Malla Reddy
-
నిజంగానే పాలు అమ్మిన మల్లారెడ్డి
-
మల్లారెడ్డి జిమ్ముల ఎక్సర్సైజులు
-
నాకెలాంటి ఈడీ నోటీసులు రాలేదు: మల్లారెడ్డి
సాక్షి,హైదరాబాద్ : మెడికల్ కళాశాల పీజీ సీట్ల కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) నోటీసులు అందాయంటూ వస్తున్న మీడియా కథనాలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టత ఇచ్చారాయననాకు ఎలాంటి నోటీసులు రాలేదు. నోటీసులు నా కొడుక్కి ఇచ్చారు. గతంలో ఈడీ రైడ్స్ జరిగాయి. విచారణకు రమ్మంటారు.. అది రెగ్యులర్ ప్రాసెస్ అని అన్నారాయన. కాగా, మెడికల్ పీజీ సీట్ల స్కాం కేసులో.. ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే.. మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డికి ఈడీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇక నోటీసుల్లో.. అక్రమంగా సీట్లను బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో కిందటి ఏడాది మల్లారెడ్డి కాలేజీల్లో ఈడీ సోదాలు జరిపింది. అంతేకాదు మెడికల్ కళాశాలల అడ్మినిస్ట్రేషన్ అధికారి సురేందర్‌రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు కూడా. -
టిల్లుని మించిపోయిన మల్లు.. మల్లారెడ్డి మాస్ డాన్స్
-
మనవరాలి పెళ్లి సంగీత్‌లో.. మల్లారెడ్డి ఊర మాస్ డ్యాన్స్
హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎదో విధంగా హల్చల్ చేస్తుంటారు. తాజాగా మల్లారెడ్డి మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్‌ని ఇరగదీశారు. మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని.. కొరియోగ్రాఫర్లతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈనెల 27న జరగనుంది.మనవరాలి సంగీత్ లో డీజే టిల్లు పాటకు మల్లన్న మాస్ స్టెప్పులు 🕺👌#MallaReddy #Mallareddydance pic.twitter.com/D0tMDpBED6— Pulse News (@PulseNewsTelugu) October 21, 2024 -
నా కాలేజీలు కాంగ్రెస్ హయాంలో కట్టినవే: మాజీ మంత్రి మల్లారెడ్డి
సాక్షి, యాదాద్రి భువనగిరి: తెలంగాణలో హైడ్రా కారణంగా ప్రజలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు. ఒక్కొక్కరూ ఒక్కో గ్రూపు తయారు చేశారని ఎద్దేవా చేశారు. అలాగే, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బుధవారం యాదగిరిగుట్ట వద్ద మీడియాతో మాట్లాడుతూ..‘హైడ్రా ప్రజలను హైరానా చేస్తోంది. ప్రజల దృష్టిని మరల్చడానికే హైడ్రా పనిచేస్తోంది. ఇళ్లను కూలగొట్టి ప్రజలను రోడ్లపై పడేయాల్సిన అవసరం ఏం వచ్చింది?. యుద్ధం చేసినట్టుగా ఇళ్లను కూల్చివేస్తున్నారు. హైడ్రా కారణంగా ప్రజలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదు. అందరి ఇళ్లకు నోటీసులు ఇచ్చినట్టే నాకు కూడా నోటీసులు ఇచ్చారు. నేను కట్టిన కాలేజీలు అన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే.కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే హస్తం పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నా. కేసీఆర్ పాలనలో పండించిన పంట కంటే ఎక్కువ పంట పండిస్తే కాంగ్రెస్ వాళ్లు పాలాభిషేకం చేస్తా. రేవంత్ సర్కార్ పాలనలో రైతుభరోసా లేదు. రుణమాఫీ పూర్తిగా కాలేదు. మంత్రుల మధ్య కూడా సఖ్యత సరిగాలేదు. ఒక్కొక్కరూ ఒక్కో గ్రూపు తయారు చేశారు. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు. కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: పాక్ కంపెనీలతో కలిసి రేవంత్ సర్కార్ భారీ స్కామ్: కేటీఆర్ -
హైడ్రా నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే: కమిషనర్ రంగనాథ్
సాక్షి,హైదరాబాద్ : నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ‘హైడ్రా’ నేలమట్టం చేస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించి ఒక్కొక్కటిగా కూల్చివేస్తోంది. ఈ చర్యలను కొన్ని వర్గాలు అభినందిస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.ఆ విమర్శలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ‘ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా మాకు సంబంధం లేదు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వాళ్లకు సమయం ఇస్తాం. అన్నీ పార్టీల నేతల అక్రమ నిర్మాణలను కూల్చేస్తున్నాం’ అని అన్నారు.ఎఫ్టీఎల్ అనేది ముఖ్యమైన అంశం.ధర్మసత్రమైన ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చేస్తాం. హైడ్రా నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. -
మల్లా రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు
-
కాంగ్రెస్ లీడర్లు నన్నేదో చేయాలనుకుంటున్నారు: మల్లారెడ్డి ఫైర్
-
కాంగ్రెస్ లీడర్లు నన్నేదో చేయాలనుకుంటున్నారు: మల్లారెడ్డి ఫైర్
సాక్షి, సుచిత్ర: కుత్బుల్లాపూర్‌లోని సుచిత్ర సర్కిల్ వద్ద మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన భూమిలో విషయంలో వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ భూమి తమదేనంటూ 15 మంది బాధితులు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, తాజాగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను ల్యాండ్ కబ్జాలు చేసే వ్యక్తిని కాను. నా దగ్గర ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. కబ్జా అంటున్న ల్యాండ్ మిలటరీ వాళ్ల ఆధీనంలో ఉంది. వాళ్ళు ఆ భూమి తీసుకున్నారు. రాత్రికి రాత్రే గుండాలు రౌడీలు వచ్చి దౌర్జన్యం చేశారు. భూమి పత్రాలు అన్ని సక్రమంగా ఉంటే ఎంఎల్ఏ లక్ష్మణ్ మొన్న ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు చూపించలేదు. కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను లీగల్‌గా పోరాడుతాను. సుచిత్ర దగ్గర ఉన్న భూమి విషయంలో అన్ని పత్రాలు సర్వేయర్లకు ఇచ్చాను. పోలీసులు కూడా నాకు సహకరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బుడ్డ లీడర్లు నన్నేదో చేయాలని కంకణం కట్టుకున్నారు. నాకు ఇవేం కొత్త కాదు. దీనికి కచ్చితంగా పోరాటం చేస్తాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
పోలీసులపై మల్లారెడ్డి ఫైర్
-
కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..
-
ఈటలా.. నువ్వే గెలుస్తావ్.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో కాకరేపుతున్నాయి. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మల్లారెడ్డిలు ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. ఈటలను చూసిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన వద్దకు వెళ్లి నువ్వే గెలుస్తున్నవన్నా అంటూ చేసిన వైరల్‌గా మారాయి.ఈటలను అలింగనం చేసుకోవడమే కాక, ఫోటో తీయండయ్య అన్న తోటి అంటూ ఉత్సాహంగా ఫొటోలు దిగారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ పడుతుండగా, కాంగ్రెస్ నుంచి పట్నం సునితా మహేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతున్న తరుణంలో బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి తమ ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటలనే గెలుస్తున్నారంటూ చెప్పడం చర్చాంశనీయంగా మారింది. -
BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి షాక్
-
మల్లారెడ్డి కాలేజ్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. యూనివర్సిటీకి చెందని విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. వివరాల ప్రకారం.. విద్యార్థుల ఆందోళనలతో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరీక్షలు ఒకటి, రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయిన సుమారు 60 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో వారు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా.. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కాగా, ధర్నా చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతుగా నిలిచారు. -
డీకే శివకుమార్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
-
బీఆర్ఎస్కు బిగ్ షాక్!.. డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి మంతనాలు
సాక్షి, బెంగుళూరు: మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి.. ఆయన అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ హోటల్లో డీకే శివకుమార్‌తో మంతనాలు జరిపారు. రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అపాయింట్మెంట్ కోరారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. తప్పుడు ప్రచారమంటూ తీవ్రంగా ఖండించిన మల్లారెడ్డి.. తాను కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదంటూ, బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంతలోనే హఠాత్ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి, ఆయన అల్లుడు భేటీ కావడం, మంతనాలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రియాంక గాంధీ సమక్షంలో మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పొలిటికల్ హైడ్రామా.. BRSకు షాకిచ్చిన ఆరూరి రమేష్ -
మల్లారెడ్డి యూ టర్న్ ?
-
కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి?
-
బీజేపీతో మాకు పొత్తు ఉంటుంది: మల్లారెడ్డి
-
బీజేపీతో పొత్తు ఉంటుంది: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో BRS పార్టీకి పొత్తు ఉంటుందంటూ బాంబు పేల్చారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇప్పటివరకు ఉప్పు, నిప్పులా ఉన్న BJP, BRS లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటూ అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మల్లారెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. బీజేపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి మల్లారెడ్డి ఆ మాటలు చెప్పాడా? లేక లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా అన్నది వచ్చే కొద్ది రోజుల్లో తెలుస్తుంది. మల్లారెడ్డి ఏమన్నాడంటే.. "బీజేపీతో BRSకు పొత్తు ఉండే అవకాశం ఉంది, మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు మా ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో టచ్‌లోనే లేరు, రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేస్తే.. BRSకు మల్కాజ్ గిరి సీటు ఇస్తారు. BJPతో BRS పొత్తు ఉండే అవకాశమున్నప్పుడు.. మా ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారని బండి సంజయ్ ఎలా మాట్లాడతారు? బండి సంజయ్‌తో అయ్యేది లేదు...పొయ్యేది లేద" అన్నారు మల్లారెడ్డి మల్కాజి గిరి లోక్‌సభ సీటు గురించి మాట్లాడుతూ.. "మా మల్కాజిగిరి లోక్‌సభ టిక్కెట్ భద్రంగా వుంది, బీజేపీతో బిఆర్ఎస్ పొత్తు ఉన్నా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం మాదే. మా అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు, మా కుటుంబం వేరు. నా కొడుకుకు టిక్కెట్ ఇస్తే మాదంతా ఉమ్మడి కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. మా యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు వుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే నేను ఏం చేయలేను" అన్నాడు మల్లారెడ్డి. మల్లారెడ్డి మాటలకు నేపథ్యమేంటీ? ఇవ్వాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు BRS సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. "బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. మోదీ.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే NDAలో బీఆర్ఎస్ను చేర్చుకోలేదు. ఎటుకాని BRS పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం.? ప్రస్తుతమున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. -
‘రాజకీయాల నుంచి తప్పుకుంటే.. గోవా వెళ్తా.. ఎంజాయ్ చేస్తా’
సాక్షి, హైదరాబాద్: తనకు గోవాలో హోటల్ ఉందని.. రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. శుక్రవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, మనిషి జీవితం ఒకేసారి వస్తుందని..ఎంజాయ్ చేయాలన్నారు తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అడుగుతున్నా.. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే రేవంత్‌ను పట్నం మహేందర్ కలిశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి చేరికకు ముందే మహేందర్ కర్చీఫ్ వేశారు. జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసమే నా పేరు వాడుకుంటున్నారు. ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి.. రేవంత్‌ను పొగుడుతున్నాడు. మల్లారెడ్డి పేరు చెప్పకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరు. గతంలో రేవంత్‌రెడ్డిపై ఆయన చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయి’’ అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. సబితారెడ్డితో కేటీఆర్ భేటీ అసెంబ్లీలో సబితారెడ్డితో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి పార్టీ వీడితే ఎదురయ్యే పరిణామాలపై చర్చించారు. ఇప్పటికే ప్రకాష్ గౌడ్, తీగల కృష్ణారెడ్డిలు.. సీఎంను కలవడంపై చర్చాంశనీయంగా మారింది. జిల్లాలో పార్టీ పరిస్థితి పై చర్చించినట్లు సమాచారం ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం -
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడట్లేదు: మల్లారెడ్డి
-
బర్రె కరిసిందా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..
-
త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా: మల్లారెడ్డి
-
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేముందని.. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానంటూ స్పష్టం చేశారు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. చర్చకు తావులేకుండా కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తానన్నారాయన. ‘‘మేము ఓడిపోతామని, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదు. తాము ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. మల్కాజిగిరి ఎంపీగా నన్నే పోటీ చేయమన్నారని నేను టికెట్‌ను నా కుమారుడు భద్రారెడ్డికి అడుగుతున్నానని మల్లారెడ్డి అన్నారు. మరోవైపు, ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు 71 ఏళ్లు వచ్చాయని, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానన్న ఆయన.. రాజకీయ పరంగా తనకు ఇవే చివరి ఐదేళ్లు.. ఈ ఐదేళ్లలో మీ అందరికీ మంచిగా సేవ చేస్తానన్నారు. ఇదీ చదవండి: Sambasiva Rao: సాంబశివరావుపై చీటింగ్ కేసు నమోదు -
"సినిమా చూపిస్త.." మల్లారెడ్డి వార్నింగ్
-
మాజీ మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్!
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలోని 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం మేడ్చల్‌లోని జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. కావ్య ఒంటెద్దు పోకడలకు సొంత పార్టీ అసమ్మతి కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చి వైజాగ్ టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా ఎన్నుకున్న మేయర్‌తో అసమ్మతి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిల మధ్య విభేదాలన్న విషయం తెలిసిందే. ఇక.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టికి మలిపెద్ది సుధీర్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చదవండి: TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం -
దుబాయ్ లో మల్లారెడ్డి ధూమ్ ధామ్
-
BRS MLA Malla Reddy Goa Trip: గోవాలో చిల్ అయిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.. ఫొటోలు వైరల్
హైదరాబాద్: భారాస ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అంటే సందడి. ఎక్కడ ఉన్నా, ఏం చేసినా ఆయన జోష్ చూపిస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు ఎన్నికల హడావుడితో అలసిపోయిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గోవాకు వెళ్లి చిల్ అయ్యారు. ఆయన తన బృందంతో కలిసి గోవాకు వెళ్లి అక్కడ సముద్రంలో బోటింగ్, స్కూబాడైవింగ్ చేశారు. బోటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోవాలో ఆయన చేసిన జల్సాల ఫొటోలు వైరల్ అయ్యాయి. పలువురు నెటిజన్లు మల్లన్నా.. మజాకా అంటూ కామెంట్స్ చేశారు. -
భూకబ్జా ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. భూకబ్జాలపై తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసు నమోదైన విషయం వాస్తవమేనని.. తాను కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శామీర్‌పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: కేసీఆర్ పగబట్టి ఉంటే కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండేవారు -
మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు
-
బిజినెస్ మెన్ సినిమా 10 సార్లు చూసిన..ఎంపీ అయినా
-
రణ్‌బీర్.. ఇక్కడికి షిఫ్ట్ అయిపో.. తెలుగువాళ్లు బాలీవుడ్‌ను..
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరో వయొలెంట్ సినిమాతో ముందుకు వస్తున్నాడు. తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో యానిమల్ మూవీ తెరకెక్కించాడు. రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై మంత్రి మల్లారెడ్డి మైక్ పట్టుకుని ఊగిపోయారు. ముంబై, బెంగళూరు వద్దు.. హైదరాబాదే బెస్ట్.. ఆయన మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు గారు.. నేను మీ బిజినెస్మెన్ సినిమా చూసి రాజకీయాల్లోకి వచ్చాను. పదిసార్లు ఆ సినిమా చూసే ఎంపీనయ్యాను. సేమ్ మోడల్.. సేమ్ సిస్టమ్.. అంతా సేమ్! రణ్‌బీర్.. మీకో విషయం చెప్పాలి. మరో ఐదేళ్లలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ.. బాలీవుడ్, హాలీవుడ్ అంతటినీ ఏలుతుంది. ఏడాది తర్వాత మీరు కూడా హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోండి. ముంబై పాతదైపోయింది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ ఎక్కువుంది. ఇప్పుడు ఇండియాలో అనుకూలంగా ఉన్న ఏకైక నగరం హైదరాబాదే! తెలుగువాళ్లు తెలివైనవారు తెలుగు ప్రజలు చాలా తెలివైనవారు. రాజమౌళి, దిల్ రాజు, సందీప్ రెడ్డి వంగా, రష్మిక మందన్నా.. వీరంతా కూడా ఎంతో తెలివైనవారు. పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! మీ యానిమల్ సినిమా కూడా రూ.500 కోట్ల కలెక్షన్లు రాబడుతుంది' అని చెప్పుకొచ్చారు. ఈయన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. మల్లారెడ్డి.. బాలీవుడ్ సెలబ్రిటీల ముందే హిందీ చిత్రపరిశ్రమను రోస్ట్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతిథులుగా వచ్చిన వారిని చులకన చేసి మాట్లాడటం కరెక్ట్ కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Minister #MallaReddy sparked controversy at the #AnimalPreReleaseEvent, making bold statements. He declared, 'Telugu people will lead India; you must move to Hyderabad in a year. Mumbai is outdated Hyderabad is the only city for India.' #Animal pic.twitter.com/AhnSKmhTrZ — Anil Tiwari (@Anil_Kumar_ti) November 27, 2023 చదవండి: పెద్ద తప్పు చేసిన అమర్, అర్జున్.. గేమ్ చేతులారా నాశనం చేసుకోవడమంటే ఇదే! -
అక్కడ మల్లన్న డ్యాన్స్..ఇక్కడ కేటీఆర్ చిట్ చాట్
-
కాంగ్రెస్ కార్పొరేటర్ అనిత ఇంటికి మల్లా రెడ్డి కోడలు
బోడుప్పల్: కాంగ్రెస్ పార్టీ 13వ డివిజన్ కార్పొరేటర్ దానగల్ల అనిత ఇంటికి సోమవారం బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు చామకూర ప్రీతిరెడ్డి వచ్చారు. గతంలో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన దానగల్ల అనిత బీఆర్ఎస్లో చేరగా, వారం రోజుల క్రితం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ప్రీతిరెడ్డి కలిసి మళ్లీ బీఆర్ఎస్లో చేరాలని కోరారు.. తమను బీఆర్ఎస్లో చాలా ఇబ్బందులకు గురి చేశారని అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్పొరేటర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఇంటికి వచ్చి ఎన్నికల సమయంలో ప్రలోభపెడుతున్నారని వాదించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మంత్రి మల్లారెడ్డి కోట్ల రూపాయలకు టిక్కెట్లు అమ్ముకున్నారని, అలాంటి వారికి ఓట్లు వేయవద్దంటూ నినాదాలు చేశారు. అక్కడ నుంచి ప్రీతిరెడ్డి కారులో వెళ్తుండగా రోడ్డుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. అడ్డుకున్న వారిలో కాంటెస్ట్డ్ కార్పొరేటర్ రాపోలు ఉపేందర్, నాయకులు చెంచల నర్సింగ్‌రావు, గోపు రాము, జయేందర్‌రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. -
మల్లారెడ్డి..ఒక్కడు కాదు నలుగురు..
-
కాంగ్రెస్ అంటే స్కాములే..
సాక్షి, మేడ్చల్ జిల్లా: టీపీసీసీ కొనుక్కున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల టికెట్లు అమ్ముకుంటున్నాడని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటే స్కాములని, ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే స్కీములని, తెలంగాణ రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో సంపద పెంచుతూ..పేద ప్రజలకు పంచుతున్నారని కొనియాడారు. రాహుల్ గాంధీ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందని, వారి హయాంలో నీళ్లు, కరెంట్ ఉన్నా..ఇవ్వలేకపోయారని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన తర్వాత రేవంత్‌రెడ్డి నియోజకవర్గం ప్రజల ముఖం చూసింది లేదని, వారి మంచి, చెడ్డలను ఆలోచించింది కూడా లేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రాంతీయ పా ర్టీలు ఉన్న చోట బీజేపీ గెలువలే.. ప్రాంతీయ పా ర్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ గెలువలేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న చోటనే గెలించిందని, అలాగే, కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోటనే గెలించిందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలను లూటీ చేసిందన్నారు. మేడిగడ్డపై బీజేపీ, కాంగ్రెస్ పా ర్టీలది ఎన్నికల స్టంట్ మాత్రమేనని, దేశానికే ఆదర్శంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లే ప్రయత్నం జరుగుతుందన్నారు. ‘మైనంపల్లి పిచ్చికుక్క అయిండు’ మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్లో ఉన్నప్పడు మంచిగుండే...ఇప్పుడేమో పైల్మాన్గా, రౌడీగామారి ‘చంపేస్తా.. కాలేజీలను మూసేస్తానని’ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ..పిచ్చి కుక్క అయిండని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలోనూ..పేదలకు సంక్షేమ పథకాలను అందించటంలోనూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నంబర్ వన్‌గా నిలిచిందని మల్లారెడ్డి తెలిపారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించగా, ఇందులో అధ్యక్షుడు వేణుగోపాల్‌నాయుడు, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అంటే ఒక స్కాం.. కేసీఆర్ అంటే అభివృద్ధి: మల్లారెడ్డి
-
మల్లారెడ్డి వర్సెస్ మైనంపల్లి.. పేలుతున్న మాటల తూటాలు
సాక్షి, హైదరాబాద్: మైనంపల్లి హన్మంతరావు ఓ రౌడీ అంటూ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మైనంపల్లిని బీఆర్ఎస్లో గెంటేస్తే కాంగ్రెస్‌లోకి వెళ్లాక పిచ్చోడయ్యాడంటూ మండిపడ్డారు. మైనంపల్లి గెలిచేది లేదు.. చేసేది లేదని విమర్శలు గుప్పించారు. ‘‘దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. బస్తీ దవాఖానలతో అందరికీ వైద్యం అందుతోంది. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ఐటీ రంగం కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ అంటే ఒక స్కాం.. కేసీఆర్ అంటే అభివృద్ధి. మాయమాటలు చెప్పడమే కాంగ్రెస్ పని.. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక పరిశ్రమలు మూత పడ్డాయి. రేవంత్ రెడ్డి ఎంపీగా మల్కాజ్ గిరికి ఏం చేశాడు?. కనీసం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి ఏం ఉద్దరిస్తాడు’’ అంటూ మల్లారెడ్డి ధ్వజమెత్తారు. అంతకుముందు కూడా వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శించారు. హద్దులు దాటి మాటలతో తిట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేతల మాటాలు విని ప్రజలు షాకవుతున్నారు. చదవండి: ఆసక్తికరంగా ‘అలంపూర్’ రాజకీయం.. బీఫాం ఎవరికో? -
తగ్గేదేలే..వామ్మో గివేం మాటలు...
-
అవ్వపై మంత్రి మల్లారెడ్డి లవ్
-
"పాలమ్మిన పూలమ్మిన.." మల్లారెడ్డిపై పాల్ ఫైర్
-
డాన్స్ ఇరగదీసిండు..!
-
డీజే పాటకు డ్యాన్స్ ఇరగదీసిన మంత్రి మల్లారెడ్డి
-
సినిమా చూపిస్తనంటున్న మల్లన్న
-
పాలమ్మినా..పూలమ్మినా...రికార్డుల్లోకెక్కినా...
-
జవహార్ నగర్ బాధితురాలికి అండగా మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: జవహార్ నగర్లో జరిగిన దుశ్శాసన పర్వం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో బాధితురాలికి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అండగా నిలిచారు. ఆమెకు పెళ్లి చేయడంతో పాటు ఉద్యోగం ఇప్పించే బాధ్యతను ఆయనే తీసుకున్నారు. బాలాజీ నగర్లో మద్యం మత్తులో ఓ కీచకుడు ఆమె దుస్తులు చించేసి.. నగ్నంగా రోడ్డుపై నిలబెట్టిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చుట్టూ వంద మంది ఉన్నా ఎవరూ ఆమెను రక్షించే ప్రయత్నం చేయకపోగా.. ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఉదంతంపై బాధితురాలు మీడియా ముందు వాపోయింది కూడా. అయితే.. ఈ కేసులో పోలీసులు బాధితురాలికి అండగా నిలవడంతో పాటు నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అయితే ఆ బాధితురాలికి మంత్రి మల్లారెడ్డి అండగా నిలబడ్డారు. బాధితురాలికి(28) మున్సిపల్ కార్పోరేషన్లో ఉద్యోగం ఇప్పించడంతో పాటు ఆమె పెళ్లి చేసేందుకు కూడా ఆయన ముందుకొచ్చారు. అంతేకాదు.. ఆమెకు డబుల్ బెడ్రూం ఇవ్వాలంటూ అధికారులకు సైతం మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్‌లోనూ ఆమె యోగక్షేమాలన్నీ తానే చూసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులకు అభయం ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి. గవర్నర్ ఆరా జవహార్ నగర్లో మహిళను వివస్త్ర చేసిన ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. మహిళా కమిషన్ సీరియస్ జవహార్ నగర్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సైతం సీరియస్ అయ్యింది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయంటూ.. డీజీపీ నుంచి వివరణ కోరింది. -
‘మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించేది నేనే!’ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడిన ఓ సంచలనమే. మల్లారెడ్డి నోటి నుంచి వచ్చే మాటలకు జనాల్లో, సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన చేసే వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలతో కొత్త చర్చకు తెరలేపారు. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిని తానే నిర్ణయిస్తానని, మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇప్పించింది తానేనని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించడంలో తనదే నిర్ణయాత్మక పాత్ర అని పేర్కొన్నారు. మేడ్చల్ కాంగ్రెస్‌లో గ్రూపు గొడవల వెనుక తామే ఉన్నామని చెప్పుకొచ్చారు. గతంలో తనపై జరిగిన ఐటీ దాడుల అంశాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘‘ఐటీ అధికారులు నా ఇంట్లో డబ్బులు ఉన్న గదిని చూడలేదు. ఆ డబ్బులు ఇప్పుడు ఎన్నికలకు ఖర్చు చేస్తా..’’అని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానా, మరొకరు పోటీ చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని పేర్కొన్నారు. చదవండి: నాలుగేళ్లుగా చేయనిది.. ఈ రెండు నెలల్లో చేస్తారా? -
యాంకర్ తో మల్లారెడ్డి మజాక్ ముచ్చట్లు
-
మేడ్చల్ నియోజకవర్గాన్ని ఎవరు శాసించబోతున్నారు..?
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రముఖ విద్యాసంస్థల అదినేత చామకూర మల్లారెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికలలో ఆయన మల్కాజిగిరిలో టిడిపి పక్షాన ఎమ్.పిగా గెలిచి ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఎన్నికలలో మేడ్చల్ నుంచి అసెంబ్లీకి పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 88066 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి 2018లో టిక్కెట్ ఇవ్వలేదు. మల్లారెడ్డి గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. మల్లారెడ్డికి 167009 ఓట్లు రాగా, లక్ష్మారెడ్డికి 78943 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ధి నక్కా ప్రబాకర్ గౌడ్‌కు సుమారు 25800 ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచారు. మల్లారెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడుసార్లు బిసి నేతలు, రెండుసార్లు ఎస్.సి.నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత గెలుపొందారు.మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు గెలిస్తే, టిడిపి నాలుగుసార్లు గెలిచింది. టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇక్కడ నుంచి 1978లో గెలిచాకే ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నారెడ్డి మొత్తం ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వికారాబాద్, తాండూరులలో రెండేసి సార్లు, ఒకసారి సనత్నగర్లోను ఆయన గెలుపొందారు. గతంలో ఈయన నీలం, కాసు మంత్రివర్గాలలో సభ్యునిగా ఉన్నారు. కేంద్రంలో మంత్రి పదవి కూడా నిర్వహించిన ఈయన నాలుగు రాష్ట్రాలకు గవర్నరుగా ఉన్నారు. ఒకసారి చెన్నారెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. అదే సమయంలో మొదల్కెన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, తెలంగాణ ప్రజా సమితి పార్టీని విజయపథంలో నడిపించిన ఘనత పొందారు. మేడ్చల్‌లో రెండుసార్లు గెలిచిన సమిత్రాదేవి మరో మూడుసార్లు ఇతర చోట్ల గెలిచారు. టిడిపిలో జడ్పి ఛైర్మన్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేసి, మంత్రి పదవిని అలంకరించిన టి.దేవేందర్‌గౌడ్ ఇక్కడ మూడుసార్లు విజయం సాధించారు. ఎన్.టిఆర్., చంద్రబాబు క్యాబినెట్లలో సభ్యునిగా ఉన్న దేవేందర్‌గౌడ్ 2008 నాటికి టిడిపిని వదలి సొంతంగా పార్టీని నవతెలంగాణ పేరిట ఏర్పాటు చేసి కొంత కాలం తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేసి మల్కాజిగిరి లోక్‌సభకు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీకి పోటీచేసి రాజకీయంగా ఎదురుదెబ్బ తిన్నారు.ఆ తర్వాత తిరిగి టిడిపిలో పునః ప్రవేశించి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇక్కడ నుంచి పోటీచేసి గెలుపొందినవారిలో సుమిత్రాదేవి, ఉమా వెంకట్రామిరెడ్డి, కె.సురేంద్రరెడ్డి, దేవేందర్‌గౌడ్, మల్లారెడ్డి కూడా మంత్రి పదవులు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మల్లారెడ్డి వాయిస్ ని యాజ్ ఇట్ ఈజ్ దింపేసాడు
-
మంత్రి మల్లారెడ్డి పై కే.ఏ పాల్ పంచులు..
-
సీట్ల బ్లాకింగ్‌లో వందల కోట్ల లావాదేవీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రైవేటు మెడికల్ కాలేజీలు రూ. లక్షల విలువ చేసే పీజీ సీట్లను రూ. కోట్లకు అమ్ముకున్నట్లు... ఈ కళాశాలల్లో రూ.వందల కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో భారీ మొత్తంలో నగదును సీజ్ చేసినట్లు ఈడీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం నాటి సోదాల సందర్భంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజీ కార్యాలయాల నుంచి రూ. 1.4 కోట్ల నగదును స్వా ధీనం చేసుకున్నామని... ఆ కాలేజీ బ్యాంకు ఖాతాలో మరో రూ. 2.89 కోట్ల నగదును స్తంభింపజేశామని వివరించింది.రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బుధవారం జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర రికార్డులను స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించిన ఈడీ... మల్లారెడ్డి మెడికల్ కాలేజీ నుంచి నగదు స్వా«దీనం చేసుకున్నట్లు మాత్రమే ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. లక్షల పెట్టుబడితో కోట్ల సంపాదన... కాళోజీ యూనివర్సిటీ అధికారులు గతేడాది చేసిన ఫిర్యాదు మేరకు మెడికల్ సీట్ల బ్లాకింగ్ దందాపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మట్టెవాడ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మనీలాండరింగ్ చట్టాల కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు సీట్ల బ్లాకింగ్ దందాపై ఆరా తీశారు. పూర్తిస్థాయిలో ప్రాథమిక ఆధారాలు సేకరించి బుధవారం హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ తదితర 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జరిపిన ఈ సోదాల్లో కీలక ఆధారాలు సేకరించారు. కొల్లగొట్లే దానిలో కొంత వాళ్లకు... మెరిట్ విద్యార్థులతో కుమ్మక్కై పీజీ మెడికల్ సీట్ల బ్లాకింగ్ దందాలో దండుకున్న డబ్బులో కొంత మొత్తాన్ని సీట్లు బ్లాక్ చేసేందుకు అంగీకరించిన విద్యార్థులకు సదరు కాలేజీలు చెల్లిస్తున్నట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఆరోగ్య వర్సిటీల కౌన్సెలింగ్‌లు పూర్తయ్యాక కూడా మిగిలే సీట్లను ప్రైవేటు కాలేజీలు సొంతంగా భర్తీ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వెసులుబాటును అనుకూలంగా మార్చుకొని కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు సీట్ల బ్లాకింగ్ దందాకు తెరతీశాయి. పీజీ నీట్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ముందుగానే ఓ కళాశాలలో కన్వీనర్ కోటాలో పీజీ సీటు పొందిన విద్యార్థులతో మరో కళాశాలలోనూ కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు సీటు బ్లాక్ చేయిస్తున్నారు. ఇలా చివరకు మిగిలిపోయిన సీట్లలో ఒక్కో సీటును రూ. కోటి నుంచి రూ. 2.5 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఈడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. కౌన్సెలింగ్‌లో సీట్లు తీసుకోని విద్యార్థులు చివరకు యూనివర్సిటీకి చెల్లించాల్సిన అపరాధ రుసుమును సైతం వారి తరఫున కాలేజీల యాజమాన్యాలే చెల్లిస్తున్నాయి. గుడ్‌విల్ కింద వారికి రూ. లక్షల్లో ముట్టజెప్పుతున్నాయి. ఇలా సీట్ల బ్లాక్ దందాతో రూ. లక్షలు ఖర్చు చేసి రూ. కోట్లు సంపాదిస్తున్నట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
ఇంత మంది అమ్మాయిలతో మల్లారెడ్డి డ్యాన్స్!
-
పోలీస్ నే పోలీస్ స్పెలింగ్ రాయమంటున్న మల్లారెడ్డి
-
మల్లా రెడ్డి సార్ కి కోపం వచ్చింది
-
డబ్బు పగిలేలా కొడుతున్న మల్లరెడ్డి
-
కార్మికులంటే అషామాషీ కాదు: మంత్రి మల్లారెడ్డి
-
సమావేశానికి పిలవాల్సిన అవసరమేంటి? వారే రావాలి: మంత్రి మల్లారెడ్డి
సాక్షి, మేడ్చల్ జిల్లా: రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలు కాస్తా.. నేతల మధ్య చాపకింద నీరులా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు బహిర్గతమవడంతో కేడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది. మంగళవారం దేవరయాంజల్లో జరిగిన మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆయన తనయుడు జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి దూరంగా ఉండటంపై కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం.. సమ్మేళనానికి ఆహ్వానం లేకపోవటం వల్లే హాజరు కాలేదని సుధీర్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి పేర్కొంటుండగా, వారిని పిలవాల్సిన అవసరమేంటి..? వారే రావాలని మంత్రి మల్లారెడ్డి వాదిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో అందరూ పాల్గొనాలని అధిష్టానమే ఆదేశించిందని, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డిని తాను పిలవడం ఏంటని.. వారే రావాలి కదా అని మంత్రి మల్లారెడ్డి పేర్కొంటున్నారు. గతంలో మండల, పురపాలక స్థాయి సమావేశాల్లో పాల్గొన్న వారిని.. ఎవరు పిలిస్తే వచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ ఆ సమావేశాలకు ఆహ్వానం ఉండటం వల్లే పాల్గొన్నామని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహారాన్ని, ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానించని విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనాలు ఇలా.. మేడ్చల్ జిల్లాలో దాదాపు నెల రోజులుగా మండల, పురపాలక సంఘాలు, అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిల్లో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. ఆతీ్మయ సమ్మేళనాల విజయవంతం కోసం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు పార్టీ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. మార్చి 24 నుంచి జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతుండగా, మేడ్చల్ నియోజకవర్గంలో మాత్రం 10 పురపాలక సంఘాలు, 5 మండలాల సమావేశాలకు 6 పురపాలికలు, 4 మండలాల్లో మాత్రమే జరిగాయి. ఇంకా పీర్జాదిగూడ, ఘట్కేసర్, నాగారం, దమ్మాయిగూడ పురపాలక సంఘాలతోపాటు ఎంసీపల్లి మండలంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాల్సి ఉంది. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు.. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గంగా కొనసాగుతున్న విభేదాలు ఆత్మీయ సమ్మేళనాలతో పోతాయని భావించినా.. మరింత ముదురుతుండటంతో పరిస్థితి ఎక్కడి దారి తీస్తుందోనని పార్టీ కేడర్ ఆందోళన చెందుతోంది. గతంలోనే మంత్రి మల్లారెడ్డిపై జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇంత వరకు ఇది ఓ కొలిక్కివచ్చిన దాఖలాలు లేవు. గతంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత హన్మంతరావు ఇంట్లో సమావేశమైన ఐదుగురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధుల విషయంలో మంత్రి మల్లారెడ్డి జోక్యాన్ని తప్పుబట్టారు. ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్న విషయం తేల్సిందే. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతర్ చేయకుండా నామినేటెడ్ పదవులను కూడా మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఆ సందర్భంలో ఎమ్మెల్యేలు ఆరోపించిన విషయం తేల్సిందే. ఈ వ్యవహారం ఇంకా చక్కబడకపోగా, నివురుగప్పిన నిప్పులా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా.. జిల్లాలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభా‹Ùరెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. కూకట్‌పల్లిలో కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ తమ గ్రూపులను ప్రోత్సహిస్తున్నట్లు పార్టీ కేడర్‌లో గుసగుసలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని 13 పురపాలక సంఘాలోŠల్ అధికార పార్టీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఉన్నప్పటికీ వారి మధ్యనే విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్లతో సహా పలు గ్రామాల్లో కూడా పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. మూడింటిలో తారస్థాయిలో.. మేడ్చల్ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ మినహాయించి మిగతా కూకట్పల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు సాఫీగానే కొనసాగుతున్నాయి. ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో చాపకింద నీరులా నాయకుల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నా.. ఆత్మీయ సమ్మేళనాలు మాత్రం సజావుగా నిర్వహిస్తున్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఆత్మీయ సమ్మేళనాల తీరు నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోస్తోంది. ఇటీవల బోడుప్పల్ పురపాలక సంఘంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం దీనికి నిదర్శంగా నిలుస్తోంది. బోడుప్పల్ సమ్మేళనంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా సమన్వయకర్త, పార్టీ ఇన్చార్జి ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలోనే ఇరువురు నేతలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ.. వాగ్వాదాలకు దిగడం పార్టీ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేసింది. -
బీఆర్ఎస్లో రగులుతున్న అసమ్మతి.. మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిగా మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ తయారైంది. మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిల మధ్య పార్టీలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు ప్రధాన నాయకులు చెరో గ్రూపుగా మారడంతో మేడ్చల్ బీఆర్ఎస్లో అసమ్మతి బయటపడుతోంది. ఆత్మీయ సమ్మేళనాలతో మరోసారి ఈ విషయం బయటపడింది. మొదటి నుంచీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరే.. 2014లో మేడ్చల్ నుంచి కారు గుర్తుపై సుధీర్‌రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఐదేళ్లు పని చేశారు. 2014 ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్‌కు టీడీపీ తరఫున మంత్రి మల్లారెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత బంగారు తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్లో చేరారు. ఎంపీగా ఉన్న సమయంలోనే మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలో తన అనుచరుల ద్వారా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో నాటి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి మల్లారెడ్డి మధ్య పలు మార్లు భేదాభిప్రాయాలు వచ్చినా అవి అప్పటి వరకే పరిమితమయ్యాయి. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం సుధీర్‌రెడ్డిని కాదని ఎంపీగా ఉన్న మల్లారెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ సమయంలో అలకబూనిన సుధీర్‌రెడ్డిని ప్రస్తుత రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధిష్టానం దూతగా వచ్చి బుజ్జగించి ఆయనకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చి బుజ్జగించారు. ఆ తర్వాత మంత్రిగా మల్లారెడ్డి కావడం, ఆయన అర్థ బలం ముందు సుధీర్‌రెడ్డి తట్టుకోలేకపోవడంతో ఆయన కొంతమేర వెనకడుగు వేశారు. ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సు«దీర్‌రెడ్డి తన తనయుడు శరత్‌చంద్రారెడ్డిని ఘట్కేసర్ నుంచి పోటీలో దింపి గెలిపించుకున్నారు. అదే ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డి తన బావమరిది మద్దుల శ్రీనివాస్‌రెడ్డిని మూడుచింతలపల్లి మండలం నుంచి పోటీలో దింపగా ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో సు«దీర్‌రెడ్డి తనయుడు శరత్‌చంద్రారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నాటి నుంచి నియోజకర్గంలో ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. సుధీర్‌రెడ్డి తన అనుచరులతో తనకూ ఓ గ్రూపును ఏర్పాటు చేసుకోగా మంత్రి మల్లారెడ్డి తన కోటరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో మరోసారి రచ్చ.. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్లో వర్గ విభేదాలు జోరుగా బయట పడ్డాయి. మొదట్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థాయి, గ్రామ, వార్డుస్థాయి నాయకులు తమ అసమ్మతి వెల్లగక్కినా అది బయటపడకుండా మంత్రి తనయుడు మహేందర్‌రెడ్డి మేనేజ్ చేశారు. చాలామంది నాయకులు ఆత్మీయ సమ్మేళనాలకు డుమ్మా కొట్టినా మంత్రి బలం ముందు తమ అసమ్మతిని బహిరంగంగా వెల్లడించలేకపోయారు. ఆత్మీయ సమ్మేళనాలకు హాజరైన సుధీర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డిలు తమ ప్రసంగాల్లో అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినా వారి గెలుపు కోసం అందరూ పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సుధీర్‌రెడ్డి ఈ అంశాన్ని పదేపదే నాయకుల ముందు ఉంచడంతో చిర్రెత్తిన మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో టికెట్ తనకు సీఎం కేసీఆర్ ఖరారు చేశారని, గెలుపు తనదేనని అన్నారు. ఆ తర్వాత జరిగిన బోడుప్పల్ ఆత్మీయ సమ్మేళనంలో ఇదే అంశం ఇద్దరి నేతల మధ్య అగ్గి రాజేసింది. పార్టీ ఎవరికి టికెట్ ఖరారు చేయలేదని సుధీర్‌రెడ్డి అనగా తనకే కేటాయించిందని మంత్రి మల్లారెడ్డి అనడం వారి మధ్య వాగ్వాదానికి తేరలేపింది. మొదటి నుంచీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న నేతలకు మరోసారి అవకాశం రావడంతో పార్టీ పరువును జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో కలిపారు. రంగంలోకి ఎవరు..? వీరి మధ్య ఆధిపత్య పోరు జోరుగా ఉండటంతో అధిష్టానం మేడ్చల్ గెలుపుకోసం చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని రంగంలోకి దించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మల్లారెడ్డి స్థాయిలో కాకున్నా ఇద్దరు నేతలు అర్థబలం గట్టిగా ఉన్నవారు కావడం, సీఎంకు నమ్మి న బంట్లుగా ఉండటంతో వీరిద్దరిలో ఒకరికి మేడ్చల్ బీఆర్ఎస్ టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
మల్లన్నతో పోటీపడ్డ కేతమ్మ ఎవ్వరూ తగ్గలేదు..
-
మల్లరెడ్డి డైలాగ్స్ చెప్పిన మంత్రి కేటీఆర్
-
విలన్‌గా చేయమని గంటసేపు బతిమలాడారు: మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘మేమే ఫేమస్’ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన యువతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలోనే యువత శాతం ఎక్కువగా ఉందన్నారు. చిరిగిన జీన్స్ వేసుకొని అమ్మాయిలతో తిరిగితే యువత ఫేమస్ అవ్వలేరని, కష్టపడితే ఫేమస్ అవుతారన్నారు. యువత గాలికి తిరగడం మానేసి కష్టపడండి.. సక్సెస్ ఎవరికి ఊరికే రాదు, తాను కూడా పాలు అమ్మి కష్టపడి కేసీఆర్ దయతో మంత్రినయ్యానంటూ పేర్కొన్నారు. ప్రపంచంలోనే నెంబవర్ వన్ ఫేమస్ మంత్రి కేటీఆర్ అని ప్రశంసలు కురిపిస్తూ.. ఆయన వల్లే గూగుల్, అమేజాన్ లాంటి సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికలు పూర్తయ్యాక తెలంగాణ యాసలో ఐదారు సినిమాలు నిర్మిస్తానని తెలిపారు. ఇటీవల పవన్ కల్యాణ్ సినిమాలో విలన్ గా నటించమని హరీశ్ శంకర్ మా ఇంటికి వచ్చాడు.. గంటపాటు బతిమిలాడినా నేను విలన్‌గా చేయనని స్పష్టం చేసినట్లు చెప్పుకొచ్చారు. -
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
-
రాముడంటే కేటీఆర్.. చంద్రుడంటే కేసీఆర్.. మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అసలు దొంగలను వదిలేసి.. పేదలకు విద్యా దానం చేస్తున్న తమపై ఐటీ దాడులు చేశారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారంలో ఆయన శాసనసభలో మాట్లాడుతూ వివేక్, ఈటల మీద ఐటీ దాడులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చాయ్ అమ్మినట్లు పబ్లిక్ ప్రాపర్టీని అమ్ముతున్నారు. ఇప్పుడు సింగరేణిని కూడా అమ్ముతానంటున్నారు’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. తెలంగాణలో రామచంద్రుల పాలన నడుస్తోంది. రాముడు అంటే రామారావు. చంద్రుడు అంటే కేసీఆర్. ఒకప్పుడు రామరాజ్యం విన్నాం. ఇప్పుడు తెలంగాణకు ఐటీ రాజ్యం తెచ్చిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుంది. ఉద్యమ చంద్రుడు ఇవాళ సూర్యుడు అయ్యాడు. కేసీఆర్ పీఎం అవుతాడు.. కేటీఆర్ సీఎం అవుతాడు’’ అని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి: తెలంగాణ సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ -
బీసీల చరిత్రలో ఇది సువర్ణాధ్యాయం
ఉప్పల్: దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రులు గంగుల కమాలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, చామకూర మల్లా రెడ్డిలు అన్నారు. వెనుకబడిన వర్గాల చరిత్రలో ఈ రోజు సువర్ణాధ్యాయమని పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్‌లో 38 ఎకరాలలో 13 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు భూమి పూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు వివిధ కులసంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత 75 ఏళ్లలో ఇంతవరకు ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని విధంగా వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేలు చేస్తున్నారని అన్నారు. ఈ ఆత్మగౌరవ భవనాలను తమ కులం ప్రతిష్టను ఇనుమడించేలా, సంస్కృతి వెళ్లి విరిసేలా డిజైన్లు చేసి నిర్మించుకునే ఆవకాశం వారికే ఇచ్చారన్నారు. ఆత్మగౌరవ భవనాల్లో దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి, తమ సంస్కృతిని చాటేలా కమ్యూనిటీ హాళ్లు, పిల్లల చదువు కోసం లైబ్రరీలు, రిక్రియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆత్మగౌరవ భవనాలకు రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. తెలంగాణ రావడంతోనే వెనుకబడిన కులాల్లో పెద్ద మార్పు వచ్చిందన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ..వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. కుల వృత్తులకు చేయూత ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ దోపిడీ చేస్తుందని, బీజేపీ మతం మత్తులో ముంచుతుందని విమర్శిస్తూ కేవలం బీఆర్ఎస్ మాత్రమే అభివృద్ధి చేస్తుందని అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కుల వ్యవస్థపై జోతిబాపూలే అద్భుత పరిశోధన చేసి మనమంతా ఒక్కటే అని, కేవలం వృత్తిపరంగా కులాలకింద విభజితులైనట్లు చెప్పారని పేర్కొన్నారు. అయితే అందరినీ కలపడానికి పూలే పడ్డ ఆవేదన నేడు కేసీఆర్‌లో కనబడుతోందన్నారు. సమూహంగా ఎదగడానికి ఈ భవనాలు దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, ఎమ్మెల్యే ముఠాగోపాల్, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరి శంకర్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఉప్పల్ తహసీల్దార్ గౌతం కుమార్, బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో తారాస్థాయికి విభేదాలు .. రాజకీయం.. రసకందాయం
‘ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు’ అనే నానుడి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలకు అతికినట్టు సరిపోతుంది. కొత్త, పాతల మధ్య కుదిరిన సయోధ్య చెదరడంతో భవిష్యత్తు రాజకీయం రసకందాయంగా మారనుంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని కీలక నాయకుల అంతర్గత కుమ్ములాటలు, ధిక్కార స్వరాలు క్రమక్రమంగా రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. నాయకుల వైఖరి అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. సాక్షి, రంగారెడ్డి: జిల్లా రాజకీయాలను శాసించే మహేశ్వరం, తాండూరు, మేడ్చల్ నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలు రోజురోజుకూ ముదిరి పాకాన పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసంతృప్తి మరింత పెరిగేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నంమహేందర్రెడ్డి, మేడ్చల్‌లో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య చాలాకాలంగా విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అవి మెల్లమెల్లగా రాజుకుంటూ ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీ ఒకటే అయినా వైరివర్గం ఆధిపత్యం మింగుడుపడక అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలనే భావనలో అసంతృప్త నేతలు ఉన్నారు. తమ కుటుంబ సభ్యులు జిల్లా పరిషత్ పీఠాలపై కూర్చున్నా సరే ప్రత్యర్థుల పెత్తనాన్ని ఒప్పుకొనేది లేదని తెగేసి చెబుతూ తిరుగుబాటుకు సిద్ధపడుతుండడం గమనార్హం. పైలెట్‌తో పట్నం ఢీ గత ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో అనూహ్య ఓటమిని చవిచూశారు. తర్వాత తన సోదరుడి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోవడంతో సంతృప్తి పడ్డారు. అనంతరం జెడ్పీ ఎన్నికలు రావడంతో సారథిగా సతీమణి సునీతను గెలిపించుకోవడం ద్వారా వికారాబాద్ జిల్లాలో తన రాజకీయ పలుకుబడి తగ్గలేదని నిరూపించుకున్నారు. అయితే, తనను ఓడించిన పైలెట్‌ను అధిష్టానం అక్కున చేర్చుకోవడంతో డీలా పడ్డారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రెండువర్గాలు విడిపోవడంతో గులాబీ శిబిరంలో లుకలుకలు మొదలయ్యాయి. వీరి ఆధిపత్యపోరులో శ్రేణులు కూడా చీలిపోవడం.. ప్రొటోకాల్ సమస్యలతో తాండూరు రాజకీయ రంజుగా మారింది. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో ప్రగతిభవన్‌కు దగ్గరయిన పైలెట్ మెడకు ఈడీ కేసు బిగుసుకుంటుందని.. తద్వారా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమనే ధీమాలో పట్నం వర్గీయులు ఉన్నారు. రోహిత్ మాత్రం తన కెరీర్‌ను ఫణంగా పెట్టి బీజేపీపై కేసీఆర్‌కు పోరాటాస్త్రం అందించానని, ఈ సారి గులాబీ బీఫారం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ సమీకరణలకు అనుగుణంగా అడుగువేయాలని భావిస్తున్న పట్నం అవసరమైతే కండువా మార్చయినా జిల్లా రాజకీయాలపై మళ్లీ పట్టు సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సబిత వర్సెస్ తీగల మహేశ్వరంలో మంత్రి సబిత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి పొసగడం లేదు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన తీగలపై సబిత విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆమె కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరి కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. అప్పటి నుంచి కినుక వహించిన కృష్ణారెడ్డి పలుమార్లు మంత్రి వ్యవహారశైలిని తప్పుబడుతూ వస్తున్నారు. అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్టానం.. ఆయన కోడలు అనితారెడ్డిని జెడ్పీ చైర్‌పర్సన్‌గా నియమించింది. దీంతో కొన్నాళ్లు గుంభనంగా వ్యవహరించిన కృష్ణారెడ్డి తిరిగి మంత్రిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అభివృద్ధి జరగడంలేదని,తన వర్గీయులను అణిచివేస్తున్నారని పెదవి విరుస్తున్నారు. ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్‌ను కాదని తనకు టికెట్ ఇచ్చే అవకాశం మృగ్యమనే ప్రచారం నేపథ్యంలో పక్కపారీ్టలవైపు చూస్తున్నారు. మేడ్చల్‌లోనూ సేమ్ సీన్ 2018 ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో మిన్నకుండిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఈసారి మాత్రం అధిష్టానంతో చావోరేవో తేల్చుకునేదిశగా అడుగులేస్తున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన చామకూర మల్లారెడ్డి అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు సంపాదించారు. ఈ పరిణామం మింగుడుపడని మలిపెద్ది.. తన అనుచరవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయనను సంతృప్తి పరిచేందుకు కుమారుడు శరత్‌చంద్రారెడ్డికి మేడ్చల్ జెడ్పీ పీఠాన్ని అప్పగించారు. దీంతో కొన్నాళ్లపాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే, సుధీర్‌రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసిన మల్లారెడ్డి.. నెమ్మదిగా అన్ని మండలాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోని సుధీర్.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బరిలో దిగి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. కుటుంబీకులపై జరిగిన ఐటీ దాడులతో మంత్రి ప్రతిష్ట మసకబారిందని.. ఈసారి తనకు టికెట్ ఖాయమనే భావనలో ఉన్నారు. అధిష్టానం నుంచి రిక్తహస్తం ఎదురైతే ప్రత్యర్థి పార్టీ కండువా కప్పుకొనేందుకు కూడా వెనుకాడరనే ప్రచారం జరుగుతోంది. -
బీజేపీపై మండిపడ్డ మల్లరెడ్డి
-
డీజే టిల్లు సాంగ్‌కు మల్లారెడ్డి డ్యాన్స్
-
డీజే టిల్లు స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి మల్లారెడ్డి.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి స్టెప్పులతో అదరగ్గొట్టారు. డీజే టిల్లు సాంగ్‌కు తనదైన శైలిలో స్టెప్పులేస్తూ అలరించారు. మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులతో కలిసి మంత్రి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు, డీజే టిల్లు మూవీ హీరో సిద్ధు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సిద్ధుతో కలిసి మంత్రి మల్లారెడ్డి స్టెప్పలేస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. దీంతో మల్లారెడ్డి డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: (తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతికుమారి) -
కొత్తగా 14 ఈఎస్ఐ డిస్పెన్సరీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 14 ఈఎస్ ఐ డిస్పెన్సరీలను ఈఎస్ఐ కార్పొరేషన్ మంజూరు చేసింది. ఇందులో ఐదు డిస్పెన్సరీల్లో ఒక్కో డాక్టర్ పోస్టును, మరో ఎనిమిది డిస్పెన్స రీలకు ఇద్దరు డాక్టర్ల చొప్పున పోస్టులు మంజూ రు చేసింది. కొత్త డిస్పెన్సరీలను మంచిర్యాల, ఖమ్మం, అదిలాబాద్, హన్మకొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కార్మిక శాఖ చర్యలు వేగవంతం చేసింది. బుధవారం ఆదర్శ్ నగర్‌లోని ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్. మల్లారెడ్డి ఆధ్వర్యంలో రీజనల్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామగుండం, శంషాబాద్‌లో వంద పడకల ఆస్ప త్రులను కేంద్రం మంజూరు చేయగా... వీటి ఏర్పా టుకు సంబంధించిన అనుమతులను ఈఎస్ఐ కార్పొ రేషన్ జారీ చేసిందని చెప్పారు. శంషాబాద్ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎక రాల స్థలాన్ని కేటాయించినట్లు వివరించారు. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ పరికరాల ఏర్పాటుకు కార్పొరే షన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. వీటిని అతి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 71 డిస్పెన్సరీలు ఉన్నాయని, మరిన్ని కొత్త డిస్పెన్స రీల ఏర్పాటుకు ప్రతిపాద నలు రూపొందించా లని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఈఎస్ఐ సేవలు విస్తృతం చేసేందుకు కార్పొరేట్ ఆస్పత్రు లను ఎంప్యానల్ చేసి సర్వీసులు అందించేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, ఈఎస్ఐసీ ప్రాంతీయ సంచాలకులు రేణుక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇస్కాన్ సేవలు అభినందనీయం
మేడ్చల్: ఇస్కాన్ దేశ విదేశాల్లో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు. మండలంలోని డబీల్‌పూర్ ఇస్కాన్ ఆలయంలో ఆదివారం నిర్వహించిన మహాసుదర్శన నారసింహ హోమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ గా కాకుండా సామాన్య భక్తురాలిగా వచ్చానని మేడ్చల్ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అనందంగా ఉందన్నారు. ఇస్కాన్ సంస్థ ప్రజల కోసం ధార్మిక కార్యక్రమాలతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. మంత్రి మల్లారెడ్డి పూజలు.. కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొ ని పూజలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ మధ్య ప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, కాంగ్రెస్ నాయకుడు హరివర్ధన్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అదో చిన్న సమస్య..పెద్దది చేయొద్దు: మంత్రి మల్లారెడ్డి
కంటోన్మెంట్ (హైదరాబాద్): తనపై ఐదుగురు ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణల పట్ల మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ అదో చిన్న సమస్యని..దయచేసి పెద్దది చేయవద్దని కోరారు. మంగళవారం ఉదయం బోయిన్‌పల్లిలోని మంత్రి నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. తామంతా ఒకటే కుటుంబమని, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న సమస్యలుంటాయని, మీడియా కూడా దీన్ని పెద్దగా చిత్రీకరించవద్దని వేడుకున్నారు. ఈ సమస్యను మా ఫ్యామిలీ (పార్టీ) పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటామన్నారు. అనంతరం మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు. చదవండి: ఆది నుంచి వివాదాస్పదమే!.. తాజాగా మరోవివాదంలో.. -
Malla Reddy: ఆది నుంచి వివాదాస్పదమే!.. తాజాగా మరోవివాదంలో..
సాక్షి, మేడ్చల్‌జిల్లా: మంత్రి మల్లారెడ్డి టీఆర్ఎస్లో ఆది నుంచి వివాదస్పద ఎమ్మెల్యేగా వార్తల్లోకి ఎక్కటం చర్చనీయాంశంగా మారుతోంది. విపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా పలు విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం. తాజాగా జిల్లాకు చెందిన ఐదుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మరో వివాదంలో చిక్కుకున్నారు. ►జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో సొంత నియోజకవర్గమైన మేడ్చల్‌కు పెద్దపీట వేస్తూ మిగతా నియోజకవర్గాలను విస్మరిస్తున్నారనేది సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రధాన ఆరోపణ. అలాగే పార్టీలో జిల్లా అధ్యక్షుడితో కలిసి గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీ పరువును బజారుకు ఈడ్చుతున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ►జయాపజయాలు ఏదైనా కాని తత్తరపాటు వ్యవహారంతో వివాదాల వరకు తొంగి చూసి.. అదే రీతిలో సమర్థించుకోవటంలోనూ మంత్రి మల్లారెడ్డి దిట్ట. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకోవటం మొదలుకొని మంత్రి పదవిని సాధించటం వరకు ఆయన వేసిన వ్యూహాలు ఫలించాయి. ►స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుకొని సహకార సంఘాలు, మున్సిపల్ ఎన్నికల వరకు మంత్రి పలు వివాదాలకు నెలవయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపు.. కొన్ని పురపాలక సంఘాల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పలు పంచాయతీల్లో సర్పంచులు, ఉపసర్పంచ్ అభ్యర్థుల ఖరారు వరకు పలు వివాదాలను మంత్రి మల్లారెడ్డి అధిగమించారు. టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలను సైతం మంత్రి సొంత పార్టీతో సహా విపక్షాల నుంచి మూట గట్టుకున్నారు. కో–ఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇటీవల తన విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరిగినప్పుడు కొత్త వివాదంలో చిక్కున్న మంత్రి ఏ విధంగా బయట పడతారని భావిస్తున్న బీఆర్ఎస్ పెద్దలకు తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో మంత్రి మల్లారెడ్డి పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారు. నామినేటెట్ పదవుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాహాటంగా విమర్శలు ఎదర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తాడోపెడో తెల్చుకుంటామని ఎమ్మెల్యేలు హెచ్చరించటం వివాదాస్పదంగా మారింది. భూ వివాదాల్లోనూ... అలాగే జిల్లాలో పలు భూ వివాదాల్లో కూడా మంత్రి పలు ఆరోపణలను మూటగట్టుకుని వివాదంలో చిక్కుకున్న దాఖలాలు ఉన్నాయి. 2019లో మంత్రి అయ్యాక మేడ్చల్, జవహర్‌నగర్, శామీర్‌పేట, ఘట్కేసర్, బోడుప్పల్, పీర్జాదిగూడ సహా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని ఊళ్లలోనూ భూముల కొనుగోళ్లలో పలు వివాదాలను ఎదుర్కొన్నారు. వివాదాల నడుమ ఉన్న భూములను గుర్తించి, ఇరు వర్గాలను ఒప్పించి ఆయా స్థలాలను తనకు విక్రయించేలా చేయడంలో సిద్ధహస్తుడనే పేరు ఆయనకు ఉంది. మూడు చింతలపల్లి పరిధిలో ఈ తరహాలో భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ఏడాదిన్నరలో బీజేపీ పీడ విరగడవుద్ది
వనపర్తి: ఎనిమిదిన్నర ఏళ్లుగా దేశ ప్రజలకు పట్టిన బీజేపీ శని మరో ఏడాదిన్నరలో విరగడవుద్దని, దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ సత్తువ కోల్పోయిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనల శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దగూడెం శివారులో జ్యోతిబాపూలే బీసీ వ్యవసాయ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, జిల్లా కేంద్రంలోని నర్సింగాయపల్లి శివారులో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల భవనాల ప్రారంభోత్సవంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ‘రానున్న సాధారణ ఎన్నికల్లో బీఎస్ఆర్ కేంద్రంలో అధికారంలోకి రావాలని జోగుళాంబ అమ్మవారిని మొక్కి వచ్చాను. ధరలు పెంచి.. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న బీజేపీకి పాలించే అర్హత లేదు’అని అన్నారు. నిరంజన్‌రెడ్డి సీఎంకు చాలా దగ్గరుంటడు.. ఏది కావాలన్నా ఈయనకు ఇస్తడు.. అందుకే చిన్నదైన వనపర్తి జిల్లాను ఇంతగా అభివృద్ధి చేశారన్నారు. అంతకుముందు నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు సమాన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పదులసంఖ్యలో ఉన్న గురుకులాలను వంద సంఖ్యలోకి మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని సబిత చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని కమలాకర్ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జ్యోతిబాపూలే గురుకులాల రాష్ట్రకార్యదర్శి మల్లయ్యభట్టు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
-
మంత్రి మల్లారెడ్డిపై ఆ నలుగురి ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ ఎమ్మెల్యే, తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలు ఈ మేరకు సోమవారం భేటీ అయినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి వైఖరిపై రగిలిపోతున్నారు ఆ నలుగురు.. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని యత్నిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, జిల్లా పదవులన్నీ తీసుకెళ్లిపోయారని ఆ నలుగురు మండిపడుతున్నారు. ఈ మేరకు ఉప్పల్, కూకట్పల్లి, శేరిలింగం పల్లి ఎమ్మెల్యేలు.. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో భేటీ అయ్యారు. మల్లారెడ్డిపై అసమ్మతితోనే ఈ భేటీ నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. నామినేటెడ్ పోస్టులు మల్లారెడ్డికి సంబంధించిన అనుచరణ గణానికే ఇప్పించుకుంటున్నారని, మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ పోస్టుపై విషయంలో వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పోస్టులు ఒకే నియోజకవర్గానికి వెళ్లిపోయాయి. జిల్లా పదవులన్నీ మంత్రి తీసుకెళ్లారు. మంత్రి మల్లారెడ్డి మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ప్రభుత్వం, పార్టీ తీరుపై కాకుండా.. కేవలం మంత్రి మల్లారెడ్డి అంశంలోనే వాళ్లంతా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి మల్లారెడ్డి జోగులాంబ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిపై ఆయన స్పందించాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో మల్లారెడ్డి అంశంపై పంచాయితీని మంత్రి కేటీఆర్ దగ్గరకు తీసుకెళ్లాలని ఆ నలుగురు భావిస్తున్నారు. -
మెడికల్ విద్యార్థులకు మంత్రి మల్లారెడ్డి క్షమాపణలు
-
తెలంగాణ: మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మల్లారెడ్డి సంస్థల అధినేత, తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో కొన్ని సాధించాలంటే కొన్నింటికి దూరంగా ఉండాలంటూ విద్యార్థులను ఉద్దేశించి హితబోధ చేశారు. ఐడీ రైడ్ చేశారు. నేను భయపడలేదు. నాలుగు వందల మంది వచ్చారు. వాళ్ల పని వాళ్లు చేసుకున్నారు. నేనేం క్యాసినో నడిపించడం లేదు. కాలేజీలు నడిపిస్తున్నా. అయినా కొందరు బ్లాక్ మెయిలర్స్ ఇబ్బంది పెట్టారు అని కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారాయన. అంతేకాదు.. మెడకిల్ కాలేజీల్లో డొనేషన్లు లేవు. ఆన్లైన్ అడ్మిషన్లే. నా కొడుకు సీటు కావాలన్న నేను ఇవ్వలేదు. భూమి అమ్మి కొడుకును ఎంబీబీఎస్ చేయించా. కొన్ని సాధించాలంటే కొన్నింటికి దూరంగా ఉండాలి. ప్రేమ దోమ పక్కనపెట్టి కష్టపడి చదవాలి. ప్రేమ, ఫ్రెండ్షిప్ అన్నింటికీ దూరంగా ఉంటేనే సక్సెస్ అంటూ హితబోధ చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారాయి. సక్సెస్ కోసం కష్టపడితే.. లైఫ్ పార్ట్నర్లు వాళ్లే వెతుక్కుంటూ వస్తారని విద్యార్థులకు మల్లారెడ్డి తెలిపారు. కల కన్నాను దాన్ని నిజం చేసుకున్నాను నా అంత అదృష్టవంతుడు ఎవడు లేడని మల్లారెడ్డి అన్నారు. ఆపై.. తన కొడుకుని తమ కులం అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేస్తే.. పార్టీలు, పిక్నిక్లు అంటూ తిరిగేది. అలా కాలేదు కాబట్టే ఇవాళ తన కోడలు నా మెడికల్ ఇనిస్టిట్యూట్‌కు ఎండీ అయ్యింది. మీరు కూడా అలా కష్టపడి చదివితేనే పైకి వస్తారు అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
పెళ్లినాటికి నాకు సైకిల్, రెండు గేదెలే... కానీ, ఇప్పుడు
హుడాకాంప్లెక్స్(రంగారెడ్డి జిల్లా): ‘నా పెళ్లి(1976) నాటికి సైకిల్, రెండు పశువులు మాత్రమే ఉండె. కానీ, ఇప్పుడు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి. అతిపెద్ద విద్యాసంస్థలు స్థాపించా. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యా’ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్పోను శనివా రం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తాను ఎంతో కష్టపడ్డానని, అనేక వ్యాపారాలు చేసి, ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగానని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశానని చెప్పారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రపంచ నగరాలకు దీటుగా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి చెప్పారు. అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందుచూపుతో నగరం నలమూలలా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా రియల్ఎస్టేట్ రంగం కుదేలైనా హైదరాబాద్‌లో మాత్రం శరవేగంగా దూసుకుపోతోందని, ప్రభుత్వం ఈ రంగానికి ప్రోత్సాహకాలు అందజేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. బెంగళూరు కాదు, హైదరాబాదే.. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు గుర్తుకొ చ్చేదని, కానీ ఇప్పుడు కేటీఆర్ చొరవతో హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిందని, ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి ముఖ్య కార్యాలయాలు ఇక్కడే కొలువుదీరాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్బీ నగర్లో చేపట్టిన అభివృద్ధి వల్ల ఈస్ట్‌జోన్ వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుందని తెలిపారు. నాగోలు నుంచి గండిపేట వరకు మూసీకి ఇరువైపులా రూ.1,370 కోట్ల వ్య యంతో 120 అడుగుల రోడ్డు నిర్మించేందు కు ప్రణాళికలు రూపొందించామని చెప్పా రు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఫిర్జాదిగూడ, బోడుప్పల్ మేయర్లు వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు. -
Malla Reddy: రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు?
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి ఇంటిపై జరిగిన ఐటీ సోదాలకు సంబంధించి ఆ శాఖ అధికారులు మంగళవారం రెండోరోజు కూడా విచారణ కొనసాగించారు. మల్లారెడ్డి ఆడిటర్‌తోపాటు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు. వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునే సమయంలో ఫీజులు, డొనేషన్లను ఏ రూపంలో తీసుకుంటున్నారు? ఎంత తీసుకుంటున్నారు? ఎన్నిరకాల ఫీజులు వసూలు చేస్తున్నారంటూ అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సోదాల్లో లభించిన కీలక పత్రాలు, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాల ఆధారంగా ఆడిటర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కళాశాలలకు మొత్తం ఎన్ని ఖాతాలున్నాయని, ఏ కళాశాలకు ఏయే బ్యాంకుల్లో ఖాతా లున్నాయని కూడా ప్రశ్నించారు. డొనేషన్ల రూపంలో వసూలు చేసిన వందకోట్ల నిధులను ఎక్కడ డిపాజిట్ చేశారన్న దానిపైనా ప్రశ్నించినట్లు తెలిసింది. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు కట్టించుకుని తక్కువ ఫీజుకు రశీదులు ఇస్తున్నట్లు అధికారుల దృష్టికి వచి్చన నేపథ్యంలో దానిపైనా ఆరా తీశారు. చదవండి: తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు: సుప్రీం వ్యాఖ్య -
మల్లారెడ్డి ఆదాయాలపై ఐటీ విచారణ: 13 మంది హాజరు.. మరో 10 మందికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థల ఆదాయం, పన్నుల చెల్లింపులకు సంబంధించి ఈ నెల 22, 23 తేదీల్లో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలపై విచారణ ప్రారంభమైంది. అధికారులు మరో పదిమందికి నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి విద్యాసంస్థలు, ఆయన బంధువుల ఇళ్లు, ఓ సహకార బ్యాంకు చైర్మన్ ఇంటిపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో కోట్లాది రూపాయల నగదు స్వాధీనంతోపాటు పలు కీలకపత్రాలు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు అకౌంట్లు, లాకర్లను పరిశీలించిన విషయం తెలిసిందే. మంత్రి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, సోదరుడు గోపాల్‌రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డి, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్లు, కొందరు ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను మొత్తం 13 మందిని ఐటీ అధికారులు బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయంలో దాదాపు ఆరు గంటలపాటు ప్రశ్నించారు. వైద్య కళాశాలల్లో డోనేషన్ల పేరుతో సుమారు వందకోట్ల రూపాయలు వసూలు చేసిన అంశానికి సంబంధించి ప్రధానంగా ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు, వస్తున్న ఆదాయానికి చెల్లించిన పన్ను మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి వాటిపై ప్రశ్నించారు. సొసైటీ పేరిట ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకుంటూ, విద్యార్థుల నుంచి నిర్దేశిత ఫీజుల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసిన అంశంపై అధికారులకు లభించిన ఆధారాలను వారి ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు. సోదాల్లో లభించిన అంశాలపై విడతలవారీగా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఐటీ సోదాలు జరిగిన సమయంలో ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన మహేందర్‌రెడ్డి కానీ, మంత్రి మల్లారెడ్డి కానీ సోమవారంనాటి విచారణలో లేరు. మంగళవారం మంత్రి మల్లారెడ్డి తరఫున ఆయన ఆడిటర్‌తోపాటు మరికొంతమంది విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చేవరకు వారిని ప్రశ్నించనున్నట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాం: రాజశేఖర్ రెడ్డి, భద్రారెడ్డి ఆదాయపన్ను శాఖ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు సోమవారం తాము, తమ సంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లు విచారణకు హాజరైనట్లు మర్రి రాజశేఖర్‌రెడ్డి, భద్రారెడ్డి విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సోదాల్లో స్వా«దీనం చేసుకున్న పలు పత్రాలకు సంబంధించి ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చామన్నారు. కాల్‌డేటాను ఓ క్రమపద్ధతిలో ఇవ్వాలని కోరగా సరేనని చెప్పామని భద్రారెడ్డి వివరించారు. కాగా, మరో పదిమందికి ఐటీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. చదవండి: టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్ -
నేడు ఐటీ అధికారుల ఎదుట హాజరుకానున్న మంత్రి మల్లారెడ్డి
-
Malla Reddy: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, భాగస్వాములపై జరిగిన ఐటీ దాడుల అంశంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సీఎండీ రత్నాకర్ పంచనామాపై తన అన్న మహేందర్‌రెడ్డితో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రత్నాకర్ కూడా ఫిర్యాదు చేశారు. మంత్రి తన విధులు అడ్డుకోవడంతో పాటు కీలక పత్రాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం దుండిగల్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. నా అన్నను బెదిరించారు.. మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి ఐటీ సోదాల నేపథ్యంలో అస్వస్థతకు గురై మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం రాత్రితో మహేందర్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు పూర్తి చేసిన అధికారులు దానికి సంబంధించిన పంచనామా రూపొందించారు. దీనిపై సంతకం చేయించుకోవడానికి డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే గుండె నొప్పితో చికిత్స పొందుతున్న తన అన్న మహేందర్‌రెడ్డిని బెదిరించి, బలవంతంగా వాటిపై సంతకాలు తీసుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి సొసైటీల అధ్యక్షుడు భద్రారెడ్డి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రత్నాకర్‌పై ఐపీసీలోని 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రూ.100 కోట్ల డొనేషన్లకు సంబంధిత పత్రాలపై కూడా ఐటీ అధికారులు మహేందర్‌రెడ్డి సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. కాగా తమ వద్ద రూ.100 కోట్లు లేవని, మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్ ఎలా ఇస్తారని మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. చదవండి: Hyderabad: ట్రాఫిక్ చిక్కులకు చెక్.. ఐటీ కారిడార్‌లో ఇక రయ్ రయ్! ల్యాప్‌టాప్, హార్డ్‌డ్రైవ్‌లు ఉన్న బ్యాగులు దొంగిలించారు.. ఇలావుండగా.. తాను పంచనామాపై సంతకం చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడకు తన అనుచరులతో కలిసి వచ్చిన మంత్రి మల్లారెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారంటూ రత్నాకర్ గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచనామా సహా కొన్ని పత్రాలు చించేశారని, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించారని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్, హార్డ్ డ్రైవ్స్‌తో ఉన్న తన రెండు బ్యాగులు కూడా దొంగిలించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బోయిన్పల్లి పోలీసులు మల్లారెడ్డి తదితరులపై ఐపీసీలోని 342, 353, 201, 504, 506, 379 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఉదంతాలు చోటు చేసుకున్న మల్లారెడ్డి ఆస్పత్రి దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆ ఠాణాకు బదిలీ చేశారు. ఠాణా గేటు వద్ద ప్రత్యక్షమైన ల్యాప్‌టాప్! ఈ 2 కేసులు నమోదైన కొద్దిసేపటికే ఓ ల్యాప్‌టాప్ నాటకీయంగా బోయిన్పల్లి పోలీసుస్టేషన్ వద్ద ప్రత్యక్షమైంది. రత్నాకర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయన ల్యాప్‌టాప్ సహా ఇతర వస్తువులు మల్లారెడ్డి ఇంట్లో ఉన్నాయా? ఎవరైనా తీసుకున్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో ఓ ల్యాప్‌టాప్ బోయిన్పల్లి పోలీసుస్టేషన్ గేటు వద్ద ప్రహరీని ఆనుకుని ఉండటం కానిస్టేబుళ్ల కంటపడింది. దీంతో వారు దాన్ని రత్నాకర్‌కు చూపించగా.. ఆ ల్యాప్‌టాప్ తనది కాదని, దాన్ని ఎవరో మార్చేశారని అన్నారు. దీంతో దాని పంచనామా నిర్వహించిన సిబ్బంది దుండిగల్ పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు. -
మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. ఆ లాకర్స్‌లో ఏమున్నాయి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, భాగస్వాములపై ఐటీ దాడులు రాజకీయంగా సంచలనంగా మారింది. దాడుల సందర్భంగా మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో రూ.18.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ఆస్తులకు సంబంధించి పలు కీలక పత్రాలు, భారీ ఎత్తున ప్రాపర్టీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని లాకర్లను ఐటీ శాఖ అధికారులు తెరవనున్నారు. ఇక, దాడుల నేపథ్యంలో తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 28, 29 తేదీల్లో ఐటీ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు. చదవండి: (IT Raids: మల్లారెడ్డికి మరో షాకిచ్చిన ఐటీ అధికారులు!) -
IT Raids: మల్లారెడ్డికి మరో షాకిచ్చిన ఐటీ అధికారులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు రాజకీయంగా సంచలనంగా మారింది. కాగా, ఐటీ దాడుల సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి రైడ్‌ను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంతమంది సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. మేము దొంగలమా? ఇంత అరాచకమా? అంటూ కామెంట్స్ చేశారు. ఇక, దాడుల నేపథ్యంలో తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 28, 29 తేదీల్లో ఐటీ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు. ఇక, నోటీసులు ఇచ్చిన వారిలో మల్లారెడ్డి సోదరులు, కుమారులు, అల్లుడు, సన్నిహితులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. మరోవైపు.. ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే విద్యా సంస్థల్లో(ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ) డొనేషన్లపై ఐటీ అధికారులు ఆరా తీయనున్నారు. -
మేం తప్పుడు పనులు చేయలేదు
-
మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఇలాంటి రైడ్స్ నా జీవితంలో చూడలేదు
సాక్షి, హైదరాబాద్: సోదాల సందర్భంగా విధులకు ఆటంకం కలిగించారన్న ఐటీ అధికారుల వ్యాఖ్యలపై తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తాను సంతకం చేసిన తర్వాతే అధికారులు బయటకు వెళ్లారని.. ఎవరి విధులకు అడ్డుపడలేదని చెప్పారు. వందకోట్లు బ్లాక్‌మనీ ఉన్నట్లు రాసి నా కొడుకుతో బలవంతంగా సంతకం చేయించారని ఆరోపించారు. కొడుకు సంతకం పెట్టిన ఫైల్స్ చూపించడం లేదన్నారు. ఇలాంటి రైడ్‌ను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంతమంది సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. 'తప్పులు చూపిస్తే ఫైన్ కడతాం.. మేము దొంగలమా? ఇంత అరాచకమా?. నాకొడుకును ఆస్పత్రిలో చేర్చినట్లు కూడా మాకు చెప్పలేదు. ఇంకా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై రైడ్స్ ఉంటాయి. ఎన్నిరైడ్స్ జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం' అని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మల్లారెడ్డిపై కేసు నమోదు అంతకుముందు, మల్లారెడ్డిపై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఐటీ అధికారి ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్తో ఈ కేసును దుండిగల్ పీఎస్‌కు బదిలీ చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని ఐటీ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో 342, 353, 201, 203, 504, 506, 353, 379 రెడ్‌విత్ R/W 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐటీ అధికారులపై భద్రారెడ్డి ఫిర్యాదు ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తమపై ఐటీ అధికారులు దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. దీంతో ఐటీ అధికారులపై 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: (మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’) -
ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి అల్లుడు రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. టర్కీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన.. ఐటీ దాడులపై స్పందించారు. తమ ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్లు లేవని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టారన్నారు. పథకం ప్రకారమే దాడులు చేశారన్నారు. కాగా, మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్ చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. చదవండి: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ -
కుట్రతోనే బీజేపీ దాడులు చేస్తోంది
-
ఏకధాటిగా ఐటీ దాడులు.. స్పందించిన మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బలగాలతో తమపై పెద్ద ఎత్తున దాడులు చేశారని మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తన పేరు ప్రతిష్టలు డ్యామేజ్ చేయాలనే దాడులు చేశారని ఆరోపించారు. తమనే కాదు, సీఎం కేసీఆర్‌ను కూడా ఏమీ చేయలేరని అన్నారు. ఈ విషయం కేసీఆరా్ ముందే చెప్పారన్నారు. తాము ఎంతో మంది పేద విద్యార్థులకు చదవు చెప్పించామని మల్లారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తమపై మూడు సార్లు ఐటీ దాడులు జరిగాయని.. కానీ ఇంత దౌర్జన్యం జీవితంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ‘ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. నా సంస్థలు ఓపెన్ బుక్.. నాది హై థింకింగ్, లో ప్రొఫైల్. కొడుకు, కోడలు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పిన నన్ను విడిచిపెట్టలేదు. నా కొడుకుతో దౌర్జన్యంగా సంతకం చేయించుకున్నారు. రూ. 6లక్షలు దొరికితే అక్కడే విడిచిపెట్టిపోయారు. ఇప్పటి నుంచి విచారణకు రావాలని వేధిస్తారు. సంబంధిత వార్త: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ మెడికల్ సీట్లు అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయంటున్నారు. మెడికల్ కాలేజీ డొనేషన్స్‌లో డబ్బులు గుంజుకున్నారని ఆరోపిస్తున్నారు. మెడికల్ సీట్లకు డొనేషన్ తీసుకోవట్లేదు. ఎంబీబీఎస్‌లో మెనేజ్మెంట్ కోటా లేదు. వివిధ క్యాటగిరీలతో అన్నీ కౌన్సిలింగ్ సీట్లే. అంతా ఆన్లైన్లోనే, కౌన్సిలింగ్‌లోనే జరుగుతుంది. మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్లు ఎలా వస్తాయి? వందల కోట్లు ఎలా వస్తాయి?. నా కొడుకు ఎంబీబీఎస్ చదవాలన్న డొనేషన్‌తో నా కాలేజీలో సీటు ఇప్పించలేను. మేము తీసుకుంటే డబ్బులు దొరకాలి కదా. మా ఇంట్లో, కొడుకులు, అల్లుడు, మా కళాశాల, ప్రొఫెసర్, టీచర్, క్లర్స్, ఇళ్లలో చేసిన సోదాలో 28 లక్షలు దొరికాయి’ అని తెలిపారు. చదవండి: మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? -
మా ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్లు లేవు : మర్రి రాజశేఖర్ రెడ్డి
-
మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’
సాక్షి, హైదరాబాద్: ఐటీ సోదాల్లో రూ.100 కోట్ల వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో కోట్లు డొనేషన్లు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 100 కోట్ల డొనేషన్ల పంచనామాపై ఐటీ అధికారులు సంతకం తీసుకున్నారు. సోమవారం ఐటీ విచారణకు హాజరుకావాలని మంత్రి మల్లారెడ్డి సహా, ఆయన కుమారులు, అల్లుడికి ఐటీ నోటీసులు జారీ చేసింది. ఇంజనీరింగ్ కాలేజీలో మూడు సంవత్సరాల్లో 100 కోట్లు డొనేషన్ల పేరుతో వసూలు చేయించారని మహేందర్ రెడ్డితో ఐటీ సంతకం తీసుకుంది. తన కొడుకుతో బలవంతంగా సంతకం పెట్టించారని ఐటీ అధికారులతో మల్లారెడ్డి వాదనకు దిగారు. ఇష్టం వచ్చినట్లు కోట్ల రూపాయల డొనేషన్లు పేరు చెప్పి సంతకాలు పెట్టించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తమ కాలేజీలో జరిగే ప్రతి లావాదేవీలకు లెక్కలు ఉంటాయని మంత్రి చెబుతున్నారు. కాగా, మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్ చేశారు. చదవండి: అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. అసలేం జరిగింది? -
అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. కాగా, అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్ టాప్‌పై హైడ్రామా చోటుచేసుకుంది. మొదట ఆసుపత్రిలో ఐటీ అధికారి రత్నాకర్ ల్యాప్‌టాప్ వదిలివెళ్లారు. రత్నాకర్‌ను బోయిన్పల్లి పీఎస్‌కు మంత్రి మల్లా రెడ్డి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో ఉండిపోయిన ల్యాప్‌టాప్‌ను మల్లా రెడ్డి అనుచరులు పీఎస్‌కు తీసుకుని వచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్‌ను కేంద్ర బలగాలు తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ల్యాప్‌టాప్‌ను లోపలికి తీసుకెళ్లేందుకు మల్లారెడ్డి అనుచరులు ప్రయత్నించారు. బోయినపల్లికి చెందిన కానిస్టేబుల్.. ల్యాప్‌టాప్‌ను లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్‌ను అడ్డుకున్న కేంద్ర బలగాలు.. ల్యాప్‌టాప్‌ను బయటే పెట్టించాయి. బోయినపల్లి పీఎస్ గేటు ముందే ల్యాప్‌టాప్‌ను మంత్రి అనుచరులు వదిలి వెళ్లారు. మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్‌ను కేంద్ర బలగాలు ఖాళీ చేశాయి. కేంద్ర బలగాలు వెళ్లిన తర్వాత ల్యాప్‌టాప్‌ను బోయినపల్లి పీఎస్ లోపలికి పోలీసులు తీసుకెళ్లారు. ప్రస్తుతం బోయినపల్లి పీఎస్‌లోనే ల్యాప్‌టాప్ ఉంది. చదవండి: మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? -
మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే?
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్ చేశారు. సోమవారం ఐటీ ఎదుట హాజరు కావాలంటూ మల్లారెడ్డి సహా, కుమారులు, అల్లుడికి అధికారులు నోటీసులు ఇచ్చారు. కాగా, తాను లేని సమయంలో తన కుమారుడితో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి సంతకం చేయించుకున్నారని బోయినపల్లి పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు. హాస్పిటల్లో ఉన్న తన కొడుకుతో బలవంతంగా సంతకం చేపించుకుంటున్నారని, ఇండ్లల్లో చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘వీళ్లు ఐటీ అధికారులు కాదు.. రక్త పిశాచులు.. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా రాస్తున్నారు. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. గందరగోళంగా రైడ్స్ చేసారు. మా దగ్గర ఎటువంటి డబ్బు దొరకలేదు. మెడికల్ కాలేజీకి సంబంధించి అన్ని అబద్ధాలు రాశారని’’ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. చదవండి: మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాలు.. అర్ధరాత్రి హైడ్రామా -
వీళ్లు ఐటీ అధికారులు కాదు.. రక్త పిశాచులు : మల్లారెడ్డి
-
మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాలు.. అర్ధరాత్రి హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. కుమారులు ఇళ్లు, బంధువులు ఇళ్లు, కార్యాలయాలు, సోదరులు ఇళ్లలో కూడా తనిఖీలు ముగిశాయి. రెండు రోజుల పాటు 65 బృందాలతో 48 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో 10.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు ముగియడంతో పంచనామా రిపోర్ట్‌ను అధికారులు మంత్రికి ఇచ్చారు. సోమవారం ఐటీ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. మరోవైపు.. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. టర్కీ నుంచి హైదరాబాద్‌కు ఆయన వస్తున్నారు. కాగా, మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాల్లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. తన పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డితో ఐటీ అధికారులు బలవంతంగా సంతకం చేయించుకున్నారంటున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. లేనివి ఉన్నట్లు రాయించుకుని సంతకం చేసుకున్నారని ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి.. గన్ మాన్ సెక్యూరిటీ లేకుండా కేవలం డ్రైవర్‌తో మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్‌కి చేరుకున్నారు. తాను లేని సమయంలో తన కుమారుడితో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి సంతకం చేయించుకున్నారని బోయినపల్లి పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు. హాస్పిటల్లో ఉన్న తన కొడుకుతో బలవంతంగా సంతకం చేపించుకుంటున్నారని, ఇండ్లల్లో చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘వీళ్లు ఐటీ అధికారులు కాదు.. రక్త పిశాచులు.. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా రాస్తున్నారు. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. గందరగోళంగా రైడ్స్ చేసారు. మా దగ్గర ఎటువంటి డబ్బు దొరకలేదు. మెడికల్ కాలేజీకి సంబంధించి అన్ని అబద్ధాలు రాశారని’’ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. చదవండి: Telangana: సోదాలు, దాడుల కాలమిది! -
Telangana: సోదాలు, దాడుల కాలమిది!
తెలంగాణాలో రాజకీయ సమరం ప్రస్తుతం దర్యాప్తు సంస్థల రూపంలో సాగుతోంది. రాష్ట్ర పోలీసులు బీజేపీ పెద్ద నేతలలో ఒకరైన బీఎల్ సంతోష్‌కు విచారణ నిమిత్తం రావాలని నోటీసు పంపితే, కేంద్ర ఆదాయ పన్నుశాఖ రాష్ట్రమంత్రి మల్లారెడ్డి ఇంటిలోనూ, ఆయనకు సంబంధించిన వారి ఇళ్లు, ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించింది. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏ మలుపు తీసుకుంటుందో అన్న ఆలోచన అందరి మదిలో ఉన్న సమయంలో మల్లారెడ్డిపై దాడి జరగడం విశేషం. కింది స్థాయి నుంచి పైకి ఎదిగి, ఇప్పుడు యూనివర్శిటీ, మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల స్థాపనతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మల్లారెడ్డి వివాదాలకు అతీతుడేమీ కాదు. ఆయన రాజకీయాల్లోకి ఒకందుకు వస్తే, అది ఇప్పుడు మరొకందుకా అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. అలా ఎదిగారు.. ఇలా చిక్కారు.! 2014లో మల్లారెడ్డి తెలుగుదేశం టిక్కెట్ సంపాదించి మల్కాజిగిరి నుంచి పోటీ చేసినప్పుడే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా గుర్తింపు పొందారు. పక్కా తెలంగాణ యాస, భాషలో మాట్లాడే మల్లారెడ్డి తన వ్యవహార శైలితో భిన్నంగా కనిపిస్తారు. అప్పట్లో టీడీపీలోనే ఉన్న రేవంత్ రెడ్డి కూడా మల్కాజిగిరి టిక్కెట్ ఆశించారు. కానీ, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం మల్లారెడ్డి వైపు మొగ్గు చూపారు. దానికి కారణం మల్లారెడ్డి టీడీపీకి భారీగా నిధులు సమకూర్చడమేనని రేవంత్ ఆరోపించేవారు. దీనిపై పార్టీలో పంచాయితీ కూడా జరిగింది. ఆనాటి రాజకీయ పరిణామాలు కలిసి వచ్చి మల్లారెడ్డి ఎంపీ అయ్యారు. తదుపరి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చిక్కుకుని రాత్రికి రాత్రి పెట్టేబేడ సర్దుకుని విజయవాడ వెళ్లిపోవడంతో మొత్తం రాజకీయం టీఆర్ఎస్ కంట్రోల్లోకి వెళ్లింది. టీడీపీ ఎమ్మెల్యేలు పలువురిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకర్షించారు. ఆ క్రమంలోనే మల్లారెడ్డిని కూడా పార్టీలోకి తీసుకువచ్చారు. తదుపరి శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి టీఆర్ఎస్ పక్షాన పోటీచేసి భారీ విజయం సాధించారు. ఆ వెంటనే రాష్ట్ర మంత్రి కూడా అయిపోయారు. సోదాలకు, రాజకీయాలకు లింకు? మల్లారెడ్డి మాటకారితనంతో పాటు, ఆయన ఆర్ధిక స్థోమత కూడా ఇందుకు బాగా ఉపయోగపడిందని నియోజకవర్గ ప్రజలు భావిస్తారు. అప్పటి నుంచి ఆయా సందర్భాలలో మల్లారెడ్డి వార్తలలోకి ఎక్కారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బహిరంగంగా మద్యం తీసుకుంటూ, దానిని సమర్ధిస్తూ మాట్లాడిన వైనం ప్రముఖంగా ప్రచారం అయింది. ఇప్పుడు ఐటీ దాడుల ద్వారా ఆయన వార్తల్లోని వ్యక్తి అయ్యారు. సాధారణంగా ఐటీ దాడులు జరిగితే పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. అన్నిచోట్ల జరిగినట్లే సోదాలు జరిపి, డబ్బు ఏమైనా దొరికినా, పన్నులు సరిగా కట్టలేదని తేలినా అధికారులు నోటీసులు ఇచ్చి వివరణ కోరి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారు. ఇది రొటీన్ వ్యవహారం. కానీ.. మల్లారెడ్డి మంత్రి కావడం, ఇటీవలి కాలంలో టీఆర్ఎస్కు, బీజేపీకి మధ్య హోరాహోరీ రాజకీయ యుద్దం సాగుతుండటంతో దాని ప్రభావం మొట్టమొదటగా మల్లారెడ్డిపైన పడినట్లుగా ఉంది. అటు కారు, ఇటు కమలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ తరఫున కొనుగోలు చేసే యత్నం చేశారంటూ ముగ్గురు వ్యక్తులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత ఒక సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును మరీ సీరియస్‌గా మార్చడంతో పరిస్థితి హద్దులు దాటిపోయినట్లుగా ఉంది. ఏకంగా కేంద్ర బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు పోలీసులు నోటీసు ఇవ్వడాన్ని కాషాయ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వెరసి ఐటీ దాడి జరిగిందన్నది అందరి అభిప్రాయంగా ఉంది. ఈ దాడిలో ఏమీ దొరక్కపోతే టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఎదురు దాడి చేసి ఉండేది. కానీ.. మల్లారెడ్డి, ఆయన బంధువుల వద్ద ఎనిమిదిన్నర కోట్ల రూపాయల నగదు దొరకడం కలకలం రేపుతోంది. దీనికి వివరణ ఇచ్చుకోవడం తలకు మించిన పనే అవుతుంది. నోట్ల రద్దు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నోట్లు దొరికితే అది పెద్ద విషయమే అవుతుంది. అందులోను రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందా అనే ఉత్కంఠ ఏర్పడింది. జవాబు లేని ప్రశ్నలెన్నో! మల్లారెడ్డి తన సెల్ ఫోన్ ఎక్కడో ఒక జనప బ్యాగ్‌లో దాచారన్న విమర్శలు సందేహాలకు తావిస్తున్నాయి. మరో బంధువు తన ఇంటి తలుపులు తీయకుండా అడ్డుకోవడం, అధికారులు తలుపులు పగలకొట్టడం వంటి ఘట్టాలు మల్లారెడ్డికి ఇబ్బంది కలిగించేవి. దీనిని టీఆర్ఎస్ సమర్ధించుకోవడం కూడా కష్టమే అవుతుంది. పట్టుబడ్డ కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? మెడికల్ కాలేజీ సీట్లను బ్లాక్‌లో అమ్మడం వల్ల వచ్చాయా? ఇంకేదైనా రూట్లో వచ్చాయా? అన్నదానికి వీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ సమావేశంలో ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే, ఎంత హెచ్చరించినా, ఎవరి మీద ఏ సంస్థ దాడి చేస్తుందో ఊహించడం కష్టమే. అంతేకాక ఎవరిని నమ్మి ఇంత డబ్బు ఎక్కడ పెడతారు?. టీఆర్ఎస్, బీజేపీ గొడవ కాస్తా రాష్ట్ర, కేంద్ర దర్యాప్తు సంస్థల మధ్య రగడగా మారిందా?. బీజేపీని వదిలేదిలేదని కేసీఆర్ చర్యలు చేపడితే, కేసీఆర్‌ను సహించబోమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనడం ఎలాంటి సంకేతాలిస్తున్నాయి?. ఈ ప్రహసనంలో సీఎం కేసీఆర్ ఇబ్బంది పడతారా? లేక ఆయన బీజేపీపై చేయి సాధిస్తారా? అన్నది తేలడానికి మరి ఎక్కువ కాలం పట్టకపోవచ్చేమో! హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు: రఘునందన్ రావు
సాక్షి, హైదరాబాద్: ఐటీ దాడులపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖండించారు. మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. ఈ అంశానికి రాజకీయ కోణాన్ని ఆపాదించడం సరికాదని సూచించారు. చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు. ఏ అధికారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎవరినీ కొట్టరని అన్నారు. ఐటీ అధికారులకు వచ్చిన ఫిర్యాదు ప్రకారమే దాడులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి చేసిన ఆరోపణలు సరైనవి కాదని హితవు పలికారు. మల్లారెడ్డి కొడుకు అస్వస్థతకు గురవ్వడంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండె నొప్పి అంటూ ప్రతి ఒక్కరూ అసుపత్రికి వెళుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఉదయం కూడా వాకింగ్ చేశరు కదా.. నోటీసులు ఇవ్వగానే గుండె నొప్పి వస్తుందా అని ధ్వజమెత్తారు. మల్లారెడ్డి సంస్థల్లో పని చేసే వారే ఐటీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోందని తెలిపారు. సంబంధిత వార్త: ఆస్పత్రి ఎదుట మంత్రి మల్లారెడ్డి ధర్నా.. కుమారుడి ఆరోగ్యంపై డాక్టర్లు ఏం చెప్పారంటే.. మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందని అన్నారు. మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అధికారం అడ్డుపెట్టుకుని తప్పు చేసిన వారే భయపడతారని విమర్శించాఉ. మల్లారెడ్డి ఫైర్ మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సురారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కొడుకును చూసేందుకు వెళ్లిన మంత్రిని సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. దీంతో మల్లారెడ్డి ఆసుపత్రి బయట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తరువాత తిరిగి ఇంటికి వెళ్లారు. తన కొడుకును సీఆర్పీఎఫ్ బలగాలతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపుతోనే ఐటీ దాడులు జరుపుతోందని విమర్శించారు. -
ఆస్పత్రి ఎదుట మంత్రి మల్లారెడ్డి ధర్నా.. కుమారుడి ఆరోగ్యంపై డాక్టర్లు ఏం చెప్పారంటే..
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డికి హైపర్ టెన్షన్ వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే, మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి వద్ద ధర్మాకు దిగారు. తన కొడుకును చూడనివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడిని సీఆర్పీఎఫ్ బలగాలతో కొట్టించారని అన్నారు. తన కుమారుడికి ఏమవుతుందోనని భయంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ సోదాల్లో నగదు, పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి ఇంటివద్ద భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి సోదాలు కొనసాగిస్తున్నారు. చదవండి: (కుమారుడికి అస్వస్థత.. ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం) -
కుమారుడికి అస్వస్థత.. ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఐటీసోదాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష్యతోనే ఈ సోదాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ సోదాల సమయంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి హుటాహుటిన సూరారంలోని ఆస్పత్రికి బయల్దేరి వెళ్లారు. అయితే ఐటీ అధికారులు మల్లారెడ్డిని ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈసందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. నేనేమన్నా దొంగ వ్యాపారాలు చేస్తున్నానా అంటూ ఐటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కొడుకును రాత్రంతా ఇబ్బంది పెట్టారు. నా కొడుకును చూడటానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. నేనేమైనా క్యాసినోలు ఆడిస్తున్నానా అని ప్రశ్నించారు. 200మంది అధికారులను పంపించి దౌర్జన్యం చేస్తున్నారు. బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అంటూ మండిపడ్డారు చదవండి: (మల్లారెడ్డి కుమారుడికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రికి తరలింపు) -
మల్లారెడ్డి కుమారుడికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన కుమారులు, బంధువులు, బిజినెస్ పార్ట్నర్స్ ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి ఐటీ దాడుల సందర్భంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్సను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే, మంత్రి ఇంట్లో ఉండగానే.. కేంద్ర పోలీసు బలగాల పహారాలో ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి. మొత్తం 50 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. చదవండి: (మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం) -
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు నిర్వహిస్తున్న దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా కాలేజీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే, మంత్రి ఇంట్లో ఉండగానే.. కేంద్ర పోలీసు బలగాల పహారాలో ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి. మొత్తం 50 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించిన అధికారులు, రూ.8.8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్ సీట్ల కేటాయింపుల్లో అవకతవకలు, రియల్ ఎస్టేట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు గుర్తించినట్లు సమాచారం. చదవండి: (టార్గెట్ మల్లారెడ్డి.. మంత్రి ఆస్తులు లక్ష్యంగా ఐటీ దాడులు) -
టార్గెట్ మల్లారెడ్డి: రూ.8.8 కోట్ల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/మేడ్చల్/కుత్బుల్లాపూర్: తెలంగాణలో గత రెండు నెలలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐతో పాటు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ వరుసగా నిర్వహిస్తున్న దాడులు సంచలనం కలిగిస్తున్నాయి. మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచే, మంత్రి ఇంట్లో ఉండగానే.. కేంద్ర పోలీసు బలగాల పహారాలో ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి. మొత్తం 50 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించిన అధికారులు, రూ.8.8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్ సీట్ల కేటాయింపుల్లో అవకతవకలు, రియల్ ఎస్టేట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు గుర్తించినట్లు సమాచారం. దాడులు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం కూడా సోదాలు కొనసాగవచ్చని తెలుస్తుండగా.. ఐటీ అధికారుల నుంచి మంగళవారం ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. పన్ను చెల్లింపు, ఎగవేతపై పక్కా సమాచారం! బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి ఇంటి నుంచే దాడులు మొదలయ్యాయి. మంత్రి, ఆయన బంధువులు నిర్వహిస్తున్న పలు విద్యా సంస్థలకు..ముఖ్యంగా మెడికల్ కళాశాలలకు సంబంధించిన ఆదాయం, వాటిపై చెల్లిస్తున్న పన్ను, ఎగవేతకు సంబంధించి అందిన పక్కా సమాచారం మేరకు ఐటీ అధికారులు దాడులకు దిగినట్లు తెలుస్తోంది. మంత్రి నిర్వహిస్తున్న విద్యా సంస్థలు, వారి బంధువుల ఇళ్లను, మంత్రి భాగస్వామిగా ఉన్న విద్యా సంస్థలను జల్లెడ పడుతున్నారు. సోదాల సమయంలో మంత్రి తన మొబైల్‌ఫోన్‌ను తన నివాసం పక్కనే ఉన్న క్వార్టర్స్‌లో జూట్ బ్యాగ్‌లో దాచి పెట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఐటీ అధికారులు ఆ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా అందరి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్న కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, ఇళ్లతో పాటు వియ్యంకుడు లక్ష్మారెడ్డి, బంధువు త్రిశూల్‌రెడ్డి, విద్యా సంస్థల ఖాతాలు ఉన్న బాలానగర్‌లోని క్రాంతి కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావు ఇళ్లల్లోనూ, ప్రధాన విద్యా సంస్థల్లోనూ దాడులు నిర్వహించారు. మెడికల్ సీట్ల కేటాయింపునకు సంబంధించిన అవకతవకలు కూడా గుర్తించినట్లు తెలిసింది. మొత్తం 30 కళాశాలల్లో దాడులు చేసినట్లు సమాచారం. అల్లుని ఇంట్లో రెండు ఎలక్ట్రానిక్ లాకర్లు మంత్రి ఇంటికి సమీపంలోనే సౌజన్య కాలనీలో నివాసం ఉండే అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో ఆయన ఇంట్లో లేరని, టర్కీ దేశ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఆయన ఇంట్లో రెండు ఎలక్ట్రానిక్ లాకర్లను అధికారులు గుర్తించారు. వాటిని తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎంఆర్ కాలేజీలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మంత్రి సోదరుడు గోపాల్‌రెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని ఫామ్ మిడోస్ విల్లాలోని మహేందర్‌రెడ్డి నివాసంలో, వియ్యంకుడు లక్ష్మారెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. కాగా మంత్రి మల్లారెడ్డి ఆర్థిక వ్యవహారాలు చూసే సంతోష్‌రెడ్డి ఇంట్లోనే ఉండి తలుపులు తీయకుండా మొండికేయడంతో, ఐటీ అధికారులు బలవంతంగా ఇంటి ద్వారాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. మల్లారెడ్డికి సంబంధించిన ఆర్థిక సమాచారం మొత్తం ఆయన వద్దనే లభిస్తుందన్న ఉద్దేశంతోనే అధికారులు బలవంతంగా లోపలికి వెళ్లినట్లు సమాచారం. సోదాల సందర్భంగా అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలు, కొన్ని హర్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విద్యాసంస్థల విస్తృత సామ్రాజ్యం! మంత్రి విద్యా సంస్థల సామ్రాజ్యం విస్తుగొల్పేస్థాయిలో ఉండడం గమనార్హం. ఆయనకు మొత్తం 36 ఇంజనీరింగ్ కాలేజీలు, మూడు మెడికల్ కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీ, రెండు అంతర్జాతీయ పాఠశాలలతో పాటు, మరిన్ని విద్యా సంస్థలు, వందల ఎకరాల భూములున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. మంత్రి కుమారులు రియల్ ఎస్టేట్ సంస్థల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల సీట్ల విక్రయంలో పెద్ద ఎత్తున ఆదాయం సమకూరినా.. ఆ మొత్తానికి సంబంధించిన పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు గుర్తించినట్లు తెలిసింది. కాలేజీల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించిన రికార్డుల్లోనూ భారీ వ్యత్యాసాలు బయటపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి మెడికల్ కాలేజీల బ్యాంకు లావాదేవీలను కూడా ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వస్తున్న ఆదాయమెంత.? ఐటీ రిటర్న్ దాఖలు చేసింది ఎంత..? పన్ను ఎగ్గొట్టింది ఎంత.? బినామీ వ్యక్తులపైనున్న ఆస్తులెన్ని.? క్రాంతి కో ఆపరేటివ్ బ్యాంకులో ఉన్న ఖాతాల్లో బినామీ ఖాతాలెన్ని.? అన్న అంశాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. సీఎంఆర్ స్కూల్స్‌లో మంత్రి మల్లారెడ్డి, నర్సింహయాదవ్ భాగస్వాములుగా ఉన్నట్లు తెలిసింది. దీనితో ఆయన ఇంటిపై కూడా దాడులు కొనసాగాయి. మహేందర్‌రెడ్డికి సన్నిహితుడైన జైకిషన్ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. జైకిషన్ కేసినోలో పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ అధికారులకు సమాచారం ఉంది. దాడుల నేపథ్యంలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి స్నేహితుడు సుచిత్రా ప్రాంతంలో ఉండే త్రిశూల్‌రెడ్డి కార్యాలయం, ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు అక్కడ రెండు కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే రఘునాథ్‌రెడ్డి వద్ద మరో రూ.2.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌రెడ్డి నివాసంలో ఎంత పట్టుబడిందీ తెలియరాలేదు. ప్రవీణ్‌రెడ్డిని తీసుకెళ్లిన ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్‌రెడ్డికి చెందిన దూలపల్లిలోని ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు అక్కడ పలు డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కాగా డాక్యుమెంట్లతో పాటు ప్రవీణ్‌రెడ్డిని, మరొక వ్యక్తిని అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. అయితే వారిని ఎక్కడికి తీసుకెళ్లిందీ కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదని తెలిసింది. హార్డ్‌డిస్కులు దాచిపెట్టిన కళాశాలల సిబ్బంది సీఎంఆర్ గ్రూప్ కళాశాలల్లోని సిబ్బంది ఐటీ అధికారులకు దొరకకుండా పలు కంప్యూటర్లు, వాటి హార్డ్ డిస్క్‌లు రహస్య ప్రదేశాల్లో దాచిపెట్టినట్లు తెలిసింది. కాలేజీలకు అధికారులు రాకముందు వరకు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజ్‌లను కూడా డిలిట్ చేసినట్లు సమాచారం. సోదాల సందర్భంగా అధికారులు కళాశాలల గేట్లు మూసివేశారు. మీడియాను సైతం అనుమతించలేదు. ఉలిక్కి పడ్డ టీఆర్ఎస్ శ్రేణులు టీఆర్ఎస్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాలతో ఆయన వెంట తిరిగే టీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ప్రసార మాధ్యమాల్లో వార్తలు రావడంతో అధికసంఖ్యలో కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే అధికారులు ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఒక కళాశాలతో ప్రారంభించి.. పాలవ్యాపారి నుండి మంత్రి స్థాయికి ఎదిగిన మల్లారెడ్డి ప్రస్ధానం మేడ్చల్ మండలం నుండే మొదలైంది. తన అమ్మమ్మ ఊరుగా చెప్పుకునే మైసమ్మగూడలోనే ఆయన మొదటి ఇంజనీరింగ్ కళాశాల స్ధాపించారు. మైసమ్మగూడలో వందల ఎకరాల భూమి ఉండగా అందులోనే పదుల సంఖ్యలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలు, మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది. కండ్లకోయలో ఆయన సోదరులు నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డి నేతృత్వంలో సీఎంఆర్ గ్రూపు పేరుతో ఇంజనీరింగ్ కళాశాలలు, సీఎంఆర్ ఆసుపత్రి ఉన్నాయి. మేడ్చల్ పట్టణంలో పదుల సంఖ్యలో కమర్షియల్ ప్లాట్లు, ఎల్లంపేట్, పూడూర్ తదితర గ్రామాలలో గోదాంలు ఉన్నాయి. ఇదీ చదవండి: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో.. -
మల్లారెడ్డి ఐటీ దాడులపై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
-
మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో నగదు సీజ్
-
మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సుచిత్రలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ. 2కోట్లు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతుండగా ఉదయం నుంచి ఆయన ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంత్రి సెల్‌ఫోన్ స్వాధీనం కాగా మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏక కాలంలో మొత్తం 50 బృందాలుగా అధికారులు. మంత్రితోపాటు ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లోనూ విస్త్రృత దాడులు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి కొడుకు, అల్లుడు, సోదరుడు, వియ్యంకుడు ఇళ్లల్లో తనిఖీలు జరుపుతున్నారు. మంత్రి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కొత్త విషయాలు వెలుగులోకి మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై జరుపుతున్న ఐటీ సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ ఇంట్లో ఐటీ సోదాలు చేస్తోంది. జైకిషన్, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లు కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. గతంలో కూడా జైకిషన్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జైకిషన్ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాస్వాములు. సీఎంఆర్ స్కూల్స్‌లో నరసింహ యాదవ్, మల్లారెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. దీంతో నరసింహయాదవ్, జైకిషన్ ఇళ్లల్లో ఐటీ దాడులు జరుపుతోంది. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నారు. క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లో ఐటీ సోదాలు జరుపుతున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లావాదేవీలు గుర్తించారు. అలాగే కన్వీనర్ కోటా సీట్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. నాలుగు మెడికల్ కాలేజీల లావాదేవీల పరిశీలిస్తున్నారు. సంబంధిత వార్త: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో.. -
మల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాల్లో కొత్త విషయాలు
-
కేంద్రం దాడులను ఎదుర్కొంటాం : మంత్రి తలసాని
-
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
-
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో..
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 50 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, అల్లుడి ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి సోదరుడు, వియ్యంకుడి నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలిస్తున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ లావాదేవాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వర్‌రావు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. చదవండి: (బీఎల్ సంతోష్‌కు మరోసారి నోటీసులు?) -
మౌలిక వసతులకు పెట్టింది పేరుగా తెలంగాణ
కుత్బుల్లాపూర్: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతో మౌలిక వసతులకు పెట్టింది పేరుగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, నచ్చిన ప్రాపర్టీ కొనుక్కుని సొంతింటి కల నెరవేర్చుకునే అవకాశం క్రెడాయ్ ప్రాపర్టీ షో ద్వారా సాధ్యమవుతోందని రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. కొంపల్లి అస్పిసియస్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజులపాటు కొనసాగే ‘క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో నార్త్‘ను ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పక్కా అనుమతులు, కచ్చితమైన సౌకర్యాల కల్పనలో క్రెడాయ్పై ప్రజలకు గట్టి నమ్మకం ఉన్నదన్నారు. మేడ్చల్‌కు దాదాపు 22 లక్షల స్క్వేర్ ఫీట్ల గేట్ వే ఆఫ్ ఐటీ పార్క్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నిర్మాణ రంగం ఊపందుకుంటోందని తెలిపారు. ధరణి సమస్యలు పరిష్కరించండి: క్రెడాయ్ ప్రతినిధులు కాగా.. క్రెడాయ్ సభ్యులు నిర్మాణ సమయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ధరణి రికార్డుల్లో సమస్యలను పరిష్కరించుకోవడానికే కనీసం 6 నెలలు సమయం పడుతోందని, ఇది నిర్మాణంపై ప్రభావం చూపుతోందని వివరించారు. మురుగునీటి సమస్య, కనెక్టివిటీ రోడ్లు, ధరణి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రాపర్టీ షోలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వి.రాజశేఖర్‌రెడ్డి, క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రారెడ్డి, అధ్యక్షుడు డి.మురళీకృష్ణారెడ్డితో పాటు క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు జి.ఆనంద్‌రెడ్డి, కె.రాజేశ్వర్, ఎన్.జైదీప్‌రెడ్డి, బి.జగన్నాథ్ రావు, ట్రెజరర్ ఆదిత్య గౌర, శివరాజ్ ఠాకూర్, కె.రాంబాబు, పలు ఆర్థిక సంస్ధలు, సందర్శకులు పాల్గొన్నారు. -
మునుగోడులో మంత్రి మల్లారెడ్డి ప్రచారం
-
మునుగోడు ఉప ఎన్నిక: మహిళలతో ఆడిపాడిన మంత్రి మల్లారెడ్డి
సాక్షి, నల్గొండ: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ తరపున నిర్వహించిన ప్రతి సభ, కార్యక్రమానికి హాజరై పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతారు. ఆటపాటలతో జనాలను హోరెత్తిస్తారు. తాజాగా మునుగోడులో ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి మల్లారెడ్డి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఊళ్లో పూజలు నిర్వహించి.. మహిళలు, మరుగుజ్జులతో కలిసి బతుకమ్మ ఆడుతూ స్థానిక ఓటర్లను ఆకట్టుకున్నారు. -
మరోసారి చిక్కుల్లో పడ్డ మంత్రి మల్లారెడ్డి
-
చిక్కుల్లో మంత్రి మల్లారెడ్డి.. బయటపడిన వీడియో.. ఆయన స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. బహిరంగంగా మద్యం తాగుతూ కెమెరాలకు చిక్కారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన మల్లారెడ్డి ప్రచారం తర్వాత తన అనుచరులతో కలిసి మందు తాగుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఫుల్ బాటిల్ పట్టుకుని గ్లాస్లో మందు పోస్తున్న మల్లారెడ్డి విజివల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చౌటప్పల్ మండలంలో ఆరెగూడెం గ్రామానికి ఎన్నికల ఇంఛార్జ్‌గా మల్లారెడ్డి ఉన్నారు. ఆదివారం గ్రామానికి వెళ్లిన ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి రోజంతా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం తన అనుచరులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: అందుకు మీరు సిద్ధమా?.. రాజగోపాల్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ దీనిపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ.. కావాలనే మందు బాటిల్ చేతిలో ఉన్న ఫోటో వైరల్ చేస్తున్నారన్నారు. మా కుటుంబ సభ్యులకు ఇస్తున్న బాటిల్ మాత్రమే. నేను తాగలేదంటూ వివరణ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో తాను కొన్ని గ్రామాలకు ఇంఛార్జ్‌గా ఉన్నానన్నారు. ప్రచారం తర్వాత అక్కడే ఉన్న మా బంధువులు ఇంటికి వెళ్లాను. నా కన్నా పెద్దవాళ్లు ఉన్నారు. మందు సర్వ్ చేశాను. తెలంగాణ సంప్రదాయం ఇది.. తప్పేముంది. నా చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మా బంధువులు. అది రహస్యంగా చేసిన పని కాదు.. ఊర్లో బంధువుల ఇల్లు అది. అది నా పర్సనల్ పని.. భోజనం చేయడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మంత్రి అన్నారు. -
అడ్వకేట్ మల్లారెడ్డి కేసును చేధించిన పోలీసులు
-
పక్కా ప్లాన్‌తో మల్లారెడ్డి హత్య.. హంతక ముఠాకు రూ.15 లక్షలకుపైగా సుపారీ?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రముఖ న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడినట్లే. ములుగు జిల్లా పందికుంట సమీపంలో ఆయన దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న ములుగు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్, ఏఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్‌ల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు అన్ని కోణాల్లో చేపట్టిన విచారణ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రెండు రోజులపాటు మల్లంపల్లి మాజీ సర్పంచ్ పిండి రవి, మైనింగ్ వ్యాపారంతో సంబంధమున్న కె.వీరభద్రరావు, ఆయన కుటుంబ సభ్యులు, మరికొందరు ఎర్రమట్టి క్వారీల యజమానులను విచారించారు. 44 క్వారీలకు చెందిన సుమారు 24 మందిని విచారించిన పోలీసులు బుధవారం కీలక ఆధారాలు రాబట్టి పలువురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య కేసు మిస్టరీ వీడినట్లు సమాచారం. హత్యకు ప్రధాన సూత్రధారి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఓ రైస్ మిల్లు వ్యాపారిగా పోలీసులు అనుమానించారు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య పూర్తి వివరాలు వెల్లడైనట్లు సమాచారం. ఆయన చెప్పిన వివరాల మేరకు మైనింగ్ క్వారీల నిర్వహణ, మల్లారెడ్డితో దీర్ఘకాలిక వివాదమున్న కీలక వ్యక్తులనూ పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ హత్య కేసుతో సంబంధమున్న మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 15 మందికిపైగా అనుమానితులను ప్రశ్నించిన తర్వాత హత్యకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. రూ.15 లక్షలకుపైగా సుపారీ? మైనింగ్ వివాదమే మల్లారెడ్డి హత్యకు కారణమన్న నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు తెలి సింది. హత్యకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సుపారీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. హత్యకు పథకం తర్వాత నర్సంపేట, శాయంపేటకు చెందిన 2 సుపారీ గ్యాంగ్‌లతో మాట్లాడినట్లు తెలిసింది. కర్నూలు ప్రాంతానికి చెందిన నలుగురు హంతక ముఠా సుపారీ తీసుకుని మల్లారెడ్డిని హత్య చేసినట్లు సమాచారం. వీరితో పాటు నల్లగొండకు చెందిన మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. కాగా.. ఈ హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు అందరూ పోలీసుల అదుపులో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. -
మీకు తమాషాగా ఉందా.. మంత్రి హరీశ్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/రామచంద్రాపురం: ‘కార్పొరేట్ ఆస్పత్రిలో మాదిరిగా అన్ని సౌకర్యాలున్నాయి. 55 మంది డాక్టర్లు.. 56 మంది నర్సులు పనిచేస్తున్నారు. కానీ, బెడ్ ఆక్యుపెన్సీ రేషియో మాత్రం 25 శాతమా? జనవరిలో 24 శాతం, ఫిబ్రవరిలో 29 శాతం, జూన్‌లో 49 శాతం.. డాక్టర్లు ఫుల్.. పేషెంట్లు నిల్’అంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రూ.20.50 కోట్లతో ఆధునీకరించిన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రి భవనాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం వైద్యుల పనితీరుపై హరీశ్‌రావు సమీక్షించారు. ఆయా వైద్య విభాగాల అధిపతులతో ముఖాముఖి నిర్వహించి వైద్యుల పనితీరు తక్షణం మెరుగుపరుచుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. ముగ్గురు గైనకాలజిస్టులు నెల మొత్తానికి చేసిన డెలివరీలు కేవలం మూడు. ఎంబీబీఎస్‌లు పనిచేసే పీహెచ్‌సీల్లో రోజుకు నాలుగైదు డెలివరీలు అవుతున్నాయి. నలుగురు వైద్యులు నాలుగేళ్లుగా విధులకు హాజరుకావడం లేదు. అయినా ఎందుకు పేరోల్ (వేతనాల జాబితా)లో ఉంచారు’అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్మికులకు అధునాతన వైద్యం అందించేందుకు శంషాబాద్‌లో మరో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వైద్యులతో ముఖాముఖి సాగిందిలా.. మంత్రి: నమస్కారం డాక్టర్ పద్మజగారూ.. గైనకాలజీ విభాగంలో ఎంతమంది ఉన్నారు.. జూలైలో ఎన్ని డెలివరీలు చేశారు. డాక్టర్ పద్మజ: ముగ్గురు డాక్టర్లం ఉన్నాం సర్, మూడు ఆపరేషన్లు చేశాం. మంత్రి: నీ వేతనం ఎంత చెప్పమ్మా.. నాకు నెలకు రూ.రెండు లక్షలు.. మీకు ఎంత? డాక్టర్ పద్మజ: రూ.1.90 లక్షలు సర్. మంత్రి: ముగ్గురు గైనకాలజిస్టులు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఈ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలున్నా పనిచేయకపోతే మిమ్మల్ని ఏమనాలి? డాక్టర్ పద్మజ: గతంలో ఇక్కడ బాగా పనిచేశాం సర్. ప్రస్తుతం ఆస్పత్రిలో బ్లడ్ నిల్వలు లేవు. మంత్రి: నార్మల్ డెలివరీ చేయడానికి బ్లడ్ ఎందుకమ్మా? అవసరం పడితే పక్కనే ఉన్న పటాన్చెరు ఏరియా ఆస్పత్రిలో భారీగా రక్తం నిల్వలున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నెలకు 700 డెలివరీలు చేస్తున్నారు. అనస్తీషియా డాక్టర్ ఉన్నారు. జనరల్ సర్జన్ ఉన్నారు. గైనకాలజిస్టులున్నారు. కానీ, ఒక్క డెలివరీ చేయకపోతే అందరూ ఎందుకమ్మా? డాక్టర్ పద్మజ: ఇకపై బాగా పనిచేస్తాం సర్, డెలివరీలు చేయడం ప్రారంభిస్తాం. మానవత్వం ఉండాలి మంత్రి: ఆర్థోపెడిక్ విభాగంలో ఎంతమంది ఉన్నారు? జూలైలో ఎన్ని ఆపరేషన్లు చేశారు. డాక్టర్ నీరజ: ఒక్క ఆపరేషన్ కూడా చేయలేదు సర్. మంత్రి : అల్ట్రాసౌండ్ ఉంది. డిజిటల్ ఎక్స్‌రే ఉంది. రెండు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. అన్ని ఆధునిక సౌకర్యాలున్నాయి. కానీ, జూలైలో ఒక్క ఆపరేషనూ చేయలేదు. ఓ ప్రైవేటుకు ఆస్పత్రికి వెళ్దాం. అక్కడ రోజుకు ఎన్ని ఆపరేషన్లు అవుతున్నాయో చూద్దాం. రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నారు. కార్మికుల కోసం కనీసం పనిచేయరా? మానవత్వం ఉండాలమ్మా.. డాక్టర్ నీరజ : ఇకపై చేస్తాం సర్.. ఇది కూడా చదవండి: ఉద్యోగ నోటిఫికేషన్లో ట్విస్ట్.. అభ్యర్థులకు షాక్! -
మల్లారెడ్డి హత్య వెనుక భారీ స్కెచ్.. రూ.10 లక్షలకుపైనే సుపారీ!
సాక్షి ప్రతినిధి, వరంగల్: న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్యకు ఓ గ్యాంగ్ రూ.10 లక్షలకుపైనే సుపారీ మాట్లాడుకున్నట్లు తెలిసింది. అయితే ఆ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చిందెవరు?.. మల్లారెడ్డిని హత్యచేసే అవసరం ఎవరికుంది?.. ఆయనను మట్టుపెడితే మేలు ఎవరికీ?.. ఈ హత్యకు కారణం మైనింగ్ వివాదమా.. భూ వివాదాలా?.. మర్డర్‌కు ప్రణాళిక రచించిందెవరు? ఘటనలో పాల్గొన్నదెవరు?.. సోమవారం రాత్రి ములుగు జిల్లా పందికుంట సమీపంలో హత్యకు గురైన మూలగుండ్ల మల్లారెడ్డి ఘటనపై సర్వత్రా సాగుతున్న చర్చ ఇది. మల్లంపల్లి మాజీ సర్పంచ్ రవి సహా 10మందినిపైగా విచారించి వదిలేసిన పోలీసులు కీలక వ్యక్తులపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. పక్కా స్కెచ్‌తో.. మల్లారెడ్డి మర్డర్‌పై మంగళవారం రాత్రి వరకు స్పష్టత రాకపోగా.. భిన్న కథనాలు వినిపించాయి. ఎర్రమట్టి క్వారీలు, భూ వివాదాల పరిష్కారం కోసం సోమవారం కూడా ములుగు రెవెన్యూ, పోలీసు అధికారులను కలిసినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ హత్య జరిగే నాలుగు రోజుల ముందు మల్లారెడ్డి ఇద్దరితో తీవ్రస్థాయిలో గొడవపడినట్లు చెబుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఒకరితో జరిగిన గొడవ తారస్థాయికి చేరగా, అవతలి వ్యక్తి లేపేస్తానని మల్లారెడ్డిని హెచ్చరించాడని అంటున్నారు. మల్లారెడ్డి హత్యకు హైదరాబాద్‌లోని ఒక హోటల్లో పథకానికి రూపకల్పన జరిగినట్లు ములుగు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. హంతకులకు రూ.10 లక్షలకుపైనే సుపారీ ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. హంతకులు కూడా హైదరాబాద్‌కు చెందిన వారుగా భావిస్తుండగా, హత్య జరిగిన సమయంలో హంతకులు మాస్క్‌లు ధరించి తెలుగు మాట్లాడారని చెబుతున్నారు. హత్యకు వాడిన కత్తులు, మారణాయుధాలను చూస్తే హైదరాబాద్ నుంచి గానీ, ఆన్లైన్లో గాని తెప్పించినవిగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. హత్య కుట్రలోని ఆ ఇద్దరు ఎవరు.. మల్లారెడ్డి భార్య భాగ్యలక్ష్మి పేర్లు చెప్పకుండా హత్య వెనుక ఇద్దరి హస్తముందని మంగళవారం మీడియాతో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలతో పాటు పలుచోట్ల భూవివాదాల్లో ఆయనను అడ్డు తొలగించుకునేందుకు వ్యూహం రూపొందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో హత్యకు వ్యూహరచన చేసి, 3 రోజులు ములుగు, హనుమకొండలో రెక్కీ నిర్వహించినట్లుగా సమాచారం. చివరకు పందికుంట వద్ద పధకం అమలు చేసినట్లు తెలిసింది. హత్య వెనుకున్న ఆ ఇద్దరు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్న పోలీసులు బుధవారం గుట్టువిప్పే అవకాశం ఉంది. ములుగు మండలం ఉమ్మాయినగర్, కేఎన్ఆర్ కాలేజీ సమీపంలోని ఐదుగురు ఎర్రమట్టిæ క్వారీల యజమానులను మంగళవారం వేర్వేరుగా విచారించారు. అలాగే మల్లారెడ్డి భార్య భాగ్యలక్ష్మి, కూతురు అనూషకు సంబంధించిన 113 ఎకరాల భూమి విషయంలోనూ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మెడ చుట్టూ పది, పొత్తి కడుపులో మూడు చోట్ల.. మొత్తం 13 చోట్ల మల్లారెడ్డిపై కత్తులతో దాడి జరిగినట్లు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ధ్రువీకరించారు. -
మాధవరెడ్డి కారుపై MLA స్టిక్కర్‌పై స్పందించిన మల్లారెడ్డి
-
విద్యా ప్రమాణాలు పెంచుతున్నాం
కుత్బుల్లాపూర్/సుభాష్‌నగర్: ప్రభుత్వ రంగంలో గత 8 ఏళ్లుగా విద్యా ప్రమాణాలను పెంచుతూ వస్తున్నామని... పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. అంగన్వాడీ మొదలు యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్, బహుదూర్‌పల్లిలలో రూ. 2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన జూనియర్ కాలేజీని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో కలసి ప్రారంభించారు. వొకేషనల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల భేరిలో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో ఇదే జూనియర్ కాలేజీ శిథిలావస్థలో ఉండేదని, ప్రస్తుతం కొత్త భవనం నిర్మించి వొకేషనల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గురుకుల విద్యార్థులు ఐఐటీలకు... ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలల్లో 5 లక్షల మంది విద్యార్థులకు రూ. 1.20 లక్షల చొప్పున ఖర్చు చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాణ్యమైన విద్యతోపాటు ఇంట్లో కూడా అందని సకల సౌకర్యాలు అందిస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందించే నాణ్యమైన చదువుతో వెయ్యి మందికంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఐఐటీకి వెళ్లారని... ఇది ప్రభుత్వం చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. 400 గురుకుల పాఠశాలలను 1,052 గురుకులాలను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామని.. ఇది ఎంతో గర్వకారణమన్నారు. విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.18 వేల కోట్లు చెల్లించామని, విదేశాల్లో చదువుకోవాలనుకునే ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు అందిస్తున్నామని కేటీఆర్ వివరించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ చొప్పున 33 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయని... అగ్రికల్చర్, లా కాలేజీలు, 79 డిగ్రీ కాలేజీలు, రెండు యూనివర్సిటీలను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వివేకానంద కోరిన మేరకు ఉర్దూ కాలేజీని మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబిత, మల్లారెడ్డి ప్రసంగించగా ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్, సురభి వాణీదేవి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం దత్తత గ్రామంలో ‘పల్లెప్రగతి’ రచ్చ
శామీర్‌పేట్: మేడ్చల్ జిల్లాలో సీఎం దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో సోమవారం నిర్వహించిన ఐదోవిడత పల్లెప్రగతి కార్యక్రమం రసాభాసగా మారింది. కార్య క్రమానికి హాజరైన రాష్ట్రమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పల్లెప్రగతికి నిధులు ఎందుకు కేటాయించడంలేదని కాంగ్రెస్ పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్, స్థానిక జెడ్పీటీసీ హరివర్ధన్‌రెడ్డి స్టేజీ మీదే నిలదీశారు. గతంలో చేసిన పల్లెప్రగతి పనులకు సర్పంచ్‌లు అప్పులు చేయాల్సి వచ్చిందని, మళ్లీ ఇప్పుడు ఐదో విడత అంటూ సర్పంచ్‌లపై భారం మోపు తోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల తో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే పోలీసులు ఆయనను బయటకు ఈడ్చుకువెళ్లారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మూడు చింత లపల్లి మండలాన్ని దత్తత తీసుకుని కోట్లాది రూపాయలు కేటాయించి అభివృద్ధి చేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో పనికిరాని ఆందోళనలు చేసే లుచ్చాగాళ్లు ఉంటారని, వారి మాటలు నమ్మవద్దని ప్రజలను కోరా రు. కాంగ్రెసోళ్లు మూర్ఖులని, బీజేపోళ్లు చెడ గొట్టేవాళ్లని ధ్వజమెత్తారు. ఎంసీపల్లి, కీసర మండల కేంద్రాల్లో జరిగిన సభల్లోనూ మం త్రులు మాట్లాడుతూ బీజేపీ కూడా కాంగ్రె స్కు ఏమి తీసిపోలేదని, కాంగ్రెస్ అధికారం లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో పింఛన్ రూ.500 ఇస్తుండగా, బీజేపీ పాలిత గుజరాత్లో రూ.600 ఇస్తున్నారని, ఆ రెండు రాష్ట్రాల్లో నూ రైతుబంధు మాటేలేదని అన్నారు. -
మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటనపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటనపై కేసు నమోదైంది. ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు నమోదు చేశారు. సోమశేఖర్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెక్షన్ 173, 147, 149, 341, 352, 506 కింద కేసు నమోదు చేశారు. రేవంత్‌రెడ్డి అనుచరులే దాడి చేశారంటూ టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు చేశారు. చదవండి: నన్ను చంపేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు -
నన్ను చంపేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు: మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై ఆదివారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడిపై మంత్రి మాల్లారెడ్డి సోమవారం స్పందించారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాపై జరిగిన దాడి వెనుక తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తం ఉంది. రెడ్డిల ముసుగులో నాపై హత్యాయత్నం జరిగింది. రేవంత్ నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు. రేవంత్, అతడి గుండాలను జైలుకు పంపుతాము’’ అని తెలిపారు. కాగా, ‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డి సభకు సంబంధించిన అంశాలను కాకుండా పదేపదే టీఆర్ఎస్ పథకాలను, సీఎం కేసీఆర్‌ను ప్రస్తావించడంపై అక్కడున్న వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మల్లారెడ్డి డౌన్ డౌన్.. మల్లారెడ్డి గో బ్యాక్..’అంటూ కుర్చీలు, రాళ్లు, చెప్పులను స్టేజీపైకి విసిరారు. ప్రసంగం మధ్యలోనే ఆపి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్ వెంటపడి మరీ రాళ్లు, చెప్పులు, నీళ్ల బాటిళ్లు విసురుతూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కష్టమ్మీద వారిని అడ్డుతప్పించి మల్లారెడ్డిని బయటికి తరలించారు. ఇది కూడా చదవండి: టీఆర్ఎస్–బీజేపీలు అధికారం లేకుండా ఉండలేవు -
మంత్రి మల్లారెడ్డిపై దాడి
ఘట్కేసర్: ‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగింది. సభకు సంబంధించిన అంశాలను వదిలిపెట్టి పదేపదే టీఆర్ఎస్ పథకాలను, సీఎం కేసీఆర్‌ను ప్రస్తావించడంపై సభికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మల్లారెడ్డి డౌన్ డౌన్.. మల్లారెడ్డి గో బ్యాక్..’అంటూ కుర్చీలు, రాళ్లు, చెప్పులను స్టేజీపైకి విసిరారు. ప్రసంగం మధ్యలోనే ఆపి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్ వెంటపడి మరీ రాళ్లు, చెప్పులు, నీళ్ల బాటిళ్లు విసురుతూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కష్టమ్మీద వారిని అడ్డుతప్పించి మల్లారెడ్డిని బయటికి తరలించారు. తీపి కబురు చెప్తారనుకుంటే.. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఆదివారం ‘రెడ్ల సింహగర్జన’ సభ జరిగింది. మంత్రి మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2018 ఎన్నికల సమయంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో.. మంత్రి మల్లారెడ్డి దానికి సంబంధించి తీపి కబురు చెప్తారని సభకు హాజరైనవారు ఆశించారు. అయితే ప్రసంగం ప్రారంభించిన మల్లారెడ్డి.. ఈ విషయాన్ని పక్కనపెట్టి టీఆర్ఎస్ పథకాలను పదేపదే ప్రస్తావించడం ప్రారంభించారు. తెలంగాణలో 75 ఏళ్లలో జరగని అభివృద్ధి గత ఏడున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిందన్నారు. దీంతో ఆగ్రహించిన కొందరు నాయకులు, సభికులు మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కుర్చీలు పైకెత్తి నిరసన తెలిపారు. రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి తదితరులు సముదాయించడంతో శాంతించారు. అందరూ ప్రశాంతంగా కూర్చుంటే మల్లారెడ్డి మంచి కబురు చెప్తారంటూ.. ఆయనకు మరోసారి మాట్లాడే అవకాశం ఇచ్చారు. తీరు మార్చుకోకపోవడంతో.. సభికులు నిరసన వ్యక్తం చేసినా మంత్రి మల్లారెడ్డి తీరు మార్చుకోలేదు. రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ.. టీఆర్ఎస్, కేసీఆర్‌లను పొగుడుతూ ప్రసంగం కొనసాగించారు. ఈ క్రమంలో ఆయన దళిత బంధు, ఇతర పథకాలను వివరిస్తూ.. మళ్లీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందంటూ వ్యాఖ్యానించే సరికి.. సభికుల నుంచి నిరసన తీవ్రమైంది. వేదికపై ఉన్న మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ హరివర్ధన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి సహా మరికొందరు మంత్రితో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో సభికులు ‘మల్లారెడ్డి డౌన్ డౌన్.. మల్లారెడ్డి గో బ్యాక్’ అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసన తెలుపుతున్నవారు కుర్చీలు, రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లను స్టేజ్‌పై మల్లారెడ్డి వైపు విసిరారు. పోలీసులు వెంటనే సభా వేదిక పైకి వచ్చి మంత్రికి రక్షణగా నిలిచారు. అతికష్టమ్మీద మల్లారెడ్డిని కాన్వాయ్ వద్దకు తీసుకువెళ్లి వాహనంలో కూర్చోబెట్టారు. కాన్వాయ్ వెళ్తున్న సమయంలోనూ సభాస్థలి నుంచి జాతీయ రహదారి వరకు వెంటపడిన సభికులు.. రాళ్లు, చెప్పులు, నీళ్ల బాటిళ్లను విసిరారు. మంత్రి వెళ్లడంతోనే సభ ముగిసింది. సభికులంతా ఆగ్రహంతో వెనుదిగారు. ‘రెడ్ల సింహ గర్జన’ ఏర్పాటు కోసం నెల రోజులకు పైగా కష్టించామని, మంత్రి వేదికపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సభను విఫలం చేశారని నిర్వాహకులు అసహనం వ్యక్తం చేశారు. వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: ‘రెడ్డి సింహగర్జన’ మహాసభ డిమాండ్ సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు చట్టబద్ధమైన రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ‘రెడ్డి సింహగర్జన మహాసభ’ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నేరుగా సీఎంలు ఇచ్చిన హామీలు కూడా అమలు కాకపోవడం గతంలో ఎన్నడూ చూడలేదని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి వర్గం సహనాన్ని పరీక్షించడం మానుకుని.. ఓసీల్లోని పేదల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో రెడ్ల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించింది. ఘట్కేసర్ సభలో రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మగారి రాంరెడ్డి, రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డి, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు తదితరులు మాట్లాడారు. 2018 ఎన్నికల సమయంలో, హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పేద రెడ్ల సంక్షేమం కోసం ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని వారు గుర్తు చేశారు. ఓసీ సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరిస్తామన్న హామీలు కలగానే మిగిలాయని విమర్శించారు. రూ.5 వేల కోట్లతో చట్టబద్ధమైన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని.. విదేశాల్లో ఉన్నత విద్యకోసం పేద రెడ్లకు రూ.25 లక్షల ఆర్ధిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వు 244ను అమలు చేయాలని, వయసుతో సంబంధం లేకుండా రైతులందరికీ రూ.5 లక్షల ఉచిత బీమా, 50 ఏళ్లు నిండిన రైతులకు రూ.5వేల పెన్షన్, ఉపాధి హామీతో వ్యవసాయ రంగం అనుసంధానం, రైతుల పంటలకు గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు. -
కేసీఆర్‌ను బీట్ చేసే మొగోడు లేడు: మంత్రి మల్లారెడ్డి
వరంగల్ (హన్మకొండ అర్బన్) : తెలంగాణ రాష్ట్రాన్ని, కేసీఆర్‌ను బీట్ చేసే మొగోడు ఏ రాష్ట్రంలో లేడని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం హనుమకొండలోని తారా గార్డెన్స్‌లో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీజేపీని...మోదీని నమ్మి దేశప్రజలు తీవ్రంగా మోసపోయారని, మరోసారి అలా జరిగే పరిస్థితి లేదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలో కేసీఆర్ కొత్త పార్టీ అధికారంలోకి వస్తే ఆటోలకు ఫిట్నెస్తో సహా అన్నీ ఫ్రీ చేస్తామన్నారు. వచ్చే దసరా పండగరోజు భద్రకాళికి మొక్కి కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి బయలు దేరుతారని అన్నారు. మోదీ అంటేనే మోసాలకు నంబర్ వన్ కేడీ అని అన్నారు. ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గాని దళిత బంధు అమలు చేస్తే తన మంత్రి , ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు కుట్రలు చేస్తున్నారన్నారు. వీళ్లు నడుమంత్రపు దొంగలు, చెడ్డగొట్టుడు గాళ్లని అన్నారు. కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఇద్దామని కార్మికులకు పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కార్మికులకే కేటాయించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే ధాన్యం క్వింటాల్ రూ.2500కు కొంటామని రేవంత్‌రెడ్డి చెపుతున్నాడని, అసలు వాడు వచ్చేది లేదు సచ్చేది లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ముందుగా ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పెడుతుందని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తే చాలా ఉద్యోగాలు వచ్చేవని, కాంగ్రెస్, బీజేపీలు దక్కకుండా తొక్కిపడేశాయన్నారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను సీఎం కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కార్మికులకు ఇచ్చే టూ వీలర్స్లలో వరంగల్, హనుమకొండ జిల్లాలకు పదివేల సైకిల్ మోటార్లు ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా పనిచేస్తుందని, కార్మికులంతా కలిసి కట్టుగా ఉండాలన్నారు. కార్మిక శాఖలో అధికారుల నిర్లక్ష్యం వల్ల క్లయిమ్‌లు పేరుకు పోయాయని, దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి తెలిపారు. ఆటోకార్మికుల కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 31న కాజీపేట రైల్వే క్రీడా మైదానంలోనిర్వహించే సభకు పెత్త సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కాగా అంతకు ముందు మంత్రి మల్లారెడ్డి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పుల్ల శ్రీనివాస్, అజీజ్‌ఖాన్, బొట్లబిక్షపతి, సారంగపాణి, కార్పొరేటర్లు, పలు కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు. -
నా సొమ్ముతోనే రేవంత్ బిడ్డ పెళ్లి
సాక్షి, హైదరాబాద్: ‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నా పైసలతోనే బిడ్డ పెండ్లి చేసిండు. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా నేను డబ్బులు ఇవ్వ లేదని రేవంత్ ప్రమాణం చేస్తారా?’అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రశ్నిం చారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మంగళవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మల్లారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రేవంత్ రక్తం తాగే మనిషి, దుర్మార్గుడు. గతంలో ఇద్దరం టీడీపీలో ఉన్నప్పుడు 24 గంటలూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. నేను ఎంపీ సీటు అడిగినందుకు కాలేజీలు మూయిస్తా అని బెదిరించాడు. దర్యాప్తు సంస్థలకు ఆధారాలు లేని ఫిర్యాదులు చేశాడు. ఎంపీగా నేను గెలిచినా బ్లాక్‌మెయిలింగ్ ఆపలేదు. డబ్బులిస్తావా లేక కాలేజీలు మూయించాలా? అని బెదిరించేవాడు. ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పినా లాభం లేకపోయింది. పాలమ్మి, వ్యవసాయం చేసి వచ్చిన డబ్బుతో కాలేజీలు స్థాపించి సంపాదించా. మరి రేవంత్ ఏం వ్యాపారం చేసి ఆస్తులు కూడబెట్టాడో చెప్పాలి?’అని డిమాండ్ చేశారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్... ‘రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్. టీడీపీలో లోకేశ్‌ను పట్టుకొని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తెచ్చుకున్నాడు. టీ టీడీపీ ఉనికి కోల్పోవడంతో కాంగ్రెస్‌లో డబ్బులు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొన్నాడని ఆ పార్టీ నేతలే ఆరోపించారు. రేపు చివరకు ఉత్తమ్, భట్టి, జానారెడ్డి వంటి నేతలతోపాటు రాహుల్‌నూ కూడా బ్లాక్మెయిల్ చేసి రేవంత్ బీజేపీలోకి వెళ్తాడు’అని మల్లారెడ్డి ఆరోపించారు. రేవంత్‌పై న్యాయపరమైన పోరాటం చేసి జైలుకు పంపుతానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ప్రదేశ్ చీటర్స్ కమిటీగా మార్చాడు: కేపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని రేవంత్‌రెడ్డి ప్రదేశ్ చీటర్స్ కమిటీగా మార్చారని, కేసీఆర్ రైతులకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారితే, రేవంత్ రౌడీలు, కేడీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా తయారయ్యారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. రేవంత్ లాంటి చీడపురుగులను చూసి ఆయన కులానికి చెందిన వారు బాధపడుతున్నారన్నారు. -
కార్మికులకు త్వరలో కొత్త పథకం
గన్‌ఫౌండ్రీ: కార్మికులను ధనవంతులుగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు, దళితబంధు తరహాలో కార్మికుల కోసం త్వరలో ఓ కొత్త పథకం తీసుకువస్తామన్నారు. తాను సైకిల్ మీద పాల వ్యాపారం ప్రారంభించానని, నిరంతరం కçష్టపడితేనే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటామని అన్నా రు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మాట్లాడుతూ.. దేశ సంపద సృష్టిలో కార్మికుల పాత్ర ఎనలేనిదన్నారు. మేడే సందర్భంగా మం త్రి మల్లారెడ్డి కార్మికుడి వేషధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. అనంత రం మైహోం గ్రూప్, ఎన్ఎస్ఎన్ కృష్ణవేణి షుగర్స్, సాగర్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ, ఎల్ అండ్ టీ వంటి పలు కంపెనీలకు ఉత్తమ యాజమాన్యం అవార్డులు, 40 మంది కార్మిక విభాగం ప్రతినిధులకు శ్రమశక్తి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.చందర్, రాష్ట్ర పాఠశాల మౌలిక వసతుల కల్పన చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి రాణీ కుముదిని, కమిషనర్ అహ్మద్ నదీమ్ పాల్గొన్నారు. పప్పు పహిల్వాన్ రాహుల్ పప్పు పహిల్వాన్‌గా పేరున్న రాహుల్‌గాంధీ వరంగల్‌కు వచ్చి ఏం ఒరగబెడతారని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దివాలా తీసిందని, అందుకే రాహుల్‌ను తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఇక్కడి తెలంగాణ భవన్లో టీఆర్ఎస్కేవీ నిర్వహించిన మే డే వేడుకల్లో మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన కార్మికులకు శ్రామిక్ అవార్డులు అందజేశారు. -
చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్ ఇచ్చారట.. ఇంకేముంది!!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రంలోని న్యూ గొల్లగూడెంకు చెందిన కొత్త మల్లారెడ్డి (రిటైర్డ్ హెడ్మాస్టర్) ఈనెల 11న చనిపోయారు. కానీ వైద్య శాఖ సిబ్బంది మాత్రం ఫిబ్రవరి 16, బుధవారం రోజున బూస్టర్ డోస్ తీసుకున్నట్టుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఇదే విషయం సెల్‌ఫోన్‌కు మెసేజ్ రాగా, వాళ్ల కుటుంబ సభ్యులు కోవిన్ యాప్‌లో సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి చూస్తే, అందులో కూడా ఇవాళ వ్యాక్సిన్ వేసినట్టుగా ఎంట్రీ చేశారు. మల్లారెడ్డి భార్య కళావతికి కూడా ఇవాళ బూస్టర్ డోస్ వేయకున్నా, వేసినట్టుగా మెసేజ్ రావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైద్యశాఖ అధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చదవండి: (మేడారం గద్దెపైకి సారలమ్మ.. చిలకలగుట్ట నుంచి రానున్న సమ్మక్క) -
యాదాద్రికి రూ.50 లక్షల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం సుంకిశాల దేవస్థానం వ్యవస్థాపకుడు పైళ్ల మల్లారెడ్డి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. శుక్రవారం ఆయన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఇటీవల యాదాద్రి ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. యాదాద్రి దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటోందన్నారు. -
యాదాద్రికి మల్లారెడ్డి రెండో విడత విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడం పనులకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి రూ. 3 కోట్ల 64 వేలు అందించారు. రెండవ విడతగా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో మొత్తం రూ.84,29,880 నగదు, రూ.2,16,35,042 విలువ చేసే చెక్కులు, 200 గ్రాముల బంగారాన్ని బాలాలయంలో ఆలయ ఈవో గీతారెడ్డికి సోమవారం అందజేశారు. మొదటి విడతగా గత నెల 28వ తేదీన రూ.1.83 కోట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. మరో వారం, పది రోజు ల్లో 11 కిలోల బంగారానికి అవసరమయ్యే నగదును అందజేస్తామని వెల్లడించారు. -
మంత్రి మల్లారెడ్డిని నిలదీసిన కాంగ్రెస్ నాయకులు
-
మంత్రి మల్లారెడ్డి తీరుపై ఆగ్రహం.. సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తమపై అవాకులు చెవాకులు పేలుతూ గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆయన కుమారుడు, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. సంస్థాగత కమిటీల్లో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, గ్రూపు రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నందున జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని శరత్ చంద్రారెడ్డి చెప్పారు. చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం ఈ నేపథ్యంలో శుక్రవారం శాసనసభ ఆవరణలో మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి, శరత్‌లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను వేర్వేరుగా కలిశారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ సూచించడంతోపాటు, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత జిల్లా టీఆర్ఎస్ నేతలతో సమావేశమవుతానని కేసీఆర్ సర్దిచెప్పినట్లు సమాచారం. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారని, అందువల్ల తాను రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శరత్ చంద్రారెడ్డి వెల్లడించారు. కాగా అసెంబ్లీకి వచ్చిన శరత్ చంద్రారెడ్డికి విజిటర్ పాస్ లేకపోవడంతో పోలీసులు లోనికి అనుమతించలేదు. ఈ విషయం తెలుసుకున్న మల్లారెడ్డి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఆయనను లోనికి తీసుకెళ్లారు. చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి -
జైలుకు వెళ్లిన వ్యక్తి.. సీఎంను తిడతాడా?
జవహర్‌నగర్: ‘రేవంత్ రెడ్డి దోకేబాజ్గాడు, చర్ల పల్లి జైలుకు వెళ్లిన వాడు సీఎంను తిడతాడా?’ అంటూ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి టీపీ సీసీ అధ్యక్షుడిపై మరోసారి ఆగ్రహం వ్యక్తంచే శారు. ఆదివారం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్లో డివిజన్ కార్యాలయం ప్రారం భోత్సవానికి వచ్చిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇతర పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమం సీఎం కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల సంక్షేమంకోసం రాత్రింబవళ్లు ఆలోచించే గొప్ప వ్యక్తి గురించి రేవంత్‌లాంటి వారు అనుచితంగా మాట్లాడడం సరికాదన్నా రు. ‘రూ.50 కోట్లతో టీపీసీసీ పదవి తెచ్చుకున్న ఈ దొంగ, సీఎంను పట్టుకుని ఎట్లపడితే అట్ల తిడుతున్నడు. వాడు మామూలుగా చచ్చి పోడు. పురుగులు పడి చచ్చిపోతడు. గత కాం గ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు, కరెంటు ఇచ్చారా? వాళ్ల మొఖాలకు ఏం చేసిండ్రు.. మొన్ననే జైలు నుంచి బయటకు వచ్చి, పెద్దమనిషిని తిడ తాడా.. ఖబడ్దార్! ఇడిసేదేలేదు బిడ్డా. ఏడపడితే ఆడ కొట్టి ఇడిసిపెడతాం, మా కార్యకర్తలు ఎవ్వరూ ఊరుకోరు’అని రేవంత్ రెడ్డిపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
‘హత్యాచార’ నిందితుడిని ఎన్కౌంటర్ చేస్తాం
మేడ్చల్: నగరంలోని సింగరేణికాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం ఆపై హత్య చేసిన నిందితుడిని వదిలిపెట్టబోమని, అతడిని తప్పకుండా ఎన్కౌంటర్ చేస్తామని మంగళవారం మంత్రి మల్లారెడ్డి మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణికాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లే పరిస్థితి లేనందున తాము అక్కడకు వెళ్లలేదని, త్వరలోనే ఆ కుటుంబాన్ని పరామర్శించి నష్టపరిహారాన్ని అందజేస్తామని మంత్రి తెలిపారు. -
టీఆర్ఎస్.. తిరుగులేనిశక్తి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేరుకే బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ పార్టీలని.. కానీ, చేసేవి చిల్లర పనులని ఎద్దేవా చేశారు. మంగళవారం జలవిహార్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వానికి ప్రాధాన్యతలని అన్నారు. టీ–కాంగ్రెస్, టీ–బీజేపీ ఏర్పాటు కేసీఆర్ పెట్టిన భిక్షేనని.. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోని నేతలు కేసీఆర్ పుణ్యాన పదవులు రాగానే ఎగిరిపడుతున్నారని ధ్వజమెత్తారు. వయసులో పెద్దవారైన సీఎంపై ఇష్టారీతిగా మాట్లాడుతున్న నేతలకు గట్టిగా సమాధానం చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏడేళ్లు ఒపిక పట్టినా.. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదన్నారు. మీరు ఇటుకలతో బదులి స్తే.. మేము రాళ్లతో జవాబు చెప్తామని పునరుద్ఘాటించారు. అరవై లక్షల పైచిలుకు సభ్యులతో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉందని.. హుజూరాబాద్ ఎన్నిక పార్టీకి ఒక సమస్యే కాదని చెప్పారు. పేదలకు ఏం కావాలో సీఎంకు తెలుసునని, వారి ఆశీర్వాదం ఉన్నంత కాలం టీఆర్ఎస్కు ఏమీ కాదన్నారు. విపక్షాల విమర్శలను ఎదుర్కొనేందుకు పార్టీ కమిటీలు ఎక్కడికక్కడ పటిష్టంగా ఉండాలన్నారు. ఈ నెల 20 లోగా సంస్థాగత కమిటీల నియామకం పూర్తి చేసి.. దీపావళి తరువాత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని సూచించారు. అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ జయభేరీ.. అసెంబ్లీ ఎన్నికలు.. పంచాయతీ ఎన్నికలు.. జిల్లా పరిషత్ ఎన్నికలు.. పార్లమెంట్ ఎన్నికలు.. ఏదైనా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టారని కేటీఆర్ చెప్పారు. ఏడేళ్లుగా పార్టీకి జనం బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికి త్వరలో నామినేటెడ్ పోస్టులు కట్టబెడతామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కో ఆప్షన్ సభ్యుల నియామకం సైతం త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ‘చేనేత’కు రూ. 73.50 కోట్లు. నేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా చేనేత కార్మికుల తలసరి ఆదాయం పెరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేత, జౌళి రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలుపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నేత కార్మికుల తలసరి ఆదాయం రూ.15 వేలకు పైగా పెంచేందుకు ప్రభుత్వ కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. నేత కార్మికుల సమస్యలపై గత నెలలో మంత్రులు కేటీఆర్, హరీశ్ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై మళ్లీ మంగళవారం అధికారులతో భేటీ అయ్యారు. ‘చేనేత’సంక్షేమం కోసం కార్మిక సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేటీఆర్ ఆమోదించారు. ఈ పథకాల అమలుకు వీలుగా రూ.73.50 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులను చేనేత కార్మికులు, సహకార సంఘాలకు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. సమావేశంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సంపాదకుడు ఏబీకే ప్రసాద్‌కు గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కారం
హఫీజ్‌పేట్(హైదరాబాద్): ప్రముఖ పత్రికా సంపాదకుడు ఏబీకే ప్రసాద్‌కు గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కారం లభించింది. కొండాపూర్‌లోని చండ్రరాజేశ్వరరావు (సీఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వృద్ధాశ్రమానికి శనివారం వచ్చిన యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి సూర్యకళావతి ఆమె చేతులమీదుగా ఈ పురస్కారాన్ని ఏబీకేకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చి అనేక ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి గౌరవ పురస్కారాలు అందుకున్న వ్యక్తి ఏబీకే అని తెలుగులోని అన్ని ప్రధాన పత్రికలకు సంపాదకులుగా పనిచేసిన ఘనత ఆయనదని ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా 2004–2009 సంవత్సరాలకు సేవలందించి తెలుగుభాషకు ప్రాచీన హోదా తీసుకురావడంలో ఆయన చేసిన కృషి విస్మరించలేనిదన్నారు. ఈ సమావేశంలో సీఆర్ ఫౌండేషన్ కోశాధికారి వి.చెన్నకేశవరావు, వైద్యాధికారి డాక్టర్ కె.రజిని, డాక్టర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ ఆరోపణలన్నీ అబద్ధాలే..
సాక్షి, హైదరాబాద్: ‘భూ ఆక్రమణలకు సంబంధించి రేవంత్‌రెడ్డి నాపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలే. నకిలీ కాగితాలను తెచ్చి నమ్మించేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలను అప్పట్లోనే చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లా. సమాచార హక్కు చట్టాన్ని వాడుకుని పబ్బం గడుపుకునే వ్యక్తి రేవంత్’ అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలసి శనివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘టీపీసీసీని రేవంత్‌రెడ్డి సర్కస్ కంపెనీలాగా మార్చాడు. కాంగ్రెస్‌లో కొంతమందిని బకరాలను చేసి మీటింగ్‌ల పేరిట వసూళ్లు చేస్తున్నాడు. రేవంత్‌కు ఎవరెవరు ఎంత ఇచ్చారో.. నా దగ్గర వివరాలు ఉన్నాయి. నాకు 600 ఎకరాలకు రైతుబంధు వస్తోందని ఎమ్మెల్యే సీతక్క ద్వారా ఆరోపణలు చేయిస్తూ ఆమెను కూడా పక్కదారి పట్టిస్తున్నాడు’ అని మల్లారెడ్డి విమర్శించారు. తనకు ఉన్న భూమిలో 400 ఎకరాల్లో కాలేజీలు ఉంటే రైతుబంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ‘తెలంగాణకు దేవుడి లాంటి కేసీఆర్‌ను తిడితే మాకు కోపం రాదా? సీఎంను తిట్టేందుకే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారా, రేవంత్ బ్లాక్‌మెయిలింగ్‌ను త్వరలో బయట పెడతా’అని మల్లారెడ్డి హెచ్చరించారు. పార్లమెంటులో క్లీన్చిట్ ఇచ్చారు.. ‘రేవంత్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది నాలాంటి పెద్ద మనిషిని వేధించేందుకేనా? జవహర్‌నగర్‌లో నా కోడలి పేరిట 350 చదరపు గజాల స్థలమే ఉండగా, అందులో నిబంధనల మేరకు ఆస్పత్రి నిర్మించి పేదలకు సేవ చేస్తున్నా. పార్లమెంటులో నా విద్యాసంస్థలపై రేవంత్ వేసిన ప్రశ్నకు క్లీన్ చిట్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లిలోని 16 ఎకరాలు నా యూనివర్సిటీ ఆవరణలో లేవు. నేను కష్టపడితే ఆస్తులు సమకూరాయి. రేవంత్‌కు బంజారాహిల్స్ ఇల్లుతో పాటు ఏం చేశాడని అన్ని ఆస్తులు వచ్చాయి’అని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తాను ఏటా రూ.2 కోట్ల ఆదాయపు పన్ను చెల్లిస్తున్నానని, సొంత డబ్బుతోనే ప్రజాసేవ చేస్తున్నానని స్పష్టంచేశారు. -
నా సవాల్ ను రేవంత్ రెడ్డి స్వీకరించలేదు
-
జిరాక్స్ పేపర్లతో వచ్చి షో చేశాడు: మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తన సవాల్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్వీకరించలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏవో కొన్ని పేపర్లు తీసుకొచ్చి తనపై కబ్జా ఆరోపణలు చేశారన్నారు. అబద్ధాలతో తన ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏవో పేపర్లు చూపించి ఆరోపణలు చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. ‘‘నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి రేవంత్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అన్ని అనుమతులతోనే హాస్పటల్ కట్టాం. పేద ప్రజల కోసమే ఆసుపత్రి కట్టాను. ఎలాంటి అవకతవకలు జరగలేదని’’ మల్లా రెడ్డి అన్నారు. ‘‘జిరాక్స్ పేపర్లు పట్టుకొని వచ్చి రేవంత్‌రెడ్డి షో చేసాడు. పొద్దంతా అబద్ధాలు చెప్పటమే పనిగా పెట్టుకున్నాడు. నా కోడలు పేరు మీద ఉంది 5 ఎకరాలు కాదు 350 గజాలే. ఆ స్థలంలో హాస్పిటల్ కట్టాను. పేద ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నా. బట్టకాల్చి మీద వేయటమే రేవంత్ రెడ్డి పని’’ అంటూ మల్లారెడ్డి నిప్పులు చెరిగారు. ఇవీ చదవండి: తొడలు కొడుతూ, భుజాలు చరుస్తూ.. తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్ -
తొడలు కొడుతూ, భుజాలు చరుస్తూ..
‘వాడు స్టేజీ ఎక్కితే జోకర్.. స్టేజీ దిగిన తర్వాత బ్రోకర్’.. మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు. ‘అరే సాలే.. గూట్లే.. లఫంగ.. ఇద్దరమూ పదవులకు రాజీనామా చేద్దాం’ అంటూ రేవంత్‌కు మంత్రి మల్లారెడ్డి తొడలు కొట్టి సవాల్, దూషణలు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార, విపక్ష నేతల నడుమ దూషణల పర్వం పరాకాష్టకు చేరుకుంది. ప్రభుత్వం, పార్టీల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నేతలు స్వయంగా తిట్ల దండ కం అందుకుంటుండటంతో.. వారి అనుచరులు మీడియా సమావేశాలు, సోషల్ మీడియా వేదికగా ఏకంగా బూతు పురాణం అందుకుంటున్నారు. ఓ వైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక వాతావరణం, మరోవైపు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ క్షేత్రస్థాయిలో చేపడుతున్న సభలు, సమావేశాలు, యాత్రలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్త రాజకీయ శక్తులు వైఎస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, తీన్మార్ మల్లన్న వంటి వారు కూడా ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తున్నారు. పార్టీతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వస్తున్న ఆరోపణలు, విమర్శలను ఖండించేందుకు టీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా మీడియా ముం దుకు రావడంలో పోటీపడుతున్నారు. అయితే వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేందుకు ఆయా పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, ఉపయోగిస్తున్న భాష హద్దులు దాటి బూతులు మాట్లాడే దశకు చేరుకుంటోంది. టీఆర్ఎస్ సంస్థాగత కమిటీల ఏర్పాటు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’తో రాబోయే రోజుల్లో పరస్పర విమర్శలు, ఆరోపణలు తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా వింగ్‌లతో పరాకాష్టకు... అన్ని రాజకీయ పక్షాలు తమ కార్యకలాపాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు వాట్సాప్ గ్రూప్ లు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల మీద ప్రత్యేక ఖాతాలు తెరుస్తు న్నాయి. గ్రామస్థాయి నుంచే సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వార్తా పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చే వార్తలు, చర్చలు, ప్రసంగాల్లో తమకు అనువైనవి, ఎదుటి వారిపై చేసే విమర్శల్లో కొన్నింటిని ఎంపిక చేసుకుని నేతల అనుచరులు, కార్యకర్తలు పోస్ట్ చేస్తున్నారు. వీటిపై వచ్చే కామెంట్లు కూడా చెప్పలేని రీతిలో ఉంటున్నాయి. అదే రీతిలో సమాధానం ఇవ్వకపోతే వెనకబడి పోతామనే ఉద్దేశంతో అలా స్పందించాల్సి వస్తోందని అధికార పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. ‘న్యూటన్ సూత్రం ప్రకారం.. చర్యకు ప్రతిచర్య తప్పదు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తోంది. విమర్శలు సంస్కారవంతంగా ఉండాలి. ఏడేండ్లుగా ఓపిక పట్టిన మా కార్యకర్తలకూ సహనం నశించింది’ అని శుక్రవారం ప్రెస్మీట్లో మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు పా ర్టీలు, నేతలతో సంబంధం లేకుండా ‘అరేయ్.. ఒరేయ్’అంటూ ఏకవచనంతో వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చేసే వ్యాఖ్యలు రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి ఉదంతంతో పరాకాష్టకు చేరాయి. ఇక తొడలు కొడుతూ, భుజాలు చరుస్తూ మంత్రి మల్లారెడ్డి ప్రదర్శించిన హావభావాలు, దూషణల పర్వాన్ని తర్వాతి దశకు తీసుకెళ్లాయి. ఈ ఉదంతంపై సామా జిక మాధ్యమాలు, ఇతర వేదికల మీద జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆయా పార్టీల కార్యకర్తలు, నేతల అనుచరులు, అభిమానులు చేస్తున్న వ్యాఖ్యలు, పెడుతున్న పోస్టులు మరీ దారుణంగా ఉంటున్నాయి. రాయ లేని, చెప్పలేని భాషలో ఆడ, మగ తేడా లేకుండా తిట్ల దండకం అందుకుంటున్నారు. ఇటీవలి కాలంలో రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి మల్లారెడ్డి, పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, గ్యాదరి కిషోర్, మైనంపల్లి హన్మంతరావు, కాంగ్రెస్ నేతలు అద్దంకి దయా కర్, దాసోజు శ్రావణ్, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నాయకుడు రాకేశ్‌రెడ్డి తదితరులు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట పడకపోతే రాబోయే రోజుల్లో విమర్శల పర్వం దాడుల పర్వానికి దారి తీసే అవకాశముందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ‘గతంలో సున్నిత అంశాల మీద సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు తీవ్ర విధ్వంసానికి దారితీసిన ఘటనలున్నాయి. రాజకీయ నాయకులు కూడా ఆరోపణలు, విమర్శల విషయంలో సంయమనం పాటించకపోతే భౌతిక దాడులు, ఘర్షణలకు దారి తీసే ప్రమాదం పొంచి ఉందని’ఓ సీనియర్ పోలీసు అధికారి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. -
మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ లీడర్లు
-
మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
-
మంత్రి మల్లారెడ్డి ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం
-
రేవంత్‌రెడ్డికి సాయంత్రం వరకు గడువిస్తున్నా
-
తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మల్లారెడ్డి
-
‘మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే’
సాక్షి, సిద్ధిపేట: మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని షర్మిల పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆరోపించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాకపోవడంతో సిద్ధిపేట జిల్లా తోగుట మండలం వేములఘాట్‌కు చెందిన వృద్ధుడు తుటుకూరి మల్లారెడ్డి మనోవేదనతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టాడన్నారు. ప్రభుత్వం కూల్చివేసిన ఇంట్లోనే చితి పేర్చుకుని మల్లారెడ్డి చనిపోవడం గమనార్హం. తన భార్య పేరు మీద ఇల్లు ఉందని.. ఆమె ఇటీవల మరణించడంతో మల్లారెడ్డికి ఇల్లు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడాన్ని ఇందిరాశోభన్ తప్పుబట్టారు. భార్య మృతి చెందితే భర్తకు ఇల్లు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆమె ప్రశ్నించారు. కన్నతల్లి లాంటి ఊరును వదిలి వెళ్తున్న వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం అన్ని వసతులు సమకూర్చాల్సిన ప్రభుత్వం.. నిర్వాసితుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడమేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులే ఇందుకు బాధ్యత వహించాలన్నారు. మల్లన్న సాగర్ కింద భూ సేకరణ జరిగిన అన్ని గ్రామాల్లో ఇంకా పూర్తి స్థాయిలో నష్ట పరిహారం అందలేదని ఆందోళనలు జరుగుతున్న విషయాన్ని ఇందిరా శోభన్ గుర్తు చేశారు. తన ఫాంహౌస్ కోసం, కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేశారని ఆరోపించారు. మల్లారెడ్డి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ సాధ్యమైనంత త్వరగా పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. నిర్వాసితులకు తమ పార్టీ నాయకురాలు షర్మిల అక్క అండగా ఉంటారని, వారి పక్షాన న్యాయ పోరాటం చేస్తారని తెలిపారు. చదవండి: నిరుద్యోగంపై వైఎస్ షర్మిలకు తొలి విజయం