
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం నుంచి 15 రోజుల పాటు జరగనున్న ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే 4 విడతలుగా జరిగిన ఈ కార్యక్రమంలో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రత, పచ్చదనంతో వెల్లివిరిసేలా చేసేందుకు చర్య లు చేపట్టారు. తాజాగా ఐదో విడతలో భాగంగా తొలి రోజు గ్రామసభ నిర్వహించి పల్లె ప్రగతి ప్రణాళిక తయా రుచేయాలి.పంచాయతీల ఆదాయ వ్యయాలు, నాలుగు విడతల్లో సాధించిన ఫలితాలను నివేదిక రూపంలో గ్రామసభ ఎదుట చదివి వినిపించాలి. ఇక కార్యక్రమంలో భాగంగా అన్ని రోజులు రోడ్లు, డ్రైన్లు శుభ్రపరచాలి.
2 రోజుల పాటు ప్రజోపయోగ సంస్థలను శుభ్రం చేయడం, ఆయా సంస్థల ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం చేపట్టాలి. ఒకరోజు పవర్‌డే పాటించాలి. ఒక రోజు గ్రామస్తుల సహకారంతో శ్రమదానం ద్వారా పిచి్చమొక్కలు తొల గించి, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి. గ్రామ నర్సరీని సందర్శించి మొక్కల ఎదుగుదలను పరిశీలించాలి. విలేజ్ డంపింగ్ యార్డు, వైకుంఠధామం తదితరాలను పరిశీలించి.. సమస్యలుంటే పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ‘తెలంగాణ క్రీడా ప్రాం గణాల’ ఏర్పాటు పై శ్రద్ధ వహించాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐదో విడత ప్రాథమ్యాలను గురు వారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment