సంగారెడ్డిలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డును అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షిప్రతినిధి,సంగారెడ్డి/సదాశివపేట: వారం రోజుల్లో 28 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తా మని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. కొద్ది రోజుల్లోనే గ్రూప్–4 నోటిఫికేషన్ కూడా వస్తుందని తెలిపారు. గురువారం ఆయన సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పను లకు శంకుస్థాపనలు చేశారు. కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదా రులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి, సదాశివపేట, కంకోల్‌లలో జరిగిన సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లా డుతూ, నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలను వివరించారు. మరో పక్క బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రూ.2,016 ఆసరా పింఛన్ ఇస్తుంటే, పక్కనే ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో కేవలం రూ.600 ఇస్తున్నార న్నారు.
పొరుగునే ఉన్న బీదర్ (కర్ణాటక) వెళ్లి ఈ విషయాన్ని పరిశీలించాలని ప్రజ లకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.75 మాత్రమే పింఛన్ ఇచ్చేవారని, లబ్ధిదారులెవరైనా చనిపోతే.. వారి స్థానంలో మాత్రమే కొత్త లబ్ధిదారు లకు పింఛన్లు మంజూరయ్యేవని గుర్తు చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదనే విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఉచితాలు వద్దంటున్న కేంద్రం మాటలపై హరీశ్‌రావు స్పందిస్తూ, పేద లకు సంక్షేమ పథకాలు అమలు చేయ వద్దని చెబుతున్నారా..? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.
దసరా నుంచి రూ.3 లక్షలు..
ఇంటి స్థలం ఉన్న పేదవారికి ఇంటి నిర్మా ణంకోసం రూ.3 లక్షలు ఇచ్చే పథకాన్ని దసరా నుంచి ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ కార్య క్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తదితరులు పాల్గొ న్నారు. కాగా, మంత్రి హరీశ్‌రావు పాల్గొన్న సదాశివపేట సభలో కోలుబావి ప్రాంతానికి చెందిన వడ్డె శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు.
ఇది గమనించిన పోలీసులు వెంటనే అతడిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎందుకు కిరోసిన్ పోసుకున్నావని విలేకరులు ప్రశ్నిం చగా, ఎన్కెపల్లి రోడ్డులో గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎకరా ఐదు గుంటల భూమిని అధికారులు తిరిగి తీసుకున్నా రన్నారు. అందులో గోదాం నిర్మించారని, ఇన్నాళ్లూ వేచిచూసినా ఎవరూ పరిహారం గురించి పట్టించుకోకపోవడంతో ఆత్మహ త్యాయత్నం చేసినట్లు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment