Job notifications
-
ఇదిగో జాబ్ కేలండర్
సాక్షి, హైదరాబాద్: వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీల భర్తీ ప్రక్రియకు సంబంధించిన జాబ్ కేలండర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ కేలండర్‌ను శాసనసభకు సమరి్పంచారు. రిక్రూట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్లు, పోస్టుల కేటగిరీలు, నోటిఫికేషన్లు జారీ చేసే నెలలు, పరీక్షలు నిర్వహించే నెలలు (తాత్కాలిక ఖరారు), రిక్రూటింగ్ ఏజెన్సీలు, పోస్టులకు అర్హతలను కేలండర్లో సవివరంగా తెలియజేశారు.ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసిన గ్రూప్ పరీక్షల వివరాలతో పాటు భవిష్యత్తులో విడుదల చేయబోయే గ్రూప్ పరీక్షల వివరాలు, వివిధ సంస్థల్లో ఇంజనీరింగ్ పోస్టులు, టీచర్లు, లెక్చరర్లు ఎస్ఐలు తదితర పోస్టుల భర్తీ, టెట్ నిర్వహణకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. అయితే విభాగాల పేర్లను పేర్కొన్నప్పటికీ ఖాళీల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. కాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో దీనిపై క్లుప్తంగా ప్రకటన చేశారు. పబ్లిక్ సరీ్వస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం ‘నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు నెరవేర్చేందుకు జాబ్ కేలండర్ ప్రకటిస్తామని ముందే చెప్పాం. ఆ విధంగానే సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జాబ్ కేలండర్ విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు రావడం, రద్దు కావడం లేదా వాయిదా పడటం, పరీక్షలు జరిగితే ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల తేదీలు ఓవర్లాప్ లాంటి వాటితో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వ పాలనలో గ్రూప్–1 పరీక్ష రెండుసార్లు రద్దయింది.2023 మార్చి 17న పేపర్ లీక్ కావడంతో, 2024 ఫిబ్రవరి 19న అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో హైకోర్టు తీర్పు మూలంగా రద్దు అయింది. అధికారంలోకి రాగానే రాష్ట్ర పబ్లిక్ సరీ్వస్ కమిషన్ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి.. యూపీఎస్సీ చైర్మన్‌ను సంప్రదించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ యూపీఎస్సీ, కేరళ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ విధానాలను అధ్యయనం చేíసింది. అనంతరం కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. గ్రూప్–1 నోటిఫికేషన్లో అదనంగా 60 పోస్టులు జోడించి 563 ఖాళీల కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశాం.ఫలితాలు ప్రకటించాం. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేశాం. మొత్తంగా 32,410 మంది నిరుద్యోగ యువతకు నియామక ఉత్తర్వులు జారీ చేశాం. అదనంగా 13,505 ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకుంది. 11,022 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాం. గ్రూప్–1, గ్రూప్ 2, గ్రూప్–3 పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో నిరుద్యోగుల కోరిక మేరకు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలు డిసెంబర్‌కు వాయిదా వేశాం. ఈ నెల 1వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో జాబ్ కేలండర్ గురించి చర్చించి ఆమోదించాం..’ అని డిప్యూటీ సీఎం తెలిపారు. అబిడ్స్‌లో అమ్మే కేలండర్‌లా ఉంది: బీఆర్ఎస్ జాబ్ కేలండర్ విడుదలపై భట్టి విక్రమార్క ప్రకటన చేయగానే, తమకు స్పందించే అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ స్పీకర్‌ను కోరారు. మంత్రులు చేసే స్టేట్మెంట్లపై స్పందించేందుకు వీలుండదంటూ స్పీకర్ తిరస్కరించారు. దీంతో జాబ్ కేలండర్పై తమకు అసంతృప్తి ఉందని, దానిపై కొంత స్పష్టత అవసరముందని, తనకు మాట్లా డేందుకు అవకాశం కలి్పంచాలని కేటీఆర్ కోరారు. డిప్యూటీ సీఎం భట్టి లేచి శాసనసభ రూల్ బుక్‌లో నిబంధన చదివి వినిపించారు. మంత్రులు స్టేట్మెంట్ ఇచి్చన తర్వాత దాని పై ప్రశ్నలు, వివరణలకు వీలులేదని చెప్పారు.దీంతో స్పీకర్ తదుపరి అంశాన్ని చేపట్టారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు పలువురు కేటీఆర్‌కు మద్దతుగా పోడియం వద్దకు వెళ్లి తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అడిగా రు. అది జాబ్ కేలండర్‌లా లేదని, అబిడ్స్‌లో విక్రయించే సాధారణ కేలండర్‌లా ఉందంటూ ఎద్దేవా చేశారు. అప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌన్సిల్‌కు వెళ్లిపోవడంతో ఆయన వచ్చిన తర్వాత అవకాశమిస్తానని స్పీకర్ చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులు పట్టించుకోకుండా చాలాసేపు పోడియం వద్దనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. -
జాబ్ కేలండర్ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించి, గెలిచిన తరువాత వారిని కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. గురువారం ఆయనను పలువురు నిరుద్యోగులు కలిసి తమ పోరాటానికి అండగా ఉండాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్ వారి పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు జాబ్ కేలెండర్ పేరుతో పెద్ద ఎత్తున పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని, దాదాపు 10 పరీక్షలకు సంబంధించి తేదీలతో సహా నోటిఫికేషన్లు అంటూ బూటకపు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. అయి తే వాటికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదన్నారు. జాబ్ కేలెండర్ ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొదటి కేబినెట్ భేటీలోనే మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను దగా చేశారన్నారు. గ్రూప్–1కు సంబంధించి తమ ప్రభుత్వం ఇచి్చన నోటిఫికేషన్‌కు కేవలం 60 ఉద్యోగాలు మాత్రమే కలిపారని పేర్కొన్నారు. ఉద్యోగాలు పెంచమని అడిగితే సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో వదలదని, అన్ని చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. గ్రూప్– 1 మెయిన్స్‌కు సంబంధించి 1:100 ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రస్తుత డిప్యూటీ సీఎం గతంలో డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు ఎందుకు అలా చేయడంలేదని ప్రశ్నించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జాబ్ కేలెండర్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ఏ నిరుద్యోగులైతే ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారో.. వారే ప్రభుత్వాన్ని గద్దె దించే పరిస్థితి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. -
ఈ పరీక్షలు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ ప్రకటనలిచ్చి నెలలు గడుస్తున్నా అర్హత పరీక్షలు నిర్వహించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంటోంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడి ఏడాది గడిచింది. అదేవిధంగా గ్రూప్–3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల ప్రకటనలు వెలువడి కూడా దాదాపు ఏడాది కావొస్తోంది. కానీ ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు ఇంతవరకు నిర్వహించలేదు. వాస్తవానికి డీఏఓ పరీక్ష ఈ ఏడాది జనవరిలో నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికీ ముహూర్తం ఖరారు కాలేదు. దీంతో పాటు ఇతర పరీక్షల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో దీర్ఘకాలంగా వీటి కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో పరీక్షలు ఇంకెప్పుడు జరుగుతాయనే అయోమయానికి గురవుతున్నారు. సన్నద్ధతకు సంకటం ఏదైనా పరీక్ష తేదీని ప్రకటిస్తే అభ్యర్థులు సన్నద్ధతకు ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు. ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పూనుకోవడం, తదనుగుణంగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో నిరుద్యోగ అభ్యర్థులు కఠోర దీక్షతో ప్రిపరేషన్లో పడ్డారు. కొందరు ప్రైవేటు ఉద్యోగాలను వదిలేసి మరీ సిద్ధమవుతున్నారు. మరికొందరైతే పనిచేస్తున్న ఉద్యోగాలకు దీర్ఘకాలిక సెలవులు పెట్టుకుని టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీలను ప్రకటించకుండా కమిషన్ కాలయాపన చేస్తుండటంతో సన్నద్ధత గాడి తప్పుతోందని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ నెలంతా ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పరీక్షలు కొనసాగుతుండగా.. వచ్చే నెలలో సైతం పలు పరీక్షలకు కమిషన్ తేదీలు ఖరారు చేసింది. ఆగస్టు నెలలో నిర్వహించాల్సిన గ్రూప్–2 పరీక్ష నవంబర్ నెలకు వాయిదా పడింది. ఈ విధంగా పలు పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. డీఏఓ, హెచ్‌డబ్ల్యూఓ, గ్రూప్–3 పరీక్షలపై తేల్చకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
కిషన్‌రెడ్డి నిరాహార దీక్ష.. కేసీఆర్‌పై సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేతలు స్పీడు పెంచారు. కేసీఆర్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ కార్యచరణను రూపొందించుకున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లయినా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదు. తెలంగాణ కోసం లక్షలాది మంది పోరాటం చేశారు. 1200 మంది విద్యార్తులు బలిదానం చేశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగానే వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా సర్కార్ యువతను మోసం చేస్తోందని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకై లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభకోణాలు మీరు చేసి కేసులు తమ మీద పెడతారా? అంటూ మండిపడ్డారు. పేపర్ లీకేజీపై పోరాడితే బండి సంజయ్‌పై కేసులు పెట్టారని ఆరోపించారు. ఉద్యోగాలపై అసెంబ్లీలో చేసిన ప్రకటన ఏమైందని కేసీఆర్‌ను ప్రశ్నించారు. నిరుద్యోగులకు పథకం ప్రకరమే సర్కార్ అన్యాయం చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ చేతకాని తనం వల్లే పరీక్షా పేపర్స్ లీక్ అయ్యాయని ఆరోపించారు. హోంగార్డు రవీందర్‌ది ఆత్మహత్య కాదని.. అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. వాటాలిస్తే గానీ ప్రభుత్వం పరిశ్రమలు పెట్టడం లేదన్నారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మోసం చేశారని.. ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. మిగులురాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై గుత్తా సుఖేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
సచివాలయాల ఉద్యోగులకు ‘ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్’
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరి పని తీరు మదింపునకు ప్రభుత్వం కొత్తగా పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (ఉద్యోగి పనితీరు సూచికలు)ను రూపొందిస్తోంది. సచివాలయాల్లో మొత్తం 20 కేటగిరీల ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్కొక్క కేటగిరీ ఉద్యోగి పనితీరు మదింపునకు వారి జాబ్చార్ట్ల ప్రకారం వేర్వేరు పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. ఈ ఇండికేటర్స్ ఆధారంగా మండల స్థాయి అధికారులు ప్రతి నెలా వారి పరిధిలోని సచివాలయాల ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తారు. సంతృప్తికరం (గుడ్), తృప్తికరం (ఫెయిర్), పర్వాలేదు (శాటిస్ఫై), అసంతృప్తికరం (నాట్ శాటిస్ఫై)గా రేటింగ్ ఇస్తారు. వరుసగా కొన్ని నెలలు అసంతృప్తికరం రేటింగ్ పొందే ఉద్యోగులకు మెళకువలు పెంపొందించుకునేలా శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల మేరకు పనితీరు అంచనా వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల జాబ్ నోటిఫికేషన్లలోనే ఉద్యోగుల పని తీరు నిరంతర అంచనా అంశాన్ని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. జాబ్ చార్ట్‌లను కూడా ప్రకటించింది. అయితే, ప్రభుత్వం ఇటీవల ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉద్దేశించిన కొన్ని సుస్థిర అభివృద్ధి సూచికలు (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్)ను రూపొందించుకొని ఆ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సిన సచివాలయాల ఉద్యోగులకు కూడా ఈ సుస్థిర అభివృద్ధి సూచికల ప్రకారం పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను రూపొందిస్తోంది. వీటి రూపకల్పన బాధ్యతను ప్రభుత్వం ఆయా ఉద్యోగుల విధులకు సంబంధించిన శాఖలకే అప్పగించింది. ఇప్పటివరకు ఆరు శాఖలు పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను రూపొందించి, ఉత్తర్వులు కూడా జారీ చేశాయి. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్లకు పశు సంవర్ధక శాఖ, మహిళా పోలీసు ఉద్యోగులకు హోం శాఖ, ఏఎన్ఎంలకు వైద్య, ఆరోగ్య శాఖ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు సాంఘిక సంక్షేమ శాఖ, ఆరు కేటగిరీల ఉద్యోగులకు పట్టణాభివృద్ధి శాఖ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ రూపొందించాయి. పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వీరందరికీ వారి జాబ్ చార్ట్ ప్రకారం వంద మార్కులు ఉంటాయి. పని తీరు ఆధారంగా మార్కులు వేస్తారు. డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేకంగా రేటింగ్ ఇచ్చారు. 90కిపైగా మార్కులు తెచ్చుకొనే డిజిటల్ అసిస్టెంట్లకు ఎక్సలెంట్ రేటింగ్ ఇస్తారు. 75 – 90 మార్కులు వచ్చేవారికి గుడ్ రేటింగ్, 50 – 75 మధ్య మార్కులు వచ్చేవారికి ఫెయిర్, 50 మార్కులకు కన్నా తక్కువ తెచ్చుకునే వారికి పూర్ రేటింగ్ ఇస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగిలిన శాఖలు కూడా త్వరలో ఇండికేటర్స్ రూపొందిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. -
ఉద్యోగాలు ఊడగొడుతున్న కేంద్రం
కోరుట్ల/పెద్దపల్లి: బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించి ఇప్పటికే ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్, బస్తీ దవాఖానా ప్రారంభించి, వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోనూ 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాట తప్పిందని, దీనిపై యువతకు సమాధానం ఇవ్వాలన్నారు. తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 81 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుళ్లుకుంటున్నారని అన్నారు. నోటిఫికేషన్లపై స్టేలు తెచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదని, ఇంత అన్యాయం జరిగితే మరి సంజయ్ ఏం చేస్తున్నారని హరీశ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 4 మెడికల్ కళాశాలలు ఇస్తే ఎంపీ సంజయ్ ఏం తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా పేదలకు వైద్య సేవలు అందించడంలో దేశంలోనే రాష్ట్రం మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. మతం పేరిట యువతను రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం ఉందని, ప్రతిపక్షాలది మాత్రం ఓటు బంధమని అన్నారు. నిరుద్యోగులకు కేంద్రం వంచన దేశంలో నిరుద్యోగం 8.30 శాతానికి పెరగగా, తెలంగాణలో కేవలం 4 శాతమే ఉందని హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనం వాపస్ తెప్పిస్తామని కేంద్రం మోసగించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు, రైతుబీమా, రైతుబంధు ఇస్తూ ఆదుకుంటోందని వెల్లడించారు. హరిత తెలంగాణ దిశగా బీఆర్ఎస్ చర్యలు తీసుకుంటే బీజేపీ మాత్రం ఉద్రిక్త తెలంగాణ, మతతత్వ తెలంగాణ కావాలన్న రీతిలో వ్యవహరిస్తోందన్నారు. కరెంట్ కోసం రోడెక్కిన రైతులను కాల్చి చంపిన నేతలు ఖమ్మంలో మాట్లాడారని, రైతులకు ఎరువులు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ అన్నదాతల గురించి మాట్లాడడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జెడ్పీ చైర్పర్సన్లు దావ వసంత, పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో గ్రూప్–4 నోటిఫికేషన్
సిద్దిపేట జోన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేసేలా అగ్నిపథ్ పేరిట ఆర్మీలో కాంట్రాక్టు విధానం తెచ్చిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అలాగే నల్ల చట్టాలను తేవడం, పెట్రో ధరలను ఇష్టానుసారంగా పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు. అలాంటి బీజేపీ తీరును గ్రామాల్లో ఎండగట్టి చర్చ పెట్టి నాయకుల చెంప చెల్లుమనేలా గులాబీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ ఉచిత శిక్షణ కేంద్రంలోని పోలీస్ ఉద్యోగాల శిక్షణార్థులకు పాలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–4 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుందని ప్రకటించారు. వాటిలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని కాళేశ్వరం ద్వారా ఒక్కఎకరా కూడా పండలేదని కొంతమంది అవాకులు చెవాకులుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో నిండుకుండలా బావుల్లో, చెరువుల్లో, చెక్ డ్యామ్ల్లోనీరు ఉందన్నారు. గతంలో 5 వేల ఎకరాల్లో పంటల సాగు అయ్యేదని, ఇప్పుడు నాలుగింతల సాగు పెరిగిందని తెలిపారు. ఢిల్లీలో, గాంధీభవన్‌లో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుందని,గ్రామాల్లోకి వచ్చి చూస్తే కాళేశ్వరం గురించి తెలుస్తుందని హరీశ్ హితవు పలికారు. కొర్రీలతో 30 వేల కోట్ల నిధుల నిలుపుదల ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు మొదలైన తర్వాత రాష్ట్రంలో ప్రారంభించిన కాళేశ్వరం పూర్తిచేసుకుని ప్రస్తుతం ఫలితాలు పొందుతున్నామని హరీశ్ అన్నారు. కానీ అక్కడ ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొర్రీల పేరుతో రాష్ట్రానికి వచ్చే రూ.30 వేల కోట్ల నిధులను ఆపిందని ఆరోపించారు. మల్లన్నసాగర్ ద్వారా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇంటింటికీ తాగునీరు అందించే రింగ్‌మెన్ రేపటి తరాలకు వరంగా మారుతుందన్నారు. దేశంలో ఎక్కువగా మాంసాహారం తినే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, 99 శాతం మాంసాహారులు ఉండగా, 1 శాతం శాకాహారం వారు ఉన్నట్లు హరీశ్ వెల్లడించారు. -
పల్లె దవాఖానాల్లో 1,569 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పల్లె దవాఖానాల్లో పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నిక వల్ల డాక్టర్ల నియామక ప్రక్రియ ఆలస్యమైందని చెప్పారు. 969 పోస్టులకు మెరిట్ జాబితా ప్రకటించామని, వారం పది రోజుల్లో నియామక పత్రాలు అందిస్తామని వెల్లడించారు. దీంతో అన్ని పీహెచ్‌సీల్లో డాక్టర్లు పూర్తిస్థాయిలో ఉంటారన్నారు. హరీశ్‌రావు శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో ‘పీహెచ్సీ మానిటరింగ్ హబ్’ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ‘పల్లె దవాఖానాల కోసం 1,569 పోస్టుల నియామక ప్రక్రియ త్వరలో మొదలవుతుంది.స్టాఫ్ నర్సులు, 1,165 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తాం. కేంద్రం దేశంలో వివిధ రాష్ట్రాలకు 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇంకా కొత్త కాలేజీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆయా జిల్లాల్లో కొత్త కాలేజీలను కేంద్రం ఇప్పుడు అనుమతించినా తీసుకుంటాం. దీనికోసం స్వయంగా నేనే కేంద్రం వద్దకు పత్రాలు తీసుకొని వెళ్తాను. కేంద్రం రేపు రమ్మంటే రేపే వెళ్తాను. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలవడానికి కూడా అభ్యంతరం లేదు. మరి ఆయన చొరవతీసుకుంటారా?’ అని అన్నారు. రాష్ట్రంలో 331 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయని, వీటిని 500కు పెంచాలని నిర్ణయించామన్నారు. బస్తీ దవాఖానాల్లో ఇప్పటివరకు 2.11 కోట్ల ఓపీ నమోదైందని చెప్పారు. వీటి వల్ల ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిందని తెలిపారు. ‘2019లో ఉస్మానియా ఆసుపత్రిలో 12 లక్షల ఓపీ ఉంటే.. ఈ ఏడాది 5 లక్షలకు తగ్గింది. గాంధీలో 6.5 లక్షల నుంచి 3.70 లక్షలకు, నిలోఫర్‌లో 8 లక్షల నుంచి 5.5 లక్షలకు, ఫీవర్ ఆసుపత్రిలో 4 లక్షల నుంచి 2 లక్షలకు తగ్గింది. దీంతో అక్కడ ఇతర సర్జరీల పెరిగాయి’ అని చెప్పారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 36.20 లక్షల మందికి 6.46 కోట్ల టెస్టులు చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న 4,500 ఆరోగ్య ఉపకేంద్రాలకుగాను 2,900 కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మారుస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. దేశంలో ఇదే తొలిసారి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి చేపట్టిన కార్యక్రమాలపై డిసెంబర్ చివరన ప్రగతి నివేదిక విడుదల చేస్తామని తెలిపారు. పీహెచ్సీ మానిటరింగ్ హబ్‌ను ఏర్పాటు చేయడం దేశంలోనే మొదటిసారని చెప్పారు. రాష్ట్రంలోని 887 పీహెచ్సీ, యూపీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటిని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్, టీఎస్ఎంఎస్ఐడీసీలకు అనుసంధానం చేశామన్నారు. మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులతో సంప్రదించి స్పెషాలిటీ సేవలు అందించే అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో 43 పీహెచ్‌సీలకు రూ.67 కోట్లతో కొత్త భవనాలను మంజూరు చేశామన్నారు. 372 పీహెచ్‌సీల మరమ్మతులకు రూ.43.18 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా కుషాయిగూడ, సూర్యాపేట జిల్లా అంబేడ్కర్ నగర్, సిద్దిపేటలోని అంబేడ్కర్ నగర్ పీహెచ్సీ వైద్యులతో, ఆసుç³త్రికి వచ్చిన హరిత, అన్నపూర్ణ అనే మహిళలతోనూ హరీశ్‌రావు మాట్లాడారు. ఈ సమావేశంలో అధికారులు శ్వేతామహంతి, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ రమేష్‌రెడ్డి, డాక్టర్ అజయ్‌కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
తొలి రోజే టీడీపీ డ్రామా మొదలైంది: మంత్రి కొట్టు
సాక్షి, అమరావతి: ఉభయ సభల్లో సమావేశాలు ప్రారంభం రోజునే టీడీపీ డ్రామా మొదలైందని.. వారికి ఏ మాత్రం సిగ్గులేదని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. 'ఈ రాష్ట్రంలో జాబు రావాలంటే జగన్ మోహన్‌రెడ్డి ఉండకూడదా?. గతంలో బాబు వస్తే జాబు అన్నారు. నారా లోకేష్ నాయుడికి తప్ప ఎవరికైనా జాబ్ వచ్చిందా?. లోకేష్‌కు జాబ్ వస్తే రాష్ట్రంలో అందరికీ జాబ్ వచ్చినట్లేనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో యువతీ యువకులకు ఉపాధి కల్పించిన ఘనత సీఎం జగన్‌ది అని అన్నారు. వైద్యరంగానికి సంబంధించి పూర్తిస్థాయిలో పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ దిగిపోతేనే ఉద్యోగాలొస్తాయనడానికి టీడీపీకి సిగ్గులేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మీ దురహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు. 'మళ్లీ బాబు వస్తే లోకేష్‌కు ఉద్యోగం కట్టబెట్టాలన్నదే మీ ఆలోచన. మెడికల్ వ్యవస్థలో పారదర్శకంగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. జగన్మోహన్రెడ్డి వల్ల న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజలకు ఉంది. టీడీపీకి రాజకీయంగా నూకలు చెల్లిపోయాయి. మీ డ్రామాలు ఎవరూ నమ్మరు' అని మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. చదవండి: (వేల ఎకరాల భూములు కొంతమంది చేతుల్లోనే: మంత్రి బుగ్గన) -
833 ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీరింగ్ సర్వీసులకు సంబంధించి 833 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీల్లోఖాళీలున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈనెల 23న టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ కార్యదర్శి తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఈనెల 28 నుంచి వచ్చేనెల 21వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. -
తెలంగాణలో గ్రూప్–4 నోటిఫికేషన్‌పై మంత్రి హరీష్‌రావు క్లారిటీ
సాక్షిప్రతినిధి,సంగారెడ్డి/సదాశివపేట: వారం రోజుల్లో 28 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తా మని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. కొద్ది రోజుల్లోనే గ్రూప్–4 నోటిఫికేషన్ కూడా వస్తుందని తెలిపారు. గురువారం ఆయన సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పను లకు శంకుస్థాపనలు చేశారు. కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదా రులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, సదాశివపేట, కంకోల్లలో జరిగిన సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లా డుతూ, నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలను వివరించారు. మరో పక్క బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రూ.2,016 ఆసరా పింఛన్ ఇస్తుంటే, పక్కనే ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో కేవలం రూ.600 ఇస్తున్నార న్నారు. పొరుగునే ఉన్న బీదర్ (కర్ణాటక) వెళ్లి ఈ విషయాన్ని పరిశీలించాలని ప్రజ లకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.75 మాత్రమే పింఛన్ ఇచ్చేవారని, లబ్ధిదారులెవరైనా చనిపోతే.. వారి స్థానంలో మాత్రమే కొత్త లబ్ధిదారు లకు పింఛన్లు మంజూరయ్యేవని గుర్తు చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదనే విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఉచితాలు వద్దంటున్న కేంద్రం మాటలపై హరీశ్‌రావు స్పందిస్తూ, పేద లకు సంక్షేమ పథకాలు అమలు చేయ వద్దని చెబుతున్నారా..? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దసరా నుంచి రూ.3 లక్షలు.. ఇంటి స్థలం ఉన్న పేదవారికి ఇంటి నిర్మా ణంకోసం రూ.3 లక్షలు ఇచ్చే పథకాన్ని దసరా నుంచి ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ కార్య క్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తదితరులు పాల్గొ న్నారు. కాగా, మంత్రి హరీశ్‌రావు పాల్గొన్న సదాశివపేట సభలో కోలుబావి ప్రాంతానికి చెందిన వడ్డె శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతడిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎందుకు కిరోసిన్ పోసుకున్నావని విలేకరులు ప్రశ్నిం చగా, ఎన్కెపల్లి రోడ్డులో గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎకరా ఐదు గుంటల భూమిని అధికారులు తిరిగి తీసుకున్నా రన్నారు. అందులో గోదాం నిర్మించారని, ఇన్నాళ్లూ వేచిచూసినా ఎవరూ పరిహారం గురించి పట్టించుకోకపోవడంతో ఆత్మహ త్యాయత్నం చేసినట్లు తెలిపాడు. -
మోదీకి ఊహించని షాక్.. ఒవైసీకి మద్దతు తెలిపిన బీజేపీ ఎంపీ
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. కాషాయ పార్టీకి చెందిన ఎంపీ.. సొంత పార్టీ బీజేపీపైనే సంచలన విమర్శలు చేశారు. దీంతో దేశంలోనే ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. యూపీలోని పిలిభిత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. కేంద్రానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. దేశంలోని నిరుద్యోగ సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని నిరుద్యోగం గత మూడు దశాబ్దాల కంటే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నదని కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. భారత్‌లో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉందంటూ.. ప్రస్తుతం ఇదే దేశంలో బర్నింగ్ ప్రాబ్లమ్ అంటూ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగితేనే దేశం శక్తివంతం అవుతుందని కుండబద్దలుకొట్టారు. ఒక వైపు ఉద్యోగాలు లేక దేశంలోని కోట్ల మంది యువత నిరుత్సాహంలో మునిగి ఉన్నారని అన్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా 60 లక్షలకుపైగా మంజూరైన పోస్టులు ఖాళీగా ఉండటం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర గణాంకాలను నమ్మవచ్చా? పలు శాఖల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ పోస్టులకు కేటాయించిన బడ్జెట్ ఎక్కడకు వెళ్లింది? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఉన్న నిరుద్యోగులందరీ ఈ విషయం తెలుసుకునే హక్కు ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కొద్దిరోజుల కిత్రం పలు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల ఖాళీలను వెల్లడించారు. ఈ సందర్బంలో తాను చదవి వినిపించిన డేటా తనది కాదని.. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీదని తెలిపారు. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి తన డేటాను చదవి వినిపించిన అసదుద్దీన్ ఒవైసీకి వరణ్ గాంధీ కృతజ్ఞతలు చెప్పారు. बेरोज़गारी आज देश का सबसे ज्वलंत मुद्दा है और पूरे देश के नेताओं को इस मुद्दे पर सरकार का ध्यान आकृष्ट कराना चाहिए। बेरोज़गार नौजवानों को न्याय मिलना चाहिए,तभी देश शक्तिशाली बनेगा। मैं आभारी हूँ की रोजगार के ऊपर उठाए गए मेरे सवालों का @asadowaisi जी ने अपने भाषण में ज़िक्र किया। pic.twitter.com/MAqfTOtHKZ — Varun Gandhi (@varungandhi80) June 13, 2022 ఇది కూడా చదవండి: యూపీ సీఎం యోగిపై అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్ -
ఈ ఏడాదంతా ఉద్యోగ పరీక్షలు
సాక్షి, సిద్దిపేట: ఉద్యోగ నోటిఫికేషన్ల మధ్య రెండు నెలల సమయం ఉండేలా ఈ ఏడాదంతా పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం సిద్దిపేటలో ‘సాక్షి’మీడియా గ్రూప్, కేసీఆర్ కోచింగ్ సెంటర్ల ఆధ్వర్యంలో పోటీ పరీక్షలపై అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 98 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఈ ఏడాదిలో భర్తీ చేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. అన్ని ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల కొందరు అవకాశం కోల్పోయే ప్రమాదం ఉన్నందున దశల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రతీ రెండు నెలలకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసేలా మంత్రివర్గం పచ్చజెండా ఊపిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటులోనూ మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేటలో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించడానికి దోహదపడే ఓరియంటేషన్ క్లాస్‌ను నిర్వహించడానికి ముందుకు వచ్చిన ‘సాక్షి’ మీడియా గ్రూప్‌నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ, హుస్నాబాద్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఎంపీడీఓ రాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తెలంగాణలో మరో నోటిఫికేషన్.. ఈసారి 1,271 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) 1,271 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందులో 70 అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్), 201 సబ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్), వెయ్యి జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం) పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, వయోపరిమితి, కేటగిరీలవారీగా ఖాళీల వివరాలతో సమగ్ర నియామక ప్రకటనను ఈ నెల 11న సంస్థ వెబ్సైట్ https://tssouthernpower.cgg.gov.in లేదా https://www.tssouthernpower.comలో పొందుపరచనున్నట్టు యాజమాన్యం తెలిపింది. త్వరలో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్), తెలంగాణ జెన్కో సంస్థల నుంచి సైతం ఏఈతోపాటు ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్ల నిర్వహణకు తెలంగాణ జెన్కో దాదాపు 200 ఏఈ పోస్టులను భర్తీ చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. ఓ మూడు, నాలుగు నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. టీఎస్ఎన్పీడీసీఎల్ దాదాపు 50 ఏఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. -
ఆశగా ఆటగాళ్లు..! తెలంగాణలో ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటా అమలు
ఖమ్మం స్పోర్ట్స్: చాన్నాళ్ల తర్వాత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఈక్రమంలో రెండు శాతం స్పోర్ట్స్ కోటా అమలుచేయడమే కాక, ఎలాంటి నిబంధనలు లేకుండా, ఎప్పుడు సాధించిన సర్టిఫికెట్లనైనా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండడంతో జిల్లా క్రీడాకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా విద్యా, ఉద్యోగ రంగాల్లో స్పోర్ట్స్ కోటా అమలుచేయాలని క్రీడా రంగ ప్రతినిధులు పోరాటాలు చేశారు. ఈనేపథ్యాన ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీఓను ఈసారి నోటిఫికేషన్లలో అమలుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగాల పోటీ పరీక్షల్లో సత్తా చాటేందుకు నిరుద్యోగులు క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. చదవండి👉 తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. ప్రిన్సిపల్ సంతకం లేకున్నా.. తొలిసారిగా 2012లో... క్రీడాకారులు, క్రీడాసంఘాల పోరాట ఫలితంగా తొలిసారిగా 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 84 జీఓ విడుదల చేశారు. ఈ జీఓ ఆధారంగా అన్ని ఉద్యోగ ఖాళీల భర్తీలో రెండు శాతం స్పోర్ట్స్ కోటా అమలుకు అవకాశం దక్కింది. ఇదే జీఓను ఇప్పుడు అమలుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, అండర్ – 14, 17, 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో ఆడి సర్టిఫికెట్లు పొందిన క్రీడాకారుల ఈ కోటా ద్వారా అవకాశం దక్కనుండడంతో ఉద్యోగం సాధించాలనే తపనతో చదువులో నిమగ్నమయ్యారు. నిబంధనలు లేకుండా... రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతుండగా, స్పోర్ట్స్ కోటా అమలుచేయనున్న ప్రభుత్వం ఈసారి మాత్రం మూడేళ్ల నిబంధన లేకుండా అన్ని సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఏదైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సాధించిన సర్టిఫికెట్ మూడేళ్ల వరకు అమల్లో ఉంటుందని గతంలో ప్రకటించారు. కానీ ఈసారి పలు ఉద్యోగాలకు వయస్సు నిబంధనలు సడలించినందున స్పోర్ట్స్ కోటా అమలులోనూ ఎప్పటి సర్టిఫికెట్లనైనా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో చాన్నాళ్ల క్రితం సర్టిఫికెట్లు సాధించి, ఇప్పటికీ ఉద్యోగాలు రాని అభ్యర్థులు మేలు చేకూరుతుందని చెబుతున్నారు. అయితే, అత్యధిక సర్టిఫికెట్లు కలిగిన వారికి తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. చదవండి👉🏻 దిమాక్ దొబ్బిందా!.. త్రిబుల్ రైడింగ్.. ఆపై మద్యం కూడా.. ఖేలో ఇండియా ఎలా? నాలుగేళ్ల నుంచి దేశంలో ఖేలో ఇండియా పేరిట ఏటా జాతీయస్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ పోటీల్లో పాల్గొని సర్టిఫికెట్లు సాధించిన వారికి కూడా స్పోర్ట్స్ కోటా అమలవుతుందా, లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రావడం లేదు. దీనికి తోడు ఐదారేళ్లలో కొత్తగా పుట్టుకొచ్చిన క్రీడల పరిస్థితి ఏమిటన్నది కూడా తెలియరావడం లేదు. కొన్ని క్రీడాంశాల్లో జిల్లా నుంచే నేరుగా అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశముండడంతో ఆయా క్రీడాకారులకు అవకాశం ఇచ్చేది, లేనిది ఇంకా వెల్లడించలేదు. ఈ అంశంపై ప్రత్యేక కమిటీ నియమించాలని క్రీడావర్గాలు కోరుతున్నాయి. ఇది మంచి పరిణామం ఎన్నో ఏళ్లనుంచి స్పోర్ట్స్ కోటాను అన్ని ఉద్యోగాల్లో అమలు చేయాలని పోరాడుతున్నాం. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటా అమలుకు నిర్ణయించడం మంచి పరిణామం. ఇక నుంచి అన్ని నోటిఫికేషన్లలో అమలుచేస్తే బాగుంటుంది. – పుట్టా శంకరయ్య, ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి క్రీడాకారులకు ప్రోత్సాహం క్రీడాకారులను ప్రోత్సహించేలా స్పోర్ట్స్ కోటాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలు చేయడం బాగుంది. ఇప్పటి వరకు కొన్ని శాఖల్లో మాత్రమే నేరుగా స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాకాశాలు లభిస్తున్నాయి. ఈసారి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అవకాశం కల్పించడం ఆనందంగా ఉంది. – కె.ఆదర్శ్‌కుమార్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి యువకులకే అవకాశం ఇవ్వాలి రాష్ట్రప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ద్వారా యువ క్రీడాకారులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తే బాగుంటుంది. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. రాష్ట్రంలోని యువత క్రీడలపై దృష్టి సారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. మరింత మంది ఉత్తమ క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. – జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షలు, మందుల వెంకటేశ్వర్లు ఉద్యోగం సాధిస్తాననే నమ్మకముంది ఉద్యోగాల భర్తీలో రాష్ట్రప్రభుత్వం స్పోర్ట్స్ కోటా అమలుచేయాలని నిర్ణయించడంపై సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఇప్పటి వరకు జాతీయస్థాయి పోటీల్లో సాధించిన సర్టిఫికెట్లు పనికి రాకుండా పోతాయమోనని ఆవేదన చెందాను. కానీ ప్రభుత్వం నిర్ణయంతో ఈసారి ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం వచ్చింది. – ఎం.జైనాద్ బేగ్ -
వారంలోగా కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో పోలీస్, ఫైర్, ఫారెస్టు, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి 20 వేల ఉద్యోగాలకు వారంరోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఒకే రోజు 16 అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. పలు సమీక్షల్లో పాల్గొన్నారు. పోలీస్ శాఖ ఇక్కడ ఏర్పాటు చేసిన కానిస్టేబుల్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి జాబ్ కేలండర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ‘‘దళితుల ఆర్థిక అభ్యున్నతికి దళితబంధు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. ఇది అమలైతదంటవా? రూ.పది లక్షలు ఇస్తరంటవా? అనే కాంగ్రెస్, బీజేపీ అపశకునం గాళ్లకు ప్రజలే గుణపాఠం చెప్పాలి. ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శిస్తున్నారు. మీ విమర్శలను దీవెనలనుకుంటాం. మరింత చిత్తశుద్ధితో ముందుకెళ్తాం’’అంటూ మంత్రి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ‘బండి సంజయ్.. నీ తొండి మాటలు బంద్ చెయ్యి’అని అక్కాచెల్లెల్లు అడ్డం తిరిగారటా.. సిలిండర్ ధర రూ.1,050 చేసినవు.. ఆ ధర ఎప్పుడు తగ్గిస్తావో చెప్పు అని గట్టిగా అడిగారట.. నిరుద్యోగ యువత దేశంలో ఉన్న 15.60 లక్షల ఉద్యోగాలెప్పుడిస్తరో చెప్పు అని నిలదీశారట’’అని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు పెట్రోల్, సిలిండర్ ధరలను పెంచి తొండి పనులు చేస్తూ రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ‘కాంగ్రెసోళ్లది దింపుడుగల్లం ఆశ. వాళ్లది వాళ్లకే సుతిలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటున్నారు’అని ఎద్దేవా చేశారు. -
నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
తిరుమలగిరి(తుంగతుర్తి): రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఏడేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా 37వ రోజైన శనివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలోకి పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మాట– ముచ్చట’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఉన్నత చదువులు చదివిన యు వత కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు రాక కూలి పనులు, కుల వృత్తులకే పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్టీపీ కో ఆర్డినేటర్ల నియామకం సాక్షి, హైదరాబాద్: పార్టీ బలోపేతంలో భా గంగా షర్మిల రాష్ట్ర అధికార ప్రతినిధుల తో పాటు రాష్ట్ర యువత విభాగం, విద్యార్థి విభాగాలకు కో ఆర్డినేటర్లను నియమించా రు. ఈ మేరకు పార్టీ కార్యాలయం శనివారం ఓ ప్ర కటన విడుదల చేసింది. రాష్ట్ర అధికార ప్రతినిధులుగా తూడి దేవేందర్ రెడ్డి, గట్టు రామచందర్‌రావు, ఏపూరి సోమన్న, పిట్ట రాం రెడ్డి, సయ్యద్ ముజ్తబా అహ్మద్, సత్యవతి, భూమిరెడ్డి, బోర్గి సంజీవ్, కేటీ నరసింహా రెడ్డి, డాక్టర్ కె.నగేశ్ నియమితులయ్యా రు. స్టేట్ యూత్ కోఆర్డినేటర్లుగా సయ్యద్ అజీ మ్, సుమన్ గౌడ్, గడ్డం హిందుజారెడ్డి, అద్నాన్ ఖాన్, నంబూరి కార్తీక్‌తో పాటు మ రో 8 మందిని నియమించారు. స్టేట్ స్టూడెం ట్ కో ఆర్డినేటర్లుగా విజయ్ కుమార్, ఎస్, నాగరాజ్ చక్రవర్తి, డి. శివారెడ్డి, గడ్డం అశోక్, ఎల్. విజయ్ కుమార్, గడ్డం ఆదాము నియమితులయ్యారు. ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షునిగా లక్కినేని సుధీర్ బాబు, హుజూర్నగర్ నియోజకవర్గం కో ఆర్డినేటర్‌గా ఆదెర్ల శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. -
కేసీఆర్ నిర్లక్ష్యంతోనే నిరుద్యోగం: షర్మిల
మోటకొండూర్: తెలంగాణలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే నిరుద్యోగ సమస్య పెరిగిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వ కుండా కాలయాపన చేయటంతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుని తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చారని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూర్ మండలం ఆరెగూడెం, గిరిబోయినగూడెం మీదుగా పాదయాత్ర నిర్వహించిన షర్మిల.. మోటకొండూర్ మండల కేంద్రానికి చేరుకుని ఉద్యోగ దీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎంతో మంది నిరుద్యో గులు కేసీఆర్ పేరు రాసి చనిపోయారని కానీ, ముఖ్యమంత్రిలో చలనం రాకపోవటం దురదృ ష్టకరమన్నారు. చనిపోయిన నిరుద్యోగుల కుటుం బాలకు రూ.25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. -
హైదరాబాద్‌లో వాటికి ఫుల్ డిమాండ్.. 30 శాతం వరకు పెరగనున్న చార్జీలు
సాక్షి, హైదరాబాద్: మహానగరంలోని ప్రైవేటు హాస్టల్స్‌కు తాకిడి పెరిగింది. సర్కారు జంబో కొలువుల భర్తీ ప్రకటనతో గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు నగరానికి క్యూ కడుతున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లు గల ప్రాంతాల్లోని హాస్టల్స్ గదులకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా హాస్టల్స్ నిర్వాహకులు గదులు, మెస్ చార్జీలు కూడా 20 నుంచి 30 శాతం పెంచేస్తున్నారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే నిరుద్యోగ అభ్యర్థులు అద్దె గదుల కంటే హాస్టళ్లలో ఉండటానికి మొగ్గు చూపుతారు. (చదవండి: ట్రాఫిక్ పోలీసుల తీరు.. ఏపీ వాహనం ఆపాల్సిందే ) రెండువేలకు పైనే హైదరాబాద్ నగరంలో రెండున్నర వేలకు పైగా సాధారణ, లగ్జరీ, డీలక్స్ హాస్టళ్లున్నాయి. ఇందులో వసతి పొందేందుకు సౌకర్యాలకు తగట్టు నెలకు కనీసం రూ.5 వేల నుంచి రూ.12 వేల వరకు చార్జీలుంటాయి. కొన్ని హాస్టళ్లు విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలతో అనుసంధానంగా కూడా నడుస్తున్నాయి. హాస్టళ్లు కనీసం 50 మంది నుంచి 150 మందితో నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు , జవహర్‌నగర్, అశోక్‌నగర్, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, సంజీవరెడ్డినగర్, ఎల్లారెడ్డిగూడ, వెంగళరావునగర్తో పాటు కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్పల్లి, గచ్చిబౌలి,మాదాపూర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో హాస్టళ్లు ఉన్నాయి. గత రెండేళ్లుగా .. కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా ప్రైవేటు హాస్టల్స్ మూతపడ్డాయి. ఇటీవల థర్డ్‌వేవ్‌లో తెరుచుకున్నప్పటికి నిర్వహణ భారంగా తయారైంది. అద్దె చెల్లించలేక సగానికి పైగా ఖాళీఅయ్యాయి. దీంతో హాస్టల్ నిర్వాహకులు నష్టాల్లో మునిగిపోయాయి. కొందరు మాత్రం సగం అద్దె చెల్లిస్తూ నష్టాలను భరిస్తూ వచ్చారు. తాజాగా సర్కారు ఉద్యోగ ప్రకటనలు రానున్నడంతో తిరిగి హాస్టల్స్‌కు పాత కళ వస్తోంది. -
మా పోరాట ఫలితమే ఉద్యోగ నోటిఫికేషన్లు
బీబీనగర్/భూదాన్ పోచంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం తనను అవమాన పరిచేలా దాడులకు తెగబడినా పోరాటం ఆపకుండా నిరంతరం నిరుద్యోగ దీక్ష చేశానని, దాని ఫలితంగానే సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు వేశారని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం ఆమె ప్రజాప్రస్థాన పాదయాత్ర భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రం నుంచి మార్కండేయనగర్, ముక్తాపూర్, చింతబావి, రేవనపల్లి, గౌస్‌కొండ, పెద్దరావులపల్లి మీదుగా బీబీనగర్ మండలానికి చేరింది. ఇందులో భాగంగా మండలంలోని భట్టుగూడెం గ్రామంలో ప్రజలతో మాట–ముచ్చట కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 11 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని అన్నారు. మహిళ అని కూడా చూడకుండా కేసీఆర్ తనపై దాడి చేయించారని, అయినా నిరుద్యోగుల కోసం దీక్షను వీడకుండా తెలంగాణ తల్లి సాక్షి గా నిరుద్యోగ యువత కోసం పోరాడుతున్నా నని చెప్పారు. కార్యక్రమాల్లో పార్టీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, ప్రోగాం కోఆర్డినేటర్ రాజగోపాల్, ప్రచార కన్వీనర్ రమేశ్, నాయకులు సత్యవతి, అతహర్, గణేశ్‌నాయక్ పాల్గొన్నారు. -
గాంధీలో 135 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో 135 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఓబీజీ, íపీడియాట్రిక్, అనస్తీషియా విభాగాల్లో ఒక్కో విభాగానికి 20 చొప్పున, ఆర్థోపెడిక్‌లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) 20 పోస్టులు మొత్తం 135 ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈనెల 19 నుంచి ఏప్రిల్ 4లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 7న మెరిట్ లిస్ట్ ప్రకటించనున్నట్లు తెలిపారు. 9న గ్రీవెన్స్ పరిశీలన, 11న ఫైనల్ మెరిట్ లిస్ట్, 12న సెలక్షన్ లిస్ట్, 14న అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారని సంబంధిత అధికారులు వెల్లడించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎండీ, ఎంఎస్, డీఎన్బీ తత్సమానమైన విద్యతోపాటు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంసీఐ లేదా ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ ఉండాలని, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు తెలంగాణ, ఏపీ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఉండాలని వివరించారు. 18 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులని, రాష్ట్రంలో అమలవుతున్న రిజర్వేషన్ ప్రకారం కేటాయింపులుంటాయని తెలిపారు. ఎస్సెస్సీ ఒకటి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, మార్క్స్ లిస్ట్, ఎంబీబీఎస్, పీజీ సర్టిఫికెట్లు, కుల, వికలాంగ« ధ్రువీకరణ, సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేసిన సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, సంబంధిత పత్రాలను దరఖాస్తుతో జత చేయాలని సూచించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లు సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉంటారు. -
రివిజన్తో విన్!
పట్టుదలతో చదివితే లక్ష్యాన్ని చేరవచ్చు. ఆశయసాధనలో అలుపెరగక ముందుకు సాగితే విజయం సాగిలపడుతుంది. నిరంతర శ్రమతో.. అకుంఠిత దీక్షతో అహరహం తపిస్తే గెలుపు బాట తథ్యం అంటున్నారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్. సర్కారీ కొలువుల నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో గ్రూప్స్ అభ్యర్థులకు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ముచ్చటించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ముందు సిలబస్‌పై అభ్యర్థులకు అవగాహన అవసరమన్నారు. దానికి అనుగుణంగా మెటీరియల్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించాలని, జనరల్ నాలెడ్జి పెంచుకోవాలన్నారు. పరీక్షల్లో తొలి మెట్టుకు ఈ రెండు అంశాలు దోహదపడతాయని శర్మన్ స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏం సూచించారంటే.. – సాక్షి, హైదరాబాద్ ఎంత అర్థమైందన్నదే పాయింట్ చదవడంతో పాటు నిరంతరం సమీక్షించు కోవాలి. గంటలకొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదు.. ఎంత వరకు అర్థమైందనేది ప్రధానం. ఇష్టంగా అర్థం చేసుకుంటూ చదవాలి. పరీక్షకు హాజరయ్యే లోపు కనీసం రెండుసార్లయినా రివిజన్ చేస్తేనే çపట్టు వస్తుంది. ఒకేసారి సిద్ధం కావాలి గ్రూప్స్ అభ్యర్థులకు ప్రిలిమ్స్ తర్వాత మెయి న్స్ పరీక్షకు లభించే కాల వ్యవధి సరిపోదు. దీంతో ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్‌కు ఒకేసారి సిద్ధం కావడం ప్రారంభించాలి. లాంగ్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే పరీక్ష విధానం అర్థమవుతుంది. జవాబు ఎంత వరకు రాయాలో తెలుస్తుంది. ప్రతి దానిని సూక్ష్మంగా గమనించి దానికి అనుగుణంగా సిద్ధమయ్యేందుకు ప్రయత్నించాలి. ఆప్షనల్ సబ్జెక్టులు కీలకం గ్రూప్ మెయిన్స్ కోసం ఆప్షన్లు నిర్ణయించు కోవడం కీలకం. ఆసక్తిని బట్టి ఆప్షన్లు నిర్ణయిం చుకోవాలి. సంబంధిత సబ్జెక్టుల్లో గట్టి పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే పరీక్ష సునాయాసంగా రాసేందుకు వీలుంటుంది. మెయిన్స్ ఇంటర్వ్యూలో సైతం ఆప్షన్స్‌పై అధిక ప్రశ్నలు అడుగుతారు.. అవసరం లేని సమాచారం వద్దు రెండు దశాబ్దాల క్రితం వరకు పోటీ పరీక్షలకు సమాచారం సేకరణ కష్టంగా ఉండేది. ప్రస్తుతం గూగుల్ సమాచార గనిగా మారింది. అనవసరమైన సమాచారం సేకరించకుండా సిలబస్‌కు అనుగుణంగా సమాచారం మాత్రమే సేకరించి వాటిపై దృష్టి సారించాలి. సమాధానాలతో సంతృప్తి పర్చాలి ఇంటర్వ్యూల్లో బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలతో సంతృప్తి పర్చగలగాలి. బోర్డు సభ్యుల దగ్గర అభ్యర్థి పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న వేస్తారు. అందులో వ్యక్తిగత, నేటివిటీ, రాష్ట్రీయ, జాతీయ, సున్నితమైన, ఉద్యోగం సంబంధించి తదితర ప్రశ్నాలు సంధిస్తారు. వాటికి ఎలాంటి టెన్షన్ లేకుండా సునా యసంగా జవాబు ఇవ్వాలి. తెలియకుంటే తెలియదని స్పష్టంగా చెప్పాలి. తెలియకున్నా.. చెప్పడానికి ప్రయత్నించవద్దు. సమయపాలన ప్రధానం పోటీ పరీక్షల్లో సమయ పాలన కూడా ప్రధానం. సమయం వృథా చేయకుండా సంబంధిత సబ్టెక్టులపై పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలి. పరీక్ష రాసేటప్పుడు కూడా ముందుగానే ప్రశ్నలకు సమయం కేటాయించుకొని పూర్తి చేసే విధంగా ప్రయత్నించాలి. -
కేసీఆర్‌ని నమ్మలేం: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: పోరాటాలకు ఎంతటి నియంత పాలకులైనా తలవంచాల్సిందేనని, కానీ కేసీఆర్‌ను నమ్మలేమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన తమ పార్టీ కార్యకర్తల విజయమన్నారు. ఉద్యోగాలకోసం తాము 17 వారాల పాటు నిరాహార దీక్షలు, అలుపెరుగని పోరాటం చేస్తేనే ప్రతిపక్షాలకు సోయి, అధికార పక్షానికి బుద్ధివచ్చిందని తెలిపారు. బిస్వాల్ కమిటీ రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలను గుర్తిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ లక్ష 50 వేల ఖాళీలని లెక్క తెలిస్తే, కేసీఆర్ మాత్రం 80 వేల ఖాళీలు మాత్రమే చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలను నింపాల్సిందేనని, టీఎస్పీఎస్సీలో నమోదు చేసుకున్నా 25లక్షల నిరుద్యోగులతో పాటు.. అర్హత ఉన్న నిరుద్యోగులందరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లపై మాట ఇచ్చినంత మాత్రాన తమ పోరాటం ఆగిపోదని, ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ చేసేవరకు తమ పోరాటం సాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. చదవండి: (సీఎం పర్యటనకు జూపల్లి డుమ్మా) -
భట్టికి మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్
-
సీఎం కేసీఆర్ ప్రకటనతో కరీంనగర్లో అంబరాన్నంటిన సంబరాలు
-
కేసీఆర్‌కు పాలాభిషేకాలు ఎందుకు..?
-
కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేసీఆర్ తీపి కబురు..
-
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు
-
సంబరాల్లో తెలంగాణ నిరుద్యోగులు
-
తెలంగాణలో కొలువుల పండగ
-
తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ
-
CM KCR: తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ: సీఎం కేసీఆర్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. ఊహించినట్లుగానే భారీగా కొలువుల భర్తీ ప్రకటనను స్వయంగా వెల్లడించారు. మొత్తం 91, 142 ఉద్యోగాలకు నేటి నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభం అని ప్రకటించారు. తమది ఎంప్లాయింట్‌మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, హయ్యెస్ట్ పెయిడ్ ఎంప్లాయిస్ తెలంగాణలో ఉన్నారని ప్రకటించుకున్న తెలంగాణ సీఎం.. కేంద్రం వైఖరి వల్లే భర్తీ ప్రక్రియ ఆలస్యమైందని ఆరోపించారు. ‘‘తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టం. నేనూ పోలీసు లాఠీ దెబ్బలు తిన్నా. అంతులేని వివక్ష, అన్యాయం ఎదుర్కొంది తెలంగాణ. వేరే పార్టీలకు రాజకీయాలంటే గేమ్.. టీఆర్ఎస్కు మాత్రం ఒక టాస్క్. ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్లం మేం. మేం ఏం చేశామో ప్రజలకూ తెలుసు. పోరాటాలు చేశాం. జైలుకు వెళ్లాం. వ్యక్తిగత నిందలు ఎదుర్కొన్నా. ఏకాగ్రత, లక్ష్యం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఊరుకున్నాం. తెలంగాణ కోసం క్షోభ, బాధ అనుభవించాం. తెలంగాణ భాష అంటే ఒకప్పుడు హాస్యాస్పదంగా ఉండేది. ఒకప్పుడు జోకర్లకు ఉండే తెలంగాణ యాస.. ఇప్పుడు హీరోలకు వచ్చేసింది. అధికారికంగా పండుగలు జరుపుకుని.. సంస్కృతిని కాపాడుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఉద్దేశంతో పోరాడాం. గోదావరి జలాలు సాధించుకున్నాం. తెలంగాణ కోసం విద్యార్థులు పోరాటాలు చేశారు. రెండు రోజులు ఆలస్యమైనా పని మంచిగా జరగాలనే కోణంలో పని చేసింది మా ప్రభుత్వం. ఇప్పటివరకు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో లక్షా 56 వేల ఉద్యోగాలకు నోటిఫై చేశాం. రాష్ట్రపతి, ప్రధానులకు స్వయంగా నేనే చర్చించా. దేశంలో ఎక్కడా లేని విధంగా.. శాశ్వతంగా 95 శాతం స్థానికులకే వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇకపై అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే. టీచర్ల ప్రమోషన్లు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాం. 9, 10 షెడ్యూల్ పంచాయితీ ఇంకా తెగని కారణంగా.. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలో గుర్తించిన ఖాళీలు 91, 142 11, 103 కాంట్రాక్ట్ ఉద్యోగుల రైగ్యులరైజేషన్ గ్రూప్-1 పోస్టులు 503, గ్రూప్-2 పోస్టులు 582 గ్రూప్-3 పోస్టులు 1,373 గ్రూప్-4 పోస్టులు 9,168 జిల్లా స్థాయిలో 39, 829 పోస్టులు. హైదారాబాద్- 5,268 నిజామాబాద్- 1,976 మేడ్చల్ మల్కజ్గిరి - 1,769 రంగారెడ్డి- 1,561 కరీంనగర్-1,465 నల్లగొండ-1,398 కామారెడ్డి- 1,340 ఖమ్మం- 1,340 భద్రాద్రి కొత్తగూడెం- 1,316 నాగర్ కర్నూలు-1,257 సంగారెడ్డి-1,243 మహబూబ్‌నగర్- 1,213 ఆదిలాబాద్-1,193 సిద్దిపేట- 1,178 మహబూబాబాద్: 1, 172 హన్మకొండ- 1,157 మెదక్- 1,149 జగిత్యాల- 1, 063 మంచిర్యాల-1, 025 యాదాద్రి-భువనగిరి- 1,010 జయశంకర్ భూపాలపల్లి- 918 నిర్మల్-876 వరంగల్-842 కొమురంభీం ఆసీఫాబాద్- 825 పెద్దపల్లి-800 జనగాం-760 నారాయణ్‌పేట- 741 వికారాబాద్-738 సూర్యాపేట-719 ములుగు- 696 జోగులాంబ గద్వాల-662 రాజన్న సిరిసిల్ల- 601 వనపర్తి-556 జోనల్ లెవల్లో 18, 866 పోస్టులు మల్టీజోనల్‌లో 13, 170 ఉద్యోగాల ఖాళీ ఇతర కేటగిరీ, వర్సిటీల్లో 8, 174 పోస్టులు నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో పాటు మొత్తం ఖాళీలలో.. 11, 103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. అలాగే మిగిలిన వాటిల్లో 80, 039 పోస్టులకు ఇవాళ్టి(మార్చి 9, 2022) నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు ఉద్యోగ గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు ఎక్స్ సర్వీస్మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు ► మొత్తం 80, 039 ఖాళీల్లో.. అత్యధికంగా హోం శాఖలో 18, 334 ఖాళీలు ఉన్నాయి. తర్వాతి సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13, 086 ఖాళీలు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో 12, 775 ఖాళీలు ఉన్నాయి. ► ఉన్నత విద్యలో 7, 878, బీసీల సంక్షేమం 4, 311, రెవెన్యూలో 3, 560, షెడ్యూల్ కాస్ట్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 2, 879, ఇరిగేషన్లో 2, 692, ఫైనాన్స్‌లో 1, 146, అత్యల్పంగా లెజిస్లేచర్‌లో 25, విద్యుత్ శాఖలో 16 ఖాళీలు ఉన్నాయి. ► కాంట్రాక్ట్ ఉద్యోగాలు వద్దన్నందుకు రాష్ట్రంలోని పలు పార్టీలు కోర్టుకు వెళ్లాయని చెప్పారు సీఎం కేసీఆర్. ఉద్యోగి కన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులే ఎక్కువ పనిచేస్తుంటారని, అయినప్పటికీ వారి జీతాలు మాత్రం తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ► కాంట్రాక్ట్ పేరుతో శ్రమదోపిడి ఉండకూడదనేది తమ అభిలాష అని ఆయన అన్నారు. అందుకే 11, 103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. క్రమంగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పారు. ► రాష్ట్రంలో ఇప్పటికే తాము 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, 1.12 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేశామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో 1,33,940 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు. ► 95 శాతం లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని అన్నారు. కేంద్ర సర్కారు సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు. దేశంలోనే అతి తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పుకొచ్చారు. తాము క్రమశిక్షణతో పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. కొందరు ఉద్యోగ నియామకాలపై అర్ధరహిత వివాదాలు సృష్టించారని ఆయన అన్నారు. -
అసెంబ్లీ వేదికగా అద్భుత ప్రకటన: సీఎం కేసీఆర్
నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నాం.. నేడు అసెంబ్లీ వేదికగా అద్భుత ప్రకటన చేయనున్నాం. ఉదయం 10 గంటలకు అందరూ టీవీలు పెట్టుకొని చూడండి – వనపర్తి సభలో సీఎం కేసీఆర్ ‘‘తెలంగాణలో ఎన్నో పనులు ప్రజలు అడగక ముందే చేసుకున్నాం. ఇప్పుడు నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నాం. బుధవారం అసెంబ్లీ వేదికగా నిరుద్యోగుల కోసం అద్భుత ప్రకటన చేయనున్నాం. ఉదయం పది గంటలకు అందరూ టీవీలు పెట్టుకుని చూడండి. తెలంగాణ ప్రగతి కోసం చివరి ఊపిరి, రక్తం బొట్టు దాకా టీఆర్ఎస్ పని చేస్తుంది..’’ మంగళవారం వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన ఈ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించింది. ముఖ్యమంత్రి ఏం చెబుతారు? ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామంటారా? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు? ఎప్పుడో మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతిని ప్రకటిస్తారా? ఎంత ఇస్తారు? అనే చర్చకు తెరతీసింది. రాజకీయ వర్గాల్లో సైతం ఉత్కంఠ నెలకొంది. అయితే 60 వేల వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని, ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రకటన ఉండవచ్చని తెలుస్తోంది. సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వనపర్తి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ల జారీపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయవచ్చనే చర్చ జరుగుతోంది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా కొలువుల భర్తీకి వార్షిక క్యాలెండర్ ప్రకటిస్తామంటూ ఇచ్చిన హామీని సైతం ప్రస్తావించే అవకాశముందని చెబుతున్నారు. ఉపాధ్యాయ, పోలీసు కొలువులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2020 డిసెంబర్ 13న కేసీఆర్ ప్రకటన చేశారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించిన తర్వాత ఏర్పడనున్న ఖాళీల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్లు జారీ చేయాలని కూడా అప్పట్లో ఆదేశించారు. అయితే పదోన్నతుల ప్రక్రియ ముగిసిన తర్వాత నియామకాల అంశం మరుగున పడిపోయింది. గతేడాది కరోనా రెండోవేవ్ రావడం, ఆ తర్వాత కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగాల పునర్విభజన చేపట్టాల్సి రావడంతో ఆ ప్రక్రియకు ఫుల్స్టాప్ పడింది. అయితే కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం బదిలీల ప్రక్రియ సైతం ఇటీవల పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీకి అన్ని అడ్డంకులు తొలగినట్టయింది. కమిటీతో మళ్లీ మొదటికి.. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు పూర్తయిన తర్వాత ప్రభుత్వం చేసే ప్రకటన కోసం నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, కేడర్ స్ట్రెంగ్త్ అవసరాలు, ఖాళీల భర్తీపై అధ్యయనానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్ శేషాద్రి అధ్యక్షతన పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు గత జనవరి 16న కేసీఆర్ ప్రకటించడంతో నియామకాల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్టు అయింది. జిల్లాల్లో ఖాళీలను గుర్తించడంతో పాటు ఆర్డీఓలు, వీఆర్వోలు, వీఆర్ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి? కొత్త జిల్లాలు, కొత్త మండలాల్లో పని ఒత్తిడికి తగ్గట్టు కొత్తగా పోస్టుల అవసరాన్ని గుర్తించడం వంటి అంశాలపై అధ్యయనం జరపాలని అప్పట్లో కమిటీకి సూచించారు. ఈ నేపథ్యంలో కొలువుల భర్తీపై ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించే పనిని ఈ కమిటీ ప్రారంభించింది. కానీ నిర్దిష్టమైన కాలవ్యవధి నిర్ణయించకపోవడం, విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో కమిటీ నివేదిక ఎప్పుడు ఇస్తుందో అన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో కాలయాపనకే ఈ కమిటీని వేశారనే విమర్శలు సైతం వచ్చాయి. అయితే ఉన్నట్టుండి ముఖ్యమంత్రి నిరుద్యోగులు గురించి చేసిన ప్రకటన నేపథ్యంలో.. ఈ కమిటీ ఆగమేఘాల మీద నివేదిక సమర్పించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలావుండగా..నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్ర బడ్జెట్ 2022–23లో ఎలాంటి నిధులను ప్రతిపాదించకపోవడంతో దీనిపై సీఎం ప్రకటన ఉండే అవకాశాలు లేనట్టేనని సమాచారం పునర్విభజన తర్వాత 85 వేల ఖాళీల గుర్తింపు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొత్తం 1.32 లక్షల పోస్టులను భర్తీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తెలంగాణ వచ్చాక తొలి నాలుగేళ్లలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయగా, దాదాపుగా గడిచిన మూడేళ్ల కాలంలో ఎలాంటి నోటిఫికేషన్లు జారీ కాలేదు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల పునర్విభజన పూర్తైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 85 వేల వరకు ఖాళీలను గుర్తించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. 1.91 లక్షల పోస్టులు ఖాళీ అన్న తొలి పీఆర్సీ రాష్ట్రంలో 39 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గతేడాది ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులు ఉండగా.. 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, ఏకంగా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ప్రధానంగా విద్యా శాఖలో 23,798, హోంశాఖలో 37,182, వైద్య శాఖలో 30,570, రెవెన్యూ శాఖలో 7,961, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది. -
ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం దుర్మార్గం
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్) : రాష్ట్రంలో ఉద్యోగ నోటి ఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండి పడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ మంగళవారం వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. షర్మిల మాట్లాడుతూ యువత, విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం బాధాకరమన్నారు. ఉపాధి అవకాశాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే 1.90 లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన ఆమెను బేగంబజార్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
‘ఎక్లాట్’లో 1,400 ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య, రక్షణ రంగంలో సాంకేతిక, సేవల రంగంలో పేరొందిన వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ (ఎక్లాట్) తెలంగాణలో తన గ్లోబల్ డెలివరీ సెంటర్ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌లో వచ్చే 18 నెలల కాలంలో మరో 1,400 మంది ఉద్యోగులను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఎక్లాట్ ఇప్పటికే కరీంనగర్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలను విస్తరించడంతో పాటు వరంగల్, ఖమ్మంలో రెండు కొత్త డెలివరీ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ సెంటర్లో 300 మంది చొప్పున, హైదరాబాద్‌లో 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. ఎక్లాట్ ప్రతినిధులు గురువారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఎక్లాట్కు అవసరమైన సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. హెల్త్‌కేర్ సొల్యూషన్స్ కోసం తాము తెలంగాణ ఏఐ మిషన్‌తోనూ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఎక్లాట్ సీఈఓ కార్తీక్ పోల్సాని, సీఓఓ స్నేహా పోల్సాని తెలిపారు. ఇదిలా ఉంటే 2016లో తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇప్పటికే కరీంనగర్లో 200 మెడికల్ కోడిం గ్, టెక్నాలజీ ఉద్యోగాలను ఎక్లాట్ సృష్టించింది. Thanks to Eclat Health Solutions for providing their continuous support to Telangana Govt in our endeavour to promote IT in tier-2 cities. @taskts and @AiTelangana will collaborate with Eclat for skill development and innovation in Healthcare NLP and AI — KTR (@KTRTRS) February 3, 2022 -
సభ్యత్వం చేయకపోతే పదవులు రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని, సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా పనిచేయనివారికి పార్టీలో భవిష్యత్ ఉండదని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అలాంటి వారికి పదవులు రావడం కష్టమన్నారు. సభ్యత్వ నమోదును ఏఐసీసీ చాలా సీరియస్‌గా పరిగణిస్తోందని, రోజూ ఢిల్లీస్థాయిలో సమీక్షిస్తోందని చెప్పారు. పార్టీ నేతలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, సమన్వయకర్తలు, బూత్‌స్థాయి ఎన్రోలర్లు సమష్టిగా పనిచేసి 30 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన గాం«దీభవన్‌లో డిజిటల్ సభ్యత్వ నమోదుపై పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. పార్టీ బలోపేతానికి, రానున్న ఎన్నికల్లో గెలుపునకు సభ్యత్వాలు చాలా కీలకమని, ప్రతి పోలింగ్ బూత్‌లో కనీసం 100 మందిని పార్టీ సభ్యులుగా చేర్పించాలని చెప్పారు. ఫిబ్రవరి 9న మళ్లీ దీనిపై సమీక్షించనున్నారు. 11 గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, డిజిటల్ సభ్యత్వ నమోదు రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు అడిగితే దాడులా? రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతిని మూడేళ్లయినా అమలుపర్చలేదని, ఈ విషయాలను అడిగేందుకు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడికి వెళ్లిన యూత్ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నేతలు దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో యూత్ కాంగ్రెస్ నేత రవికాంత్గౌడ్పై ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అనుచరులు దాడి చేశారని, జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిలో పోలీసుల అత్యుత్సాహం కారణంగా కార్యకర్త శ్రీనివాస్ నాయక్ కాలు విరిగిందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యమం ఉధృతం చేస్తాం: శివసేనారెడ్డి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడిలో భాగంగా వినతిపత్రాలు సమరి్పంచేందుకు వెళ్లిన యువజన కాంగ్రెస్ నేతలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఎమ్మెల్యేలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. దేశంలోనే నంబర్ 1 నల్లగొండ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పార్టీ సభ్యత్వ నమోదులో నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని గాం«దీభవన్ వర్గాలు చెప్పాయి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో 3.50 లక్షల సభ్యత్వం నమోదైందన్నాయి. దీని పరిధిలోని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 76,252, సూర్యాపేటలో 73,697, కోదాడలో 55,682, మిర్యాలగూడలో 38,456, దేవరకొండలో 38,380, నాగార్జునసాగర్‌లో 57,260, నల్లగొండలో 8,711 సభ్యత్వాలను ఈ నెల 29 నాటికి పూర్తి చేసినట్టు చెప్పాయి. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భారీస్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయి. -
మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేంతవరకు ఎక్కడికక్కడ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కలిపి లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిర్వీర్యం చేస్తోందని గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. వయోభారంతో మానసికంగా నిరుద్యోగులు కుంగిపోతున్నారని తెలిపారు. ఎనిమిదేళ్లుగా డీఎస్సీ లేదని, గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేలు, మంత్రులను నిరుద్యోగులు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని లింగంగౌడ్ ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు. -
ఉద్యోగం రాలేదని ఉరేసుకున్నాడు
దుబ్బాక రూరల్: ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. ఏఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన బీర్ల ఎల్లం, యాదవ్వ దంపతుల రెండో కుమారుడు శ్రీకాంత్ (24) డిగ్రీ పూర్తి చేశాడు. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పరీక్ష రాశాడు. పరీక్షలో సరైన ఫలితం రాలేదు. మూడేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని తన సోదరి ఫోన్‌కు వాట్సాప్ పందేశం పంపాడు. కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు. -
తొలి సంతకం ఉద్యోగాల భర్తీపైనే.. : వైఎస్ షర్మిల
నార్కట్‌పల్లి: తెలంగాణలో 1.91 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్ టీపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఉద్యోగాల భర్తీపైనే చేస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లిలో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ కాకపోవడంతో నిరుద్యోగులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో పోరాడిన నిరుద్యోగులు చనిపోతున్నా సీఎం కేసీఆర్‌కు ఎలాంటి కనికరం లేకుండా పోయిందన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని త్వరలోనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తుందని సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మూడుసార్లు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి లక్ష ఉద్యోగాలు భర్తీ చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలని, అప్పుడే ప్రతి ఒక్కరి బతుకుల్లో మార్పు వస్తుందన్నారు. తమ పార్టీపై నమ్మకంతో రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే రైతులు నచ్చిన పంటలు వేసుకోవచ్చని, ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తామని, మహిళలకు అభయహస్తం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతుల బ్యాంక్ రుణాల మాఫీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నేతలు పిట్టా రాంరెడ్డి, చంద్రహాసన్‌రెడ్డి, ఏపూరి సోమన్న, ఇరుగు సునీల్, శివపావని, సత్యవతి, చైతన్యరెడ్డి, పబ్బతిరెడ్డి వెంకట్‌రెడ్డి, పోకల అశోక్, పర్వతం వేణు పాల్గొన్నారు. -
Telangana: రెండేళ్లుగా జాబ్ ప్రకటనల్లేవ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) డీలా పడింది. కొత్తగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ఎటూ పాలుపోలేని స్థితిలో ఉంది. దాదాపు రెండేళ్లుగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయలేదు. నూతన జోనల్ విధానం అమలు తర్వాత పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించక పోవడంతో కొత్త నోటిఫికేషన్లు జారీ చేయలేదు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన టీఎస్ పీఎస్సీ.. నోటిఫికేషన్ల విడుదల నుంచి దరఖాస్తు ప్రక్రియ, హాల్‌టికెట్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనతో పాటు ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవ డంతో స్తబ్దుగా ఉంది. మరోవైపు ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకున్న 24.62 లక్షల మంది అభ్య ర్థులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. జాడలేని జంబో ఉద్యోగ ప్రకటన... రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీలను గుర్తించింది. వీటికి ఒకేసారి భర్తీ ప్రకటన వేస్తారనే ప్రచారం సైతం జరిగింది. ఇది జరిగి ఆర్నెళ్లు కావస్తున్నా ఇప్పటికీ కొత్త కొలువుల జాడలేదు. కొత్తగా ఉద్యోగ ప్రకటనలు వస్తాయనే ఆశతో ఇప్పటికే అభ్యర్థులు కోచింగ్‌కు సిద్ధమయ్యారు. మరోవైపు ఒకేసారి ఉద్యోగ ప్రకటనలు వెల్లడించాల్సి వస్తే సంసిద్ధంగా ఉండేలా టీఎస్పీఎస్సీ సైతం ఏర్పాట్లు చేసుకుంది. కానీ, ఈ ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానట్లు సమాచారం. దీంతో ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యం అవుతోంది. టీఎస్పీఎస్సీ ఏర్పాటై ఏడేళ్లు కావస్తోంది. తొలి చైర్మన్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో దాదాపు 39వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయగా.. ఇందులో 35 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగిసింది. మిగతా వాటి ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. కొత్త కోరం వచ్చి ఆర్నెళ్లు... కొత్త కోరం ఏర్పాటై ఆర్నెళ్లు గడిచినా ఇప్పటికీ ఒక్క ప్రకటన విడుదల చేయలేదు. నూతన ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాతే టీఎస్పీఎస్సీలో హడావుడి మొదలు కానుంది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీకి సంబంధించి తమకు ఏదైనా సమాచారం ఇస్తే.. దానికి అనుగుణంగా కేలెండర్ ప్రారంభించడానికి వీలవుతుందని, అలా కాకుండా అన్నీ ఒక్కసారే ఇవ్వాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఒన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు: 24,62,032 పురుషులు: 14,71,205 మహిళలు: 9,90,827 -
నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగి ఆత్మహత్య
కోటపల్లి (చెన్నూర్): ‘కేసీఆర్ సార్.. ప్లీజ్ నోటిఫికేషన్లు ఇవ్వండి. నాలా బాధపడేవారు చాలామంది చావడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి వారినైనా కాపాడండి. మీ కాళ్లు పట్టుకుంటా. అమ్మా నాన్నా క్షమించండి.. మన ఇంటి పరిస్థితి బాగాలేదు. కానీ జాబ్ లేక, మీ మీద ఆధారపడి జీవించలేక ఈ నిర్ణయం తీసుకున్నా. నా చావుతోనైనా ఉద్యోగ ప్రకటనలు వెలువరించాలి. నిరుద్యోగుల ఆత్మహత్యల్లో నాదే చివరిది కావాలి’అని ఓ నిరుద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. కోటపల్లి మండలం బబ్బరుచెల్క గ్రామానికి చెందిన అసంపెల్లి శివక్క– వెంకన్న దంపతులకు కుమారుడు మహేశ్ (23)తోపాటు ఒక కుమార్తె ఉంది. కూతురుకు పెళ్లిచేశారు. మహేశ్‌ను డీఎడ్, డిగ్రీ చదివించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఉద్యోగం కోసం రెండేళ్లుగా ప్రిపేర్ అవుతున్నారు. నోటిఫికేషన్లు రాకపోవడంతో చెన్నూర్‌లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో చేరారు. ఇటీవల ఆ కంపెనీని మూసివేయడంతో నాలుగు నెలలుగా మహేశ్ ఇంటి వద్దనే ఉంటున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోవడంతో కలత చెంది సూసైడ్ లెటర్ రాశారు. లెటర్‌ను ఇంట్లో పెట్టి బయటకి వెళ్లిపోయారు. ఈ లెటర్‌ను చూసిన కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో మహేశ్ తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒక్కగానొక్క కొడుకు ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న రైస్‌మిల్ సమీపంలోని పత్తి చేనులో మహేశ్ విగతజీవిగా కనిపించాడు. వెంటనే స్థానికులు పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. జైపూర్ ఏసీపీతోపాటు సీఐలు, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వైద్యులను అక్కడికే రప్పించి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. మహేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు, అతడి స్నేహితులు ఎన్‌హెచ్–63పై బైఠాయించారు. బాధిత కుటుంబానికి 4 ఎకరాల భూమి, 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏసీపీ నరేందర్ మహేశ్ తల్లిదండ్రులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం మహేశ్ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు వాంగ్మూలం ఇచ్చారని సీఐ నాగరాజు చెప్పారు. జాతీయ రహదారిపై అందోళన చేస్తున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు -
చేతకాకపోతే రాజీనామా చెయ్
నల్లగొండ టూటౌన్/నల్లగొండ: ‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. 3.81 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 54 లక్షల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నరు.. కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం 8 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నరు.. ఇంటికో ఉద్యోగం ఇచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఈ హామీలు నెరవేర్చడం చేతకాకపోతే ముఖ్యమంతి పదవికి కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని సీఎంగా చేయాలి’ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఆమె నిరుద్యోగ నిరాహారదీక్ష చేశా రు. షర్మిల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ తన ఇంట్లో వందశాతం ఉద్యోగాలు ఇచ్చుకున్నా రని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్ 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి రోడ్డున పడేశారని అన్నారు. దళితులకు మూడెకరాల చొప్పున ఇస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సీఎం కేసీఆర్.. తాను హామీ ఇవ్వలేదని ఇటీవల శాసనసభలో అనడం దుర్మార్గమని, తరచూ యశోదా ఆసుపత్రికి వెళ్లే మీరు మతిమరుపు చికిత్స కూడా చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల భూములపై టీఆర్ఎస్ నేతల కన్ను పడిందని వైఎస్ షర్మిల అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద మీడియాతో మాట్లాడుతూ వర్సిటీ భూములపై కన్నెసి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. -
Telangana: 65 వేల ఉద్యోగాల భర్తీపై రేపు కీలక ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై గురువారం స్పష్టత రానుంది. ఏయే శాఖల్లో, ఎన్ని పోస్టుల భర్తీ, వాటికి సం బంధించిన నోటిఫికేషన్ల జారీ, ఇతర అంశాలపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. అందులో ఉద్యోగాల భర్తీతోపాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. 65 వేల పోస్టులతో.. రాష్ట్రంలో సుమారు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని సీఎం కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 13న ప్రకటించిన విషయం తెలిసిందే. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని, తద్వారా ఏర్పడే కొత్త ఖాళీలను సైతం గుర్తించి భర్తీ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే.. ఉద్యోగుల పదోన్నతులు, స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లుగా పోస్టుల విభజన, ఖాళీల గుర్తింపు ప్రక్రియలు సుదీర్ఘంగా సాగాయి. ఆర్థిక శాఖ ఇటీవలే ఈ అంశాలను కొలిక్కి తెచ్చింది. 65వేలకుపైగా ఖాళీ పోస్టులను గుర్తించింది. ఈ ప్రతిపాదనలపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని ఉన్నతాధికారవర్గాలు తెలిపాయి. 50 వేల నుంచి 65వేల పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు జారీ దిశగా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. దీనితోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ అవసరాలు, వనరుల సమీకరణ, దళితబంధు పథకానికి చట్టబద్ధత తదితర అంశాలపైనా కేబినెట్ చర్చించనున్నట్టు వెల్లడించాయి. వనరుల సమీకరణలో భాగంగా మైనింగ్ రంగంలో సంస్కరణల అమలు, భూముల వేలానికి సంబంధించిన పలు ప్రతిపాదనలపైనా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. రెండు కొత్త ఎత్తిపోతల పథకాలు సింగూరుపై రెండు భారీ ఎత్తిపోతల పథకాలను నిర్మించాలనే ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వాటిపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతలను రూ.3,916 కోట్లతో, బసవేశ్వర లిఫ్టును రూ.2,750 కోట్లతో చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించారు. అయితే వ్యయాన్ని తగ్గించడం కోసం సీసీ లైనింగ్ పనులను తొలగించి మొత్తం రూ.4,500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పూర్తిచేయాలని, నాబార్డ్ నుంచి రూ.2వేల కోట్ల సాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వరి సాగుపై అనిశ్చితిపై.. బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై కేంద్రం విముఖత నేపథ్యంలో వచ్చే యాసంగిలో వరి సాగుపై ప్రతిష్టంభన నెలకొంది. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతులను సన్నద్ధం చేయడం, వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు తదితర అంశాలపై కేబినెట్లో నిర్ణయాలు తీసుకోనున్నారు. 22 నుంచి వర్షాకాల సమావేశాలు! ఈ నెల 19తో హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో 22వ తేదీ నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
బీజేపీ చేతిలో కేసీఆర్ జుట్టు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణకు నష్టం కలిగిం చేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ స్పందించడం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ జుట్టు బీజేపీ చేతుల్లో ఉందని, అందుకే ఆ పార్టీతో అంటకాగుతున్న సీఎం కేంద్రానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడటం లేదన్నారు. నిరుద్యోగ దీక్షలో పాల్గొనడానికి వైఎస్ షర్మిల మంగళవారం వరంగల్ నగరానికి వచ్చారు. తొలుత హనుమకొండ కేయూ జంక్షన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. సుమారు 4 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అనంతరం హయగ్రీవాచారి గ్రౌండ్స్ సమీపంలో షర్మిల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని పది వారాలుగా దీక్షలు చేస్తున్నా ఈ సర్కారుకు చీమకుట్టినట్లయినా లేదు. నిరుద్యోగుల కలల సాకారం కోసం ఎన్ని వారాలైనా దీక్షలు చేస్తా. ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచేదాకా దీక్షలు కొనసాగిస్తా’ అని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలకు ఉద్యో గాలు ఇవ్వని కేసీఆర్, ఎంతమంది త్యాగం చేశారని ఆ కుటుంబంలో ఐదుగురికి పదవులు ఇచ్చుకున్నా రని షర్మిల నిలదీశారు. ఏళ్ల తరబడి వేచిచూస్తున్నా ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం లేదని, నిరాశతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షలో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఏపూరి సోమన్న, ఎన్.భరత్‌రెడ్డి, నాడెం శాంతికుమార్, అప్పం కిషన్, కళ్యాణ్, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 1.42 లక్షల వేతనం
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ పోస్టుల(34 ఖాళీలు) భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హిందీ/ఇంగ్లీష్‌లో మాస్టర్ డిగ్రీ లేదా జర్నలిజం/ మాస్ కమ్యూనికేషన్లో డిప్లోమా లేదా పీజీ డిప్లోమా ఉన్న వారిని అర్హులుగా ప్రకటించింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో జర్నలిజంలో అనుభవం ఉన్నవారిని నియమించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేసుకోవడానికి 2021 ఆగస్ట్ 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.in/ లో చూడవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు, వయసు తదితర అంశాలను తెలుసుకోవాలి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీలు- 34 తెలుగు- 5 హిందీ- 9 ఇంగ్లీష్- 3 పంజాబీ- 3 ఒడియా- 3 బెంగాలీ- 1 మరాఠీ- 5 గుజరాతీ- 1 అస్సామీ- 2 మణిపూరి- 2 పోస్టులు: సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సంఖ్య: 34 దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 12, 2021 విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ లేదా జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనుభవం: ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తిగల సంస్థలు, లిస్టెడ్ ప్రైవేట్ సంస్థలకు చెందిన న్యూస్ ఏజెన్సీ, న్యూస్పేపర్లో జర్నలిజం, పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్ విభాగాల్లో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వయస్సు: 30 ఏళ్ల లోపు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది. వేతనం: ఏడో పే కమిషన్‌లో లెవెల్ 7 పే స్కేల్ వర్తిస్తుంది. అంటే రూ.44,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,42,400 వేతనం లభిస్తుంది. -
సాగునీటి శాఖలో 700 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండొద్దని, వెంటనే పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. తొలి విడతలో 700 పోస్టులు భర్తీ చేసేందుకు శాఖ సిద్ధమవుతోంది. వాటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) పోస్టులు 568, అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులు 132 ఉండనున్నాయి. వీటి భర్తీకి సంబంధించిన ఫైలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఇప్పటికే శాఖ పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ స్థాయి నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు 378 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు. ఈ పదోన్నతులతో పాటు ఖాళీగా ఉన్న ఇతర పోస్టులు కలిపి మొత్తంగా శాఖ పరిధిలో 1,167 ఖాళీలున్నట్లు ఇరిగేషన్ శాఖ గుర్తించింది. ఇందులో తొలి విడతలో భాగంగా 700 పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయించారు. భర్తీ చేయనున్న ఏఈఈ పోస్టుల్లో సివిల్‌కు సంబంధించి 310, మెకానికల్ 58, ఎలక్ట్రికల్ 200 ఉండనున్నాయి. -
ఎన్నికల కోడ్.. 50 వేల ఉద్యోగాల భర్తీ ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న పలు ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను ఎలా భర్తీ చేయాలన్న విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. మార్చి 14న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్‌తోపాటు కోడ్ అమల్లోకి రాగా ఆ వెంటనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు రెండు, మూడు నెలలు ఆలస్యం తప్ప దని అధికారులు పేర్కొంటు న్నారు. దీనికితోడు త్వరలో జరగాల్సిన మున్సిపల్ ఎన్ని కలకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడితే ఉద్యోగ నోటి ఫికేషన్ల కోసం నిరుద్యోగులు నాలుగైదు నెలల వరకు వేచి చూడకతప్పని పరిస్థితి ఉంటుందని చెబు తున్నారు. అలాగే అన్ని శాఖల్లో పదోన్నతులు పూర్తి చేశాకే ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటే మరిన్ని ఎక్కువ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందకు వస్తాయని తాజాగా ఉన్నతాధికారులు చెప్పడంతో ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇంకా ఎక్కువ సమయమే పట్టే పరిస్థితి నెలకొంది. అర్థిక శాఖకు అందిన వివరాలు.. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ డిసెంబర్లో ఆదేశించగా ఆర్థిక శాఖ ఆ మేరకు కసరత్తు చేపట్టింది. వివిధ శాఖలు, జిల్లాలవారీగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించింది. దీని ప్రకారం పోలీసు శాఖ 20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపించింది. అందులో 450 ఎస్ఐ, మిగతావి కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు విద్యాశాఖ కూడా టీచర్ పోస్టుల ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపించింది. 6,500 వరకు సెకండరీ గ్రేట్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలను ఇచ్చింది. అవి కాకుండా మోడల్ స్కూళ్లు, విద్యాశాఖ గురుకులాల్లో మరో 1500కు పైగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను పంపించింది. చదవండి: (ఆర్ఆర్ఆర్.. రూ.13 వేల కోట్ల భారీ వ్యయంతో ప్రాజెక్టు) ఇక సంక్షేమ శాఖల్లో వార్డెన్లు, వెల్ఫేర్ ఆఫీసర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఇలా మొత్తంగా 1,700 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను పంచించింది. అలాగే ఆయా శాఖల పరిధిలోని కొత్త గురుకులాల్లో 3,200 వరకు బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చి ప్రతిపాదనలను పంపించాయి. ఇక వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ తదితర 3,298 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని వివరాలను అందజేసింది. మున్సిపల్ శాఖలోనూ 3,878 ఖాళీలు ఉన్నట్లు ఆర్థికశాఖకు పంపించింది. అలాగే రెవెన్యూ, పంచాయతీరాజ్, తదితర శాఖల్లో మొత్తంగా 50 వేల వరకు పోస్టులకు అనుమతి కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. అనుమతుల జారీ ప్రారంభం కాకముందే... శాఖల వారీగా అందిన ఉద్యోగ ఖాళీల పరిశీలన ప్రక్రియను ఆర్థిక శాఖ చేపట్టింది. అది పూర్తి కాకముందే ఈ నెల 16న హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్, వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అదే రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ మార్చి 17 వరకు అది అమల్లో ఉండనుంది. అప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయడానికి వీల్లేదు. అయితే ఈ సమయంలో ఇంటర్నల్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. శాఖల వారీగా, పోస్టులవారీగా రోస్టర్ వివరాలను రూపొందించడం వంటి పనులను పూర్తి చేసుకొని నోటిఫికేషన్ల జారీకి సిద్ధం కావచ్చని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు. వెంటవెంటనే ఎన్నికలు... ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెనువెంటనే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కనుక వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి మరో రెండు నెలల సమయం పట్టవచ్చని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు వెళ్తే నాలుగైదు నెలలపాటు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు వేచి చూడక తప్పనిపరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేశాకే నోటిఫికేషన్ల జారీకి వెళితే ఎక్కువ మొత్తంగా ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. ఉదాహరణకు విద్యాశాఖలో ప్రస్తుతం 4 వేల వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లను (ఎస్జీటీ) భర్తీ చేయవచ్చు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం ఖాళీలను పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంది. ఇలా 6,627 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఎస్జీటీలకు పదోన్నతులు ఇస్తే మరో 6,627 ఎస్జీటీ పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా చేయవచ్చని చెబుతున్నారు. అలాగే హెడ్మాస్టర్, పీజీటీ, టీజీటీ పోస్టులను, ఇలా అవకాశం ఉన్న అన్ని శాఖల్లో పదోన్నతుల తరువాత భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఆరేడు నెలలు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. చదవండి: (ఎక్కడా ఆంక్షల్లేవు.. మరి ప్యాసింజర్‌కు రైళ్లేవి?) టీచర్ పోస్టులైతే మరింత ఆలస్యం... విద్యాశాఖలో ఇంతవరకు పదోన్నతుల ప్రక్రియ చేపట్టలేదు. పదోన్నతుల కోసం విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. కానీ ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా ఎన్నికల కోడ్ వచ్చేసింది. విద్యాశాఖతోపాటు ఏ శాఖలోనూ ఇపుడు పదోన్నతులు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎన్నికల కోడ్ ముగిశాకే చర్యలు చేపట్టాల్సి వస్తుంది. మరోవైపు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం టెట్ కోసం 5 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అది నిర్వహించకుండా టీచర్ పోస్టులను భర్తీ చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మిగితా పోస్టుల నోటిఫికేషన్ల కంటే టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ మరింత ఆలస్యం కానుంది. -
సీఎం కేసీఆర్ ప్రకటన.. నిరుద్యోగుల్లో ఆశలు
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. సర్కారీ కొలువుల నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ త్వరలో ముగియనుంది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రంలో వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నింటినీ భర్తీ చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏయే శాఖల్లో ఎంతమంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు’ అని సీఎం కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. కొలువుల జాతర మొదలుకానుంది. ఒకటీ రెండు నెలల్లో 50 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరించాలని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదివారం సీఎం కేసీఆర్ ఆదేశించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. విద్యాశాఖ, పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో అత్యధిక పోస్టులు అందుబాటులోకి రానున్నా యి. రాష్ట్రంలో 2018 తరువాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాకపోవడంతో ఇన్నాళ్లు నిరుద్యోగులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇపుడు సీఎం ప్రకటనతో వారికి ఊరట లభించినట్లైంది. వీరంతా సీరియస్‌గా ప్రిపరేషన్లో మునిగిపోనున్నారు. విద్యాశాఖలో 15 వేలకు పైనే రాష్ట్రంలోని పాఠశాలల్లో దాదాపు 15 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 2017 సంవత్సరంలో 8,972 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన విద్యాశాఖ తాజాగా మరో 15 వేలకు పైగా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల స్థానాల్లో విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారు. అం దులో ప్రధానంగా విద్యార్థులు ఎక్కువగా ఉండి, ఒక్కరిద్దరే టీచర్లు ఉన్న స్కూళ్లు, సబ్జెక్టు టీచర్లు లేని స్కూళ్లలో గతేడాది 15,661 మంది విద్యా వలంటీర్లు పని చేశారు. అంటే ఆ మేరకు ఉపాధ్యాయ ఖాళీలు కచ్చితంగా ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఈ నేపథ్యంలో 15వేలకు పైగానే ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉంటుంది. పోలీసుశాఖలో 20 వేలు రాష్ట్ర పోలీసు శాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఇదే విషయాన్ని ఇటీవల చెప్పారు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసు శాఖలో ఆయా పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. మరోవైపు వైద్యారోగ్య శాఖలో 12 వేల పోస్టులు, రెవెన్యూ శాఖలో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం చెబు తోంది. వీటితోపాటుఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు కలిపి 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా.. రాష్ట్రంలో 1,10,012 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందులో 83,048 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే ఆయా శాఖల ద్వారా నిబంధనలకు సంబంధించిన క్లియరెన్స్‌లు లభిం చకపోవడంతో అన్నింటినీ భర్తీ చేయలేకపోయారు. 52,724 పోస్టులు భర్తీకి వివిధ ఏజెన్సీలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. అందులో 36,758 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. వాటిలో 35,724 పోస్టుల భర్తీ చేసినట్లు ఇటీవల టీఎస్పీఎస్సీ గవర్నర్‌కు అందజేసిన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. పాతవి... కొత్తవి కలిపి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) 2018లో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 16,925 కానిస్టేబుల్ పోస్టులు, 1,503 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. 2019 సెప్టెంబరు నాటికి వీటికి రాతపరీక్ష పూర్తయి ఫలితాలు వచ్చేశాయి. సబ్ ఇన్స్పెక్టర్లతోపాటు, సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుళ్లకు ఈ ఏడాది జనవరి నాటికి శిక్షణ మొదలైంది. మైదానాల కొరత, కరోనా లాక్డౌన్ కారణంగా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)ల శిక్షణలో తీవ్ర జాప్యం నెలకొంది. అక్టోబరు మొదటివారంలో 9,213 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తయి విధుల్లో చేరారు. తాజాగా 1,162 మంది సబ్ ఇన్స్పెక్టర్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఈ లెక్కన 10,375 పోస్టులు భర్తీ అయ్యాయి. మరోవైపు భర్తీ కాకుండా సరెండర్ చేసిన పోస్టులు కొన్ని ఉన్నాయి. వాటితో పాటు కొత్తగా ఏర్పడిన ఖాళీలు కలుపుకొని తాజాగా 20 వేల వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు అంచనా. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మూడేళ్లలో 52 వేలకు పైగా పోస్టుల భర్తీ వైద్యారోగ్య శాఖలో 12 వేలు.. రెవెన్యూలో 4 వేలు తాజా లెక్క తేలాలి... రాష్ట్ర ప్రభుత్వం గతంలో వెల్లడించిన లెక్కల ప్రకారం ఉన్నత విద్యలో 4,702, వ్యవసాయ శాఖలో 3,673, పశుసంవర్ధక శాఖలో 1,842, బీసీ సంక్షేమ శాఖలో 2,881, అటవీ శాఖలో 3,602 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇపుడు సీఎం ఆదేశాలతో అన్ని శాఖల్లో తాజాగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించాక... నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం అనుమతించనుంది. -
అందుకే ఉద్యోగ నోటిఫికేషన్ : బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగ నోటిఫికేషన్ ఒక ఎన్నికల డ్రామా అని, నిరుద్యోగుల ఓట్ల కోసమే కేసీఆర్ పేపర్ ప్రకటన చేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఓట్ల కోసమే నోటిఫికేషన్ డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు నిజంగా నిరుద్యోగులపై చిత్తశుద్ది ఉంటే అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. (చదవండి : తెలంగాణలో కొలువుల జాతర) బీజేపీ ఆందోళనను ముందుగానే పసిగట్టి భయంతో నోటిఫికేషన్ అని పేపర్ ప్రకటన చేశారని విమర్శించారు. నోటిఫికేషన్ తప్పుల తడకగా ఇచ్చి కోర్డుల ద్వారా రద్దు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. కేసీఆర్ మాయల పకీరు మాటలు విని మోసపోయే రోజులకు కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల కడుపుమంట లో కేసిఆర్ కాలిపోయే రోజులు వచ్చాయని బండి సంజయ్ విమర్శించారు. -
సచివాలయ ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 15,971 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. పాత పద్ధతి, మార్గదర్శకాల ప్రకారమే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉండగా, వాటిలో ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలను ఆయా శాఖల నుంచి పంచాయతీరాజ్ శాఖ బుధవారం తెప్పించుకుంది. వీటిలో అత్యధికంగా 6,916 పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రామ ఉద్యాన అసిస్టెంట్ పోస్టులు 1,746, విలేజీ సర్వేయర్ పోస్టులు 1,234, పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు 1,122 చొప్పున ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది ఆగస్ట్–సెప్టెంబర్ మధ్య జరిగిన నియామక ప్రక్రియలో దాదాపు 15,971 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోగా, ఆ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 3 వేలకు పైగా పోస్టులు అదనం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలకు అదనంగా మరో 300 నూతన సచివాలయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో మరో 3 వేలకు పైగా సచివాలయ ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. వాటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
కోచింగ్ సెంటర్ల నిలువు దోపిడీ
ఒకే గదిలో వందల మంది. తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. కనీసం ఫ్యాన్ ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉడికిపోవాల్సిందే. మరుగుదొడ్డి బాధలు అన్నీఇన్నీ కావు. ఫీజులు మాత్రం రూ.వేలల్లో బాదేస్తారు. జిల్లాలోని కోచింగ్ సెంటర్ల తీరిది. ఉద్యోగంపై ఆశతో వందలాది మంది అక్కడే ‘శిక్ష’ణ పొందుతున్నారు. నెలరోజులు ఓర్చుకుంటే భవిష్యత్ బాగుంటుందని బాధలన్నీ భరిస్తున్నారు. ఇదే అదనుగా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. – అనంతపురం ఎడ్యుకేషన్ ► నగరంలోని ఆర్ఎఫ్ రోడ్డులో నిర్వహిస్తున్న సాయిగంగ కోచింగ్ సెంటర్. ఓ ప్రయివేట్ ఆసుపత్రిపైన నిర్వహిస్తున్న ఈ కోచింగ్ సెంటర్లో అభ్యర్థుల అవస్థలు చెప్పుకుంటే తీరేవికావు. ► రఘువీరా టవర్స్‌లో నిర్వహిస్తున్న ప్రగతి కోచింగ్ సెంటర్లో కనీస సౌకర్యాలు లేవు. ముఖ్యంగా అభ్యర్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక మహిళా అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ► గుల్జార్‌పేటలోని ఓ రేకులషెడ్‌లో నిర్వహిస్తున్న శ్రీధర్ కోచింగ్ సెంటర్లో పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ వందలాది మంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ షెడ్లో మగ్గిపోతున్నారు. ► ఫీజుల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న నిర్వాహకులు అభ్యర్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం గమనార్హం. సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పలు నోటిఫికేషన్లు...కోచింగ్ సెంటర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యంతో నిరుద్యోగులంతా కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. దీంతో ఏ కోచింగ్ సెంటర్లో చూసినా అభ్యర్థులతో కిటకిటలాడుతున్నారు. ఇదే అదునుగా ఆయా సెంటర్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మరోవైపు కనీస సౌకర్యాలు కల్పించకుండా నిరుద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే లక్షలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో దాదాపు 8,545 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్–5) పోస్టులు 571, ఏఎన్ఎం/మల్టీపర్సస్ పోస్టులు 1,041, హెల్త్ అసిస్టెంట్ వీఆర్ఓ (గ్రేడ్–2) 384, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులు 19, పశుసంరక్షణ అసిస్టెంట్ పోస్టులు 805, ఉద్యానశాఖలో అసిస్టెంట్లు 483, వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ పోస్టులు 282, మహిళా పోలీస్ పోస్టులు 1,217, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 159, డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ(సెక్రటరీ గ్రేడ్–6) పోస్టులు 896, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు 896, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ పోస్టులు 896, విలేజ్ సర్వేయర్ పోస్టులు 896 భర్తీ చేయనున్నారు. కిక్కిరిసిన కోచింగ్ సెంటర్లు : ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో కోచింగ్ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగం తెచ్చుకోవాలనే లక్ష్యంతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. నెలరోజులు మాత్రమే గడువు ఉండటంతో శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు కోచింగ్ తీసుకునేందుకు జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. ఇదే అదనుగా జాబ్ గ్యారెంటీ పేరుతో కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆర్భా ట ప్రచారాలు చేస్తూ నిరుద్యోగులకు వల వేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి నిపుణులను రప్పించి ప్రత్యేశ శిక్షణ ఇప్పిస్తామంటూ ఆశలు పెడుతున్నారు. నెల రోజుల శిక్షణకు రూ.8 వేల దాకా ఫీజు ఫిక్స్ చేశారు. హాస్టల్ వసతి కావాలంటే మరో రూ.3,500 అదనంగా వసూలు చేస్తున్నారు. అధికారుల నియంత్రణ కరువు : ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై అధికారులకు నియంత్రణ లేదు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కోచింగ్ సెంటర్లను ఏ అధికారీ పర్యవేక్షించరు. ఇవి ఎవరి పరిధిలోకి వస్తాయనే విషయంపై అధికారులకే స్పష్టత లేదు. ఇదే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కలిసి వస్తోంది. అధికారులు పట్టించుకోకపోవడం, శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు నోరు మెదపకపోవడంతో ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. పైగా కనీస సౌకర్యాలు కల్పించడం లేగు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోచింగ్ సెంటర్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుని, కనీస సదుపాయాలు కల్పించేలా చూడాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. చుక్కల చిక్కులు తీరుస్తాం అనంతపురం అర్బన్: చుక్కల భూముల సమస్యలకు సంబంధించిన ఫైళ్లన్నీ వారం రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ స్పష్టం చేశారు. అలాగే చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తామంటూ అవినీతి పాల్పడిన సిబ్బందిపై కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ‘‘ రైతులకు చుక్కలు’’ శీర్షిక ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. చుక్కల భూములకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి వారం రోజుల్లో ఫైళ్లన్నీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఈ వ్యవహారంలో కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతూ రైతులను వేధించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. విచారణ చేయించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫైళ్ల పరిష్కారంలో ఎవరైనా సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తే రైతులు నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఉద్యోగాల విప్లవం తెచ్చాం : ఎమ్మెల్యే మేకపాటి
సాక్షి, వింజమూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఉద్యోగాల విప్లవం తెచ్చారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్ అండ్‌బీ అతిథిగృహంలో ఆదివారం ఆయన పార్టీ నాయకులతో పలు విషయాలపై చర్చించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ పటిష్టం చేస్తూ 1.27 లక్షల పోస్టులను భర్తీ చేయనున్నారని తెలిపారు. అదే విధంగా గ్రామ వలంటీర్లు రెండున్నర లక్ష వరకు భర్తీ చేయనున్నామన్నారు. దీంతో నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చి వారి కుటుంబ అభివృద్ధికి తోడ్పాటునందిస్తాయన్నారు. వింజమూరుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును త్వరితగతిన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, నాయకులు మద్దూరి చిన్నికృష్ణారెడ్డి, మద్దూరి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, దాట్ల విజయభాస్కర్‌రెడ్డి, చీమల హజరత్‌రెడ్డి, మండాది గోవిందరెడ్డి, అన్నపురెడ్డి బాలిరెడ్డి, నీలం సంజీవరెడ్డి, అన్నపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, సూరం వినోద్‌రెడ్డి, దాట్ల రమేష్‌రెడ్డి, నీచు బాలయ్య, దాట్ల కృష్ణారెడ్డి తదితరులున్నారు. -
ఉద్యోగ విప్లవం
సాక్షి కడప : ఉద్యోగాల కోసం..ఉపాధి కోసం కాళ్లరిగేలా తిరిగినా..కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా టీడీపీ హయాంలో ఫలితం కనిపించలేదు. కానీ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార పగ్గాలు చేపట్టగానే ఒక్కో రంగాన్ని బలోపేతం చేస్తూ వస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి, పారిశ్రామిక విప్లవం, ఉద్యోగులు, ప్రజల సంతోషం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ఉద్యోగాల విప్లవం కళ్లేదుటే కనిపిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ కనిపించని రీతిలో ఒక్కసారిగా ఉపాధికి పెద్దపీట వేయడంతో నిరుద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. జిల్లాలో పది వేలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించడం సంచలనంగా మారింది. భారీగా ఉద్యోగాల భర్తీ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. టీడీపీ హయాంలో వంచనకు గురై ఉపాధి లేక ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే ప్రస్తుత వైఎస్ జగన్ సర్కార్ ఉపాధికి పెద్దపీట వేస్తూ ఎక్కడికక్కడ పరిశ్రమలు నెలకొల్పుతూ ప్రైవేటు రంగంలోనూ ఉపాధికి అవకాశాలు కల్పిస్తోంది. మరోవైపు గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన.. ఎవరూ కార్యాలయాల చుట్టూ తిరగకూడదన్న సంకల్పంతో ఉద్యోగాల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ప్రక్రియ ఆరంభించారు. అందులో భాగంగా ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నోటీఫికేషన్ విడుదలైంది. పది విభాగాలకు సంబంధించి పదిమంది ఉద్యోగులను నియమించి వారి ద్వారా ప్రజలకు పలు రకాల సేవలందించనున్నారు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 10,610 ఉద్యోగాలు కల్పించనున్నారు. అందుకు సంబం«ధించి అధికారులు ప్రతిపాదనలు రూపొందించినా కొంచెం అటు, ఇటు పెరిగే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 18 రకాల సేవలు..10 మంది ఉద్యోగులు వివిధ శాఖల ద్వారా ప్రజలకు 18 రకాల సేవలను గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అందించనుంది. ఆయా శాఖల పర్యవేక్షణలో వార్డు కార్యదర్శులు ప్రజలకు సేవలందిస్తారు. ఇందుకు తగ్గట్లే విద్యావంతులను పరీక్ష ద్వారా ఎంపిక చేసి ప్రతిభావంతులను వార్డు ఉద్యోగులుగా నియమిస్తారు. ఈ దిశగా నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు దరఖాస్తు చేయడం మొదలు పెట్టారు. పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్న నిరుద్యోగులు దరఖాస్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోకపోతే...వయస్సు దాటిపోయే ప్రమాదం ఉంది. గత ఐదేళ్లలో టీడీపీ ఆశించిన మేర ఉద్యోగాలు కల్పించకపోవడంతో నిరుద్యోగుల వయోపరిమితి దాటిపోతోంది. ప్రస్తుతం సచివాలయాల్లో పది మంది పనిచేయనున్నారు. 18 రకాల సేవలను వారు అందించనున్నారు. మున్సిపాలిటీలో 4 వేలు.....గ్రామ పంచాయతీలో 2 వేలకు ఒకటి చొప్పున.. జిల్లాలోని కడప కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీలతోపాటు గ్రామ పంచాయతీలకు సంబంధించి సచివాలయాలను వేర్వేరుగా విభజించారు. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే నాలుగు వేల జనాభాకు ఒక వార్డు సచివాలయం ఏర్పాటు దిశగా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీలలో కలుపుకుని మొత్తం మీద 1061 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే సచివాలయాల లెక్క మరికొంత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ జిల్లాలోని కడప కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీల్లోని వార్డు సచివాలయాలకు, పంచాయతీల్లోని గ్రామ సచివాలయాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. పెద్ద ఎత్తున పోస్టులు ఉండడంతో నిరుద్యోగులకు ఉద్యోగ పండుగ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలాకాలంగా ఎదురుచూసి ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న నిరుద్యోగులకు ఒక్కసారిగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించే నోటిఫికేషన్ వెలువడడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. -
గ్రామసచివాలయాల్లో కొలువుల జాతర
సాక్షి, కర్నూలు(అర్బన్)/టౌన్: ఉద్యోగాల విప్లవం మొదలైంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించే సమయం ఆసన్నమైంది. జిల్లాలోని 879 గ్రామ సచివాలయాల్లో 8,110 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే 300 వార్డు సచివాలయాల్లో దాదాపు మూడు వేల పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 26వ తేదీ రాత్రి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలోని మొత్తం 909 గ్రామ పంచాయతీల్లో జనాభాను పరిగణనలోకి తీసుకుని గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను అధికారులు నిర్ధారించారు. వార్డు సచివాలయాల విషయంలోనూ ఇదే పద్ధతి పాటించారు.ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 27 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. సెప్టెంబర్ ఒకటో తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాలకు లక్షల సంఖ్యలో నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, సంక్షేమ పథకాల అమల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు వాటిని పారదర్శకంగా అర్హులకు అందించేందుకు గ్రామ సచివాలయాల్లో 13 రకాల పోస్టులు భర్తీ కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 879 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. అయితే గ్రామ పంచాయతీల జనాభా ఆధారంగా ఇంకా రెండు లేక మూడు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపామని జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్‌రావు చెప్పారు. 300 వార్డు సచివాలయాలు జిల్లాలోని కర్నూలు కార్పొరేషన్‌తో పాటు ఎనిమిది మున్సిపాలిటీలలో వార్డుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం 300 వార్డు సచివాలయాలను ఖరారు చేసింది. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులను నియమించనున్నారు. ఈ లెక్కన దాదాపు మూడు వేల మంది ఉద్యోగులను తీసుకుంటారు. వార్డు కార్యదర్శి (సాధారణ పరిపాలన శాఖ), మౌలిక వసతుల కార్యదర్శి (గ్రేడ్–2 ), శానిటేషన్ కార్యదర్శి (గ్రేడ్–2 ), విద్యా కార్యదర్శి, ప్లానింగ్ కార్యదర్శి, సంక్షేమం, అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్–2), ఆరోగ్య కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, మహిళా కార్యదర్శి పోస్టులకు ఎంపిక చేస్తారు. -
‘విద్యుత్’ కొలువులు
సాక్షి, హైదరాబాద్ : భారీ ఉద్యోగ నియామక జారీ ప్రకటనకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సిద్ధమవుతోంది. 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, 2,000 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఆగస్టు 3 లేదా 23న నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది. 3న నోటిఫికేషన్ ఇస్తే.. జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఆగస్టు 6 నుంచి, జేపీఓలకు 14 నుంచి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 21 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. 23న నోటిఫికేషన్ ఇస్తే 26 నుంచి జేఎల్ఎం పోస్టులకు, 27 నుంచి జేపీఓ పోస్టులకు, 28 నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనుంది. అక్టోబర్ 13 ఉదయం జేపీఓ, మధ్యాహ్నం జేఎల్ఎం, అక్టోబర్ 20న ఉదయం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. 95ః5 స్థానిక, స్థానికేతర కోటాను అమలు చేయనున్నారు. -
గ్రూప్–1కు గ్రీన్ సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో గ్రూప్–1, గ్రూప్–2 వంటి రాష్ట్ర స్థాయి, మల్టీ జోన్, జోనల్ స్థాయి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించినట్లేనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో 135 వరకు గ్రూప్–1 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు మార్గం సుగమమైం దని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం శాఖల వారీగా భర్తీకి ఆమోదం తెలుపుతూ ఇచ్చిన పోస్టులను కొత్త జోన్లు, మల్టీ జోన్లు, స్టేట్ కేడర్ వారీగా పునర్విభజన చేసి భర్తీ చేయాల్సి ఉంటుందని టీఎస్పీఎస్సీ వర్గా లు పేర్కొంటున్నాయి. కాకపోతే ఇందుకు కాస్త సమయం పడుతుందని చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పోస్టుల భర్తీ విధానంపై త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వరద్దు కంటే ముందుగానే నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఆ తర్వాతే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గ్రూప్–2 నోటిఫికేషన్ కూడా! జోనల్ స్థాయి పోస్టులు కలిగిన గ్రూప్–2 నోటిఫికేషన్ కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి 200కు పైగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు సహా ఏసీటీవో తదితర కేటగిరీల్లో దాదాపు 500 వరకు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. గ్రూప్–2 నోటిఫికేషన్ పోస్టుల భర్తీకి ఇదివరకే జారీ చేసిన నోటిఫికేషన్.. న్యాయ వివాదాలతో పెండింగ్‌లో పడిన విషయం తెలిసిందే. అలాగే శాఖల నుంచి రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలతో కూడిన ఇండెంట్లు కూడా రావాల్సి ఉంది. దీంతో వాటి భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాలేదు. ప్రస్తుతం ఎన్నికల వేడిమీదే వీలైనన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 13 శాఖల్లో 20 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ల జారీకి కసరత్తు చేస్తోంది. గ్రూప్–1లో ఇదివరకే 127 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని భావించినా, అందులో రాష్ట్ర స్థాయి, మల్టీ జోన్, జోనల్ పోస్టులు ఉన్నందున నోటిఫికేషన్లు జారీ చేయలేదు. అవి న్యాయ వివాదాలుగా మారొద్దన్న జోనల్ వ్యవస్థపై స్పష్టత వచ్చాకే వాటిని భర్తీ చేయాలని నోటిఫికేషన్ల జారీని నిలుపుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం లభించడంతో, ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన మరో 8 పోస్టులు కలుపుకుని మొత్తం 135 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది. అందులో ఇప్పటికే అన్ని రకాల క్లియరెన్స్‌లు ఉన్న పోస్టులు 76 ఉండగా, 42 డీఎస్పీ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గతంలోనే ఆమోదం తెలిపింది. గతంలో మిగిలిపోయిన గ్రూప్–1 పోస్టులు 7 ఉన్నాయి. వీటితోపాటు మరిన్ని కేటగిరీల్లో పోస్టులను కలుపుకొని మొత్తంగా 135 పోస్టులను భర్తీ చేసే అవకాశముంది. -
మైనార్టీ గురుకులాలకు మరో 1,863 పోస్టులు
సాక్షి, హైదరాబాద్ : మైనార్టీ గురుకుల పాఠశాలలకు కొత్తగా 1,863 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు. వీటిని రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యక్రమాలపై అధికారులతో సమావేశమయ్యారు. మైనార్టీ గురుకులాల్లో ఉపాధ్యాయ ఖాళీలున్నాయని అధికారులు ప్రస్తావించగా సీఎస్ పైవిధంగా స్పందించారు. ఇటీ వల రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 1,321 మంది టీచర్లను నియమించినట్లు గుర్తు చేశారు. జిల్లాల్లోని వక్ఫ్ ఆస్తుల జాబితాను రూపొందించాలని, ఆ భూములను విద్యా సంస్థల నిర్మాణానికి వినియోగించేలా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. మైనార్టీ యువతకు వివిధ రంగాలలో మెరుగైన శిక్షణను అందించడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రాజెక్టు రిపోర్టును తయారుచేయాలని సూచించారు. షాదీ ముభారక్ ద్వారా 24,662 మం ది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 11,746 మందికి మంజూరు చేశామని, మిగతా వాటికి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. విదేశీ విద్యానిధి పథకం కింద ఇప్పటివరకు 968 మందిని ఎంపిక చేసి రూ.109 కోట్లు ఖర్చు చేశామన్నారు. మల్టీ సెక్టో రల్ డెవలప్మెంట్కు సంబంధించి 2016–17లో 7 మైనార్టీ గురుకులాల నిర్మాణానికి కేంద్రం రూ.126 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. మొదటి దశలో కేంద్రం రూ.37.80 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.25.20 కోట్లు విడుదల చేసిందన్నారు. అలాగే 2017–18లో మరో 6 రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూ రు చేసిందని, కేంద్ర వాటా కింద రూ.10.08 కోట్లు, రాష్ట్ర వాటా కింద రూ.21.60 కోట్లు విడుదలయ్యా యని వెల్లడించారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవ లప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా సివిల్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర ఉద్యోగాల కోసం మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల మంజూరును వేగవంతం చేయాలన్నారు. -
నిరుద్యోగులకు దగా!
సాక్షి, హైదరాబాద్ : బాబు వస్తేనే జాబు వస్తుందంటూ గత ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసుకుని అధికారం చేపట్టిన టీడీపీ.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. ఉద్యోగాల భర్తీ నుంచి నిరుద్యోగ భృతి వరకూ దారుణంగా మోసగించింది. ఒకవైపు పోస్టుల సంఖ్యను భారీగా కుదిస్తూ మరోవైపు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తోంది. రాష్ట్రంలో 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా 2016లో కేవలం 4,275 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. అందుకు సంబంధించిన నియామక ప్రక్రియ ఇప్పటివరకూ పూర్తికాలేదు. ఏటా టీచర్ పోస్టుల భర్తీ అని చెప్పి ఇప్పటిదాకా ఒకే ఒకసారి చేపట్టి అభ్యర్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఖాళీలన్నీ భర్తీ... ఏటా డీఎస్సీ ‘మేం అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీని పటిష్టం చేసి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నిటినీ భర్తీ చేయిస్తాం. ఏటా డీఎస్సీ ప్రకటించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం.’ – 2014 టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఖాళీల సంఖ్య 1.42 లక్షలకు పైనే.. ఎన్నికలకు ముందు ఏపీలోని 13 జిల్లాల్లో 1.42 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నట్లు అప్పటి ఉమ్మడి ప్రభుత్వం కమల్‌నాథన్ కమిటీకి సమాచారం అందించింది. ఈ నాలుగేళ్లలో రిటైరైన వారి పోస్టులను కూడా కలిపితే ఖాళీల సంఖ్య 1.80 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉంటుందని అంచనా. వీటిలో కేవలం 10 వేల పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతిస్తూ టీడీపీ సర్కారు 2016 జూన్ 17న జీవో–110 విడుదల చేసింది. ఇందులో 5,991 పోస్టులు పోలీస్ శాఖకు సంబంధించినవి కాగా.. మిగతా 4,009 ఖాళీలు ఇతర శాఖలకు సంబంధించినవి. అయితే, డిసెంబర్ 31వ తేదీ వరకు నోటిఫికేషన్లు జారీ చేయడానికే పరిమితమయ్యారు. తప్పుడు లెక్కలతో కుదింపు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో మొత్తం మంజూరైన పోస్టులు 6,97,621 అని, అందులో 1,42,825 ఖాళీలున్నాయని కమల్‌నాథన్ కమిటీకి నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. అయితే, టీడీపీ సర్కారు మాత్రం ఉద్యోగాల సంఖ్య 4.83 లక్షలని.. అందులో ఖాళీలు కేవలం 77,737 మాత్రమేనని పోస్టుల సంఖ్యను కుదించేసింది. అందులోనూ 20 వేల పోస్టులు మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తామని, మిగతావి ఔట్‌సోర్సింగ్‌లో చేపట్టనున్నట్లు ప్రకటించి నిరుద్యోగులను దారుణంగా మోసగించింది. అవైనా పూర్తిగా నింపారా అంటే అదీ లేదు. కేవలం 4,275 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నాలుగేళ్లలో 30వేల మంది ‘ఔట్’ రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ పోస్టుల భర్తీ చేపట్టకపోగా, వివిధ శాఖల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందికి మరోవైపు ఉద్వాసన పలికింది. ఆరోగ్యమిత్ర, గోపాలమిత్రలను తొలగించింది. చివరకు వారు కోర్టును ఆశ్రయించినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 16 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయలేదు సరికదా ఆ హామీని నెరవేర్చమన్నందుకు వారందరినీ తొలగించాలంటూ ఉత్తర్వులు ఇప్పించారు. గత నాలుగేళ్లలో ప్రభుత్వం వివిధ విభాగాల్లో దాదాపు 30 వేల మంది వరకు ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఇళ్లకు సాగనంపిందని ఆయా సంఘాలు పేర్కొంటున్నాయి. తొలగించిన ఖాళీలను ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీచేస్తూ ఒక్కో పోస్టుకు లక్షల్లో వసూలు చేస్తున్నారు. హోదా లేక ప్రైవేట్ జాబులూ లేవు రాష్ట్ర విభజన తరువాత ఏపీలో చెప్పుకోదగ్గ పరిశ్రమలూ లేకపోవడంతో నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి దొరకటంలేదు. చంద్రబాబు నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారం పంచుకుని తన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకాలేదు. రాష్ట్రానికి సంజీవని అయిన హోదా లేకపోవడంతో పరిశ్రమలు రాకుండా పోయాయి. ఉన్నవి కూడా మూతపడి కార్మికులు వీధుల పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భృతి అంటూ నయవంచన రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, ఉద్యోగం రానివారికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటివరకు ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. అంతేకాక, నిరుద్యోగ భృతి హామీని విస్మరించారు. ఇటీవల రూ.1,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెబుతూ దానికీ సవాలక్ష షరతులు పెట్టి కోత పెడుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ప్రభుత్వం దానికీ కోతపెట్టి కుదిస్తోంది. ఈ నాలుగేళ్లకు కలిపి ఒక్కో నిరుద్యోగికి రూ.96 వేల దాకా ప్రభుత్వం బకాయి పడింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో కంటి తుడుపు చర్యలకు దిగింది. 70,000 పైగా పోస్టులు మాయం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 1.42 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు నాటి ప్రభుత్వం కమల్‌నాథన్ కమిటీకి వెల్లడించింది. ఇప్పుడు టీడీపీ సర్కారు మాత్రం ఖాళీ పోస్టుల సంఖ్య 77,737 మాత్రమేనని చెబుతోంది. పదవీ విరమణ చేసిన వారిని కలుపుకుంటే ఖాళీల సంఖ్య మరింత పెరుగుతుంది. మరి దాదాపు సగం పోస్టులు ఏమైనట్లు? ఇప్పటి వరకూ 4,275 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. -
ఉద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్‌ను అమలు చేయడంపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) దృష్టి సారించింది. ఇప్పటికే స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. మరిన్ని కీలక మార్పులపై కసరత్తు చేస్తోంది. వార్షిక క్యాలెండర్‌ను, స్టేట్ సివిల్ సర్వీసెస్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలోనే అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతోంది. మొత్తంగా ఎప్పుడు ఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందోనని నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేయాలని భావిస్తోంది. కసరత్తు మొదలు.. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ విషయంలో ఒక్కో శాఖ ఒక్కోలా వ్యవహరిస్తోంది. ఒక్కో సమయంలో ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతోంది. దీంతో పలు శాఖల్లో చాలా కాలం పాటు పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయి. భర్తీ సమయంలోనూ గందరగోళం నెలకొంటోంది. ఈ పరిస్థితికి çఫుల్స్టాప్ పెట్టాలన్న యోచనతో వార్షిక క్యాలెండర్ అమలుకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ దిశగా టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఒక సంవత్సర కాలంలో ఏయే శాఖల్లో, ఏయే కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఖాళీ అవుతాయనే జాబితాలు తీసుకుని... ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల తేదీలు, దరఖాస్తులు, పరీక్షలు, ఫలితాల వెల్లడి షెడ్యూల్‌ను సిద్ధం చేసేలా కసరత్తు చేస్తోంది. స్టేట్ సివిల్ సర్వీసెస్‌పైనా.. స్టేట్ సివిల్ సర్వీసెస్ అమలుపైనా టీఎస్పీఎస్సీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో స్టేట్ సివిల్ సర్వీసెస్, కామన్ సిలబస్ విధానం ఉంది. ఆయా రాష్ట్రాల్లో గ్రూప్–1, గ్రూప్–2 వంటి పరీక్షలకు సిద్ధమయ్యేవారు అటు సివిల్స్ పరీక్షలూ రాయగలిగేలా కామన్ సిలబస్‌ను రూపొందించారు. ఆ తరహాలోనే రాష్ట్రంలోనూ స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటుపై మాజీ వీసీ రామకృష్ణయ్య నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ జాయింట్ సివిల్ సర్వీసెస్ పేరుతో పలు ప్రతిపాదనలు చేయగా.. టీఎస్పీఎస్సీ వాటిని ప్రభుత్వానికి పంపింది. సర్కారు ఆమోదం లభిస్తే.. వెంటనే అమల్లోకి తేవాలని భావిస్తోంది. సర్కారుకు ప్రతిపాదించిన అంశాలివీ.. ♦ గ్రూప్–1, గ్రూప్–2లను స్టేట్ సివిల్ సర్వీసెస్ కిందకు తీసుకురావాలి. ♦ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారానే ఈ రెండు రకాల పోస్టులను భర్తీ చేయాలి (రెండింటికి వేర్వేరు పరీక్షలు కాదు). ♦ సిలబస్ యూపీఎస్సీ సిలబస్‌తో 75 శాతం వరకు సమానంగా ఉండాలి. దీనివల్ల వారు సివిల్స్ రాయడం, సివిల్స్‌కు సిద్ధమయ్యే వారు ఈ పరీక్షలు రాయడం సులభమవుతుంది. ♦ స్టేట్ సబార్డినేట్ సర్వీసు కింద గ్రూప్–3, గ్రూప్–4 పోస్టులను ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేయాలి. -
‘ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి’
► ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనసభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1.20లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రకటించడం హర్షనీయమని, కానీ ప్రకటించిన ఖాళీల్లో స్పష్టత లేదన్నారు. దీంతో నిరుద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొందని, శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను పేర్కొంటూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత భర్తీ చేసిన పోస్టుల వివరాలను కేటగిరీల వారీగా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, ఆర్డీఓ కార్యాలయాలు ఏర్పాటు చేశారని, వాటిల్లో అధికారులు, ఉద్యోగులు లేక ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయన్నారు. సేవలందిలంచే అధికారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్త జిల్లాలు, ఆర్డీఓ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో కొత్తగా భర్తీ చేసిన, ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను వెల్లడించాలన్నారు. అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి ఎంత సమయం పడుతుందో తెలపాలని, ఎన్ని పోస్టులు పదోన్నతులతో భర్తీ చేస్తారో, నేరుగా నియామకాల ద్వారా ఎన్నింటిని భర్తీ చేస్తారో తెలపాలన్నారు. ఈమేరకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. -
పోటీ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల కోత
-
పోటీ పరీక్షల్లో నెగిటివ్ మార్కులు
- ఇకపై వెలువడే ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్తింపు - అన్ని ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలలో అమలు - ఒక తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత - ఆషామాషీ అభ్యర్ధులకు ముకుతాడే లక్ష్యం - ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో వివిధ పోస్టుల భర్తీకి ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో ‘నెగటివ్ మార్కుల’ విధానాన్ని అనుసరించాలని నిర్ణరుుంచింది. ఒక తప్పుడు సమాధానానికి 1/3 మార్కును కోత విధించనున్నారు. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప జీఓ నంబర్ 235ని విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఆబ్జెక్టివ్ తరహా పరీక్షల్లో అభ్యర్ధులు కొందరు తమకు సరైన సమాధానాలు తెలియకపోరుునా బహుళ సమాధానాల్లో ఏదో ఒకదాన్ని లాటరీ పద్ధతిలో గుర్తిస్తున్నారు. అదృష్టం కొద్దీ అవి సరైన సమాధానాలైతే లబ్ధి పొందు తున్నారు. దీనివల్ల నిజంగా కష్టపడి చదివి సరైన సమాధానాలు గుర్తించిన వారికి నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం వల్ల ఆషామాషీగా పరీక్షలకు హాజరైన వారు సైతం కష్టపడి చదివిన వారితో పాటుగా ఉద్యోగాల పోటీలో ముందు వరుసలోకి వచ్చేస్తున్నారని ఏపీపీఎస్సీ భావించింది. ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయాలంటే నెగటివ్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని కమిషన్ ప్రభుత్వానికి ఇంతకు ముందు నివేదిం చింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పరీక్షలకు అత్యధిక స్థారుులో అభ్యర్ధులు దరఖాస్తు చేస్తారని, వీరికి నేరుగా కాకుండా ముందుగా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి పూర్తిస్థారుులో వడపోత పోశాకే మెరుున్ పరీక్ష నిర్వహించనున్నందున నెగిటివ్ మార్కుల విధానం అమలుకు అనుమతివ్వాలని కోరింది. టెస్టును ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించే ఈ స్క్రీనింగ్ టెస్టుకు ‘నెగటివ్ మార్కుల విధానాన్ని అమలు చేసేందుకు తమకు అనుమతివ్వాలని ఏపీపీఎస్సీ కోరింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా అనేక ఇతర పోటీ పరీక్షల్లో అమలవుతున్న నెగటివ్ మార్కుల విధానం తరహాలో దీన్ని అమలు చేయాలని సంకల్పించింది. ఈ నెగిటివ్ మార్కుల విధానం వల్ల అదృష్టదేవతపై భారం వేసి ఏదో ఒకదాన్ని గుర్తించే అభ్యర్ధులకు ముకుతాడు పడుతుందని అభిప్రాయ పడింది. ఒక ప్రశ్న సమాధానం తప్పుగా గుర్తిస్తే వారికి అప్పటికే వచ్చిన మార్కులో 1/3 మార్కును కోత విధిస్తారు. ఏపీపీఎస్సీ పేర్కొన్నట్లు స్క్రీనింగ్ టెస్టులకే కాకుండా ఆబ్జెటివ్ మల్టిపుల్ చారుుస్ ఆన్సర్లతో నిర్వహించే అన్ని పరీక్షలకు నెగటివ్ మార్కుల విధానాన్ని అనుసరించాలని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రూప్-2కు వర్తించేనా? గ్రూప్ 2 నోటిఫికేషన్ గత నెలలోనే విడుదలైనందున దానికి ఈ జీఓ వర్తించే అవకాశం లేదు. ఒకవేళ గ్రూప్ 2కు కూడా అమలు చేయాలంటే ఏపీపీఎస్సీ గతంలో జారీచేసిన నోటిఫికేషన్‌కు సవరణ నోటి ఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. రానున్న కాలంలో భర్తీ చేయబోయే గ్రూప్ 3 పోస్టులకు ఈ నెగటివ్ మార్కుల విధానం అమలు కానుంది. -
నిరుద్యోగుల జీవితాలతో టీడీపీ చెలగాటం
⇒ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మర్రివేముల శ్రీనివాస్ గుంటూరు : నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఏపీ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మర్రివేముల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని బ్రాడీపేట ఎస్‌హెచ్‌వో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల వ్యవధిలో ప్రభుత్వ శాఖల్లో ఏ ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదన్నారు. ఎన్నికల్లో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ళుగా ఒక్క నోటిఫికేషన్ రాకపోవడంతో రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వయో పరిమితి దాటిపోయి ఉద్యోగాలకు అర్హత కోల్పోయి ఎంతో మంది తీవ్ర మనోవేదనతో ఉన్నారని చెప్పారు. జాబు కావాలంటే బాబు రావాలని, నిరుద్యోగ భృతి అంటూ ఊదరగొట్టిన టీడీపీ నాయకులు అధికరాంలోకి వచ్చిన తరువాత హామీలను తుంగలో తొక్కి నిరుద్యోగులను నడిరోడ్డుపై నుంచోపెట్టారని విమర్శించారు. విశ్వ విద్యాలయాల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా, ప్రైవేటు వర్శిటీలను ప్రోత్సహించడం సరికాదన్నారు. గ్రూప్-1,2,3,4 నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటనలు చేస్తూ కార్యాచరణ మాత్రం చేపట్టడం లేదని ఆరోపించారు. అన్ని పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు బ్లూ ప్రింట్ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 1.45 లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా, కేవలం నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేబినెట్ ఆమోదించడంపై ఆయన ప్రశ్నించారు. జేఎల్, డీఎల్ పోస్టులతో పాటు సీఆర్డీఏ పరిధిలోని ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
'లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతాం'
హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు చెప్పారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ...10 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు వెయ్యి గ్రూప్-2 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌పై గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. అవసరమైతే సభను శుక్రవారం కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ...పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను త్వరలో చెల్లిస్తామన్నారు. ఈ పథకానికి ఏలాంటి ఆటంకాలు రాకుండా దశల వారీగా నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. -
ఉద్యోగ అవకాశాలు
బీహెచ్‌యూ టీచింగ్ ఫ్యాకల్టీ బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ).. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వాని స్తోంది. మొత్తం ఖాళీలు 59. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 10. వివరాలకు www.bhu.ac.in చూడొచ్చు. బాబా ఫరీద్ వర్సిటీలో 37 పోస్టులు ఫరీద్‌కోట్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ ఫిజిస్ట్, టెక్నీషియన్ ఫర్ న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ టెక్నీషియన్, రేడియోథెరపీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 37. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 5. వివరాలకు www.bfuhs.ac.in చూడొచ్చు. చాచా నెహ్రూ బాల చికిత్సాలయలో వివిధ పోస్టులు ఢిల్లీలోని చాచా నెహ్రూ బాల చికిత్సాలయ.. ిపీడియాట్రిక్స్, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, రేడియాలజీ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 9. ఇంటర్వ్యూ తేది జనవరి 29. వివరాలకు www.delhi.gov.in చూడొచ్చు. ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో వివిధ పోస్టులు కోల్‌కతాలోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ.. సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ వివిధ విభాగాల్లో లోయర్ డివిజన్ క్లర్క, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది జనవరి 31. వివరాలకు www.cifri.res.in చూడొచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 58 పోస్టులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 58. దరఖాస్తుకు చివరి తేది జనవరి 30. వివరా లకు www.centralbankofindia.co.in చూడొచ్చు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో 22 పోస్టులు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ గ్రేడ్-1, స్టెనో గ్రేడ్-1, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 22. దరఖాస్తుకు చివరి తేది జనవరి 29. వివరాలకు www.npcilcareers.co.in చూడొచ్చు. ఆర్జీఎస్ఎస్హెచ్లో 82 పోస్టులు ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (ఆర్జీఎస్ఎస్హెచ్).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 82. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 6. వివరాలకు www.rgssh.in చూడొచ్చు. ప్రెసిడెంట్స్ సెక్రటేరియట్లో 66 పోస్టులు ప్రెసిడెంట్స్ సెక్రటేరియట్.. ఢిల్లీ, హైదరాబాద్, సిమ్లాలలోని రాష్ట్రపతి భవన్లలో మాలి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 66. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 29. వివరాలకు www.rashtrapatis achivalaya.gov.in చూడొచ్చు. -
జీవోలు అమలు చేయడమే మా పని
ఉద్యోగ నోటిఫికేషన్లపై టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి హైదరాబాద్ : ప్రభుత్వం నుంచి ఉద్యోగ నియామకాల జీవోలు వస్తే.. తాము కచ్చితంగా వాటిని అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ క మిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. రాజ్యాంగ సంస్థగా టీఎస్ పీఎస్సీ కేవలం ప్రభుత్వ జీవోలను మాత్రమే అమలు చేస్తుందన్నారు.తెలంగాణ వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో 2014 సివిల్స్ విజేతలు ఇరా సింఘాల్, కట్టా సింహాచలంలను హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు చట్టం ప్రకారం జోనల్ సిస్టమ్, లోకల్ రిజర్వేషన్ విధానం వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల కారణంగానే ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయన్నారు. కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, వికలాంగుల సహకార సంస్థ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ శైలజ, వికలాంగుల జేఏసీ చైర్మన్ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో ఉద్యోగాల ఖాళీలు 1.07లక్షలు
* ప్రాధాన్యత క్రమంలో నోటిఫికేషన్లు * తొలి విడత 25 వేల పోస్టుల భర్తీ * జూలై నుంచి మొదలు కానున్న ప్రక్రియ.. * డీఎస్సీ నిర్వహణకు రేషనలైజేషన్ అడ్డంకి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 1.07 లక్షల ఉద్యోగాల ఖాళీలున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా లెక్క తేల్చింది. కొన్ని విభాగాల్లో రెండు రాష్ట్రాల ఉద్యోగుల విభజన కొలిక్కి రావడంతో.. తాత్కాలిక కేటాయింపు జాబితాల ఆధారంగా ఈ ఖాళీల సంఖ్యపై నిర్ధారణకు వచ్చింది. సచివాలయం సహా మొత్తం 33 విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ప్రాధాన్యత క్రమంలో తొలివిడతగా 25 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఏఏ విభాగాల్లో, ఏఏ కేడర్‌లో ఖాళీలను భర్తీ చేయాలనే వివరాలపై కసరత్తు మొదలైంది. ఇటీవలే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, పోలీసు కానిస్టేబుల్ (డైవర్లు) పోస్టులను అన్నింటికంటే ముందుగా భర్తీ చేసే అవకాశముంది. వీటితోపాటు ప్రభుత్వం విద్యుత్ ప్రాజెక్టులపై అత్యధిక ప్రాధాన్యం కనబరుస్తున్నందున ఆ శాఖలో ఇంజనీర్ల ఖాళీలను తొలి విడతలో భర్తీ చేసే యోచనలో ఉంది. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల పరిధిలో ఖాళీగా ఉన్న 1,919 ఏఈలు, సబ్ ఇంజనీర్ల కొత్త పోస్టులకు జూలైలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ప్రభుత్వం లెక్కతేల్చిన వాటిలో అత్యధికంగా పాఠశాల విద్యాశాఖ, హోం శాఖ, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, రెవెన్యూ విభాగాల్లో ఖాళీలున్నాయి. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 25 వేల పోస్టులు, హోంశాఖలో 15 వేలు, ఉన్నత విద్యాశాఖలో 10 వేలు, వైద్య ఆరోగ్య శాఖలో 11 వేలు, రెవెన్యూ విభాగంలో 10 వేలు, పంచాయతీరాజ్‌లో 7 వేలు, వ్యవసాయంలో 2,200 పోస్టులు, మిగతా విభాగాలన్నింటిలో 27 వేల ఖాళీలున్నాయి. పాఠశాల విద్యాశాఖలో అత్యధికంగా 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. కానీ, డీఎస్సీ నిర్వహణకు పాఠశాలల రేషనలైజేషన్ అడ్డంగా ఉందని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకా రం రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. డీఎస్సీ నిర్వహించేలోగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేపట్టే నియామకాలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. వీటితో పాటు ప్రభుత్వరంగ సంస్థల్లోని ఖాళీల భర్తీకి ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10 పరిధిలో ఉన్న సంస్థల్లో ఉద్యోగుల విభజనకు చిక్కులు ఇంకా తొలగిపోనందున వీటిలోని ఖాళీలను రెండో దశలో భర్తీ చేయాలని యోచిస్తోంది. -
ఆవిర్భావ దినోత్సవంపై ఆశలు
నోటిఫికేషన్ల కోసం లక్షలాది నిరుద్యోగుల ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) నాటికి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అవుతాయన్న ఆశతో నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అయితే రాష్ట్రం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ కాకపోవడంతో వారు ఆందోళనలో పడ్డారు. ఇప్పటికిప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలంటే ప్రభుత్వం, ఆయా శాఖల నుంచి మూడు ప్రధానమైన అంశాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. పోటీ పరీక్షల విధానం, సిలబస్ ఫైలుకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. దీనిపై ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక పంపి మూడు నెలలు కావస్తోంది. మరోవైపు గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు పెంచుతామని అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం దీనిపైనా ఉత్తర్వులు ఇవ్వలేదు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆయా శాఖలు ఇండెంట్లు ఇవ్వాల్సి ఉంది. వీటిపై స్పష్టత వస్తేనే నోటిఫికేషన్లను జారీ సాధ్యపడుతుంది. విభజనతో సంబంధంలేని పోస్టుల భర్తీకి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాం టి పోస్టులు 76,548 ఉన్నాయని, అయినా వాటి భర్తీ విషయంలో జాప్యం చేస్తోందని వాపోతున్నారు. విభజన సమస్యలు లేకపోయినా దృష్టి సారించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా స్థాయి పోస్టుల్లో గెజిటెడ్ కేటగిరీలో 592, ఎన్జీవో కేటగిరీలో 59,231, లాస్ట్‌గ్రేడ్ కేటగిరీలో 14,353, ఎయిడెడ్ విభాగాల్లో 2,369 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు, రాష్ట్రంలో 17,702 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రేషనలైజేషన్ చేస్తే తప్ప ఇందులో ఎన్ని పోస్టులు అవసరమవుతాయో స్పష్టత రాదంటున్నారు. పోలీసు కానిస్టేబుళ్లు (డ్రెవర్లు) 3,620, ఇరిగేషన్లో డీఈఈలు 26, విద్యుత్తు విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్లు 1492, సబ్ ఇంజనీర్లు 427, నీటి పారుదల శాఖలోనే 635 ఏఈ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపినా నోటిఫికేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. -
‘కోచింగ్’ దందా
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : నిరుద్యోగులలో ఆశలు రేకెత్తిస్తూ ఇటీవల ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. అరకొరగానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నా.. ఆశావహులు ఆయా ఉద్యోగాల కు భారీ స్థాయిలోనే దరఖాస్తు చేసుకుంటున్నారు. కొందరు స్టడీ మెటీరియల్ కొనుగోలు చేసి ఇంట్లోనే సన్నద్ధం అవుతుండగా.. మరికొందరు కోచింగ్ సెంటర్ల బా ట పడుతున్నారు. దీనిని కోచింగ్ సెంటర్లు సొమ్ము చేసుకుంటున్నాయి. ఫీజులు, మెటీరియల్ పేరుతో వేలల్లో డబ్బులు గుంజుతున్నాయి. అరకొరగానే పోటీ పరీక్షలకు సంబంధించి నిజామాబాద్ నగరం లో సుమారు 25 కోచింగ్ సెంటర్లున్నాయి. బస్టాండ్ సమీపంలో, సుభాష్‌నగర్, ఖలీల్‌వాడి, హమాల్వా డీ, గో ల్హన్మాన్ తదితర ప్రాంతాలలో ఈ కేంద్రాలున్నాయి. ఒక్కోదానిలో 200 నుంచి 400 వరకు అభ్యర్థులు వివిధ సబ్జెక్టులపై శిక్షణ తీసుకుంటున్నా రు. అన్ని కోచింగ్ సెంటర్లలో కలిపి సుమారు ఆరు వేల వరకు అభ్యర్థులున్నారు. నిర్వాహకులు నాలుగు గదులను అద్దెకు తీసుకొని, మూడు నాలుగు వందల మంది అభ్యర్థులను చేర్చుకొని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏ కేంద్రంలోనూ సరైన వసతులు లేవు. చాలా చోట్ల ఇరుకు గదులలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. రేకుల షెడ్డులో నడుస్తున్న కోచింగ్ సెంటరూ ఉంది. కొన్ని సెంటర్లలో తాగునీటి వసతి సైతం కల్పించడం లేదు. చాలా చోట్ల అనుభ వం ఉన్న శిక్షకులు లేరు. డిగ్రీ పూర్తి చేసినవారితోనే త తంగం నడిపిస్తున్నారు. ప్రకటనల్లో మాత్రం అనుభవజ్ఞులైన శిక్షకులతో ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తామని పేర్కొంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఉద్యోగం కోసం నిరుద్యోగు లు ఈ బాధలను భరిస్తున్నారు. వేలల్లో ఫీజులు ప్రస్తుతం వీఆర్ఓ, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శి, ఐబీపీఎస్ తదితర పోటీ పరీక్షలకు జిల్లాలో కోచింగ్ ఇస్తున్నారు. ఆయా కోర్సులకు రూ. 3,500 నుంచి రూ. 5 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. కోర్సులో చేరినప్పుడే పూర్తి ఫీజు వసూలు చేస్తున్నారు. స్టడీ మెటీరియల్ పేరుతో అభ్యర్థులనుంచి అదనపు మొత్తాన్ని గుంజుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక శిక్షకులను రప్పిస్తున్నామంటూ ఫీజులు వసూ లు చేస్తున్నారు. అయితే నిర్దేశిత సిలబస్ ప్రకారం ఎక్కడా స్టడీ మెటీరియల్ అందించడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తోచినట్లు గా మెటీరియల్ తయారు చేయించి విక్రయిస్తున్నారని పేర్కొంటున్నారు. కోచింగ్ సెంటర్లపై పర్యవేక్ష ణ లేకపోవడంతో ఆయా సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతోనే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కోచింగ్ సెంటర్లు ఆడింది ఆట, పాడింది పాటగా నడుస్తోంది. అభ్యర్థులనుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. న్యాయబద్ధం గా ఫీజులు వసూలు చేయకపోతే ఆందోళన చేస్తాం. -శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్ అభ్యర్థులకు న్యాయం చేయాలి చాలా చోట్ల సరైన శిక్షకులు లేకున్నా కోచింగ్ సెంటర్లను నడిపిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మంచిది కాదు. నిపుణులతో కోచింగ్ ఇప్పించి అభ్యర్థులకు న్యాయం చేయాలి. కోచింగ్ సెంటర్లలో వసతులు కూడా కల్పించాలి. - ఎ.ప్రగతి కుమర్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఖాళీలెన్నో.. ‘కొలువులు’ కొన్నే..
కామారెడ్డి, న్యూస్‌లైన్: జిల్లాలోని 718 పంచాయతీలను 477 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్‌కో పంచాయతీ కార్యదర్శి పనిచేయాల్సి ఉంది. అయితే జిల్లాలో 163 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 314 పంచాయతీ కార్యదర్శుల పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 66 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేసింది. సదాశివనగర్ మండలంలో 24 పంచాయతీలుండగా ఏడుగురు, కామారెడ్డి మండలం లో 17 పంచాయతీలకుగాను నలుగురు పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో కార్యదర్శులకు వేరే క్లస్టర్ల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. రెండు, మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా చేశారు. అంటే ఒక పంచాయతీ కార్యదర్శి ఐదారు గ్రామాల బాధ్యతలు చూడాల్సి వస్తుండడంతో పాలన కుంటుపడుతోంది. పంచాయతీ కార్యదర్శులతో పనులు ఉంటే ఆయన ఏ గ్రామంలో ఉన్నాడో తెలుసుకుని, అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. గ్రామాల్లో కీలకమైన భూముల వ్యవహారం చూసే రెవెన్యూ కార్యదర్శుల పోస్టులదీ ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల 65 రెవెన్యూ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇంకా రెండు వందలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అరకొర పోస్టుల భర్తీ ప్రకటనలపై నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని కోరుతున్నారు. -
వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీచేయాలి
సాక్షి, హైదరాబాద్: ఆర్థికశాఖ అనుమతి లభించిన 70 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలు చూపి నోటిఫికేషన్ల జారీలో జాప్యం చేయడం సబబు కాదన్నారు. నోటిఫికేషన్ల జారీ విషయమై కృష్ణయ్య మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని కలి శారు. పోలీసు, టీచర్లు, లెక్చరర్ల నియామకాలు వెంటనే చేపట్టాలని విన్నవించారు.