Airbnb
-
పండుగ సీజన్లో పర్యాటకానికి ఉత్తమ ప్రదేశాలు: ఎయిర్‌బీఎన్‌బీ
రాబోయే పండుగలను.. శరదృతువు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చాలామంది కొత్త ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. ఈ తరుణంలో అమెరికాకు చెందిన వెకేషన్ రెంటల్ కంపెనీ 'ఎయిర్‌బీఎన్‌బీ' (Airbnb) భారతీయ ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్రయాణ అనుభవాలను అందించడానికి టాప్ ట్రెండింగ్ ప్రదేశాలను వెల్లడించింది. ఇందులో కాన్పూర్, లక్షద్వీప్, ఉజ్జయిని వంటివి ఉన్నాయి.కాన్పూర్‌లో దసరా ఉత్సవాలను ఆడంబరంగా నిర్వహిస్తారు. ఉష్ణమండల ఆకర్షణకు ప్రసిద్ధి చెందిన లక్షద్వీప్ కూడా పర్యాటకానికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఉజ్జయినిలో ఆధ్యాత్మిక శోభను చూడవచ్చు. ఇవన్నీ సహజ సౌందర్యమైన సాంస్కృతిని.. వాటి ప్రాముఖ్యతను తెలియజేసే గమ్యస్థానాలు.అంతర్జాతీయ ప్రదేశాల కోసం అన్వేషించేవారికి టోక్యో, అమాల్ఫీ, బాకు వంటివి చెప్పుకోదగ్గవి. టోక్యోలోని పార్కులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అమాల్ఫీ తీరం పర్యాటకులకు ప్రశాంతమైన వాతావరణం అందిస్తాయి. బాకు ప్రాంతం వాస్తుశిల్పం, గొప్ప చరిత్రను తెలియజేస్తాయి. భారతీయ పర్యాటకులు మంచి ప్రదేశాలను సందర్శించాలనుకున్నప్పుడు ఇవన్నీ మరుపురాని మధురమైన అనుభూతులను అందిస్తాయి.ఓ వైపు పండుగ సీజన్, మరోవైపు శరదృతువు.. ఈ సమయంలో భారతీయులు దేశీయ, అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. అలాంటి ఈ ప్రదేశాలు చాలా అనుకూలంగా ఉంటాయని ఎయిర్‌బీఎన్‌బీ జనరల్ మేనేజర్ 'అమన్‌ప్రీత్ బజాజ్' పేర్కొన్నారు.ప్రపంచ పర్యాటక దినోత్సవం (సెప్టెంబర్ 27) సమీపిస్తోంది. ఈ ఏడాది వరల్డ్ టూరిజం డే థీమ్ "పర్యాటకం మరియు శాంతి". దీని అర్థం ఏమిటంటే ప్రపంచ దేశాల మధ్య శాంతి, సంస్కృతుల మీద అవగాహన కల్పించడం. పర్యాటకులు విభిన్న ప్రకృతి దృశ్యాలను.. మెరుగైన అనుభవాలను అన్వేషించడానికి టూరిజం ఎంతో ఉపయోగపడుతుంది. -
లాంగ్ వీకెండ్.. ఎక్కువ మంది ఇక్కడికే..
స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్లను పురస్కరించుకుని లాంగ్ వీకెండ్ వచ్చింది. దీంతో వీటిని సద్వినియోగం చేసుకునేందుకు చాలా మంది వెకేషన్ ప్లాన్ చేసే పనిలో పడ్డారు. దగ్గరలో మంచి వెకేషన్ స్పాట్లు ఎక్కడ ఉన్నాయా అని శోధిస్తున్నారు.వెకేషన్ రెంటల్ సేవలు అందించే ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) సంస్థ ప్రకారం.. స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్ సందర్భంగా వచ్చిన లాంగ్ వీకెండ్‌తో డొమెస్టిక్ వెకేషన్ స్టేల కోసం శోధనలు వార్షిక ప్రాతికదికన 340 శాతానికిపైగా పెరిగాయి. దేశంలో మంచి వెకేషన్ స్పాట్లు అందుబాటులో ఉండటంతో లాంగ్ వీకెండ్లలో వీటిని సందర్శించేందుకు భారతీయ పర్యాటకులలో పెరుగుతున్న ఆసక్తిని ఈ డేటా తెలియజేస్తోంది.ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రాంతాలు ఇవే.. ఈ లాంగ్ వీకెండ్ సందర్భంగా ఎక్కువ మంది ఆసక్తి కనబరిచిన వెకేషన్ స్పాట్లను ఎయిర్‌బీఎన్‌బీ తెలియజేసింది. వాటిలో గోవా, లోనావాలా, పుదుచ్చేరి, ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, ఉదయపూర్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఎయిర్‌బీఎన్‌బీ సెర్చ్ డేటా ప్రకారం చాలా మంది బీచ్‌లు ఉన్న ప్రాంతాలపై ఆసక్తి కనబరిచినట్లుగా తెలుస్తోంది. -
పెరుగుతున్న ట్రావెల్ స్కామ్‌లు.. బాధితులు వీళ్లే..
దేశ విదేశాలకు ఇటీవల హాలిడే ట్రిప్‌లకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరిలో యువత, టీనేజర్లే అధికంగా ఉంటున్నారు. అయితే ఇలా హాలిడే ట్రిప్‌లకు వెళ్లేవారు ట్రావెల్ బుకింగ్ స్కామ్‌లకు గురవుతున్నారు. ఇలాంటి ట్రావెల్ స్కామ్‌లను అరికట్టడానికి ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్స్తో చేతులు కలిపింది.మార్కెట్ రీసెర్చ్ సంస్థ యుగోవ్ ఇటీవల ఒక అధ్యయనం చేసింది. ఇందులో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌కు చెందిన మిలీనియల్స్ (1980, 90లలో పుట్టినవారు), జెన్ జెడ్ (1995-2010 మధ్య జన్మించినవారు) టీనేజర్లు ఎక్కువగా ప్రయాణ స్కామ్‌ల బారిన పడుతున్నారు. బాధితులు సగటున రూ.1,02,233 నష్టపోతున్నారు. డబ్బు ఆదా అవుతుందంటే చాలు దాదాపు సగం మంది భారతీయ ప్రయాణికులు హాలిడే బుక్ చేసుకునేటప్పుడు అప్రమత్తతను పట్టించుకోవటం లేదని ఈ అధ్యయనం పేర్కొంది. 40 శాతం మందికిపైగా పరిమిత సమాచారంతోనే బుకింగ్ చేస్తుండటం వల్ల నష్టపోతున్నారని వెల్లడించింది.ఈ అధ్యయనానికి అనుగుణంగా వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ తమ కస్టమర్ ఇన్ఫర్మేషన్, బుకింగ్‌ల రక్షణ కోసం అనేక చర్యలను అమలు చేసింది. స్కామ్‌లు, ఆన్-ప్లాట్‌ఫారమ్ మెసేజింగ్ అరికట్టడానికి గెస్ట్ పేమెంట్ పేమెంట్ ప్రొటెక్షన్ కోసం ప్రత్యేక బృందాలు, వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వీటిలో భాగంగా చెక్-ఇన్ తర్వాత 24 గంటల వరకు పేమెంట్‌ను నిలిపివేయడం ద్వారా యూజర్లకు అదనపు భద్రతను అందిస్తోంది. -
పారిస్ ఒలింపిక్స్.. భారీగా ట్రావెల్ బుకింగ్స్!
పారిస్ ఒలింపిక్స్ 2024 మరికొద్ది వారాల్లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ట్రావెల్ బుకింగ్స్ భారీగా పెరినట్లు ఎయిర్ బీఎన్బీ తెలిపింది. తన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో దాదాపు 90 శాతం వినియోగదారులు ఒలింపిక్స్ జరిగే ప్రదేశాల చుట్టూ ఉన్న హోటల్స్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు పేర్కొంది.జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ఈసారి పారిస్ ఆతిథ్యం ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, అథ్లెట్లు, ఇతరులు ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే చాలా మంది ఒలింపిక్స్ జరిగే క్రీడా ప్రాంగణాల పరిసరాల్లోని హోటల్స్‌ను బుక్ చేసుకున్నారు. ఈమేరకు ఆతిథ్య రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ ఆన్లైన్ హోటల్ బుకింగ్ ప్లాట్పామ్ ఎయిర్ బీఎన్బీ ప్రకటన విడుదల చేసింది. ఒలింపిక్స్ జరిగే ఆక్వాటిక్స్ సెంటర్, బెర్సీ అరెనా, బార్డాక్స్ స్టేడియం, చాంప్ డే మార్స్ అరెనా, చాటూ డి వెర్సల్లీస్, చాట్రాక్స్ షూటింగ్ సెంటర్, ఈఫిల్ టవర్ స్టేడియం..వంటి క్రీడా ప్రాంగాణాల పరిసరాల్లో హోటల్స్ పూర్తిగా బుక్ అయినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదారుల్లో దాదాపు 90 శాతం మంది ఈ ఒలింపిక్స్ జరిగే ప్రాంతాల్లోని హోటల్స్‌ను సెర్చ్ చేస్తున్నట్లు పేర్కొంది. భారత్, చైనా, హాంకాంగ్, జపాన్ నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఈసారి అత్యధిక పెరుగుదల కనిపిస్తుందని చెప్పింది. భారతీయ ప్రయాణికులు పారిస్‌తోపాటు సమీపంలోని నైస్, ఆబర్‌విల్లియర్స్, కొలంబెస్, సెయింట్-ఓవెన్-సుర్-సీన్ వంటి ఇతర ప్రదేశాలను అన్వేషిస్తున్నారని తెలిపింది.ఈ సందర్భంగా ఎయిర్ బీఎన్బీ జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా 160 కంటే ఎక్కువ దేశాల నుంచి అభిమానులు, క్రీడాకారులు, అథ్లెట్లు ఒలింపిక్స్‌కు హాజరుకానున్నారు. భారతీయులు ఒలింపిక్స్ ఈవెంట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలను ప్లాన్ చేస్తున్నారు. గతంలో కంటే 30 శాతం భారత ప్రయాణికుల సంఖ్య పెరుగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 31 నాటికి హోటల్స్‌లో బుక్ అయిన ‘స్టేయింగ్ టైం(రాత్రి, పగలు బుక్ చేసుకునే సమయం)’ రెండేళ్ల క్రితం వ్యవధితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: ఖతార్‌లో యూపీఐ సేవలు..!పారిస్‌లో జరిగే ఒలింపిక్ క్రీడల పరిసర ప్రాంతాల్లోని దాదాపు రూ.8,300 కోట్లు వ్యాపారం సాగుతుందని అంచనా. దీనివల్ల దాదాపు 7,300 మందికి ఉపాధి లభిస్తుందని సమాచారం. ఇదిలాఉండగా, పారిస్‌లో ఒలింపిక్స్ నిర్వహణ సరైన నిర్ణయం కాదని గతంలో 44 శాతం స్థానికులు అభిప్రాయపడ్డారు. వేదికలు, క్రీడా గ్రామాల ఏర్పాటులో భాగంగా వేలాది మంది నిర్వాసితులను సమీపంలోని భవనాల నుంచి ఖాళీ చేయించడంపైనా విమర్శలు వస్తున్నాయి. -
పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్‌లు
వేసవిలో సరదాగా గడపాలనుకునేవారికి భారత్‌లో కొన్ని ప్రదేశాలను సూచిస్తూ అమెరికాకు చెందిన ఎయిర్‌బీఎన్‌బీ రిపోర్ట్ విడుదల చేసింది. ట్రెండింగ్ వేసవి గమ్యస్థానాల్లో గోవా, వర్కాల బీచ్‌లను స్వర్గధామాలుగా పేర్కొంది. జూన్, జులై, ఆగస్టులో బస చేయడానికి పర్యాటకులు జనవరి నుంచి మార్చి 15, 2024 వరకు చేసిన శోధనల ఆధారంగా ఈ రిపోర్ట్‌ను తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది.ఎయిర్‌బీఎన్‌బీ తెలిపిన వివరాల ప్రకారం..భారతదేశంలో ట్రెండింగ్ వేసవి గమ్యస్థానాల్లో గోవా, వర్కాల బీచ్‌లు కీలకంగా మారాయి. వారణాసి, దిల్లీ వంటి సాంస్కృతిక కేంద్రాలు, కొచ్చి వంటి సుందరమైన నగరాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయంగా మిలన్, అమాల్ఫీ, టోక్యో, రోమ్, ఫ్రాంక్ఫర్ట్ వంటి దేశాల్లోని ప్రదేశాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఈ సందర్భంగా ఎయిర్‌బీఎన్‌బీ జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ సింగ్ బజాజ్ మాట్లాడుతూ..‘భారతీయ పర్యాటకులు వేసవిలో సేదతీరేందుకు గోవా, వర్కాల వంటి బీచ్‌లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. వారణాసి వంటి సాంస్కృతిక కేంద్రాలను ఎంచుకుంటున్నారు. అంతర్జాతీయంగా టోక్యోతో పాటు మిలన్, అమాల్ఫీ, రోమ్, ఫ్రాంక్ఫర్ట్ వంటి యూరోపియన్ దేశాలు విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. పర్యాటకుల ప్రాధాన్యతలకు అనుగుణంగా సంస్థ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సీజన్లో భారతీయ ప్రయాణికులు దేశంలో, విదేశాల్లో తమ గమ్యస్థానాలను అన్వేషించడానికి వీలు కల్పిస్తోంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: డిగ్రీ ఉన్నా..లేకపోయినా భారీ ఉద్యోగాలు.. లింక్డ్ఇన్ నివేదికఎయిర్బీఎన్బీ స్వల్ప, దీర్ఘకాలిక విడిదికోసం ప్రయాణికులకు బస ఏర్పాటు చేస్తోంది. ఈ అమెరికన్ కంపెనీ ఆన్లైన్లో సేవలందిస్తోంది. ప్రయాణికులు, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది. ప్రతి ఆన్లైన్ బుకింగ్ నుంచి కొంత కమీషన్ వసూలు చేస్తోంది. ఈ కంపెనీను 2008లో బ్రియాన్ చెస్కీ, నాథన్ బ్లెచార్జిక్, జో గెబ్బియా స్థాపించారు. ఎయిర్‌బీఎన్‌బీ అసలు పేరు ఎయిర్ బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్. -
సెలబ్రిటీలతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు..
న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు విస్తరించే దిశగా ఆతిథ్య సేవల ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఎయిర్‌బీఎన్‌బీ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా సినిమా, స్పోర్ట్స్, మ్యూజిక్ తదితర రంగాల సెలబ్రిటీలతో జట్టు కడుతోంది. తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌తో చేతులు కలిపింది. ’భారత్‌లో బాలీవుడ్ స్టార్ జాన్వి కపూర్‌లా జీవించండి’ స్లోగన్‌తో ఆమె బాల్యంలో నివసించిన చెన్నై ఇంటిని బస కోసం ప్రమోట్ చేస్తోంది. తమ కార్యకలాపాలకు సంబంధించి భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటని, టాప్ 10 మార్కెట్ల జాబితాలోకి చేరే అవకాశాలు ఉన్నాయని ఎయిర్‌బీఎన్‌బీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డేవ్ స్టీఫెన్సన్ తెలిపారు. 2022తో పోలిస్తే 2023లో బుకింగ్స్ 30 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. విదేశాలు వెళ్లేవారితో పాటు దేశీయంగా కూడా పర్యటించే టూరిస్టులను ఆకట్టుకునేందుకు భారత్‌లో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు స్టీఫెన్సన్ వివరించారు. తమ కార్యకలాపాల ద్వారా భారత్‌లో 85,000 పైచిలుకు ఉద్యోగాలకు, జీడీ పీ వృద్ధికి 920 మిలియన్ డాలర్ల మేర తోడ్పా టు అందించినట్లు పేర్కొన్నారు. -
పర్యాటక శాఖతో ఎయిర్‌బీఎన్‌బీ ఎంవోయూ
న్యూఢిల్లీ: సాంస్కృతిక వారసత్వ పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం తెచ్చే దిశగా కేంద్ర టూరిజం శాఖతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు కట్టింది. తాము చేపట్టిన ’విజిట్ ఇండియా 2023’ కార్యక్రమంలో భాగంగా కేంద్రంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. భారతదేశ సుసంపన్న సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా ఈ ఎంవోయూ కింద ’సోల్ ఆఫ్ ఇండియా’ పేరిట ప్రత్యేక మైక్రోసైట్‌ను ఆవిష్కరించనున్నట్లు వివరించింది. టూరిస్టులకు పెద్దగా తెలియని పర్యాటకప్రాంతాల్లో ఆతిథ్యం కలి్పంచేవారికి అవసరమైన తోడ్పా టు అందించడం, హోమ్‌స్టేలకు ప్రాచుర్యం కలి్పంచడం వంటి సేవలు అందించనుంది. విదేశీ పర్యాటకులను భారత్ వైపు ఆకర్షించేందుకు, స్థానికంగా ఉపాధి అవకాశాలు కలి్పంచేందుకు, అంతర్జాతీయ టూరిజం మ్యాప్‌లో భారత్ మరింత విశిష్ట స్థానం దక్కించుకునేందుకు ఈ ఎంవోయూ ఉపయోగపడగలదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. -
ప్రతీకారం ఇలా కూడా తీర్చుకోవచ్చా.. దంపతులు చేసిన పనికి విల్లా యజమాని షాక్..?
వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీకి భారీషాక్ తగిలింది. ఇద్దరు దంపతులు తీర్చుకున్న రివెంజ్ దెబ్బతో ఆ సంస్థకు రూ.1.2లక్షల నష్టం వాటిల్లింది. వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. చైనాకు చెందిన భార్యభర్తలు సౌత్ కొరియాలో సియోల్‌లో 25 రోజుల పాటు వెకేషన్‌కు వెళ్లాలని అనుకున్నారు. ఇందుకోసం వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీలో సియోల్‌లో ఓ విల్లాను బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకునే సమయంలో విల్లా యజమాని ‘లీ’(Lee)ని, ఎయిర్‌బీఎన్‌బీని సంప్రదించలేదు. అయితే వాళ్లిద్దరూ తాము బుక్ చేసుకున్న విల్లా నగరంలో లేదని, ఎక్కడో శివారు ప్రాంతంలో ఉందని తెలుసుకొని కంగుతిన్నారు. తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని విల్లా ఓనర్ని అడిగారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. చేసేది లేక చైనా నుంచి సియోల్‌కు వచ్చారు. 25 రోజుల పాటు విల్లాలో ఉన్న భార్యభర్తలు విల్లా ఓనర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. లీ’కి ఫోన్ చేసి మీ విల్లాలో నిఘా కెమెరాలు ఉన్నాయా? అవి పనిచేస్తున్నాయా? అడిగారు. అందుకు మా విల్లాలో సీసీ కెమెరాలు లేవని చెప్పడంతో తమ ప్లాన్‌ను అమలు చేశారు. అవసరానికి మించి లైట్లు, ట్యాప్‌లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ ట్యాప్‌లను ఆన్ చేశారు. 25 రోజుల్లో కేవలం ఐదుసార్లు మాత్రమే సియోల్‌ను సందర్శించారు. ఆ ఐదు రోజుల్లో ఐదైదు నిమిషాలు మాత్రమే ఉన్నారు. గడువు ముగియడంతో విల్లాను ఖాళీ చేశారు. ఈ క్రమంలో గ్యాస్ కంపెనీ అధికారులు విల్లా ఓనర్‌కు లీకి ఫోన్ చేశారు. మీ విల్లాలో గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉందనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. అధికారులు సమాచారంతో విల్లాలో ఎదైనా ప్రమాదం జరిగిందేమోనని బయపడ్డారు. విల్లాను సందర్శించిన తర్వాత దంపతులు చేసిన పనికి యజమానికి లీ షాక్‌కు గురయ్యాడు. విల్లాలో ఏం జరిగిందోనని తెలుసుకునే ప్రయత్నించే క్రమంలో కిటికీలు తెరిచి ఉండడం, గ్యాస్ ఆన్‌లో ఉండడం గమనించాడు. $116 (రూ. 9,506) నీరు, కరెంట్ $730 (రూ. 59,824), గ్యాస్ ఇతర $728 (రూ. 59,660) బిల్లులు వచ్చాయి. 120,000 లీటర్ల కంటే ఎక్కువ నీటిని ఉపయోగించారు. భార్య భర్తల ప్రతీకారంతో తమ సంస్థకు భారీ ఎత్తున నష్టం జరిగిందని ఎయిర్‌బీఎన్‌బీ సైతం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, తమపై ప్రతీకారం తీర్చుకున్న చైనాలో ఉన్న భార్యభర్తలపై కోర్టును ఆశ్రయిస్తానని, వాళ్లిద్దరూ ఎక్కడున్నా కటకటల్లోకి పంపిస్తానని లీ చెప్పడం కొసమెరుపు. చదవండి👉 ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా చూడొచ్చు!