ys avinash reddy
-
పోలవరం ఎత్తును తగ్గించవద్దు: లోక్‌సభలో వైఎస్సార్సీపీ
ఢిల్లీః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని లోక్‌సభ వేదికగా వైఎస్సార్సీపీ మరోసారి ఖండించింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దని, ఒరిజినల్ ఎత్తు ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్‌సభలో జలశక్తి శాఖ పద్దులపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున చర్చలో అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు పలు ప్రాజెక్టుల అంశాలను కూడా అవినాష్ లేవనెత్తారు.‘ ఇటీవల రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్రం ఈసీని తిరస్కరించింది. రాయలసీమ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులకోసం బాబు ప్రభుత్వం తగిన ఒత్తిడి చేయలేదు. వైఎస్ జగన్ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు మెజారిటీ పనులు పూర్తయ్యాయి. రాయలసీమ ఎత్తిపోతలతో 800 అడుగుల వద్ద రోజు మూడు టిఎంసిల నీరు తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. లేదంటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుంది. ఓవైపు శ్రీశైలంలో 798 అడుగుల వద్ద తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగుల వద్ద పాలమూరు- రంగారెడ్డి , డిండి ప్రాజెక్టులకు నీరు తరలిస్తున్నారుఈ పరిస్థితుల్లో 880 అడుగుల వరకు నీరు ఎప్పుడు వస్తుంది...రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లెప్పుడు వస్తాయి. గుండ్రేవుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల రిపేర్లు చేపట్టాలి. ఏపీకి జలజీవన్ మిషన్ కింద నిధులను పెంచాలి. నంద్యాల - కల్వకుర్తి మధ్య రివర్ ఓవర్ బ్రిడ్జితోపాటు ఆనకట్ట నిర్మించాలి’ అని అవినాష్ రెడ్డి కోరారు. -
‘కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి’
సాక్షి,వైఎస్సార్‌జిల్లా: వైఎస్సార్సీసీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తమ బాగోతం బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుంది. అందుకే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. దమ్ముంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం (ఫిబ్రవరి24) ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం తర్వాత సభలో ఉంది తామేనని, కాబట్టి ప్రజాగళం వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిపక్షం ఉండేది కేవలం వైఎస్సార్సీపీనే. 11 సీట్లంటున్నారు. కానీ.. 40 శాతం ఓట్లు వచ్చాయనేది మర్చిపోతున్నారా?. నలుగురు ఎంపీలున్నారు..11 మంది ఎమ్మెల్యేలున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండు నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తామంటే ఎలా? అదే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ముఖ్యమంత్రి గంట మాట్లాడితే 40 నిమిషాలు ప్రధాన ప్రతిపక్షనేత మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రజల గొంతుక అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వకపోతే ప్రజల సమస్యలను వినిపించే అవకాశమే ఉండదు. వైఎస్ జగన్‌ను అవమానిస్తున్నామని స్పీకర్, చంద్రబాబు అనుకుంటున్నారు కానీ..ప్రజలను అవమానిస్తున్నారనేది మర్చిపోతున్నారు.ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతోనే మేం అసెంబ్లీకి వెళ్లాం. ప్రధాన ప్రతిపక్షనేతగా జగన్ వెళ్తే వీళ్లకి ఏ రకమైన సినిమా కనిపిస్తుందో వాళ్లకు తెలుసు. వాళ్లిచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు.ఇదే అంశంపై వైఎస్ జగన్ మాట్లాడటం మొదలు పెడితే వాళ్లు సమాధానం చెప్పలేరు. దాని నుంచి తప్పించుకోవడం కోసమే ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వకుండా ఇలా వ్యవహరిస్తున్నారు.నిజంగా పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందనే ముచ్చట పడితే కూటమి గాలిలో 65 వేల ఓట్లతో బీటెక్ రవి ఓడిపోయాడు.వాళ్లకు అంత ముచ్చటగా ఉంటే..పులివెందుల, కుప్పం, మంగళగిరి, పిఠాపురం నాలుగు చోట్లా రాజీనామాలు చేయండి. ఎన్నికలకు వెళ్దాం.ఈ తొమ్మిది నెలల పాలనకు రిఫరెండంగా, సూపర్ సిక్స్ పాలనకు రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లి చూసుకుందాం. ప్రజలేం తీర్పు ఇస్తారో చూద్దాం..కాకమ్మ కబుర్లు, దద్దమ్మ మాటలు మాట్లాడొద్దు’ అని కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో విరుచుకు పడ్డారు. -
జగన్ అసెంబ్లీ వస్తే చంద్రబాబుకు వణుకు
-
ఓటరు దేవుడా..అని దండం పెట్టి మోసం చేశారు: వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి,వైఎస్సార్‌జిల్లా: కూటమి ప్రభుత్వం అన్ని విధాల విఫలం అవుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. శనివారం(ఫిబ్రవరి8) వైఎస్సార్ జిల్లా జెడ్పీ మీటింగ్ అనంతరం అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రైతులకు రూ.20వేలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చింది లేదు. మా అధినేత వైఎస్ జగన్ 9 గంటల విద్యుత్ సరఫరా ఇస్తే దాన్ని 7 గంటలకు కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే రోడ్లెక్కుతాం.రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. పంటల బీమా లేదు. కనీసం బీమా ప్రీమియం కూడా రైతులే కట్టుకోవాల్సి వస్తోంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ దరఖాస్తులు వేలల్లో పెండింగులో ఉన్నాయి. వాటినీ మంజూరు చేయడం లేదు. గతంలో ఉన్న పథకాలూ అమలు చేయడం లేదు. గొప్పలు చెప్పుకున్న సూపర్ సిక్స్ అమలు అంతకన్నా లేదు.కానీ ఈ 9 నెలల్లో 1.40లక్షల కోట్లు అప్పు మాత్రం తెచ్చారు..ఎక్కడ ఖర్చు చేశారో తెలియదు. చంద్రబాబు అనుభవం ఉన్న ఆర్థిక వేత్త అని చెప్పుకుంటారు. ఆయన కచ్చితంగా సూపర్ సిక్స్ అమలు చేసి తీరాల్సిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే ఆనాడు హామీలు ఇచ్చారు కదా. హామీలు అమలు చేయాల్సిన బాధ్యత వారిదే. ఆనాడు అలవిగాని హామీలు ఇచ్చి..ఓటరు దేవుడా అంటూ దండాలు పెట్టి ఇప్పుడు ఘోరంగా మోసం చేస్తున్నారు.ప్రభుత్వ పథకాలు లేక ప్రజల చేతుల్లో డబ్బు లేక వారి కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పరిషత్ సమావేశానికి కూటమి ప్రజాప్రతినిధులు కాదు..చివరికి కలెక్టర్,జేసీలు కూడా హాజరు కాలేదు. మేం అభ్యంతరం తెలిపితే అరగంట తర్వాత జేసీ వచ్చారు. ఇది తీవ్రమైన బాధ్యతారాహిత్యం. ఒక జిల్లా అత్యున్నతస్థాయి సమావేశానికి మంత్రులు సరే..కనీసం కలెక్టర్ కూడా రాలేదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నా’అని అవినాష్‌రెడ్డి అన్నారు. -
శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న అవినాష్ రెడ్డి
-
వైఎస్ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సంబంధం లేని వ్యక్తులను కూడా నిందితులుగా చేరుస్తూ అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా పులివెందుల(Pulivendula)లో కడప ఎంపీ వైఎ అవినాష్‌రెడ్డి(YS Avinash Reddy) పీఏ రాఘవరెడ్డి(PA Raghava Reddy)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో తనకు సంబంధం లేదంటున్నా రాఘవరెడ్డిని నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు.వర్రా రవీంద్రారెడ్డి కేసులో నిందుతుల జాబితాకు అంతే లేకుండా పోయింది. ఇప్పటికే 112 మందికి పైగా నిందితులను చేర్చగా.. తాజాగా ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బండి రాఘవరెడ్డిని నిందితునిగా చేర్చారు.దీంతో రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టు ఆయనకు నేడు బెయిల్ నిరాకరించడంతో పోలీసులు వెంటనే అతని ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకుని పులివెందుల అర్బన్ పీఎస్‌కు తరలించారు. ఇప్పటికే పలు దఫాలుగా రాఘవరెడ్డిని పులివెందుల డిఎస్పీ విచారణ చేశారు.ఇదీ చదవండి: సీజ్ ద షిప్.. సర్వం లాస్!ముందస్తు బెయిల్ అంశం కోర్టులో పెండింగులో ఉన్నప్పుడు ఆయన పోలీసులు పిలిచినప్పుడల్లా విచారణకు హాజరయ్యారు. కోర్టు చెప్పిన మేరకు విచారణకు సహకరించారు. అయినా పోలీసులు బెయిల్ పిటిషన్ రద్దు కాగానే వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వాస్తవంగా వర్రా రవీంద్రారెడ్డి కేసుకు తనకు సబంధం లేదని రాఘవరెడ్డి పలుమార్లు చెప్తున్నారు. అయితే వర్రా రవీంద్రారెడ్డి పెట్టే పోస్టులకు కంటెంట్ రాఘవరెడ్డే ఇస్తున్నాడంటూ కేసు నమోదు చేశారు.వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన వాగ్మూలంలో ఈ వివరాలు చెప్పారని పోలీసులు అంటుండగా.. వర్రా రవీంద్రారెడ్డి తనను చిత్రహింసలకు గురిచేసి తనతో తప్పుడు వాగ్మూలం రాయించుకున్నారని మేజిస్ట్రేట్ ముందు చెప్పారు. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి అరెస్ట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో వైపు ఈ కేసులో నిందితుల జాబితా ఎంతవరకూ పెంచుకుంటూ పోతారో అర్థం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. -
చంద్రబాబు చావు తెలివితేటలు.. ఏరు దాటాక నక్క నాటకాలు
-
విద్యుత్ అధికారికి YS అవినాష్ రెడ్డి వినతి పత్రం.. దీనిపై చర్యలు తీసుకోండి
-
పులివెందులలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం
-
YS అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
కడపలో పోలీసుల ఓవరాక్షన్.. అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, వైఎస్సార్: కూటమి సర్కార్ పాలనలో వైఎస్సార్సీపీ నేతల టార్గెట్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు తాము ఎన్నికలను బహిష్కరించామని చెప్పినా అరెస్ట్‌ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.వైఎస్సార్ జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు మోహరించాయి. ఎక్కడికక్కడ వీఆర్వోల నుంచి వైఎస్సార్సీపీ మద్దతుదారులైన రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చారు. చక్రాయపేట, వేముల, వేంపల్లెల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వేంపల్లెలో నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్దమైన వీఆర్వోలను మండల టీడీపీ నాయకుడి కుమారుడు బూతు పురాణం అందుకున్నారు.జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియంలో వీఆర్వోలందరినీ ప్రత్యేక వాహనంలో ఎక్కించుకుని టీడీపీ నేతలు సమయం ముగిసేంతవరకు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. అలా చేయడంపై ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు.నీటి తీరువా బకాయిలు ఉంటే పోటీకి నో..సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలంటే నీటి తీరువా బకాయిలు ఉండకూడదు. ఎన్నికల్లో పోటీ చేసే వారు నీటి తీరువా బకాయిలు లేవని వీఆర్వోల నుంచి నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకోవాలి. సాధారణంగా నో డ్యూ సర్టిఫికెట్లను ఆ సాగునీటి సంఘాల పరిధిలోని గ్రామ సచివాలయాల్లో వీఆర్వోలు జారీ చేస్తారు.అయితే ఇప్పుడు సాగు నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో నో డ్యూ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని వీఆర్వోలకు కూటమి ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారు. దాంతో నో డ్యూ సర్టిఫికెట్ల కోసం ఆ మండల తహసిల్దార్ కార్యాలయాలకు వెళ్లిన ఇతర పార్టీల మద్దతుదారులపై పోలీసుల సమక్షంలోనే కూటమి శ్రేణులు దాడులు చేసి.. భయోత్పాతానికి గురిచేస్తున్నాయి.ఇక, రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. సాగు నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను తమ మద్దతుదారులకే కట్టబెట్టి, దోచుకోవాలనే దురాలోచనతో అరాచకాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే ‘చేతులెత్తి ఎన్నుకునే విధానం’ ద్వారా వాటికి ఎన్నికలు నిర్వహించేలా చట్టాన్ని సవరించింది. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఏకాభిప్రాయం వ్యక్తం కాని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.ఇతర పార్టీల మద్దతుదారులు పోటీకి సిద్ధమైతే రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అలా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది గుర్తెరిగిన కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెరతీసింది. ఇతర పార్టీల మద్దతుదారులు సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుని కుట్ర చేస్తోంది. -
కడపలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
చంద్రబాబు పై అవినాష్ రెడ్డి ఫైర్
-
బీటెక్ రవి హల్చల్.. అధికారుల అండతో ఓవరాక్షన్
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి అరాచక పాలన కొనసాగుతోంది. టీడీపీ నేతలు కొందరు అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. తాజాగా నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో బీటెక్ రవి హల్ చల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా బీటెక్ రవి రాజకీయం చేస్తుండటంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోంది. పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో టీడీపీ, కూటమి నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. పులివెందులలో నీటి పన్ను నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారు. గిడ్డంగివారిపల్లిలో బీటెక్ రవి తన అనుచరులతో కలిసి నో డ్యూ సర్టిఫికెట్లను చింపివేశారు. అలాగే, ఇనగలూరులో అధికారాలను అడ్డుపెట్టుకుని నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. నియోజకవర్గంలో తన అనుచరులను అడ్డుపెట్టుకుని బీటెక్ రవి హల్ చల్ చేస్తున్నాడు.ఇక, నో డ్యూ సర్టిఫికెట్ ఉంటేనే నామినేషన్ వేసేందుకు అర్హత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ నేతలకు నో డ్యూ సర్టిఫికెట్లు రాకుండా కూటమి నేతలు ఎత్తుగడ వేస్తున్నారు. మరోవైపు.. పలుచోట్ల వీఆర్వోలు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరపాలని లేఖలో కోరారు. అధికారులు సహకరించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నామినేషన్లు వేస్తే కేసులు పెడతామంటూ వైఎస్సార్సీపీ నేతలను కొందరు అధికారులు బెదిరిస్తున్నారని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చేతకాని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో అధికారుల తీరుపై ఆర్డీవో, డీఎస్పీకి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇలా అయితే శాంతిభద్రతల సమస్య వస్తుందని అధికారులకు తెలిపారు. -
ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్
-
బీటెక్ రవి, పోలీసులకు వైఎస్ అవినాష్ రెడ్డి వార్నింగ్
-
జవాన్ రాజేష్ కుటుంబాన్ని ఆదుకోండి.. సీఎంకు అవినాష్ రెడ్డి లేఖ
సాక్షి, వైఎస్సార్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. చత్తీస్‌గఢ్‌లో ల్యాండ్ మైన్ పేలడంతో చనిపోయిన జవాన్ రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని లేఖలో సీఎంను అవినాష్ రెడ్డి కోరారు.ఇటీవల చత్తీస్‌గఢ్ అంబుజ్‌మడ్‌లో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్ పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి.. సోమవారం రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేష్ కుటుంబ సభ్యులు సాయం కోసం విన్నవించుకున్నారు. దీంతో, వెంటనే స్పందించిన అవినాష్ రెడ్డి.. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.ఈ లేఖలో రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. రాజేష్ కుటుంబానికి తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందించాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే, కుటుంబ పోషణ కోసం రాజేష్ భార్య స్వాతికి మానవతా దృక్పథంతో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, వీర మరణం పొందిన రాజేష్‌కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
ఇంత అరాచకమా..? చంద్రబాబు సర్కార్‌పై అవినాష్‌రెడ్డి ఫైర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అరాచక పాలన సాగుతోందని.. వందరోజుల్లోనే చంద్రబాబు సర్కార్ అసంతప్తి మూటగట్టుకుందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిలెటిన్ స్టిక్స్ పేల్చి వీఆర్ఏ నరసింహను చంపారన్నారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. పులివెందులలో ఇష్టానుసారం మట్కా, జూదం నడిపిస్తున్నారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది’’ అని అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు.పులివెందులతో పాటు జిల్లా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పులివెందుల ప్రశాంతంగా ఉండేంది. పులివెందులలో అభివృద్ధి, సంక్షేమం తప్ప ఇలాంటి సంస్కతి లేదు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం వినియోగంలోకి తేవాలి’’ అని అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!‘‘పులివెందులలో ఎంతో అద్భుతంగా నిర్మించిన మెడికల్ కాలేజీకి కూటమి ప్రభుత్వం అడ్మిషన్లు రాకుండా చేసింది. తిరుమల లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబు బురదజల్లే విధంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా చూశారు. దేవుడిని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేయొద్దు’’ అని అవినాష్‌రెడ్డి హితవు పలికారు. -
మహామ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల్లో ఎంపీ అవినాష్ రెడ్డి
-
వినాయకుని పూజలో వైఎస్ అవినాష్ రెడ్డి
-
ఏపీకి ప్రత్యేక హోదా వాగ్దానాన్ని కేంద్రం నిలబెట్టుకోవాలి: ఎంపీ అవినాష్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చలో భాగంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నోసార్లు ప్రధాని నరేంద్ర మోదీని కోరారని తెలిపారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామన్న విభజన చట్టంలోని హామీని అమలు చేయాలని కోరారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను వెంటనే ప్రారంభించాలివైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని ఎంపీ అవినాష్ కోరారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతున్నా పేదలు-ధనికుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని అన్నారు. పేదలు ధనికులుగా మారినప్పుడే ఇది అర్థవంతంగా ఉంటుందన్నారు. 10 శాతం మంది ధనికుల చేతుల్లో 77 శాతం దేశ సంపద ఉంటే.. 90% జనాభా చేతిలో 23% సంపద మాత్రమే ఉందని తెలిపారు. ఈ అంతరాలను తొలగించేందుకు ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.‘దేశంలో ఆదాయపు పన్ను రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య భీమా 25 వేలకే ఐటిడి కింద పరిమితం చేశారు. కానీ రోజురోజుకు వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆరోగ్య బీమాను లక్ష రూపాయల వరకు మినహాయించాలి. కొత్త పన్ను విధానం వల్ల ప్రజలు ప్రోత్సాహకాలకు దూరమవుతున్నారు. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుంది. చేనేతకారులు ఉపయోగించే ముడి సరుకులపై ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలి. ఫిషింగ్ నెట్స్ పై జిఎస్టిని రద్దు చేయాలి. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి. వ్యవసాయ యంత్రాలపై జిఎస్టిని మినహాయించాలి. ఆరోగ్య బీమా, జీవిత బీమా లపై 18 శాతం జీఎస్టీని ఉపసంహరించాలి’ అని తెలిపారు. -
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
పులివెందుల: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బీహార్‌కంటే ఘోరంగా మారుస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. వారి రెడ్‌బుక్ రాజ్యాంగం మనిషి స్వేచ్ఛగా బతకాలన్న ప్రాథమిక హక్కును హరిస్తోందన్నారు. ఓవైపు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, మరోవైపు అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారం, హత్యలతో రాష్ట్రం అరాచకంగా మారిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో అరాచకాలపై ఢిల్లీ స్థాయిలో గళమెత్తుతామని తెలిపారు. అవినాశ్ రెడ్డి శుక్రవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో ఇటీవల అధికార పార్టీ దాడిలో గాయపడిన అబ్బాస్, ప్రతాప్‌రెడ్డి, హాజీవలిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు మేరకు అబ్బాస్, ప్రతాప్‌రెడ్డి, హాజీవలిని పరామర్శించి, వారిలో ధైర్యం కల్పించి, వైఎస్ జగన్ తరపున భరోసా ఇచ్చినట్లు చెప్పారు. వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని చెప్పామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై వరుస దాడులు చేస్తున్నారన్నారు. వినుకొండలో వందల మంది చూస్తుండగా వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ చేతులు, తర నరకడం టీడీపీ నేతల అరాచకానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. వేంపల్లెలో వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్ రెడ్డిని 20 మంది టీడీపీ కార్యకర్తలు హాకీ స్టిక్స్‌తో విచక్షణా రహితంగా కొట్టారని, స్టిక్స్ విరిగిపోతే బండరాళ్లతో తలపై దాడి చేశారన్నారు. బుధవారం పుంగనూరులో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ మిథున్‌రెడ్డి పైనా రాళ్లతో దాడులు చేశారన్నారు. తాము గత ఐదేళ్లు ఇదే విధంగా ఆలోచించి ఉంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉండేవారా అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ నాయకత్వం ఏ రోజూ అరాచకాలను ప్రోత్సహించలేదని, ఎంతసేపూ కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని అందించడంపైనే దృష్టి పెట్టిందని తెలిపారు. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన వైఎస్ జగన్‌కు ఉన్న సెక్యూరిటీని 80 శాతం తొలగించారన్నారు. సెక్యూరిటీని తొలగించినా, ఇంకా ఏమి చేసినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఆపలేరని ఆయన తెలిపారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ తర్వాత పులివెందులలో 70వేల టన్నుల ఇసుకను టీడీపీ వారు దోచేశారని చెప్పారు. మైన్స్, బార్ల పైనాపడిపోతున్నారని చెప్పారు. -
చంద్రబాబు నీతులు చెబుతూనే దాడులను ప్రోత్సహిస్తున్నారు: ఎంపీ అవినాష్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయి. సీఎం చంద్రబాబు ఒకవైపు నీతులు చెబుతూనే మరోవైపు దాడులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. అలాగే, వైఎస్సార్సీపీ ఎంపీలు పార్టీని వీడే అవకాశమే లేదన్నారు.కాగా, కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నేడు లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ వెళ్లారు.. ఈ సందర్బంగా అవినాష్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కడప పార్లమెంట్ నుంచి వరుసగా మూడోసారి గెలవడం సంతోషంగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, కడప ప్రజల మద్దతు, కార్యకర్తల కష్టంతో విజయం సాధించాను. నాపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన కడప ప్రజలు నాపై నమ్మకం ఉంచారు. వారి అభివృద్ధి కోసం పనిచేస్తాను.ఇక, కేంద్రంలో టీడీపీ మద్దతుపై ఆధారపడే ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకపోవడం ప్రజాదోహమే అవుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయి. 2019లో మేము విజయం సాధించినప్పుడు మేము ఎవరిపై దాడులకు పాల్పడలేదు. చంద్రబాబు ఒకవైపు నీచులు చెబుతూనే మరోవైపు దాడులను పోత్రహిస్తున్నారు.వైఎస్సార్సీపీ ఎంపీలపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీలు పార్టీనీ వీడే అవకాశమే లేదు. పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వారిలాగే అందరు పార్టీ మారుతారని అనుకుంటున్నారు. మేమంతా వైఎస్ జగన్ వెంటే ఉంటాం’ అని స్పష్టం చేశారు. -
కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఆధిక్యం
-
కుట్రలు.. కుతంత్రాలు
సాక్షి ప్రతినిధి, కడప: పోలింగ్ ముగిసింది. ప్రజా తీర్పు నిక్షిప్తమై ఉంది. జనం తుది ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. కౌంటింగ్ చేపట్టడమే తరువాయి. అయినా ఇప్పటికీ ఎల్లోబ్యాచ్ కుట్రలు, కుతంత్రాలను వీడడం లేదు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది.. కాబట్టే పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో రహస్య ఒప్పందాలు చేపట్టారని తోకపత్రిక వండివార్చింది. హవ్వా..నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహారం ఉండిపోయింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డిని ఎంపిక చేసి బలిపీఠం ఎక్కించారు. భూపేష్ విజయం కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోగా, ఎదుటిపార్టీపై బురద చల్లి అంతర్గత కలతలు, విభేదాలు సృష్టించే ఎత్తుగడను ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు ఇన్చార్జిగా భూపేష్‌రెడ్డి జనం మధ్యకు వెళ్లారు. నిత్యం జనంతోనే ఉంటూ తన పరపతి పెంచుకున్నారు. టీడీపీ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందనుకున్న తరుణంలో అనూహ్యంగా ఆదినారాయణరెడ్డి తెరపైకి వచ్చి, ఎన్నికల పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించేలా చక్రం తిప్పారు. భూపేష్ ఆశలు అడియాశలయ్యాయి. జమ్మలమడుగులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఆ నిర్ణయం ఆదినారాయణరెడ్డి నోట్లో వెలక్కాయపడ్డట్లయింది. భూపేష్ మద్దతు లేకపోతే, జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా రాజకీయ మనుగడ సాధించలేననే నిర్ణయానికి వచ్చారు. జిల్లా నేతల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. పార్లమెంట్ అభ్యరి్థత్వం ఖరారయ్యే వరకు జమ్మలమడుగు గడ్డపై అడుగు పెట్టలేదు. ఈపరిణామం మొత్తం జిల్లా వాసులకు ఎరుకే. లోపాయికారి ఒప్పందం టీడీపీదే.... కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు అధికంగా వస్తున్న నియోజకవర్గాల్లో మొదటిది పులివెందులే. బీటెక్ రవికి పడిన ప్రతి ఓటు అక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్‌కు పడాలి. ఎందుకంటే అవన్నీ టీడీపీ సంప్రదాయ ఓట్లు కాబట్టి. స్వయంగా బీటెక్ రవికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో ఉన్న రహస్య ఒప్పందం మేరకు ఎంపీ అభ్యర్థి భూపేష్‌కు అక్కడ గండికొట్టారు. క్రాస్ ఓటింగ్ చేయించారు. కాంగ్రెస్‌తో లోపాయకారి ఒప్పందం చేసుకున్న టీడీపీ నేతలే, ఎదుటివాళ్లపై బురద వేసేందుకు ఎల్లోబ్యాచ్తో తప్పుడు రాతలు రాయించే పనిలో నిమగ్నమయ్యారని పలువురు వివరిస్తున్నారు. హవ్వా...ఓటమి భయమా..?! కడప ఎంపీగా ఇప్పటికీ రెండు పర్యాయాలు వైఎస్ అవినాష్‌రెడ్డి విజయం సాధించారు. తొలుత 1.90 లక్షల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, రెండో మారు 3.80లక్షల ఓట్ల మెజార్టీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరో పర్యాయం తలపడ్డారు. ఈ సారి కూడా ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజార్టీ సాధించే వారిలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఉన్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఓటమి భయం పట్టుకున్నట్లు ఎల్లోమీడియా చెప్పుకు రావడం విశేషం. తగ్గట్లుగా కథనం వండివార్చి బీటెక్ రవితో రహస్య ఒప్పందమంటూ వైఎస్సార్సీపీలో అంతర్గత కలతలు రేపేందుకు సిద్ధమయ్యారని పలువురు వివరిస్తుండడం గమనార్హం.తెరపైకి వచ్చిన తెలుగుకాంగ్రెస్... వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షరాలు షర్మిల తెరపైకి వచ్చారు. ప్రచారం ఆరంభం నుంచి షర్మిలతో టీడీపీ నేతలు జతకట్టారు. పరస్పర అవగాహనకు వచ్చారు. టీడీపీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి భూపేష్‌కు ఓటు అడడగం పూర్తిగా మానుకున్నారు. కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు మినహా తక్కిన టీడీపీ అభ్యర్థులు డమ్మీ బ్యాలెట్ కూడా చూపలేదు. వాస్తవంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే ఎంపీ అభ్యర్థికి ఓట్లు గణనీయంగా తగ్గిపోతున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జమ్మలమడుగులో స్వతహా అనుబంధం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎంపీ అభ్యర్థికి ఓట్లు సమానంగా వచ్చినా, తక్కిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చే ఓట్ల కంటే తక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. టీడీపీ నేతల శల్య సారథ్యం వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ పడ్డట్లు తెలుస్తోంది. తెలుగు కాంగ్రెస్ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు భారీగా ఓట్లు ఖాతాలోకి రానున్నాయి. 2019లో ఆ పార్టీ అభ్యర్థి గుండ్లకుంట శ్రీరాములుకు 8,341 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరగనుంది. అదేవిధంగా 2019 టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడికి 4,02,773 ఓట్లు లభించాయి. ఆ ఓట్లు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డికి రావడం లేదని విశ్లేషకులు వివరిస్తున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు సమాచారం. -
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి
-
పులివెందులలో హింసకు టీడీపీ పన్నాగం
సాక్షి ప్రతినిధి కడప: హింసకు తావు లేకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పోలింగ్ జరిగేలా ఎన్నికల కమిషన్(ఈసీ) చర్యలు తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. పోలింగ్‌లో హింసకు టీడీపీ కుట్ర చేస్తోందని తెలిపారు. పోలింగ్ ప్రారంభంలోనే వైఎస్సార్ జిల్లా పులివెందులలో మొదటగా హింస రేపాలన్నది టీడీపీ పన్నాగమన్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి గలాటాలు చేయాలని ప్రణాళిక రూపొందించుకుందన్నారు.ఇప్పటికే చంద్రబాబు దీనికి సంబంధించి డైరెక్షన్ ఇచ్చారని, వారి అనుకూల అభ్యర్థులు, ఏజెంట్లతో హింసకు యత్నిస్తోందని తెలిపారు. అనుకూల మీడియాలో ఆ ఘటనలకు విస్తత ప్రచారం కల్పించి, వైఎస్సార్సీపీనే చేయించినట్లుగా తప్పుడు ప్రచారానికి కుట్ర జరిగిందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు, వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు ఈ వ్యూహం రచించారన్నారు. స్వేఛ్చగా, నిర్భయంగా ఎన్నికలు జరిగితే టీడీపీకి నష్టమని, అందుకే ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నారన్నారు. -
అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్
-
చంద్రబాబు ట్రాప్‌లో షర్మిల, సునీత
పులివెందుల/లింగాల: తన అక్కలైన షర్మిల, సునీతలు చంద్రబాబు ట్రాప్‌లోపడి తమపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి చెప్పారు. 2021 నుంచి వారిద్దరూ తనను మానసికంగా ఎంతో ఇబ్బందిపాల్జేశారన్నారు. చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ, ఎల్లో మీడియా ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదివి ఇష్టమొచ్చినట్లు నన్ను, జగనన్నను తిడుతున్నారని.. అయినా, వారిపట్ల తనకెలాంటి కోపంలేదని చెప్పారు. వైఎస్ వివేకాను హత్యచేశానన్న వ్యక్తిని వారు ప్రోత్సహిస్తున్నారని, అతడు పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నా.. అతడిని ఓడించాలని ఒక్కమాట కూడా అనడంలేదన్నారు. హంతకుడు అప్రూవర్‌గా మారడంతో అతడినే సోదరుడిగా భావిస్తున్నారన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండల కేంద్రంలో అవినాశ్‌రెడ్డి రోడ్ షో, బస్టాండులో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..సభ్యతతో ప్రతి విమర్శలు చేయడంలేదు..వారిద్దరూ తనను ఎన్ని విమర్శలు చేసినా అదే రీతిలో తాను చేయగలను. కానీ, సభ్యత, సంస్కారాలవల్ల చేయడంలేదు. మా నాన్నను తప్పుడు ఆరోపణలతో 385 రోజులు జైల్లో పెట్టారు. ఎవరికీ ద్రోహం చేయలేదు, మనకెందుకీ శిక్ష అని అంటూ ఆయన బాధపడ్డారు. దేవుడి దయ, మీ ఆశీస్సులు ఉన్నంతవరకు మేం ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటాం. ఇక దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిల మరణాలకు కారణం ఎవరు? ఎక్కడ కుట్ర జరిగింది? ఎవరికి మేలు చేసేందుకు ఇలాంటివి చేశారన్న నిజాలను ఎన్నివేల అడుగుల లోతున దాచిపెట్టి ఉన్నా బయటికి వస్తాయి. వారికి కడప కోర్టు జరిమానా..వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చి టీడీపీకి లబ్ధిచేకూర్చాలని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ ఇచ్చారు. ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఏమీచేయలేరు. ఇక కొద్ది గంటలముందే కడప కోర్టు వీరుచేసే దుష్ప్రచారాలకు జరిమానా విధించింది. కేసు ట్రయిల్‌కు రాకముందే మీరెలా మాట్లాడతారని షర్మిలక్కకు, సునీతక్కకు, వారి సోదరుడు బీటెక్ రవికి రూ.10 వేలు జరిమానా విధించింది.న్యాయస్థానాలు కూడా వీరు చేసేది తప్పని చెబుతున్నాయి. వీరి టార్గెట్ కేవలం వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే. నా నిజాయితీని నూరు శాతం నిరూపించుకుంటా. ఇక ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లువేసి, వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, ఎంపీ అభ్యర్థినైన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మా కష్టకాలంలో మీరు చూపిన ప్రేమ నేను జీవితాంతం మర్చిపోలేను. -
మా అక్కలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడతా: వైఎస్ అవినాష్
సాక్షి, వైఎస్సార్: టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. వీరితో పోరాడే శక్తిని ప్రజలే నాకు ఇస్తారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ప్రతీరోజు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని పచ్చ మీడియాకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. 2021 తర్వాత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నోటికి ఎంత మాట వస్తే అంత వరకు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే కోపం కంటే ఎక్కువగా బాధేస్తోంది. వాళ్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు.రెండున్నరేళ్లు ఎవరూ మాట్లాడలేదు. వాచ్మెన్ రంగన్నకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేసినా ఏమీ మాట్లాడలేదు. రెండున్నరేళ్ల తర్వాత రంగన్న మాట్లాడుతున్నాడు. ఓవైపు తానే చంపానని చెబుతున్న దస్తగిరి గురించి వీరద్దరూ ఏమీ అనడం లేదు. అతను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి బయట తిరుగుతున్నాడు. అన్నీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు మాటలు చెబుతున్నారు.వైఎస్ భాస్కర్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉండి ఏ పని కావాలన్నా చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టించారు. నా తప్పు లేకపోయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా గట్టిగా నిలబడతాం. మీ అందరి మద్దతుతో గెలిచి తీరుతాను. ఇప్పుడు తిట్టిన వాళ్లే మళ్లీ క్షమాపణలు చెప్పాలి.. అది నేను వినాలి. వివేకం చిన్నాన్నను చంపిన వాస్తవం వెలుగులోకి వస్తుంది. ఈ కుట్రలు ఎవరో చేశారో తప్పకుండా బయటకు వస్తుంది.దివంగత వైఎస్సార్ తాను బ్రతికినంత కాలం.. టీడీపీ, ఈనాడుతో పోరాడారు. అటువంటి వారితో ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు. మీరు వాళ్ల వారసులా.. లేక వైఎస్సార్ వారసులా?. నన్ను కనుమరుగు చేయాలంటే దేవుడు ఒప్పుకోడు. మా అక్కలతో పోరాడే శక్తిని ప్రజలే ఇస్తారు. వైఎస్సార్సీపీ ఓట్లు చీల్చి టీడీపీకి లబ్ధి చేకూర్చాలనేది షర్మిలకు కాంగ్రెస్ పెట్టిన టాస్క్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరిది నాటకమో.. ఎవరు నిజమో ప్రజలే నిర్ణయిస్తారు అని కామెంట్స్ చేశారు. -
ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
-
అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
వేముల: వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ ప్రజలను కోరారు. వైఎస్సార్ జిల్లా వేములలో ఆదివారం ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వైఎస్ జగన్, వైఎస్ అవినాశ్‌రెడ్డిలను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ భారతమ్మ, ఆమె సోదరుడు, ప్రముఖ వైద్యుడు ఈసీ దినేశ్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి భారతమ్మపై అభిమానం చూపారు. ఆమెను చూడగానే చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ, తమ ఇంటిలోకి ఆహ్వానించి అభిమానాన్ని చాటుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆమెను చూడటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. వేముల మెయిన్ రోడ్డు, ఎస్సీ కాలనీ, శేషన్నగారిపల్లె, బచ్చయ్యగారిపల్లెల్లో భారతమ్మ, ఈసీ దినేశ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సోదరి శ్వేతారెడ్డి.. జెడ్పీటీసీ వెంకట బయపురెడ్డి, ఎంపీపీ చల్లా గంగాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ లింగాల ఉషారాణి, వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి నాగెళ్ల సాంబశివారెడ్డి, మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, పీసీబీ డైరెక్టర్ మరక శివకృష్ణారెడ్డిలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక టీసీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రచారంలో అవ్వాతాతలను, మహిళలు, పెద్దలను ‘అన్న బాగున్నారా.. అవ్వా బాగున్నారా’ అంటూ భారతమ్మ ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఇంటి వద్ద వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని భారతమ్మ చెప్పారు. పేదలు ఉన్నత చదువులు చదివితే ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చివేశారన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనను గ్రామీణ విద్యార్థులకు చేరువ చేశారని తెలిపారు. పేదల సంక్షేమ పథకాలు కొనసాగడానికి మరోసారి వైఎస్ జగన్‌ను సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌కు మెండుగా ప్రజల ఆశీస్సులు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాలపై దృష్టి సారించిందని భారతమ్మ తెలిపారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పాలనను ప్రజల వద్దకే తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేశారన్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ జగన్‌ను ప్రజలు మళ్లీ సీఎంగా కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్ విజయాన్ని ఆపలేరన్నారు. ఎన్నికల ప్రచారంలో పలువురు నేతలు పాల్గొన్నారు. -
Viveka Case: అవినాష్‌రెడ్డికి ఊరట
హైదరాబాద్, సాక్షి: వివేకా కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి ఊరట లభించింది. కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి వేసిన పిటిషన్‌ను శుక్రవారం ఉదయం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, కాబట్టి ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి ఓ పిటిషన్ వేశాడు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే దస్తగిరి పిటిషన్దస్తగిరి ఆరోపణల్లో వాస్తవం లేదునిరాధార ఆరోపణలతో పిటిషన్ వేశారుసీబీఐ బెయిల్ రద్దు ఎప్పుడూ కోరలేదుహైకోర్టు షరతులను కూడా ఎక్కడా ఉల్లంఘించలేదుసాక్షులను బెదిరించినట్లు ఎక్కడా ఆధారాల్లేవ్వైఎస్ భాస్కర్‌రెడ్డి విషయంలో సైతం ఆధారాల్లేవ్ఇప్పటికే ఈ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ వేసిందిఅని అవినాష్ తరఫు న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దస్తగిరి పిటిషన్‌ను కొట్టేసింది.మరోవైపు ఇదే కేసులో అరెస్టైన అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అదే సమయంలో ఉదయ్‌కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ లకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.ఇక.. ఈ కేసులో వివేకా కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి అంటున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, పైగా ఎన్నికల వేళ .. దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా.. ఆయన్ను అప్రూవర్‌గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.ఈ కేసులో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు అవినాష్. షర్మిల రాజకీయ సభల్లో ఏం మాట్లాడుతుందో అందరు చూస్తున్నారులేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు సునీత పవర్ పాయింట్ ప్రజటేషన్ ఇస్తోందిఅసలు ఈ కేసులో మాట్లాడటం ఇష్టం లేదు, కేవలం వివరణ కోసమే మీడియా ముందుకు వచ్చానుదస్తగిరిని అప్రూవర్ చేసిన విధానం అందరు గమనించండిఈ కేసులో వాచ్ మెన్ రంగన్న ఐ విట్ నెస్ ...నలుగురి పేర్లు చెప్పాడురంగన్న చెప్పిన వారిని ఏ విచారణ సంస్ద అయిన అరెస్ట్ చేసి కస్టడీ అడిగి సమాచారం రాబట్టాలినెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చెయ్యలేదుదస్తగిరి హత్య చేశానని ఒప్పుకున్నా అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపారుఅనంతరం దస్తగిరి యాంటిస్పేటరీ బెయిల్ అడిగాడుదస్తగిరి బెయిల్‌కు సునీత అభ్యంతరం చెప్పలేదుపక్కా ప్రణాళికతో దస్తగిరిని అప్రూవర్ చేశారు306- 4A ప్రకారం అప్రూవర్‌ను ట్రయల్ అయిపోయే వరకు బయటకు పంపకూడదుకానీ చట్టంలో లొసుగులను అధారంగా చేసుకుని.. అడిగినంత డబ్బు ఇస్తామని అప్రూవర్‌గా మార్చారుఅప్రూవర్ అనేది అనవాయితీగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుంది?సిబిఐతో సునీత, దస్తగిరి లాలూచీకి అనేక ఉదహరణలు ఉన్నాయిఇచ్చిన వాంగ్మూలన్నే నా వాంగ్మూలం కాదని సునీత చెబితే సిబిఐ ఎలా అంగీకరిస్తుంది.?హత్య జరిగిన పది రోజులకు సునీత ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందో అందరికీ తెలుసుజమ్మలమడుగులో చనిపోయే ముందు రోజు వరకు అవినాష్ రెడ్డికి మద్దతుగా వివేకా ఎన్నికల ప్రచారం చేశారని సునీత చెప్పిందిఇంత స్పష్టంగా చెప్పి ఇప్పుడు ఎంపి టికెట్ కోసమని ఎలా మాట మార్చుతారు?నాకు బెయిల్ వచ్చాకా ఇప్పటివరకు 13 సార్లు వాంగ్మూలం ఇచ్చానుఎవరో ఫోన్ చేస్తే అవినాష్ వెళ్లి సాక్షాలు చెరిపానని సునీత బురద జల్లుతోందిఈ కేసులో శివప్రకాష్ రెడ్డి మూడవ వ్యక్తి అని సునీత ఎలా చెబుతుంది?వైఎస్ వివేకానందరెడ్డికి సొంత బావమరిది శివప్రకాష్ రెడ్డి, ఆయన మూడో మనిషి ఎలా అవుతాడు ?శివప్రకాష్ చెబితేనే నేను వివేకా ఇంటికి వెళ్లాను, అ తరువాతే నేను సమాచారం చెప్పానుమూడో వ్యక్తి కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని ఎలా అంటారు ?ఎవరైనా కాల్ చేస్తారని ముందే ఊహిస్తారా?నేను వెళ్లక ముందే క్రిష్ణారెడ్డి వివేకా ఇంటికి వెళ్లాడు, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో మాట్లాడాడునేను వెళ్లగానే పోలీసులకు కూడా చెప్పానువివేకా లెటర్ దాచిపెట్టడం పెద్ద నేరం, తప్పడు ఉద్దేశం ఉంటే అ రోజే చెప్పి ఉండాలిఎర్రగంగిరెడ్డి 45 నిమిషాలు అలస్యంగా వచ్చాడుఎర్రగంగిరెడ్డికి శివప్రకాష్ రెడ్డే ఫోన్ చేశాడుసునీత ఏ రకంగా నిందలు వేస్తున్నారో అందరు గమనించాలిఎర్రగంగిరెడ్డి వివేకాకు ఎంత అప్తుడొ అందరికి తెలుసువివేకానందరెడ్డి చివరి రెండేళ్లు తీవ్ర దుర్బర పరిస్దితి అనుభవించారుచివరి రోజుల్లో ఎందుకు నిరాదరణకు గురిచేసారో చెప్పాలి ?బెంగుళూరులో సెటిల్ మెంట్ లో డబ్బు వస్తే రెండో కుటుంబానికి ఇవ్వాలని ప్రయత్నించారు.రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా వివేకాను సొంత కుటుంబ సభ్యులే నిరాదరణకు గురిచేశారుఇక సునీత తరచు చెబుతున్నట్టు గూగుల్ మ్యాప్, గూగుల్ టేక్ అవుట్ ఒకటి కాదుగూగుల్ టేక్ అవుట్‌కు శాస్త్రీయత లేదని గూగులే చెబుతోందివైఫై వాడితే ఒక రకంగా డేటా అయితే ఒక రకంగా చూపుతుంది100 మీటర్ల నుంచి కిలోమీటర్ అంత దూరం తేడా కనిపిస్తోందిఅది కూడా మూడేళ్ల తరువాత చూశారు?మొదట్లో గూగుల్ టేక్ ఔట్ ఎందుకు తప్పని అనిపించలేదు?గూగుల్ టేక్ ఔట్ అనేది తప్పుగా నమోదు చేశామని సిబిఐ ఎందుకు కోర్టుకు వివరణ ఇచ్చింది?గ్రీన్ విచ్ మీన్ టైం ప్రకారం 5.30గంటలు వెనక చూపించామని లిఖిత పూర్వకంగా ఎందుకు రాసిచ్చింది?ఇది వివాదం అవ్వడంతో దీంతో మళ్లీ సాకులు చెబుతు కౌంటర్ వేశారువారి కారణాలపైనే వారే అఫిడవిట్ వేశారు, అబద్దాన్ని ఏమి చేసినా నిజం కాదుచంద్రబాబు కుట్రలో సునీత భాగమై ఇలా మాట్లాడుతున్నారునేను ఏ తప్పు చెయ్యలేదు, ఎవ్వరికీ భయపడిదిలేదున్యాయవ్యవస్దపై పూర్తి నమ్మకం ఉందిఈ కేసులో తాము అనుసరిస్తోన్న తీరుకు సిబిఐ లెంపలేసుకుని వెనక్కి వెళ్లాల్సి వస్తుందినా ఫోన్లో వాట్సప్ యాక్టివ్ ఉన్నందుకు నిందితులతో మాట్లాడానని ఆరోపిస్తున్నారుఆరోపించే వారికి కనీసం వాట్సాప్ పట్ల అవగాహన అయినా ఉండాలినా నెంబర్ వాట్సాప్‌లో ఎన్నో గ్రూపులున్నాయి.ఏ గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా.. వాట్సాప్‌లోకి వస్తుందినేను నిద్ర పోయినప్పుడు వచ్చే మెసెజ్‌లు ఎవరైనా చూస్తారా?మూడేళ్లుగా నన్ను అప్రతిష్టపాలు చేశారుఅనేక ఇబ్బందులకు గురిచేశారు74 యేళ్ల వయస్సులో మా తండ్రి జైలులో మగ్గుతున్నాడుటిడిపి, బిజేపి నాయకులను అడ్డుపెట్టుకుని కేసులు వేశారుహత్యని తెలిసింది ముందుగా వివేకా కుటుంబ సభ్యులకే.!వైఎస్అర్ చనిపోయాక షర్మిలకు ఎంపిగా ఉండాలనే ఆలోచన ఎందుకు రాలేదు?వీరే కదా నన్ను ఎంపీగా ఉండమని పిలిచిందికేవలం ఎంపీ పదవి చూపి విమర్శలు చెయ్యడం సరికాదు -
చంద్రబాబు మేనిఫెస్టోపై.. అవినాష్ రెడ్డి రియాక్షన్
-
సకుటుంబ సపరివార సమేతంగా
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట అయిన వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఘనవిజయానికి ఆయన కుటుంబమంతా కదిలింది. పులివెందుల అసెంబ్లీ స్థానంలో సీఎం వైఎస్ జగన్‌కు, కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాశ్‌రెడ్డి, పార్టీ ఇతర అభ్యర్థులకు గత ఎన్నికల్లోకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యతలను కుటుంబ సభ్యులు భుజాన వేసుకున్నారు. అందరూ కలిసి ప్రణాళిక ప్రకారం జిల్లా ప్రజల ముందుకు వెళ్తున్నారు. వైఎస్సార్ సోదరులు, సమీప బంధువులు నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ సహా మరికొందరు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన సంక్షేమం, సాధించిన అభివృద్ధి, సుపరిపాలనను వివరిస్తూ గత ఎన్నికలకంటే మరింత ఎక్కువ మెజార్టీతో ఘనవిజయాన్ని అందించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సామాన్యుల ఉన్నతే లక్ష్యంగా, విశేష పారిశ్రామిక ప్రగతి సాధించిన సీఎం వైఎస్ జగన్‌ను, వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించారని, మరోమారు ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు బాధ్యతలిలా.. వైఎస్సార్ సోదరులు వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సు«దీకర్‌రెడ్డి, వైఎస్ మధుకర్‌రెడ్డి కడప నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల మున్సిపాలిటీకి వైఎస్ మనోహర్‌రెడ్డి, లింగాలకు వైఎస్ అభిõÙక్‌రెడ్డి, తొండూరుకు వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి ఇన్చార్జిలుగా ఉన్నారు. పులివెందుల రూరల్, కొండాపురం మండలాలకు చవ్వా దుష్యంత్‌రెడ్డి, జమ్మలమడుగుకు చవ్వా జగదీష్‌రెడ్డి ప్రచార బాధ్యతలు చేపట్టారు. వేముల మండల ఇన్చార్జిగా డాక్టర్ ఈసీ దినేష్‌రెడ్డి, సింహాద్రిపురానికి గండ్లూరు వీరశివారెడ్డి, చక్రాయపేటకు వైఎస్ కొండారెడ్డి, వేంపల్లెకు వైఎస్సార్ మేనల్లుడు యువరాజ్‌రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ విజయం కోసం సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సతీమణి వైఎస్ సమతారెడ్డి, సోదరి వైఎస్ శ్వేతారెడ్డి, చవ్వా సునీతారెడ్డి, వైఎస్ తేజారెడ్డి, దివ్య (వైఎస్సార్ మేనకోడలు) విస్తృతంగా పర్యటిస్తున్నారు. వీరంతా ఇప్పటికే పులివెందుల, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో పర్యటించారు. జగన్ చెబితే చేస్తారు.. చంద్రబాబు చెప్పినా చేయరు: వైఎస్ భారతమ్మ పులివెందుల/తొండూరు: సీఎం వైఎస్ జగన్ చెబితే చేస్తారని, చంద్రబాబు చెప్పినా చేయరని సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ చెప్పారు. రాష్ట్ర ప్రజలందరిదీ కూడా ఇదే అభిప్రాయమన్నారు. ఆమె ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం ఇనగలూరులో ప్రజలతో మమేకమయ్యారు. పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ప్రజలతో మాట్లాడారు.తమకు సీఎం జగన్ వల్ల అన్ని పథకాలూ అందుతున్నాయని అక్కడున్న వారంతా చెప్పారు. తమ కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయని, తమ ఓట్లు వైఎస్సార్సీపీకే అని బదులిచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు భారతమ్మ స్పందించారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గత ఎన్నికల్లోకంటే మరింత ఎక్కువ మెజార్టీని ఇస్తారని చెప్పారు. ఇందుకు వారే నిదర్శనమంటూ ప్రజలను చూపించారు. అక్కడున్న ప్రజలంతా జగన్మోహన్రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీని అందిస్తామంటూ నినదించారు. మేనిఫెస్టో గురించి భారతమ్మ మాట్లాడుతూ ఇప్పుడున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆ పథకాలకు సీఎం జగన్ మరింత మెరుగులు దిద్ది అందిస్తారని చెప్పారు. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి బలమని, 40 ఏళ్లుగా ప్రజలు ఆదరిస్తున్నారని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. ఆమెతో పాటు వైఎస్ సమత, వైఎస్ మధురెడ్డి కోడలు చైతన్య, డాక్టర్ చందన ఉన్నారు.ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎదురు లేని వైఎస్సార్ కుటుంబంఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ కుటుంబానికి ఇప్పటివరకు ఎదురే లేదు. కడప పార్లమెంటు నుంచి 1989లో తొలిసారి వైఎస్సార్ ఎంపీగా ఎన్నికయ్యారు. వరసగా నాలుగు పర్యాయాలు ఆయనదే విజయం. 1989 నుంచి 2019 వరకు 10 సార్లు కడప పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా, అన్ని ఎన్నికల్లో జిల్లా ప్రజానీకం వైఎస్ కుటుంబానికే పట్టం కట్టారు. నాటి నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
‘ఎంతమంది కలిసొచ్చినా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరు’
సాక్షి, పులివెందుల: గత ఎన్నికలప్పుడు ఏవైతే హామీలిచ్చారో సంక్షేమ పథకాలు చెప్పారో చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా.. కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు కోల్పోయినా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి సీఎం జగన్ చూపించారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా పులివెందులోని సీఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగించారు.‘‘ఐదు సంవత్సరాల జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్నిరకాలుగా అభివృద్ధి చెందింది. మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో జరిగింది మీరంతా చూశారు. సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒకసారి ఆలోచించండి. 2019 నుంచి 2024 వరకు ఈ ఐదేళ్లలో నాలుగుసార్లు సీబీఆర్ను ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పైడిపాలెం 6 టీఎంసీలు నాలుగుసార్లు నింపడం జరిగింది. మరి అలా నింపాం కాబట్టే ఈ ఐదేళ్లపాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సాగునీరు అందించాం....మీరు ఒక్కసారి ఆలోచించండి, 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమ ప్రాంతానికి అందులో భాగంగా పులివెందుల కూడా రావడం జరిగింది. ఆయన పులివెందుల వచ్చి వెళ్లాక ఈ 16 నెలల్లో వర్షమే లేదు. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత వర్షమనేది దూరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ 16 నెలల కరువు కాలంలో కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా మనం లింగాల బ్రాంచ్ కెనాల్ క్రింద చెరువులు కావొచ్చు, పీబీసీ క్రింద చెరువులు కావొచ్చు, జీకేఎల్ఐ క్రింద చెరువులకు కావొచ్చు సమృద్ధిగా అరటి, చీని రైతులకు సమృద్ధిగా మనం నీళ్లు అందించామంటే జగనన్న ముందుచూపుతో సీబీఆర్‌లో 10 టీఎంసీలు పెట్టడం, పైడిపాలెంలో 6 టీఎంసీలు పెట్టడం వల్లనే సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరుడికి తెలియజేస్తున్నా...ముఖ్యంగా పంటల బీమా గురించి ఒకసారి ఆలోచించండి. 2014 నుంచి 2019 వరకు మన జిల్లా రైతాంగానికి రూ.750 కోట్లు పంటల బీమా వస్తే, జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు రూ.1,100 కోట్లు పంటల బీమా రైతులకు అందింది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ.. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో కేవలం రూ.40 కోట్లు మాత్రమే అందింది. జగనన్న హయాంలో 2019 నుంచి 2024 వరకు దాదాపు రూ.278 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జిల్లాలోని రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. 2023 ఖరీఫ్ లో వర్షాభావ పరిస్థితుల వలన మనం ఏదైతే నష్టపోయామో దానికి సంబంధించి పంటల బీమా వచ్చే జూన్ మాసంలో రైతుల ఖాతాల్లో తప్పకుండా జమ అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా...ఒకవైపు మొగమేరు మీరు చూస్తే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందో ఒక్కసారి చూడండి. రైతులకు ప్రయోజనకరంగా మొగమేరు కట్టలు పటిష్టం చేయడం జరిగింది, చెక్ డ్యామ్ లు నిర్మించడం జరిగింది. మరోవైపు చక్రాయపేట మండలం చూడండి. గాలేరు నగరి హంద్రీనీవా సుజల స్రవంతి అనుసంధానంలో భాగంగా ఇప్పటికే అక్కడ కాలేటివాగు డ్యామ్ ను 0.1 నుంచి 1.2 టీఎంసీల స్టోరేజీ డ్యామ్ గా దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇవాళ వర్షం నీళ్లు వస్తే మనం అక్కడ పంప్ హౌస్‌ల నిర్మాణం పూర్తి చేస్తే మరి చక్రాయపేట మండలంలో దాదాపు 40 చెరువులకు నీళ్లిచ్చే అవకాశం ఉందనే విషయాన్ని అందరికీ మనవి చేస్తున్నా. తప్పకుండా సంవత్సరం రోజుల్లో ఆ పంప్ హౌస్ ను కూడా పూర్తి చేసి చక్రాయపేట మండలాన్ని కూడా మిగిలిన 6 మండలాల మాదిరి సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రతి రైతన్నకు తెలియజేస్తున్నా....మరి ఇవాళ మన ప్రతిపక్షాలు మనం ఇంత పెద్దఎత్తున సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే మన తప్పులను చూపలేక, మనల్ని తప్పుబట్టలేక చేసేదేమీలేక, మనల్ని ఎదుర్కొనే బలం లేక గుంపుగా మన మీదకు వస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా మన మీదకు వస్తున్నారు. ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారాలు చేస్తున్నారు. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు విష ప్రచారాలు చేస్తున్నారు ఇవంతా కూడా మీరు గమనించండి. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే అది నిజమవుతుందనేది చంద్రబాబు, ఎల్లోమీడియా సిద్ధాంతం. వాళ్ల ట్రాప్‌లో ఎవరూ పడొద్దని చెప్పి మనవి చేసుకుంటూ ఎంతమంది కలిసొచ్చినా, ప్యాకేజీ స్టార్ కావొచ్చు, బీజేపీ కావొచ్చు, పరోక్షంగా కాంగ్రెస్ కావొచ్చు, ఎల్లోమీడియా కావొచ్చు మీరు ఎన్ని తప్పుడు హామీలిచ్చినా జగన్ మోహన్ రెడ్డిని టచ్ చేయలేరని తెలియజేస్తున్నా చంద్రబాబు అండ్ కోకు....మీకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, కానీ జగన్ మోహన్ రెడ్డి ఒక్కడు ఆయనకు అండగా రాష్ట్రంలో లక్షలమంది యువకులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు జగన్ మోహన్ రెడ్డి గార్కి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి గార్కి అండగా నిలబడేందుకు మేమంతా సిద్ధమంటున్నారు. కాబట్టి ఎంతమంది కలిసొచ్చినా సరే జగన్మోహన్రెడ్డి గారి విజయాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ ఒక్కరూ కూడా ఆపలేరు....2019 లో మీరు ఎలా ఆదరించారో, ఆశీర్వదించారో మరి 2024 ఈ ఎన్నికల్లో కూడా మే 13న జరిగే ఎన్నికల్లో మీ ఆదరణ, ఆశీస్సులు సంపూర్ణంగా ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మనందరి అన్న జగనన్నపైనా, అదేవిధంగా ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నాపైనా మెండుగా ఉంచాలని, 2019కి మించిన ఘన విజయాన్ని అందించాలని మళ్లీ ప్రజాసేవను, ఈ అభివృద్ధి యజ్ఞాన్ని, సంక్షేమ రాజ్యాన్ని ముందుకు కొనసాగించే విధంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని పేరుపేరున ప్రతి అన్న, తమ్ముడ్ని, ప్రతి అక్కచెల్లెమ్మకు మనవి చేస్తున్నా’’ అని అవినాష్‌రెడ్డి తెలిపారు. -
నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు...అవినాష్ పై సీఎం జగన్ ప్రశంసలు
-
జగనన్నకు లక్ష ఓట్ల మెజారిటీ గ్యారంటీ..
-
వివేకా హత్యపై దుష్ప్రచారం ఆపండి
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిలపైన దుష్ప్రచారం చేయొద్దని కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తదితరులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డిల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు తేల్చిచెప్పింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి మాట్లాడొద్దని సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడే మాట్లాడాలని కుండబద్దలు కొట్టింది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని హెచ్చరించింది. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్, షర్మిల, సునీత తదితరులు తాము చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తొలగించాలని ఆదేశించింది. వీరు సీఎం వైఎస్ జగన్, వైఎస్ అవినాశ్‌రెడ్డిలపై దుష్ప్రచారం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు తెలిపింది. రాజకీయంగా మైలేజీ కోసమే దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలు, మీడియా పబ్లిక్ కోర్టుగా అవతరించి న్యాయపాలనలో జోక్యం చేసుకుంటున్నాయని కడప జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు కడప ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.శ్రీదేవి రెండు రోజుల క్రితం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలు, వక్రీకరణలు ఆపండి.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ధ్రువీకరణ కాని ఆరోపణలతో, వక్రీకరణలతో వ్యక్తిగత దాడులు, విమర్శలు చేయడం మానాలని కాంగ్రెస్, టీడీపీ, జనసేన నేతలను, వారి పార్టీల క్యాడర్‌ను కడప జిల్లా కోర్టు ఆదేశించింది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉందని కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ఆరోపిస్తూ మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని ఆయా పార్టీల అధినేతలను, అనుచరులకు కోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్‌రెడ్డిని వైఎస్ జగన్ రక్షిస్తున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆపాలని తేల్చిచెప్పింది. వ్యక్తిగత విమర్శలు మాని తమ పార్టీల ఎజెండాలపైన, ఇతర పార్టీల వైఫల్యాలపైన దృష్టి సారించాలని వారికి కోర్టు హితవు పలికింది. వివేకా హత్య కేసులో జగన్ నిందితుడు కాదన్న విషయాన్ని గుర్తెరగాలంది. రాజకీయ మైలేజీ కోసమే జగన్, అవినాశ్‌లపై.. షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులు వ్యాఖ్యలు చేశారంది. ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా పరువు నష్టం కలిగించేవేనని తేల్చిచెప్పింది. అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి.. వాదనలు విన్న జిల్లా జడ్జి శ్రీదేవి పిటిషనర్ వాదనలతో ఏకీభవించారు. వాక్ స్వాతంత్య్రం సహేతుక పరిమితులకు లోబడి ఉంటుందన్న సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఓ వ్యక్తి ప్రతిష్టను, మంచితనాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం ఆ స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ‘వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తుతం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా షర్మిల, చంద్రబాబు, లోకేశ్ ప్రజల ముందు వైఎస్సార్సీపీ, దాని అధినేత వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తదితరులపై తప్పుడు, పరువు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారనేందుకు, అసభ్యంగా పరిహాసం చేస్తున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. వారి మాటలను, వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాలు పదే పదే ప్రచురించాయి, ప్రసారం చేశాయి. ముఖ్యంగా అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా పేర్కొన్నారు. ఆయనను సీఎం జగన్ రక్షిస్తున్నారని పేర్కొన్నాయి.’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇతరులు సొంత తీర్పులివ్వరాదు.. ‘పౌర హక్కుల దురాక్రమణను నిరోధించడానికి, నిందితుల హక్కులను కాపాడేందుకు, మీడియా ప్రవర్తనకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించే విషయంలో సరైన నిబంధనలు లేవు. ఓ వ్యక్తి అరెస్ట్ సమయంలో అతడిని దోషిగా నిర్ధారించే ట్రెండే ప్రస్తుతం కొనసాగుతోంది. రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు, మీడియా ఉన్నది ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకే తప్ప, తమ ఇష్టాఇష్టాలకు అనుగుణంగా తీర్పులు ఇచ్చేందుకు ఎంతమాత్రం కాదు. ప్రస్తుత కేసులో ఈ కోర్టు ముందుంచిన డాక్యుమెంట్లు, వీడియోలు, పత్రికా కథనాలను విశ్లేషిస్తే.. బహిరంగంగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆయనను వైఎస్ జగన్ రక్షిస్తున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నారు. ఓ కేసు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నప్పుడు.. ఎవరూ కూడా తమ సొంత తీర్పులు ఇవ్వడానికి వీల్లేదు. ఆ అధికారం ఎవరికీ లేదు. అలాంటి కేసులో ఉన్న వ్యక్తిని తమ ఇష్టానుసారం హంతకుడిగా, దోషిగా ప్రకటించడానికి వీల్లేదు. నిష్పాక్షిక ట్రయల్ నిర్వహించి నిందితుడిని దోషిగా నిర్ధారించేంత వరకు ఆ వ్యక్తి అమాయకుడే అన్నది న్యాయ సూత్రం. ఓ వ్యక్తి నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్పైన మాత్రమే ఉంది. పెండింగ్‌లో ఉన్న కేసు గురించి మూడో వ్యక్తి ఎవరూ కూడా తమ తప్పుడు ప్రయోజనాల కోసం బహిరంగంగా మాట్లాడటం, వ్యాఖ్యలు చేయడం, తీర్పులిచ్చేయడానికి ఎంతమాత్రం వీల్లేదు’ అని జడ్జి శ్రీదేవి తేల్చిచెప్పారు. తప్పుడు ప్రచారంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చంద్రబాబు ప్రోద్భలంతో వైఎస్ వివేకా హత్యపై షర్మిల, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, సునీత తదితరుల దుష్ప్రచారంపై విసిగిపోయిన వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. తమ పార్టీతో పాటు సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డి, తదితరులపై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా షర్మిల, చంద్రబాబు, సునీతలను నిరోధించాలంటూ కడప జిల్లా కోర్టులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.శ్రీదేవి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున ఎం.నాగిరెడ్డి, కె.ఎస్.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు, షర్మిల, సునీత తదితరులు చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన డాక్యుమెంట్లను, తప్పుడు ఆరోపణల వీడియోలను న్యాయవాదులు కోర్టు ముందుంచారు. కోర్టు ప్రొసీడింగ్స్‌లో మీడియా, రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయి ‘రాజకీయ పార్టీలు మీడియా ద్వారా పబ్లిక్ కోర్టుగా అవతరించాయి. అటు మీడియా, ఇటు రాజకీయ పార్టీలు సొంతంగా దర్యాప్తు చేసేస్తున్నాయి. తద్వారా కోర్టు ప్రొసీడింగ్స్‌లో జోక్యం చేసుకుంటున్నాయి. నిందితుడు, దోషికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విస్మరించాయి. దోషిగా నిర్ధారణ అయ్యేవరకు నిరపరాధే అనే సూత్రాన్ని కూడా పట్టించుకోవడం లేదు. కోర్టులు కేసును విచారణకు స్వీకరించడానికి ముందే నిందితులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలుస్తున్నాయి. ఇది ప్రజలపై, జడ్జీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తత్ఫలితంగా అమాయకుడైన నిందితుడిని నేరస్తుడిగా చూడాల్సి వస్తోంది. నిందితుల హక్కులు, స్వేచ్ఛను పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదు. ట్రయల్‌కు ముందు ఓ అనుమానితుడు, నిందితుడు విషయంలో మీడియా సాగించే పరిమితికి మించిన ప్రతికూల ప్రచారం ట్రయల్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తద్వారా అతడే నేరం చేశాడని భావించాల్సి వస్తోంది. ఇలా చేయడం న్యాయ పాలనలో జోక్యం చేసుకోవడమే అవుతుంది’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దుష్ప్రచారాన్ని ఆపండి.. ఎన్నికల ప్రచారంలో షర్మిల తదితరులు వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డిని సీఎం జగన్ కాపాడుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అవినాశ్‌రెడ్డిని ఏకంగా హంతకుడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ప్రకటనలు, వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదించారు. చంద్రబాబు కూడా ప్రొద్దుటూరు సభలో వివేకాను హత్య చేసిన వ్యక్తిని ఎంపీగా నిలబెట్టారంటూ దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇక లోకేశ్ అయితే నేరుగా ముఖ్యమంత్రి జగనే తన బాబాయి వివేకాను హత్య చేశారని ఆరోపించారన్నారు. పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ తదితరులు కూడా ఇలాగే దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. వివేకా హత్య కేసు సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో జగన్, అవినాశ్, వైఎస్సార్సీపీపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆయా పార్టీల అధినేతలను, క్యాడర్‌ను నిరోధించాలన్నారు. రాజకీయ మైలేజీ కోసమే సీఎం జగన్, అవినాశ్‌పై వ్యాఖ్యలు.. ‘ప్రస్తుత కేసులో షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, బీటెక్ రవి వారి రాజకీయ మైలేజీ కోసం వైఎస్సార్సీపీపై, వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో జగన్ ఎన్నడూ కూడా నిందితుడు కాదు. కాబట్టి వివేకాను జగన్ చంపారంటూ ప్రజలందరి ముందు లోకేశ్ చేసిన ప్రకటన పరువు నష్టం కలిగించేదే. సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటూ.. ఈ కోర్టు ఈ కేసులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఉత్తర్వుల వల్ల షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుంటే వైఎస్సార్సీపీ, జగన్, అవినాశ్ రెడ్డిలకు తీరని నష్టం కలుగుతుంది. ఇదే సమయంలో షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులు పదే పదే పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తారు. ఎన్నికల వేళ ఇది వైఎస్సార్సీపీ, ఎన్నికల్లో పోటీ చేసే ఆ పార్టీ అభ్యర్థులకు తీరని నష్టం కలిగిస్తుంది. అందుకే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ఈ కేసులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించా’ అని జిల్లా జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఇదంతా సీబీఐ, సునీత ఆడుతున్న డ్రామా
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సునీతక్క చెబుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి చెప్పారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు శాస్త్రీయ విధానంలో కాకుండా, పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని అన్నారు. ఇదంతా దస్తగిరిని అడ్డం పెట్టుకొని, హియర్ సే ఎవిడెన్స్ అంటూ సీబీఐ, సునీత తదితరులు కలిసి ఆడుతున్న డ్రామా అని స్పష్టం చేశారు. ఎంపీ అవినాశ్ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసలు దస్తగిరి అప్రూవర్‌గా మారకముందే ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ‘వివేకా హత్య జరిగిన 40 రోజుల తర్వాత దస్తగిరి సీబీఐ ముందు వాంగ్మూలమిస్తూ అతనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలి. కానీ, సీబీఐ అతన్ని అరెస్టు చేయలేదు. పైగా, అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సీబీఐ, సునీత సహకరించారు. 2021 అక్టోబరు 21న కోర్టులో దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే సీబీఐ అభ్యంతరం లేదని చెప్పింది. సునీత అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్ వచ్చేంత వరకూ వేచి ఉండి, ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ఐపీసీ 306(4)ఏ ప్రకారం అప్రూవర్ అయితే కోర్టులో విచారణ అయ్యే వరకు బెయిల్ రాదు. కాబట్టే బెయిల్ వచ్చిన తర్వాత 306 (4)బి ప్రకారం అప్రూవర్‌గా మార్చారు. ఇక అతను జైలుకెళ్లే అవకాశం లేదు. సీబీఐ, సునీత ఈ విధానాన్ని వాడుకున్నారు. ఒకవేళ హంతకుడినని ఒప్పుకొన్న అతన్ని అరెస్టు చేసి ఉంటే జీవిత కాలం బెయిల్ వచ్చి ఉండేది కాదు. అందుకే హంతకుడినని ఒప్పుకొన్న దస్తగిరి ఒక్క రోజు కూడా జైలులో ఉండకుండా అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సహకరించి, ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని బయటకు తెచ్చారు. ఇక జీవిత కాలం ఈ కేసులో అతని అరెస్టు ఉండదని హామీ ఇచ్చి, ఈ ప్రయోజనాన్ని కల్పించినందుకు వారికి కావల్సిన పేర్లను అతనితో చెప్పించుకున్నారు. ఇదంతా డ్రామా కాదా?’ అని అవినాశ్ ప్రశ్నించారు. దస్తగిరి హియర్ సే ఎవిడెన్స్ అంటూ అప్పటి దర్యాప్తు అధికారి రామ్‌సింగ్, సునీత కలిసి కట్టుకథ అల్లారని, అందువల్లే తన తండ్రి చేయని నేరానికి ఏడాదిగా జైల్లో మగ్గుతున్నారని, రెండున్నరేళ్లు శివశంకర్‌రెడ్డి జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపారు. గూగుల్ టేకౌట్‌కు కచ్చితత్వం ఉండదని గూగులే వెల్లడించిందని, అయినా దాని ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేస్తున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మేన్ రంగన్న నలుగురి పేర్లు చెప్పినప్పటికీ, వారిని దర్యాప్తు అధికారి అరెస్టు చేయలేదని, కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపి వాస్తవాలు రాబట్టలేదని తెలిపారు. సునీత అప్పుడొకలా.. ఇప్పుడొకలా.. వివేకా హత్యపై నర్రెడ్డి సునీత మొదట్లో ఒకలా, ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారని అవినాశ్ అన్నారు. ‘2020 జూలై 20న సీబీఐకి సునీత వాంగ్మూలమిస్తూ ఆమె భర్త సెల్ఫోన్లో వివేకా రాసిన డెత్ నోట్ ఫోటో చూపించారని, అందులో మా తండ్రి డ్రైవర్ ప్రసాద్‌ను డ్యూటీకి త్వరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టాడని, ఈ లెటర్ రాసేందుకు చాలా కష్టపడ్డానని, డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దని రాసి ఉన్నట్లు చెప్పింది. 2020 ఆగస్టు 27న లెటర్ గురించి ఏమీ తెలియదని, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ చూపించారని చెబుతోంది. ఇలా నెలలోనే ఎందుకు మాట మార్చింది? హత్య జరిగిన 10 రోజులకు నాన్నగారు అవినాశ్‌ను ఎంపీని చేసేందుకు, జగనన్నను సీఎంను చేసేందుకు ఏమేమి చేయాల్నో అంతా చేశారని సునీత చెప్పింది. ఈరోజు హత్యకు ఎంపీ టికెట్ మోటివ్ అని చెబుతున్నారు. నాలుగేళ్ల తర్వాత 2023 మే31న సీబీఐ దగ్గరికి వెళ్లి అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెప్పమంటే అలా చెప్పానంది. అప్పటికే 13 సార్లు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన సునీత ఏనాడూ ఈ విషయాన్ని చెప్పలేదు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పమంటే.. ఇప్పుడు చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణా చెప్పమంటే చెబుతున్నారా’ అని అన్నారు. శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేస్తేనే వెళ్లాను ‘ఆ రోజు జమ్మలమడుగు వెళ్తున్న నాకు వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేశారు. వివేకా చనిపోయినట్లు చెప్పి విలపించారు. వెంటనే ఇంటికెళ్లమన్నారు. నేను వెళ్లి డెడ్‌బాడీని చూసి బయటకు వచ్చేశాను. సీఐకి ఫోన్ చేసి త్వరగా రమ్మన్నాను. డెత్ నోట్లో ఉన్న వాస్తవ విషయాన్ని చెప్పకుండా ఘటన స్థలంలోకి నన్ను వెళ్లమని ఎందుకు చెప్పారు? లెటర్లో ఉన్న విషయం తెలిసిన వెంటనే నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు పోలీసులకు చెప్పలేదు? ఇంక థర్డ్ పర్సన్ ఫోన్‌కాల్ కోసం వెయిటింగ్ ఎక్కడ? శివప్రకాష్‌రెడ్డి థర్డ్ పర్సనా? వివేకా చివరి రెండేళ్లు డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడ్డారని పని మనుషులు వాంగ్మూలమిచ్చారు. ఆస్తి ఆమ్మే అవకాశం లేదు. చెక్ పవర్ రద్దు చేశారు. రెండో భార్య షమీమ్, అమె కుమారుడి కోసం ఇబ్బందులు పడ్డారు. డబ్బు కోసం డైమండ్స్, సెటిల్మెంట్లు అంటూ తిరగడం ఆరంభించారు’ అని తెలిపారు. మా ఇద్దర్నీ గెలిపించాలని వివేకా పిలుపు ‘నేను చేసే ప్రతి కార్యక్రమాన్నీ వివేకా బలపర్చేవారు. 2014లో వేంపల్లెలో వీధి వీధీ తిరుగుతూ జగన్నను సీఎం చేయాలని, నన్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. 2019ఎన్నికల్లో చివరిరోజు కూడా ఇంటింటా ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించామని చెబుతున్నారు. 854 మంది ఓటర్లలో ఒక్కరినైనా సీబీఐ విచారించిందా? మీకంటే చిన్నోడినైన నాపైన ఎందుకింత ద్వేషం’ అని ప్రశ్నించారు. వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలే ఆరోజు రాత్రి అంతా నేను ఫోన్ వాడినట్లు సునీత చెబుతోంది. నేను ఆరోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేచాను. ఫోన్ నెట్ ఆన్‌లో ఉంటే మేసేజ్‌లు వస్తుంటాయి. నానుంచి ఎవరికీ మెసేజ్ కానీ, ఫోన్‌కాల్ కానీ వెళ్లలేదు. ఎర్ర గంగిరెడ్డి నుంచి నాకు ఎలాంటి మేసేజ్ రాలేదు. అంటే వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలే. ఎవరెన్ని అబద్దాలు చెప్పినా న్యాయమే గెలుస్తుంది. సీబీఐ ఎప్పటికైనా లెంపలేసుకోక తప్పదు. నాకు న్యాయస్థానాలపై నమ్మకం, గౌరవం ఉంది. షర్మిల, సునీత ఆరోపణలను ప్రజలు విశ్వసించరు. తాను బీజేపీకిలోకి వెళ్తాననడం ‘జోక్ ఆఫ్ ది సెంచురీ’ అని ఓ విలేకరి ప్రశ్నకు సమా«ధానంగా అవినాశ్ రెడ్డి చెప్పారు. హార్ట్ ఎటాక్ అన్నది సునీత కుటుంబం చేసిన ప్రచారమే ‘హార్ట్ ఎటాక్ అన్న విషయం సునీత కుటుంబం నుంచే ప్రచారమైంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అదే రోజు మీడియాతో మాట్లాడుతూ హార్ట్ ఎటాక్‌తో వివేకానందరెడ్డి చనిపోయినట్లు శివప్రకాష్‌రెడ్డి చెప్పినట్లుగా తెలిపారు. అదే విషయాన్ని వీడియో ద్వారా వివరించారు. హార్ట్ ఎటాక్ అని ఫిర్యాదు చేయాలని పీఏ కృష్ణారెడ్డికి చెప్పినట్లు సునీత చెప్పారు. డెత్‌నోట్ చదివాక కూడా హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పారు’ అని ప్రశ్నించారు. -
వివేకా కేసులో సునీత, దస్తగిరి లాలూచీ పడ్డారు: ఎంపీ అవినాష్
సాక్షి, కడప: వివేకా కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ .. దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా.. ఆయన్ను అప్రూవర్‌గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కేసులో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు అవినాష్. ఏపీ ఎన్నికల వేళ.. రాజకీయాలు వేడేక్కిన వేళ.. పోలింగ్ సమీపిస్తోన్న వేళ.. నర్రెడ్డి సునీత పెడుతున్న ప్రెస్మీట్లు, చేస్తోన్న వివాదస్పద అంశాలు, బోడిగుండుకు.. మోకాలికి ముడిపెడుతూ చేస్తోన్న సూత్రీకరణలను అవినాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక పకడ్బందీగా పన్నిన కుట్రలో భాగంగా సునీత ప్రెస్మీట్లలో అబద్దాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని, షర్మిల ఓ అడుగు ముందుకేసి ఎన్నికల ప్రచారంలో వాడుకుంటోందని, వాటిని చంద్రబాబు.. మరో అడుగు ముందుకేసి హత్యా రాజకీయాలంటూ ప్రకటనలు చేస్తున్నారని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అసలు హత్య కేసులో ఇప్పటివరకు సిబిఐ అనుసరించిన ధోరణి, దర్యాప్తులో డొల్లతనంతో పాటు సునీత వ్యవహార శైలిని కూడా అవినాష్ రెడ్డి పలు ఆధారాలతో మీడియా ముందుంచారు. ఎంపీ అవినాష్ ప్రెస్మీట్లో ముఖ్యాంశాలు: షర్మిల రాజకీయ సభల్లో ఏం మాట్లాడుతుందో అందరు చూస్తున్నారు లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు సునీత పవర్ పాయింట్ ప్రజటేషన్ ఇస్తోంది అసలు ఈ కేసులో మాట్లాడటం ఇష్టం లేదు, కేవలం వివరణ కోసమే మీడియా ముందుకు వచ్చాను దస్తగిరిని అప్రూవర్ చేసిన విధానం అందరు గమనించండి ఈ కేసులో వాచ్ మెన్ రంగన్న ఐ విట్ నెస్ ...నలుగురి పేర్లు చెప్పాడు రంగన్న చెప్పిన వారిని ఏ విచారణ సంస్ద అయిన అరెస్ట్ చేసి కస్టడీ అడిగి సమాచారం రాబట్టాలి నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చెయ్యలేదు దస్తగిరి హత్య చేశానని ఒప్పుకున్నా అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపారు అనంతరం దస్తగిరి యాంటిస్పేటరీ బెయిల్ అడిగాడు దస్తగిరి బెయిల్‌కు సునీత అభ్యంతరం చెప్పలేదు పక్కా ప్రణాళికతో దస్తగిరిని అప్రూవర్ చేశారు 306- 4A ప్రకారం అప్రూవర్‌ను ట్రయల్ అయిపోయే వరకు బయటకు పంపకూడదు కానీ చట్టంలో లొసుగులను అధారంగా చేసుకుని.. అడిగినంత డబ్బు ఇస్తామని అప్రూవర్‌గా మార్చారు అప్రూవర్ అనేది అనవాయితీగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుంది? సిబిఐతో సునీత, దస్తగిరి లాలూచీకి అనేక ఉదహరణలు ఉన్నాయి ఇచ్చిన వాంగ్మూలన్నే నా వాంగ్మూలం కాదని సునీత చెబితే సిబిఐ ఎలా అంగీకరిస్తుంది.? హత్య జరిగిన పది రోజులకు సునీత ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందో అందరికీ తెలుసు జమ్మలమడుగులో చనిపోయే ముందు రోజు వరకు అవినాష్ రెడ్డికి మద్దతుగా వివేకా ఎన్నికల ప్రచారం చేశారని సునీత చెప్పింది ఇంత స్పష్టంగా చెప్పి ఇప్పుడు ఎంపి టికెట్ కోసమని ఎలా మాట మార్చుతారు? నాకు బెయిల్ వచ్చాకా ఇప్పటివరకు 13 సార్లు వాంగ్మూలం ఇచ్చాను ఎవరో ఫోన్ చేస్తే అవినాష్ వెళ్లి సాక్షాలు చెరిపానని సునీత బురద జల్లుతోంది ఈ కేసులో శివప్రకాష్ రెడ్డి మూడవ వ్యక్తి అని సునీత ఎలా చెబుతుంది? వైఎస్ వివేకానందరెడ్డికి సొంత బావమరిది శివప్రకాష్ రెడ్డి, ఆయన మూడో మనిషి ఎలా అవుతాడు ? శివప్రకాష్ చెబితేనే నేను వివేకా ఇంటికి వెళ్లాను, అ తరువాతే నేను సమాచారం చెప్పాను మూడో వ్యక్తి కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని ఎలా అంటారు ? ఎవరైనా కాల్ చేస్తారని ముందే ఊహిస్తారా? నేను వెళ్లక ముందే క్రిష్ణారెడ్డి వివేకా ఇంటికి వెళ్లాడు, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో మాట్లాడాడు నేను వెళ్లగానే పోలీసులకు కూడా చెప్పాను వివేకా లెటర్ దాచిపెట్టడం పెద్ద నేరం, తప్పడు ఉద్దేశం ఉంటే అ రోజే చెప్పి ఉండాలి ఎర్రగంగిరెడ్డి 45 నిమిషాలు అలస్యంగా వచ్చాడు ఎర్రగంగిరెడ్డికి శివప్రకాష్ రెడ్డే ఫోన్ చేశాడు సునీత ఏ రకంగా నిందలు వేస్తున్నారో అందరు గమనించాలి ఎర్రగంగిరెడ్డి వివేకాకు ఎంత అప్తుడొ అందరికి తెలుసు వివేకానందరెడ్డి చివరి రెండేళ్లు తీవ్ర దుర్బర పరిస్దితి అనుభవించారు చివరి రోజుల్లో ఎందుకు నిరాదరణకు గురిచేసారో చెప్పాలి ? బెంగుళూరులో సెటిల్ మెంట్ లో డబ్బు వస్తే రెండో కుటుంబానికి ఇవ్వాలని ప్రయత్నించారు. రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా వివేకాను సొంత కుటుంబ సభ్యులే నిరాదరణకు గురిచేశారు ఇక సునీత తరచు చెబుతున్నట్టు గూగుల్ మ్యాప్, గూగుల్ టేక్ అవుట్ ఒకటి కాదు గూగుల్ టేక్ అవుట్‌కు శాస్త్రీయత లేదని గూగులే చెబుతోంది వైఫై వాడితే ఒక రకంగా డేటా అయితే ఒక రకంగా చూపుతుంది 100 మీటర్ల నుంచి కిలోమీటర్ అంత దూరం తేడా కనిపిస్తోంది అది కూడా మూడేళ్ల తరువాత చూశారు? మొదట్లో గూగుల్ టేక్ ఔట్ ఎందుకు తప్పని అనిపించలేదు? గూగుల్ టేక్ ఔట్ అనేది తప్పుగా నమోదు చేశామని సిబిఐ ఎందుకు కోర్టుకు వివరణ ఇచ్చింది? గ్రీన్ విచ్ మీన్ టైం ప్రకారం 5.30గంటలు వెనక చూపించామని లిఖిత పూర్వకంగా ఎందుకు రాసిచ్చింది? ఇది వివాదం అవ్వడంతో దీంతో మళ్లీ సాకులు చెబుతు కౌంటర్ వేశారు వారి కారణాలపైనే వారే అఫిడవిట్ వేశారు, అబద్దాన్ని ఏమి చేసినా నిజం కాదు చంద్రబాబు కుట్రలో సునీత భాగమై ఇలా మాట్లాడుతున్నారు నేను ఏ తప్పు చెయ్యలేదు, ఎవ్వరికీ భయపడిదిలేదు న్యాయవ్యవస్దపై పూర్తి నమ్మకం ఉంది ఈ కేసులో తాము అనుసరిస్తోన్న తీరుకు సిబిఐ లెంపలేసుకుని వెనక్కి వెళ్లాల్సి వస్తుంది నా ఫోన్లో వాట్సప్ యాక్టివ్ ఉన్నందుకు నిందితులతో మాట్లాడానని ఆరోపిస్తున్నారు ఆరోపించే వారికి కనీసం వాట్సాప్ పట్ల అవగాహన అయినా ఉండాలి నా నెంబర్ వాట్సాప్‌లో ఎన్నో గ్రూపులున్నాయి. ఏ గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా.. వాట్సాప్‌లోకి వస్తుంది నేను నిద్ర పోయినప్పుడు వచ్చే మెసెజ్‌లు ఎవరైనా చూస్తారా? మూడేళ్లుగా నన్ను అప్రతిష్టపాలు చేశారు అనేక ఇబ్బందులకు గురిచేశారు 74 యేళ్ల వయస్సులో మా తండ్రి జైలులో మగ్గుతున్నాడు టిడిపి, బిజేపి నాయకులను అడ్డుపెట్టుకుని కేసులు వేశారు హత్యని తెలిసింది ముందుగా వివేకా కుటుంబ సభ్యులకే.! వైఎస్అర్ చనిపోయాక షర్మిలకు ఎంపిగా ఉండాలనే ఆలోచన ఎందుకు రాలేదు? వీరే కదా నన్ను ఎంపీగా ఉండమని పిలిచింది కేవలం ఎంపీ పదవి చూపి విమర్శలు చెయ్యడం సరికాదు -
సీఎం జగన్ పై దాడిని ఖండించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
-
షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు: వైఎస్సార్ సోదరి విమల
సాక్షి, విజయవాడ: వైఎస్ కుటుంబ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైఎస్ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని వైఎస్సార్ సోదరి విమల ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీతలు ఏది మాట్లాడినా కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారని, వివేకా కేసులో నిత్యం అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ఇంట్లో అమ్మాయిలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని అల్లరి పెట్టడం బాధగా అనిపిస్తోందని అన్నారామె. వైఎస్ విమల శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారు. మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నాను. నేనూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నా. షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసాను. షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు. నిత్యం షర్మిల అవినాష్‌ను విమర్శిస్తున్నారు. అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా?. సీఎం జగన్‌ను కూడా దీంట్లోకి లాగుతున్నారు. వాళ్లే(షర్మిల, సునీతలు) డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు?. హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు. అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా?.. .. షర్మిలకు లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడ ఉంది. అవినాష్ 10ఏళ్లు చిన్నవాడు. అతనికి కుటుంబం ఉంది. ఏ పాపం చేయని నా సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నాడు. అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారు. హత్య చేసిన వాడు సుప్రీంకోర్టు కు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం బాధగా ఉంది. శత్రువులంటా ఒక్కటైనపుడు కుటుంబసభ్యుడికి తోడుగా ఉండాలి. వైఎస్సార్ ను ఇప్పటికీ కోట్లాదిమంది గుండెల్లో పెట్టుకున్నారు. వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం. షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారు. జగన్ పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు. వివేకం, వైఎస్సార్ ఇద్దరూ ఫ్యాక్షన్ కి వ్యతిరేకంగా ఉన్నారు. రాజారెడ్డిని చంపినపుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు .. ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు. మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండి. పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు. అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది. షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు. మా వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించట్లేదు. మీరు చేసే పనుల పట్ల వైఎస్సార్ కూడా సంతోషంగా లేరు. వైఎస్సార్ ని ఇబ్బందులు పెట్టినవారు ఇప్పుడు షర్మిలతో ఉన్నారు .. కడప, పులివెందులలో జరిగిన అభివృద్ధి నీ కళ్ళకు కనిపించట్లేదా?. వైఎస్సార్ ఉన్నపుడు వివేకానంద రెడ్డి కడప చూసుకున్నారు. ఇప్పుడు అవినాష్ కడప చూసుకుంటున్నారు. నిస్వార్థంగా పని చేసి కడపను అభివృద్ధిని చేస్తున్నారు. మీరెన్ని మాటలు అన్నా అవినాష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడటం లేదు. శతృవులంటా ఏకమై మీ చుట్టూ చేరారు. అవినాష్ పై మీకు కోపం పోవాలని ప్రార్థిస్తున్నాను. మీకు దైవ భయం కూడా లేకుండా పోయింది. షర్మిల ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. నేను షర్మిల, సునీతకు చెప్పాలని చూసినప్పటి నుండి నాతో కూడా మాట్లాడడం మానేశారు. షర్మిల, సునీత కు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. గత ఐదేళ్లుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. డబ్బు కోసమో, పదవులకోసమో నాకు తెలియదు.. కానీ ఏదో ఆశించి వాళ్లిద్దరూ ఇదంతా చేస్తున్నారు. .. జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు. బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు. వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా. అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు. మేనత్తగా చెబుతున్నా మీరు ఇప్పటికైనా మారండి.. నోళ్లు మూసుకోండి. లేదంటే ఒకసారి షర్మిల, సునీత మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకోండి. అవినాష్ గెలవాలని చివరిరోజువరకూ వివేకానంద రెడ్డి పనిచేశారు. ప్రజలంతా సీఎం జగన్ కి అండగా ఉండాలి. మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి. అవినాష్ కు, జగన్ కు ఓట్లు వేసి గెలిపించాలి. షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్ ను నమ్మవద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలి’’ అని విమల ఏపీ ప్రజల్ని కోరారు. -
గత కొన్నేళ్లుగా మాపై బురదచల్లే ప్రయత్నం జరుగుతోంది: అవినాష్ రెడ్డి
-
‘మా కుటుంబంలో చీలిక తెచ్చారు’: ఎంపీ అవినాష్‌రెడ్డి
సాక్షి,వైఎస్ఆర్: తనేంటో తన మనస్తత్వం ఏంటో ప్రజలకు తెలుసని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. పులివెందులలో వైఎస్ఆర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో అవినాష్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘మూడేళ్లుగా తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. మా కుటుంబంలో కూడా చీలికలు తెచ్చారు. మాపై ఎంత ద్వేషంతో మాట్లాడుతున్నారో చూడండి. వైఎస్ అవినాష్‌రెడ్డి ఎలాంటి వాడో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. అయినా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ఉన్నాం. ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి. అయినా నేను ప్రజల్లోనే ఉంటా.. ప్రజల కోసం పని చేస్తా. బలిజలకు 31 ఎమ్మెల్యే 5 ఎంపీ సీట్లు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ. బలిజలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ మనది. గడచిన 16 నెలలుగా వర్షాలు పడకపోయినా గండికోట, చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులను నింపడం వల్లే ప్రస్తుతం రైతులకు సాగునీటికి, ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేదు. గతంలో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క హామీని విస్మరించింది. చంద్రబాబు నాయుడికి ధైర్యం సరిపోక మళ్లీ కూటమిగా వచ్చి 2014 లో ఇచ్చిన అబద్ధపు హామీలను మళ్లీ ఇస్తున్నారు. అధికారం కోసం చంద్రబాబు దిగజారిపోతున్నారు’ అని అవినాష్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి.. కర్నూలు జిల్లాలో కూటమికి భారీ షాక్ -
బాబు చేతిలో కీలుబొమ్మ సునీత
సాక్షి, అమరావతి: పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ లోకం అంతా కళ్లు మూసుకుందని అనుకున్నట్టుగా ఉంది నర్రెడ్డి సునీత తీరు. ఆమె చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా మారి, బాబు కుట్రలో భాగస్వామిగా మారి ఆమె తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. రాష్ట్ర ప్రజలంతా నమ్మేస్తారని భ్రమపడుతున్నారు. ఇదే భావనతో హైదరాబాద్‌లో శనివారం మీడియా సమావేశం నిర్వహించి మరీ చంద్రబాబు స్క్రిప్‌్టను వినిపించారు. ఇన్నాళ్లూ బాధితురాలిగా వేసుకున్న ముసుగును తొలగించి పూర్తిగా టీడీపీ మనిషినేనని బయటపడ్డారు. ఓ వైపు ఆమె తండ్రి వైఎస్ వివేకా హత్య వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తూనే, మరోవైపు వివేకా హంతకులతో జట్టు కడుతుండటం ఆమెకే చెల్లింది. వివేకానందరెడ్డి రెండో వివాహంతో కుటుంబంలో తలెత్తిన విభేదాలను మరుగున పెట్టి, తన తండ్రి హత్య వెనుక ఆస్తి వివాదాలు లేవని నమ్మిచేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కడప ఎంపీ అభ్యర్థిత్వంపై అవాస్తవాలు ప్రచారం చేసిన సునీత.. తాజాగా పులివెందుల ఉప ఎన్నికల్లో అభ్యర్థిత్వంపైనా అబద్ధాలు చెబుతున్నారు. ఆమె తండ్రి రాసిన లేఖను వారే దాచిపెట్టిన నిజం, గుండెపోటు కథను వారే ప్రచారంలోకి తెచ్చిన వాస్తవం బయటపడకుండా చూడటమే ధ్యేయమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకాను కుట్రతో ఓడించింది చంద్రబాబు ముఠాయేనని, 2019 ఎన్నికల్లో వివేకాను టీడీపీకి అడ్డుగా లేకుండా చేసిందీ ఎల్లో గ్యాంగేనన్నది బహిరంగ రహస్యం. అందుకే ఆమె అబద్ధాలను ప్రజలు నమ్మడంలేదు. అసత్య ప్రచారాన్ని పూర్తి ఆధారాలతో సహా, హేతుబద్ధమైన ప్రశ్నలతో ప్రజానీకం తిప్పికొడుతోంది. విజయమ్మకు వ్యతిరేకంగా వివేకా ఎందుకు పోటీ చేశారు? వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత వైఎస్ కుటుంబంలో పరిణామాలను సునీత వక్రీకరించారు. పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ భాస్కర్‌రెడ్డి పోటీ చేయాలని భావించగా వివేకానందరెడ్డి వ్యతిరేకించారని, వైఎస్ విజయమ్మే పోటీ చేయాలని పట్టుబట్టారన్నారు. సునీత ఎంత పచ్చిగా అబద్ధాలు చెబుతున్నారో ఇదే నిదర్శనం. పులివెందులలో విజయమ్మ పోటీ చేయాలని చెప్పిన వివేకా.. ఆమెకు వ్యతిరేకంగా పోటీ చేశారనే విషయాన్ని సునీత ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఆ ఎన్నికల్లో భాస్కర్‌రెడ్డి పోటీ విషయం చర్చకే రాలేదు. విజయమ్మనే పోటీ చేయించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. ఆమే పోటీ చేశారు కూడా. కానీ వైఎస్ వివేకానందరెడ్డి తన సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒత్తిడికి లొంగి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. వారి ఒత్తిడితోనే పులివెందులలో విజయమ్మపై పోటీ చేశారు. ప్రజలు మాత్రం సీఎం జగన్, వైఎస్ విజయమ్మ వెన్నంటి నిలిచారు. ఆ ఉప ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ విజయమ్మ భారీ మెజార్టీతో గెలిచారు. దీన్ని వక్రీకరించి ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపై దు్రష్పచారం చేసేందుకు సునీత యత్నించడం విడ్డూరంగా ఉంది. కడప ఎంపీ అభ్యర్థిత్వంపైనా అవాస్తవాలే? 2014లో కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేయాలని వివేకా భావించారని సునీత చెప్పుకొచ్చారు. అసలు కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్ రెడ్డిని వైఎస్సార్సీపీ ఏకాభిప్రాయంతో ఎంపిక చేసింది. వివేకా కూడా ఏకీభవించారు. 2019 ఎన్నికల్లో కూడా అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డినే మరోసారి పోటీ చేయించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆ ఎన్నికల ఇన్చార్జిగా వివేకానందరెడ్డినే నియమించారు. వివేకా చివరివరకూ అవినాశ్ రెడ్డి విజయం కోసం శ్రమించారు. హత్యకు గురికావడానికి ముందు రోజు కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పర్యటించి ఎంపీగా అవినాశ్ రెడ్డిని, ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. పార్టీ నేతలతో చర్చించి వచ్చారు. వివేకానందరెడ్డి చివరివరకూ అవినాశ్ విజయం కోసం పనిచేశారని సునీతే 2019 మార్చి 21న హైదరాబాద్‌లోనే మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ విషయం బాబు చేతిలో కీలుబొమ్మగా మారిన ఆమె మర్చిపోయిందేమో కానీ, ప్రజలందరికీ గుర్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించింది చంద్రబాబు ముఠానే 2017 వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సునీత ఆరోపణలూ అసత్యాలే. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వివేకానందరెడ్డినే వైఎజ్ జగన్ ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందినవారే కావడంతో వివేకా విజయం సులువేనని అంతా భావించారు. వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికైతే జిల్లాలో టీడీపీ ఉనికికే ప్రమాదమని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి, కుట్రపూరితంగా వివేకాను ఓడించారు. ఈ వ్యవహారంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డి కీలకపాత్ర పోషించారు. వాస్తవాలిలా ఉంటే.. సునీత మాత్రం వివేకాను ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి ఓడించారని పదే పదే అసత్యాలు చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వివేకా హత్య.. అది ఎల్లో గ్యాంగ్ కుట్రే తన తండ్రి హంతకులను శిక్షించడం కోసమే పోరాడుతున్నా అని చెబుతున్న సునీత ఉద్దేశపూర్వకంగా ఓ విషయాన్ని మర్చిపోతున్నారు. వివేకా హత్యకు గురైంది చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే. 2019 ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ విజయం కోసం వివేకా ఎన్నికల వ్యూహాలు పన్నుతూ అందర్నీ కలుపుకొంటూ దూసుకుపోతున్నారు. దాంతో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి బెంబేలెత్తారు. వివేకా జీవించి ఉంటే వారితో పాటు బీటెక్ రవికీ రాజకీయంగా ప్రతిబంధకంగా మారుతారు. ఈ నేపథ్యంలోనే వివేకా హత్యకు గురయ్యారు. వివేకా భౌతికంగా లేకపోవడం రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుందని టీడీపీ పెద్దలు భావించారన్నది సుస్పష్టం. వివేకా హత్యకు ముందు టీడీపీ నేతలు కొందరితో రహస్య సమావేశాలు, హత్య తరువాత ఆ నేతలు వ్యవహరించిన తీరే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. వివేకాతో ఆర్థిక విభేదాలు తలెత్తిన కొమ్మారెడ్డి పరమేశ్వరెడ్డితో బీటెక్ రవి సాన్నిహిత్యం పెంచుకున్నారు. హత్యకు ముందు రోజు అంటే 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. అంటే వివేకా హత్య వెనుక ఎల్లో గ్యాంగ్ ఉందన్నది స్పష్టమవుతోంది. సునీత మాత్రం చంద్రబాబు, ఆది నారాయణరెడ్డి, బీటెక్ రవిల పేర్లనే ప్రస్తావించడం లేదు. హడావుడిగా ఆస్తుల బదిలీ ఎందుకో.. వివేకానందరెడ్డి హత్య వెనుక కుటుంబ ఆస్తి వివాదాలు లేవని నమ్మిచేందుకు సునీత యత్నించారు. అసలు తన తండ్రి వివేకానందరెడ్డి పేరిట ఆస్తులేవీ లేవని చెప్పుకొచ్చారు. మరి ఆస్తులు ఏవీ లేకపోతే కుటుంబ కంపెనీల్లో ఆయన చెక్ పవర్‌ను ఆమె తల్లితో కలిసి ఎందుకు రద్దు చేశారు? వివేకా హత్య తరువాత పులివెందులలో ఉన్న భూములను హడావుడిగా తన పేరిట సునీత మార్చుకున్నారని రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయి కదా. ఆస్తుల బదిలీలో ఈ హడావుడి ఎందుకు? అంటే దస్తగిరి వాంగ్మూలం తప్పేకదా అంతేకాదు దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన బెంగళూరు భూ సెటిల్మెంట్ వివాదం అన్నది లేనేలేదని సీబీఐ చెప్పిందని సునీత గుర్తుచేస్తున్నారు. అంటే అప్రూవర్‌గా మారుతూ దస్తగిరి చెప్పిన విషయాలు అవాస్తవాలేనని సునీత అంగీకరించినట్టే కదా. అలా అయితే దస్తగిరి ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిపై చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అవాస్తవమే అవుతాయి కదా. వైఎస్ వివేకా హత్యతో వారికి సంబంధం లేనట్టే అవుతుంది. ఆ విషయాన్ని సునీత ఎందుకు అంగీకరించడంలేదు? అవినాశ్ రెడ్డిపై అసత్య ఆరోపణలను ఎందుకు కొనసాగిస్తున్నారు? అంటే.. కేవలం చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే ఆమె వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మే తన వెనుక ఏ పార్టీ లేదని సునీత ఎంతగా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, చంద్రబాబు చేతిలో ఆమె కీలుబొమ్మగా మారారన్నది ఆమె వ్యవహార శైలే చెబుతోంది. టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే వైఎస్సార్సీపీకి ఓటేయకూడదని అంటున్నారు. బాబు ఐదేళ్లుగా చేస్తున్న అసత్య ఆరోపణలనే ఆమె పదే పదే వల్లిస్తున్నారు. వివేకా హంతకులతో సునీత దంపతుల సాన్నిహిత్యం వివేకానందరెడ్డి హత్యకు గురైన సమయంలో ఆయన నివాసంలో ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డితో సునీత దంపతులకే దశాబ్దాలుగా సాన్నిహిత్యం ఉంది. ఆ నలుగురితో వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డికి సాన్నిహిత్యం లేదు. ఇక వివేకాను గొడ్డలితో నరికి చంపానని అంగీకరించిన హంతకుడు దస్తగిరితో సునీత దంపతులు ఇప్పటికీ ఎందుకు సఖ్యతతో ఉంటున్నారన్నది మరో కీలకాంశం. టీడీపీ ప్రభుత్వంలో నియమించిన సిట్, తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, సీబీఐ కూడా వివేకానందరెడ్డిని దస్తగిరితో సహా నలుగురు హత్య చేశారని నిర్ధారించాయి. వివేకాను గొడ్డలితో స్వయంగా నరికాను అని చెప్పిన దస్తగిరి అప్రూవర్‌గా మారడంతోనే ఈ కేసు దర్యాప్తు దారితప్పింది. సునీత, ఆమె భర్త దస్తగిరితో పలుసార్లు భేటీ అవుతున్నారు. టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితోనూ సన్నిహితంగా ఉంటున్నారు. అంటే వివేకా కుటుంబం, టీడీపీ నేతల పన్నాగంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్‌గా మారారన్నది సుస్పష్టం. వివేకా హంతకుడితో, రాజకీయ ప్రత్యర్థులతోనూ ఆ కుటుంబం సన్నిహితంగా ఉండటం ఈ హత్య కుట్రలో వారి సామూహిక భాగస్వామ్యాన్ని బహిర్గతం చేస్తోంది. వివేకా రెండో వివాహం, కుటుంబ వివాదాల సంగతేమిటి? వివేకానందరెడ్డి రెండో వివాహాన్ని సునీత ఉద్దేశపూర్వకంగా మరుగున పరుస్తున్నారు. షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు ఉన్నారని, దాంతోనే కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు తలెత్తాయనే వాస్తవాన్ని కప్పిపుచ్చుతున్నారు. ఎందుకంటే వివేకా హత్య వెనుక కుటుంబంలో విభేదాలు కీలక పాత్ర పోషించాయి. ఆయన మరణిస్తే ఎవరికి ప్రయోజనం, ఆయనతో వ్యక్తిగతంగా, ఆస్తిపరంగా, రాజకీయంగా ఎవరికి విభేదాలు ఉన్నాయన్నది ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం. రెండో భార్య షమీమ్‌కు పుట్టిన కుమారునికి ఆస్తిలో భాగం ఇవ్వాలని వివేకా భావించారు. రాజకీయ వారసునిగా చేస్తానని కూడా ప్రకటించారు. దాంతో ఆ కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ వివాదాలు తీవ్రస్థాయిలో తలెత్తాయి. వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆయనతో తీవ్రంగా గొడవపడి, ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్‌లో ఉంటున్నారు. కుటుంబానికి చెందిన కంపెనీల్లో వివేకాకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేశారు. సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి షమీమ్ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీమ్, సునీత దూషించుకుంటూ చేసుకున్న వాట్సాప్ చాటింగ్‌ను కూడా అప్పట్లోనే సిట్ బృందం వెలికితీసింది. షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని, ఆమె కుమారుడిని హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నప్పటికీ అవడంలేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. షమీమ్ కూడా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇవన్నీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి జీవించి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదికే ఎక్కువ ప్రయోజనమన్నది స్పష్టమవుతోంది. వివేకాను హత్య చేసిన తరువాత ఆయన నివాసంలో కొన్ని ఆస్తి పత్రాలు, రౌండ్ సీల్ కోసం హంతకులు వెదికారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంటే వివేకా తన రెండో భార్యకు రాసిచ్చిన ఆస్తి పత్రాలను ఆ ఇంటి నుంచి తీసుకువెళ్లారన్నది సుస్పష్టం. వివేకా లేకపోతే ఆస్తి మొత్తం దక్కడంతోపాటు రాజకీయ వారసత్వం కూడా తమకే వస్తుందన్న ఉద్దేశం ఆయన బావమరిది, అల్లుడికి ఉందన్నది స్పష్టమైంది. లేఖను దాచిందీ మీరే.. గుండెపోటు ప్రచారం చేసిందీ మీరే ఇన్ని విషయాలు రెండేళ్లుగా మాట్లాడుతున్న సునీత.. వైఎస్ వివేకా గుండె పోటుతో మరణించారనే ప్రచారం ఎలా వచ్చిందో మాత్రం చెప్పరు. ఎందుకంటే ఆయన గుండెపోటుతో చనిపోయారన్న ప్రచారం వెనుక సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డే ఉన్నారు. వివేకా రాసిన లేఖను కూడా దాచిపెట్టి ఆ ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. శివప్రకాశ్ రెడ్డే మొదటగా ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. టీవీ చానళ్లలో ప్రసారమైంది. ఆ ప్రచారాన్ని కొనసాగించేందుకు వివేకా రాసిన లేఖను కుమార్తె, అల్లుడు రహస్యంగా ఉంచారు. ఆ లేఖను మొదటగా ఆరోజు ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి ఆ విషయాన్ని సునీత భర్త రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖ, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని రాజశేఖరరెడ్డి ఆయనతో చెప్పారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాని హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసిపోయేది. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. వారు ఆ లేఖను చదివిన వెంటనే అయినా దాన్ని పోలీసులకు ఇచ్చారా అంటే అదీ లేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. -
షర్మిల వ్యాఖ్యలపై వైఎస్ అవినాష్ రెడ్డి రియాక్షన్..
-
బాబు పన్నాగం.. రాజకీయ శిఖండిలా షర్మిల, సునీత
తండ్రి హత్య ద్వారా రాజకీయంగా ఎదగాలన్న కుతంత్రం కూతురిది. సొంత బాబాయి హత్యను వ్యక్తిగత లాభంకోసం వాడుకోవాలన్నది మరొకరి వ్యూహం. ఇద్దరు ఆడవాళ్లను అడ్డంపెట్టుకుని రాజకీయం చేయాలన్నది చంద్రబాబు పన్నాగం. ఇదీ వివేకా హత్య చుట్టూ జరుగుతున్న రాజకీయ రాక్షస క్రీడ. నర్రెడ్డి సునీతారెడ్డి సంచలనం రేపిన వివేకానందరెడ్డి హత్య తరువాత వార్తల్లో బాగా వినిపించిన పేరు. వివేకా చనిపోయిన రోజు నుంచి గత ఐదేళ్లుగా సునీతారెడ్డి చెబుతున్న మాటలు.. .చేస్తున్న ప్రకటనలు ఆమెపై అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. వివేకా హత్య తరువాత సంఘటనా స్థలంలో దొరికిన లెటర్ దాచిపెట్టడం మొదలు తన తండ్రితో సునీతారెడ్డికి ఉన్న విభేధాలు ఆమెపై అనుమానాలు మరింత బలపడేలా చేశాయి. అబద్ధం సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తన తండ్రి రెండో వివాహం చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న సునీతారెడ్డి చాలాకాలంగా వివేకాతో మాట్లాడటం మానేశారు. ఆ తరువాత జరిగిన గొడవల కారణంగానే వివేకా హత్య జరిగిందనే అనుమానాలూ ఉన్నాయి. ఇక వివేకా హత్య కేసు విచారణ సందర్భంగా సీబీఐలోని కొంతమంది అధికారులతో కలిసి సునీతారెడ్డి సాక్ష్యులను బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. అబద్ధం సాక్ష్యం చెప్పాలని సునీతా దంపతులు తనపై ఒత్తిడి తెచ్చినట్లు వివేకా పీఏ కృష్ణారెడ్డి ఏకంగా పోలీసులకు, కోర్టుకే ఫిర్యాదు చేశారు. హత్య కేసును మరొకరిపై నెట్టేసేందుకు ఇక తన తండ్రి హత్య వెనక టీడీపీ నాయకులున్నారని ఆరోపించిన సునీతారెడ్డి తరువాతి కాలంలో అదే టీడీపీతో కలిసి పనిచేయడంతో ఆమెపై అనుమానాలు మరింత బలపడ్డాయి. తన తండ్రిని చంపానని బాహాటంగానే ప్రకటించిన దస్తగిరికి అనుకూలంగా సునీతారెడ్డి వ్యవహరించడంపై కుటుంబ సభ్యులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక తన తప్పు బయటపడకుండా ఉండేందుకే సునీతారెడ్డి వివేకా హత్య కేసును మరొకరిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే అవినాష్‌రెడ్డిని ఇరికించే ప్రయత్నం జరుగుతోందనేది స్పష్టమవుతోంది. వివేకా హత్య జరిగిన తరువాత మీడియాతో మాట్లాడిన సునీతారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులపై అనుమానాలు వ్యక్తం చేశారు. హత్య తరువాత సరిగ్గా 12రోజులకు ప్రెస్‌మీట్ పెట్టిన సునీతారెడ్డి.. హత్యకు గల కారణాలపై సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ఆమె టీడీపీ నాయకులే హత్యచేశారని బలంగా వాదించారు. తన తండ్రి హత్య వల్ల లబ్ది పొందేది టీడీపీయేనని సునీతారెడ్డి కారణాలతో సహా సోదాహరణంగా వివరించారు. వివేకా హత్య వెనక టీడీపీ నేతలు: సునీతారెడ్డి టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి ఈ హత్య వెనక ఉన్నారని అధికార తెలుగుదేశం పార్టీ ఆ ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నిస్తోందని సునీతారెడ్డి ఆరోపించారు. ఆదినారాయణరెడ్డిని కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, దీని వెనక పూర్తిస్థాయి కుట్ర జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు సునీతారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం తన తండ్రిహత్య కేసు విచారణను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులెవరికైనా హత్యతో సంబంధం ఉంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. వారి పేరు ప్రకటించేవారని అన్నారు. కేవలం రాజకీయ లబ్దికోసమే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేసు విచారణను వాడుకుంటోందని ఆమె అన్నారు. వివేకా హంతకులను పట్టుకునేందుకు కాకుండాం తమ కుటుంబ సభ్యులను ఇరికించే విధంగా విచారణ సాగుతోందని విమర్శించారు. అవినాష్ గెలుపు కోసం వివేకా ప్రయత్నం ఇక తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే విషయాన్ని సైతం సునీతారెడ్డి తీవ్రంగా ఖండించారు. తన తండ్రి వివేకానందరెడ్డి ఎన్నికల్లో అవినాష్‌రెడ్డిని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారని సునీతారెడ్డి స్పష్టం చేశారు. కేసును తప్పుదారి పట్టించడంతోపాటు రాజకీయంగా లబ్దిపొందేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం వేసిన సిట్ నిందితులను పట్టుకోకుండా కేవలం తమ బంధువులను మాత్రమే విచారించడం వెనక కుట్ర జరుగుతోందనే అనుమానాలున్నాయన్నారు. మేము అనుమానాలు వ్యక్తం చేసినా కొంతమందిని టీడీపీ ప్రభుత్వంలోని సిట్ అధికారులు కనీసం విచారించలేదని అప్పట్లో ఆరోపించడం సంచలనం కలిగించింది. వివేకానందరెడ్డిని తెలుగుదేశం నేతలే హత్య చేసి ఉంటారని పలుమార్లు ఆరోపించిన సునీతారెడ్డి తరువాతి కాలంలో మాట మార్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖీఈ్కకి అనుకూలంగా ఆమె ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. చంద్రబాబుతో కలిసిం సొంత కుటుంబంపై కత్తులు దూస్తున్నారు. కాలం గడుస్తుంటే సునీతలో మార్పు వివేకా హత్యకు సంబంధించి ఎవరు హత్య చేశారుం ఎందుకు హత్యచేశారు అనే విషయంపై అందరికన్నా సునీతారెడ్డికే ఎక్కువ క్లారిటీ ఉంది. అందుకే ఆమె చాలాసార్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీం వివేకా హత్య గురించి కథలు కథలుగా చెప్పారు. కాలం గడుస్తున్నకొద్దీ సునీతారెడ్డి ఆలోచనల్లో పెను మార్పు రాసాగింది. సీబీఐ విచారణ ప్రారంభమైన తరువాత సునీతారెడ్డి పూర్తిగా మారిపోయారు. వివేకాను తామే కిరాతకంగా హత్యచేశామని ప్రకటించిన దస్తగిరి అండ్ బ్యాచ్‌కు సహకరించాలని నిర్ణయించుకున్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారకుండానే ముందస్తు బెయిల్‌కు అప్లై చేస్తే సునీతారెడ్డి కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ మాట ఎందుకు అడగలేదు వివేకాను నరికానని మీడియా ముందు ప్రగల్భాలు పలికిన దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని సునీతారెడ్డి కనీసం ఒక్కసారి కూడా ఎందుకు అడగలేదు. పైగా ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని ఇరికించాలని సునీతారెడ్డి దంపతులు సాక్ష్యులను బెదిరించడం ప్రారంభించారు. అవినాష్‌రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడాలని సీబీఐతో కలిసి వివేకా పీఏ కృష్ణారెడ్డిని హింసించారు. బాబుకు రాజకీయ లబ్ది కోసం.. వివేకా హత్య కేసులో చంద్రబాబు కుట్రపై ఆధారాలతో సహా ప్రెస్‌మీట్ పెట్టిన సునీతారెడ్డి తరువాతి కాలంలో చంద్ర బాబు చేతిలో పావుగా మారిపోయింది. చంద్రబాబు ఎజెండాను అమలు చేసే విధంగా రాజకీయ విమర్శలు చేయడంం చంద్రబాబు మనుషుల సహాయంతో కోర్టుల్లో పిటిషన్లు వేయడం ప్రారంభించింది. వివేకా హత్య కేసులో నిందితులకు శిక్షపడటం కన్నాం ఈ కేసు ద్వారా చంద్రబాబుకు రాజకీయ లబ్ది చేకూర్చాలన్న ఏకైకా అజెండా సునీతారెడ్డిలో బాగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు సునీతారెడ్డి రాజకీయ ప్రకటనలు ప్రారంభించించి వైఎస్సార్సీపీకి ఓటువెయొద్దంటూ అనే స్థాయికి ప్రచారం చేస్తోంది. లేఖను ఎందుకు దాచిపెట్టారు? వివేకా హత్యకేసులో టీడీపీ కుట్ర ఉందని ముందుగా ప్రకటించిన సునీతా తరువాతి కాలంలో ప్లేటు ఫిరాయించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా హత్య జరిగిన తరువాత అక్కడే దొరికిన లేఖను నర్రెడ్డి సునీతారెడ్డి దంపతులు ఎందుకు దాచిపెట్టారనే దానిపై ఇప్పటికీ సరైన సమాధానం లేదు. ఈ లేఖ విషయం ముందుగానే పోలీసులకు తెలిస్తేంకేసు విచారణ మరో విధంగా ఉండేదని స్పష్టమవుతోంది. హత్యను గుండెపోటుగా మలచడానికే ఈ లేఖను దాచిపెట్టారా అనే అనుమానాలు ముందునుంచీ ఉన్నాయి. ఆస్తి కోసమే హత్యా? ఇక వివేకా రెండో వివాహాన్ని వ్యతిరేకించిన సునీతారెడ్డి దంపతులు ఆస్తికోసమే ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ కేసులో అవినాష్‌రెడ్డిని ఇరికించేందుకు కుట్ర చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఆకాంక్షతోనే సునీతారెడ్డి తన తండ్రి కేసును వాడుకుంటున్నారనే ఆరోపణలు చాలారోజుల నుంచే వినిపిస్తోంది. ముఖ్యంగా తన తండ్రి కేసును టీడీపీకి అనుకూలంగా మార్చడం ద్వారాం భవిష్యత్తులో రాజకీయ లబ్ది పొందాలన్నది సునీతారెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్.. సునీతారెడ్డి నోట పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వివేకా హత్య కేసును రాజకీయం చేయాలని యత్నిస్తున్న సునీతారెడ్డికి.. ఆమె సోదరి షర్మిల జత కలిశారు. తెలంగాణాలో రాజకీయ పార్టీ పెట్టి ఘోర వైఫల్యాలను మూటగట్టుకున్న షర్మిలం వివేకా కేసు ద్వారా ఏపీలో పొలిటికల్ ఎంట్రీ కోసం పావులు కదిపారు. సంబంధంలేని వ్యక్తులపై బురదజల్లి వ్యక్తిగత వైషమ్యాలను రెచ్చగొట్టి లబ్దిపొందాలని యత్నిస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం వ్యక్తిగత ఆకాంక్షల నిమిత్తంం ఒక హత్యకేసును ఏవిధంగా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చో వివేకా కేసు మంచి ఉదాహరణ. సునీతతో చేతులు కలిపి.. తన తండ్రి హత్యకేసును తనకు అనుకూలంగా మార్చేందుకు అబద్ధాలు, అసత్యాలు పలుకుతున్న సునీతారెడ్డికి అనుకూలంగా అవతారం ఎత్తిన షర్మిల ప్రకటనలు చేయడం ప్రారంభించారు. రాజకీయ కారణాలతో తన అన్నతో విభేధించిన షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టి ఘోర వైఫల్యాలను మూటగట్టుకున్నారు. ఇక తెలంగాణాలో రాజకీయ దుకాణం నడపలేనని నిర్ణయించికున్న ఆమెం ఏపీలో ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా సునీతారెడ్డితో కలిసి తన కుటుంబంపైనే విమర్శలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా కడప ఎంపీ సీటుపై కన్నేసిన షర్మిల తన సోదరుడు అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే తతంగం నడిపారు. కడప ఎంపీ సీటు విషయంలో చంద్రబాబు సహకారం అందిస్తారనే నమ్మకంతో ఏకంగా తన అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేశారు. ఓవైపు విచారణ జరగుతుండగానే వివేకానందరెడ్డిని హత్య చేసింది.. అవినాష్‌రెడ్డి అంటూ తీర్పు చెప్పినట్లు చెప్పింది షర్మిల. రాజకీయ ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టిన షర్మిలం తన తండ్రిపై చార్జిషీటు వేసిన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పైగా వివేకా హత్యకు సంబంధించి గతంలో చాలాసార్లు అవినాష్‌రెడ్డికి అనుకూలంగా మాట్లాడిన షర్మిల ఇప్పుడు మాటమార్చటంపై.. జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై దశాబ్దాలుగా విషం చిమ్ముతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి అధినేతలు రామోజీ, రాధాకృష్ణతో పాటు చంద్రాబాబులతో షర్మిల స్నేహం చేయడం ఆమె తన విలువలను తాకట్టు పెట్టారనే చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఎదిగేందుకే విమర్శలు విలువలు, నైతికత ద్వారా రాజకీయాలకే వన్నె తెచ్చిన వైఎస్సార్ కుమార్తె ఇప్పుడు ఇలా దిగజారడం పెద్దాయన అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. రాజకీయంగా ఎదిగేందుకు తన సొంత అన్నపైనే కత్తిగట్టిన చెల్లెలుగా షర్మిల చరిత్రపుటల్లో మిగిలిపోతుందనే విమర్శ జగన్ అభిమానులను సైతం ఆవేదనకు గురిచేస్తోంది. రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయి అనే మాటకు షర్మిల చేస్తున్న రాజకీయాలే ఓ చక్కటి ఉదాహరణ. అందుకే హత్య కేసును వాడుకుని ఎదగాలన్నం షర్మిల ఆకాంక్ష ఆమె రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతుందనే చర్చ జరుగుతోంది. చంద్రబాబే ఈ కేసులో అసలైన సూత్రధారి! వివేకా కేసులో అత్యంత అనుమానాస్పద వ్యక్తి చంద్రబాబునాయుడు. హత్య సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. రాజకీయంగా తాను లబ్దిపొందెందుకు ఎందరో పాత్రధారులను సృష్టించిన చంద్రబాబే ఈ కేసులో అసలైన సూత్రధారి. ఇక వివేకా హత్య కేసులో ప్రథమ ముద్దాయిగా ఉండాల్సిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కేసు ద్వారా రాజకీయ లబ్దికోసం ఇప్పటికీ కూడా నానా కుట్రలు చేస్తున్నాడు. కేసును తప్పుదోవ పట్టించాడు ముఖ్యంగా హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు.. ఈ కేసు నుంచి అసలు హంతకులను తప్పించే కుతంత్రాలు చేశాడు. హత్య జరిగిన తరువాత సిట్ పేరుతో కాలయాపన చేసిం రాజకీయ లబ్దిపొందేందుకు ప్రయత్నించాడు. వివేకా హత్యకేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలను విచారించకుండా అడ్డుకున్నదీ చంద్రబాబే. అసలు హంతకులు దొరకకుండాం కాలయాపన చేస్తూ వైఎస్ కుటుంబంపై ఆరోపణలు చేశాడు. తన రాజకీయ లబ్దికోసమే వివేకాను హత్యచేయించాడనే ఆరోపణలు వచ్చినా అధికారం అడ్డుపెట్టుకుని చంద్రబాబు కేసును తప్పుదోవ పట్టించాడు. ఇక అధికారం పోయాక సీబీఐలోని కొంతమంది అధికారులను ప్రలోభపెట్టిన చంద్రబాబు కేసును తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన బాబుం మెల్లిగా కేసులో అమయాకుల పేర్లు వచ్చేలా కుట్రలు చేశాడు. రాజకీయ ఆశచూపి సునీతారెడ్డిని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకున్నాడనే విమర్శలున్నాయి. అందుకే చంద్రబాబు లాయర్ల ద్వారానే సునీతారెడ్డి కోర్టుల్లో పిటిషన్లు వేసినట్లు స్పష్టమైంది. రఘురామకృష్ణం రాజు ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా ఈ కేసులో కుట్ర జరిగినట్లు ఇప్పటికే పలుమార్లు స్పష్టమైంది. ఈ కేసులో అటు సునీతారెడ్డిని ఇటు షర్మిల ద్వారా తన రాజకీయ ఎజెండాను నడిపిస్తున్న చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తుండటంతో మరింత దిగజారాడు. ఇప్పుడు హత్యా రాజకీయాలంటూ ప్రకటనలు చేయడంం అదే మాటను పదే పదే సునితా షర్మిలతో పలికించడం ఈ కుట్రల వెనక ఉన్న చంద్రబాబు నిజ స్వరూపాన్ని బయటపెడుతోంది. అందుకే వివేకా కేసులో సునీతారెడ్డి, షర్మిల లాంటి పాత్రధారులెంతమంది ఉన్నా అసలు సూత్రధారి మాత్రం చంద్రాబాబే. నీచపు హత్యారాజకీయాల చదరంగంలో పావులెవరో పాపాత్ములెవరో లోకం చూస్తూనే ఉంది. అంతా గ్రహిస్తూనే ఉంది. ఎన్నికల్లో ఓటు రూపంలో సమాధానం చెప్పెందుకు జనవాహిని సంసిద్ధంగా ఉంది. -
షర్మిల వ్యాఖ్యలపై స్పందించిన అవినాష్‌రెడ్డి
వైఎస్ఆర్, సాక్షి: కడప లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలపై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించారు. మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని.. ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తానని, అదే మంచిదని వ్యాఖ్యానించారాయన. ‘‘నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు అమె విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయి. మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.. .. మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని. కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి. మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉంటుంది కదా!’’ అని అవినాష్‌రెడ్డి అన్నారు. -
ఇవేం రాజకీయాలు? ఇదేం తీరు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య 2019లో జరిగింది. ఆ హత్య జరిగిన సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. అధికారంలో తెలుగుదేశం ఉంది. ఆనాడు వ్యవస్థలన్నీ చంద్రబాబు చేతిలోనే ఉన్నాయి. అప్పుడు మీనమేషాలు లెక్కించిన వారు ఇప్పుడు 2024లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. ముఖ్యంగా షర్మిల చేస్తున్న రాజకీయ ఆరోపణలపై కడపలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిల ఎక్కడికి వెళ్లి ప్రచారం చేయాలనుకున్నా.. నేను రాజశేఖరరెడ్డి బిడ్డను అని చెప్పాలనుకున్నా.. ప్రజల మాత్రం జై జగన్ నినాదాలు వినిపిస్తున్నారు. చెప్పుకోడానికి షర్మిలకు ఏం లేదా? ఈ ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ షర్మిల చెప్పుకోడానికి ఏమి లేకపోవడంతో మళ్లీ వివేకానంద హత్య కేసుపై పదే పదే ప్రసంగాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు హయాంలో జరిగిన హత్యను ఇప్పుడు రాజకీయంగా ఉపయోగించుకునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మాట మారిందెందుకమ్మ.? : రాచమల్లు వైఎస్ కుటుంబ విషయాలను రాజకీయం కోసం షర్మిల వాడుకోవడం సరికాదని హితవు పలికారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. షర్మిలమ్మ తన స్థాయికి మించి, సంబంధం లేని మాటలు మాట్లాడుతోందని తప్పుబట్టారు. వైఎస్ఆర్ మరణించాక.. ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ FIRలో చేర్పించిందని, వైఎస్ జగన్‌ను అక్రమంగా 15 నెలలు జైలులో పెట్టిందని, రాష్ట్రాన్ని రెండుగా విభజించిందని.. ఆనాడు షర్మిల అన్నారని రాచమల్లు పేర్కొన్నారు. ఇప్పుడు తన రాజకీయ స్వార్థం కోసం షర్మిల మాట మార్చడం సరికాదని హితవు పలికారు రాచమల్లు. సొంత అన్న అభిమతం తెలుసుకోలేకపోతున్నారు తెలంగాణాలో తరిమేస్తే ఆంధ్రాలో పడినట్లు నాలుగు ఓట్లు సంపాదించుకునేందుకు షర్మిల వైఎస్ పేరును ఉచ్చరించడం సరికాదన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశాయాలకు, ప్రతిబింబాలకు నిజమైన వారసుడు జగన్ మాత్రమేనన్నారు. ఒకే తల్లి కడుపున పుట్టి సొంత అన్న అభిమతం, ఆలోచనలను, మంచి తనాన్ని షర్మిల తెలుసుకోలేపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో తడిచిందంటూ షర్మిల చేస్తున్న ప్రకటనలను తప్పుబట్టారు. వైఎస్సార్సిపి పేదవాడి చెమటతో నడుస్తోన్న పార్టీ అని పార్టీ, పరిపాలన, జగనన్న ఆలోచన అన్నీ పేదవాడి కోసమేనన్నారు. నిన్నటిదాకా తెలంగాణ.. హఠాత్తుగా ఏపీ నిన్నటిదాకా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలని చెప్పుకున్న షర్మిలకు ఇప్పుడు హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. క్యాలెండర్లో పేజీ ఎలా మారుతుందో అలా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి పార్టీ మార్చిందని, మాట్లాడే తీరూ మారిందన్నారు. షర్మిలమ్మ ఈ రాష్ట్ర బిడ్డగా, జిల్లా బిడ్డ అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చిన్నాన్న కోరిక మేరకు ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారన్నారు. చంద్రబాబుకు మద్దతు..కాంగ్రెస్‌కు జీ హుజూర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ టీడీపీకి మద్దతు ఇస్తూ షర్మిల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇంటి విషయాలను వీధిలో పెట్టి షర్మిల రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి జీ హుజూర్ అని ఎలా అంటున్నారని తెలిపారు. తాను రాజశేఖరరెడ్డి బిడ్డను అంటూ రాజశేఖరరెడ్డిని హీనంగా మాట్లాడిన చంద్రబాబుతో అంతర్గతంగా ఎలా అవగాహన కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. షర్మిల నైతికతకు ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. -
వైఎస్ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభం
-
వైఎస్ వివేకాను చంపిందెవరు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినపుడు ముఖ్యమంత్రి స్థానంలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడే ఇప్పుడు అమాయకంగా... హత్య చేసిందెవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఇది వారం రోజుల్లో తేల్చాల్సిన కేసు అని చెబుతున్న వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత... హత్య జరిగాక రెండు నెలలపాటు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడిని ప్రశ్నించనే లేదు. అంతే కాదు.. హత్య చేశానని, తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు మరికొందరితో కలిసి వివేకాను తనే గొడ్డలితో నరికానని అంగీకరించిన దస్తగిరి ఇప్పుడు జైలు నుంచి విడుదలై దర్జాగా బయట తిరుగుతున్నాడు. సునీతకు, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆత్మీయుడిగా మారాడు. చంద్రబాబు అనుకూల మీడియాకు వీఐపీ నాయకుడైపోయాడు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సునీత బావగారు శివప్రకాశ్రెడ్డితో సహా పలువురికి ఫోన్లు చేసి చెప్పిన నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి.. తర్వాత ఓడిపోవటంతో బీజేపీలోకి ఫిరాయించారు. వీళ్లలో హత్య చేసిన వాళ్లు... చేయించిన వాళ్లు... దాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్న వారు... అంతా ఉన్నారు. అందరూ కలిసి లోతైన కుట్రతో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై, ఆయన కుటుంబంపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ కుట్రను మరింత లోతుకు తీసుకెళుతున్నారు. కుట్రలో భాగంగానే... చంద్రబాబు అనుకూల తోక పత్రికకు అధిపతిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మూడు రోజుల కిందట నర్రెడ్డి సునీతతో సహా చంద్రబాబును కలిశారు. కడప ఎంపీగా సునీతను పోటీకి దింపటంపై అక్కడ చర్చ జరిగింది. చివరకు సునీతను పోటీ చేయించని పక్షంలో ఆమె చేత విస్తృతంగా ప్రచారం చేయించాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రచారమంటే... నియోజకవర్గంలో తిరగటం మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో మీడియా సమావేశాలు కూడా. అందులో భాగమే ఢిల్లీలో సునీత ప్రెస్ కాన్ఫరెన్స్. దానికి కొనసాగింపే శనివారం ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ బహిరంగ సభలో చంద్రబాబు ఊగిపోవటం. ఇదంతా ఒక స్కెచ్. సూత్రధారి చంద్రబాబు. పాత్రధారులు సునీత నుంచి దస్తగిరి, బీటెక్ రవి వరకూ ఎందరో!!. వివేకా హత్యతో లాభమెవరికి? జాతీయ, అంతర్జాతీయ నేర పరిశోధన ప్రమాణాలు చెప్పేదొకటే.. ఒక నేరం వల్ల ఎవరికి లాభం ఉంటుందో వారే దోషులు, కుట్రదారులు. అలా చూసినప్పుడు వివేకా హత్యతో లాభమెవరికి? ఆయన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నది ఎవరు? ఈ కోణంలో పరిశీలించినప్పుడు వచ్చే సమాధానాలు రెండే. వివేకా సంపాదించిన ఆస్తులు తమకే దక్కాలని, ఆయన రాజకీయ వారసత్వమూ తమకే ఉండాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి పంతం పట్టారు. కాకపోతే షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆమెతో వివేకాకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ రెండో వివాహంతో వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. వివాహాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు, చిన్న బావమరిది అయిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి సౌభాగ్యమ్మ పులివెందులలో నివాసం ఉండకుండా హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె సునీత వద్ద ఉంటున్నారు. సునీత నర్రెడ్డి ? ఆస్తి మొత్తం మాకే దక్కాలి.... వివేకా రెండో వివాహాన్ని ఆయన కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. తన తండ్రి యావదాస్తీ తమకే చెందాలని ఆమె పంతం పట్టారు. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్యకు ఆస్తిలో వాటా ఇస్తానన్నారు. ఓ ఇల్లు ఇచ్చేశారు. హైదరాబాద్‌లోనూ ఒక ఇల్లు కొనుగోలు చేసి తన కుమారుడిని అక్కడే ఉంచి బాగా చదివిస్తానని షమీమ్‌కు మాట ఇచ్చారు. దాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకున్న చెక్ పవర్‌ను రద్దు చేశారు. షమీమ్‌తో సునీత గొడవ పడ్డారు. పరస్పరం దారుణంగా దూషించుకుంటూ వారిద్దరి మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను కూడా దర్యాప్తు సంస్థలు వెలికి తీశాయి. సౌభాగ్యమ్మ, సునీత మొండి పట్టుదల చూశాక వివేకా కాస్త జాగ్రత్తపడ్డారు. తన ఆస్తిలో షమీమ్‌కు వాటా కల్పిస్తూ వీలునామా రాస్తానన్నారు. అందుకోసం స్టాంపు పేపర్లు కూడా తెప్పించుకున్నారు. అదిగో... అలా స్టాంపు పేపర్లు తెచ్చిన రోజుల వ్యవధిలోనే వివేకా హఠాత్తుగా హత్యకు గురయ్యారు. ఆయన్ను హత్య చేశాక దస్తగిరి సహా హంతకులు ఆ ఇంటిలో ఉన్న బీరువాలో ఏవో స్టాంపు పేపర్లు, రౌండ్ సీల్ కోసం వెతికారని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య తన వాంగ్మూలంలో పేర్కొనడం ఇక్కడ ప్రస్తావనార్హం. పైపెచ్చు వివేకా హత్య జరిగిన కొన్ని నెలలకే కుటుంబానికి చెందిన భూములు, ఇతర ఆస్తులన్నింటినీ సునీత తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీన్ని బట్టి హత్య వల్ల ఎవరికి లబ్ధి కలిగిందో తెలుస్తోంది కదా!. మరి హత్య చేయించిందెవరో కనుక్కోవటానికి ఇంతకన్నా ఏం కావాలి? మాటమార్చి... చంద్రబాబు గూటిలోకి తన తండ్రి వివేకా హత్య వెనుక అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి ఆదినారాయణ రెడ్డి, అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారని సునీత 2019 మార్చిలో చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ కృషి చేశారని కూడా చెప్పారు. 2019 మార్చి 21న హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి మరీ ఇవన్నీ చెప్పిన సునీత... 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంను చేసి తన తండ్రి కోరిక నెరవేర్చాలని ప్రజలను కోరారు. కానీ 2020లో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఆమె పూర్తిగా ప్లేటు ఫిరాయించారు. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి... చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్లి టీడీపీ రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు. చంద్రబాబు? రాజకీయ లబ్ధికి ఇదే అదను.. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిజానికి కడప జిల్లాలోను, పులివెందులలోను టీడీపీకి ప్రధాన అడ్డంకి వైఎస్ వివేకా. ఆయన అడ్డు తొలగింది. వైఎస్సార్సీపీ అధిపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని దీనిలో ఇరికించి దుష్ప్రచారం సాగిస్తే... కడప జిల్లాలో తాము పాగా వేయొచ్చనేది బాబు దురాలోచన. అందుకే... మార్చి 15న వివేకా హత్య విషయం బయటకు వచ్చిన తరవాత బాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తన సొంత మనిషి అయిన అప్పటి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును రంగంలోకి దింపారు. ఆయన అందరినీ ప్రభావితం చేస్తూ దర్యాప్తును ఆదిలోనే తప్పుదోవ పట్టించారు. నిజానికి ఈ హత్య విషయంలో సునీత లక్ష్యం ఒక్కటే. హత్య వెనుకనున్న తన భర్త, బావగార్ల పేర్లు బయటకు రాకుండా ఉండటం. బాబు లక్ష్యమేమో తన ప్రత్యర్థులను ఇరికించటం. అందుకే ఈ విజాతి ధ్రువాలు రెండూ ఆకర్షించుకుని... ఒకరి లక్ష్యానికి మరొకరు సాయంగా నిలిచారని... రానురాను కుట్రను మరింత లోతుల్లోకి తీసుకెళుతున్నారని ఈ వ్యవహారాన్ని దగ్గర్నుంచి పరిశీలిస్తున్నవారు చెప్పే మాట. ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలపై సందేహాలు రేకెత్తించేలా పచ్చ మీడియా ద్వారా అభూతకల్పనలతో దుష్ప్రచారం చేయటం... హత్య వెనుక ఉన్న కుట్రదారుల పాత్ర బయటకురాకుండా కేసును సంక్లిష్టంగా మార్చటం... ఇవన్నీ ఇందులో భాగంగానే జరిగిపోయాయి. చంద్రబాబు గ్యాంగ్‌కు కృతజ్ఞతలతో.. మీ సునీత బహుశా... నాలుగేళ్లుగా తాము సాగిస్తున్న కుట్రను మరింత పదునెక్కించాలనుకున్నారో, ఇకపై ముందుకు వెళ్లాలంటే ముసుగు తీయక తప్పదని భావించారో గానీ... సునీత ముసుగు తీశారు. రెండ్రోజుల కిందట ఢిల్లీలో బాబు స్క్రిప్టును చదువుతూ... ఆఖరికి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి కూడా కృతజ్ఞతలు చెప్పారంటే టీడీపీ ఏ స్థాయిలో సునీతకు సహకరించిందో... ఈ కుట్ర ఎంత లోతైనదో తెలియకమానదు. వైఎస్సార్సీపీ టికెట్టుపై గెలిచి... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని దూషిస్తూ సమాజంలో వర్గవిభేదాలు సృష్టించేందుకు కుట్రపన్నిన ఎంపీ రఘురామకృష్ణరాజు... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అత్యంత పరుషపదంతో దూషించిన టీడీపీ నేత పట్టాభి... సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ అత్యంత వివాదాస్పదుడిగా మారిన టీడీపీ నేత, పి.గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేశ్.. తమ పార్టీ విధానాలతో నిమిత్తం లేకుండా చంద్రబాబు కోసమే పనిచేస్తున్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సీపీఐ నారాయణ... బీజేపీలో ఉంటూ బాబు ఎజెండాను అమలు చేస్తున్న సీఎం రమేశ్... బాబు లాయరు సిద్ధార్థ లూథ్రా... నిరపరాధులను హింసించి, వేధించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించిన సీబీఐ అధికారి రామ్‌సింగ్... సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా... వీళ్లందరికీ సునీత కృతజ్ఞతలు తెలిపారు. అంటే తాను ఆ పచ్చ ముఠాలో సభ్యురాలినేనని విస్పష్టంగా ప్రకటించారు. విశేషమేంటంటే వీళ్లందరిలో ఓ ఉమ్మడి లక్షణం ఉంది. అది... తమ వృత్తులు, పార్టీలకు అతీతంగా చంద్ర బాబు కోసం పనిచేయటం. వైఎస్ జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించటం. అది చాలదూ... సునీత పాత్రను బయటపెట్టడానికి!!. ఇంకా వివేకా ఎవరెవరికి అడ్డంకిగా ఉన్నారు? ఆయన హత్యతో ఏ పాత్ర«ధారికి ఎలాంటి లాభం? ఇవన్నీ ఒకసారి చూద్దాం... ఆదినారాయణ రెడ్డి? గుండెపోటు అని మొదట చెప్పింది ఈయనే... వివేకా గుండెపోటుతో చనిపోయారని మీడియా సాక్షిగా బయటకు చెప్పింది నాటి మంత్రి ఆదినారాయణ రెడ్డి. వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తనకు ఫోన్ చేసి గుండెపోటుతో వివేకా మరణించారని చెప్పారని, సిగరెట్లు ఎక్కువ తాగుతారు కనక అలా జరిగి ఉండొచ్చని తాను కూడా అన్నానని ఆయన స్వయంగా మీడియాకు వెల్లడించారు. అంతేకాదు.. శివప్రకాశ్ రెడ్డి ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారం కోసం వెళుతున్న ఎంపీ అవినాశ్‌రెడ్డికి చెప్పటంతో... ఆయన తన వాహనాన్ని నిలిపేసి, వెనక్కు తిరిగి వివేకా ఇంటికి వచ్చారు. మరి గుండెపోటు అని ప్రచారం చేయాల్సిందిగా శివప్రకాశ్‌రెడ్డికి చెప్పిందెవరు? ఆదినారాయణ రెడ్డికి ఆయనే అడ్డంకి... 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి... టీడీపీకి అమ్ముడుపోయారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయకుండా అనైతికంగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన్ను కడప ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారు. కానీ ఎంపీగా గెలవటానికి వివేకానందరెడ్డి ప్రధాన అడ్డంకిగా నిలిచారు. జిల్లాపై పూర్తి పట్టున్న వివేకా రంగంలో ఉంటే తాను ఎంపీగా గెలవడం అసాధ్యమని ఆది నారాయణ రెడ్డి గుర్తించారు. ఈ నేపథ్యంలో వివేకా హత్యకు గురయ్యారు. వివేకా హత్య ఆదినారాయణరెడ్డికి రాజకీయంగా ప్రయోజనం కలిగించేదే కదా? నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ? లేఖను దాచి... గుండెపోటని ప్రచారం చేసి వివేకా హత్య కేసు దర్యాప్తు పక్కదారి పట్టించడంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిది కీలకపాత్ర. ఎందుకంటే హత్యకు గురైనప్పుడు వివేకా తన స్వదస్తూరితో రక్తంతో ఓ లేఖను రాశారు. ఆ లేఖను చూసిన ఎవరికైనా... అది మామూలు మరణం కాదని, ముమ్మాటికీ హత్యేనని తెలిసిపోతుంది. అలాంటి లేఖను ఆ రోజు (2019, మార్చి 15) ఉదయం 6.10 గంటలలోపే వివేకా పీఏ కృష్ణారెడ్డి చూశారు. ఆ విషయాన్ని వెంటనే సునీత భర్త రాజశేఖరరెడ్డికి ఫోన్లో చెప్పారు. ‘మేం వచ్చే వరకు ఆ లేఖను గానీ, వివేకా సెల్‌ఫోన్‌ను గానీ ఎవరికీ ఇవ్వవద్దు. పోలీసులకు కూడా చెప్పొద్దు’ అని వారు పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించారు. ఆ లేఖను గనక వెంటనే పోలీసులకు ఇవ్వమని వారు చెప్పి ఉంటే... మొత్తం వ్యవహారం మరోలా ఉండేది. వివేకాది హత్య అని తేలిపోయేది. ఎవరూ మృతదేహం వద్దకు వెళ్లేవారు కాదు. పోలీసులు తమ పని తాము చేసేవారు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచటంతో... వ్యవహారం మొత్తం వారు ప్లాన్ చేసినట్టే సాగింది. బీటెక్ రవి... ? వివేకా ఉంటే ఇక అంతే.. పులివెందుల నియోజకవర్గంలో కనీసస్థాయిలోనైనా పట్టు సాధించాలన్నది టీడీపీ నేత బీటెక్ రవి లక్ష్యం. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో 2019 ఎన్నికల్లో యథేచ్చగా అక్రమాలు సాగించవచ్చనేది ఆయన పన్నాగం. కానీ వివేకా వైఎస్సార్సీపీకి పెద్దదిక్కుగా నిలబడటంతో బీటెక్ రవి ఆటలు సాగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను దొంగదెబ్బ తీసిన బీటెక్ రవికి పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని వివేకా పంతం పట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్యకు గురయ్యారు. హత్యకు ముందు రోజు కొమ్మారెడ్డి పరమేశ్వర రెడ్డి(ఈయనకు వివేకాతో ఆర్థిక విభేదాలు తలెత్తాయి)తో బీటెక్ రవి రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందారు కూడా. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిచ్చేదే. రామ్‌సింగ్? చంద్రబాబు చేతిలో పావు... వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఎంతటి సిద్ధహస్తుడో వివేకా కేసులో సీబీఐ తీరే నిరూపిస్తోంది. వాస్తవానికి ఈ కేసులో నిశితమైన దర్యాప్తు జరిగి దోషులు బయటపడాలని మొదటి నుంచీ భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... కేసును సీబీఐ దర్యాప్తు కోసం అప్పగించాలని సునీత కోరగానే సరేనన్నారు. సీబీఐకి అప్పగించారు. కాకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే ముందస్తు కుట్రతో బీజేపీలోకి పంపిన తన మనుషులు సీఎం రమేశ్, సుజనా చౌదరి ద్వారా చంద్రబాబు చక్రం తిప్పటం మొదలెట్టారు. సీబీఐ దర్యాప్తు అధికారిగా నియమితుడైన రామ్‌సింగ్ వివాదాస్పద వ్యవహార శైలే అందుకు తార్కాణం. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన ఆయన ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టుగా ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని కేసును పక్కదారి పట్టించారు. దస్తగిరిని ఢిల్లీకి తీసుకువెళ్లి బెదిరించి... ప్రలోభాలకు గురిచేసి అప్రూవర్‌గా మార్చారు. తాము అనుకున్నది అతని అప్రూవర్ వాంగ్మూలంగా నమోదు చేశారు. పీఏ కృష్ణారెడ్డిని, మరికొందర్ని ఢిల్లీకి తీసుకువెళ్లి తీవ్ర చిత్రహింసలు పెట్టారు. తాను చెప్పిందే చెప్పాలని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వైఎస్సార్ జిల్లాలో పలువురిని అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేయడంతో వారి కుటుంబాలు బెంబేలెత్తిపోయాయి. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామ్‌సింగ్ స్వయంగా అసత్య ఆరోపణలు చేశారు. కడపలో తాను కార్లో వెళ్తుంటే ఆగంతకులు వచ్చి హత్య చేస్తానని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా ఆయన కారుపై ఎలాంటి దాడి జరగలేదని... ఎవరూ బెదిరించలేదని నిర్ధారణ అయ్యింది. అనేక ఫిర్యాదులు రావటంతో ఇంతటి వివాదాస్పదుడైన రామ్సింగ్ను న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర హోమ్ శాఖ ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పించింది. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి? రాజకీయ వారసత్వం మాకే దక్కాలి.. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వంపై ఆయన అల్లుడు, చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి కన్నేశారు. ఆయన తరువాత రాజకీయ వారసత్వంగా తమకే పదవులు దక్కాలని భావించారు. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్య షమీమ్‌తో తనకు కలిగిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయించారు. దాంతో రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి కంగుతిన్నారు. షమీమ్ ఇంటికి వెళ్లి ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేస్తామని కూడా బెదిరించారు. వారిద్దరికి భయపడి ఆమె పులివెందుల నుంచి హైదరాబాద్ వెళ్లిపోయి ఓ అజ్ఞాత ప్రదేశంలో ఉండేవారు. అంటే వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం తమకే దక్కాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారన్నది సుస్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే వివేకానందరెడ్డి 2019 ఎన్నికల ముందు హత్యకు గురయ్యారు. దస్తగిరి? హత్య చేసి... హైడ్రామా తండ్రిని చంపినవారిపై ఎవరికైనా కోపం, కక్ష ఉంటాయి. కానీ వివేకానందరెడ్డిని ఎంత పాశవికంగా హత్య చేసిందీ వెల్లడించిన దస్తగిరితో వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండటం విస్మయం కలిగించేదే. వివేకాను హత్య చేసిన నలుగురిలో దస్తగిరి ఉన్నారన్నది నిర్ధారణ అయ్యింది. కానీ అదే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేయిస్తున్నారంటే... వెనుక ఎవరున్నారన్నది కీలకం. చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి...ఇలా అందరూ దస్తగిరికి బహిరంగంగానే సహకరిస్తున్నారు. వివేకా హత్యకు ముందు రూ.500 కు కూడా అప్పులు చేసిన దస్తగిరి ప్రస్తుతం ఓ కాన్వాయ్‌తో కూడిన బొలేరో వాహనాలను కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నారు. ఇక దస్తగిరి చేస్తున్న దుష్ప్రచారాన్ని పదే పదే టీడీపీ అనుకూల మీడియా ప్రసారం చేస్తోంది. ఆయన ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తోంది. అంటే దస్తగిరి ఇష్టానుసారంగా చెబుతున్న కట్టుకథలు, చేస్తున్న అసత్య ఆరోపణల వెనుక చంద్రబాబు ముఠా, సునీత కుటుంబమే ఉందన్నది స్పష్టమవుతోంది కదా!. సెల్ఫోన్లో డేటా డిలీట్ చేశారెందుకు? ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి వివేకా రాసిన లేఖను, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి అందజేశారు. వారు ఆ సెల్‌ఫోన్‌లోని డేటాను డిలీట్ చేశారు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. ‘‘ఆ రోజు ఉదయం పీఏ కృష్ణా రెడ్డి ఫోన్ చేసి గాయాలతో వివేకా బాత్రూమ్లో పడి ఉన్నారని చెప్పారు. మా నాన్నకు గతంలో కూడా గుండె సమస్య ఉన్నందున బాత్రూమ్లో పడి తలకు బలమైన గాయం అయి ఉండొచ్చని భావించా. అందుకే పోలీసులకు అలాగే ఫిర్యాదు చేయమని కృష్ణారెడ్డితో చెప్పా’’ అని సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో సునీత పేర్కొన్నారు. లేఖను చూశాకైనా... వివేకా మృతదేహాన్ని చూశాకైనా ఒక డాక్టరైన సునీతకు ఎలాంటి అనుమానమూ రాలేదంటే ఏమనుకోవాలి? ఉద్దేశపూర్వకంగా నిజాలు దాటిపెట్టారని భావించనవసరం లేదా? తండ్రిని ఓడించినా... సునీతకు ఇష్టులే వివేకానందరెడ్డిని 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే చంద్రబాబు దొంగదెబ్బ తీసి ఓడించారు. 2017లో వైఎస్సార్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకాను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీ వారే కావడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు. వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికైతే జిల్లాలో టీడీపీకి ఉనికే ఉండదని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి వివేకాను కుట్రతో ఓడించారు. అక్రమాలకు పాల్పడి బీటెక్ రవి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ కుట్రలో చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి సర్వంతామై వ్యవహరించారు. కానీ ఆ ముగ్గురూ సునీతకు, ఆమె భర్త, బావగారికిçప్పుడు అత్యంత సన్నిహితులైపోవటమే విచిత్రం. – సాక్షి, అమరావతి -
చంద్రబాబు హయంలో అభివృద్ధికి నోచుకోని కడప
-
పులివెందుల నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
-
కడపలో ప్రజా చైతన్యం
సాక్షి ప్రతినిధి, కడప/ కడప కార్పొరేషన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సామాజిక సాధికారత కడప నగరంలో పాటలై పొంగింది. గురువారం నగరంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర వేలాది ప్రజలతో జైత్రయాత్రలా సాగింది. గురువారం ఉదయం నుంచే కడప నగరంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. నృత్యాలు, పాటలు, జై జగన్ నినాదాలతో యాత్ర అంగరంగ వైభవంగా సాగింది. మధ్యాహ్నం 3.25 గంటలకు యూఎస్ మహల్ నుంచి బస్సు యాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక ప్రజలు, మహిళలు పూలు, గజమాలలు, మంగళ హారతులు, బాణసంచాతో అడుగడుగునా యాత్రకు బ్రహ్మరథం పట్టారు. పాత బస్టాండులో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశేష జనవాహిని మధ్య జరిగిన సభలో మంత్రులు, పలువురు మంత్రులు సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సాధికారతను వివరించారు. ప్రసంగాల్లో జగన్ పేరు వచ్చిన ప్రతిసారీ ప్రజల హర్షాతిరేకాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. వైఎస్సార్ జిల్లా కడపలో నిర్వహించిన సభలో పాల్గొన్న జనవాహినిలో ఓ భాగం సంఘ సంస్కర్త సీఎం జగన్: మంత్రి సురేష్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, జ్యోతిరావు పూలే ఆలోచనలు కలగలిపిన పాలనతో సీఎం వైఎస్ జగన్ సామాజిక సంఘ సంస్కర్తగా నిలిచారని మంత్రి ఆదిమూలపు సురేష్ అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలోని ఉప కులాలను కూడా సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థితికి తెస్తున్నారని తెలిపారు. ఆగ్రకులాల సరసన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ విద్యార్థులు చదువుకునేలా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తెచ్చారన్నారు. మన ఆత్మగౌరవం నిలిపిన జగనన్నకు అండగా నిలవాలని కోరారు. జగనన్న ఆలోచనకు అండగా నిలుద్దాం: ఎమ్మెల్సీ రవిబాబు అణచివేతకు గురైన బిడ్డలను సామాజికంగా, రాజకీయంగా ఎదిగేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు కోరారు. 40 ఏళ్లుగా పేదల శ్రమశక్తి, ఆలోచన విధానాన్ని దోపిడీ చేసిన చంద్రబాబు రూ.6 లక్షల కోట్లకు ఎదిగారన్నారు. చంద్రబాబు వళ్లంతా అవినీతి మచ్చే : డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎంగా సుదీర్ఘకాలం పని చేసిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం వీసమెత్తు కూడా పనిచేయలేదని తెలిపారు. బాబు వళ్లంతా అవినీతి మచ్చే ఉందని ఎద్దేవా చేశారు. మూడు తరాల క్రితమే వైఎస్ కుటుంబం సామాజిక న్యాయం పాటించిందని తెలిపారు. జగనన్న సర్కార్‌లో స్కావెంజర్ బిడ్డకు కూడా కార్పొరేట్ విద్య అందుతోందన్నారు. పేదల ఉన్నతికి అనుక్షణం తపించే సీఎం వైఎస్ జగన్‌ను మన జాతి కోసం మరోమారు గెలిపించుకోవాలని కోరారు. సామాజిక న్యాయం నినాదం కాదు..విధానం: డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సామాజిక న్యాయం నినాదంగానే ఉండేదని, ఇప్పుడు సీఎం జగన్ పాలనలో అది ఓ విధానమైందని డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా చెప్పారు. సీఎం వైఎస్ జగన్ సామాజిక సాధికారితను ఆచరణలో చూపెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. కడప ప్రజలు తనను రెండు సార్లు అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపితే, సీఎం వైఎస్ జగన్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఆయన సరసన కూర్చోబెట్టుకున్నారని చెప్పారు. సంక్షేమం, సామాజిక న్యాయం సమపాళ్లలో..: ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో సామాజిక న్యాయానికీ అంతే ప్రాధాన్యత ఇచ్చారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. కేబినెట్లో 70 శాతం మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని చెప్పారు. రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ పోస్టుల్లోనూ ఈ వర్గాలకే సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, ఎంవీ రామచంద్రారెడ్డి, పోతుల సునీత, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ఎంపీ బుట్టా రేణుక, కడప మేయర్ సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ ఆకేపాటి అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ 3 వారాలకు వాయిదా
న్యూఢిల్లీ: కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. పిటిషనర్ సునీతారెడ్డి తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్ద్ లూథ్రా ఏపీలో చంద్రబాబు కేసుతో బిజీగా ఉండటంతో అందుబాటులో లేకుండా పోయారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపిన సునీతారెడ్డి.. కేసు విచారణ వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ సునీత విజ్ఞప్తి మేరకు మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. కాగా వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. చదవండి: YS Viveka Case: వివేకా హత్య కుటుంబ ఆస్తి కోసమే.. సీబీఐకి ఎంపీ అవినాష్ లేఖ -
అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించిన ఎంపీ అవినాష్
-
కువైట్‌లో ఘనంగా వై.ఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. కువైట్ వైఎస్ అవినాష్ రెడ్డి యూత్ అసోషియేషన్ నాయకులు, ముల్లా జిలాన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపీ గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు కువైట్ వైఎస్ఆర్ సిపీ నాయకులు సహా అవినాష్ అభిమానులు బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అవినాష్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రవాసాంధ్రులంటే ప్రత్యేక అభిమానమని, వాళ్ల సమస్యలు ఏవైనా ఆయన దృష్టికి వెళితే వెంటనే స్పందించి పరిష్కరించడానికి కృషి చేస్తారని గోవిందు నాగరాజు పేర్కొన్నారు. కరోనా కష్ట కాలంలో గల్ఫ్ లో ఉన్న ప్రవాసాంధ్రులను ఆదుకున్న గొప్ప వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి మైనార్టీ నాయకులు షేక్ రహమతుల్లా కొనియాడారు. -
ఎలాంటి సింహమో ప్రజలు తేలుస్తారు..
పులివెందుల : మనం కొదమ సింహాలమా, వృద్ధ సింహాలమా.. గ్రామ సింహాలమా అనేది ప్రజలు తేలుస్తారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందుల పర్యటనలో బుధవారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు భయస్తుడు కాబట్టే తాను ధైర్యవంతుడిని అని చెప్పుకునేందుకు మాటిమాటికి కొదమ సింహం అని అంటున్నాడని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులను సందర్శించేందుకు ఆయన ఏ ధైర్యంతో వస్తున్నాడో అర్థంకావడంలేదన్నారు. ఒక అబద్ధాన్ని కళ్లు ఆర్పకుండా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 11వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించలేమని భావించి దాన్ని 44వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచిన ఘనత మహానేత డాక్టర్ వైఎస్సార్‌దే. దీనిని అడ్డుకునేందుకు అప్పట్లో ధర్నాలు చేయించిన విషయం బాబు మరిచిపోయినా ప్రజలు మర్చిపోలేదు. అలాగే, గండికోట రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు కుదించిన ఘనుడు చంద్రబాబే. వైఎస్సార్ వచ్చాక 27టీఎంసీలుగా చేశారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులో ఎన్నడూ పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపిన దాఖలాల్లేవు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 27టీఎంసీల పూర్తి సామర్థ్యాన్ని నింపి సీమకు నీళ్లిస్తున్నారు. నిర్వాసితులకు రూ.950కోట్ల పరిహారం ఇవ్వబట్టే ఇది సాధ్యమైంది. అలాగే, చిత్రావతి ప్రాజెక్టు కూడా. తన 14ఏళ్ల పాలనలో ఏనాడూ సీమ ప్రాజెక్టుల గురించి పట్టించుకోని పెద్ద మనిషి చంద్రబాబు. డ్రిప్‌లో రూ.వెయ్యి కోట్ల బకాయి పెట్టి అబద్ధాలా.. డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించి చంద్రబాబు హయాంలో ఆయా కంపెనీలకు రూ.1,000 కోట్ల బకాయిలు పెట్టడంతో స్కీం నిర్విర్యమైపోయింది. జగనన్న సీఎం అయ్యాక వాటిని చెల్లించి గత ఏడాది పునఃప్రారంభించారు. పంటల బీమా విషయంలోనూ చంద్రబాబు ఇచ్చిన దానికంటే రెండు రెట్లకు పైగా జగన్ ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ జిల్లాలో 2012కు సంబంధించిన శనగపంట బీమా 2014–19 వరకు పెండింగ్‌లో ఉండేది.. జగనన్న వచ్చాక తొలి ఏడాదిలోనే రూ.112కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. పైడిపాలెం వైఎస్సార్ బ్రెయిన్ చైల్డ్.. పైడిపాలెం రిజర్వాయర్ వైఎస్సార్ బ్రెయిన్ చైల్డ్. ఆయన హయాంలో 90శాతం పనులు పూర్తయ్యాయి. దానిని కూడా బాబు తన ఖాతాలోనే వేసుకుంటున్నాడు. కడప ఎయిర్పోర్ట్ రన్‌వే కోసం రూ.75కోట్లు జగనన్న ప్రభుత్వం చెల్లించింది. ఈరోజు రన్‌వే విస్తరణ జరిగి పెద్ద ఫ్లైట్లు వస్తున్నాయంటే అది జగన్ చలవే. అలాగే, కుప్పాన్ని కూడా గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్. ఇక జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. ఇవేవీ చంద్రబాబుకు కనిపించడంలేదు. మరోవైపు.. తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని తన సోదరి, చంద్రబాబు, బీజేపీలోని టీడీపీ నేతలు, వ్యవస్థలోని ఒక పెద్ద మనిషి కలిసి రెండున్నరేళ్లుగా పన్నాగం పన్నారు. వారి అంతిమ లక్ష్యం వైఎస్సార్సీపీని, జగన్‌ను ఇబ్బంది పెట్టడమే. వివేకా కేసులో వాస్తవాలను పక్కన పడేసి రాజకీయ కోణంలో ముందుకు తీసుకువెళుతున్నారు. క్షమాపణ చెప్పి మాట్లాడాలి ఇక తెలుగుగంగ ప్రాజెక్టులో బ్రహ్మం సాగర్‌కు నీరు రావాలంటే కావాల్సిన కాలువ రిపేర్లు చేయాలని అనేకసార్లు విన్నవించినా చంద్రబాబు పట్టించుకోలేదు. జగన్ వచ్చిన తర్వాత ఆ కాలువలన్నీ ఆధునికీకరణ చేసి లైనింగ్ చేయించారు. ముందు ఈ ప్రాంత ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పి మాట్లాడాలి. -
సాగునీటి ప్రాజెక్టులపై బాబు మాటలన్నీ పచ్చి అబద్దాలే: ఎంపీ అవినాష్ రెడ్డి
-
Viveka Case: వివేకా హత్య కుటుంబ ఆస్తి కోసమే!
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుటుంబ ఆస్తి వివాదాలే ప్రధాన కారణమని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. కుటుంబ వారసత్వ ఆస్తి కోసమే వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఈ హత్య చేయించారని ఆధారాలతో సహా వివరించారు. వివేకా తన రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడి పేరిట రాసిన నోటరీ వీలునామాను నిందితులు నర్రెడ్డి కుటుంబానికి అందచేశారని తెలిపారు. షమీమ్‌కు వాటా ఇవ్వకుండా వివేకా ఆస్తి మొత్తాన్ని సునీత తన పేరిట మ్యుటేషన్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో దర్యాప్తు అధికారిగా ఉన్న రాంసింగ్ దురుద్దేశపూరితంగా ఈ అంశాలపై దర్యాప్తు చేయకుండా పక్కదారి పట్టించారన్నారు. అధికారికంగా బాధ్యతలు స్వీకరించటానికి మూడున్నర నెలల ముందు నుంచే రాంసింగ్ దర్యాప్తు చేపట్టడం, సాక్షులు చెప్పినదానికి భిన్నంగా వాంగ్మూలాలను నమోదు చేయడాన్ని ప్రస్తావించారు. ఈమేరకు ఎంపీ అవినాశ్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు సవివరంగా రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలు, అనంతర పరిణామాలను లేఖలో వివరించారు. హత్యలో పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఇప్పించిన వాంగ్మూలం పూర్తిగా అసత్యాల పుట్ట అని స్పష్టం చేశారు. వివేకా బాత్రూమ్లో లభ్యమైన గుర్తు తెలియని వేలి ముద్రలు ఎవరివి? అనే విషయాన్ని సీబీఐ పట్టించుకోకపోవడాన్ని ఎంపీ అవినాశ్ లేఖలో ప్రస్తావించారు. కడప ఎంపీ టికెట్‌పై ఎలాంటి సందిగ్దత లేదని స్పష్టం చేస్తూ హత్యకు ముందు రోజు వరకు ఎంపీగా తన గెలుపు కోసం వివేకా ప్రచారం చేశారని గుర్తు చేశారు. రాంసింగ్ ఉద్దేశపూర్వకంగా విస్మరించిన అంశాలను పునఃసమీక్షించి ఐపీసీ 457, 460, 394, 398, 302 సెక్షన్ల కింద సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు. వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30 లోగా పూర్తి చేయాలని న్యాయస్థానం సీబీఐకి గడువు నిర్దేశించింది. అంటే అప్పటిలోగా సీబీఐ తుది చార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 19న సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాశ్‌రెడ్డి ఈ లేఖను రాశారు. సీబీఐ నమోదు చేసి న్యాయస్థానానికి సమర్పించిన సాక్షుల వాంగ్మూలాలు, అంతకు ముందు ఛార్జ్షీట్లలో పేర్కొన్న అంశాలను విశ్లేషించిన అనంతరం తాను సహేతుకంగా ఈ సందేహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీబీఐ గత గత ఛార్జ్ షీట్ల లో విస్మరించిన కీలక అంశాలను పునసమీక్షించి సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం చేయలని కోరారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి లేఖలో ప్రస్తావించిన ప్రధానాంశాలు సంక్షిప్తంగా... పక్కదారి పట్టించిన రాంసింగ్ రాంసింగ్ దర్యాప్తు అధికారిగా 2021 నవంబరు 9న అధికారికంగా బాధ్యతలు స్వీకరించగా అప్పటికి మూడున్నర నెలల ముందే సీఆర్పీసీ నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేపట్టారు. సెప్టెంబరు 2నే వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. నాతోపాటు నా తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే సాక్షుల పేరిట వాంగ్మూలాలు నమోదు చేశారు. సాక్షులు చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలాలు నమోదు చేసి తన కింది అధికారులతో వాటిపై సంతకాలు చేయించారు. సీఐ శంకరయ్య, అభిషేక్‌రెడ్డి చెప్పని విషయాలను చెప్పినట్లుగా రాంసింగ్ ఏకపక్షంగా వాంగ్మూలాలను నమోదు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ శంకరయ్య కడప ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. తాను చెప్పినట్లు అబద్ధాలు చెప్పాలని ఉదయకుమార్‌రెడ్డిని రాంసింగ్ చిత్రహింసలకు గురి చేయడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021 నవంబర్ 9వరకు రాంసింగ్ దర్యాప్తు కొనసాగించి రెండు చార్జ్షీట్లు దాఖలు చేశారు. వివేకా రెండో వివాహం అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. బెంగళూరు భూవివాదం కట్టుకథే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి రాంసింగ్ ఇప్పించిన వాంగ్మూలంలోని అంశాలు పూర్తి అవాస్తవమని సీబీఐ దర్యాప్తులోనే వెల్లడైంది. బెంగళూరులోని ఓ భూవివాదానికి సంబంధించి డబ్బుల కోసం వివేకాను హత్య చేయమని, తనకు వైఎస్ భాస్కర్‌రెడ్డి సహకారం ఉందని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. బెంగళూరు భూవివాదానికి సంబంధించి 10 మందిని సీబీఐ విచారించింది. ఆ భూమికి సంబంధించిన పత్రాలు నకిలీవని తేలడంతో వాటిని బెంగళూరుకు చెందిన వై.వెంకట ప్రసాద్‌కు అప్పటికే అప్పగించేసినట్టు వెల్లడైంది. అంటే వివేకా హత్యకు చాలా నెలల ముందే బెంగళూరు భూవివాదం సమసిపోయింది. దస్తగిరి వాంగ్మూలం పూర్తిగా అవాస్తవమని స్పష్టమైంది. ఆ వాంగ్మూలం ఆధారంగా రాంసింగ్ దర్యాప్తు చేయడం దురుద్దేశపూరితమే. చెక్ పవర్ రద్దుతో ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ సభ్యులు తన చెక్ పవర్ రద్దు చేయడంతో వివేకా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విపరీతంగా మద్యానికి బానిసయ్యారు. మోసగాడైన సునీల్ యాదవ్ చెప్పిన వజ్రాల కథను విశ్వసించారు. వాటిని విక్రయించి డబ్బులు ఇప్పించాలని సునీల్ యాదవ్ కోరడంతో తన వాహనాన్ని ఇవ్వడంతోపాటు అతడితో కలసి పలు ప్రాంతాలు తిరిగారు. తరువాత సునీల్ యాదవ్ చెప్పినదంతా కట్టుకథేనని ఎర్ర గంగిరెడ్డి గ్రహించాడు. అప్పటి నుంచి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి వివేకా ఇంటికి రావడం మానేశారు. వారిద్దరి కుటుంబాల్లో మహిళలతో వివేకాకు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో వారిద్దరూ ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వివేకాపై దాడి చేసిన తరువాత ఆయన మర్మాంగంపై సునీల్ యాదవ్ కాలితో తన్ని తీవ్రంగా దూషించారు. నర్రెడ్డి కుటుంబానిదే ఆ కుట్ర కుటుంబ వారసత్వ ఆస్తి కోసమే వివేకానందరెడ్డిని హత్య చేశారు. ఆ హత్య వెనుక వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఇతర నర్రెడ్డి కుటుంబ సభ్యులున్నారు. ఎందుకంటే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వివేకా తన రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడు షెహన్‌షాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చలేకపోయారు. తన కుమారుడి విద్యాభ్యాసం, భవిష్యత్ కోసం తన ఆస్తిలో కొంత వాటా రాసివ్వాలనుకున్నారు. కుటుంబ ఉమ్మడి ఆస్తిలో తన పేరిట ఉన్న 25 శాతం వాటాను షమీమ్, ఆమె కుమారుడి పేరిట ఆయన నోటరైజ్డ్ వీలునామా రాసినట్లు తెలిసింది. దీన్ని ఆయన మొదటి భార్య, కుమార్తె, అల్లుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో వివేకా హత్య జరిగింది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు–చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డిలతో ఎర్ర గంగిరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన ద్వారానే వారు వివేకా హత్యకు పన్నాగం పన్ని ఉంటారు. తమ కుటుంబ సభ్యులతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని వివేకాపై ఆగ్రహంతో ఉన్న సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డిల సహకారంతో ఎర్ర గంగిరెడ్డి ఈ హత్యకు పథకం వేశాడు. డబ్బు ఆశ చూపించి దస్తగిరిని కూడా పాత్రధారిని చేశారు. వివేకా హత్య తరువాత ఆ ఇంట్లో కొన్ని పత్రాల కోసం ఎర్ర గంగిరెడ్డి, ఇతర నిందితులు గాలించారు. హత్యలో పాలు పంచుకున్న దస్తగిరితోపాటు వాచ్మెన్ రంగయ్య కూడా తన వాంగ్మూలంలో ఇదే విషయాన్ని చెప్పారు. బెంగళూరు భూవివాదం లేదని ఎర్ర గంగిరెడ్డికి తెలుసు కాబట్టి వారు వెతికింది వివేకా రాసిన నోటరీ వీలునామా గురించే అని స్పష్టమవుతోంది. నోటరీ వీలునామాను ఎర్ర గంగిరెడ్డి వివేకా కుమార్తె, అల్లుడికి ఇచ్చి ఉంటారు. అంటే కుటుంబ ఆస్తి కోసమే వివేకాను హత్య చేశారు. వివేకా హత్య తరువాత ఆ కుటుంబ ఆస్తి మొత్తాన్ని సునీత తన పేరిట మ్యుటేషన్ ద్వారా మార్పించుకోవడం గమనార్హం. షమీమ్‌కు ఎలాంటి ఆస్తి దక్కలేదు. ఆస్తి కోసమే వివేకాను ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి హత్య చేయించారని ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్ సమీప బంధువైన భరత్ యాదవ్ తన వాంగ్మూలంలో చెప్పాడు. తాము చెప్పినట్లు సీబీఐకి అవాస్తవాలు చెప్పకుంటే ఈ కేసులో ఇరికిస్తామని వివేకా పీఏ కృష్ణారెడ్డిని సునీత బెదిరించారు. ఈ వాస్తవాలన్నీ వివేకా హత్య వెనుక నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. సీబీఐ ఈ కోణంలో అసలు దర్యాప్తు చేయలేదు. ఆ వేలిముద్రలు ఎవరివి? వివేకా హత్య జరిగిన ప్రదేశాన్ని కడప పోలీసుల క్లూస్ టీమ్ పరిశీలించి బాత్రూమ్ గోడలు, తలుపు వెనుక ఉన్న వేలిముద్రలను సేకరించింది. ఆ వేలిముద్రల్లో కొన్ని నలుగురు నిందితుల వేలిముద్రలతో సరిపోలేదు. అంటే హత్య జరిగిన రోజు రాత్రి ఆ నలుగురు నిందితులే కాకుండా ఆ ఇంట్లో మరెవరో ఉన్నట్లు స్పష్టమవుతోంది. సీబీఐ అప్రూవర్‌గా మార్చిన దస్తగిరి ఆ వ్యక్తి పేరును వెల్లడించలేదు. ఆ వేలి ముద్రలు ఎవరివి? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేయలేదు. ఎవరినో రక్షించేందుకే ఆ వేలి ముద్రలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని స్పష్టమవుతోంది. ఆ వేలి ముద్రలు ఎవరివన్న కోణంలో దర్యాప్తు చేస్తే ఈ హత్య వెనుక అసలు కుట్ర బయటపడుతుంది. ఆ తరువాత మాట మార్చిన సునీత కడప ఎంపీ టికెట్ కోసమే వివేకాను హత్య చేశారని రాంసింగ్ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు పూర్తిగా అవాస్తవం. అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న నన్నే (అవినాష్‌రెడ్డి) 2019 ఎన్నికల్లోనూ అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. నా గెలుపు కోసం పార్టీ ఎన్నికల ఇన్చార్జ్గా వివేకానందరెడ్డి ఉన్నారు. ఆయన చనిపోయే ముందు రోజు వరకూ నా గెలుపు కోసం కృషి చేశారు. మైదుకూరు నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డితో కలసి ప్రచారం కూడా చేశారు. సీబీఐ ఈ విషయాలపై ఏమాత్రం దృష్టి సారించలేదు. కనీసం రఘురామిరెడ్డినిగానీ పార్టీ నేతలను గానీ సంప్రదించలేదు. వివేకా హత్య తరువాత తొలుత సునీత కూడా మీడియాకు ఇదే విషయాలను చెప్పారు. తన తండ్రి చివరి వరకు అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం పని చేశారని వెల్లడించారు. 2019 అక్టోబరు తరువాత ఆమె మాట మార్చి నాపై, మా పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇదీ చదవండి: వివేకా కేసులో పుకార్లేంటీ? నిజాలేంటీ? -
Viveka Case: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు'
సాక్షి, అమరావతి: ‘మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. రాజకీయంగా అత్యంత సంచలనమైన కేసు.. దర్యాప్తు చేస్తోంది దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ. దర్యాప్తు చేపట్టిన 1,226 రోజుల తర్వాత కూడా సీబీఐ సాధించింది ఇదీ అని చెప్పడానికి ఏమీ లేదన్నది నిర్వివా దాంశం. హత్య వెనుక విస్తృత కుట్ర ఉందనే మాట చెప్పడం తప్ప.. అందుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన అభియోగాలకు ఒక్కటంటే ఒక్కదానికి కూడా ఆధారాలు చూపించలేకపోయింది’ అని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ పేర్కొంది. నిష్పాక్షికమైన థర్డ్ పార్టీగా ‘ద వైర్’ వెబ్సైట్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇటీవల దాఖలు చేసిన తుది చార్జ్‌షీట్‌లోని అంశాలను విశ్లేషించింది. రాజకీయ, నేర, న్యాయ సంబంధమైన వార్తా విశ్లేషకురాలిగా సుదీర్ఘ అనుభవం ఉన్న సరిత రాణి ‘ద వైర్’ వెబ్సైట్లో రాసిన విశ్లేషాత్మక వ్యాసం ఇలా.. సాధించింది శూన్యం 2020 మార్చి 11న వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి బదిలీ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికే 120 రోజుల సమయం తీసుకుంది. మరో 474 రోజుల తర్వాత 2021 అక్టోబర్‌లో మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేసింది. వివేకా హత్యలో పాలుపంచుకున్నారని చెబుతూ ఎర్ర గంగిరెడ్డి(ఏ–1), సునీల్ యాదవ్(ఏ–2), గజ్జల ఉమాశంకర్ రెడ్డి(ఏ–3), దస్తగిరి(ఏ–4)లను నిందితులుగా పేర్కొంది. ఈ హత్య వెనుక విస్తృత కుట్రను వెలికి తీయాల్సి ఉందని చెప్పింది. సీబీఐ తుది చార్జ్‌షీట్ 2023 జూలై 20న బయటకు వచ్చింది. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, వారి సన్నిహితుడు డి.శివశంకర్‌రెడ్డిలను కూడా నిందితులుగా పేర్కొంది. కానీ సీబీఐ మొదటి నుంచీ పేర్కొంటూ వచ్చిన విస్తృత కుట్ర గురించి మాత్రం ఏమీ చెప్పలేకపోయింది. హత్య వెనుక ఉద్దేశం అంటూ 14 పేరాల సుదీర్ఘ వ్యాసాన్ని చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. అందులో ఏముంది అంటే అందరికీ తెలిసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ నేపథ్యం, వంశ చరిత్ర మాత్రమే. ఇది తప్ప వాస్తవానికి హత్య వెనుక విస్తృత కుట్ర గురించి సీబీఐ స్పష్టంగా ఏమీ చెప్పలేకపోయింది. ఇంతకీ ఇంతటి హైప్రొఫైల్ కేసుకు సంబంధించిన తుది చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు, వాటిలోని వాస్తవాలను పరిశీలిస్తే సీబీఐ దర్యాప్తులో డొల్లతనం బట్టబయలు అవుతోంది. సీబీఐ తాను పేర్కొన్న అభియోగాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క దానికి కూడా ఆధారం చూపించలేకపోయింది. అంతకు మించి వివేకా హత్య వెనుక ఆయన సొంత కుటుంబంలో విభేదాలు, బయట శక్తుల ప్రమేయాన్ని సీబీఐ పట్టించుకోకపోవడం విస్మయ పరుస్తోంది. చార్జ్‌షీట్‌లో సీబీఐ ఏం చెప్పింది.. అందులోని వాస్తవం ఏమిటన్నది అంశాల వారీగా పరిశీలిస్తే ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు సాధించింది శూన్యమన్నది స్పష్టమవుతోంది. సీబీఐ చెప్పిందేమిటి? వాస్తవం ఏమిటి? అన్నది చూద్దాం. 1.వివేకా క్రియాశీలకమైన నేతా? సీబీఐ : 2019 నాటికి వివేకా రాజకీయంగా ప్రభావవంతమైన నేత. రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు. వాస్తవం : 2019 నాటికి వివేకా రాజకీయంగా ప్రభావవంతమైన నేత కాదు. హత్యకు గురయ్యే 15 ఏళ్ల ముందు 2004లో చివరిసారిగా ఎన్నికల్లో గెలిచారు. దశాబ్ద కాలంగా రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. 2008లో స్వదేశానికి తిరిగి వచ్చిన వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం సోనియా గాంధీని కలిశారు. కానీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది. వివేకా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారని ఆయన కుమార్తె సునీతనే సీబీఐకి రెండుసార్లు చెప్పారు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన రాజకీయాల నుంచి రిటైరై పోయినట్టేనని ఆమె చెప్పారు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత నుంచి ఆయన ఎలాంటి పదవిలో లేరు. పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మ చేతిలో భారీ తేడాతో ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ను పట్టించుకోలేదు. ఎమ్మెల్సీగా కూడా నామినేట్ చేయలేదు. ఆయన అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యేపై దాడికి యత్నించడం కూడా ఇందుకు కారణం అయిఉండొచ్చు. 2.అవినాశ్ బలమైన అభ్యర్థి కాదా? సీబీఐ : 2019 ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైఎస్ అవినాశ్ రెడ్డి బలహీనమైన అభ్యర్థి అని వివేకానందరెడ్డి భావించారని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. వాస్తవం : అవినాశ్‌రెడ్డి బలహీనమైన అభ్యర్థి అన్నది పూర్తిగా అవాస్తవం. ఆయన అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో 1,90,323 ఓట్ల భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. ఆయన ఎంత బలమైన అభ్యర్థో ఆ మెజార్టీనే చెబుతుంది. ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌తో పార్టీ నిర్ణయం మేరకు తన ఎంపీ పదవికి 2018లో రాజీనామా చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అవినాశ్‌రెడ్డి మరింత భారీ మెజార్టీతో అంటే 3,80,976 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డిపై అంత మెజార్టీ సాధించడం విశేషం. ఏ రకంగా చూసినా అవినాశ్‌రెడ్డి బలమైన అభ్యర్థి అన్నదాంట్లో సందేహం లేదు. వివేకానందరెడ్డి తాను హత్యకు గురికావడానికి ముందు వరకు కూడా అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. వివేక హత్యకు గురైన ముందు రోజు రాత్రి కూడా అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం జమ్మలమడుగులో ప్రచారం చేశారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్టు వెల్లడించారు. అవినాశ్‌రెడ్డే ఎంపీ అభ్యర్థి అన్న విషయంలో మరో మాటే లేదని వివేకానందరెడ్డి సోదరి వైఎస్ విమల కూడా స్పష్టం చేశారు. ఎంపీగా అవినాశ్ గెలుపు కోసం వివేకా చివరి వరకు ప్రచారం చేశారని కూడా ఆమె చెప్పారు. ప్రస్తుతం కొందరు రాజకీయ దురుద్దేశంతో అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 3. షర్మిల వాంగ్మూలంలో చెప్పినదానికి ఆధారం ఎక్కడ? సీబీఐ : 2019 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల కానీ, విజయమ్మ కానీ పోటీ చేయాలని వివేకా భావించారనే విషయాన్ని షర్మిల వెల్లడించారు. వాస్తవం : కడప ఎంపీ అభ్యర్థిత్వం విషయంపై వివేకానందరెడ్డి తనతో చెప్పినట్టుగా షర్మిల వెల్లడించిన సమాచారానికి ఎలాంటి ఆధారం లేదు. ఎంపీగా తానుగానీ తన తల్లి విజయమ్మగానీ పోటీ చేయాలని వివేకా చెప్పినట్టు వాంగ్మూలం ఇచ్చిన షర్మిల.. అందుకు ఎలాంటి ఆధారం చూపించలేకపోయారు. ఎంపీ టికెట్ అంశంపై వారిద్దరు మాట్లాడుకున్నట్టు కూడా గతంలో ఎప్పుడూ మీడియాలోగానీ పార్టీ వర్గాలుగానీ చెప్పలేదు. సీబీఐ ఎలాంటి ఆధారం గురించి పేర్కొన లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ల తర్వాత షర్మిల తన సోదరుడితో రాజకీయంగా విడిపోయి తెలంగాణాలో సొంతంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ విషయం కూడా ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నదే. ఒక వేళ కడప ఎంపీ అభ్యర్థి విషయంపై వివేకానందరెడ్డికి వేరే అభిప్రాయం ఉన్నా సరే రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపించదు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మపై పోటీ చేసినప్పటి నుంచి వైఎస్సార్ కుటుంబ వ్యవహారాల్లో ఆయన పాత్ర పెద్దగా లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ రాజకీయ నిర్ణయాల్లో కూడా ఆయన పాత్ర పెద్దగా ఏమీ లేదన్నది ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ తెలిసిన విషయమే. వివేకానందరెడ్డిపై సానుకూల దృక్పథంతో వైఎస్ జగన్ ఆయన్ను వైఎస్సార్ జిల్లా పార్టీ ఇన్చార్జ్ చేశారు. కానీ వివేకా ఏనాడూ కూడా పార్టీ ముఖ్య నేతగా ఉండలేదు. 4. ఎమ్మెల్సీ ఎన్నికలపై సీబీఐ చెప్పింది కట్టుకథే సీబీఐ : 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి కారణం. అవినాశ్‌రెడ్డి అనుచరుడు డి.శివశంకర్‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని భావించినప్పటికీ వైఎస్ జగన్ తన చిన్నాన్న వివేకానందరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. దాంతో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఆ ఎన్నికల్లో వివేకా ఓటమికి పని చేశారు. దాంతో వివేకా ఆగ్రహంతో డి.శివశంకర్‌రెడ్డిని దూషించారు. వాస్తవం : స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివ శంకర్‌రెడ్డి కారణమనడానికి సీబీఐ ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. ఆ ఎన్నికల్లో ఆ జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలోని 800 మందికిపైగా ఓటర్లలో ఎవర్ని ప్రలోభాలకు గురిచేశారో కూడా చెప్పలేకపోయింది. ఆ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో సీబీఐ కనీసం మాట్లాడనే లేదు. ఆ ఎన్నికల్లో వివేకా ఓటమికి, ఆయన హత్యకు సంబంధం ఉన్నట్టుగా కూడా సీబీఐ ఎలాంటి ఆధారాన్ని చూపించనే లేదు. రెండేళ్ల క్రితం నాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విషయంపై తలెత్తిన వివాదం వల్ల తమను దూషించారనే ఉద్దేశంతో 2019 ఎన్నికల ముందు హత్యకు ఎవరైనా ప్రయత్నిస్తారా? అందులోనూ 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థి కుటుంబం 2019 ఎన్నికల ముందు హత్య వంటి దుందుడుకు పనులకు ఎందుకు ఒడిగడుతుంది? పైగా 2019 ఎన్నికల్లో 3.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన అవినాశ్ రెడ్డికి వివేకాతో రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఏమాత్రం ఉండదు. సీబీఐ తమ ఆరోపణకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో విభేదాలు షమీమ్ అనే మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. వివేకా గుండెకు ఆపరేషన్ చేసుకున్నప్పటికీ ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ పులివెందులలో ఉండటం లేదు. హైదరాబాద్‌లో తన కుమార్తె సునీత నివాసంలో ఉంటున్నారు. నెలకు ఒకట్రెండుసార్లు పులివెందుల వచ్చి వెళుతున్నారు. కుమార్తె సునీత ఏడాదికి ఒకట్రెండుసార్లు మాత్రమే వస్తున్నారు. ‘షమీమ్‌తో మా నాన్న సహజీవనం చేస్తున్నారని 2011లో బయటపటినప్పటి నుంచి ఆయనతో నేను సఖ్యతగా లేను. పులివెందులకు ఎప్పుడోగాని వెళ్లడం లేదు. 2018లో క్రిస్మస్ తర్వాత మళ్లీ నేను పులివెందుల వెళ్లనే లేదు. నా భర్త ఎన్.రాజశేఖర్‌రెడ్డి మాత్రం అప్పుడప్పుడు వెళుతుండేవారు’ అని సునీత చెప్పారు. వివేకానందరెడ్డి తన పేరును అక్బర్ఖాన్గా మార్చుకుని షమీమ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు ఉన్నారు. షమీమ్ కుటుంబం నిర్వహణ బాధ్యత చూస్తుండటంతోపాటు ఆమె చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేశారు. బలపనూరులో ఆమె ఇంటి పై అంతస్తును నిర్మించడంతోపాటు 8 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. ఇక వివేకానందరెడ్డి మొదటి భార్య సోదరులు తనను బెదిరించేవారని షమీమ్ సీబీఐకి చెప్పారు. పెద్ద భార్య పెద్ద సోదరుడు శివప్రకాశ్‌రెడ్డి తన ఇంటికి వచ్చి బెదిరించారని తెలిపారు. తన కుమారుడికి హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పించడంతోపాటు అక్కడే ఓ ఇల్లు కొని ఇచ్చి.. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని వివేకా షమీమ్‌కు మాట ఇచ్చారు. కానీ అంతలోనే వివేకా హత్యకు గురయ్యారు. అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వివేకా వివేకానందరెడ్డి షమీమ్‌ను రెండో వివాహం చేసుకోవడంతోపాటు ఆస్తి ఇస్తానని చెప్పడంతో మొదటి భార్య కుటుంబం ఆగ్రహించింది. కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకు చెక్ పవర్ రద్దు చేసింది.చెక్‌పవర్ రద్దు కావడంతో వివేకా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. మద్యం, ఇతర అవసరాలకు కూడా చేతిలో డబ్బులు లేక అల్లాడిపోయారని వివేకా ఇంట్లో పనివానిగా ఉన్న పెందింటి రాజశేఖర్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆయన సునీల్ యాదవ్, దస్తగిరిలతో సన్నిహితమయ్యారు. వారు చెప్పినట్టు చేస్తే వారిద్దరు డబ్బులు తెస్తారని ఎర్ర గంగిరెడ్డి వివేకాతో చెప్పేవారు. ఎనిమిది మంది నుంచి రూ.5 కోట్లు అప్పు తీసుకున్నారు. ఓసారి పెందింటి రాజశేఖర్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పారు. తమ ఇంట్లో డబ్బు కోసం ఏదో గొడవ జరుగుతోంది.. వివేకానందరెడ్డి బాగా తాగేసి గొడవ చేస్తున్నారని చెప్పారు. ‘మా నాన్న వివేకా ఇష్టానుసారంగా అప్పులు చేసి, తీర్చకపోవడంతో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ట్రాక్ రికార్డ్ సరిగా లేకపోవడంతో కంపెనీలకు బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. కంపెనీల నిర్వహణకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు అడ్డంకిగా ఉండకూడదనే మా నాన్న చెక్ పవర్‌ను రద్దు చేశాం’ అని సునీత చెప్పారు. వాస్తవం ఏమిటంటే.. వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన స్థానంలో సునీత ఆ కంపెనీల్లో డైరెక్టర్ అయ్యారు. జీవించి ఉండగా రోజువారి ఖర్చుల కోసం వివేకా ఇబ్బందులు పడ్డారు. కానీ ఆయన మరణించిన తర్వాత కొన్ని నెలలకే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆ కంపెనీ అప్పులన్నీ చాలా వరకు తీర్చేశారు. కంపెనీలన్నీ గాడిలో పడ్డాయి. ఈ ఏడాది జనవరిలో 93 ఎకరాల భూమిని సౌభ్యాగమ్మ, సునీత పేరిట బదిలీ చేశారు. బయటి శక్తుల పాత్ర పట్టించుకోని సీబీఐ వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దర్యాప్తు ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వనే లేదు. కుటుంబ విభేదాలు, రాజకీయంగా అడ్డుకునేందుకు యత్నించారంటూ సీబీఐ చెబుతున్న కారణాలేవీ కూడా నమ్మదగ్గవిగా లేవు. వాటికి ఎలాంటి ఆధారాలూ లేవు. అదే సమయంలో వివేకా కుటుంబంలో విభేదాలు, ఇతర అంశాలను కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. మొత్తం ఉమ్మడి కుటుంబంలో విభేదాలు అనే అంశాన్నే సీబీఐ ప్రధానంగా ప్రస్తావిస్తుండటం కేవలం కేసును తప్పుదారి పట్టించేందుకేనని స్పష్టమవుతోంది. వివేకా హత్య వెనుక బయటి శక్తుల ప్రమేయంపై సీబీఐ ఇప్పటి వరకు దృష్టి సారించనే లేదు. ఇప్పటి వరకు కేవలం సీబీఐ అప్రూవర్‌గా మార్చిన నిందితుడు దస్తగిరి, వాచ్‌మేన్ రంగయ్య వాంగ్మూలాలనే ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తోంది. కానీ వారు నిజాలే చెబుతున్నారడానికి ఆధారం ఏమిటి? -
వివేకా కేసు దర్యాప్తులో సీబీఐ హ్యాండ్సప్!
సాక్షి, అమరావతి: ఊహించినట్లుగానే మాజీ మంత్రి వైఎస్ వివేకాందనందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ చేతులెత్తేసింది! ముందుగానే ‘అప్రూవర్’ గంతలు కట్టుకుని దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ చివరికి సాధించింది శూన్యం!! నిందితుడు దస్తగిరితో చెప్పించిన తప్పుడు కథనం.. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు వండివార్చిన వాంగ్మూలాలు మినహా రెండున్నరేళ్ల దర్యాప్తు తరువాత సీబీఐ సాధించింది ఏమీ లేదు! శాస్త్రీయ ఆధారం అంటూ తెరపైకి తెచ్చిన ‘గూగుల్ టేక్’ అవుట్ చివరకు వట్టిదేనని చేతులెత్తేసింది. సాక్షుల వాంగ్మూలాల పేరిట పరస్పర విరుద్ధమైన, అహేతుకమైన వాదనలు బెడిసికొట్టాయి. గతంలో దాఖలు చేసిన చార్్జషీట్లలో పేర్కొన్న అభూత కల్పనలు, ఊహాజనితాలకు కొనసాగింపుగానే సీబీఐ తుది చార్్జషీట్ను దాఖలు చేసి చేతులు దులిపేసుకున్నట్లు స్పష్టమవుతోంది. సాధించింది శూన్యం ఎలాంటి ఆధారాలు లేకుండా వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి పేర్లను చార్్జషీట్లలో సీబీఐ ఏకపక్షంగా చేర్చింది. వారికి వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. గూగుల్ టేక్ అవుట్ పూర్తిగా అహేతుకమని నిపుణులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. యూటీసీ కాలమానానికి, భారత కాలమానానికి తేడా కూడా గుర్తించకుండా గతంలోని చార్జిషీట్లోఅభియోగాలను మోపడం సీబీఐ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. తమ అభియోగాలు అవాస్తవమని న్యాయ విచారణలో వెల్లడవుతుందని గుర్తించిన సీబీఐ తుది చార్జిషీట్లోనాలుక కరుచుకుంది. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి సునీల్ యాదవ్ అక్కడ లేరని పేర్కొంది. గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం పూర్తిగా తొందరపాటేనని స్పష్టమైంది. వాంగ్మూలాల కట్టుకథలు సాక్షులు చెప్పని విషయాలను కూడా 164 స్టేట్మెంట్ పేరిట నమోదు చేసుకుని మీడియాకు లీకులు ఇవ్వడం సీబీఐ దురుద్దేశాన్ని వెల్లడిస్తోంది. 2019 మార్చి 15న ఉదయం తాము హైదరాబాద్‌లో సమావేశంలో ఉండగా వైఎస్ జగన్ తమకు వివేకా మరణించారనే విషయాన్ని తెలియచేసినట్లు అజేయ కల్లం చెప్పారు. కానీ ఆయన ఫలానా సమయం అని ఏమీ చెప్పలేదు. కానీ ఉదయం 5.30 గంటలకే వైఎస్ జగన్ తమకు చెప్పారని అజేయ కల్లం వెల్లడించినట్లు సీబీఐ ఏకపక్షంగా వాంగ్మూలం నమోదు చేసుకుని మీడియాకు లీకులు ఇచ్చింది. దీన్ని అజేయ కల్లం వెంటనే ఖండించారు. అజేయ కల్లంను కలసిన అధికారి ఒకరు కాగా ఆయన పేరిట వాంగ్మూలం నమోదు చేసిన అధికారి మరొకరు కావడం గమనార్హం. ఇక అదే రోజు ఆ సమావేశంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఏస్ కృష్ణమోహన్‌రెడ్డి ఉదయం 6.30 గంటలకు తనకు ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ చేసి వివేకా మరణించిన విషయాన్ని తెలిపారని సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. వైఎస్ జగన్ నివాసంలో సహాయకుడు నవీన్ కూడా అదే చెప్పారు. ఆ ఇద్దరి వాంగ్మూలాలను సీబీఐ అదే విధంగా నమోదు చేసింది. మరి వారిద్దరు ఉదయం 6.30 గంటలకు తెలిసింది అన్నప్పుడు అదే సమావేశంలో పాల్గొన్న అజేయ కల్లం మాత్రం ఉదయం 5.30 గంటలకు తెలిసింది అని ఎలా చెప్పగలరు? ఎంపీ టికెట్ నిర్ధారించేది వైఎస్ జగన్ కడప ఎంపీ టికెట్ అంశంపై లేని సందిగ్దత ఉన్నట్టుగా చూపించేందుకు సీబీఐ విఫల యత్నాలు చేస్తోంది. తాజాగా షర్మిల వాంగ్మూలం పేరిట అదే ప్రచారాన్ని తెరపైకి తేవడం విడ్డూరంగా ఉంది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా తనను పోటీ చేయమని వివేకా ఒత్తిడి చేశారని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కానీ ఎంపీ టికెట్‌ను నిర్ణయించేది వివేకానో షర్మిలనో కాదు. నిర్ణయించేది పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయన అప్పటికే అవినాశ్‌రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించేశారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనే 2019 ఎన్నికల్లోనూ అభ్యర్థి అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. వివేకా కూడా అవినాశ్‌రెడ్డి తరపున ప్రచారం చేశారు. బెడిసికొట్టిన దస్తగిరి అప్రూవర్ కుట్ర వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ మొదట్లోనే పక్కదారి పట్టింది. హత్య చేశానని స్వయంగా అంగీకరించిన నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం న్యాయ నిపుణులను విస్మయపరిచింది. వివేకాను హత్య చేస్తే తాము చూసుకుంటామని వైఎస్ భాస్కర్‌రెడ్డి భరోసా ఇచ్చారని ఎర్రగంగిరెడ్డి తనతో చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అయితే తాను అలా చెప్పనే లేదని ఎర్ర గంగిరెడ్డి స్పష్టం చేశారు. ఇక వివేకా హత్యకు రూ.40 కోట్లతో డీల్ కుదిరినట్లు దస్తగిరి మరో కట్టుకథ చెప్పాడు. అందుకు సీబీఐ ఎలాంటి ఆధారాన్ని చూపించ లేదు. బెంగళూరులో ఓ భూ వివాదంలో రూ.8 కోట్లు వస్తాయని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్టుగా దస్తగిరి చెప్పాడు. అసలు ఆ వివాదమే లేదని స్పష్టమైంది. తనకు అడ్వాన్స్‌గా రూ.కోటి ఇచ్చారని చెప్పుకొచ్చిన దస్తగిరి రూ.2 వేల కోసం చివరికి రూ.500 కోసం సునీల్ యాదవ్‌తోపాటు ఇతరులను ప్రాథేయపడుతూ పెట్టిన వాట్సాప్ మెస్సేజ్‌లు వెలుగు చూశాయి. రూ.కోటి ఉన్న వ్యక్తి రూ.500 కోసం దేబిరించడం ఏమిటన్నది సీబీఐనే చెప్పాలి. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చిన సీబీఐ హత్య ఆయుధాన్ని కూడా రికవరీ చేయలేకపోయింది. తండ్రి శత్రువులతో సునీత కుమ్మక్కు పులివెందులలో తన తల్లి విజయమ్మపై పోటీ చేసినప్పటికీ వైఎస్ వివేకా పార్టీలోకి వస్తానంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. సముచిత గౌరవం ఇచ్చారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను అభ్యర్థిగా నిలిపారు. చంద్రబాబు పన్నాగంతో నాటి మంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి వైఎస్సార్సీపీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి కుట్రతో వివేకానందరెడ్డిని ఓడించారు. వివేకా మరణించిన తరువాత ఆయన కుమార్తె సునీత టీడీపీ నేతలతో కుమ్మక్కు కావడం విస్మయపరిచింది. వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కారణమంటూ సీబీఐకి తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో పూర్తిగా విఫలమైన సీబీఐ తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కట్టుకథలతో దర్యాప్తును పక్కదారి పట్టిస్తోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
SC on Viveka Case : పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ : వివేకా హత్య కేసుకు సంబంధించి సునీత వేసిన పిటిషన్ ఇవ్వాళ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కేసును విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం.. ఈ వ్యవహారంలో పూర్వపరాల గురించి అడిగింది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు గడువు ముగియడంతో.. సిబిఐ తన కౌంటర్ దాఖలు చేయలేదు. సునీత ఏం కోరింది? ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిబిఐ చేసిన దర్యాప్తుకు సంబంధించిన కేసు డైరీ వివరాలను తనకు ఇవ్వాలంటూ పిటిషనర్ సునీత సుప్రీంకోర్టును అడిగింది. పిటిషనర్ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కీలకమైన ఈ వ్యవహారంలో ఈ పరిస్థితుల్లో కేసు డైరీ వివరాలను పిటిషనర్‌కు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది. గంగిరెడ్డి లాయర్ ఏం కోరారు? ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ దర్యాప్తు పూర్తయిందని, ఈ నేపథ్యంలో గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ వేరుగా వినాలని ఆయన తరపు లాయర్ కోరారు. ఈ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. వివేకా హత్య కేసు చాలా సీరియస్ అంశం అని పేర్కొన్న సుప్రీం కోర్టు, సునీత పిటిషన్ తో పాటు గంగిరెడ్డి బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఏపీ పోలీసులు ఏం కనుగొన్నారు? సిబిఐ ఏం తేల్చింది? వివేకానందరెడ్డి హత్య 15 మార్చి, 2019న జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు ఓ బృందాన్ని కూడా నియమించింది. ఆ కేసును క్షుణ్ణంగా విచారణ చేసిన నాటి ఏపీ పోలీసులు.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో తమ నివేదికను CBIకి అప్పగించారు. ఈ నేపథ్యంలో అసలు అప్పటి పోలీసులు ఏమని నివేదించారు? ఇప్పుడు తాజాగా CBI దర్యాప్తులో ఏం కనిపెట్టిందన్న అంశాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివేకానంద రెడ్డి హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వాలని సిబిఐకి ఆదేశించింది. CBIకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటీ? ఈ కేసులో రెండు వారాల్లో రిప్లై పిటిషన్ దాఖలు చేయాలి నోటీసులపైన రిజాయిండర్లు మూడు వారాల్లో దాఖలు చేయాలి జూన్ 30న దాఖలు చేసిన చార్జిషీట్ కాపీని తమ ముందు ఫైల్ చేయాలి వివేకానంద రెడ్డి హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వాలి అనంతరం ఈ కేసులో తర్వాతి విచారణను సెప్టెంబర్ 11 కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో ఇతర ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. -
జగనన్న ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు !
-
క్రీడా వికాస కేంద్రం ప్రారంభించిన ఎంపీ అవినాష్ రెడ్డి
-
Viveka Case : సునీత పిటిషన్ జులై 3కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో.. సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణను వచ్చే నెల(జులై) 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ(జూన్ 19, సోమవారం) విచారణ జరిపింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ నెలాఖరు (జూన్ 30) కల్లా వివేకా హత్య కేసుపై సిబిఐని దర్యాప్తు పూర్తి చేయమని ఇప్పటికే సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విషయాన్ని సిద్ధార్థ లూథ్రా న్యాయస్థానానికి గుర్తు చేశారు. ఈ నెలాఖరుతో సిబిఐ దర్యాప్తు గడువు ముగుస్తున్నందున ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ అంగీకరించలేదు. కేసు విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ CJI బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో వాదనలు వినిపించాల్సిందిగా ప్రతివాదులయిన అవినాష్ రెడ్డి, CBIలకు నోటీసులు జారీ చేసింది. Supreme Court is hearing a plea by the daughter of former MP late YS Vivekananda Reddy against a Telangana High Court order granting anticipatory bail to Kadapa MP YS Avinash Reddy in connection with her father's murder.#SupremeCourt #SupremeCourtofIndia pic.twitter.com/Xs5HCAjpXz — Bar & Bench (@barandbench) June 19, 2023 పిటిషన్‌కు కాలం చెల్లే అవకాశం! వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఈ నెలాఖరు సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌గా విధించిన సంగతి తెలిసిందే. అలాగే సునీతా రెడ్డి పిటిషన్ ను జులై 3కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో.. CBI చార్జిషీట్ దాఖలు చేస్తే గనుక ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ కు కాలం చెల్లిపోయే అవకాశం ఉంది. గత విచారణలో సునీత తీరుపై అసంతృప్తి వివేకా కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి మే 31వ తేదీన షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. గత విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరింది సునీత. అంతే కాదు, హైకోర్టు మినీ ట్రయల్ ను నిర్వహించిందని, తమ వాదనల్లో మెరిట్ పరిశీలించకుండా బెయిల్ ఇచ్చిందని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ ను అరెస్ట్ చేయించాలన్న తాపత్రయం సునీతలో కనిపిస్తోందని, కేవలం ఇగో క్లాషెస్ కోసం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని మొన్నటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. Justice Surya Kant: Returnable on 7th July. Counsel: There is a connected matter. Justice Kant: List before first bench on 3rd July 2023, after getting appropriate orders from CJI. #SupremeCourt #SupremeCourtOfIndia — Live Law (@LiveLawIndia) June 19, 2023 తన వాదనే వినాలి, తాను చెప్పిందే నమ్మాలి అన్నట్టుగా కనిపించిన సునీత తీరు ఆశ్చర్యకరంగా ఉంది. ఏ న్యాయస్థానమయినా.. ఎలాంటి అభియోగాలపైనా అయినా.. వాదనలతో పాటు దానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన పిమ్మటే నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని సునీత విస్మరించినట్టు కనిపించింది. ఇదీ చదవండి: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌కి కారణం ఇదే.. -
YS Viveka Case: ఎంపీ అవినాశ్ జైలుపాలే మీ లక్ష్యమా?
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డిని జైలుపాలు చేయడమే మీ లక్ష్యమా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం నర్రెడ్డి సునీతను ప్రశ్నించింది. ఈ వ్యవహారం చూస్తుంటే ఈగో క్లాషెస్లా ఉందని వ్యాఖ్యానించింది. తొందరపడి వ్యక్తిగత వాదనల ద్వారా నష్టపోతారేమో చూసుకోవాలని హితవు పలికింది. పిటిషనర్ సునీత విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఈ నెల 19వతేదీకి వాయిదా వేస్తూ అదనపు డాక్యుమెంట్లు అందచేసేందుకు అనుమతించింది. ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ నర్రెడ్డి సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. అయితే సుప్రీం వెకేషన్ బెంచ్ సీనియర్ న్యాయవాదులను అనుమతించకపోవడంతో పిటిషనర్ సునీత తన వాదనలు తానే వినిపించడం ప్రారంభించారు. సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా ఆమెకు సహకరించేందుకు ధర్మాసనం అనుమతించింది. తాను పిటిషనర్‌నని, తన తండ్రి హత్యకు గురయ్యారని సునీత చెబుతుండగా.. ఆ విషయాల్లోకి తాము వెళ్లడం లేదని, వెకేషన్లో ఎందుకు వచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఈ కేసులో జూన్ 30 కల్లా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఛార్జిషీట్ ముందే ఫైల్ చేయాల్సి ఉంది. ఏ – 8 (అవినాశ్) భారీ కుట్ర చేసిన ప్రధాన వ్యక్తుల్లో ఒకరు. సీబీఐ దర్యాప్తునకు సహకరించడంలేదు. ముందస్తు బెయిలు పొందడం వల్ల కస్టోడియల్ ఇంటరాగేషన్ కుదరడం లేదు. ముందస్తు బెయిలు ఎందుకు ఇచ్చారో కారణాలు తెలియడం లేదు’’ అని సునీత పేర్కొన్నారు. ఈ సమయంలో జస్టిస్ విక్రమ్‌నాథ్ జోక్యం చేసుకుంటూ ‘దీంట్లో అంతగా అత్యవసరమైన పరిస్థితి ఏముంది? వెకేషన్ బెంచ్‌కు రావాల్సిన అవసరం ఉందా?’ అని ప్రశ్నించారు. సీబీఐ చూసుకుంటుంది.. ‘ఒక వ్యక్తిని అరెస్టు చేయాలో లేదో దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది. ఎవరిని, ఎప్పుడు అరెస్టు చేయాలో ఎవరిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలో సీబీఐకు తెలుసు. విచారణకు సహకరిస్తున్నారా లేదా అనేది కూడా సీబీఐ చూసుకుంటుంది. మీరెందుకు జోక్యం చేసుకుంటారు? ఈ కేసులో పలు సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. మీకెందుకు ఈగో క్లాషెస్? అతడిని (ఎంపీ అవినాశ్) జైలు పాలు చేయాలన్న లక్ష్యమా? ఆ విధంగా చూడొద్దు. ఈ తరహా ప్రొసీడింగ్స్ ఎందుకు?’’ అని జస్టిస్ అమానుల్లా వ్యాఖ్యానించారు. ఇప్పుడీ పిటిషన్‌ను కొట్టివేస్తే.. ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇతర నిందితులతో కలసి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత ఆరోపించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అవినాశ్‌రెడ్డి సీబీఐ దర్యాప్తునకు సహకరిస్తున్నప్పుడు కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం ఏముందని ప్రశ్నించింది. ‘‘మీకో సలహా ఇస్తాం. మీరు వ్యక్తిగతంగా వాదిస్తున్నారు. చట్టంపై అవగాహన లేమితో వాదనలో అంతగా ప్రావీణ్యం లేకపోవచ్చు. మేం ఇప్పుడు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తే సీనియర్ న్యాయవాదికి ఇబ్బంది అవుతుంది. అందుకే సెలవుల తర్వాత విచారణ జాబితాలోకి చేరుస్తాం’’ అని సునీతనుద్దేశించి ధర్మాసనం పేర్కొంది. సీబీఐ దర్యాప్తు ఈ నెల 30 కల్లా పూర్తి కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా ఈ సమయంలో పేర్కొన్నారు. వాదనలకు సీనియర్ న్యాయవాదులను అనుమతించడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ తమకు ఇబ్బంది కలగ చేయవద్దని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది. తాము ఇప్పుడు వాదనలకు అనుమతిస్తే మరో నలుగురు సీనియర్ న్యాయవాదులు తమను వక్షకు గురి చేశారని ఆరోపించే అవకాశం ఉందని పేర్కొంది. తాము అనుమతించకపోయినప్పటికీ మీరు వాదనలు చేస్తున్నారంటూ లూత్రాను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో మరో బెంచ్ నిర్దేశించిన డెడ్‌లైన్‌ను తాము మార్చలేమని స్పష్టం చేసింది. గడువు నిర్దేశించాక ఎలా మారుస్తాం? సీబీఐకు నోటీసులిచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించాలని ధర్మాసనాన్ని సునీత కోరారు. అయితే ఇప్పటికే మరో బెంచ్ జూన్ 30వతేదీ అని గడువు నిర్దేశించిన తరువాత తాము ఎలా మారుస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవేళ ఇప్పుడు తాము జోక్యం చేసుకుంటే మొత్తం అంతా మారిపోతుందని వ్యాఖ్యానించింది. అయితే సీబీఐకి నోటీసులు ఇవ్వాలని సునీత మరోసారి అభ్యర్థించడంతో ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఎందుకు సీబీఐ రావాలని కోరుతున్నారు? రావాలో వద్దో సీబీఐ నిర్ణయించుకుంటుంది. ప్రతివాది సహకరించకుంటే, కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమైతే, హైకోర్టు ఆదేశాలు సరి కాకుంటే సీబీఐ తనకు తానే వస్తుంది. అందుకే చెబుతున్నాం. జూలై 3న కోర్టుకు రండి. మీ న్యాయవాది వాదిస్తారు’ అని ధర్మాసనం సూచించింది. న్యాయవాది వాదించడమే సబబు.. హైకోర్టు ఆదేశాలు నిష్ప్రయోజనమని ఈ అంశానికి సంబంధించి మరో కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని సునీత పేర్కొనడంతో అందుకే తాము సెలవుల తర్వాత రావాలని సలహా ఇస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ప్రతివాది అవినాశ్ మీ కజినా? అని ధర్మాసనం పదేపదే సునీతను ప్రశ్నించగా... అవునని తన రెండో కజిన్ అని సునీత సమాధానమిచ్చారు. అయితే పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించడమే సబబని, ఇందులో సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా సునీత పిటిషన్‌ను బుధవారం విచారణ జాబితాలో చేర్చాలని, అడ్వొకేట్ ఆన్‌రికార్డ్స్ హాజరవుతారని లూత్రా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే సీబీఐకి నోటీసులు ఇవ్వడంలో తాము జోక్యం చేసుకోబోమని, పిటిషనర్ విజ్ఞప్తి మేరకు ఈ నెల 19న విచారణ జాబితాలో చేర్చాలంటూ రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలిచ్చింది. -
తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకుని అధికార పార్టీపై అబద్దాలు చెబుతున్నారు: వైఎస్ అవినాష్ రెడ్డి
-
నారా లోకేష్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి కౌంటర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: లోకేశ్ యువగళం పాదయాత్రపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమలో పాదయాత్ర చేస్తే తప్ప లోకేశ్‌కు ఈ ప్రాంత వాసినని తెలియలేదని మండిపడ్డారు. ‘‘తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకుని అధికార పార్టీపై అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ గుర్తే లేదు. అబద్ధాలకోరులను ప్రజలు ఎవరూ నమ్మరు’’ అని అవినాష్‌రెడ్డి అన్నారు. చదవండి: YS Viveka Case: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు -
YS Viveka Case: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సునీత రెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. కేసును ఈ నెల 19కి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ A.అమానుల్లా నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాగా కేసులో తానే వాదనలు వినిపిస్తానంటూ సునీతారెడ్డి ముందుకు వచ్చింది. దీనిపై స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ఎవరైనా లాయర్ ను పెట్టుకోవాలని సూచించింది. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రాను సునీతకు సాయం చేయాలని కోరింది. సునీత : సీబీఐ దర్యాప్తునకు అవినాష్ ఏ మాత్రం సహకరించడం లేదు. ఏప్రిల్ 24 తర్వాత 3 సార్లు నోటీసులిచ్చినా విచారణకు రాలేదు జస్టిస్ విక్రమ్ నాథ్ : ఈ కేసులో అంత అత్యవసరమైన పరిస్థితి ఏముంది? వెకేషన్ ముందున్న బెంచ్‌కు రావాల్సిన పరిస్థితి ఉందా? జస్టిస్ A.అమానుల్లా : ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలా? లేదా అన్నది దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేయాలో, ఎవరిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలో CBIకి తెలుసు. ఈ కేసులో చాలా సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. సునీత : ఇతర నిందితులతో కలిసి అవినాష్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. ఇదే కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు : అవినాష్ రెడ్డి CBI ముందు హాజరవుతున్నారు కదా, అలాగే దర్యాప్తుకు సహకరిస్తున్నప్పుడు CBIకి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం ఏముంది? ఈ కేసులో మీరు తొందరపడి వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలనుకుంటే నష్టపోతారు, మీరు (సునీతను ఉద్దేశించి) న్యాయశాస్త్రంలో నిష్ణాతులు కాకపోవచ్చు. మీ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేస్తే.. తర్వాత వచ్చే లాయర్ కు సమస్య ఎదురవుతుంది. సెలవుల తర్వాత ఈ కేసును పరిశీలిద్దామా? సీనియర్ లాయర్ లుథ్రా: ఈ నెలాఖరులోగా సిబిఐకి ఇచ్చిన దర్యాప్తు గడువు ముగుస్తుంది సుప్రీంకోర్టు : మిస్టర్ లుథ్రా.. మీరు సమస్యలు సృష్టిస్తున్నారు. వాదనలు వద్దంటున్నా.. మీరు తలదూర్చాలనుకుంటున్నారు. ఈ కోర్టులోనే ఒక బెంచ్ విధించిన గడువుపై మేం మళ్లీ ఉత్తర్వులు ఇవ్వాలా? సునీత : ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిబిఐని ఆదేశించండి సుప్రీంకోర్టు : అలాంటి ఉత్తర్వులు మేమేలా ఇస్తాం? ఈ పిటిషన్ లో విచారణకు రావాలా లేదా అన్నది CBI ఇష్టం. జులై 3న రండి సునీత : హైకోర్టు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించే తుది అధికారం సుప్రీంకోర్టుకు ఉందని గతంలో మీరు చెప్పారు కదా జస్టిస్ A.అమానుల్లా : మీరు ఆరోపణలు చేస్తున్న నిందితుడు మీ కజినా? సునీత : అవును, అవినాష్ రెడ్డి నాకు సెకండ్ కజిన్ సీనియర్ లాయర్ లుథ్రా: ఈ కేసును రేపు పరిశీలించండి. రేపు అడ్వొకేట్ ఆన్ రికార్డును కోర్టు ముందుంచుతాం. నేను వాదనలు వినిపిస్తాను సుప్రీంకోర్టు : మీరు అడిగినట్టు CBIకి నోటీసులు ఇవ్వలేం. కేసును జూన్ 19వ తేదీకి (వచ్చే సోమవారం) వాయిదా వేస్తున్నాం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జారీ చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ సునీతా రెడ్డి వేసిన పిటిషన్లో సిబిఐకి నోటీసులు జారీ చేయాలని కోరినా.. సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఈ కేసులో సునీత తీరు పంతాలకు పోయి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది. కేవలం అవినాష్ రెడ్డిని జైల్లో వేయించడమే లక్ష్యంగా సునీత తీరు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కేసుకు సంబంధించి అదనపు పత్రాలు సమర్పించేందుకు సునీతకు అవకాశమిచ్చింది సుప్రీంకోర్టు. ఈ కేసును జూన్ 19న పరిశీలిస్తానని తెలిపింది. -
తొంగి చూసినట్లే రాతలు!.. ఆ ప్రశ్నలకు బదులేవీ?
మనిషికి , మనిషికి కొలమానాలు ఎలా మారిపోతాయో చూడండి. వివేకా కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ఏడుసార్లు విచారించినా.. మళ్లీ ,మళ్లీ విచారణ చేయాలనడం కరెక్టట!. అదే మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ను ఏపీ సీఐడీ ప్రశ్నిస్తే మాత్రం తప్పట!. ఏమి లాజిక్!. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్నది ఒక ఆరోపణ. దాని జోలికి వెళ్లకుండా.. సీబీఐ వాళ్లు అలా చేశారు... ఇలా చేశారు.. అవినాశ్.. దానికి సమాధానం చెప్పలేదు.. దీనికి చెప్పలేదు అంటూ ఇష్టారీతిన వార్తలు ఇచ్చారు. చివరికి ఎంతవరకు వెళ్లారంటే అవినాష్‌కు బెయిల్ ఇవ్వకుండా చేయాలన్న దురుద్దేశంతో ఎల్లో మీడియాలోని ఒక వర్గం ఏకంగా న్యాయ వ్యవస్థకే కళంకం ఆపాదిస్తూ చర్చలు జరిపింది. ✍️ అవినాష్ రెడ్డిని ఈ కేసులో సీబీఐ విచారిస్తున్న తీరుపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక కోణంలోనే విచారణ సాగుతోందని, రెండో కోణంలో దర్యాప్తు జరగడం లేదన్న అభ్యంతరాలూ వ్యక్తం అవుతున్నాయి. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో.. గౌరవ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక సిబిఐ నీళ్లు నమిలింది. కాగా, మార్గదర్శి ఆర్దిక లావాదేవీల అక్రమాల కేసులో ఆ సంస్థ ఎండీ అయినా శైలజా కిరణ్‌ను సీఐడీ విచారిస్తుంటే.. అది కక్ష అని ప్రచారం చేస్తున్నారు. తమ చేతిలో మీడియా ఉంది కనుక సీఐడీపై ఆరోపణలు గుప్పించారు. అదే మరోచిట్ ఫండ్ సంస్థ కాని, ఇంకో ఆర్థిక సంస్థ కాని ఇలా కేసులో చిక్కుకుంటే, ఆ కంపెనీ ఎండీని, డైరెక్టర్లను సీఐడీ విచారిస్తుంటే ఇదే ఈనాడు మీడియా ఎన్ని రకాల కథనాలు వండి వార్చేది?. ✍️ కొన్నేళ్ల క్రితం అగ్రిగోల్డ్ డిపాజిట్ల కేసును తీసుకుంటే ఈనాడు మీడియా ఎన్ని వార్తలు ఇచ్చి ఉంటుంది!. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోనియాగాంధీ, చంద్రబాబులు కలిసి కేసులు పెట్టినప్పుడు సీబీఐ విచారణ సందర్భంలో ఎంత ఘోరంగా ఈనాడు మీడియా వార్తలు ఇచ్చింది గుర్తు లేదా!. జగన్ పై కేసు నిలబడుతుందా?లేదా? అన్నదానితో నిమిత్తం లేకుండా, ఏకపక్షంగా.. సీబీఐ అధికారి ఇచ్చిన లీకులు, తమకు ఏది తెలిస్తే దానిని మొదటి పేజీలలో పుంజీలకొద్ది కథనాలు ఇచ్చారే!. ఏకంగా జగన్ పై ఈడీ కేసులు వచ్చాయని, తీహారు జైలుకు తరలిస్తారని పలుమార్లు వార్తలు ఇచ్చారే! అప్పుడు సీబీఐ వాళ్లకు గొప్పసంస్థగా కనిపించింది. ఆ దర్యాప్తు సంస్థ అధికారిని గొప్ప ఆఫీసర్‌గానూ పబ్లిసిటీ చేశారు. తీరా ఆ అధికారి ఆ తర్వాత కాలంలో ఒక రాజకీయ పార్టీలో చేరి ఎన్నికలలో పోటీచేసి ఓటమి చెందారు. అంతగా ఆ మీడియా ఆయనను ప్రభావితం చేసిందన్నమాట. ✍️ ఇప్పుడు మార్గదర్శి కేసులో ఏమి రాస్తున్నారు?.. ఏమి చెబుతున్నారు?.. మార్గదర్శిని దెబ్బ తీయడమే అసలు లక్ష్యం అని హెడ్డింగ్‌లు పెడుతున్నారు. ఏడు గంటల పాటు ఎండీ శైలజా కిరణ్‌ను విచారించిన సీఐడీ, మళ్లీమళ్లీ అవే ప్రశ్నలు. పొంతనలేని అంశాలు అంటూ ఈనాడు వార్త ఇచ్చింది. మరి సీబీఐ అవినాష్‌ను కాని, ఆయా కేసులలో కాని పలుమార్లు విచారించినప్పుడు ఇలా ఎందుకు రాయదు!. సీబీఐ వేసిన ప్రశ్నలు వేయడం కాకుండా కొత్త ప్రశ్నలు వేసిందని ఈనాడు కనిపెట్టిందా!. ఏ దర్యాప్తుఅధికారి అయినా, తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా పదే,పదే ఒకే ప్రశ్న అడుగుతుంటారట. తద్వారా ఏదో టైమ్ లో భిన్నమైన సమాచారం వస్తుందేమోనని పరిశీలిస్తుంటారట. వేధింపులే లక్ష్యంగా అధికారులు వ్యవహరించారని ఈనాడు ఆరోపణ. ✍️ సాధారణంగా నిందితులు పోలీస్ స్టేషన్ లేదా, నిర్దిష్ట పోలీసు కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరు కావల్సి ఉంటుంది. కాని ఇక్కడ ఏపీ సీఐడీ రామోజీరావును కాని, ఆయన కోడలు శైలజా కిరణ్ ను కాని వారి ఇంటికే వళ్లి విచారిస్తున్నారే!. దేశంలో ఎంత మందికి ఇలాంటి గౌరవం లభిస్తుంది. అయినా వేధింపులే అని వీరు వాపోతున్నారు. పొంతన లేని అంశాల గురించి ప్రస్తావించారని అంటున్నారు. అవేమిటో చెప్పలేదు. అవినాష్ కేసు అయినా, మరోకేసు అయినా, దర్యాప్తు సంస్థ వేసిన ప్రశ్నలు, వీరు ఇచ్చిన జవాబులు అంటూ వార్తలు ఇచ్చే మీడియా శైలజా కిరణ్ విషయంలో అలా ఎందుకు చేయలేదు?. ఏ ప్రశ్నకు ఆమె ఏ సమాధానం ఇచ్చారో రాసి ఉంటే వాస్తవాలు తెలిసేవి కదా!. ✍️ గత నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వంపై విపరీతమైన దాడి చేస్తూ , నిత్యం తప్పుడు వార్తలతో నింపుతున్న ఈనాడు మీడియాకు తమదాకా వచ్చేసరికి అమ్మో,అబ్బో అంటున్నారే. సీఐడీ వారు మార్గదర్శిలో ఫలానా అక్రమాలు జరిగాయని అంటున్నారు. వందల కోట్లో, వేల కోట్లో బ్లాక్ మనీ సర్కులేట్ అయిందని చెబుతున్నారు. వాటికి ఆధారాలు ఉన్నాయంటున్నారు. వాటిని శైలజా కిరణ్ కు కూడా చూపించి ప్రశ్నిస్తే, ఆమె వాటికి జవాబు ఇవ్వలేకపోయారని వేరే మీడియాలో వార్తలు వచ్చాయే!. డిపాజిట్ దారుల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారా?లేదా? అన్నదానికి నిర్దిష్టమైన సమాధానం ఇవ్వవచ్చు కదా?. అన్నిటికి మించి CID వారు మార్గదర్శి ఆఫీస్ లలో సోదాలు జరిపినప్పుడు వారు అడిగిన రికార్డులు అన్నింటినీ ఇచ్చేసి ఉంటే అసలు సమస్యే ఉండేది కాదు కదా!. ✍️ ఏపీలో జరిగిన కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టును ఎందుకు ఆశ్రయించవలసి వచ్చింది? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం రావడం లేదు. మార్గదర్శి నిధులను మళ్లించిన విషయాన్ని ఒప్పుకున్నారు. కాని, ఎక్కడికో తెలియదని ఆమె అన్నారట. ఆ డబ్బును షేర్లలో పెట్టారా?లేదా? అందుకు చట్టం అనుమతిస్తుందా? అలాగే ఆ నిధులను రామోజీ గ్రూపు ఇతర సంస్థలలో పెట్టారా?లేదా? అది చెల్లుతుందా? నల్లధనం మార్పిడికి మార్గదర్శిని వాడుకున్నారన్న అభియోగానికి ఏమి సమాధానం ఇచ్చారు?. ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న వాదన తప్ప, చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా అనేవాటికి జవాబు ఇవ్వడం లేదు. విచారణకు శైలజ సహకరించలేదని అధికారులు అంటున్నారు. అయితే ఒక అధికారి సహకరించారని అన్నారని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. నిజంగానే శైలజా సహకరించి ఉంటే మంచిది!. సీఐడీకి కాని, ఇతరత్రా సాధారణ ప్రజలకు కాని వస్తున్న సందేహాలను తీర్చే విధంగా తమ మీడియాలో ప్రముఖంగా ఇస్తే అంతా తేలిపోతుంది కదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ ఇదీ చదవండి: ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్ ఏంటంటే.. -
అవినాష్‌రెడ్డి సహకరిస్తున్నా.. లేదంటూ మెన్షన్!
సాక్షి, ఢిల్లీ: వివేకా హత్య కేసులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం తెలంగాణ హైకోర్టు(వెకేషన్ బెంచ్) కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్మంజూరు చేసింది. అయితే ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. జూన్ 13న జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేపట్టనుంది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలన్నది సునీత పిటిషన్ సారాంశం. ఇవాళ(శుక్రవారం) సుప్రీంకోర్టులో పిటిషన్‌పై మెన్షన్ చేసిన సునీత తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా విచారణ చేపట్టాలని కోరారు. వివేకా కేసులో దర్యాప్తు కోసం రావాలని సీబీఐ కోరుతున్నా.. అవినాష్‌రెడ్డి హాజరు కాలేదని న్యాయవాది లూథ్రా కోర్టుకు తెలిపారు. అయితే, ఇప్పటివరకు 7 సార్లు అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరు అయిన విషయం తెలిసిందే. బెయిల్ తర్వాత కూడా శనివారం రోజున అవినాష్‌రెడ్డి సీబీఐ ముందు హాజరయ్యారు. ఈ విషయాన్ని సమగ్రంగా వివరించకుండా.. అవినాష్‌రెడ్డి లక్ష్యంగా కొన్ని తప్పుడు వాదనలు వినిపించారు సునీత తరపు న్యాయవాది. ఇక తెలంగాణ హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు జరిగిన వాదనల సందర్భంగా హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలను మాత్రం సునీత తన పిటిషన్లో సుప్రీంకోర్టు ముందు ఉంచకపోవడం గమనార్హం. ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం హియర్ సే పేరుతో, కొన్ని కల్పిత కథనాలను సృష్టించి, వాటిని తెలుగుదేశం సహకారంతో ఎల్లో మీడియాలో పబ్లిష్ చేయించి వాటి ఆధారంగానే మరోసారి సుప్రీంకోర్టును సునీత ఆశ్రయించినట్టు తాజా పిటిషన్ ద్వారా అవగతమవుతోంది. దర్యాప్తునకు అవినాష్‌రెడ్డి అన్నివిధాలుగా సహకరిస్తున్నప్పటికీ.. సునీత తరపు న్యాయవాది మాత్రం ఆయన దర్యాప్తును అడ్డుకుంటున్నారంటూ ధర్మాసనానికి వినిపించారు. దీనిపై స్పందించిన బెంచ్.. పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. ఇదీ చదవండి: ఇది వ్యక్తిగత దాడి మాత్రమే కాదు! -
చెప్పుడు మాటలతో దర్యాప్తా?
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు మినహా ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎవరో అన్నవి, విన్నవి మినహా సాక్ష్యాలేవని ప్రశ్నించింది. కేవలం చెప్పుడు మాటలు, ఊహాజనిత సాక్ష్యాల ఆధారంగా సీబీఐ తప్పుదారిలో దర్యాప్తు కొనసాగిస్తోందని తప్పుబట్టింది. ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరం లేదని పేర్కొంటూ ఐదు షరతులతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, జూన్ చివరి వరకు దర్యాప్తునకు సహకరించాలని, ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరు కావాలని తెలిపింది. ఒకవేళ అవినాశ్‌ను అరెస్టు చేస్తే రూ.5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరో ఇద్దరి ష్యూరిటీ తీసుకుని బెయిల్‌పై విడుదల చేయాలని కూడా సీబీఐని ఆదేశించింది. షరతులను అవినాశ్ ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. ముందస్తు బెయిల్ కోరుతూ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్ర, శనివారం సుదీర్ఘ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు మే 31న తుది తీర్పు వెలువరిస్తామని, అప్పటివరకు ఆయన్నుఅరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అవినాశ్‌రెడ్డికి షరతులతో ముందుస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ ఎం.లక్ష్మణ్ ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. సాక్షులెవరూ ఫిర్యాదు చేయలేదు.. ‘సుదీర్ఘ కాలం దర్యాప్తు చేసినా అవినాశ్‌కు వ్యతిరేకంగా సీబీఐ ఎలాంటి ఆధారాలను సేకరించలేకపోయింది. కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమైంది. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలను చెరిపివేయడంలోనూ అవినాశ్ ప్రమేయం ఉన్నట్లు తేలలేదు. సాక్షులను అవినాశ్ బెదిరిస్తున్నట్లు ఇప్పటివరకు ఎవరూ దర్యాప్తు అధికారులకు ఫిర్యాదు చేయలేదు. సీబీఐ సేకరించింది హియర్ సే ఎవిడెన్స్ (ఫలానా వ్యక్తి నాకు చెప్పారు అని మరొకరి చెప్పడం), ఊహాజనిత సాక్ష్యాలు మాత్రమే. ఈ హత్య వెనుక భారీ కుట్ర ఉందనేందుకు అవినాశ్‌కు వ్యతిరేకంగా నేరుగా ఒక్క ఆధారం కూడా లేదు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన సమాచారంపైనే సీబీఐ పూర్తిగా ఆధారపడి దర్యాప్తు సాగిస్తోంది. రాజకీయ కోణం అంటున్నా అందుకు ఆధారాలు లేవు. కోర్టుకు ఆరోపణలు కాదు.. ఆధారాలు కావాలి. ఈ అంశాలన్నింటిని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత కస్టోడియల్ విచారణ అవసరం లేదని ఈ కోర్టు భావిస్తోంది. అవినాశ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు పిటిషన్‌ను అనుమతిస్తున్నాం’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ‘సాక్షుల స్టేట్మెంట్లతోనే సీబీఐ దర్యాప్తు చేసింది. రెండేళ్ల క్రితమే అవినాశ్ కుట్ర బయటపడిందని చెప్పిన సీబీఐ అప్పుడే ఎందుకు విచారణ చేయలేదో సమాధానం లేదు. హత్యకు వాడిన గొడ్డలిని సీబీఐ రికవరీ చేయలేదు. ఏ–2 గొడ్డలిని నాలాలో పడేసినట్లు చెప్పాడు. నిందితులకు ఇచ్చిన డబ్బును కూడా రికవరీ చేయలేదు. దస్తగిరి అనుచరుడు మున్నాను ఈ డబ్బుకు సంబంధించి విచారించలేదు. వివేకా అల్లుడు తానే లేఖను దాచిపెట్టానని వాంగ్మూలంలో చెప్పాడు. ఎర్రగంగిరెడ్డితో మిగతా ముగ్గురు నిందితులకు ఉన్న సంబంధాలను సీబీఐ కనుగొనలేదు. వివేకా తలపై గాయాలున్నా హత్య కేసుగా నమోదు కాలేదు. అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేయడం నాటి విచారణాధికారి తప్పిదమే. కడప ఎంపీ టికెట్ వివాదంపై సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలూ లేవు. వివేకా హత్య కేసులో, సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్ పాత్ర ఉన్నట్లు ఆధారాలు లేవు’ అని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎక్కడా అవినాశ్ పాత్ర లేదు: న్యాయవాది ‘ఈ హత్య కేసు వెనుక భారీ కుట్ర ఉందంటున్న సీబీఐ, అవినాశ్‌కు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. విచారణకు అవినాశ్ సహకరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఏడు సార్లు విచారణ జరిగింది. హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించి దాదాపు నాలుగేళ్లు అవుతున్నా సీబీఐ ఆరోపణలు మినహా అవినాశ్‌కు వ్యతిరేకంగా ఆధారాలను చూపడం లేదు. సాక్ష్యాలు లేకుండా ఓ పార్లమెంట్ సభ్యుడి ప్రజా జీవితాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. వివేకా హత్య జరిగిన రోజు అవినాశ్ అక్కడకు చేరుకునేటప్పటికి అందరూ గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయారని చెబుతుండటంతో ఆయన కూడా తొలుత అలాగే భావించారు. సాక్ష్యాల ధ్వంసంలోనూ ఆయన పాత్ర లేదు. అప్పటికే పలు ఫోన్లలో వీడియోలు, ఫొటోలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు విచారించిన నేపథ్యంలో కస్టోడియల్ విచారణ అవసరం లేదు’ అని అవినాశ్ న్యాయవాది పేర్కొన్నారు. బెయిల్ మంజూరుకు కోర్టు పరిగణలోకి తీసుకున్న అంశాలివీ.. తొలి చార్జీషీట్ సమయంలో అవినాశ్‌కు సంబంధం ఉండొచ్చని అనుమానించిన సీబీఐ విచారణ నోటీసులు జారీ చేసేందుకు మాత్రం రెండేళ్లు ఆగింది. జనవరి నుంచి విచారణకు హాజరు కావాలని మాత్రమే నోటీసులు జారీ చేసింది. ఒకవేళ ఆయన్ను అరెస్టు చేసే ఉద్దేశం ఉంటే సీబీఐ ఇన్నేళ్లు ఎందుకు ఆగిందనే దానికి దర్యాప్తు అధికారుల వద్ద సమాధానం లేదు. అవినాశ్ తల్లి మెడికల్ రికార్డులను పరిశీలిస్తే శస్త్రచికిత్స వాస్తవమే అన్నది తెలుస్తోంది. విచారణ సందర్భంగా హైకోర్టు అడిగిన పలు ప్రశ్నలకు సీబీఐ సమాధానం చెప్పలేకపోయింది. -
ఎంపీ అవినాష్‌కు ఊరట.. హైకోర్టు ఆర్డర్‌లోని కీలక అంశాలివే!
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జస్టిస్ లక్ష్మణ్ ఇచ్చిన తీర్పులో చాలా కీలక అంశాలను పొందుపరిచారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన తీరు, దర్యాప్తు సంస్థల రికార్డులు, నిందితుల వివరాలను తన తీర్పులో పేర్కొన్నారు. హంతకులు వీరే సీబీఐ దర్యాప్తు ఆధారంగా వివేకానందరెడ్డిని హత్య చేసింది గంగిరెడ్డి, యాదాటి సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి అని తేలింది హత్యకు కారణాలేంటీ? దర్యాప్తు సంస్తల విచారణ ఆధారంగా తేలింది ఏంటంటే, హత్య చేసిన నలుగురికి వివేకాతో వేరు వేరు వైరుధ్యాలున్నాయి సంబంధిత వార్త: ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు 1. ఎర్ర గంగిరెడ్డి : వివేకా పలుమార్లు గంగిరెడ్డిని అందరి ముందు తిట్టడంతో పాటు రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ లావాదేవీల్లో విభేదాలు వచ్చాయి. 2. సునీల్ యాదవ్: తనకు బెంగుళూర్ సెటిల్మెంట్లో డబ్బులు రాలేదని వివేకాపై ఆగ్రహంగా ఉన్నాడు. దీంతో పాటు రంగురాళ్లు, వజ్రాల లావాదేవీలలో వివేకాతో విభేదాలు వచ్చాయి. తన తల్లిపై వివేకా తప్పుడు ఆలోచనలతో ఉన్నాడని సునీల్ యాదవ్ వివేకాపై పగ పెంచుకున్నాడు. 3. ఉమాశంకర్‌రెడ్డి: వివేకా తనకు సర్పంచ్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదనే కోపం ఉంది. తన భార్యపై వివేకా తప్పుడు ఆలోచనలతో ఉన్నాడని ఉమాశంకర్‌రెడ్డి కోపం పెంచుకున్నాడు. 4. దస్తగరి: తనను డ్రైవర్‌గా తొలగించాడన్న కోపం వివేకాపై ఉంది. ఒక మహిళతో అక్రమ సంబంధం విషయంలో దస్తగిరికి వివేకాకు శత్రుత్వం ఉంది. చదవండి: వివేకా హత్య కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదు: సజ్జల ఎప్పుడెప్పుడు ఏం జరిగింది? 1. ఈ కేసులో ముందుగా టీడీపీ నాయకుడు ఆదినారాయణరెడ్డిపై అనుమానాలు వచ్చాయి. 2. వివేకాను కుటుంబ సభ్యులే హత్య చేశారని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటనలు చేశారు. దీనిని తీవ్రంగా తప్పుబడుతు వివేకా కుమార్తే సునీతారెడ్డి ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసారు. 3. ఆధారాలను పరిశీలిస్తే సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాలను తుడిచేవేసే ప్రయత్నం జరిగినట్లు స్పష్టమవుతోంది. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి సైతం ఆధారాలు దాచిపెట్టినట్లు స్పష్టమవుతోంది. హత్యకు ముందు వివేకా రాసిన ఉత్తరాన్ని దాచిపెట్టాలని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పీఏ కృష్ణారెడ్డికి చెప్పారు. 4. సిబీఐ విచారణలో సేకరించిన వాంగ్మూలంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వివేకా హత్య కేసులో సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంలో అవినాష్‌రెడ్డి పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారం లేదు. 5. సంఘటనా స్థలంలో ఆధారాలను గంగిరెడ్డి తుడిచేందుకు ప్రయత్నించినట్లు ఆధారాలు ఉన్నాయి. 6. హత్య సమయంలో వివేకా నివాసంలో డాక్యుమెంట్ల కోసం గంగిరెడ్డి, యాదాటి సునీల్ వెతికినట్లు సీబీఐ దర్యాప్తు ద్వారా తెలుస్తోంది. నిందితులు ఆ డాక్యుమెంట్లను తమతో పాటు తీసుకెళ్లారు. డాక్యుమెంట్లను తమతో పాటు తీసుకెళ్లే ముందు డాక్యుమెంట్లను పరిశీలించుకున్నారని అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పష్టంగా చెప్పారు. గంగిరెడ్డి, యాదాటి సునీల్ హత్య సమయంలో వ్యవహరించిన తీరును బట్టి ఈ డాక్యుమెంట్ల కోసమే హత్య జరిగినట్లు అర్ధమవుతోంది. 7. ఈ డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పటి వరకు సీబీఐ తేల్చలేకపోయింది. ఈ డాక్యుమెంట్లు దొరికితే హత్యకు అసలు ఉద్దేశ్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. 8. వివేకా హత్యకు ముందు 2019 ఫిబ్రవరి 10వ తేదీన గంగిరెడ్డి ఇంటి వద్ద బ్లాక్ బొలేరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు ఉన్న విషయంపై వివరాలు సేకరించడంలో సీబీఐ విఫలమైంది. ఇది కూడా చదవండి: ఇది వ్యక్తిగత దాడి మాత్రమే కాదు.. అవినాష్ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి ఆవేదన 9. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు. 10. కడప ఎంపి టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందనేది కేవలం ఊహజనితమే. సీబీఐ సేకరించిన వాంగ్మూలాలలోనే వివేకా కడప నుంచి పోటీ చేయాలనుకోలేదని స్పష్టం అవుతోంది. 11. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వాంగ్మూలంలో ఒక విషయం స్పష్టమవుతోంది. వివేకా హత్య కన్నా ముందే ఎంపీ టికెట్‌కు అనధికారికంగా అవినాష్‌రెడ్డి పేరు ఖరారు అయినట్లు రాజశేఖర్‌రెడ్డి చెప్పినదాన్ని బట్టి స్పష్టమవుతోంది. 12. కడప ఎంపీగా అవినాష్‌రెడ్డిని గెలిపించేందుకు తన తండ్రి ప్రయత్నించారని ఆయన కుమార్తె సునీతారెడ్డి పలుమార్లు చెప్పారు. 13. హత్యకు ఒకరోజు ముందు కూడా అవినాష్‌రెడ్డి కోసం వివేకా ప్రచారం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. 14. గతంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సమయంలో సునీతారెడ్డి.. అవినాష్‌రెడ్డి క్యార్టర్‌లోనే బసచేసారు. ఒకవేళ వివేకాను హత్య చేసింది అవినాష్‌రెడ్డి అయితే సునీతా ఆయన క్యార్టర్లో షెల్టర్ తీసుకునేవారా? అవినాష్‌రెడ్డితో తమ తండ్రికి శత్రుత్వం ఉందని వివేకా కుటుంబ సభ్యులు ఆరోపించలేదు. 15. దస్తగిరి స్టేట్మెంట్ రికార్డు చేయడానికి ఏడాది ముందుగానే 46 లక్షల రూపాయలు రికవరి చేశారు. అయినా దస్తగిరిని అరెస్టు చేయలేదు. 16. ఇక ఈ కేసులో దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా గుర్తించక ముందు నుంచే సీబీఐ తనను అరెస్టు చేయదనే ధీమా దస్తగిరికి వచ్చేసింది. 17. తన తొలి స్టేట్మెంట్లో ఎక్కడా అవినాష్‌రెడ్డి పేరు చెప్పని దస్తగిరి తరువాత కాలంలో అవినాష్‌రెడ్డికి కుట్రలో భాగం ఉందనే స్టేట్మెంట్ ఇచ్చారు. 18. హత్య జరిగిన రాత్రి ఏ-2గా ఉన్న యాదాటి సునీల్ యాదవ్ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు ఆధారాలున్నాయని సీబీఐ అంటోంది. సీబీఐ ప్రకారం హత్య జరిగిన రాత్రి 1.58నిమిషాలకు యాదాటి సునీల్ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారు. అయితే సిబీఐ సాంకేతిక నిపుణుడు ఇచ్చిన సమాచారం పూర్తి భిన్నంగా ఉంది. సీబీఐ సాంకేతిక నిపుణుడు తన వాంగ్మూలంలో యాదాటి సునీల్ 2.42నిమిషాలకు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని చెబుతున్నారు. ఈ రెండు వాదనలలో వైరుధ్యం కనిపిస్తోంది. పరస్పర తేడాలున్నట్టు తెలుస్తోంది. 19. CC టీవి వీడియో క్లిప్‌లో తెల్లవారు జామున 3.15నిమిషాలకు ఉమాశంకర్‌రెడ్డి రోడ్డుపై పారిపోతున్నట్లు కనిపించింది. ఒక వేళ CBI చెబుతున్నట్టు 1.30కు హత్య జరిగితే 3.15కు నిందితుడు ఎందుకు పారిపోతున్నట్టు కనిపిస్తాడు? వివేకా ఇంటికి కేవలం వంద మీటర్ల దూరంలో ఉన్నప్రాంతానికి చేరుకోడానికి 2 గంటలు పట్టదు కదా? హత్య జరిగాక యాదాటి సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ముగ్గురు ఒకేసారి అక్కడి నుంచి తన వాంగ్మూలంలో దస్తగిరి చెప్పాడు. 20. గత రెండున్నరేళ్లలో అవినాష్‌రెడ్డికి వివేకా హత్యతో సంబంధం ఉన్నట్లు CBI ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. సీబీఐ సమన్లు ఇచ్చిన 7సార్లు అవినాష్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. -
వివేకా హత్య కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వివేకా కేసులో సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విచారణను పక్కదారి పట్టించేలా, దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎల్లోమీడియా చర్చలు పెట్టిందని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ను ఎదుర్కోలేక ఇలాటి పనులు చేస్తున్నారని, వ్యవస్థను కించపరిచేలా ఒక మూకలా తయారై దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మీడియా పరిధులు దాటి వ్యహరిస్తోందని విమర్శించారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు జడ్జికి దురుద్దేశాలు ఆపాదిస్తూ.. అతనికి డబ్బు మూటలు అందాయంటూ ఆ వర్గం మూఠా వ్యాఖ్యలు చేసిందని అన్నారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఏబీఎన్, మహాటీవీ కథనాలు ప్రచురించిందని, స్వేచ్చగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసేలా చర్చలు చేపట్టిందని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి ఎల్లో మీడియా ప్రయత్నించిందని.. దర్యాప్తునకు సంబంధించిన అంశాలు వారికెలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘ఓ వర్గం మీడియా తమ సొంత అజెండాతో దుష్ప్రచారం చేస్తోంది. మీడియా ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు జరగాలి. టీవీ ఛానళ్ల డిబేట్లలో రెచ్చిపోయి వ్యాఖ్యానాలు చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజాయితీపరులపై అమానుషంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ జగన్‌దే తుది నిర్ణయం వైఎస్ జగన్ చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీ వైఎస్సార్సీపీ. ఆ తర్వాతే వివేకా పార్టీలో చేరతానంటే జగన్ ఆహ్వానించారు. పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలనే విషయంలో జగన్‌దే తుదినిర్ణయం. ఎవరికి టికెట్లు ఇస్తే పార్టీకి ఉపయోగపడుతుందనేది జగన్ ఇష్టం. వివేకా హత్య కేసు విషయంలో రాజకీయం కోణం ఎక్కడా లేదు. రాష్ట్రంలో ఎవరిని అడిగిన ఆ విషయం చెప్తారు. ఒక్క కోణంలోనే సీబీఐ దర్యాప్తు లేఖను దాచిపెట్టాలని వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. కేవలం ఒక్క కోణంలోనే సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. వివేకా హత్య వెనక ఆస్తికి సంబంధించి వివాదాలు ఉన్నాయి. ఆస్తి, కుటుంబ వ్యవహారాల్లో దర్యాప్తు జరపడం లేదు. కీలక అంశాలపై సీబీఐ విచారణ చేపట్టలేదు. టీడీపీకి అనుకూలంగా కోర్టు తీర్పులు వస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టా? ప్రతికూలంగా కోర్టు తీర్పులు వస్తే ప్రజాస్వామ్యం ఓడినట్టా? చివరకు న్యాయమే గెలుస్తుందని హైకోర్టు తీర్పుతో స్పష్టమైంది’ అని సజ్జల వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట లభించిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వివేకా కేసులో కస్టడీ విచారణ అవసరం లేదని కోర్టు తెలిపింది. -
చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్.. బిగ్ జోక్ అంటూ..
సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా ఫుల్ ఫైరయ్యారు. చంద్రబాబు రైతులను ఎలా మోసం చేశారో అందరికీ తెలుసు. యువతను చంద్రబాబు ఆదుకుంటాననడం పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని యువత మరిచిపోలేదని గుర్తు చేశారు. కాగా, మంత్రి రోజా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు?. చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలోనే ఎక్కడా లేడు. వాలంటీర్ వ్యవస్థతో లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారు. మా ప్రభుత్వం తీసుకువచ్చిన అమ్మఒడిపై ఇష్టానుసారం మాట్లాడి.. ఇప్పుడు అమ్మకు వందనం అంటున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పథకాలు ఎందుకు అమలు చేయలేదు?. రాష్ట్రంలో యువతను చంద్రబాబు ఆదుకుంటాననడం పెద్ద జోక్. బాబు వస్తే జాబ్ అంటూ గతంలో మోసం చేశావు. గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని యువత మరిచిపోలేదు. రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలకు సీఎం జగన్ అండగా నిలిచారు. రైతులను చంద్రబాబు ఎలా మోసం చేశారో అందరికీ తెలుసు. 3300 చికిత్సలకు ఆరోగ్యశ్రీ అందిస్తున్నది సీఎం జగన్ మాత్రమే. మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు చిత్తు కాగితంతో సమానం. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్ చేయగలిగినవే చెప్పారు.. చేసి చూపించారు. చంద్రబాబు అబద్దపు హామీలతో మోసం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టారు. వివేకా కేసులో సీబీఐ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేవని జడ్జీ చెప్పారు. ఎల్లో మీడియాలో ఇష్టానుసారం చర్చలు పెట్టి తప్పుడు ప్రచారం చేశారు. హైకోర్టు జడ్డీ చేసిన వ్యాఖ్యలు అందరూ గమనించాలి. తప్పుడు సమాచారంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదని జడ్జి చెప్పారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇది కూడా చదవండి: వివేకా కేసు: ‘ఏబీఎన్, మహా టీవీ వీడియోలను కోర్డుకు ఇవ్వండి’ -
ఇది వ్యక్తిగత దాడి మాత్రమే కాదు.. అవినాష్ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఊరట లభించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఆర్డర్లో హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముడుపులు అందాయంటూ ఓ వర్గం టీవీ ఛానెల్స్‌లో జరిగిన డిబేట్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏబీఎన్(తెలుగు), మహా టీవీ ఛానళ్లలో ఈనెల 26వ తేదీ జరిగిన చర్చల వీడియోలను ఇవ్వాలని రిజిస్ట్రార్‌కు న్యాయమూర్తి ఆ ఆర్డర్‌కాపీ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియోలను డౌన్లోడ్ చేసి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సీజేకి అందించాలన్నారు. టీవీ చర్చల్లో చేసిన కామెంట్స్ చూసి ఆయన తీవ్రంగా కలత చెందినట్టు ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు. కాగా, ఆయా టీవీ చర్చల్లో పాల్గొన్న సస్పెండైన మెజిస్ట్రేట్ ఒకరు.. హైకోర్టు న్యాయమూర్తికి డబ్బు సంచులు వెళ్లాయని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ‘‘నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా మీడియాలో కొందరు వ్యక్తులతో చర్చలు పెట్టారు. ఇది కేవలం నాపై జరిగిన వ్యక్తిగత దాడి మాత్రమే కాదు.. మొత్తం న్యాయవ్యవస్థను దెబ్బతీసే కుట్ర. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసే ప్రయత్నం జరిగింది. ఒకస్థాయిలో విచారణ నుంచి తప్పుకోవాలని అనకున్నాను. సుప్రీం కోర్టు ఆదేశాలు, ఎలాంటి భయం లేకుండా న్యాయాన్ని కాపాడుతానని చేసిన ప్రతిజ్ఞ గుర్తుచేసుకుని విచారణ కొనసాగించా. సస్పెండై, అరెస్టయిన ఒక మెజిస్ట్రేట్ ఏకంగా.. న్యాయమూర్తికి డబ్బు సంచులు అందాయని వ్యాఖ్యానించారు. గౌరవమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి చెయ్యండ్రా అంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్, మహాటీవీ చర్చల్లో చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయి. ఈ ధిక్కరణపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అనేది తెలంగాణ హైకోర్టు నిర్ణయిస్తుంది’’ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఆర్డర్ కాపీలో.. తొలి రెండు పేజీల్లో జస్టిస్ లక్ష్మణ్ పేర్కొన్న వ్యాఖ్యల సారాంశం. ‘‘మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్చకు మేం అడ్డంకి కాదు. కానీ, కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయ’’ని న్యాయమూర్తి ఆ ఆర్డర్ కాపీలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు -
YS Avinash Reddy: అందుకే అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చింది
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో విచారణ జరుపుతున్న దర్యాప్తు సంస్థ సీబీఐ.. ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసిందని, ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని, కోర్టు ఆ వాదనతో ఏకీభవించి ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు ‘సాక్షి’కి తెలిపారు. అంతేకాదు వివేకా కేసులో అవినాష్‌కు సంబంధం ఉన్నట్లు ఒక్క ఆధారం లేదని.. అందుకే కోర్టు ఆ తీర్పు ఇచ్చిందని అంటున్నారు. వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ క్రమంలో తీర్పు అనంతరం బయటకు వచ్చిన ఆయన తరపున న్యాయవాదులు సాక్షితో మాట్లాడారు. అవినాష్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని ఆయన తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి సాక్షికి వివరించారు. ‘‘సీబీఐ అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేసిందని కోర్టుకు తెలిపాం. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లో అవినాష్ పేరు లేదని బెంచ్ దృష్టికి తీసుకెళ్లాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో వివేకా హత్య జరిగింది. ఆ సమయంలో సిట్ ఏర్పాటు చేసి.. వందల మందిని విచారించారు. కానీ, ఏ ఒక్కరు కూడా అవినాష్ రెడ్డి పేరు చెప్పలేదు. కావాలనే అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. ఆ వాదనతో కోర్టు ఏకీభవించి.. కస్టడీ విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. అదే సమయంలో విచారణకు సహకరించాలంటూ అవినాష్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. ప్రతీ శనివారం అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వెళ్లాలి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో సీబీఐ కార్యాలయానికి హాజరు కావాలని ఆ ఆదేశాల్లో పేర్కొందని వివరించారు. అవినాష్ రెడ్డికి ఈకేసుతో సంబంధం ఉందని ఒక్క ఆధారం లేదు. అందుకే ముందస్తు బెయిల్ ఇచ్చారు అని ఆయన తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి సాక్షికి తెలిపారు. సిబిఐ చెప్పిన రాజకీయ కారణాలు కూడా సహేతుకంగా లేవని కోర్టుకు విన్నవించాం. కేవలం కక్ష సాధింపులో భాగంగా, ప్రత్యర్థులపై బురద జల్లేలా సిబిఐ చేసిన ఆరోపణలున్నాయని, పైగా అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఎల్లో మీడియాలో చేసిన ఆరోపణలనే సిబిఐ తన వాదనలుగా చేర్చిందని కోర్టుకు తెలిపామని న్యాయవాదులు వివరించారు. కేవలం హియర్ సే ఆధారంగా ఒకరిపై బురద జల్లడం సరికాదని, నిందారోపణలు చేసినంత మాత్రానా న్యాయం అందకుండా పోదన్న విషయం రుజువయిందన్నారు. ఇదీ చదవండి: ముందస్తు బెయిల్‌కు హైకోర్టు విధించిన షరతులు ఇవే.. -
ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి.. తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఉన్నత న్యాయస్థానం. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ఇవాళ తుది తీర్పు వెలువరించిన హైకోర్టు వెకేషన్ బెంచ్.. బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అవినాష్‌రెడ్డి లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్.. షరతులతో కూడిన బెయిల్ అవినాష్‌రెడ్డికి మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో వివేకా కేసులో అవినాష్ రెడ్డి కస్టడీ విచారణ అవసరం లేదని బెంచ్ సీబీఐ తరపు న్యాయవాదులతో స్పష్టం చేసింది. హైకోర్టు ఆర్డర్కాపీలో ఏముందంటే.. 30 పేజీల హైకోర్టు ఆదేశాల్లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. సీబీఐ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. సాక్ష్యాలను తారుమారు చేశారనడానికి కూడా ఎవిడెన్స్ లేవు. చెప్పుడు మాటల ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేసింది. ఊహాజనితమైన విచారణ మాత్రమే సాగింది. ఈ తరుణంలో.. కస్టోడియల్ విచారణ అవసరం లేదని భావిస్తున్నాం. అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నాం. హైకోర్టు షరతులివే ► అవినాష్‌రెడ్డిని గనుక అరెస్టు చేసినట్లయితే.. రూ. 5 లక్షల పూచీకత్తుతో బెయిల్ పై విడుదల చేయాలి ► సీబీఐ అనుమతి లేకుండా అవినాష్ రెడ్డి దేశం విడిచి వెళ్లరాదు. ► సాక్షులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేయకూడదు. ► సీబీఐ దర్యాప్తునకు అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరించాలి. ► ప్రతి శనివారం ఉ.10 నుంచి సా.5 వరకు అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాలి ► అవసరమని CBI భావించినప్పుడు విచారణకు అవినాష్ రెడ్డిని పిలవచ్చు పైషరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చు. ఆ ఛానెల్స్ డిబేట్‌పై అభ్యంతరం ఇక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహా టీవీ ఛానెల్స్‌లో తాజాగా వివేకా కేసు పరిణామాలపై జరిగిన డిబేట్లో న్యాయమూర్తికి డబ్బుల సంచులు వెళ్లాయంటూ ఓ సస్పెండెడ్ మెజిస్ట్రేట్ చేసిన వ్యాఖ్యలపైనా.. హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఆ చర్చకు సంబంధించిన వీడియోలను కోర్టును సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ‘‘నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచారం చేశాయి. మీడియా ఛానల్ డిబేట్ లో కొంత మంది వ్యక్తుల ద్వారా నాపై ఆరోపణలు చేయించారు’’ అంటూ ఆర్డర్ కాపీలో వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. ‘‘‘మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్చకు మేం అడ్డంకి కాదు. కానీ, కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయి. మీడియా కథనాలు చూసి ఒక స్థాయిలో నేను ఈ కేసు విచారణ నుండి తప్పుకోవాలనుకున్నాను. సస్పెండ్ అయ్యి ఒక జడ్జ్ నాకు డబ్బు సంచులు వచ్చాయని అసత్య ప్రచారం చేయడం బాధాకరం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి విచారణ జరిపి తీర్పు వెల్లడించాను. ఆయా డిబేట్ల వీడియోలను కోర్టుకు సమర్పించండి. చీఫ్ జస్టిస్ ఆ వీడియోలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారు అని హైకోర్టు జడ్జి పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి అనేక మలుపులు.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏప్రిల్ 17వ తేదీన అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటి నుంచి ఆ పిటిషన్‌పై విచారణ అనేక మలుపులు తిరిగింది. చివరికి.. సుప్రీం కోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆయన ఊరట లభించింది. అవినాష్‌రెడ్డికి బెయిల్ పిటిషన్ వేసే హక్కు ఉందని, పిటిషన్‌పై వాదనలు వినాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా వాదనలు వింది తెలంగాణ హైకోర్టు వేకేషన్ బెంచ్. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా.. సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి ఇప్పటికే ఏడుసార్లు హాజరయ్యారు. అయితే తల్లి అనారోగ్యం కారణంగా ఈ నెల 22వ తేదీన విచారణకు మాత్రం హాజరు కాలేదు. సీబీఐ విచారణలో ఇప్పటిదాకా తాను సహకరిస్తూ వస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. తల్లి బాగోగులు చూసుకోవడానికి గడువు కోరుతూ సీబీఐకి విజ్ఞప్తి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి పలు ప్రశ్నలను సంధించింది. ఇదీ చదవండి: అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేయడం సరికాదు! -
ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారమే సీబీఐ నడుస్తోంది: సజ్జల
సాక్షి, విజయవాడ: ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారం సీబీఐ వ్యవహరిస్తున్నట్లు ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ కౌంటర్‌పై స్పందించారు. సీబీఐ సెన్సేషన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఉందని, ఆధారాలు లేకుండా ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీబీఐ ఏం చేయాలనుకుంటుందో ఎల్లో మీడియాకు ముందే తెలుస్తుందని.. సీబీఐ విచారణ ఏ విధంగా చేస్తోందో అర్థం కావట్లేదన్నారు. సీబీఐ వెనుక ఎవరున్నారన్నదానిపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ప్రజల్లో అయోమయం సృష్టించేలా సీబీఐ తీరు ఉంది. ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారం సీబీఐ నడుస్తోంది. ఆ స్క్రిప్ట్‌కే విచారణ అని తగిలిస్తున్నారు. కాకమ్మ కథలన్నీ ఎల్లో మీడియాలోనే తయారవుతున్నాయి. దీని వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది. సరైన దిశలో సీబీఐ విచారణ జరగడం లేదు’’ అని సజ్జల అన్నారు. చదవండి: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై TS హైకోర్టులో విచారణ -
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత
సాక్షి కర్నూలు/ హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, వైఎస్ శ్రీలక్ష్మికి కర్నూలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే, మెరుగైన వైద్య సేవల కోసం శ్రీలక్ష్మిని హైదరాబాద్‌లోని ఏఐజీ తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స అందుతోంది. ఇక, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. మరోవైపు.. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి శుక్రవారం బీపీ పెరగడంతో జైలు అధికారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఉస్మానియా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం భాస్కర్ రెడ్డిని రేపు నిమ్స్‌కు తరలించనున్నారు జైలు అధికారులు. ఇది కూడా చదవండి: మంచి చేసే ఉద్దేశం వాళ్లకు లేదు.. నారా చంద్రబాబును నమ్మొద్దు: సీఎం జగన్ -
హైదరాబాద్ ఆస్పత్రికి అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ
సాక్షి, కర్నూలు: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ తాజా హెల్త్ బులిటెన్‌ను కర్నూలు విశ్వభారతి వైద్యులు విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆమెను శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. లక్ష్మమ్మ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈరోజు లక్ష్మమ్మను డిశ్చార్జ్ చేశాం. గుండె సంబంధిత చికిత్స కోసం వేరే ఆస్పత్రికి రిఫర్ చేస్తాం అని వైద్యులు ప్రకటించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించనున్నారు. లోబీపీ, గుండెపోటుకు గురై ఈ నెల 19వ తేదీన ఆమె కర్నూలు విశ్వభారతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. -
అవినాష్ ను టార్గెట్ చేయడం సరికాదు: వైఎస్ విమలమ్మ
-
అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. అవినాష్ తరపున సీనియర్ కౌన్సిల్ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. విచారణను రేపటికి కోర్టు వాయిదా వేసింది. రేపు ఉదయం 10:30 నిమిషాలకు హైకోర్టు విచారణ చేపట్టనుంది. వాదనలను రేపు విననుంది. వైఎస్ అవినాష్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక, అంతకుముందు ముందస్తు బెయిల్‌పై ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అవినాష్ పిటిషన్‌పై విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది కూడా చదవండి: అవినాష్ ముందస్తు బెయిలుపై నిర్ణయానికి ఇన్ని రోజులా! -
ఓవరాక్షన్ సరే!.. అప్పుడేమైంది గురివింద బాబు?
‘ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. అది బయటి వారికి చాలా అసహ్యంగానూ అనిపిస్తోంది. రాజకీయాలు మరీ ఇంతలా దిగజారిపోవాలా? అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. అవినాష్ రెడ్డిని సిబిఐ ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటి? సిబిఐ ఇంత బలహీనంగా ఉందా? అంటూ ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. టిడిపి అనుకూల మీడియాల్లో డిబేట్స్ చూస్తోంటే సీబీఐ అరెస్ట్ చేయకపోతే మీడియా ప్రతినిథులే వెళ్లి అవినాష్ ను అరెస్ట్ చేసేలా కనిపిస్తున్నారు. ఇటువంటి ట్రెండ్ గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.‘ ఏపీలో 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వయానా చిన్నాన్న అయిన వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఈ హత్య జరిగే నాటికి ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. కొంతకాలంగా ఈ హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. హత్యకేసులో ప్రధాన నిందితులను విచారించిన సీబీఐ.. ఆ తర్వాత మరి కొందరిని పిలిచి విచారిస్తోంది. ఈ క్రమంలో భాగంగా వివేకా మరో సోదరుడు వైఎస్ భాస్కర రెడ్డి తో పాటు ఆయన తనయుడు.. కడప ఎంపీ అయిన అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. భాస్కర రెడ్డిని రిమాండ్ లో తీసుకున్న సీబీఐ.. అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలు దఫాలు విచారించింది. తాజాగా మరోసారి విచారణకు పిలిచింది. అయితే.. అవినాష్ రెడ్డి తల్లికు గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించేందుకు వెళ్లాల్సి రావడం.. తాను విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సిబిఐ కి లేఖ రాశారు. అదే సమయంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తన బెయిల్ పిటిషన్ ను విచారించాల్సిందిగా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరారు. అవినాష్ రెడ్డి తల్లికి కర్నూలు లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు కూడా బులెటిన్ విడుదల చేశారు. ఐసీయూ లో కొద్ది రోజులు చికిత్స అందించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు. తన తండ్రి భాస్కర రెడ్డి అరెస్ట్ అయి ఉన్నందున తన తల్లిని తానే చూసుకోవాలి కాబట్టి ఈ నెల 27 వరకు తనకు గడువు నివ్వాలని.. ఆ తర్వాత తాను విచారణకు హాజరవుతానని అవినాష్ రెడ్డి సిబిఐకి రాసిన లేఖలో కోరారు. అంతే.. ఈ వార్తలు మీడియాలో ప్రసారం అవుతుండగానే అటు టీడీపీ నేతలు, ఇటు టీడీపీ అనుకూల ఛానెళ్లూ కూడా.. ‘‘అదేంటీ?.. అవినాష్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటి?.. ఏం! సీబీఐ మరీ అంత బలహీనంగా ఉందా?’’ అంటూ డిబేట్స్ నడపడం మొదలు పెట్టారు. అటు టిడిపి నేతలు అవినాష్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలంటే డిమాండ్లు చేయడం మొదలు పెట్టారు. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోగా.. వ్యతిరేకంగా పావులు కదుపుతోందంటూ కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. దీనిపై న్యాయ రంగ నిపుణులు మండి పడుతున్నారు. 👉 ‘అసలు ఎవరిని అరెస్టు చేయాలి?..’ అది చెప్పడానికి మీడియా ఎవరు? సీబీఐ ఎవరిని అరెస్ట్ చేయాలో ఎప్పుడు అరెస్ట్ చేయాలో అసలు చేయాలో చేయకూడదో మీడియా చెప్పడం ఏంటి? దర్యాప్తు సంస్థకు దమ్ము ఉందా లేదా అన్నది కూడా మీడియానే తేల్చేయడం ఏంటి? తమ రాజకీయ ప్రత్యర్ధులు అయితే వెంటనే అరెస్ట్ చేసేయాలి అదే తమపై కేసులు వచ్చి తమని అరెస్ట్ చేస్తే రాజకీయంగా కక్షసాధిస్తారా? అంటూ దబాయింపు సెక్షన్ విరుచుకు పడిపోతారు . ఇదేం పద్ధతి? అంటున్నారు న్యాయ రంగ నిపుణులు. 👉 వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు కారు. ఆయనపై ఉన్న అభియోగం అల్లా హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలు తారు మారు చేయించారని. అది కూడా ఆయన చేశారని కాదు. అసలు వివేకానంద రెడ్డిని హత్య చేసిన ప్రధాన నిందితుడు దస్తగిరి బెయిల్ పై హాయిగా బయట తిరుగుతున్నాడు. అనుమానాలు మాత్రమే ఉన్న అవినాష్ రెడ్డిని మాత్రం.. తక్షణమే అరెస్ట్ చేసేయాలంటూ టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ ఓ పత్రిక రాసి పారేసింది. నిజానికి సీబీఐ ఇంత వరకు దీనిపై ఎలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. ప్రభుత్వంపై కానీ అవినాష్ రెడ్డిపై కానీ ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. అవినాష్ రెడ్డి అడిగింది కూడా నాలుగు రోజుల పాటు విచారణకు గడువు ఇమ్మనమనే. అది కూడా తల్లి ఆరోగ్యం బాగా లేదు కాబట్టి. అయితే టీడీపీ నేతలు.. వారి అనుకూల ఛానెళ్లు సీబీఐకి ఏదో అపచారం జరిగిపోతోన్నట్లు.. ధర్మాన్ని ఎవరో అడ్డుకుంటోన్నట్లు గగ్గోలు పెట్టేస్తున్నారు. 👉 కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి సహకరించకపోవడం క్షమించరాని నేరం అంటున్న ఆ పత్రిక.. గతంలో చంద్రబాబు నాయుడు, ఇదే సీబీఐ ఏపీలో అడుగు పెట్టనివ్వకుండా ఏకంగా జీవో జారీ చేస్తే అపుడు సిబిఐ దుర్మార్గమైన దర్యాప్తు సంస్థ అన్నట్లు.. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తోందన్నట్లు కథనాలు వండి వార్చింది. అపుడు టిడిపి నేతలు కూడా సీబీఐని పనికిమాలిన సంస్థగా ఏకి పారేశారు. ఇపుడు తాము ప్రతిపక్షంలోకి వచ్చే సరికి తమ ప్రత్యర్ధులపై ఓ కేసు వచ్చింది కాబట్టి టిడిపి నేతలు ఇపుడు సిబిఐని కీర్తిస్తున్నారని న్యాయ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని అవినాష్ అంటోంటే ‘అదంతా నాటకం.. డ్రామా..’ అంటూ టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ‘‘2019లో టిడిపి ప్రతిపక్షంలోకి జారుకున్నాక వారి హయాంలో చేసిన అవినీతికి సంబంధించిన కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసే సందర్భాల్లో టిడిపి నేతలు కూడా ఆసుపత్రుల్లో చేరారు. అచ్చెంనాయుడు అయితే తనకి పైల్స్ ఆపరేషన్ అయ్యిందని నెలల తరబడి ఆసుపత్రి బెడ్ దిగలేదు. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోనని చెప్పి టిడిపి అనుకూల వర్గీయులది అయిన రమేష్ హాస్పిటల్ లో ఆయన కాలక్షేపం చేసి విచారణ నుండి తప్పించుకున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచి.. టిడిపి తరపున వ్యవహారాలు నడుపుతోన్న రఘురామ కృష్ణం రాజు కులాల మధ్య చిచ్చు రేపేలా వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే తనని కొట్టేశారంటూ ఆరోపణలు చేసి బెయిల్ తెచ్చుకుని తనకు అనుకూలంగా ఉండే ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందారే తప్ప ఏపీలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందలేదు. మార్గదర్శి చిట్స్ లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సిఐడీ అధికారులు సోదాలకు వెళ్లినపుడు ఆ సంస్థ అధినేత రామోజీ రావు అమాంతం మంచం పై పడుక్కుని ఆరోగ్యం బాగా లేదని చెప్పుకున్నారు. విచారణకు కూడా సిద్ధంగా లేనని చెప్పించారు. అయితే అలాగని లిఖిత పూర్వకంగా రాసి ఇస్తారా అని డాక్టర్లను సిఐడీ అధికారులు అడగడంతో వాళ్లు నీళ్లు నమిలి విచారణకు హాజరు కావచ్చునని ఒప్పుకున్నారు. టిడిపి నేత సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసంలో ఓ సినీ నిర్మాతపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనలో బాలయ్యను అరెస్ట్ చేయాల్సి వచ్చినపుడు అమాంతం బాలయ్యకు మానసిక పరిస్థితి బాగా లేదని మతి చలించిందని వైద్యుల చేత సర్టిఫికెట్ పుట్టించుకుని అరెస్ట్ నుండి తప్పించుకున్నారు.’’ ఇపుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు వీటినే గుర్తు చేస్తున్నారు. అప్పట్లో.. ఆస్పత్రిలో అచ్చెన్న 👉 టిడిపి నేతలను అరెస్ట్ చేసే సందర్భాల్లో వాళ్లకి మాయరోగాలు వస్తాయి.. వాళ్లు తమకు అనుకూలమైన ఆసుపత్రులనే ఆశ్రయిస్తారు.. చివరకు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు.. అదే అవినాష్ రెడ్డి తల్లి పరిస్థితి బాగా లేక విచారణకు సమయం కావాలని అడిగితే ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయరు? అంటూ టిడిపి నేతలు, టిడిపి అనుకూల పత్రికలు ప్రశ్నించడంలో అర్ధం లేదని పాలక పక్ష నేతలు అంటున్నారు. చంద్రబాబు నాయుడిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుల్లో విచారణలు జరక్కుండా చంద్రబాబు స్టేలు తెచ్చుకుని కాలక్షేపం చేస్తున్నారు. అటువంటి చంద్రబాబు నాయుడి పార్టీ నేతలు గురివింద గింజలాగా నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు. 👉 ప్రస్తుతానికి అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా తెలంగాణా హై కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. హై కోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించాల్సిందిగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులను సూచించింది. ఈఘటనలో టిడిపి నేతలతో సమానంగా మీడియా ప్రతినిథులు కూడా తామే న్యాయమూర్తులు అయినట్లు, దర్యాప్తు సంస్థల అధికారులు అయినట్లు విచారించేసి తీర్పులు ఇచ్చేస్తున్నారనే చర్చ కూడా ఒకటి నడుస్తోంది. ఈ పద్ధతి మారాలని అంటున్నారు కొందరు. అసలు సీబీఐని ఏపీలోకి అనుమతించాలా? అడ్డుకోవాలా? అన్న అంశంపై టిడిపి నేతలు తమ వైఖరి ఏంటో ఇప్పటికైనా స్పష్టం చేయాలంటున్నారు పాలక పక్ష నేతలు. అధికారంలో ఉంటే ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే అందుకు పూర్తి భిన్నంగా యూటర్నులు తీసుకోవడం చంద్రబాబు నాయుడికి మొదట్నుంచీ అలవాటే అంటున్నారు రాజకీయ పండితులు. ::: CNS యాజులు, సాక్షి టీవీ ఇదీ చదవండి: ఆ టీడీపీ ఎమ్మెల్యే వస్తే ఊరంతా హడల్! -
వివేకా హత్య కేసు: వైఎస్ విమలారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, కర్నూల్: వైఎస్ వివేకా హత్య కేసు విషయమై వైఎస్సార్ సోదరి వైఎస్ విమలారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకాను చంపిన వారు బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారని అన్నారు. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, వైఎస్ విమలమ్మ బుధవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం, విమలమ్మ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలక్ష్మి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఇంకా లిక్విడ్స్‌పైనే ఉన్నారని అన్నారు. ఈ క్రమంలోనే వివేకాను హత్య చేసిన వాళ్లు బయట తిరుగుతుంటే తప్పు చేయని అవినాష్ కుటుంబం ఎంతో బాధపడుతోంది. ఏ తప్పు చేయని అవినాష్‌ను టార్గెట్ చేయడం సరికాదు. తప్పు చేయలేదంటున్న వాళ్లు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. వివేకా హత్యలో మా ఫ్యామిలీ వాళ్లు లేరని మొదట చెప్పిన వైఎస్ సునీత ఇప్పుడు ఎందుకు మాట మార్చిందో తెలియదు. సునీత వెనుక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి. అసత్య ఆరోపణల వల్ల అవినాష్ తల్లి తల్లడిల్లిపోతోంది. అవినాష్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అవినాష్‌ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. న్యాయం జరుగుతుందున్న నమ్మకంతో అవినాష్ ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అనారోగ్యంపై విష కథనాలా? -
అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణపై ఎల్లో మీడియాకు అత్యుత్సాహమెందుకు?
సాక్షి, అమరావతి: అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణపై ఎల్లో మీడియాకు అత్యుత్సాహమెందుకు అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు ప్రభుత్వం జీవో 176 తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని చంద్రబాబు జీవో తెచ్చారని గుర్తు చేశారు. ‘‘ఇవాళ అవినాష్ రెడ్డి గురించి ఎల్లో మీడియా ఇష్టానుసారం రాస్తోంది. మనోడు ఉంటే ఒకలా .. లేకుంటే మరోలా రాయడం ఎల్లో మీడియా పని. గుండెజబ్బు వచ్చిన తల్లి కోసం ఎంపీ అవినాష్ రెడ్డి వెసులుబాటు అడిగారు. తల్లికి అనారోగ్యంగా ఉంటే అవినాష్ వెళ్లకూడదా?. పిలిచిన ప్రతిసారీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. అవినాష్ రెడ్డి ఎక్కడికైనా పారిపోయాడా?. మీరు మోదీతో తగాదా పెట్టుకుంటే రాష్ట్రంలోకి సీబీఐ రాకూడదు. చంద్రబాబు ఎందుకు బెయిల్ తెచ్చుకున్నారు?. చంద్రబాబు ఎన్నిసార్లైనా బెయిల్ తెచుకోవచ్చా?. ఏ రోజైనా సీబీఐ విచారణకు వెళ్లారా ?. చాలా దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని పేర్ని నాని మండిపడ్డారు. చదవండి: యెల్లో మీడియాకే స్వేచ్ఛ ఉంటుందా..విలువలు లేకుండా ఇంతలా దిగజారాలా? తల్లికి సీరియస్‌గా ఉంటే ఇష్టమొచ్చిన ప్రచారం చేస్తున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే కూడా తప్పేనా?. చంద్రబాబు అన్నం తిని బతికేకన్నా బెయిల్ మీద బతుకుతుంటారు. మీకు కనీసం మానవత్వం కూడా లేదు. జగన్‌ను చూస్తే వీళ్లకు కడుపు మంట. మచిలీపట్నం సభపై తప్పుడు వార్తలు రాశారు. సీఎం జగన్ ప్రసంగం వినకుండా వెళ్లిపోయారంటూ తప్పుడు రాతలు రాశారు. సీఎం జగన్ ప్రసంగం అందరూ శ్రద్దగా విన్నారు. చంద్రబాబు సభలకు జనం రావడం లేదన్న వార్తలు వేశారా ?. ఖాళీ కుర్చీలకు స్పీచ్ ఇచ్చిన ఘనుడు చంద్రబాబు. జనం లేకుంటే జనం అద్భుతంగా వచ్చారంటూ రాస్తారు. సీఎం జగన్ సభకు జనం వస్తే మాత్రం తప్పుడు రాతలు రాస్తారు. చంద్రబాబు కోసం ఎంతకైనా బరితెగించేందుకు ఎల్లో మీడియా రెడీ’’ అని పేర్ని నాని దుయ్యబట్టారు. ‘‘ఏం చెప్పినా, ఏం రాసినా జనం నమ్మేస్తారని రామోజీ అనుకుంటున్నారు. చంద్రబాబుకు మేలు జరిగేందుకు జగన్ మీద విషం చిమ్ముతున్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. కేంద్రం ఇచ్చిన నిధులపై ఇష్టమొచ్చిన కథనాలు రాస్తున్నారు’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. -
అనవసర కథనాలు రాస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు: సజ్జల
-
2019 కంటే మరింత రీసౌండ్ విక్టరీ ఖాయం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన చూసి ప్రతిపక్షాలు కడుపుమంటతో రగిలిపోతున్నాయి. ఎల్లో మీడియాతో దుష్ర్పచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. కాగా, సజ్జల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఈరోజు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చి నేటికి నాలుగేళ్లు అయింది. ఇచ్చిన హామీలను 98.5% అమలు చేసి చూపించాం. అసలైన రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు సీఎం జగన్ చేసి చూపించారు. అవినీతికి వ్యతిరేకంగా, పారదర్శకంగా అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నాం. బందరు పోర్టు శంకుస్థాపన మరో మైలురాయి. వచ్చే ఏడాది రామాయపట్నం పోర్టు ప్రారంభం అవుతుంది. నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో ప్రజలంతా గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏపీ పాలనను మెచ్చుకుంటున్నాయి. దేశానికే ఆదర్శంగా సీఎం వైయస్ జగన్ నాలుగేళ్ల పరిపాలన. #YSRCPAgain2024 pic.twitter.com/lLGhG6mwDg — YSR Congress Party (@YSRCParty) May 23, 2023 16 మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పాలనా వికేంద్రీకరణ జరిగింది. 2019 కంటే మరింత రీసౌండ్ విక్టరీ ఈసారి వస్తుంది. కేంద్రం నిధులు ఇస్తే కూడా ఎల్లో మీడియా కడుపుమంటతో అల్లాడుతోంది. మనకు రావాల్సిన నిధులు మనం సాధించగలిగాం. ఆనాడు చంద్రబాబు చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు. బీజేపీతో పార్టనర్‌గా ఉండి కూడా చంద్రబాబు ఏమీ చేయలేదు. తన వ్యక్తిగత పనులకు వాడుకున్నారే తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయలేదు. ఎప్పుడు చెడు జరుగుతుందా అని చంద్రబాబు అండ్ కో ఎదురు చూస్తూ ఉంటారు. నాలుగేళ్ళ క్రితం ఇదే రోజున @YSRCParty ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజు నుంచే @ysjagan గారు అమలు చేస్తూ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఎలా ఉంటాయో చాటిచెప్పారు. #YSRCPAgain2024 pic.twitter.com/YruDsuVz34 — YSR Congress Party (@YSRCParty) May 23, 2023 అవినాష్ వ్యవహారంలోనూ తప్పుడు రాతలు.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహారంలోనూ ఎల్లో మీడియా రోతరాతలు రాస్తున్నారు. అవినాష్ రెడ్డి వ్యవహారం కోర్టులో ఉంది. అనవసర కథనాలు రాస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. తన తల్లి అనారోగ్యంతో ఉండటంతో అవినాష్ విచారణకు హాజరుకాలేదు. ఆ విషయాన్ని సీబీఐకి కూడా తెలిపారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి ఆరుసార్లు విచారణకు హాజరయ్యారు. కేంద్ర బలగాలు వస్తున్నాయని అసత్య కథనాలు రాశారు. మళ్ళీ రాకుండా అడ్డుకున్నారంటూ వారే రాస్తారు. రామోజీరావు కేసులో ఏ కోర్టుకైనా వెళ్లొచ్చా? అవినాష్ వెళ్తే ఎలా తప్పు అవుతుంది?. హైదరాబాదు వెళ్తే ఎందుకు వెళ్లారని అడుగుతారు?. బెంగుళూరు వెళ్తే ఎందుకు వెళ్ళారని అడుగుతారు?. వారిష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారు. పబ్లిక్ ఇష్యూస్‌ను పక్కదారి పట్టించేలా ఆ మీడియా వ్యవహరిస్తోంది. అవినాష్ మీద కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తే అలాగే జరుగుతుంది. కానీ ఎల్లోమీడియా అనుకున్నట్లు జరగలేదని కడుపుమంటతో బాధ పడుతున్నారు అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే గిరిధర్‌ను పరామర్శించిన సీఎం జగన్ -
అవినాశ్ ముందస్తు బెయిలుపై నిర్ణయానికి ఇన్ని రోజులా!
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిలుపై నిర్ణయం తీసుకోవడానికి ఇన్ని రోజులా అని తెలంగాణ హైకోర్టుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తంచేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఉత్తర్వులు జారీ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసింది. అవినాశ్ పిటిషన్‌పై ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపి తగిన ఆదేశాలివ్వాలని ఆదేశించింది. గతంలో మరో బెంచ్ విచారించినప్పటికీ వెకేషన్ బెంచ్ విచారణకు అడ్డంకి కాదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు (జూన్ 5) వచ్చే వరకు సీబీఐ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని లేదా తన పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ విచారించేలా ఆదేశాలివ్వాలంటూ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన అప్లికేషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత హైకోర్టు విచారించలేదా అని జస్టిస్ నరసింహ ప్రశ్నించారు. హైకోర్టు రెండుసార్లు విచారించిందని, ఉత్తర్వులు ఇవ్వలేదని, జూన్ 5కు వాయిదా వేసిందని, మే 15న సీబీఐ నుంచి నోటీసులు వచ్చాయని అవినాశ్ తరపున సీనియర్ న్యాయవాది వి.గిరి తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించగా.. సీబీఐ నోటీసులు ఇచ్చిందన్నారు. ‘హైకోర్టులో విచారణ ఉండగా సీబీఐ నోటీసులు ఇవ్వడం గమనార్హం’ అని అభిప్రాయపడిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు హాజరు కాలేదు కదా అని అనగా.. ఏడుసార్లు పిటిషనర్ హాజరయ్యారని గిరి తెలిపారు. ఒక్క రోజు వ్యవధిలో రావాలని నోటీసులు ఇవ్వడంతో మూడు రోజులు సమయం కోరామన్నారు. సీబీఐ తరపున ఎవరైనా హాజరయ్యారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఎవరూ హాజరు కాలేదని వైఎస్ వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది లూత్రా తెలిపారు. హైకోర్టులో ఏప్రిల్ 27న ఇద్దరి పిటిషన్లూ విచారణకు వచ్చాయని, సీజే వద్దకు వెళ్లినా ఎలాంటి ఆర్డర్ రాలేదని, జూన్ 5న మేటర్ జాబితా అయిందని లూత్రా వివరించారు. జస్టిస్ నరసింహ జోక్యం చేసుకొని.. ఏమైనా అరెస్టు భయం ఉందా అని ప్రశ్నించారు. తాను మొదటి నుంచి అదే చెబుతున్నానని, ఇప్పటికే అవినాశ్ తండ్రి అరెస్టయ్యారని, తల్లి ఆసుపత్రిలో ఉన్నారని గిరి చెప్పారు. ఈ సమయంలో లూత్రా జోక్యం చేసుకోవడంతో గిరి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. గిరిని ధర్మాసనం మందలించడంతో ఆయన ధర్మాసనానికి క్షమాపణలు తెలిపారు. బెయిలు కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని ధర్మాసనం లూత్రానుద్దేశించి వ్యాఖ్యానించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ గురించి ఆరా తీసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు వెకేషన్ బెంచ్ వినాలని సూచిస్తామని తెలిపింది. హైకోర్టుకు వెళ్లాలని ఇరువర్గాలకు తెలిపింది. అవినాశ్ వద్దకు వెళ్లాలని సీబీఐ ప్రయత్నించగా వందలాది మంది అనుచరులు అడ్డుకున్నారని లూత్రా అనగా.. అవన్నీ సీబీఐ న్యాయవాది చెబుతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం జస్టిస్ నరసింహ ఉత్తర్వులు వెలువరించారు. Justice Narasimha: He has the right to... Mr. Luthra you can take all these objections when the anticipatory bail is taken up by vacation bench. — Live Law (@LiveLawIndia) May 23, 2023 Bench: ...We are inclined to accept the prayer as the anticipatory bail taken up for hearing pursuant to our order was heard, but no order was passed...We direct the Criminal LP...will be placed before next vacation bench on 25.05.2023... — Live Law (@LiveLawIndia) May 23, 2023 ఇది కూడా చదవండి: టీడీపీ మీడియాకే స్వేచ్ఛ ఉంటుందా.. విలువలు లేకుండా ఇంతలా దిగజారాలా? -
ఎల్లో మీడియా ఓవరాక్షన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారంటూ సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎల్లో మీడియా ఓవరాక్షన్ చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తల్లి శ్రీలక్ష్మి బాగోగులు చూసుకుంటున్న అవినాశ్ పట్ల కనీస మానవత్వాన్ని కూడా మరిచి ఎల్లో మీడియా అమానుష ధోరణిని బయటపెట్టుకుంది. సీబీఐ అధికారులు సోమవారం కర్నూలుకు రావడంతో అదే అదనుగా రెచ్చిపోయింది. అవినాశ్‌ను ఎలాగైనా అరెస్టు చేయించాలన్న విపరీత ధోరణి, కర్నూలు నగరంలో ఉద్రిక్తతలు సృష్టించాలన్న వ్యూహంతో క్షణక్షణం అసత్య ప్రచారంతో హోరెత్తించింది. గంట గంటకు ఎల్లో మీడియా పిచ్చి ముదిరి, మధ్యాహ్నానికి పీక్స్‌కు చేరుకొంది. స్థానిక పోలీసులు సహకరించడంలేదని, మధ్యాహ్నానికి కర్నూలుకు కేంద్ర బలగాలు వస్తున్నాయని, ఆ వెంటనే సీబీఐ అధికారులు అవినాశ్‌ను అరెస్టు చేస్తారంటూ తప్పుడు ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎల్లో మీడియా విపరీత ధోరణిని రాష్ట్రవ్యాప్తంగా పలువురు తప్పుపట్టారు. తల్లి ఆరోగ్యం బాగోలేక బాధలో ఉన్న వ్యక్తిపట్ల అమానవీయంగా వ్యవహరించడాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు, సభ్య సమాజం ఖండించాయి. ఒక ఎంపీకి ఉండే హక్కులు, ఆయన ప్రైవసీని భంగపరిచే విధంగా పచ్చ పైత్యాన్ని వెళ్లగక్కుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురదజల్లే కుట్రలో భాగంగానే వైఎస్ అవినాశ్‌రెడ్డి లక్ష్యంగా ఎల్లోమీడియా ఈ దుర్నీతికి పాల్పడుతోందని స్పష్టమవుతోంది. అందులో భాగంగానే అర్ధరాత్రి వేళ ఆస్పత్రిలోకి చొరబడుతున్నారని, ఎంపీ తల్లికి అందిస్తున్న చికిత్సపై వైద్యులు సమాచారం అందిస్తున్నా, అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినాశ్ సోమవారం సీబీఐ విచారణకు హాజరు కావల్సి ఉంది. అయితే, ఆయన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఈనెల 20వ తేదీ నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తోంది. అవినాశ్ దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 27 తర్వాత హాజరవుతానని అవినాశ్ సీబీఐ అధికారులకు లేఖ పంపారు. అయినప్పటికీ, సీబీఐ అధికారులు సోమవారం ఉదయం కర్నూలు వచ్చారు. స్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. దీనినే అవకాశంగా తీసుకున్న ఎల్లో మీడి యా వెంటనే తప్పుడు కథనాలు ప్రచారం చేయడం ప్రారంభించింది. అవినాశ్‌ను అరెస్టు చేయడానికే సీబీఐ అధికారులు వచ్చారంటూ అసత్య ప్రచారం మొదలెట్టింది. వారు పోలీసు అధికారులను కలిసినట్లు, అవినాశ్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారంటూ స్క్రోలింగ్‌లు, చర్చలు ప్రారంభించింది. అవినాశ్‌ను అరెస్టు చేయకపోవడంతో నిరాశ చెందిన ఈ మీడియా.. కొత్త వ్యూహా న్ని రచించింది. సీబీఐ అధికారులు పోలీసు అధికారులను సంప్రదిస్తున్నారని, ఎప్పుడైనా అరెస్టు జరగవచ్చని మరో ప్రచారం మొదలెట్టింది. ముఖ్యంగా టీవీ–5, ఏబీఎన్ తప్పుడు కథనాలు, చర్చలతో హోరెత్తించాయి. విశ్వభారతి హాస్పిటల్ వద్ద పోలీసు బందోబస్తు సీబీఐని కూడా ప్రభావితం చేస్తారా? సీబీఐ బృందం కర్నూలుకు రాగానే ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలైంది. సీబీఐ అధికారులు ఆస్పత్రికి కూడా వెళ్లలేదు. నేరుగా స్టేట్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లి అక్కడే బస చేశారు. అయినా, పచ్చ మీడియా సీబీఐ వెంటనే అవినాశ్‌ను అరెస్టు చేసేస్తోందంటూ ప్రచారం మొదలెట్టింది. టీవీ చర్చల్లో తమకు అను కూలురను కూర్చోబెట్టి, అధికారులను ప్రభావితం చేసేలా చర్చలు సాగించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. మీడియా ట్రయల్ పేరిట వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్ని చూసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉద యం నుంచే కర్నూలుకు తరలివచ్చారు. డిప్యుటీ సీఎం అంజాద్బాష,వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్, శ్రీదేవి, ఆర్థర్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఉదయాన్నే ఆస్పత్రికి చేరుకున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కడప మేయర్ సురేశ్‌బాబు, శాప్‌చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆస్పత్రికి వచ్చారు. కర్నూలుతోపాటు పులివెందుల, కడప, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల నుంచి కూడా వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలిరావడంతో ఆస్పత్రి పరిసరాలు జనంతో కిక్కిరిశాయి. డీఎస్పీ విజయశేఖర్ ఆధ్వర్యంలో ఆస్పత్రి వద్ద ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి కార్యకర్తల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో మరిన్ని బలగాలు సోమవారం రాత్రికి కర్నూలుకు చేరుకున్నాయి. ఆస్పత్రి ముందు కార్యకర్తల నిరసన ఎల్లో మీడియా అబద్ధపు ప్రచారాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రి ముందు బైఠాయించారు. ‘తండ్రిని అకారణంగా జైలుకు పంపారు. తల్లి అనారోగ్యంతో ఉంటే బాగోగులు చూసుకుంటున్న అవినాశ్‌ను వెంటాడి, వేధించడం ఏంటని’ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ ఆస్పత్రిలోకి చొరబాటు వందలాది రోగులు, వారి సహాయకులు ఉండే ఆస్పత్రిలోకి మీడియా పదే పదే జొరబడటంపై సీనియర్ విలేకరులే మండిపడుతున్నారు. కేవలం చంద్రబాబుకు ఏదో మేలు చేయాలన్న తపనతోనే ఎల్లో మీడియా పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తున్నారు. ఇదే ఉద్దేశంతో ఆస్పత్రి పరిసరాల్లో ఆదివారం అర్ధరాత్రి, ఎల్లో మీడియా హంగామా చేసింది. రాత్రి 11గంటల తర్వాత ఎల్లో మీడియా ప్రతినిధి ఒకరు తాను పనిచేస్తున్న సంస్థ పేరు కాకుండా మరో పేరు చెప్పి ఆస్పత్రిలోకి వెళ్లారు. శ్రీలక్ష్మి ఉన్న ఐసీయూ సమీపంలో ఓ కానిస్టేబుల్ అతన్ని నిలువరించారు. తప్పుడు పేరు చెప్పి రావాల్సిన అవసరం ఏముందని అక్కడున్న వారు కూడా గట్టిగా నిలదీశారు. దీంతో మీడియా ప్రతినిధి ఆస్పత్రి గేటు వద్దకు వచ్చి అవినాశ్ అనుచరులపై దుందుడుకుగా వ్యవహరించారు. ఇదంతా మిగతా ఎల్లో మీడియా ప్రతినిధులు వీడియో తీయబోయారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీలక్ష్మిని పరామర్శించిన వైఎస్ విజయమ్మ వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ సోమవారం సాయంత్రం విశ్వభారతి ఆస్పత్రికి వచ్చి ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మి ని పరామర్శించారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవినాశ్‌ను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని, అంతా మంచే జరుగుతుందని కాంక్షించారు. ఆందోళనకరంగానే శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి అవినాశ్ తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై విశ్వభారతి ఆస్పత్రి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఆమెకు నాన్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫారేక్షన్ (గుండె పోటు) ఉందని పేర్కొంది. యాంజియోగ్రామ్ చేశామని, రెండు రక్తనాళాల్లో బ్లాక్‌లు గుర్తించామన్నా రు. క్రిటికల్ కేర్ యూనిట్లో వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఆమెకు రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉండటంతో అయానోట్రోపిక్ సపోర్ట్‌తో ఉన్నారని తెలిపారు. ఆది, సోమవారాల్లో ఆమె వాంతులు చేసుకున్నారని, అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉందని తెలిపారు. మరికొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వెల్లడించారు. -
ఇదేం తీరు.. ఇదేం హింస? అవినాష్‌రెడ్డిపై విషం కక్కుతున్న ఎల్లో మీడియా
కడప ఎంపీ అవినాష్‌రెడ్డి విషయంలో పచ్చమీడియా పడుతున్న ఆత్రుత, ఆరాటం తీవ్ర విమర్శల పాలవుతోంది. జర్నలిజం ముసుగులో వ్యక్తుల ప్రైవసీని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న తీరు పరిధులు దాటుతోంది. అవినాష్‌రెడ్డి లోక్‌సభ సభ్యుడు. రెండు సార్లు కడప లోక్‌సభ స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. 2014లో లక్షా 90వేల మెజార్టీ వస్తే, 2019లో 3లక్షల 80వేల మెజార్టీ వచ్చింది. అవినాష్‌రెడ్డి.. పూర్తిగా ప్రజా జీవితం గడుపుతున్నారు. ప్రజల మధ్య ఉంటున్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయనకు సీబీఐ నుంచి నోటీసులు వచ్చాయి. ఇప్పటివరకు నోటీసులు ఇచ్చిన ప్రతీసారి ఆయన సీబీఐ ముందు దర్యాప్తుకు హాజరవుతున్నారు. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సమాధానాలు ఇస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి న్యాయపరంగా తనకున్న ఆప్షన్లను వినియోగించుకుంటున్నారు. అది ఆయనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. తనకు న్యాయం కావాలంటూ ఏ వ్యక్తి అయినా ఏ కోర్టునయినా ఆశ్రయించవచ్చు. తన వాదన వినిపించవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 7 సార్లు దర్యాప్తుకు హాజరైన అవినాష్.. తాజాగా తన తల్లి అస్వస్థత కారణంగా హైదరాబాద్ నుంచి తిరిగి కడపకు, అక్కడినుంచి కర్నూలుకు వచ్చారు. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా సీబీఐకి విన్నవించారు. తల్లికి గుండెపోటు వచ్చిందని, ఆస్పత్రిలో ICU ట్రీట్మెంట్ జరుగుతోందని, 7 రోజులు సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. చదవండి: ఆసుపత్రిలో చేరటంపైనా రోగిష్టి రాతలేనా ? ఇక్కడ బయటికొచ్చిన కీలకమైన అంశం ఏంటంటే, ఎల్లోమీడియా తీరు. సీబీఐ వాళ్లు ఏ చర్య తీసుకుంటారా అన్నది పక్కన పెడితే.. ఇంకా అరెస్ట్ చేయలేదంటూ పచ్చమీడియా తెగ ఆందోళన చెందుతోంది. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇంకెందుకు నాన్చుతున్నారు, అసలు అరెస్ట్ చేస్తారా? చేయరా? ఇవీ ఎల్లోమీడియాలో నాలుగు రోజుల నుంచి జరుగుతున్న చర్చలు. ఆపరేషన్ అవినాష్ అంటూ ఇష్టానుసారంగా మీడియా ట్రయల్స్ చేస్తోన్న ఎల్లోమీడియాకు, కనీస ఇంగీత జ్ఞానం లేకుండా విశ్లేషణలు ఇస్తోన్న ఛానల్ పెద్దలు, వారి వెనకే తనా అంటే తందానా అన్నట్టుగా పచ్చపార్టీ నేతలు.. వీరి తాపత్రయం చూస్తేంటే.. సిబిఐలోకి పరకాయ ప్రవేశం చేసి తామే అరెస్ట్ చేయాలన్నట్టుగా ఉంది. వృద్దురాలు అయిన అవినాష్ తల్లి గుండె నొప్పితో అస్పత్రిలో జాయిన్ అయితే తప్పేంటి? కొడుకు ఆసుపత్రిలో ఉండి చూసుకోవడం తప్పా? అని ప్రశ్నిస్తున్నారు. చదవండి: అమ్మ పరిస్థితి సీరియస్, 7 రోజులు గడువివ్వండి : సీబీఐకి అవినాష్ విజ్ఞప్తి ఎల్లో మీడియాకు పది ప్రశ్నలు 1. అవినాష్ రెడ్డి విషయంలో అంత అత్యుత్సాహం ఎందుకు? 2. వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తోంది సీబీఐనా? ఎల్లో మీడియానా? 3. సీబీఐ దర్యాప్తులో చర్చకు వచ్చే వేర్వేరు అంశాలకు తమ పైత్యాన్ని ఎల్లో మీడియా ఎందుకు కలుపుతోంది? 4. సీబీఐ ఎలా దర్యాప్తు చేయాలో కూడా ఎల్లో మీడియానే వార్తల రూపంలో ఎలా ఇస్తోంది? 5. సీబీఐని ప్రభావితం చేయాలన్న తాపత్రయం ఎందుకు? 6. ఒక ఎంపీకి కనీస ప్రైవసీ ఉండదా? ఆయన వెంట ఎందుకు పడుతున్నట్టు? 7. ఆయన తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోకి ఎందుకు చొరబడుతున్నట్టు? 8. లోపల ఏం జరుగుతుందో తెలియకుండా బయట ఇష్టానుసారంగా వార్తలు ఎందుకు రాస్తున్నారు? 9. మీడియా ట్రయల్ పేరిట ఎంతకైనా తెగిస్తారా? 10. మీ ఉద్దేశ్యాలను దర్యాప్తు సంస్థలకు ఎలా అంటగడతారు? కొన్ని ఛానళ్లు దురుద్దేశపూర్వకంగా అవినాష్‌ను లక్ష్యంగా చేసుకుని వార్తలు ప్రసారం చేస్తున్నాయి. చంద్రబాబుకు స్టే వచ్చినప్పుడు ఏమయ్యాయి ఈ వార్తలు? విచారణ తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించినప్పుడు ఎందుకు చేయలేదు మీడియా దర్యాప్తు? -దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టు, ఏపీ ప్రభుత్వ సలహాదారు ఎల్లో మీడియాను ప్రజలంతా ఛీ కొడుతున్నారు, జర్నలిజం విలువలకు ఎల్లో మీడియా పాతరేస్తుంది, అలజడి సృష్టించడానికే ఎల్లో మీడియా అభూత కల్పన సృష్టిస్తోంది, అసత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి, తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అవినాష్ దగ్గర ఉండాల్సి ఉంది, కొన్ని మీడియా సంస్థలు దిగజారి వ్యవహరిస్తున్నాయి. - బీవై రామయ్య, కర్నూలు మేయర్ తల్లి ఆరోగ్యం బాగవగానే అవినాష్‌రెడ్డి సహకరిస్తారు, సీబీఐకి విజ్ఞప్తి చేస్తున్నాం. -ఎస్వీ మోహన్‌రెడ్డి -
అమ్మ పరిస్థితి సీరియస్, 7 రోజులు గడువివ్వండి : సీబీఐకి అవినాష్ విజ్ఞప్తి
సాక్షి, కర్నూలు: దర్యాప్తునకు హాజరు కావాలంటూ సిబిఐ ఇచ్చిన నోటీసులకు లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు ఎంపీ అవినాష్ రెడ్డి. "మా అమ్మ లక్ష్మి (67 ఏళ్లు) తీవ్ర అస్వస్థతకు గురయి, ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. బ్లడ్ ప్రెషర్‌తో పాటు హైపర్ టెన్షన్ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మా నాన్నా భాస్కరరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం మీకు తెలిసిందే. మా తల్లితండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ఒక్కగానొక్క కొడుకయినా నాపై ఉంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో అమ్మకు తోడుగా ఉండి ఆమె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు కానీ, నిస్సత్తువతో పాటు మగతలో ఉంటున్నారు. ఇప్పటికే ఒకసారి గుండె పోటు వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అమ్మ లక్ష్మికి డాక్టర్లు యాంజియోగ్రామ్ టెస్టు చేయగా.. గుండెలో రెండో చోట్ల బ్లాక్‌లు ఉన్నాయని తేలింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆమెను మరిన్ని రోజులు ICUలోనే ఉంచి చికిత్స అందించాలని డాక్టర్లు సూచించారు. పై పరిస్థితుల దృష్ట్యా నాకు 7 రోజుల గడువు కావాలని కోరుతున్నాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడగానే మీ ముందు విచారణకు హాజరు కాగలనని అవినాష్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన లిఖిత పూర్వక జవాబులో పేర్కొన్నారు. ఇటు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. సుప్రీం కోర్టులో తన పిటిషన్ పై రేపు విచారణ ఉందని సిబిఐకి తెలిపారు అవినాష్ రెడ్డి. తన తల్లి ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు అవినాష్ రెడ్డి. మరో వైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితిపై సోమవారం ఉదయం హెల్త్‌బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. లక్ష్మమ్మ కార్డియో సమస్యతో బాధపడుతున్నారు. బీపీ తక్కువగా ఉండి.. ఏం తినలేకపోతున్నారు. వాంతులు అవుతున్నాయి. మెదడుకు, పొట్టకు అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉంది. ఆమె ఇంకా వైద్య బృందం పర్యవేక్షణలో ఉంది. ఇంకా కొన్నిరోజులు ఆస్పత్రిలోనే ఉండాలి. లో బీపీ కారణంగా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాలి అని వైద్యులు ప్రకటించారు. -
తల్లికి హార్ట్ సర్జరీ.. సీబీఐ విచారణకు హాజరుకాలేనన్న అవినాష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి.. సీబీఐకి తెలిపారు. వివరాల ప్రకారం.. తన తల్లి అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల కారణంగా సీబీఐని వారం రోజులు సమయం కావాలని అవినాష్ రెడ్డి కోరారు. ఆమెకు హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరముంటుందని డాక్టర్లు సూచించారు. ఈ కారణంగా సర్జరీ సమయంలో తాను విచారణ హాజరుకాలేనని అవినాష్ రెడ్డి తెలిపారు. ఇది కూడా చదవండి: బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం మాకు మాటల్లేని ఆనందం: పేర్ని నాని -
ఆందోళనకరంగానే అవినాష్‌రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి
సాక్షి, కర్నూల్: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చికిత్స అందిస్తున్న వైద్య బృందంలోని డాక్టర్ హితేష్‌రెడ్డి ప్రకటించారు. ‘‘యాంజియోగ్రామ్ చేస్తే రెండు వాల్స్ బ్లాక్ అయినట్లు తేలింది. లక్ష్మమ్మకు చికిత్స చాలా అవసరం. ఆమెకు బీపీ తక్కువగా ఉంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం’’ అని డాక్టర్ హితేష్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. పులివెందులలోని నివాసంలో శుక్రవారం ఉదయం శ్రీలక్ష్మి అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించగా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రత్యేక ఆంబులెన్స్‌ను ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గం మధ్యలో ఆమె పరిస్థితి విషమించడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. -
అవినాష్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
సాక్షి, గుంటూరు: వివేకా కేసులో తమ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, తన తల్లికి సీరియస్‌గా ఉంది గనుకే ఇవాళ విచారణకు హాజరు కాలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అయితే.. అవినాష్‌రెడ్డి గైర్హాజరు విషయంలో కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో కథనాలు ప్రసారం చేస్తుండడంపై అసహనం వ్యక్తం చేశారాయన. శుక్రవారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు హాజరయ్యే ఉద్దేశంతోనే అవినాష్ హైదరాబాద్‌కు వచ్చారు. తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి సమాచారం ఇచ్చే ఉంటారు. అయినా ఏదో జరిగిపోతోందంటూ కొందరు హడావిడితో కూడిన ప్రచారం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో దుష్ఫ్రచారం చేస్తున్నాయి.. వార్తలు ఇస్తున్నాయి. గతంలో ఆయన సీబీఐ పిలిచిన ప్రతీసారి హాజరయ్యారు. ఆయన సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు. అవినాష్‌రెడ్డి ఎక్కడికీ పోవడం లేదు.. తప్పించుకోవాల్సిన అవసరం అవినాష్‌రెడ్డికి లేదు అని సజ్జల స్పష్టం చేశారు. అవినాష్‌పై బుదర చల్లాలనే కొంత మంది అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, వైఎస్ సునీత, పచ్చమీడియా.. అంతా కలిసి అవినాష్‌పై అసత్య ప్రచారం చేయిస్తున్నారు అని సజ్జల ఆరోపించారు. అసలు హంతకుడు రోడ్డు మీద తిరుగుతున్నాడు సీబీఐ పిలిచినప్పుడల్లా అవినాష్ విచారణకు హాజరయ్యారు. తల్లికి అనారోగ్యం అని క్రియేట్ చేసుకుని.. విచారణకు ఎగ్గొట్టాల్సిన అవసరం లేదు. కానీ, నిందితుడు, గూగుల్ టేకౌట్ అని రకరకాల పేర్లతో సీబీఐ హడావిడి చేస్తోంది. అయిదు సార్లు విచారణకు హాజరైన అవినాష్ ఇప్పుడెందుకు వెళ్లడు?. ఒకవేళ తీవ్రపరిణామాలు ఎదురైనా.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లికి బాగలేదని సీబీఐకి చెప్పి మరీ వెళ్లాడు. సీబీఐ ఎదుటకు రేపు అయినా వెళ్లాల్సిందేగా?. అసలు హత్య చేశానన్నవాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. నేరుగా సెటిల్మెంట్ చేస్తున్నాడు. కానీ, ఒక ఎంపీని మాత్రం వెంటాడుతున్నారు అని సజ్జల ఆక్షేపించారు. ఆ ఫ్యామిలీ అలాంటిది కాదు అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని కూడా వివేకా కేసులో సీబీఐ పిలవగానే విచారణకు వెళ్లారు. అన్యాయం ఎందుకు చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తారు. ఒక ఎంపీపై బురద జల్లడం సబబు కాదు. వివేకా హత్యలో నిజంగా అవినాష్ పాత్ర ఉంటే.. అప్పట్లో చంద్రబాబు ఊరుకునేవారా?. వాస్తవాలు బయటకు రావాలనే సీబీఐ విచారణ చేస్తున్నా మేం అభ్యంతరం పెట్టలేదు. కానీ, వ్యక్తిత్వ హననం చేయడం కరెక్ట్ కాదు అని సజ్జల అన్నారు. ఇదీ చదవండి: అవినాష్‌రెడ్డి తల్లికి సీరియస్ -
విచారణకు హాజరవడంపై సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి
సాక్షి, అమరావతి: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సీబీఐ మరోసారి నోటీసులిచ్చింది. మంగళవారం నాడు హైదరాబాద్‌లో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే, షార్ట్ నోటీస్‌తో విచారణకు పిలిచారని, అత్యవసర పనులు ఉన్న కారణంగా నేడు విచారణకు హాజరు కాలేననని లిఖితపూర్వకంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ముందస్తు ఖరారైన షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేకపోతున్నానని తెలిపారు. నాలుగు రోజుల గడువు కావాలని కోరారు. నాలుగు రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని ఎంపీ తెలిపారు. ఈమేరకు సీబీఐకి లేఖ రాశారు. -
ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు(మంగళవారం) హైదరాబాద్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. వివేకా కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూన్ 05వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అవినాష్‌రెడ్డిని విచారించుకోవచ్చని సీబీఐకి హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఆ బ్రదర్స్ చెప్పినట్టే చేశా.. వివేకా పీఏ సంచలన స్టేట్మెంట్ -
నర్రెడ్డి సోదరులు చెప్పినట్టే చేశా: వివేకా పీఏ కృష్ణారెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందాక ఆయన అల్లుడు.. బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, అతని సోదరుడు నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలు చెప్పినట్టే చేశానని వివేకా పీఏ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పెద్దోళ్లు కనుక వారు చెప్పినట్టే చేయాల్సి వచ్చిందన్నారు. ‘వారు చెప్పినట్లు చేయకపోతే నువ్వు కూడా జైలుకు వెళ్తావు’ అని వివేకా కుమార్తె సునీతమ్మ కూడా చెప్పడంతో వారి సూచనల మేరకు నడుచుకున్నానని పునరుద్ఘాటించారు. వివేకా మృతదేహాన్ని చూడగానే తనకొచ్చిన సందేహాలన్నింటినీ వారికి స్పష్టంగా వివరించానని, అయినా వారి మార్గనిర్దేశం మేరకే వ్యవహరించానని ఇటీవల ఆయన ఓ టీవీ చానల్(ఎన్టీవీ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి ఘటన అనంతర పరిస్థితిని పూసగచ్చినట్లు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. రోజూలాగే ఆ రోజూ వెళ్లాను నేను 30 ఏళ్లకు పైగా వివేకా సార్ వద్ద పని చేస్తున్నాను. ప్రతిరోజు 5.30 గంటలకు సార్ ఇంటికి వెళ్లే అలవాటు. ఆ రోజు కూడా అలాగే వెళ్లాను. ఆయన నిద్ర లేచి ఉంటే హాలులో లైట్ వేస్తారు. వాచ్మెన్ రంగన్న పడుకొని ఉన్నాడు. సార్ ఇంకా లేవలేదని బయటికి వచ్చి, వీధిదీపం కింద ఐదు నిమిషాలు ఆంధ్రజ్యోతి పేపర్ తిరగేశాను. వివేకా సతీమణి సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాను. ‘సార్ లేట్‌గా వచ్చి ఉంటాడులే.. కొద్దిసేపు పడుకోని’ అని ఆమె సూచించారు. తిరిగి పేపర్ చదువుతుండగా.. వంట మనిషి లక్ష్మి, ఆమె కుమారుడు వచ్చారు. సార్ ఇంకా లేవలేదా? అని అడిగారు. ‘రాత్రి లేట్‌గా వచ్చి ఉంటారు.. లేప వద్దని మేడమ్ చెప్పింది’ అని చెప్పాను. కొద్ది సేపటి తర్వాత.. సార్ లేవకపోతే లేపాలి కదా.. మళ్లీ ఎందుకు లేపలేదు.. అని అరుస్తారని వంటమనిషి లక్ష్మిని బెడ్ రూమ్ సైడుకు వెళ్లి పిలవాలని చెప్పాను. లక్ష్మి బెడ్రూము వద్దకు వెళ్లి పిలిచి వచ్చే సమయంలో వాచ్మెన్ రంగన్న లేచి.. బెడ్‌షీట్‌ను సందులో పెట్టి ఉత్తరం వైపు ఉండే గార్డెన్ వైపు వెళ్లిపోయాడు. అంతలోనే వాచ్మెన్ రంగన్న పరుగెత్తుకుంటూ వచ్చి సార్ పడిపోయాడని చెప్పాడు. నేను వంటమనిషి కుమారుడు ప్రకాశ్ నార్త్ సైడ్ వాకిలి గుండా లోపలికి పరుగెత్తాము. లోపలికి వెళ్లి చూస్తే అంతా రక్తమే ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బెడ్ రూం అంతా రక్తం. భయం వేసింది. ఏసీ, లైట్ ఆన్‌లో ఉంది. సార్ మాత్రం బెడ్‌పై లేడు. బాత్రూములో పడిపోయి ఉన్నాడు. నాడి పట్టుకుని చూశా. తలపై గాయం కనిపిస్తోంది. నాతోపాటు ఉన్న ప్రకాశ్‌తో మన సార్ మనకు లేడని చెప్పా. బయటికి వచ్చి వివేకా సార్ అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేశాను. ‘బావ ఇక మనకు లేడు. ఎవరో ఏదో చేశారు. ఏదో జరిగింది. తలపై గాయం కనిపిస్తోంది. ఇల్లంతా రక్తం ఉంది’ అని చెప్పాను. తర్వాత ఆయన సోదరుడు శివప్రకాశ్‌రెడ్డికి కూడా అదే చెప్పాను. తర్వాత కొద్ది సేపటికి వైఎస్ వివేకా మొబైల్ సోఫాలో కనిపించింది. సైలెంట్లో ఉంది. ఏదో ఫోన్ రావడంతో రింగ్ అవుతున్నట్లు గుర్తించి, జేబులో పెట్టుకున్నాను. బెడ్ ముందు ఉన్న వీల్ చైర్ ముందు ఓ పేపరు పడి ఉంది. ప్రకాశ్, నేను దాన్ని ఓపెన్ చేసి చూశాము. అందులో సార్ రాసిన మ్యాటర్ ఉంది. ఆ లెటర్లో అక్షరాలు అంత క్లియర్‌గా లేవు. బాగా పరిశీలిస్తే ‘డ్రైవర్ ప్రసాద్ నిన్న డ్యూటీకి త్వరగా రమ్మన్నందుకు నన్ను కొట్టి చంపాడు. మీరు డ్రైవర్ ప్రసాద్‌ను వదిలి పెట్టవద్దు’ అని రెండుసార్లు రాసి ఉంది. కింద వైఎస్ వివేకా అని ఉంది. లెటర్‌ను ఎవరికీ చూపించొద్దన్నారు ఆ లెటర్ విషయం వెంటనే అల్లుడు రాజశేఖరరెడ్డికి తెలియజేశాను. ‘ఆ లెటర్‌ను జాగ్రత్తగా దాచి పెట్టు.. ఎవరికీ చూపించవద్దు’ అన్నాడు. నేను పోలీసులతో ప్రాబ్లమ్ అవుతుంది కదా అని అడగాను. ‘అదంతా నేను వచ్చిన తర్వాత మాట్లాడతా. నీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. నేను వచ్చాక పోలీసులకు ఇస్తాను. అప్పటి దాకా దాచి పెట్టు’ అని చెప్పాడు. ఈ విషయంగా శివప్రకాశ్‌రెడ్డికి కూడా తెలియజేసి.. నాకు దిక్కుతోచడం లేదని చెప్పాను. తర్వాత కొద్ది సేపటికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వచ్చాడు. నేనే ఆయన్ను లోపలికి పిలుచుకుని వెళ్లాను. అవినాశ్ రెడ్డితోపాటు శివశంకర్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి మరి కొంత మంది ఉన్నారు. తర్వాత అవినాశ్‌రెడ్డి సార్ బయటికి వచ్చి లాన్లో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వైఎస్ అవినాష్‌రెడ్డి చిన్నాన్న, పెద్దనాన్న, కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వచ్చారు. నేను రంగన్న పిలిచి దబాయిస్తే, రాత్రి దోశలు తిని నిద్రయానని చెప్పాడు. పోలీసులకు చెప్పేద్దామంటే వినలేదు గుండెపోటు విషయం ఎవరు ఎలా చెప్పారో తెలియదు. లెటర్, రక్తాన్ని బట్టి వైఎస్ వివేకాను ఎవరో ఏదో చేశారని నేను భావించాను. కొద్ది సేపటికి సీఐ శంకరయ్య, ఎర్రగంగిరెడ్డి వచ్చారు. ఎర్ర గంగిరెడ్డి రావడంతోటే బ్లడ్ వాంటింగ్ చేసుకున్నాడని చెప్పాడు. బాత్రూములో గోడకు ఆరు, ఏడు అడుగులు రక్తం చిమ్మిందని చెప్పగా.. బేసిన్‌కు తల కొట్టుకుని రక్తం వచ్చి ఉంటుందిలే అన్నాడు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామా అంటే ఏం అవసరం లేదులే అన్నాడు. ఎర్రగంగిరెడ్డి ఇలా చెబుతున్నాడని నేను నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి చెప్పాను. పక్కన సీఐ ఉన్నాడని మాట్లాడాలని ఫోన్ సీఐకి ఇచ్చాను. వాళ్లిద్దరు మాట్లాడుకున్నారు. రాజశేఖరరెడ్డి స్టేషన్లో కంఫ్లైంట్ రాసివ్వాలని సూచించారు. కొద్దిసేపటికి ఎర్రగంగిరెడ్డి.. కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాకు ‘లక్షుమ్మను రమ్మను.. బక్కెట్‌తో నీళ్లు తీసుకుని ఇదంతా క్లీన్ చేయాలి’ అని చెప్పాడు. లక్షుమ్మ సగం క్లీన్ చేసి.. కళ్లు తిరుగుతున్నాయని చెప్పి వెళ్లిపోయింది. తర్వాత తన వద్ద పనిచేసే పిల్లలు రాజశేఖర్, ట్యాంకర్ బాషాతో ఇనాయితుల్లా క్లీన్ చేయించారు. సార్ డెడ్‌బాడీ బాత్రూము నుంచి తేవడానికి ఎర్రగంగిరెడ్డితో కలిసి నలుగురు వెళ్లారు. తర్వాత అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు బాగా కొట్టారు అవినాష్‌రెడ్డి ఉదయాన్నే వచ్చి వెళ్లాడు.. మళ్లీ రాలేదు. రక్తం శుభ్రం చేసే సమయంలో ఆయన లేరు. నేను సీఐ చెప్పినట్లు కంప్లైంట్ రాసిచ్చి ఆస్పత్రికి వెళ్లాను. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి.. నా భార్యను తీసుకొచ్చి పోస్టుమార్టం రూమ్ వద్ద సార్‌ను చూపించాను. తర్వాత సార్ డెడ్ బాడీని ఇంటి వద్దకు తెచ్చారు. అప్పుడు లెటర్‌ను నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చాను. తర్వాత 15 నిమిషాలకు ఆ లెటర్‌ను ఎస్పీకి అందజేశానని, నీకు ఇబ్బంది లేదని రాజశేఖర్‌రెడ్డి చెప్పాడు. సాయంత్రం 4 – 4.30 గంటల ప్రాంతంలో నన్ను పోలీసులు తీసుకు వెళ్లి జేఎన్టీయూ గెస్ట్‌హౌస్‌లో పెట్టారు. అక్కడి నుంచి నాతోపాటు మరికొందరిని వేముల పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం కడప డీటీసీకి తీసుకెళ్లి 13 రోజులు పెట్టుకుని అందరినీ కొట్టారు. తర్వాత నాతోపాటు ప్రకాశ్, ఎర్రగంగిరెడ్డిని ముద్దాయిలుగా చూపిస్తూ రిమాండ్‌కు తరలించారు. మూడు నెలలు జైలులోనే ఉన్నాం. మద్యమధ్యలో సునీతమ్మ, రాజశేఖర్‌రెడ్డి వచ్చి మాట్లాడిపోయే వారు. మేము బయటికి వచ్చిన కొద్దిరోజుల తర్వాత కేసు సీబీకి బదిలీ చేశారు. తర్వాత సునీత, రాజశేఖరరెడ్డి.. సీబీఐకి సహకరించాలని చెప్పేవారు. అప్పటి నుంచి సీబీఐ అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లి వచ్చాం. సీబీఐ వాళ్లూ కొడతారనుకోలేదు సీబీఐ వాళ్లు ఢిల్లీకి రావాలని చెప్పారని నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి తెలియజేశాను. వెళ్లమని చెప్పి.. టికెట్ ఆయనే తీసిచ్చాడు. వారికి సహకరించాలని సూచించాడు. ఢిల్లీలో వాళ్లు నెల రోజులు పెట్టుకున్నారు. మధ్యలో రాంసింగ్ వచ్చి ‘నేను చెప్పినట్లు చెబుతావా? లేదా? వైఎస్ అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలు మిమ్మల్ని మ్యానేజ్ చేశారు. ఆ విషయం మీరు చెప్పడం లేదు. మేము చెప్పినట్లు చెప్పకపోతే జైలుకు పంపుతాం’ అని బెదిరిస్తూ కొట్టేవారు. సీబీఐ అధికారులు ఇలా కొడతారని ఊహించలేదు. నెల తర్వాత నన్ను పంపించేశారు. ఆ తర్వాత నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీతలు నన్ను హైదరాబాదుకు రమ్మని పిలిచారు. అక్కడికి వెళ్లాక ‘నువ్వు రాంసింగ్ సార్ ఎలా చెబితే అలా చేయాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడతావు, నువ్వు సహకరిస్తే నిన్ను సేవ్ చేస్తాం. ఇదొక్కటే మార్గం’ అని చెప్పారు. మధ్యమద్యలో నర్రెడ్డి రాజశేఖరరెడ్డి.. అవినాశ్ మ్యానేజ్ చేశాడని చెప్పమన్నారు. నిజం చెబితే కొడతారేంటి? ‘దస్తగిరి, రంగన్నలు మేము చెప్పినట్లు విన్నారు. నువ్వు కూడా చెప్పినట్లు వింటే సేవ్ చేస్తా’ అని రాంసింగ్ తెలిపారు. తెల్లవారగానే నీ ఇద్దరు కుమారులతో కలిసి కడపలోని కేంద్ర కారాగార గెస్ట్‌హౌస్‌కు రావాలని సూచించారు. నేను ఈ విషయం నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పగా, వెళ్లాలని సూచించాడు. హైదరాబాదులోని పిల్లలను పిలిచించి ఉదయం 11 గంటలకు వారితో కలిసి వెళ్లాను. మేము చెప్పినట్లుగా సహకరించాలని కోరారు. ఇందుకు నేను మరోమారు అభ్యంతరం చెబుతూ.. నాకు తెలిసిన విషయాలన్నీ చెబుతానని చెప్పాను. దాంతో ఆయన కట్టె తీసుకుని నన్ను కొట్టాడు. నిజం చెబితే కొడతారా? అంటూ మా పిల్లలు అడ్డుతగిలారు. సాయంత్రం వరకు నన్ను అక్కడే పెట్టుకుని బూతులు తిట్టి పంపారు. మళ్లీ పిలిచి నప్పుడు కూడా ఇలాగే మాట్లాడితే నీ కథ ఉంటాదని హెచ్చరించారు. చెప్పినట్లు వినలేదని పెళ్లి ఆపించేశారు అప్పటికి వారం రోజుల్లో నా చిన్న కుమారుడి పెళ్లి. సీబీఐ వాళ్లకు నేను సహకరించలేదని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సునీతకు కోపం వచ్చింది. వారు పెళ్లి కుమార్తె వారికి ఫోన్ చేసి ‘కృష్ణారెడ్డి హత్య కేసులో ఉన్నాడు. వైఎస్ అవినాష్‌రెడ్డికి సహకరించాడు. త్వరలో ఆస్తులు స్వాధీనం చేసుకుంటారు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి’ అని ఫోన్ చేసి చెప్పారు. నాకు విషయం తెలిసి నేను నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి వద్దకు వెళ్లగా సరైన స్పందన లేదు. పెళ్లి క్యాన్సిల్ అయితే కానీ అని నేను నిజాన్ని నిర్భయంగా చెప్పాలని భావించాను. ఆ తర్వాత నా కుమారుడు అమెరికా వెళ్లాడు. నేను ప్రాణ రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వబోతే ఆయన తీసుకోలేదు. అందుకే పులివెందుల కోర్టులో ప్రైవేటు కంప్లైంట్ వేశాను. దాని గురించి ఇప్పటివరకు అతీగతీ లేదు. నా పాస్‌పోర్టు రెన్యూవల్ కాకుండా ఆగిపోయింది. నా ప్రమోషన్ ఆగిపోయింది., నా కుమారుడు పెళ్లి ఆగిపోయింది. నేను వివేకాకు సేవ చేసినందుకు ఇస్తామన్న ఐదు ఎకరాల భూమి ఇవ్వలేదు. ఇలా అన్ని విధాలా నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు సీబీఐ కొత్త బృందం వచ్చింది. వారికి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను. పారదర్శకంగా విచారణ జరిగితే అసలు దోషులెవరన్నది తెలుస్తుంది. వివేకాకు హైదరాబాద్, పులివెందుల, కడపల 200 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆ ఆస్తులన్నీ దాదాపు కంపెనీ పేరుపైనే ఉండేవి. అలాగైతే జైలుకెళ్లేది నువ్వేనని భర్తకు సునీత హెచ్చరిక అవినాశ్ నన్ను మేనేజ్ చేయడం ఏమిటని అప్పుడే గట్టిగా వ్యతిరేకించాను. అప్పుడు సునీత నాపై ఫైర్ అవుతూ ‘నువ్వు ఏమనుకుంటున్నావు.. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు’ అని హెచ్చరించారు. రాజశేఖరరెడ్డి నన్ను సముదాయించేలా భుజం తట్టాడు. నేను ఉన్నది ఉన్నట్లు చెబుతానన్నాను. ఆ సమయంలో సునీత.. రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి నేను సహకరించకపోతే నర్రెడ్డి జైలుకు వెళ్తాడని చెప్పింది. ఆయనతో ఆమె అలా ఎందుకు అన్నాదో నాకు అప్పట్లో అర్థం కాలేదు. తర్వాత కొద్ది రోజులకు రాత్రి వేళ సీబీఐ అధికారి రాంసింగ్ నా సెల్‌కు మిస్డ్ కాల్ ఇచ్చారు. తర్వాత మా అబ్బాయితో ఫోన్ చేయించి (రాంసింగ్‌కు తెలుగు రానందున) మాట్లాడించాను. -
ఏది నిజం?: గంతలు కట్టేందుకే కట్టుకథలు
సాక్షి, అమరావతి: ప్రతి ఊర్లో ఒకడుంటాడు. ఊరికి ఏదైనా మంచి జరిగితే భరించలేడు. వాస్తవాలను పక్కదారి పట్టించేందుకు ఏదో ఒక దుష్ప్రచారాన్ని తెరపైకి తెస్తాడు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఒకరున్నారు! అధికారంలో ఉండగా రాష్ట్రానికి ఆయన చేసిందేమీ లేదు. ప్రతిపక్షంలో ఉన్నా బుద్ధి వంకరే. తనకు అలవాటైన రీతిలో కుట్రలకు పదును పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తన భజన మీడియా ద్వారా కట్టు కథలను ప్రచారంలోకి తెస్తారు. ఒకపక్క భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం.. విశాఖలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరగడం.. మరోపక్క అమరావతిలో భూ దందాలపై సిట్ దర్యాప్తు కొనసాగించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించడంతో బెంబేలెత్తి టీడీపీ కరపత్రిక ఈనాడు, ఇతర ఎల్లో మీడియాను రంగంలోకి దించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అఫిడవిట్ పేరిట ఎంపీ అవినాశ్‌రెడ్డిపై నిరాధార అభియోగాలతో బురద చల్లేందుకు బరి తెగించారు. అయితే సీబీఐ అభియోగాలు అవాస్తవమని స్పష్టం చేస్తూ ఎంపీ అవినాశ్‌రెడ్డి పూర్తి ఆధారాలతో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ వెలుగులోకి రావడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు, ఆయన బృందం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించడం విస్మయపరుస్తోంది. ఎంపీ అవినాశ్‌రెడ్డి విచారణకు సహకరించడం లేదంటూ అభియోగం మోపడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 19 నుంచి 25వరకు అవినాశ్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరై ఏకంగా 210 ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెప్పారు. ఆ ప్రశ్నలన్నీ గతంలో విచారణలో అడిగినవే అయినా సరే ఓపిగ్గా సమాధానాలిచ్చారు. న్యాయస్థానం ఆదేశాలతో అదంతా ఆడియో, వీడియో రికార్డింగ్ కూడా చేశారు. అయినా సరే ఎంపీ అవినాశ్ దర్యాప్తునకు సహకరించడం లేదనడం వెనుక దురుద్దేశాలున్నట్లు స్పష్టమవుతోంది. కౌంటర్ అఫిడవిట్లో ఎంపీ అవినాశ్‌రెడ్డి పేర్కొన్న ఇతర అంశాలు సంక్షిప్తంగా ఇవీ... ఎమ్మెల్సీ ఎన్నికలపై అదే దుష్ప్రచారం ఎన్నిసార్లు వాస్తవాలను వెల్లడించినా పదే పదే ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తేవడం ఎల్లో మీడియా కుట్రలకు నిదర్శనంగా నిలుస్తోంది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై వక్రీకరణే అందుకు తార్కాణం. 2017లో కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ వివేకాను చంద్రబాబు కుట్రపూరితంగా ఓడించారు. వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవిని బరిలో నిలిపారు. నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి ద్వారా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసి అడ్డదారిలో బీటెక్ రవిని గెలిపించారు. అయితే వైఎస్ వివేకాకు వ్యతిరేకంగా వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి పని చేసి బీటెక్ రవిని గెలిపించారంటూ సీబీఐ అవాస్తవాలను తన అఫిడవిట్లో పదే పదే ప్రస్తావిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి అందుకే ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ నిరాధార అభియోగాలు మోపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 800 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఎవరినైనా సీబీఐ విచారించిందా ? జిల్లాలో అన్ని ఓట్లను కలిపి ఎన్నికల కమిషన్ లెక్కిస్తుంది. మరి పులివెందులలో ఓట్లు క్రాస్ అయ్యాయని సీబీఐ ఎలా చెబుతుంది? ఇక డి.శివశంకర్‌రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించాలని అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి భావించారని సీబీఐ ఎలా నిర్ధారణకు వచ్చింది? వాటిలో ఒక్కదానికైనా సీబీఐ సమాధానం చెబుతుందా అంటే అదీ లేదు. కేవలం దురుద్దేశాలతో అభియోగాలు మోపడం మినహా నిరూపించే ఉద్దేశమే సీబీఐకి లేదన్నది స్పష్టమవుతోంది. బీటెక్ రవితో జట్టుకట్టిన సునీత దంపతులు ఈనాడు సహా ఇతర ఎల్లో సిండికేట్ కట్టు కథలకు తాజా పరిణామాలే నిదర్శనం. వైఎస్ వివేకాను కుట్రపూరితంగా ఓడించిన బీటెక్ రవి ఇప్పుడు ఆయన కుమార్తె సునీత, అల్లుడు– చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు అత్యంత సన్నిహితుడు. ఆ విషయాన్ని బీటెక్ రవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు. అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆ ఇంటర్వ్యూలో ఆయన ఆరోపణలు కూడా చేశారు. అంటే 2017ఎన్నికల్లో వివేకాకు వ్యతిరేకంగా అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పని చేయలేదని స్పష్టమవుతోంది. సీఐబీ అభియోగాలు నిజమైతే బీటెక్ రవి, అవినాశ్‌రెడ్డి మధ్య ఫోన్ సంభాషణలు ఉండాలి కదా? బీటెక్ రవితో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి రోజూ ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నారనేది సందేహాస్పదంగా మారుతోంది. అవినాశ్‌కు ఖరారైన ఎంపీ టిక్కెట్‌పై సీబీఐ వక్రీకరణ కడప ఎంపీ టికెట్‌పై లేని సందిగ్దతను ఉన్నట్లుగా చిత్రీకరిస్తూ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతోంది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ను సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైఎస్ అవినాశ్‌రెడ్డికే పార్టీ ఖరారు చేసింది. ఆయన్ని గెలిపించే బాధ్యతను వైఎస్ వివేకానందరెడ్డికి అప్పగిస్తూ ఎన్నికల ఇన్చార్జ్గా నియమించింది. అప్పటికే అవినాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. ఆయన గెలుపు కోసం వివేకా కూడా విస్తృతంగా పర్యటించారు. హత్యకు గురికావడానికి కొన్ని గంటల ముందు కూడా అంటే 2019 మార్చి 14న అవినాశ్‌రెడ్డికి అనుకూలంగా వివేకానందరెడ్డి మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు 300 ఇళ్లకు వెళ్లి ఇంటింటి ప్రచారం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సిట్టింగ్ ఎంపీ అవినాశ్‌రెడ్డిలను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ విషయాన్ని రఘురామిరెడ్డిని అడిగినా, వివేకా ఎన్నికల ప్రచారం నిర్వహించిన 300 ఇళ్లలోని వారిని అడిగినా వాస్తవం తెలుస్తుంది. సీబీఐ ఆ ప్రయత్నమే చేయకపోవడం విడ్డూరంగా ఉంది. అంతేకాదు అవినాశ్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ శ్రమించారని వివేకా కుమార్తె సునీత స్వయంగా 2019 మార్చి 27న మీడియాతో చెప్పారు. ఎంపీ టికెట్ కోసం వివేకానందరెడ్డిని హత్య చేశారన్న సీబీఐ అభియోగాలు పూర్తి నిరాధారం. అభ్యర్థులు ముందే ఖరారు.. వివేకా హత్య తరువాతే అవినాశ్‌రెడ్డికి టికెట్‌ను ఖరారు చేస్తూ పార్టీ ప్రకటించిందన్న సీబీఐ అభియోగం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 25 ఎంపీ, 175 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను 2019 మార్చి 17న పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఏ పార్టీ కూడా ఒక్క రోజులో 200 మంది అభ్యర్థులను ఖరారు చేయదు. ముందే ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లను నామినేషన్ల ముందు ప్రకటించడం అన్నది కేవలం ఒక తంతే. అదే విధంగా 200 మంది వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అప్పటికే ఖరారు చేశారు. వారంతా అప్పటికే ప్రచారంలో సైతం నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనానికి భిన్నంగా సీబీఐ అఫిడవిట్ సీబీఐ ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను విస్మరించి నిరాధార అభియోగాలను మోపుతున్నట్లు మరోసారి నిరూపితమైంది. 2019 మార్చి 15 తెల్లవారుజామున ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు వెళుతున్నట్లు ఎంపీ అవినాశ్‌రెడ్డి చెప్పింది తప్పని సీబీఐ తన కౌంటర్లో పేర్కొనడం విస్మయపరుస్తోంది. ఆ రోజు అవినాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు వెళుతుండగా వివేకా చనిపోయిన విషయాన్ని ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. దీంతో అవినాశ్‌రెడ్డి వెనక్కి మళ్లి వివేకా నివాసానికి చేరుకున్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు చల్లా మల్లి, బండి కేశవ్, బండి రాఘవరెడ్డి, వెంకట రమణారెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి ఇదే విషయాన్ని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పారు. వారి సాక్ష్యాన్ని సీబీఐ రికార్డు కూడా చేసింది. కానీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించి అసలు ఆ రోజు ఉదయం అవినాశ్‌రెడ్డి జమ్మలమడుగు వెళ్లడం లేదని సీబీఐ కౌంటర్లో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకోకుండా సీబీఐ కట్టు కథలు అల్లుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రత్యక్ష సాక్షులా... గూగుల్ టేక్ అవుటా? వాస్తవాలను వక్రీకరించడంలో పచ్చ ముఠా మరో అడుగు ముందుకేసింది. సాంకేతికంగా కచ్చితంగానీ, న్యాయపరంగా ఏమాత్రం చెల్లుబాటుగాని గూగుల్ టేక్ అవుట్ పేరిట దుష్ప్రచారం చేస్తోంది. 2019 మార్చి 15 తెల్లవారుజామున వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇంట్లోనే గడిపి మూడో వ్యక్తి ఫోన్ కోసం ఎదురు చూశారని అఫిడవిట్లో పేర్కొనడం విస్మయపరుస్తోంది. వివేకా హత్య విషయాన్ని ఆయన పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డే ఎంపీ అవినాశ్‌కు తెలిపారు. శివప్రకాశ్‌రెడ్డి మూడో వ్యక్తి అవుతారా? మరి ఆయన్ని ఆ కోణంలో సీబీఐ ఎందుకు విచారించడం లేదు? గూగుల్ టేక్ అవుట్ పేరిట సీబీఐ చెబుతున్న అంశాలు, ప్రత్యక్ష సాక్షులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. సీబీఐ దర్యాప్తు తీరు అహేతుకంగా ఉందనేందుకు ఇదో నిదర్శనం. సీబీఐ ఏమాత్రం శాస్త్రీయంగానీ గూగుల్ టేక్ అవుట్‌ను పరిగణలోకి తీసుకుంటుందా? ఐదుగురు సాక్షులు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుంటుందా? ఒకవేళ గూగుల్ టేక్ అవుట్నే పరిగణలోకి తీసుకుంటే ఐదుగురు సాక్షులే కాదు.. మొత్తం 248 మంది సాక్షులు చెప్పింది తప్పని అంగీకరిస్తుందా? చిత్ర పటాలంటూ.. విచిత్ర వాదన ఫోన్ కాల్స్ మ్యాప్ అంటూ మరో ఊహాజనితమైన కథను తెరపైకి తెచ్చారు. వివేకా హత్యకు ముందు రోజు అంటే 2019 మార్చి 14 సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 15 ఉదయం 8 గంటల వరకు ఫోన్ సంభాషణల క్రమాన్ని వివరించే మ్యాప్ అంటూ అఫిడవిట్లో పేర్కొంది. ఒక ఊహాజనిత కుట్ర చిత్రాన్ని గీశారు. సీబీఐ ఉద్దేశపూర్వకంగా విస్మరించిన అంశం ఏమిటంటే ఎర్ర గంగిరెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి ఒకే పార్టీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఒకరితో ఒకరు ఫోన్లో మాట్లాడుకోవడం కుట్రలో భాగంగా చూపించడం హాస్యాస్పదంగా ఉంది. ఇక తండ్రీ కుమారులైన వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి పరస్పరం మాట్లాడుకోవడం కూడా కుట్రలో భాగంగా చూపించడం అంటే సీబీఐ ఈ కేసు దర్యాప్తులో ఎంతగా దారి తప్పిందో స్పష్టమవుతోంది. నిందితుడిగా సీబీఐ పేర్కొన్న ఉదయ్‌కుమార్‌రెడ్డికి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదు. యూసీఐఎల్ ఉద్యోగి అయిన ఆయన అవినాశ్‌రెడ్డిని సాధారణంగా తరచూ కలిసేవారు. వారిద్దరి మధ్య ఫోన్ కాల్స్ కూడా కుట్రలో భాగంగా చూపించడం విడ్డూరంగా ఉంది. దర్యాప్తు ఇంత డొల్లతనంగా ఉండటం సీబీఐ ప్రమాణాలను దిగజారుస్తోంది. వారి ఫోన్ కాల్స్ మ్యాప్ ఎందుకు గీయలేదు? ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితులు. ఆ నలుగురు ఆయన అల్లుడు–చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డిలకు అత్యంత సన్నిహితులన్నది పులివెందులలో అందరికీ తెలిసిన విషయమే. మరి ఎర్ర గంగిరెడ్డి– నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి– నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి మధ్య ఫోన్ కాల్స్‌పై సీబీఐ ఎందుకు దృష్టి సారించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. వారి మధ్య కాల్స్‌ను అనుమానాస్పదంగా పరిగణించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నా సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు? వారి మధ్య ఫోన్ కాల్స్ మ్యాప్‌ల ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేయడం లేదో సీఐబీనే సమాధానం చెప్పాలి. వివేకా హత్య తరువాత సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి జైలులో ఉన్న ఎర్ర గంగిరెడ్డిని కలుసుకున్నారు. ఆ ములాఖత్ కచ్చితంగా అనుమానాస్పదమే. ఇక వివేకాను నరికి చంపానని అంగీకరించిన దస్తగిరి బెయిల్ పిటీషన్‌ను సునీత వ్యతిరేకించకపోవడం కీలకంగా మారింది. డి.శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను మాత్రం ఆమె వ్యతిరేకించడం వెనుక దురుద్దేశం ఉందని స్పష్టమవుతోంది. దస్తగిరి బెయిల్‌ను వ్యతిరేకించని సునీత డి.శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆధారాలు ధ్వంసం చేయించింది వివేకా బావమరుదులే వివేకా హత్యా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేయించారంటూ అవినాశ్‌రెడ్డిపై సీబీఐ మోపిన అభియోగాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. వివేకా చనిపోయారని, వెంటనే అక్కడికి వెళ్లమని ఆయన పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి చెబితేనే అవినాశ్ వెళ్లారు. అప్పటికే వివేకా రాసిన లేఖ గురించి శివప్రకాశ్‌రెడ్డికి తెలిసినా అవినాశ్‌కు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. ఇక వివేకా నివాసంలో రక్తపు మరకలు, ఫ్లోర్‌ను శుభ్రం చేయించింది ఎర్ర గంగిరెడ్డి. శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే ఆయన అలా చేశారు. ఎందుకంటే వారిద్దరూ అత్యంత సన్నిహితులు కాబట్టి. అంటే ఆధారాలను ధ్వంసం చేయించింది శివప్రకాశ్‌రెడ్డి అని స్పష్టమవుతూనే ఉంది. మరి ఈ విషయంలో శివప్రకాశ్‌రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. అవినాశ్ ఆధారాలను ధ్వంసం చేయించినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందా? అలాంటిది ఏదీ లేనప్పుడు సీబీఐ ఏ ఆధారాలతో ఈ అభియోగాలను మోపుతోంది? వివేకా లేఖ, సెల్‌ఫోన్‌ను గోప్యంగా ఉంచిన ఆయన అల్లుడు, పెద్ద బావమరిదిని విచారించాలని అవినాశ్ ఎప్పటి నుంచో కోరుతునే ఉన్నారు. ఇన్నాళ్లకు మేలుకున్న సీబీఐ నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని కొద్ది రోజుల క్రితం ఎట్టకేలకు విచారించింది. పది రోజుల క్రితమే సీబీఐ అఫిడవిట్ దాఖలు.. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, విశాఖలో అదాని డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే అద్భుతమైన ఆ రెండు ప్రాజెక్టులపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. మరోవైపు చంద్రబాబు సర్కారు భూదోపిడీ, ఇతర అవినీతి బాగోతాలపై సిట్ దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు బుధవారమే తీర్పునిచ్చింది. ఆ రెండు అంశాలు గురువారం మీడియాలో ప్రముఖంగా ప్రచురితమవుతాయని తెలుసు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ, పచ్చ మీడియా వేసిన పన్నాగమే సీబీఐ కౌంటర్ అఫిడవిట్‌ను హఠాత్తుగా తెరపైకి తేవడం. వాస్తవానికి సీబీఐ పది రోజుల క్రితమే న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. అదే రోజు అది అన్ని పత్రికలకు అందుబాటులోకి వచ్చింది. సీబీఐ కౌంటర్‌కు సమాధానంగా ఎంపీ అవినాశ్‌రెడ్డి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ రెండింటి ఆధారంగా న్యాయస్థానంలో వాద ప్రతివాదనలు జరిగాయి. అనంతరం న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. అవన్నీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. తాజాగా భోగాపురం విమానాశ్రయం, అదాని డేటా సెంటర్‌కు శంకుస్థాపన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఆదేశాలతో ఈనాడు, ఎల్లో మీడియా సీబీఐ అఫిడవిట్ అంశాన్ని ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చాయి. -
ఏకపక్షంగా విచారణ
సాక్షి ప్రతినిధి, కడప: ‘సీబీఐ పెద్ద సంస్థ... నేను ఆ సంస్థ మొత్తాన్ని నిందించే పెద్దవాడిని కాదు గానీ వివేకం పెదనాన్న హత్య కేసులో విచారణ చేస్తున్న రామ్‌సింగ్ ఏకపక్షంగా వ్యవహరించారు. ఫ్యాక్ట్ టార్గెట్ కాకుండా పర్సన్‌ను టార్గెట్ చేస్తూ విచారణ చేస్తున్నారు. కట్టుకథల ఆధారంగా అబద్ధాల కట్టడాలను కడుతోంది. మా అక్క సునీతమ్మ తన భర్తను కాపాడుకునే క్రమంలో నన్ను, మానాన్న వ్యక్తిత్వాలను నాశనం చేస్తోంది. సునీతమ్మను పావుగా వాడుకుని ఎల్లో మీడియా, చంద్రబాబునాయుడు, బీజేపీలో చేరిన టీడీపీ నేతల ద్వారా వైఎస్సార్ సీపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐవో) ఏకపక్ష వైఖరి, ఎల్లో మీడియా కట్టుకథలపై ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో వివరాలు ఇవీ.. మూడేళ్లుగా మాట్లాడాలనుకున్నా.. సీబీఐ విచారణ గురించి ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. మూడేళ్లుగా చాలా సందర్భాల్లో మాట్లాడాలనుకున్నా.. సీబీఐపై నమ్మకంతో, వివేకం పెద్దనాన్న గురించి కొన్ని విషయాలు మాట్లాడలేక, చనిపోయిన వ్యక్తి కుమార్తె, అల్లుడు గురించి మాట్లాడలేక ఎన్ని ఆరోపణలొచ్చినా మౌనంగానే ఉన్నా. విచారణ తప్పుదారిలో వెళ్తున్నా భరించా. సీబీఐ వేసిన రెండు చార్జిïÙట్లు, 248 మంది సాక్షుల స్టేట్మెంట్లు, కోర్టుల్లో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లు, వ్యక్తిగతంగా నా విచారణను బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నా. పథకం ప్రకారం వ్యక్తిత్వ హననం.. వాచ్మెన్ రంగన్న ప్రత్యక్ష సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నలుగుర్ని గుర్తు పట్టి వారి పేర్లు కూడా చెబుతాడు. మరి నలుగురిలో ఒకర్ని అప్రూవర్‌గా మార్చాల్సిన అవసరం ఉందా? కిరాయికి హత్య చేసిన వ్యక్తి, డబ్బు కోసం మంచి మనిషి ని చంపిన వ్యక్తి, అదే డబ్బు కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడడా? హత్యలో స్వయంగా పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి ముందస్తు బెయిల్‌కు సీబీఐ నో అబ్జెక్షన్ అని చెబుతోంది. రెండేళ్లుగా కోర్టులో ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అవుతున్న సునీతమ్మ మరి దస్తగిరి ముందస్తు బెయిల్ పట్ల ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది అతడిని పావుగా వాడుకొని మమ్మల్ని టార్గెట్ చేయడం కాదా? అప్రూవర్ అనే అబద్ధాల కట్టడంలో అత్యున్నతస్థాయి విచారణ సంస్థ ఇన్వెస్టిగేషన్ అధికారి రామ్‌సింగ్ దిగజారి ప్రవర్తించారు. కీలక అంశాలను మరుగున పరుస్తూ సిల్లీ అంశాల ఆధారంగా విచారణ కొనసాగించారు. నిజాలను మరుగునపరచి.. ఘటనా స్థలంలో ఉన్న వాస్తవాన్ని ఎందుకు దాచి పెట్టాల్సి వ చ్చింది? వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని తెలిసీ, డెత్ నోట్ చదివి వినిపించిన పీఏ కృష్ణారెడ్డిని ఎవరికీ చూపించకుండా లేఖ దాచి పెట్టాలని అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశించారు. వాస్తవాలు చెప్పకుండా ఘటన స్థలంలోకి నన్ను వెళ్లమని నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి ఫోన్లో చెప్పారు. జమ్మలమడుగు వెళ్తున్న నేను అక్కడికి వెళ్లి చూసిన ఘటనను ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చా. అప్పటి సీఐకి ఫోన్ చేసి వివేకం పెద్దనాన్న చనిపోయారు, చాలా రక్తం ఉంది, బెడ్ రూమంతా రక్తం ఉంది, త్వరగా రండి సార్.. అని చెప్పా. అది హత్య అని తెలియడానికి లెటర్ క్లియర్ ఎవిడెన్స్. లెటర్ కంటెంట్ విన్న వెంటనే నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? కనీసం నాకైనా చెప్పాలి కదా? హత్య విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు. ఇలాంటి వాస్తవాలను రామ్‌సింగ్ మరుగునపరచి ఏకపక్షంగా వ్యవహరిస్తారు. సునీతమ్మ తన భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాషిరెడ్డిలను కేసు నుంచి కాపాడుకునేందుకు ఆరాటం చూపుతోంది. అన్ని వేళ్లు వాళ్ల వైపే... ఘటనాస్థలంలో దొరికిన లెటర్‌తో పాటు వేళ్లన్నీ వాళ్ల వైపే చూపుతున్నాయి. వివేకం సార్ 2010లో ఇస్లాం మతం స్వీకరించి మహమ్మద్ అక్బర్‌గా పేరు మార్చుకొని షమీమ్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి షహెన్షా అనే అబ్బాయి కూడా ఉన్నాడు. సునీతమ్మ, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, షమీమ్ స్టేట్మెంట్లు పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. షమీమ్‌కు ఒక విల్లా కొనుగోలు చేసి ఇచ్చి, అబ్బాయిని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివించాలని, ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి జీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వివేకం పెదనాన్న అనుకున్నారు. బెంగళూరు డీల్ రూ.8 కోట్లు వస్తే ఆ మొత్తం వారికి ఇవ్వాలనుకున్నారు. అయితే బెంగళూరులో డబ్బు వచ్చే అవకాశమే లేదని 8 మంది సాక్షుల ద్వారా వెల్లడైంది. తన వాటా ఆస్తిగా వచ్చిన 25 శాతం భాగాన్ని షమీమ్ కుటుంబానికి చెందేలా వివేకం సార్ విల్లు రాయించారు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఇది తెలిసి ఎర్ర గంగిరెడ్డి ద్వారా పథక రచన చేశారు. రెండో పెళ్లి వ్యవహారంతో 2013 నుంచి సునీతమ్మకు, పెదనాన్నకు మధ్య మాటలు కూడా లేవు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కూడా ఆ విషయాన్ని విచారణలో వెల్లడించారు. వివేకం సార్‌కు ఉన్న చెక్ పవర్‌ను కూడా రద్దు చేశారు. హత్య అనంతరం ఎర్ర గంగిరెడ్డి డాక్యుమెంట్లు, స్టాంపు పేపర్లు తీసుకెళ్లినట్లు ఏ–4 చెబుతున్నాడు. ఇవన్నీ కూడా వేళ్లు వారివైపే చూపుతున్నాయి. ఏ–2, ఏ–3 కుటుంబ సభ్యుల కారణంగా వివేకం సార్‌తో తీవ్రమైన విభేదాలున్నాయి. ఎర్రగంగిరెడ్డి ద్వారా నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వీరందర్నీ వాడుకున్నారు. ఇది పూర్తిగా మర్డర్ ఫర్ గెయిన్. రాజశేఖరరెడ్డిని తప్పించి దస్తగిరిని పావుగా చేసుకొని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. సునీతమ్మది పోరాటం కాదు...ఆరాటం వివేకం సార్ హత్య కేసులో సునీతమ్మది పోరాటం కాదు, ఆరాటం మాత్రమే. భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఈ హత్య కేసులోంచి బయటికి రావాలి. అమె భర్త స్థానంలో నన్ను, మా నాన్నను ఇరికించాలి. అది అసూయతోనే. ఇంకో కారణం లేదు. మాకైతే సునీతమ్మపై గౌరవం ఉంది. ఆమెను బాధ పెట్టాలని కాదు.. వాస్తవాలు తెలియాలి కాబట్టి చెబుతున్నాం. సుప్రీంకోర్టులో నాపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పిటిషన్ వేశారు. రామ్సింగ్ను సపోర్టు చేస్తూ కౌంటర్ పిటిషన్ వేస్తారు. పర్సన్‌ను టార్గెట్ చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. మాజిల్లా వాసులందరికీ తెలుసు. ఎంపీ టికెట్ మోటివ్ అన్నది హాస్యాస్పదం. వైఎస్ వివేకా ముందు రోజు కూడా మైదుకూరు నియోజకవర్గంలో డోర్ టు డోర్ ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డి, ఎంపీగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. సంబంధం లేని వారి జీవితాలను ఇందులోకి లాగి ఎందుకు నాశనం చేయాలనుకున్నారు? ఈ విషయాన్ని సీబీఐని అడుగుతున్నా. సునీతక్కను కూడా అడుగుతున్నా. నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని వివేకం పెదనాన్న బలపర్చేవారు. నా కార్యక్రమాలకు వచ్చేవారు. నా కోసం ఫైట్ చేసే వ్యక్తిని నేను చంపాననడం ఎంతవరకూ లాజికల్ అనేది ఆలోచించండి. 2014లో వేంపల్లెలో వీధి వీధిలో తిరుగుతూ మా ఇద్దరు కుమారులు జగన్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిలను గెలిపించాలని ప్రచారం చేశారు. అప్రూవర్ కట్టుకథ.... సీబీఐకి సాక్షుల స్టేట్మెంట్లు పరిశీలిస్తే (ఎల్‌డబ్ల్యూ 10, 34, 37, 38, 50, 86, 94, 98) బెంగళూరు సెటిల్మెంట్ ఫెయిల్ అయింది. రాధాకృష్ణమూర్తివి ఫేక్ డాక్యుమెంట్లు, డబ్బులు రావని స్పష్టంగా చెప్పారు. ఏమాత్రం డబ్బులు రాని విషయం గురించి వాదోపవాదనలు చేసుకుని చంపినట్లు చెప్పడం కట్టుకథ కాదా? అది స్పష్టంగా తెలియడం లేదా? వివేకం పెదనాన్న హత్యలో సిట్ నాలుగైదు కోణాల్లో విచారణ కొనసాగించింది. వివేకం సార్ రెండో వివాహం, బతికున్న సమయంలో బలపనూరులో షమీమ్‌కు కట్టించిన ఇంటిని కూడా రాయించుకోవడం, మర్డర్ ఫర్ గెయిన్ అన్న విషయం వెలుగు చూస్తున్న సమయంలో.. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాషిరెడ్డిలను కాపాడుకునేందుకు సునీతమ్మ సిట్ వద్దు సీబీఐ విచారణ కావాలని కోరుతోంది. అంతకంటే వేరే మతలబు లేదు. ఎల్లోబ్యాచ్ పావుగా సునీతమ్మ సీబీఐ ఎంతో పెద్ద ఏజెన్సీ. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. ఏ–4 దస్తగిరిని పావుగా చేసుకొని సునీతమ్మ మమ్మల్ని టార్గెట్ చేస్తోంది. సునీతమ్మను పావుగా చేసుకొని లబ్ధి పొందేందుకు ఎల్లో బ్యాచ్ ప్రయతి్నస్తోంది. వాళ్లకు నేను, మానాన్న టార్గెట్ కాదు. వైఎస్సార్సీపీనే టార్గెట్. ఎందుకంటే మాద్వారా వైఎస్సార్సీపీ డీఫేమ్ కావాలి. ఎల్లో మీడియా, చంద్రబాబునాయుడు, మారెడ్డి రవీంద్రనాథరెడ్డి, బీజేపీలో ఉన్న టీడీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వారికి ప్రజల్లోకి వెళ్లే దమ్ము, ధైర్యం లేదు. డీఫేమ్ చేయడంలో ఎల్లోబ్యాచ్ ఎక్స్పర్ట్. ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడినే డీఫేమ్ చేసి రోడ్డున పడేశారు. మీ కుట్రలను పటాపంచలు చేస్తాం. న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ వ్యవస్థపైన మాకు నమ్మకం ఉంది. అబద్ధాల కట్టడాలు న్యాయస్థానంలో నిలబడవు. నిజం పునాదిపై ఉన్నాం. చివరకు న్యాయమే గెలుస్తుందన్న విశ్వాసం ఉంది. -
అవినాశ్ అరెస్టుకు సీబీఐ అత్యుత్సాహం
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కిరాయి హంతకుడు బయట తిరిగేందుకు పూర్తిగా సహకరిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ).. ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని అతని తరఫు సీనియర్ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదించారు. అవినాశ్‌ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే దర్యాప్తు చేస్తోంది తప్ప.. ఇతర కీలక అంశాలను పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సురేందర్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను శుక్రవారానికి (నేటికి) వాయిదా వేశారు. ‘హియర్ సే ఎవిడెన్స్’ ఆమోదం కాదు.. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సీబీఐ ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావిస్తూ అవినాశ్‌ను అరెస్టుచేయాలని చూస్తోంది. కానీ, అందులో ఏ ఒక్క దానికీ ఆధారాల్లేవు. అన్నీ ఊహాజనితాలు, కల్పితాలే. ఏ–4 నిందితుడు దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ టేక్అవుట్, ఎమ్మెల్సీ ఎన్నికల కారణం, సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు చేస్తోంది. ఇందులో ఏ ఒక్కటీ చట్టప్రకారం సరికాదు. మన వెనుక వైఎస్ అవినాశ్, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి ఉన్నారని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలాన్ని ఇచ్చాడు. అయితే, ఈ వ్యాఖ్యలను గంగిరెడ్డి తన వాంగ్మూలంలో ఖండించాడు. తను ఎవరి పేరు చెప్పలేదని వెల్లడించాడు. అంతేకాక.. దస్తగిరి రెండుసార్లు వాంగ్మూలం ఇచ్చాడు. మొదటిసారి చెప్పిన దాంట్లో ఎవరి పేరూలేదు. రెండోసారి చెప్పిన దాంట్లో ఈ పేర్లు చెప్పాడు. ఇలా ఎందుకు చెప్పాడని సీబీఐ దర్యాప్తు చేయడంలేదు. అతన్ని ప్రశ్నించడంలేదు. ‘హియర్ సే ఎవిడెన్స్’ అంటే.. ఎవరో చెప్పింది విని చెప్పడం. ఇది చట్టప్రకారం ఆమోదయోగ్యం కాదు. అంతేకాదు.. కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి బదిలీ చేసిన తర్వాత దస్తగిరి దాదాపు రెండునెలలు ఢిల్లీలో ఉండి వచ్చాడు. తాను సీబీఐ వారిని కలిసివచ్చానని కూడా బయట చెప్పాడు. అక్కడ జరిగిన ఒప్పందంలో భాగంగానే ఈ పేర్లు ప్రస్తావించాడు. తానే హత్యచేశానని చెప్పిన కిరాయి హంతకుడికి బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ సహకరించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాగే, గూగుల్ టేక్అవుట్ ప్రామాణికం కాదు. ఒక వ్యక్తి తన స్నేహితుడి ఫోన్లోని గూగుల్‌ను అతని జీమెయిల్‌తో తెరిస్తే.. స్నేహితుడు ఎక్కడికి వెళ్లినా ఇతను అక్కడ ఉన్నట్లే చూపిస్తుంది. అందుకే గూగుల్ టేక్అవుట్ను గూగుల్ కూడా సర్టిఫై చేస్తూ లేఖ ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని సర్టిఫై చేయదు. దస్తగిరి చెప్పిన వాంగ్మూలానికి, గూగుల్ టేక్అవుట్ సమాచారానికి వివరాల్లో తేడా ఉంది. ఇందులో ఏదీ సరైందో సీబీఐ ఎలా నిర్ణయించుకుంది,, ఎలా చెబుతుంది?’.. అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వివాదానికీ సాక్ష్యాల్లేవు.. ఇక వివేకా.. అవినాశ్‌కు బాబాయి. అవినాశ్ ఎంపీగా పోటీచేసినప్పుడు అతని ప్రచారంలో, గెలుపులో వివేకా కీలకపాత్ర పోషించారు. తర్వాత జరగబోయే ఎన్నికల్లో కూడా అవినాశ్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొనడానికి ఆయన సిద్ధమై ఉన్నారు. ఇదే విషయాన్ని వివేకా మృతిచెందిన దాదాపు 10 రోజుల తర్వాత ఆయన కుమార్తె సునీత కూడా మీడియాకు వెల్లడించింది. తర్వాత ఏం జరిగిందో.. మాట మార్చారు. ఇక సాక్షాలను మార్చడం విషయానికొస్తే.. మార్చి 15, 2019 ఉదయం అవినాశ్‌రెడ్డి జమ్మలమడుగు బయల్దేరారు. మధ్యలో ఉండగా వివేకా అల్లుడు ఫోన్‌చేసి, గుండెపోటుతో మృతిచెందినట్లు చెప్పారు. దీంతో ఆయన ఉ.6 తర్వాత అక్కడికి చేరుకున్నారు. కొంత సమయం అక్కడి ఉండి వెళ్లిపోయారు తప్ప.. సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం చేయలేదు. ఇది కూడా కల్పితమే. అవినాశ్, భాస్కర్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకునే సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది. వివేకా రాసిన లేఖను సాయంత్రం వరకు ఎందుకు దాచాల్సి వచ్చిందో చెప్పమని అతని అల్లుడిని సీబీఐ కనీసం ప్రశ్నించలేదు. సీబీఐ దర్యాప్తు చేపట్టిన నాటి నుంచి పిలిచిన ప్రతీసారి అవినాశ్ విచారణకు హాజరవుతున్నారు. ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. అర్టికల్–21ను ఉల్లంఘిస్తూ.. అవినాశ్ ప్రాథమిక హక్కును కాలరాస్తున్నారు. సీబీఐ కోరిన రోజున.. ఉదయం నుంచి సాయంత్రం వరకు (కస్టడీ) విచారణకు హాజరుకావడానికి అవినాశ్ సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి’ అని నిరంజన్‌రెడ్డి న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. అవినాశ్‌పై ఎలాంటి కేసుల్లేవు అనంతరం, సునీత తరఫు న్యాయవాది సిద్దార్థ లూద్రా వాదనలు వినిపిస్తూ.. అవినాశ్‌పై పలు కేసులు ఉన్నాయని, ఎన్నికల అఫిడవిట్లో అతను పేర్కొన్నారని చెప్పారు. దీనిపై నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుని.. అవినాశ్‌పై ఎలాంటి కేసుల్లేవని, తాజాగా సమాచార హక్కు చట్ట ప్రకారం తీసుకున్న డాక్యుమెంట్లను కోర్టుకు చూపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
‘అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ దగ్గర లేవు’
సాక్షి, హైదరాబాద్: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించగా, సునీత తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూత్రా, సీబీఐ తరపున పీపీ నాగేంద్ర వాదనలు వినిపించారు. ‘‘వివేకాను దస్తగిరే హత్య చేశాడు.. అలాంటప్పుడు దస్తగిరి స్టేట్మెంట్ను ఎలా పరిగణలోకి తీసుకుంటారు.. గూగుల్ టేకౌట్ ఎలా ఆధారం అవుతుంది?. అవినాష్‌ను లక్ష్యంగా చేసుకొనే దర్యాప్తు జరుగుతోందని అవినాష్ తరఫు న్యాయవాది అన్నారు. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి జమ్మలమడుగు వెళ్తున్నట్టు 5గురు సాక్షులు స్టేట్ మెంట్ ఇచ్చారు, కానీ అవినాష్ రెడ్డి తన ఇంటి నుంచి నేరుగా వివేకా ఇంటికి వచ్చాడని CBI చెబుతుంది" అని లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ‘‘ఢిల్లీలో దస్తగిరి 2 నెలల పాటు సీబీఐ కస్టడీలో ఉన్నాడు. కస్టడీ ముగియగానే దస్తగిరి బెయిల్ పిటిషన్ వేశాడు. అప్రూవర్‌గా సీబీఐ దస్తగిరిని మార్చింది. దస్తగిరి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ఎక్కడా అపోజ్ చేయలేదు. దస్తగిరిని ముందుగానే ప్లాన్ చేసి అవినాష్‌రెడ్డి పేరు చెప్పేలా చేసింది. సీబీఐ చెప్పిన వాటికి దస్తగిరి అంగీకరించి అప్రూవర్‌గా మారాడు. దస్తగిరి బెయిల్లో మెరిట్స్ పరిగణలోకి తీసుకోలేదు. హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం నేనెక్కడా చూడలేదు.’’ అని అవినాష్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. చదవండి: వివేకా కేసు: వీడియో రిలీజ్ చేసిన ఎంపీ అవినాష్ ‘‘దస్తగిరి యాంటీసిపేటరి బెయిల్‌ను సీబీఐ వ్యతిరేకించకపోవడం న్యాయ సమ్మతం కాదు. అక్కడ ఇక్కడ విన్న మాటలను బట్టి అవినాష్‌పై ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ఇక్కడ విన్న మాటలు ఎప్పుడూ ఎవిడెన్స్ కాదు. దస్తగిరి మొదటి స్టేట్మెంట్లో గంగిరెడ్డి సహా ఐదుగురు పేర్లు మాత్రమే చెప్పారు. తర్వాత ఇచ్చిన మరో స్టేట్మెంట్లో కొత్తపేర్లు తెరపైకి తెచ్చారు. అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ వద్ద లేవు.’’ అని అవినాష్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. "గూగుల్ టేకౌట్ అనేది ప్రత్యేక యాప్ ఏం కాదు, గూగుల్ టేకౌట్ అక్యూరసీ 2000 మీటర్లు ఉంటుంది. ఇక్కడ 50 మీటర్ల వ్యత్యాసం ఉంది. ఏ కోర్టులు గూగుల్ టేక్ అవుట్ ను ఆధారంగా పరిగణించవు. గూగుల్ టేక్ ఔట్ ఎప్పుడూ కచ్చితమైన ప్రదేశాన్ని చూపించదు. 15-20 మీటర్ల వ్యత్యాసం ఉంటుంది. గూగుల్ టేకౌట్ కు ఎలాంటి శాస్త్రీయత లేదు" "హత్య జరిగిన రాత్రి 1.58 కి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఏ2 సునీల్ యాదవ్ ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ చెబుతోందని సి.బి.ఐ అంటోంది. కానీ హత్యకు ముందు రోజు రాత్రి నుంచి ఉదయం 9 గంటలవరకు దస్తగిరి, సునీల్ యాదవ్ కలిసే ఉన్నాము అని దస్తగిరి స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఒక వేళ సునీల్ యాదవ్ లొకేషన్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉంటే దస్తగిరి టేకౌట్ కూడా అక్కడే ఉండాలి కదా" అని అవినాష్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ‘‘అవినాష్ కోసం మా నాన్న ప్రచారం చేశారని సునీతనే చెప్పారు. ఇంకా సిబిఐ ఆరోపిస్తున్న రాజకీయ కోణంలో హత్యకు మోటివ్ ఎక్కడుంది? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సిబిఐ ఎప్పుడయినా ఇంటరాగేషన్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు గతంలో ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఈ ఆదేశాలు ఇస్తే మేం తూచా తప్పకుండా పాటిస్తామని" అవినాష్ న్యాయవాది నివేదించారు. వాదనల అనంతరం అవినాష్ రెడ్డి పిటిషన్‌ను రేపు మధ్యాహ్నం 3.30గంటలకు హైకోర్టు వాయిదా వేసింది. -
అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా.. మరో ఇద్దరికి సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానంద కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ కేసు విచారణ తెలంగాణ హైకోర్టులో గురువారానికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు విచారణ చేపడతామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ రోజు జాబితాలో లేని పిటిషన్లపై విచారణ చేపట్టలేమని తెలిపింది. దీంతో పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టాలని అవినాష్‌రెడ్డి తరపు లాయర్ కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. గురువారం మధ్యాహ్నం విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. మరో ఇద్దరికి సీబీఐ నోటీసులు వైఎస్ వివేకా కేసులో సీబీఐ తాజాగా మరో ఇద్దరిని విచారణకు పిలిచింది. వైఎస్ వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నిస్తోంది. ఇద్దరి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తోంది. వైఎస్ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి స్టేట్ మెంట్‌ను సీబీఐ మంగళవారం రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. (బాబుకు విజనూ లేదు.. విస్తరాకుల కట్టా లేదు: కురసాల కన్నబాబు) కాగా, అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై మంగళవారమే హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉండగా.. సుప్రీంకోర్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి ఇంకా అందకపోవడంతో హైకోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల సారాంశం మేరకే తదుపరి విచారణ ఉంటుందని పేర్కొన్న హైకోర్టు తాజాగా గురువారానికి విచారణ వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. వివేకా హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారంతో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. (అనంతపురం: సీఎం జగన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం) -
సునీత అక్క స్టేట్మెంట్లో పలు అనుమానాలున్నాయి: అవినాష్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వివేకా హత్య కేసులో తనను కుట్రపూరితంగా ఇరికిస్తున్నారని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘కేసును ఛేదించే దానికంటే నన్ను ఇరికించడానికే సీబీఐ విచారణ జరుపుతోంది. నాలాంటి ఎంపీ స్థాయి వ్యక్తినే ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సునీత అక్క సీబీఐకు ఇచ్చిన మొదటి స్టేట్మెంట్కు తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్కు చాలా తేడాలున్నాయి. సునీత అక్క ఇచ్చిన స్టేట్మెంట్లో పలు అనుమానాలున్నాయి.’’ అని అవినాష్‌రెడ్డి అన్నారు. ‘‘హత్య జరిగిన రోజు నేను జమ్మలమడుగు వెళ్లేందుకు సిద్ధమయ్యాను. పులివెందుల రింగ్‌రోడ్ దగ్గరికి వెళ్లే సరికి నాకు శివప్రకాష్‌రెడ్డి నుంచి ఫోన్ వస్తే వచ్చాను. కానీ సీబీఐ ఈ కేసులో ఇంట్లో ఉన్నట్లు ఇరికించే ప్రయత్నం చేస్తోంది. నాతో పాటు వచ్చిన వారిని విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయి’’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు ‘‘హత్య జరిగిన రోజు విలువైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లినట్లు సీబీఐకి దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. సీబీఐ వాటిపై విచారించలేదు. ఉదయం లెటర్, సెల్‌ఫోన్ లభిస్తే దాచిపెట్టి సాయంత్రం పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నా.. నేను ఎలాంటి తప్పు చేయలేదని చాలా నమ్మకంగా ఉన్నాను. మీడియా ఈ కేసు విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. రేపు, ఎల్లుండి పులివెందులలో ఉంటాను’’ అని ఎంపీ అవినాష్‌రెడ్డి వెల్లడించారు. -
వివేకా కేసు దర్యాప్తు జూన్ 30 వరకు పొడిగింపు
► వివేకా హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ హత్య కేసులో దర్యాప్తు గడువును జూన్ 30 వరకు పొడిగించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ గడువు ఏప్రిల్ 30కి ముగియాల్సి ఉంది. తాజా ఉత్తర్వులతో సీబీఐకి మరో రెండు నెలల అదనపు గడువు వచ్చినట్టయింది. ► ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ గురించి ఈ సమయంలో అడగాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయలేదు. ఒక వేళ నిజంగానే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సీబీఐ భావించి ఉంటే.. ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసి ఉండేది. లిఖిత పూర్వకంగా ప్రశ్నలు, సమాధానాలు ఇవ్వాలన్న హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తున్నాం- చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పూర్తి ఆదేశాలు 1. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను పరిశీలించాం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ ఆధారంగా ఆదేశాలిచ్చారు. 2. వైఎస్ వివేకానందారెడ్డి ఆయన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఆయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి సోదరుడు. 3. హత్య గురించి వివేకా పీఏ MV కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటయింది. అలాగే కేసును అడిషనల్ డైరెక్టర్ నేతృత్వంలో సిబిఐ దర్యాప్తు చేస్తోంది. 4. వివేకా కూతురు విజ్ఞప్తి మేరకు కేసును బదిలీ చేశాం. సిబిఐ వేసిన ఛార్జ్‌షీట్‌లో నలుగురి పేర్లు ఉన్నాయి. నవంబర్ 17, 2021న శివశంకర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. జనవరి 31, 2022న సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది 5. ఏప్రిల్ 16న దర్యాప్తుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్‌రెడ్డికి సిబిఐ నోటీసులిచ్చింది. దీనిపై తెలంగాణ హైకోర్టును ఎంపీ అవినాష్‌రెడ్డి ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన హైకోర్టు..లాయర్ సమక్షంలో విచారణ జరపాలని సిబిఐకి సూచించింది. 6. అలాగే ఏప్రిల్ 19 నుంచి 25 వరకు దర్యాప్తుకు హాజరు కావాలని ప్రశ్నలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను మేం కొట్టివేస్తున్నాం. 7. ఈ సమయంలో అరెస్ట్ చేయాలా వద్దా అన్న అంశాల జోలికి వెళ్లడం లేదు. నిజంగా అవినాష్‌రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయాలని భావించి ఉంటే ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేవాళ్లు. సిబిఐ కూడా ఒక పద్ధతిలో దర్యాప్తు చేస్తోంది. సీబీఐ అరెస్టు చేస్తుందని మీరెందుకు ఊహిస్తున్నారు?. 8. కేసు దర్యాప్తు గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నాం. 9. ఏప్రిల్ 25న తెలంగాణ హైకోర్టు ముందుకు రానున్న పిటిషన్ లో ముందస్తు బెయిల్ కు సంబంధించి ఎంపీ అవినాష్ తన వాదనలు వినిపించుకోవచ్చు 10. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రభావం అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ప్రభావం చూపరాదు. వైఎస్ అవినాష్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు అవినాష్ రెడ్డి ఎంపీగా బాధ్యత గల పదవిలో ఉన్నారు, ఎక్కడికి వెళ్లడం లేదు సిబిఐ ముందు ఇప్పటివరకు ఏడుసార్లు విచారణకు హాజరయ్యారు విచారణకు అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నాడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులలోని పేరా 18 తప్పుడు గా అన్వయం చేస్తున్నారు అవినాష్ రెడ్డి ఎలాంటి సాక్ష్యం ధ్వంసం చేయలేదు, పైగా అన్ని వైపులా అవినాష్ పై దాడి జరుగుతోంది ► అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు(మంగళవారం) తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాము ఇవాళ ఇచ్చిన తీర్పు ప్రభావం ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణపై ఉండకూడదని పేర్కొంది. ఇదీ చదవండి: ఏది నిజం? వివేకా హంతకులను నడిపిస్తుందెవరు? -
వివేకా రెండో భార్య షమీమ్ సంచలన స్టేట్మెంట్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన రెండో భార్య షమీమ్ స్టేట్మెంట్ను సీబీఐ అధికారులు తీసుకున్నారు. ఈ సందర్బంగా సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో షమీమ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో షమీమ్.. సీబీఐకి మూడు పేజీల స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్లో వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. ఇక, స్టేట్మెంట్లో వివేకా హత్యకు ముందు జరిగిన పరిణామాలను షమీమ్ వివరించారు. షమీమ్ తన స్టేట్మెంట్లో 2010 అక్టోబర్ 3న వివేకాతో తనకు వివాహం జరిగిందన్నారు. 2015లో తమకు షేహన్ షా(కొడుకు) జన్మించినట్టు స్పష్టం చేశారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతా రెడ్డి బెదిరించేది. హత్యకు కొన్ని గంటల ముందు వివేకా.. నాతో ఫోన్లో మాట్లాడారు. బెంగళూరు భూ సెటిట్మెంట్లో 8 కోట్లు వస్తాయని వివేకా చెప్పారు. మా వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు, మమ్మల్ని దూరం పెట్టారు. షేహాన్ షాను రాజకీయంగా పైకి తీసుకొస్తా అని వివేకా చెప్పేవారు. పలు మార్లు శివ ప్రకాష్ రెడ్డి నన్ను బెదిరించారు. ఆ కారణంగానే చనిపోయాడని తెలిసినా రాలేకపోయాను. అన్యాయంగా వివేకా చెక్ పవర్‌ను తొలగించారు అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయ్’ -
సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి ఊరట
-
ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డికి వైఎస్సార్ సీపీ తరఫున టిక్కెట్టిచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గెలిచేంత మెజారిటీ ఉన్నా సరే... కుట్రపూరితంగా ఆయన్ని ఓడించి.. టీడీపీ తరఫున బీటెక్ రవిని గెలిపించింది చంద్రబాబు నాయుడు. ఆయన ఉంటే జిల్లాలో తాము రాజకీయంగా ఏమాత్రం ఎదగలేమని భావించింది టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి. ఆయన్ని ఏకంగా గొడ్డలితో నరికి నేను హత్య చేశాను అని దర్యాప్తు సంస్థల ఎదుటే సాక్ష్యం ఇచ్చిన దస్తగిరి. వీళ్లంతా ఎవరు? వివేకానందరెడ్డిని వ్యక్తిగతంగా, రాజకీయంగా అంతం చేసిన ముఠా సభ్యులు. మరి వీళ్లంటే వివేకానందరెడ్డి కుటుంబానికి సహజంగానే తీవ్ర ఆగ్రహం ఉండాలి కదా? కానీ ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, దస్తగిరి... బాబు కోసం పనిచేసే ‘ఈనాడు’.. దాని తోకలు.. వీళ్లంతా ఇపుడు వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితులైపోయారు. అంతా కలిసే కోర్టులకెళుతున్నారు. ‘నేనే నరికి చంపా’ అన్న దస్తగిరి బెయిలుకోసం దరఖాస్తు చేస్తే వ్యతిరేకించ లేదు. దర్జాగా బయటే తిరుగుతున్నాడతను. ఎల్లో మీడియాకు పతాక స్థాయి ఇంటర్వ్యూలిస్తున్నాడు. వంకర మాటల ఓపెన్హార్టులో బీటెక్ రవి ప్రవచనాలు చెప్తున్నాడు. వీళ్లంతా కలిసి హంతకుడిని కూడా వదిలేసి తమ రాజకీయ ప్రత్యర్థుల్ని దీంట్లో ఇరికించడానికి వెంటాడుతున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఎవరికి అర్థం కానిది ఈ నాటకం? వివేకానందరెడ్డి హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన ఈ ఎల్లో మాఫియాను ఛేదిస్తే తప్ప హత్య వెనక ఉన్న వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు. 2017లో వివేకాపై చంద్రబాబు రాజకీయ కుట్ర.. మెజార్టీ సభ్యులు ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి వైఎస్ వివేకానందరెడ్డిని రాజకీయంగా అంతం చేయడమే కాదు భౌతికంగానూ లేకుండా చేయాల్సిన అవసరం కచ్చితంగా టీడీపీకే ఉందన్నది బహిరంగ రహస్యం. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ బలోపేతానికి ఆయనే అడ్డంకిగా నిలబడ్డారు. అందుకే 2017లో వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వివేకాను కుట్రపూరితంగా ఓడించారు చంద్రబాబు. స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకానందరెడ్డిని అభ్యర్థిగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందినవారే ఉండటంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని అంతా భావించారు. వివేకాను ఓడిస్తే.. నాటి విపక్ష నేత జగన్‌ను ఓడించినట్లేనని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలు పెట్టి తమ వైపు లాక్కున్నారు. దీనికి నాటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి పూర్తిగా సహకరించారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నీతిబాహ్యంగా టీడీపీకి అమ్ముడుపోయి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్ భారీగా డబ్బులు వెదజల్లి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టి దొడ్డిదారిలో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించారు. 2019... వివేకా భౌతికంగా అంతం 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబులో మళ్లీ గుబులు మొదలైంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే సీటును గెలిచిన టీడీపీకి ఈ సారి అది కూడా కష్టమేనని అర్థమైంది. కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ లోక్‌సభ స్థానానికి పార్టీ ఎన్నికల ఇన్చార్జ్గా అప్పటికే వైఎస్ వివేకానందరెడ్డిని నియమించారు. పార్టీ గెలుపు కోసం ఎన్నికల వ్యూహాలు పన్నుతూ...అందర్నీ కలుపుకుంటూ వెళ్లారు వివేకా. దాంతో చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి బెంబేలెత్తారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు ఖరారు చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌ను కూడా ఆదినారాయణ రెడ్డి కొడుక్కి ఇచ్చారు. వివేకా ఉంటే ఎప్పటికీ తాము రాజకీయంగా పైచేయి సాధించలేమన్నది బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే వివేకా హత్యకు గురయ్యారు. మరి ఇది టీడీపీ కుట్ర కాదా? వివేకా హత్యకు ముందు టీడీపీ నేతలతో కొందరి రహస్య సమావేశాలు... ఆయన హత్య తరువాత టీడీపీ నేతలు వ్యవహరించిన తీరే దీనికి ఊతమిస్తోంది. హత్య అనంతరం... అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పదేపదే కడప ఎస్పీకి ఫోన్ చెయ్యడం... బీటెక్ రవితో కూడా నేరుగా సంభాషించటం... ఎప్పటికప్పుడు జరుగుతున్న వ్యవహారాలను నాటి సీఎం చంద్రబాబుకు అప్డేట్ చెయ్యటం.. ఇవన్నీ కాదనలేని వాస్తవాలు. అంటే... అంతా తాము అనుకున్నట్లే జరుగుతోందా? లేదా.. అన్నది బాబుకు ఏబీ అప్డేట్ చేశారన్నది నిపుణుల మాట. హత్యకు ముందు... వివేకా అనుచరుడితో బీటెక్ రవి భేటీ ఎందుకో...! తనకు దీర్ఘకాలంగా అనుచరుడిగా ఉన్న కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డితో వివేకాకు ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు వచ్చాయి. దాంతో పరమేశ్వరరెడ్డి కక్ష పెంచుకుని పులివెందుల నియోజకవర్గంలో వివేకా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ నేత బీటెక్ రవితో చేతులు కలిపాడు. వివేకా హత్యకు అప్పటికే పన్నాగం సిద్ధం కావడంతో... ముందుగా పరమేశ్వరరెడ్డి ఎలిబీ సృష్టించుకోవడానికి వివేకా హత్యకు కేవలం రెండు రోజుల ముందే అంటే 2019 మార్చి 13న అనారోగ్యం సాకుతో కడపలోని సన్‌రైజ్ ఆస్పత్రి ఐసీయూలో చేరాడు. కానీ ఎవరికీ తెలియకుండా 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యాడు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి... ఆ తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. ‘గుండె పోటు’ కథకుడు శివప్రకాశ్ రెడ్డి... వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయటమే కాదు. ఆ హత్యలో ఇతరుల్ని ఇరికించడానికి కూడా ఎల్లో గ్యాంగ్ పకడ్బందీ కుట్ర పన్నిందని చెప్పొచ్చు. ఎందుకంటే వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే తప్పుడు ప్రచారం వెనుక ఆయన పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. శివప్రకాశ్‌రెడ్డి మొదట ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. ‘‘సిగరెట్లు ఎక్కువుగా తాగుతారు కదా! అందుకే ఇలా జరిగి ఉండొచ్చు’’ అని ఆదినారాయణరెడ్డి ఆయనతో చెప్పారు. ఈ విషయాన్ని ఆదినారాయణ రెడ్డి స్వయంగా టీవీ ఛానెళ్ల ఎదుట వెల్లడించారు. అంతేకాదు. ఆదినారాయణరెడ్డికి చెప్పిన శివప్రకాశ్ రెడ్డే... ఎన్నికల ప్రచారం నిమిత్తం ఉదయాన్నే జమ్మలమడుగు వెళుతున్న ఎంపీ అవినాశ్‌రెడ్డికి కూడా వివేకా గుండెపోటు విషయం చెప్పారు. దాంతో అక్కడి నుంచే వెనుదిరిగి... అవినాశ్ రెడ్డి వివేకా ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ వివేకా పీఏ కృష్ణారెడ్డితో పాటు పలువురు ఉన్నారు. ఇలా శివప్రకాశ్ రెడ్డి చెప్పిన గుండెపోటు విషయమే... టీవీల్లో బ్రేకింగ్ న్యూస్‌గా వచ్చింది. ఆయన హత్యకు గురయ్యారనే నిజం బయటపడేలోపే ఈ తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చారు. మరి శివప్రకాశ్‌రెడ్డి, ఆది నారాయణరెడ్డి ఈ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు చేశారు? దీన్ని ఛేదిస్తే హత్య కేసులో అసలు కుట్ర బయటపడుతుంది. రక్తపు మరకల లేఖ.. గోప్యంగా ఉంచమన్న కుమార్తె, అల్లుడు.. వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకుగాను ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి పక్కా ప్లాన్‌తోనే వ్యవహరించారు. అదెలాగంటే... వైఎస్ వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించారు. వాళ్లు బెదిరించడంతో... డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదటగా అంటే ఆ రోజు ఉదయం 6.10లోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి... ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మరకలున్న ఆ లేఖ చూసినవారెవరికైనా... వివేకాది హత్యేనని తెలిసిపోతుంది. కానీ లేఖ విషయాన్ని కృష్ణారెడ్డి చెప్పగానే... తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవ్వరికీ ఇవ్వవద్దని, దాచి ఉంచాలని కృష్ణారెడ్డితో నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఆ తరవాతే అసలు పన్నాగానికి తెరలేచింది. శివ ప్రకాశ్ రెడ్డి ద్వారా అవినాశ్‌రెడ్డికి చెప్పించారు. అవినాశ్ రెడ్డి కాల్ డేటా చూస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుంది కూడా. అవినాశ్ అక్కడకు చేరాక కూడా ఆయనకు లేఖ చూపించలేదు. లేఖ ఉందన్న విషయం కూడా చెప్పలేదు. అంటే... అన్నీ పథకం ప్రకారమే చేశారు. వాస్తవానికి వారు గనక ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇవ్వాలని చెప్పి ఉంటే వివేకా హత్యకు గురయ్యారన్నది వెంటనే అందరికీ తెలిసిపోయేది. కనీసం అక్కడకు చేరుకున్న అవినాశ్‌కు చూపించినా హత్య సంగతి అర్థమయ్యేది. హత్య జరిగిందని తెలిస్తే ఎవ్వరూ మృతదేహాన్ని తాకేవారే కాదు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. బహుశా! అంతా తామనుకున్నట్టే జరిగిందనో ఏమో!! ఆ రోజు నుంచీ ఇప్పటివరకూ చంద్రబాబు నాయుడు ఈ హత్య గురించి ఎక్కడ మాట్లాడినా... మృతదేహానికి బ్యాండేజీ ఎవరు కట్టారు? రక్తపు మరకలు ఎవరు తుడిచారు? అనే ప్రశ్నలే వేస్తున్నారు. మొత్తం టీడీపీ, ఎల్లో మీడియా.. అందరూ ఇదే విషయమై దుష్ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప అసలు గుండెపోటు అని చెప్పిందెవరు? వారికెలా తెలిసింది? అసలు లేఖను ఎందుకు గోప్యంగా ఉంచారు? అలా ఎందుకు ఉంచమన్నారు? అనే విషయాలను మాత్రం ప్రచారంలోకి రానివ్వటం లేదు. ఇదీ.. కుట్ర వెనక అసలు కథ. ఆ రోజు మధ్యాహ్నం 1గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆ లేఖతోపాటు వివేకా సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. ఆ లేఖను చదివారు కానీ... వెంటనే పోలీసులకు ఇవ్వలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నదే ఈ హత్య కేసులో కీలకం. చంద్రబాబు మంత్రాంగం... వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన రోజు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతోనూ టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డితోను, బీటెక్ రవితోను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు. కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ఏబీవీ ఎందుకు అంతగా తాపత్రయ పడ్డారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ... తాను జరిపిన దర్యాప్తులో అసలు లేఖ విషయమే పట్టించుకోకపోవటం గమనార్హం. వివేకా మరణిస్తే ఎవరికి ప్రయోజనం... ! ఆయన రెండో వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు వివేకానందరెడ్డి మరణిస్తే ఎవరికి లాభం అన్నది ఈ కేసులో కీలకం. దాంతో అన్ని వేళ్లూ వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలపైకే వెళ్తున్నాయి. తాను రెండో వివాహం చేసుకున్న షమీమ్ అనే మహిళకు పుట్టిన కుమారుడికి ఆస్తిలో భాగం ఇవ్వాలని ఆయన భావించారు. తన రాజకీయ వారసుడిగా చేస్తానన్నది ఆ జిల్లాలో అందరికీ తెలుసు. అందుకే ఆ కుటుంబంలో ఆస్తి వివాదాలు, రాజకీయ వారసత్వ వివాదాలు తీవ్రస్థాయికి చేరాయి. వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రంగా గొడవపడి ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్‌లో ఉంటున్నారు. సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బావగారు శివ ప్రకాశ్‌రెడ్డి షమీమ్ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీమ్, వైఎస్ సునీత పరస్పరం దూషించుకుంటూ చేసుకున్న వాట్సాప్ చాటింగ్‌ను కూడా అప్పట్లోనే సిట్ బృందం వెలికితీసింది. షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని... ఆమె కుమారుడిని హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నా...అవ్వడం లేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి జీవించి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదికే ఎక్కువ లాభమన్నది గమనించాల్సిన అంశం. ఆస్తితో పాటు రాజకీయ వారసత్వం కూడా తమకే వస్తుందన్నది వారి ఉద్దేశంగా తెలుస్తుంది. హంతకుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చింది ఎవరు...!? వైఎస్ వివేకాను గొడ్డలితో స్వయంగా నరికాను అని చెప్పిన దస్తగిరి అప్రూవర్‌గా మారడంతోనే ఈ కేసు దర్యాప్తు దారితప్పింది. అతన్ని అప్రూవర్‌గా మార్చింది ఎవరనే అంశమూ ఇక్కడ కీలకం. దస్తగిరి తరచు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో భేటీ అవుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితో సన్నిహితంగా ఉంటున్నారు. ఎల్లో మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్నాడు. అంటే వివేకా కుటుంబం, టీడీపీ నేతల పన్నాగంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్‌గా మార్చినట్టు స్పష్టమవుతోంది. అప్పటివరకు పేదరికంలో కొట్టుమిట్టాడిన దస్తగిరి.. అప్రూవర్‌గా మారిపోగానే ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. కారు, బంగ్లా, డ్రైవర్... అన్నీ వచ్చేశాయి. మరి వీటిని ఇస్తున్నదెవరు? ఎందుకు ఇస్తున్నారు? సీబీఐ అధికారులు దస్తగిరిని ఢిల్లీకి తీసుకువెళ్లి మరీ అప్రూవర్‌గా మార్చి వాంగ్మూలం నమోదు చేశారు. అందులో వాస్తవం ఎంతన్నది పట్టించుకోకుండా ఆ వాంగ్మూలం ఆధారంగానే ఏకపక్షంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. హంతకుడు ఎల్లో గ్యాంగ్ హీరోనా...! వివేకాను హత్య చేసిన దస్తగిరిని అటు టీడీపీ ఇటు టీడీపీ అనుకూల పచ్చ మీడియా హీరోగా చూపించేందుకు బరితెగించి వ్యవహరిస్తున్నాయి. ఈనాడు,ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5 చానళ్లు దస్తగిరిని ఇంటర్వ్యూలు చేస్తూ అతన్ని ఓ సెలబ్రిటీగా చూపిస్తున్నాయి. వైఎస్సార్ కుటుంబంపై అక్కసుతో పాత్రికేయ విలువలను దిగజారుస్తూ ఓ హంతకుడిని హీరోగా చూపించేందుకు పడరానిపాట్లు పడుతున్నాయి. తన తండ్రి హంతకుడిని ఓ సంఘ సంస్కర్తగా టీడీపీ, ఎల్లో మీడియా చూపిస్తూ ఉంటే సునీత కనీసం అభ్యంతరం వ్యక్తం చేయకపోవటమే ఇక్కడ దారుణం. ఇదే బాబు మార్కు పన్నాగం... చంద్రబాబు ఎవరినైనా అడ్డుతొలగించుకోవాలంటే తనదైన శైలిలో పన్నాగం పన్నుతారు. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి సొంతం కుటుంబంలోనే చిచ్చుపెట్టి సొంతవారితోనే కథ నడిపిస్తారని ఎన్టీఆర్ విషయంలో రుజువైంది. ఎన్టీ రామారావును ఆయన సొంత పిల్లలతోనే ఛీకొట్టించి మరీ పదవి నుంచి దించేసి తాను అడ్డదారిలో సీఎం అయ్యారు. అదే రీతిలో వివేకానందరెడ్డికి ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డిలతోనే పొగ పెట్టించారు. టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిల సహకారంతో కుటుంబ సభ్యులే పాత్రధారులుగా గుట్టుచప్పుడు కాకుండా కథ ముగించారు. కీలక అంశాలను విస్మరిస్తున్న సీబీఐ సున్నితమైన వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ ఆది నుంచీ దారి తప్పింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు...ఆయన లైంగిక అక్రమ సంబంధాలతో ఆయనపై కక్ష పెంచుకున్నవారు... వివేకాను సెటిల్మెంట్లకు వాడుకున్న స్నేహితులు, అనుచరులు...వివేకాను అడ్డుతొలగించుకుంటేనే రాజకీయంగా మనుగడ అని భావించిన చంద్రబాబు, ఆది నారాయణ రెడ్డి, బీటెక్ రవి... ఇలా ఈ కేసులో పచ్చ కుట్రను స్పష్టం చేస్తున్న అనేక కోణాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. కానీ సీబీఐ మాత్రం హంతకుడిని ఎవరో వ్యూహాత్మకంగా అప్రూవర్‌గా మారిస్తే... ఆ వాంగ్మూలం పట్టుకునే ఈ కేసు దర్యాప్తు గోదారిని ఈదేందుకు యత్నిస్తుండటం సీబీఐ తీరునే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. -
అవినాష్ కోసం వివేకా ప్రచారం చేశారు: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా 2021 దాకా జరిగిన సీబీఐ దర్యాప్తులో ఎలాంటి ఆధారాల్లేవన్న విషయాన్ని తెలంగాణ హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. వివేకా కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ అవినాష్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. మంగళవారం హైకోర్టు ఆయనకు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలని అవినాష్‌కు చెబుతూనే.. ఏప్రిల్ 25వ తేదీ దాకా అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ సీబీఐను ఆదేశించింది హైకోర్టు. అంతేకాదు ఈ పిటిషన్‌పై మధ్యంతర ఉత్వర్వుల్లో పలు కీలకాంశాలను ప్రస్తావించింది బెంచ్. వివేకా హత్యకు ఐదు కారణాలున్నాయని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. రాజకీయంగా పోటీ, ఆస్తుల వివాదం, అక్రమ సంబంధాలు, కొందరితో విభేధాలు, సిబ్బందితో వివాదాలని పేర్కొన్నారు. కానీ, వివేకా మాత్రం అవినాష్‌రెడ్డి కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. పైగా అవినాష్‌రెడ్డి అప్పటికే ఎంపీగా ఉండి.. రెండోసారి పోటీ చేస్తున్నారు. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరి వాంగ్మూలం మేరకే అవినాష్‌పై కేసు నమోదు చేశారు. మరో నిందితుడు దస్తగిరికి చెప్పిన విషయాన్ని పరిగణించారు. హత్య వెనుక ఎవరో పెద్దవాళ్లున్నారని ఏ1 అన్నాడన్నది దస్తగిరి కథనం. ఎవరో ఏదో అన్నారని.. దాని ఆధారంగా అభియోగం మోపడం హియర్ సే(సాధారణంగా న్యాయస్థానంలో సాక్ష్యంగా అనుమతించబడదు) అవుతుంది. పైగా 2021 వరకు జరిగిన సీబీఐ దర్యాప్తులో అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. సీబీఐ కూడా ఇప్పటి వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయలేదు. కేవలం నోటీసులు ఇచ్చి మాత్రమే విచారించింది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడమన్న ఆప్షన్ చిట్ట చివరిదై ఉండాలి. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను ఈ కోర్టు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎవరిమీద ఏ ఆరోపణలున్నాయి? దానికి ఆధారాలేమున్నాయి?. ఏప్రిల్ 25వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దు. అవినాష్‌రెడ్డి విచారణ సందర్భంగా ప్రశ్నలను ముందుగా ఇచ్చి.. లిఖితపూర్వకంగా జవాబులు తీసుకోవాలి. దర్యాప్తు ప్రక్రియను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేయాలి. ఈ కేసులో తుది ఉత్తర్వులు ఏప్రిల్ 25న ఇస్తాం అని తెలంగాణ హైకోర్టు ఇరు వర్గాలకు స్పష్టం చేసింది. అంతేకాదు.. కేసు దర్యాప్తుపై ఇప్పటికే సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, దర్యాప్తును ఏప్రిల్ 30 లోపు పూర్తి చేయమని సుప్రీంకోర్టు సూచించిందని కోర్టు గుర్తు చేసింది. అలాగే.. మధ్యంతర ఉత్వర్వుల్లో సిద్దారాం vs మహారాష్ట్ర కేసును ఉదహరించింది. -
అవినాశ్‌ను అరెస్టు చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ నెల 25వ తేదీ వరకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఆయన రోజూ సీబీఐ కార్యాలయానికి వస్తారని, ఏ విచారణ చేయాలన్నా చేపట్టవచ్చని సూచించింది. అయితే సీబీఐ అడిగే ప్రశ్నలు లిఖితపూర్వకంగా ఉండాలని... వీడియో, ఆడియో రికార్డు చేయాలని స్పష్టం చేసింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని, 25వతేదీలోగా సాక్ష్యాలు సేకరించాలని పేర్కొంటూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ నాటికి అన్ని అంశాలను పరిశీలించి తుది ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 30లోగా విచారణ పూర్తి చేయాలని సీబీఐకి నిర్దేశించింది. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆ వివరాలు ఇవీ... ఏది ప్రామాణికం..? ‘హత్య జరిగిన రోజు నిందితుల కదలికలకు సంబంధించి భాస్కర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో ఒకలా.. ఏ–4 దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో మరోలా.. సీబీఐ గూగుల్ టేకౌట్లో ఇంకోలా ఉంది. ఇందులో ఏది ప్రామాణికం? దేనిని పరిగణలోకి తీసుకోవాలి? కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడితే ఈనాడు పత్రిక ప్రచురించింది. గతంలో ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్సింగ్ను పలుకుబడితో మార్చేశారంటూ వ్యాఖ్యలు చేశాడు. దీన్ని సీబీఐ సమర్థిస్తుందా? విచారణాధికారిని మార్చింది సుప్రీంకోర్టు. అంటే దస్తగిరి ఉద్దేశం సుప్రీంకోర్టు ద్వారా మార్పించారనా? అత్యున్నత న్యాయస్థానంపై ఇలాంటి వ్యాఖ్యలను స్వాగతిస్తామా? ఈ కేసులో ఇంప్లీడ్ అయిన సునీత న్యాయవాది దస్తగిరి వ్యాఖ్యలను సమర్థించడం సరికాదు. అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, మరో ఇద్దరు తమ వెనుక ఉన్నారని గంగిరెడ్డి పేర్కొన్నట్లు దస్తగిరి చెప్పాడు. అయితే గంగిరెడ్డి మాత్రం తాను ఎవరి పేర్లు చెప్పలేదని వాంగ్మూలంలో పేర్కొన్నాడు. కిరాయి హంతకుడు చెప్పిన ఓ మాటను పట్టుకుని అవినాశ్, భాస్కర్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించేందుకు సీబీఐ శతవిధాలా ప్రయత్నిస్తోంది. గూగుల్ కూడా సర్టిఫికెట్ ఇవ్వదు.. వైఎస్ వివేకా హత్య వెనుక ఉన్న ప్రధాన కారణాలపై సీబీఐ దర్యాప్తు సాగించడం లేదు. గంగిరెడ్డితో వివేకాకు భూమికి సంబంధించిన వివాదం ఉంది. తనకు రావాల్సిన వాటా ఇవ్వడం లేదని గంగిరెడ్డి ఆగ్రహంతో ఉండేవాడు. వివేకా రెండో భార్య, ఆమె కుమారుడి ఉదంతంలో మొదటి భార్య, కుమార్తె సునీత, అల్లుడితో తీవ్ర విభేదాలున్నాయి. సునీల్ యాదవ్(ఏ–2) తల్లిని వివేకా అసభ్యకరంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలున్నాయి. వివేకాకు కొందరు రాజకీయ శత్రువులు కూడా ఉన్నారు. ఈ నాలుగు అంశాలపై సీబీఐ విచారణ జరపలేదు. సీబీఐ దర్యాప్తు అంతా అవినాశ్, భాస్కర్‌రెడ్డిని ఇరికించేందుకే సాగుతూ ఇతర కారణాల జోలికి వెళ్లడం లేదు. గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికం కాదు. ఇది సీబీఐకి కూడా తెలిసినా అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని ఇరికించే ఉద్దేశంతో దాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికమని గూగుల్ కూడా అధికారికంగా సర్టిఫికెట్ ఇవ్వదు.. ఇప్పటివరకు ఇవ్వలేదు కూడా. అలాంటిది సీబీఐ దాన్ని ఆధారంగా పేర్కొనడం తప్పుబట్టాల్సిన అంశం. ఆధారాలు లేకుండా అరెస్టులు... 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమికి అవినాశ్, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కారణమని వివేకా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రిమాండ్ పిటిషన్లో సీబీఐ పేర్కొంది. దీనికి ఎలాంటి ఆధారం, సాక్ష్యం లేదు. ఎలాంటి ఆధారం లేకుండా ఓ యువ ఎంపీని అరెస్టు చేస్తే ఆయన భవిష్యత్, పరువు ప్రతిష్టలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కడప పార్లమెంట్ స్థానం నుంచి అవినాశ్ రెండుసార్లు ఎంపీగా పోటీ చేశారు. వివేకా జీవించి ఉండగా అవినాశ్ విజయం కోసం ప్రచారం నిర్వహించారు. గెలుపు బాధ్యతంతా ఆయనే తీసుకుని పనిచేశారు. అత్యంత సన్నిహితులైన వివేకా, అవినాశ్ మధ్య సంబంధాలు ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగా హత్యలు చేసుకునే స్థాయికి వెళ్లాయనడం సరికాదు. సీబీఐ కంటే ముందు సిట్ మెటీరియల్ అంతా సేకరించింది. దీన్ని సీబీఐకి అందజేసింది. దస్తగిరి బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో గానీ, అప్రూవర్‌గా పేర్కొన్న సమయంలో గానీ ఈ మెటీరియల్‌ను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టలేదు. అసలు హత్యలో కీలక పాత్ర పోషించిన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిని వదిలేశారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుకు ఎందుకు పిటిషన్ వేయలేదని న్యాయస్థానం ప్రశ్నించడంతో తర్వాత దాఖలు చేశారు. దీనిపై కూడా వాయిదాలు కోరుతూ జాప్యం చేస్తూ వస్తున్నారు. హత్య చేసిన తర్వాత తాను బీరువా పగుల కొట్టానని, గంగిరెడ్డి ఏవో డాక్యుమెంట్ల కోసం వెతికి తీసుకెళ్లాడని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. ఆ డాక్యుమెంట్లు ఏమిటి? ఎక్కడి తీసుకెళ్లాడో దర్యాప్తు అధికారులు ఇంతవరకు తెలుసుకోలేదు. అసలు మెటీరియల్‌ను దర్యాప్తు అధికారులు ఎందుకు పరిశీలించడం లేదో తెలియదు. వివేకా మృతి విషయాన్ని ఆయన అల్లుడికి చెప్పింది ఎవరు? వారికి ఈ విషయం ఎలా తెలిసింది? దీని గురించి కూడా విచారణ చేయడం లేదు. ఆధారాలు లేకుండానే భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు.. తన వీడియో, ఆడియో రికార్డును చేస్తున్నారో లేదో చెప్పాలని అవినాశ్ పలుమార్లు సీబీఐని కోరారు. ఓ చిన్న నోట్ ఇచ్చేందుకు కూడా వారు నిరాకరించారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించి ఆ వివరాలు తెలుసుకోవాల్సి వచ్చింది. విలువైన కోర్టు సమయం వృథా అయింది. దర్యాప్తు పారదర్శకంగా లేదు. విచారణ ముగిసిందని భాస్కర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అవినాశ్‌కు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు వారి వద్ద ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేవు.. ఒక్క దస్తగిరి వాంగ్మూలం మినహా. సీబీఐ విచారణకు సహకరించేందుకు అవినాశ్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు, ఎక్కడికి పిలిచినా ఆయన వస్తారు. ఇప్పటికే పలుమార్లు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. దాదాపు 20 గంటలకుపైగా విచారించి 161 సీఆర్పీసీ కింద స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. అవినాశ్‌ను అరెస్టు చేయాలని సీబీఐ అతృతతో ఉంది. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలి’ ఇంకా సాక్ష్యాలు సేకరిస్తున్నాం: సీబీఐ పీపీ ‘వివేకా హత్య వెనుక కుటుంబ తగాదాలు, వ్యాపార తగాదాలు లేవు. అవినాశ్‌రెడ్డి విచారణకు సహకరించడం లేదు. ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేశారు. ఇంకా కొందరిని విచారించాల్సి ఉంది. సమాచారం, డాక్యుమెంట్లు సేకరిస్తున్నాం. గంగిరెడ్డి తీసుకువెళ్లిన డాక్యుమెంట్లను సేకరించలేదు’ అని సీబీఐ పీపీ తెలిపారు. కిక్కిరిసిన కోర్టు హాల్లో సుదీర్ఘ వాదనల అనంతరం అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. -
‘సమాచారం ఇచ్చిన వ్యక్తిని ఎందుకు విచారించలేదు?’
హైదరాబాద్: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్ర లేకపోయినా అనూహ్యంగా సీబీఐ టార్గెట్ చేసిందని తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా వాదనలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అవినాష్ తరఫు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ.. ‘అప్రూవర్‌గా మారిన దస్తగిరి కడపలో కూర్చొని ట్రయల్స్ చేస్తున్నాడు. ఇక్కడ కోర్టులో చేసిన వాదనలకు అక్కడ కౌంటర్ కామెంట్స్ చేస్తున్నాడు. అవినాష్‌పై, ప్రభుత్వంపై దస్తగిరి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌ని పలుకుబడితో..ట్రాన్స్ఫర్ చేశాడని ఆరోపణలు చేశాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు అధికారిని మార్చారు. తప్పుడు ఆరోపణలు చేసిన దస్తగిరిని సునీత న్యాయవాది సమర్ధిస్తున్నాడు. సీబీఐ ఆఫీసర్ రామ్ సింగ్‌ను మార్చింది సుప్రీం కోర్టు.. అవినాష్ రెడ్డి అని ఎలా అంటారు..?, నేరం చేశారు అనడానికి సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కుటుంబ గొడవలు, భూ వివాదాలు, వివాహేతర సంబంధాలు వివేకా హత్యకు కారణమై ఉండొచ్చు. సీబీఐ ఇప్పటి వరకు 2 చార్జీ షీట్లు వేసింది. మొదటి చార్జిషీట్‌కు ముందే దస్తగిరి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనూహ్యంగా అవినాష్‌ను సీబీఐ టార్గెట్ చేసింది. ఎక్కడా అవినాష్ రెడ్డి పాత్ర లేదు’ అని తెలిపారు. సమాచారం ఇచ్చిన వ్యక్తిని ఎందుకు విచారించలేదు? వివేకా చనిపోయిన రోజు ఉదయం గం. 6.26ని.లకు అవినాష్‌కు వివేకా చనిపోయినట్లు చెప్పింది శివప్రకాష్‌రెడ్డి. వాళ్లు ఫోన్ చేసే వరకూ అవినాష్‌కి వివేకా మరణం గురించి తెలియదు. అవినాష్ రెడ్డికి సమాచారం ఇచ్చిన వారిని సీబీఐ ఎందుకు విచారించడం లేదు. ఆరోజు పలువురు వ్యక్తులు వివేకా ఇంట్లోనే ఉన్నారు. గుండెపోటు అని రూమర్స్ ప్రచారం జరిగింది. ఆ రూమర్స్ ప్రకారమే గుండెపోటు అని అవినాష్‌రెడ్డి చెప్పారు’ అని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు స్పష్టం చేశారు. -
అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మళ్లీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి విచారణను మళ్లీ వాయిదా వేసింది సీబీఐ. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతుండడంతో రేపు(బుధవారం) ఆయన్ని విచారించాలని సీబీఐ నిర్ణయించుకుంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని కోఠి సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణ జరగాల్సి ఉంది. అయితే.. హైకోర్టులో విచారణ పూర్తికాలేదన్న విషయం కోర్టు దృష్టికి వెళ్లింది. ఈ తరుణంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సైతం కోర్టులోనే ఉండడంతో.. ఎవరు ప్రశ్నిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో విచారణను రేపు ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు దర్యాప్తు సంస్థ, కోర్టుకు తెలియజేసింది. అయినా.. సీబీఐ తీరు మారలేదు -
నోటీసులిచ్చి అరెస్టులా?
సాక్షి, హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాతే విచారణకు పిలవాలని, అప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. వాదనలు విన్న అనంతరం అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను నేటికి వాయిదా వేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ ఎంపీ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సురేందర్ సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వైఎస్ వివేకా హత్యకు ప్రధానంగా నాలుగు కారణాలున్నాయని న్యాయస్థానానికి నివేదించారు. ఒకటి.. ఆర్థికపరమైన విభేదాలు, రెండు.. కుటుంబ తగాదాలు, మూడోది.. మహిళలతో అక్రమ సంబంధాలు, నాలుగు.. రాజకీయ అంశాలున్నట్లు తెలిపారు. ఇతర కోణాలు చాలా ఉన్నాయి.. ‘కిరాయి హంతకుడు దస్తగిరి వాంగ్మూలం మినహా ఎలాంటి ఆధారం లేకుండా అరెస్టులు చేయడం చట్టవిరుద్ధం. ఇప్పటివరకు మెటీరియల్‌ను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టలేదు. 2021 అక్టోబర్ 26న సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది. ఏ–1 నుంచి ఏ–4 వరకు నిందితులుగా పేర్కొంది. 2022 జనవరి 31న అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తూ ఏ–1 నుంచి ఏ–5 వరకు నిందితులుగా పేర్కొంది. సీఆర్పీసీ 160 కింద పిటిషనర్‌కు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10, మార్చి 14వ తేదీల్లో 160 సీఆర్పీసీ కింద విచారణకు హాజరైన పిటిషనర్ వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసింది. తనను సీబీఐ చిత్రహింసలకు గురిచేస్తోందని నిజం చెబుతానని దస్తగిరి పేర్కొనడంతో గంగిరెడ్డి వారించారని, భయపడాల్సిన పనిలేదని, మన వెనుక అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నారని చెప్పినట్లు సీబీఐ పేర్కొంది. అంటే దస్తగిరిని చిత్రహింసలకు గురి చేసినట్లు తెలుస్తోంది. అందుకే సీబీఐ చెప్పినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. 2022 ఆగస్టులో సీబీఐకి అనుకూలంగా దస్తగిరి వాంగ్మూలం ఇవ్వడంతో రెండు నెలలు తిరగకుండానే అక్టోబర్‌లో ముందస్తు బెయిల్‌కు పూర్తిగా సహకరించింది. పిటిషనర్ పార్లమెంట్ సభ్యుడు. ఆయన పరువుకు భంగం కలిగేలా దర్యాప్తు సంస్థ వ్యవహరిస్తోంది. నిందితుడిగా పేర్కొంటూ మీడియాకు స్టేట్మెంట్లు ఇస్తోంది. పిటిషనర్ తండ్రి భాస్కర్‌రెడ్డి 75 ఏళ్ల వయసులో ఆరోగ్యం సహకరించకున్నా కడపలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. స్పష్టమైన ఆధారాలు లేనప్పుడు నిందితులకు బెయిల్ ఇవ్వాలని గత తీర్పులు చెబుతున్నాయి. అసలు ఈ కేసులో ఆర్థిక, కుటుంబ, ఇతర తగాదాలు చాలా ఉన్నాయి. ఆ కోణంలో సీబీఐ కనీసం పరిశోధన చేయడం లేదు. వివేకా చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇందులో ఆయన వ్యతిరేకుల హస్తం కూడా ఉండవచ్చు’ అని నిరంజన్‌రెడ్డి నివేదించారు. దస్తగిరి బెయిల్‌పై సునీత మౌనం.. ‘వివేకాను హత్య చేసేందుకు నగదు తీసుకున్నానని, గొడ్డలి కూడా కొనుగోలు చేశానని దస్తగిరి ఒప్పుకున్నాడు. హంతకుడైన దస్తగిరిని కనీసం కస్టడీలోకి తీసుకుని విచారించకుండానే క్షమించడం చట్ట విరుద్ధం. అతడికి ముందస్తు బెయిల్ ఇచ్చినా, అప్రూవర్‌గా పేర్కొన్నా వివేకా కుమార్తె సునీత కలుగజేసుకోవడం లేదు. అవినాశ్, భాస్కర్‌రెడ్డి దాఖలు చేసే పిటిషన్లలో మాత్రమే ఆమె ఇంప్లీడ్ అవుతోంది. సీబీఐ చెప్పినట్లుగా ఆమె వ్యవహరిస్తున్నారు. వివేకా తన వారసుడిగా రెండో భార్య కుమారుడిని ప్రకటించారు. ఈ విషయంలో మొదటి భార్య, సునీత, అల్లుడితో తీవ్ర మనస్పర్థలు చోటుచేసుకుని తారాస్థాయికి చేరాయి. గంగిరెడ్డితో వివేకాకు నగదుకు సంబంధించిన విభేదాలు ఉన్నాయి. తన తల్లిని వివేకా లైంగికంగా వేధించారని సునీల్ యాదవ్ చెప్పాడు. ఆ క్రమంలో వివేకాపై సునీల్‌కు పగ ఉంది. ఇలాంటి వివాదాల నేపథ్యంలో జరిగిన హత్యపై ఏ ఒక్క అంశాన్ని సీబీఐ నిర్ధారణ చేసుకోలేదు. ఈ కేసులో సీబీఐ గత దర్యాప్తు అధికారిపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. విచారణను తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆయనపై స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇది అక్కడి కోర్టులో పెండింగ్‌లో ఉంది’ అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. రంగన్న స్టేట్మెంట్ ఎందుకు పరిగణనలోకి తీసుకోరు..? ‘వివేకా వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్ను సీఆర్పీసీ సెక్షన్ 161, 164 కింద దర్యాప్తు సంస్థ రికార్డ్ చేసింది. దాని ప్రకారం హత్య జరిగిన రోజు రంగన్న నిద్రలో ఉండగా అకస్మాత్తుగా పాత్రలు, ఇనుప రాడ్ పడిపోవడం లాంటి శబ్దాలు వినపడటంతో పార్క్ వైపు ఉన్న ద్వారం పక్క కిటికీ నుంచి లోపలికి చూశాడు. ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్‌ను అతడు గుర్తించాడు. నాలుగో వ్యక్తి పొడవుగా, సన్నగా ఉన్నట్లు చెప్పాడు. వారంతా వెళ్లాక రంగన్న లోపలికి వెళ్లి చూడగా బాత్రూమ్లో రక్తపు మడుగులో వివేకా పడి ఉన్నారు. ఇదే విషయాన్ని రంగన్న స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. విచారణ స్థలంలో దొరికిన ఆధారాలు రంగన్న చెప్పిన వివరాలతో సరిపోలడంతో పాటు బలాన్ని చేకూర్చింది. దీన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోవడం లేదు. సీసీ కెమెరాల్లో నమోదైన వీడియో ఫుటేజీని, పోలీసులు సేకరించిన మెటీరియల్‌ను సీబీఐ పరిశీలించలేదు. సీబీఐ కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుని దస్తగిరికి ముందస్తు బెయిల్ ఇవ్వడం, అప్రూవర్‌గా అనుమతించడం చట్ట వ్యతిరేకం. విచారణకు సహకరించేందుకు అవినాశ్ సిద్ధంగా ఉన్నారు. ఆయన్ను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించాలి’ అని నిరంజన్‌రెడ్డి కోరారు. అనంతరం సీబీఐ పీపీ వాదనలు వినిపించారు. 160 కింద నోటీసులు ఇచ్చి ఎలా అరెస్టు చేస్తారు? అని ఈ సందర్భంగా సీబీఐని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘ఇప్పటికే నాలుగుసార్లు విచారణకు హాజరయ్యారు. అరెస్టు చేయలేదు. ఇప్పుడు అందుకు అవకాశం ఉందా?’ అని ప్రశ్నించగా దీనికి పీపీ బదులిస్తూ.. విచారణకు హాజరయ్యారని, విచారణ మేరకు అదుపులోకి తీసుకునే చాన్స్ ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
అయినా.. సీబీఐ తీరు మారలేదు
సాక్షి, అమరావతి: ‘న్యాయం జరగటమే కాదు. న్యాయం జరుగుతున్నట్లు కనిపించాలి’ ‘ఈ కేసులో రాజకీయ కోణాన్ని నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా సీబీఐ సేకరించలేదు. సీబీఐ దర్యాప్తు సమగ్రంగా లేదు’... ఇవీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటీవల రెండు సందర్భాల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు. సీబీఐ విచారణ తీరుపై ఈ వ్యాఖ్యలు చేయటంతోనే సుప్రీంకోర్టు సరిపెట్టలేదు. దర్యాప్తు ఎలా చేయాలో స్పష్టత ఇస్తూ... దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించింది కూడా. సీబీఐ అన్ని కోణాలనూ దర్యాప్తు చేయటం లేదని, కొందరిని దోషులుగా తేల్చాలన్న నిర్ణయాన్ని ముందే తీసేసుకుని దానికి తగ్గట్టుగా దర్యాప్తు చేస్తున్నట్లు కనిపిస్తోందని కేసులో నిందితుడైన శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ వేశారు. దానిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ పైవ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశిస్తూ పిటిషనర్‌కు ఊరటనిచ్చింది. దాని ప్రకారమే ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం కొత్తగా ఏర్పాటైంది. కానీ మునుపటి దర్యాప్తు అధికారి ఎక్కడైతే ఆగారో అక్కడి నుంచి దర్యాప్తు చేస్తున్నట్టుగా ఈ బృందం నేరుగా వైఎస్ అవినాశ్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నట్టు గడిచిన రెండుమూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. మరి ఇలాగైతే సుప్రీంకోర్టు తీర్పువల్ల పిటిషనర్‌కు ఏం ఊరట కలిగినట్టు? అసలు పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలన్న ఉద్దేశంతోనే కదా సుప్రీంకోర్టు కొత్త బృందాన్ని ఏర్పాటు చేయమన్నది. మరి ఆ బృందం కనీసం ఆ అంశాలవైపు చూడకుండా పాత దర్యాప్తుకు కొనసాగింపుగా చేసుకుంటూ పోతే ఏమనుకోవాలి? సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తిని సీబీఐ ఖాతరు చేయాల్సిన అవసరం లేదా? వివేకానందరెడ్డి హత్యకు బలమైన కారణాలుగా భావిస్తూ తులసమ్మ లేవనెత్తిన నాలుగు కీలక కోణాలను అసలు పట్టించుకోవడమే లేదెందుకు? ఇలాగైతే బాధ/æతులకు న్యాయం జరుగుతుందా? దర్యాప్తు అసమగ్రం.. దర్యాప్తు బృందాన్ని మార్చడమే నిదర్శనం ఓ కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడం అత్యంత అరుదు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు అటువంటి అసాధారణ నిర్ణయాన్నే తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు సమగ్రంగా లేదని భావించటంతో... న్యాయసూత్రాల ఆధారంగా దర్యాప్తు ఎలా చేయాలో చెప్పటమే కాక, దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు ఎస్పీ రామ్సింగ్ను తొలగించమని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వంలో ఎస్పీ వికాస్ సింగ్, అదనపు ఎస్పీ ముకేశ్ కుమార్‌లతో కొత్త బృందాన్ని సీబీఐ నియమించింది. పాత బృందం తప్పటడుగుజాడల్లోనే... పాత దర్యాప్తు బృందాన్ని మార్చమని సుప్రీంకోర్టు చెప్పిందంటేనే ... ఆ బృందం చేసిన దర్యాప్తు సక్రమంగా లేదని కదా!. వివేకాను హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి, అతని వాంగ్మూలం ఆధారంగానే పాత దర్యాప్తు బృందం విచారణ కొనసాగించింది. ఆ దర్యాప్తు నివేదికలో ఎలాంటి ఆధారాలూ లేవని సుప్రీంకోర్టు చెప్పింది. దానర్థం అప్పటివరకు దర్యాప్తులో పట్టించుకోని కొత్త కోణాలను గుర్తించి, తగిన సాక్ష్యాలను సేకరించమని సుప్రీం కోర్టు చెప్పినట్టే కదా!. కానీ అది సీబీఐకి వినిపించలేదు. సీబీఐ కొత్త దర్యాప్తు బృందం కూడా హంతకుడైన దస్తగిరి వాంగ్మూలం చూట్టూనే దర్యాప్తును పరిమితం చేస్తోంది. అసలు వాస్తవాల జోలికి పోవటమే లేదు. దానికి తార్కాణాలివిగో... కనీసం విచారించకుండానే అరెస్టులా...!? ఉదయ్ కుమార్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలను సీఐబీ అరెస్టు చేసిన తీరు సహజ న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే ఏ నిందితుడినైనా విచారించకముందు అరెస్టు చేయటమనేది ఉండదు. కానీ ఈ దర్యాప్తు బృందం వారిని విచారించకుండానే అరెస్టు చేసేసింది. తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని, పూర్తిగా సహకరిస్తానని భాస్కర్‌రెడ్డి మొదటి నుంచీ చెబుతున్నారు. పాత దర్యాప్తు బృందం ఓసారి ఆయన్ను విచారణకు రావాలని ఫోన్ చేసి పిలిచింది. దాంతో కడప జైలు వద్ద సీబీఐ అధికారుల కార్యాలయానికి వెళ్లారు. చాలాసేపు నిరీక్షించినా సీబీఐ ఆయన్ని విచారణకు పిలవ లేదు. పైగా నోటీసులివ్వకుండా ఎందుకు వచ్చారన్నట్టు మాట్లాడారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి పుట్టినరోజు, పెళ్లి రోజు ఒకేరోజు. గత 20ఏళ్లుగా ఆ రోజున తీర్థయాత్రకు వెళుతున్నారు. ఈ ఏడాది కూడా సీబీఐ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుని వెళ్లారు. అంటే సీబీఐ అధికారుల విచారణకు ఆయన మొదటి నుంచీ పూర్తిగా సహకరిస్తూనే ఉన్నారు. అటువంటి భాస్కర్‌రెడ్డిని కొత్త దర్యాప్తు బృందం కనీసం విచారించకుండానే నేరుగా వచ్చి అరెస్టు చేయడం విస్మయపరుస్తోంది. నోటీసులిచ్చి విచారించిన తరువాతే తదుపరి చర్యలు తీసుకోవాలన్న కనీస నిబంధనను కూడా పట్టించుకోలేదు. పైగా ఆయన విచారణకు సహకరించడం లేదని కోర్టులో చెప్పటం చూస్తే... విచారణ ఏ రీతిన సాగుతోందో అర్థమవుతుంది. అసలు ఆయన్ని విచారించేందుకు నోటీసే ఇవ్వని సీఐబీ ఆయన విచారణకు సహకరించడం లేదని ఎలా చెబుతుంది? పైగా వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఏకపక్షంగా అరెస్టు చేశాక.. విచారణ కోసం 10 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరడం ఉద్దేశపూర్వకంగా వేధించటానికేనని స్పష్టంకాక మానదు. – ఉదయ్ కుమార్‌రెడ్డిని కూడా అదే రీతిలో... ఈ కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా చెప్పాలని దర్యాప్తులో భాగంగా రామ్‌సింగ్ తనను వేధించారని గతంలో ఉదయ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కొత్త దర్యాప్తు బృందం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఎవరైనా భావిస్తారు. కానీ కొత్త బృందం ఉదయ్‌ని కనీసం విచారించకుండా... ఆయన ఆరోపణకు ఆధారం ఏమిటో అడగకుండా పులివెందులలోని ఆయన ఇంటికి నేరుగా వచ్చి... తమతో కడప రావాలని చెప్పి దార్లో అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌కు తరలించారు. ఒక్క కొత్త ఆధారాన్ని సేకరించనే లేదు... సుప్రీం కోర్టు కొత్త దర్యాప్తు బృందాన్ని నియమించమని ఆదేశించిందంటే... పాత దర్యాప్తు బృందం సరిగా విచారించ లేదని తేల్చినట్టే. కాబట్టి కొత్త బృందం ఈ కేసులో అప్పటివరకు విస్మరించిన కోణాలేమైనా ఉంటే వాటిని పరిశీలించాలి. అప్పటివరకు వెలుగుచూడని సాక్ష్యాలుంటే వెలికితీయాలి. కానీ డీఐజీ చౌరాసియా నేతృత్వంలో బృందం ఈ అంశాలు వేటినీ పట్టించుకోనే లేదు. ఈ కేసులో ఒక్క కొత్త ఆధారాన్నీ సేకరించలేదు. సాక్షులెవరినీ విచారించనేలేదు. అంతకుముందు రామ్‌సింగ్ బృందం ఏకపక్షంగా చేసిన దర్యాప్తునకు కొనసాగింపుగానే వ్యవహరిస్తోంది. ఆ తప్పటడుగుల్లోనే నడుస్తోంది. అంటే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తిని బేఖాతరు చేస్తోంది. రాజకీయ కోణానికి ఆధారాలేవి? వివేకా హత్య వెనుక రాజకీయ కోణం ఉందని నిరూపించే ఒక్క ఆధారాన్నీ సీబీఐ చూపించలేకపోయిందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కొత్త దర్యాప్తు బృందం కూడా ఆ దిశగా ఒక్క సాక్ష్యాన్ని కూడా సేకరించనే లేదు. కానీ భాస్కర్‌రెడ్డి అరెస్టు రిమాండ్ రిపోర్ట్‌లో మాత్రం రాజకీయ అంశాలను ఏకపక్షంగా ప్రస్తావించేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ వివేకానందరెడ్డి గతంలో భాస్కర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొనడం హాస్యాస్పదమే. పాత బృందం ఇదే మాట అంటే అసలు రాజకీయ కోణం ఉన్నదనడానికి ఆధారాలేవని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దానికి ఒక్క ఆధారమూ చూపకుండానే ఈ బృందం కూడా అవే వ్యాఖ్యలను ఏకంగా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిందంటే ఏమనుకోవాలి? భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యమూ లేదు... ఈ కేసులో భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పనే లేదన్నది కీలకం. పైగా వైఎస్ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిల ప్రమేయం ఉనట్టుగా చెప్పాలని తమను సీబీఐ వేధిస్తోందని పలువురు సాక్షులు పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డిని ఏ ప్రాతిపదికన అరెస్టు చేశారంటే... దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలాన్నే చూపిస్తుండటం చిత్రాతిచిత్రం. ఎందుకంటే వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేసింది దస్తగిరి. ‘నేనే నరికి చంపా’ అని అంగీకరించింది దస్తగిరి. అలాంటి దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడమే సీబీఐ చేసిన పెద్ద పొరపాటు. ఇక దస్తగిరిని ఢిల్లీ తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి మరీ అప్రూవర్‌గా మార్చారని ఈ కేసులో మరో నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి గతంలోనే చెప్పారు. మరోవైపు ఈ కేసులో ఇతర నిందితులను అరెస్టు చేస్తూ... వారికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని వాదిస్తున్న సీబీఐ... వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేశానని ఒప్పుకున్న నిందితుడు దస్తగిరి బెయిల్ పిటీషన్‌ను వ్యతిరేకించకపోవడం విడ్డూరమే. ఈ అంశాలన్నింటినీ కొత్త దర్యాప్తు బృందం కనీసం విశ్లేషించనే లేదు. హంతకుడైన దస్తగిరి బయట తిరుగుతుంటే... అప్రూవర్‌గా అతనిచ్చిన అహేతుకమైన వాంగ్మూలం ఆధారంగా పలువురిని అరెస్టు చేస్తుండటమే విస్మయకరం. ఆ నాలుగు కోణాల్లో దర్యాప్తే చేయని సీబీఐ! ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ కీలకమైన నాలుగు అంశాలను ప్రస్తావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ కోణాల్లో దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న ఆమె వాదనను న్యాయస్థానం నమోదు చేసింది కూడా. ఆమె లేవనెత్తిన అంశాలు ఇవీ... 1. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహంతో ఆ కుటుంబంలో ఆర్థిక విభేదాలు తలెత్తాయి. 2. వివేకానందరెడ్డికి కొందరితో ఉన్న ఆర్థిక లావాదేవీలు, సెటిల్మెంట్ వ్యవహారాలున్నాయి. 3. వివేకానందరెడ్డి అక్రమ లైంగిక సంబంధాలున్నాయి. దీనిపై ఆయన పట్ల కొందరు వ్యక్తిగత కక్ష పెంచుకున్నారు. 4. వివేకా రాజకీయ వారసత్వం కోసం ఆయన సొంత కుటుంబ సభ్యుల మధ్య విభేదాలున్నాయి. కాకపోతే ఈ అంశాలపై కొత్త సీబీఐ బృందం కనీసం దృష్టి కూడా పెట్టలేదు. -
వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయ్: అవినాష్‌రెడ్డి న్యాయవాది
సాక్షి, హైదరాబాద్: వివేకా కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. కేవలం దస్తరిగి ఇచ్చిన కన్ఫెషన్ తప్ప.. సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, పైగా దస్తగిరిని కూడా బెదిరించి ఆ స్టేట్మెంట్ తీసుకుందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. ఆపై పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది వాదనలు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. భాస్కర్‌రెడ్డి పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే అరెస్ట్ చేశారు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి దస్తగిరి కన్ఫెషన్ తప్ప సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరిని బెదిరించి.. చిత్రహింసలకు గురిచేసినట్లు ఎర్ర గంగిరెడ్డి చెప్పాడు. దస్తగిరి కూడా సీబీఐకి భయపడి భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయి. ఒకటి కుటుంబం, రెండోది వ్యాపార సంబంధాలు, మూడోది వివాహేతర సంబంధాలు, నాలుగోది పొలిటికల్ గెయిన్. వీటిపై సీబీఐ ఫోకస్ పెట్టలేదని అవినాష్ రెడ్డి తరపున న్యాయవాది వాదించారు. అలాగే.. వైఎస్ అవినాష్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని, రాజకీయ కోణంలో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను ఇరికించే కుట్రలో భాగమే ఇదంతా అని వాదించారు. ఈ తరుణంలో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది తెలంగాణ హైకోర్టు. అంతేకాదు.. వివేకా కేసులో అవినాష్‌రెడ్డి ఇవాళ్టి విచారణను రేపటికి సీబీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. రేపు సాయంత్రం నాలుగు గంటల తర్వాతే అవినాష్‌రెడ్డిని విచారణకు పిలవాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇదీ చదవండి: వివేకాపై అందుకే సునీత కక్షగట్టింది -
అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మంగళవారానికి వాయిదా
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నేటి సీబీఐ విచారణ రేపటికి(మంగళవారం) వాయిదా పడింది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం అవినాష్‌రెడ్డిని విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఆ విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు విచారణకు రావాలని అవినాష్‌రెడ్డికి సీబీఐ స్పష్టం చేసింది. నేటి విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్‌రెడ్డి హాజరయ్యే క్రమంలో విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ మేరకు అవినాష్‌రెడ్డికి సీబీఐ మరో నోటీసు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టులో నేటి మధ్యాహ్నం అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉన్నందునే సీబీఐ తన విచారణను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే. చదవండి: హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఎంపీ అవినాష్ రెడ్డి -
హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఎంపీ అవినాష్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతించింది. సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్టు బెంచ్ స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్‌లోని కీలక అంశాలు ఇవే.. ‘నాకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. 161 సీఆర్సీసీ కింద సీబీఐ అధికారులు నా స్టేట్మెంట్ రికార్డు చేశారు. వివేకా కుమార్తె సునీత స్థానిక ఎమ్మెల్సీ ద్వారా చంద్రబాబు, సీబీఐ ఆఫీసర్‌తో కుమ్మకయ్యారు. ఈ కేసులో కుట్ర పన్ని నన్ను ఇరికిస్తున్నారు. నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి. గూగుల్ టేకౌట్ ఆధారంగానే నన్ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం జరుగుతోంది. దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజులు సీబీఐ తన వద్ద ఉంచుకుంది. అక్కడే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారు. ఈ కేసులో నాపై ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరి స్టేట్మెంట్ ఒక్కటే ప్రాముఖ్యంగా సీబీఐ తీసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు నేను నిందితుడిగా లేను. 2021 సీబీఐ ఛార్జ్‌షీట్‌లో నన్ను అనుమానితుడిగా చేర్చారు. నాపై నేరం రుజువు చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. వివేకా తన రెండో భార్యతో ఆర్థికంగా పాలుపంచుకుంటున్నాడని సునీత కక్ష గట్టింది. వివేకా కుమార్తె సునీత, స్థానిక ఎమ్మెల్సీ ద్వారా ప్రతిపక్ష నేతతో కుట్ర పన్ని నన్ను, నా కుటుంబాన్ని దెబ్బతీయడానికి ప్లాన్ చేశారు. సునీత, వివేకా రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయి. వివేకా రెండో భార్య కుమారుడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తామని వివేకా హామీ ఇచ్చారు. స్కూల్ పక్కనే విల్లా కొనుగోలు చేసేందుకు వివేకా ప్లాన్చేశారు. వివేకా రెండో భార్య కుటుంబానికి డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ప్లాన్ తెలిసి వివేకాతో సునీత గొడవ పడ్డారు. వివేకా హత్యలో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి’ అని పేర్కొన్నారు. -
ఘటన నాటి నుంచీ టీడీపీ డైరెక్షన్ లోనే విచారణ
-
భాస్కర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వండి..సీబీఐ కోర్టులో దర్యాప్తు సంస్థ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన భాస్కర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పాటు ఉదయ్‌కుమార్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా సోమవా రం సీబీఐ కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా, 2019 మార్చి 15న వివేకానందరెడ్డి మృతదేహం రక్తపు మడుగులో బాత్రూమ్లో లభ్యమైందని, ఈ హత్య వెనుక భారీ కుట్ర ఉందని సీబీఐ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్‌లో ఇంకా ఏం చెప్పిందంటే.. వివేకాతో వారికి పలు విభేదాలు ‘వివేకానందరెడ్డితో భాస్కర్‌రెడ్డికి, శివశంకర్‌రెడ్డికి పలు విభేదాలు ఉన్నాయి. 2017లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన వివేకా ఓడిపోయారు. ఈ ఓటమికి పై ఇద్దరే కారణమని వివేకా తీవ్ర ఆగ్రహంతో ఉండేవారు. హత్య చేసిన వారు కూడా భాస్కర్‌రెడ్డికి, శివశంకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఈ కేసులో భాస్కర్‌రెడ్డి సహా పలువురు కీలక వ్యక్తులు ఉన్నారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. హంతకులకు రూ.40 కోట్లు ఇస్తానని శివశంకర్‌రెడ్డి హామీ ఇచ్చాడని దస్తగిరి చెప్పాడు. హత్య చేసే ప్రక్రియలో ఏ–1, ఏ–2, ఏ–3, ఏ–4 లను వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న చూశాడు. ఆ రోజు రాత్రి సుమారు 1.58 గంటల సమయంలో సునీల్‌యాదవ్ భాస్కర్‌రెడ్డి ఇంటి వద్ద ఉన్నట్లు అతని మొబైల్ లొకేషన్ చూపించింది. ఇది విచారణలో తేలింది. భాస్కర్‌రెడ్డి ఇతరులతో మాట్లాడినట్లు.. వారు అంతా చూసుకుంటారని హత్య తర్వాత ఎర్ర గంగిరెడ్డి.. ఇతర నిందితులకు చెప్పాడు. అ తర్వాత వివేకా గుండెపోటుతో చనిపోయారని.. భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ కథ అల్లారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. అవినాశ్‌రెడ్డి.. అతని పీఏ రాఘవరెడ్డి ఫోన్ నుంచి సీఐ శంకరయ్యకు కాల్ చేశారు. వివేకా మృతి చెందారని చూసిన తర్వాతే అవినాశ్ ఫోన్ చేసినట్లు ఇదే ఆధారం. సాధారణ మరణం అని చెప్పడం కోసమే ఇదంతా చేశారు. ఆ తర్వాత రక్తపు మరకలను తుడిచి వేశాక మృతదేహాన్ని బెడ్రూంలోకి మార్చారు. ఈ హత్యలో వైఎస్ భాస్కర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. మా విచారణలోనూ భాస్కర్‌రెడ్డి సహకరించలేదు. అందువల్ల కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నాం’ అని సీబీఐ కోరింది. -
కళ్లకు గంతలతోనే దర్యాప్తు
సాక్షి, అమరావతి: ఏనుగు కాళ్లు, తొండం, తోక పట్టుకుని నలుగురు అంధులు గనక ఆ ఏనుగెలా ఉందో ఊహిస్తూ చెబితే ఏమవుతుంది? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ కూడా ఇలాగే చేస్తోంది. వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ... కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు దీన్నే తలపిస్తోంది. కుట్రదారులెవరో నిగ్గుతేల్చే నిప్పు కణికల్లాంటి అంశాలను పూర్తిగా వదిలేసి దర్యాప్తు సాగిస్తుండటమే విస్మయం కలిగిస్తోంది. అవేంటంటే... ♦వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఆస్తి కోసం..రాజకీయ వారసత్వం కోసం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ♦మెజార్టీ ఓట్లు ఉన్నప్పటికీ స్థానిక కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన వైఎస్ వివేకానంద రెడ్డి ఓడిపోయారు. టీడీపీ గెలిచింది. ♦వివేకా గుండెపోటుతో మరణించారని తొలిసారిగా చెప్పింది ఆయన పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డి. ఆయన తొలుత చెప్పింది టీడీపీ మంత్రి ఆది నారాయణరెడ్డికే. ♦వైఎస్ అవినాశ్‌ను ఎంపీగా గెలిపించేందుకు తన తండ్రి కృషి చేస్తున్నారన్న సునీత... మళ్లీ మాట మార్చి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకని? ♦స్వయంగా హత్య చేశాడంటున్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం సరైనదేనా?.. రూ.40 కోట్ల సుపారీ కట్టుకథలో అడుగడుగునా అవాస్తవాలే. ♦నార్కో పరీక్షల్లో ఏమీ చెప్పని రంగయ్య తరువాత ఏదో చెప్పారట..! ♦ఆధారాల ధ్వంసం అంటున్న సీబీఐ... ఆ మూడు వేలిముద్రలపై ఎందుకు మౌనంగా ఉంటోంది? ♦వివేకా హత్య కుట్రదారులు ఆయన అల్లుడు, పెద్ద బావమరిదే అంటున్న తులసమ్మ మాటలనెందుకు పట్టించుకోరు? ఇవీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అంశాలు.. కానీ కళ్లకు గంతలు కట్టుకున్న రీతిలో సీబీఐ వాటినేమాత్రం పట్టించుకోవడం లేదు. ముందుగా నిర్ణయించుకున్నట్టుగా... ఎవరో ప్రభావితం చేస్తున్నారన్నట్టుగా ముందుకెళుతోంది. కుట్రదారులు ఎవరన్న కోణంలో కాకుండా...ముందే ఓ నిర్ణయానికి వచ్చేది ఆ దిశగా వెళుతోందనటానికి భాస్కర్‌రెడ్డి అరెస్టే తాజా తార్కాణం. తన చర్యను సమర్థించుకుంటూ సీబీఐ సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ నిండా కల్పితాలు...ఊహాజనితాలు... అవాస్తవాలే!. ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ కేవలం గాలిమాటలు పోగేసి రిమాండ్ నివేదికను రూపొందించడం ఆశ్చర్యమే మరి. రిమాండ్ రిపోర్ట్‌లో సీబీఐ ప్రస్తావించిన అంశాలు ఒకసారి పరిశీలిస్తే... వివేకాను కుట్రపూరితంగా ఓడించిందెవరు? వైఎస్ వివేకానందరెడ్డి 2017 కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేశారు. తగినంత బలం ఉంది కనక గెలుస్తారన్న ఉద్దేశంతో జగన్మోహన్రెడ్డి ఆయనకు టికెట్టిచ్చారు. కానీ ఓడిపోయారు. అందుకు వైఎస్ భాస్కర్ రెడ్డే కారణమని వివేకా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సీబీఐ తన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. అందుకే వివేకాపై భాస్కర్‌రెడ్డి కక్ష పెంచుకున్నారన్నట్టుగా చెప్పింది. కానీ వాస్తవం ఏమిటంటే... ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించింది స్వయానా చంద్రబాబు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపికి పూర్తి మెజార్టీ ఉంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి వివేకానందరెడ్డి గెలుపు నల్లేరుపై నడకే. కానీ చంద్రబాబు పన్నాగంలో భాగంగా అప్పటి టీడీపీ మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేశారు. కుట్ర పూరితంగా వివేకాను ఓడించారు. ఇది వైఎస్సార్ జిల్లాలో బహిరంగ రహస్యం. అంటే వైఎస్ వివేకానందరెడ్డి ఎవరిపై ఆగ్రహించాలి? వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచినా.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ చేరి మంత్రి అయి తనను ఓడించిన ఆదినారాయణ రెడ్డిపై కదా? సీబీఐ మాత్రం భాస్కర్‌రెడ్డిపై ఆగ్రహించినట్టుగా కట్టు కథను అల్లడం విస్మయ పరిచేదే. ఇక వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఇప్పటికీ ఆదినారాయణ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. తన తండ్రిని ఓడించిన ఆయనతో వారికి సన్నిహిత సంబంధాలు ఎందకున్నాయి? వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కూడా తన భార్య, కుమార్తె, అల్లుడి ఒత్తిడితోనే వివేకానందరెడ్డి మంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. వారి ఒత్తిడితోనే ఏకంగా వైఎస్ విజయమ్మపై పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తన చిన్నాన్నపై పూర్తి గౌరవంతో పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డికి రాజకీయ శత్రువులు టీడీపీ నేతలైన ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిలేనని.. ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించింది కుమార్తె సునీ త, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డేనని స్పష్టమవుతోంది. మరి ఈ దిశగా సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నదే సందేహాలకు తావిస్తోంది. ఎంపీ టికెట్ అవినాశ్ రెడ్డిదేనని అప్పటికే స్పష్టత కడప సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాశ్‌రెడ్డికే 2019 ఎన్నికల్లో కూడా టికెట్ ఇస్తున్నట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి మౌఖికంగా ప్రకటించేశారు. దాంతో అవినాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఆయన ఎన్నికల ప్రచారానికి వైఎస్ వివేకానందరెడ్డే ఇన్చార్జి. ఆ విషయాన్ని వైఎస్ వివేకా హత్యకు గురైన తరువాత కూడా ఆయన కుమార్తె సునీత మీడియా ముఖంగా చెప్పారు. మరి కడప ఎంపీ టికెట్ కోసమే వైఎస్ వివేకాపై భాస్కర్‌రెడ్డి కుటుంబం కక్ష పెంచుకుందని టీడీపీ ఆరోపిస్తుండటం ఎంత నీచం!!. గుండెపోటు కథ వివేకా పెద్ద బావమరిదిదే... వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో నెత్తురు కక్కుకుని చనిపోయినట్టు భాస్కర్‌రెడ్డి ఇతర నిందితులతో కలసి ప్రచారం చేశారని సీబీఐ తన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. వాస్తవానికి వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని వైఎస్ అవినాశ్రెడ్డిగానీ వైఎస్ భాస్కర్రెడ్డిగానీ ఎవరికీ చెప్పలేదు. ఆ విషయాన్ని చెప్పింది వివేకానందరెడ్డి పెద్ద బావమరిది, అల్లుడికి సోదరుడు అయిన నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి. అది కూడా వైఎస్ వివేకా రాజకీయ శత్రువు, అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డితోనే ఆయన తొలుత చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న శివ ప్రకాశ్ రెడ్డి స్వయంగా మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. సిగరెట్లు ఎక్కువగా తాగుతారు కనక ఇలా జరిగి ఉండొచ్చని తాను చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డి స్వయంగా మీడియాకు చెప్పారు. అంతేకాదు నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డే ఎంపీ అవినాశ్ రెడ్డికి ఫోన్ చేసి.. వివేకా చనిపోయిన విషయాన్ని చెప్పారు. అప్పటికే ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు వెళుతున్న ఎంపీ అవినాశ్... వెనక్కి తిరిగి వైఎస్ వివేకా ఇంటికి వెళ్లారు. ఆ ఫోన్ రాకపోయి ఉంటే అవినాశ్‌రెడ్డి జమ్మలమడుగు వెళ్లేవారు. ఎన్నికల ప్రచారం చేసుకునేవారు. వైఎస్ వివేకా మృతిచెందారని అందరికీ చెప్పింది శివ ప్రకాశ్‌రెడ్డి. గుండెపోటుతో మరణించారని చెప్పింది కూడా ఆయనే. కానీ భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి చెప్పారంటూ సీబీఐ ఓ కల్పిత కథను రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించటం విస్మయం కలిగిస్తోంది. వివేకా రాసిన లేఖను ఎందుకు దాచిపెట్టారు? వైఎస్ వివేకా మరణించే సమయంలో లేఖ రాశారు. రక్తపు మరకలతో కూడిన లేఖ అది. డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచినట్టు ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను ఆ రోజు ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి... వెంటనే ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పీఏ కృష్ణారెడ్డితో చెప్పారు. సునీత, ఆమె భర్త మధ్యాహ్నం 1గంట సమయంలో పులివెందుల చేరుకున్నారు. వారికి ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి అందించారు. చివరకు సాయంత్రం 5గంటలకు వారంతా కలిసి లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఇక్కడే అత్యంత కీలకమైన అంశం దాగి ఉంది. ఆ లేఖను దాచి ఉంచమని సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పకపోయి ఉంటే కృష్ణారెడ్డి వాటిని వెంటనే బయటపెట్టేవారు. శివప్రకాశ్‌రెడ్డి చెప్పిన సమాచారంతో అక్కడికి వచ్చిన అవినాశ్‌కు గనక దాన్ని చూపించి ఉంటే... వివేకాది హత్యేనని అందరికీ వెంటనే స్పష్టత వచ్చేది. గుండెపోటో మరొకటో కాదని వెంటనే తెలిసిపోయేది. అసలు ఎవ్వరూ మృతదేహాన్ని ముట్టుకునేవారే కాదు. కానీ ఆ లేఖను దాచి ఉంచమని చెప్పడమే కాకుండా... వివేకా గుండెపోటుతో చనిపోయారని టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి చెప్పింది వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదే. వాస్తవం ఇలా ఉంటే... గుండెపోటు కథను భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి ప్రచారంలోకి తీసుకువచ్చారని సీబీఐ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనడమే దర్యాప్తు తీరుపై సందేహాలకు తావిస్తోంది. ఆనాడు సునీత మాట్లాడింది మరచిపోయారా? తన తండ్రి హత్య వెనుక అసలు దోషి ఆదినారాయణ రెడ్డేనని సునీత 2019 మార్చిలో చెప్పిన విషయాలను సీబీఐ పరిగణనలోకి తీసుకోవడమే లేదు. వివేకా హత్య తరువాత సునీత హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని పెట్టి... వైఎస్ కుటుంబంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తమ కుటుంబం గురించి చంద్రబాబుకు ఏం తెలుసని ప్రశ్నించారు. ఒకర్ని ఒకరు చంపుకునే చరిత్ర తమ కుటుంబానికి లేదన్నారు. కేవలం వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననానికే టీడీపీ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని సునీత మండిపడ్డారు. చంద్రబాబు అసలు ఆదినారాయణ రెడ్డిని ఎందుకు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆమె సూటిగా ప్రశ్నించారు. ప్రజలు ఎవరూ చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఆనాడు అలా మాట్లాడిన సునీత ఇప్పుడెందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు?. ఎవరి ఒత్తిడి, ప్రలోభాలకు లొంగి సునీత మాట మార్చారు? ఆమె ఢిల్లీ వెళ్లినప్పుడల్లా వెనకుండి కథ నడిపిస్తున్నది ఎవరు? వ్యవస్థలను ప్రభావితం చేస్తూ దర్యాప్తును పక్కదారి పట్టిస్తోంది ఎవరు? వీటిని సీబీఐ ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదు? హంతకుడే అప్రూవరా...!? రిమాండ్ రిపోర్ట్‌లో సీబీఐ పేర్కొన్న మరో అంశం కూడా ఆ సంస్థ విశ్వసనీయతను శంకించేలా చేస్తోంది. వైఎస్ వివేకాను గొడ్డలితో స్వయంగా నరికినట్లు చెప్పిన నిందితుడు దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా మార్చడం న్యాయ నిపుణులను విస్మయపరుస్తోంది. హత్య చేసిన వ్యక్తి జైల్లో కాక దర్జాగా బయట తిరుగుతున్నారు. అతని బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించలేదు. హంతకుడైన దస్తగిరి తో కల్పితాలు, అభూతకల్పనలు చెప్పించి... వాటి ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతుండటం వెనుక మర్మమేమిటి? రూ.40కోట్ల సుపారీ కట్టుకథే.. దస్తగిరి అప్రూవర్ వాంగ్మూలం పేరిట సీబీఐ అల్లిన మరో కట్టుకథ రూ.40 కోట్ల సుపారీ స్టోరీ. వైఎస్ వివేకాను హత్య చేయడానికి రూ.40 కోట్లకు సుపారీ కుదిరిందని, అందులో రూ.5కోట్లు అడ్వాన్స్ వచ్చిందని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పి తనకు రూ.కోటి ఇచ్చారని దస్తగిరి వాంగ్మూలంలో చెప్పినట్టు సీబీఐ పేర్కొంది. మరి అదే సీబీఐ వెలికి తీసిన దస్తగిరి, సునీల్ యాదవ్ మధ్య వాట్సాప్ సందేశాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వివేకా హత్యకు రెండు రోజుల ముందు వరకు... ఆ తరువాత కూడా దస్తగిరి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ సునీల్ యాదవ్‌కు మెస్సేజులు చేశారు. కనీసం రూ.2 వేలు అయినా అప్పు ఇవ్వాలని... రూ.500 ఇచ్చినా ఆ పూట ఖర్చుకు సరిపోతాయని ప్రాథేయపడ్డారు. ఆ వివరాలన్నీ కూడా సీబీఐనే వెల్లడించింది. మరి దస్తగిరి రూ. కోటి అడ్వాన్స్‌గా తీసుకుని ఉంటే రూ.500 అప్పు ఎందుకడుగుతాడు? అంటే రూ.40కోట్ల సుపారీ కట్టు కథే కదా? అప్రూవర్‌గా మారగానే దస్తగిరికి డబ్బూదస్కం ఇక అప్పటివరకు కటిక పేదరికంలో కొట్టుమిట్టాడి న దస్తగిరి అప్రూవర్‌గా మారిపోగానే ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. ఒక్కసారిగా కార్లతో తిరు గుతూ... ట్రాక్టర్లు కొనుగోలు చేసి... సెటిల్మెంట్లు మొదలు పెట్టాడు. అంటే అప్రూవర్‌గా మారి వైఎస్ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలకు వ్యతిరేకంగా వాంగ్మూలమిచ్చినందుకు అతనికి భారీగానే ముట్టిందన్నది తేటతెల్లమవుతోంది. మరి తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని దస్తగరిని ప్రలోభపెట్టింది ఎవరు? నార్కో టెస్టుల్లో ఏమీ చెప్పని రంగయ్య...! అభిషేక్ మహంతి ఎస్పీగా ఉన్నప్పుడు ఈ కేసు దర్యాప్తులో భాగంగా వాచ్‌మేన్ రంగయ్యను విచారించారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన గుజరాత్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తీసుకువెళ్లి అతనిపై నార్కో ఎనాలిసిస్ టెస్ట్, బ్రెయిన్ మ్యాపింగ్, లై డికెక్టర్ టెస్ట్‌లు నిర్వహించారు. నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించిన ఆ పరీక్షల్లో కూడా రంగయ్య ఏమీ చెప్పలేకపోయాడు. కానీ ఆ రోజు రాత్రి ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్‌లతోపాటు మరో వ్యక్తిని చూశానని రంగయ్య తమ దర్యాప్తులో చెప్పారని సీబీఐ అంటోంది. నార్కో పరీక్షల్లోనే ఏమీ చెప్పలేని రంగయ్య అన్ని నెలల తరువాత సీబీఐ అధికారులు మామూలుగా అడిగితే ఇవన్నీ చెప్పారట!. నమ్మశక్యమా? తులసమ్మ పిటిషన్‌లోని అంశాలపై దర్యాప్తే లేదు వివేకా హత్యకు కారణాలపై డి.శివ శంకర్ రెడ్డి భార్య తులసమ్మ పలు సందేహాలను లేవనెత్తుతూ పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలు, రాజకీయ వారసత్వం, ఆస్తి పై హక్కుల కోసం కుమార్తె, అల్లుడితో విభేదాలు, నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం టీడీపీ నేత బీటెక్ రవి కక్షగట్టడం, ఆర్థిక విభేదాలతో కక్ష పెంచుకున్న అనుచరుడు కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డి టీడీపీ నేత బీటెక్ రవితో కలసి కుట్ర పన్నటం, రాజకీయ విభేదాలు ఉన్న తాడిపత్రి నేత రాజేశ్వరరెడ్డి, అతనికి సహకరించిన నీరుగట్టు ప్రసాద్‌ల ప్రమేయం...ఇలా తులసమ్మ లేవనెత్తిన కీలకమైన అంశాలను న్యాయస్థానం నమోదు చేసింది. కానీ సీబీఐ వీటిని దర్యాప్తులో కనీసం పరిగణలోకే తీసుకోవటం లేదు. ఆ 3 వేలి ముద్రలపై మౌనం ఎందుకో...! వివేకా హత్య స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారనేది భాస్కర్‌రెడ్డి మీద సీబీఐ చేసిన ప్రధాన అభియోగం. ఆ ఆరోపణ పూర్తిగా అహేతుకం. మరి అదే సమయంలో వివేకా హత్య ప్రదేశంలో లభించిన కీలకమైన ఆధారాలను సీబీఐ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? మృతదేహం పడి ఉన్న బాత్రూమ్లో లభించిన వేలి ముద్రలను నిపుణులు పరిశీలించి పలువురి వేలిముద్రలతో సరిపోల్చారు. కానీ వాటిలో అయిదు వేలి ముద్రలు ఎవరితోనూ సరిపోల లేదు. వాటిలో మూడు వేలిముద్రలు పూర్తిగా ఉండగా... మరో రెండు పాక్షికంగా ఉన్నాయి. బాత్రూమ్ గోడలు, తలుపు వెనుక భాగంలో ఆ వేలి ముద్రలను గుర్తించారు. పూర్తిగా ఉన్న ఆ 3 వేలి ముద్రలు ఎవరివన్నది ఇప్పటివరకు తేలలేదు. సీబీఐ ఆ విషయాన్నే పట్టంచుకోలేదు. ఆ వేలి ముద్రలెవరివో గుర్తిస్తే అసలు దోషులెవరో తెలుస్తుంది కదా? సీబీఐ వేధింపులపై ఫిర్యాదులు బుట్టదాఖలు వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి పేర్లు చెప్పాలని సీబీఐ తనను చిత్రహింసలకు గురి చేసిందని... ఇంకా వేధిస్తోందని కల్లూరు గంగాధర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా సీబీఐ స్పందించ లేదు. ఎంపీ అవినాశ్, భాస్కర్‌రెడ్డి పేర్లు చెప్పాలని సీబీఐ తనను వేధిస్తోందని ఉదయ్ కుమర్‌రెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా సీబీఐ తీరు మారలేదు. కొత్త బృందం...పాత కక్షే..: వివేకా హత్య కేసులో రామ్‌సింగ్ నేతృత్వంలోని సీబీఐ అధికారుల బృందం గతంలో ఎంత అసంబద్ధంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు. తాము చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలం రాసుకున్నారని పలువురు సాక్షులు వాపోయారు. తాము కోరుకున్నట్లు వాంగ్మూలమివ్వాలని చిత్రహింసలకు గురి చేస్తోందని మరికొందరు బాధితులు పోలీసులను కూడా ఆశ్రయించారు. దాంతో ఈ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ అధికారి రామ్సింగ్ను న్యాయస్థానం తొలగించి కొత్త బృందాన్ని నియమించాలని సీబీఐని ఆదేశించింది. కొత్త అధికారుల బృందం వస్తే కొత్త కోణంలో దర్యాప్తు చేసి కొత్త అంశాలను వెలికి తీస్తారని అంతా ఆశించారు. కానీ కొత్త బృందం వచ్చింది కానీ ఒక్క కొత్త ఆధారాన్ని కూడా కనుగొనలేదు. పైగా పాత బృందం అసంబద్ధంగా చేసిన దర్యాప్తునే ఆధారంగా చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ఏప్రిల్ 30లోగా కేసు దర్యాప్తును ముగించాలన్న ఉద్దేశంతో కక్షపూరితంగా కొందర్ని లక్షంగా చేసుకుని వ్యవహరిస్తోందన్నది తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఉదయ్‌కుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిల అరెస్టుకు గతంలో సీబీఐ బృందం చెప్పిన అహేతుక కారణాలనే కొత్త బృందం కూడా వల్లేవేయడం విస్మయపరుస్తోంది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు సీబీఐ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న మరో అంశం... వివేకానందరెడ్డి రెండో వివాహం...దాంతో ఆ కుటుంబంలో తలెత్తిన తీవ్ర విభేదాలు, ఆస్తి తగాదాలు. వీటిని సీబీఐ నామమాత్రంగానైనా దర్యాప్తు చేయకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందన్నది ప్రశ్నగా మారుతోంది. షమీమ్ అనే ముస్లిం మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారని.. వాళ్లిద్దరికీ ఒక కుమారుడు కూడా పుట్టాడని... ఆ కుమారుడికి ఆస్తిలో భాగంతో పాటు తన రాజకీయ వారసుడిగా చేస్తానని ప్రకటించారన్నది ఆ జిల్లాలో అందరికీ తెలిసిందే. దాంతో వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి ఆయనతో తీవ్రంగా గొడవపడ్డారు. ఆయన్ని వదిలి కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. వివేకా ఒక్కరే పులివెందులలో ఉంటున్నారు. బెంగళూరులో ఓ భూమి సెటిల్మెంట్ ద్వారా వచ్చే రూ.2 కోట్లను తన రెండో భార్యకు ఇవ్వాలని వివేకా నిర్ణయించారు. దాంతో సునీత ఆయనతో గొడవపెట్టుకున్నారు. అంతేకాక సునీత, ఆమె భర్త నర్రెడ్డి, బావగారు శివ ప్రకాశ్‌రెడ్డి షమీమ్ ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగారు. వివేకాను విడిచిపెట్టకపోతే ఆమె కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీమ్, వైఎస్ సునీత మధ్య వాట్సాప్‌లో వాదోపవాదాలు సాగాయి. ఒకర్ని ఒకరు దూషించుకున్న వాట్సాప్ మెస్సేజులను కూడా గతంలో సిట్ అధికారులు గుర్తించారు. షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని... ఆమె కుమారుడికి హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నా... అవ్వడం లేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఈ వారసత్వ, ఆస్తి గొడవలే వివేకా హత్యకు ప్రధాన కారణమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వివేకానందరెడ్డి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బామమరిదికే ఎక్కువ ప్రయోజనం. కానీ సీబీఐ మాత్రం ఈ కీలకాంశాలన్నిటినీ విస్మరిస్తూ ఏకపక్షంగా కక్షపూరితంగా దర్యాప్తు చేస్తోందనే విమర్శలున్నాయి. ఆనాడు చంద్రబాబు రాజీనామా చేశారా...! భాస్కర్‌రెడ్డి అరెస్టుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుండటం విడ్డూరంగా ఉంది. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైఎస్ వివేకా హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉందని సునీత అప్పట్లోనే ఆరోపించారు. మరి ఆ రోజు చంద్రబాబు తన పదవికి రాజీనామా చేశారా...! వైఎస్ వివేకా హత్యపై మొదటిసారి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. మూడు నెలలు టీడీపీ అధికారంలో ఉంది. మరి ఆ 3 నెలల్లో వైఎస్ వివేకా హత్య వెనుక భాస్కర్‌రెడ్డి, అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని సిట్ ఎందుకు ఆధారాలు చూపించలేకపోయింది?. వైఎస్ కుటుంబంలోని వారి పాత్ర ఉందంటే చంద్రబాబు ఆ కేసును తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని ఉండేవారు కదా. మరి ఆనాడు సిట్ పోలీసులతోపాటు టీడీపీ నేతలు కూడా వైఎస్ వివేకా హత్య వెనుక భాస్కర్‌రెడ్డి కుట్ర ఉందని చెప్పనే లేదు కదా. అంటే ఆ హత్య వెనుక వారి ప్రమేయం లేనట్టే కదా. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఏనాడూ సిట్ దర్యాప్తును ప్రభావితం చేయలేదు. సీబీఐ దర్యాప్తునకు కూడా హైకోర్టు సాక్షిగా సమ్మతించారు. విచారణను తెలంగాణకు మారుస్తామన్నా కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ సమ్మతిని తెలిపింది తప్ప వ్యతిరేకించ లేదు కదా?. ఇది చాలదూ వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవస్థలను ఎంత గౌరవిస్తోందో చెప్పటానికి? -
నిజాలు దాచి దర్యాప్తా?
సాక్షి, పులివెందుల: ‘అత్యున్నత స్థాయి విచారణ సంస్థ దిగజారి ప్రవర్తిస్తోంది. కీలక అంశాలను మరుగు పరుస్తూ, సిల్లీ అంశాల ఆధారంగా విచారణ చేస్తోంది. పర్సన్ టార్గెట్ ఇన్వెస్టిగేషన్ కాదు.. ఫ్యాక్ట్ టార్గెట్ ఇన్వెస్టిగేషన్ చేయాలని సీబీఐ డైరెక్టర్, డీఐజీ, కొత్తగా నియమితులైన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను కలిసి అభ్యర్థించినా ఆ దిశగా కనీస విచారణ చేపట్టలేదు’ అని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఆదివారం పులివెందులలో ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని ఊహించని విధంగా అరెస్టు చేశారని, మాటలు రానంత బాధగా ఉందన్నారు. వ్యతిరేక శక్తులు, వ్యతిరేక మీడియాతో పోరాటం చేయడంలో నిజాయితీ నిరూపించుకోవడం సవాల్‌గా నిలుస్తోందని చెప్పారు. సీబీఐ కీలక అంశాలను డౌన్‌ప్లే చేసి, సిల్లీ అంశాల ఆధారంగా ఎందుకు విచారణ కొనసాగిస్తోందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుపటి అధికారి చేసిన రోల్ కంటిన్యూ చేయడం మినహా విచారణలో ప్ర«ధాన కోణం వెలుగు చూడడం లేదన్నారు. ఇలా అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడిన కొద్ది గంటలకే సోమవారం మరోమారు విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇవ్వడం గమనార్హం. అవినాష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడిన అంశాలు ఇంకా ఇలా ఉన్నాయి. డెత్ నోట్ దాచి పెట్టింది అల్లుడే.. ♦వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని తెలిసీ, డెత్ నోట్ చదివి వినిపించిన పీఏ కృష్ణారెడ్డితో దానిని ఎవరికీ చూపించకుండా దాచి పెట్టమని అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశించారు. ఆ మేరకు కృష్ణారెడ్డి ఆయన చెప్పినట్లే చేశారు. వాస్తవాలు చెప్పకుండా ఘటనా స్థలం వద్దకు నన్ను వెళ్లమని నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి ఫోన్లో కోరారు. ♦నేను అక్కడికి వెళ్లి చూశాక ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చాను. హత్య విషయం నా కంటే గంట ముందుగా వివేకా అల్లుడికి తెలుసు. పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన ఆయన విషయాన్ని దాచారు. వివేకా హత్య విషయాన్ని ముందుగా పోలీసులకు తెలిపింది నేనే. సీఐ శంకరయ్యకు స్వయంగా మూడు సార్లు ఫోన్ చేశాను. 35 నిమిషాల తర్వాత సీఐ వచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన నన్నే దోషిగా చూపిస్తున్నారు. ♦ఆ రోజు జమ్మలమడుగుకు వెళ్తున్న నాకు ఫోన్ రావడంతో కృష్ణాలయం సమీపం నుంచి వెనుతిరిగి వచ్చాను. నేనొక్కడినే కాకుండా, నాతో పాటు నాలుగు వాహనాలు ఉన్నాయి. మీరు చెబుతున్న గూగుల్ టేకౌట్ ద్వారా పరిశీలించుకోండి. వాస్తవమో కాదో తెలుస్తుంది. డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి.. ♦ఏ–4 దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన స్టేట్మెంట్లో వివేకా హత్య అనంతరం స్టాంప్డ్ డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాతే ఇంట్లో నుంచి బయటికి వచ్చినట్లు చెప్పాడు. దీనిని బట్టి డాక్యుమెంట్లు దొంగిలించారని స్పష్టం అవుతోంది. అలాంటప్పుడు దొంగతనానికి చెందిన సెక్షన్లు సీబీఐ ఎందుకు పెట్టలేదు? ♦తన ఐడియా ప్రకారమే డెత్‌నోట్‌లో డ్రైవర్ ప్రసాద్ పేరు రాయించానని దస్తగిరి చెబుతున్నాడు. దస్తగిరి చంపి, సంబంధం లేని వారిపై ఆరోపణలు చేస్తున్నాడు. ఆ మేరకు ఉన్న ఐపీసీ సెక్షన్లు ఎందుకు పెట్టలేదు? మరోవైపు వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్లో హత్యలో పాల్గొన్న నలుగురి పేర్లతో సహా చెబుతారు. అయినా నిందితుల్లో ఒకరిని సాక్షిగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇవన్నీ చూస్తే కలిసికట్టుగా పద్ధతి ప్రకారం విచారణ సాగుతోందని అర్థమవుతోంది. ♦ఏప్రిల్ 3న రిజిస్టర్ పోస్టు ద్వారా సీబీఐ డైరెక్టర్, డీఐజీ, ప్రస్తుత ఐఓకు పలు వివరాలు ఆధారాలతో పంపించాను. 5వ తేదీ మనిషి ద్వారా కూడా వారికి చేర్చాను. ఏమాత్రం మార్పు లేదు. బెంగళూరు సెటిల్మెంట్లో రూ.8 కోట్లు రావాల్సి ఉండగా, ఆ డబ్బులో సగం ఇవ్వాలని డిమాండ్ చేసిన తర్వాత జరిగిన ఘర్షణలో చంపినట్లు దస్తగిరి చెబుతాడు. ♦వాస్తవంలో అవి ఫేక్ డాక్యుమెంట్లు అని తేలిపోయింది. అసలే రాని, లేని డబ్బు కోసం గొడవ జరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలను ఎందుకు సీబీఐ ఛేదించడం లేదు? డాక్యుమెంట్లు తీసుకెళ్లామని దస్తగిరి చెబుతున్నాడు.. ఆ డాక్యుమెంట్లను ఎందుకు రికవరీ చేయలేదు? అందులో ఏముంది? అన్న విషయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. సునీతక్క వర్షన్ సడన్‌గా మారింది ♦ 2019 మార్చి 15న హత్య జరిగితే, టీడీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో వైఎస్ కుటుంబం ఔన్నత్యాన్ని సునీతక్క స్పష్టంగా వివరించింది. సీఎంగా వైఎస్ జగనన్నను, ఎంపీగా నన్ను చేసుకోవాలని కొద్ది నెలలుగా వైఎస్ వివేకానందరెడ్డి తపన పడ్డారని ఆమె స్పష్టంగా తెలిపింది. ఒక సంవత్సరం వరకూ బాగా మాట్లాడేది. ఎర్రగంగిరెడ్డి వైఖరిపై నా అభిప్రాయం కూడా కోరింది. చెప్పాను. సడన్‌గా వైఖరి మార్చుకొని ఢిల్లీకి వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలు చేసింది. కారణమేంటో సునీతక్కే చెప్పాలి. ♦హత్యలో స్వయంగా పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి ముందస్తు బెయిల్ కోసం సీబీఐ నో అబ్జక్షన్ చెబుతోంది. రెండేళ్లుగా కోర్టులో ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అయ్యే సునీతమ్మ, దస్తగిరి ముందస్తు బెయిల్‌కు మాత్రం అభ్యంతరం చెప్పరు. ఆ తర్వాత అప్రూవర్ అనే అబద్ధాల కట్టడం వెలుగులోకి వచ్చింది. ♦అప్రూవర్‌గా మారితే కేసు విచారణ పూర్తయ్యే వరకు లోపల ఉండాల్సి వస్తుంది కాబట్టి ముందస్తు బెయిల్‌కు అభ్యంతరం చెప్పడం లేదు. అటు సీబీఐ, ఇటు సునీతమ్మ కలిసికట్టుగా ప్రణాళిక బద్ధంగా కేసును పక్కదాది పట్టిస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతోంది. మేము ఏ తప్పూ చేయలేదు ♦మా నాన్న 40 ఏళ్లుగా మీ అందరికీ తెలుసు. మా మనస్తత్వాలు తెలుసు. నా నిజాయితే నన్ను గెలిపిస్తోంది. వివేకం సార్ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మేము ఇసుమంతైనా తప్పు చేయలేదు. ఎల్లో మీడియా విష ప్రచారాలను నమ్మొద్దు. ♦2009 నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. తొలుత లింగాల మండలం ఇన్ఛార్జిగా పని చేశా. పదేళ్లుగా నేనేంటో అందరికీ తెలుసు. ఈ 3650 రోజుల్లో 1500 రోజులు ఉదయ్‌కుమార్‌రెడ్డి నాతో కలిసి ఉంటాడు. కానీ ఆ రోజు ఉదయమే వచ్చినట్లు చెబుతున్నారు. ఇంకో విషయం.. థర్డ్ పర్సన్ ఫోన్ కోసం నేను వెయిట్ చేసినట్లు మరో విషయాన్ని చెబుతున్నారు. అదే వాస్తవమైతే నేనే అక్కడికి ఎవర్నో పంపించి ఫోన్ చేయించుకునే వాడిని కదా.. చాలా సిల్లీ థింగ్స్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ♦విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది. అప్రూవర్ అనే అబద్దాల కట్టడం కోర్టులో నిలిచే అవకాశమే లేదు. మాకు పదవులపై వ్యామోహం లేదు. న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. వ్యవస్థలపై గౌరవం ఉంది. న్యాయం కోసం పోరాటం చేస్తాం. వ్యక్తి టార్గెట్‌గా చేస్తున్న విచారణలో తుదకు న్యాయమే గెలుస్తుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు సాక్షి ప్రతినిధి కడప : కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో మరోసారి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. -
ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు
సాక్షి ప్రతినిధి కడప: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో మరోసారి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. -
భాస్కర్ రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేయించారు: ఎంపీ అవినాష్ రెడ్డి
-
విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది: అవినాష్ రెడ్డి
సాక్షి, పులివెందుల: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. పులివెందులలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. ఇక, భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. ‘భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేయించారు. ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటాం. మేం చెప్పిన అంశాలను సీబీఐ పరిశీలించలేదు. లెటర్ దాచిపెట్టామని వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు. హత్య విషయం నా కంటే గంట ముందు వివేకా అల్లుడికి తెలుసు. కీలక అంశాలను సీబీఐ విస్మరిస్తోంది. వివేకా హత్య విషయాన్ని ముందుగా పోలీసులకు చెప్పింది నేనే. పోలీసులకు సమాచారం ఇచ్చిన నన్నే దోషిగా చూపిస్తున్నారు. నేను గాలి మాటలు.. గాలి కబుర్లు చెప్పడం లేదు. సాక్షులు చెప్పిన స్టేట్మెంట్ల ఆధారంగానే చెబుతున్నాను. చదవండి: వివేకా హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు? సీబీఐ నమ్ముకున్న దస్తగిరి స్టేట్మెంట్లోనే అనేక కీలక అంశాలున్నాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. డాక్యుమెంట్లు చోరి కాబడ్డ ఏ4పై ఎందుకు కేసు నమోదు కాలేదు. ఏ4కి ఎందుకు ఇంత రిలీఫ్ ఇస్తున్నారు. కలిసికట్టుగా ఎవరిపైనో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్రూవర్‌గా మార్చేందుకు యాంటిసిపేటరీ బెయిల్ వేయించారు. అప్రూవర్‌కు సహకరించి సీబీఐ బెయిల్ ఇప్పించింది. వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరుతున్నాను. ఏప్రిల్ 3న మా అభ్యంతరాలను సీబీఐ దృష్టికి తీసుకెళ్లాం అని అన్నారు. చదవండి: రెండో వివాహంతోనే కుటుంబంలో తీవ్ర విభేదాలు! పోలీసులు రావొద్దని నేను చెప్పాననడం దారుణం. పాత అధికారి చేసిన విచారణనే కొత్త బృందం ఫాలో అవుతోంది. వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరుతున్నాను. రెండో భార్యకు ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారు. స్టాంపు పేపర్లు పోతే సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదు. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత స్టాంప్ పేపర్ల పరిశీలన, దొంగతనం జరిగింది. చోరీ కేసు ఎందుకు పెట్టలేదు.. ఆ దిశగా ఎందుకు విచారించలేదు?. సునీత, సీబీఐ ఒక లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నాయి. వివేకా.. షేక్ మహ్మద్ అక్బర్‌గా 2010లో పేరు మార్చుకున్నారు. వివేకాకు పెహన్ షా అనే కుమారుడు ఉన్నాడు. వివేకా రాసిన లెటర్ అక్కడే ఉంది. లెటర్ దాచిపెట్టామని వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు. విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది. మాకు పదవులపై వ్యామోహం లేదు. వ్యవస్థలు, న్యాయస్థానాలపై మాకు గౌరవం ఉంది. చివరకు నిజాయితీయే గెలుస్తుంది’ అని తెలిపారు. చదవండి: భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానికుల ర్యాలీ -
వివేకా హత్య వెనక వారసత్వం పోరు ఉందనే ప్రచారం: అవినాష్ రెడ్డి
-
‘వివేకా హత్యలో దస్తగిరి పాల్గొన్నాడు’
సాక్షి,హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. గురువారం వైఎస్ భాస్కరరెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించగా, ఆపై సీబీఐ కూడా తమ వాదనలు వినిపించింది. వివేకా కేసులో దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టించిందని.. భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని భాస్కర్‌రెడ్డి తరపున లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు. కేసుతో భాస్కర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను ఇరికించే కుట్ర జరుగుతోంది. సీబీఐ ఉద్దేశపూర్వకంగానే.. మా క్లయింట్లను లాగే ప్రయత్నం చేస్తున్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని వ్యతిరేకిస్తున్నాం. వివేకా హత్యలో దస్తగిరి పాల్గొన్నాడు. అలాంటిది నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చేసి.. దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టించింది. ఒక నిందితుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మా క్లయింట్లను ఈ కేసులోకి ఎలా లాగుతారు. గూగుల్ టేక్అవుట్ ఫొటోలను ఎలా ఆధారంగా చూపిస్తారు?. ఇది ముమ్మాటికీ మా క్లయింట్స్‌ను ఇరికించే ప్రయత్నమే అంటూ లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు. ఇక సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మాజీ మంత్రి వివేకానందరెడ్డిది హత్యేనేని, వివేకాను ఎవరు హత్య చేశారన్నది తేలాల్సి ఉందని, సుప్రీం కోర్టు ఈ కేసును దగ్గరగా పర్యవేక్షిస్తోందని వాదించింది. ఈ తరుణంలో ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. -
ఇడుపులపాయ పంచాయతీ వీరన్న గట్టులో ఎంపీ అవినాశ్ రెడ్డి పర్యటన
-
అవినాశ్, భాస్కర్‌రెడ్డిలను ఇరికించే కుట్ర
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును టీడీపీ నేతలు, వైఎస్ సునీత కలసి తప్పుదారి పట్టిస్తున్నారని, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిలను కేసులో ఇరికించేందుకు కుట్ర సాగుతోందని భాస్కర్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. టీడీపీ నేతలు, సునీతకు సీబీఐ దర్యాప్తు అధికారి కూడా పూర్తిగా సహకరించారని చెప్పారు. దర్యాప్తు సరిగా చేయడం లేదని భావించిన సుప్రీంకోర్టు ఆ అధికారిని విచారణ నుంచి తప్పించిందని వివరించారు. ప్రత్యక్ష సాక్షులను, ఆధారాలను పట్టించుకోకుండా దస్తగిరి తప్పుడు వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించినా, బెయిల్ ఇచ్చినా సునీత మౌనంగా ఉండటం వెనుక కుట్ర దాగి ఉందని వెల్లడించారు. ‘వివేకా హత్య కేసులో సీబీఐ చెప్పినట్లు ఏ–4 దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. దాని ఆధారంగా నన్ను, మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని, అతనికి బెయిల్ ఇస్తూ కిందికోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలి. నన్ను, మరికొందరిని నిందితులుగా చేర్చవద్దని ఆదేశాలివ్వాలి’ అని కోరుతూ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘హత్య కేసులో నిందితుడైన కిరాయి హంతకుడికి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని సుప్రీం కోర్టు పలు తీర్పులిచ్చింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలంలో చెప్పిన వాటికి సాక్ష్యం లేదు. ఇలా ఎలాంటి సాక్ష్యం లేకుండా ఒకరు చెప్పారంటూ వ్యక్తులను నేరంలోకి నెట్టడం చట్టవ్యతిరేకం. నేరంలో నలుగురు పాలుపంచుకున్నారు. వీరిలో తక్కువ నేరం చేసిన వారు జైలులో ఉండగా, కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్ ఇచ్చారు. దస్తగిరిని కస్టడీలోకి తీసుకోలేదు. విచారణా జరపలేదు. గంగిరెడ్డి ఆదేశాల మేరకు దస్తగిరి హత్యలో కీలక పాత్ర పోషించాడు. దీని కోసం భారీ మొత్తంలో నగదు కూడా తీసుకున్నాడు. అతని వద్ద కొంత నగదు కూడా దొరికింది. ఆయుధాన్ని అతనే తెచ్చినట్లు, హత్యలో ప్రధాన పాత్ర పోషించినట్లు కూడా ఒప్పుకున్నాడు. ఇంత చేసినా అతన్ని అప్రూవర్‌గా ప్రకటించేలా కడప కోర్టులో సీబీఐ కౌంటర్ వేసింది. 2021 ఆగస్టులో అనుకూల వాంగ్మూలం ఇచ్చిన కారణంగానే అక్టోబర్‌లో బెయిల్‌కు సీబీఐ సహకరించింది. మన వెనుక అవినాశ్, భాస్కర్‌రెడ్డి లాంటి కీలక వ్యక్తులు ఉన్నారని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని సీబీఐ చెబుతోంది. అసలు ఎవరి పేర్లూ చెప్పలేదని గంగిరెడ్డి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ అంశాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోవడంలేదు. వారికి ఏది కావాలో దాన్నే పరిగణనలోకి తీసుకుని విచారణ చేస్తు్తన్నారు. గూగుల్ టేక్ అవుట్ డేటాను ఆధారంగా చేసుకోవడం సరికాదు’ అని నిరంజన్‌రెడ్డి వాదించారు. టీడీపీతో సునీత మిలాఖత్ ‘వివేకా తన వారసుడిగా రెండో భార్య కుమారుడిని ప్రకటించారు. ఇది మొదటి భార్య, కూతురు సునీత, అల్లుడికి నచ్చలేదు. ఆస్తుల విషయంలోనూ వారి మధ్య తీవ్రమైన మనస్పర్థలు వచ్చాయి. గంగిరెడ్డితో వివేకాకు నగదుకు సంబంధించిన విభేదాలు కూడా ఉన్నాయి. అలాగే తన తల్లితో వివేకా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సునీల్ యాదవ్ చెప్పాడు. ఇలాంటి వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగింది. వీటిని కూడా సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు. అవినాశ్‌తో వివేకా సన్నిహితంగా ఉండేవారు. ఎన్నికల్లో అవినాశ్ విజయం కోసం ప్రచారం కూడా చేశారు. వివేకా హత్య తర్వాత ఇదే విషయాన్ని సునీత కూడా చెప్పారు. టీడీపీతో ఆమె మిలాఖత్ అయినప్పటి నుంచి మాట మార్చారు. విభేదాలు ఉన్న వారిని వదిలిపెట్టి.. సన్నిహితులను కేసులో ఇరికించేందుకు పథకం సాగుతోంది. దస్తగిరిపై వాచ్‌మేన్ రంగన్న చెప్పిన ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదు. దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడం చట్టవిరుద్ధం. అతనికి బెయిల్ ఇచ్చే సమయంలోనూ అన్ని అంశాలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. బెయిల్ చట్టప్రకారం ఇవ్వలేదు కనుక కడప కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలి. దర్యాప్తు అధికారులకు అవినాశ్, భాస్కర్‌రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారు. విచారణకు హాజరవుతున్నారు. భాస్కర్‌రెడ్డిని నిందితుడిగా చేర్చవద్దని సీబీఐని ఆదేశించాలి’ అని నిరంజన్‌రెడ్డి నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
‘వివేకా కేసులో సునీత మౌనం వహిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. నిందితులకు వ్యతిరేకంగా బలంగా సాక్ష్యాలున్నాయని, అలాగే ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సైతం సీబీఐ పరిగణనలోకి తీసుకోవడం లేదని భాస్కర్‌రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో భాస్కర్ రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం వాదనలు జరిగాయి. నిందితుడు దస్తగిరిని అఫ్రూవర్ గా పరిగణించడాన్ని సవాల్ చేస్తూనే.. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ వీళ్లు పిటిషన్లు దాఖలు చేశారు. వివేకా కేసులో భాస్కర్‌రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణకు సీబీఐ ఎస్పీ వికాస్ కుమార్ సైతం హాజరయ్యారు. ఇక ఈ కేసులో వివేకా పీఏ కృష్ణారెడ్డి తరపున లాయర్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. అలాగే.. భాస్కర్‌రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్‌రెడ్డి ఇవాళ వాదనలు వినిపించారు. ‘‘వివేకా రెండో భార్య కుమారుడిని వారసుడిగా ప్రకటించడంతో.. వారి కుటుంబంలో తీవ్ర విభేదాలు వచ్చాయి. సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులను వేధించారనే వివేకాపై కక్ష పెంచుకుని హత్యకు కుట్ర పన్నారు. రాజకీయంగా టీడీపీ సునీతతో కలిసి.. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపై కుట్ర పన్నార’’ని నిరంజన్‌రెడ్డి వాదించారు. సీబీఐ కూడా దస్తగిరి వాంగ్మూలంపైనే ఆధారపడి విచారిస్తోందని నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన నిందితుడు దస్తగిరి తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. సాక్ష్యాధారాలు నిందితులకు వ్యతిరేకంగా.. బలంగా ఉన్నాయి. అయినా దస్తగిరికి బెయిల్ సహా అప్రూవర్‌గా పరిగణించడంపై సునీత మౌనం వహిస్తున్నారని నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. వాదనలు ముగియడంతో విచారణను ఎల్లుండి(గురువారానికి) వాయిదా వేసింది కోర్టు. ఇదీ చదవండి: వివేకా కేసులో రంగన్న చెప్పింది సీబీఐ పట్టించుకోదా? -
ముగిసిన ఎంపీ అవినాశ్‌రెడ్డి సీబీఐ విచారణ
సాక్షి, హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. మరోసారి సీబీఐ విచారణలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన అవినాశ్‌రెడ్డిని సుమారు నాలుగు గంటపాటు అధికారులు ప్రశ్నించారు. న్యాయవాది సమక్షంలో అవినాశ్‌రెడ్డిని సీబీఐ విచారించింది. కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు విన్న అనంతరం అరెస్టు సహా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. తాము తీర్పు వెలువరించే వరకు ఈ మధ్యంతర ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. తనను విచారణకు హాజరు కావాలని ఆదేశించడంపై స్టే విధించాలని కోరుతూ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ విచారణ చేపట్టినా ఆడియో, వీడియో రికార్డింగ్‌తోపాటు దర్యాప్తు పారదర్శకంగా సాగేలా సీబీఐని ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిష న్పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌పైనా తీర్పు రిజర్వు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
తీర్పు వచ్చేవరకు ఎంపీ అవినాష్ రెడ్డిపై ఎలాంటి చర్యలొద్దు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు విన్న అనంతరం అరెస్టు సహా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తాము తీర్పు వెలువరించే వరకు ఈ మధ్యంతర ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. తనను విచారణకు హాజరు కావాలని ఆదేశించడంపై స్టే విధించాలని కోరుతూ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ విచారణ చేపట్టినా ఆడియో, వీడియో రికార్డింగ్‌తోపాటు దర్యాప్తు పారదర్శకంగా సాగేలా సీబీఐని ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిష న్పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌పైనా తీర్పు రిజర్వు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. (చదవండి : రెండో వివాహంతోనే కుటుంబంలో తీవ్ర విభేదాలు) రాజకీయ ఒత్తిళ్లతోనే అభియోగాలు.. ‘సునీత పిటిషన్ వెనుక సీబీఐ హస్తం ఉంది. కొందరు రాజకీయ నేతల ఒత్తిళ్లతోనే ఆమె పిటిషనర్‌పై అభియోగాలు మోపారు. తన తండ్రి పిటిషనర్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారని, ఇంటింటికి తిరిగారని హత్య జరిగిన అనంతరం కూడా చెప్పిన సునీత ఏడాది తర్వాత మాట మార్చారు. ఆ తర్వాత నుంచి పిటిషనర్‌పై ఆరోపణలు చేయడం ప్రారంభించారు. వివేకా హత్య కేసులో అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, హతుడి రెండో భార్య షమీమ్ పాత్రపై సీబీఐ విచారణ సాగించడం లేదు. వివేకా 2010లో రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు జన్మించాడు. రెండో పెళ్లి కారణంగానే వివేకా కుటుంబంలో విభేదాలు వచ్చాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో మనస్ఫర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలో తన పేరుతో ఉన్న ఆస్తులను రెండో భార్య పేరుతో రాయాలని వివేకా భావించారు. ఆస్తుల గొడవల వల్లే వివేకా హత్య జరిగింది. ఈ కేసులో రెండో పెళ్లి కూడా కీలక అంశం. సీబీఐ ఆ దిశగా విచారణ చేయాలి. వివేకాది గుండెపోటని పిటిషనర్ ఎక్కడా చెప్పలేదు. స్థానిక రాజకీయ నేత శశికళతో పిటిషనర్ అసలు మాట్లాడనే లేదు. ఆమె కూడా ఇదే విషయాన్ని సీబీఐకి చెప్పింది. ఇదే కోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. అందులో శశికళ గురించి కూడా ప్రస్తావించారు. ఇప్పటివరకు సీబీఐ రెండు చార్జీషీట్లు దాఖలు చేసినా ఎక్కడా సిట్ దర్యాప్తు నివేదికను కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో 14న సీబీఐ విచారణకు పిటిషనర్ హాజరుకాకుండా ఆదేశాలివ్వాలి’ అని నిరంజన్‌రెడ్డి కోరారు. (చదవండి : వివేక హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు?) సీల్డ్ కవర్లో వివరాలు... వివేకా హత్య కేసు డైరీని సీబీఐ సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది. 35 మంది సాక్షుల వాంగ్మూలం, 10 డాక్యుమెంట్లు, కొన్ని ఫొటోలు, హార్డ్‌డిస్క్‌లను కోర్టు ముందుంచింది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖ, ఎఫ్ఎస్ఎల్ నివేదికను సైతం సమర్పించింది. కేసుకు సంబంధించి ఆధారాలను ధ్వంసం చేసినట్లు పిటిషనర్‌పై ఆరోపణలున్నాయని, ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయవద్దని కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ కార్యాలయం ఎదుట మీడియాకు వివరాలను ఎంపీ వెల్లడించడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. ఈనెల 14న విచారణ హాజరు నుంచి మినహాయింపు కోరే అంశంపై సీబీఐనే ఆశ్రయించాలంది. ఈ కేసు విచారణ హైదరాబాద్‌కు బదిలీ అయ్యాక పిటిషనర్ తండ్రి భాస్కర్‌రెడ్డిని కడపలో హాజరు కావాలని ఎందుకు పిలిచారని సీబీఐని ప్రశ్నించింది. తాము పిలవలేదని సీబీఐ తెలిపింది. కాగా తన మీద, తన కుటుంబంపైనా ఆరోపణలు చేశారని అందుకే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశానని సునీత నివేదించారు. -
కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు: ఎంపీ అవినాష్ రెడ్డి
-
వివేకా హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కొన్ని కీలక అంశాలు విస్మరిస్తున్నారని చాలా రోజులుగా ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఓ కేసు కూడా నమోదయింది. గత ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై స్పందించిన న్యాయస్థానం ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. ఇన్నాళ్లూ సీబీఐ కప్పిపుచ్చేందుకు యత్నించిన కొన్ని కీలక వాస్తవాలు న్యాయస్థానంతో పాటు ప్రజల దృష్టికి వచ్చాయి. ఆ వివరాలు, సమాధానాలు లేని ప్రశ్నలు ఓ సారి చూద్దాం. 1. లేఖ విషయం ఎందుకు దాచి పెట్టారు? మార్చి 15, 2019న వివేకానందరెడ్డి హత్యకేసు వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా తన సెల్‌ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు వాట్సాప్ చేశారు. వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాశ్‌రెడ్డి.. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు ఫోన్ చేస్తే వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం వివేకా స్వదస్తూరితో రాసిన లేఖ, ఆయన వాడుతున్న సెల్‌ఫోన్. వీటి విషయంలో సొంత కుటుంబ సభ్యులు పాటించిన గోప్యత అనుమానస్పదంగా ఉంది. వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్‌ఫోన్‌ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పీఏ కృష్ణారెడ్డికి రాజశేఖరరెడ్డి ఆదేశించారు. వారు పులివెందుల చేరుకున్న తర్వాత సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌లు, ఇతర వివరాలను డిలీట్ చేసిన తర్వాతే వాటిని పోలీసులకు అప్పగించారని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ కూడా కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్‌రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు కుట్రపన్ని ఉండొచ్చు. వివేకా హత్య అనంతరం ఆయన కుటుంబ సభ్యుల పాత్ర సందేహాస్పదంగా ఉందని ఆమె కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 2. హత్యకు, వివేకానందరెడ్డి రెండో పెళ్లి, కుటుంబానికి ఉన్న లింకేంటీ? షమీమ్ అనే మహిళను కొన్నాళ్ల కింద వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారు. ఇది కుటుంబ సభ్యులకు ఏ మాత్రం నచ్చలేదు. ముఖ్యంగా ఈ పెళ్లి కారణంగా వివేకానందరెడ్డికి, ఆయన కుమార్తె, అల్లుడు, పెద్దబావమరిదితో బాగా అంతరం పెరిగినట్టు పులివెందులలో చెబుతారు. ఇదే విషయాన్ని కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పేర్కొన్నారు. ‘వైఎస్ వివేకానందరెడ్డి షమీమ్ అనే మహిళను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారి తీశాయి. బెంగళూరులో భూ సెటిల్మెంట్ ద్వారా వచ్చే రూ.4 కోట్లను తన రెండో భార్య షమీమ్‌కు ఇస్తాననడంతోపాటు ఆమె ద్వారా తనకు కలిగిన కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని వివేకానందరెడ్డి చెప్పారు. ఇది మొదటి భార్య, కుటుంబానికి నచ్చలేదు.‘ రెండు కుటుంబాల మధ్య తలెత్తిన ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలే ఈ హత్యకు కారణమని ఈ కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. 3. వివేకాకు ఉన్న వివాదాలేంటీ? వివేకానందరెడ్డికి ఆయన అనుచరుడిగా ఉన్న కొమ్మా పరమేశ్వరరెడ్డికి మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దాంతో కక్ష పెంచుకున్న పరమేశ్వరరెడ్డి... వివేకా రాజకీయ ప్రత్యర్థి బీటెక్ రవికి సన్నిహితుడిగా మారారు. ఈ విషయాన్ని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ కూడా కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ‘ వివేకా హత్యకు ముందు ఎలిబీ సృష్టించుకునేందుకు పరమేశ్వరరెడ్డి 2019 మార్చి 13న అనారోగ్యం నెపంతో కడపలోని సన్‌రైజ్ ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరారు. కానీ ఎవరికీ తెలియకుండా 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యాడు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్షకు అతను తిరస్కరించడం సందేహాలకు తావిస్తోందని‘ తులసమ్మ కోర్టుకు విన్నవించారు. అలాగే వైఎస్సార్ కడప జిల్లాకే చెందిన వైజీ రాజేశ్వరరెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థిరపడ్డాడు. ఆయన రాజకీయ ప్రత్యర్థి నారాయణరెడ్డిని వైఎస్సార్సీపీలోకి తీసుకురావాలని వివేకా భావించడంతో కక్ష పెంచుకున్నాడని, వైఎస్ వివేకాపై అప్పటికే కక్షగట్టిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి హైదరాబాద్‌లో వైజీ రాజేశ్వరరెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారని కూడా తులసమ్మ తెలిపారు. 2019 మార్చి 14న పులివెందులకు చెందిన నీరుగుట్టు ప్రసాద్ ఉద్దేశ పూర్వకంగానే వివేకా ఇంటికి ఉత్తరం వైపు తలుపు గడియ పెట్టకుండా వెళ్లిపోయారని, హంతకులు ఆ రోజు వివేకా ఇంటిలోకి ప్రవేశించి హత్య చేసేందుకు వీలుగా ఈ పని జరిగిందని ఆరోపించారు. సీబీఐ ఈ కేసు విషయంలో అనుసరిస్తున్న తీరుపట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడంతోపాటు అతని ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించక పోవడం సీబీఐ దురుద్దేశాలను వెల్లడిస్తోంది. ఈ హత్యలో అసలు కుట్రదారులుగా భావిస్తున్న నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, బీటెక్ రవి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను సీబీఐ విచారించనే లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు -
వివేకా హత్య కేసు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ అవినాష్‌రెడ్డిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు విచారించిన ఆడియో, వీడియో రికార్డులను హార్డ్ డిస్క్ రూపంలో మంగళవారం కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఎంపీ అవినాష్‌రెడ్డి రిట్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. గతంలో రెండు సార్లు విచారణలో ఆడియో, వీడియో రికార్డులు చేశారా అని హైకోర్టు.. సీబీఐని ప్రశ్నించింది. ఏ 4గా ఉన్న దస్తగిరి బెయిల్‌పై సీబీఐ అభ్యంతరం తెలపలేదని హైకోర్టుకు అవినాష్ తరఫు న్యాయవాది తెలిపారు. విచారణాధికారి పారదర్శకంగా వ్యవహరించడం లేదని అభియోగాలు ఉన్నాయన్న తెలంగాణ హైకోర్టు.. ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించి ఏ విషయమైనా తెలపాలని సీబీఐకి కోర్టు సూచించింది. చదవండి: Political Fact Check: వివేకా హత్య కేసులో పుకార్లేంటీ? నిజాలేంటీ? -
వివేకా హత్య కేసులో సీబీఐ ఏకపక్షంగా విచారణ చేస్తోంది: సురేష్‌బాబు
-
‘దస్తగిరి బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు’
కడప(వైఎస్సార్ జిల్లా): వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఏకపక్షంగా విచారణ చేస్తోందని కడప మేయర్, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సురేష్‌బాబు ఆరోపించారు. కేవలం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఇరికించేందుకు సీబీఐ కుట్ర చేస్తోందని సురేష్ బాబు పేర్కొన్నారు. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన దస్తగిరికి సీబీఐ మద్దతు ఇస్తోందన్న సురేష్ బాబు.. అప్రూవర్ పేరుతో సీబీఐ మద్దతు ఇవ్వడంతో అతను బెయిల్‌పై బయట తిరుగుతున్నాడన్నాడన్నారు. శుక్రవారం సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ..‘విచారణను వీడియో రూపంగా, న్యాయవాది సమక్షంలో చేయాలని మాత్రమే ఎంపీ కోరారు. దీనిపై కూడా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. అభూత కల్పనలు ప్రచురితం చేయడం, లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు ప్రసారాలు చేయడం బాధాకరం. విచారణకు ఎంపీ వైఎస్ అవినాష్ ఇతర కుటుంబ సభ్యులు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఒకరికి సహాయం చేసే గుణం వైఎస్ కుటుంబానిది, అంతే కాని విచారణ తప్పించుకుని తిరగడం లేదు. సీబీఐ అంటే మంచి నమ్మకం ఉంది.. అలాంటి మంచి నమ్మకం కోల్పోకుండా విచారణ చేయాలి. ఒక్క అబద్ధాన్ని పదే పదే నిజం అని చెప్పడం ప్రసారాలు చేయడం ఏంటి’ అని ప్రశ్నించారు. -
Political Fact Check: వివేకా హత్య కేసులో పుకార్లేంటీ? నిజాలేంటీ?
తెలుగుదేశం క్యాంపు, ఎల్లో మీడియా తనకు అచ్చొచ్చిన గోబెల్స్ ప్రచారాన్ని వివేకా హత్య కేసుకు రుద్ది రాజకీయ లబ్ది కోసం వెంపర్లాడుతున్నట్టు తెలుస్తోంది. పదే పదే అబద్దాలను ప్రచారం చేసి దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడానికి తెగ ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. హత్య జరగడం మొదలు.. ఇప్పటివరకు ప్రతీ అంశాన్ని అనుకూలంగా మార్చుకునే దిశగా ఈ కుట్ర సాగుతోంది. ఇందులో కీలకమైన అంశం రాజకీయం. ఎంపీ టికెట్ విషయంలో వివేకానందరెడ్డి అడ్డు ఉంటారని భావించినందుకే ఆయన్ను హత్య చేశారంటూ ఎల్లో మీడియా విస్తృతంగా కథనాలు ఇచ్చింది. ఇందులో నిజమెంత? ఏ కోణంలో ఆలోచించినా ఈ వాదనలో కించిత్తు లాజిక్ కనిపిస్తోందా? ఇక్కడ కొన్ని ఎల్లో మీడియా వాదనలు, వాటికి స్థానికంగా ఉన్న వాస్తవ పరిస్థితులను పోల్చి చూద్దాం. ఎల్లో మీడియా వాదన : ఎంపీ టికెట్‌కు అడ్డు పడతాడన్న భయంతోనే వివేకా హత్య.? Fact Check : వైఎస్సార్ కడప జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, వాస్తవ పరిశీలనలేంటీ? వైఎస్సార్ కడప జిల్లాలో రాజకీయాలు దశాబ్దాలుగా ఒకే తీరున ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబంపై అక్కడి ప్రజలు పూర్తి విశ్వాసాన్ని, ఆదరాభిమానాలను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎంతగా ఆదరించారో.. అదే తీరున, అంత కంటే ఓ మెట్టు ఎక్కువగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని తమ వాడిగా గుండెల్లో పెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడయినా.. వైఎస్సార్సిపి పేరుతో కొత్త పార్టీని పెట్టినప్పుడయినా.. తమ అభిమానాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఇక్కడ పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. కాంగ్రెస్ లేదా బీజేపీ తరహాలో నిర్ణయాలు ఎక్కడో ఢిల్లీలో ఉండవు. వివిధ సమీకరణాలు, నాయకత్వ లక్షణాలు, ప్రజలకు చేరువయ్యే అభ్యర్థిని పార్టీ అధ్యక్షుడు ఎంచుకుంటారు. అలాగే 2014లో అయినా, 2019లో అయినా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. కడప ఎంపీ టికెట్‌ను ఆయన రెండు సార్లు కూడా వైఎస్ అవినాష్‌రెడ్డికే ఇచ్చారు తప్ప వివేకానంద రెడ్డికి ఇవ్వలేదు. వయస్సు రీత్యా అయినా.. ప్రజల్లో ఉన్న కలివిడి, ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే శక్తి, వివిధ వర్గాల్లో ఉన్న ఆదరణ విషయంలో వివేకానందరెడ్డి ఏ రకంగానూ అవినాష్‌రెడ్డి అడ్డు పడలేదు, అడ్డు రాలేదు. ఎల్లో మీడియా వాదన : రాజకీయంగా వివేకానందరెడ్డి అవినాష్‌రెడ్డికి పోటీగా మారుతున్నాడు Fact Check : వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఏం ఫలితాలొచ్చాయి? వాస్తవ పరిశీలనలేంటీ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వైఎస్సార్ కడప జిల్లాలో రాజకీయ పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ ఏ మార్పు కనిపించలేదు. గతంలోలాగే వైఎస్సార్సిపికి ప్రజలు పట్టం కట్టారు. ఇక కడప ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికను పరిశీలిస్తే.. 2014లో, 2019లో రెండు సార్లు ఇక్కడ ఎన్నిక జరిగింది. రెండు సార్లు కూడా.. కడప ఎంపీ స్థానానికి తమ అభ్యర్థిగా అవినాష్‌రెడ్డిని ఎంచుకున్నారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2014లో కడప ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలో అవినాష్‌రెడ్డి ఏకంగా లక్షా 90వేల మెజార్టీతో గెలిచారు. ఆయనకు 671,983 ఓట్లు అంటే 55.95% వస్తే.. తెలుగుదేశం అభ్యర్థి రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి 481,660 ఓట్లకు పరిమితం అయ్యారు. ఇక 2019లో అవినాష్‌రెడ్డి విజయం రెండింతలయింది. 2019లో కడప ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలో అవినాష్‌రెడ్డి ఏకంగా 3 లక్షల 80వేల 726 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆయనకు 783,499 ఓట్లు అంటే 63.79% వస్తే.. తెలుగుదేశం అభ్యర్థి సి.ఆదినారాయణ రెడ్డికి కేవలం 402,773 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏ రకంగా చూసినా 3లక్షల 80వేల మెజార్టీ అంటే దేశంలో ఘనవిజయం సాధించిన వ్యక్తుల్లో అవినాష్‌రెడ్డి ఒకరు. ఈ లెక్కలు చూస్తే.. అవినాష్‌రెడ్డికి ఏ కోశానా వివేకానందరెడ్డి అడ్డుగా ఉన్నాడనో.. లేక రాజకీయంగా తన అవకాశాలను దెబ్బ తీస్తాడన్న వాదన సరికాదని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇంత చిన్న లాజిక్‌ను పక్కనబెట్టి ఎల్లోమీడియా ఇదే రాగం తీయడం, దాన్ని దర్యాప్తు సంస్థల మీద ప్రభావితం చేసేలా ప్రచారం చేయడం విడ్డూరంగానే కనిపిస్తుంది. ఎల్లో మీడియా వాదన : కడప టికెట్ నాకైనా ఉండాలి లేక మన వాళ్లకే ఉండాలి : వివేకానందరెడ్డి తరచుగా తన కూతురు సునీతకు చెప్పేవాళ్లు Fact Check : వైఎస్సార్ కడప జిల్లాలో వాస్తవ పరిశీలనలేంటీ? రాజకీయంగా ఎలాంటి పరిస్థితులున్నాయి? పైన చెప్పుకున్న సమగ్ర వివరాలలో మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అంశాలు రెండు. మొదటిది వైఎస్సార్సిపి అనేది ప్రాంతీయ పార్టీ. అంటే పార్టీ అధ్యక్షుడు ఎవరిని ఎంచుకుంటే వారే అభ్యర్థి అవుతారు. అప్పటికే రెండు సార్లు అంటే 2014, 2019లలో అవినాష్‌రెడ్డి ఘనవిజయం సాధించారు, ప్రజలకు చేరువయ్యారు, వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. 2014-19 మధ్య కాలంలో వైఎస్సార్సిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడపలో జరిగిన సమావేశంలో జనవరి 3, 2018న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబును సభపైనే ప్రశ్నించిన ధైర్యం అవినాష్‌రెడ్డిది. కృష్ణా జలాల విషయంలో తన నియోజకవర్గంలో ముంపు గ్రామాలకు న్యాయం చేయాలంటూ చంద్రబాబును నేరుగా ప్రశ్నించిన ధైర్యం అవినాష్‌ది. జనవరి 3, 2018న జరిగిన మరో బహిరంగ సభలో ఎంపీగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ అసలు ప్రాజెక్ట్ ఘనత ఎవరిదో చెప్పబోతున్నప్పుడు సభపైనే చంద్రబాబు, టిడిపి నేతలు మైక్ లాక్కున్న ఘటన ఈ కింది వీడియోలో చూడవచ్చు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే. వైఎస్సార్ కడప జిల్లాలో పార్టీ కార్యకర్తలకు, సామాన్యులకు పూర్తిగా అండగా ఉండే మనస్తత్వం అవినాష్‌రెడ్డిది. పార్టీ పరంగా ఆయన తన వాదనను పూర్తి స్థాయిలో వినిపించారు. తెలుగుదేశం నాయకులకు కొరకరాని కొయ్యగా మారారు. అందుకే అవినాష్‌రెడ్డి ఉంటే కడపలో ఏం చేయలేమన్న ధోరణి టిడిపి నేతల్లో కనిపించింది. సరిగ్గా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే వివేకానంద రెడ్డి హత్య జరగడం, దాన్ని ఒక పథకం ప్రకారం అవినాష్‌రెడ్డికి అంటించడం ఇందులో భాగమేనని స్థానికంగా ఎవరిని అడిగినా చెబుతారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా అవినాష్ ఎదుగుదలకు వివేకానందకు ఎలాంటి లింకు లేదు. పైగా అవినాష్‌ను వద్దని తనకు టికెట్ కావాలని వివేకానందరెడ్డి చెప్పారంటూ ఎల్లోమీడియా చేస్తున్న వాదనలోనూ లాజిక్ లేదు. ఎల్లో మీడియా వాదన : రాజకీయంగా వివేకా ఎదుగుతున్నారు. అందుకే ఆయన్ను అడ్డు తొలగించారు. Fact Check : వైఎస్సార్ కడప జిల్లాలో వాస్తవ పరిశీలనలేంటీ? రాజకీయంగా వివేకా సాధించిన విజయాలేంటీ? వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం ఆయన నీడలో ఎదిగిన వివేకానందరెడ్డి.. ఆయన మరణం తర్వాత మరో స్టాండ్ తీసుకున్నారు. ఏ కుటుంబం అయితే అండగా ఉందో అదే కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేశారు. తర్వాతి కాలంలో ఆయన తిరిగి వైఎస్సార్సిపిలో చేరినా.. ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు. 2017 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి వైఎస్సార్సిపి అభ్యర్థిగా బరిలో దిగారు. అప్పటికే జిల్లాలో ఏ రకంగా చూసినా పార్టీ పటిష్టంగా ఉంది. అభ్యర్థి ఎవరయినా వైఎస్సార్‌సిపిదే విజయం అన్నట్టుగా ఆనాటి పరిస్థితి ఉంది. ఆ ఎన్నికల్లో పోటీకి దిగిన వివేకానందరెడ్డి ఓడిపోయారు. తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి చేతిలో ఓడిపోవడం ఇబ్బందికర పరిస్థితి. ఏ రకంగా చూసినా ఇది వివేకానందరెడ్డికి ఇబ్బందికరమైన విషయమే. ఎమ్మెల్సీగా గెలవలేని అభ్యర్థి.. కడప ఎంపీగా పోటీ చేయాలని ఎలా భావిస్తారు? ఎల్లో మీడియా ప్రచారం చేసినట్టు టికెట్ తనకే కావాలని ఎలా అడుగుతారు? ఇక ఆయన్ను అవినాష్‌రెడ్డి తనకు అడ్డు అని ఎలా భావిస్తారు? ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తే.. అవినాష్‌రెడ్డిని ఇరికించడానికి, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడానికి ఓ పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని అర్థమవుతోంది. -
రెండో వివాహంతోనే కుటుంబంలో తీవ్ర విభేదాలు!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం విచారణకు హాజరు కావాలనడంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో ఆయన కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. వివేకా, సునీత మధ్య మనస్పర్థలు ‘2010లో షేక్ షమీమ్‌ను వైఎస్ వివేకా రెండో వివాహం చేసుకున్నారు. 2015లో వీరికి ఓ కుమారుడు కూడా పుట్టాడు. అప్పటి నుంచి వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. షమీమ్‌ను సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డి, బావ ఎన్.శివప్రకాశ్‌రెడ్డి శత్రువుగా చూసేవారు. సునీత, రాజశేఖరరెడ్డితో పాటు వివేకా పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. వారు వివేకానందరెడ్డి చెక్ పవర్‌ను కూడా రద్దు చేశారు. దీంతో ఆయన ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివేకా మొదటి భార్య, కూతురు హైదరాబాద్‌లో ఉండగా, ఆయన మాత్రం పులివెందులలోనే ఎక్కువ రోజులు గడిపేవారు. ఒక దశలో ఆయన వారసుడిగా షమీమ్ కుమారుడినే ప్రకటిస్తారని, ఆ మేరకు విల్లు కూడా రాశారని పుకార్లు వచ్చాయి. హత్య అనంతరం నిందితుల (ఏ1 నుంచి ఏ4) ఇళ్లలో ఈ పత్రాల కోసం వెతికినట్లు కూడా సమాచారం. ఇవన్నీ పరిశీలిస్తే.. సొంత కుటుంబ సభ్యులే ఆయన్ని వదలించుకునే పథకం వేసినట్లు అర్థమవుతుంది. వివేకా మరణానంతరం సునీత, ఆమె కుటుంబీకులు బెదిరించినట్లు షమీమ్ దర్యాప్తు అధికారులకు కూడా చెప్పారు. తన కుమారుడి పేరుమీద రూ.2 కోట్లు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తానని వివేకా చెప్పినట్లు వెల్లడించారు’ అని అవినాశ్‌రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. బీటెక్ రవి, చంద్రబాబు ప్రభావంతోనే.. ‘వివేకా హత్య తర్వాత సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి)ని కలిశారు. రవి ద్వారా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో మంతనాలు జరిపారు. హత్య జరిగిన సంవత్సరం వరకు సునీత నాపై ఆరోపణలు చేయలేదు. పైగా, ప్రెస్‌మీట్ పెట్టి నా విజయం కోసం వివేకా చాలా శ్రమించారని, జమ్మలమడుగులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని ఆమె చెప్పారు. కానీ చంద్రబాబు ప్రభావానికి లోనైన తర్వాతే నాపై ఆరోపణలు చేశారు’ అని తెలిపారు. వారికి నచ్చినట్లు దర్యాప్తు ‘దస్తగిరి అక్కడా ఇక్కడా విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా ఈ కేసులో నన్ను ఇరికిస్తున్నారు. సునీల్ యాదవ్ గూగుల్ టేక్ఔట్ ఫోన్ లొకేషన్ అనే పేరుతో సీబీఐ నన్ను వేధిస్తోంది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖపై దర్యాప్తు చేయటంలేదు. దర్యాప్తు అధికారి తప్పుడు ప్రచారానికి ప్రభావితమై ఆ కోణంలోనే, పక్షపాతంతో విచారణ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా కొందరిపై ఒత్తిడి తెస్తున్నారు. నేను విచారణలో చెప్పిన విషయాలను విచారణ అధికారి మార్చి వారికి అవసరమైనట్లుగా మీడియాకు లీకులిస్తున్నారు. నోటీసుల దశలో దర్యాప్తు సాగుతుండగా చార్జిషీట్లో నేరస్తునిగా సీబీఐ చిత్రీకరిస్తోంది. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఈ కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారు. అందువల్ల నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా దర్యాప్తు అధికారులను ఆదేశించాలి’ అని అవినాశ్‌రెడ్డి పిటిషన్లో కోరారు. -
ఈ నెల 10న సీబీఐ విచారణకు హాజరవుతా : ఎంపీ అవినాష్ రెడ్డి
-
సీబీఐ దర్యాప్తుపై సందేహాలు: ఎంపీ అవినాశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ.. నిజాన్ని వెలికితీసే కోణంలో కాకుండా, వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సాగుతోందన్న భావన కలుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అన్నారు. సీబీఐ విచారణ సరైన దిశలో వెళ్లాలని చెబుతున్నానే తప్ప అనుమానించడం లేదని స్పష్టం చేశారు. మీడియా సైతం ఈ విషయంలో నిజాలను నిజాలుగా చూపాలని కోరారు. తనకు తెలిసిన అన్ని నిజాలను పొందుపరుస్తూ సీబీఐ అధికారులకు వినతిపత్రం ఇచ్చానని, అందులోని అంశాలపైనా విచారణ జరగాలని కోరినట్టు తెలిపారు. అబద్ధాన్ని నిజంగా.. నిజాన్ని అబద్ధంగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. అనంతరం సాయంత్రం బయటికి వచ్చాక మీడియాతో మాట్లాడారు. జనవరి 28న విచారణకు కొనసాగింపుగా శుక్రవారం రెండోసారి సీబీఐ అధికారుల విచారణకు హాజరైనట్లు తెలిపారు. గతంలో విచారణప్పుడు మరోమారు పిలుస్తామని చెప్పారని, ఈసారి మాత్రం మళ్లీ విచారణకు రావాలని చెప్పలేదన్నారు. ఎంపీ ఇంకా ఏమన్నారంటే.. మీడియా బాధ్యతగా వ్యవహరించాలి మీడియా బాధ్యతగా వార్తలు ప్రసారం చేయాలని మనవి చేస్తున్నా. గతంలోనూ ఇదే విషయం చెప్పాను. మళ్లీ అదే చెబుతున్నా. నేను విజయమ్మ గారి దగ్గరికి వెళ్లి వస్తే.. బెదిరించి వచ్చానని చర్చలు పెట్టి, ప్రచారం చేస్తున్నారు. అది ఎంత వరకు సబబు? నేను దుబాయ్‌కి వెళ్లిపోయానని వక్రీకరించే వార్తలు వేస్తున్నారు. ► తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్లు చేశానని వక్రీకరించే వార్తలు వేయడమే కాకుండా దానిపై గంటల తరబడి, రోజులపాటు చర్చలు పెడుతున్నారు. విచారణ జరుగుతున్నప్పుడు మీడియా బాధ్యతగా మెలగాలి. మీడియానే ట్రయల్ పూర్తి చేసి..దోషులెవరో, నిర్దోషులెవరో మీడియానే నిర్ణయిస్తోంది. ఇది విచారణపై ఎంత ప్రభావం పడుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచే ప్రయత్నం జరుగుతోంది. అదేవిధంగా ఒక నిజాన్ని వంద నుంచి సున్నా చేసే ప్రయత్నం జరుగుతోంది. ► ముందు నుంచి కూడా ఫ్యాక్ట్ టార్గెట్‌గా కంటే పర్సన్ టార్గెట్‌గా విచారణ జరగడం సరికాదు. గూగుల్ టేకౌట్ అన్నది నిజమైన గూగుల్ టేకౌటా.. టీడీపీ టేకౌటా అన్నది భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే.. సీబీఐ సమర్పించిన కౌంటర్లోని విషయాలన్నీ ఏడాది క్రితం టీడీపీ వాళ్లు చేసిన విమర్శలే. అందువల్ల ఎవరికైనా సందేహాలు రావడం సహజం. ఈ పరిస్థితిలో విచారణ సరైన కోణంలో వెళ్లాలని చెబుతున్నాను తప్ప.. నేను అనుమానించడం లేదు. ఆ రోజు చెప్పిందే ఈ రోజూ చెబుతున్నా ► వివేకం సార్ చనిపోయిన రోజు నేను మార్చురీ దగ్గర మీడియాతో మాట్లాడాను. మళ్లీ రెండు రోజుల తర్వాత కూడా మీడియాతో మాట్లాడాను. ఆ రోజు ఏం మాట్లాడానో.. ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నా. సీబీఐ వాళ్లకు అదే చెబుతున్నా. ఎవరెన్నిసార్లు పిలిచి అడిగినా అదే చెబుతా. ఎందుకంటే నాకు తెలిసిన నిజం అదే కాబట్టి. ► ఆ రోజు ఆ విషయం గురించి మీడియాతో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి నేనే. అందుకే నేను ఆ రోజు చెప్పిందే ఈ రోజూ చెబుతున్నా. సీబీఐ వారి ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పాను. ► వివేకం సార్ చనిపోయిన రోజు సీన్ ఆఫ్ క్రైంకి నేను వెళ్లేటప్పటికే అక్కడ ఒక లెటర్ ఉంది. కానీ, ఆ లెటర్‌ను దాచిపెట్టారు. ఆ లెటర్లో అది హత్య అని స్పష్టంగా ఉంది. అందులో అనేక అంశాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి నేను చెప్పడం కంటే భవిష్యత్తులో అవన్నీ బయటికి వస్తాయి. ► ఇంతకు ముందు అడిగినట్టే అడ్వొకేట్ సమక్షంలో ప్రశ్నించాలని, అన్ని విషయాలు ఆడియో.. వీడియో రికార్డింగ్ చేయాలని ఇప్పుడు కూడా కోరాం. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ కూడా లెటర్ పెట్టాం. కానీ అది జరగలేదు. అయితే ఒక ల్యాప్‌టాప్‌ను మాత్రం నా ముందు ఉంచారు. అది ఎందుకోసం అన్నది నాకు తెలియదు. -
విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు: అవినాష్ రెడ్డి
-
ఏది నిజం?: పచ్చ పైత్యం ముదిరిపోయింది!
చనిపోయిన మనిషి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకువెళ్తూ... ఏమో బతుకుతాడేమోననే దింపుడు కళ్లెం ఆశతో మధ్యలో పాడెను ఓసారి కిందకు దించి మరీ చూస్తారు!!. రాష్ట్రంలో రాజకీయంగా టీడీపీ అంతిమయాత్ర కొనసాగుతున్న తరుణంలో... ఎల్లో మీడియాలో ఇదే దింపుడు కళ్లెం ఆశ మిణుకు మిణుకు మంటోంది. అందుకే ఆ పార్టీని బతికించేందుకు రోజుకో రీతిలో రాజకీయ కుట్రకు తెరతీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం విషం చిమ్ముతోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వార్తలు, కథనాల పేరిట అభూతకల్పనలు, అవాస్తవాలను ప్రతిరోజూ అచ్చేస్తూ... పాత్రికేయ విలవలకు పాతరవేస్తోంది. సీబీఐ న్యాయస్థానంలో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ పేరిట ఈనాడు, దాని తోక మీడియా మరోసారి అదే పచ్చ పైత్యాన్ని ప్రదర్శించాయి. అసలు ఆ అఫిడవిట్లో ఏముందనే దానితో పని లేకుండా.... చంద్రబాబు పోసిన ‘పచ్చ’ సిరాను తమ పెన్నుల్లో నింపేసుకుని విచ్చలవిడి రాతలకు దిగాయి. 2019లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వగానే చంద్రబాబు బీజేపీలోకి పంపిన తన కోవర్టుల ద్వారా ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అందుకే దర్యాప్తు దారితప్పిందన్నది సుస్పష్టం. తమకు అదే కావాలన్న రీతిలో అటు చంద్రబాబు ఇటు పచ్చ మీడియా వైఎస్సార్ కుటుంబంపై నిస్సిగ్గుగా బురద జల్లుతున్నాయి. సునీల్ యాదవ్‌పై విరుద్ధ వాదనలేల? ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కదలికలు అత్యంత కీలకమని సీబీఐ చెబుతోంది. ప్రధానంగా వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున సునీల్‌యాదవ్ ఎక్కడెక్కడ తిరిగారన్నది దర్యాప్తులో తాము కనుగొన్న అతి ముఖ్యమైన విషయంగా పేర్కొంది. మరి అంత ముఖ్యమైన అంశంపై సీబీఐ 2021లో న్యాయస్థానానికి చెప్పిన మాటకు... ఇప్పుడు సీబీఐ కోర్టుకు చెప్పిన మాటకు పొంతన లేదెందుకు? సునీల్ యాదవ్‌ను 2021, ఆగస్టులో సీబీఐ అరెస్టు చేసింది. 2021, డిసెంబర్లో చార్జ్‌షీట్ వేసింది. అందులో వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున... వివేకా ఇంటి పరిసరాల్లోనే సునీల్ యాదవ్ తిరిగినట్టు సీబీఐ పేర్కొంది. సునీల్ మొబైల్ ఫోన్ లొకేషన్‌ను గూగుల్ టేకౌట్ విధానం ద్వారా నిర్ధారించి ఈ విషయాన్ని కనుగొన్నట్టు తెలిపింది. కేసులో ఇదే అత్యంత కీలకమైన సాక్ష్యమని కూడా న్యాయస్థానానికి నివేదించింది. మరి సీబీఐ వద్ద అంత పక్కా సమాచారం ఉంటే దాని ఆధారంగా కేసు దర్యాప్తును ఎందుకు వేగవంతం చేయలేదు?. నేరుగా చర్యలు తీసుకోవచ్చు కదా? వెంటనే కేసు దర్యాప్తును కొలిక్కి తేవచ్చు కదా? కానీ అలా చేయలేదు. హత్య జరిగిన నాడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నారని నాటి చార్జిషీట్లో చెప్పనే లేదు. ఇప్పుడు 14 నెలల తరువాత... హఠాత్తుగా సునీల్ యాదవ్ ఆ రోజు వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉన్నట్టు న్యాయస్థానానికి సీబీఐ చెప్పడం వెనుక మతలబేంటి? బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టాలని ఎందుకు ప్రయత్నిస్తోంది? సునీల్ యాదవ్ కదలికలను గుర్తించి ఉంటే 2021 నాటి చార్జ్షీట్లోనే ఎందుకు చెప్పలేదు...!? ఇప్పుడెందుకు కొత్తగా చెబుతున్నారు? న్యాయస్థానానికి రెండు వేర్వేరు సందర్భాల్లో రెండు వేర్వేరు వాదనలు వినిపించడమేంటి? ఇదంతా యాదృచ్ఛికం కాదని... ఓ స్కెచ్ ప్రకారమే జరుగుతోందని అర్థం కావటం లేదూ? వారు వివేకాకు సన్నిహితులు కాదా!? వివేకా హత్య కేసులో మోకాలికి– బోడి గుండుకు ముడిపెట్టేందుకు పచ్చ మీడియా యత్నిస్తోంది. వివేకానందరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి మధ్య విభేదాలున్నాయని ఈనాడు పతాక శీర్షికల్లో రాసింది. వారి మధ్య కడప ఎంపీ టికెట్ కోసం విభేదాలున్నాయని సీబీఐ అధికారులు చెబుతున్నట్లు కూడా పేర్కొంది. పోనీ ఆ మాటకే కట్టుబడి ఉన్నారా అంటే... అదీ లేదు. ఈ కేసులో అరెస్టయిన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి వివేకానందరెడ్డికి సన్నిహితులని చెప్పేదీ ఈనాడే. ఆ నలుగురే మళ్లీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలతో కలసి వివేకా హత్యకు కుట్రపన్నారని రాసేదీ ఈనాడే. సీబీఐ అధికారులు కూడా ఇదే మాటలు వల్లె వేస్తున్నారు. ఇది కుట్ర కాదా రామోజీ? ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు వైఎస్ వివేకానందరెడ్డికి ఎన్నో ఏళ్లుగా సన్నిహితులని సీబీఐ చెబుతోంది. అది నిజం కూడా. వివేకాకు సన్నిహితులు కనక వారికి సహజంగానే వివేకా కుటుంబీకులతో కూడా సన్నిహిత సంబంధాలుంటాయి. అంటే వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు కూడా ఆ నలుగురు సన్నిహితులేనన్నది అందరికీ తెలిసిన విషయమే. నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి హైదరాబాద్‌లో తన మనవరాలి పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తూ పులివెందుల నుంచి ఒక్క ఎర్ర గంగిరెడ్డినే ఆహ్వానించారు. అంటే వారంతా సన్నిహితులేనన్నది సుస్పష్టం. ఇక వైఎస్ వివేకానందరెడ్డిని ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు హత్య చేశారని సీబీఐ ఎఫ్ఐఆర్లో కూడా పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే... ఎవరైనా చెబితే ఆ హత్య చేశారా? వ్యక్తిగత, ఆర్థిక విభేదాలతోనే హత్యకు పాల్పడ్డారా? అనేది. వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయన్నది రహస్యమేమీ కాదు. తన రెండో భార్యకు ఆస్తిలో వాటా ఇవ్వాలని... ఆమెకు, తనకు పుట్టిన కొడుకును వారసుడిగా ప్రకటించాలని వైఎస్ వివేకా భావించారు. దీన్ని ఆయన కుటుంబం వ్యతిరేకించింది. ఆయన భార్య హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె సునీత వద్దకు వెళ్లిపోయారు. ఇదంతా పులివెందులలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ వ్యవహారంలోనే వివేకా రెండో భార్యను సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్ రెడ్డి బెదిరించారన్నది కూడా కాదనలేని నిజం. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డిని సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి హత్య చేస్తే...అందుకు ఎర్రగంగిరెడ్డి దగ్గరుండి సహకరిస్తే... దాని వెనుక నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డిల ప్రమేయం ఉండే అవకాశాలూ ఉంటాయి కదా? పైగా వివేకా మరణించిన విషయం మొదటగా ఆయన కుమార్తె సునీత, భార్య సౌభాగ్యమ్మ, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డిలకే తెలిసింది. ఉదయాన్నే జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన వైఎస్ అవినాశ్ రెడ్డికి... నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి చెబితేనే ఈ మృతి విషయం తెలిసింది. ఆ ఫోన్‌కాల్‌తోనే ఆయన వెనక్కి తిరిగి పులివెందుల వచ్చారు. ఫోన్లో మెసేజీలు డిలీట్ చేయలేదా? పైపెచ్చు వివేకా రాసిన లేఖను, ఆయన సెల్‌ఫోన్‌ను తామొచ్చే వరకూ ఎవరికీ ఇవ్వొద్దని పీఏ కృష్ణారెడ్డికి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. వారు వచ్చిన తరువాత, ఆ ఫోన్లోని కొన్ని మెసేజీలను డిలీట్ చేశాకే దాన్ని పోలీసులకు ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డిల పాత్రపైనా సందేహాలను లేవనెత్తుతున్నాయి కదా? మరి వాళ్లనెందుకు సీబీఐ విచారించటం లేదు? ఆ దిశగా దర్యాప్తు ఎందుకు చేయటం లేదు? అంతేకాదు వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు వేసిన సిట్ దర్యాప్తు నివేదికగానీ...అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదికనుగానీ సీబీఐ ఏమాత్రం పట్టించుకోలేదు. వాటిని పక్కన పడేసి సీబీఐలో కిందిస్థాయి అధికారులు కొందరు... దర్యాప్తును కావాలనుకున్న దిశగా నడిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పోనీ టీడీపీ, ఈనాడు ఆరోపిస్తున్నట్టుగా వైఎస్ వివేకా, వైఎస్ అవినాశ్ మధ్య విభేదాలు ఉండటమే నిజమైతే... వివేకా సన్నిహితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు సహజంగానే అవినాశ్‌కు దూరంగా ఉంటారు. తమకు ఆప్తుడైన వివేకా అంటే సరిపడని అవినాశ్ రెడ్డితో వారెందుకు సన్నిహితంగా ఉంటారు? మరి ఆ నలుగురే హత్య చేశారు అనుకుంటే దాంతో అవినాశ్‌కి గానీ ఆయన కుటుంబ సభ్యులకుగానీ ఎటువంటి సంబంధం ఉండదు కదా?. ఈ చిన్న లాజిక్‌ను సీబీఐ, టీడీపీ, పచ్చ మీడియా ఎందుకు మిస్ అవుతున్నాయి? కేవలం ముఖ్యమంత్రి కుటుంబంపై బురదజల్లేందుకేనని అర్థం కావటం లేదా? సాక్షులు చెప్పని మాటలు కూడా... సీబీఐ దర్యాప్తు తీరులో విస్మయం కలిగించే అంశమేంటంటే... ఈ కేసులో సాక్షులు చెప్పని విషయాలనూ వారి వాంగ్మూలాలుగా నమోదు చేయడం!!. బహుశా గతంలో ఎప్పుడూ పోలీసుల విచారణలో గానీ, సీబీఐ దర్యాప్తులో గానీ ఇలాంటి ఆరోపణలు రాలేదు. కానీ వివేకా హత్య కేసులో ఎంతోమంది సాక్షులు తాము చెప్పని మాటలను సీబీఐ అధికారులు ఏకపక్షంగా నమోదు చేసేసి... మీడియాకు లీకులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సీబీఐ అధికారులు పేర్కొన్న శశికళ అనే మహిళ వాంగ్మూలం కూడా అదే రీతిలో ఉంది. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా ఎంపీ అవినాశ్ రెడ్డి తనతో చెప్పారని శశికళ వాంగ్మూలమిచ్చినట్లుగా సీబీఐ పేర్కొంది. కానీ ఈ విషయాన్ని శశికళ ఖండించారు. అవినాశ్ రెడ్డి తనతో ఏమీ చెప్పనే లేదని... తాను అసలు అవినాశ్‌తో ఈ విషయంపై మాట్లడనే లేదని ఆమె స్పష్టం చేశారు. అదే మాటను ఆమె గతంలో సిట్ విచారణలోనూ, ప్రస్తుత సీబీఐ దర్యాప్తులోనూ చెప్పారు. కానీ తాను చెప్పని మాటలను చెప్పినట్టుగా సీబీఐ అధికారులు ఎందుకు వాంగ్మూలంగా రాసుకున్నారో తెలియడం లేదని శశికళ వాపోయారు. ఈ విషయాన్ని తనతో కనీసం నిర్ధారించుకోకుండా ఈనాడు, ఇతర మీడియా ఏకపక్షంగా రాసేసినట్లు ఆమె తెలియజేశారు. రామోజీరావు నీతిమాలిన పాత్రికేయంపై ఆమె మండిపడ్డారు. గతంలోనూ పలువురి విషయంలో ఇలాంటివి జరగటం ఇక్కడ గమనార్హం. వైఎస్సార్ కుటుంబ సభ్యుడు వైఎస్ అభిషేక్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వెల్లపు వర ప్రసాద్, రఘునాథ రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన గంగాధర్‌రెడ్డిలతోపాటు 71 ఏళ్ల ప్రభావతమ్మ అనే మహిళ కూడా ఇలాగే చెప్పారు.తాము చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేశారని వారు తెలియజేశారు. దీనిపై అధికారికంగా ఫిర్యాదు కూడా చేశారు. ఎందుకిలా జరుగుతోంది? ఈ తరహా సీబీఐ వాంగ్మూలాలు ఎల్లో మీడియాకు మాత్రమే ఎలా చేరుతున్నాయి? దీనివెనక ఉన్న అదృశ్య శక్తులేంటి? అన్నివేళ్లూ చూపిస్తున్నది చంద్రబాబు వైపే!!. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక ఇలా దొడ్డిదారి పోరాటానికి బాబు దిగారన్నది తేలిగ్గానే అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీలోకి పంపిన కోవర్టులు చంద్రబాబుకు ఈ వ్యవహారంలో సహకరిస్తున్నారన్నది రహస్యమేమీ కాదు. ఫ్లెక్సీలో ఫొటో ఉంటే ప్రభావితం చేయడమా..!? సీబీఐ పేరు చెబుతూ ‘ఈనాడు’ రాసిన మరో దుర్మార్గపు రాత ఇది. ఈ కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు తన ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా వేయించిన ఫ్లెక్సీలో ఎంపీ అవినాశ్ రెడ్డి ఫొటో పెట్టారట. తద్వారా తన వెనుక ఎంతమంది పరపతి గలవారున్నారో అని కేసును, సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించారట!!. అదీ ఈనాడు వెళ్లగక్కిన పైత్యం. ఫ్లెక్సీలో ఓ నాయకుడి ఫొటో పెడితే అది సాక్షులను ప్రభావితం చేయడం అవుతుందా? గతంలో బ్యానర్లు, వాల్ పోస్టర్లు ఉండేవి. కొన్నేళ్లుగా ఫ్లెక్సీలు వచ్చాయి. చిన్న సెలూన్ ప్రారంభోత్సవం నుంచి షాపింగ్ మాల్స్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సాధారణమైపోయింది. ఆ సందర్భంగా తమ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతల ఫొటోలు ఆ ఫ్లెక్సీల్లో వేయటం సహజం. దీన్ని కూడా తప్పుబడతారా? చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు రాష్ట్రమంతటా ఆయన ఫొటోలు ఎందరో ఫ్లెక్సీల్లో వేశారు... ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నాసరే ఆయన ఫొటోలు ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీల్లో వేస్తున్నారు. అంత మాత్రాన వారంతా చంద్రబాబు ఫొటో చూపించి అందర్నీ బెదిరిస్తున్నట్టు భావించాలా? మరి ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫొటోలుంటే లేని అభ్యంతరం... ఎంపీ అవినాశ్ రెడ్డి ఉంటే మాత్రం బెదిరించడం.. సాక్షులను ప్రభావితం చేయడం ఎలా అవుతుంది రామోజీ గారూ?. అవినాశ్‌కు టికెట్టు ఖరారు చేశాక కూడా... సీబీఐ కౌంటర్ అఫిడవిట్ అంటూ ఈనాడు, దాని తోకమీడియా వండిన కథనాలన్నీ అవాస్తవాలే. అసలు కడప ఎంపీ టికెట్‌పై విభేదాలు రేగే అవకాశం ఎక్కడుంది? అవినాశ్ రెడ్డి అప్పటికే కడప ఎంపీ. ఆయనకే టికెట్ ఇస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అప్పటికే ధ్రువీకరించారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి... ఎంపీగా అవినాశ్‌ను గెలిపించడానికి ప్రచారం కూడా మొదలు పెట్టారు. ముందురోజు రాత్రి జమ్మలమడుగులో ప్రచారం చేసి ఇంటికి వచ్చాక... ఆ రోజు అర్ధరాత్రి ఆయన హత్యకు గురయ్యారు. ఎంపీగా అవినాశ్ విజయం కోసం తన తండ్రి ప్రచారం చేస్తున్నారని వైఎస్ వివేకా హత్య తరువాత ఆయన కుమార్తె సునీత మీడియాతో కూడా చెప్పారు. మరి ఎంపీ టికెట్‌పై వివేకా, అవినాశ్ మధ్య విభేదాలున్నాయని పచ్చ మీడియా పదే పదే రాస్తుండటం రాజకీయ కుట్ర కాక మరేమిటి? ఇక వివేకా హత్యకు రూ.40కోట్లు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారనే మరో నిరాధార ఆరోపణ కూడా పదే పదే చేస్తున్నారు. అందుకోసం రూ.5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని...అందులో తనకు రూ.కోటి కూడా ఇచ్చారని దస్తగిరి అప్రూవర్‌గా మారుతూ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సీబీఐ తెలిపింది. మరి హత్య చేయడానికి 10 రోజులు ముందే చేతిలో కోటి రూపాయలున్న దస్తగిరి.. ఆ తరవాత రూ.5వేలు, రూ.10వేల అప్పు కోసం పులివెందులలో అందరి చుట్టూ ఎందుకు తిరిగాడు? సునీల్ యాదవ్ తనకివ్వాల్సిన రూ.3 లక్షలు ఇప్పించాలంటూ... ఆ మేరకు దస్తావేజులు చూపిస్తూ మరీ దస్తగిరి ప్రాథేయపడటం నిజం కాదా...! ఆ దస్తావేజులను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కదా!. అంటే దస్తగిరికి రూ.కోటి ఇచ్చారన్నది అబద్ధమని స్పష్టమవుతోంది కదా? దీన్నిబట్టి దస్తగిరి అప్రూవర్‌గా మారుతూ ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలన్నీ కల్పితాలే తప్ప వాస్తవాలు కాదని తెలియటం లేదా? హత్య వెనుక ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పినట్లుగా దస్తగిరి వెల్లడించిన విషయం అవాస్తవం కాదా? -
కడపలో వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి శంకుస్థాపన
-
ముగిసిన వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ
సాక్షి, హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరమైతే మరోసారి పిలుస్తామన్నారు. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరాము. మా విజ్ఞప్తిని సీబీఐ అధికారులు అంగీకరించలేదు. వాస్తవాలను ఒక సెక్షన్ మీడియా వక్రీకరిస్తోంది. విచారణను ఒక మీడియా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. కాగా, వివేకానందరెడ్డి కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని సాక్షిగా విచారించే క్రమంలో సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ ఆదేశాల్లో భాగంగా నోటీసులు అందుకున్న అవినాష్‌రెడ్డి శనివారం విచారణకు హాజరయ్యారు. -
సీబీఐ నోటీసులపై స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ కడప: సీబీఐ నోటీసులపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం విచారణకు హాజరవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల షెడ్యూల్స్ ప్రకారం నేడు విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు సీబీఐ అధికారులకు వెల్లడించినట్లు తెలిపారు. విచారణకు అయిదు రోజుల సమయం కావాలని కోరినట్లు చెప్పారు. తరువాత సీబీఐ ఎప్పుడు పిలిచినా విచారణకు తప్పకుండా హాజరవుతానని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానని వెల్లడించారు. గత రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన కుటుంబపై ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తనేమిటో, తన వ్యవహార శైలి ఏంటో జిల్లా ప్రజలందరికీ బాగా తెలుసని అన్నారు. న్యాయం గెలచి, నిజానిజాలు వెల్లడి కావాలన్నదే తన ధ్యేయమన్నారు. ‘మీడియా ముఖ్యంగా కోరుకుంటున్న నిజం బయటకు తేలాలని నేను కూడా భగవంతుడుని కోరుకుంటున్నా. ఆరోపణలు చేసేవారు మరొకసారి ఆలోచించుకోవాలి.. ఇలాంటి నిరాధారమైన ఆరోణలు చేస్తే మీ కుటుంబ సభ్యులు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్. అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. తాజాగా ఈ నోటీసులపై అవినాష్ రెడ్డి స్పందించారు. చదవండి: YSR Aarogyasri: 39 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డు -
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
-
భూములను పరిశీలించిన ఎంపీ అవినాష్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప పట్టణంలో అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల సందర్బంగా జరిగిన ప్రార్థనలో పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు అధిక వర్షాలతో భూములు జవుకు ఎత్తుతున్న విషయాన్ని ఇటీవల లింగాల మండల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి రైతులు తీసుకెళ్లారు. ఆ సమస్యపై అధ్యయనం చేయటానికి వచ్చిన కమిటీ సభ్యులతో కలిసి రైతుల భూములను ఎంపీ పరిశీలించారు. ఆయన వెంట ఓఎస్డీ అనిల్ కుమార్‌రెడ్డి.. ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్ శాఖ అధికారులు, మండల నాయకులు ఉన్నారు. చదవండి: ఆ మాట జగనన్నే చెప్పాడని కూడా చెప్పండి: సీఎం జగన్