
మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఇప్పుడిప్పుడే ఆధిపత్యాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ ప్రముఖ అంతర్జాతీయ ఆతిథ్య సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ.. మహిళల వ్యాపార పురోభివృద్ధిపై ఆసక్తికర విశేషాల్ని వెల్లడించింది.
ఎయిర్‌బీఎన్‌బీలో భారతీయ మహిళా హోస్ట్‌లకు (హోటల్స్, పీజీలు అద్దెకిచ్చే వారు) 2024 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది. వారు ఆ ఏడాదిలో రూ.260 కోట్లు ఆర్జించారు. ఇది ఆ ప్లాట్‌ఫామ్ ఆతిథ్య ల్యాండ్ స్కేప్‌కు గణనీయంగా దోహదం చేసింది. దేశంలోని ఎయిర్‌బీఎన్‌బీ హోస్ట్ లలో దాదాపు 30% ఉన్న మహిళలు సమ్మిళితతను పెంపొందించడం, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా సాంప్రదాయ ఆతిథ్య పరిశ్రమను పునర్నిర్మించారు. దేశవ్యాప్తంగా ట్రావెల్ అనుభవాలను పునర్నిర్వచించడంలో మహిళల ప్రాముఖ్యత పెరుగుతోందనడానికి వారి సాధనలే నిదర్శనం.
పెరుగుతున్న మహిళా హోస్ట్‌లు
దేశంలో మహిళా హోస్ట్‌లు గణనీయమైన విజయాన్ని సాధించారు. భారత్‌లో ఎయిర్‌బీఎన్‌బీ గెస్ట్ ఫేవరెట్ లిస్టింగ్స్‌లో దాదాపు 35% మహిళా హోస్ట్‌లే నిర్వహిస్తుంటం విశేషం. చిరస్మరణీయమైన, సౌకర్యవంతమైన బసలను అందించడంలో వారి అసాధారణ సామర్థ్యాన్ని ఇది హైలైట్ చేస్తుంది. సుందరమైన ప్రదేశాలలో సౌకర్యవంతమైన హోమ్ స్టేల నుండి ఆధునిక పట్టణ అపార్ట్ మెంట్ల వరకు, మహిళలు సృజనాత్మకత, శ్రద్ధ, అతిథి అంచనాలపై లోతైన అవగాహనను ప్రదర్శించారు.
భారతీయ మహిళల్లో ట్రావెల్ ట్రెండ్స్
దేశీయ, అంతర్జాతీయ పర్యటనలకు ఎయిర్‌బీఎన్‌బీని భారత మహిళా ప్రయాణికులు వేదికగా ఎంచుకున్నారు. 2024లో భారతీయ మహిళా ప్రయాణికులకు అత్యంత డిమాండ్ ఉన్న దేశీయ గమ్యస్థానాలలో గోవా, ఢిల్లీ, బెంగళూరు, పూణే, జైపూర్ ఉన్నాయి. అంతర్జాతీయంగా లండన్, దుబాయ్, బ్యాంకాక్, పారిస్, రోమ్ వంటి నగరాలు వారి ట్రావెల్ విష్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచాయి.
మిలీనియల్ మహిళలు (1981-1996 మధ్య పుట్టినవారు) తమ ప్రయాణ ప్రణాళికల కోసం ఎయిర్‌బీఎన్‌బీని ఉపయోగించడంలో ముందంజలో ఉన్నారు. వారి తరువాత వరుసలో జెన్‌జెడ్ మహిళలు (1996-2012 మధ్య పుట్టినవారు) ఉన్నారు. సౌలభ్యం, ప్రత్యేకమైన అనుభవాలు, స్థోమత కోసం వారి ప్రాధాన్యత ఎయిర్‌బీఎన్‌బీ ప్రజాదరణను పెంచింది. డుయో ట్రావెల్ అత్యంత ఇష్టమైన ట్రిప్ టైప్ గా అవతరించింది. తరువాత సమూహ ప్రయాణాలు, మహిళల్లో భాగస్వామ్య ప్రయాణ అనుభవాల పెరుగుతున్న ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment