YS Sharmila
-
‘విడ్డూరంగా షర్మిల మాటలు.. ముమ్మాటికీ అది తప్పుడు ప్రచారమే’
వైఎస్సార్ జిల్లా, సాక్షి: అదానీ వ్యవహారంతో గత ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పత్రికల్లో వస్తున్న వార్తల్లో ఇసుమంత కూడా వాస్తవం లేదని అన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. గురువారం ఈ అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపైనా మండిపడ్డారు.‘‘అదానీ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో జగన్ కు లంచాలు ముట్టాయంటూ షర్మిల మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అదానీ కంపెనీ విద్యుత్ ను కేంద్ర ప్రభుత్వానికి అమ్మితే.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి ద్వారా ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో అదానీ లంచం ఎందుకిస్తారు.? అదానీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు... షర్మిల పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తుంది. రాజకీయాలను అడ్డు పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చు కోవాలనుకుంటున్నారు. అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు అని చార్జిషీట్ లో ఉంటే.. ఏకంగా జగన్‌కు 1,750 కోట్లు లంచం ఇచ్చారని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రానికి తక్కువతో విద్యుత్ కొని ఆదా చేస్తే తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు, షర్మిలకు దమ్ముంటే నరేంద్ర మోదీని ప్రశ్నించాలి. .. గడచిన 6 నెలల్లో కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్న శివప్రసాద్‌రెడ్డి.. అబద్ధాలను అస్త్రాలుగా చేసుకుని పాలిస్తూ ఏపీ ప్రజలను గాలికి వదిలేశారన్నారు. ‘‘నాడు కేబినెట్ చర్చల అనంతరం 2.49 పైసలకే మన ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేసింది. కానీ, ఇప్పుడు రామోజీరావు కొడుకు, రాధాక్రిష్ణలు, షర్మిల, టీడీపీ నేతలు పక్కనే ఉండి చూసినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గతంలో ఇదే సెకి ద్వారా రూ 5.30 పైసలతో విద్యుత్ కొనుగోలు చేసింది’’ అని శివప్రసాద్‌రెడ్డి గుర్తు చేశారు.అమెరికా కేసులో జగన్ పేరుందని దుష్ప్రచారం చేస్తున్నారు.. అక్కడ వేసిన చార్జ్ షీట్ లో ఎక్కడా జగన్ పేరూ లేదు.. ఏపీ ప్రభుత్వం పేరూ లేదు అని స్పష్టం చేశారు.ప్రతిపక్షాన్ని పూర్తిగా మట్టుపెట్టాలని ప్రశ్నించే గొంతును నొక్కేందుకు వీళ్లు చట్టాలు తెస్తున్నారు. ప్రజల సమస్యలను మేం మాట్లాడుతున్నాం అని నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కూడా పీడీ యాక్ట్ పెడతారా? అని ప్రశ్నించారాయన... చెవిరెడ్డి చేసిన నేరం ఏంటి? ఓ ఆడపిల్ల కుటుంబాన్ని పరామర్శిస్తే కేసు పెడతారా?. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే వారికి అండగా నిలవవద్దని మీరు ఇలాంటి కేసులు పెడుతున్నారా?. మీరు మాత్రం ప్రతి రోజూ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడొచ్చు.. మేం పేదల పక్షాన నిలిస్తే కేసులు పెడతారా? అని శివప్రసాద్‌రెడ్డి నిలదీశారు. -
జగన్ పై కుట్రలకు సై అంటున్న షర్మిల
-
బెయిల్ రద్దుకే కుట్ర.. బాధితుడు జగనే
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి న్యాయపరమైన ఇబ్బందులు కలిగించి ఆయన బెయిల్ రద్దుకు జరుగుతున్న కుట్రపూరిత వ్యవహారాలను వైఎస్ విజయమ్మ తన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్లకు లొంగి సరస్వతి కంపెనీ షేర్ల సర్టిఫికెట్లు పోయాయంటూ.. జగన్ సంతకాలు లేకుండానే షేర్లు బదిలీ చేయడం మోసపూరితం కాదా? అని నిలదీసింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయడమే కాకుండా ఆయన కుమారుడు వైఎస్ జగన్‌ను అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ ఎన్నికలకు కొద్ది గంటల ముందు విజయమ్మ వీడియో రికార్డింగ్‌ను విడుదల చేసినప్పుడు వైఎస్సార్ అభిమానులు తీవ్రంగా కలతచెందారని తెలిపింది. వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై స్పందిస్తూ ఈమేరకు వైఎస్సార్సీపీ ఆమెను ఉద్దేశించి ఓ లేఖను విడుదల చేసింది. షర్మిల ఎన్నో రకాలుగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా జగన్ ఒక్కరోజు కూడా తన చెల్లెలిని ఒక్క మాట కూడా అనలేదనే విషయాన్ని గుర్తు చేసింది. చెల్లెలుపై ప్రేమాభిమానాలతోనే జగన్ తన స్వార్జిత ఆస్తుల్లో షర్మిలకు వాటా ఇచ్చేందుకు ఎంవోయూ చేశారని... అవి కుటుంబ ఆస్తులే అయితే ఎంవోయూ చేయాల్సిన అవసరం ఉండదు..చట్టా రీత్యా హక్కు వస్తుంది కదా? అని పేర్కొంది. అసలైన బాధితుడైన జగన్‌కు బాసటగా ఉండటం విజయమ్మ ధర్మమని స్పష్టం చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణిగా, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాతృమూర్తిగా విజయమ్మను అమితంగా గౌరవిస్తామని పేర్కొంది. వాస్తవాలను ఆమెకు, ప్రజల ముందు ఉంచేందుకు వైఎస్సార్సీపీ విడుదల చేసిన లేఖ పూర్తి పాఠం ఇదీ... కాంగ్రెస్‌కు ఓటేయమని విజయమ్మ ఎలా అంటారు? ఆనాడే వైఎస్సార్ అభిమానులు తీవ్ర కలత చెందారు 2024 ఎన్నికల్లో జగన్ ఒక్కరే ఒకవైపున ఉంటే... అటువైపు చంద్రబాబు నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు అంతా జట్టు కట్టారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో పెట్టిన కాంగ్రెస్ పార్టికి, తన కుమారుడు జగన్‌ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టికి ఓటేయమని కోరుతూ విజయమ్మ వీడియో విడుదల చేశారు. వైఎస్సార్సీపీని ఇబ్బంది పెడుతూ.. తాను షర్మిలవైపు ఉన్నాననే విషయాన్ని తద్వారా చాలా స్పష్టంగా చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసేలా ఇలా వ్యవహరించడం ధర్మమేనా..! రాజకీయాలు పక్కనపెడితే ఒక తల్లిగా ఆరోజు విజయమ్మ మద్దతు సంగతి దేవుడెరుగు...కనీసం తటస్థ వైఖరిని మరిచిపోయి పక్షపాతం వహించిన వైనం చూసి వైఎస్సార్ అభిమానులు తీవ్ర కలత చెందారు. బాధపడ్డారు. సర్టిఫికెట్లు పోయాయని.. మోసపూరితంగా షేర్ల బదలాయింపు సరస్వతీ కంపెనీ వ్యవహారంలో షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్ల ప్రభావంతో షేర్ల సర్టిఫికెట్లు పోయాయని విజయమ్మ చెప్పారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండానే, జగన్ సంతకాలు లేకుండానే ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా షేర్లు బదిలీ చేశారు. తన కుమారుడికి న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయని, అది బెయిల్ రద్దు కుట్రకు దారితీస్తుందని తెలిసినా అలా చేశారు. తద్వారా తాను షర్మిలతోనే ఉన్నానని మరోసారి స్పష్టంగా చెప్పారు. షర్మిలను ఏనాడూ ఒక్క మాట అనని జగన్.. వైఎస్ జగన్‌కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన లేఖ టీడీపీ సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యక్షమైంది. విజయమ్మ కూడా సంతకం చేసిన ఆ లేఖను టీడీపీ విడుదల చేయడం ఏమిటి...? ఇంత జరిగినా జగన్ ఏనాడూ తన చెల్లెలను ఉద్దేశించి ఒక్కమాట కూడా మాట్లాడ లేదు. కానీ షర్మిల ఎన్నోసార్లు వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో విజయవాడలో జగన్‌పై దాడి జరిగితే హేళనగా మాట్లాడారు. షర్మిలను సరిదిద్దాలని విజయమ్మ ఏనాడూ ప్రయత్నించకపోవడం ఆమె వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. బాధితుడు జగనే... కోర్టు కేసులపై ప్రతికూల ప్రభావితం పడేలా షర్మిల ప్రవర్తన, చర్యలు ఉంటున్నాయి. ఓ వైపు ఆస్తులపై హక్కులు కోరుతూ మరోవైపు అందుకు విరుద్ధంగా ఆమె వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులపై వైఎస్ జగన్ పోరాటం చేస్తుంటే... వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై తనకు ఎలాంటి ఆందోళనలేనట్టు ఆమె ప్రవర్తిస్తున్నారు. జగన్‌ను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనుగుణంగానే ఆమె వ్యవహరిస్తున్నారు. షర్మిల వేసే ప్రతి అడుగూ ప్రత్యర్థులకు లబ్ధి చేకూర్చేలా ఉంటోంది. మూడు నాలుగేళ్లుగా ఇంత జరుగుతున్నా జగన్ ఓపికతో, సహనంతో, మౌనంగా ఆ బాధను భరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ఎవరు...? ఒక తల్లిగా విజయమ్మ ఎవరికి బాసటగా ఉండాలనే బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రచ్చ కెక్కిందీ... పరువు తీసిందీ షర్మిలే రాజకీయాల పేరిట తెలంగాణలో అడుగుపెట్టిన దగ్గరనుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి జగన్‌ను షర్మిల ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అక్కడ నుంచి ఒక్కసారిగా మాయమై వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టికి... అన్నను 16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించిన పార్టికి ఈ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా వచ్చారు. రాజకీయాలు ఇంతే అనుకున్నా ప్రజాస్వామ్య విమర్శల పరిధిని దాటి ఆజన్మ శత్రువు మాదిరిగా జగన్‌ను షర్మిల అనరాని మాటలు అంటున్నారు. ఎన్నికల సమయంలో జగన్‌పై దాడి జరిగితే ఎగతాళి చేసి అమానవీయంగా మాట్లాడింది షర్మిల కాదా..? వీటన్నింటినీ జగన్ ఓపికతో భరించారు. మరి రచ్చకెక్కింది ఎవరు... పరువుతీసింది ఎవరు... నిజమైన బాధితుడు ఎవరు... జగనే కదా..!! విచక్షణ విస్మరించిన విజయమ్మ కుమార్తె ప్రభావం, ఒత్తిళ్లతో విజయమ్మ విచక్షణ విస్మరించారు. కుమార్తెను వెనకేసుకువచ్చే ధోరణితో సరస్వతీ కంపెనీ విషయంలో తనవంతు పాత్ర పోషిస్తూ చట్టవ్యతిరేక పనులకు తోడ్పడ్డారు. తన కుమారుడు ఎదుర్కోబోయే చట్టపరమైన సంక్షిష్ట పరిస్థితులేంటో తెలిసి కూడా విజయమ్మ దాన్ని విస్మరించారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం ఇదే. ఉమ్మడి ఆస్తులే అయితే ఒకరి కంపెనీల్లో ఒకరికి ఎందుకు వాటాలు లేవు? వైఎస్సార్ ఆ ఆస్తులను షర్మిలకు ఎందుకు పంచలేదు? వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నపుడే జగన్ కంపెనీలు నడిపారు. అలాగే షర్మిల తన కంపెనీలను తాను నడిపారు. ఉమ్మడి ఆస్తులు అయితే మరి ఒకరి కంపెనీల్లో ఒకరికి వాటాలు ఎందుకు లేవు? వైఎస్సార్ మనోభావాలు, ఆజ్ఞ వేరేలా ఉంటే ఇలా ఎందుకు జరిగింది ? తన కుమార్తెకు వైఎస్సార్ పూరీ్వకుల ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను ఇచ్చారు. జగన్ ఆస్తులు తనవి కాదు కాబట్టే ఇవ్వలేదు. ఎందుకంటే అవన్నీ జగన్ స్వార్జితం కాబట్టి. తన స్వార్జిత ఆస్తులను షర్మిలకు ఇచ్చిన జగన్ షర్మిలకు వివాహమైన 20 ఏళ్ల తర్వాత జగన్ తన స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలిపై ప్రేమానురాగాలకొద్దీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కోర్టు కేసుల నేపథ్యంలో 2019లో ఆమెకు మంచి చేస్తూ ఒక ఎంఓయూ రాసి ఇచ్చారు. అంతేకాకుండా గడచిన పదేళ్లలో దాదాపు రూ.200 కోట్లు పైచిలుకు జగన్ ద్వారా షర్మిల పొందినా ఆమె తన సోదరుడిపట్ల ఏమాత్రం కృతజ్ఞత చూపలేదు. షర్మిల ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా ? ఇంత యాగీ చేస్తున్న షర్మిల ఈ సంస్థల్లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా? ఒక్కరోజైనా కంపెనీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారా? కంపెనీలకున్న రూ.1400 కోట్ల అప్పుల్లో తన వాటా కింద వ్యక్తిగత పూచీకత్తు ఇస్తూ సంతకం పెట్టారా? రూ.500 కోట్ల నష్టాల్లో అయినా ఆమె పాత్ర పోషించారా? ఈ కంపెనీలకు సంబంధించిన కష్టాల్లో, చిక్కుల్లో, కోర్టు కేసుల్లో ఏరోజైనా తానుగా బాధ్యత తీసుకున్నారా? వాటాలు ఉంటే ఇలా నష్టం చేస్తారా? ఈ కంపెనీల మీద, జగన్ మీద ఎవరైతే కేసులు పెట్టారో వారికి రాజకీయ ప్రయోజనం కల్పించేలా షర్మిల వారిని బలపరుస్తున్నారు. కంపెనీలను బలహీనపరుస్తున్నారు. ఆమె నడవడిక, వైఖరి చూస్తే ఈ కంపెనీల్లో వాటాలు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుందా? నిజంగా వాటాలు ఉంటే ఇలా చేస్తారా? ఇలా జగన్‌ను, ఆయన కంపెనీలను ఇబ్బందులు పాలు చేస్తారా? కోర్టులే నిర్ణయిస్తాయి ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ వ్యవహారం కోర్టులో ఉంది. ఇరువురి వాదనలు ప్రజలముందు ఉన్నాయి. ఎవరు చేసింది సరైనదో, ఎవరివైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయి.ఉమ్మడి ఆస్తులే అయితే ఎంవోయూ ఎందుకు? తన స్వార్జిత ఆస్తులను ప్రేమానురాగాలతో షర్మిలకు ఇస్తున్నట్లు జగన్ ఎంఓయూ రాస్తే... దానిపై విజయమ్మ, షర్మిల ఇద్దరూ సంతకాలు చేశారు. అంటే దీని అర్థం జగన్ స్వార్జిత ఆస్తుల్లో హక్కులేదని, ఆరోజు వారు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టేగా? మరి ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు అంటూ లేఖలో పేర్కొనడం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే కదా. నిజంగా ఉమ్మడి ఆస్తులే అయితే వాటిని పంచుకునే పద్ధతి ఇలా ఎంఓయూల రూపంలో ఉండదు... చట్టరీత్యా హక్కుగా వస్తుందని ప్రతి కుటుంబానికి తెలుసు. జగన్ స్వార్జిత ఆస్తి కోసం షర్మిల యాగీ ఏమిటి? జగన్ స్వార్జితమైన ఆస్తిలో ఎలాంటి హక్కులేకపోయినా, ఆ ఆస్తిలో తనకు భాగం కావాలని షర్మిల ఇంత రాద్ధాంతం చేయడం ఏంటి? ఇంత యాగీ చేయడం ఏంటి? ఇన్ని లేఖలు రాయడం ఏంటి? ఆ లేఖను టీడీపీ విడుదల చేయడం ఏంటి? ఆమె పద్ధతి, ప్రవర్తన మారి తన ప్రేమానురాగాలను చూరగొంటే, కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాత ఆమెకు ఏమేరకు మంచి చేయాలో, ఎంత చేయాలో, ఏం చేయాలో ఆరోజు నిర్ణయం తీసుకుంటానని జగన్ ఇదివరకే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇంకెంతమాత్రం మునిగిపోకూడదని, ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తామని ఇదివరకే మా పార్టీ స్పష్టం చేసింది. బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ ఎందుకు ప్రస్తావించ లేదు?ప్రజలను పక్కదోవ పట్టించడమే వైఎస్ జగన్మోహన్రెడ్డిని న్యాయపరంగా ఇబ్బంది పెట్టేందుకు... తద్వారా బెయిల్ రద్దుకు పన్నిన కుట్ర వ్యవహారాన్ని విజయమ్మ తన లేఖలో కనీసం ప్రస్తావించ లేదు. అది ప్రజలను పక్కదోవ పట్టించడమే. సరస్వతీ కంపెనీ విషయంలో ఈడీ అటాచ్మెంట్ ఉంది. తెలంగాణ హైకోర్టు స్టేటస్కో ఆదేశాలు ఉన్నాయి. యాజమాన్య బదిలీ జరిగేలా క్రయవిక్రయాలు చేయకూడదని అటాచ్మెంట్లో ఉందనే విషయం అందరికీ తెలుసు. సరస్వతీ కంపెనీ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో సహా పలువురి న్యాయసలహాలు ఉన్నాయి. అయినప్పటికీ తప్పని తెలిసినప్పటికీ.. మోసపూరితంగా, కుట్రపూరితంగా షేర్లు బదిలీ చేసిన మాట వాస్తవమే కదా...! షర్మిల భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై వైఎస్ జగన్మోహన్రెడ్డికి న్యాయపరంగా, చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి తెలిసి కూడా విజయమ్మ ఆమోదించి సంతకం పెట్టడం నిజమేకదా...! విజయమ్మ తన లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులను పక్కదోవ పట్టించడమే. -
ఏ కొంపలో నీలాంటి చెల్లి ఉండదు
-
షర్మిల పై పుష్ప శ్రీవాణి ప్రశ్నల వర్షం..
-
YSR మరణానికి కారకులెవరు..
-
చంద్రబాబుతో కలసి సొంత అన్నపైనే షర్మిల కుట్ర చేస్తున్నారు
-
జగన్ బెయిల్ రద్దు చేయడానికే మీ కుట్రలు
-
షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా
-
BIG Queation: షర్మిలమ్మ బైబిల్ మీద ప్రమాణం చేసి కన్నీళ్లు కాదు కరెక్ట్ ఆన్సర్ కావాలి
-
కుట్ర విఫలమైందని ఏడుపు.. వందల కోట్లు తీసుకుని, రిటర్న్ గిఫ్ట్..
-
Big Question: ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కన్నీళ్ల డ్రామాలెందుకు చెల్లెమ్మా
-
సొంత అన్నపై కుట్ర పన్నిన శాడిజం ఎవరిది ?.. కన్నీటి చాటు డ్రామా..!
-
షర్మిల... చంద్రబాబు కబంద హస్తాల నుంచి బయటకు రా...
-
సుబ్బారెడ్డి పై షర్మిల వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సుధాకర్ బాబు
-
ద్రోహం తలపెట్టినా చూస్తూ ఉండిపోవాలా?
సాక్షి, అమరావతి: ఆనాడు పిల్లనిచ్చి.. పదవులిచ్చి.. పార్టీ నీడనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. నేడు ఆయన చేతిలో కీలుబొమ్మగా మారిన షర్మిల సొంత అన్న జగన్‌కే ద్రోహం తలపెట్టారు. స్వార్జిత ఆస్తుల్లో వాటా ఇస్తానన్న అన్న ప్రేమకు విలువ లేకుండా చేస్తూ, ఆయన బెయిల్ రద్దుకు శత్రువులతో కలిసి కుట్రలు చేస్తున్నారు.పెళ్లయిన 20 ఏళ్ల తరువాత, తండ్రి మరణించిన పదేళ్ల అనంతరం కూడా చెల్లికి ఆస్తులిచ్చేంత సహృదయం ఉన్న జగన్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ఈ కుతంత్రాలను రక్తి కట్టించడం కోసం మీడియా ముందు దొంగ ఏడుపులతో డ్రామాలాడుతున్నారు. ఇదేనా వైఎస్సార్ బిడ్డ నైజం. ఇలాగేనా ఆ మహానేత కుమార్తె నడుచుకోవాల్సిన విధానం... అంటూ షర్మిలపై సోషల్ మీడియా వేదికలపై నెటిజన్లు మండిపడుతున్నారు. పబ్లిక్ పోస్టులతో దుమ్మెత్తి పోస్తున్నారు. వాటి సారాంశం ఇలా ఉంది.. భారతి పేరు ఉంది.. మీ పేరు లేదంటే ఏంటి అర్థం? ‘వాళ్ల పేర్లతో ఆస్తులు ఉంటే... నిజంగా వాళ్లవి అవుతాయా? నా పేరు మీద ఆస్తులు రాసి ఉంటే నేను ఎందుకు జైలుకి వెళ్లలేదు అంటున్నారు. అలా అయితే భారతి కూడా జైలుకు వెళ్లాలి కదా’ అని అంటున్న షర్మిలకు భారతి పేరు ఈడీ కేసుల్లో ఉందనే విషయం తెలియదా? మరి షర్మిల పేరు ఎందుకు లేదు. అంటే ఆ ఆస్తులతో షర్మిలకు సంబంధం లేదనే కదా అర్థం. ఎవరైనా తమ ఆస్తులకు వేరే వాళ్ల పేర్లు పెట్టుకుంటుంటే పోనీలే పేరు పెట్టుకుంటే ఏముందిలే అని ఊరుకుంటారా.? అవి జగన్ ఆస్తులు కాబట్టే వాళ్ల పేర్లు పెట్టుకున్నా దివంగత వైఎస్సార్ అభ్యంతరం చెప్పలేదనేది నిజం కాదా? చిన్నాన్నను అంత మాట మీరనొచ్చా? సొంత చిన్నాన్న అంటుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయని, నా బిడ్డలు నీ ముందు పెరగలేదా... అని సుబ్బారెడ్డిని ప్రశ్నించిన షర్మిల అదే చిన్నాన్నను జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని, పదవులు ఇస్తే అనుభవిస్తున్నారని అనడం సమంజసమా. ఆయనపై అంత ప్రేమ ఉన్నప్పుడు కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా అంత పెద్ద మాట ఎలా అనగలిగారు షర్మిలమ్మా.? చిన్నాన్న కాబట్టే, మొదటి నుంచీ జరుగుతున్న పరిణామాలను దగ్గరగా చూస్తున్నారు కాబట్టే సుబ్బారెడ్డి వాస్తవాలు మాట్లాడితే తట్టుకోలేక ఆయనను నిందించడమేనా మీ సంస్కారం. పైగా సాయిరెడ్డి, సుబ్బారెడ్డిలను పరీక్షించడం కోసం, వాళ్ల గురించి విజయమ్మకు తెలియడం కోసం లేఖలో వారి పేర్లు ప్రస్తావించారా? ఇప్పుడు మీరు వారిద్దరి గురించి విజయమ్మకు కొత్తగా చెప్పాలా..? విజయమ్మ క్షోభకు కారణం మీరే కదా? ‘సొంత కొడుకు తల్లిని కోర్టుకి ఈడ్చాడని, ఇలాంటి కొడుకును ఎందుకు కన్నాను.. పురిటిలోనే చంపేయాల్సింది అని ఆ తల్లి అనడం లేదని, ఇది చూడటానికా నేను ఇంకా బతికి ఉన్నాను’ అని విజయమ్మ ఏడుస్తోందని చెప్పుకొస్తున్నారు షర్మిల. విజయమ్మ ఈ మాటలు అన్నారో లేదో షర్మిలకే తెలియాలి. అయితే నిజానికి విజయమ్మను ఇంతటి క్షోభకు గురిచేస్తున్నది మాత్రం షర్మిలేనని స్పష్టంగా అర్థం అవుతోంది. ఆస్తుల కోసం షర్మిల పట్టుబట్టి తల్లిని, కొడుకుని వేరు చేయాలని ప్రయత్నిస్తుండటం విజయమ్మకు కడుపుకోత కాదా? కుమారుడి ప్రతి కష్టంలోనూ, ప్రతి విజయంలోనూ తోడున్న విజయమ్మను కూడా మీ కుట్రలకు వాడుకుంటారా..? బహుశా ఇలాంటి కూతురు నాకెందుకు పుట్టిందా అని విజయమ్మ బాధపడుతూ ఉండి ఉంటారు. ఒకసారి చేస్తే సరేగాని ప్రతి సారీ మీడియా ముందుకు వచ్చి దొంగ ఏడుపులు ఏడ్చేయడం షర్మిలకే చెల్లింది. చంద్రబాబును కాపాడాలనుకున్న ప్రతిసారీ ప్రెస్‌మీట్ పెట్టడం... కన్నీళ్లు పెట్టేసుకోవడం ఆమెకు బాగా అలవాటైపోయింది. ప్రజలపై రూ.6 వేల కోట్లకు పైగా విద్యుత్ చార్జీల భారం వేస్తే రాని కన్నీరు, వాస్తవాలను ఒప్పుకోలేక వస్తున్నాయంటేనే అర్థం అవుతోంది ఆమెకు ప్రజల మీద ఎంత ప్రేమో.. విద్యుత్ చార్జీల విషయంలో చంద్రబాబు, కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత రాకూడదనేగా ఈ ఏడుపు డైవర్షన్లు? నిజమే.. జగన్ లాంటి అన్న ఎవరుంటారు? ఏ అన్న అయినా... చెల్లికి గిఫ్ట్ అంటే ఏ బంగారమో, చీరనో ఇస్తారని, అంతేకాని ఆస్తుల్లో 40 శాతం వాటా ఇస్తారా? నా హక్కు కాబట్టే నాకు ఇస్తామన్నారని షర్మిల అంటున్నారు. నిజమే ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్న రోజులివి. అలాంటి కలికాలంలోనూ చెల్లిలికి తన సొంత ఆస్తి నుంచి, కష్టార్జితం నుంచి వాటా ఇస్తాననే అన్న బహుశా ఒక్క జగన్ తప్ప ఎవరూ ఉండరేమో. అది కూడా ఆమెకు పెళ్లి జరిగిన 20 ఏళ్ల తరువాత, తండ్రి మరణించిన 10 ఏళ్లు అయిపోయాక అంటే నిజంగా చెల్లిలి మీద ఎంత ప్రేముంటే ఇంతటి నిర్ణయం తీసుకుంటారు..? పైగా అడగకుండానే ఎంవోయూ రాసిచ్చారని మీరే అంటున్నారంటే, అంత చిత్తశుద్ధి ఉన్న అన్న ఇంకెవరుంటారు. మీ లేఖను టీడీపీ విడుదల చేయడమేమిటి? ఐదేళ్లు ఎంవోయూ చేతిలో ఉన్నా ఏ మీడియాకు విడుదల చేయని షర్మిల.. అన్నకు రాసిన లేఖను మాత్రం టీడీపీ అధికారికంగా ఎలా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ లేఖ, ఆమె కాకుండా టీడీపీ అధికారికంగా ఎలా బయటపెడుతుంది. అంటే కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటేనని మీరే చెప్పినట్టు కాదా.? మీరు చేస్తున్నది ఏమిటి...? జగన్ సొంత లబ్ధి కోసం తల్లిని, చెల్లిని కోర్టుకి ఈడ్చారంటున్నారే మరి మీరు చేస్తున్నదేమిటి. మీ లబ్ధి కోసం, మీరు మోస్తున్న చంద్రబాబు లబ్ధి కోసం సొంత అన్న బెయిల్‌ను రద్దు చేయించి జైలుకు పంపాలనుకోవడం లేదా? ఇందుకోసం మీరు మీ తల్లి విజయమ్మను వాడుకోవడం లేదా..? దీన్నేమనాలి? మీరేం త్యాగాలు చేశారు? వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడానికి మీ త్యాగాలు, కష్టమే కారణమా షర్మిల. మీరు పదేళ్లలో అన్న ఇచ్చిన రూ.200 కోట్లు తీసుకున్నారు. తండ్రి పంచి ఇచ్చిన ఆస్తులతో వ్యాపారాలు చేసుకున్నారు. అదేనా మీ త్యాగం? అన్నంటే ప్రాణం అంటూనే అన్న చేసిన సాయాన్ని మర్చిపోయి కుట్రలు చేయడమేనా మీ నైజం? మీరు సంపాదించుకున్న ఆస్తుల్లో జగన్ వాటా అడిగితే మీకెలా ఉంటుంది?. -
గురి తప్పిన బాణం వెనుక..!
గురి తప్పిన బాణాల గురించి కాదు, గురి పెడుతున్న వేటగాడి గురించి మాట్లాడుకోవాలి. ఆ వేటగాడు అల్లుతున్న ఉచ్చుల గురించి ఆలోచించాలి. ఓట్ల కోసం నూకలు చల్లి ఆపై వల వేసి బంధించే అతడి మాయోపాయాలపై మేధోమథనం జరగాలి. హిరణ్యాక్షుడు పొందిన వరాల చందంగా వార్తా ప్రసార మాధ్యమాస్త్రాలను తన అమ్ములపొదిలో దాచిపెట్టుకున్న అతని వ్యూహ రహస్యాల గురించి మాట్లాడుకోవాలి. ఒక్కో బాణాన్ని మంత్రించి వదిలి పాఠకుల మస్తిష్కాలను స్వాధీనపరచుకోవా లని చూసే అతని తంత్రాంగం గురించి జనాన్ని అప్రమత్తం చేయాలి.రామాయణంలో కనిపించే కిష్కింధ రాజైన వాలికి ఒక విచిత్ర లక్షణం ఉన్నది. తన ఎదుటికి ఎంతటి బలవంతుడు వచ్చినా, అతని బలాన్ని తనలోకి లాగేసుకొనే శక్తి అతని సొంతం. వాలి మాదిరి బలశాలి కాదు మన అనుభవశాలి. కానీ అటువంటి లక్షణం ఒకటి ఈయనకూ ఉన్నది. తన రాజకీయ ప్రత్యర్థి ఏ విషయాల్లో బలవంతుడో గ్రహించి ఆ విషయాల్లోనే అతడు బలహీనుడని గోబెల్స్ ప్రచారం నిర్వహించడంలో మన కురువృద్ధుడు నిష్ణాతుడు. సత్య వాక్పాలన రాముడి బలం అను కుంటే, ఆ రాముడు అబద్ధాలాడతాడని ప్రచారం చేయడం, జనాన్ని నమ్మించడమే ఈయనకున్న నైపుణ్యం.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి బలం ఆయన వ్యక్తిత్వం. మాట తప్పకపోవడం, మడమ తిప్పక పోవడం ఆ వ్యక్తిత్వ లక్షణాలు. రాజకీయ అడుగులు వేయడం మొదలు పెట్టిన తొలి రోజుల్లోనే ఇది నిరూపితమైంది. పది హేనేళ్ల కింద ఆయన తండ్రి∙చనిపోయినప్పుడు ఆ షాక్ తట్టుకోలేక గుండె పగిలి చనిపోయినవారూ, ఆత్మహత్యలు చేసుకున్నవారూ వందల సంఖ్యలో ఉన్నారు. ఈ పరిణామం వల్ల ఉద్వేగానికి గురైన జగన్ ఆ అమరులందరినీ తన ఆత్మబంధువులుగా ప్రకటించారు. వారందరి ఇళ్లకు వెళ్లి దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానన్న సంకల్పాన్ని ప్రకటించారు.ఈ సంకల్పానికి కాంగ్రెస్ అధిష్ఠానం అడ్డుతగిలిన సంగతి తెలుగు పాఠకులకు తెలిసిన విషయమే. తమ మాట వింటే భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తామని, వినకపోతే కేసులు పెట్టి జైల్లో వేస్తామని రాయబారాలు నడిపినట్టు అనంతర కాలంలో కాంగ్రెస్ నేతలే బహిరంగంగా వెల్లడించారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంలో సోనియా గాంధీ మకుటం లేని మహారాణి. ‘ఫోర్బ్స్’ మేగజైన్ 2010లో ప్రకటించిన ప్రపంచంలోని శక్తిమంతుల జాబితా టాప్ టెన్‌లో ఆమె పేరు ఉన్నది. 2008లో ‘టైమ్’ మేగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో కూడా ఆమె పేరున్నది. అటువంటి రోజుల్లో ఆమె మాటను ధిక్కరించే సాహసం ఎవరు చేస్తారు? కానీ జగన్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం!ఈ బలమైన వ్యక్తిత్వాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రజలతో పాటు చంద్రబాబు, ఆయన పార్టీ, యెల్లో మీడియా యజమానులు కూడా గుర్తించారు. అందువల్లనే ఆయన వ్యక్తిత్వం మీద దాడిని కేంద్రీకరించారు. యెల్లో సిండికేట్‌కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు. జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టుకున్నారు. అప్పుడు తన ఆగర్భశత్రువైన కాంగ్రెస్‌తో జతకట్టి జగన్ వ్యక్తిత్వ హననంలో, జైలు పాలు చేయడంలో బాబు కూటమి ప్రధాన బాధ్యత తీసుకున్నది. ఎందువలన? జగన్ బలమైన వ్యక్తిత్వమే భవిష్యత్తులో తమకు ప్రత్యర్థి కాగల దన్న అంచనాతోనే!ఆ వ్యక్తిత్వం పలుమార్లు నిరూపణైంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరిన చంద్రబాబు అసాధ్యమైన హామీలను ఇచ్చారు. అప్పుడు రైతులకు రుణమాఫీ ఒక్కటి ప్రకటించాలని శ్రేయోభిలాషులు జగన్‌కు సలహా ఇచ్చారు. అమలు చేయలేని హామీని ఇవ్వడం కన్నా ప్రతిపక్షంలో కూర్చోవడానికే జగన్ సిద్ధ పడ్డారు. అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోని మడత పెట్టేయడం ఈ రోజుల్లో రివాజుగా మారింది. ఇటువంటి వాతా వరణంలో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ ఆనవాయితీని మార్చారు. ఎన్నికల మేనిఫెస్టోకు పటం కట్టి ప్రభుత్వ కార్యాల యాల్లో పెట్టించారు. ఆ మేనిఫెస్టో అమలుపై ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేస్తూ వచ్చారు.అమలు చేసిన హామీల గురించి చెప్పడం కాదు, మళ్లీ గెలిస్తే అరచేతిలో వైకుంఠం పెడతాననే హామీలే ముఖ్యమని మళ్లీ సలహాలొచ్చాయి. జగన్ వాటికి చెవి ఒగ్గలేదు. కానీ చంద్రబాబు అటే మొగ్గారు. జనం ముందు బయోస్కోప్ పెట్టెను తెరిచి ‘కాశీ పట్నం చూడరబాబు చూడరబాబు’ అంటూ బొందితో కైలా సాన్ని హామీ ఇచ్చారు. దాంతోపాటు కూటమి సమీకృత కార ణాలు, ‘సాంకేతిక’ కారణాలు అనేకం పనిచేసి బాబు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు హామీలు అమలుచేయాలి. అది సాధ్య మయ్యే పని కాదు. ఒక పక్క జగన్ ప్రభుత్వం హామీలను అమలు చేసిన తీరు జనం మదిలో తాజా జ్ఞాపకంగానే ఉన్నది. ఈ జ్ఞాపకాన్ని మరిపించడం కూటమి పెద్దల తక్షణ కర్తవ్యం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వారు నెలకో రకంగా ప్రయోగిస్తున్న డెవర్షన్ రాకెట్లు ఈ తక్షణ కర్తవ్యంలో భాగమే!ఆస్తి కోసం తల్లీ, చెల్లి మీద జగన్ కోర్టుకు వెళ్లారనే ప్రచారాన్ని గత రెండు మూడు రోజులుగా బాబు క్యాంప్ విస్తృతంగా చేపట్టింది. ఔను ఆయన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఎవరి కారణంగా అలా వెళ్లక తప్పని అగత్యం ఏర్పడింది? ఈ అంశాల జోలికి మాత్రం యెల్లో మీడియా సహజంగానే వెళ్లదు. జగన్ వ్యక్తిత్వ హననం ఒక్కటే దాని ఎజెండా. ఆ ఎజెండా పరిమితు లకు లోబడే దాని ప్రాపగాండా కార్యక్రమం ఆధారపడి ఉంటుంది. జగన్, షర్మిలల చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి ఈ వివాదానికి సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లా డారు. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో అన్నాచెల్లెళ్ల మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. జగన్ తన సొంత ఆస్తిలోంచి కొంత భాగాన్ని చెల్లెలికి ఇచ్చేలా ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదు ర్చుకున్నారు. ఇవన్నీ బయటకు వచ్చాయి. జగన్ ఎన్సీఎల్టీకి వెళ్లిన డాక్యుమెంట్ టీడీపీ అధికార ట్విట్టర్ హ్యాండిల్‌పై ప్రత్య క్షమైంది. షర్మిల రాసిన బహిరంగ లేఖ విడుదలైంది. ఆమె మీడియాతో కూడా మాట్లాడారు.ఈ మొత్తం డాక్యుమెంట్లు, లేఖలు మీడియా సమావేశాల్లో లేవనెత్తిన అంశాలు విస్తృతంగా రెండు రాష్ట్రాల్లోనూ జనంలోకి వెళ్లాయి. ఈ అంశాలపై పెద్ద ఎత్తున చర్చోపచర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ పంచాయతీని పబ్లిక్‌లోకి తీసుకొచ్చిన సూత్రధారులు, పాత్రధారుల ఉద్దేశం వేరు. జగన్ వ్యక్తిగత ప్రతిష్ఠపై బురద జల్లడం, ఆయన న్యాయ పోరాటాన్ని బలహీన పరచడం, వీలైతే ఆయన బెయిల్‌ను రద్దు చేయించి మళ్లీ జైలుకు పంపించడం! ఈ పరిణామాన్ని నిశితంగా గమనించిన వారికి కుట్రదారుల ఉద్దేశం సులభంగానే అర్థమవుతుంది. జగన్ మోహన్‌రెడ్డి క్రియాశీలకంగా రాజకీయాల్లో లేకపోతే లాభం పొందేదెవరు? ఆ లాభంలో ఎంతోకొంత తమ పార్టీకి కూడా దక్కకపోతుందా అని ఒంటె పెదవులకు నక్క ఆశలు పెట్టు కున్నట్టు పొంచి ఉన్నది ఎవరు?డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టకముందే, ఆ మాటకొస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా చేపట్టడానికి ముందే జగన్ మోహన్‌రెడ్డి విజయ వంతమైన వ్యాపారవేత్త. ఆయన సండూర్ పవర్‌ను 1998లోనే ప్రారంభించారు. విజయవంతమైన వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ వెళ్లడం సహజం. వారి ట్రాక్ రికార్డును బట్టి పెట్టుబడులు రావడం కూడా సహజమే. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. డాక్టర్ వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో గానీ, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గానీ జగన్ మోహన్‌రెడ్డి బెంగళూరు కేంద్రంగానే వ్యాపారాలు చేసు కున్నారు తప్ప హైదరాబాద్‌లో లేరు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషించ వలసిన అనివార్యత ఏర్పడినప్పుడే ఆయన మకాం హైదరా బాద్‌కు మారింది. జగన్ మోహన్‌రెడ్డి స్థాపించిన భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ సంస్థల్లో ఇతరులు పెట్టుబడులు పెట్టడం వెనుక క్విడ్ ప్రోకో దాగున్నదనే ఆరోపణలు తెచ్చి కాంగ్రెస్–టీడీపీ కుమ్మక్కయి ఆయనపై అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైలుకు పంపాయి. ఆ సంస్థలు గడిచిన పదహారు పదిహేడేళ్లుగా విజయవంతంగా నడుస్తూ మదుపరులకు లాభాలు తెచ్చి పెట్టడం క్విడ్ ప్రోకో ఆరోపణల్లోని బూటకత్వాన్ని ఎండగట్టింది. మార్కెట్‌ను విస్తృతంగా అధ్యయనం చేసి సొంత ప్రాజెక్టుతో, సొంత పెట్టుబడులతో పాటు ఇతర ఇన్వెస్టర్లకు తన ప్రాజెక్టుపై నమ్మకం కలిగించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జగన్ తన వ్యాపారాలను విస్తరించుకున్నారు. ఈ ప్రయాణంలో రాజకీ యంగా మాట కోసం నిలబడవలసివచ్చిన కారణంగా ఆయన దారుణమైన వ్యక్తిత్వ హననానికి గురి కావలసి వచ్చింది. ఊహించని నిందలు మోయవలసి వచ్చింది. వ్యక్తిత్వ హననం అనేది హత్యతో సమానమంటారు. ఆ రకంగా చూస్తే కొన్ని వందల సార్లు ఆయన హత్యకు గురి కావలసి వచ్చింది.ఇప్పుడు తల్లీ, చెల్లిపై కోర్టుకెక్కారనే నిందను మోపారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చిన తర్వాత జగన్ మోహన్‌రెడ్డి వ్యక్తిగత ఔన్నత్యం ప్రజలకు తేటతెల్లమైంది. కుట్రదారుల పని కుడితిలో పడ్డట్టయింది. వారసత్వంగా సంక్ర మించిన ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను కూడా జగన్, షర్మిల మధ్య డాక్టర్ వైఎస్సార్ పంపకం చేశారు. భారతి సిమెంట్స్ గానీ, జగతి పబ్లికేషన్స్ గానీ జగన్ మోహన్‌రెడ్డి స్వార్జితం కనుక పంపకాల్లో అవి రాలేదు. పైగా ఈ రెండు కంపెనీల్లోనూ జగన్, ఆయన సతీమణి భారతిలకు తప్ప షర్మిలకు వాటా కూడా లేదు. సిమెంట్ పరిశ్రమకు తన భార్య పేరునూ, పబ్లికేషన్స్‌కు భార్యాభర్తలిద్దరి పేర్లూ కలిసేలా ‘జగతి’ అనే పేరును జగన్ పెట్టుకున్నారు. అప్పుడు డాక్టర్ వైఎస్సార్ జీవించే ఉన్నారు. ఒక సందర్భంలో ‘ఈనాడు’ రాసిన అవాకులు చెవాకులకు జవాబునిస్తూ తన భార్య మీద ప్రేమతో తన సిమెంట్ పరిశ్రమకు ఆమె పేరును పెట్టుకున్నానని కూడా జగన్ రాశారు. అప్పుడు వైఎస్సార్ జీవించే ఉన్నారు. ఈ కంపెనీలు వారి కుటుంబ వారసత్వ సంపద కాదనీ, జగన్ స్వార్జితాలే అని చెప్పడానికి ఇటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. తండ్రి చనిపోయిన తర్వాత చాలాకాలం పాటు అన్న తనను బాగానే చూసుకున్నారని షర్మిల కూడా తన బహిరంగ లేఖలో అంగీకరించారు. షర్మిల తనకు చెల్లెలు మాత్రమే కాదు, పెద్ద కూతురు వంటిదని జగన్ ఒక సందర్భంలో ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే తండ్రి మనసుతో ఆలోచించి తన స్వార్జితమైన ఆస్తుల్లో వాటాలు చెల్లెలికి ఇవ్వాలని సంకల్పించారు. అందుకోసం ఒక అవగాహనా పత్రాన్ని (ఎమ్ఓయు) కూడా రాసిచ్చారు. ఇదెప్పుడు జరిగింది... తండ్రి చనిపోయిన పది సంవత్సరాల తర్వాత, షర్మిలకు వివాహం జరిగిన 20 సంవత్సరాల తర్వాత! ఇంతకాలం తర్వాత సొంత ఆస్తిలో చెల్లెలికి భాగం కల్పించిన అన్నలెందరుంటారు? ఈ మధ్య కాలంలో 200 కోట్ల సొంత ఆదాయాన్ని కూడా సోదరికి జగన్ అందజేశారు. ఈ వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత జనం దృష్టిలో జగన్ ఔన్నత్యం మరింత పెరిగింది.క్విడ్ ప్రోకో కేసుల కారణంగా ఆస్తులు ఈడీ జప్తులో ఉన్నందువల్ల ఎమ్ఓయూ (అన్‌రిజిస్టర్డ్)ను రాసుకోవలసి వచ్చింది. లేకపోతే ఈ పంపకాల కార్యక్రమం ఇప్పటికే పూర్తయి ఉండేది. కేసుల వ్యవహారం పూర్తిగా పరిష్కారమయిన పిదప ఆస్తుల బదలాయింపు జరిగేలా ఎమ్ఓయూ రాసుకున్నారు. ఈ పత్రంలోని ప్రతి పేజీ మీద జగన్‌తో పాటు షర్మిల కూడా సంతకం చేశారు. పత్రం మొదటి పేజీలోని రెండో అంశంలోనే పంపకానికి ప్రతిపాదిస్తున్న ఆస్తుల సొంతదారు జగన్ మోహన్‌రెడ్డి (the subject properties / owned directly and indirectly through companies by YS Jagan) అనే మాట స్పష్టంగా ఉన్నది. ఈ వాక్యం కింద షర్మిల సంతకం కూడా ఉన్నది.రెండో పేజీలో ఇంకో కీలక అంశమున్నది. తన చెల్లెలి మీద వైఎస్ జగన్‌కున్న ప్రేమాభిమానాల కారణంగా (In consideration of his love and affection for his sister, YSJ here by agrees....) ప్రతిపాదిత ఆస్తులను బదిలీ చేస్తున్నట్టున్నది. అంతేతప్ప హక్కుగా ఆమెకు బదిలీ చేస్తున్నట్టు లేదు. ఈ పేజీ మీద కూడా షర్మిల సంతకం ఉన్నది. ఈ ఒప్పందం రాసుకున్నది 2019లో. అప్పుడు ఈ ప్రతిపాదిత ఆస్తులు అన్న సొంత ఆస్తులని అంగీకరించి సంతకం కూడా చేశారు కదా!భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌లో వాటాలతో పాటు సరస్వతి పవర్ పూర్తిగా షర్మిలకే బదిలీ అయ్యేటట్లుగా రాసుకుని తాత్కాలికంగా తల్లిగారి పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి కేసుల పరిష్కారం తర్వాత అది షర్మిలకు బదిలీ అయ్యేలా ఏర్పాటు చేశారు. కానీ ఆ గిఫ్ట్ డీడ్‌ను తల్లి పేరు మీద షేర్లుగా షర్మిల మార్పించారు. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ దగ్గర ఉన్నాయని తెలిసీ అవి ఎక్కడో పోయాయని చెప్పి, బదిలీ పత్రాలపై జగన్ సంతకం చేయకుండానే షేర్లు మార్పించారు. ఈడీ జప్తులో ఉన్న ఆస్తుల బదిలీ వల్ల కేసుల్లో న్యాయపరమైన చిక్కులను జగన్ ఎదుర్కోవలసి వస్తుందని తెలిసీ షర్మిల ఈ చర్యకు పాల్పడ్డారు. దాంతో ఈ చట్టవిరుద్ధమైన వ్యవహారాన్ని ఆపాలని జగన్ ఆమెకు లేఖ రాశారు. ఆమె ససేమిరా అనడంతో న్యాయ నిపుణుల సలహా మేరకు ఆయన ఎన్సీఎల్టీ తలుపు తట్టి ఈ బదిలీని ఆపేయాలని కోరవలసి వచ్చింది. ఇదే తల్లినీ, చెల్లినీ జగన్ కోర్టుకీడ్చారని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం లోని అసలు గుట్టు. ఈ రకమైన ప్రచారంతో తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలనీ, జగన్ ప్రతిష్ఠను దెబ్బ తీయాలనీ యెల్లో సిండికేట్ తాపత్రయపడుతున్నది. ఈ దుష్ట పన్నాగానికి షర్మిల పూర్తి స్థాయిలో సహకరిస్తున్నదని శనివారం నాటి ఆమె మీడియా సమావేశం బట్టబయలు చేసింది. జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దవుతుంది కాబట్టి అమ్మను కోర్టు కీడుస్తారా అని ప్రశ్నించడం ఆశ్చర్యపరిచింది. జగన్ ముందు గానే ఎన్సీఎల్టీకి లేఖ రాయడంతో బెయిల్ రద్దయ్యే అవకాశం పోయిందని ఆమె ఆశాభంగం చెందారా అనే అనుమానం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. చంద్రబాబుతో ఆమె పూర్తిస్థాయిలో కుమ్మక్కు అయ్యారనేందుకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావా లని వారు ప్రశ్నిస్తున్నారు. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు చేతిలో వైఎస్ షర్మిల కీలు బొమ్మలా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. షర్మిల మాటలు వైఎస్సార్ కుమార్తెల లేవని విమర్శించారు.సొంత అన్న అనే అనుబంధం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో కలిసి షర్మిల చేసే కుట్రలు చూసి, స్వర్గంలో వైఎస్సార్ కూడా బాధపడతారని అన్నారు. షర్మిలలో అడుగడుగునా స్వార్థం కనిపిస్తుందని దుయ్యబట్టారు.చంద్రబాబు అడుగుజాడల్లో షర్మిల నడుస్తున్నారని అన్నారు వరుదు కళ్యాణి. ఈడీ కేసుల్లో భారతి ఆస్తులు కూడా జప్తు చేశారని చెప్పారు. నాడు కేసుల్లో వైఎస్సార్ పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చిందని.. అయితే ఆనాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా పోరాడి వైఎస్సార్ పేరును తొలగించారని ప్రస్తావించారు. తప్పుడు మార్గంలో షేర్లు బదిలీ చేశారని జగన్ కోర్టుకు వెళ్ళారని, షర్మిల అండ్ కో చేసే కీడు నుంచి తప్పించుకోడానికి మాత్రమే ఆయన కోర్టుకు వెళ్లారని స్పష్టం చేశారు.చదవండి:షర్మిలకు మానవత్వం ఉందా..?: టీజేఆర్ సుధాకర్‌బాబు‘జగన్ బెయిల్ రద్దు అయితే లక్షల కుటుంబాలు రోడ్డున పడేవి. సొంత అన్న కోసం ఇంత దారుణంగా ఎవరైనా మాట్లాడుతారా? రక్తం పంచుకొని పుట్టిన అన్న కోసం ఇలా మాట్లాడటం దుర్మార్గం. మహిళలను గొప్పగా చూసే వ్యక్తి వైఎస్ జగన్. షర్మిల చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఎవరూ నమ్మరు. 2019లో షర్మిల అధికారంలోకి తీసుకొస్తే.. 2014లో ఎందుకు అధికారానికి దూరం అయ్యాం. షర్మిల ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు కనుసన్నల్లో నడవడం దుర్మాగం. వైఎస్సార్ వారసత్వన్ని నిలబెట్టిన వ్యక్తి జగన్. పుట్టింటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత షర్మిలపై ఉంది. షర్మిల చంద్రబాబు కబంద హస్తాల నుంచి బయటకు రావాలి’ అని వరుదు కళ్యాణి తెలిపారు. -
Chandrababu: ఏమిటో.. అవన్నీ సిగ్గుపడాల్సిన విషయాలు కావట!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరే వేరుగా ఉంటుంది. అసత్యాలను సమర్ధంగా, అలవోకగా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అని ఎవరైనా ఒప్పుకోవల్సిందే. 2024 ఎన్నికలలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలను మాయ చేసిన చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అత్యాచారాలు, హత్యలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నా, వాటి గురించి ప్రస్తావించడం లేదు .పలు గ్రామాలలో డయేరియా వ్యాపిస్తున్నా, దానిపై ఆయన సీరియస్‌గా స్పందించడం లేదు. ప్రస్తుతం ఆయనకు మెయిన్ సబ్జెక్ట్ ఏమిటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన సోదరి షర్మిల మధ్య జరుగుతున్న పరిణామాలు వివాదంగా కనిపిస్తుంది. తనకు సంబంధం లేదంటూనే ఆయన చేయవలసిన విమర్శలన్నీ చేశారు. పైగా అన్నిటిని మించి జగన్‌కు సమాధానం చెప్పవలసి రావడం ఆయనకు సిగ్గు అనిపిస్తోందట. తల్లి, చెల్లిని జగన్ రోడ్డుపైకి లాగారట. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో చూడండి. షర్మిల తన సోదరుడు జగన్ బెయిల్ రద్దు అయినా ఫర్వాలదన్నట్లుగా వ్యవహరిస్తుంటే, ఆమెకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు. సడన్‌గా షర్మిల మీద ఆయనకు సానుభూతి ఏర్పడింది. ఆమె తన రాజకీయ ట్రాప్‌లో నుంచి జారి పోకుండా, ఆమెను అడ్డం పెట్టుకుని కధ నడిపిస్తూ, ఇతర ముఖ్యమైన అంశాలను డైవర్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. మాజీ మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాదానాలు చెప్పగలిగితే , అవి కన్విన్సింగ్‌గా ఉంటే కచ్చితంగా చంద్రబాబు ఎవరికి సిగ్గుపడనవసరం లేదు. ఒకవైపు జగన్‌పై కుట్రలు చేస్తూ, ఇంకో వైపు ఏమీ ఎరగనట్లుగా నటించడం చంద్రబాబు అర్ట్గా చెప్పాలి. ఆయన చేసిన ఒక వ్యాఖ్యను గమనించండి. ఆస్తి ఇవ్వడానికి తల్లి, చెల్లికి కండిషన్లు పెట్టే జగన్, ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి షరతులు పెడతారో అని ఆయన అన్నారని టీడీపీ మీడియా పేర్కొంది. ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తానని ఊహించలేదు. ఇవేం చిల్లర రాజకీయాలు? అలాంటి వారికి సమాధానం చెప్పడానికి సిగ్గు అనిపిస్తోందని ఆయన అంటున్నారు.సిగ్గుపడాల్సిన విషయం కాదటఅసలు ఎవరికి అర్దం కాని విషయం ఏమిటంటే సొంత కుటుంబంలో గత నాలుగు దశాబ్దాలుగా సాగిన ఉదంతాలపై సిగ్గు పడకుండా, జగన్ కుటుంబంలో వివాదాలపై చంద్రబాబు సిగ్గుపడడం ఏమిటో ఎవరికి అర్దం కాదు. సూపర్ సిక్స్ హామీలు అంటూ చేసిన హామీలను అమలు చేయలేకపోవడం సిగ్గుపడాల్సిన పని కాదట. మహిళాశక్తి అంటూ ప్రతి మహిళకు 1500 ఇస్తానని చెప్పి మహిళా లోకానికి ఆశపెట్టి ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం విషయమే కాదట. తల్లికి వందనం పేరుతో, నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ చిన్నపిల్ల్ని సైతం చాక్లెట్ల మాదిరి ఊరించి చివరకు ఇవ్వకుండా మోసం చేయడం సిగ్గుపడాల్సిన విషయం కాదట. షర్మిలకు జగన్ అదనంగా ఇస్తానని చెప్పిన ఆస్తులు ఇవ్వలేదని చంద్రబాబు సిగ్గుపడతారట. ఒక పక్క తానిచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు షరతులు పెడుతూ ప్రజలకు సేవ చేయడానికి జగన్ ఎలాంటి షరతులు పెడతారో అంటూ ఈయన సిగ్గు పడుతున్నారట. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను జగన్ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేసిన విషయాన్ని కప్పిపుచ్చడానికి బాబు ఎలాంటి డ్రామా ఆడుతున్నారో. చంద్రబాబు సుద్దులు చెబుతున్నారు..జగన్‌వి చిల్లర రాజకీయాలట. ప్రతిపక్షంలో ఉన్నా , అధికారపక్షంలో ఉన్నా చిల్లర విషయాల్ని సైతం తన రాజకీయాలకు వాడుకునే చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. సరే! జగన్, షర్మిల మధ్య ఏదో వివాదం నడుస్తోంది. మరి చంద్రబాబు కుటుంబంలో అసలు వివాదాలే జరగలేదా! ఆయన చేసినవి చాలా నాణ్యమైన రాజకీయాలా? లేక నాసిరకం రాజకీయాలా? అన్నవి ఆయన గత చరిత్ర చూస్తేనే తెలిసిపోతుంది కదా. 1978 కాంగ్రెస్ టికెట్ పొంది గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు నడపడం, పార్టీనుంచి సస్పెండ్ అవ్వడం, మామ ఎన్టీఆర్ మీదనే పోటీచేస్తానని తొడకొట్టి సవాల్ చేయడం, ఆ తర్వాత తుస్సుమని జారుకోవడం ఆయన దృష్టిలో ఇవేవీ చిల్లర రాజకీయాలు కాకపోవచ్చు. 1983లో కాంగ్రెస్ అభ్యర్దిగా ఘోర పరాజయం తర్వాత తన భార్యను అడ్డంపెట్టుకొని మామ ఎన్టీఆర్‌పై ఒత్తిడి తెచ్చి టీడీపీలో చేరడానికి నానా తంటాలు పడడం, విలువలతో కూడిన రాజకీయమని చంద్రబాబు భావన కావచ్చు. పార్టీలోకి వచ్చాక టీడీపీలో ఒక వర్గాన్ని నడిపి చివరకు తన మామ ఎన్టీఆర్ సీఎం కుర్చీకే ఎసరు పెట్టడం అత్యంత విలువైన రాజకీయమని ఆయన ఉద్దేశ్యం. ఇందుకోసం వైస్రాయ్ హోటల్‌ను వేదికగా చేసుకోవడం, అక్కడకు తన భార్య లక్ష్మీపార్వతితో కలిసి వచ్చిన ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం చాలా ఆప్యాయతతో కూడిన రాజకీయమన్నమాట. ఇలాంటి అల్లుడిని రాజకీయంగా ఆదరిస్తానని ఎన్టీఆర్ ఊహించలేకపోయారు. ఆ విషయాన్ని ఆయనే వెల్లడిస్తూ చంద్రబాబును ఎంత ఘోరంగా దూషించారో వినడానికి సిగ్గేసింది కానీ, చంద్రబాబు రాజకీయం ప్రకారం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అప్పట్లో లక్ష్మీపార్వతిపై అభూత కల్పనలు, వదంతులు సృష్టించడం, ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని చెప్పడం ఆయన మరణం తర్వాత తానే ఎన్టీఆర్ కు అసలైన వారసుడినని అంటూ చెప్పుకొని తిరగడానికి ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన భావించి ఉండాలి. తన బావమరిది హరికృష్ణతో జరిగిన గొడవలేవీ కుటుంబ తగాదా కాదు. హరికృష్ణను ఈయన రోడ్డు పైకి లాగలేదు. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని చంద్రబాబును విమర్శించలేదు. ఇన్ని జరిగినా చంద్రబాబు మాత్రం నీతులు చెప్పగల సమర్థుడు. చెత్త రాజకీయాలు ప్రజలను కాపాడలేవని చంద్రబాబు సెలవిచ్చారు. నాలుగు నెలల్లో ఎన్ని ఘోరాలు!మంచిదే! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ చెత్తరాజకీయాలు చేయడానికి ఎక్కడా సిగ్గుపడకపోయినా ఇప్పుడు జగన్ కేవలం ప్రజాసమస్యలనే మాట్లాడుతున్నా, వాటిని చెత్త రాజకీయాలు అని ప్రచారం చేస్తున్నారు. విలువల్లేని మనుషులు సమాజానికి చేటు, కనీసం విలువలు ఉండాలి, ''బురద వేస్తాను. మీరు తుడుచుకోండి అన్నట్టుగా'' జగన్ వ్యవహరిస్తున్నారట. ఇంతకంటే అన్యాయమైన ఆరోపణ ఏమైనా ఉంటుందా? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ఈవీఎంల మాయో, మరో విధంగానో అధికారంలోకి వచ్చాక ఈ నాలుగు నెలల్లో జరిగినన్ని ఘోరాలు ఇంకెప్పుడైనా జరిగాయా? తిరుమల లడ్డూలో వాడిన నేతిలో జంతుకొవ్వు కలిసిందని దారుణైమన అబద్దపు ఆరోపణ చేయడం, ఆ తర్వాత నాలుక కరుచుకోవడం మంచి రాజకీయమవుతుందా? విలువలతో కూడిన రాజకీయమవుతుందా? చెత్త రాజకీయమవుతుందా? వరదల సమయంలో సమర్థంగా పని చేయలేక ప్రకాశం బ్యారేజ్ వద్దకు కొట్టుకొచ్చిన బోట్లను కుట్రగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం విలువలతో కూడిన రాజకీయం అవుతుందా? చెత్త రాజకీయం అవుతుందా? ఈ అంశాల్లో జగన్‌పై చంద్రబాబు వేసింది బురదగా చూడాలా? పన్నీరుగా చూడాలా? గాజు అద్దాల మేడలో కూర్చొని ఎదుటివాళ్లపై రాళ్లు వేసి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిని అడ్డం పెట్టుకొని ఎంతసేపూ రాజకీయ ప్రత్యర్ధులపై బురద చల్లడం , డైవర్షన్ రాజకీయాలు చేయడం ఇవన్నీ నీచ రాజకీయాల కిందకు వస్తాయా? లేక స్వచ్ఛమైన రాజకీయాల కిందకు వస్తాయా ? అనేది చంద్రబాబే ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. కానీ ఆత్మతో సంబంధం లేకుండా ఎలాంటి రాజకీయాలనైనా నడపగలిగిన చంద్రబాబునుంచి విలువలతో కూడిన రాజకీయాలను ఆశించడమంటే ఇసుకనుంచి తైలం తీసినట్టే అవతుందేమో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అన్నా చెల్లెళ్ల మధ్య గొడవ.. అక్కడే మొదలైంది
-
వాళ్ళను చూసి సంస్కారం నేర్చుకో: షర్మిలకు కౌంటర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్ర చేస్తున్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఆస్తిలో కొడుకు కన్నా కూతురుకి ఎక్కువగా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఆస్తిలో కూడా షర్మిల వాటా కోరడం సమంజసమేనా అని ప్రశ్నించారు. జగన్ వ్యాపారాల్లో ఎక్కడైనా షర్మిల డైరెక్ట్‌గా ఉన్నారా అని నిలదీశారు.అందరి ఇళ్ళలో అక్క చెల్లెమ్మలు ఉన్నారని, వివాహ సమయంలో ఏదైతే ఆస్తులు ఉంటాయో అవి చెల్లెలికి ఇస్తారని తెలిపారు. వైఎస్సార్ ఆనాడు జగన్ కంటే షర్మిలకు ఎక్కువే ఇచ్చారని గుర్తు చేశారు. ఆన్న సంపాదించుకున్నాడని ఈర్ష పడి ఆమె జనంలోకి రావడం దారుణమన్నారు. బాలకృష్ణ ఇంట్లో గతంలో కాల్పులు జరిగాయని. అప్పుడు వైఎస్సార్ కక్షపూరితంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. ‘ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎవరి కుటుంబం వారిది. నీ వివాహం జరిగినప్పుడు నీకు ఆస్తులు ఇవ్వలేదా? వైఎస్సార్ సీఎం అయ్యాక కూడా నువ్వే పక్కనున్నావు. జగన్ ఎక్కడో బెంగుళూరులో ఉండేవాడు. ఆ రోజు నువ్వు వ్యాపారాలు చేసుకోవాలి అనుకుంటే ఆయన సాయం చేసేవారు. జగన్ బెంగుళూరులో ఉంటూ సాక్షి, భారతి సిమెంట్స్ పెట్టారు. ఆ తర్వాత ఆయన ఆస్తుల విలువ పెరిగి ఉండొచ్చు. నీకున్న ఆస్తుల్లో ఆయన వాటా అడిగాడా?చెల్లెల్ని పైకి తేవాలని జగన్ తాను కట్టుకున్న ఇంట్లో ఆమెకు భాగం ఇచ్చారు. నాకు సమానంగా రావాలి అంటోంది. జగన్ వ్యాపారాల్లో ఎక్కడైనా నువ్వు డైరెక్ట్‌గా ఉన్నావా? వైఎస్సార్ చనిపోయినా ఏ అవసరం లేకున్నా ప్రేమతో ఆయన దాన విక్రయం చేశారు. వైఎస్సార్ బతికుండగానే ఆస్తులు పంపకం జరిగింది. పులివెందుల, ఇడుపులపాయ భూములు ఆమెకు ఇచ్చారు.జగన్ చేసిన MOUలో క్లియర్‌గా కేసులు తేలిన తర్వాత బదిలీ చేస్తామని చెప్పారు. ఇది తప్పు, మీరు అలా బదిలీ చేసుకోకూడదని జగన్ చెప్పారు. అయినా ఆమె పెడ చెవిన పెట్టారు. విధిలేని పరిస్థితిలో ఆయన నోటీసు ఇచ్చారు. మీ చర్యల వల్ల రేపు ఆయన ఇబ్బందీ పడకూడదని ఆ నోటీసు ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే పచ్చ పత్రికలు వక్రీకరిస్తున్నారు.. కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కై జగన్‌పై కేసులు పెట్టారు. గతంలో చంద్రబాబు కుట్రల వల్లే జగన్ జైలుకు వెళ్లారు. ఆయన్ను18 నెలలు జైలో పెట్టించింది మీరు కాదా..? వారికి అంత మేలు చేసిన వ్యక్తి కుమారుడిపై అవినీతి కేసులు పెట్టింది మీరు కాదా? మీరు 53 రోజులు లోపలికి వెళితే ప్రపంచం అల్లకల్లోలం అయినట్లు మాట్లాడారు. షర్మిల వ్యాపారాలు సరిగ్గా చేసుకోకపోతే జగన్ బాధ్యుడా? తెలంగాణలో పార్టీ పెట్టి డబ్బులు పోగోట్టుకుంటే జగన్ బాధ్యుడా? తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇంతక ముందు నేను చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నా. ఏ రోజూ వారి తల్లి, చెల్లిని నేను వారింట్లో చూడలేదు. ఈ రోజు దాన విక్రయం ఇచ్చిన వ్యక్తిపై ఆరోపణలు చేసే అర్హత మీకుందా? ఆయన సంపాదించుకున్న ఆస్తిలో ప్రేమతో వాటా ఇచ్చిన వ్యక్తిపై ఎలా ఆరోపణలు చేస్తారు? షర్మిలకు నా విన్నపం. నువ్వు చేసే పనిని మరోసారి ఆలోచించుకో. చంద్రబాబు అక్క చెల్లెలకు ఈ రోజు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళు రోడ్డు మీదకు రాలేదే. వాళ్ళని చూసి సంస్కారం నేర్చుకో?ఏడాది నుంచి చూస్తున్నా. అన్నను ఇబ్బందీ పెట్టాలని చూస్తున్నావు. ఆమెనే నాకు 200 కోట్లు ఇచ్చారని చెప్తుంది. అది మీ నాన్న సంపాదించింది కాదు. ఇబ్బందిలో ఉంటే అడగడంలో తప్పు లేదు. కుటుంబాన్ని రోడ్డుకీడ్చడం ఏమిటి? చంద్రబాబు ముందు హామీలు అమలు చెయ్. అది వదిలేసి ఇలాంటి నీచ సంస్కృతికి దిగుతున్నావు. జగన్ పాపులారిటీ తట్టుకోలేక, ప్రజలకు ఏమీ చేయలేక ఇలాంటి నీచానికి దిగుతున్నావు.’ అని మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ వినాశనమే షర్మిల లక్ష్యం..
-
KSR Live Show: షర్మిల జగమొండి.. ఎవరికి తెలియని పచ్చి నిజాలు బయటపెట్టిన అనలిస్ట్ కృష్ణం రాజు
-
టీడీపీ కుట్రలో షర్మిల పావు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి,తాడేపల్లి: టీడీపీ చేసే కుట్రలో షర్మిల పావుగా మారిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి పేర్నినానితో కలిసి వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం(అక్టోబర్ 25) మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు.‘జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్,టీడీపీ కలిసి వైఎస్‌జగన్‌పై కేసు పెట్టాయి. హైకోర్టు స్టేటస్కో ఆదేశాలున్నా షర్మిల సరస్వతి పవర్ కంపెనీ షేర్లు బదలాయించారు. షేర్లను బదలాయించినందువల్లే జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించారుఆస్తుల్లో వాటా ఉంటే షర్మిలపై ఈడీ కేసులు ఎందుకు పెట్టలేదు. చెల్లిపై ప్రేమ ఉన్నందునే వైఎస్జగన్ షర్మిలకు ఎంవోయూ చేసుకున్నారు. షర్మిల ఆస్తుల కోసం పోరాడుతున్నారా’అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. వైవీసుబ్బారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. సరస్వతి సిమెంట్స్ ప్రాపర్టీ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి.అయినాసరే షేర్లు బదలాయించుకోవటం వెనుక కుట్ర ఉంది.2019 ఆగస్టులో వైఎస్జగన్, షర్మిల ఎంవోయూ రాసుకున్నారుప్రాపర్టీ చూసుకున్నాకనే షర్మిల సంతకాలు పెట్టారుజగన్ ప్రేమ అభిమానంతోనే షర్మిలకు ఆస్తులు రాసిచ్చారు.కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఇదంతా జరిగింది.ఇప్పుడు షర్మిల చేస్తున్న రాద్దాంతమంతా ఆస్తుల కోసమే అని అర్థం అవుతోంది.షర్మిలకు లీగల్ గా ఆస్తుల మీద హక్కు ఉంటే ఆమె కూడా కేసులు ఎదుర్కొనేవారు.జగన్ ఒక్కరే జైలుకు ఎందుకు వెళ్తారు?జగన్ కు వచ్చిన డివిడెండ్ నుంచి షర్మిలకు రూ.200 కోట్లు ఇచ్చారు.జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ జగన్ పెట్టుకున్న పరిశ్రమలు.వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే ఈ కంపెనీలు పెట్టుకున్నారు.అందులో షర్మిలకు వాటాలు ఉంటే అప్పుడే రాసిచ్చేవారు.షర్మిల అబద్దాలాడుతున్నారువైఎస్ జగన్ ఇంట్లో చిచ్చుపెట్టి చంద్రబాబు చలిమంట కాచుకుంటున్నారు: పేర్నినానివైఎస్సార్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారుతండ్రి ఆశయం కోసమైతే చంద్రబాబు కోసం పనిచేస్తారావైఎస్సార్ను అభిమానించేవారు ఇప్పటికీ చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారు.గత మూడు నాలుగు రోజులుగా వైఎస్‌జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు.షర్మిల తాపత్రయం అంతా ఆస్తుల కోసమే..తండ్రి ఆశయాల కోసం కానేకాదువ్యక్తిగతంగా రాసుకున్న ఉత్తరం టీడీపీ అధికారిక వెబ్సైట్లో ఎలా వచ్చింది? చంద్రబాబు అక్రమ రాజకీయాలకు ఇది నిదర్శనంకేంద్రంలో బీజేపీతో ఉంటూ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో అక్రమ బంధాన్ని కొనసాగిస్తున్నారుకాంగ్రెస్కు తాము వ్యతిరేకమని చెప్పి చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తున్నారు?రాజకీయ వింత బంధాలను ఏపీలోనే చూస్తున్నాంవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడంవెనుక జగన్ కష్టం,కార్యకర్తలే కారణంషర్మిలతో మాలాంటోళ్లు చాలామంది పని చేశాంమాలాంటి 30,40 మంది పదవులు వదులుకుని వచ్చారుటీడీపీ నుండి చాలామంది వైఎస్సార్సీపీలోకి వచ్చారుకానీ ప్రధానమైన కష్టం,నష్టం అంతా జగన్,కార్యకర్తలదేషర్మిలతో పాదయాత్ర వద్దని నేనే స్వయంగా జగన్‌తో చెప్పానుభవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని కూడా జగన్‌కి చెప్పానుకానీ నా కుటుంబంలో అలాంటివేమీ రావని జగన్ చెప్పారుకంపెనీల్లో షర్మిలకు వాటాలు ఉంటే ఆమెని కూడా డైరెక్టర్‌గా వైఎస్సార్ పెట్టేవారుఅలా జరగ లేదంటే షర్మిలకు సంబంధం లేదనే అర్థం కదాచంద్రబాబు అనవసరంగా జగన్ కుటుంబ సభ్యుల గొడవల్లో జోక్యం చేసుకుంటున్నారుజూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికలకు వాడుకుని ఎందుకు వదిలేశారు?చంద్రబాబు నైజంపై ఆయన తోడళ్లుడే పుస్తకం వేశారుఅసలు చంద్రబాబు తన తోడబుట్టినవారికి ఏం ఆస్తులు రాసిచ్చారు?చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారింది ఇదీ చదవండి: ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు షర్మిలా..? -
Jupudi: మీ తమ్ముడికి, మీ అక్క చెల్లెళ్లకి మీరు ఇచ్చిన ఆస్తి..