ఓ ఇంట్లో వంట చేస్తున్న మహిళ
జోగిపేట(అందోల్): డ్రా పద్ధతిలో డబుల్‌బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశారు. మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా సామూహిక గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఎంపికలో అవకతవకలు జరిగాయని ప్రచారం. అయితే జాబితా మారుతుందన్న అనుమానంతో అనధికారికంగా కేటాయించిన ఇళ్లలోకి లబ్ధిదారులు చేరిపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్‌లో చోటుచేసుకుంది.
డాకూరులో రూ.5.65 కోట్లతో 104 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించారు. ఈ నెల 6న లబ్ధిదారుల సమక్షంలో డ్రా పద్ధతిలో నంబర్లుసహా ఇళ్లను కేటాయించారు. 10న మంత్రి హరీశ్ సమక్షంలో ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. పలు కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దయింది. అదే సమయంలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని పత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
అధికారుల రీ సర్వేతో జాబితా మారుతుందన్న ఆందోళనలో ఆయా లబ్ధిదారులు పెట్టె, బేడ సదరుకొని కేటాయించిన ఇళ్లలోకి పరుగులు తీశారు. 2, 3 రోజులుగా వారంతా గృహ ప్రవేశాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు అవాక్కయ్యారు. ఇప్పుడు ఇళ్లను ప్రారంచేది ఎలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment