుకే వీరు తొలి మహిళలు అవగలిగారు. భారతావనిలో ఆదర్శవంతులుగా నిలవగలిగారు. ‘మహిళా దినోత్సవం’ సమీపిస్తున్న వేళ.. కొందరు తొలి మహిళల ప్రస్తావన. లెఫ్టినెంట్ భావనా కస్తూరి రిపబ్లిక్ డే పరేడ్‌లో (2019) పురుషుల సైనిక దళానికి సారథ్యం వహించిన తొలి మహిళ! కెప్టెన్ శిఖా సురభి రిపబ్లిక్ డే పరేడ్ (2019)లో భారత సైన్యం ప్రదర్శించిన మోటార్ సైకిల్ విన్యాస బృందం ‘డేర్ డెవిల్స్’లో తొలి, ఏకైక మహిళా సభ్యురాలు. డాక్టర్ జి.సి. అనుపమ ఆస్ట్రొనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (భారత ఖగోళరంగ సంస్థ) తొలి మహిళా అధినేత. దేశంలోని ఖగోళ శాస్త్రవేత్తలంతా ఇందులో అధికారిక సభ్యత్వం కలిగి ఉంటారు. ఫ్లయిట్ లెఫ్టినెంట్ హీనా జైస్వాల్ భారతీయ వాయుసేనలో (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) తొలి మహిళా ఫ్లయిట్ ఇంజినీర్. శాంతిదేవి భారతదేశంలో తొలి మహిళా ట్రక్కు మెకానిక్కు. శాంతిదేవి ఇరవై ఏళ్లుగా భారీ వాహనాలను రిపేర్ చేస్తున్నారు. ఉషా కిరణ్ చత్తీస్‌గడ్‌లోని కల్లోల బస్తర్ ప్రాంతంలో విధులను స్వీకరించిన తొలి సి.ఆర్.పి.ఎఫ్ మహిళా అధికారి. కవితాదేవి డబ్లు్య.డబ్లు్య.ఇ. (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్)లో పాల్గొన్నతొలి భారతీయ మహిళా రెజ్లర్. అవని చతుర్వేది ఒంటరిగా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపిన తొలి మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్. ఎం.ఎ.స్నేహ భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా నో క్యాస్ట్, నో రెలిజియన్ ‘సర్టిఫికెట్’ సంపాదించిన తొలి భారతీయ మహిళ. అరుణిమ సింగ్ జలచరాలను కాపాడే పనిలో ఉన్న తొలి భారతీయ ప్రాణి ప్రేమికురాలు. ఇప్పటివరకు ఆమె 18 ప్రమాదకరమైన నీటి ప్రాణులను ప్రాణగండం నుంచి బయటపడేశారు. ప్రాంజల్ పాటిల్ కంటిచూపు లేని తొలి భారతీయ మహిళా ఐఎఎస్ అధికారి. గత ఏడాదే ఆమె ఎర్నాకులం జిల్లా (కేరళ) అసిస్టెంట్ కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
మనోభావాల కలబోత
వందకుపైగా ఏళ్ల నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నిర్వహించుకుంటున్నారు మహిళలు. తమను అదిమిపెట్టిన అడ్డంకిని ఛేదించి, విప్లవాత్మకమైన విజయానికి బాటలు వేసిన స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఉన్నారు అప్పటి నుంచి. అయినా సరే.. సమానత్వం కోసం ఇంకా గళమెత్తాల్సిన పరిస్థితే ఉంది. రాబోయే ఏడాది (2019, మార్చి 8) ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ‘బ్యాలెన్స్ ఫర్ బెటర్’. లింగ వివక్ష లేని ప్రపంచం కోసం డ్రైవింగ్ ఫోర్స్‌గా పని చేయడానికి సాటి మహిళలను సంసిద్ధం చేయనుంది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రపంచానికి బాగా తెలిసిన మహిళల పోరాటం. ఇది మాత్రమే కాదు. మనకు పెద్దగా పరిచయం లేని మరెన్నో పోరాటాలు మహిళల కోసం జరుగుతున్నాయి, 2019లోనూ జరగబోతున్నాయి. జూన్ నెలలో కెనడాలో ‘ఉమెన్ డెలివర్ 2019’ కాన్ఫరెన్స్ జరగనుంది. మహిళలు తమను తాము సంఘటిత పరుచుకోవడానికి నిర్వహించుకునే సదస్సుల్లో ప్రపంచంలోనే అత్యంత పెద్ద సదస్సు ఇది. స్త్రీ–పురుష సమానత్వం, ఆరోగ్య రక్షణ, బాలికలు, మహిళలు మానసికంగానూ శారీరకంగానూ, ఉల్లాసంగా ఉండే వాతావరణం కోసం పరితపించే మనసులు అక్కడ కొలువుదీరి ఆవేదనను పంచుకుంటాయి. ఒకే రోజు వంద నగరాల్లో..! ‘ఉమెన్స్ మార్చ్ 2019’.. వచ్చే ఏడాది జనవరి19వ తేదీన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలో జరగనున్న కవాతు. ఇది అక్కడి మహిళలు చేస్తున్న మూడవ ఉమెన్స్ మార్చ్. 2017లో మొదలైన ఈ ఉద్యమం ఏటా కొనసాగుతోంది. ఆ మార్చ్‌కు మద్దతుగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు వంద నగరాల్లో మహిళలు కవాతు నిర్వహిస్తాయి. లింకన్ మెమోరియల్ దగ్గర నిర్వహించే ర్యాలీలో మహిళల అవసరాలు, అవకాశాలు, హక్కులు ప్రధానాంశాలు . దిద్ది రాయించే సదస్సు ఏప్రిల్‌లో మూడు రోజులపాటు న్యూయార్క్‌లో ‘ఉమెన్ ఇన్ ద వరల్డ్’ సదస్సు జరగనుంది. దశాబ్దకాలంగా నినదిస్తోంది ఈ ‘ఉమెన్ ఇన్ ద వరల్డ్’. ఈ సదస్సులో మహిళల హక్కుల కార్యకర్తలు, అభ్యుదయ వాదులు సమావేశమై అభిప్రాయాలు పంచుకుంటారు. మగవాళ్ల చేతుల్లో రూపుదిద్దుకున్న మహిళల జీవితాలను విశ్లేషిస్తూ, మహిళల జీవితాలకు ఆరోగ్యకరమైన రూపు తీసుకురావడానికి మేధోమధనం జరుగుతుంది. పితృస్వామ్య భావజాలంతో రూపుదిద్దుకున్న సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం ఒక ఎత్తయితే, మహిళల గురించిన ఉదంతాలను వార్తాకథనాలుగా రాసేటప్పుడు సున్నితత్వాన్ని పాటించకపోవడం మరోఎత్తు. మీడియా ఉపయోగించే పదజాలం చాలాసార్లు అభ్యంతరకరంగా ఉంటోంది. వీటన్నింటి మీద తమ గళాన్ని వినిపించడానికి చేస్తున్న ఓ ప్రయత్నం ఇది. ఐరాసలో సమాలోచన మార్చిలో ఉమెన్స్ డే జరిగిన మూడు రోజులకు న్యూయార్క్‌లో మహిళల స్థితిగతుల మీద ఐక్యరాజ్య సమితిలో చర్చలు జరగనున్నాయి. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న 63వ సదస్సు ఇది. ఈ ఏడాది థీమ్ ‘కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్’. ఇందులో సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఆ పెద్దవాళ్లు చర్చించే అంశం కొత్తదేమీ కాదు. ‘మహిళలకు సామాజిక రక్షణ వ్యవస్థ, సేవల రంగంలో విధులు నిర్వర్తించడానికి ఉన్న వెసులుబాటు, మహిళల భద్రత ఏర్పాట్లు, స్త్రీ– పురుష సమానత్వం, బాలికలు – మహిళల సాధికారత’ ఉంటాయి. కొంచెం అటుఇటుగా ఎన్నో ఏళ్లుగా మాట్లాడుతున్నదే. అయినా... ఇంకామాట్లాడాల్సిన అవసరం ఉన్న అంశమే. -
రోడీస్..లేడీస్
సిటీ లేడీస్ ఓ డేర్ టూర్‌కు సిద్ధమవుతున్నారు. రోడ్డు మార్గంలో థాయ్‌లాండ్‌కు సాహస యాత్ర చేపడుతున్నారు. అటు బైక్స్, ఇటు కార్లు రెండింటినీ మేళవించి అక్టోబర్ 20న దేశంలోనే తొలిసారిగా ఈ తరహా ట్రిప్‌కు ఎంబార్క్ సంస్థ ముందుకొచ్చింది. సాక్షి, సిటీబ్యూరో :‘రోడ్డు మార్గంలో దేశాలు చుట్టేయాలి. అదీ మహిళలు.. స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వేల కిలోమీటర్లు ప్రయాణం సాగించాలి’ అంటే సాధారణ విషయం కాదు. అయితే అలాంటి సాహసయాత్రలను వ్యక్తిగతంగా సుసాధ్యం చేసిన ఇద్దరు స్నేహితురాళ్లు... ఇప్పుడు ఆల్ ఉమన్ ట్రిప్‌నకు శ్రీకారం చుట్టారు. ఇందులో అందరూ మహిళలే ఉండడంతో పాటు అటు బైక్స్, ఇటు కార్లు రెండింటినీ మేళవించి దేశంలోనే తొలిసారి ఈ తరహా ట్రిప్ నిర్వహిస్తోంది ఎంబార్క్ సంస్థ. దీని వ్యవస్థాపకులుమేధా జోసెఫ్ నగరవాసి కావడం విశేషం. రోడ్డు మార్గంలో ఒక సిటీ నుంచి మరో సిటీకి వెళ్లాలంటే, అబ్బా... అలసిపోతామేమో అనుకుంటాం. అలాంటిది ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే... ‘రోడ్ జర్నీ మీద ప్యాషన్ ఉంటేనే అది సాధ్యం’ అంటున్నారు మేధా జోసెఫ్. కొండాపూర్‌లో నివసించే మేధాకు చిన్నప్పటి నుంచి బైక్ రైడింగ్, కార్‌డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. వీలున్నంత వరకు ఎంత దూరమైనా రోడ్ మార్గంలోనే ప్రయాణించేది. ఆ ఇష్టం ఆమెతో పాటే పెరిగింది. తనలాంటి సరదా ఉన్న సుజల్‌ను ఫ్రెండ్‌ను చేసింది. ముంబైకి చెందిన సుజల్ వివిధ కంపెనీల్లో హెచ్ఆర్ విభాగంలో పనిచేశారు. డ్రైవింగ్‌పై అభిరుచితో అమెరికా, యూకే, యూరప్, టర్కీ, థాయ్‌లాండ్ తదితర దేశాలు చుట్టేశారు. ‘సుజల్ పరిచయం తర్వాత మా రూటే మారిపోయింది’ అంటూ నవ్వేసిన మేధా ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... ప్యాషన్ టు ప్రొఫెషన్ మాది పుణె. పదేళ్లుగా నగరంలో ఉంటున్నాను. జీఈ, ఇన్ఫోసిస్ తదితర ప్రముఖ కంపెనీల్లో ఫైనాన్స్ ప్రొఫెషనల్‌గా పనిచేశాను. రోడ్ టూర్స్‌పై ఇష్టంతో రికార్డ్ స్థాయి జర్నీ చేయాలని నా ఫ్రెండ్ సుజల్తో కలిసి ఇండియా నుంచి మొరాకో వరకు 57 రోజుల్లో 16 దేశాలు చుట్టేసి వచ్చాం. ఈ ట్రిప్‌లో మొత్తం 23వేల కి.మీ ప్రయాణం చేశాం. ఈ రోడ్ ట్రిప్ మా ఆలోచనల్ని మార్చేసింది. చాలామంది భారతీయులకు లాంగ్ రోడ్ ట్రిప్స్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ... అనుమతులు ఎలా పొందాలి? రూట్స్ ఎలా ప్లాన్ చేయాలి? ఇంకా ఎన్నో విషయాలపై అవగాహన లేకపోవడంతో ఆగిపోతున్నారని అర్థమైంది. దీంతో మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. జాబ్స్ వదిలేశాం. మూడేళ్ల క్రితం ఎంబార్క్ సంస్థను స్థాపించాం. దేశంలోనే బహుశా మహిళల ఆధ్వర్యంలో రోడ్ ట్రిప్స్ నిర్వహించే తొలి సంస్థ మాది. అద్భుతమైన అనుభవాలు.. దేశవిదేశాల్లోని రహదారులు... అనుభవాల వేదికలు. విభిన్న రకాల వంతెనలు, నిర్మాణాలు వాటి పైనుంచి ప్రయాణాలు మరచిపోలేని అనుభూతులు అందిస్తాయి. ఇవి మనకు మరే రకమైన ప్రయాణంలో రావనేది నిస్సందేహం. సంస్థ స్థాపించాక, ఇప్పటి వరకు దాదాపు 10 ట్రిప్స్ నిర్వహించాం. అన్నీ మన దేశం నుంచి విదేశాలకే. ఓవర్లాండ్ ట్రిప్ పేరుతో ఇండియా నుంచి స్పెయిన్‌కి 15 దేశాలను చుట్టేస్తూ 2017లో నిర్వహించిన వైవిధ్యభరితమైన ట్రిప్‌నకు చాలా పేరొచ్చింది. మేం నిర్వహించే ప్రతి ట్రిప్‌లో కనీసం 10 –12 మంది పాల్గొంటారు. ఆల్ ఉమన్..అందుకే ఇప్పటి వరకు అందరికీ (పురుషులు, మహిళలు) ట్రిప్స్ నిర్వహించినా... ఇప్పుడు నిర్వహించనున్న ఇండియా టు థాయ్‌లాండ్ ట్రిప్‌లో మహిళలకే అవకాశం కల్పించాం. కనీసం 25 మంది ఇందులో పాల్గొంటారు. సాధారణంగా మహిళల ట్రిప్స్‌కి సంబంధించి వ్యక్తిగత భద్రత, వాహనాలు బ్రేక్‌డౌన్ అయి మొరాయించడం తదితర సమస్యలు ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని మేం ఒక పూర్తిస్థాయి కాన్వాయ్‌తో ప్రయాణిస్తాం. ముగ్గురో నలుగురో కలిసి వెళ్లడం కన్నా ఇలా సమూహంలా వెళ్లడం.. అదే సమయంలో అందరి ఆలోచనా ధోరణి ఒకేలా ఉండడం.. విభిన్న నైపుణ్యాలున్న వారితో ప్రయాణించడం... ఇవన్నీ సమస్యలను కొంతవరకు సులభతరం చేస్తాయి. ఫుల్ రెస్పాన్స్... డ్రైవ్‌కు సంబంధించి ముందస్తుగా మరమ్మతులు, ఫిక్సర్స్ గురించిన అవగాహన కూడా కల్పిస్తాం.మా ట్రిప్స్‌కి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, హైదరాబాద్ నగరం నుంచి ఊహించని సంఖ్యలో సంప్రదిస్తున్నారు. రోడ్ ట్రిప్స్‌పై మహిళల్లో చాలా ఆసక్తి ఉంది. కొత్త ప్రాంతాలు, వినూత్న తరహా ప్రయాణ అనుభవాలను చాలామంది కోరుకుంటున్నారు. భవిష్యత్తులో సెంట్రల్ ఆసియా, సౌత్ అమెరికా, ఆఫ్రికా తదితర ఉత్తేజభరితమైన ట్రిప్స్తో రాబోతున్నాం. ఇంకా వరల్డ్ మ్యాప్‌లోని చాలా మార్గాలను ప్లాన్ చేయబోతున్నాం. ట్రిప్ విశేషాలివీ... ♦ ఆలిండియా ఉమన్స్ డ్రైవ్ ఇండియా టు థాయ్‌లాండ్ (కార్ అండ్ మోటార్‌సైకిల్) ట్రిప్‌ను మహిళాదినోత్సవం రోజునప్రకటించారు. ♦ ఇది అక్టోబర్ 20న గౌహతిలో ప్రారంభమై, నవంబర్ 4న బ్యాంకాక్‌లో ముగుస్తుంది. ♦ మొత్తం 2,800 కి.మీ కొనసాగుతుంది. ♦ వీసాలు, కార్, వ్యక్తిగత అనుమతులు, కార్ కస్టమ్ పేపర్ వర్క్, బోర్డర్ క్రాసింగ్, ఎంట్రన్స్ ఫీ, వెహికల్ ఇన్సూరెన్స్, టోల్, వెహికల్ కార్నెట్, బస, ఆహార వసతి తదితరాలన్నీ సంస్థ చూసుకుంటుంది. లీడ్, బ్యాకప్ వెహికల్స్‌ను సమకూరుస్తుంది. -
ఆకాశం అందింది
శకుంతల కాలే. మహారాష్ట్ర స్టేట్ బోర్డు ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్ పర్సన్. ఈ ఏడాది మహారాష్ట్ర ఎస్.ఎస్.సి. ఫలితాలు ఆవిడ చేతుల మీదుగానే విడుదల అయ్యాయి. ఎస్.ఎస్.సి. వరకైనా చదివే ఆర్థిక పరిస్థితి లేని ఒక పల్లెటూరి అమ్మాయి ఈ స్థాయికి చేరడం వెనుక ఉన్నవి కేవలం ఆమె కృషి, పట్టుదల, దీక్ష మాత్రమే. పుణే జిల్లా అంబేగావ్ అనే చిన్న పల్లెటూరు శకుంతలది. చిన్నతనంలోనే.. నాలుగో తరగతి చదువుతుండగానే తన తండ్రిని కోల్పోయింది. తల్లి నిరక్షరాస్యురాలు. భర్త పోయాక తప్పనిసరి పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్లవలసి వచ్చింది. వ్యవసాయ కూలీగా వచ్చే డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోయేది కాదు. శకుంతలను ఎలా చదివించగలదు. పైచదువులకు ఎలా పంపగలదు? ఎలాగో కష్టపడి పదో తరగతి వరకు చదివించింది కూతుర్ని. అంతకంటే ముందే.. పద్నాలుగో ఏటే శకుంతలకు పెళ్లి చేసేసింది. ఆ తరవాతే పదో తరగతి పరీక్షలు రాసింది శకుంతల. పద్నాలుగేళ్లకే పెళ్లి ‘‘మా ఊళ్లో జూనియర్ కాలేజీ లేదు. దూరాలకు పంపించి చదివించే స్థోమతా లేదు అమ్మకు. అందువల్లే నాకు అంత చిన్నవయసులో వివాహం చేసేసింది అమ్మ’’ అంటుంది శకుంతల. వివాహం అయ్యాక శకుంతల అత్తవారింటికి చేరింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. అక్కడా అంతే. ఆడపిల్లల చదువుకి ప్రాధాన్యం లేదు. అయితే ‘‘నా అదృష్టం కొద్దీ మా అత్తమామలు కాస్త లోకాన్ని చూసినవారు. నన్ను చదువుకోమని ప్రోత్సహించారు’ అంటూ సంబరంగా చెబుతుంది శకుంతల. అలా ఇంట్లో అందరూ సహకరిస్తుండటంతో, ఏదో ఒకటి సాధించాలనే కోరిక బయలుదేరింది ఆమెలో. ఈ విషయంలో ‘సావిత్రి ఫూలే పుణే విశ్వవిద్యాలయానికి’ రుణపడ్డానని చెప్తుంది శకుంతల. ఆ కాలేజీలో దూర విద్య ఉంది. అందువల్ల ఆ సెంటర్ నుంచి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బీఏ, ఎంఏ (మరాఠీ) పూర్తి చేసింది. రేడియోనే ఎన్సైక్లోపీడియా ‘‘డీఈడీ పూర్తి చేసిన తరవాత, నేను చదువుకున్న పాఠశాలలోనే టీచర్‌గా పనిచేశాను. సౌకర్యాలు ఉంటే, ఎదగగలమని చాలామంది అభిప్రాయపడతారు. కాని ప్రతికూల పరిస్థితుల్లో, వ్యక్తిగా ఏ మాత్రం ఎదగడానికి అవకాశం లేని పరిస్థితుల్లోనే ఒక బలమైన శక్తి ఎలాగో వచ్చేస్తుందనుకుంటాను. నాలోనే ఆ శక్తి, పట్టుదల మొదలయ్యాయి. ఎలాగైనా సరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాసవ్వాలని దీక్ష పట్టాను’’ అని చెబుతుంది శకుంతల. పరీక్షలకు కావలసిన మెటీరియల్ అందుబాటులో లేవు, కనీసం వార్తలు చూద్దామంటే టీవీ సదుపాయం కూడా లేదు. ఆ గ్రామంలో ఏ సమాచారం తెలుసుకోవాలన్నా ఆమెకు రేడియోనే ఆధారం. తన కల నెరవేరాలంటే అందుబాటులో ఉన్న సాధనాన్నే వినియోగించుకోవాలనుకుంది శకుంతల. రేడియోలో వచ్చే వార్తలు వింటూనే జనరల్ నాలెడ్జి పెంచుకుంది. ఉమెన్స్‌డే రోజే పీహెచ్డీ ఉదయం మూడు గంటలకే లేవడం, గ్రామంలో దూరంగా ఉన్న బావి నుంచి నీళ్లు తోడి తెచ్చుకోవడం, ఇంటిపనులన్నీ పూర్తి చేసుకోవడం, స్కూల్‌కి వెళ్లడం.. ఇదీ శకుంతల దినచర్య. మధ్యలో కాస్త తీరిక దొరికినా, ఆ కాస్తలోనే ప్రిపరేషన్.అలా 1993లో సర్వీస్ కమిషన్ క్లాస్ 2 పరీక్ష పాస్ అయింది. ‘‘నా కల నెరవేరింది. ఆకాశాన్ని అందుకున్నంత ఆనందం కలిగింది. పట్టుదల ఉంటే ఎవరైనా, దేన్నైనా సాధించగలరు అని తెలుసుకున్నాను’’ అంటున్న శకుంతల కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందింది. షోలాపూర్‌లో విద్యాశాఖలో ఉద్యోగం సంపాదించింది.‘‘1995లో నేను క్లాస్ 1 ఆఫీసర్ని అయ్యాను. స్త్రీవిద్య విభాగానికి హెడ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాను. గ్రామీణ నవలా సాహిత్యంలో మహిళల పాత్రచిత్రణ అనే అంశంపై పీహెచ్డీ చేశాను. యాధృచ్చికంగా అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించిన సంవత్సరమే నా పీహెచ్‌డి పట్టా అందుకున్నాను’’ అంటున్న శకుంతల మహిళలకు ఓ ఆదర్శం. గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఆమె స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. – రోహిణి -
ఘనంగా విమెన్స్ డే, ఆటా వార్షికోత్సవం
కెంటకీ : అమెరికాలోని ఆటా(అమెరికన్ తెలుగు అసోసియేషన్) ఆధ్యర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళ దినోత్సవం, ఆటా వార్షికోత్సవాన్ని కెంటకీ స్టేట్‌లోని లూసివిల్లెలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెంటకీ సెనెటర్ జూలీ ఆడమ్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆటా కెంటకీ రిజనల్ కో-ఆర్డినేటర్ డా.మహేష్ కుమార్ గుండ్లూరు మాట్లాడుతూ.. కార్యక్రమానికి హాజరై, మహిళ దినోత్సవాన్ని, ఆటా వార్షికోత్సవాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 650 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. అలాగే తెలుగు సినిమా గాయని సునీతా తన పాటలతో అందరినీ అలరించారు. గుండ్లూరు కవితా, సరస్వతీ తూటుపల్లి, హేమప్రసాద్, కవితా, వెంకటేశ్వర రెడ్డి, రాజ గోపాల్ రెడ్డి, రమ్య, అనిల్, కృష్ణ, భారతి, శివ రామకోటి రెడ్డి, సుజిత్‌లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తోడ్పాటు అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో కెంటకీ నేషనల్ టీం లీడర్స్ చైర్మన్ డా. తిరుపతి రెడ్డి, కో చైర్మన్ శ్రీకాంత్ కోటగిరి, ఆటా అధ్యక్షులు కరుణాకర్ అసిరెడ్డి, ఆటా ట్రస్టీ అనిల్ బోడిరెడ్డి, వెబ్ కమిటీ చైర్మన్ ఉమేష్ ముత్యాల, రామకిృష్ణ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ కో చైర్మన్ కిశోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాబులందించే జాబ్‌లో
స్వాతంత్య్రం వచ్చిన 66 ఏళ్లకు 2013 మార్చి 8న మహిళ దినోత్సవం రోజున అందరూ మహిళలే నిర్వహించే పోస్ట్ ఆఫీసు ఢిల్లీలో ఏర్పాటైంది. కానీ అంతకంటే 30 ఏళ్ల ముందుగానే పోస్ట్–ఉమన్‌గా ఎంపికై ఎంతో ధీమాగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు ఇంద్రావతి. ఇప్పటికీ ఆ బాధత్యలను ఇంకా పురుషులే ఎక్కువగా నిర్వహిస్తున్న ఈ కాలంలోనూ దాదాపు రిటైర్మెంట్ వరకూ తన పోస్టును విజయవంతంగా నిర్వహించారామె. ఈ మధ్యే రిటైర్ అయిన ఆమె కథ ఇది. పోస్ట్‌మ్యాన్ అనే మాటనే ఎక్కువగా వింటాం. వాళ్లనే చూసి ఉంటాం. కాని ఇంద్రావతి పోస్ట్ ఉమన్. ఢిల్లీ ఫస్ట్ పోస్ట్ ఉమన్‌గా రిక్రూట్ అయ్యి సేవలు అందించారామె. ఆడవాళ్లు చేయగలిగే ఉద్యోగాలలో వారి ప్రేవేశానికే ప్రతిబంధకాలు ఉన్న రోజుల్లో ఆడవాళ్లకు ఏ మాత్రం ప్రవేశం లేని పోస్ట్‌మేన్ రంగంలో విజయవంతగా సర్వీసు పూర్తి చేశారామె. ప్రయత్నిస్తే వీలు లేని ఉద్యోగాల్లో కూడా విజయం సాధించవచ్చు అంటారామె. కష్టాల నుంచి... హర్యానాలోని చిన్న పల్లెటూరు ఇంద్రావతి స్వస్థలం. అమ్మాయిలను అసలు బడికే పంపని ఊరది. అలాంటి ఊళ్లో ఇంద్రావతి వాళ్లది ఉమ్మడి కుటుంబం. వాళ్లమ్మ అకస్మాత్తుగా చనిపోవడంతో ఉమ్మడికుటుంబంలోంచి వాళ్లను ఉన్నపళంగా బయటకు పంపించేశారు. దాంతో ఇంద్రావతి వాళ్లు ఆ ఊళ్లో బడిలో తలదాచుకున్నారు. ఆమె అక్కడ అక్షరాలు దిద్దడం నేర్చుకున్నారు. ఆ శ్రద్థను చూసి ఇంద్రావతి తండ్రి ఆమెను బడిలో చేర్పించారు. అలా ఆమె చదువు సాగింది. అందుకే ఒక విషాదమే తన చదువుకు తోడ్పడిందని చెబుతారు ఇంద్రావతి. ఉద్యోగమూ అంతే. అనుకోకుండా పంపిన దరఖాస్తుతో కొలువు ఖరారైంది. 1982, సెస్టెంబర్ 13న పోస్ట్(ఉ)మ్యాన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ‘నేను చేరినప్పుడు ఆ జాబ్‌లో అందరూ మగవాళ్లే. అసలు ఆడవాళ్ల వస్తారని అనుకుని ఉండరు. అందుకే ఆ కొలువులో ఆడవాళ్లకు ఓ ప్రాపర్ టైటిల్ ఇవ్వలేదు. నన్ను కూడా పోస్ట్‌మ్యాన్ అనే పిలిచేవారు.’ అని వివరణ ఇస్తారు ఇంద్రావతి. ఒక్కోరోజు 70 ఉత్తరాలు... ఇంద్రావతి మొదట్లో హర్యానాలోని రోథక్‌లో ఉండేవారు. ఉద్యోగమేమో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో. ఢిల్లీకి రోజూ ట్రైన్లో వచ్చేవారు. ఉదయం తొమ్మిదింటికి డ్యూటీ మొదలయ్యేది. పోస్ట్ ఆఫీస్‌కు వచ్చిన ఉత్తరాలన్నిటినీ బస్సు వెళ్లే దారి ప్రకారంగా విభజిస్తారు. ఆ తర్వాత ఆ రూట్ ప్రకారమే బట్వాడా చేస్తారు. వాటిని ఆయా గడపల్లో వేయడానికి రోజుకు కనీసం ఎనిమిది కిలోమీటర్లు నడిచేవారట ఆమె. ఒక్కోరోజైతే 70 ఉత్తరాల దాకా ఉండేవట. బట్వాడా కోసం ఎన్నో ఇళ్ల తలుపులు తట్టాలి. వాటిల్లో అపార్ట్మెంట్లూ ఉంటాయి. కొన్నిటికి లిఫ్ట్స్ ఉంటాయి. కొన్నిటికి ఉండవు. మెట్లెక్కాల్సిందే. ‘ఢిల్లీ ఫస్ట్ పోస్ట్ ఉమన్నే కాదు.. మా ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబ్ దొరికిన ఫస్ట్ లేడీని, ఇంకా చెప్పాలంటే మా ఊరి తొలి ప్రభుత్వోద్యోగిని కూడా నేనే. ఈ క్రెడిట్ నాకూ ప్రౌడ్‌గానే అనిపిస్తుంటుంది. మా ఊళ్లో వాళ్లూ గొప్పగానే చూస్తారు’ అంటారు ఇంద్రావతి నవ్వుతూ. కోడలికీ స్ఫూర్తి.. ఇంద్రావతికి ఇద్దరు పిల్లలు. అమ్మమ్మ, నానమ్మ కూడా అయ్యారు. కోడలు వచ్చాక ఫక్తు అత్తగారిలా ప్రవర్తించలేదామె. తనకు చదువు విలువ తెలుసు కాబట్టి కేవలం ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్న కోడలిని ఉన్నత చదువులకై ప్రోత్సహించారు. ఇప్పుడు కోడలు, కూతురు ఇద్దరూ పోస్ట్గ్రాడ్యూయేట్లే. మహిళలకు ఆర్థిక స్వావలంబన ఉండాలనే ఉద్దేశంతో కోడలినీ ఉద్యోగస్తురాలిని చేసింది. వింతగా చూసేవారు... వేధించేవారు కూడా... పోస్ట్ ఉమన్‌గా తన జీవితం ఎలా ఉంది అని అడిగితే.. ‘మొదట్లో చాలా చాలెంజింగ్‌గా అనిపించేది. యూనిఫామ్ వేసుకొని ఉత్తరాలు పంచడానికి వెళ్తుంటే అందరూ వింతగా చూసేవాళ్లు. కొంతమంది గేలి చేశారు. కొంత మందైతే దొంగననుకునే వాళ్లు. ఇంకొంతమంది బిచ్చగత్తెననీ భ్రమపడ్డారు. అ యితే విషయం తెలుసుకున్నాక వాళ్లే గౌరవించడం మొదలుపెట్టారు. ఒకసారి ఒక తాగుబోతు నాతో మిస్ బిహేవ్ చేశాడు. కాని మత్తు దిగాక మరుసటిరోజు నేను పనిచేస్తున్న పోస్టాఫీస్‌కు వచ్చి క్షమాపణ కోరాడు. తాను అలా ప్రవర్తించినందుకు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. నా జీవితంలో అలాంటి సంఘటన అదే మొదలు, ఆఖరు కూడా. చదువురాని వాళ్లు పర్సనల్ లెటర్స్‌ను నాతో చదివించుకునేవాళ్లు. ఎంతో నమ్మకం ఉంటేనే కదా.. చదవమంటారు! చిన్న వాళ్లు, పెద్దవాళ్లు అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. ఢిల్లీ ఫస్ట్ పోస్ట్ ఉమన్‌ని అని తెలిసీ నాతో సెల్ఫీ దిగడానికి ఆరాటపడుతుంటారు. వాళ్ల అభిమానం చూస్తుంటే హ్యాపీగా ఉంటుంది.’ అంటారు ఇంద్రావతి. ఇంద్రావతి తొలిసారి ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ దగ్గరలోని గోల్ ఢాక్–ఖానాలోనే గత నెలాఖర్లో పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆ ఆఫీస్ సిబ్బంది ఆమెకు ఘనంగా వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేశారు. ‘యోగా చేస్తాను. నా మనవరాళ్లతో కలిసి స్విమ్మింగ్‌కు వెళ్తాను. నాకిష్టమైన వ్యాపకాలతో రిటైర్మెంట్ లైఫ్‌నూ అంతే బిజీగా గడపాలని డిసైడ్ చేసుకున్నా’ అంటారు ఇంద్రావతి. -
ప్రధాని గారు నా సపోర్ట్ మీకే : కాజల్
సాక్షి, సినిమా : మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్ నా సపోర్ట్ ఎప్పుడూ మీకుంటుంది అని అన్నారు నటి కాజల్ అగర్వాల్. ఏంటీ ఈ బ్యూటీకీ రాజకీయ ఆశ పుట్టుకొచ్చిందా అనే సందేహం కలుగుతోందా? ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అన్న సామెతలా భవిష్యత్‌లో కాజల్‌అగర్వాల్ రాజకీయాలకు రెడీ అనవచ్చునేమో. ఆ మధ్య సినిమా శాశ్వతం కాదు, వేరే రంగంపై దృష్టి పెట్టాలని కాజల్ అన్న విషయం తెలిసిందే. ఆ సంగతి అటుంచితే ఇటీవల ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రధాని నటి కాజల్ అగర్వాల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారట. అందుకు తెగ ఆనందపడిపోయిన కాజల్ అందుకు సామాజిక మాధ్యమం ద్వారా బదులిచ్చారు. అదేంటంటే ‘ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఔన్నత్యంతో మీరు రాసిన లేఖకు ధన్యవాదాలు. మహిళల సాధికారకత కోసం మీరు ప్రవేశ పెట్టిన భేటీ బచావో.. భేటీ పడావో, నారీశక్తి పథకాలకు నేను చాలా ఆకర్షితురాలినయ్యాను. వాటి ద్వారా సమాజంలో కచ్చితంగా మంచి మార్పు వస్తుంది. అలాంటి స్త్రీ శక్తిని పెంపొందించే విషయంలో మీకు నా సపోర్టు ఎప్పుడూ ఉంటుంది’ అని కాజల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ప్యారీస్ ప్యారీస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తెలుగులో కల్యాణ్‌రామ్‌కు జంటగా నటిస్తున్న ఎంఎల్ఏ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతానికి ఇవి మినహా మరే చిత్రాలు లేవు. దీంతో కొత్త అవకాశాల కోసమో, లేక ప్రధాని దృష్టిని ఆకర్షించి రాజకీయాల్లోకి రావాలన్న దూరాలోచనో గానీ మొత్తం మీద ఈ విధంగా కాజల్ వార్తల్లో నానుతున్నారు. అయితే కాజల్ అగర్వాల్ సమాచారం మోదీ దృష్టికి వెళ్లిందో లేదో మరి. -
భార్యలను కొట్టడం తప్పుకాదన్న ఎంపీ
కంపాలా: హుందాగా ప్రవర్తించాల్సిన చట్ట సభ ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. తాజాగా ఉగాండాకు చెందిన ఎంపీ ఒనెమస్ ట్వినామసికో మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల పాలయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..‘ప్రతీ పురుషుడు భార్యపై పైచేయి సాధించాలి. మహిళలను క్రమశిక్షణలో పెట్టాలనుకున్నపుడు వారిని కొట్టడంలో ఏమాత్రం తప్పులేదం’టూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఉగాండా మహిళలు #OnesmusTwinamasikoMustResign హాష్‌ట్యాగ్‌తో ట్వినామసికో రాజీనామా చేయాలంటూ ట్విటర్ వేదికగా ఉద్యమం చేపట్టారు. ఉగాండా పార్లమెంట్ స్పీకర్ రెబెకా కడగా, ఆమెతోపాటు పార్లమెంట్‌లోని మహిళా ప్రతినిధులంతా ఎంపీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. వారి డిమాండ్లకు ఆయన తలొగ్గక తప్పలేదు. మహిళలంటే తనకెంతో గౌరవముందని, మహిళల పట్ల జరుగుతున్న హింసకు తాను వ్యతిరేకమంటూ పార్లమెంట్‌కు లేఖ రాశారు. మహిళలకు క్షమాపణ తెలుపుతూ వివరణ ఇచ్చారు. ఉగాండా అధ్యక్షుడు యొవేరీ ముసేవేని ఆడవారిని హింసించే మగవారంతా పిరికిపందలంటూ సందేశం ఇచ్చినరోజే ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అక్కడ ఇవేమీ కొత్తకాదు.. 2016లో విడుదల చేసిన ప్రభుత్వ నివేదిక ప్రకారం.. ప్రతీ ఐదుగురు మహిళల్లో ఒకరు లైంగిక, భౌతిక పరమైన దాడులు ఎదుర్కొంటున్న వారే. 14 నుంచి 49 ఏళ్ల వయసున్న ఆడవారు వివిధ రకాలుగా వేధింపబడుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
ఆశించని సహాయానికి.. ఊహించని ప్రతిఫలం
టెక్సస్ : ప్రతిఫలం ఆశించకుండా ఏ పని చేసినా, ఫలితం ఏదో రూపంలో వస్తుందంటారు. అలాగే న్యూటన్ మూడో నియమం ప్రకారం చర్యకు, ప్రతి చర్య ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇది చాలా సందర్భాలలో నిరూపితమయింది కూడా. మానవ జీవితం కూడా ఈ సిద్ధాంతంతో ముడిపడి ఉందనడానికి ఓ మహిళా వెయిటర్ జీవితంలో జరిగిన సంఘటనే నిదర్శనం. 18 ఏళ్ల ఏవోని విలియమ్స్ అమెరికా టెక్సస్‌లోని లా మార్య్కూలో ఉన్న వాఫెల్ హౌస్‌లో వెయిట్రస్‌గా ఉదయం పూట పనిచేస్తుంది. తన విధుల్లో భాగంగా విలియమ్స్ చేసిన చిన్న సహాయం తనకు కీర్తితోతోపాటు మరచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది. చార్పెంటియర్ అనే ముసలాయన రెగ్యులర్‌గా ఆ హోటల్లో బ్రెక్‌ఫాస్ట్ చేయడానికి వస్తుండేవాడు. ఇటీవలే ఆయనకు ఆపరేషన్ జరిగింది. దీంతో సొంతంగా ఆహార పదార్థాలను ముక్కలుగా చేసుకొని తినడానికి ఇబ్బంది పడేవాడు. ఇది గమనించిన విలియమ్స్ అతని ఆహారాన్ని స్వయంగా తానే ముక్కలుగా చేసి ఇచ్చింది. అక్కడే ఉన్న లారా ఓల్ఫ్ అనే కస్టమర్ ఈ ఫొటోని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ సహాయం ఆ పెద్దాయనకు చిన్నదిగా తోచవచ్చునేమో కానీ, నా దృష్టిలో మాత్రం ఇది చాలా గొప్పది అనే లారా ఫేస్బుక్లో కామెంట్ చేశారు. అనతికాలంలోనే ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతోమంది విలియమ్స్‌ని ప్రశంసలతో ముంచెత్తారు. టెక్సస్ సదరన్ యూనివర్సిటీ 16వేల డాలర్ల(10 లక్షల రూపాయలు) ఉపకారవేతనాన్ని అందించింది. లా మార్క్య్ మేయర్ కూడా విలియమ్స్ దయ హృదయాన్ని గుర్తించారు. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా స్థానికంగా విలియమ్స్ డేగా ప్రకటించారు. చాలామంది ఏదైనా సహాయం చేయ్యాలంటే ఆలోచించే ఈ రోజుల్లో విలియమ్స్ ప్రతిఫలం ఆశించకుండా చేసిన చిన్న సహాయం తన జీవితానికి దారి చూపడంతో పాటు, ఏనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. -
‘ఆమెకే విజయావకాశాలు ఎక్కువ’
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు మహిళలకే ఎక్కువగా ఉంటాయని ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. ‘మహిళలు ఓడిపోతారనే భావన సరైంది కాదు. గత 70 ఏళ్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మహిళలకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారికిచ్చే టికెట్ల శాతం(6%) కంటే వారి గెలుపు శాతమే(10%) ఎక్కువగా ఉంది. ఈ గణాంకాలు చాలు.. వారు ఎన్నికల్లో గెలవలేరనే భావన తప్పని నిరూపించడానికి’ అని ఖురేషీ తెలిపారు. ఇక మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ఆయన ప్రస్తావించారు. భారత్‌లో 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న 28 శాతం మంది మహిళలు లైంగిక వేధింపుల గురౌతున్నారన్నారు. మహిళలు హింసను భరించాలే తప్ప ఎదురు తిరగకూడదని పురుషులు భావించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం మన రాజ్యాంగం ఎన్నో హక్కులను, చట్ట సభలు చట్టాలను కల్పించాయని.. కానీ, అవేవీ అమలు కాకపోవటం బాధాకరమైన విషయమని ఖురేషీ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆపరేషన్@బోరు బావి
లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా చేస్తూ దూసుకెళోతున్న నయనతార నటించిన తమిళ చిత్రం ‘ఆరమ్’ తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదల కానుంది. గోపి నైనర్ దర్శకత్వంలో ‘శివ లింగ, విక్రమ్ వేదా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్. రవీంద్రన్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తంగా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ‘‘ప్రజలకు ఏది అవసరమో అదే చట్టమవ్వాలి కానీ చట్టాన్ని ముందే తయారు చేసి దాన్ని ప్రజల మీద రుద్దకూడదు’’ అని ఈ టీజర్‌లోని డైలాగ్ ఆకట్టుకుంటోంది. ‘‘తమిళంలో నయనతారకు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన చిత్రమిది. బోరు బావిలో ఆడుకుంటున్న పిల్లలు పడిపోతే, అక్కడ జరుగుతున్న ఆపరేషన్ కథా వస్తువుగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా గోపి నైనర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ ఆపరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ పాత్రలో నయనతార నటన అద్భుతం. ఆసక్తికి గురి చేసే మలుపులతో సాగే మంచి పొలిటికల్ డ్రామా. ఈ నెల 16న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. -
సింగర్‌గా మారిన ఫైర్‌బ్రాండ్ డీఐజీ
సాక్షి, బెంగళూరు : ఫైర్‌బ్రాండ్ పోలీసు అధికారిణిగా పేరొందిన కర్ణాటక డీఐజీ (జైళ్ల శాఖ) రూపా ముగ్దిల్ తనలో దాగున్న మరో ప్రతిభను బయటపెట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. 1965లో విడుదలైన మీనా కుమారి - ధర్మేంద్రల ‘కాజల్’ సినిమాలోని ‘తోరా మన్ దర్పణ్ కెహలాయె’ అంటూ సాగే పాటను ఆమె స్వయంగా ఆలపించారు. ‘ఈ పాట ఆడియో రికార్డింగ్ కోసం కేవలం అరగంట సమయం మాత్రమే పట్టింది. వీడియో చిత్రీకరణ కూడా నాలుగు గంటల్లో ముగించేశాం’ అని రూపా చెప్పారు. తమలో దాగున్న శక్తిని గుర్తించాలంటూ సాగే ఈ పాట తనలో ఎంతో స్ఫూర్తి నింపిందని, అందుకే ఈ వీడియో రూపొందించినట్లు తెలిపారు. మనసే అందరిలోని సంతోషం, దుఃఖానికి, సాధించే విజయాలు, అపజయాలకు కారణమని.. బలంగా అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీలేదని అందరూ గుర్తించాలన్నారు. ఈ వీడియో మ్యూజిక్ కంపోజర్‌గా కన్నడ సినీ దర్శకుడు అలెన్ వ్యవహరించారు. ఆర్జే శృతీరావు కోరిక మేరకు వీడియోను రూపొందించానని రూపా తెలిపారు. పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న అన్నాడీఎంకే నేత శశికళకు ప్రత్యేకంగా రాజభోగాలు కల్పిస్తున్నారంటూ నివేదికనిచ్చి ఒక్కసారిగా సంచలనంగా రూపా నిలిచారు. గతంలో కూడా ధార్వాడ్(మధ్యప్రదేశ్) ఎస్పీగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఉమా భారతిని అరెస్ట్ చేసి ఆమె సంచలనం సృష్టించిన విషయం విదితమే. -
సౌత్‌లో ఫస్ట్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని చంద్రగిరి రైల్వే స్టేషన్‌ను దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా రైల్వేస్టేషన్‌గా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరుపతి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగిరి రైల్వేస్టేషన్ మీదుగా పదుల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం భక్తులు, విద్యార్థులు, ఉద్యోగులతో స్టేషన్ రద్దీగా కనిపిస్తుంటుంది. దీనికి తోడు ప్రతిరోజు సుమారు 10 ప్యాసింజర్ల ద్వారా 700 మంది ప్రయాణికులు చంద్రగిరి మీదుగా కాలినడకన తిరుమలకు వెళ్తుంటారు. ఇంత ప్రాముఖ్యం ఉన్న చంద్రగిరి రైల్వేస్టేషన్లో ముగ్గురు స్టేషన్‌మాస్టర్లు, ముగ్గురు పాయింట్ ఉమెన్‌లతో పాటు ఒక టిక్కెట్ బుకింగ్ క్లార్క్ అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలను అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ స్టేషన్‌ను పూర్తిగా మహిళా రైల్వేస్టేషన్‌గా మార్చింది. దాంతో దక్షిణ భారతంలోనే మొట్టమొదటి మహిళా స్టేషన్‌గా చంద్రగిరి స్టేషన్ చరిత్రలో స్థానం సంపాదించుకుంది. విధులకు హాజరయ్యేందుకు ఉద్యోగినులకు ప్రత్యేక వాహనాలతో పాటు, అదనపు సహాయక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో తిరుపతి రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో భాగంగా కూడా చంద్రగిరి మహిళా రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయబోతున్నారు. పురుషులకంటై తామేమీ తక్కువ కాదని, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించి, నూతన ఒరవడిని సృష్టిస్తామని ఈ స్టేషన్‌లోని మహిళా ఉద్యోగినులంతా ధీమా వ్యక్తం చెయ్యడం అభినందనీయం. – భూమిరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి, సాక్షి, చంద్రగిరి సంతోషంగా ఉంది చంద్రగిరి రైల్వేస్టేషన్లో మొట్టమొదటి మహిళా స్టేషన్‌మాస్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. టికెట్ బుకింగ్ స్టాఫ్ దగ్గర్నుంచి స్టేషన్ మాస్టర్ వరకు అంతా మహిళలమే విధులు నిర్వహిస్తున్నాం. గత పది సంవత్సరాలుగా నేను రైల్వేలో విధులు నిర్వహిస్తున్నాను. అయితే ఇలా మహిళలందరితో కలసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. – పూర్ణిమ, స్టేషన్‌మాస్టర్, చంద్రగిరి ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు నేటి సమాజంలో పురుషుల కంటే మహిళలే అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇటువంటి తరుణంలో స్త్రీలకు మరింత ప్రోత్సాహం అందించి మా ఉన్నతికి మార్గం సుగమం చేసిన అధికారులకు ధన్యవాదాలు. పదేళ్లకు పైగా రైల్వే పాయింట్ ఉమన్‌గా విధులు నిర్వహిస్తున్నాను. జిల్లాలో ఎన్నో స్టేషన్లలో విధులు నిర్వహించాను. ఎక్కడ చూసినా మహిళలంటే కొంత చిన్నచూపు కనిపించేది. మాలోని ప్రతిభను గుర్తించి, మాకంటూ ఓ రైల్వేస్టేషన్‌ను ప్రకటించడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. – శ్యామల, పాయింట్ ఉమన్, చంద్రగిరి -
అమ్మాయికి ఆటలెందుకన్నారు!
సాక్షి, హైదరాబాద్ : మిథాలీకి అప్పుడు ఎనిమిదిన్నరేళ్లు. చిన్నప్పుడు ఎంతో బద్ధకస్తురాలు. బద్ధకాన్ని పోగొట్టేందుకు అన్నయ్య వెంట ప్రతిరోజూ క్రికెట్ ప్రాక్టీస్‌కు పంపించేవారు తల్లిందండ్రులు. ప్రాక్టీస్ ముగిసినాక కోచ్ జ్యోతిప్రసాద్ ఆఖరులో రెండు మూడు బాల్స్ వేసి మిథాలీరాజ్‌తో కూడా ఆడిపించేవారు. ఆ రెండు, మూడు బాల్స్ వేసినప్పుడు మిథాలీ ఆడిన ఆటకు జ్యోతిప్రసాద్ మంత్రముగ్ధుయ్యారు. మిథాలీ తల్లిదండ్రులు దొరైరాజ్, లీల్రాజ్లను పిలిచి మీ అమ్మాయిలో చాలా ప్రతిభ ఉందన్నారు. దీంతో ఆమె చదివే కిమ్స్ హైస్కూల్లో రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేలా మిథాలీని సిద్దం చేశారు. మూడు నెలలకు కిమ్స్ స్కూల్ కోచ్ సంపత్‌కుమార్ నాయుడు ‘మీ అమ్మాయిని ఇండియా తరపున ఆడిస్తా’ అన్నారు. ఆ మాట విన్న దొరైరాజ్, లీలారాజ్ నవ్వుకున్నారు. అసలు క్రికెట్ అంటే తెలియని మిథాలీని ఇండియాకి ఎలా ఆడిస్తారంటూ కోచ్‌ను ప్రశ్నించారు. కానీ ఆ రోజు కోచ్ మాటతో వదిలేయడంతోనే ఈరోజు మహిళా క్రికెట్ అంటే మిథాలీ.. మిథాలీ అంటే మహిళా క్రికెట్ అనే పేరు తెచ్చిపెట్టింది. కానీ మిథాలీరాజ్ చిన్నప్పుడు ప్రాక్టీస్‌కు వెళ్తున్నప్పుడు రక్తసంబంధీకులు, బంధువులు చాలా హేళనగా మాట్లాడేవారని ఆమె తల్లి లీలారాజ్ చెప్పారు. ‘మీకేం పనిలేదా ఆడపిల్లకు ఆటలు ఎందుకు.. ఆమెకేమైనా దెబ్బ తగిలితే పెళ్లి ఎవడు చేసుకుంటాడు’ అని తన అత్త విసుక్కునేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎందరు ఎన్ని మాటలన్నా.. కూతురును ఓ మంచి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాం. మహిళలకే ఆదర్శంగా తీర్చిదిద్దాం. మహిళా దినోత్సవం సందర్భంగా మిథాలీరాజ్ తల్లి లీలారాజ్ ఏమంటున్నారంటే.. మిథాలీ క్రికెట్లో బాగా రాణిస్తోంది. 9 ఏళ్లకే సబ్జూనియర్స్కి సెలెక్ట్ అయ్యింది. అప్పుడు ఢిల్లీకి ఎలా పంపాలి అని చాలా బాధపడ్డాం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కి వెళ్లి మిథాలీ ట్రైన్ ఎక్కేవరకు ఉన్నాం. ఇంటికి వచ్చాక ఏడుస్తూ ఉన్నాను. నా బాధను గమనించిన నా భర్త దొరై ‘దేశానికి మన కూతురిని ఇచ్చాం. నువ్వు కూల్‌గా ఉండు. మిథాలీని అలా పంపడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు నెక్ట్స్ కాజీపేట స్టేషన్లో ట్రైన్ ఆగుతుంది వెళ్లి తీసుకొచ్చేస్తా’ అన్నారు. వెంటనే కన్నీళ్లు తుడుచుకుని ఇంకోసారి నేను ఇలా ఏడ్వను, బాధ పడను అని మాట ఇచ్చాను. అక్కడ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మిథాలీ ఎంతో ఆనందంగా హైదరాబాద్‌కు వచ్చింది. ఇక ప్రాక్టీస్ విషయంలో చాలా ఏకాగ్రత పెట్టాలి. దొరై ఆంధ్ర బ్యాంక్‌లో పనిచేస్తున్నారు, నేను సికింద్రాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో చేస్తున్నాను. మిథాలీని ప్రాక్టీస్‌కి తీసుకెళ్లడం కష్టంగా ఉందని.. ఆమె ఆహారం, ప్రాక్టీస్, తదితర విషయాల్లో దగ్గర ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని నేను నా ఉద్యోగాన్ని వదిలేశా. ఎందుకిలా చేస్తున్నారు..? మిథాలీని క్రికెట్‌కు దగ్గర చేసి బంధువులకు దూరం చేశాం. దీంతో మా ఉమ్మడి కుటుంబంలో చాలా మంది మిథాలీకి తెలియదు. చాలాసార్లు మా అమ్మ, బంధువులు ‘ఎందుకిలా చేస్తున్నారు’ అంటూ మొహంపైనే అనేవారు. కానీ.. మాకు తెలుసు మా కూతురి స్టామినా ఏంటో. ఎవరెన్ని మాట్లాడినా మేం ఏం పట్టించుకోలేదు. మా పని మేం చేసుకుంటూ.. ఆటపై దృష్టి సారించమని ఆమెను ప్రోత్సహించాం. ఇప్పుడు గర్వంగా ఉంది క్రికెట్లో ఆమె వరల్డ్ రికార్డు సాధించనప్పుడు మా అత్తమామల వైపు వారు, ఆ కుటుంబం వైపు వారు చాలా సంతోషించి, మాకు ఫోన్లు చేసి అభినందించారు. ఇప్పుడు మహిళా క్రికెట్‌కు నా కూతురు ద్వారా గుర్తింపు రావడాన్ని చూసి తల్లిగా నేనెంతో గర్విస్తున్నా. ఒక ఆడపిల్ల తల్లిగా నాకు ఇంతకన్నా ఆనందం ఏముంటుంది.