బాబు పన్నాగం.. రాజకీయ శిఖండిలా షర్మిల, సునీత | Analysis Story: Sunitha Sharmila Chandrababu U Turn Politics On YS Viveka Assassination | Sakshi
Sakshi News home page

బాబు పన్నాగం.. రాజకీయ శిఖండిలా షర్మిల, సునీత

Published Sat, Apr 6 2024 1:58 PM | Last Updated on Sat, Apr 6 2024 2:58 PM

Analysis Story: Sunitha Sharmila Chandrababu U Turn Politics On YS Viveka Assassination - Sakshi

తండ్రి హత్య ద్వారా రాజకీయంగా ఎదగాలన్న కుతంత్రం కూతురిది. సొంత బాబాయి హత్యను వ్యక్తిగత లాభంకోసం వాడుకోవాలన్నది మరొకరి వ్యూహం. ఇద్దరు ఆడవాళ్లను అడ్డంపెట్టుకుని రాజకీయం చేయాలన్నది చంద్రబాబు పన్నాగం. ఇదీ వివేకా హత్య చుట్టూ జరుగుతున్న రాజకీయ రాక్షస క్రీడ.

నర్రెడ్డి సునీతారెడ్డి సంచలనం రేపిన వివేకానందరెడ్డి హత్య తరువాత వార్తల్లో బాగా వినిపించిన పేరు. వివేకా చనిపోయిన రోజు నుంచి గత ఐదేళ్లుగా సునీతారెడ్డి చెబుతున్న మాటలు.. .చేస్తున్న ప్రకటనలు ఆమెపై అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. వివేకా హత్య తరువాత సంఘటనా స్థలంలో దొరికిన లెటర్ దాచిపెట్టడం మొదలు తన తండ్రితో సునీతారెడ్డికి ఉన్న విభేధాలు  ఆమెపై అనుమానాలు మరింత బలపడేలా చేశాయి.

అబద్ధం సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి
తన తండ్రి రెండో వివాహం చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న సునీతారెడ్డి చాలాకాలంగా వివేకాతో మాట్లాడటం మానేశారు. ఆ తరువాత జరిగిన గొడవల కారణంగానే వివేకా హత్య జరిగిందనే  అనుమానాలూ ఉన్నాయి. ఇక వివేకా హత్య కేసు విచారణ సందర్భంగా సీబీఐలోని కొంతమంది అధికారులతో కలిసి సునీతారెడ్డి సాక్ష్యులను బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. అబద్ధం సాక్ష్యం చెప్పాలని సునీతా దంపతులు తనపై ఒత్తిడి తెచ్చినట్లు వివేకా పీఏ కృష్ణారెడ్డి ఏకంగా పోలీసులకు, కోర్టుకే ఫిర్యాదు చేశారు.

హత్య కేసును మరొకరిపై నెట్టేసేందుకు
ఇక తన తండ్రి హత్య వెనక టీడీపీ నాయకులున్నారని ఆరోపించిన సునీతారెడ్డి తరువాతి కాలంలో అదే టీడీపీతో కలిసి పనిచేయడంతో ఆమెపై అనుమానాలు మరింత బలపడ్డాయి. తన తండ్రిని చంపానని బాహాటంగానే ప్రకటించిన దస్తగిరికి అనుకూలంగా సునీతారెడ్డి వ్యవహరించడంపై కుటుంబ సభ్యులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక తన తప్పు బయటపడకుండా ఉండేందుకే సునీతారెడ్డి వివేకా హత్య కేసును మరొకరిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే అవినాష్‌రెడ్డిని ఇరికించే ప్రయత్నం జరుగుతోందనేది స్పష్టమవుతోంది.

వివేకా హత్య జరిగిన తరువాత  మీడియాతో మాట్లాడిన సునీతారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులపై అనుమానాలు వ్యక్తం చేశారు. హత్య తరువాత సరిగ్గా 12రోజులకు ప్రెస్‌మీట్ పెట్టిన సునీతారెడ్డి.. హత్యకు గల కారణాలపై సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చిన ఆమె టీడీపీ నాయకులే హత్యచేశారని బలంగా వాదించారు. తన తండ్రి హత్య వల్ల లబ్ది పొందేది టీడీపీయేనని సునీతారెడ్డి కారణాలతో సహా సోదాహరణంగా వివరించారు.

వివేకా హత్య వెనక టీడీపీ నేతలు: సునీతారెడ్డి 
టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవి ఈ హత్య వెనక ఉన్నారని అధికార తెలుగుదేశం పార్టీ ఆ ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నిస్తోందని సునీతారెడ్డి ఆరోపించారు. ఆదినారాయణరెడ్డిని కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, దీని వెనక పూర్తిస్థాయి కుట్ర జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు సునీతారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం తన తండ్రిహత్య కేసు విచారణను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులెవరికైనా హత్యతో సంబంధం ఉంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. వారి పేరు ప్రకటించేవారని అన్నారు. కేవలం రాజకీయ లబ్దికోసమే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేసు విచారణను వాడుకుంటోందని ఆమె అన్నారు. వివేకా హంతకులను పట్టుకునేందుకు కాకుండాం తమ కుటుంబ సభ్యులను ఇరికించే విధంగా విచారణ సాగుతోందని విమర్శించారు. 

అవినాష్‌ గెలుపు కోసం వివేకా ప్రయత్నం
ఇక తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే విషయాన్ని సైతం సునీతారెడ్డి తీవ్రంగా ఖండించారు. తన తండ్రి వివేకానందరెడ్డి ఎన్నికల్లో అవినాష్‌రెడ్డిని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారని సునీతారెడ్డి స్పష్టం చేశారు. కేసును తప్పుదారి పట్టించడంతోపాటు రాజకీయంగా లబ్దిపొందేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం వేసిన సిట్‌ నిందితులను పట్టుకోకుండా కేవలం తమ బంధువులను మాత్రమే విచారించడం వెనక కుట్ర జరుగుతోందనే అనుమానాలున్నాయన్నారు. మేము అనుమానాలు వ్యక్తం చేసినా కొంతమందిని టీడీపీ ప్రభుత్వంలోని సిట్ అధికారులు కనీసం విచారించలేదని అప్పట్లో ఆరోపించడం సంచలనం కలిగించింది.

వివేకానందరెడ్డిని తెలుగుదేశం నేతలే హత్య చేసి ఉంటారని పలుమార్లు ఆరోపించిన సునీతారెడ్డి తరువాతి కాలంలో మాట మార్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖీఈ్కకి అనుకూలంగా ఆమె ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. చంద్రబాబుతో కలిసిం సొంత కుటుంబంపై కత్తులు దూస్తున్నారు. 

కాలం గడుస్తుంటే సునీతలో మార్పు
వివేకా హత్యకు సంబంధించి ఎవరు హత్య చేశారుం ఎందుకు హత్యచేశారు అనే విషయంపై అందరికన్నా సునీతారెడ్డికే ఎక్కువ క్లారిటీ ఉంది. అందుకే ఆమె చాలాసార్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీం వివేకా హత్య గురించి కథలు కథలుగా చెప్పారు. కాలం గడుస్తున్నకొద్దీ సునీతారెడ్డి ఆలోచనల్లో పెను మార్పు రాసాగింది. సీబీఐ విచారణ ప్రారంభమైన తరువాత సునీతారెడ్డి పూర్తిగా మారిపోయారు. వివేకాను తామే కిరాతకంగా హత్యచేశామని ప్రకటించిన దస్తగిరి అండ్‌ బ్యాచ్‌కు సహకరించాలని నిర్ణయించుకున్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారకుండానే ముందస్తు బెయిల్‌కు అప్లై చేస్తే సునీతారెడ్డి కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

ఆ మాట ఎందుకు అడగలేదు
వివేకాను నరికానని మీడియా ముందు ప్రగల్భాలు పలికిన దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని సునీతారెడ్డి కనీసం ఒక్కసారి కూడా ఎందుకు అడగలేదు. పైగా ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని ఇరికించాలని సునీతారెడ్డి దంపతులు సాక్ష్యులను బెదిరించడం ప్రారంభించారు. అవినాష్‌రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడాలని సీబీఐతో కలిసి వివేకా పీఏ కృష్ణారెడ్డిని హింసించారు.  

బాబుకు రాజకీయ లబ్ది కోసం..
వివేకా హత్య కేసులో చంద్రబాబు కుట్రపై ఆధారాలతో సహా ప్రెస్‌మీట్ పెట్టిన సునీతారెడ్డి తరువాతి కాలంలో చంద్ర బాబు చేతిలో పావుగా మారిపోయింది. చంద్రబాబు ఎజెండాను అమలు చేసే విధంగా రాజకీయ విమర్శలు చేయడంం చంద్రబాబు మనుషుల సహాయంతో కోర్టుల్లో పిటిషన్‌లు వేయడం ప్రారంభించింది. వివేకా హత్య కేసులో నిందితులకు శిక్షపడటం కన్నాం ఈ కేసు ద్వారా చంద్రబాబుకు రాజకీయ లబ్ది చేకూర్చాలన్న ఏకైకా అజెండా సునీతారెడ్డిలో బాగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు సునీతారెడ్డి రాజకీయ ప్రకటనలు ప్రారంభించించి వైఎస్సార్సీపీకి ఓటువెయొద్దంటూ అనే స్థాయికి ప్రచారం చేస్తోంది. 

లేఖను ఎందుకు దాచిపెట్టారు?
వివేకా హత్యకేసులో టీడీపీ కుట్ర ఉందని ముందుగా ప్రకటించిన సునీతా తరువాతి కాలంలో ప్లేటు ఫిరాయించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా హత్య జరిగిన తరువాత అక్కడే దొరికిన లేఖను నర్రెడ్డి సునీతారెడ్డి దంపతులు ఎందుకు దాచిపెట్టారనే దానిపై ఇప్పటికీ సరైన సమాధానం లేదు. ఈ లేఖ విషయం ముందుగానే పోలీసులకు తెలిస్తేంకేసు విచారణ మరో విధంగా ఉండేదని స్పష్టమవుతోంది. హత్యను గుండెపోటుగా మలచడానికే ఈ లేఖను దాచిపెట్టారా అనే అనుమానాలు ముందునుంచీ ఉన్నాయి.

ఆస్తి కోసమే హత్యా?
ఇక వివేకా రెండో వివాహాన్ని వ్యతిరేకించిన సునీతారెడ్డి దంపతులు ఆస్తికోసమే ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ కేసులో అవినాష్‌రెడ్డిని ఇరికించేందుకు కుట్ర చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఆకాంక్షతోనే సునీతారెడ్డి తన తండ్రి కేసును వాడుకుంటున్నారనే ఆరోపణలు చాలారోజుల నుంచే వినిపిస్తోంది. ముఖ్యంగా తన తండ్రి కేసును టీడీపీకి అనుకూలంగా మార్చడం ద్వారాం భవిష్యత్తులో రాజకీయ లబ్ది పొందాలన్నది సునీతారెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌.. సునీతారెడ్డి నోట పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

వివేకా హత్య కేసును రాజకీయం చేయాలని యత్నిస్తున్న సునీతారెడ్డికి.. ఆమె సోదరి షర్మిల జత కలిశారు. తెలంగాణాలో రాజకీయ పార్టీ పెట్టి ఘోర వైఫల్యాలను మూటగట్టుకున్న షర్మిలం వివేకా కేసు ద్వారా ఏపీలో పొలిటికల్ ఎంట్రీ కోసం పావులు కదిపారు. సంబంధంలేని వ్యక్తులపై బురదజల్లి వ్యక్తిగత వైషమ్యాలను రెచ్చగొట్టి లబ్దిపొందాలని యత్నిస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం వ్యక్తిగత ఆకాంక్షల నిమిత్తంం ఒక హత్యకేసును ఏవిధంగా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చో వివేకా కేసు మంచి ఉదాహరణ.

సునీతతో చేతులు కలిపి..
తన తండ్రి హత్యకేసును తనకు అనుకూలంగా మార్చేందుకు అబద్ధాలు, అసత్యాలు పలుకుతున్న సునీతారెడ్డికి అనుకూలంగా అవతారం ఎత్తిన షర్మిల ప్రకటనలు చేయడం ప్రారంభించారు. రాజకీయ కారణాలతో తన అన్నతో విభేధించిన షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టి ఘోర వైఫల్యాలను మూటగట్టుకున్నారు. ఇక తెలంగాణాలో రాజకీయ దుకాణం నడపలేనని నిర్ణయించికున్న ఆమెం ఏపీలో ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా సునీతారెడ్డితో కలిసి తన కుటుంబంపైనే విమర్శలు చేయడం ప్రారంభించారు.

ముఖ్యంగా కడప ఎంపీ సీటుపై కన్నేసిన షర్మిల తన సోదరుడు అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే తతంగం నడిపారు. కడప ఎంపీ సీటు విషయంలో చంద్రబాబు సహకారం అందిస్తారనే నమ్మకంతో ఏకంగా తన అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేశారు. ఓవైపు విచారణ జరగుతుండగానే వివేకానందరెడ్డిని హత్య చేసింది.. అవినాష్‌రెడ్డి అంటూ తీర్పు చెప్పినట్లు చెప్పింది షర్మిల. రాజకీయ ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టిన షర్మిలం తన తండ్రిపై చార్జిషీటు వేసిన కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

పైగా వివేకా హత్యకు సంబంధించి గతంలో చాలాసార్లు అవినాష్‌రెడ్డికి అనుకూలంగా మాట్లాడిన షర్మిల ఇప్పుడు మాటమార్చటంపై.. జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంపై దశాబ్దాలుగా విషం చిమ్ముతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి అధినేతలు రామోజీ, రాధాకృష్ణతో పాటు చంద్రాబాబులతో షర్మిల స్నేహం చేయడం ఆమె తన విలువలను తాకట్టు పెట్టారనే చర్చ జరుగుతోంది.  

రాజకీయంగా ఎదిగేందుకే విమర్శలు
విలువలు, నైతికత ద్వారా రాజకీయాలకే వన్నె తెచ్చిన వైఎస్సార్ కుమార్తె ఇప్పుడు ఇలా దిగజారడం పెద్దాయన అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. రాజకీయంగా ఎదిగేందుకు తన సొంత అన్నపైనే కత్తిగట్టిన చెల్లెలుగా షర్మిల చరిత్రపుటల్లో మిగిలిపోతుందనే విమర్శ జగన్ అభిమానులను సైతం ఆవేదనకు గురిచేస్తోంది. రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయి అనే మాటకు షర్మిల చేస్తున్న రాజకీయాలే ఓ చక్కటి ఉదాహరణ. అందుకే హత్య కేసును వాడుకుని ఎదగాలన్నం షర్మిల ఆకాంక్ష ఆమె రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతుందనే చర్చ జరుగుతోంది.

చంద్రబాబే ఈ కేసులో అసలైన సూత్రధారి!
వివేకా కేసులో అత్యంత అనుమానాస్పద వ్యక్తి చంద్రబాబునాయుడు. హత్య సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. రాజకీయంగా తాను లబ్దిపొందెందుకు ఎందరో పాత్రధారులను సృష్టించిన చంద్రబాబే ఈ కేసులో అసలైన సూత్రధారి. ఇక వివేకా హత్య కేసులో ప్రథమ ముద్దాయిగా ఉండాల్సిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కేసు ద్వారా రాజకీయ లబ్దికోసం ఇప్పటికీ కూడా నానా కుట్రలు చేస్తున్నాడు.

కేసును తప్పుదోవ పట్టించాడు
ముఖ్యంగా హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు.. ఈ కేసు నుంచి అసలు హంతకులను తప్పించే కుతంత్రాలు చేశాడు. హత్య జరిగిన తరువాత సిట్ పేరుతో కాలయాపన చేసిం రాజకీయ లబ్దిపొందేందుకు ప్రయత్నించాడు. వివేకా హత్యకేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవిలను విచారించకుండా అడ్డుకున్నదీ చంద్రబాబే. అసలు హంతకులు దొరకకుండాం కాలయాపన చేస్తూ వైఎస్ కుటుంబంపై ఆరోపణలు చేశాడు. తన రాజకీయ లబ్దికోసమే వివేకాను హత్యచేయించాడనే ఆరోపణలు వచ్చినా అధికారం అడ్డుపెట్టుకుని చంద్రబాబు కేసును తప్పుదోవ పట్టించాడు. 

ఇక అధికారం పోయాక సీబీఐలోని కొంతమంది అధికారులను ప్రలోభపెట్టిన చంద్రబాబు కేసును తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన బాబుం మెల్లిగా కేసులో అమయాకుల పేర్లు వచ్చేలా కుట్రలు చేశాడు. రాజకీయ ఆశచూపి సునీతారెడ్డిని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకున్నాడనే విమర్శలున్నాయి. అందుకే చంద్రబాబు లాయర్ల ద్వారానే సునీతారెడ్డి కోర్టుల్లో పిటిషన్‌లు వేసినట్లు స్పష్టమైంది. రఘురామకృష్ణం రాజు ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా ఈ కేసులో కుట్ర జరిగినట్లు ఇప్పటికే పలుమార్లు స్పష్టమైంది. 

ఈ కేసులో అటు సునీతారెడ్డిని ఇటు షర్మిల ద్వారా తన రాజకీయ ఎజెండాను నడిపిస్తున్న చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తుండటంతో మరింత దిగజారాడు. ఇప్పుడు హత్యా రాజకీయాలంటూ ప్రకటనలు చేయడంం అదే మాటను పదే పదే సునితా షర్మిలతో పలికించడం ఈ కుట్రల వెనక ఉన్న చంద్రబాబు నిజ స్వరూపాన్ని బయటపెడుతోంది. అందుకే వివేకా కేసులో సునీతారెడ్డి, షర్మిల లాంటి పాత్రధారులెంతమంది ఉన్నా అసలు సూత్రధారి మాత్రం చంద్రాబాబే. నీచపు హత్యారాజకీయాల చదరంగంలో పావులెవరో పాపాత్ములెవరో లోకం చూస్తూనే ఉంది. అంతా గ్రహిస్తూనే ఉంది. ఎన్నికల్లో ఓటు రూపంలో సమాధానం చెప్పెందుకు జనవాహిని సంసిద్ధంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement