సాక్షి, హైదరాబాద్: పోరాటాలకు ఎంతటి నియంత పాలకులైనా తలవంచాల్సిందేనని, కానీ కేసీఆర్‌ను నమ్మలేమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన తమ పార్టీ కార్యకర్తల విజయమన్నారు. ఉద్యోగాలకోసం తాము 17 వారాల పాటు నిరాహార దీక్షలు, అలుపెరుగని పోరాటం చేస్తేనే ప్రతిపక్షాలకు సోయి, అధికార పక్షానికి బుద్ధివచ్చిందని తెలిపారు.
బిస్వాల్ కమిటీ రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలను గుర్తిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ లక్ష 50 వేల ఖాళీలని లెక్క తెలిస్తే, కేసీఆర్ మాత్రం 80 వేల ఖాళీలు మాత్రమే చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలను నింపాల్సిందేనని, టీఎస్‌పీఎస్సీలో నమోదు చేసుకున్నా 25లక్షల నిరుద్యోగులతో పాటు.. అర్హత ఉన్న నిరుద్యోగులందరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లపై మాట ఇచ్చినంత మాత్రాన తమ పోరాటం ఆగిపోదని, ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ చేసేవరకు తమ పోరాటం సాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
చదవండి: (సీఎం పర్యటనకు జూపల్లి డుమ్మా)
Comments
Please login to add a commentAdd a comment