వేసవిలో సరదాగా గడపాలనుకునేవారికి భారత్‌లో కొన్ని ప్రదేశాలను సూచిస్తూ అమెరికాకు చెందిన ఎయిర్‌బీఎన్‌బీ రిపోర్ట్ విడుదల చేసింది. ట్రెండింగ్ వేసవి గమ్యస్థానాల్లో గోవా, వర్కాల బీచ్‌లను స్వర్గధామాలుగా పేర్కొంది. జూన్, జులై, ఆగస్టులో బస చేయడానికి పర్యాటకులు జనవరి నుంచి మార్చి 15, 2024 వరకు చేసిన శోధనల ఆధారంగా ఈ రిపోర్ట్‌ను తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది.
ఎయిర్‌బీఎన్‌బీ తెలిపిన వివరాల ప్రకారం..భారతదేశంలో ట్రెండింగ్ వేసవి గమ్యస్థానాల్లో గోవా, వర్కాల బీచ్‌లు కీలకంగా మారాయి. వారణాసి, దిల్లీ వంటి సాంస్కృతిక కేంద్రాలు, కొచ్చి వంటి సుందరమైన నగరాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయంగా మిలన్, అమాల్ఫీ, టోక్యో, రోమ్, ఫ్రాంక్‌ఫర్ట్ వంటి దేశాల్లోని ప్రదేశాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎయిర్‌బీఎన్‌బీ జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ సింగ్ బజాజ్ మాట్లాడుతూ..‘భారతీయ పర్యాటకులు వేసవిలో సేదతీరేందుకు గోవా, వర్కాల వంటి బీచ్‌లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. వారణాసి వంటి సాంస్కృతిక కేంద్రాలను ఎంచుకుంటున్నారు. అంతర్జాతీయంగా టోక్యోతో పాటు మిలన్, అమాల్ఫీ, రోమ్, ఫ్రాంక్‌ఫర్ట్ వంటి యూరోపియన్ దేశాలు విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. పర్యాటకుల ప్రాధాన్యతలకు అనుగుణంగా సంస్థ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సీజన్‌లో భారతీయ ప్రయాణికులు దేశంలో, విదేశాల్లో తమ గమ్యస్థానాలను అన్వేషించడానికి వీలు కల్పిస్తోంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: డిగ్రీ ఉన్నా..లేకపోయినా భారీ ఉద్యోగాలు.. లింక్డ్‌ఇన్ నివేదిక
ఎయిర్‌బీఎన్‌బీ స్వల్ప, దీర్ఘకాలిక విడిదికోసం ప్రయాణికులకు బస ఏర్పాటు చేస్తోంది. ఈ అమెరికన్ కంపెనీ ఆన్‌లైన్‌లో సేవలందిస్తోంది. ప్రయాణికులు, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది. ప్రతి ఆన్‌లైన్ బుకింగ్ నుంచి కొంత కమీషన్ వసూలు చేస్తోంది. ఈ కంపెనీను 2008లో బ్రియాన్ చెస్కీ, నాథన్ బ్లెచార్జిక్, జో గెబ్బియా స్థాపించారు. ఎయిర్‌బీఎన్‌బీ అసలు పేరు ఎయిర్ బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్.
Comments
Please login to add a commentAdd a comment