పల్లె ప్రగతిలో సంగారెడ్డి టాప్‌:హరీష్‌ ‌‌రావు | Harish Rao Said Sangareddy District In Forefront In Palle Pragathi | Sakshi

పల్లె ప్రగతిలో సంగారెడ్డి టాప్‌:హరీష్‌ ‌‌రావు

Jul 17 2020 12:00 PM | Updated on Jul 17 2020 12:08 PM

Harish Rao Said Sangareddy District In Forefront In Palle Pragathi - Sakshi

సాక్షి, సంగారెడ్డి: పల్లెప్రగతిలో సంగారెడ్డి జిల్లా ప్రథమస్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు. పఠాన్ చేరు నియోజకవర్గంలో జరిగిన ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 55 గ్రామాలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు గ్రామాలకు సొంత నిధులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు పంపిణీ చేయడం రాష్టం లోనే ప్రథమం అన్నారు. ప్రతి గ్రామంలో తాగునీరు, 24 గంటల విద్యుత్‌,మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు.

వచ్చే నెలరోజుల్లో జిల్లాలో వైకుంఠ ధామాలు, రైతు వేదికలు పూర్తిస్థాయిలో నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. జిల్లాలో 100 పడకల కరోనా ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, భయపడకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. కరోనా బారినపడిన వారిని చులకనగా చూడొద్దని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement