
హైదరాబాద్: భారాస ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అంటే సందడి. ఎక్కడ ఉన్నా, ఏం చేసినా ఆయన జోష్ చూపిస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు ఎన్నికల హడావుడితో అలసిపోయిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గోవాకు వెళ్లి చిల్ అయ్యారు.
ఆయన తన బృందంతో కలిసి గోవాకు వెళ్లి అక్కడ సముద్రంలో బోటింగ్, స్కూబాడైవింగ్ చేశారు. బోటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోవాలో ఆయన చేసిన జల్సాల ఫొటోలు వైరల్ అయ్యాయి. పలువురు నెటిజన్లు మల్లన్నా.. మజాకా అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment