సీఎం దత్తత గ్రామంలో ‘పల్లెప్రగతి’ రచ్చ | Palle Pragathi Programme Hit By Protests In Medchal | Sakshi
Sakshi News home page

సీఎం దత్తత గ్రామంలో ‘పల్లెప్రగతి’ రచ్చ

Published Tue, Jun 7 2022 1:30 AM | Last Updated on Tue, Jun 7 2022 1:30 AM

Palle Pragathi Programme Hit By Protests In Medchal - Sakshi

ఎర్రబెల్లి, హరివర్ధన్‌రెడ్డి వాగ్వాదం 

శామీర్‌పేట్‌: మేడ్చల్‌ జిల్లాలో సీఎం దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో సోమవారం నిర్వహించిన ఐదోవిడత పల్లెప్రగతి కార్యక్రమం రసాభాసగా మారింది. కార్య క్రమానికి హాజరైన రాష్ట్రమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పల్లెప్రగతికి నిధులు ఎందుకు కేటాయించడంలేదని కాంగ్రెస్‌ పార్టీ జెడ్పీ ఫ్లోర్‌ లీడర్, స్థానిక జెడ్పీటీసీ హరివర్ధన్‌రెడ్డి స్టేజీ మీదే నిలదీశారు.

గతంలో చేసిన పల్లెప్రగతి పనులకు సర్పంచ్‌లు అప్పులు చేయాల్సి వచ్చిందని, మళ్లీ ఇప్పుడు ఐదో విడత అంటూ సర్పంచ్‌లపై భారం మోపు తోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల తో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే పోలీసులు ఆయనను బయటకు ఈడ్చుకువెళ్లారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మూడు చింత లపల్లి మండలాన్ని దత్తత తీసుకుని కోట్లాది రూపాయలు కేటాయించి అభివృద్ధి చేశారని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీల్లో పనికిరాని ఆందోళనలు చేసే లుచ్చాగాళ్లు ఉంటారని, వారి మాటలు నమ్మవద్దని ప్రజలను కోరా రు. కాంగ్రెసోళ్లు మూర్ఖులని, బీజేపోళ్లు చెడ గొట్టేవాళ్లని ధ్వజమెత్తారు. ఎంసీపల్లి, కీసర మండల కేంద్రాల్లో జరిగిన సభల్లోనూ మం త్రులు మాట్లాడుతూ బీజేపీ కూడా కాంగ్రె స్‌కు ఏమి తీసిపోలేదని, కాంగ్రెస్‌ అధికారం లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో పింఛన్‌ రూ.500 ఇస్తుండగా, బీజేపీ పాలిత గుజరాత్‌లో రూ.600 ఇస్తున్నారని, ఆ రెండు రాష్ట్రాల్లో నూ రైతుబంధు మాటేలేదని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement