palle pragathi program
-
15 రోజులు.. 6.51లక్షల మంది శ్రమదానం
సాక్షి,హైదరాబాద్: పల్లెల్లో సైతం పట్టణ సదుపాయాలు కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి (ఐదో విడత) కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఇందులో భాగంగా 12,769 గ్రామపంచాయతీలలో ప్రజలను భాగస్వా మ్యం చేస్తూ వివిధ కమిటీలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పలు అభివృద్ధి పనుల్లో 6.51 లక్షలమంది శ్రమదానం చేసినట్లు పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని యా శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 63 వేల కి.మీ. పొడవైన రోడ్లను, 36 వేల కి.మీ.పొడవైన మురుగు కాల్వలు, 80,405 సంస్థలను పరిశుభ్రం చేసినట్లు వెల్లడిం చారు. 19,349 లోతట్టు ప్రాంతాలు, 1,098 పనికి రాని బోరుబావులు, 1,902 నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చి వేయగా.. అవెన్యూ ప్లాంటేషన్ కోసం 10,946 కి.మీ రోడ్లు గుర్తించడంతో పాటు 17,710 విద్యుత్ స్తంభాలకు మూడో వైరును, 1,206 విద్యుత్తు మీటర్లు సమకూర్చినట్లు తెలిపారు. మొత్తం 15 రోజుల పాటు జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు కలిపి మొత్తం 8,286 మంది, రాష్ట్రస్థాయి అధికారులు 10,012 పాల్గొన్నారని వివరించారు. ‘ప్రగతి’సోపానాలివే...: పల్లె ప్రగతిలో ఇప్పటివ రకు రూ.116 కోట్లతో 19,472 పల్లె ప్రకృతి వనాలు, రూ.1,555 కోట్లతో 12,669 వైకుంఠధా మాలు, రూ.318 కోట్లతో 12,753 డంపింగ్ యార్డులు నిర్మించినట్లు సుల్తాని యా తెలిపారు. 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు రూ.9,800 కోట్ల మేర గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంటు మంజూరు చేయగా..గ్రామాల్లో అభివృద్ధి కార్య క్రమాల నిమిత్తం ప్రతీనెల రూ.256.66 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. 545 గ్రామీణ మండలాల్లో మండలానికి ఐదు చొప్పున 5 నుంచి 10 ఎకరాల్లో 2,725 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, వీటిలో 594 బృహత్ వనాలు ఏర్పాటు కాగా మిగిలినవి పురోగతిలో ఉన్నాయని తెలిపారు. -
సీఎం దత్తత గ్రామంలో ‘పల్లెప్రగతి’ రచ్చ
శామీర్‌పేట్: మేడ్చల్ జిల్లాలో సీఎం దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో సోమవారం నిర్వహించిన ఐదోవిడత పల్లెప్రగతి కార్యక్రమం రసాభాసగా మారింది. కార్య క్రమానికి హాజరైన రాష్ట్రమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పల్లెప్రగతికి నిధులు ఎందుకు కేటాయించడంలేదని కాంగ్రెస్ పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్, స్థానిక జెడ్పీటీసీ హరివర్ధన్‌రెడ్డి స్టేజీ మీదే నిలదీశారు. గతంలో చేసిన పల్లెప్రగతి పనులకు సర్పంచ్‌లు అప్పులు చేయాల్సి వచ్చిందని, మళ్లీ ఇప్పుడు ఐదో విడత అంటూ సర్పంచ్‌లపై భారం మోపు తోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల తో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే పోలీసులు ఆయనను బయటకు ఈడ్చుకువెళ్లారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మూడు చింత లపల్లి మండలాన్ని దత్తత తీసుకుని కోట్లాది రూపాయలు కేటాయించి అభివృద్ధి చేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో పనికిరాని ఆందోళనలు చేసే లుచ్చాగాళ్లు ఉంటారని, వారి మాటలు నమ్మవద్దని ప్రజలను కోరా రు. కాంగ్రెసోళ్లు మూర్ఖులని, బీజేపోళ్లు చెడ గొట్టేవాళ్లని ధ్వజమెత్తారు. ఎంసీపల్లి, కీసర మండల కేంద్రాల్లో జరిగిన సభల్లోనూ మం త్రులు మాట్లాడుతూ బీజేపీ కూడా కాంగ్రె స్కు ఏమి తీసిపోలేదని, కాంగ్రెస్ అధికారం లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో పింఛన్ రూ.500 ఇస్తుండగా, బీజేపీ పాలిత గుజరాత్లో రూ.600 ఇస్తున్నారని, ఆ రెండు రాష్ట్రాల్లో నూ రైతుబంధు మాటేలేదని అన్నారు. -
నేటి నుంచి ‘పల్లె ప్రగతి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం నుంచి 15 రోజుల పాటు జరగనున్న ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే 4 విడతలుగా జరిగిన ఈ కార్యక్రమంలో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రత, పచ్చదనంతో వెల్లివిరిసేలా చేసేందుకు చర్య లు చేపట్టారు. తాజాగా ఐదో విడతలో భాగంగా తొలి రోజు గ్రామసభ నిర్వహించి పల్లె ప్రగతి ప్రణాళిక తయా రుచేయాలి.పంచాయతీల ఆదాయ వ్యయాలు, నాలుగు విడతల్లో సాధించిన ఫలితాలను నివేదిక రూపంలో గ్రామసభ ఎదుట చదివి వినిపించాలి. ఇక కార్యక్రమంలో భాగంగా అన్ని రోజులు రోడ్లు, డ్రైన్లు శుభ్రపరచాలి. 2 రోజుల పాటు ప్రజోపయోగ సంస్థలను శుభ్రం చేయడం, ఆయా సంస్థల ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం చేపట్టాలి. ఒకరోజు పవర్‌డే పాటించాలి. ఒక రోజు గ్రామస్తుల సహకారంతో శ్రమదానం ద్వారా పిచి్చమొక్కలు తొల గించి, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి. గ్రామ నర్సరీని సందర్శించి మొక్కల ఎదుగుదలను పరిశీలించాలి. విలేజ్ డంపింగ్ యార్డు, వైకుంఠధామం తదితరాలను పరిశీలించి.. సమస్యలుంటే పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ‘తెలంగాణ క్రీడా ప్రాం గణాల’ ఏర్పాటు పై శ్రద్ధ వహించాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐదో విడత ప్రాథమ్యాలను గురు వారం ప్రకటించింది. -
రూపాయి బకాయి కూడా లేదు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, అద్భుతంగా తీర్చిదిద్దుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లతో గురువారం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా గ్రామ పంచాయతీలకు రూ.256 కోట్ల చొప్పున విడుదల చేసిందని, ఈ నెల మొత్తం కూడా ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. ఈ లెక్కన రూ.10 వేల కోట్లు గ్రామ పంచాయతీలకు అందజేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. గ్రామ పంచాయతీలకు రూపాయి కూడా పెండింగ్‌లో లేదన్నారు. ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమం ఈ నెల 3 నుంచి 17 వరకు జరుగుతుందని.. ప్రజాప్రతినిధులంతా తప్పనిసరిగా పాల్గొనాలని కేటీఆర్ స్పష్టం చేశారు. బిల్లులు ఎక్కడా పెండింగ్‌లో లేవని, సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అబద్ధమని చెప్పారు. ఇప్పటివరకు 1,39,152 చెక్కుల ద్వారా రూ.696.71 కోట్లను ఆర్థికశాఖ క్లియర్ చేసిందని.. మిగతా పెండింగ్ చెక్కులేవైనా ఉంటే వెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రెండు నెలలుగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన రూ.1,400 కోట్లు విడుదల చేయలేదని.. వెంటనే అవి విడుదల చేసేలా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేంద్రం నుంచి రూ.1,400 కోట్ల బకా>యిలు విడుదలయ్యేలా పోరాడాలని సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులూ ఇవ్వకుండా.. కొత్త సాఫ్ట్వేర్ పేరుతో ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. బండి సంజయ్ దీక్ష ఎందుకో చెప్పాలి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. దీక్ష ఎందుకు? ఎవరి మీద? చేస్తున్నారో స్పష్టం చేయాలని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వని కేంద్రం మీదా? కేంద్రం ఇవ్వకపోయినా ఇచ్చిన రాష్ట్రం మీదా? అన్నది చెప్పిన తరువాతే ఆయన దీక్ష చేయాలన్నారు. -
పల్లెప్రగతి అంతా డొల్ల..అందుకు జయశంకర్ స్వగ్రామమే నిదర్శనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పల్లెప్రగతి కార్యక్రమం డొల్లతనానికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామంలో జరిగిన అభివృద్ధే నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధిలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు వరంగల్ జిల్లాలో శనివారం పర్యటించిన సందర్భంగా తన దృష్టికి వచ్చిన విషయాలను వివరిస్తూ సీఎం కేసీఆర్‌కు రేవంత్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ‘ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నాను. అది ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం. ఆయన లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించడం కష్టం. కానీ, రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లవుతున్నా ఆ గ్రామంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించట్లేదు. కనీస మౌలిక సదుపాయాల్లేవు. రెవెన్యూ గ్రామమనే హోదా కూడా ఇవ్వలేదు. ఆ ఊరికి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. నిరుపేద దళితుడు సిలివేరు జానీ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. మీరేమో మిషన్ భగీరథ, దళితబంధు అని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. జయశంకర్ గ్రామంలో అభివృద్ధి జరగకపోవడం ఆ పెద్దమనిషి మీద మీకు ఎంత విద్వేషం, వ్యతిరేక భావం ఉన్నాయో చెబుతోంది. వెంటనే భగీరథ ద్వారా ఆ గ్రామానికి నీళ్లివ్వాలి. గ్రామంలోని నిరుపేద దళితులను ఆదుకోవాలి. అక్కంపేట అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి’అని ఆ లేఖలో పేర్కొన్నారు. వరంగల్ ఓఆర్ఆర్తో పచ్చని పొలాల్లో చిచ్చు వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టు కోసం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ద్వారా పెద్ద ఎత్తున భూ సేకరణకు సిద్ధం చేస్తున్నారని.. ఆ ప్రాజెక్టు పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోందని రేవంత్ అన్నారు. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాలకు చెందిన 21,517 ఎకరాల భూమిని సేకరించడం ద్వారా లక్ష మందికి పైగా రైతులు, కౌలుదారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఓఆర్ఆర్ పేరుతో చిన్న, సన్నకారు రైతుల భూమిని లాక్కుంటే వారెలా బతకాలని ప్రశ్నించారు. అభివృద్ధి ముసుగులో పేదల ఉసురు తీయొద్దని, భూ సేకరణ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతులకు కంటి మీద కునుకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. ఆ భూ సేకరణ జీవోను విరమించుకుంటున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే రైతులతో కలిసి కాంగ్రెస్ ఉద్యమిస్తుందని లేఖలో రేవంత్ వెల్లడించారు. -
ఢిల్లీ నుంచే పల్లెకు నిధులా.. ఇదేం చిల్లర..?
సాక్షి, హైదరాబాద్: ‘‘పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చాక.. నాటి రాజీవ్‌గాంధీ నుంచి నేటి మోదీ వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రం నుంచే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారంగా ఉంది. జవహర్ రోజ్‌గార్ యోజన, ప్రధాని గ్రామసడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సరికాదు. స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి. ఏం అవసరం, ఏమేం చేయాలన్నది తెలుస్తుంది. కానీ రోజువారీ కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం ఏమిటి?..’’అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. 75 ఏళ్ల ఆజాదీకి అమృత్ మహోత్సవాలు జరుపుకొంటున్న సమయంలో కూడా.. దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయని, తాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారని.. కేంద్రం తీరే దీనికి కారణమని విమర్శించారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో కూడా రావాల్సినంత ప్రగతి రాలేదని.. కేంద్రం వీటిపై దృష్టి పెట్టకుండా రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్రంలో పల్లె/ పట్టణ ప్రగతి కార్యక్రమాలు, వరి ధాన్యం సేకరణ, పలు ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జూన్ 3 నుంచి ‘ప్రగతి’బాట ఈ నెల 20 నుంచి నిర్వహించ తలపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వేసవి నేపథ్యంలో జూన్ 3 నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పల్లె ప్రగతిలో ఎంపీపీలు, ఎంపీడీవోల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. 100 శాతం బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) గ్రామాల సాధనకు చర్యలు తీసుకోవాలని, వైకుంఠ ధామాల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలకు విశేష గుర్తింపు, ఆదరణ లభించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో తొలిదశలో పదికి పది గ్రామాలు, రెండో దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును సీఎం అభినందించారు. ‘‘కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అందరి అనుమానాలను పటాపంచలు చేసి.. తెలంగాణ పల్లెలను అభివృద్ధి పథాన నడిపించుకుంటున్నాం. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేసుకొని ప్రగతి సాధిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభ దశలో తీసుకున్న నిర్ణయాలు, ఎంచుకున్న ప్రాధాన్యతా క్రమాలు కొందరికి జోక్ లాగా కనిపించాయి. అడవుల పరిరక్షణపై సమీక్ష నిర్వహిస్తే ఈ అడవులేంటి అని నవ్వుకున్నారు. నేడు దేశ పర్యావరణం, పచ్చదనంలో తెలంగాణ భాగస్వామ్యం అగ్రభాగాన నిలిచింది. అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధిని కొన్ని జాతీయ మీడియా ఛానళ్లు ప్రసారం చేయగా.. ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపోయాయి. నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. అనతికాలంలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించాం’’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పంటల ఉత్పత్తి, తలసరి ఆదాయంలో ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌తోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి దశబ్దాలుగా స్థిరపడిన రాష్ట్రాలకంటే తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని చెప్పారు. పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే వేడుకల్లో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని.. రాష్ట్ర ప్రగతిని తెలియజేస్తూ ప్రసంగాలు ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు సమగ్ర సమాచారంతో ప్రసంగాలను తయారుచేయాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో కార్యక్రమాలను ఉదయం 9 గంటలకే ప్రారంభించి, త్వరగా ముగించాలని సూచించారు. సాయంత్రం పూట జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం నిర్వహించాలని సూచించారు. తెలంగాణ కేంద్రంగా కవితలను తీసుకురావాల్సిందిగా కవులను, రచయితలను ఆహ్వానించాలని కోరారు. మెరుగైన వైద్య సదుపాయాలతో.. రాష్ట్రంలో మొత్తం 10 వేల పడకల సామర్థ్యంతో కొత్త మల్టీ/సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను నిర్మించుకోనున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. వరంగల్‌లో 24 అంతస్తుల్లో 38 విభాగాలతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని.. హైదరాబాద్‌లోని అల్వాల్, సనత్‌నగర్, గడ్డిఅన్నారం, గచ్చిబౌలిలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కలిపి 57 వేల ఆక్సిజన్ బెడ్లు, 550 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రాష్ట్రం కలిగి ఉందని పేర్కొన్నారు. పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ ప్రపంచానికి ‘గ్రీన్ ఫండ్ కాన్సెప్ట్’ను తెలంగాణ రాష్ట్రమే పరిచయం చేసిందని.. స్థానిక సంస్థల బడ్జెట్లో 10 శాతం నిధులను హరితహారానికి కేటాయించడం తప్పనిసరని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో 2,087 ఎకరాల్లో నిర్మించిన పార్కును ఆదర్శంగా తీసుకొని.. ఇతర జిల్లాల్లో కూడా అర్బన్ పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌కు ఓఆర్ఆర్ గ్రీన్ నెక్లెస్ వంటిదని, దాని గ్రీనరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. జాతీయ రహదారులకు ఇరువైపులా చెట్ల పెంపకం, మల్టీ లేయర్ ప్లాంటేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అడవుల పునరుద్ధరణ ద్వారా కోల్పోయిన స్వర్గాన్ని మళ్లీ తెచ్చుకుందామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్, వ్యవసాయ, సంక్షేమ పథకాలను రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ప్రజలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని.. కర్ణాటకలోని రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణ పథకాలను కర్ణాటకలో అమలు చేయాలని, లేకపోతే తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని కోరుతున్నారని గుర్తు చేశారు. ఇక ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించిన సీఎం కేసీఆర్.. తూకం, గన్నీ బ్యాగులు, రవాణ, మిల్లుల్లో దిగుమతి తదితర అంశాలపై ఆరా తీశారు. మొత్తంగా 56 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని అధికారులు నివేదించారు. సీఎం సమీక్షలో మరిన్ని ఆదేశాలివీ.. – ప్రతి గ్రామంలో వైకుంఠధామానికి 10 రోజుల్లోగా మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్ ఇవ్వాలి. – పాఠశాలలు, అంగన్వాడీలు, ఆస్పత్రులు తదితర ప్రజావినియోగ సంస్థల పారిశుధ్యం, తాగునీటి సరఫరా తదితర బాధ్యతలను గ్రామపంచాయతీలు నిర్వహించేలా డీపీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – మున్సిపల్ వార్డుల్లో నర్సరీలు ఏర్పాటు చేయకపోతే, దానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఈ నర్సరీల విషయంలో తనిఖీలను చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్లు కూడా పర్యవేక్షించాలి. – ‘దళితబంధు’పథకం కోసం ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గంలో 1,500 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొనసాగించాలి. ఎంపిక పూర్తయిన తర్వాత దశలవారీగా పథకాన్ని అమలు చేయాలి. -
‘పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి’పై సీఎం సమీక్ష 18న
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈనెల 18న ప్రగతిభవన్‌లో ‘పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి’కార్యక్రమాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. సమీక్ష సమావేశంలో మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్‌బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డీపీవోలు, అటవీశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు పాల్గొంటారు. -
పల్లె, పట్టణ ప్రగతి తరహాలో ‘వ్యవసాయ ప్రగతి’ రైతుకు ఊతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల తరహాలోనే.. రైతుల కోసం ప్రత్యేకంగా ‘వ్యవసాయ ప్రగతి’ని చేపట్టాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. పొలాల్లో భూసార పరీక్షలు, విత్తనాలు వేయడం మొదలు పంట ఉత్పత్తుల విక్రయాల దాకా అన్ని అంశాల్లో విస్తృత అవగాహన కల్పించడం, అవసరమైన సాయం అందించడం లక్ష్యంగా ఈ సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. దీనిపై వ్యవసాయ శాఖ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ కార్యక్రమాన్ని ఎప్పటినుంచి అమల్లోకి తేవాలన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా.. ఈ వానాకాలం సీజన్ నుంచే మొదలుపెట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే ‘వ్యవసాయ ప్రగతి’ని ప్రకటించవచ్చని అంటున్నాయి. ప్రతీ సీజన్ (వానాకాలం, యాసంగి)కు ముందు వ్యవసాయ ప్రగతి కార్యక్రమం ఉండేలా.. అంటే ఏటా రెండుసార్లు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. రైతువద్దకే యంత్రాంగమంతా.. ప్రభుత్వం పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల కింద ఎన్నో పనులు చేపడుతోంది. సంబంధిత శాఖల సమన్వయంతో.. పారిశుధ్యం, దోమల నివారణ, రోడ్ల వెంబడి, ఖాళీ స్థలాల్లో పిచ్చి చెట్లను తొలగించడం, శిథిలాల తొలగింపుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలనూ నిర్వహిస్తోంది. ఇదే తరహాలో వ్యవసాయ సీజన్లకు ముందు ‘వ్యవసాయ ప్రగతి’ చేపట్టాలని.. వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) మొదలు జిల్లాస్థాయి అధికారుల దాకా రైతుల వద్దకే వెళ్లేలా కార్యక్రమానికి రూపకల్పన చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏయే చోట్ల, ఏయే పంటలు వేయాలి? ఎంత మేర సాగు చేయాలి? అన్నది నిర్ధారించి.. ఈ వ్యవసాయ ప్రణాళికపై రైతులకు అవగాహన కల్పిస్తారు. వివిధ శాఖల సమన్వయంతో.. రైతులకు సంబంధించి వ్యవసాయశాఖతోపాటు నీటిపారుదల, విద్యుత్, పంచాయతీరాజ్ వంటి శాఖలతోనూ అవసరం ఉంటుంది. రిజర్వాయర్లు, నదులున్నచోట కాలువల్లోకి నీటికి ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై నీటి పారుదలశాఖ స్పష్టత ఇస్తుంది. ఆ మేరకు రైతుల వద్దకు నీటిపారుదల అధికారులు కూడా వస్తారు. అలాగే విద్యుత్ మోటార్లకు సక్రమంగా కరెంటు సరఫరా అయ్యేలా చూడటం, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలకు సంబంధించి విద్యుత్ అధికారులు వస్తారు. అలాగే జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కూడా రైతుల వద్దకు వచ్చి పంటలు, సాగుపై సూచనలు చేస్తారు. ఆయా శాఖలు, విభాగాలతో వ్యవసాయశాఖ సమన్వయం చేసుకొని ‘వ్యవసాయ ప్రగతి’ కార్యక్రమం చేపడతుంది. మరోవైపు రైతు వేదికలను ఆధారం చేసుకొని మరికొన్ని కార్యక్రమాలను చేపడతారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, కంది వేయాలన్న ప్రభుత్వ సూచనల మేరకు వీటిపైనా రైతులకు అవగాహన కల్పిస్తారు. పంట పండించాక మద్దతు ధరలు ఎలా ఉంటాయి, ఏయే పంటలకు ఎక్కడ అధిక ధరలు లభించే అవకాశం ఉందన్న సూచనలూ చేస్తారు. వరి పొలాల్లో అంతర పంటగా చేపల పెంపకం చేపట్టాలని నిర్ణయించారు. కొన్నిదేశాల్లో ఇలా చేపల పెంపకం జరుగుతున్నందున.. ఆయాచోట్ల అధ్యయనం చేశాక ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రభుత్వం విస్తృతస్థాయిలో ‘వ్యవసాయ ప్రగతి’కి రూపకల్పన చేస్తున్నా.. ఎక్కడైనా లోపాలు ఉంటే రైతుల ఆగ్రహానికి కూడా గురికావాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. వ్యవసాయ ప్రగతి కింద చేపట్టే కార్యక్రమాలివీ..! వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్న ప్రకారం.. భూసార పరీక్షల నుంచి విత్తనాలు, యాంత్రీకరణ, రుణాలు, పంట అమ్మకాల దాకా దాదాపు అన్ని అంశాల్లో రైతులకు తోడ్పడే కార్యక్రమాలను ‘వ్యవసాయ ప్రగతి’కింద చేపట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు కసరత్తు మొదలుపెట్టారని తెలిసింది. – గ్రామాల్లో మొబైల్ టెస్టింగ్ సెంటర్ల ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి.. వాటి ఫలితాలకు అనుగుణంగా ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో రైతులకు సూచిస్తారు. రైతులు ఆయా నేలలకు అవసరమైన ఎరువులు మాత్రమే వాడాలి. ఎక్కువ వాడితే పంట విషపూరితం అవుతుంది. కాబట్టి మోతాదును నిర్ణయిస్తారు. – కొందరు రైతులు వానలు మొదలవగానే విత్తనాలు వేస్తారు. కానీ నిర్ణీత మోతాదులో వర్షం పడ్డాక మాత్రమే విత్తనాలు వేయాలి. లేకుంటే వృథా అవుతుంది. అందువల్ల వర్షం ఏమేరకు పడితే.. విత్తనాలు వేయాలో సూచిస్తారు. ముఖ్యంగా పత్తి రైతులు తొలివానకే విత్తనం వేయడం, తర్వాత కొద్దిరోజులు వానలు లేక.. విత్తనాలు మాడిపోవడం తరచూ జరుగుతోంది. అధికారులు ఈ సమస్యకు చెక్‌పెడతారు. – వ్యవసాయ కేలండర్ ప్రకారం ఏ నెలలో ఏ పంటలు వేయాలన్న దానిపై రైతులకు స్పష్టమైన సూచనలు చేస్తారు. శాస్త్రీయ పద్దతుల్లో పంటలు వేయకపోతే దాని ప్రభావం దిగుబడిపై పడుతుందన్నది వివరిస్తారు. – పంటలకు తగిన విత్తనాలను ఎంచుకోవడంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. కల్తీ విత్తనాలు కొనకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకంగా తెలియజేస్తారు. మరోవైపు కల్తీ విత్తనాలపై టాస్క్‌ఫోర్స్ బృందాలతో దాడులు నిర్వహిస్తారు. – వర్షాలు సకాలంలో పడకపోయినా, వానల మధ్య ఎక్కువ రోజులు విరామం వచ్చినా.. పంటల రక్షణకు ఎలాంటి పద్ధతులు అనుసరించాలో తెలియజేస్తారు. అవసరమైతే స్వల్పకాలిక, మధ్యకాలిక పంటల వివరాలు తెలియజేస్తారు. – ఏ పంటకు ఎంత నీరు అవసరమనేది తెలియజేస్తారు. మన దగ్గర అవసరానికి మించి నీటిని వినియోగిస్తున్నారన్న విమర్శలు ఉన్నందున.. రైతులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తారు. – వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వం వ్యవసాయ యంత్రాల కోసం ఇస్తున్న సబ్సిడీని తెలియజేస్తారు. అవసరమైతే రైతు వేదికల వద్ద ఆయా యంత్రాలను ప్రదర్శిస్తారు. కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఎక్కువగా ప్రోత్సహించి వ్యవసాయ యాంత్రీకరణవైపు రైతులను మళ్లిస్తారు. – రైతుబంధు అందరికీ అందేలా ప్రత్యేక చర్యలు చేపడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను పెట్టే ఆలోచన ఉన్నట్టు సమాచారం. – రైతుబీమా ఉండీ, సొమ్ము అందని వారు ఎవరైనా ఉంటే.. వివరాలను సేకరించి ఎల్ఐసీకి పంపిస్తారు. – బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇప్పించేలా స్థానిక అధికారులు కృషిచేస్తారు. రైతుబంధు సొమ్మును అప్పుల కింద జమ చేసుకోకుండా బ్యాంకర్లతో చర్చలు జరుపుతారు. – పంటలు చేతికొచ్చాక మద్దతు ధరకు మించి అధికంగా ఎక్కడ ధరలు అందుబాటులో ఉంటాయో, వాటిని ఎలా తెలుసుకోవాలో రైతులకు వివరిస్తారు. -
పోటాపోటీగా ‘పల్లె ప్రగతి’!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అభివృద్ధి అంశంలో పల్లెల మధ్య పోటీ నెలకొంది. కొత్తగా పనుల గుర్తింపు, అసంపూర్తిగా ఉన్న పనుల పూర్తి, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లతో తమ గ్రామాన్ని ఆదర్శంగా నిలిపేందుకు పంచాయతీ కార్యదర్శులు, పాలకవర్గాలే కాకుండా ప్రజలు పోటీ పడుతున్నారు. అధికారులు సైతం పల్లె ప్రగతి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని సంబంధిత అధికారులు, ఉద్యోగులను హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు పల్లె ప్రగతిలో చేపడుతున్న పనుల పురోగతి, పారిశుద్ధ్యం, పంచాయతీ కార్యాలయాల తనిఖీలు, గ్రామసభల నిర్వహణ, విద్యుత్ బిల్లుల వసూళ్లపై క్షేత్రస్థాయి నుంచి ప్రగతి నివేదికలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం ఉత్తమ, చెత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను గుర్తించి సంబంధిత అధికారులకు నివేదిస్తోంది. మూడో విడత పల్లె ప్రగతిలో పనుల పురోగతిని సమీక్షించిన ప్రభుత్వం పారిశుద్ధ్యం, పచ్చదనం–పల్లె ప్రకృతి వనాలు, పన్ను వసూళ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల అంశాలపై ఉత్తమ జిల్లాల జాబితాను గత నెలలో వెల్లడించింది. ఇదే సమయాన పెద్దగా పురోగతి లేని ఐదు జిల్లాల వివరాలను ప్రకటించారు. దీంతో నాలుగో విడతలోనూ ‘ఉత్తమ’ జాబితాలో స్థానం పొందేలా ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నారు. మరోవైపు చేపడుతున్న పనులతో పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నాలుగో విడత. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జూలై ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించిన అధికారులు అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులను గుర్తించి వాటిని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని విడతల్లో కలిపి 51,076 గ్రామ సభలు జరిగాయి. కాగా, మూడో విడతలో జరిగిన పనులను ఆరు అంశాల్లో పరిశీలించిన ప్రభుత్వం... ఉత్తమమైన, పనుల్లో పురోగతిలో లేని ఐదేసి చొప్పున జిల్లాలను ఎంపిక చేసి వెల్లడించింది. పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఏళ్లుగా తీరని ప్రధాన సమస్యలు పల్లె ప్రగతితో పరిష్కారమవుతూ గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. పల్లె ప్రగతిలో భద్రాద్రి జిల్లా నాలుగు విభాగాల్లో రాష్ట్రంలోనే టాప్ ఐదు స్థానాల్లో నిలిచింది. – రమాకాంత్, డీపీఓ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
మూడు వాగులు.. ఆరు కిలోమీటర్లు..
సాక్షి, ఆసిఫాబాద్(తిర్యాణి): పల్లె ప్రగతి పనుల పరిశీలనకు కుమ్రంభీం జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి అటవీ బాటపట్టారు. బుధవారం తిర్యాణి మండలం రోంపెల్లి నుంచి గుండాల గ్రామం వరకు దట్టమైన అటవీ ప్రాంతంలో ఆరు కిలోమీటర్ల నడకలో మూడు వాగులు దాటారు. గుండాలలో పల్లె ప్రగతి పనులు, జలపాతం సందర్శించారు. గ్రామస్తులతో సమావేశమై ఎకో టూరిజం డెవలప్మెంటు ద్వారా గుండాల జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, తద్వారా ఇక్కడి 20 మంది యువకులకు స్వయం ఉపాధి లభిస్తుందని తెలిపారు. జలపాతం వద్ద గుడారాలను ఏర్పాటు చేసి పర్యాటకుల సంఖ్య మరింత పెరిగేలా చర్యలు చేపడతామని, రొంపెల్లి నుంచి గుండాల వరకు రోడ్డు సౌకర్యం కోసం ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపారు. ఆయన వెంట గిన్నెదరి ఫారెస్టు రేంజ్ అధికారి ప్రణయ్, ఈజీఎస్ ఏపీవో శ్రవణ్‌కుమార్, సర్పంచ్ జంగుబాయి, పంచాయతీ కార్యదర్శి రాధాకిషన్, ఆదివాసీ నాయకులు శంకర్, కోవ మెతిరాం, సీతారాం, అశోక్ ఉన్నారు. -
పల్లెప్రగతికి ఆహ్వానం అందలేదని జెడ్పీటీసీ మనస్తాపం, దాంతో
చిలప్‌చెడ్(నర్సాపూర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమాలు చిలప్‌చెడ్ మండలోని గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగిన్పప్పటికీ ఏ ఒక్క రోజు, ఏ కార్యక్రమానికి స్థానిక జెడ్పీటీసీ చిలుముల శేషసాయిరెడ్డికి ఆధికారిక ఆహ్వానం అందలేదు. దీంతో మనస్థాపానికి గురైన శేషసాయిరెడ్డి శనివారం టీఅర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శేషసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జరిగిన పది రోజుల పల్లెప్రగతి కార్యక్రమాలకు మండల పర్యటనకు నాలుగు సార్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వచ్చారు. మండలంలోని అన్ని గ్రామాలు, తండాల్లో హరితహారం కార్యక్రమం, రైతు వేదికలు, పల్లెప్రకృతి వనాలకు ప్రారంభోత్సవాలు చేశారు. కానీ ప్రోటోకాల్ ప్రకారం తనకు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందకపోవడంతోనే హాజరు కాలేదని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన చిలప్‌చెడ్ మండల జెడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలిచి, మండల అభివృద్ధిలో తనవంతు కృషి చేస్తున్నప్పటికీ, ఈ కార్యక్రమాలకు తనను అధికారులు మరచిపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. -
ఖమ్మం : రసాభాసగా మల్లవరంలో పల్లెప్రగతి కార్యక్రమం
-
CM KCR: ‘ప్రగతి’ చూపకుంటే మారాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్య క్రమాల అమలు ఆశిం చిన రీతిలో లేకపోవ డంపై సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు. దీంతో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు చివరి హెచ్చ రిక జారీ చేయనున్నారు. ఇందుకోసం ఈ నెల 28న ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన సమా వేశం.. రెండు రోజులు ముందుకు జరిగి ఈ నెల 26వ తేదీకి మారింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా పంచాయతీ అధి కారి (డీపీఓ), జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల (డీఆర్డీఓ)ను తమ వెంట తీసుకురావాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులందరూ తప్పకుండా హాజరుకావాలని చెప్పింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాల అమలుపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు సీఎం మరోసారి దిశానిర్దేశం చేయనున్నారు. పది రోజుల సమయం ఇటీవల సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతి, హరిత హారం కార్యక్రమాల అమలును ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. ఆశించిన రీతిలో పురోగతి లేదని ఆయన గుర్తించినట్టు సమాచారం. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి పల్లె/పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల అమలుపై తన ఆశయాలు, లక్ష్యాలను సవివరంగా చెప్పారు. అయినా క్షేత్రస్థాయిల్లో పరిస్థితులు మారట్లేదని తాజాగా నిర్వహించిన పర్యటనల్లో సీఎం ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వెంటనే మరోసారి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మూడు కార్యక్రమాల అమలు విషయంలో తన ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను చివరిసారిగా వారికి స్పష్టం చేయాలని కేసీఆర్ ఈ సమావేశానికి తలపెట్టినట్టు సమాచారం. ఈ కార్యక్రమాల అమలుతో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తే లేదని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీఓలు, డీఆర్డీఓలకు ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేయనున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు మరోసారి వారం పది రోజుల సమయం ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల్లో ఆకస్మిక తనిఖీలు వచ్చే నెల నుంచి ముఖ్యమంత్రి రెండో విడతగా జిల్లాల్లో పర్యటించి ఈ కార్యక్రమాల అమలుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కలెక్టర్లతో నిర్వహించనున్న సమావేశంలో వానా కాలం సాగు, రైతుబంధు పంపిణీ, ధరణి సమస్యల పరిష్కారం, పాఠశాలల పునఃప్రారంభం తదితర అంశాలపై సైతం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. -
రంగారెడ్డి క్లీన్.. మంత్రి జిల్లా స్లీప్
సాక్షి, హైదరాబాద్: ‘పల్లె ప్రగతి’లో వరంగల్ రూరల్ జిల్లా వెనుకబడింది. ఈ జిల్లా గురించి ప్రత్యేక ప్రస్తావన ఎందుకంటే.. ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌శాఖకు ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రి. ఆ మంత్రి సొంత జిల్లా వరంగల్‌రూరల్. అదీ అసలు సంగతి! ‘పల్లె ప్రగతి’లోని అంశాలపై పంచాయతీరాజ్ శాఖ అంతర్గత సర్వే నిర్వహించింది. దీని ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు కేటాయించింది. మొదటి ర్యాంకును రంగారెడ్డి సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ములుగు, సిద్ది పేట ఉన్నాయి. చివరివరుసలో వరంగల్ అర్బన్, వికారాబాద్, వరంగల్ రూరల్ జిల్లాలున్నాయి. మూడు నెలలకోసారి... ప్రతి మూడు నెలలకోసారి పల్లెప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో క్లీన్ అండ్ గ్రీన్, శిథిల భవనాల కూల్చివేత, మురుగు కాల్వల్లో వ్యర్థాల తొలగింపు, చెత్త సేకరణ, వర్షపునీరు నిల్వ ఉండకుండా గుంతల పూడ్చివేత, దోమల నివారణాచర్యలను పంచాయతీలు చేపడుతున్నాయి. వీటితోపాటు వైకుంఠధామం, నర్సరీల నిర్వహణ, డంపింగ్ యార్డుల పనుల పురోగతిని కూడా చేర్చారు. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతి ఒరవడిని రోజూ కొనసాగించాలని రాష్ట్ర సర్కారు పంచాయతీలను ఆదేశించింది. అయితే, ఈ పనులు ఎంతమేరకు అమలవుతున్నాయో తెలుసుకోవాలనుకుంది సర్కారు. అకస్మా త్తుగా గ్రామాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వా లని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. ప్రొఫార్మాను కూడా ఇచ్చింది. వీధుల పరిశీలన, మురుగు కాల్వల శుభ్రం, అంగన్వాడీ, పాఠశాలలు, పీహెచ్సీ, వీధిదీపాల పనితీరు, యాంటీ లార్వా పనులు, కోవిడ్–19 నివారణాచర్యల పరిశీలనకుగాను ఉన్నతాధికారులు గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 1,037 గ్రామాల్లో పర్యటించి జిల్లాలకు ర్యాంకులు కేటాయించారు. -
పల్లె ప్రగతిలో సంగారెడ్డి టాప్:హరీష్ రావు
సాక్షి, సంగారెడ్డి: పల్లెప్రగతిలో సంగారెడ్డి జిల్లా ప్రథమస్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు. పఠాన్ చేరు నియోజకవర్గంలో జరిగిన ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 55 గ్రామాలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు గ్రామాలకు సొంత నిధులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు పంపిణీ చేయడం రాష్టం లోనే ప్రథమం అన్నారు. ప్రతి గ్రామంలో తాగునీరు, 24 గంటల విద్యుత్,మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. వచ్చే నెలరోజుల్లో జిల్లాలో వైకుంఠ ధామాలు, రైతు వేదికలు పూర్తిస్థాయిలో నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. జిల్లాలో 100 పడకల కరోనా ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, భయపడకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. కరోనా బారినపడిన వారిని చులకనగా చూడొద్దని మంత్రి హరీష్‌రావు తెలిపారు. -
త్వరలోనే విద్యుత్ చార్జీల పెంపు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : త్వరలోనే విద్యుత్ చార్జీల పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. విద్యుత్ చార్జీలు పెంచకుంటే ఆ సంస్థల మనుగడ ఎలా అని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులకు 101 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నామని.. వాళ్లకు ఎలాంటి పెంపు ఉండదన్నారు. పేదలకు ఇబ్బంది కలిగించబోమని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో పల్లె ప్రగతిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ చట్టాన్ని కఠిన తరం చేశామని చెప్పారు. జవాబుదారీతనం లేని ఉద్యోగులను తీసేస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు సక్రమంగా నిధులు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు కూడా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి చాలా మంది విరాళాలు ఇచ్చారని.. వారికి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. గ్రామ కార్యదర్శుల సంఖ్య పెంచామని గుర్తుచేశారు. పల్లెప్రగతి ద్వారా గ్రామీణ తెలంగాణ స్వరూపం మారుతోందన్నారు. 3 వేలకు పైగా గిరిజన ప్రాంతాలను పంచాయతీలుగా మార్చామని అన్నారు. గిరిజనుల సెంటిమెంట్లను గౌరవిస్తున్నట్టు తెలిపారు. -
చెత్తబండి రోజూ రాకపోతే కౌన్సిలర్ పదవి పోవుడే: హరీష్ రావు
సాక్షి, సిద్ధిపేట : ఎండాకాలం వస్తే కరెంట్ బాధ ఉండే పరిస్థితి ఇప్పుడు లేదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక పట్టణ, ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహిళా భవన నిర్మాణానికి హరీష్ రావు, ఎమ్మెల్యే రామలింగరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులకు రెండు వేల పింఛన్ ఇచ్చి కొండంత అండగా నిలిచారని అన్నారు. మహిళలకు రూ.50 లక్షల రూపాయలతో మహిళా భవనం శంకుస్థాపన చేశామని తెలిపారు. ఉగాదికి పైసా ఖర్చు లేకుండా పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. స్థలం ఉన్న వారికి తొందరలోనే డబుల్ బెడ్ రూంలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కట్టిస్తామని అందుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోనే పెద్ద సమస్య అయిన చెత్తపై అందరు కలిసికట్టుగా పని చేసి చెత్తను లేకుండా చేసి, స్వచ్చ దుబ్బాకగా తీర్చిదిద్దుతామని భరోసానిచ్చారు. పారిశుధ్య కార్మికులకు పని తగ్గాలంటే మనమంతా తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. చెత్తను బయట పడేసిన వారికి అయిదు వందల రూపాయల ఫైన్ విధిస్తామన్నారు. ఇంటి ముందుకు చెత్తబండి ప్రతి రోజు రాకపోతే కౌన్సిలర్ పదవి పోవుడేనన్నారు. పేదవాడు ఇళ్లు కట్టుకుంటే రూపాయి లంచం అవసరం లేదని, తెలంగాణ దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. ప్రతి నెల రూ. 78 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధికి ఇస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో స్మశాన వాటిక వద్ద మొక్కనాటిన మంత్రి హరీష్ రావు మొక్క సంరక్షణ కోసం పదివేల రూపాయలు అందజేశారు. -
వామ్మో.. ఖైజాలా?
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తుంటే.. కామారెడ్డిలోని పంచాయతీ కార్యదర్శులను మాత్రం ఆ యాప్ పరుగులు పెట్టిస్తోంది. యాప్ భయంతో రెండుమూడు రోజులుగా ఉదయం 8 గంటలకే తమ పంచాయతీకి చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలు దాటేవరకు గ్రామంలోనే ఉంటున్నారు. ∙ సాక్షి నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నెలరోజుల్లో గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలతో కూడిన జాబితాను పంచాయతీ కార్యదర్శులతోపాటు గ్రామసర్పంచ్‌లకు అప్పగించారు. ఈ పనుల విజయవంతంలో పంచాయతీ కార్యదర్శులదే కీలక భూమిక. కానీ కొన్నిచోట్ల వారు సక్రమంగా పనిచేయడం లేదన్న ఆరోపణలున్నాయి. మంత్రి ఆదేశాలతో.. ఇటీవల జిల్లాకేంద్రంలో నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. వేదికపైకి జిల్లాలోని ఒక సర్పంచ్‌తోపాటు పంచాయతీ కార్యదర్శిని పిలిచి గ్రామంలోని ఇళ్లు, నాటాల్సిన మొక్కలు, నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాల గురించి ప్రశ్నించారు. వారు సరైన సమాధానాలు ఇవ్వలేదు. దీంతో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు పల్లెప్రగతిపై సరైన అవగాహన లేదని, వారికి సరిగ్గా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. దీంతో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల పనితీరును మెరుగు పర్చాలని జిల్లాయంత్రాంగం ఆలోచనచేసి మొదట పంచాయతీ కార్యదర్శులంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లోనే ఉండేలా చూడాలని నిర్ణయించారు. హాజరును పర్యవేక్షించడానికి ఖైజాలా అనే యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా వారి హాజరును పర్యవేక్షించేందుకు రెండుమండలాలకు ఒక అధికారిని నియమించారు. ఈ యాప్ ద్వారా పంచాయతీ కార్యదర్శులు హాజరు నమోదు చేసుకుంటే వారు ఉన్న ప్రదేశంతోపాటు సమయం కూడా అందులో స్పష్టంగా తెలిసిపోతుంది. పనులపై ప్రణాళిక... మార్చి నెలాఖరు వరకు గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి జిల్లాఅధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. గ్రామాల్లో మురికి కాలువలను నిరంతరం శుభ్రంగా ఉండేలా చూడడం, పచ్చదనాన్ని పకడ్బందీగా అమలు చేయడం, గ్రామాల్లోని అంగన్వాడి, పాఠశాల, ఓహెచ్‌ఆర్ ట్యాంకులు తదితర ప్రాంతాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడడం, నర్సరీల ఏర్పాటు, పవర్‌వీక్ కార్యక్రమాలు, ట్రాక్టర్ల కొనుగోలు, ఇంకుడుగుంతల ఏర్పాటు, ఫీల్డ్‌అసిస్టెంట్ల పనితీరుపై పర్యవేక్షణ, గ్రామాల్లోని ప్రతిఇంటికి చెత్తబుట్టల పంపిణీ, ప్రధాన కూడళ్లల్లో చెత్తకుండీల ఏర్పాటు, 100 శాతం పన్నులు వసూలు చేయడం, వార్షిక బడ్జెట్ తయారుచేయడం, మరుగుదొడ్ల నిర్మాణం, మిషన్ భగీరథ పనుల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. కార్యదర్శుల్లో టెన్షన్ ఖైజాలా యాప్ భయంతో పంచాయతీ కార్యదర్శులు రెండు, మూడురోజులుగా ఉదయాన్నే పల్లెలకు పరుగులు తీస్తున్నారు. ఈ యాప్‌తో కొంతమంది కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలతోపాటు గర్భిణులుగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో ఉండేందుకు ఇబ్బందిపడాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఉదయాన్నే ఇళ్లల్లో పనులు ముగించుకొని గ్రామాలకు వెళ్లేందుకు వారు నానా యాతన పడుతున్నారు. తమ కష్టానికి ప్రతిఫలంగా గ్రామాలు బాగుపడితే అంతకన్నా ఆనందం ఉండదని వారు అంటున్నారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గం పల్లెప్రగతి కార్యక్రమాల నిర్వహణకు సహకరించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లాయంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
అలాంటి వారిని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు..
సాక్షి, శంషాబాద్: చిత్తశుద్ధితో పనిచేసే నాయకులను ప్రజలు ఎప్పటికి గుర్తుపెట్టుకున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో పల్లె పగ్రతి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. సమయాభావం వల్ల అందరికి మాట్లాడే అవకాశం రాకపోతే నాయకులెవరూ బాధపడొద్దన్నారు. సభలో మాట్లాడకపోతే అవమానంగా భావించవద్దని.. గ్రామ అభివృద్ధి కోసం పనిచేసే వారిని ప్రజలు ఎప్పటికి మరిచిపోరని తెలిపారు. సీఎం కేసీఆర్ నిరూపించారు.. ప్రతి గ్రామ పంచాయతీకి సెక్రటరీని నియమించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం అంటే ఏమిటో నేడు కేసీఆర్ నిరూపించారని పేర్కొన్నారు. గతంలో రైతులు కరెంట్ కావాలని ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగేవారని, కానీ ఇప్పుడు కరెంట్ ఎక్కువ అయ్యిందని రైతులు చెబుతున్నారని తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత అధికంగా ఉండేదన్నారు. ప్రతి గ్రామం బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని.. చట్టాన్ని ప్రతి సర్పంచ్ చదివి అర్థం చేసుకోవాలని సూచించారు. పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి ఉండాలన్నారు. ప్రతి గ్రామం ఆదర్శ గ్రామం గా ఎదగాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. -
పకడ్బందీగా పల్లె ప్రగతి..
సాక్షి, హైదరాబాద్: గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియాలనే లక్ష్యంతో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం మరింత పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ప్రతిరోజూ ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య పనులు జరగాలని, గ్రామాలు బాగుండటం కోసం రోజూ చేయాల్సిన పనులు చేసి తీరాల్సిందేనని స్పష్టంచేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం ఎలా అమలవుతోంది.. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలో విధులు ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు త్వరలో తానే గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు జరుపుతానని వెల్లడించారు. పల్లె ప్రగతి స్పూర్తితో త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించనున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రజలు అయితే పల్లెల్లో, లేకుంటే పట్టణాల్లో నివసిస్తారు. ఈ రెండు చోట్లు బాగుంటే అంతా బాగున్నట్టే. అందుకే పల్లెలు, పట్టణాలు బాగుండాలని ప్రభుత్వం సంకల్పించింది. ముందుగా పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టింది. పంచాయతీరాజ్ శాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేశాం. ప్రతీ గ్రామానికి గ్రామ కార్యదర్శిని నియమించాం. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాం. ప్రతినెలా క్రమం తప్పకుండా రూ.339 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నాం. ప్రతీ గ్రామానికి ట్రాక్టర్ సమకూరుస్తున్నాం. ప్రభుత్వం ఇన్ని రకాల సహకారం, ప్రేరణ అందిస్తున్నప్పటికీ పల్లెలు బాగుపడకుంటే ఎట్ల? కచ్చితంగా బాగుపడి తీరాలి. ప్రతీ గ్రామానికి నర్సరీ ఏర్పాటు చేశాం. విధిగా అన్నిచోట్లా మొక్కలు పెంచాలి. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి ప్రతిరోజూ వీధులు ఊడ్చాలి. మోరీలు శుభ్రం చేయాలి. కొన్ని రోజులు చేసి చేతులు దులుపుకోవడం కాదు. ప్రతిరోజూ గ్రామాల్లో ఏం జరగాలో అవన్నీ జరగాలి’’అని ఆదేశించారు. మొక్కుబడి వ్యవహారం వద్దు.. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తామే గ్రామాన్ని ఊడ్చినట్లు పేపర్లో ప్రచారం కోసం ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారని.. ఇది సరికాదని సీఎం పేర్కొన్నారు. ‘‘వారంతా ఉన్నది చీపురు పట్టి ఊడవడానికి కాదు. గ్రామాల్లో ఎవరి పని వారితో చేయించడానికి. గ్రామ పంచాయతీల్లో అవసరమైన సిబ్బందిని నియమించాం. వేతనాలు పెంచాం. ట్రాక్టర్లున్నాయి. వాటిని ఉపయోగించి, పని చేయించాలి. అంతే తప్ప మొక్కుబడి వ్యవహారం కావద్దు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పనులు ఎలా జరుగుతున్నాయి? పల్లె ప్రగతి పురోగతి ఏమిటి? ఎవరెవరు తమ బాధ్యతలు సరిగ్గా నిర్వహిస్తున్నారు? అనే విషయాలు పరిశీలించడానికి నేనే స్వయంగా త్వరలో గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తాను’’అని తెలిపారు. నగరాలు, పట్టణాలు కాలుష్యకూపాలుగా మారకూడదు హైదరాబాద్ నగరంతో పాటు, ఇతర నగరాలు, పట్టణాలు కాలుష్య కూపాలుగా మారకుండా పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నగరాల లోపల, బయట ఉన్న అటవీ భూముల్లో విరివిగా చెట్లు పెంచి, దట్టమైన అడవులు ఉండేలా చూడాలన్నారు. ‘‘హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. నగరంలో జనాభా అంతకంతకూ పెరుగుతోంది. మనది సముద్ర తీరం లేని నగరం. కాలుష్యం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తే ఇతర నగరాల మాదిరిగా జనజీవనం నరకప్రాయం అవుతుంది. దీనికి విరుగుడుగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి. హైదరాబాద్ లోపల, బయట లక్షా 60 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. అక్కడ విరివిగా చెట్లు పెంచి దట్టమైన అడవులుగా తీర్చిదిద్దాలి. దీనివల్ల హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు, కాలుష్యం పెరగకుండా చూడవచ్చు. నగరంలో కూడా విరివిగా చెట్లు పెంచాలి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ బడ్జెట్లలో పదిశాతం నిధులను పచ్చదనం పెంచడానికి ఉపయోగించాలి. ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా హరిత ప్రణాళిక రూపొందించాలి. అన్ని పట్టణాల్లో కనీసం వార్డుకొకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేయాలి. తెలంగాణలోని అన్ని పట్టణాలు పచ్చదనంతో కళకళలాడే విధంగా పట్టణ ప్రగతిలో చర్యలు ప్రారంభించాలి’’అని ముఖ్యమంత్రి కోరారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ తివారి, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందనరావు, పీసీసీఎఫ్ శోభ, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ పల్లె ప్రగతి పురోగతి నివేదిక – 12,751 గ్రామాలకు గాను 12,705 గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు – ఇప్పటి వరకు 6,017 ట్రాక్టర్ల కొనుగోలు. మరో 4,534 ట్రాక్టర్లకు ఆర్డర్ – ఇప్పటి వరకు గ్రామాల్లో 10.78 కోట్ల మొక్కలు నాటగా.. వాటిలో 84 శాతం మొక్కలు బతికాయి – 76,562 కిలోమీటర్ల మేర వీధుల శుభ్రం – 62,976 కిలోమీటర్ల మేర మురికి కాల్వల శుభ్రం – 48,767 చోట్ల ఇళ్ల శిథిలాల తొలగింపు – 1,24,655 చోట్ల పొదలు, తుప్పలు, మురికి తుమ్మల తొలగింపు – 56,213 చోట్ల ఖాళీ ప్రదేశాలు, కామన్ ఏరియాల శుభ్రం – 9,954 పాత, పనిచేయని బోర్ల మూసివేత – 1,13,881 చోట్ల నీరు నిల్వ ఉండే బొందల పూడ్చివేత – 56,050 చోట్ల రోడ్ల గుంతలను పూడ్చివేత – 67,245 చోట్ల ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల శుభ్రం – మార్కెట్లు, సంతలు నిర్వహించే 6,500 ప్రదేశాల శుభ్రం హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు 350కి పెంపు హైదరాబాద్‌లో పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాల సంఖ్యను 350కి పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రస్తుతం ఉన్న 118 బస్తీ దవాఖానాలు బాగా పనిచేస్తున్నాయని, ప్రజలు వీటితో ఎంతో సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో వీటి సంఖ్యను గణనీయంగా పెంచాలని సూచించారు. నగరంలోని 150 డివిజన్లలో డివిజన్‌కు రెండు చొప్పున ఈ దవాఖానాలు ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేదలు నివసించే బస్తీలు, కాలనీల్లో మరిన్ని ఎక్కువ ఏర్పాటు చేయాలన్నారు. నెలరోజుల్లోనే కొత్త బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
ప్రగతి మంత్రం.. పల్లె చిత్రం
సాక్షి, హైదరాబాద్: ప్రగతి మంత్రం ఫలించింది. పల్లెచిత్రం మారింది. హరితహారమే లక్ష్యంగా పారిశుద్ధ్య నిర్వహణే కర్తవ్యంగా రాష్ట్రంలోని 12,751 పంచాయతీల్లో సాగిన రెండోవిడత పల్లె ప్రగతి కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. అక్షరాస్యతలోనూ ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని భావించిన ప్రభుత్వం.. ‘ఈచ్ వన్ టీచ్ వన్’నినా దం కింద తొలిసారి గ్రామ పంచాయతీల్లో 25,03,901 మంది వయోజనులను నిరక్షరాస్యులుగా గుర్తిం చింది. ఇందులో అత్యధికంగా నారాయణపేట జిల్లాలో 1,54,804, నల్లగొండ జిల్లాలో 1,47,054 మంది వయోజన నిరక్షరాస్యులు ఉం డగా, యాదాద్రి జిల్లాలో 1,32,412 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 1,21,847 మంది, నిర్మల్ జిల్లాలో 1,20,597 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి కోసం సర్కారు అక్షర యజ్ఞం చేపట్టనుంది. దశాబ్దాలుగా సమస్యల వలయంలో చిక్కుకొని కునారిల్లుతున్న గ్రామీణ ప్రాం తాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా విస్తృతంగా అభివృద్ధి, అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ఈసారి విశేషం. తొలిరోజు గ్రామ సభల్లో వార్షిక ప్రణాళిక, పంచా యతీ ఆదాయ వ్యయాలు, తొలి విడత పల్లెప్రగతి నివేదికను గ్రామస్తుల ముందుంచడం ద్వారా పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. గ్రామ సభలు, పాదయాత్రలు, శ్రమదానాలు, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల హడావుడితో గత 11 రోజులు పల్లెల్లో సందడి వాతావరణం కనిపించింది. పరిసరాల పరిశుభ్రత, పిచ్చిమొక్కల తొలగింపు, వైకుంఠధామాలు, కంపోస్టు యార్డు, శాశ్వత నర్సరీలకు స్థలాలను గుర్తించారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 51 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాయి. దాతల సహకారం... పల్లె దాటినా సొంతూరిపై మమకారంతో సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చిన పలువురు దాతలు పల్లె ప్రగతికి ఇతోధికంగా సహకారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందించి 15,739 మంది దాతృత్వంతో ముందుకొచ్చారు. వీరంతా రూ. 11.64 కోట్ల విరాళాలను అందజేశారు. మరింత ఆర్థిక సాయం అందించేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పల్లెల సత్వర సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటివరకు వివిధ పద్దుల కింద రూ. 1,475.28 కోట్లు విడుదల చేయగా ఈ నిధులకు దాతల సాయం చేదోడువాదోడుగా నిలవడంతో అభివృద్ధి పట్టాలెక్కనుంది. పల్లెసీమలకు సమస్యల నుంచి విముక్తి లభించనుంది. మొత్తం గ్రామ పంచాయతీలు : 12,751 గ్రామీణ జనాభా : 2.03 కోట్లు గ్రామ సభలు నిర్వహించిన పంచాయతీలు : 12,749 భాగస్వామ్యమైన ప్రజలు : 7,02,563 -
అభివృద్ధి మీ చేతుల్లోనే: స్మిత సబర్వాల్
సాక్షి, ఇందల్వాయి(నిజామాబాద్): గ్రామ అభివృద్ధి ఆ గ్రామ ప్రజల చేతుల్లోనే ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ గ్రామ ప్రగతి కోసం పని చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి (సీఎంవో) స్మిత సబర్వాల్ పిలుపునిచ్చారు. ప్రజల సహకారం ఉంటేనే ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవచ్చని తెలిపారు. ప్రజా ప్రతినిధులు నిత్యం గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని సూచించారు. సర్పంచ్ల పనితీరు బాగలేక పోతే పదవులు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో కలిసి స్మిత సోమవారం జిల్లాలో పర్యటించారు. ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి, ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్, బాల్కొండ మండలం బుస్సాపూర్‌లో ‘పల్లెప్రగతి’ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో గ్రామస్తులతో మాట్లాడారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనుల వివరాల గురించి ఆరా తీశారు. గ్రామాల్లో చేపట్టిన పనులు నిజమా.. కాదా? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్, హరితహారం, మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. చంద్రాయన్పల్లిలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పరిశుభత్ర బాధ్యత ప్రజలదే.. ప్రభుత్వం చెప్పినా, చెప్పకపోయినా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన భాధ్యత ప్రజలపై ఉందని స్మిత పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టినపుడే కాకుండా ఎల్లప్పుడూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అలవాటు చేసుకోవాలని సూచించారు. నిధుల లభ్యత ఆధారంగా గ్రామ పంచాయతీ అధికారులు సంవత్సర ప్రణాళికను పకడ్బందీగా రూపొందించాలని, గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలను జీపీ కార్యాలయంలో ప్రదర్శించాలన్నారు. శిథిలావస్థకు చేరిన రోడ్లపై స్థానికులు అడిగిన ప్రశ్నలకు స్మిత బదులిస్తూ.. మిషన్ భగీరథ ద్వారారక్షిత జలాలు వంద శాతం ప్రజలకు చేరిన అనంతరం గ్రామాల్లోని అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొక్కలు చనిపోతే చర్యలు: వర్గీస్ ప్రతి ఇంటిలో ఐదు పండ్ల మొక్కలను పెంచాలని సీఎంవో ఓఎïస్డీ ప్రియాంక వర్గీస్ సూచించారు. గత ఐదు విడతల్లో హరితహరంలో పెంచిన మొక్కల వల్లే సమృద్ధిగా వర్షాలు కురిశాయని చెప్పారు. ప్రతీ గ్రామ పంచాయతీ తప్పకుండా నర్సరీని కలిగి ఉండాలని, అందులో ప్రధానంగా నిమ్మ గడ్డి, కృష్ణ తులసి మొక్కలను పెంచాలన్నారు. నిమ్మ గడ్డి వలన దోమలు రాకుండా ఉంటాయన్నారు. ప్రతీ గ్రామంలో నిర్దేశిత మొక్కలు నాటి 85 శాతం మొక్కలు బతికేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపడతాయని, మొక్కలు చనిపోతే చర్యలు తప్పవని తెలిపారు. అడవుల్లో పండ్ల మొక్కలు నాటితే కోతుల బెడదను నివారించవచ్చని తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావ్, కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నాయని, పనితీరు బాగా లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జెడ్పీ సీఈవో గోవింద్, ఆర్డీవో శ్రీనివాసులు, మిషన్ భగీరథ ఎస్ఈ రాజేందర్, ట్రాన్స్‌కో ఎస్ఈ సుదర్శనం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించండి.. తను పూరి గుడిసెలో నివాసం ఉంటున్నానని, తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని సామ్యానాయక్ తండాకు చెందిన లక్ష్మి స్మిత సబర్వాల్‌ను కోరారు. తన కోరిక తీర్చితే సంతోషిస్తానని ఆమె తెలపగా, స్మిత సబర్వాల్ సుముఖత వ్యక్తం చేశారు. -
పల్లె ప్రగతిలో డోనర్స్ డే కార్యక్రమం
పల్లె ప్రగతి కోసం దాతలు ముందుకు వస్తున్నారు. లక్షలాది రూపాయలు విరాళంగా అందిస్తున్నారు. అయితే దాతలు ఇచ్చిన సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేస్తే కుదరదు. విరాళాలు ఇచ్చిన వారు సూచించిన పనులే చేపట్టాల్సి ఉంటుంది. లేకపోతే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవు. సాక్షి, మోర్తాడ్(నిజామాబాద్): పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఆదివారం డోనర్స్ డే, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు నిర్వహించారు. పల్లెల అభివృద్ధి కోసం దాతలు చాలామంది ముందుకు వచ్చారు. మొదట గ్రామాల అభివృద్ధి కోసమే విరాళాలు సేకరించాలని ప్రభుత్వం భావించినా.. ఆ తర్వాత పాఠశాలల్లో సమస్యల పరిష్కారంపైనా దృష్టి సారించారు. ఆయా పాఠశాలల్లో గతంలో చదువుకున్నవారితో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను నిర్వహించాలని నిర్ణయించి అన్ని గ్రామాల పరిధిలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం నిర్వహించిన డోనర్స్ డే, పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో దాతలనుంచి విరాళాలు ఆహ్వానించారు. కొంత మంది వస్తు రూపంలో సాయం అందించగా.. మరికొందరు నగదు సాయం చేశారు. ఇలా ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో రూ. 50 వేల నుంచి రూ.10 లక్షల వరకు విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది. పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమం ఈనెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఈలోపు మరికొందరు దాతలు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇలా వచ్చిన విరాళాల సొమ్ము వినియోగం విషయంలో స్పష్టత లేకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. దీనికి ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. దాతలు ఇచ్చిన విరాళంతో వారు సూచించిన పనులను చేపట్టాలని సూచించింది. అలాగే పాఠశాలల అభివృద్ధికి వచ్చిన విరాళాలనూ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. దీంతో విరాళం ఇచ్చిన సొమ్మును ఎందుకోసం ఖర్చు చేయాలి అని పంచాయతీ ఉద్యోగులు స్పష్టత తీసుకుంటున్నారు. దాతలు ఫలానా పని చేయాలని సూచిస్తే ఆ పనే చేయాల్సి ఉంటుంది. వారు ఏ పనీ సూచించకపోతే పంచాయతీ తీర్మానం ప్రకారం సొమ్మును ఖర్చు చేయాలి. కలెక్టర్ ఖాతాకు చేరిన నిధులు పంచాయతీలకు.. పల్లెల అభివృద్ధి కోసం ముందుకు వచ్చేవారు విరాళం ఇవ్వడానికి కలెక్టర్ ఖాతా నంబర్‌ను ప్రకటించారు. కలెక్టర్ ఖాతాకు చేరిన నిధులను దాతలు సూచించిన పంచాయతీ ఖాతాకు బదలాయించనున్నారు. విరాళం సొమ్ము పక్కదారి పడితే అభాసు పాలయ్యే ప్రమాదం ఉండడంతో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. లెక్కలు పక్కాగా ఉంటాయి గ్రామ పంచాయతీలకు ఇచ్చిన విరాళాల లెక్క పక్కాగా ఉంటుంది. పాఠశాలలకు ఇచ్చిన విరాళాలు కూడా పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలి. దాతలు సూచించిన పనులకే నిధులను ఖర్చు చేయనున్నాం. – పీవీ శ్రీనివాస్, డీఎల్పీవో, ఆర్మూర్ -
ఇక పట్టణ ప్రగతి ప్రణాళిక
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి ప్రణాళికను అమలు చేస్తామని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంటలో గురువారం రెండో విడత పల్లె ప్రగతి ప్రణాళికను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. అంతకుముందు మోహినికుంటలో మంత్రులు పర్యటించి ‘పల్లె ప్రగతి’ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. పల్లె ప్రగతి కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని 12,751 గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయని, అదే స్ఫూర్తితో రెండో విడతను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల తర్వాత నూతన మున్సిపల్ పాలక వర్గాలకు శిక్షణ ఇచ్చి, పకడ్బందీగా పట్టణ ప్రగతి ప్రణాళికను అమలు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. మోహినికుంట తమ తాత సొంత ఊరు అని, స్థలం ఇస్తే ఇక్కడ తాత, నాయనమ్మల పేరిట సొంత ఖర్చులతో ఫంక్షన్ హాలు నిర్మిస్తామని కేటీఆర్ ప్రకటించారు. మోహినికుంట వెళ్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెబితే.. ఆ ఊరి కోసం ఏదైనా మంచి పని చేయాలని సూచించారని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయి వర్ధన్నపేట: ‘మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి.. ఆయన అన్ని విధాల సమర్థుడు. కేటీఆర్ నాయకత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించాం’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా దమ్మన్నపేటలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. -
తెలంగాణలో నేటి నుంచి ‘పల్లె ప్రగతి’