Goa
-
శీతల ప్రయాణం..
కొద్ది రోజుల క్రితం సాధారణ స్థాయిలో ఉన్న విమానయాన ధరలు అమాంతం రెట్టింపయ్యాయి. ముఖ్యంగా డిసెంబర్ 15 నుంచి 31 తేదీల్లో గతంతో పోల్చితే రెండింతలు, మూడింతల మేర పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నగర వాసుల్లో ప్రయాణాల పట్ల ఉన్న ఆసక్తే దీనికి కారణం. కాగా ప్రస్తుత నెలల్లో వరుసగా క్రిస్మస్, ఇయర్ ఎండ్, న్యూఇయర్, సంక్రాంతి వంటి పండుగల నేపథ్యంలో నగరవాసులకు భారీగా సెలవులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ట్రావెలింగ్ మంత్‌గా డిసెంబర్‌ను ఎంచుకుంటున్నారు. ప్రతి యేడాదీ డిసెంబర్ నెలలో ఏదో ఒక టూర్ వేయడం అందివచ్చిన సెలవులను వినియోగించుకోవడం నగర వాసులకు అలవాటే. ఇందు కోసం ముందస్తుగానే నగరంలోని ప్రయాణ ప్రేమికులు వారి ప్రయాణ గమ్యస్థానాలకు మార్గాలను సుగమం చేసుకున్నారు. యువత, టెకీలు ట్రావెలింగ్ ప్లాన్స్‌లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా డొమెస్టిక్ ప్రయాణాలు ఇప్పటికే సోల్డ్ ఔట్ బోర్డ్పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో.కొందరు ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ టెకీలు యేడాదంతా వారి సెలవులను వినియోగించకుండా తమ తమ విధులు నిర్వహిస్తుంటారు. దీంతో పాటు మరికొందరు టెకీలకు, కాల్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ ఉద్యోగులకూ డిసెంబర్ నెలలో భారీగా సెలవులు ఉంటాయి. దీంతో ఆయా సెలవుదినాలను డిసెంబర్ డెస్టినేషన్ కోసమే వినియోగిస్తుంటారు.. నగరంలో విస్తరిస్తున్న ఐటీ ట్రెండ్‌తో గత కొన్నేళ్లుగా ట్రావెలింగ్ రంగంలోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు మిగిలిపోయిన సెలవులు, మరోవైపు నగరంలోని విదేశాలకు చెందిన గ్లోబల్ కంపెనీల క్రిస్మస్ లీవ్స్ దీనికి ప్రామాణికం అవుతున్నాయి.వీటిని ఎంజాయ్ చేయడానికి ఇప్పటికే యుద్ధప్రాతిపధికన టీమ్ హెడ్లకు మెయిల్స్ పెట్టేయడం, ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించడం, పర్యాటక ప్రాంతాల్లో విడిది, విందు, వినోదం తదితరాలకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇది కొత్తేం కాకపోయినప్పటికీ.. ఈ కల్చర్ ఈ ఏడాది మరింత పుంజుకోవడం విశేషం. సాధారణ రోజుల్లో 4 నేల నుంచి 9 వేల వరకూ ఉండే దేశీయ విమాన చార్జీలు ప్రస్తుతం 14 నుంచి 20 వేలకు పైగా కొనసాగడం ఈ సంస్కృతి ప్రభావానికి నిదర్శనం. కన్యాకుమారి, కేరళ మొదలు.. మనాలి, డార్జిలింగ్ వంటి శీతల ప్రదేశాలకు బయలు దేరుతున్నారు. మరికొందరైతే స్విస్ దేశాలు, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ వంటి విదేశాలకు బుకింగ్‌లు మొదలెట్టారు. ఏడాదికి వీడ్కోలు.. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పడం, నూతన ఏడాదికి నూతనోత్సాహాన్ని పొందడం కోసం కూడా ట్రావెలింగ్ డెస్టినేషన్లనే ఎంచుకుంటున్నారు ఈ తరం యువత. ఇయర్ ఎండ్ వేడుకలకైతే గోవాలాంటి మ్యూజికల్ నైట్స్ కోసం పరితపిస్తున్నారు నగర వాసులు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు వేసిన కొత్త రైలు సేవలు పొందడానికి ముందస్తుగానే బెర్త్ కరారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యంగా బుక్ చేస్తే ఈ చార్జీలు మరింత పెరిగిపోతాయని ఇప్పటికే చాలా టూర్స్ ప్లానింగ్, బుకింగ్ పూర్తయ్యాయని గూగుల్ చెబుతుంది. ఈ వేదికల్లో అవకాశం లేకపోతే ప్రైవేటు ట్రావెల్స్‌ను సైతం ఆశ్రయిస్తూ, సెల్ఫ్ డ్రైవింగ్‌కు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంతో పాటు దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లోని ట్రావెలింగ్ ఏజెన్సీలు, ఈవెంట్ ఆర్గనైజర్లు ముందస్తు పండగలు చేసుకుంటున్నారు.గోవా పార్టీలకు... యేడాది చివరి వేడుకలకు నగర యువత భారీగా ఆసక్తి చూపిస్తోంది. వీరిలో అత్యధికులు వెళ్లే ఏకైక డెస్టినేషన్ మాత్రం గోవానే. ఎందుకంటే..నగర కల్చర్‌లో భాగంగా పంబ్ పారీ్టలు, లైవ్ కాన్సర్ట్, డీజే మ్యూజిక్ వంటి ట్రెండ్స్‌ని ఆస్వాదించే వారు, ప్రకృతిని కోరుకునే వారు వేరు వేరుగా ఈస్ట్ గోవా, నార్త్ గోవాలను ఎంచుకుంటారు. తమకు అనుకూలమైన, అనువైన స్పాట్స్‌ను ముందస్తుగానే ఎంచుకుని అందుకు అనుగునంగా ప్రయాణాలకు టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో వైజాగ్, అరకు వ్యాలీ సైతం టాప్‌లోనే ఉన్నాయి.ఎతైన ప్రదేశాలకు.. ఇప్పటికే ఈ సీజన్లో దక్షిణాది రాష్ట్రాల్లోని కూర్గ్, ఊటీ, మున్నార్, వయనరాడ్, కొడైకెనాల్, ఇడుక్కి, యరక్కాడ్, కున్నూర్ వంటి హిల్ స్టేషన్స్‌కి భారీగా టికెట్లు బుక్ అయ్యాయని లోకల్ ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నామాట. దీంతోపాటు ఈ మధ్య కాలంలో మనాలి, డార్జిలింగ్, సిమ్లా, షిల్లాంగ్ వంటి చల్లటి ప్రకృతి ప్రాంతాలను ఆస్వాదించడానికి ఉవి్వళ్లూరుతున్నారు. ఈ ట్రిప్స్‌లో భాగంగానే నార్త్‌కు ఎక్కువగా ప్రయాణమవుతున్నారు. అంతేకాకుండా సాంస్కృతిక వైవిధ్యాన్ని తిలకించడానికి కేరళ, ఊటీ వంటి ప్రదేశాలను వారి గమ్యస్థానాలుగా చేర్చుకున్నారు. -
ఎంపీ సంజయ్ సింగ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా.. కోర్టు నోటీసులు
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు భారీ షాక్ తగిలింది. క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో తన ప్రమేయం ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ సింగ్‌పై గోవా సీఎం ప్రమాద్ సావంత్ సతీమణి రూ.100కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు సంబంధించి గోవా కోర్టు సంజయ్ సింగ్‌కు నోటీసులు పంపించింది. పరువు నష్టం దావా కేసుపై జనవరి 10లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రమోద్ సావంత్ భార్య సులక్షణ సావంత్ ఉత్తర గోవాలోని బిచోలిమ్‌లోని సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ కోర్టులో కేసు వేసినట్లు బీజేపీ అధికార ప్రతినిధి గిరిరాజ్ పాయ్ వెర్నేకర్ తెలిపారు. తాత్కాలిక సివిల్ జడ్జి ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం నోటీసులు జారీ చేసినట్లు వెర్నేకర్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఢిల్లీ మీడియా సమావేశంలో సులక్షణ సావంత్‌పై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై సులక్షణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. పరువుకు భంగం కలిగేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన సంజయ్ సింగ్ తనకు రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు తన గురించి సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. -
లవ్ మ్యారేజెస్ తో... స్టార్ హీరోయిన్స్ బిజీ ?
-
గోవాలో ఘనంగా జరిగిన కీర్తిసురేష్ వివాహం
-
హిందూ సంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్,ఆంటోనీల పెళ్లి
హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకుంది. గోవా వేదికగా వారిద్దరూ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరుకుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కీర్తి మెడలో ఆంటోనీ మూడుముళ్ల వేయడంతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో కొత్త దంపతులు పంచుకున్నారు.గోవా వేదికగా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొందిమంది సన్నిహితులు పాల్గొన్నారు. నూతన వధూవరులను వారందరూ ఆశీర్వదించారు. దీంతో అభిమానులు కూడా వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఏడాది దీపావళి రోజున ఆంటోనీ తాటిల్‌తో తన ప్రేమ విషయాన్ని కీర్తి సురేశ్ తెలియజేసింది. సౌత్‌లో బిజీ హీరోయిన్గా ఉన్న ఆమె కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బేబీ జాన్ మూవీతో ఆమె బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ త్వరలోనే విడుదలకానుంది.కీర్తి సురేష్ పెళ్లిలో పాల్గొన్న వారందరికీ KA అని ముద్రించి ఉన్న హ్యాండ్ బ్యాండ్స్ ఇచ్చారట.. వాటిని ధరించిన వారికి మాత్రమే పెళ్లి వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారట. ఆంటోనీతో ప్రేమ, వివాహం గురించి ఇటీవల కీర్తి ఇన్‌స్టా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఒక ఫొటో విడుదల చేసిన ఆమె.. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనున్నట్లు తెలిపింది. ఆంటోనీ కుటుంబం వ్యాపార రంగంలో రానిస్తుంది. కొచ్చి, చెన్నైలలో వారికి వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కలిసే ఉన్న కీర్తి, ఆంటోనీ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారట. ఇప్పుడు పెళ్లితో ఒక్కటిగా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
గోవాలో కీర్తి సురేశ్ పెళ్లి వేడుక.. ఫోటో పంచుకున్న హీరోయిన్!
హీరోయిన్ కీర్తి సురేశ్ వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈనెల 12న తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తటిల్‌ను పెళ్లాడనుంది. ఇప్పటికే కీర్తి సురేశ్ తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గోవాలో జరగనున్న వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తాజాగా కీర్తి సురేశ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఫోటోను షేర్ చేసింది. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులంతా గోవాలో ల్యాండైనట్లు తెలుస్తోంది. కాగా.. 15 ఏళ్లుగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు.రెండు సంప్రదాయాల్లో వివాహం..ఇరు కుటుంబాల సమ్మతితో రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈనెల 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. కాగా.. కీర్తి సురేశ్ ప్రస్తుతం హిందీలో బేబీ జాన్ మూవీతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. -
భారత్‌లో మొట్టమొదటి ఎయిర్‌బీఎన్‌బీ అకాడమీ: ఎక్కడంటే..
గ్లోబల్ హోమ్‌స్టే అండ్ హోటల్ అగ్రిగేటర్ 'ఎయిర్‌బీఎన్‌బీ'.. గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ సహకారంతో.. గోవాలో భారతదేశపు మొట్టమొదటి ఎయిర్‌బీఎన్‌బీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అకాడమీని ప్రారంభించింది. హోమ్‌స్టే టూరిజాన్ని ప్రోత్సహించడానికి.. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని హాస్పిటాలిటీ వ్యాపారవేత్తలలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి కంపెనీ గోవాలోని పర్యాటక శాఖ (DoT) మధ్య ఉన్న అవగాహన ఒప్పందం (MOU)లో భాగంగా ఈ అకాడమీ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంటే, ఎయిర్‌బీఎన్‌బీ ఇండియా జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ పాల్గొన్నారు.కొత్త అకాడమీ ద్వారా.. వ్యక్తులను కంపెనీ హోస్ట్ చేసే ప్రపంచానికి పరిచయం చేయడమే ఎయిర్‌బీఎన్‌బీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దీనికోసం కంపెనీ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌ల ద్వారా 25 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. ఉత్తర గోవా నుంచి పాల్గొనేవారి కోసం మిరామార్ రెసిడెన్సీలో మొదటి రౌండ్ వర్క్‌షాప్‌లు జరిగాయి. దక్షిణ గోవా నుంచి మరో 25 మంది ట్రైనీలను లక్ష్యంగా చేసుకుని మడ్గావ్లో తదుపరి రౌండ్ శిక్షణలు నిర్వహించనున్నారు.ఎయిర్‌బీఎన్‌బీ అకాడమీ ప్రారంభం సందర్భంగా పర్యాటక మంత్రి రోహన్ ఖౌంటే మాట్లాడుతూ.. గోవా సంస్కృతిని సంరక్షించడం ద్వారా పునరుత్పాదక పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో హోమ్‌స్టే విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ ఒప్పందం గ్రామీణ గోవాకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.ఎయిర్బీఎన్బీతో అవగాహన ఒప్పందం.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అకాడమీని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. స్థానిక కమ్యూనిటీలకు సాధికారత కల్పిస్తూనే.. గోవా తన ప్రత్యేక సాంస్కృతిక, సహజ ఆస్తులను ఉపయోగించుకోవడానికి ఈ చొరవ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం గోవా విభిన్నమైన, ప్రామాణికమైన అనుభవాలను ప్రదర్శించడానికి సహాయం చేస్తుందని పేర్కొన్నారు. -
రెండు సంప్రదాయాలను గౌరవిస్తూ కీర్తి సురేష్ పెళ్లి
సినీ తారల ప్రేమ, పెళ్లి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి సీజనే నడుస్తోందని చెప్పవచ్చు. ఇటీవల నటుడు నాగచైతన్య, శోభిత వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగిన విషయం తెలిసిందే. మరుపక్క నటి సమంత బాలీవుడ్‌కు చెందిన ఓ నటుడి ప్రేమలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇకపోతే కురక్రారుల డ్రీమ్ గర్ల్ కీర్తి సురేష్ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న హిందీ చిత్రం బేబీ జాన్‌తో ఈ అమ్మడు పాన్ ఇండియా కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఇలా కథానాయకిగా ఉన్నత స్థాయిలో రాణిస్తున్న సమయంలోనే కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమవడం చాలామందిని ఆసక్తికి గురిచేసింది. 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న తన పాఠశాల స్నేహితుడు ఆంటోనితో ఏడడుగులు నడవడానికి కీర్తి సురేష్ సిద్ధమవుతున్నారు. కాగా తను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి క్రిస్టియన్ మతానికి చెందినవాడు కావడంతో నటి కీర్తి సురేష్ కూడా మతం మారడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే అది నిజం కాదంటూ తమ ప్రేమ, పెళ్లికి మతం సమస్య కాదని ఈ క్రేజీ జంట నిరూపించుకున్నారు. ఆ విధంగా ఇరు కుటుంబాల సమ్మతితో రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వీరి పెళ్లి ఈనెల 12న గోవాలో జరగనుంది. అక్కడ 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. -
కళనే లాభదాయకమైన వృత్తిగా మలిచింది! హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీకే..
గోవా కళాప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహిళ శారదా కేర్కర్. ఆమె యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేసింది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో స్పెషలైజేషన్ చేసింది. ఇండియాకి వచ్చి గోవాలో మ్యూజియం ఆఫ్ గోవా (ఎంఓజీ)కి చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. చిల్డ్రన్ ఆర్ట్ స్టూడియో స్థాపించి పిల్లలకు కళారంగం కోసం కొంత సమయాన్ని కేటాయించే అవకాశం కల్పించింది. కళారంగంలో ఉపాధి పొందడానికి అవసరమైన భరోసా కల్పిస్తూ కళాసాధనను లాభదాయకమైన వృత్తిగా మార్చింది.గోవా రాష్ట్రాన్ని కళలు, కళారంగం, వాటికి మార్కెట్ కల్పిస్తూ సామాజిక వ్యవస్థాపనల దిశగా నడిపిస్తోంది శారదాకేర్కర్. సాహిత్యం, రంగస్థలం, విజువల్ ఆర్ట్స్, సంగీతం, నాట్యరీతులను సుసంపన్నం చేయడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోంది. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులను ఒక్కో విభాగాన్ని ఒక్కో కేటగిరీగా వర్గీకరించి వారి కళారూపాల ప్రదర్శనలను నిర్వహిస్తోందామె. అలాగే సాంకేతికత సహకారంతో సృజనాత్మక రంగంలో ఎన్ని ప్రయోగాలు చేయవచ్చనేది ఆచరణలో చూపిస్తోంది. గ్రాఫిక్ డిజైనింగ్, ఫ్యాషన్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, యానిమేషన్, గేమింగ్, ఆర్ట్ డైరెక్షన్, సౌండ్ ఇంజనీరింగ్ వంటి సృజనాత్మకమైన ఉపాధి రంగాలను కళల విభాగంలోకి తీసుకువస్తూ కళారంగాన్ని విస్తరిస్తోంది శారద కేర్కర్. గడచిన తొమ్మిదేళ్లలో 600 మంది హస్తకళాకారులు తమ ఉత్పత్తులతో ఎమ్ఓజీ నిర్వహించిన ఎగ్జిబిషన్లలో పాల్గొన్నారు. దివ్యాంగులైన కళాకారుల చిత్రాలతో ‘ఆర్ట్ ఇంక్’, పిల్లల చిత్రాలతో ‘ఏ వరల్డ్ ఆఫ్ మై ఓన్’, మహిళా చిత్రకారులతో ‘అన్ ఎర్త్డ్’ చిత్రకళా ప్రదర్శనలను నిర్వహించింది శారద. ఎమ్ఓజీని రోజుకు 200 మంది సందర్శిస్తారు.సంస్కృతి ప్రతిబింబాలుమ్యూజియం ఆఫ్ గోవా కోసం శారద పాతికమంది గోవా ఆర్టిస్టులు చిత్రించిన గోవా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలను సేకరించింది వీటిని ఎమ్ఓజీ నిర్వహించే ప్రతి ఎగ్జిబిషన్‌లోనూ ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ‘హోమోలూడెన్స్: ద ఆర్ట్ ఆఫ్ ప్లే’ ప్రదర్శన జరుగుతోంది. అందులో గోవా ఆర్టిస్టులతోపాటు అనేక రాష్ట్రాలు, నెదర్లాండ్ దేశం నుంచి కూడా ఆర్టిస్టులు మొత్తం వంద మంది చిత్రకారుల కళారూపాలున్నాయి. బీచ్ కంటే మ్యూజియం సందర్శనలోనే ఎక్కువ ఎంజాయ్ చేశాం అని ఫీడ్‌బ్యాక్ బుక్‌లో రాస్తున్నారు. ఏడాదికి పదివేల మంది స్టూడెంట్స్ సందర్శిస్తున్నారు. వాళ్లు సమకాలీన కళలతోపాటు గోవా చరిత్రను తెలుసుకుంటున్నారు.కళాకృతులకు మార్కెట్ వేదికగడచిన ఎనిమిదేళ్లుగా ప్రతి ఆదివారం ఎంఓజీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వివిధ రంగాలకు చెందిన నాలుగు వందల మంది నిపుణులు హాజరై ప్రసంగించారు. ఆర్ట్, ఆర్కిటెక్చర్, సైన్స్, మేనేజ్మెంట్, బిజినెస్, ఎన్విరాన్మెంట్, పాలసీ మేకింగ్, యాక్టివిజమ్ అంశాల్లో కళాకారులకు సమగ్రమైన అవగాహన కల్పించారు. ‘ఆమి గోవా’ నాన్‌ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజ్ ద్వారా అల్పాదాయ వర్గాల మహిళలు తయారు చేసే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉత్పత్తులను విక్రయించడానికి ఒక వేదిక ఏర్పాటు చేసింది శారద. ఇందులో మహిళల స్వావలంబన సాధికారత, గోవా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ అనే రెండు రకాల ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. స్వయం సహాయక బృందాల మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. శారద కేర్కర్ చొరవతో గోవా హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీ కొత్త రూపు సంతరించుకుంటోంది. (చదవండి: కేరళను ఊపేసిన ఘటన! ఒక్క ఆవు కోసం ముగ్గురు మహిళలు..) -
ఇఫీలో మా కాళి
రైమా సేన్, అభిషేక్ సింగ్ ప్రధాన పాత్రల్లో విజయ్ యెలకంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘మా కాళి’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన మల్టీ లింగ్వల్ మూవీ ఇది. హిందీలో నిర్మించిన ఈ చిత్రం బెంగాలీ, తెలుగులో 2025లో విడుదల కానుంది. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ(ఇంటర్నేనేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో ‘మా కాళి’ సినిమాని ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్, గోవా రాష్ట్ర డీజీపీ అలోక్ కుమార్ హాజరయ్యారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ– ‘‘మా కాళి’ చిత్రాన్ని భారతదేశ విభజన, డైరెక్ట్ యాక్షన్ డే నేపథ్యంలో తీశారు. 1947లో స్వాతంత్య్రం పొందిన మన దేశం ఆ తర్వాత ఇండియా, పాకిస్థాన్ గా మారింది. 1971 నాటికి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌గా మారింది. ఒక దేశం మూడు ముక్కలైంది. అయినప్పటికీ భారతదేశం మాత్రమే ఇప్పటికీ రాజ్యాంగాన్ని నమ్ముతుంది. ‘మా కాళి’ వాస్తవ కథ ఆధారంగా రూపొందించబడింది. డైరెక్ట్ యాక్షన్ డే అనేది మన దేశ చరిత్రలో ఒక బ్లాక్ డే’’ అని తెలిపారు. ‘‘మా కాళి’కి ప్రమోద్ సావంత్, ఆనంద బోస్గార్ల నుంచి వచ్చిన ప్రశంసల్ని సత్కారంగా భావిస్తున్నాం’’ అన్నారు విజయ్ యెలకంటి, నిర్మాత వందనా ప్రసాద్. -
ప్రేక్షకులూ భాగస్వాములే!
‘‘ఆర్టిస్టుగా ప్రతిభ ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ ఎవర్నీ ఆపలేరు’’ అని అంటున్నారు. కృతీ సనన్. గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో ఆమెపాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సమావేశంలో బంధు ప్రీతి గురించి కృతీ సనన్ మాట్లాడిన వ్యాఖ్యలు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో నాకు మంచి ఆహ్వానమే లభించింది. అయితే ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేనప్పుడు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కొంత సమయం పట్టడం సహజమే.మేగజీన్స్లో మన ఫొటోలు కనిపించేందుకు కూడా సమయం పటొచ్చు. ఇదంతా స్ట్రగుల్లో భాగమే. అయితే రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత, ప్రతిభతో, బాగా కష్టపడితే ఏదీ ఆపలేదు’’ అని అన్నారు. ఇంకా ఇండస్ట్రీలో బంధుప్రీతి గురించి కృతీ చెబుతూ– ‘‘బంధుప్రీతి అపవాదు మొత్తం బాధ్యతను ఇండస్ట్రీయే మోయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఈ విషయంలో ప్రేక్షకుల భాగస్వామ్యం కూడా ఉంది. స్టార్ కిడ్స్ అంటూ మీడియా వాళ్లు వారిపై ప్రత్యేక ఫోకస్ పెడతారు. దీంతో ఆడియన్స్ స్టార్ కిడ్స్ను ఫాలో అవుతుంటారు. స్టార్ కిడ్స్‌పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి, స్టార్ కిడ్స్‌తోనే సినిమాలు తీయాలని నిర్మాతలు అనుకుంటారు. అయితే ఆడియన్స్‌కు కనెక్ట్ కాని వారు ఎవరూ ఇండస్ట్రీలో ఉండలేరు. అది నిజం. ప్రతిభ ఉన్నవాళ్లే ఉంటారు’’ అన్నారు. -
ఇఫీలో హను–మాన్ భాగం కావడం ఆనందం: తేజ సజ్జా
‘‘కథా కథనాల పట్ల ప్రేక్షకులకు ఉన్న అభిరుచి మన సినిమా అభివృద్ధికి దోహదపడుతుంది’’ అన్నారు హీరో తేజ సజ్జా. ‘‘హను–మాన్’ కేవలం సినిమా కాదు.. మన సాంస్కృతిక మూలాలు, సంప్రదాయాలకు కట్టిన పట్టం’’ అని కూడా అన్నారు. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇండియన్ పనోరమా విభాగంలో ‘హను–మాన్’ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ... ‘‘కల్పిత గ్రామమైన అంజనాద్రి నేపథ్యంలో దైవిక శక్తులను పొందిన ఓ చిన్న దొంగ... మహా శక్తిమంతుడైన హనుమంతుని దాకా సాగించే ప్రయాణాన్ని ఈ చిత్రం చూపించిందని, భారతీయ పురాణాల విశిష్టతను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఈ చిత్రం ద్వారా నిర్వర్తించామనీ అన్నారు. ఈ చిత్రం మన పౌరాణిక మూలాలను చాటి చెబుతూ భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలిపిందన్నారు.‘హను–మాన్ ’ సీక్వెల్ రూపకల్పన కోసం పని చేస్తున్నట్టు ధృవీకరించారు. తెలుగు పరిశ్రమ వినూత్న కథనాలతో అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు సాధిస్తోందన్నారు. ‘హను–మాన్’ సాంస్కృతిక వారసత్వం, ఆధునిక కథల శక్తిమంతమైన సమ్మేళనమని, భారతీయ పనోరమాలో భాగం కావడం ఈ చిత్ర కళాత్మక సాంస్కృతిక విశిష్టతకు నిదర్శనం’’ అంటూ తన ఆనంద వ్యక్తం చేశారు తేజ సజ్జా. – గోవా నుంచి సాక్షి ప్రతినిధి -
సినిమా... సాహిత్యం మధ్య సాన్నిహిత్యం పెరగాలి: దర్శకుడు మణిరత్నం
‘‘సినిమా... సాహిత్యం మధ్య ఎంత సాన్నిహిత్యం పెరిగితే అంతగా భారతీయ సినిమా మెరుగుపడుతుంది’’ అని అభిప్రాయపడ్డారు దక్షిణాది దర్శక దిగ్గజం మణిరత్నం. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో భాగంగా ‘ట్రాన్స్ఫార్మింగ్ లిటరరీ మాస్టర్‌పీస్’ అనే అంశంపై ‘మాస్టర్ క్లాస్’లో ఆయన మాట్లాడారు. మరో దక్షిణాది ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కూడా మణిరత్నంతో సంభాషించారు. ‘‘నేను ఇప్పటికీ ప్రేక్షకులలో ఒక్కడిగా కూర్చుని సినిమా చూసే వ్యక్తినే’’ అని మణిరత్నం అన్నారు. ఏళ్లుగా మాస్టర్ పీస్ లాంటి సినిమాలు అందిస్తున్నప్పటికీ తనను తాను అనుభవశూన్యుడిలా, ప్రారంభ దశలో ఉన్నట్లుగానే భావిస్తాను అన్నారాయన. సినిమా, సాహిత్యం మధ్య లోతైన అనుబంధం ఏర్పడేలా సినిమా నిర్మాతలు చూడాలని మణిరత్నం కోరారు.పుస్తకానికి దృశ్యరూపం ఇవ్వాలంటే...పుస్తకాలను చలన చిత్రాలలోకి మార్చడంలోని సూక్ష్మ నైపుణ్యాలను ఈ సందర్భంగా మణిరత్నం వివరించారు. ‘‘సినిమాలు దృశ్య మాధ్యమానికి చెందినవి. కానీ పుస్తకాలు ప్రధానంగా ఊహాజనితమైనవి. పుస్తకాలకు దృశ్యరూపం ఇచ్చేటప్పుడు ఫిల్మ్ మేకర్‌కు అదనపు సామర్థ్యం ఉండాలి. పాఠకుడి ఊహకు ప్రాణం పోయడంలో జాగ్రత్త వహించాలి’’ అని సూచించారు. ఇంకా పురాణాలు, ప్రాచీన భారతీయ చరిత్ర తన దృక్పథాన్ని ప్రభావితం చేశాయని మణిరత్నం అన్నారు. కల్కి కృష్ణమూర్తి 1955 నాటి ఐకానిక్ రచనల నుంచి స్వీకరించిన తన ‘΄పొన్నియిన్ సెల్వన్’ చిత్రం గురించి మాట్లాడుతూ... చోళుల కాలాన్ని చిత్రించేందుకు పడిన వ్యయ ప్రయాసలను వివరించారు. తంజావూరులో ఆ కాలపు అవశేషాలు కూడా లేకుండా యాయని, అయితే సెట్లను రూపొందించడానికి ఇష్టపడక భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో షూటింగ్ చేశామని, అక్కడి నిర్మాణాన్ని చోళుల వాస్తుశిల్పం ప్రకారం మార్చామనీ అన్నారు. సృజనాత్మక స్వేచ్ఛను తీసుకుంటున్నప్పుడు ఆలోచనాత్మకంగా, పుస్తకాన్ని దాని అసలు స్ఫూర్తిని కాపాడేలా చూడాలని యువ సినీ రూపకర్తల్ని మణిరత్నం కోరారు.వినోదమే ప్రధానం: శివ కార్తికేయన్‘‘సినిమా పరిశ్రమలోకి రావడానికి నేను ఏ లక్ష్యాలను పెట్టుకోలేదు. కేవలం ప్రేక్షకులకు వినోదం అందించాలని తప్ప’’ అన్నారు ప్రముఖ నటుడు శివ కార్తికేయన్. ‘ఇఫీ’లో భాగంగా కళా అకాడమీ ప్రాంగణంలోని ఇంట్రాక్టీవ్ సెషన్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి ఖుష్బూ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ... తాను స్టార్ కావాలని రాలేదని, చేసే పాత్రల ద్వారా ప్రేక్షకులకు వినోదం పంచాలనుకున్నానని, అందుకు అనుగుణంగానే తొలుత టీవీ కార్యక్రమాలు... ఆ తర్వాత అంతకన్నా పెద్దదైన వెండితెరపైనా అవకాశాలు అందుకున్నాననీ శివ కార్తికేయన్ పేర్కొన్నారు. 200 సినిమాలకు పైగా నటించినా ఇప్పటికీ తన లక్ష్యం ప్రేక్షకులకు వినోదం అందించడమే అన్నారాయన. – గోవా నుంచి సాక్షి ప్రతినిధిఇఫీలో ఎమ్ 4 ఎమ్మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఎమ్ 4 ఎమ్’(మోటివ్ ఫర్ మర్డర్). జో శర్మ, సంబీత్ ఆచార్య లీడ్ రోల్స్‌లో నటించారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ (యూఎస్ఏ) బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది. కాగా ఈ మూవీ హిందీ ట్రైలర్‌ని ‘ఇఫీ’లో శనివారం విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం గురించి మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ–‘‘యూనివర్సల్ సబ్జెక్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఎమ్ 4 ఎమ్’. ప్రేక్షకులు మా మూవీని చూసి థ్రిల్ అవుతారు’’ అన్నారు. -
గోవా ఐఎఫ్ఎఫ్ఐ ఈవెంట్లో అక్కినేని ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
-
గోవా తీరంలో జలాంతర్గామిని ఢీకొట్టిన పడవ
న్యూఢిల్లీ: గోవా తీరం నుంచి సముద్రంలో 70 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. భారత నావికా దళానికి చెందిన జలాంతర్గామిని మత్స్యకారుల పడవ ఢీకొట్టినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సముద్రంలో చేపలు పట్టేందుకు ఉపయోగించే ఈ పడవ పేరు మార్తోమా. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 13 మంది ఉన్నారు. వారిలో 11 మందిని అధికారులు రక్షించారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం ఆరు నౌకలను, హెలికాప్టర్లను రంగంలోకి దించినట్లు నావికా దళం అధికార ప్రతినిధి చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని పేర్కొన్నారు. ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కో–ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ)తో కలిసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. కోస్ట్ గార్డ్ సిబ్బంంది సేవలు కూడా వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, జలాంతర్గామిని పడవ ఢీకొన్న ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు నావికా దళం ఆదేశాలు జారీ చేసింది. -
IFFI : గోవా సినిమా పండుగ..సందడి చేసిన స్టార్లు (ఫొటోలు)
-
IFFI : ఘనంగా గోవా సినిమా పండుగ ప్రారంభం.. సందడి చేసిన నాగ్, ఇతరులు (ఫొటోలు)
-
గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో...
జో శర్మ, సంబీత్ ఆచార్య లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఎమ్ 4 ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ (యూఎస్ఏ) బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం హిందీ ట్రైలర్‌ని ఈ నెల 23న గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో విడుదల చేయనున్నారు. -
మా నాన్న వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను – నాగార్జున
‘‘మా నాన్న నేర్పిన జీవిత పాఠాలు నన్ను ఎన్నో రకాలుగా ప్రభావితం చేశాయి. మా నాన్న బాటలో నడవడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. ప్రతి ఏడాది కేంద్ర ప్రసార సమాచార శాఖ సహకారంతో జాతీయ చిత్ర పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం (ఇఫీ) బుధవారం గోవాలోప్రారంభమైంది. ఈ నెల 28 వరకూ ఈ చిత్రోత్సవం జరగనుంది. తొలి రోజు నటులు ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ, దర్శకుడు తపన్ సిన్హాల శతాబ్ది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా లెజండరీ ఆల్బమ్‌ని విడుదల చేశారు. ఈ వేదికపై తండ్రి ఏఎన్నార్ గురించి మాట్లాడారు నాగార్జున. యాంకర్ కోరిన మీదట తాను నటించిన ‘బంగార్రాజు’ చిత్రంలోని ‘వాసివాడి తస్సాదియ్యా..’ డైలాగ్ చెప్పారు నాగార్జున. ఈ చిత్రోత్సంలో నాగార్జున, అమల దంపతులను, నటుడు శరత్ కుమార్, దర్శకుడు ఆర్కే సెల్వమణి, చిదానంద నాయక్, నిర్మాత–దర్శకుడు సుభాష్ ఘాయ్, నటీమణులు నిత్యా మీనన్, ప్రణీతలను సన్మానించారు. ‘‘పేపర్ బాయ్‌గా నా ప్రస్థానం ప్రారంభించాను’’ అని శరత్‌కుమార్ పేర్కొన్నారు. ‘‘తెలుగు సినిమాల్లోని కొత్తదనం, పాజిటివిటీ అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు టాలీవుడ్‌ని చేరువ చేస్తున్నాయి’’ అన్నారు అమల.ఐఫీ... ఇంకొన్ని విశేషాలు→ కార్యక్రమప్రారంభంలో భారత వందనం నృత్య కార్యక్రమం ఆహూతులను విశేషంగా అలరించింది.→ సినీ దిగ్గజాలు అక్కినేని నాగేశ్వరరావు, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా, రాజ్ కపూర్ల జీవితం గురించి బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ అందించిన వీడియో సహిత కార్యక్రమం ఆకట్టుకుంది.→ పలుమార్లు ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం ప్రస్తావన వచ్చింది.→ చిత్రోత్సవంలో భాగంగా విభిన్న కేటగిరీలో చిత్రాలను ఎంపిక చేసే జ్యూరీల్లో తెలుగు దర్శకుడు హరీష్ శంకర్, హైదరాబాద్‌కు చెందిన యువ డిజైనర్ అర్చనా రావు ఉన్నారు.→ బాలీవుడ్ నటి మానుషీ చిల్లర్ ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ పాటకు నృత్యంతో అలరించారు.→ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక గురు పండిట్ రవిశంకర్ జీవిత ఘట్టాల ఆధారంగా తీస్తున్న చిత్ర విశేషాలు ప్రదర్శించారు.→ ఆహూతుల్లో ఖుష్బూ, సుశాంత్ తదితరులు ఉన్నారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
ఇఫీలో గుస్సాడీ నృత్యం
తెలంగాణ సంప్రదాయ నృత్య వైభవం మరోసారి జాతీయ అంతర్జాతీయ వేదికలపై తళుక్కుమననుంది. గోవాలో అట్టహాసంగా బుధవారం జరుగనున్న అంతర్జాతీయ భారత్ చిత్రోత్సవం (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. ఇఫీ)ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఆదివాసీ గోండు గిరిజనుల గుస్సాడీ నృత్యం ప్రదర్శనకు అవకాశం దక్కించుకుంది. ఈ నృత్య కళాకారునిగా ఇటీవలే కీర్తిశేషులైన పద్మశ్రీ కనకరాజు జాతీయ స్థాయిలో పేరొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవంలో తెలంగాణ సంప్రదాయ నృత్య ప్రదర్శనకు నోచుకోవడం, ఆ ప్రదర్శనలో పాల్గొనే కళాకారులు అందరూ దివంగత కనకరాజు శిష్యులే కావడంతో ఇది గత నెలలోనే దివికేగిన గుస్సాడీ నృత్య దిగ్గజానికి ఘన నివాళిగా చెప్పొచ్చు. – సాక్షి, హైదరాబాద్ -
గోవా ట్రిప్ ఎంజయ్ చేస్తున్న వితిక శేరు , నిహారిక కొణిదెల (ఫొటోలు)
-
గోవా లో కీర్తి సురేష్ పెళ్లి.. పెళ్లి కొడుకు ఎవరంటే..
-
Peruri Jyoti Varma: పవర్ ఫుల్
విరామం అంటే వెనక్కి తగ్గడం కాదు, పరాజయం అంతకంటే కాదు. విత్తనం నాటిన రోజు నుంచి అది పచ్చగా మొలకెత్తడానికి మధ్య కూడా విరామం ఉంటుంది. ఒకప్పుడు హ్యాండ్‌బాల్ గేమ్ నేషనల్ ప్లేయర్ అయిన జ్యోతి పెళ్లి తరువాత కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. విరామం తర్వాత మళ్లీ ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టిన పేరూరి జ్యోతి పవర్ లిఫ్టింగ్‌లో తక్కువ సమయలోనే సాధన చేసి గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో 45 కిలోల బరువు ఎత్తి కాంస్యం సాధించింది. నిజానికి అది పతకం కాదు... అపూర్వమైన ఆత్మవిశ్వాసం...జ్యోతి స్వస్థలం మహారాష్ట్రలోని నాగ్‌పూర్. పెళ్లికిముందు హ్యాండ్‌బాల్ గేమ్‌లో నేషనల్ ప్లేయర్. 1994లో ‘విజ్ఞాన్ యూనివర్శిటీ’లో ప్రొఫెసర్‌గా చేస్తున్న డాక్టర్ పిఎల్ఎన్ వర్మతో వివాహం జరగడంతో గుంటూరుకు వచ్చింది. కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు దూరంగా ఉండక తప్పలేదు. అయితే వ్యాయామాలకు, యోగ సాధనకు విరామం ఇవ్వలేదు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మగ్గం పని... వంటి అభిరుచుల పట్ల మక్కువను విడవలేదు. మనం అడుగుపెట్టే స్థలాలు కూడా భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి అంటారు. జ్యోతి విషయంలో అలాగే జరిగింది.ఏడాది క్రితం స్థానిక ‘ఇన్ఫినిటీ జిమ్’లో చేరి రకరకాల వ్యాయామాలు చేసేది. ఆమె ఉత్సాహం, పట్టుదల చూసి కోచ్ రమేష్ శర్మ ‘మీరు పవర్ లిఫ్టింగ్‌లో అద్భుతాలు సాధించగలరు’ అన్నారు. ఆమె నవ్వుతూ ఊరుకుంటే ఆ కథ అక్కడితో ముగిసేది. కోచ్ మాటలను ఆమె సీరియస్‌గా తీసుకుంది. ‘ఒకసారి ఎందుకు ప్రయత్నించకూడదు’ అనుకున్నది. అలా అనుకోవడంలో పతకాలు సాధించాలనే ఆశయం కంటే... ఆటల పట్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టమే కారణం. ఆరు నెలల క్రితం పవర్ లిఫ్టింగ్‌లో సాధన మొదలుపెట్టింది. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. ‘ఇంకా నువ్వు కాలేజీ స్టూడెంటే అని అనుకుంటున్నావా’ లాంటి వెటకారాలు వినిపించాయి. అయితే ఈ వెటకారాలు, మిరియాలు ఆమె సాధన ముందు నిలవలేకపోయాయి. మరింత దీక్షతో సాధన చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన మాస్టర్స్ నేషనల్స్‌లో కొద్దితేడాతో పతకం మిస్ అయింది. ‘పతకంతో తిరిగి వస్తావనుకున్నాం’ అన్నారు మిత్రులు. ‘వంద పతకాలతో తిరిగి వచ్చాను’ అన్నది జ్యోతి నవ్వుతూ. ఆమె చెప్పిన వంద పతకాలు... ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతోనే గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్స్ చాంపియన్ షిప్లో రికార్డు స్థాయిలో 45 కేజీలు బరువు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. నిజానికి ఇదిప్రారంభం మాత్రమే. ఆమె ఉత్సాహం, పట్టుదల చూస్తుంటే మరిన్ని విజయాలు ఆమె ఖాతాలో పడతాయని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే...ఏదైనా సాధించాలంటే మన విలువ మనం ముందుగా గుర్తించాలి. నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యం అవుతుంది. నాకు ఆరోగ్య సమస్యలున్నాయి. హైపో థైరాయిడ్, స్పాండిలైటిస్ నన్ను ఇబ్బంది పెట్టినా వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నాను. రోజూ యోగ, జిమ్, మెడిటేషన్, గార్డెనింగ్ చేస్తాను.– పేరూరి జ్యోతి– దాళా రమేష్‌బాబు, సాక్షి, గుంటూరుఫొటోలు: మురమళ్ల శ్రీనివాసరావు. -
ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు.. రికార్డులు బద్దలు
రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌ల్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు గోవా బ్యాటర్లు అజేయ ట్రిపుల్ సెంచరీలతో చెలరేగారు. స్నేహల్ కౌతంకర్ 215 బంతుల్లో 45 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 314 పరుగులు చేయగా.. కశ్యప్ బాక్లే 269 బంతుల్లో 39 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 300 పరుగులు చేశారు. స్నేహల్, కశ్యప్ మూడో వికెట్‌కు అజేయమైన 606 పరుగులు జోడించి రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. స్నేహల్, కశ్యప్ ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడటంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో (93 ఓవర్లలోనే) రెండు వికెట్ల నష్టానికి 727 పరుగులు చేసింది. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకు ఆలౌటైంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. 643 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ ఈ ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కొనసాగించి 92 పరుగులకు చాపచుట్టేసింది. ఫలితంగా గోవా ఇన్నింగ్స్ 551 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విశేషాలు.. నమోదైన రికార్డులు..రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు చేయడం ఇది రెండో సారి మాత్రమే.1989లో గోవాతో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన డబ్ల్యూవీ రామన్, అర్జున్ క్రిపాల్ సింగ్ ఒకే ఇన్నింగ్స్‌లో ట్రిపుల్ సెంచరీలు చేశారు.స్నేహల్, కశ్యప్ మూడో వికెట్‌కు అజేయమైన 606 పరుగులు జోడించి రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.ఈ మ్యాచ్‌లో గోవా చేసిన స్కోర్ (727/2) రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌గా నమోదైంది.రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చరిత్రలో అత్యధిక స్కోర్ మేఘాలయ చేసింది. 2018 సీజన్లో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో మేఘాలయ 826 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌లో గోవా చేసిన స్కోర్ (727/2) యావత్ రంజీ ట్రోఫీ చరిత్రలోనే తొమ్మిదో అత్యధిక స్కోర్‌గా రికార్డైంది.ఈ మ్యాచ్‌లో స్నేహల్ చేసిన ట్రిపుల్ సెంచరీ మూడో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీగా (205 బంతుల్లో) రికార్డైంది.రంజీల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు తన్మయ్ అగర్వాల్ పేరిట ఉంది. తన్మయ్ గత రంజీ సీజన్లో 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. -
ఐదు వికెట్లతో చెలరేగిన అర్జున్ టెండుల్కర్.. మెగా వేలంలో...
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ గోవా ఆల్‌రౌండర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. అర్జున్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. 84 పరుగులకే ఆలౌట్ అయింది.గోవాకు ప్రాతినిథ్యంకాగా ముంబైకి చెందిన అర్జున్ టెండుల్కర్ దేశవాళీ క్రికెట్లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఎడమచేతి వాటం కలిగిన బ్యాటర్ అయిన అర్జున్.. లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ కూడా! ఇక 25 ఏళ్ల అర్జున్ రంజీ ట్రోఫీ 2024-25లో ప్లేట్ గ్రూపులో ఉన్న గోవా.. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో తలపడుతోంది.పొర్వోరిమ్లోని గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్లో బుధవారం ఇరుజట్ల మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన అరుణాచల్ ప్రదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే అటాక్ మొదలుపెట్టిన గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండుల్కర్.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బెంబేలెత్తించాడు.టాప్-5 వికెట్లు అతడి ఖాతాలోనేఅర్జున్ ధాటికి టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ కకావికలమైంది. ఓపెనర్ నబాం హచాంగ్‌ను డకౌట్ చేయడంతో వికెట్ల వేట మొదలుపెట్టిన అర్జున్.. మరో ఓపెనర్ నీలం ఒబి(22), వన్‌డౌన్ బ్యాటర్ చిన్మయ్ పాటిల్(3), నాలుగో స్థానంలో వచ్చిన జే భస్వార్(0), ఐదో నంబర్ బ్యాటర్ మోజీ ఎటె(1)లను పెవిలియన్‌కు పంపాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనతద్వారా అర్జున్ టెండుల్కర్.. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన(5 Wicket Haul) నమోదు చేశాడు. ఇక అర్జున్‌తో పాటు గోవా బౌలర్లలో కేత్ పింటో రెండు, మోహిత్ రేడ్కర్ మూడు వికెట్లతో రాణించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే కుప్పకూలిన అరుణాచల్ ప్రదేశ్.. 84 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.ముంబై తరఫున కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అర్జున్ టెండుల్కర్ ఈమేరకు ఉత్తమ ప్రదర్శన కనబరచడం.. అతడికి సానుకూలాంశంగా మారింది. ఈ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇక సచిన్ టెండుల్కర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి 13 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. అయితే, రిటెన్షన్స్‌లో భాగంగా ఐదుగురిని అట్టిపెట్టుకున్న ముంబై.. అర్జున్ను వదిలివేసింది. ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్ వేలంపాట జరుగనుంది.చదవండి: ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్‌లన్నీ మా దేశంలోనే.. పాక్ ప్రభుత్వ వైఖరి ఇదే!